USA
-
ఉంగరంతో ప్రపోజ్ చేద్దామనుకున్నాడు, ఈలోపే..
చూడచక్కని జంట. ఒకే దగ్గర కలిసి పని చేస్తున్నారు. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలనుకుంది. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. విధి ఆడిన వింత నాటకంలో అనూహ్యంగా ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.యారోన్, సారా.. ఇద్దరూ ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది. బుధవారం సాయంత్రం వాషింగ్టన్‌లోని యూదుల మ్యూజియం వద్ద జరిగిన వేడుకలో కలిసే పాల్గొన్నారు. అయితే ఓ దుండగుడు అత్యంత సమీపంగా నలుగురు ఉన్న బృందంపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఈ ఇద్దరే మరణించారు. ఆ తర్వాతే తెలిసింది ఏంటంటే.. త్వరలో ఆ యువకుడు ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడని!యారోన్, సారా మంచి మిత్రులు మాత్రమే కాదు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు కూడా. వచ్చే వారం జెరూసలేంలో సారాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయాలని యారోన్ సిద్ధంగా ఉన్నాడు. ఈలోపే ఇలా జరిగింది. ఎంతో జీవితం ఉన్న ఆ యువ జంట జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడం నిజంగా బాధాకరం అని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచెయిల్ లెయిటర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉగ్రదాడిలో యువ జంట మరణించడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత దుండగుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేశాడు. అతన్ని చికాగోకు చెందిన ఎలియాస్ రోడ్జిగూజ్‌గా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఇదీ చదవండి: ఇలాంటివి అమెరికాలో కుదరవు-ట్రంప్ -
వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం
-
వాషింగ్టన్లో ఉగ్రదాడి!.. ట్రంప్ ఆగ్రహం
అమెరికలో దౌత్య పరమైన విషాదం నెలకొంది. ఓ ఆగంతకుడు జరిపిన దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ(Israel Embassy Staff) సిబ్బంది మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే వాళ్లను హతమార్చినట్లు నిర్ధారణకు వచ్చారు.స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం వాషింగ్టన్ డీసీలోని యూదుల మ్యూజియం(Jewish Museum) వద్ద ఈ ఘోరం జరిగింది. మ్యూజియంలో ఓ ఉత్సవం జరుగుతుండగా.. ఎంబసీ స్టాఫ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. అంతలో.. అత్యంత సమీపం నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటనలో సిబ్బంది ఇద్దరు మరణించారు. కాల్పులకు పాల్పడ్డ దుండగుడు పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ‘‘ ఫ్రీ పాలస్తీనా.. ఫ్రీ పాలస్తీనా(Free Palestine) ’’ అంటూ జెండా కప్పేసుకుని అక్కడే కూర్చుని నినాదాలు చేశాడు. దీంతో ఉగ్రదాడి కోణంలోనే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణతో.. గాజాలో తీవ్ర దాడులు(Gaza War) జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతుండటంతో పాలస్తీనీయులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ పరిణామాల వేళ.. కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మరోవైపు.. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. “These horrible D.C. killings, based obviously on antisemitism, must end, NOW! Hatred and Radicalism have no place in the USA. Condolences to the families of the victims. So sad that such things as this can happen! God Bless You ALL!” —President Donald J. Trump pic.twitter.com/Z30bjAQOpZ— The White House (@WhiteHouse) May 22, 2025జెవిష్ మ్యూజియం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అమెరికాలో ద్వేషానికి, ఉగ్రవాదానికి చోటు లేదని.. యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న భయంకరమైన ఈ తరహా దాడులు, హత్యలు తక్షణమే ఆగాలని హెచ్చరించారాయన. మరోవైపు ఘటనపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇతర దేశాల్లోని ఎంబసీలను మాత్రం అప్రమత్తం చేసినట్లు సమాచారం. -
ట్రంప్‌కు కోపమొచ్చింది.. ఏం మాట్లాడుతున్నావ్ వెళ్లిపో అంటూ..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి కోపమొచ్చింది. ప్రశ్నించిన ఓ విలేకరిపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నావ్?. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ట్రంప్ చిందులు తొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ట్రంప్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌కు ఖతార్.. విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించిన విషయమై ట్రంప్‌ను ఎన్బీసీ ఛానెల్ విలేకరి ప్రశ్నించారు. సదరు విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఊగిపోయారు. అనంతరం, ట్రంప్ మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?. నువ్వు తెలివితక్కువ వాడివి. ఇక్కడ మేం మాట్లాడుతున్న దానికి, ఖతార్ విమానానికి సంబంధం ఏంటి? వాళ్లు విమానం ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస తదితర సమస్యల నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. విలేకరిగా విధులు నిర్వహించే అర్హత నీకు లేదు’ అని ట్రంప్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ వార్తా సంస్థపై కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిపై విచారణ జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షడు ట్రంప్‌కు ఖతార్ పాలక కుటుంబం విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జంజో జెట్ విమానాన్ని స్వీకరించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. తాజాగా ఈ విమానం ట్రంప్ స్వీకరించడానికి అమెరికా రక్షణశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఇక, దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్ వన్) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీవిరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’కు కొత్త వెర్షన్‌గా ఉపయోగించాలని ప్రణాళికలు చేస్తున్నారు. President Trump Slams NBC reporter 🔥 "GET OUT OF HERE"You ought to go back to your studio at NBC because Brian Roberts and the people that run that place, they ought to be investigated. They are so terrible the way you run that network. And you're a disgrace. No more questions… pic.twitter.com/ezuE4vXstc— Steve Gruber (@stevegrubershow) May 21, 2025 -
అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు
-
టారిఫ్ ప్రభావాలను భారత్ తట్టుకోగలదు
న్యూఢిల్లీ: యూఎస్ టారిఫ్‌లు, అంతర్జాతీయంగా వాణిజ్య ప్రతికూలతలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. భారత్ ఎగుమతులపై తక్కువ ఆధారపడడం.. అదే సమయంలో బలమైన సేవల రంగం అండతో అమెరికా టారిఫ్‌లను అధిగమించగలదని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనికితోడు దేశీ వృద్ధి చోదకాలు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. మరే వర్ధమాన దేశంతో పోల్చుకున్నా భారత్ మెరుగైన స్థితిలో ఉందని పేర్కొంది. ప్రైవేటు వినియోగం పెంపు, తయారీ సామర్థ్యాల విస్తరణ, మౌలిక సదుపాయలపై వ్యయాలు పెంచడం వంటివి.. అంతర్జాతీయ డిమాండ్ బలహీనతలను అధిగమించేందుకు సాయపడతాయని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నాయని.. ఇది ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతుగా నిలుస్తుందని వివరించింది. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంపు డిమాండ్‌కు ఊతమిస్తుందని అంచనా వేసింది. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు భారత్ కంటే పాక్‌కే ఎక్కువ నష్టం చేస్తాయని పేర్కొంది. ఆ దేశంతో భారత్‌కు పెద్దగా వాణిజ్య సంబంధాలు లేకపోవడాన్ని ప్రస్తావించింది. పైగా భారత్‌లో అధిక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి అంతా ఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉన్నట్టు తెలిపింది. కానీ, రక్షణ రంగంపై అధికంగా వెచి్చంచాల్సి వస్తే అది భారత్ ద్రవ్య పరిస్థితులపై ప్రభావం చూపిస్తుందని.. ద్రవ్య స్థిరీకరణ ఆలస్యం కావొచ్చని అభిప్రాయపడింది. భారత ఆటో రంగం మాత్రం అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. అమెరికా టారిఫ్‌ల కారణంగా ఏర్పడిన అనిశి్చతులతో 2025 సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను మూడీస్ 6.7 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఈ నెల మొదట్లో ప్రకటించడం తెలిసిందే. -
అగ్రరాజ్యానికో గోల్డెన్ డోమ్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అగ్రరాజ్యం, అతిపెద్ద ఆర్థికవ్యవస్థ, అమేయమైన సైనిక శక్తి.. ఇలా అన్నీ ఉన్నా అమెరికాను సువిశాలమైన, విస్తారమైన భూభాగం భయపెడుతోంది. భూమి ఎక్కువుంటే ఎందుకు భయపడాలనే సందేహం రావొచ్చు. దేశం ఓ మోస్తరు విస్తీర్ణంలో ఉండే ఉన్న భూభాగమంతటికీ సమగ్ర స్థాయిలో రక్షణ కల్పించొచ్చు. అదే విశాల భూభాగమైతే శత్రు దేశ క్షిపణులు ఎక్కడ పడతాయో ఊహించడం కూడా కష్టం. అమెరికాను వేధిస్తున్న ఈ సమస్యకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో చెక్ పెడతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ప్రకటించారు. మొత్తంగా 175 బిలియన్ డాలర్ల వ్యయంతో గోల్డెన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాట్లుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2029 జనవరిలోగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి యావత్ అమెరికా భూభాగాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థను ఏర్పాటుచేయడం అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ స్పష్టంచేసింది. భూమి మీదే కాదు ఆకాశంలోనూ ఇందుకు సంబంధించి లేజర్ కాంతిపుంజం వెదజల్లే వ్యవస్థలను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని బడ్జెట్ ఆఫీస్ తెలిపింది. ఇంతటి సంక్లిష్టమైన అధునాతన సాంకేతికతతో కూడిన అసాధారణ వ్యవస్థ నిర్వహణకు రాబోయే 20 సంవత్సరాల్లో ఏకంగా 542 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనావేసింది. ప్రస్తుతానికి అమెరికా పార్లమెంట్లో ట్రంప్ తొలి దఫాగా ప్రాజెక్ట్ కోసం కేవలం 25 బిలియన్ డాలర్లు మాత్రమే ప్రతిపాదించారని బడ్జెట్ ఆఫీస్ తెలిపింది.ఏమిటీ గోల్డెమ్ డోమ్?ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్ క్షిపణులను మన భూభాగంపై మోహరించిన సుదర్శన చక్ర(ఎస్–400) గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. మార్గమధ్యంలోనే ఆ మిస్సైళ్లను కూల్చేసింది. గాజా భూభాగం మీద నుంచి హమాస్ సాయుధులు సంధించిన వందలాది క్షిపణులను సైతం ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ గగనతల రక్షణ వ్యవస్థ ఇలాగే నేలమట్టంచేసి తమ నేలను కాపాడుకుంది. ఎస్–400, ఐరన్‌డోమ్‌లు భూతలం మీద మొహరించిన రక్షణ వ్యవస్థలు. వాహనాలపై బిగించిన రాకెట్ లాంఛర్ ఇందులో కీలకం. అయితే అమెరికా సిద్ధంచేయబోతున్న గోల్డెన్ డోమ్ కాస్తంత భిన్నమైంది. ఇది భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మేళవింపు. లేజర్ కాంతి ఎంతటి కఠినమైన లోహాలనైనా కోసి పారేస్తుంది. ఆకాశంలోని ఉపగ్రహం లాంటి వ్యవస్థ ఈ లేజర్ కాంతి పుంజాన్ని శత్రు క్షిపణులపై ప్రయోగించి వాటిని సెకన్ల వ్యవధిలో నాశనం చేస్తుంది. గోల్డెన్ డోమ్‌లో ఈ లేజర్‌కాంతి విభాగమే అత్యంత కీలకమైంది. గోల్డెన్డోమ్లో భాగంగా పెద్దసంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి వాటిని నిఘా, దాడి వ్యవస్థలుగా తీర్చిదిద్దనున్నారు.లేజర్ కాంతి, సెన్సార్లు, శాటిలైట్ల సమ్మేళనంఈ గోల్డెన్ డోమ్‌ను లేజర్ కాంతి, సెన్సార్లు, పలు ఉపగ్రహాల, క్షిపణుల సమ్మేళనంగా చెప్పొచ్చు. అన్నీ కలిసి ఏకకాలంలో సమన్వయంతో పనిచేస్తూ నవతరం ‘మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్’గా నిలిచిపోనున్నాయి. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే సెన్సార్లను భూతలం మీద ఉండే గగనతల రక్షణ వ్యవస్థతో అనుసంధానిస్తారు. ఫలానా ప్రాంతం నుంచి శత్రు క్షిపణి దూసుకొస్తున్న విషయాన్ని భూతల, గగనతల సమ్మిళిత వ్యవస్థలు గుర్తించి వెంటనే ఆకాశంలోని లేజర్ కాంతిపుంజ విభాగానికి చేరవేస్తాయి. లేజర్‌కాంతి అవసరంలేని సందర్భాల్లో శత్రు క్షిపణిని అడ్డుకునేందుకు వెనువెంటనే క్షిపణులను ప్రయోగిస్తారు. సొంత క్షిపణితో పనికాదని నిర్ధారించుకోగానే అత్యంత తీక్షణమైన లేజర్ కాంతిని ఆ శత్రు క్షిపణిపై ప్రసరింపజేస్తారు. నేల మీద మొబైల్ లాంఛర్ నుంచి, యుద్ధవిమానం నుంచి వచ్చే క్షిపణులనూ ఈ లేజర్‌కాంతి నాశనం చేయగలదు. అలా అమెరికా గగనతలంలో కీలకమైన చోట్ల ఈ లేజర్‌బీమ్ లైటింగ్ సిస్టమ్స్‌ను సిద్ధంచేస్తారు. ఈ బహుళ అంచెల వ్యవçస్థలన్నీ ఎల్లవేళలా సమన్వయంతో పనిచేస్తూ అమెరికాను కంటికి రెప్పలా కాపాడతాయి. గోల్డెన్ డోమ్ ముఖ్యంగా నాలుగు పనులు చేస్తుంది. 1. ఫలానా చోట శత్రు క్షిపణి క్రియాశీలకంగా మారిందని గుర్తించగానే అది లాంఛర్‌ను దాటి బయటికొచ్చేలోపే నాశనంచేస్తుంది. 2. ఒకవేళ అప్పటికే బయల్దేరితే తొలిదశలోనే అడ్డుకుంటుంది. 3. లేదంటే మార్గమధ్యంలో నేలకూలుస్తుంది. 4. అప్పటికీ చేయిదాటిపోతే అది లక్ష్యాన్ని ఢీకొట్టే చిట్టచివరి నిమిషంలోనైనా మిస్సైల్‌ను మట్టుబెడుతుంది. ఈ పనులను కృత్రిమమేధ ఆధారిత కమాండ్ సిస్టమ్ చూసుకుంటుంది.స్టార్‌వార్స్ సిద్ధాంతం నుంచి..అంతరిక్షం నుంచి కాంతిపుంజాన్ని ప్రయోగించడమనేది ఇంకా ప్రయోగదశలోనే ఉందని అమెరికా ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ మంగళవారం వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ, యూఎస్ నార్తర్న్ కమాండ్లు సమష్టిగా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై పనిచేస్తు న్నాయి. ‘‘ సంప్రదాయక క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లతోపాటు అణ్వస్త్ర సామర్థ్య క్షిపణులనూ ఈ గోల్డెన్ డోమ్ విజయవంతంగా అడ్డుకుంటుంది’’ అని రక్షణ మంత్రి పీట్ హెగ్సత్ చెప్పారు. యూఎస్ స్పేస్‌ఫోర్స్ జనరల్ మైఖేల్ గెటెలిన్ ఈ ప్రాజెక్ట్‌కు సారథ్యంవహిస్తారు. ఫోర్స్టార్ జనరల్ అయిన గెటెటిన్కు వైమానిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. తాము సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా చేరతామని కెనడా తన ఆసక్తిని వెల్లడించింది. ఆయుధరంగ దిగ్గజం ‘లాక్‌హీడ్ మార్టిన్’ సంస్థ గోల్డెన్ డోమ్ ఉపకరణాలను అభివృద్ధిచేయనుంది. 80వ దశకంలో అమెరికా అధ్యక్షునిగా సేవలందించిన రొనాల్డ్ రీగన్ ‘స్టార్‌వార్స్’ సిద్ధాంతం, ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ వ్యవస్థల నుంచే గోల్డెన్ డోమ్ ఆలోచన పురుడుపోసుకుంది. క్షిపణులను అడ్డుకునే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, ఏగిస్ సిస్టమ్‌లనూ గోల్డెన్ డోమ్‌లో వినియోగించనున్నారు.సందేహాలు, అనుమానాలుఇంతవరకు అంతరిక్షంలో పరీక్షించని ఈ వ్యవస్థను కేవలం నాలుగేళ్లలోపు ఎలా అందుబాటులోకి తెస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. గోల్డెన్ డోమ్‌లో పెద్ద సంఖ్యలో కొత్త ఉపగ్రహాలు, ఏఐ సెన్సార్లు అవసరం. ప్రపంచంలోనే అత్యధిక రుణభారాన్ని మోస్తున్న అమెరికా సర్కార్ ఈస్థాయి కొత్త భారీ బడ్జెట్‌ను ఇంత తక్కువ సమయంలో సమకూర్చుకోగలదా? అసలు ఇది సమర్థవంతంగా పనిచేస్తుందా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం తొలినాళ్లలో ఒకేరోజు ఒకేసారి 20 నిమిషాల వ్యవధిలో హమాస్ 5,000 స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. వాటిని అడ్డుకోవడంలో ఐరన్‌డోమ్ విఫలమైంది. ఈ నేపథ్యంలో ఒక సాయుధ సంస్థే ఇన్ని మిస్సైళ్లను ప్రయోగించగల్గితే పేద్ద యుద్ధమే వస్తే రష్యాలాంటి దేశం ఇంకెంత స్థాయిలో విరుచుకుపడుతుందో ఊహించడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ శక్తిసా మర్థ్యాలు ఏపాటివో అందుబాటులోకి వస్తేగానీ చెప్పలే మని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.చైనా, రష్యా నుంచి ముప్పు..రష్యా, చైనా తమ ఉపగ్రహాలకు అధునాతన శక్తిసామర్థ్యాలను సంతరింపజేశాయి. అవి అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యంచేయగలవు. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ అవసరం ఏర్పడిందని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. కేవలం అంతరిక్షంలో వాడేందుకు రష్యా ఒక కొత్తతరహా అణ్వాయుధాన్ని తయారుచేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ అణ్వాయుధం అంతరిక్షంలో సంచరిస్తూ విడతలవారీగా పేలుతూ సమీప శత్రుదేశ ఉపగ్రహాలను నాశనంచేయగలదని అమెరికా వాదిస్తోంది. అమెరికా గోల్డెన్ డోమ్ ఆలోచనను ఇప్పటికే రష్యా, చైనాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శక్తివంతమైన లేజర్‌కాంతి వ్యవస్థలను అంతరిక్షంలో ఏర్పాటుచేసి ఉప గ్రహాలు సంచరించే కక్ష్యలను రణక్షేత్రాలుగా మార్చొద్దని ఇరు దేశాలు గోల్డెన్ డోమ్ ఆలోచనపై అభ్యంతరం వ్యక్తంచేశాయి. -
అమెరికా గోల్డెన్ డోమ్.. భారత్ ఐరన్ డోమ్ ఇదే
ఢిల్లీ: అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంలో అటు ఇరాన్, ఇటు హిజ్బొల్లాలు ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేశాయి. అయితే ఈ దాడిలో రాకెట్లను ఐరన్ డోమ్ అడ్డంగించింది.రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేసి తన సామర్థ్యం ఏంటో ఇజ్రాయెల్ ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ ఐరన్ డోమ్ వ్యవస్థపై ప్రపంచ దేశాలు కన్నేశాయి. మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐరన్‌డోమ్‌తో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడీ ఐరన్ డోమ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాను బాలిస్టిక్,క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షించేందుకు 175 బిలియన్ డాలర్ల వ్యవస్థతో గోల్డెన్ డోమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తోంది?వంటి వివరాలు చూద్దాం.గోల్డెన్ డోమ్ అంటే ఏమిటి?గోల్డెన్ డోమ్ అనేది అమెరికా కోసం రూపొందించబడిన అంతరిక్ష ఆధారిత క్షిపణి నిరోధక కవచం. శుత్రువులు ప్రయోగించిన రాకెట్లను భూమి మీదకు చేరుకునే లోపే అడ్డుకునేలా టెక్నాలజీని వినియోగిస్తోంది. ఉదాహరణకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌లు భూమి మీద ఉన్న ఇంటర్సెప్టర్లు (Interceptors) ఆధారంగా పనిచేస్తే, అమెరికా గోల్డ్ డోమ్ పూర్తిగా అంతరిక్షంలో శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. ఈ గోల్డెన్ డోమ్‌లో శాటిలైట్స్ ఉంటాయి. ఇవి క్షిపణులు ఎగురటం ప్రారంభమైన వెంటనే వాటిని గుర్తించి, ప్రారంభ దశలోనే వాటిని నిలువరించే సామర్ధ్యం సత్తా దీని సొంతం.ఈ సాంకేతికత అమెరికా భూమిపైకి మాత్రమే కాకుండా ఇతర ఖండాల నుండి లేదా అంతరిక్షం నుండి వచ్చే క్షిపణుల నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. ఇది చైనా, రష్యా, ఉత్తర కొరియా, భవిష్యత్తులో ఇరాన్ లాంటి దేశాలు తలపెట్టే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా రూపొందిస్తోంది.బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణుల నుంచి దేశాన్ని రక్షిస్తోంది. గోల్డెన్ డోమ్‌లో అవుటర్ లేయర్ స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ (SBIRS),గ్రౌండ్-బేస్డ్ రాడార్స్తో పాటు,మిసైల్ లాంఛర్లను అడ్డుకుంటుంది. భారత్‌కు ఆకాశ్ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా గోల్డెన్‌డోమ్.. భారత్‌కు ఆకాశ్. ఆకాశ్ భారత్ క్షిపణి రక్షక వ్యవస్థ. 30 కి.మీ. దూరంలో, 18,000 మీ. ఎత్తులో ఎగురుతున్న శత్రు విమానాల్ని కూల్చేస్తుంది. గాల్లో ఎగురుతున్న యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలి నుండి భూమికి ప్రయోగించే క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులనూ నిర్వీర్యం చెయ్యగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు, ఒక్కో లాంచరులో మూడేసి క్షిపణులూ ఉంటాయి. ఇందులో ఒక రాజేంద్ర 3డీ పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎర్రే రాడార్ కూడా ఉంటుంది. ప్రతీ బ్యాటరీ ఏకకాలంలో 64 లక్ష్యాలను పరిశీలిస్తుంది. వాటిలో 12 లక్ష్యాలను ఛేదించగలదు.ఒక్కో క్షిపణిలో 60 కిలోగ్రాము శకలాలతో కూడుకున్న వార్‌హెడ్ ఉంటుంది.ఆకాశ్ వ్యవస్థ తేలిగ్గా ఎక్కడికంటే అక్కడికి తరలించవచ్చు. -
హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు
అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్ సంస్థల నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ దారుణంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత వీసా దరఖస్తులు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసా దరఖాస్తుల సంఖ్య నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 26.9 శాతం తగ్గిందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ సంవత్సరం కేవలం 358,737 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి - ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 480,000లతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2025 లో 470,342 అర్హత గల రిజిస్ట్రేషన్లు 343,981 చేరాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ దరఖాస్తుల 308,613గా ఉంది.ప్రత్యేక లబ్ధిదారులు 442,000 నుండి 339,000 కు తగ్గారు ఒక్కో దరఖాస్తుదారుని సగటు రిజిస్ట్రేషన్లు 1.06 నుండి 1.01 కి తగ్గాయి. బహుళ రిజిస్ట్రేషన్లు కలిగిన లబ్ధిదారుల తరపున కేవలం 7,828 దరఖాస్తులు మాత్రమే దాఖలు కాగా గత ఏడాది ఈ సంఖ్య 47,314గా ఉంది. అయితే, పాల్గొనే కంపెనీల సంఖ్య 57,600 వద్ద సాపేక్షంగా స్థిరంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, అనిశ్చితులే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వాదనలను కొట్టిపారేసిన యూఎస్సీఐఎస్ రిజిస్ట్రేషన్ శాతం తగ్గడానికి కారణం ట్రంప్ విధానాలు, వీసా నిబంధనలు కాదని వెల్లడించింది.. మోసాలు, అన్యాయమైన రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు తాము తీసుకుంటున్న చర్యలే కారణమని పేర్కొంది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో ట్రంప్ పరిపాలనలో విధానాలు, యుఎస్ చట్టాన్ని ఒక్కసారి ఉల్లంఘించిన వ్యక్తుల వీసాలను రద్దు చేసే "క్యాచ్-అండ్-రివోక్" నియమాన్ని తిరిగి ప్రవేశపెట్టడం. వీసా సంబంధిత రుసుము పెంపు, ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చిందంటున్నారు టెక్ సంస్థ యజమానులు. జనవరిలో, H-1B రిజిస్ట్రేషన్ రుసుమును 10 డాలర్ల నుంచి 215 కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ చర్య ముఖ్యంగా స్టార్టప్‌లు. చిన్న సంస్థలకు చాలాఎక్కువగా ప్రభావితం చేసిందని గ్రాడింగ్.కామ్ వ్యవస్థాపకురాలు మమతా షెఖావత్ అన్నారు. అయితే హెచ్ 1-బి వీసాల డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినా, 2026లో అందుబాటులో ఉన్న 85,000 వీసాల కోసంరిజిస్ట్రేషన్ల సుమారు 3.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం.చదవండి: అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకి -
అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : యూఎస్ ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్!
సీనియర్ సిటిజనులను పట్టిపీడిస్తున్న అల్జీమర్స్ (Alzheimer )వ్యాధి నిర్ధారణలో కీలకమైన పురోగతి ఊరటగా నిలుస్తోంది. ఈ వ్యాధిని సహాయపడటానికి రక్తాన్ని పరీక్షించే పరికరం అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ రక్తపరీక్షను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదించింది. అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే తొలి ఇన్ విట్రో డయాగ్నస్టిక్ పరికరం కావడం విశేషం. ఈ ఏడాది జూన్నుంచి అమెరికాలో ఇది అందుబాటులోకి వస్తుంది. జపాన్ కంపెనీ అభివృద్ధి చేసిన సరికొత్త మెడికల్ టెస్ట్‌కు అమెరికాలోని ఎఫ్‌డీఏ గతవారమే ఆమోదముద్ర వేసింది. తద్వారా పెట్ స్కాన్లు వెన్నెముక ద్రవ విశ్లేషణలు లేకుండానే ఈ పరీక్ష ద్వారా30 నిమిషాల్లో ఫలితాన్ని తెలుసుకోవచ్చు.అల్జీమర్స్ ముందస్తు గుర్తింపు, సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌డీఏ దీనికి ఆమోదముద్ర వేసింది. "అల్జీమర్స్ వ్యాధి చాలా మందిని ప్రభావితం చేస్తుందని, రొమ్ము క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ రెండింటి బాధితుకల ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని FDA కమిషనర్ మార్టిన్ ఎ మకారీ ఒక ప్రకటనలో తెలిపారు. 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 10 శాతం మందికి అల్జీమర్స్ ఉందని ,2050 నాటికి ఆ సంఖ్య రెట్టింపు కానుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కొత్త వైద్య ఉత్పత్తులు రోగులకు సహాయ పడతాయని ఆశిస్తున్నామన్నారు. ఈ చర్య రోగులకు ఈ వినాశకరమైన నాడీ సంబంధిత వ్యాధి పురోగతిని నెమ్మదింపజేసేలా, ముందుగానే చికిత్స ప్రారంభించడంలో ఇది సహాయ పడుతుంది. అలాగే ఖరీదైన, ఇన్వాసివ్ PET ఇమేజింగ్ లేదా కటి పంక్చర్ (lumbar punctures)ల అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.పరీక్ష ఎలా పనిచేస్తుందిఫుజిరేబియో డయాగ్నోస్టిక్స్ అభివృద్ధి చేసిన లూమిపల్స్ రక్త పరీక్ష రక్తంలోని రెండు ప్రోటీన్ల నిష్పత్తిని కొలుస్తుంది. అమిలాయిడ్ 1-42 β-అమిలాయిడ్ 1-40 - ఈ రెండింటి నిష్పత్తి మెదడులోని అమిలాయిడ్ ఫలకాలతో పరస్పర సంబంధం కలిగి ఉంది.ప్రస్తుత రోగనిర్ధారణ పద్ధతులతో పోలిస్తే అల్జీమర్స్ రక్త పరీక్ష చాలా వరకు ఖచ్చితంగా ఉంటుందని అంచనా. 499 మంది రోగులతో నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో, ఈ పరీక్ష అధిక రోగనిర్ధారణ విశ్వసనీయతను ప్రదర్శించిందిసానుకూల ఫలితాలు వచ్చిన వారిలో 91.7 శాతం మందికి PET స్కాన్లు లేదా స్పైనల్ టాప్స్ లేకుండా అల్జీమర్స్-సంబంధిత ఫలకాలు నిర్ధారించినారు. ప్రతికూల ఫలితాలు వచ్చిన వారిలో 97.3 శాతం మందికి ఎటువంటి ఫలకాలు (plaques) లేవు. జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా గందరగోళం వంటి అభిజ్ఞా క్షీణత లాంటి ప్రారంభ సంకేతాలను చూపిస్తున్న 55 ఏళ్లు ,అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం ఈ పరీక్ష ఉద్దేశించబడింది. అమెరికాలోని సర్టిఫైడ్ ప్రయోగశాలలలో ఈ పరీక్ష అందుబాటులో ఉంటుందని ఫుజిరెబియో నిర్ధారించింది. ఇది నేరుగా రోగులకు అందుబాటులో ఉండదు. వైద్యుడి సిఫారసు అవసరం. అయితే ఇది భారతదేశంలో లేదా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ పరీక్ష ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. అయితే, US డేటా ఆధారంగా ఇతర దేశాలలో నియంత్రణ ఆమోదాలు అనుసరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
175 బిలియన్ డాలర్లతో ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’.. చైనా, రష్యా ఆందోళన..
వాషింగ్టన్: ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధం వాతావరణం కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వార్.. ఇక, ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ వంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రక్షణ వ్యవస్థల గురించి చాలా చర్చలు జరిగాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ దేశానికి కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. ఈ ‘గోల్డెన్ డోమ్’ కోసం ఏకంగా దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా( 175 బిలియన్ డాలర్లు)ఖర్చు చేస్తామని వెల్లడించారు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలోనే ‘గోల్డెన్ డోమ్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి 25 బిలియన్ డాలర్ల ప్రారంభ నిధులు కేటాయిస్తున్నామని, అంతిమంగా 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అత్యంత సాంకేతికతతో కూడిన మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ను ఆమోదిస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అవతలి నుంచి అమెరికాపై క్షిపణి దాడులు చేసినా ఇది తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. స్పేస్ నుంచి దాడులు చేసినా అమెరికాకు ఏమీ కాదన్నారు. మన దేశం విజయంలో.. మనం భూమి మీద నివసించాలంటే ఇలాంటివి అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు.🚨 #BREAKING: President Trump and Secretary Hegseth have announced the GOLDEN DOME missile defense system for the U.S."Golden Dome will be capable of catching missiles from across the world or even SPACE.""We'll be completing the job Reagan started 40 years ago!"Trump also… pic.twitter.com/MX1URx1fa0— Nick Sortor (@nicksortor) May 20, 2025యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా సైతం ఆసక్తిని చూపినట్లు తెలిపారు. డోమ్ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. దీనికి 542 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుండొచ్చని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లు, అణు దాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా దీని ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.చైనా, రష్యా ఆందోళన..ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్.. ఐరన్ డోమ్ వ్యవస్థను 2011 నుంచి ఉపయోగిస్తోంది. ప్రత్యర్థుల క్షిపణులు దూసుకొచ్చినా.. ఉక్కు కవచంలా వాటిని అడ్డుకునేందుకు టెల్అవీవ్ ఈ డోమ్‌ను ఉపయోగిస్తుంది. దీని నిర్మాణానికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. దీంతో అటువంటి గోల్డెన్ డోమ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా (USA) సైతం సిద్ధమయ్యింది. అయితే, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశాయి. . @SecDef "The Golden Dome for America’s game changer. A generational investment in security in America and Americans..." pic.twitter.com/uazlPcCytR— DOD Rapid Response (@DODResponse) May 20, 2025 -
అశ్లీల కంటెంట్‌పై అమెరికా కొరడా
వాషింగ్టన్: ఆన్లైన్లో అశ్లీల కంటెంట్‌పై అమెరికా కొరడా ఝళిపించింది. దాని నియంత్రణకు ‘టేకిట్ డౌన్’ పేరిట కొత్తం చట్టం తెచ్చింది. దీనిప్రకారం వ్యక్తుల తాలూకు అశ్లీల, అభ్యంతరకర ఫొటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడానికి వీల్లేదు. సోషల్ ప్లాట్‌ఫాంలు అలాంటి కంటెంట్‌ను తమ దృష్టికి రెండు రోజుల్లోగా తొలగించాల్సి ఉంటుంది.ఈ నిబంధన డీప్‌ఫేక్ కంటెంట్‌కు కూడా వర్తిస్తుంది. ఈ చట్టం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ఎన్నాళ్లుగానో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లుపై సోమవారం ఆమె సమక్షంలోనే ట్రంప్ సంతకం చేశారు. అనంతరం ఆయన కోరిక మేరకు మెలానియా కూడా బిల్లుపై సంతకం చేయడం విశేషం. ‘‘దీనికోసం మెలానియా ఎంతగానో పోరాడింది. కనుక ఆమె సంతకానికి అర్హురాలు’’ అని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. -
ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!
వైద్యవిధానం విప్లవాత్మక మార్పులతో పురోగమిస్తుంది. నయం కానీ వ్యాధులను సరికొత్త చికిత్సా విధానంతో నయంచేసి రోగుల్లో సరికొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. తాజాగా వైద్య విధానంలో అలాంటి పరిణామామే చోటు చేసుకుంది. అంతేగాదు మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిలో కొత్త ఆశలను అందిస్తోంది. ఈ ఘనత సాదించింది లాస్ ఏంజిల్స్‌లోని యూఎస్ సర్జన్లు. అసలేం జరిగిందంటే..నలుగురు పిల్లల తండ్రి ఆస్కార్ లారైన్జార్ కేన్సర్ కారణంగా రెండు మూత్రపిండాలు, మూత్రశయంలోని దాదాపు సగ భాగాన్ని కోల్పోయాడు. దాంతో అప్పటి నుంచి అతడు డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నాడు. అతడి సమస్యను నయం చేసేలా అమెరికన్ యూరాలజిస్ట్లు అవయవా దాత నుంచి సేకరించిన మూత్రపిండాలు, మూత్రశయంని మార్పిడి చేశారు. ఈ సంక్లిష్టమైన సర్జరీ దాదాపు ఎనిమిది గంటలు పైనే పట్టింది. 41 ఏళ్ల ఆస్కార్ లారైన్జార్కి ఈ శస్త్రిచికిత్స పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అలాగే మార్పిడి చేసి కొత్త మూత్రపిండాల సాయంతో మూత్ర విసర్జన చేయగలిగాడు కూడా. అతనికి ప్రస్తుతం మూత్రపిండాల పనితీరు మెరుగ్గానే ఉండటంతో డయాలసిస్ అవసరం తగ్గింది కూడా. ఈ సర్జరీ జరిగిన కొన్ని గంటల అనంతరమే..అతడు సాధారణ మూత్ర విసర్జన చేయగలిగాడు. పాపం ఆ వ్యక్తి గత ఏడేళ్లుగా ఈ మూత్ర విసర్జన చేయలేకపోయాడు. ఈ శస్త్ర చికిత్స అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ మేరకు సదరు వైద్య బృందం మాట్లాడుతూ..మూత్రాశయ మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్సల గురించి గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే క్లినికల్ ట్రయల్ కోసం మరో నాలుగు శస్త్ర చికిత్సలు చేసేలే ప్లాన్లు ఉన్నాయి. నిజానికి ఈ పద్ధతిలో అవయవ తిరస్కరణకు అడ్డుకట్ట వసేలా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అణిచివేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే ఇంతవరకు బలహీనమైన మూత్రాశయాలతో బాధపడుతున్న చాలామంది బాధితులకు ప్రేగులోని భాగంతో తిరిగి మూత్రశయం తయారు చేయడం వంటి పరిమిత ఎంపికలే గతంలో ఉండేవని అన్నారు. దీంతో ఆయా వ్యక్తుల్లో తరుచుగా ఈ సమస్యల తిరగబెట్టడమే లేదా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నమవ్వడమో జరిగేదన్నారు. కానీ ప్రస్తుతం తాము చేసిన ఆధునిక మూత్రాశయ మార్పిడి చికిత్సతో అంతకుముందు ఉత్ఫన్నమైన ప్రమాదాలకు తెరపడినట్లయ్యిందన్నారు. అలాగే కేన్సర్ వంటి మహమ్మారి వ్యాధులతో బాధపడే వారిలో కొత్త ఆశలను నింపింది. సదరు బాధితుడు లారైన్జార్ చేసిన శస్త్రచికిత్స వైద్యశాస్త్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచించడమే గాక అతను పూర్తిస్థాయిలో కోలుకుంటే గనుక చాలామంది రోగులకు జీవితంపై కొత్త ఆశను అందిస్తుంది.(చదవండి: ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్ ) -
Joe Biden: సివియర్ కేన్సర్ స్టేజ్..! ఏకంగా ఎముకలకు..
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)కు కేన్సర్ తీవ్రతరమైన స్థాయిలో ఉందని ఆయన కార్యాలయం వెల్లడించింది. వైద్య పరీక్షల్లో బైడెన్‌కు తీవ్రమైన ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అది ఎముకలకు వ్యాపించిందని చెబుతున్నారు. 82 ఏళ్ల బైడెన్ గత కొన్ని రోజులుగా మూత్ర విసర్జన సంబంధిత సమస్యలతో బాధపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా..ఈ విషయం వెల్లడైందని వైద్యులు చెబుతున్నారు. చెప్పాలంటే బైడెన్ సివియర్ కేన్సర్ స్టేజ్‌తో పోరాడుతున్నారు. త్రీవతరమైన దశలో ఉన్న ఈ కేన్సర్‌ని నిర్వహించడం సులభమేనని త్వరితగతిని ఆయన ఈ వ్యాధి నుంచి కోలుకుంటారని బైడెన్ కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే ఈ కేన్సర్ ఏవిధంగా ప్రాణాంతకంగా మారుతుందా..? ఆ కేన్సర్ కణాలు ఎముకలకు వ్యాపించడం అంటే..ప్రోస్టేట్ కేన్సర్(Prostate cancer)ని వైద్యులు మొదటగా ఏ స్థాయిలో ఉందో నిర్థారిస్తారు. ఇక్కడ బైడెన్‌కు 9 స్కోరుతో అత్యంత తీవ్ర స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉందని వెల్లడైంది. పైగా ఆ కేన్సర్ ఎముకల వరకు వ్యాపించిందని తెలిపారు. అదెలా జరుగుతుందంటే..ప్రోస్టేట్ కేన్సర్ పురుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా నెమ్మదిగా పెరుతుంది. ఒక్కోసారి శరీరంలోని ఇతర భాగాలకు అంటే..ప్రధానంగా ఎముకలకు వ్యాపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అంటే ఇక్కడ వెన్నెముక, తుంటి, పెల్విస్ వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుందట. ఈ దశని క్రిటికల్ స్టేజ్‌గా పేర్కొన్నారు వైద్యులు. దీనివల్ల రోగికి తీవ్రమైన నొప్పి, వెన్నుపాము కుదింపు, చలశీలతకు సంబంధించిన సమస్యలు ఉత్ఫన్నమవుతాయిని చెబుతున్నారు. అంతేగాదు ప్రోస్టేట్ కేన్సర్ ఎముక నిర్మాణాన్ని ప్రేరేపిస్తుందట. ఎముకను పెళుసుగా మార్చి విరిగిపోయేలా చేస్తుందట. అందువల్ల ఆయా బాధితులకు రాత్రిపూట ఎముక సంబంధిత నొప్పులు తీవ్రతరమవుతాయట. అందులోనూ 80 ఏళ్లు పైబడిన వారిలో, ఎముకలకు వ్యాపించే ప్రోస్టేట్ కేన్సర్ అనేది అత్యంత ప్రాణాంతకమైదిగా పేర్కొన్నారు నిపుణులు. ముందస్తుగా ఎలా గుర్తించాలంటే..బాడీ వెనుక లేదా తుంటిలో నిరంతర ఎముక నొప్పి. నాడీ సంబంధిత సమస్యలను అలక్ష్యం చేయకూడదు. బయాప్సీ ఫలితాల ఆధారంగా ప్రోస్టేట్ కేన్సర్ స్టేజ్‌ని నిర్థారిస్తారు.చికిత్స: హార్మోన్ థెరపీ, రేడియేషన్, కీమోథెరపీ, ఎముకలను లక్ష్యంగా చేసుకునే శస్త్రచికిత్సలతో నయం చేస్తారు. ఇంత ప్రాణాంతక స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నప్పుడూ..పూర్తినివారణ సాధ్యం కాదని చెబుతున్నారు నిపుణులు. కేవలం దాన్ని నిర్వహించగలం.. అంతే అన్నారు. ఇక్కడ రోగి జీవన నాణ్యత మెరుగుపరిచేలా చికిత్స అందిస్తారు. కేవలం ఆయా బాధితులు మూత్ర సంబంధిత సమస్యలకు, ఎముకల బలం కోసం విటమిన్ డి స్లపిమెంట్స్ వంటి వాటితో చికిత్స అందించి పరిస్థితి మెరుగుపడేలా చేయగలరే తప్ప పూర్తి స్థాయిలో ఈ సమస్య నుంచి బయటపడటం జరగదని తెలిపారు. అలాగే కొన్ని రకాల కేన్సర్లను మొదటి స్టేజ్‌లో ఉంటేనే పూర్తి స్థాయిలో నివారించడం సాధ్యపడుతుందని నొక్కి చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: చిన్న వయసులో చూపు కోల్పోయినా.. ప్రతిభతో జ్వలిస్తోంది..! ) -
ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి
అరిజోనా: అమెరికాకు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. టిక్‌టాక్ ఇన్ఫ్లుయెన్సర్ ఎమిలీ కైసర్ మూడేళ్ల కుమారుడు ట్రిగ్ కైసర్ తమ ఇంటి వెనుకవున్న స్విమ్మింగ్ పూల్‌లో స్పృహలేని స్థితిలో కనిపించాడు. ఈ ఘటన అరిజోనాలోని చాండ్లర్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే మే 12న సాయంత్రం ఏడు గంటల సమయంలో, చాండ్లర్ పోలీస్ విభాగానికి అష్లే డ్రైవ్‌లోని ఒక ఇంటి నుంచి కాల్ వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఇన్ఫ్లుయెన్సర్ ఎమిలీ కైసర్ కుమారుడు ట్రిగ్గా గుర్తించారు. వారు వెంటనే కార్డియోపల్మనరీ రిససిటేషన్(సీపీఆర్) చేశారు. అనంతరం బాలుడిని తొలుత చాండ్లర్ రీజినల్ హాస్పిటల్‌కు, ఆ తర్వాత ఫీనిక్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత, మే 18 ట్రిగ్ మృతి చెందాడు. అనంతరం చాండ్లర్ పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలుడు పూల్‌లో మునిగి ఎలా మృతిచెందాడనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కాగా 26 ఏళ్ల ఎమిలీ కైసర్ టిక్‌టాక్ ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొందారు. ఆమెకు 3.4 మిలియన్ టిక్‌టాక్ ఫాలోవర్స్, వన్ మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె భర్త బ్రాడీ కైసర్. వీరి కుటుంబం అరిజోనాలోని చాండ్లర్‌లో 2024 నవంబర్ నుంచి ఉంటోంది.ఎమిలీ తన రోజువారీ జీవితం, భార్యగా, తల్లిగా తన అనుభవాలను, శుభ్రత, జీవనశైలి, బ్యూటీ టిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ ఘటన తర్వాత, ఎమిలీ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మానేయడంతో ఆమె ఫాలోవర్స్ ఆందోళన చెందుతున్నారు. వారు ఆమెకు సానుభూతి సందేశాలు పంపుతున్నారు. కాగా అమెరికాలో పలువురు చిన్నారుల మరణానికి ఈత కొలనులు కారణంగా నిలుస్తున్నాయనిసెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(డీసీసీ) తెలిపింది.ఇది కూడా చదవండి: హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి -
బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్.. స్పందించిన ట్రంప్, కమలాహారిస్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తాజాగా ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇటీవల ఆయనకు జరిపిన ఆరోగ్య పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధరణ అయినట్లు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. బైడెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల బైడెన్‌కు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఆయన ప్రొస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో, పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబసభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ స్పందించారు. బైడెన్ క్యాన్సర్ అనే విషయం తనను కలచి వేసిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బైడెన్ పోరాట యోధుడని పేర్కొన్న ఆమె.. ఈ క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.Doug and I are saddened to learn of President Biden’s prostate cancer diagnosis. We are keeping him, Dr. Biden, and their entire family in our hearts and prayers during this time. Joe is a fighter — and I know he will face this challenge with the same strength, resilience, and… pic.twitter.com/gG5nB0GMPp— Kamala Harris (@KamalaHarris) May 18, 2025మరోవైపు.. బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్.. ‘జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడం దురదృష్టకరం. ఈ విషయం తెలిసి నేను, మెలానియా చాలా బాధపడ్డాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. "Melania and I are saddened to hear about @JoeBiden’s recent medical diagnosis. We extend our warmest and best wishes to Jill and the family, and we wish Joe a fast and successful recovery." –President Donald J. Trump 🇺🇸 pic.twitter.com/6HjermTGK7— The White House (@WhiteHouse) May 18, 2025 -
సముద్రగర్భంలో పెను విస్ఫోటం!
అగ్నిపర్వతం బద్దలైనప్పుడు నిప్పులు చిమ్ముతూ లావా నింగిలోకి ఎగసిపడటం, విపరీతంగా ధూళి సమీప గ్రామాలపై దుమ్ము దుప్పటి కప్పేయడం టీవీల్లో చూసే ఉంటారు. వీటికి పూర్తిభిన్నమైన అగ్నిపర్వతం అతి త్వరలో బద్దలుకానుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఆస్టోరియా నగర తీరానికి 300 మైళ్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రం లోపల ఈ అగ్నిపర్వతం దాగి ఉంది. దీని పేరు యాక్సియల్ సీమౌంట్. భూ ఉపరితలం మీద కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితలానికి 1.4 కిలోమీటర్ల లోతులో ఉండటమే ఈ అగ్నిపర్వతం ప్రత్యేకత. ఎందుకంత ప్రత్యేకత? ఈ అగ్నిపర్వతం రెండు భూ పలకలు ఢీకొనే చోట ఏర్పడింది. పసిఫిక్ భూ పలక, జువాన్ డీ ఫ్యూకా భూ పలకలు తరచూ అత్యంత స్వల్పంగా కదులుతుంటాయి. ఈ క్రమంలో ఇవి పరస్పరం తగులుతూ భూమి ఉపరితల పొరల కదలికలకు కారణం అవుతున్నాయి. వీటి సమీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం త్వరలో బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలోని హ్యాట్‌ఫీల్డ్ మెరైన్ సైన్స్ సెంటర్లో పరిశోధకుడైన బిల్ చాడ్విక్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘భూకేంద్రంలో ద్రవరూపంలోని శిలలు అగ్నిపర్వతం ద్వారా బయటకు వస్తాయి. ఈ శిలాద్రవం (మాగ్మా) వెంటనే సముద్ర జలాలకు తగిలి చల్లబడుతుంది. ఈ క్రమంలో అక్కడి సముద్ర జలాలు వేడెక్కుతాయి’’ అని చాడ్విక్ చెప్పారు.వేల కొద్దీ భూకంపాలు! ‘‘అగ్నిపర్వతం ఎత్తు కేవలం 3,300 అడుగులు. కానీ అత్యంత క్రియాశీలంగా తయారైంది. ఇటీవలికాలంలో శిలాద్రవం బయటికొచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. భూమి కంపిస్తోంది. అగ్నిపర్వతం తాజా స్థితిని తెల్సుకునేందుకు మేం సమీప ప్రాంతం దాకా కేబుల్ వ్యవస్థ ద్వారా భూకంప తీవ్రతలను కనిపెట్టే ఏర్పాట్లుచేశాం’’ అని ఆయన చెప్పారు. ‘‘ అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భూమి వందల సార్లు కంపిస్తుంది. ఇక అగ్నిపర్వతం బద్దలైన సందర్భాల్లో వేల సార్లు కంపిస్తుంది. 2015 ఏప్రిల్‌లో చివరిసారిగా అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు విపరీతంగా శిలాద్రవం బయటకు ఎగజిమ్మింది. అప్పుడు 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 10,000 చిన్నపాటి భూకంపాలు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భూమి కంపించే వీలుంది’’ అని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ ఓషనోగ్రఫీ’లో మెరైన్ జియోఫిజిసిస్ట్, ప్రొఫెసర్ విలియం విల్కుక్ స్పష్టంచేశారు. జీవవైవిధ్యానికి బాసట అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భారీ స్థాయిలో శిలాద్రవం మహాసముద్రజలాల్లో కలిసిపోతుంది. ఈ శిలాద్రవంలో ఎన్నో రకాల మూలకాలు ద్రవరూపంలో ఉంటాయి. ఇవన్నీ సముద్రజలాల్లో సమ్మిళితమై అక్కడి సూక్ష్మజీవులకు ఆహారంగా మారతాయి. ఈ సూక్ష్మజీవులపై ఆధారపడిన చిన్న జలచరాలు, వాటిని ఆహారం తీసుకునే చేపలు.. ఇలా ఆహార చక్రం సదా సవ్యంగా కొనసాగేందుకు అగ్నిపర్వతం పరోక్షంగా సాయపడుతోంది. అత్యంత వేడితో సెగలు కక్కే మాగ్నా సముద్ర ఉపరితలానికి ఎగసిపడగానే అక్కడ జీవులు కొన్ని చనిపోయినా తర్వాత మాత్రం అక్కడ జీవరాశి పెరుగుదలకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో జీవం మనుగడకు అగ్నిపర్వతాలు సైతం తమ వంతు సాయం చేస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మెరైన్ జియోలజీ, జియోఫిజిక్స్ విభాగ ప్రొఫెసర్ డెబీ కెల్లీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచ పరిణామాలే దిక్సూచి
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈ వారంలో మన స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా సుంకాల నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందాలపై తాజా సమాచారం, ప్రపంచ మార్కెట్లపై అది చూపే ప్రభావాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ’భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతలు, తెరవెనుక భౌగోళిక–రాజకీయ సంఘటనలు ప్రస్తుతం శాంతించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు ఇప్పుడు క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్లో మిగిలిన కంపెనీల పనితీరుపై దృష్టిసారించే అవకాశం ఉంది. అంతేకాకుండా, భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అనుకున్నదాని కంటే ముందుగానే కుదరవచ్చన్న ఆశాభావం నెలకొంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌పై మరింత సానుకూల ప్రభావం చూపవచ్చు’ అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. దేశీ పరిణామాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెలువడే కీలక ఆర్థిక గణాంకాలు కూడా మన మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని ఆయన తెలిపారు. అమెరికా వస్తువులపై టారిఫ్‌లను పూర్తిగా ఎత్తివేసేందుకు భారత్ సుముఖంగా ఉందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొనడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనుందని కూడా ఆయన తాజాగా చెప్పారు.కీలక ఫలితాలు... ఈ వారంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ తదితర కీలక కంపెనీలు క్యూ4 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. స్వల్పకాలానికి మన మార్కెట్ ట్రెండ్‌ను ఇవి నిర్దేశించే అవకాశం ఉంది. ‘ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగిన ప్రధాన ఈవెంట్లు ఏవీ లేనందున ఇన్వెస్టర్ల దృష్టి మళ్లీ దేశీ కంపెనీల ఫలితాలపై ఉంటుంది. అలాగే కీలక ఆర్థిక గణాంకాలను కూడా నిశితంగా ట్రాక్ చేస్తారు. ప్రపంచ ట్రేడ్ డీల్స్‌పై అప్డేట్లు, ప్రపంచ మార్కెట్లు వాటికి ఎలా స్పందిస్తాయనేది కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారు’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత ర్యాలీకి దన్నుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ధోరణి కూడా మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతుంది’ అని మిశ్రా వ్యాఖ్యానించారు. ‘అమెరికా–చైనా మధ్య ట్రేడ్ డీల్, ఇండో–పాక్ ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ప్రపంచ వాణిజ్య రంగంలో సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పుంజుకోవడానికి ఇది దోహదం చేస్తుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. గతవారం ఇలా.. విదేశీ ఇన్వెస్టర్ల జోరు నేపథ్యంలో స్టాక్ మార్కెట్ తాజా ర్యాలీ గత వారంలో కూడా కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2,876 పాయింట్లు (3.61 శాతం) దూసుకెళ్లి 82,331 వద్ద స్థిరపడింది. ఇకఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,012 పాయింట్లు (4.21 శాతం) జంప్ చేసి 25,020 వద్ద ముగిసింది.విదేశీ ఇన్వెస్టర్ల క్యూ... ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలఉ శాంతిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడుల బాట పడుతున్నారు. దేశీయంగా కూడా ఆర్థిక వ్యవస్థ మూలాలు మెరుగుపడుతుండటం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) తాజా ర్యాలీ కొనసాగుతోంది. మే నెలలో ఇప్పటిదాకా (16 నాటికి) దేశీ ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ.18,620 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో భారీగా అమ్మకాలకు దిగిన ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌లో తొలిసారి మళ్లీ నికర పెట్టుబడులు (రూ.4,223 కోట్లు) పెట్టడం తెలిసిందే. జనవరిలో ఏకంగా రూ.78,027 కోట్లు, మార్చిలో రూ.34,574 కోట్లు, మార్చిలో రూ.3,973 కోట్ల చొప్పున విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఏప్రిల్ మధ్య నుంచి మళ్లీ పెట్టుబడుల రూట్లోకి వచ్చిన ఎఫ్‌పీఐల దన్నుతో మార్కెట్లు కూడా యూ టర్న్ తీసుకుని దూసుకెళ్తున్నాయి. మొత్తంమీద మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పుంజుకోవడానికి ఇది దారితీస్తోంది. -
ఈ వారం కథ: రీట్వీట్
నువ్వు అలా స్క్రోల్ చేస్తున్నావు. డెడ్ లైన్ల మధ్య ఓ క్షణం. నైట్ లాంప్ వుండీ లేనట్లు వెలుగుతోంది. ప్లాస్టిక్ కంటైనర్‌లోని గోట్ బిర్యానీ చల్లారిపోయింది. క్యాంపస్ అంతా నిశ్శబ్దంగా వుంది, మంచు తెరలతో మూసుకుపోయినట్లు. ఎక్కడి నుంచో పోలీసు హారన్లు. నువ్వు ఏదో చెప్పాలనో, మాట్లాడాలనో అనుకోవటం లేదు. అది నీ తత్త్వం కాదు. అంత మాత్రాన నీకు హృదయం లేదని కాదు. పేదరికం నీ పెదాల్ని మూసేసింది. కానీ ఆ రోజు, నువ్వొక ఫొటో చూశావు. చిన్న పిల్ల. ఆరేడేళ్ళు వుంటాయేమో. ఆ పసిదాని మొహం సగం బూడిదలో కప్పడిపోయింది. ఆ తల్లి ఏడుపు ఆ ఫొటోలో నుంచి నీ గుండెను తాకింది. శిథిలాల మధ్య చిక్కుకున్న ఆ మృతదేహాన్ని చూడలేక కళ్ళు వాల్చుకున్నావు. ఆ పసిదాని పేరు నీకు తెలీదు. తెలియక్కర లేదు కూడా. దుఃఖానికి వూర్లు, పేర్లు, దేశాలు, భాషలు అక్కరలేదు. ఆ రోజుకి ఇంకేమీ రాయలేకపోయావు. ఎన్ని మరణాలు? ఎన్ని దేహాలు? ఎన్ని యుద్ధాలు? ఎంత విధ్వంసం? "Being human is not a crime''ట్వీట్లో వున్నది ఆ ఒక్క వాక్యమే! ఆ వాక్యం రాసింది నువ్వు కాదు. నువ్వు దాన్ని ఎడిట్ చేయలేదు. రీట్వీట్ జస్ట్ రీట్వీట్ చేశావు. ఒక్క క్లిక్. దాహంతో వున్న వాళ్ళకు ఓ గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లు. That's it. అనుకోకుండా ఆ రీట్వీట్ వైరల్ అయింది. కామెంట్లు వరదలాగా ముంచెత్తాయి.కొందరు నిన్ను ప్రశంసిస్తే, మరికొందరు "unamerican' అని విమర్శించారు. ఇమ్మిగ్రెంట్లకు అసలేం పని ఈ దేశంలో అన్నారు. వెళ్లిపొమ్మని కొందరంటే, వెళ్లగొడతామని మరికొందరన్నారు. రాడికల్ అని కొందరంటే, ట్రైటర్ అన్నారు మరికొందరు. నిజం చెప్పద్దు. ఒక్కసారి నీ రీట్వీట్, ఆ స్పందన, ఆ కామెంట్లు ఆ పాపులారిటీ నువ్వు భలే ఆనందించావు. కానీ ఆ ఆనందానికి నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో అప్పుడు నువ్వూహించలేదు. నీ పాలిట అదే ఉరితాడవుతుందని. అదే నీకు వ్యతిరేక సాక్ష్యం అవుతుందని. ఒక్క వాక్యం. Hashtags లేవు. నినాదాలు లేవు. యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనలో అనుకోకుండా నువ్వొక ప్లకార్డు పట్టుకున్నావు. డైలీ పెన్సిల్వేనియన్ పత్రిక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో నువ్వే ప్రముఖంగా కనిపిస్తున్నావు. ఇప్పుడు మీ యూనివర్సిటీలో భారతి అంటే మరో సుబ్రహ్మణ్య భారతి. ఈ ప్రదర్శనలు, ఈ ట్వీట్లు, ఈ డిబేట్లు వీటన్నింటితో నీలోపలి కవిత్వం మళ్ళీ బయటకొచ్చింది. నీ కవితలు స్టూడెంట్స్ నోటి వెంట పద్యాలయ్యాయి.∙∙ మరోవైపు ఏం జరుగుతోందో నువ్వు ఊహించలేకపోయావు. వీటన్నింటినీ ఓ నిఘా కన్ను చూస్తోంది. నిన్నే, నిన్నే, నిన్నే. జింకలకు తెలియాలి సింహాలు ఎప్పటికైనా వేటాడి తీరతాయని. ఇమ్మిగ్రెంట్లకు తెలియాలి ఎప్పటికైనా తిరిగెళ్లిపోవాలని. నీ ఒంటి రంగు ఎప్పటికీ తెలుపు కాబోదని. నీ నిక్ నేమ్ ఎప్పటికీ ‘బ్రౌనీ’నే అని. నువ్వు హక్కులడిగితే, వాళ్ళు నీ బాధ్యతలు గుర్తుచేస్తారు. లిబర్టీ బెల్ ఉన్న ఊర్లో లిబర్టీ నేతిబీరకాయలో నెయ్యి. తెలుసుకొనవే చెల్లీ, అలా మసలుకొనవే తల్లీ!∙∙ నీకు తెలియదు నీ పేరు అట ingtonలోని ఓ అధికార కార్యాలయపు టేబుల్ మీద ఓ ఫోల్డర్ లోకి చేరుతుందని. నీకు తెలియదు నీ పేరు ‘భారతి రాఘవన్’ ఒక జాబితాలోకి అంత సులువుగా చేరిపోతుందని. నీకు తెలియదు నీ వొంటి రంగు, నీ వీసా స్టేటస్, నీ కోపం, నీ ఆలోచన ఇవి చాలు నువ్వు నేరస్థురాలివని నిర్ధారించడానికని. నీకు తెలియదు ఆ అల్గారితమే ఒక ఆయుధమవుతుందని. ఎందుకంటే, నువ్వొక ఇమ్మిగ్రెంట్వి. నీ ధర్మాగ్రహం ఓ ఎర్రజెండా. ప్రతి జెండా ఓ ప్రమాద హెచ్చరిక! ఎక్కడేం జరుగుతోందో వూహించలేని నువ్వు, చల్లారిన నీ గోట్ బిర్యానీని తినటానికి ఉపక్రమించావు. కానీ నీ కళ్ళు పదే పదే ఆ దృశ్యాన్ని చూపిస్తుంటే, తినలేక, తినకుండా పారేసే ఆర్థిక శక్తి లేక రేపటి కోసం దాచి పెట్టావు. నీ ఇవాళనీ రేపటినీ మార్చేసింది అది. కాన్ఫరెన్స్ పేపర్ అసంపూర్తిగా వదిలేసి రూమ్‌కి బయలుదేరావు. టైమ్ చూశావు. వచ్చే నెల అక్క పెళ్లి ఆలోచనలతో నీ మొహాన ఓ చిరునవ్వు వెలిగింది.∙∙∙INTERNAL DHS MEMO & CLASSIFIEDసబ్జెక్ట్: భారతి రాఘవన్ డేట్ ఆఫ్ బర్త్: 04/14/1997సిటిజన్‌షిప్: ఇండియా స్టేటస్: ఎఫ్–1 యూనివర్సిటీ: యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా రెడ్ ఫ్లాగ్: యు.ఎస్. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు. సాక్ష్యం: సోషల్ మీడియా యాక్టివిటీ. రికమెండేషన్: సెక్షన 212(a)(3)(B)కింద వీసా రద్దుకేటగిరీ: సంఘ వ్యతిరేక సంస్థలకు మద్దతు నోట్: జాతీయ భద్రతా ముప్పు యాక్షన్: సాఫ్ట్ డెటెన్షన్ ప్రోటోకాల్. ∙∙ ఓ వారం తర్వాత యూనివర్సిటీ లైబ్రరీ ద్వారం దగ్గర నీ బ్యాడ్జ్ పని చేయలేదు. కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టి వెళ్లిపోయావు. అక్క పెళ్లి కోసం ఇండియా వెళ్ళే హడావిడిలో. నీ వీసా స్టేటస్ మారిందని నీకు తెలియను కూడా తెలియదు. ఎయిర్‌పోర్టు రెండో సెక్యూరిటీ గార్డు కూడా నీ వైపు చూడకుండా కంప్యూటర్ వంక చూస్తున్నప్పుడు, నీకేం అర్థం కాలేదు. నీ మొహంలో భయం, ఆందోళన.‘‘మేమ్, ప్లీజ్ కొంచెం ఈ పక్కకు రండి’’ సెక్యూరిటీ గార్డు రిక్వెస్ట్‌గా అడిగినా, అందులో అధికారమే ధ్వనిస్తోంది. ‘‘ఏమైనా ప్రాబ్లమా సార్?’’ అతి వినయంగా అడిగిన నీ మాటలకు, ‘‘ఇది జస్ట్ రొటీన్’’ చెప్పాడతను. చాలాసార్లు అది నిజమే. కానీ ఈసారి కాదు. ∙∙ ఏజెంట్స్ ఫీల్డ్ నోట్స్: సబ్జెక్ట్ కామ్‌గా కనిపించింది. ఏ మత సంస్థలతోనూ ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది. మానవహక్కులు, అకడమిక్ ఫ్రీడంలాంటి పదాలు తరచూ ప్రయోగించింది. ఆ పోస్ట్ రీట్వీట్ చేయటంలో కానీ, ఆ ప్రదర్శనలో ప్లకార్డ్ పట్టుకోవడంలో కానీ ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పింది. పదే పదే ప్రశ్నించాకా,‘‘ఎవరి పట్లనైనా మానవత్వంతో స్పందించటం నేరమా?’’ అని ఎదురు ప్రశ్నించింది. ∙∙ నీ చేతికి వేసిన సంకెళ్ళు నిన్ను చూసి చులకనగా నవ్వాయి. ఆ నిశ్శబ్దం నిన్ను భూతంలా చుట్టుముట్టి భయపెట్టింది. వాళ్ళంతా చాలా ప్రశాంతంగా ఇది చాలా అలవాటైన పనిలాగా చేసుకుంటూ వెళ్లిపోవటం నిన్ను నిలువునా కూల్చేసింది. నువ్వు మొదట్లో మామూలుగానే అడిగే ప్రయత్నం చేశావు, కానీ నీ గొంతులో కోపం, భయం, ఆందోళన అన్నీ వాళ్ళకు కనిపించాయి. వేటాడే పులికి తన నోటికి చిక్కిన జింక మొహం చూస్తే చాలు. తినక ముందే కడుపు నిండిపోతుంది. వాళ్ళ మొహాలు నీ కంటికి వేటాడే సింహాల్లాగానే కనిపించాయి. ‘‘నా మీద పెట్టిన చార్జ్ ఏమిటి?’’ ‘‘దేశ భద్రతకు ముప్పు.’’ దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్రజెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు.∙∙ ఆ రాత్రి నిన్ను వ్యాన్‌లో మరో చోటికి తీసుకెళ్లారు. అక్కడ కిటికీల్లేవు.కొందరు గార్డులు నీ వంక సానుభూతిగా చూశారు. కొందరు ఇది మా ఉద్యోగం అన్నట్లు కళ్ళతోనే చెప్పుకున్నారు. కొందరి కళ్ళల్లో బాగా శాస్తి జరిగిందన్న ఆనందం. నీ దవడ బిగుసుకుంది. నీ పళ్ళు గట్టిగా కరుచుకోవటం వల్లనో, మరి దేని వల్లనో నాలుకకి రక్తపు రుచి తెలిసింది. ఫోన్ కాల్ ట్రాన్ స్క్రిప్ట్: ICE మానిటర్డ్ లైన్ ‘‘చిన్నీ’’ ‘‘అమ్మా’’ వొణికిన గొంతులోంచి కన్నీళ్లు లోపలకి ఇంకిపోతున్నాయి. ‘‘మొన్న ఫ్లయిట్ ఎందుకు కాన్సిల్ చేశావ్? అంతా ఓకే కదా? నిజం చెప్పు. ఏమైనా జరిగిందా? ఏదేదో వింటున్నాం ఇక్కడ’’ భారతి సమాధానం ఇవ్వకముందే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది. ‘‘అంతా బాగానే వుంది మీరు వర్రీ కావద్దు. వీసా సమస్యలు. పేపర్లు సబ్మిట్ చేశా. బహుశా అక్క పెళ్ళికి నే రాలేకపోవచ్చు’’‘‘నీ వీసా Extensionకి ఎప్పుడనగానో అప్లై చేశావుగా ’’‘అనుమానాలు ముందు పుట్టి తర్వాత అమ్మలు పుట్టి వుంటారు. అంత తొందరగా దేన్నీ నమ్మరు.’ ‘‘ఇక్కడ పరిస్థితులు కొంచెం టెన్షన్‌గా వున్నాయి. నేను ఫోన్ చేయకపోతే కంగారు పడొద్దు.’’ తన మాటలు తనకే నిర్జీవంగా వినిపించాయి. ఫోన్ కాల్ టైమ్ అయిపోయింది. ∙∙ Asylum కోసం మిగతా బందీలకు వీలు కుదిరినప్పుడల్లా ఉత్తరాలు రాసి పెడుతున్నావు నువ్వు. చేయటానికి వేరే పని ఏముంది? ఆలోచనల్లో మునిగిపోవటం తప్ప. ప్రపంచానికి పెదరాయుడులాంటి అమెరికానే గెంటేస్తుంటే, ఇంకే దేశానికిAsylum అప్లికేషన్స్ పెట్టుకోగలరు ఎవరైనా? కదా!∙∙ ఆ సెంటర్లో అనేక దేశాల వాళ్ళు, భాషల వాళ్ళు. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళతో పాటు, నేరాలు ఆపాదించబడ్డ వాళ్ళు కూడా. Like Bharati.. స్పీడ్‌గా కారు నడిపి ఫైన్ కట్టని చిన్న నేరాల నుంచి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు: అందరికీ ఒకటే డిటెన్షన్ సెంటర్. కాపలా కాస్తున్న వారి కళ్ళకు ఎవరేమిటో తెలియదు. తెలియక్కరలేదు కూడా. గార్డులకు, డిటైనీలకు తెలిసింది నల్లటి ఊచలు మాత్రమే!ఊచలు పట్టి వుంచేది వ్యక్తులనే కానీ వ్యక్తిత్వాలను కాదు. ఆవేశాన్నే కానీ ఆలోచనలను కాదు. దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్ర జెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు. కల్పనా రెంటాల(చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!) -
ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..!
‘అద్దె కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు– అబ్బా! ఎలారా ఫ్యామిలీ మన్ అందరూ మ్యానేజ్ చేస్తున్నారు’ అనే సినిమా డైలాగ్ మాదిరిగానే చాలామంది ఫ్యామిలీని రన్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అయితే, అమెరికాలోని లానెట్, జోహాన్ అనే దంపతులు ఈ కష్టాలన్నింటికీ దూరంగా బతికేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. అదే నౌకాజీవితం. వారికున్న కార్లన్నీ ఆమ్మేసి, ప్రపంచయాత్ర చేసే నౌకలో యావజ్జీవిత యాత్రను ప్రారంభించారు. ఈ నౌక మూడున్నరేళ్లల్లో 147 దేశాలకు చెందిన 425 ఓడరేవులలో ఆగుతుంది. ఇప్పటికే ఈ దంపతులు 25 దేశాలను సందర్శించారు. ఇలానే తర్వాతి పదిహేనేళ్లు కూడా ఇందులోనే గడిపేయాలని నిర్ణయించుకున్నారు. అద్భుతమైన వారి నౌకాజీవితాన్ని ‘లివింగ్ లైఫ్ ఆఫ్ ఏ క్రూజ్’ పేరుతో యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసి, ‘ఇక్కడ మేము నెలకు రూ. 2.85 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఇది మా సాధారణ ఖర్చుల కంటే చాలా తక్కువ. పైగా వంట వండటం, బట్టలు ఉతకడం, రూమ్ క్లీనింగ్ ఇలా ఏ పనీ చేయాల్సిన పనిలేదు. పడుకున్న దుప్పట్లు కూడా వారే మడతేసి పెడతారు. కేవలం ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకొని తినడం, ఎంజాయ్ చేయటమే మా పని. ఇదే మా అడ్రస్. అయితే, అప్పుడప్పుడు భూమి మీదకు వెళ్లినప్పుడు నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాం’ అని చెప్పారు. (చదవండి: కళ్లు చెదిరే కాంతుల వేడుక..!) -
పరాయి దేశానికి ఆడుతూ సెంచరీల మోత మోగించిన భారత బ్యాటర్లు
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 2023-27లో భాగంగా నిన్న (మే 17) కెనడాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో యూఎస్ఏ ప్రాతినిథ్యం వహిస్తున్న భారత క్రికెటర్లు స్మిట్ పటేల్, మిలింద్ కుమార్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఫ్లోరిడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా.. ఓపెనర్ స్మిట్ పటేల్ (137 బంతుల్లో 152 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), ఐదో నంబర్ ఆటగాడు మిలింగ్ కుమార్ (67 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు అజేయ సెంచరీలతో శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 361 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కెనడా.. సంజయ్ కృష్ణమూర్తి (3.2-0-10-3), కెంజిగే (10-0-41-2), మిలింద్ కుమార్ (9-0-40-2), హర్మీత్ సింగ్ (10-1-38-2), జస్దీప్ సింగ్ (7-0-35-1) సత్తా చాటడంతో 46.2 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా యూఎస్ఏ 169 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో మిలింద్, స్మిట్ పటేల్ రికార్డు సెంచరీలతో కదంతొక్కడంతో యూఎస్ఏ వన్డేల్లో తమ అత్యధిక స్కోర్‌ను (361) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 60 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన మిలింద్.. వన్డేల్లో యూఎస్ఏ తరఫున వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో మిలింద్ టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ఇండియన్ బార్న్ బ్యాటర్‌గా సెహ్వాగ్ సరసన నిలిచాడు. సెహ్వాగ్ 2009లో న్యూజిలాండ్‌పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ బార్న్ ప్లేయర్ రికార్డు విరాట్ కోహ్లి (52 బంతులు) పేరిట ఉంది.ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 44 బంతులు తీసుకున్న మిలింద్.. ఆతర్వాత హాఫ్ సెంచరీని కేవలం 16 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ క్రమంలో మిలింద్ ఓ ఓవర్లో (48వ ఓవర్లో) 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 30 పరుగులు పిండుకున్నాడు. స్మిట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో అతను చేసిన అజేయమైన 152 పరుగుల స్కోర్ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 చరిత్రలోనే రెండో అత్యుత్తమం. -
అమెరికాలో కలకలం.. బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన నౌక
వాషింగ్టన్: న్యూయార్క్ నగరంలో నౌక ప్రమాదం కలకలం రేపింది. మెక్సికన్ నేవీకి చెందిన ఒక శిక్షణ నౌక ‘కువౌటెమోక్’ (Cuauhtemoc) బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల మేరకు.. ప్రయాణ సమయంలో కువౌటెమోక్ నౌకకు ఏర్పాటు చేసిన మూడు అడుగుల తెర భాగం బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. దీంతో నౌకకు ఏర్పాటు చేసిన తెరతోపాటు బ్రూక్లిన్ బ్రిడ్జ్ ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Just watched the Brooklyn Bridge get smoked live by a boat with a massive Mexican flag pic.twitter.com/R8eJKwJaJ2— Nelson Slinkard (@TheWillieNelson) May 18, 2025 మెక్సికోకు చెందిన ఈ నౌక సుమారు 297 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఉంది. శిక్షణ కోసం వినియోగించిన ఈ నౌక బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ను ఢీ కొట్టడంతో ప్రయాణం ఆగిపోయింది.Just watched the Brooklyn Bridge get smoked live by a boat with a massive Mexican flag pic.twitter.com/R8eJKwJaJ2— Nelson Slinkard (@TheWillieNelson) May 18, 2025 ఈ నౌక ప్రతి సంవత్సరం శిక్షణ ముగిశాక ప్రపంచ పర్యటనలో భాగంగా పలు పోర్ట్‌లకు వెళ్లుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 6న మెక్సికోలోని అకపుల్కో పోర్ట్ నుంచి ప్రయాణం మొదలైంది. 277 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ నౌక 15 దేశాల్లోని 22 పోర్ట్‌లను సందర్శించాలని ప్రణాళిక వేసుకుంది. ఇందులో కింగ్స్టన్ (జమైకా), హవానా (క్యూబా), కోసుమెల్ (మెక్సికో), న్యూయార్క్ (అమెరికా), రేక్జావిక్ (ఐస్లాండ్), బోర్డో, సేంట్ మాలో, డంకిర్క్ (ఫ్రాన్స్), అబెర్డీన్ (స్కాట్లాండ్) ఉన్నాయి. మొత్తం 254 రోజుల ప్రయాణంలో 170 రోజులు సముద్రంలో గడపాల్సి ఉంది. -
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్‌పై పుతిన్ కుట్ర?
వాషింగ్టన్: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాల్ని తెలుసుకునేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk)పై రష్యా యువతితో వలపు వల విసిరినట్లు మాజీ ఎఫ్‌బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఏజెంట్ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మన్ బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్ తీసిన డాక్యుమెంటరీలో జోనాథ్ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాన్ మస్క్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్‌పై ఓ యువతి ప్రయోగించారు. మస్క్‌కు ఉన్న జూదం,మత్తు పదార్ధాల వినియోగంలాంటి వీక్నెస్ను అడ్డం పెట్టుకుని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. పుతిన్‌కు ఆపరేషన్ గురించి తెలుసా?ఇక మస్క్, పీటర్ థీల్‌పై జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ పుతిన్ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్ అనుమతి లేకుండా స్పై చేయరు కదా? అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే, రష్యా జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో మస్క్, పీటర్ థీల్ చిక్కుకున్నారా? లేదా? అనే విషయాల్ని వెల్లడించేందుకు జోనాథన్ బౌమా విముఖత వ్యక్తం చేశారు.కాగా, ఎఫ్‌బీఐలో 16 ఏళ్లు పని చేసిన జోనాథ్ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథ్ బౌమాను అరెస్ట్ చేసింది. చివరకు లక్షడాలర్ల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు. -
'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'
భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయం.. అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. నిర్దిష్ట గడువు దాటిన తరువాత కూడా అక్కడే (అమెరికాలో) ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.నిర్దిష్ట గడువు తరువాత కూడా అమెరికాలో ఉంటే.. వారిపై బహిష్కరణ వేటు ఉంటుంది. అంతే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టడానికి సాధ్యం కాదు, అంటే శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని తన ఎక్స్ ఖాతాలో యూఎస్ ఎంబసీ ఇండియా వెల్లడించింది.యూఎస్ ఎంబసీ ఇండియా చేసిన ప్రకటన.. అమెరికాలో విద్యార్థి, పర్యాటక, వర్క్ పర్మిట్ వంటి వీసాలతో ఉంటున్న భారతీయులకు వర్తిస్తుంది. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా అక్కడే ఉంటే.. వారు భవిష్యత్తులో ఎప్పుడూ మళ్ళీ అమెరికాలో అడుగుపెట్టలేరు. నిర్దిష్ట గడువు తరువాత.. ఏవైనా అనుకోని ఇబ్బందులు ఎదురైతే, చట్టపరమైన చర్యల నుంచి బయటపడటానికి యూఎస్సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) ని సంప్రదించాలని, యూఎస్ ఎంబసీ ఇండియా పేర్కొంది.ఇదీ చదవండి: ఇదీ పాకిస్తాన్ పరిస్థితి..!వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో ఉంటున్నవారు యూఎస్ విడిచి వెళ్లిపోవాలని.. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఏప్రిల్‌లోనే చెప్పారు. గడువు దాటిన 30 రోజుల వరకు కూడా దేశంలోనే ఉన్నవారు ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. లేకుంటే.. అలాంటి వారిని క్రిమినల్ కేసులు కింద అరెస్ట్ చేసి జైలులో ఉంచే అవకాశం ఉంది. జరిమానా కూడా విధించవచ్చు.If you remain in the United States beyond your authorized period of stay, you could be deported and could face a permanent ban on traveling to the United States in the future. pic.twitter.com/VQSD8HmOEp— U.S. Embassy India (@USAndIndia) May 17, 2025 -
అమెరికాకు షాక్.. రేటింగ్‌కు కోత పెట్టిన మూడీస్
అగ్రరాజ్యంగా చెప్పుకొనే అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అమెరికా క్రెడిట్ రేటింగ్‌కు కోత పెట్టింది.పెరుగుతున్న జాతీయ రుణం, ఆర్థిక అస్థిరతపై ఆందోళనలను ఉటంకిస్తూ యునైటెడ్ స్టేట్స్ క్రెడిట్ రేటింగ్‌ను ట్రిపుట్ ఎ (AAA) నుండి ఎఎ 1 (AA1) కు తగ్గించింది. అగ్రరాజ్యం తన టాప్ ర్యాంకింగ్‌ను కోల్పోవడం చరిత్రలో ఇదే తొలిసారి.అమెరికా ఆర్థిక పథంపై పెరుగుతున్న భయాందోళనలకు ఇది సంకేతంగా నిలుస్తోంది. గతంలో 2023లో ఫిచ్ రేటింగ్స్, 2011లో స్టాండర్డ్ అండ్ పూర్స్ ఏజెన్సీలు ఇలాగే అమెరికా రేటింగ్‌కు కోతలు పెట్టాయి. తాజాగా మూడీస్ తొలిసారిగా అగ్రరాజ్యం ర్యాంక్‌ను తగ్గించింది. ఫెడరల్ లోటు 2024లో జీడీపీలో 6.4 శాతం నుంచి 2035 నాటికి దాదాపు 9 శాతానికి పెరుగుతుందని మూడీస్ అంచనా వేసింది.క్రెడిట్ రేటింగ్ తగ్గడం వల్ల వ్యాపార సంస్థలు, వినియోగదారులకు రుణ వ్యయాలు పెరుగుతాయని, తనఖా రేట్లు, కారు రుణాలు, క్రెడిట్ కార్డు వడ్డీపై ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడీస్ స్థిరమైన దృక్పథాన్ని కొనసాగించినప్పటికీ ఆ దేశ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంలో రాజకీయ గందరగోళం ప్రధాన అవరోధంగా పేర్కొంది.ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను కోతలు, వ్యయ తగ్గింపులను అమలు చేయాలని భావిస్తున్న తరుణంలో మూడీస్ నుంచి ఈ ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. రేటింగ్‌ను తగ్గించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వైట్ హౌస్ కొనసాగుతున్న రికవరీ ప్రయత్నాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని వాదించింది. అయితే రేటింగ్ కోత ప్రస్తుత పాలనలో పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితికి ప్రతిబింబంగా విమర్శకులు భావిస్తున్నారు.ఈ వార్తలపై ప్రపంచ మార్కెట్లు స్పందిస్తుండగా, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఫెడరల్ రిజర్వ్, విధాన నిర్ణేతలు ఎలా స్పందిస్తారో ఆర్థికవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ డౌన్ గ్రేడ్ అమెరికాలో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం గురించి కొత్త ఆందోళనలను రేకెత్తిస్తుంది. పెరుగుతున్న రుణ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనాలని పాలకులపై ఒత్తిడిని పెంచుతుంది. -
వై-యాక్సిస్ యూఎస్ ఎంబసీతో ఎంఓయూ
సాక్షి,సిటీబ్యూరో: అమెరికాలో చదువుకోవాలనుకునే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహిక విద్యార్థులకు సహకారం అందించ డానికి వై–యాక్సిస్ ఫౌండేషన్ యూఎస్ రాయబార కార్యాలయంతో అధికారిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా విద్యార్థులకు విశ్వసనీయమైన, నిస్పాక్షికమైన మార్గదర్శకత్వాన్ని పూర్తి ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎడ్యుకేషన్ యూఎస్ఏ ప్రోవైడర్‌గా ఈ ఒప్పందాన్ని కుదర్చుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వై యాక్సిస్ ఫౌండేషన్ కార్యాలయంలో అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ జెనిఫర్ లార్సన్, వై యాక్సిస్ ఫౌండేషన్ ట్రస్టీ జేవియర్ అగస్టిన్తో యూఎస్ ఎడ్యుకేషన్ సెంటర్ సేవలకు సంబంధించిన ఎంఓయును కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలకు సేవలు అందించే ఏకైక ఎడ్యుకేషన్ యూఎస్ఏ కేంద్రంగా హైదరాబాద్‌లో వై–యాక్సిస్ ఫౌండేషన్‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం సంతోషంగా ఉందని హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్ తెలిపారు. యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవాలనుకునే వారికి అవసరమైన సమాచారం కోసం ఎడ్యుకేషన్ యూఎస్ఏ వన్–స్టాప్ సెంటర్ వై–యాక్సిస్ ఫౌండేషన్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వై–యాక్సిస్ ఫౌండేషన్ డైరెక్టర్ సబీనా జేవియర్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: After Fifty యాభై దాటారా? మతిమరుపా? ఇవిగో జాగ్రత్తలు! -
ఎయిర్ ట్యాక్సీల్లో వేదికలకు రవాణా.. ఇలా ఇదే తొలిసారి
లాస్ ఏంజెలిస్: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటి వరకు ఆటగాళ్లు, ప్రేక్షకులు, వీఐపీలు కార్లు, బస్సుల్లోనే వేదికలకు చేరేవారు. కానీ లాస్ ఏంజెలిస్‌లో 2028లో జరిగే విశ్వక్రీడలు ‘విహంగ విహారానికి’ సిద్ధమవుతున్నాయి. మరో మూడేళ్లలో అమెరికాలోని ప్రఖ్యాత నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్లో ‘ఎయిర్ ట్యాక్సీ’లను వినియోగిస్తామని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.ఆటగాళ్లు, వీఐపీలే కాదు... సాధారణ ప్రేక్షకులు సైతం విహంగ విహారం చేస్తూ ఆయా వేదికలకు చేరుకుంటారు. విశ్వక్రీడల్లో ఈ తరహా ఎయిర్ ట్యాక్సీలు నిర్వహించనుండటం చరిత్రలోనే తొలిసారి కానుంది. తద్వారా ఎవరికీ ప్రయాణ బడలిక లేకుండా కేవలం పది నుంచి 20 నిమిషాల్లోపే వేదికలకు చేరవేయవచ్చని నిర్వాహకులు ప్రణాళికలతో ఉన్నారు. సోఫీ స్టేడియం, లాస్ ఏంజెలిస్ మెమోరియల్ కొలిజియం, శాంటా మోనికా, ఆరెంజ్ కౌంటీ, హాలీవుడ్ వేదికలకు ఎయిర్ ట్యాక్సీలను వినియోగించే ఆలోచనతో ఉన్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ ఆడమ్ గోల్డ్‌స్టెయిన్ తెలిపారు. అమెరికా భవిష్య ప్రయాణ ముఖచిత్రాన్నే లాస్ ఏంజెలిస్ విశ్వక్రీడలు మార్చబోతున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఫైనల్లో అల్కరాజ్రోమ్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ తన కెరీర్లో 25వ టోరీ్నలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అల్కరాజ్ 6–3, 7–6 (7/4)తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై విజయం సాధించాడు. 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఒక ఏస్ సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఏడాది నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన అల్కరాజ్ రెండు టోర్నీల్లో (మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్; రోటర్‌డామ్ ఓపెన్) విజేతగా నిలిచి, బార్సిలోనా ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. యానిక్ సినెర్ (ఇటలీ), టామీ పాల్ (అమెరికా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. -
భారతీయులకు ట్రంప్ మరో షాక్..
-
ఎన్నారైలపై ట్రంప్ మరో పిడుగు
మీరు అమెరికాలో ఉంటున్నారా? భారత్‌లోని మీ కుటుంబానికి ప్రతి నెలా డబ్బులు పంపుతున్నారా? అయితే ఇకపై మరో పన్ను బాదుడుకు సిద్ధంగా ఉండండి. అలా పంపే ప్రతి లక్ష రూపాయలకూ రూ.5 వేల చొప్పున ట్రంప్ ముక్కు పిండి మరీ వసూలు చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భారత అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న అధ్యక్షుడు ఈ మేరకు ప్రతిపాదనను తాజాగా తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం అమెరికాలోని వలసదారులు (Migrants) తమ మాతృదేశాలకు పంపే మొత్తాలపై 5 శాతం పన్ను విధించనున్నారు. అమెరికా పౌరులు కానివారందరికీ ఇది వర్తిస్తుంది. గ్రీన్‌కార్డుదారులతో పాటు హెచ్–1బీ, ఎఫ్–1 లేదా జే–1 తదితర వీసాలపై అక్కడ ఉంటున్న భారతీయులంతా ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితులవుతారు. ట్రంప్ దీనికి ‘వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్’ అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు. ఈ బిల్లుకు అధికార రిపబ్లికన్లు మద్దతిస్తుండగా ఎన్నారైల (NRIs) మద్దుతుదారుగా పేరున్న విపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్లు ప్రస్తుతం ప్రతినిధుల సభ పరిశీలనలో ఉంది. అక్కడ, అనంతరం సెనేట్‌లో ఆమోదముద్ర పడితే జూలై 4 నుంచి అమల్లోకి వస్తుంది. మనోళ్లకు పెద్ద దెబ్బ అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 45 లక్షల పై చిలుకే. వారిలో చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తదితరులే. వాళ్లు భారత్‌కు ఏటా భారీ మొత్తాలు పంపుతుంటారు. మామూలు ఉద్యోగులు చేసేవాళ్లు కూడా భారత్‌లోని తమ కుటుంబాల పోషణ, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు తదితరాల నిమిత్తం ప్రతి నెలా టంచనుగా డబ్బులు పంపుతుంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు.రెమిటెన్స్ పన్ను (remittance tax) దెబ్బకు ఇకపై మనవాళ్లు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మన విదేశీ మారకద్రక్య నిల్వలపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చంటున్నారు. ‘‘భారత్ తిరిగొచ్చి ఇక్కడే స్థిరపడాలని భావించే అమెరికా ఎన్నారైలు సంపాదించే ప్రతి డాలర్‌పైనా 5 శాతం కోత పడ్డట్టే లెక్క. భారీ మొత్తాలు పంపే ఆలోచనలో ఉన్నవాళ్లు జూలైకి ముందే ముగించుకోవడం మేలు’’ అని సూచిస్తున్నారు.జీవనాధారంపై దెబ్బ రెమిటెన్సుల పన్ను వర్తింపు విషయమై ప్రతిపాదనలో ఎలాంటి మినహాయింపులూ ప్రతిపాదించలేదు. కనుక ఎంత తక్కువ మొత్తం పంపినా బాదుడు ఖాయమే. దాంతో వాటిపైనే ఆధారపడే ఎన్నో భారత కుటుంబాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ‘‘పిల్లల్ని అమెరికా పంపిన తల్లిదండ్రుల్లో చాలామంది వారిపైనే ఆధారపడి ఉంటారు. ఇంటి అద్దె, లేదా ఈఎంఐలు మొదలుకుని వైద్య ఖర్చుల దాకా పిల్లలు నెల నెలా పంపే డబ్బులే ఆధారం. రెమిటెన్సులంటే కేవలం ఆర్థిక కార్యకలాపాలు కావు. లక్షలాది మందికి జీవనాధారాలు. దీన్ని ఆ మానవీయ కోణం నుంచి చూడాలి. కానీ ట్రంప్ పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారు’’ అంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నారై రెమిటెన్సులపై బాగా ఆధారపడే మన రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం ఖాయమని చెబుతున్నారు.రెమిటెన్సుల్లో భారతే టాప్ → ప్రపంచం మొత్తంలో విదేశాల నుంచి అత్యధికంగా రెమిటెన్సులు వచ్చేది భారత్‌కే. → 2024లో వాటి మొత్తం ఏకంగా 130 బిలియన్ డాలర్లు! అంటే దాదాపు రూ.10.7 లక్షల కోట్లు. → అందులో 28 శాతం, అంటే రూ.3 లక్షల కోట్ల (32 బిలియన్ డాలర్ల) మేరకు వాటా భారత అమెరికన్లదే. → ఆ లెక్కన 5 శాతం రెమిటెన్సు పన్ను రూపేణా అమెరికాకు ఏటా ఒక్క ఎన్నారైల మీదే అప్పనంగా రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది! అక్రమ పన్నే! రెమిటెన్స్ పన్ను విధింపు చట్టారీత్యా చూసినా సరికాదన్నది ఆర్థిక నిపుణుల వాదన. ‘‘ఇది చాలా అన్యాయమైన ప్రతిపాదన. వేలాది మైళ్లు వలస వెళ్లి అనేక కష్టాలకోర్చి తమవారికి అండగా నిలుస్తున్నందుకు, స్వదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నందుకు శిక్షిస్తున్నట్టుగా ఉంది. పైగా అమెరికాకు అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులు చెల్లించిన మీదట మిగుల్చుకున్న మొత్తంపై దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది కచ్చితంగా అక్రమమే. ఇందులో రాజకీయ ఉద్దేశాలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి’’ అని వారంటున్నారు. ఈ ప్రతిపాదనపై డెమొక్రాట్ సభ్యులు కాంగ్రెస్‌లో తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. వలస సమాజాలను, ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలను ఈ పన్ను అన్యాయంగా పీల్చి పిప్పి చేస్తుందని వాదించారు. మితవాద రిపబ్లికన్లు కూడా వారితో గొంతు కలుపుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కెనడా, అమెరికా మార్కెట్లోకి హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కెనడా, అమెరికా ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. ఈ మేరకు కెనడా సంస్థ చార్జ్ పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్యూర్ కంపెనీ తెలిపింది.ఈ భాగస్వామ్యంతో ప్యూర్ అధునాతన ఎనర్జీ స్టోరేజ్ ప్రొడక్ట్ లైన్ ను కో-బ్రాండింగ్ అరేంజ్మెంట్ ద్వారా కెనడా, అమెరికాలోని వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ఉత్పత్తులు రెసిడెన్షియల్, కమర్షియల్ నుంచి గ్రిడ్ స్కేల్ అప్లికేషన్స్ వరకు ఉంటాయని పేర్కొంది.తమకున్న పటిష్టమైన తయారీ సౌకర్యాలతో బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో లోతైన నైపుణ్యాన్ని సాధించామని, తమ మా సృజనాత్మక, మన్నికైన, నమ్మదగిన ఇంధన నిల్వ ఉత్పత్తులకు యూఎస్, కెనడా మార్కెట్లలో విస్తృత ఆమోదం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు ప్యూర్ ఫౌండర్, ఎండీ నిశాంత్ దొంగరి అన్నారు. -
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తిమంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్‌ది నాల్గో స్థానం. ఇక్కడ చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉంది. టాప్ 5లో ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణకొరియాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ బలం మరింత పెరిగిందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. అది కూడా అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందన్నారు. అటు ఎఫెన్స్, ఇటు డిఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని కొనియాడారు. ఇక్కడ ప్రధానంగా భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ప్రశంసలు కురిపించారు. భారత్ రక్షణ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ పని తీరును ఎంత పొగిడినా తక్కువే అంటూ కితాబిచ్చారు. బ్రహ్మోస్ తరహా క్షిపణులు అటు పాకిస్తాన్ లోనే కాదు, చైనాకు కూడా లేవని బల్లగుద్దీ మరీ చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో భారత్ లో ఉన్న బ్రహ్మోస్ తో సరిపోల్చే క్షిపణులు కానీ ఆయుధ సామాగ్రి గానీ లేవన్నారు జాన్ స్పెన్సార్.. ఈ విషయాల్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జాన్ స్పెన్సార్.‘ చైనా వైమానికి రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు కానీ భారతదేశ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం కల్గి ఉన్నాయి. భారత్ బ్రహ్మోస్ క్షిపణి.. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల్లో ఉన్న దానికంటే అధికరెట్లు బలంగా ఉంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ భారత్ క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఏ ప్రదేశాన్నైనా సునాయాసంగా ఛేదించగలదనే సందేశాన్ని భారత్ చాలా క్లియర్ గా పంపింది’ అని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే.. -
వింత డ్యాన్స్‌తో ట్రంప్‌కు స్వాగతం.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమ దేశాల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చేరుకున్నారు. ట్రంప్‌కు యూఏఈలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు అక్కడి సంప్రదాయ నృత్యం అల్ అయ్యాలా (Al-Ayyala)తో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదేం డ్యాన్స్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.వివరాల ప్రకారం.. అధ్యక్షుడు ట్రంప్ యూఏఈ (UAE) చేరుకున్నాక అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరు నేతలు కలిసి అధ్యక్ష భవనం ఖషర్ అల్-వాటన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు బాలికలు జుట్టు విరబోసుకొని సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా తలలు ఊపుతూ ట్రంప్‌నకు స్వాగతం పలికారు. పక్కనే కొందరు డబ్బులు వాయిస్తుండగా ఇద్దరు నేతలు ముందుకు కదిలారు. వారి డ్యాన్స్ చూసిన ట్రంప్.. ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.In a symbolic gesture of respect, the #UAE welcomed Donald Trump with the traditional Al-Ayyala dance — a beautiful display of heritage, unity, and yes, the iconic hair-flippic.twitter.com/rjYe0y0VJu— Jordan Kyle (@_Jordan_Kyle_) May 15, 2025ఇదిలా ఉండగా, యునెస్కో (UNESCO)ప్రకారం.. అల్- అయ్యాలా అనేది యూఏఈ, ఒమన్లలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ నృత్యం. సంప్రదాయ దుస్తులు ధరించిన బాలికలు వారి పొడవాటి జుట్టును విరబోసుకొని.. సంగీతానికి అనుగుణంగా తలలను ఊపుతుంటారు. వేడుకలు, వివాహాల సమయాల్లో అల్- అయ్యాలాను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. వయసు, లింగం, సామాజిక బేధం వంటి తేడాలు లేకుండా అందరినీ ఒకచోట చేర్చేదిగా దీన్ని భావిస్తారు. వీరంతా తలలు ఊపుకుంటూ డ్యాన్స్ చేసినట్టుగా ఊగిపోతారు.It is actually a traditional Emirati dance called Al Ayyala or Al Razfa depending on the region. The hair movement by the women symbolizes pride and beauty and is part of a heritage performance that reflects unity and strength. What you saw was not just a show. It was culture. pic.twitter.com/JKcAlXOmGd— Khalid Alkaabi (@alyarwani) May 15, 2025 -
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో! -
అమెరికాలో అరకు రుచులు..
అరకు కాఫీ రుచిని యునైటెడ్ స్టేట్స్కు పరిచయం చేసిన మొదటి బ్రాండ్‌గా అరకు అరోమా నిలిచిందని, హైదరాబాద్ నగరంతో పాటు స్థానిక రుచులను విశ్వవ్యాప్తం చేయడంలో తాము వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అరకు అరోమా వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య తెలిపారు. క్రిష్ ఫుడ్ అండ్ ఫన్ ఇండియా ఆధ్వర్యంలో అరకు అరోమా కొత్త కాఫీ బ్లెండ్లను ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రుచి, నాణ్యతకు ప్రసిద్ధి చెందిన ఈ ఆఫర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఔత్సాహికులకు సరికొత్త అనుభవాలను అందిస్తాయని అన్నారు. ఈ కొత్త బ్లెండ్లలో అరకు అరోమా గ్రీన్ కాఫీ, అరబికా రీగేల్, ఫిల్టర్ కాఫీ, అరబికా ప్రైమ్ ఉన్నాయన్నారు. యూఎస్ఏలో రిజిస్టర్డ్ బ్రాండ్ ఉనికితో ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులకు సేవలు అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అందర్జాతీయ వంటకాలు.. ) -
అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో జీరో టారిఫ్!
దోహా: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉన్న వేళ కాల్పుల విరమణకు ఇరుదేశాలు సమ్మతించాయని అందరికంటే ముందే ప్రకటించి అభాసుపాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తొందరపాటు ప్రకటన చేశారు. టారిఫ్‌లు విధించకుండానే అమెరికా నుంచి వస్తూత్పత్తుల దిగుమతికి భారత్ అత్యుత్సాహం చూపిస్తోందని ట్రంప్ గురువారం అనూహ్య ప్రకటన చేశారు. దీంతో వెంటనే భారత్ స్పందించింది. అలాంటిదేమీ లేదని, టారిఫ్‌ల ఖరారుపై విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతు న్నాయని, చర్చలు ఇప్పట్లో ముగిసిపోవని భారత్ స్పష్టంచేసింది. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టింది.మోదీ మౌనమేల?: కాంగ్రెస్ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేరని విపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘‘ అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు చర్చల కోసం మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ జీరో టారిఫ్ అంటూ ప్రకటన చేశారు. ఈ సున్నా టారిఫ్‌కు, ఆపరేషన్ సిందూర్ ఆగిపోవడానికి మధ్య సంబంధమేంటి?. ఈ అంశంలో మోదీ ఎందుకు మౌనం వహించారు?. అమెరికాతో డీల్ కుదుర్చుకునేందుకు మోదీ ఏమేం అంశాల్లో తలూపారు?’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు.ట్రంప్ ఏం మాట్లాడారు?గురువారం ఖతార్ రాజధాని దోహాలో వ్యాపారదిగ్గజాలు, సంస్థలతో ట్రంప్ సమావేశమయ్యారు. చైనా, అమెరికా టారిఫ్‌ల యుద్ధం నేపథ్యంలో భారత్‌లో అత్యధికంగా ఐఫోన్లను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేయబోతున్నట్లు యాపిల్ సంస్థ ఇటీవల ప్రకటించడం తెల్సిందే. ఈ విషయం నచ్చని ట్రంప్ ఇదే అంశాన్ని దోహా భేటీలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వద్ద ప్రస్తావించారు. ‘‘అమెరికాలో యాపిల్ సంస్థను ఇంతబాగా చూసుకుంటున్నా మీరేమో భారత్‌లో ఐఫోన్లను మరింత ఎక్కువగా తయారుచేస్తామంటున్నారు. అక్కడే కర్మాగారాలను విస్తరిస్తున్నారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. అమెరికా ఉత్పత్తులపై భారత్ చాలా ఎక్కువ టారిఫ్‌లు విధిస్తోంది. ప్రపంచంలో అధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్ కూడా ఉంది. టారిఫ్‌లు పెంచాక అత్యధిక ధరలకు మీరు భారత్‌లో వస్తువులను విక్రయించడం చాలా కష్టమవుతుంది. మీకో విషయం చెప్పనా. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ ఒక చక్కని ప్రతిపాదన తెచ్చింది. అసలు టారిఫ్‌లే లేకుండా వస్తువులను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి వాళ్లు దాదాపు అంగీకారం తెలిపారు. మీరు భారత్‌లో ఐఫోన్ల తయారీ కర్మాగారాలను నిర్మించినా అక్కడి సర్కార్ మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. వాళ్లకు స్వప్రయోజనాలే ముఖ్యం’’ అని టిమ్‌కుక్‌తో ట్రంప్ మాట్లాడారు. ఈ విషయాలను మీడియాకు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తనతో మాట్లాడిన తర్వాత అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు టిమ్‌కుక్ అంగీకారం తెలిపారని ట్రంప్ ప్రకటించారు. భారతీయ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ ఏప్రిల్ 9వ తేదీన ప్రకటించారు. అయితే 90 రోజులపాటు ఈ పెంపును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తర్వాత ట్రంప్ వెల్లడించడం తెల్సిందే.ఖండించిన భారత్ట్రంప్ మాటల్లో వాస్తవం లేదని భారత్ గురువారం ప్రకటించింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ‘‘ టారిఫ్లుసహా సమగ్ర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇవి సంక్లిష్టమైనవి. చర్చలు ముగిసిపోలేదు. ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ఏ అంశంపైనా తుది నిర్ణయాలు వెలువడలేదు. ఒప్పందం కుదుర్చుకుంటే అది ఇరుపక్షాలకు ప్రయోజనకారిగా ఉండాలి. రెండు దేశాలకూ లబ్ధిచేకూరాలి. మేం ఇదే కోరుకుంటున్నాం. చర్చలు పూర్తికాకుండానే దీనిపై మాట్లాడటం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. 2024లో ఇరుదేశాల మధ్య 129 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. -
2025లో తొలిసారి 25000 పైకి నిఫ్టీ
ముంబై: పరస్పర సుంకాలు లేని వాణిజ్యాన్ని భారత్ ప్రతిపాదించిందనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో దలాల్ స్ట్రీట్ గురువారం ఒకటిన్నర శాతం ర్యాలీ చేసింది. భారత్‌తో పాటు యూఎస్ ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పెరిగి 82,531 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 395 పాయింట్లు బలపడి 2025లో తొలిసారి 25వేల స్థాయిపైన 25,062 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం కావడం విశేషం. ఒక దశలో సెన్సెక్స్ 1,387 పాయింట్లు ఎగసి 82,718 వద్ద, నిఫ్టీ 449 పాయింట్లు దూసుకెళ్లి 25,116 ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. → దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరగడంతో భారత కరెన్సీ రూపాయి ఒత్తిడికి లోనైంది. డాలర్ మారకంలో 22 పైసలు బలహీనపడి 85.54 స్థాయి వద్ద స్థిరపడింది.→ స్టాక్ మార్కెట్ వరుస లాభాలతో బుధ, గురువారాల్లో రూ.9 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.440 లక్షల కోట్లకు చేరింది.లాభాలు ఎందుకంటే → ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్‌లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్‌సెషన్ వరకు ఫ్లాట్‌గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి. → ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్‌కు దిగుమతయ్యే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.→ రిటైల్ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి. → వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. -
అమెరికాలో ఘోరం : భారత సంతతి పర్వతారోహకుడి సహా ముగ్గురు దుర్మరణం
అమెరికాలోని వాషింగ్టన్లో పర్వతారోహణ చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డితో సహా ముగ్గురు పర్వతారోహకులు మరణించారు. అయితే, నాల్గవ సహచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. పర్వతారోహణంపై ఆసక్తితో ఎంతో ఉత్సాహంగా మొదలైన వీరి ప్రయాణం విషాదాంతమైంది. దీంతో బాధిత కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.పశ్చిమ ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ కాస్కేడ్స్ పర్వతాలపై ఈ ప్రమాదంచోటు చేసుకుంది. ఈ క్లైంబింగ్ ప్రమాదంలో మరణించిన ముగ్గురిలో భారత సంతతికి చెందిన టెక్కీ విష్ణు ఇరిగిరెడ్డి కూడా ఉన్నారు. సియాటిల్ నివాసి అయిన 48 ఏళ్ల విష్ణు తన ముగ్గురు స్నేహితులు టిమ్ న్గుయెన్ (63), ఒలెక్సాండర్ మార్టినెంకో (36) ఆంటన్ సెలిక్‌లతో (38), త్సేలిఖ్ లతో కలిసి శనివారం కాస్కేడ్స్‌లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్ ప్రాంతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని NBC న్యూస్ నివేదించింది. అయితే ఈ ఘోర ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక అధిరోహకుడు త్సేలిఖ్,తన ముగ్గురు స్నేహితుల మరణానికి దారి తీసిన ప్రమాదం గురించి అధికారులకు తెలియజేయడానికి 64 కిలోమీటర్లు ప్రయాణించాడు. త్సేలిఖ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు ,అంతర్గత రక్తస్రావం, మెదడు గాయానికి చికిత్స పొందుతున్నాడు.అయితే పైకి ఎక్కుతున్నపుడు తుఫాను ప్రమాదాన్ని గుర్తించిన వీరు వెనక్కి తగ్గినప్పటికీ ఫలితం లేకపోయింది. కిందికి దిగుతున్న సమయంలో జట్టు యాంకర్ పాయింట్ విఫలం కావడంతో వారు 200 అడుగుల కిందకు పడిపోయారని క్లైంబింగ్ వెబ్సైట్ నివేదించింది. ఈ ప్రమాదంలోపై విష్ణు స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర విచారాన్ని వ్యకతం చేశారు. విష్ణు అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడని ప్రకృతిని బాగా ఇష్టపడేవారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు సియాటిల్‌లో అత్యంత నైపుణ్యమున్న టెక్నీషియన్లలో గొప్పవాడని, తనదైన విలువలతో జీవితాన్ని నిర్మించు కున్నాడంటూ కంట తడిపెట్టుకున్నారు. విష్ణు గౌరవార్థం అతని స్నేహితులు , కుటుంబ సభ్యులు రెండు లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలు అందించనున్నారు. అలాగే మే 22 వరకు ఆ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వాలని వారు ఇతరులకు విజ్ఞప్తి చేశారు.విష్ణు గ్రేటర్ సియాటిల్ ప్రాంతంలోని టెస్ట్ పరికరాల తయారీ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. విష్ణు గొప్ప టీం లీడర్ అనీ, ఆయన మరణం తీరని లోటు అంటూ కంపెనీ కూడా నివాళులర్పించింది. నార్త్ కాస్కేడ్స్‌లోని లిబర్టీ బెల్ సమూహంలోని గ్రానైట్ శిఖరం, నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్, అనుభవజ్ఞులైన పర్వాతారోహకులకు ప్రసిద్ధి చెందింది. -
అమెరికాలో కొత్త ట్యాక్స్.. అమలైతే ఎన్ఆర్ఐల జేబులు ఖాళీ!
అమెరికాలో మరో కొత్త రకం పన్నుకు ట్రంప్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇది గనుక అమలులోకి వస్తే అక్కడ నివస్తున్న ప్రవాస భారతీయులపై (NRI) తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి సంబంధించి అమెరికా హౌస్ ఆఫ్ రిపబ్లికన్స్‌లో మే 12న ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్‌పై 5 శాతం పన్ను విధించనున్నారు.స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 2028 వరకు 2,500 డాలర్లకు పెంచడం ద్వారా 2017 పన్ను కోతలు, ఉద్యోగాల చట్టాన్ని శాశ్వతం చేయాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెండోసారి అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ఈ చట్టాన్ని 'గ్రేట్' అని అభివర్ణిస్తూ, రిపబ్లికన్లు దీనిని ఆమోదించేలా చూడాలని కోరారు. మే 26 మెమోరియల్ డే నాటికి బిల్లును ఆమోదించాలని సభ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత అది సెనేట్‌కు వెళుతుంది. జూలై 4వ తేదీలోగా చట్టంగా మార్చాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.కొత్తగా వసూలు చేసే 5 శాతం రెమిటెన్స్ పన్నును పన్ను విరామాలకు నిధులు సమకూర్చడానికి, సరిహద్దు భద్రతా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెబుతున్నారు. ఇది యూఎస్ ట్రెజరీకి బిలియన్లకొద్దీ ఆదాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ కష్టపడి డబ్బులు సంపాదించుకుని వాటిని తమ దేశాల్లోని కుటుంబాలకు పంపించే విదేశీయులకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.ఎన్ఆర్ఐలపై తీవ్ర ప్రభావంభారత్లోని తమ కుటుంబాలకు డబ్బు పంపే ఎన్ఆర్ఐలకు ఈ పన్ను తీవ్ర ఆర్థిక ప్రభావాలను కలిగిస్తుంది. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్‌కు ఏటా 8,300 కోట్ల డాలర్ల రెమిటెన్స్ లు పంపుతుండగా, అందులో ఎక్కువ భాగం అమెరికా నుంచే అందుతున్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం ఎన్ఆర్ఐలు భారత్‌లోని తమ కుటుంబాలకు పంపే ప్రతి లక్ష రూపాయలకు రూ.5,000 పన్ను రూపంలో యూఎస్ ప్రభుత్వానికి వెళ్తుంది. -
న్యూజెర్సీలో విజయవంతంగా 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్
అమెరికాలోని తెలుగు సంఘం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA), యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్ ( USCA), యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్ (USAF) ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించిన 29 వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. న్యూజెర్సీలోని పాంప్టన్ ప్లెయిన్స్తో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన వచ్చింది. సుమారు 30 రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా ప్లేయర్స్ తరలివచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ‘మాట’ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగొని, సహా వ్యవస్థాపకులు ప్రదీప్ సామల, అధ్యక్షులు కిరణ్ దుద్దగి, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్, గౌరవ సలహాదారులు రఘు రామ్ వీరమల్లు, USCF వాలంటీర్ చరణ్ ఖజానా అండ్ టీం, USCA అధ్యక్షులు అతుల్ భావే, షకీల్, తదితరులు ఈ పోటీలు విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మే1న కిక్ ఆఫ్ ఈవెంట్ తో ఘనంగా ప్రారంబమైన పోటీలు మే4 న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిసాయి. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మొట్ట మొదటి సారి జూనియర్స్ కేటగిరీలో క్యారమ్స్ పోటీలు నిర్వహించటం విశేషం.మే 2న నిర్వహించిన డబుల్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్యారమ్ పోటీల్లో 60కి పైగా జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి జట్టు డబుల్స్‌లో ఎంతో ఉత్సహంగా పాల్గొన్నాయి. రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో ఢోల్ ఎఫెక్ట్ బాండ్ మ్యూజికల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మే 3న సింగిల్స్ ఈవెంట్ నిర్వహించారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. సింగల్స్ ఈవెంట్స్ నువ్వా నేనా అన్నట్టూ పోటా-పోటీగా జరిగింది. మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ షో ఆకట్టుకుంది. సింగర్స్ అనిత కృష్ణ, సిజి ఆనంద్ తమ గ్రాతంతో ఆడియన్స్‌ని మైమరపించారు.మే4న గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఇటీవల భారత్ లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించి.. గ్రాండ్ ఫినాలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.డబుల్స్ ఫైనల్, సింగిల్స్ ఫైనల్, జూనియర్స్ నేషనల్ ఫైనల్ పోటీలు విజయవంతంగా జరిగాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సహంగా ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇక జూనియర్స్ US నేషనల్స్ క్యారమ్ టోర్నమెంట్‌కి అనుహ్య స్పందన వచ్చింది. USCA అధ్యక్షులు అతుల్ భావే, USCA మాజీ ట్రెజరర్ మందర్ అష్టేకర్ డబుల్స్ ఫైనల్స్ కామెంటేటర్లుగా వ్యవరించారు. ఇక ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే ప్రత్యేక బహుమతులు అందజేశారు. గెలిచిన విజేతలకు అందరికీ కలిపి 10 వేల వంద డాలర్ల నగదు బహుమతిని అందజేశారు. గ్రాండ్ ఫినాలే లో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ షో ఆడియన్స్‌ని అలరించింది. ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ రఘు కుంచే, సింగర్ అంజన సౌమ్య తమ గాత్రంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. రఘు కుంచే, అంజన సౌమ్య జోడి.. పలు సూపర్ హిట్ సాంగ్స్‌తో హోరెత్తించారు. ఈ సందర్భంగా సింగర్స్‌ని నిర్వహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిడిల్సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ డా. ఉపేంద్ర చివుకుల, జెర్సీ సిటీ కౌన్సిల్ అభ్యర్థి షాహబ్ ఖాన్, జెర్సీ నగర మేయర్ అభ్యర్థి ముస్సాబ్ అలీ, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్ తదితరులు హజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని పలువురు కొనియాడారు. ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్ గా మాట, గ్రాండ్ స్పాన్సర్లుగా వాల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, రియల్ టెక్ సర్వీసెస్, 3i ఇన్ఫోటెక్ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి సహాయసహాకారాలు అందించిన యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, స్టార్ఫ్యూజన్, సాషా రియాల్టీ, 9i సోలుషన్స్ని నిర్వహకులు అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయంలో భాగమైన వాలంటీర్లు ప్రత్యేకంగా యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ యూత్ శ్రీచరణ్ ఖజానా అండ్ టీమ్‌ని కొనియాడుతూ, సహాయసహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం అవ్వటంలో కీలక పాత్ర పోషించిన స్పోర్ట్ డైరెక్టర్ సురేష్ ఖజానా, గ్రాండ్ స్పాన్సర్స్ రియల్టెక్ సర్వీసెస్ CEO, మాట హానరీ అడ్వైసర్ రఘురామ్ వీరలమల్లుని ఘనంగా సన్మానించి, సత్కరించారు. మాటా ప్రెసిడెంట్ కిరణ్ దుద్దగి, USCA ప్రెసిడెంట్ అతుల్ భావే.. విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారులకు మాట టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైన పలు సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనటం పట్ల పలువురు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వహకులను పలువురు అభినందించారు.(చదవండి: అమెరికాలో ఎన్ఆర్ఐలే మా టార్గెట్) -
‘శాంతిదూత’ ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంత సులభంగా అర్థం కారని ఆయన గల్ఫ్ దేశాల పర్యటన తీరుతెన్నులు చూస్తే తెలుస్తుంది. తాను అధికారంలోకొస్తే పశ్చిమాసియాలో సాగుతున్న ‘అంతూ దరీ లేని యుద్ధాలకు’ ముగింపు పలుకుతానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన తరచు అనే వారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు రోజుల గల్ఫ్ పర్యటనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గమనిస్తే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చదల్చుకున్నట్టు కనబడుతోంది. తన రెండో దశ పాలనలో ట్రంప్ మొదలెట్టిన తొలి విస్తృత విదేశీ పర్యటన ఇది. ఈ ప్రాంతంలోనే ఉన్న ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లకపోవటం ఆయన తాజా వైఖరికి సంకేతం. ఇది ఎన్నాళ్లుంటుందన్నది తెలియక పోయినా చేస్తున్న ప్రకటనలైతే భిన్నంగా ఉన్నాయి. ఇరాన్‌తో అమెరికా 46 ఏళ్లుగా సాగిస్తున్న ‘అప్రకటిత యుద్ధం’ ఇక కొనసాగనీయరాదన్న అభిప్రాయం ఉందని మంగళవారం సౌదీ అరే బియాలోని రియాద్‌లో ఆయన ప్రకటించారు. బుధవారం సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్– షారాతో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు నెలకొల్పుకొనాలని సలహా ఇచ్చారు. అల్–షారాకు గతంలో అల్ కాయిదాతో, ఐఎస్‌తో సంబంధాలుండేవి. ఈ భేటీకి ముందే గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) సదస్సులో సిరియాపై ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు తెలియజేశారు. ఈ నిర్ణయాలపై ఇజ్రాయెల్ అలిగినా, మరొకరు అభ్యంతర పెట్టినా ఆయన ఖాతరు చేయదల్చుకున్నట్టు లేరు. గత నెలలో ట్రంప్‌ను కలిసి సిరియాపై ఆంక్షలు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వేడుకున్నారు. ఇరాన్ విషయంలో అయితే చాలా చెప్పివుంటారు. సిరియాపై ఆంక్షలు ఎత్తేయటం, ఇరాన్‌తో చెలిమికి సిద్ధపడటం నెతన్యాహూకు ససేమిరా ఇష్టం లేదు. కానీ లీకుల ద్వారా తప్ప నేరుగా తన అసమ్మతిని ఇంతవరకూ తెలియజేయలేదు. ఆ మధ్య ట్రంప్ ఇందుకు భిన్నంగా మాట్లాడారు. అణు ఒప్పందాన్ని అంగీకరించి, శాంతికి సిద్ధపడకపోతే ఇరాన్ భారీ స్థాయి ఒత్తిడులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. కానీ ట్రంప్ తాజా ధోరణి అందుకు భిన్నంగా ఉంది. ఇరాన్‌తో చెలిమి గురించి ఆయన ఏదో మాటవరసకు అనలేదు. ‘ప్రస్తుతం అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలు కొన్ని తరాల కిందట మాపై శత్రుత్వంతో చెలరేగినవే’ అని గుర్తుచేశారు. సిరియా, ఇరాన్‌ల విషయంలో తన వైఖరి మారటానికి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కారణమని ఆయన జీసీసీ వేదికపైనే ప్రకటించారు కూడా. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతూనే ఉన్నా ఈనెల 5న వారితో అవగాహనకొచ్చారు. స్నేహంలోనైనా, శత్రుత్వంలోనైనా ట్రంప్ తీరే వేరని ఆయన నిర్ణయాలు తెలియజేస్తున్నాయి. మూడేళ్లనాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ వచ్చినప్పుడు దేశంలో మానవహక్కులు అడుగంటుతున్న వైనంపై సౌదీ యువరాజును నేరుగా ప్రశ్నించారు. 2018లో జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి ప్రాణం తీయించడాన్ని ప్రస్తావించారు. ఈ మాదిరి హత్యలు తమకు సమ్మతంకావని చెప్పారు. అందుకే కావొచ్చు... ఇప్పుడు ట్రంప్‌కు ఎదురైన స్వాగతసత్కారాల వంటివి బైడెన్‌కు లభించలేదు. సౌదీ గడ్డపై గతకాలపు అమెరికా అధ్యక్షుల్ని నిశితంగా విమర్శించటానికి ట్రంప్ వెన కాడలేదు. అమెరికన్ సమాజం గురించి కాస్తయినా తెలియనివారు ఎంతో జటిలమైన గల్ఫ్ సమా జాల్లో జోక్యం చేసుకోవటానికి ఎగబడ్డారని వ్యాఖ్యానించటం చిన్న విషయం కాదు. పశ్చిమాసియా దేశాలతో ఎన్ని వేల కోట్ల డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకోగలమన్నదే ఆయన ఆరాటంగా కనబడు తోంది. దానికి తగ్గట్టే మంగళవారం సౌదీతో 14,200 కోట్ల డాలర్ల మేర ఆయుధ ఒప్పందంపై సంతకాలయ్యాయి. ఇదిగాక అమెరికాలో 60,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు యువరాజు ప్రకటించారు. ట్రంప్ దీంతో సంతృప్తిపడలేదు. దీన్ని లక్ష కోట్ల డాలర్లకు పెంచాలని ఆ వేదికపైనుంచే కోరారు. సౌదీతో అమెరికాకు ఎప్పుడూ మంచి స్నేహసంబంధాలేవున్నా ఈ స్థాయి ఒప్పందాలెప్పుడూ లేవు. ఒక పరిశోధక సంస్థ నివేదిక ప్రకారం 2010–20 మధ్య అమెరికాకు సౌదీతో 10,000 కోట్ల డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలు మాత్రమే కుదిరాయి.స్నేహం పేరుతో అమెరికాను దోచుకుంటున్నారని నాటో భాగస్వామ్య దేశాలైన పాశ్చాత్య మిత్రులపై తరచూ విరుచుకుపడే ట్రంప్...పశ్చిమాసియా దేశాలకు ఏ కష్టమొచ్చినా అమెరికా దృఢంగా నిలబడుతుందని హామీ ఇవ్వటం గమనార్హం. ఇంధన అవసరాల్లోనూ, రక్షణరంగంలోనూ పనికొచ్చే అత్యంత విలువైన లిథియం, కోబాల్ట్‌లతోపాటు థోరియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్వేషించి అమెరికా చేర్చటానికి సౌదీ–అమెరికా ఖనిజ సంస్థల మధ్య ఈ పర్యటనలో 900 కోట్ల డాలర్ల ఒప్పందం కుదరటంతో ట్రంప్ సంతోషానికి పట్టపగ్గాల్లేవు. అందువల్లే పశ్చిమాసియాకు శక్తి మంతమైన సెమీ కండక్టర్ చిప్స్, ఏఐ డేటా సెంటర్లకు పనికొచ్చే కీలక విడిభాగాల ఎగుమతులకు ఆయన పచ్చజెండా ఊపారు. ఇది సంప్రదాయ అమెరికా విదేశాంగ విధానానికి భిన్నం.ఈ పర్యటనలో ట్రంప్ స్వకార్యమూ నెరవేర్చుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దేశ ప్రయోజనాలకూ, అధ్యక్షుడిగా ఆయన నిర్ణయాలకూ చుక్కెదురన్నది విమర్శకుల వాదన. ట్రంప్ సొంత సంస్థకు సారథ్యం వహిస్తున్న ఆయన కుమారులు గత కొన్నివారాలుగా గల్ఫ్‌లో తిష్ఠ వేసి తమ సంస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనీ, కుదిరిన ఒప్పందాలన్నీ వారికి మేలు కలిగించేవేననీ అంటున్నారు. ఏది ఏమైనా ట్రంప్ వైఖరి మళ్లీ మారేలోగా పశ్చిమాసియా చక్కబడితే ప్రపంచానికి అంతకన్నా కావాల్సిందేమీ లేదు. -
ఖతార్‌లో ట్విస్ట్.. ట్రంప్ ఆశ... అడియాస?
ఖతార్ రాజకుటుంబం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత విలాసవంతమైన బోయింగ్ 747-8 విమానాన్ని బహుమతిగా స్వీకరిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ పని సముచితమేనా అని ఎవరైనా అడిగితే.. ‘అంత ఖరీదైన విమానాన్ని ఖతార్ ఉచితంగా ఇస్తానంటుంటే వద్దని చెప్పడానికి నేనేమైనా వెర్రివాడినా?’ అని ట్రంప్ ఎదురు ప్రశ్నిస్తున్నారు.వాస్తవానికి ఖతార్ జెట్ నెల క్రితమే టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకున్నట్టు ఫ్లైట్ రికార్డులను ఉదహరిస్తూ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఆ విమానాన్ని మెరుగ్గా తీర్చిదిద్దే ఏర్పాట్లు ఆరంభమై ఉండొచ్చని కూడా పేర్కొంది. ఈ నెల 8న విమానం శాన్ ఆంటోనియో చేరుకుందని, అప్పట్నుంచి అది అక్కడే ఉందని ‘శాన్ ఆంటోనియో ఎక్స్‌ప్రెస్ న్యూస్’ తెలిపింది. విమానం రెట్రో ఫిట్టింగ్ పనులను డిఫెన్స్ కాంట్రాక్టర్ ‘ఎల్3 హ్యారిస్ టెక్నాలజీస్’కు ట్రంప్ పురమాయించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ మరో కథనం ప్రచురించింది. ఖతార్ ఫ్రీగా ఇస్తున్న 13 ఏళ్లనాటి ఆ విమానం ధర 400 మిలియన్ డాలర్లు (రూ.3,400 కోట్లు) ఉంటుందని అంచనా వేసినప్పటికీ దాని విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (రూ.2,100 కోట్లు) మాత్రమేనని ఆ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తి ఒకరు వెల్లడించారు.ఇక చావు కబురు చల్లగా చెప్పినట్టు.. అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి అనువుగా, ఎయిర్ ఫోర్స్ వన్ ప్రమాణాలకు తగ్గట్టుగా మార్పు చేర్పులు (ఓవర్ హాలింగ్) చేపట్టడానికి ఆ విమానం విలువకు మూడు రెట్లు లేదా అంతకంటే ఎక్కువే ఖర్చవుతుందని లెక్కలు వేస్తున్నారు. 40 ఏళ్ల నాటి తమ పాత ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానాలను తాత్కాలికంగా పక్కనపెట్టి ఖతార్ సూపర్ లగ్జరీ విమానంలో దర్పంతో తిరగాలని ట్రంప్ ఉబలాటపడుతున్నారు. దీనిపై ఆయన సొంత రిపబ్లిక్ పార్టీ నేతలే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ‘కమాండర్ ఇన్ చీఫ్’ హోదాలో అధ్యక్షుడి సురక్షిత ప్రయాణానికి వీలుగా ఖతార్ విమానానికి ‘ఎయిర్ ఫోర్స్ వన్’ తరహాలో మార్పులు చేయడానికి బాగానే సమయం పడుతుందట.కమ్యూనికేషన్, రక్షణ సామర్థ్యాలతోపాటు విమానంలో భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడానికి కొన్ని నెలల నుంచి రెండేళ్ల దాకా వ్యవధి పట్టవచ్చని భావిస్తున్నారు. అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చని, అధ్యక్షుడిగా ట్రంప్ రెండో టర్మ్ ముగిసేలోపు ఆ ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని అమెరికా అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పైగా ఖతార్ విమానంతో గూఢచర్యం, నిఘా సమస్యలున్నాయని రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రజ్ వ్యాఖ్యానించారు. ఖతార్ కానుకను అంగీకరించడమంటే తమ భద్రతాపరమైన కీలక వ్యవస్థలు, కమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోకి చొరబడటానికి ఓ విదేశానికి అనుమతి ఇవ్వడమేనని డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ జాక్ రీడ్ అభిప్రాయపడ్డారు.మిలిటరీ కమాండ్ అండ్ కంట్రోల్ పాయింట్!అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం.. కదిలే వ్యవస్థ లాంటిది. అధ్యక్షుడి భద్రతలో అమెరికా రక్షణ విభాగం రాజీపడదు. భద్రతాపరమైన లోపాలకు తావివ్వదు. అందుకే ఖతార్ విమానాన్ని ‘ఈకకు ఈక, తోకకు తోక పీకినట్టు’ ఫ్రేమ్ వరకు భాగాలుగా విడగొట్టి అమెరికా తొలుత దాన్ని ఆసాంతం శోధించాలి. బగ్స్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన కమ్యూనికేషన్స్, సెక్యూరిటీ ఎక్విప్మెంట్ అమర్చి విమానాన్ని పునర్నిర్మించాలి. ఇంత పెద్ద తతంగం ఉంది మరి!.విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అన్యులెవరూ హైజాక్ చేయకుండా చూడాలి. ఎందుకంటే దేశాధ్యక్షుడు విమానంలో ప్రయాణించే సమయంలో మిలిటరీ ‘కమాండ్ అండ్ కంట్రోల్’కు ఆ ఎలక్ట్రానిక్ వ్యవస్థలే ఆయువుపట్టు. ఖతార్ విమానాన్ని ఇలా అప్‌గ్రేడ్ చేయడానికి, మెరుగ్గా తీర్చిదిద్ది ముస్తాబు చేయడానికి చాలా కాలం పట్టవచ్చు. ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపుకునే వెసులుబాటు ఉంది. అయితే దేశాధ్యక్షుడు ప్రయాణంలో ఉండగా ‘ఎయిర్ ఫోర్స్ వన్’కు గాల్లోనే ఇంధనం నింపిన సందర్భం ఇప్పటివరకు ఒక్కటీ లేదు. ఖతారీ సంప్రదాయ బోయింగ్ 747 విమానానికి గాలిలో ఇంధనం నింపుకునే సామర్థ్యం లేదు. ఉదాహరణకు అణుదాడి జరిగిన సందర్భంలో నేలపై దిగకుండా అమెరికా అధ్యక్షుడి విమానం సురక్షితంగా ఎక్కువసేపు గాల్లోనే ఉండాల్సివస్తే... ఆ విమానానికి మిడ్-ఎయిర్ రీఫ్యూయెలింగ్ సామర్థ్యం తప్పనిసరి! -జమ్ముల శ్రీకాంత్. -
అమెరికాలో నల్గొండ విద్యార్థిని కన్నుమూత
ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లిన మరో భారతీయ విద్యార్థి కన్నుమూసింది. ఇటీవలి కాలంలోఅమెరికాలో భారత విద్యార్థుల మృతుల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం మరింత విషాదం. తాజాగా మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన యువతి మృతి చెందింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతులకు కుమార్తె ప్రియాంక(26) అమెరికాలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్) చదువుతోంది. అనారోగ్యంతో మృతి చెందడం విషాదాన్ని నింపింది.అలబామా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేసిన ప్రియాంక అక్కడే పార్ట్ టైం వర్క్ చేస్తోంది. బ్రెయిన్ డెడ్ (మెదడు మృతి) స్థితికి చేరుకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దంత సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించి ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిపిన వైద్యులు తెలిపారు. స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూంలో పడిపోయి ఉండటాన్ని గమనించి స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించి ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. -
వెనక్కి తగ్గిన అమెరికా – చైనా
వేలంపాట తరహాలో అమెరికా, చైనాలు ఒకరిపై ఒకరు సుంకాలు పెంచుకుంటూ పోయిన వైనంతో బెంబేలెత్తిన ప్రపంచ మార్కెట్లూ, ఆర్థిక వ్యవస్థలూ నేల చూపులు చూస్తున్న వేళ జెనీవా నుంచి సోమవారం ఒక చల్లని కబురు వినబడింది. ఆర్థికంగా ప్రపంచంలోనే ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న ఇరు దేశాలూ ప్రస్తుతానికి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాయన్నదే దాని సారాంశం. ఇది బుధవారం నుంచి అమల్లోకొచ్చి తొంభై రోజులపాటు... అంటే మూణ్ణెల్లపాటు అమల్లో వుంటుందనీ, రెండు దేశాల ప్రతినిధులతో ఏర్పడిన సలహా యంత్రాంగం ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుందనీ ఉమ్మడి ప్రకటన వివరిస్తోంది. ఈ సలహా యంత్రాంగంలో చైనా తరఫున ఆ దేశ ఉపప్రధాని హో లిఫాంగ్ , అమెరికా తరఫున ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్, వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీయర్‌లుంటారు. మూర్ఖత్వంలో ఎవరికెవరూ తీసిపోని ఈ రెండు పక్షాలూ చివరికేం చేస్తాయన్నది ఇంకా చూడాల్సేవున్నా ఇప్పటికైతే ఒక ముప్పు తాత్కాలికంగానైనా ఉపశమించిందని సంతోషించక తప్పదు. మొన్న జనవరిలో అమెరికాలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ప్రపంచాన్ని హడలెత్తిస్తూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న వరస నిర్ణయాల్లో ఈ సుంకాల పెంపు వ్యవహారం అతి పెద్దది. గత నెల 2 నుంచి అమల్లోకొచ్చిన ఈ పెంపు చైనా మినహా వేరే దేశాలపై తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు ట్రంప్ ఆ వెంటనే ప్రకటించారు. కానీ కోడెల పోట్లాటల మధ్య లేగల కాళ్లు విరిగినట్టు అమెరికా–చైనా సుంకాల యుద్ధంతో ప్రపంచమంతటికీ సమస్యలు తలెత్తాయి. తాజా ఒప్పందం పర్యవసానంగా అమెరికా విధించిన 145 శాతం సుంకాలు కాస్తా 30 శాతానికి తగ్గుతాయి. అలాగే అమెరికా దిగుమతులపై చైనా విధించిన 125 శాతం సుంకాలు 10 శాతానికి దిగొస్తాయి. ఈ వారం ఆఖరులోగా తాను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చిస్తానని ట్రంప్ చెప్పటం కూడా సంతోషించదగ్గది. చైనాతో సుంకాల విషయమై చర్చలు సాగుతున్నాయని ఆ మధ్య ట్రంప్ పదే పదే ప్రకటించగా చైనా ఖండించింది. చివరకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో చర్చలు సాకారమయ్యాయి. చైనాను దెబ్బతీసే ఉద్దేశం తమకు మొదణ్ణించీ లేదని ట్రంప్ ప్రకటించారు. ఇది స్వాగతించ దగ్గదే అయినా బడాయి మాటనే చెప్పాలి. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయటం సంగతలా వుంచి అమెరికాలోని తయారీరంగ పరిశ్రమలు ముడిసరుకులు దొరక్క ఇబ్బందులుపడుతూ దివాలా దశకు చేరాయి. ఉద్యోగాలకు కోతబెట్టాయి. వినియోగదారులు సైతం ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో పాటు, లభ్యమైన సరుకు ధర ఆకాశాన్నంటడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి సతమతమవుతుంటే సరుకును రెట్టింపు, అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి రావటం వారిని కుంగదీసింది. చైనాలోనూ పరిస్థితి ఏమంత సజావుగా లేదు. అనేక కంపెనీలు మూతబడ్డాయి. కొన్ని సంస్థలు ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతులపై దృష్టి సారించాయి. ట్రంప్ అధికారంలోకొస్తూనే దేశంలో యువత ప్రాణాలు తీస్తున్న మత్తు పదార్థం ఫెంటానిల్ విచ్చలవిడిగా దొరకటంలో చైనా పాత్రవుందని ఆరోపిస్తూ ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై 20 శాతం అదనంగా సుంకాలు పెంచారు. గత నెల 2 నుంచి దానికి మరో 34 శాతం జోడించారు. ఇలా తమ నుంచి వెళ్లిన సరుకులపై 54 శాతం సుంకాలు విధించటాన్ని జీర్ణించుకోలేని చైనా దానికి ప్రతీ కారంగా అమెరికా దిగుమతులపై 34 శాతం మేర అదనపు సుంకాలు విధించింది. ఇక అక్కడి నుంచి ఇద్దరిమధ్యా ‘చంపుడు పందెం’ మొదలైంది. నిజానికి ట్రంప్‌కు ముందు ఫెంటానిల్‌తో చైనాకు లంకె పెట్టినవారెవరూ లేరు. అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆయన దాన్ని ఎక్కువచేసి చూపారు. మొత్తానికి అమెరికా 145 శాతం, చైనా 125 శాతం సుంకాల దగ్గర ఆగాయి. ఇప్పుడు కుదిరిన ఒప్పందం పర్యవసానంగా గంపగుత్తగా అన్ని రకాల సరుకులపైనా సుంకాలు తగ్గిపోవు. చైనా సరుకులపై అమెరికా విధించిన 30 శాతం సుంకాలు కొనసాగుతాయి. అలాగే విద్యుత్ వాహనాలు, ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ఇంతకన్నా ఎక్కువగానే సుంకాలున్నాయి. అవన్నీ గత కొన్ని సంవత్సరాల్లో విధించినవి కనుక ఈ ఒప్పందం వాటి జోలికిపోదు.అవతలిపక్షం నుంచి ఎలాంటి రాయితీలూ పొందకుండా, తమకనుకూలమైన ముగింపు వైపుగా చర్యలేమీ కనబడకుండా ఒప్పందానికి రావటం బలహీనతను సూచిస్తుంది తప్ప బలాన్ని కాదు. ప్రస్తుత ఒప్పందం వ్యూహాత్మకమైనదని చెప్పుకున్నా, మున్ముందు దేశానికేదో ఒరుగుతుందని అంటున్నా... అధిక సుంకాల మోత నుంచి వెనక్కి తగ్గమని ట్రంప్‌పై దేశంలో అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు వచ్చాయన్నది వాస్తవం. నిరుటి గణాంకాలు గమనిస్తే రెండు దేశాలూ వాణిజ్య పరంగా పరస్పరం ఆధారపడినవేనని తెలుస్తుంది. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా 12.9 శాతం. అలాగే అమెరికా మొత్తం ఎగుమతుల్లో చైనా వాటా 14.8 శాతం. కెనడా, మెక్సికోల తర్వాత స్థానం చైనాదే. అధిక సుంకాల యుద్ధం చివరకు ప్రపంచ ఆర్థికాభివృద్ధిని మందగింపజేస్తుందని, ఉత్పత్తుల కొరతను సృష్టించి ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని... ఇదంతా చిట్టచివరకు అమెరికాను మాంద్యం ఊబిలోకి నెడుతుందని నిపుణులు మొదణ్ణించీ హెచ్చరిస్తూనే ఉన్నారు. సర్వజ్ఞుణ్ణని భావించేవారికి చెప్పటానికి ప్రయత్నించటం వృథా ప్రయాస. ఏదైనా అనుభవంలోకొస్తే తప్ప తత్వం బోధపడదు. మొత్తానికి ఈ చర్చల వల్ల ఇప్పటికైతే అర్థవంతమైన పరిష్కారం లభించలేదు. మున్ముందు ఏమవుతుందన్నది రెండు దేశాల విజ్ఞతకూ పరీక్ష. -
అమెరికా–చైనా టారిఫ్ డీల్...
న్యూఢిల్లీ: టారిఫ్‌ల పెంపును 90 రోజుల పాటు నిలిపివేయాలన్న అమెరికా, చైనా నిర్ణయంతో భారత్‌కు సవాళ్లు ఉన్నప్పటికీ, నిర్దిష్ట వ్యాపార అవకాశాలు కూడా ఉంటాయని ఎగుమతిదారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడమనేది అంతర్జాతీయంగా వాణిజ్య స్థిరత్వానికి సానుకూలాంశమని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. టారిఫ్‌ల తగ్గింపు వల్ల, ఎల్రక్టానిక్స్, మెషినరీ, రసాయనాలు వంటి అధిక విలువ చేసే ఉత్పత్తులకు సంబంధించి అమెరి–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఎగియవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామంతో భారత ఎగుమతిదార్లకు సవాళ్లు ఎదురుకావచ్చన్నారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలాంటి మార్కెట్లో చొచ్చుకుపోయిన భారత ఎగుమతిదార్లకు పోటీ పెరగవచ్చని రాల్హన్ చెప్పారు. కానీ, ఆ రెండు దేశాల వాణిజ్య పరిధిలోకి రాని ఇతర రంగాలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం లభించగలదన్నారు. ఫార్మా ఏపీఐలు, ఐటీ ఆధారిత సరీ్వసులు, రత్నాభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఆర్గానిక్ రసాయనాల్లాంటి ఎగుమతులను పటిష్టపర్చుకోవచ్చని రాల్హన్ చెప్పారు. విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ సరఫరాదారుగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ వాణిజ్యంలో మరింత ప్రాధాన్యం దక్కేలా అమెరికాతో భారత్ క్రియాశీలకంగా సంప్రదింపులు జరపడం శ్రేయస్కరమని ఆయన పేర్కొన్నారు. అలాగే టారిఫ్‌ల తగ్గింపనేది తాత్కాలికమే కావడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవకుండా హెడ్జింగ్ చేసుకునేందుకు కంపెనీలు పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు) స్కీమ్, మేకిన్ ఇండియా కార్యక్రమం కింద భారత్‌లో ఉత్పత్తిని పెంచుకునేందుకు మొగ్గు చూపవచ్చని రాల్హన్ చెప్పారు. చైనా నుంచి భారత్‌లోకి దిగుమతులు వెల్లువలా వచి్చపడకుండా ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచాలని మరో ఎగుమతిదారు చెప్పారు. వ్యయాలు తగ్గించుకోవాలి.. మన ఎగుమతులపై అమెరికాలో సుంకాల రేటు చైనాతో పోలిస్తే తక్కువే ఉన్నప్పటికీ.. వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోతోందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితమే చైనా ఉత్పత్తులపై అమెరికా 145 శాతం టారిఫ్‌లు విధించినప్పుడు 10 శాతం శ్లాబ్‌లో ఉన్న భారత్ వైపు మొగ్గు ఎక్కువగా కనిపించిందని పేర్కొన్నారు. ప్రస్తుత 30 శాతంతో పోల్చినప్పుడు మనం ఇంకా మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. గతంలో ఉన్నంత ప్రయోజనం ఉండదని శ్రీవాస్తవ చెప్పారు. టారిఫ్‌లను ప్రతిపాదిత 26 శాతానికి పెంచకుండా, 10 శాతం స్థాయిలోనే కొనసాగించేలా అమెరికాతో సంప్రదింపుల ద్వారా భారత్ స్మార్ట్ డీల్ కుదుర్చుకునేందుకు ప్రయతి్నంచాలని ఆయన సూచించారు. వాణిజ్య విధానానికే పరిమితం కాకుండా భారత్ అత్యవసరంగా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలని, లాజిస్టిక్స్‌ను ప్రక్షాళన చేయాలని, నిబంధనలు అంచనాలకు అందే విధంగా ఉండేలా విధానాలను మెరుగుపర్చుకోవాలని పేర్కొన్నారు. వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడంపై సంప్రదింపులు జరుగుతున్నందున 90 రోజుల పాటు చాలా మటుకు సుంకాలను గణనీయంగా తగ్గించుకునేందుకు అమెరికా, చైనా అంగీకారానికి వచ్చాయి.ఫార్మా రేట్ల కోతతో భారత్‌పై ఒత్తిడి: జీటీఆర్ఐప్రి్రస్కిప్షన్ ఔషధాల రేట్లను 30–80 శాతం వరకు తగ్గించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలతో అంతర్జాతీయంగా ఫార్మా రేట్లలో మార్పులు చోటు చేసుకుంటాయని జీటీఆర్ఐ తెలిపింది. అమెరికాలో వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఫార్మా సంస్థలు ఇతర దేశాల్లో తాము ధరలు పెంచుకునేందుకు ప్రయతి్నస్తాయని పేర్కొంది. ఇందుకోసం పేటెంట్ చట్టాలను మార్చే విధంగా భారత్‌లాంటి దేశాలపై ఒత్తిడి తేవొచ్చని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచానికి చౌకగా ఔషధాలను అందించేందుకు ఉపయోగపడుతున్న తన పేటెంట్ చట్టాల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగరాదని సూచించారు. మన జనరిక్స్‌పై ప్రపంచం ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ మోడల్‌ను పరిరక్షించడమనేది భారత్‌కి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, ప్రపంచానికి కూడా అవసరమని వివరించారు. -
సీజ్ఫైర్.. బుల్ జోష్!
ముంబై: భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దలాల్ స్ట్రీట్‌లో బుల్ పరుగులు తీసింది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం కూడా బుల్‌కు జోష్‌నిచ్చాయి. ఫలితంగా సూచీలు గడిచిన నాలుగేళ్లలో (2021) తర్వాత ఒకరోజులో అతిపెద్ద లాభాన్ని గడించాయి. సెన్సెక్స్ 2,975 పాయింట్లు లాభపడి 82,430 వద్ద, నిఫ్టీ 917 పాయింట్లు బలపడి 24,925 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం ముగింపు. సూచీల 4% ర్యాలీతో స్టాక్ మార్కెట్లో ఒక్కరోజే రూ.16.15 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.432.56 లక్షల కోట్ల(5.05 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. రోజంతా లాభాలే: గత వారాంతాన భారత్, పాక్‌ల మధ్య సీజ్ఫైర్, అమెరికా చైనాల మధ్య ట్రేడ్ ఒప్పందాల పరిణామాల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,350 పాయింట్లు బలపడి 80,804 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు ఎగసి 24,420 వద్ద మొదలయ్యాయి. ఇంట్రాడేలో అన్ని రంగాల్లో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సూచీలు మరిన్ని లాభాలు ఆర్జించగలిగాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 3,041 పాయింట్లు దూసుకెళ్లి 82,496 వద్ద, నిఫ్టీ 937 పాయింట్లు ఎగసి 24,945 వద్ద గరిష్టాన్ని తాకాయి. → సెన్సెక్స్ సూచీలో ఇండస్ఇండ్ (–3.57%), సన్‌ఫార్మా(–3.36%) మినహా 28 షేర్లూ లాభపడ్డాయి. సూచీల్లో ఐటీ 6.75%, రియల్టీ 6%, మెటల్, టెక్, యుటిలిటీ, పవర్ ఇండెక్సులు 5% రాణించాయి. ఇండస్ట్రీయల్, బ్యాంకెక్స్ సూచీలు 4–3% లాభపడ్డాయి. → మార్కెట్ అనూహ్య ర్యాలీలో రక్షణ రంగ, డ్రోన్ల తయారీ కంపెనీల షేర్లకు డిమాండ్ కొనసాగింది. యాక్సిస్కేడ్స్ టెక్నాలజీస్ 5%, డేటా ప్యాటర్న్స్ 4%, మిశ్ర ధాతు నిగమ్ 3.50%, భారత్ ఎల్రక్టానిక్స్ 2%, పెరిగాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ 6%, డ్రోణాచార్య ఏరియల్ 5% పెరిగాయి.లాభాలు ఎందుకంటే: → పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో కాల్పులు పరిణామాలతో భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వంలో, అనేక దౌత్యప్రయత్నాల తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో ఒక్కసారిగా దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఊపువచ్చింది. → అమెరికా–చైనాల మధ్య ‘టారిఫ్ వార్’ సైతం ఒక కొలిక్కి వచ్చింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చలు సఫలమై ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ టారిఫ్‌లను 115% మేర తగ్గించుకోవడంతో పాటు కొత్త సుంకాలకు 90 రోజులపాటు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. అగ్రదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రపంచ మార్కెట్లకు ఫుల్ జోష్ వచ్చింది. → ఈక్విటీ ఫండ్లలోకి సిప్ల ద్వారా ఏప్రిల్‌లో రికార్డు స్థాయి రూ.26,632 కోట్లు పెట్టుబడులు రావడం, అంతర్జాతీయ క్రిడెట్ రేటింగ్ ఏజెన్సీ మారి్నంగ్‌స్టార్ డీబీఆర్ఎస్ భారత సావరిన్ క్రిడెట్ రేటింగ్‌ను దీర్ఘకాలానికి బీబీబీ(కనిష్టం) నుంచి బీబీబీ(స్థిరత్వం)కి అప్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలు మార్కెట్ల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.భారీ లాభాల్లో అమెరికాచైనాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా వాణిజ్య యుద్ధానికి 90 రోజుల విరామం ప్రకటించడంతో అమెరికా ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్అండ్పీ 500 ఇండెక్సు 2.70%, డోజోన్స్ సూచీ 2%, నాస్డాక్ ఇండెక్సు 4% లాభాల్లో ట్రేడవుతున్నాయి. ట్రెజరీ ఈల్డ్స్, డాలర్ ఇండెక్సులూ పెరిగాయి. -
హమాస్ చెర నుంచి అమెరికా బందీ విడుదల
దెయిర్ అల్–బలాహ్: తమ చెరలో ఉన్న అమెరికా పౌరుడైన ఇజ్రాయెల్ సైనికుడు ఈడన్ అలెగ్జాండర్‌ను గాజాలోని హమాస్ సాయుధ సంస్థ సోమవారం రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ శ్రేణులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మెరుపుదాడి చేపట్టి వందలాది మందిని చంపడంతోపాటు 250 మందిని బందీలుగా పట్టుకుపోవడం తెల్సిందే. వీరిలో ఈడన్ సహా ఇప్పటికీ చెరలోనే ఉన్న 59 మందిలో 24 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు చెబు తున్నారు. పట్టుబడిన సమయంలో ఇతడు ఇజ్రాయెల్ సైన్యంలోని ఇన్ఫాంట్రీ విభాగంలో విధుల్లో ఉన్నాడు. దాదాపు 19 నెలలపాటు గాజాలో హమాస్ వద్ద సజీవంగా ఉన్న వారిలో అమెరికాకు చెందిన ఏకైక వ్యక్తి ఈడన్. ఈడన్ కోసం సురక్షిత కారిడార్ ఏర్పాటు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ట్రంప్ ప్రభుత్వంపై సాను కూల ధోరణితోనే ఈడన్ను వదిలిపెట్టినట్లు హమాస్ ప్రకటించింది. యుద్ధం ముగిసే దిశగా సానుకూల పరిణామమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. -
ఇటు30 అటు10
జెనీవా: ఎడాపెడా టారిఫ్‌లు విధించుకుంటూ వాణిజ్యయుద్ధాన్ని మొదలెట్టిన అమెరికా, చైనా ఎట్టకేలకు శాంతించాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా సమష్టిగా సంధికి ఆమోదముద్ర వేశాయి. ఇందులోభాగంగా సోమవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగర వేదికగా వాణిజ్య ఒప్పందాన్ని కుదర్చుకుని టారిఫ్ రణానికి ముగింపు పలికినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. చైనా ఉత్పత్తులపై 145 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ సర్కార్, అందుకు దీటుగా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్ వసూలుచేస్తామని జిన్‌పింగ్ ప్రభుత్వం గతంలో ప్రకటించడం తెల్సిందే. సోమవారం కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందంతో ఈ టారిఫ్‌లు భారీగా దిగిరానున్నాయి. ఒప్పందం మేరకు ఇకపై చైనా ఉత్పత్తులపై అమెరికా 30 శాతం టారిఫ్‌లు విధించనుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా కేవలం 10 శాతం టారిఫ్‌లు విధించనుంది. తొలుత 3 నెలలపాటు అమలుతొలుత 90 రోజులపాటు ఈ టారిఫ్‌లనే అమలుచేసి, సమీక్ష జరిపి అందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. జెనీవాలో ఈ మేరకు అమెరికా, చైనా తరఫున అత్యున్నత స్థాయి అధికారులు మంతనాల జరిపి ట్రేడ్ డీల్‌ను ఖరారుచేశారు. ఐక్యరాజ్యసమితిలో స్విస్ రాయబారి అధికారిక నివాసంలో జరిగిన ఈ చర్చల్లో అమెరికా తరఫున అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్, వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ పాల్గొన్నారు. ఆర్థిక, వాణిజ్యం సంబంధాలపై ఇకమీదటా ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతాయని స్కాట్బెసెంట్ అన్నారు. ‘‘ ఇరువైపులా పెరిగిన అత్యధిక టారిఫ్‌లతో వాణిజ్యం ఒక్కసారిగా స్తంభించిపోయింది. చైనాతో వాణిజ్యబంధం బలోపేతానికే కృషిచేస్తున్నాం. అందుకే పెంచిన టారిఫ్‌లను మళ్లీ తగ్గిస్తున్నాం. సమతుల వాణిజ్యం కోరుకుంటున్నాం. ఈ తరహా వాణిజ్యాన్ని సాకారాంచేస్తాం’’ అని బెసెంట్ వ్యాఖ్యానించారు. తర్వాత చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఇరువైపులా 91 శాతం టారిఫ్ తగ్గించుకున్నాం. మేం మరో 90 రోజులకోసం మరో 24 శాతం తగ్గించాం. దీంతో అమెరికాపై మా టారిఫ్ 10 శాతానికి దిగొచ్చింది. ఏప్రిల్ రెండో తేదీన అమెరికా టారిఫ్‌లు పెంచాక మేం తీసుకున్న ప్రతీకార నిర్ణయాలనూ ఉపసంహరించుకుంటున్నాం’’ అని చైనా ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే 90 రోజులపాటు ఈ రేట్లనే కొనసాగించి తర్వాత సమీక్ష జరపనున్నారు. దీనిపై కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఇది తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం లాంటిదే. 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని క్యాపిటల్ ఎకనమిక్స్‌లో చీఫ్ ఆసియా ఎకానమిస్ట్ మార్క్ విలియమ్స్ వ్యాఖ్యానించారు. ‘‘ 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందనే ఇక్కడ అసలు ప్రశ్న’’ అని చైనాలో యురోపియన్ యూనియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జేన్స్ ఎస్కీలెండ్ అన్నారు. సింథటిక్ డ్రగ్ అయిన ఫెంటానిల్‌ను తమ దేశంలోకి చైనా పోటెత్తిస్తోందంటూ ట్రంప్ సర్కార్ తొలుత టారిఫ్‌ల పెంపు జెండా ఎగరేయడం తెల్సిందే. -
అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
అమెరికా ప్రతీకగా సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి, బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దేశంలో గోల్డ్ రేటు ఏకంగా లక్ష మార్కును దాటేసింది. అయితే తాజాగా జరిగిన అమెరికా - చైనా దేశాలను టారిఫ్స్ కొంత తగ్గిస్తున్నట్లు.. ఇవి 90 రోజులు అమల్లో ఉంటాయని ప్రకటించాయి. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లో 3400 డాలర్ల కంటే ఎగువన ట్రేడ్ అయిన ఔన్స్ బంగారం ధర.. ఏకంగా 3218 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే భారతదేశంలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. వెండి ధరలు కూడా బంగారం బాటలో పయనించిందా అన్నట్లు.. తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం మొత్తం మీద బంగారం, వెండి ధరలు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది. -
అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ కు బ్రేక్..
-
90 రోజుల పాటు కొత్త సుంకాలు: అమెరికా, చైనా మధ్య డీల్
నువ్వా నేనా అంటూ ప్రతీకార సుంకాలను అంతకంతకూ పెంచుకుంటూ పోయిన అమెరికా, చైనా దేశాలు టారిఫ్‌ల విషయంలో ఓ డీల్ కుదుర్చుకున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం.. చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది. ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?అమెరికా ప్రపంచ దేశాల మీద ప్రతీకార సుంకాలను విధించిన సమయంలో.. చైనా కూడా అమెరికాకు ధీటుగా సుంకాలను పెంచింది. దీంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద విపరీతమైన ప్రభావం చూపింది. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే తాజాగా.. ఇరుదేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఈ సుంకాలను తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. -
ట్రంప్ ఖతార్ పర్యటన.. భారీ బహుమతి రెడీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని ట్రంప్‌కు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలో మధ్యప్రాచ్య పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్.. ఖతార్ పాలక కుటుంబం నుంచి విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఒక విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కానుకను అమెరికా అధ్యక్షుడు స్వీకరించడం, దాని చట్టబద్ధతపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.Qatar to Gift $400 Million Plane to President Trump:▪️According to ABC News, the Trump administration is set to accept a luxury Boeing 747-8 jumbo jet—valued at around $400 million—from the Qatari royal family.▪️The plane will serve as Air Force One for Trump until just… pic.twitter.com/d1H7OdyNmD— Beau Bannon🇺🇸 (@BeauBannon) May 11, 2025అయితే, విదేశీ ప్రభుత్వం నుండి ఇంత పెద్ద బహుమతిని అధ్యక్షుడు స్వీకరించడంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అమెరికా రాజ్యాంగంలోని జీతాల నిబంధన, ఆర్టికల్ I, సెక్షన్ 9, క్లాజ్ 8, ప్రభుత్వ పదవిలో ఉన్న ఎవరైనా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏదైనా.. రాజు, యువరాజు లేదా విదేశీ రాష్ట్రం.. నుండి ఏదైనా బహుమతి, జీతం, కార్యాలయం లేదా బిరుదును స్వీకరించడాన్ని నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలో, అమెరికా అధికారులు దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్ వన్) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీ విరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’కు కొత్త వెర్షనుగా ఉపయోగిస్తారు. సురక్షితమైన కమ్యూనికేషన్లు, ఇతర అవసరమైన సౌకర్యాలు జోడించాలని యోచిస్తున్నారు. -
కాశ్మీర్ అంశంపై ట్రంప్ ఆఫర్.. నో చెప్పిన మోదీ
-
భారత్, పాక్‌పై ట్రంప్ ఆసక్తికర కామెంట్స్.. ఈసారి కశ్మీర్ అంటూ..
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అమెరికా మధ్యవర్తిత్వంతో సద్దుమణిగింది. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరుదేశాల నేతలతో చర్చించి కాల్పుల విరమణకు వచ్చేలా చేశారు. అయితే, భారత్-పాక్ అంశంపై తాజాగా ట్రంప్ మరోసారి స్పందించారు. ఈసారి కశ్మీర్ అంశం ప్రస్తావించి కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ట్రుత్‌తో స్పందిస్తూ..‘కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాక్‌తో కలిసి పనిచేస్తాం. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను. వెయ్యి సంవత్సరాల కశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. అలాగే, భారత్, పాకిస్తాన్‌ను చూసి నేను గర్వపడుతున్నాను. ప్రజల మరణానికి, నాశనానికి దారితీసే ప్రస్తుత యుద్ధాన్ని ఆపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయం పూర్తిగా అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని రెండు దేశాలు కలిగి ఉన్నాయి. అచంచలమైన శక్తివంతమైన నాయకత్వం రెండు దేశాలకు ఉందని కితాబిచ్చారు.యుద్ధం కారణంగా లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది!. మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం బాగా మెరుగుపడింది. ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో అమెరికా మీకు సాయం చేయగలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉంది. ఈ రెండు గొప్ప దేశాలతో నేను వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను’ అని చెప్పుకొచ్చారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - May 10, 2025, 11:48 PM ET )I am very proud of the strong and unwaveringly powerful leadership of India and Pakistan for having the strength, wisdom, and fortitude to fully know and understand that it was time to stop… pic.twitter.com/RKDtlex2Yz— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) May 11, 2025ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్తాన్.. భారత్‌పై సైనిక చర్యకు దిగింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి తెగబడింది. భారత్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది. -
అమెరికన్లకు కొత్త కష్టాలు.. లిప్ స్టిక్ ముద్దు.. చెడ్డీలు వద్దు!
దేశంలో .. కాదు కాదు.. అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ ఏం బాలేదు. పెద్ద పెద్ద సంస్థలే వేలల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఉన్న వాళ్ళతో సర్దుకోండి కొత్త స్టాఫ్‌ను ఇచ్చేది లేదంటున్నాయి. హైక్స్ .. ఇంక్రిమెంట్స్ గురించి పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు. ఉన్న ఉద్యోగం ఊడిపోకుండా చూసుకోండి.. అదే పదివేలు అంటూ సూచనలు చేస్తున్నాయి. అమెరికా ఐటీలో వచ్చిన పెనుమార్పు ఆయా రంగాల్లోని పనిచేస్తున్న వాళ్ల జీవితాలనే కాదు మొత్తం అమెరికా జీవితాల్లో పెనుమార్పులు తెచ్చిందట. అసలు పొదుపు.. ప్లానింగ్. డబ్బంటేనే లెక్కలేకుండా జీవించే అమెరికన్లు ఈ ఆర్థిక మాంద్యం పరిస్థితులను ముందే ఊహించి.. కుటుంబ ఖర్చులను భారీగా తగ్గిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.ఖరీదైన ఆహారం తినడం తగ్గించారట. అంటే లంచ్ టైములో స్టాఫ్‌తో పాటు అలా వెళ్లి రెస్టారెంట్లో తినే అలవాటున్న వాళ్ళు సైతం ఇప్పుడు ఆ పద్ధతి మానుకుని పద్ధతిగా ఇంటి నుంచి డబ్బా తీసుకువెళ్తున్నారట. బుద్ధిగా ఇంటి భోజనం చేస్తూ.. దిసీజ్ హెల్దీ యూ నో అంటున్నారట. దీంతోబాటు జెంట్స్ కూడా సెలూన్లలో ఖర్చు తక్కువ.. అంటే చావకరకం మసాజులు.. క్రాఫ్ స్టైల్స్ వంటివి కోరుతున్నారు తప్ప అప్పట్లా ఖరీదైన సేవలకు నో అంటున్నారట. అంటే ఓ నాలుగువేల ఖరీదుండే మసాజ్ ఎందుకులే గురూ ఓ. వెయ్యితో ముగించు.. అసలే రోజులు బాలేవు అంటున్నారట. దీంతోబాటు గోళ్ళ సంరక్షణ కు ఎక్కువ ఖర్చు చేయడం ఎందుకని ఏకంగా కృత్రిమ గోళ్లు రకరకాల డిజైన్లలో రెడీమేడ్ కొనుక్కుని పెట్టుకుంటున్నారట. పెడిక్యూర్.. మానిక్యూర్ వంటివి చేయించాలంటే బోలెడు ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద ఖర్చుతో టూర్లు తగ్గిస్తున్నారు.లిప్ స్టిక్ కొందాం.. చెడ్డీలు వద్దులే ఇదంతా ఒకెత్తు అయితే .. ఆర్థిక మాంద్యం ప్రభావమో.. భయం కారణంగానో కానీ రెండు అంశాల్లో మాత్రం చిత్రమైన తేడా కనిపిస్తోంది. దేశంలో లిప్ స్టిక్ కొనుగోళ్లు భారీగా పెరిగాయట. ఇదే తరుణంలో పురుషుల లో దుస్తులు.. ముఖ్యంగా డ్రాయర్లు కొనుగోళ్లు తగ్గినాయి అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఖరీదైన సౌందర్య సాధనాలు.. క్రీములు కొనడానికి మహిళలు వెనుకాడుతున్నారు. వేలకువేలు పెట్టి పార్లర్లకు వెళ్ళడానికి ఇష్టపడని మహిళలు.. పోనీ మంచి లిప్ స్టిక్ అయినా కొనుక్కుందాం అని నిర్ణయించుకుని వాటితో సర్దుకుంటున్నారట. అందంగా ఉండాలంటే పార్లర్ కు మాత్రమే వెళ్లాలా ఏంటి వదినా.. ఇదిగో ఈ లిప్ స్టిక్ వేసుకున్నాక నేను చాలా అందంగా ఉన్నానని మీ అన్నయ్యగారు మెచ్చుకున్నారు అంటూ ఒకరికోరు చెప్పుకుంటున్నారట.దీంతో మహిళలు జస్ట్ లిప్ స్టిక్ కొనుక్కుంటో సంతృప్తి చెందుతూ ఖర్చులు తగ్గిస్తున్నారట. అందుకే లిప్ స్టిక్ అమ్మకాలు పదిశాతం పెరిగాయట. మరోవైపు పురుషులు కూడా ప్యాంట్ షర్ట్. వంటివి బావుంటే చాలు లోపల వేసుకునే చెడ్డీలకు అంత ఖర్చు ఎందుకు ఉన్నవాటినే ఏదోలా సర్దుబాటు చేసుకుందాం.. వాటికోసం మళ్ళీ డాలర్లు ఎందుకు తగలెయ్యాలి.. లోపల వేసేది ఎవరు చూస్తారు అంటున్నారట. మొత్తానికి మాంద్యం ప్రభావం చెడ్డీల మీద కూడా పడింది. -సిమ్మాదిరప్పన్న. -
ఎఫ్‌డీఏ వ్యాక్సిన్స్ విభాగం హెడ్‌గా ఇండియన్ అమెరికన్
వాషింగ్టన్: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వ్యాక్సిన్ విభాగం సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ (సీబీఈఆర్) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన హెమటాలజిస్ట్–ఆంకాలజిస్ట్ వినయ్ ప్రసాద్ నియమితులయ్యారు. ఎఫ్‌డీఏ కమిషనర్ మార్టి మకారీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రసాద్‌కు మెడిసిన్‌లో సుదీర్ఘమైన, విశిష్టమైన చరిత్ర ఉందని, ఆయన ఆంకాలజీలో విస్తృతమైన పరిశోధనలు చేశారని మకారీ పేర్కొన్నారు. సీబీఈఆర్.. ఎఫ్‌డీఏ కింద ఉన్న టీకాలు, ఔషధాలను పర్యవేక్షిస్తుంది. ప్రసాద్ గతంలో ఎఫ్‌డీఏను, కోవిడ్–19 వాక్సిన్స్, మాస్క్ ఆదేశాలను తీవ్రంగా విమర్శించడం గమనార్హం. కోవిడ్ సమయంలో ప్రసాద్ తన బ్లాగులో, సోషల్ మీడియా వేదికలపై సీబీఈఆర్ అప్పటి డైరెక్టర్ మార్క్స్ నాయకత్వాన్ని తీవ్రంగా ఖండించారు. పాఠశాల మూసివేతలు, మాస్క్ విధానాలు, కోవిడ్ –19 బూస్టర్ షాట్‌ను వ్యతిరేకించారు. అందుకు ప్రస్తుత ఎఫ్‌డీఏ కమిషనర్ డాక్టర్ మార్టి మకారీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ నియమాకంపై సీబీఈఆర్ మాజీ డైరెక్టర్ పీటర్ మార్క్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీబీఈఆర్ డైరెక్టర్‌గా ప్రసాద్ నియామకం తరువాత వ్యాక్సిన్ తయారీ సంస్థ మోడెర్నా (నాస్డాక్: ఎంఆర్ఎన్ఏ) షేర్లు సుమారు 10 శాతం క్షీణించాయి. ఫైజర్ షేర్లు 3 శాతం తగ్గాయి. సరెప్టా థెరప్యూటిక్స్, టేషా జీన్ థెరపీస్ వంటి చిన్న జన్యు చికిత్స సంస్థలు తీవ్రమైన నష్టాలను చవిచూశాయి. సుమారు 20% పడిపోయాయి. చికాగో విశ్వవిద్యాలయం నుంచి వైద్య పట్టా పొందిన ప్రసాద్.. నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో సేవలందించారు. శాన్ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. -
అల్కట్రాజ్.. అమెరికా కాలాపానీ!
అమెరికాలో అత్యంత కఠినమైన జైలు అల్కట్రాజ్‌ను తెరవాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. శాన్ఫ్రాన్సిస్కో సముద్ర జలాల్లో ఉన్న ఈ జైలు ఒకప్పుడు తీవ్ర అపఖ్యాతి పాలైంది. ది రాక్‌గా ప్రసిద్ధికెక్కిన జైలు 60 ఏళ్ల కింద మూతపడింది. దశాబ్దాల క్రితం పర్యాటక ప్రాంతంగా మారింది. ఏటా లక్షలాది మంది సందర్శిస్తున్నారు. అలాంటి జైలును మళ్లీ ఉపయోగంలోకి తెచ్చేందుకు ట్రంప్ ప్రయతి్నస్తున్నారు. శిథిలావస్థలో ఒకప్పటి ప్రమాదకర జైలును పునరుద్ధరించడం సరికాదని నిపుణులు అంటున్నా పట్టించుకోవడం లేదు. అల్కట్రాజ్ గురించి ట్రంప్ ఈ ద్వీప జైలును తెరవడమే గాక విస్తరించాలని ఆదేశించినట్లు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. దుర్మార్గులు, హింసాత్మక, ప్రమాదకర నేరస్తులతో అమెరికా చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అల్కట్రాజ్ తన దృష్టిలో శాంతిభద్రతలను కాపాడగల అతి బలమైన, శక్తివంతమైన ప్రదేశమని అనంతరం మీడియాతో కూడా చెప్పుకొచ్చారు. దేశంలో ప్రస్తుతం శాంతిభద్రతలు చాలా అవసరం గనుక దాన్ని మళ్లీ తెరవబోతున్నట్టు చెప్పారు. జైలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాన్ని తెరిచే ఆలోచన బాగుందన్నారు. అమెరికా పౌరులు, జాతీయ భద్రత కోసం ఇప్పుడా జైలు అత్యంత అవసరమని సరిహద్దు అధికారి టామ్ హోమన్ కూడా అన్నారు. షార్క్‌ల కాపలా... అల్కట్రాజ్. ఒక్కమాటలో చెప్పాలంటే అండమాన్‌లోని కరడుగట్టిన కాలాపానీ వంటి జైలు. శాన్ఫ్రాన్సిస్కోకు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ద్వీపంలో ఉంది. దీన్ని మొదట నావికా రక్షణ కోటగా నిర్మించారు. 20వ శతాబ్ద ప్రారంభంలో సైనిక జైలుగా మార్చారు. 1934లో అధికారికంగా ఫెడరల్ జైలుగా మార్చేశారు. దీని భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. తప్పించుకోజూడటమంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఎందుకంటే ద్వీపం చుట్టూ సముద్రంలో షార్కులుంటాయి. జైలు నుంచి ఎలాగోలా తప్పించుకున్నా వాటికి ఆహారంగా మారతారు. అమెరికాలోని అత్యంత క్రూరమైన నేరస్తులను ఇక్కడ ఉంచేవారు.బలమైన సముద్ర అలలతో పాటు అతి శీతల పసిఫిక్ జలాలతో కూడిన అల్కాట్రాజ్ ఖైదీలకు అక్షరాలా నరకప్రాయం. ఈ జైలులో గ్యాంగ్‌స్టర్ అల్ కాపోన్, జార్జ్ మెషీన్ గన్ కెల్లీ వంటి కరడుగట్టిన నేరస్తులను ఉంచారు. దీనిపై అనేక సినిమాలు వచ్చాయి. నిర్వహణ అత్య ంత ఖరీదుగా మారడంతో 1963లో అటార్నీ జనరల్ రాబర్ట్ కెన్నెడీ దీని మూసివేయించారు. ఈ జైలు, ద్వీపం ఇప్పుడు నేషనల్ పార్క్ సరీ్వస్ నిర్వహణలో ఉన్నాయి. ఏటా 14 లక్షల మంది దీన్ని సందర్శిస్తున్నారు. గతంలోనూ ప్రయత్నాలు ఈ కేంద్రాన్ని డిటెన్షన్ సెంటర్‌గా తెరవాలని గతంలోనూ పలువురు నేతలు విఫలయత్నం చేశారు. 1981లో ‘మారియల్ బోట్ లిఫ్ట్’లో క్యూబా నుంచి ఫ్లోరిడాకు వచి్చన 20,000 మంది శరణార్థులను ఉంచడానికి నాటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రతిపాదించిన 14 ప్రాంతాల్లో ఇదీ ఉకటి. చారిత్రక పర్యాటక ప్రదేశం కావడం, అంతమందికి సౌకర్యాలు లేకపోవడంతో వెనక్కు తగ్గారు.నిర్వహణ అసాధ్యమంటున్న నిపుణులు..అల్కట్రాజ్‌ను తిరిగి తెరవడంపై జైలు నిపుణులు, చరిత్రకారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట ఈ విషయం వినగానే జోక్ అనుకున్నట్టు బీఓపీ తాత్కాలిక డైరెక్టర్‌గా చేసిన హ్యూ హుర్విట్జ్ చెప్పారు. ‘‘దాన్ని మరమ్మతు చేయాలనుకోవడం హాస్యస్పదం. ఆరడుగుల వ్యక్తి నిటారుగా నిలబడలేని గదులతో కూడిన భవనాలవి. పైగా కూలిపోతున్నాయి. సరైన భద్రత, ఫెన్సింగ్, కెమెరాలు కూడా లేవు. ఆ జైలును ఇప్పుడు నడపడం అసాధ్యమన్నారు. ‘‘1963లో జైలును మూసినప్పుడు ఖైదీల తలసరి నిర్వహణ ఖర్చు 13 డాలర్ల దాకా ఉండేది. ఇతర ఫెడరల్ జైళ్లలో అది ఐదు డాలర్లలోపే. ఇప్పుడు ఇతర జైళ్లలోనే 120 డాలర్లకు పెరిగింది. ఆ లెక్కన అల్కట్రాజ్లో కనీసం 500 డాలర్లు కావాలి. అంతంత వెచి్చ ంచి దోషులను అక్కడుంచడం చాలా ఖరీదైన వ్యవహారం’’అని చరిత్రకారుడు జాన్ మార్టిని తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ అమెరికాలో అత్యంత కఠినమైన జైలు అల్కట్రాజ్‌ను తెరవాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. శాన్ఫ్రాన్సిస్కో సముద్ర జలాల్లో ఉన్న ఈ జైలు ఒకప్పుడు తీవ్ర అపఖ్యాతి పాలైంది. ది రాక్‌గా ప్రసిద్ధికెక్కిన జైలు 60 ఏళ్ల కింద మూతపడింది. దశాబ్దాల క్రితం పర్యాటక ప్రాంతంగా మారింది. ఏటా లక్షలాది మంది సందర్శిస్తున్నారు. అలాంటి జైలును మళ్లీ ఉపయోగంలోకి తెచ్చేందుకు ట్రంప్ ప్రయతి్నస్తున్నారు. శిథిలావస్థలో ఒకప్పటి ప్రమాదకర జైలును పునరుద్ధరించడం సరికాదని నిపుణులు అంటున్నా పట్టించుకోవడం లేదు. -
స్వచ్ఛందంగా వెళ్లిపోతే వెయ్యి డాలర్లు
వాషింగ్టన్: అమెరికాలో పెద్ద సంఖ్యలో తిష్టవేసిన అక్రమ వలసదారులను బయటికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. సొంత దేశాలకు స్వచ్ఛందంగా వెళ్లిపోయే వలసదారులకు వెయ్యి డాలర్ల చొప్పున అందజేస్తామని సోమవారం హోం ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) విభాగం ప్రకటించింది. నిర్బంధానికి గురి కావడం, బలవంతంగా వెళ్లగొట్టడం కంటే స్వచ్చందంగా సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ‘సీబీపీ హోమ్’ యాప్ ద్వారా అంగీకారం తెలిపిన వారికి ప్రయాణ ఖర్చులను సైతం చెల్లిస్తామని డీహెచ్ఎస్ తెలిపింది. అమెరికాను వీడే అక్రమ వలసదారులకు ఇదే అత్యుత్తమ, సురక్షిత మార్గమని డీహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోమ్ తెలిపారు. -
దయలేని ట్రంప్.. ఈసారి సినిమాపై సుంకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై సుంకాలు విధించారు. అమెరికా గడ్డపై షూటింగ్ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారాయన.కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్న ట్రంప్.. విదేశాల్లో చిత్రీకరణ జరిగి.. అమెరికాలో రిలీజ్ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(USTR)కు ఆదేశాలు జారీ చేశారాయన. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన.చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారాయన. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా మరణిస్తోందన్న ట్రంప్.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాలు చిత్రీకరణ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో ‘టారిఫ్ వార్’లో భాగంగా హాలీవుడ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100 శాతం సుంకాలను విధించడం గమనార్హం. బెడిసికొట్టే అవకాశం?ట్రంప్ తాజా ప్రకటపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్‌ను పునరుద్ధరించకపోగా.. నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్, వార్నర్ బ్రోస్ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కొలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగులు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండడమే అందుకు ప్రధాన కారణం. -
అమెరికాలో రానా సందడి.. హాలీవుజ్ దిగ్గజాలతో భేటీ!
టాలీవుడ్ హీరో రానా నాయుడు యూఎస్‌లో సందడి చేశారు. ఇటీవల డబ్ల్యూడబ్ల్యూఈ రేజ్లింగ్ మేనియాలోనూ కనిపించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రానా మియామి గ్రాండ్ ప్రిక్స్ వీకెండ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. అక్కడే హాలీవుడ్లో ప్రముఖ సంగీత దిగ్గజాలైన 50 సెంట్, ఆస్కార్ విజేత అయిన గూడింగ్ జూనియర్‌తో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇండియాకు చెందిన లోకా లోకా పార్టీ సంస్థ ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు రానా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే లోకా లోకా సంస్థకు సహా వ్యవస్థాపకుల్లో ఒకరైన రానా దగ్గుబాటి ఈవెంట్లో సందడి చేశారు. ఈ కంపెనీకి హర్ష వడ్లమూడి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కలిసి ముగ్గురు ఈ సంస్థకు కో ఓనర్స్‌గా ఉన్నారు. అమెరికా మార్కెట్లో తమ సంస్థ విస్తరణ కోసమే రానా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. రానా చొరవతో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్‌గా లోకా లోకా సంస్థ మరింత బలోపేతం కానుంది. ఈ సందర్భంగా వ్యాపారం, వినోదం, క్రీడల ప్రపంచానికి నిలయమైన మియామిలో రానా దగ్గుబాటి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. -
బాలీవుడ్ స్టార్లు... ఇష్టమైన టూర్లు... ఎందుకు ఇష్టమంటే..!
బాలీవుడ్ సెలబ్రిటీల జీవితాలు మనలో చాలా మందికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మనకు స్ఫూర్తినిచ్చేది ఆకర్షణీయమైన జీవనశైలి మాత్రమే కాదు, వారి ప్రయాణ గమ్యస్థానాల ఎంపిక కూడా. మరీ ముఖ్యంగా అందరం సమ్మర్ సీజన్ సందర్భంగా ఇలా టూర్ల వేటలో పడినప్పుడు...స్టార్లు ఎంచుకునే ప్రాంతాల వివరాలు తెలుసుకోవడం అంటే మన అభిరుచులను కలుసుకోవడం కూడా. కలలు కనే బీచ్ అయినా లేదా సందడిగా ఉండే నగరమైనా, బిజీ షెడ్యూల్ నుండి తప్పించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి తగిన ప్రదేశాలను కనుగొనే నైపుణ్యాన్ని లేదా వారి ఉత్తమమైన కలిగి ఉంటారు.– నేహా ధూపియా, జైపూర్ పాత–ప్రపంచ ఆకర్షణ ఆధునిక సౌకర్యాల కలయికను ఇష్టడుతుంది. కరీనా కపూర్ ఖాన్ తరచుగా నూతన సంవత్సర కాలంలో కుటుంబ సెలవుల కోసం స్విట్జర్లాండ్‌ను, ముఖ్యంగా గ్సా్టడ్ను సందర్శిస్తుంది.–షాహిద్ కపూర్ మీరా రాజ్‌పుత్ కపూర్: గ్రీస్, స్పెయిన్ స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ గమ్యస్థానాలను తమ పిల్లలతో సేదతీరుతుంటారు.–కర్ణాటకలోని కూర్గ్‌ను తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశంగా బోమన్ ఇరానీ చెబుతారు.–సోను సూద్: షాపింగ్ కుటుంబ సందర్శనల కోసం వాషింగ్టన్, డి.సి.ని ఇష్టపడతాడు. –పారిస్‌కు తరచుగా వచ్చే సందర్శకురాలు ఫరా ఖాన్ కళ, చరిత్ర ఫ్యాషన్ మిశ్రమాన్ని :ఇష్టపడుతుంది.– తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో న్యూ ఇయర్‌కి నయనతార స్వాగతం పలికింది. –శ్రీలంకలో ప్రశాంతమైన బీచ్ స్నాప్షాట్లను దియా మీర్జా ఆస్వాదిస్తుంది. –బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా సందర్శించే గమ్యస్థానాలలో లండన్ ఒకటిగా నిలిచింది. సోనమ్ కపూర్, రియా కపూర్, సారా టెండూల్కర్ పరిణీతి చోప్రా వంటి తారలకు ఈ నగరం ఒక రొటీన్ ఎంపిక. ఐకానిక్ హైడ్ పార్క్ మీదుగా షికారు చేయడం నుంచి నగరంలోని ట్రెండీ రెస్టారెంట్లు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్‌ను అన్వేషించడం వరకు లండన్ సరదాలను సాహసాలను వారు తరచుగా అభిమానులతో పంచుకుంటారు.–పారిస్ అనేది బాలీవుడ్ సెలబ్రిటీలు వదల్లేని మరొక హాట్‌స్పాట్. ఈ ’సిటీ ఆఫ్ లైట్స్’ దిల్జిత్ దోసాంజ్, మలైకా అరోరా వంటి తారలను తరచు రారమ్మంటుంది. ఫ్రెంచ్ వంటకాలను ఆస్వాదించడం నుంచి రిటైల్ థెరపీలో పాల్గొనడం వరకు భిన్న రకాలుగా స్టార్లు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు.–బాలీవుడ్ సెలబ్రిటీల ఎంపికలో మాల్దీవులు సైతం అగ్రస్థానంలో నిలుస్తుంటాయి. ప్రశాంతమైన బీచ్‌లు, అందమైన వాతావరణం అద్భుతమైన సూర్యాస్తమయాలతో, తమ బిజీ జీవితాల నుంచి తప్పించుకోవాలనుకునే తారలకు ఇది తరచుగా విహారయాత్రగా మారుతుంది. రకుల్ ప్రీత్ సింగ్, నేహా ధూపియా పరిణీతి చోప్రా ఇలా ఈ ద్వీప స్వర్గంలో కనిపించిన ప్రముఖులు ఎందరో.–న్యూయార్క్ నగరం కూడా సెలబ్రిటీలకు తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా మారింది. మీరా కపూర్, కరిష్మా కపూర్, ప్రియాంక చోప్రా అమీర్ ఖాన్ సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా న్యూయార్క్‌పై తమ ఇష్టాన్ని ప్రదర్శించారు, . సెంట్రల్ పార్క్ , టైమ్స్ స్క్వేర్ వంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌ల స్నాప్షాట్లను పంచుకున్నారు.–స్వదేశానికి దగ్గరగా ఉండాలి అలాగే రిలాక్స్డ్గా ఉండాలి అనుకునే స్టార్స్‌ను గోవా ఆకర్షించడం కొనసాగుతూనే ఉంది. భూమి పెడ్నేకర్, సారా అలీ ఖాన్ శిల్పా శెట్టి అక్కడి ప్రశాంతమైన బీచ్‌లను ఆస్వాదిస్తుంటారు. . గోవా లో ఉన్నప్పుడు వారు షేర్ చేసుకునే ఫోటోలు ఆ ప్రదేశం పట్ల వారి అభిమానాన్ని మనకు చూపిస్తాయి.–స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడిన బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ... ఇష్టమైన గమ్యస్థానాలలో కరేబియన్ దీవులను పేర్కొంటారు. ఈ దీవులపై వారు పంచుకునే సోషల్ మీడియా పోస్ట్‌లు వారి ఇష్టాన్ని మనకు పట్టిస్తాయి. =తన బైక్‌పై రోడ్ ట్రిప్‌లకు వెళ్లడాన్ని ఇష్టపడే అమిత్ సాద్ ఇటీవల ముంబై నుంచి లేహ్–లడఖ్‌కు 5,288 కి.మీ. ప్రయాణించి నెలరోజుల పర్యటన చేపట్టారు. ‘‘రోడ్డులోని ప్రతి మలుపు వ్యక్తిగత పరివర్తనకు అవకాశం. తెలియని వాటిని తెలుసుకోవడం’’ అంటారాయన.–హిమాలయ శ్రేణి పట్ల సారా అలీఖాన్ ప్రేమ అంతులేనిది. కొన్ని నెలల క్రితం, ఆమె కాశ్మీర్‌కు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేసింది. ఓ ఇంటర్వ్యూలో, సారా‘‘నాకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు వెళ్లి అక్కడ ట్రెక్కింగ్ చేయడం చాలా ఇష్టం. అలాఏ కాశ్మీర్ అంటే కూడా చాలా ఇష్టమని షేర్ చేసింది. మసాయి మారాలో అలియా భట్‌కు ప్రపోజ్ చేశాడు. రణ్‌బీర్ కపూర్ అప్పటి నుంచి ఈ జంటకు కెన్యా నేషనల్ రిజర్వ్ ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా మారింది. -
జిన్‌పింగ్‌కు టెన్షన్.. చైనా అధికారులకు అమెరికా ట్రాప్?
వాషింగ్టన్: చైనా అధికారులను బుట్టలో వేసుకునేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఎప్పటికప్పుడు కొత్త దారులు వెదుకుతోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ పాలనలో తమ భద్రత గురించి ఆందోళన చెందే చైనా అధికారులు తమతో కలిసి పనిచేయాలంటూ అమెరికా గూఢచార విభాగం సీఐఏ తాజాగా పిలుపునిచ్చింది. అలాంటి వారు తమను సంప్రదించాలని కోరింది. చైనాలో వారికి భద్రత ఇస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించి చైనా అధికార భాష మాండరిన్లో రూపొందించిన వీడియోలను తాజాగా యూట్యూబ్, ఎక్స్లలో విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ వీడియోలకు విడుదలైన మొదటి రోజే 50 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.ఒక వీడియోలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వంలో ఎంతో నిజాయతీతో పనిచేస్తున్న ఓ వ్యక్తి.. ‘పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, వాటి వల్ల తన కుటుంబ భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతుంటాడు. వీడియోలో నేపథ్య సంగీత తీవ్రత పెరుగుతుండగా అతడు..‘నేను ఏ తప్పూ చేయలేదు. నేను భయంతో జీవించలేను..!’అంటూ తన స్మార్ట్‌ఫోన్‌తో సీఐఏను సంప్రదించే ప్రయత్నం చేస్తుంటాడు. సీఐఏ చిహ్నం కనిపించడంతో రెండు నిమిషాల నిడివిగల ఈ వీడియో ముగుస్తుంది. వీడియో కింద ఉన్న లింక్‌లో సీఐఏ అంటూ నకిలీ ఖాతాలుంటాయనే హెచ్చరికతోపాటు, సురక్షితంగా సంప్రదించడంపై సూచనలుంటాయి.ఈ వీడియోలపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ స్పందించారు. కొత్తగా కొన్ని దేశాల్లో ముఖ్యంగా చైనాలో మనుషులను నియమించుకుని గూఢచర్య కార్యకలాపాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. గూఢచర్యం కోసం అమెరికా అధికారులను చైనా వాడుకుంటున్నట్లు ఇటీవల వార్త లు వచ్చిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికత పరంగా ప్రపంచంపై ఆధిపత్యం చలాయించాలని చైనా కుట్రలు పన్నుతోందని తెలిపారు. ఇటువంటి బెడదపై తగురీతిలో స్పందిస్తామన్నారు. అందులో భాగంగానే ఈ వీడియోలను విడుదల చేశామని చెప్పారు. ఇటీవలే సీఐఏ కొరియన్, మాండరిన్, ఫార్సి భాషల్లో సీఐఏను సంప్రదించడమెలాగో వివరిస్తూ వీడియోలు విడుదల చేసింది. మూడేళ్ల క్రి తం రష్యన్ భాషలో నూ ఇలాంటి వీడియోనే సీఐఏ విడుదల చేయడం గమనార్హం. 牛B,美国CIA发布最新宣传片,向中国大陆高级官员抛出橄榄枝。一般人就别联系CIA了,联系了人家也不回。话说回来,当你没有利用价值的时候,CIA还会保护你或你的家人吗? 参考帮美国对抗塔利班的阿富汗人,跑道上趴飞机轮子也不给上。😂😂😂 pic.twitter.com/7Z06mSEInQ— 边境杀手 (@adjustcate) May 1, 2025 -
పాము విషానికి తిరుగులేని విరుగుడు.. మనిషి రక్తం నుంచే..
హీరోకు వాళ్ల నాన్నో, తాతయ్యో చిన్నప్పటి నుంచే కొద్దిపాటి మోతాదులో విషం తినిపిస్తారు. దాంతో పెరిగి పెద్దయ్యాక ఎలాంటి పాము కరిచినా మనవాడికి ఏమీ కాదు. ఈ ఫార్మూలాతో సూపర్‌డూపర్ హిట్టైన సినిమాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికాలోనూ కాలిఫోర్నియాలో ఉండే తిమోతీ ఫ్రైడ్ అనే వ్యక్తి అచ్చం అలాగే చేశాడు. ఒకటీ రెండూ సార్లు కాదు, 18 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 200 సార్లకు పైగా పాములతో కరిపించుకున్నాడు. 700 సార్లకు పైగా పాము విషాన్ని ఒంట్లోకి ఎక్కించుకున్నాడు!.గుర్రం వంటి బలిష్టమైన జంతువులను కూడా ఒకే కాటుకు బలి తీసుకునే 16 ప్రాణాంతక పాము జాతుల విషాలూ వాటిలో ఉన్నాయి. ఫలితంగా తిమోతీ ఎలాంటి పాము కరిచినా ఏమీ కాని స్థితికి చేరుకున్నాడు! మనవాడి రక్తం నుంచి సైంటిస్టులు తాజాగా పాము విషానికి విరుగుడు తయారు చేశారు. ఇప్పటిదాకా తయారైన వాటిల్లోకెల్లా అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్ ఇదేనని చెబుతుండటం విశేషం! దీన్ని పాముకాటు చికిత్సలోనే అత్యంత విప్లవాత్మక మలుపుగా చెబుతున్నారు!!ఇలా చేశారు... బ్లాక్‌మాంబా. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. రాచనాగు, టైగర్ స్నేక్, రాటిల్ స్నేక్ వంటివీ ఈ కోవలోకే వస్తా యి. ఇలాంటి విషపూరిత పాములతో పదేపదే కరిపించుకున్న తిమోతీ గురించి అమెరికాకు చెందిన వ్యాక్సీన్ కంపెనీ సెంటివాక్స్ సీఈఓ జాకబ్ గ్లెన్‌విల్లే 2017లో ఎక్కడో చదివారు. వాటి విషాన్ని వందలాదిసార్లు ఒంట్లోకి ఎక్కించుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. తిమోతీ ట్రక్ మెకానిక్‌గా చేసేవాడు. తర్వాత రకరకాల పాములను గురించి ఆసక్తికరమైన వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. ఆ క్రమంలో ఒకసారి రెండు నాగుపాములు వెంటవెంటనే కరవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు.మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఇలా విషం పుచ్చుకోవడం మొదలుపెట్టాడు. తిమోతీ అంగీకారంతో గ్లెన్‌విల్లే అతని రక్త నమూనాలు సేకరించారు. ఎలాంటి పాము విషాన్నైనా తట్టుకోగలిగే తిరుగులేని యాంటీబాడీలు వాటిలో పుష్కలంగా ఉన్నట్టు తేల్చారు. కొలంబియా వర్సటీకి చెందిన మెడికల్ సైన్సెస్ నిపుణుడు రిచర్డ్ స్టాక్ తదితరుల సాయంతో సైంటిస్టులు ఆ యాంటీబాడీలను సేకరించారు. ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ శ్రమకోర్చి వాటి సాయంతో అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్ ఇంజక్షన్ తయారు చేశారు. దానికి ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 అని పేరు పెట్టారు.ప్రయోగాత్మకంగా బ్లాక్మాంబాతో పాటు 19 అత్యంత విషపూరిత పాముల విషాన్ని ఒక్కొక్కటిగా ఎలుకలకు ఎక్కించి, అనంతరం వాటికి ఈ విరుగుడు ఇచ్చారు. బ్లాక్మాంబాతో పాటు 13 రకాల విషాల బారినుంచి ఎలుకలను ఈ యాంటీ వెనమ్ కాపాడటం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు! ఆరు అత్యంత విషపూరిత పాముల విషాన్ని కలగలిపి ఇచ్చినా అదే ఫలితం వచి్చంది. మిగతా 6 రకాల విషాలకు కూడా ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 పాక్షికంగా విరుగుడుగా పని చేసింది. ఇది ప్రస్తుతానికి ప్రయోగాల దశలోనే ఉన్నట్టు గ్లెన్‌విల్లే చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలను తాజాగా సైంటిఫిక్ జర్నల్ ‘సెల్’లో ప్రచురించారు.శ్రమతో కూడిన ప్రక్రియ యాంటీ వెనమ్ తయారీ ఓ సంక్లిష్ట ప్రక్రియ. పాముల నుంచి సేకరించిన విషయాన్ని చిన్న డోసుల్లో గుర్రాల వంటి జంతువులకు ఎక్కిస్తారు. ఆ విషానికి రోగనిరోధకత సమకూరాక వాటి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలతో విరుగుడు తయారు చేస్తారు. అయితే ఇది శ్రమతో కూడినదే గాక ప్రమాదకరమైన ప్రక్రియ కూడా. చాలాసార్లు సరిగా పని చేయకపోవడంతో పాటు సీరియస్ సైడ్ ఎఫెక్టులు కూడా తలెత్తుతాయి. పాముకాటుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.4 లక్షల మంది బలవుతున్నట్టు అంచనా. 4 లక్షల మంది దాకా వికలాంగులుగా మారుతున్నారు. గ్వాటెమాలా గ్రామాల్లో పెరిగిన గ్లెన్‌విల్లే ఈ సమస్యకు మెరుగైన, శాశ్వత పరిష్కారం కోసం చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అది ఎల్‌ఎన్‌ఎక్స్–డీ09 కాగలదని ఆయన ధీమాగా చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్. -
ఐఫోన్ భారత్‌లో తయారీ.. అమెరికాలో అమ్మాలి
ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజార్టీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అమ్మేవి కాకుండా ఇతర దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని స్పష్టం చేశారు. టిమ్ కుక్ నిర్ణయం వెనక కారణాలేంటి? భారీ టారిఫ్‌ల కారణంగా యాపిల్ కంపెనీ నెమ్మదిగా చైనాతో తెగతెంపులు చేసుకుంటోందా? ఈ నిర్ణయంతో మనదేశానికి లాభమేంటి? – సాక్షి, స్పెషల్ డెస్క్దిద్దుబాటలో కంపెనీ.. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల ఉత్పత్తిలో చైనా వాటా ఏకంగా 75% పైగా ఉంది. ఈ అంశమే ఇప్పుడు యాపిల్‌కు కష్టాలను తెచ్చిపెట్టింది. యూఎస్–చైనా వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరడమే ఇందుకు కారణం. చైనా నుంచి యూఎస్‌కు దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ సర్కార్ భారీగా 145% సుంకాలు విధించడం.. ఆ తరువాత ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్‌ఫోన్స్‌ను మినహాయించడంతో వీటిపై టారిఫ్ కాస్తా 20%కి వచ్చి చేరింది. టారిఫ్‌ల విషయంలో ప్రస్తుతానికి ఉపశమనం ఉన్నా.. తయారీపై సింహభాగం ఒక దేశంపై ఆధారపడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్న వాస్తవం యాపిల్‌కు అర్థం అయినట్టుంది.అందుకే చైనాలో తయారీ తగ్గించి భారత్‌పై ఫోకస్ చేసింది. యూఎస్ మార్కెట్‌కు పూర్తిగా భారత్ నుంచే ఐఫోన్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. జనవరి–మార్చి కాలంలో రూ.48,000 కోట్ల విలువైన మేడిన్ఇండియా ఐఫోన్స్ యూఎస్‌కు ఎగుమతి అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతైన ఫోన్ల విలువ రూ.28,500 కోట్లు. మొత్తం ఐఫోన్స్ తయారీలో గత ఏడాది భారత్ వాటా 20% ఉంది. 2025లో ఇది 25–30 శాతానికి చేరే అవకాశం ఉంది.రెండు కొత్త ప్లాంట్లు.. యూఎస్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని చైనాకు ప్రత్యామ్నాయ తయారీ స్థావరంగా భారత్‌ను తీర్చిదిద్దే పనిలో యాపిల్ నిమగ్నమైంది. ఈ నిర్ణయం భారత్‌కు లాభించే విషయమే. ఈ క్రమంలో యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్న భాగస్వామ్య కంపెనీలూ తమ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాయి. తమిళనాడులోని హోసూర్ వద్ద ఉన్న టాటా ఎల్రక్టానిక్స్ కొత్త ప్లాంట్‌లో ఐఫోన్ల తయారీ ఇటీవలే ప్రారంభం అయింది. కర్ణాటకలోని బెంగళూరు వద్ద రూ.22,139 కోట్లతో ఫాక్స్కాన్నిర్మిస్తున్న కేంద్రంలో కొద్ది రోజుల్లో తొలి దశ ఉత్పత్తి మొదలు కానుంది. ఐఫోన్స్ ముచ్చట్లు..⇒ 2024లో ప్రపంచవ్యాప్తంగా 23.2 కోట్ల ఐఫోన్ల అమ్మకాలు ⇒ 2024లో దేశంలో ఐఫోన్ల విక్రయాల్లో 35% వృద్ధి. 1.2 కోట్ల ఐఫోన్ల అమ్మకాలు. ⇒ భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అమ్మకాల విలువ పరంగా అగ్రస్థానంలో ఐఫోన్. ⇒ 2024–25లో భారత్ నుంచి రూ.1,50,000 కోట్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి. 2023–24లో ఇది రూ.85,000 కోట్లు. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 4.3 కోట్ల యూనిట్ల యాపిల్ ఫోన్లు తయారయ్యాయి.వాటా రెండింతలకు.. దేశంలో 2017 నుంచి ఐఫోన్ల అసెంబ్లింగ్ మొదలైంది. 2026 చివరినాటికి భారత్‌లో ఏటా 7–8 కోట్ల ఐఫోన్లు ఉత్పత్తి కానున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అలాగే ఒక్క యూఎస్ కోసమే 6 కోట్ల యూనిట్లను భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 4.3 కోట్ల యాపిల్ ఫోన్లు తయారయ్యాయి. వీటి విలువ రూ.1,87,000 కోట్లు. ఇందులో 80% ఎగుమతులు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల తయారీలో భారత్ వాటా 18 నెలల్లో రెండింతలకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. కాగా, ఐఫోన్స్‌ను తయారు చేయడానికి చైనా నుండి కీలక యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతిలో పెరుగుతున్న జాప్యం ఐఫోన్ 17 విడుదలను మాత్రమే కాకుండా.. దేశం నుండి ఫోన్ల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనే కంపెనీ ప్రణాళికను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాప్ స్టోర్ సైతం..ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచంలో అతిపెద్దదైన యాపిల్ కంపెనీకి భారత్‌లో ఐఓఎస్ యాప్ వ్యవస్థ 2024లో రూ.44,447 కోట్ల ఆదాయం సమకూర్చింది. యాపిల్‌కు గత ఏడాది అన్ని విభాగాల్లో కలిపి భారత్ సుమారు రూ.2.3 లక్షల కోట్ల ఆదాయాన్ని అందించినట్టు తెలుస్తోంది. భారత్‌లో డెవలపర్లకు అద్భుత అవకాశాలు ఉన్నాయని యాపిల్ సీఈవో టిమ్ కుక్ గతంలో అన్నారు. ప్రతి వారం సగటున 2.2 కోట్ల మంది ఇండియా యాప్ స్టోర్‌ను వినియోగిస్తున్నారు. 2024లో యాప్ డౌన్లోడ్స్ 110 కోట్లకుపైమాటే. -
ఒప్పందానికి ముందు అవకాశాల అన్వేషణ
న్యూఢిల్లీ: మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు కొనసాగిస్తున్న భారత్–అమెరికా, దీనికంటే ముందు పరస్పర ప్రయోజనాన్నిచ్చే అవకాశాలను గుర్తించే పనిలో పడ్డాయి. వచ్చే సెపె్టంబర్–అక్టోబర్ నాటికి ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని కేంద్ర సర్కారు ఇప్పటికే సంకేతాలు ఇచి్చంది. రెండు దేశాలూ రంగాల వారీ చర్చలు మొదలు పెట్టాయని, మే చివరి నుంచి మరింత విస్తృత సంప్రదింపుల ప్రణాళికతో ఉన్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. భారత్ తరఫున కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ రాజేష్ అగర్వాల్, అసిస్టెంట్ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (దక్షిణాసియా) బ్రెండన్ లించ్ వాషింగ్టన్లో గత వారం మూడు రోజుల పాటు చర్చలు నిర్వహించారు. ‘‘మొదటి దశ పరస్పర ప్రయోజనకర, బహుళ రంగాల వాణిజ్య ఒప్పందాన్ని (బీటీఏ) 2025 చివరికి (సెపె్టంబర్–అక్టోబర్) ముగించే దిశగా మార్గసూచీపై బృందం చర్చించింది. తొలి దశలో పరస్పర విజయావకాశాలపైనా దృష్టి పెట్టింది’’అని వాణిజ్య శాఖ తెలిపింది. భారత్‌పై విధించిన అదనపు సుంకాలను 90 రోజుల పాటు (జూలై 9 వరకు) అమెరికా నిలిపివేసిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే మొదటి దేశం భారత్ అవుతుందంటూ యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. పరస్పర డిమాండ్లు.. కార్మికుల ప్రాధాన్యం కలిగిన టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యుయలరీ, తోలు ఉత్పత్తులు, గార్మెంట్స్, ప్లాస్టిక్, కెమికల్స్, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి ఎగుమతులపై సుంకాల రాయితీలను భారత్ కోరుతోంది. అమెరికా తన వైపు నుంచి ఇండస్ట్రియల్ గూడ్స్, ఆటోమొబైల్స్, వైన్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డైరీ, యాపిల్, నట్స్ తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాలు తగ్గించాలని డిమాండ్ చేస్తోంది.ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించి నియమ, నిబంధనలను రెండు దేశాలూ ఇప్పటికే ఖరారు చేసుకోవడం తెలిసిందే. అమెరికాతో భారత్‌కు వాణిజ్య మిగులు ఏటేటా పెరుగుతుండడం గమనార్హం. 2024–25లో ఇది 41.18బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఆరి్థక సంవత్సరాల్లో ఇది 35.32 బిలియన్ డాలర్లు (2023–24), 27.7 బిలియన్ డాలర్లు (2022–23) చొప్పున ఉంది. దీన్ని సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోంది. -
CIA: ట్రంప్ ఎఫెక్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వేలాడుతున్న లేఆప్స్ కత్తి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టారు.అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)లో 1200 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.JUST IN: The CIA plans to cut 1,200 employees as the Trump admin eyes downsizing of thousands across the U.S. intelligence community. Keep cutting and downsizing the government!— Gunther Eagleman™ (@GuntherEagleman) May 2, 2025సీఐఏలో ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ పరిపాలన విభాగం చట్టసభ సభ్యులకు సమాచారం అందించింది. అయితే, సీఐఏ సంత్సరాలుగా తొలగింపులకు బదులుగా నియామకాల్ని నిలిపి వేసిన విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. సీఐఏ ఉద్యోగుల తొలగింపులపై ట్రంప్ పరిపాలన విభాగం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదే అంశంపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ మాట్లాడుతూ జాతీయ భద్రతా ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయి. ఈ చర్యలు సీఐఏ పటిష్టతకు దోహదం చేకూర్చడమే కాదు..ఏజెన్సీలో కొత్త శక్తిని నింపడానికి.. మరింత మెరుగ్గా మార్చడానికి చేపట్టిన వ్యూహంలో భాగం’ అని చెప్పారు.దేశంలో అనవసర ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ డోజ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఉద్యోగుల్నితొలగిస్తుంది. ఇప్పటికే పలు రంగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించింది. కొద్ది రోజుల క్రితం ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్‌కు (ఐఆర్ఎస్) చెందిన 20000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా, సీఐఏ ఉద్యోగుల్ని సైతం తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమించింది. -
అమెరికాలో ఇక మేడిన్ ఇండియా ఐఫోన్లే!
న్యూఢిల్లీ: జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు.చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో కుక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్‌లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్ తెలిపారు.ఎస్అండ్పీ గ్లోబల్ విశ్లేషణ ప్రకారం 2024లో అమెరికాలో ఐఫోన్ విక్రయాలు 7.59 కోట్లుగా ఉండగా, మార్చిలో భారత్ నుంచి 31 లక్షలు ఎగుమతయ్యాయి. టారిఫ్ రేట్లు, పాలసీలు ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే జూన్ త్రైమాసికంలో తమ వ్యయాలపై రూ. 900 మిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని కుక్ చెప్పారు. -
ఖనిజ ఒప్పందం ఖరారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఉక్రెయిన్‌లోని అపారమైన అరుదైన ఖనిజ సంపదపై కన్నేసిన ఆయన దాన్ని చేజిక్కించుకోవడంలో అడుగు ముందుకేశారు. ఖనిజాలు తవ్వుకోడానికి అనుమతి ఇస్తేనే రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి, శాంతిని నెలకొల్పడానికి సహకరిస్తానంటూ మెలికపెట్టి ఉక్రెయిన్ను దారికి తెచ్చుకున్నారు. ట్రంప్ ఒత్తిడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలొగ్గక తప్పలేదు. ఖనిజాలను సొంతం చేసుకోవడానికి ట్రంప్‌కు అనుమతి ఇచ్చేశారు.ఈ మేరకు ఉక్రెయిన్–అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంపై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సంతకాలు జరిగాయి. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బీసెంట్, ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి యూలియా సిర్దెంకో సంతకాలు చేశారు. ఉక్రెయిన్ భూభాగంలోని గ్రాఫైట్, టైటానియం, అల్యూమినియం వంటి 20కిపైగా ముడి ఖనిజాలు ఇక అమెరికా పరం కానున్నాయి. అలాగే ఖనిజేతర వనరులైన ముడి చమురు, సహజ వాయువు డ్రిల్లింగ్కు సైతం అనుమతి లభించింది. ఒప్పందానికి సంబంధించిన పూర్తివివరాలను ఇరు దేశాలు ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచాయి.ఈ కొత్త ఒప్పందాన్ని ‘యూఎస్–ఉక్రెయిన్ రీఇన్వెస్ట్మెంట్ ఫండ్’ అని పిలుస్తున్నారు. ఖనిజాలు తవ్వుకోడానికి అనుమతులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ నిధికి ఉక్రెయిన్–అమెరికా సమానంగా డబ్బులు సమకూర్చాల్సి ఉంటుంది. వాస్తవానికి రెండు నెలల క్రితమే ఈ ఒప్పందంపై సంతకాలు జరగాల్సి ఉండగా అనూహ్యంగా ఆగిపోయింది. అప్పట్లో వైట్‌హౌస్‌లో ట్రంప్, జెలెన్స్కీ మధ్య మీడియా సమక్షంలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. అప్పటి నుంచి జరిగిన ప్రయత్నాలు ఫలించి, ఒప్పందం కుదిరింది. అమెరికాతో ఈ ఒప్పందం పదేళ్లపాటు అమల్లో ఉంటుందని ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షిమీహల్ చెప్పారు. ఖనిజాల తవ్వకం, ఆదాయంలో ఇరు దేశాలకు సమాన వాటా లభిస్తుందన్నారు. మూర్ఖుడిగా ఉండదల్చుకోలేదు: ట్రంప్ ఉక్రెయిన్‌కు తాము ఇప్పటిదాకా ఇచ్చిన దానికంటే అధికంగా తిరిగి పొందబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం పొందలేని మూర్ఖుడిగా తాను ఉండదల్చుకోలేదని అన్నారు. ఒకచోట డబ్బు ఖర్చు పెట్టినప్పుడు లాభపడాల్సిందేనని పరోక్షంగా తేల్సిచెప్పారు. మరోవైపు ఒప్పందాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం స్వాగతించింది. ఇది సమానమైన, గొప్ప అంతర్జాతీయ ఒప్పందమని అభివర్ణించింది. భవిష్యత్తులో అమెరికా నుంచి సైనిక సాయం పొందడానికి ఇది కీలకంగా మారుతుందని ఆకాంక్షించింది. అమెరికాతో బంధం బలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అమెరికాతో కలిసి ఒక నిధిని ఏర్పాటు చేయబోతున్నామని, తమ దేశంలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ నిధి దోహదపడుతుందని వెల్లడించింది. కీలకాంశాలు.. ఉక్రెయిన్–అమెరికా ఖనిజ ఒప్పందంలో కొన్ని కీలకాంశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు 350 బిలియన్ డాలర్లు ఇచ్చామని, ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని ట్రంప్ గతంలో డిమాండ్ చేశారు. కొత్త ఒప్పందం ప్రకారం.. ఆ డబ్బును ఉక్రెయిన్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. రష్యా పట్ల ఇన్నాళ్లూ సానుకూలంగా మాట్లాడిన అమెరికా స్వరంలో మార్పు వచ్చింది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచబోతోంది. రష్యాకు సహకరించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని అమెరికా సంకేతాలిచ్చింది. ఖనిజాలను తవ్వుకొనే అవకాశం అమెరికాకు ఇచ్చినప్పటికీ వాటిపై యాజమాన్య హక్కులు ఉక్రెయిన్‌కే దఖలు పరిచారు. యూ రోపియన్ యూనియన్(ఈయూ)లో చేరాలన్న ఉక్రె యిన్ ఆకాంక్షను అమెరికా ఇకపై అడ్డుకోదు. ఈయూతోపాటు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం స్వీకరించడానికి అమెరికా సహకరిస్తుంది. అమెరికా నుంచి సైనిక సాయం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే, ఉక్రెయిన్ భద్రతకు అమెరికా పూర్తి గ్యారంటీ ఇవ్వలేదు. ఆ ఖనిజాలకు ఎందుకంత ప్రాముఖ్యం?ఇతర దేశాల్లో లేని ఆరుదైన ఖనిజ నిల్వలకు ఉక్రెయిన్ కేంద్రంగా మారింది. లిథియం, గ్రాఫైట్, మాంగనీస్, టైటానియం వంటివి నిక్షిప్తమ య్యాయి. 34 కీలక ఖనిజాల్లో 23 రకాల ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఉక్రెయిన్ను ప్రపంచంలోనే విలువైన ఖనిజ వనరులు కలిగిన దేశంగా నిలబెట్టింది. ఆధునిక కాలానికి అవవసరమైన ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, సౌర ఫలకాలు, శక్తి నిల్వ వ్యవస్థలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆయుధాల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటివి ఉక్రెయిన్‌లో పుష్కలంగా ఉన్నా యి.ఇక ముడి ఇనుము, టైటానియం, మాంగనీస్, యురేనియం, నియోడిమియం, డిస్ప్రోసి యం, నియోబియం, టాంటాలమ్, బెరీలియం, కోబాల్ట్, మాంగనీస్, జిర్కోనియం వంటి ఖనిజా లకు లోటులేదు. ఈ ఖనిజాల కోసం అమెరికా ప్రధానంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే ఉక్రెయిన్‌లోని ఖనిజ వనరులను దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రపంచంలోని మొత్తం ఖనిజ వనరుల్లో 5 శాతానికిపైగా ఉక్రెయిన్‌లోనే ఉండడం గమనార్హం. -
మీకు అండగా ఉంటాం: అమెరికా
ఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలకు తాము అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఈ రోజు(గురువారం) హెగ్సే కు ఫోన్ చేసి మాట్లాడారు రాజ్‌నాథ్ సింగ్ .ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందనే చరిత్ర ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రాజ్ నాథ్. ఉగ్రవాదంపై ప్రపంచం గుడ్డిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెగ్సే కు తెలిపారు రాజ్ నాథ్. దీనిలో భాగంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలను తాము మద్దతిస్తామన్నారు హెగ్సే. ఉగ్రవాదంపై భారత్ కు రక్షణ చర్యలు తీసుకునే హక్కు ఉందని హెగ్సే పేర్కొన్నారు. భారత్ కు అమెరికా అండగా నిలబడుతుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి స్పష్టం చేసిన సంగతిని రాజ్ నాథ్ సింగ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. The U.S. Secretary of Defence @PeteHegseth spoke to Raksha Mantri Shri @rajnathsingh earlier today and expressed his deepest sympathies for the tragic loss of innocent civilians in the dastardly terror attack in Pahalgam, Jammu & Kashmir.Secretary Hegseth said that the U.S.…— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 1, 2025 పాకిస్తాన్ కవ్వింపు చర్యలు..కాగా, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)తోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్వోసీ దగ్గర వరుసగా ఏడోరోజూ(గురువారం) పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారతసెన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎల్ఓసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా ఏడోరోజు కావడం గమనార్హం.మరో వైపు అరేబియా సముద్రంలో యుద్ధవాతావరణం నెలకొంది. భారత్, పాకిస్థాన్‌లు యుద్ధనౌకలను మోహరించాయి. గుజరాత్ పోరుబందర్ వద్ద భారత్ యుద్ధనౌకలు.. సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. నిన్న(బుధవారం) సైతం ఎల్ఓసీలో పాక్ కాల్పులు కొనసాగగా... భారత జవాన్లు ప్రభావవంతంగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో నాలుగు సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతుండడంతో ప్రాణనష్టం జరగడం లేదని అధికారులు పేర్కొన్నారు.పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధూనది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ సైన్యం ఆగ్రహంతో రగిలిపోతోంది. సరిహద్దులో భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతోంది. దీన్ని భారత్ సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. -
ఇండియా Vs పాక్ రంగంలోకి అమెరికా
-
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!
వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్‌కు అమెరికా షాకిచ్చింది. మతిలేని చర్యను వెనకేసుకు రావొద్దని హెచ్చరించింది. పహల్గాం దాడి విషయంలో చేపట్టే దర్యాప్తులో భారత్‌కు సహకరించాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ - పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాక్ ప్రధాని హహబాద్ షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు.ఫోన్ సంభాషణలో రూబియో.. ఉగ్రవాదంపై భారత్ తీసుకునే ప్రతి చర్యలో అమెరికా పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అదే సమయంలో పహల్గాంలో 26 మంది ప్రాణాలు తీసిన అమానుష చర్యపై భారత్ చేపట్టే దర్యాప్తుకు సహకరించాలని సూచించినట్లు సమాచారం.Today, Secretary Marco Rubio spoke with Pakistan's Prime Minister Muhammad Shehbaz Sharif and encouraged Pakistan to work with India to de-escalate tensions, re-establish direct communications, and maintain peace and security in South Asia: US State Department spokesperson Tammy…— ANI (@ANI) April 30, 2025Secretary of State Marco Rubio spoke with Indian External Affairs Minister Dr S Jaishankar today. The Secretary expressed his sorrow for the lives lost in the horrific terrorist attack in Pahalgam, and reaffirmed the United States' commitment to cooperation with India against…— ANI (@ANI) April 30, 2025 జైశంకర్‌తో మాట్లాడిన సమయంలో మార్కో రూబియో పహల్గాం దాడి బాధితులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై జరిపే పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముందు నుంచి పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పాకిస్తాన్‌తో కలిసి పనిచేయాలని భారత్ కృషి చేయాలని కోరారు. Discussed the Pahalgam terrorist attack with US @SecRubio yesterday. Its perpetrators, backers and planners must be brought to justice.— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 1, 2025అందుకు ప్రతిస్పందనగా ఎక్స్ వేదికగా జైశంకర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో దాడికి పాల్పడ ఉగ్రవాదుల్ని, వాళ్లను పెంచి పోషిస్తున్న వారిని, పహల్గాం ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలి’ అని పేర్కొన్నారు. రుబియో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో జరిపిన సంభాషణల్లో పాకిస్తాన్ పహల్గాం దాడిని ఖండించాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఈ దాడిపై పాకిస్తాన్ బాధ్యత వహించాలని, భారత్‌తో నేరుగా సంభాషణలు పునరుద్ధరించి శాంతి దిశగా కృషి చేయాలని సూచించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి తాజా పరిణామలపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. -
సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
న్యూఢిల్లీ: సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునే విషయంలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదంటూ స్వతంత్ర దర్యాప్తులో తేలిందని అదానీ గ్రీన్ వెల్లడించింది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం భారత్‌లో ప్రభుత్వ వర్గాలకు లంచాలిచ్చారని, అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే క్రమంలో ఆ విషయాన్ని దాచిపెట్టారని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, ఎండీ వినీత్ జైన్‌లపై అమెరికాలో అభియోగాలు మోపారు. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది. స్వతంత్ర దర్యాప్తులో అవకతవకలు జరగలేదని వెల్లడైనట్లు అదానీ గ్రీన్ పేర్కొంది. -
ట్రంప్ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్ కార్నీ
టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్ కార్నీ? -
‘ఛీ’నా రాజకీయం...
అవకాశం దొరికింది కదాని ఇండియాను పాకిస్థాన్ భుజాల మీదుగా కాల్చాలని ప్రయత్నిస్తోంది కుటిల చైనా. ఆ దిశగానే బీజింగ్-ఇస్లామాబాద్ రక్షణ భాగస్వామ్యం బలపడుతోంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న తరుణంలో... గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల తమ అత్యాధునిక పీఎల్-15 క్షిపణులను పాక్ వైమానిక దళానికి చైనా అందించింది.బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) పీఎల్-15 క్షిపణులను మోసుకెళుతున్న తమ జేఎఫ్-17 బ్లాక్ 3 యుద్ధ విమానాల ఫొటోలను పాక్ వైమానిక దళం (పీఏఎఫ్) ఇటీవల విడుదల చేయడం గమనార్హం. ‘పీఏఎఫ్’కు చైనా సరఫరా చేసినవి ఎగుమతులకు ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ రకం క్షిపణులు అనుకుంటే పొరపాటు! తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్)కు చెందిన సొంత పీఎల్-15 క్షిపణులను చైనా నేరుగా పాక్ కు అందజేసినట్టు ‘యూరేషియన్ టైమ్స్’ ఓ కథనం ప్రచురించింది.భారత్, పాక్ నడుమ వైరం ముదురుతున్న అత్యంత కీలక తరుణంలో ఆగమేఘాలపై ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరింత ఎక్కువ దూరం నుంచి భారత్ విమానాలను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్ని పీఎల్-15 క్షిపణులు పాక్ యుద్ధ విమానాల పైలట్లకు కల్పిస్తాయి. అలా శత్రువుపై గెలుపును సునాయాసం చేస్తాయి.ఏమిటీ పీఎల్-15 మిసైల్?పీఎల్-15 క్షిపణి ఆధునిక వైమానిక యుద్ధరంగంలో చైనాకు ఓ ప్రధానాస్త్రం. ఇది ప్రభుత్వ ఏరోస్పేస్ సంస్థయిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (ఏవీఐసీ) అభివృద్ధి చేసిన రాడార్ గైడెడ్ దూరశ్రేణి క్షిపణి. ధ్వని వేగానికి ఐదు రెట్లు (మ్యాక్ 5) మించిన వేగంతో గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించదగ్గ ఈ మిసైల్ 200-300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ వెర్షన్ మిసైల్ 145 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. జే-10సి, జే11-బి, జే-15, జే-16, జేఎఫ్-17 బ్లాక్ 3, జే-20 విమానాలకు పీఎల్-15 క్షిపణిని అమర్చవచ్చు. 160 కిలోమీటర్ల రేంజితో, శబ్ద వేగానికి నాలుగు రెట్ల వేగంతో ప్రయాణించగల అమెరికాకు చెందిన ఏఐఎం-120డి అమ్రామ్ క్షిపణితో పోలిస్తే రేంజి, వేగం పరంగా మెరుగైన ఈ పీఎల్-15 మిసైల్ 2018 నుంచి చైనా వైమానిక దళానికి సేవలు అందిస్తోంది.పీఎల్-15 వర్సెస్ మీటియర్... యూరోపియన్ ఎంబీడీఎం మీటియర్ క్షిపణితో పీఎల్-15ను పోల్చవచ్చు. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల మీటియర్, ఎంఐసీఏ దూరశ్రేణి క్షిపణులను ప్రస్తుతం భారత్ చెంత ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు అమర్చవచ్చు. లాంచ్ ప్లాట్ ఫాం, ఎత్తు, లక్ష్యపు చలనశీలత అంశాలపై ఆధారపడి మీటియర్ మిసైల్ పరిధి 100-200 కిలోమీటర్లు ఉంటుంది. ధ్వని వేగానికి నాలుగు రెట్లు మించిన వేగాన్ని అది అందుకోగలదు. సామర్థ్యం పరంగా పీఎల్-15ఈ (ఎగుమతి రకం)తో మీటియర్ క్షిపణిని పోల్చవచ్చు. కానీ పీఎల్-15 స్టాండర్డ్ వెర్షన్ (పాక్ కు చైనా సరఫరా చేసిన ప్రామాణిక రకం) మాత్రం మీటియర్ కంటే అధిక వేగం, దూరశ్రేణి గల క్షిపణి. రాంజెట్ ఇంజిన్ సాయంతో మీటియర్ క్షిపణి ప్రయాణమంతటా స్థిర వేగంతో దూసుకెళుతుంది.ఇందుకు భిన్నంగా పీఎల్-15 మిసైల్ డ్యూయల్ పల్స్ ఘన ఇంధన రాకెట్ మోటార్ సాయంతో ప్రయాణిస్తుంది. ఇందులోని ఘన ఇంధనం కొద్దిసేపు మాత్రమే జ్వలించినప్పటికీ రాంజెట్ ఇంజిన్ గల మీటియర్ కంటే ఎక్కువ వేగం అందిస్తుంది. అయితే ధ్వనికి ఐదు రెట్లు పైబడిన స్పీడ్ అందుకున్నా ప్రయాణం పొడవునా అదే వేగాన్ని పీఎల్-15 మిసైల్ కొనసాగించలేదు! క్షిపణుల బయటివైపు చిన్న రెక్కల్లాంటి భాగాలు (ఫిన్స్) ఉంటాయి. వాటిని మడవగలిగితే మరిన్ని క్షిపణులను యుద్ధవిమానాలకు అమర్చవచ్చు. ఈ బుల్లి రెక్కల్ని మడిచిన పీఎల్-15 క్షిపణి నమూనాను చైనా నిరుడు జూహాయ్ ఎయిర్ షోలో ప్రదర్శించింది. దీంతో జే-20 లాంటి యుద్ధవిమానాలు నాలుగు బదులుగా ఆరు పీఎల్-15 మిసైళ్లను మోసుకెళ్లే వీలు కలిగింది.రష్యన్ ‘ఆర్-37ఎం’ వైపు భారత్ చూపు?పాక్ మోహరించిన పీఎల్-15 మిసైళ్లతో భారత వైమానిక దళానికి తలనొప్పి తప్పేలా లేదు. వాటిపై పైచేయి సాధించే ఆప్షన్ ఇండియాకు లేకపోలేదు. అది... రష్యాకు చెందిన అత్యాధునిక ఆర్-37ఎం దూరశ్రేణి క్షిపణి! అతిధ్వానిక వేగాన్ని (మ్యాక్ 6) అందుకోగల ఈ హైపర్ సానిక్ మిసైల్ 300-400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తుత్తునియలు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దీన్ని విస్తృతంగా వినియోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి ఆర్-37ఎం క్షిపణి నుంచే ప్రధాన ముప్పు ఎదురైందంటే అతిశయోక్తి కాదు.ఆర్-37ఎంను అమర్చిన మిగ్-31 విమానాలు పలు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. ఉక్రెయిన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని సైతం ఈ మిసైల్ సాయంతో రష్యా కూల్చివేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. విశేషం ఏమిటంటే సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 యుద్ధ విమానాలపై ఆర్-37ఎం క్షిపణులను మోహరించవచ్చు. భారత్ వద్ద ‘సుఖోయ్ ఎస్యు-30’ శ్రేణికి కొదవ లేదు. ప్రస్తుతం మనకు 260కి పైగా సుఖోయ్ ఎస్యు-30ఎంకెఐ యుద్ధ విమానాలు ఉన్నాయి.వాటిని సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 వేరియంట్లుగా ఉన్నతీకరించే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. ఎస్యు-30ఎంకెఐ విమానాలకే ఆర్-37ఎం క్షిపణులను అమర్చాలంటే పెద్ద సాంకేతిక ప్రక్రియ ఉంది. దాదాపు 84 ఎస్యు-30ఎంకెఐ విమానాలను ఎస్ఎం2 వేరియంట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడానికి రూ.63 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఆర్-37ఎం క్షిపణులను ఇండియాకు విక్రయించడానికి రష్యా కూడా ఆసక్తి కనబరుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలపై ఈ క్షిపణులను మోహరించే అంశంలోనూ చర్చలు సాగుతున్నాయి. 2019లో బాలాకోట్ దాడుల సందర్భంగా ఇండియాకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని పాక్ తన ఎఫ్-16 విమానం-అమ్రామ్ క్షిపణితో కూల్చివేసింది. నాడు ఇండియా చెంత దూరశ్రేణి క్షిపణులు లేకపోవడం పెద్ద లోటు. ఆ తర్వాత మీటియర్ క్షిపణులను అమర్చిన రాఫెల్ విమానాలను భారత్ మోహరించింది. - జమ్ముల శ్రీకాంత్ -
ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
భారత ఆర్ధిక వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇండియా.. జర్మనీ, జపాన్‌లను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు.భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే మన దేశంలోని ప్రజాస్వామ్యమే మనకు అతిపెద్ద ప్రయోజనమని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని ఇటీవలే వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్దది. వచ్చే ఏడాది చివరి నాటికి మనం నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉండబోతున్నాము. ఆ తర్వాత ఏడాది మూడవ అతిపెద్దదిగా ఉంటామని ఆయన వివరించారు.ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ GDPకి గణనీయంగా దోహదపడతాయి. అంతే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక విధానాలపై కూడా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం.. టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇలా..➤యునైటెడ్ స్టేట్స్ (యూఎస్): 30.507 ట్రిలియన్ డాలర్లు➤చైనా: 19.231 ట్రిలియన్ డాలర్లు➤జర్మనీ: 4.744 ట్రిలియన్ డాలర్లు➤భారతదేశం: 4.187 ట్రిలియన్ డాలర్లు➤జపాన్: 4.186 ట్రిలియన్ డాలర్లు➤యునైటెడ్ కింగ్డమ్ (యూకే): 3.839 ట్రిలియన్ డాలర్లు➤ఫ్రాన్స్: 3.211 ట్రిలియన్ డాలర్లు➤ఇటలీ: 2.422 ట్రిలియన్ డాలర్లు➤కెనడా: 2.225 ట్రిలియన్ డాలర్లు➤బ్రెజిల్: 2.125 ట్రిలియన్ డాలర్లు -
నక్షత్రాలు చూడటానికి బెస్ట్ ప్లేస్ ..!
చీకటివేళ, మిలమిల మెరిసే నక్షత్రాల నింగిని చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆ అబ్బురమైన అనుభూతి, మనసుపై చెరగని ముద్ర వేయాలంటే, అమెరికాలోని ఉటా రాష్ట్రం వెళ్లాల్సిందే! అక్కడి సెడార్ బ్రేక్స్ నేషనల్ మాన్యుమెంట్ సమీపంలో రాత్రిపూట సేద తీరాలి. నక్షత్రాలను చూడటానికి అదో అద్భుతమైన ప్రదేశం అంటారు ప్రకృతి ప్రేమికులు. ఇక్కడ సహజసిద్ధమైన అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవట! ఇక్కడి లోతైన లోయలో సున్నపురాతి గుట్టలు కాలాన్ని బట్టి, నేలలో ఉండే ఖనిజాన్ని బట్టి రంగురంగులుగా మెరుస్తాయి. ఈ సెడార్ బ్రేక్స్ ప్రత్యేకమైన భౌగోళిక లక్షణాలతో ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మొదట్లో ఒక సరస్సు అని, నీరు ఎండిపోయాక అడుగున పేరుకున్న అవక్షేపాల రూపమే ప్రస్తుతం మనకు కనిపించే శిలలని చెబుతున్నారు. ఇది సుమారు ఆరు కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని అంచనా. ఈ ప్రాంతాన్ని 1933లో జాతీయ వారసత్వ చిహ్నంగా గుర్తించిన నాటి నుంచి, ఈ అద్భుతమైన సహజ సౌందర్యాన్ని పరిరక్షిస్తున్నారు. ఇక్కడ హైకింగ్, ఫొటోగ్రఫీ, నక్షత్రాల పరిశీలన వంటి కాలక్షేపాలను ఆస్వాదించవచ్చు. (చదవండి: వేసవి అంటే సెలవులేనా?) -
నిరీక్షణ ఫలించింది...
కొన్ని సంవత్సరాల నుంచి భర్తతో కలిసి మన దేశంలో ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ భారత్‌లో తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. దిల్లీలో ఉంటున్న ఫిషర్ దంపతులు నిషా అనే దివ్యాంగురాలైన బాలికను దత్తత తీసుకోవాలనుకున్నారు. అయితే దత్తత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగింది.‘2023లో అక్టోబర్‌లో దత్తత కోసం దరఖాస్తు చేసుకోగా, 2024లో నిషాకు దగ్గరయ్యాం. 2025 ఏప్రిల్ నాటికి దత్తత పూర్తయింది. ఇప్పుడు నిషా మా అందమైన కుమార్తె’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది ఫిషర్.‘కౌంటింగ్ డౌన్ ది డేస్ అన్టిల్...’ ట్యాగ్‌లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తాను దత్తత తీసుకున్న పాప కనిపిస్తుంది. మరో వీడియోలో చిన్నారి నిషాకు సంబంధించిన ఎమోషనల్ గ్లింప్స్‌ను షేర్ చేసింది. దివ్యాంగురాలు అనే కారణంతో నిషాను చిన్న వయసులోనే తల్లిదండ్రులు వదిలేశారు. రెండు సంవత్సరాలు అనాథాశ్రమంలో పెరిగింది నిషా. ‘స్పెషల్ నీడ్స్ చైల్డ్‌ను దత్తత తీసుకోవాలనుకోవడానికి కారణం...వారికి కొత్త జీవితం ఇవ్వాలనుకోవడం’ అంటుంది క్రిస్టెన్ ఫిషర్. -
ముగిసిన ఇరాన్, అమెరికా మూడో దఫా చర్చలు
మస్కట్ (ఒమన్): యురేనియం శుద్ధి కార్యక్రమం వేగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇరాన్‌తో అమెరికా చేపట్టిన మూడో దఫా పరోక్ష చర్చలు శనివారం ఒమన్‌లో ముగిశా యి. అయితే ఈ చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయి అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. చర్చల తర్వాత అమెరికా తరఫున అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు ఒమన్ నుంచి తమ స్వదేశాలకు పయనమయ్యారని విశ్వస నీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘పరస్పర గౌరవం, హామీలకు కట్టుబడేలా ఒప్పందం కుదర్చుకునేందుకు రెండు దేశాలు ఆసక్తి కనబర్చాయి. కీలక ప్రతిపాదనలు, సాంకేతిక అభ్యంతరాలు, తదితరాలపై మరోదఫా చర్చలు జరుపుతాం. వచ్చే వారం సైతం సంప్రతింపుల ప్రక్రియ కొనసాగుతుంది. మళ్లీ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. మే మూడో తేదీన తదుపరి భేటీ ఉంటుంది’’అని ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ ప్రకటించారు. గతంలో మస్కట్, రోమ్‌లో ఇలా పరోక్ష చర్చలు జరిగాయి. గతంలో మాదిరే ఈసారి చర్చల్లో సైతం ఒమన్ విదేశాంగ మంత్రి బుసైదీ మధ్యవర్తిగా ఉన్న విషయం విదితమే. చర్చలకు ముందు విట్కాఫ్ రష్యాలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. చర్చలు మొదలైన సమయంలోనే దక్షిణ ఇరాన్లో రజేయీ నౌకాశ్రయంలో శనివారం పేలుళ్లు సంభవించడం గమనార్హం. అర్ధశతాబ్ద శత్రుత్వాన్ని పక్కనబెట్టిమరీ ఇరాన్‌పై కఠిన ఆంక్షలను సడలిస్తామని, అందుకు ప్రతిగా అణ్వాయుధంలో ఉపయోగించే యురేనియం శుద్ధి వేగాన్ని తగ్గించాలని అమెరికా డిమాండ్ చేయడం తెల్సిందే. తమ డిమాండ్లను ఒప్పుకోకుంటే దాడులతో తెగబడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే అందుకు దీటుగా బదులిస్తామని ఇరాన్ ప్రతిస్పందించడం విదితమే. -
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి అని ట్రంప్ చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రోమ్ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతపై ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ అంటే నాకు ఎంతో గౌరవం. అలాగే పాకిస్తాన్ కూడా నాకు చాలా దగ్గర. రెండు దేశాలతో నేను సన్నిహితంగా ఉంటాను. కశ్మీర్ విషయంలో భారత్, పాక్‌ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే, ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా చేసేదేమీ లేదు. ఇక, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్త పని. ఉగ్రవాదుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం’ అని వ్యాఖ్యలు చేశారు.#WATCH | On #PahalgamTerroristAttack, US President Donald Trump says, "I am very close to India and I'm very close to Pakistan, and they've had that fight for a thousand years in Kashmir. Kashmir has been going on for a thousand years, probably longer than that. That was a bad… pic.twitter.com/R4Bc25Ar6h— ANI (@ANI) April 25, 2025అంతకుముందు ట్రంప్.. కశ్మీర్ పహల్గాం ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికాలో భారత్ అంశంపై ప్రశ్నించిన పాక్ జర్నలిస్టుకు భంగపాటు ఎదురైంది. పహల్గాం ఘటన తర్వాత భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంపై అమెరికా విదేశాంగ ప్రతినిధి టామ్మీ బ్రూస్‌ను ఓ పాక్ జర్నలిస్టు అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. మనం ఇంకో సబ్జెక్టు మాట్లాడుకుందాం. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్, మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడను. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తాను. ఈ హీనమైన దాడికి పాల్పడిన వారికి శిక్ష పడాలని కోరుకుంటాను. పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు మనం చూస్తున్నాం. వాటిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. జమ్మూకశ్మీర్‌పై ఎటువంటి పొజిషన్ తీసుకోలేదు’ అని పేర్కొన్నారు. -
వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు
న్యూఢిల్లీ: భారత్, వాణిజ్య ఒప్పందం, అమెరికా ఉత్పత్తులకు, కొత్త అవకాశాల,ను తీసుకొస్తుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్టీఆర్) జైమీసన్ గ్రీర్ తెలిపారు. అంతేకాదు ఇరు దేశాల్లోని కారి్మకులు, రైతులు, వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్–అమెరికా కాంపాక్ట్ భాగస్వామ్యం ప్రాధాన్యతను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మరోసారి ధ్రువీకరించినట్టు చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతిని ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్యం విషయంలో సమతుల్యతను తీసుకొస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యూఎస్‌టీర్, భారత వాణిజ్య శాఖ, పరిశ్రమల శాఖలు చర్చలకు సంబంధించి నిబంధనలను ఇప్పటికే ఖరారు చేసినట్టు చెప్పారు. భారత మార్కెట్లో తన ఉత్పత్తులకు మరింత ప్రవేశం కల్పించడం కోసం అమెరికా చూస్తోందని, టారిఫ్, నాన్ టారిఫ్ అడ్డంకులను తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా అదనపు హామీలపై చర్చించనున్నట్టు చెప్పారు. భారత్ పెద్ద ఎత్తున టారిఫ్‌లు విధిస్తోందంటూ అమెరికా ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆరోపించడం గమనార్హం. భారత్‌తో 45.7 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటును అమెరికా మోస్తోంది. 2024లో భారత్‌తో అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 129.2 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత ఉత్పత్తులపై అమెరికా సగటు టారిఫ్ 3.3 శాతంగా ఉంటే, అమెరికా ఉత్పత్తులపై భారత్ సగటున 17 శాతం టారిఫ్ విధిస్తుండడం గమనార్హం. టారిఫ్‌లకు అదనంగా సేవల మార్కెట్‌కు సంబంధించి సాంకేతిక పరమైన అవరోధాలు, నియంత్రణపరమైన అవరోధాలు భారత్‌తో అమెరికా వాణిజ్యం పెంచుకునే విషయంలో అవరోధాలు కలి్పస్తున్నట్టు జైమీసన్ గ్రీర్ తెలిపారు. -
భారత షిప్పింగ్ మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్‌ల వల్ల షిప్పింగ్ రంగంలో స్వల్పకాలికంగా కాస్త సమస్యలు తలెత్తినా, దీర్ఘకాలికంగా చూస్తే భారత మారిటైమ్ మూలాలు పటిష్టంగా ఉన్నాయని అంతర్జాతీయ షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ మెరైన్ గ్రూప్ సీఈవో జెస్పర్ క్రిస్టెన్సన్ తెలిపారు. పోర్టు సామర్థ్యాలు .. ఎగుమతుల బేస్ పెరుగుతుండటం, సుశిక్షితులైన సిబ్బంది లభ్యత తదితర అంశాల దన్నుతో గ్లోబల్ షిప్పింగ్ పరిశ్రమలో పరిస్థితులకు అనుగుణంగా భారత్ తనను తాను మల్చుకోగలిగే స్థితిలో ఉందని వివరించారు. బహుళ నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్‌కి షిప్పింగ్ రంగంలో డిమాండ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని చెప్పారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, నిబంధనలు తదితర అంశాల ఆధారంగా షిప్పింగ్ రంగంలో నైపుణ్యాల ఆధారంగా నియామకాలు ఉంటున్నాయని వివరించారు. సినర్జీలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 28,000 మంది సీఫేరర్స్ ఉండగా, వీరిలో 70 శాతం మంది భారతీయులేనని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్లీట్ విస్తరణకు అనుగుణంగస్మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
బయోమెట్రిక్స్, చిరునామా
వాషింగ్టన్: వీసాల విషయంలో రోజుకో కొత్త నిబంధనతో ఆశావహులకు అమెరికా చుక్క లు చూపుతోంది. హెచ్–1బీ వీసా దరఖా స్తుదారులు ఇంటి చిరునామా, బయో మెట్రిక్ డేటా వంటి వ్యక్తిగత సమాచారం అందజే యాలని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మి గ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) తాజాగా ఆదేశించింది. ఈ మేరకు వివరాలు సమర్పించాలంటూ వారికి రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్ఎఫ్ఈ) జారీ చేస్తోంది. అమె రికాలోని 240కి పైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదవాలని కలలుగనే అంతర్జాతీయ విద్యార్థు లకు ఇది కొత్త సమస్యగా మారనుంది. దీని వెనక ఉద్దేశాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి. హెచ్–1బీ వీసా దరఖాస్తులకు బయోమెట్రిక్స్ అవస రమే ఉండదని ఇమ్మిగ్రేషన్ అటార్నీలు అంటున్నారు. -
ముష్కరుల వేటలో భారత్‌కు సహకరిస్తాం
వాషింగ్టన్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది హిందువులను పొట్టనబెట్టుకున్న ముష్కరుల వేటలో భారత్‌కు తమ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ స్పష్టం చేశారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా సానుభూతి ప్రకటించారు. దాడికి కారకులైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్‌కు సాయంగా నిలుస్తామని అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధ వారం ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. దారు ణాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. -
చాట్‌జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..!
చాట్‌జీపీటీ వంటి సాంకేతికతో ఆరోగ్య సలహాలు తీసుకోవద్దుని నొక్కి చెబుతుంటారు నిపుణులు. అవి నేరుగా వైద్యుడిని సంప్రదించినట్లుగా ఉండదు, పైగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వ్యాధులను నిర్థారించలేదనే హెచ్చరిస్తుంటారు. అయితే ఆ మాటలన్నింటిని కొట్టిపారేసేలా ఓ ఘటన చోటుచేసుకుంది. వైద్యులే గుర్తించలేని ఆరోగ్య సమస్యను గుర్తించి ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. అసలు ఆ ఏఐ చాట్‌జీపీటీ లేకపోతే నా ప్రాణాలే ఉండేవి కాదని కన్నీటిపర్యంతమైంది ఆమె. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..అమెరికాలోని నార్త్‌కరోలినా ప్రాంతానికి చెందిన మహిళ ఎన్నేళ్లుగానో తెలియని అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఆ అనారోగ్యం కారణంగా ఆమె బాడీలో ఎన్నో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, విపరీతమైన కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంది. దీంతో వైద్యులను సంప్రదించినా లాభం లేకుండాపోయింది. వాళ్లంతా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్థారించారు.పైగా యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. అయినా ఆమెకెందుకో తాను అంతకుమించిన పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్న ఫీల్ ఉండేది. దీంతో సరదాగా ఏఐ చాట్‌జీపీటీలో తాను ఫేస్ చేస్తున్న అనారోగ్య సమస్యలను వివరించింది. చివరగా వైద్యులు ఏమని నిర్థారించారో చాట్‌జీపీటో సంభాషిస్తుండగానే..ఆమె హషిమోటో వ్యాధితో బాధపడి ఉండొచ్చని చెప్పింది చాట్‌జీపీటీ. దీంతో ఆమె వెంటనే వైద్యుల్ని సంప్రదించి ఆ దిశగా వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆ పరీక్షల్లో ఆమె ప్రాణాంతక కేన్సర్ అయినా..హషిమోటో వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. స్క్రీనింగ్ పరీక్షల్లో వైద్యులు ఆమె మెడలో రెండు చిన్న గడ్డలను గుర్తించారు. ఆ తర్వాత వాటిని కేన్సర్ కణితులుగా నిర్థారించారు. ప్రస్తుతం ఆమె తగిన చికిత్సను పొంది ఆ సమస్య నుంచి బయటపడింది. తాను గనుక చాట్‌జీపీటీనీ సంప్రదించి ఉంకడపోతే..ఇంకా ఆర్థరైటిస్ మందులు వాడుతూ..కేన్సర్ సమస్యను ముదరబెట్టుకునేదాన్ని అని వాపోయింది. ఇలా మరో ప్రయత్నం చేయకుంటే తన ప్రాణాలే పోయేవి అంటూ తన అనుభవాన్ని వివరించారామె. ఏంటీ వ్యాధి అంటే..హషిమోటో వ్యాధి అనేది థైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేసే స్వయం ప్రతిరక్షక రుగ్మత. ఇది హైపోథైరాయిడిజం (thyroid గ్రంధి తక్కువ పనితీరు)కు కారణమవుతుంది. దీని వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి కారణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిని విదేశీ కారకంగా భావించి, దానిపై దాడి చేస్తుంది. ఈ దాడి థైరాయిడ్ గ్రంధిని దెబ్బతీసి, దాని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చితకిత్స మాత్రం.. మందులతో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాల్సిందే.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Starch-Free Rice Cooker: డయాబెటిస్, ఊబకాయాన్ని దరిచేరనీయదు..) -
పాన్ వరల్డ్ హైవే.. 14 దేశాలను కలుపుతూ.. ఎన్నో వింతలు, విశేషాలతో..
ప్రస్తుతం అంతా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి అంటూ తెగ చర్చ జరుగుతోంది. అయితే, దానికి కాస్తా భిన్నంగా పాన్ హైవే(PAN Highway.. గురించి ఎప్పుడైనా విన్నారా.. ఎప్పుడైనా చూశారా?. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.. ఈ హైవే అగ్రరాజ్యం అమెరికాలో ఉంది. ఈ రోడ్డు మార్గం పొడవు ఏకంగా 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు). ఇది 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. అందుకే దీన్ని పాన్ అమెరికా హైవే అని పిలుస్తున్నారు. ఈ గురించి మరిన్ని వివరాలు ఇలా..రోడ్లు, హైవేలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రదేశాలు, సంస్కృతులను కలుపుతాయి. ఒక దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ బాగుంటేనే ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు మార్గం నిర్మించారు. దీంతో, ఈ పాన్ అమెరికా హైవే.. రికార్డుల్లోకి ఎక్కింది.30,600 కిలోమీటర్ల పొడవు.. పాన్-అమెరికన్ హైవే.. అలాస్కాలోని ప్రుధో బేలో ప్రారంభమై అర్జెంటీనాలోని ఉషుయాలో ముగుస్తుంది. ఉత్తర అమెరికా.. దక్షిణ అమెరికాను కలుపుతుంది. ఈ రోడ్డు మార్గం దాదాపు 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు) విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన డ్రైవింగ్ చేయగల రహదారిగా రికార్డు సృష్టించింది.పాన్-అమెరికన్ హైవే ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా అంతటా ఒకదానికొకటి అనుసంధానించబడిన రహదారుల ద్వారా విస్తరించి ఉంది. మరీ ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత సరళ రేఖలలో ఒకటిగా ఈ హైవే పరిగణించబడుతోంది. ఇది ఎలాంటి మలుపులు లేకుండా.. సరళ రేఖగా ఉంటుంది. ఈ రోడ్డు ఒక చివర నుంచి మరో చివరకు చేరుకోవాలంటే దాదాపు 60 రోజుల సమయం పడుతుంది. విరామం లేకుంగా రోజుకు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంది.Did you know about the Pan-American Highway? It stretches from Alaska to Argentina, covering over 19,000 miles and passing through multiple terrains, climates, and countries! Civil engineers across the Americas made it all possible.#CivilEngineering #Infrastructure #DidYouKnow pic.twitter.com/zDqErPyZ6R— CKL Engineers (@CKLEngineersLLC) April 10, 202514 దేశాలను కలుపుతూ..పాన్ అమెరికా రహదారి 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరాగ్వా, కోస్టా రికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, అర్జెంటీనాను కలుపుతుంది. ఇది కేవలం ఒక మార్గం మాత్రమే కాదు. ఈ రోడ్డుపై ప్రయాణ సమయంలో ఎన్నో వింతలు, ప్రకృతి దృశ్యాలు, సంస్కృతులు, చరిత్రలను తెలుసుకోవచ్చు. ఈ హైవే ఎడారులు, పర్వతాలు, వర్షారణ్యాలు, తీర ప్రాంతాలతో సహా వివిధ వాతావరణాలు కలిగిన ప్రాంతాల గుండా వెళ్తోంది. ఈ రోడ్డు నిర్మాణంపై 1920లో మొదటి సారి చర్చలు జరగ్గా.. 1937లో 14 దేశాలు పాన్-అమెరికన్ హైవే కన్వెన్షన్‌పై సంతకం చేశాయి. 1960లో రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యి వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రహదారిపై ట్రాఫిక్ లేకుండా వాహనాలు ప్రయాణం సాగిస్తున్నాయి. లాంగ్ రైడ్ వెళ్లాలనుకునే వారు ఈ మార్గంలో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. -
24 ఏళ్లకే కంపెనీ ..28కే రిటైర్మెంట్! ఏకంగా రూ. 106 కోట్లు..
ఆరుపదుల వయసుకి రిటైర్మెంట్ తీసుకుంటారు. ఇది సహజం. కానీ రెండు పదుల వయసుకే అంటే..జస్ట్ 28 ఏళ్లకే రిటైర్ అవ్వడం గురించి విన్నారా..!. పైగా పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దే పనిలో గడుపుతున్నాడట. అంతలా చకచక కెరీర్లో సెటిల్ అయిపోయి..పిల్లలు పెంచే సమయానికే హాయిగా వారితో గడిపేలా ప్లాన్ చేసుకున్నాడు ఈ యూఎస్ వ్యక్తి. అతడి స్టోరీ వింటే..ఇది కదా పక్కా ప్లానింగ్ లైఫ్ అంటే అనిపిస్తుంది.అతడే యూఎస్‌కి చెందిన నథానెల్ ఫారెల్లీ. ఈతరం జెన్ జెడ్ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 29 ఏళ్ల నథానెల్ ఫారెల్లీ 21 ఏళ్లకే రిజిస్టర్డ్ నర్సు అయ్యాడు. సరిగ్గా అప్పుడే కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న సమయం. దాన్నే తన అభ్యున్నతికి మార్గంగా మలిచాడు. ఆ సమయంలో ఫారెల్లీ రివిటలైజ్ అనే కంపెనీ ప్రారంభించి..దాంతో ఈ హోమ్ ఇన్ఫ్యూషన్ థెరపీ సేవలు అందించాడు. అందులోనూ మహమ్మారి సమయంలో చికిత్స పొందడం రోగులకు చాలా కష్టంగా ఉండేది. అందుకని వారికి తన కంపెనీ సాయంతో ఇంటి వద్దే యాంటీబయాటిక్ మందులతో చికిత్స పొందేలా నర్సులను సరఫరా చేసేవాడు. ఆ హోమ్ ఇన్ఫ్యూషన్ థెరపీ వ్యాపారంతో కొద్దికాలంలోనే కోట్లు గడించాడు. దాంతో అలా జస్ట్ నాలుగేళ్లకే తన వ్యాపారాన్ని $12.5 మిలియన్లకు (రూ. 106 కోట్లు) విక్రయించి బిందాస్‌గా సెటిల్ అయిపోయాడు. అంటే..నిండా ముప్పై ఏళ్లు నిండక ముందు పూర్తి ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందాడు. అలా ఫారెల్లీ 28 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుని.. ఆ వచ్చిన సొమ్ముపై వచ్చే వడ్డీతో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రస్తుతం ఫారెల్లీ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఫ్లోరిడాలోని పెన్సకోలాలో నివసిస్తున్నాడు. అంతేగాదు తన పిల్లలకు సాకర్ క్రీడలో శిక్షణ ఇవ్వడం, రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించడం తదితర పనులు చేస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నానని, కానీ భవిష్యత్తులో మరో కంపెనీ పెట్టే అవకాశం ఉందని చెబుతున్నాడు ఫారెల్లీ. (చదవండి: యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్) -
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల జాబితాను గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్(GFP Index) విడుదల చేసింది. ఇందులో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. భారత్ నాల్గో స్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసేంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్‌సైనిక బలంతో పాటు నేటి ప్రపంచ రక్షణ వాతావరణాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మకత, సాంకేతిక, భౌగోళిక రాజకీయ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే యూకే, దక్షిణకొరియా, ఫ్రాన్స్ తదితర దేశాలను వెనక్కి నెట్టిన భారత్.. నాల్గో స్థానాన్ని నిలబెట్టుకుంది. యూఎస్ఏ (పవర్ ఇండెక్స్ 0.0744)2,127,500 మంది సైనిక శక్తితో యూఎస్ఏ అగ్రస్థానంలో నిలిచింది. 13, 043 విమానాలు, 4, 640 యుద్ధ ట్యాంకుర్లతో కూడిన బలీయమైన సైనిక శక్తితో అమెరికా ఉంది. దాంతోపాటు అతిపెద్ద రక్షణ బడ్జెట్ కూడా అమెరికా సొంతం. అత్యాధునిక సాంకేతికత, వైమానిక ఆధిపత్యం కూడా అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి.రష్యా (పవర్ ఇండెక్స్0.0788)అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా. అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. గత కొంతకాలంగా ఉక్రియెన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. చైనాతో వ్యూహాత్మక పొత్తులను కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది.చైనా (పవర్ ఇండెక్స్ 0.0788)పవర్ ఇండెక్స్ పాయింట్లలో రష్యాతో కలిసి పంచుకుంటున్న చైనా.. అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. చైనా సైనిక విస్తరణ, సాంకేతిక పురోగతి, ఆర్థిక శక్తి తదితర అంశాలు ప్రపంచ వేదికపై ఆ దేశ సైనిక పురోగతని చూపెడు\తోంది. 6,800 యుద్ధ ట్యాంకర్లతో అతిపెద్ద ట్యాంక్ ఫ్లీట్ కల్గిన దేశంగా చైనా ఉంది. చైనా 3,170,000 సైనిక సిబ్బందితో పాటు 3,309 యుద్ధ విమానాలను కల్గి ఉంది.భారత్ (పవర్ ఇండెక్స్ పాయింట్లు 0.1184)ప్రపంచంలోని అతిపెద్ద సాయుధ దళాలలో ఒకటిగా ఉన్న భారత్,.. నాల్గో స్థానంలో ఉంది. 5,137,550 మంది సైన్యం, 2,229 యుద్ధ విమానాలు, 4, 201 యుద్ధ ట్యాంకర్లతో భారత్ నాల్గో స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను, అణ్వాయుధాలను కల్గిన భారత్.. ఆసియా అంతటా వ్యూహాత్మకంగా తన ఉనికిని విస్తరిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దక్షిణకొరియా (పవర్ ఇండెక్స్ 0.1656)పవర్ ఇండెక్స్ జాబితాలో దక్షిణాకొరియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. 3,820,000 సైనిక సిబ్బంది, 1, 592 యుద్ధ విమానాలు, 2, 236 యుద్ధ ట్యాంకర్లు దక్షిణకొరియా సొంతం. అత్యంత అధునాతన టెక్నాలజీ కల్గిన రక్షణ రంగంలో దక్షిణకొరియాది ప్రత్యేక స్థానం. దాంతోపాటు అమెరికాతో సాన్నిహిత్య సంబంధాలు కూడా దక్షిణకొరియా సైనిక బలానికి మరింత దోహదం చేస్తోంది,. ప్రధానంగా సరిహద్దుల్లో ఉత్తరకొరియాతో ఉన్న వైరంలో భాగంగా ఉద్రిక్త పరిస్థితులను దక్షిణకొరియా ఎప్పటికప్పుడు చాకచక్యంగా తిప్పికొడుతోంది.యూకే (పవర్ ఇండెక్స్ 0.1785)పవర్ ఇండెక్స్ స్కోరులో యునైటెడ్ కింగ్ డమ్(యూకే) ఆరోస్థానంలో ఉంది. 1,108,860 మంది సైనిక సిబ్బందితో పాటు 631 ఎయిర్ క్రాఫ్ట్ లు, 227 యుద్ధ ట్యాంకర్లు యూకే కల్గి ఉంది. పవర్ ఫుల్ నేవీ, శక్తివంతమైన న్యూక్లియర్ సామర్థ్యం యూకే సొంతం. నాటో సభ్యత్వం కల్గిన దేశాల్లో యూకే కీలక పాత్ర పోషిస్తోంది.ఫ్రాన్స్ (పవర్ ఇండెక్స్ 0.1878)అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో ఫ్రాన్స్ ది ఏడో స్థానం. 376,000 మంది సైనికి శక్తి, 976 ఎయిర్ క్రాఫ్ట్ లు, 215 యుద్ధ ట్యాంకర్లను ఫ్రాన్స్ కల్గి ఉంది. నాటోతో పాటు, యూరోపియేన్ భద్రత విభాగంలో ఫ్రాన్స్ ముఖ్య భూమిక పోషిస్తోంది. అధునాతన ఆయుధ శక్తిని ఫ్రాన్స్ కల్గి ఉంది. అధునాతమైన అణ్వాయుధాలను కల్గిన దేశంగా ఫ్రాన్స్ ఉంది.జపాన్ (పవర్ ఇండెక్స్ 0.1839)సైనిక శక్తిలో జపాన్ ఎనిమిదో స్థానంలో ఉంది. 328,150 సైనిక శక్తి, 1, 443 ఎయిర్ క్రాఫ్ట్ లు, 521 యుద్ధ ట్యాంకర్లను జపాన్ కల్గి ఉంది. మిలటరీ విభాగంలో సాంకేతికపరంగా అడ్వాన్స్ డ్ గా ఉన్న దేశం జపాన్. త్యున్నత సైనిక శిక్షణ కల్గిన దేశంగా జపాన్ కొనసాగుతోంది. ప్రధానంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో జపాన్ సైనిక శక్తి అత్యంత బలంగా ఉంది.టర్కీ (పవర్ ఇండెక్స్ 0.1902)టర్కీది తొమ్మిదో స్థానం. 883,900 సైనిక సిబ్బంది, 1,083 ఎయిర్ క్రాఫ్ట్స్, 2,238 యుద్ధ ట్యాంకర్లు ఫ్రాన్స్ కల్గి ఉంది. మిడిల్ ఈస్ట్, యూరోపియన్ వ్యవహారాల్లో టర్కీ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోంది. ఎయిర్ ఫోర్స్, మిలటరీ విభాగాల్లో టర్కీ అత్యంత బలంగా ఉంది.ఇటలీ (పవర్ ఇండెక్స్ 0.2164)అత్యంత బలమైన సైనిక శక్తి కల్గిన దేశాల టాప్ 10 జాబితాలో ఇటలీది పదో స్థానం. 280,000 సైనిక శక్తిని ఇటలీ కల్గి ఉంది. 729 ఎయిర్ క్రాఫ్ట్ లు, 200 యుద్ధ ట్యాంక్లరు ఇటలీ కల్గి ఉంది. నాటోలో ఇటలీ ముఖ్య భూమికను పోషిస్తూ ఉంది.పవర్ ఇండెక్స్ లెక్క ఇలా..పవర్ ఇండెక్స్ స్కోరును లెక్కించేటప్పుడు అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఒక దేశానికి అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ఫోర్స్ ఉండి, అదే దేశానికి నేవీ బలం తక్కువగా ఉంటే, ఆ దేశం మొత్తం స్కోరులో వెనకంజలో ఉంటుంది. ఇక్కడ సైనిక బలాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా లెక్కించి ఒక అంచనా వేస్తారు. పవర్ ఇండెక్స్ స్కోరు ఎంత తక్కువగా ఉంటే, ఆ దేశం అంత బలంగా ఉన్నట్లు అర్ధం. . -
Sperm Race ఇది రొటీన్ రేస్ కాదు! సమ్‌థింగ్ స్పెషల్!
ఈ నెల 25న ప్రపంచంలోనే తొలిసారిగా లాస్ ఏంజిల్స్‌లో ‘లైవ్ స్పెర్మ్ రేస్’ జరగనుంది. జీవనశైలిలో మార్పులు... మొదలైన వాటివల్ల పురుషుల్లో పెరుగుతున్న సంతాన లేమి అనే క్లిష్టమైన సమస్యపై ఈ రేస్ దృష్టి సారిస్తుంది.‘ఎవరి స్పెర్మ్ హెల్తీయెస్ట్? ఫాస్టెస్ట్?’ అనే దానిపై జరిగేపోటీ ఇది. పోటీ ఎలా ఉంటుంది? అనే విషయానికి వస్తే... నిజమైన స్పెర్మ్‌తో కూడిన రేస్ ఇది. మానవ ప్రత్యుత్పత్తి మార్గాన్ని అనుసరించేలా మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్ రూపొందించారు. సింక్రనైజ్డ్ స్టార్టర్లతో రసాయన సంకేతాలు, ఫ్లూయిడ్ డైనమిక్స్ కోర్సు ద్వారా స్పెర్మ్ నమూనాలు ఈత కొట్టేలా చేస్తారు. ఈపోటీని యాక్షన్ హై–రిజల్యూషన్ కెమెరాతో రికార్డ్ చేస్తారు. విజేతను నిర్ణయించడానికి మూడు రేసులు జరుగుతాయి. ప్లే–బై–ప్లే కామెంటరీ అలరిస్తుంది.ఇన్స్టంట్ రీప్లే, కామెంటరీ, గణంకాలు, లీడర్ బోర్డ్‌లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లను అభిమానులు ఆస్వాదించేలా చేస్తుంది.ఈ రేస్‌లో బెట్టింగ్ కూడా ఉంటుంది!అత్యంత వేగంగా ఈత కొట్టే స్పెర్మ్‌పై అభిమానులు పందెం కట్టవచ్చు. ‘ఏ లాఫ్ విత్ ఏ డీపర్ పర్పస్’ నినాదంతో ఈ రేస్‌కు శ్రీకారం చుట్టారు. యువ మిలియనీర్ల బృందం ఈ విచిత్ర పోటీని నిర్వహిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే హెల్త్, టెక్, ఎంటర్టైన్మెంట్లను మిళితం చేసి రూపొందించిన రేస్ ఇది. ‘ఎవరూ టచ్ చేయని అంశాన్ని తీసుకొని ఆసక్తికరంగా ఈ రేస్‌ను రూపొందించాం. ఇది పురుషుల సంతానలేమి గురించి ప్రజలు నిస్సంకోచంగా మాట్లాడుకునేలా చేస్తుంది’ అంటున్నారు పోటీ నిర్వాహకులు.రేస్ ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ‘ఎక్స్’లో ‘ది స్పెర్మ్ ట్రాక్: నాట్ యువర్ యావరేజ్ రేస్’ టైటిల్‌తో ట్రైలర్ విడుదల చేశారు. ఈ రేస్‌లో పాల్గొనే టీమ్‌లను కూడా పరిచయం చేశారు. రేస్ ఉద్దేశం గురించి ‘స్పెర్మ్ రేసింగ్ మేనిఫెస్టో’ కూడా విడుదల చేశారు. ఈ మైక్రోస్కోపిక్ బ్యాటిల్లో వీర్య విజేత ఎవరో వేచి చూద్దాం.ఇది చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్ -
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక, ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ముష్కరులకు అండగా ఉన్న పాకిస్థాన్‌ను భారత్ గట్టిగా హెచ్చరించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌పై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ తాజాగా స్పందించారు. ఈ క్రమంలో మైఖేల్ రూబిన్.. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఆల్‌ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు. బిన్ లాడెన్ అప్పుడు కలుగులో దాక్కుంటే ఇప్పుడు మునీర్ ప్యాలెస్‌లో జీవిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో అమెరికా పాక్‌ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా, మునీర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని సూచించారు.ఇదే సమయంలో.. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశానికి వెళ్ళినప్పుడు ఉగ్ర దాడి జరిగినట్లే, ఇప్పుడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన సందర్భంగా పాకిస్తాన్ దాడి చేసినట్టు కనిపిస్తోంది అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. ఇప్పటి పహల్గాం ఉగ్ర దాడికి.. 2000 సంవత్సరంలో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి పోలికలు కనిపిస్తున్నాయి. దేశంలో విదేశీ అగ్ర నేతల పర్యటనలు సాగుతున్న వేళే ఇవి చోటుచేసుకున్నాయి. దీనికి తోడు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే దాడి జరగడం గమనార్హం. అసీం మునీర్‌కు.. భారత్‌పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడన్న పేరుంది. ఆయన ప్రకటనలూ ఉగ్ర దాడికి పురిగొల్పేలానే ఉంటాయి. దీనికి తోడు జమ్ము కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకుంటున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండటం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో పహల్గాం దాడి చోటుచేసుకోవడం గమనార్హం.పుల్వామా దాడి వేళ మునీరే..2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నారు. ఆ దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ కావడంతో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకను ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇక, ప్రస్తుత పహల్గాం ఘటనకు సంబంధించిన కూడా ఆయనకు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురిగొల్పిందనే వాదనలను బలపరిచే ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. ‘మన ఉద్దేశం స్పష్టం. కశ్మీర్ గతంలోనూ మన జీవనాడిలా ఉండేది. భవిష్యత్తులోనూ ఉంటుంది. దానిని మనం ఎప్పటికీ మరిచిపోలేం. మన కశ్మీరీ సోదరుల పోరాటంలో.. వారిని ఒంటరిగా వదిలేయం. మీరు మీ పిల్లలకు పాకిస్థాన్ కథ చెప్పండి. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారు. మన మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవి. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనవి రెండు దేశాలు’ అని మునీర్ వ్యాఖ్యానించారు. -
పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా ఖండించారు. పహల్గాం ఉగ్రదాడి గురించి జేడీ వాన్స్ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఇరువురి నేతల మధ్య జరిగిన సంభాషణను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ వెల్లడించారు.జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఈ క్రూరమైన ఉగ్రవాద దాడిని అమెరికా ఖండిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఉగ్రవాదంపై చేసే పోరాటంలో భారత్‌కు అండగా అమెరికా ఉంటుందని అన్నారు. అలాగే, ఉగ్రవాదం విషయంలో భారత్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. Usha and I extend our condolences to the victims of the devastating terrorist attack in Pahalgam, India. Over the past few days, we have been overcome with the beauty of this country and its people. Our thoughts and prayers are with them as they mourn this horrific attack. https://t.co/cUAyMXje5A— JD Vance (@JDVance) April 22, 2025జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రపంచం దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి. కాగా, జేడీ వాన్స్ నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా బుధవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. జేడీ వాన్స్ దంపతుల్ని సాధరంగా ఆహ్వానించారు. -
వాణిజ్య ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధం
జైపూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఆయనను చూస్తే అసూయగా ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని కొందరు విమర్శిస్తున్నప్పటికీ ఆయన పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తున్నాయే తప్ప ఎక్కడా తగ్గడం లేదన్నారు. అంతర్జాతీయంగా మోదీకి లభిస్తున్న అప్రూవల్ రేటింగ్స్ తనకు అసూయ కలిగిస్తున్నాయని, ఈ విషయం సోమవారం నేరుగా మోదీకే చెప్పానని వెల్లడించారు.‘మోదీ స్పెషల్ పర్సన్’ అని ప్రశంసించారు. మంగళవారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఓ సదస్సులో వాన్స్ ప్రసంగించారు. ప్రధానంగా ఇండియా–అమెరికా సంబంధాలపై మాట్లాడారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం విషయంలో తుది ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధమైందని ప్రకటించారు. రోడ్‌మ్యాప్‌పై విధివిధానాలను ఇరు దేశాలు అధికారికంగా ఖరారు చేశాయని వెల్లడించారు. భారతదేశ ఉత్పత్తులపై విధించిన 26 శాతం ప్రతీకార సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజులపాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధం కావడం డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీల విజన్ వాస్తవరూపం దాల్చే విషయంలో ఒక కీలకమైన ముందడుగు అని వాన్స్ అభివర్ణించారు. భారత్–అమెరికా సంయుక్తంగా ప్రగతి సాధించాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ ‘కొరుకుడుపడని కఠినమైన సంధానకర్త’ అని అభివర్ణించారు. ఆయనతో బేరం తేల్చడం అంత సులభం కాదన్నారు. అందుకే ఆమెరికా ఆయనను గౌరవిస్తోందని వ్యాఖ్యానించారు. మిత్రుడిగా వచ్చా.. తాను ఇండియాకు నీతిబోధలు చేయడానికి రాలేదని, ఒక భాగస్వామిగా, మిత్రుడిగానే వచ్చానని జె.డి.వాన్స్ అన్నారు. ఏ పని ఎలా చేయాలో ఇండియాకు నేర్పే ఉద్దేశం తనకు లేదన్నారు. గతంలో అమెరికా ప్రభుత్వాలు భారత్‌కు నీతి పాఠాలు బోధించేందుకు ప్రయత్నించేవని, భారత్‌ను చౌకగా కార్మిక శక్తి లభించే దేశంగానే చూసేవారని చెప్పారు . ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులను మరింత అధికంగా కొనుగోలు చేయాలని భారత్‌కు విజ్ఞప్తిచేశారు.అమెరికా ఇంధన, రక్షణ ఉత్పత్తులు, పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేయాలన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. టెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి వేర్వేరు కీలక రంగాల్లో భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’పై ఇరుదేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.ఇవాన్ ఇండియాలోనే ఉంటానన్నాడు ప్రధాని మోదీ తమకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారని జె.డి.వాన్స్ ఆనందం వ్యక్తంచేశారు. మోదీ ప్రేమానురాగాలు తమ కుటుంబాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా తమ ముగ్గురు పిల్లలకు మోదీ ఎంతో ఆత్మీయులయ్యారని తెలిపారు. మోదీ ఇచ్చిన విందు తన కుమారుడు ఇవాన్‌కు ఎంతోగానో నచ్చిందని, ఇండియాలోనే ఉండిపోవాలని కోరుకుంటున్నట్లు ఇవాన్ తనతో చెప్పాడని అన్నారు. తన పిల్లలకు డొనాల్డ్ ట్రంప్‌తో ఏర్పడిన అనుబంధం ఇప్పుడు మోదీతోనూ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఇండియాలో తన కంటే తన భార్య ఉషా చిలుకూరికే గొప్ప ఆదరణ లభిస్తోందని వాన్స్ చమత్కరించారు.అంబర్ కోట సందర్శనవాన్స్ తన భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలతో కలిసి మంగళవారం ఉదయం రాజస్తాన్‌లోని చరిత్రాత్మక అంబర్ కోటను సందర్శించారు. వాన్స్ కుటుంబానికి రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రి దియా కుమారీతోపాటు అధికారులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. చక్కగా అలంకరించిన ఏనుగులు, తీర్చిదిద్దిన రంగవల్లులు, జానపద నృత్యాలతో అమెరికా ఉపాధ్యక్షుడికి ఆత్నియ స్వాగతం లభించింది. చందా, మాలా అనే రెండు ఏనుగులు తొండాలు ఎత్తి వాన్స్ కుటుంబానికి స్వాగతం పలికాయి. రాజస్తానీ సంప్రదాయ జానపద నృత్యాలు అలరించాయి. -
ఊరిస్తున్న వాన్స్ టూర్
అమెరికా విధించబోయే సుంకాల గురించి మనతో సహా ప్రపంచమంతా బెంబేలు పడుతున్న వేళ, అక్కడ చదివే మన విద్యార్థులు, వృత్తిగత నిపుణులు వీసా సమస్యలతో సతమతమవుతున్న వేళ నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటన కోసం ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా సోమవారం మన గడ్డపై అడుగుపెట్టారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఎంతో ఇష్టుడైన నేత కనుక ఆయన ద్వారా కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయన్న విశ్వాసం మన దేశానికున్నట్టుంది.అందుకే కావొచ్చు... ప్రోటోకాల్స్ పక్కనబెట్టి మరీ ఆయనకు ఘనస్వాగతమిచ్చారు. మారిన పరిస్థితుల రీత్యా అమెరికాతో కొత్తగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మన దేశానికి తప్పనిసరి. ఇప్పటికే ఆ విషయంలో ఇరు దేశాల మధ్యా సంప్రదింపులు సాగుతున్నాయి. ఒప్పందాలకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు ఖరారయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన తర్వాత వాన్స్ ప్రకటించారు. దాదాపు 60 దేశాలపై సుంకాలను భారీ యెత్తున పెంచుతూ ఈ నెల 2 నుంచి అమల్లోకొస్తాయని ప్రకటించిన ట్రంప్, ఆ తర్వాత 90 రోజుల పాటు నిలిపివేశారు. కేవలం చైనాపై మాత్రమే అవి కొనసాగుతున్నాయి. పాత ఒప్పందాల స్థానంలో కొత్తవి కుదుర్చుకోవటం, తమకు మరింత మేలు కలిగేలా చేసుకోవటం ట్రంప్ ధ్యేయం. అందుకోసమే మూడు నెలల కొత్త గడువు విధించారు.నాలుగేళ్ల క్రితం రిపబ్లికన్ పార్టీకీ, ప్రత్యేకించి ట్రంప్‌కూ తీవ్ర వ్యతిరేకి అయిన జేడీ వాన్స్ ట్రంప్ తొలి దశ పాలనలోనే ఆయనకు మద్దతుదారుగా మారారు. గడచిన వంద రోజులుగా ఉపాధ్యక్షుడిగా ఆయన వ్యవహార శైలి గమనిస్తే రిపబ్లికన్ పార్టీలో ఆయన మున్ముందు కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయని సులభంగానే చెప్పొచ్చు. ఆ మితవాద పక్షానికి ఆయన సరికొత్త స్వరంగా మారారు. ట్రంప్‌ను ఏయే అంశాల్లో ఇంతవరకూ వాన్స్ ఒప్పించారన్నది ఎవరికీ తెలి యదుగానీ... ఆయన విజన్‌ను తు.చ. తప్పకుండా పాటిస్తున్న నేతగా ఇప్పటికే నిరూపించు కున్నారు. మ్యూనిక్ భద్రతా సదస్సు సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మారిన అమెరికా వైఖరిని నిక్కచ్చిగా చెప్పటంలో వాన్స్ విజయం సాధించారు. యూరప్ దేశాలు నొచ్చుకున్నా ఆయన ఖాతరు చేయలేదు. బ్రిటన్ విధానాలను దుయ్యబట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని మందలిస్తున్న ట్రంప్‌తో గొంతు కలిపారు. గ్రీన్‌ల్యాండ్‌ను కొనితీరాలన్న ట్రంప్ అభిమతానికి అనుగుణంగా చెప్పాపెట్టకుండా కుటుంబ సమేతంగా వాన్స్ అక్కడికెళ్లారు. ప్రస్తుతం రక్షణ, విదేశీ వ్యవహారాలు డెన్మార్క్‌కు అప్పగించటం మినహా ఇతరత్రా స్వయం ప్రతిపత్తిని అనుభవిస్తున్న గ్రీన్‌ల్యాండ్‌కుగానీ, డెన్మార్క్‌కుగానీ ఈ ప్రతిపాదన ఇష్టం లేదు. ట్రంప్ మాదిరే స్వేచ్ఛా వాణిజ్యాన్ని, ఉదారవాద ఆర్థికవిధానాలనూ, భారీ వలసలనూ వాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వాన్స్ అంటే వల్లమాలిన అభిమానం ఏర్పడటానికి ట్రంప్‌కు చాలా కారణాలున్నాయి. వాన్స్ లోని రచనా శక్తి అందులో ఒకటి. ఒకప్పుడు తనను ‘అమెరికన్ హిట్లర్’ అన్నా దాన్నంతటినీ మరిచి పోయే స్థాయిలో వాన్స్ ఆత్మకథాత్మక నవల ‘హిల్‌బిల్లీ ఎలిజీ’ ట్రంప్‌ను కట్టిపడేసింది. 2022లో ఆయనను ఒహాయో సెనెటర్‌ను చేయటమేగాక, అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిర్ణయించటానికి కూడా ఆ నవల ఉపకరించింది. శ్వేతజాతి అమెరికన్ జనాన్ని కూడగట్టడంలో, డెమాక్రాట్ల ఏలుబడిలో జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టడంలో ట్రంప్‌కు వాన్స్ నవల తోడ్పడిందని చెప్పాలి. పర్వత ప్రాంతాలను ఆనుకుని వుండే మారుమూల ప్రాంతాల్లో అక్షరాస్యతకూ, అభివృద్ధికీ దూరంగా వుండే శ్వేతజాతి అట్టడుగు వర్గాల జీవితాన్ని ఆ నవలలో వాన్స్ చిత్రీకరించారు. అరకొర పనులతో, అర్ధాకలి బతుకులతో వెళ్లబుచ్చే జనాలను నేరుగా చూసిన ఆ ప్రాంతవాసిగా వాన్స్ దాన్ని ప్రభావవంతంగా చెప్పగలిగారు. ఆ అట్టడుగు జనం గురించి ట్రంప్ ఎంత మాట్లాడినా నవలలో వాన్స్ చిత్రించిన జీవితానుభవం ట్రంప్‌కు లేదు. అది తెలుసుకున్నాక ఆయన మరింతగా ఆ వర్గంలోకి చొచ్చుకుపోగలిగారు. అందుకే కావొచ్చు... ట్రంప్‌కు వాన్స్ అంటే ప్రత్యేకాభిమానం ఏర్పడింది. అలాగని ఆయనను తన వారసుడిగా ప్రకటించదల్చుకోలేదు. మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయటాన్ని రాజ్యాంగం నిరాకరిస్తున్నా, దాన్ని ఎలాగోలా మార్చి మరోసారి ఆ పీఠాన్ని అధిష్ఠించాలని ట్రంప్ కలలుగంటున్నారు. అదెంతవరకూ కుదురుతుందో భవిష్యత్తే తేల్చాలి. అసాధ్యమైతే మాత్రం ట్రంప్ మొదటి ఎంపిక వాన్సే కావొచ్చు.గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల వాణిజ్యం విలువ 12,920 కోట్ల డాలర్లు. మన నుంచి అమెరికా నిరుడు 8,740 కోట్ల డాలర్ల సరుకును దిగుమతి చేసుకుంది. మూడు నెలల తర్వాత మనపై 26 శాతం సుంకాలు విధిస్తే అక్కడి మార్కెట్లో మన సరుకుల ధర పెరిగి డిమాండ్ పడి పోవచ్చు. అందుకే ద్వైపాక్షిక చర్చలు అత్యవసరమయ్యాయి. తమను నష్టపరిచే విధంగా అమె రికాతో ఎవరైనా ఒప్పందం చేసుకుంటే ప్రతిచర్యలు తీసుకోవాల్సి వస్తుందని చైనా హెచ్చరించగా... ఆ దేశంతో పరిమిత వాణిజ్యమే నెరపాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ చెబుతున్నారు. ఇది ముదిరితే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారొచ్చు. వర్తమాన అంతర్జాతీయ పరిస్థితుల్లో దౌత్యం తాడు మీది నడక లాంటిది. దాన్ని విజయవంతంగా పరిపూర్తి చేయటం అంత సులభమేం కాదు.గట్టిగా మాట్లాడి, అనుకున్నది సాధించటంలో మోదీకి మరెవరూ సాటిరారని వాన్స్ కితాబిచ్చారు. కుదరబోయే ఒప్పందాలు దాన్ని నిరూపిస్తే అంతకన్నా కావాల్సిందేముంది? -
సంక్షోభంలో విశ్వవిద్యాలయాలు
నేడు ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు సంక్షోభంలో వున్నాయి. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన హార్వర్డ్, కొలంబియా యూనివర్సిటీలు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధిపత్య, సామ్రాజ్య వాద చర్యలకు గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొలంబియా యూనివర్సిటీలో అంబేడ్కర్ ఎంతో స్వేచ్ఛను అనుభవించిన విషయం ఆయన జీవన గాథల్లో వ్యక్తం అవుతుంది. అమెరికాలోని హార్వర్డ్, కొలంబియా విశ్వవిద్యాలయాల్లో విద్యతో పాటు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసినట్లు మనకు చరిత్ర చెబుతున్న సత్యం. ఇక్కడ ప్రపంచంలోని ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు, సాంకేతిక నిపుణులు తయా రయ్యారు. అనేక దేశాల్లో అత్యున్నతంగా చదువుకున్న మేధావులు పెక్కుమంది ఇక్కడ తమ జ్ఞానానికి పదును పెట్టుకున్నారు. ట్రంప్ వర్సెస్ హార్వర్డ్ట్రంప్ ఆదేశాలను హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు అలెన్ ఎం. గార్బర్ ధిక్కరించడం పట్ల సామాజిక, రాజకీయ మేధావి వర్గం సానుకూలంగా స్పందించింది. ‘‘హార్వర్డ్ విశ్వవిద్యాలయం తన స్వాతంత్య్రాన్ని ప్రభుత్వాధీనం చేయబోదు. తన రాజ్యాంగ హక్కు లను వదులుకోబోదు. ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే విశ్వవిద్యాల యాలు ఏమి బోధించాలి, ఏ విద్యార్థులను చేర్చుకోవాలి. ఏ సిబ్బందిని నియమించుకోవాలి, ఏ పరిశోధనలు జరపాలి అనే విషయా లను ఆదేశించజాలదు’’ అని గార్బర్ వ్యాఖ్యానించారు. విశ్వవిద్యా లయ వ్యవహారాల నిర్వహణలో పాలకుల జోక్యానికి ప్రతిస్పందిస్తూ ఏ భారతీయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్ ఇంత నిక్కచ్చిగా మాట్లాడి ఉంటారు? ఈ ధరిత్రిపై తన కంటే శక్తిమంతుడు మరొకరు లేరని విశ్వసిస్తున్న ట్రంప్ ఆదేశాలను గార్బర్ ధిక్కరించారు.అందుకు ఆగ్రహించిన ట్రంప్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధుల విడుదలను నిలిపివేశారు. అయినప్పటికీ శ్వేత సౌధ ఆదేశాలను పాటించేందుకు హార్వర్డ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. గత నెలలో మరో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం కొలంబియాకు కూడా 400 మిలియన్ డాలర్లను మంజూరు చేసేందుకు ట్రంప్ నిరాకరించారు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆయన షరతులకు కొలంబియా సమ్మతించింది. నిజానికి విశ్వవిద్యాలయాల అధిప తులు సామ్రాజ్యాధిపతుల కంటే గొప్పవారు. వారు ఎంతో జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంటేనే ప్రపంచం నడుస్తుంది. అమెరికా నేడు అనేక విషయాల్లో ప్రపంచంలో ముందు ఉందంటే అందులో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో ఉంది. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా స్వామ్యాన్ని ప్రవచించిన, స్టాలిన్ నియంతృత్వాన్ని ఎదిరించి ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని ప్రవచించిన జాన్ డ్యూయీ వంటి ఎందరో మేధావులు ఆవిర్భవించిన కొలంబియా విశ్వవిద్యాలయం నేడు ఆంక్షలను ఎదుర్కోవడం బాధాకరమైన విషయం. ‘‘ప్రజాస్వామికం అనే భావాన్నీ, ప్రజాస్వామికం అర్థాన్నీ మనం ఎప్పటికప్పుడు కొత్తగా తరచి చూసుకుంటూ వుండాలి. రాజకీయ, ఆర్థిక, సాంఘిక సంస్థలను కూడా దీనికి అనుకూలంగా మార్చుకోవాలి. ప్రజాస్వా మికం నిత్యనూతనం అయి, ప్రజల అవసరాలతోపాటు మారుతూ వచ్చినపుడే అది ప్రజల జీవితాన్ని ప్రతిబింబించేదీ, ప్రజలకు సహాయం చెయ్యగలిగేదీ అవుతుంది. ఈనాటి మార్పులనూ, రాబోయే మార్పులనూ తెలుసుకోటానికి అది ముందుకు నడవాలి. అది కదలకుండా నిలబడటం ఆత్మహత్య చేసుకోవటమే అవుతుంది’’ అని హెచ్చరించారు జాన్ డ్యూయీ. ఆయన విద్యకు ప్రధానమైన పాత్రను ఇచ్చారు. విద్య అంటే జ్ఞాన జ్యోతి, విద్య అంటే విప్లవ సంకేతం, విద్య అంటే మానవాభ్యుదయానికి మార్గం. భారతదేశ పరిస్థితిమన దేశంలో కూడా యూనివర్సిటీల మీద పెత్తనం అప్రజాస్వా మికంగా, లౌకిక భావజాలానికి భిన్నంగానే జరుగుతోంది. విశ్వ విద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపాన్నే మార్చే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. 2023 నాటికి మనకు 1,074 విశ్వవిద్యాల యాలున్నాయి. ఇందులో 128 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. ఇక్కడ ఒకప్పుడు లౌకికవాద, ప్రజాస్వామ్య, ఆర్థిక, సామ్యవాద, సామాజిక పరిణామవాద భావజాలం అభివృద్ధి చెందింది. జీవశాస్త్రం, పదార్థ శాస్త్రం, రసాయన శాస్త్రంలో ప్రపంచానికే జ్ఞానసంపత్తిని అందించ గల్గిన పరిశోధనలు వచ్చాయి. దళిత బహుజన విద్యార్థులకు మెరు గైన స్కాలర్షిప్లు లభించాయి. దళిత బహుజన మైనారిటీల నుండి కూడా ఎంతో నూత్న జ్ఞానం ఆవిర్భవించింది. జేఎన్ యూ, ఢిల్లీ విశ్వ విద్యాలయం, జామియా మిలియా, ఏఎవ్‌ుయూ, జాదవపూర్, జమ్ము సెంట్రల్ వర్సిటీల్లో (వాటి అధ్యాపకులు, విద్యార్థులు) ఎంతో విలువైన పరిశోధనలు చేశారు. జేఎన్‌యూలో ఇమ్మానుయేల్ కాంట్, హెగెల్, కారల్ మార్క్స్ గురించిన విస్తృతమైన అధ్యయనాలు జరిగాయి. సబాల్ట్రన్ స్టడీస్‌లో భాగంగా హిస్టరీలో అత్యంత విలువైన విషయాలను ముందుకు తెచ్చిన రొమిల్లా థాపర్ జేఎన్‌యూలో చరిత్ర బోధకురాలని మరువరాదు. కానీ నేడు దేశంలో మత గ్రంథాల్లోని పురాణ కథలను పాఠ్య గ్రంథాలుగా తెచ్చే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. భారతీయ విశ్వ విద్యాలయాలకు ప్రభుత్వ ప్రోత్సాహం చాలా తక్కువగా వుంది. ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని విమర్శిస్తున్న భారత మేధావులు కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థించడం ఆశ్చర్యాన్ని గొలుపుతోంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా విద్యా వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. భారతదేశంలో ఎక్కువ ధనం విద్యకే ఖర్చవుతోంది. అయినా ఉపాధి రంగాలు లేక ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతు న్నారు. ఇప్పుడు భారత పాలకులకు, రాష్ట్రాలను పాలించే ముఖ్య మంత్రులకు ఈ దేశంలో ఉన్న మానవ వనరులను, మానవ శక్తిని ఎలా సమన్వయించాలో తెలియక ఇతర దేశాలకు ఉపాధి రంగాల కోసం విద్యార్థులను వెళ్ళమని పురమాయిస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్ళడం తప్పు కాదు. దేశంలో ఉన్న విద్యను, విద్యా మూలాలను దెబ్బతీసుకోవడం వలన వనరుల మీద ఆసక్తి తగ్గిపోతుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. విద్యకు హద్దులా?ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు పాలకవర్గ సామ్రాజ్య వాద, పెట్టుబడిదారీ, మతోన్మాద భావజాలాల ఒత్తిడిలో వున్నాయి. సరైన గ్రాంట్స్, స్కాలర్షిప్లు లేక విలవిల్లాడుతున్నాయి. తెలంగాణలో సెంట్రల్ విశ్వవిద్యాలయ భూములను ఆక్రమిస్తున్నారు. విశ్వవిద్యాలయాలు కులాధిపత్య భావాల మధ్య నలుగుతున్నాయి. భారతదేశంలో జీవించలేక, ఉపాధి లేక, స్వేచ్ఛ లేక ఇతర దేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో అమె రికా విధిస్తున్న ఆంక్షలు గొడ్డలిపెట్టుగా ఉన్నాయి.ఆసియా దేశాలు తమ స్వీయ విద్యోత్పత్తి, జ్ఞానోత్పత్తి విషయంలో స్వయంకృషికి పూనుకోవలసిన అవసరం వుంది. విద్య మానవుని వికాసానికి సోపానం. ఉన్నత విద్య ప్రపంచ జీవన వ్యవస్థ లను పునరుజ్జీవింపజేయగల శక్తిని కలిగి వుంటుంది. హార్వర్డ్, కొలంబియా, భారతీయ విశ్వవిద్యాలయాల పునరుజ్జీవన ఉద్యమం అత్య వసరం. ప్రపంచంలో విశ్వ మానవులైన వారందరూ విద్య ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే అయ్యారు. సామ్రాజ్యానికి ఎల్లలుంటాయి. పాలనకు హద్దులు వుంటాయి. కానీ విద్యకు హద్దులుండవు. విద్య గురించి అంబేడ్కర్ మాట్లాడుతూ, ‘‘ఏ విద్య అయితే సమర్థతను సమున్నతంగా పెంచలేదో, సమానత్వాన్ని పెంపొందించుకోవడానికి బాధ్యత వహించదో, నీతికి భూమికగా నిలువదో అది విద్యకాదు. విద్య అనేది మానవ సంక్షేమానికి రక్షణగా, శక్తిమంతంగా, బహుళ ప్రయోజనకారిగా సమతానురాగాల మూలస్థానంగా ఉండాల’’న్నారు. విద్యావంతమైన జాతి దానంతటదే అభివృద్ధిలోకి వస్తుంది. అంబే డ్కర్ ఆలోచనలే ప్రపంచ విశ్వవిద్యాలయాల వికాసానికి మార్గం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
నష్టం కలిగిస్తే ప్రతీకారం తప్పదు
బీజింగ్: టారిఫ్‌ల నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా హెచ్చరికలు చేసింది. ఆ ఒప్పందాలతో తమకు నష్టం వాటిల్లే పక్షంలో ప్రతీకార చర్యలు తప్పవని ఆయా దేశాలకు తేల్చి చెప్పింది. ఇటువంటి ఒప్పందాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల నుంచి మినహాయించినందుకు ప్రతిఫలంగా చైనాతో వాణిజ్య సంబంధాలను పరిమితం చేయాలంటూ ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో వాణిజ్య శాఖ ప్రతినిధి ఈ ప్రకటన చేశారని అధికార జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. ‘ఒక వేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటుంది. తాత్కాలిక లాభం కోసం ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టాలని చూడటం పులి చర్మం కోసం దానితో బేరమాడటం వంటిదే. ఎదురుదెబ్బ తప్పదు’అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమతో లాభదాయకమైన వ్యాపార సంబంధాలు కలిగిన పలు దేశాలు సుంకాల మినహాయింపులు పొందడానికి అమెరికాతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోకుండా నిరోధించడానికే చైనా ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. జపాన్, ఈయూ, ఆసియాన్‌లోని పలు దేశాలు అమెరికాతోపాటు చైనాతోనూ విస్తృత వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. భారత్ కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయతి్నస్తోంది. చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 245 శాతం టారిఫ్‌లు ప్రకటించగా, చైనా సైతం అమెరికా వస్తువులపై 125 శాతం టారిఫ్‌లు విధించింది. ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడిన చైనా ఆర్థిక వ్యవస్థపై అమెరికాతో ఆసియాన్ లాంటి భాగస్వాములు కుదుర్చుకునే ఒప్పందాలతో ప్రతికూల ప్రభావం చూపుతుంది. -
అమెరికా సంబంధమా.. అసలే వద్దు!
‘అగ్రరాజ్యంలో ఉద్యోగం. డాలర్లలో జీతం, పెళ్లయితే ఇద్దరూ కలిసి బాగా సంపాదిస్తారు. కార్లు, బంగళాలు అన్నీ వచ్చేస్తాయి. పిల్లలు అమెరికా పౌరులవుతారు. సొంత ఊళ్లో ఏమున్నా లేకపోయినా అమెరికాలో ఉద్యోగం ఉంటే చాలదా? బంగారంలాంటి అమెరికా సంబంధాన్ని వదులుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉంటుందా?’.. నిన్నమొన్నటి వరకు తెలుగువాళ్లలో అమెరికా సంబంధాలపై ఉన్న అభిప్రాయమిది.ఇప్పుడు అమెరికా పేరెత్తితేనే బాబోయ్ మాకొద్దు ఆ సంబంధం అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు, తరువాత అన్నట్లుగా అమెరికా పెళ్లి సంబంధాల పరిస్థితి తయారైంది. ట్రంప్ ఆంక్షలకు ముందు కుదుర్చుకున్న పెళ్లి సంబంధాలు సైతం రద్దవుతున్నాయి. మధ్యతరగతి వర్గాల నుంచి సంపన్న కుటుంబాల వరకు ఇదే పరిస్థితి ఉంది. – సాక్షి, హైదరాబాద్ఈ అనిశ్చితి మరో రెండేళ్లు ఉండొచ్చు ఇది ఒకవిధంగా కష్టకాలమే. ఈ అనిశ్చితి మరో రెండేళ్లు ఉంటుందేమో అనిపిస్తోంది. ఏదో ఒక పరిణామం జరిగి ట్రంప్ మారితే తప్ప ఇప్పట్లో పరిస్థితులు మారుతాయని భావించలేము. – హిమబిందు, కాన్వోకేషన్స్స్కే్వర్, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ.అంతులేని వీసా కష్టాలుఆ అబ్బాయి షికాగోలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది క్రితం హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఒక అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. గత నెలలో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు భావించాయి. కానీ డిపెండెంట్ వీసాలపై అమెరికా ఆంక్షలు విధించటంతో ఇప్పుడు ఆ కుటుంబాలు పునరాలోచనలో పడ్డాయి. ‘చేసుకుంటే అమెరికా అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి’అని కలలుగన్న ఆ అమ్మాయి ఇప్పుడు ‘ఏ హైదరాబాదీ అయినా సరే పెళ్లికి రెడీ’అంటోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు కొంతకాలంగా అమెరికాలోని ఒహాయోలో ఉంటున్నారు. భర్తకు హెచ్–1 వీసా ఉంది.హెచ్–4 వీసాపై రెండేళ్ల క్రితం భార్యను తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఆమె రెండుమూడు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నట్లు ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుంది. ఇటీవల సొంత ఊరుకు వచ్చిన ఆ జంట తిరిగి అమెరికాకు వెళ్లారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్‌పోర్టులోనే ఆమెను నిలిపివేసి, ఉద్యోగాల గురించి ఆరా తీశారు. ఆమె పనిచేస్తున్నట్లు చెప్పిన కంపెనీల హెచ్ఆర్ విభాగాలు ఆ విషయాన్ని ధ్రువీకరించకపోవడంతో ఆమె వీసాను ఫ్రీజ్ చేశారు. గత్యంతరం లేక ఆమె భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దయిపోతున్న పరిస్థితి ఉంది. ట్రంప్ ఆంక్షలు ప్రారంభమైన తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రెండున్నర నెలల్లోనే సుమారు వేయి మంది తెలుగువాళ్లు వివిధ కారణాలతో వెనుదిరిగి విచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు కొత్తగా వీసాల దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ఆశలు వదిలేసుకున్నారు. ఈ అనిశ్చితి కారణంగా పెళ్లి సంబంధాలు రద్దుకావడం, వాయిదా వేసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అమీర్‌పేట్‌లో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న హిమబిందు తెలిపారు. అమెరికా సంబంధాల కోసం మ్యారేజ్ బ్యూరోల్లో దరఖాస్తు చేసుకున్నవాళ్లు సైతం విరమించుకుంటున్నట్లు చెప్పారు.అమెరికా పౌరులైతేనే భద్రత చాలాకాలంగా అమెరికాలో ఉండి గ్రీన్కార్డుదారులుగా స్థిరపడ్డవాళ్లకు కూడా ఇప్పుడు భద్రత లేకుండా పోయింది. సాధారణంగా ఏడేళ్లకు పైగా అక్కడ ఉంటే గ్రీన్‌కార్డు లభించే అవకాశం ఉంది. కానీ ఏడెనిమిదేళ్ల తరువాత వివిధ కారణాల వల్ల తిరిగి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడుతున్నవాళ్లు ఇప్పుడు తమ గ్రీన్‌కార్డులను వదులుకోవాల్సి వస్తోంది.సాధారణంగా గ్రీన్‌కార్డుదారులు తమ గుర్తింపును కొనసాగించాలంటే అమెరికాలోనే ఉంటున్నట్లు నమోదు కావాలి. అందుకో సం ప్రతి 6 నెలలకు ఒకసారి అమెరికా వెళ్లి వస్తారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటివారి గ్రీన్‌కార్డులను కూడా రద్దు చేస్తుండటంతో భద్రత లేకుండా పోయింది. అమెరికా పౌరసత్వం కలిగిన వాళ్లకు మాత్రమే ఇప్పుడు పూర్తి భద్రత ఉందని హిమబిందు తెలిపారు. అలాంటి కుటుంబాల్లో సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడానికి కొంత అవకాశాలు ఉన్నాయి. పాతకాలపు ‘నయా’ట్రెండ్డాలర్ డ్రీమ్స్ కరిగిపోవటంతో పెళ్లి సంబంధాల్లో పాతకాలపు పద్ధతులకు మళ్లీ పెద్దపీట వేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం, పెద్ద చదువుల జోలికి వెళ్లకుండా సొంత ఊళ్లో ఏ మేరకు ఆస్తి ఉంది? ఎన్ని ఎకరాల భూమి ఉంది? హైదరాబాద్‌లో సొంత ఫ్లాట్, ఇల్లు వంటివి ఉన్నాయా? ఉన్న ఊళ్లో సదరు కుటుంబానికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఉన్నాయి? వంటి అంశాలను ఆరా తీసి సంబంధాలను ఎంపిక చేసుకుంటున్నారు. ‘అమెరికా అబ్బాయిల కోసం ఎదురుచూసేందుకు అమ్మాయిలు నిరాకరిస్తున్నారు. చాలామంది ఇప్పుడు డిగ్రీ చేసిన వాడైనా సరే కుటుంబ భద్రత బాగుంటే చాలని భావిస్తున్నారు’అని హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ వివాహ పరిచయవేదిక ప్రతినిధి ఒకరు చెప్పారు. -
సిరి మా 'లక్ష'మి.. పసిడి పరుగే పరుగు..!
న్యూఢిల్లీ: అందరికీ ప్రియమైన బంగారం దేశంలోని సామాన్యులను మాత్రం బెంబేలెత్తించేలా పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78 వేలు పలికిన 10 గ్రాముల 24 క్యారట్ల ధర తాజాగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ మొదలవుతున్న వేళ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కలుపుకుని ఏకంగా రూ.లక్ష మార్కును దాటేసింది. సోమవారం బెంగళూరు బులియన్ మార్కెట్లో రూ. 1,02,000గా పసిడి ధర నమోదైంది. ఇక ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1,650 పెరిగి రూ. 99,800 మార్క్‌ను తాకగా హైదరాబాద్‌లో అటు ఇటుగా రూ. 1,00,100కు చేరుకుంది. మరోవైపు 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ఢిల్లీలో రూ. 1,600 పెరిగి రూ. 99,300 వద్ద నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ బలహీనపడటం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం బంగారం కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 26 శాతం ర్యాలీ చేసింది. 10 గ్రాములకు రూ. 20,850 పెరిగింది. మరోవైపు వెండి కిలో రూ. 500 పెరిగి రూ. 98,500 మార్క్‌ను చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ (31.1 గ్రాములు)కు 101 డాలర్ల వరకు ఎగసి 3,430 డాలర్లకు చేరుకుంది. 2006 వరకు నాలుగు అంకెల స్థాయికే పరిమితమైన బంగారం ధర.. 2007 నుంచి అయిదు అంకెల స్థాయిలోకి అడుగుపెట్టింది. ఏటా ధర వృద్ధి చెందుతూ 2012లో రూ.31 వేలకు చేరినప్పటికీ.. ఆ తరువాత పసిడి ధర ఒడిదుడుకులకు లోనై తిరోగమనం చెందింది. ఇక 2016 నుంచి ఏటా దూకుడు కొనసాగించింది.ఎంసీఎక్స్‌లోనూ రికార్డులు..మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్) లోనూ బంగారం రూ. 98 వేల రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల జూన్ నెల కాంట్రాక్టు ధర రూ. 2,111 పెరగడంతో (2.22%).. ఆల్‌టైమ్ గరిష్టం రూ. 97,365 నమోదైంది. ఆగస్ట్ నెల కాంట్రాక్టు సైతం రూ. 2,104 పెరిగి రూ. 98,000కు, అక్టోబర్ కాంట్రాక్టు రూ. 2,617 పెరిగి రూ. 98,000కు చేరడం గమనార్హం.బంగారం అంటే సంపద. కుటుంబానికి ఆర్థిక భరోసా. అభివృద్ధికి సూచిక.కష్టకాలంలో తోడుంటుందన్న ఓ నమ్మకం. సామాన్యుడైనా, సంపన్నుడైనా తన కష్టార్జితంలో ఎంతో కొంత బంగారం రూపంలో పొదుపు చేసుకోవడం, పెట్టుబడిగా దాచుకోవడం అనాదిగా వస్తోంది. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే బిడ్డ భవిష్యత్, పెళ్లి కోసం బంగారం కూడబెట్టడం భారతీయ కుటుంబాల్లో తొలి ప్రాధాన్యత. అంతేనా.. పండగైనా, వేడుకైనా నలుగురిలో ఆభరణాలు జిగేల్‌మనాల్సిందే. స్థాయిని చూపించుకోవడానికీ ఒక సాధనమైంది. తరతరాలుగా కుటుంబంలో భాగమైన ఈ పుత్తడి ఇప్పుడు అందనంత దూరం పరుగెడుతోంది. బంగారం ఇప్పుడు ప్రియమైంది. అందరూ ఊహించినట్టుగానే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర పన్నులు కలుపుకొని రూ.లక్ష దాటింది.ఈ పరుగు ఇప్పట్లో ఆగదంటోంది బులియన్ మార్కెట్. పరిస్థితులూ ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ధరలు అమాంతం పెరగడంతో భారతీయ వినియోగ దారులు వివాహాలు, ఇతర శుభకార్యాలకు గతంతో పోలిస్తే ఆచితూచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు బంగారు వర్తకులు చెబుతున్నారు. అయితే ఆభరణాలతో పోలిస్తే బంగారు కడ్డీలు, నాణేల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. - నూగూరి మహేందర్ ఎందుకీ పరిస్థితి?ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అంతర్జాతీయ పరిణామాలు బంగారానికి చుట్టుకున్నాయి. డాలర్ విలువ పడిపోవడం, అమెరికా–చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరి ఆర్థిక మాంద్యం భయాలు రేకెత్తించడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్ విలువ తగ్గింది. అమెరికా ట్రెజరీలు భారీగా అమ్ముడుపోతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుదల కూడా 2025లో పుత్తడి ర్యాలీకి మద్దతిచ్చాయి.గరిష్టాలూ గరిష్టమే..పసిడి 2024లో 40కిపైగా సందర్భాల్లో ఆల్‌టైమ్ హై ధర నమోదు చేసింది. 2025లో 23 సార్లు గరిష్టాలను తాకింది. దీంతో గరిష్టాలు గరిష్ట స్థాయిలో నమోదు కావడం విశేషం. ఔన్స్ ధర 2,650 డాలర్లతో 2025 సంవత్సరం ప్రారంభమైంది. సంప్రదాయ పరిణామాలకు విరుద్ధంగా 2024లో డాలర్ ఇండెక్స్ పెరిగి ఈక్విటీ మార్కెట్లు బాగా పనిచేసినప్పటికీ బంగారం ధర దాదాపు 28% అధికం కావడం గమనార్హం. అమెరికా డాలర్, భారత రూపాయి, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, యూరో, బ్రిటిష్ పౌండ్, కెనడియన్ డాలర్, ఆ్రస్టేలియన్ డాలర్ సహా అన్ని ప్రధాన కరెన్సీలలో బంగారం ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. అంతర్జాతీయంగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం ధర 2025 మార్చి 14న 3,000 డాలర్లు తాకి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఔన్స్ పసిడి రేటు 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు పట్టింది. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. వినియోగంలో మనం ఎక్కడంటే..⇒ 2024 నాటికి భారతీయుల వద్ద పుత్తడి నిల్వలు – 25,000 టన్నులు ⇒ ప్రపంచ మొత్తం పరిమాణంలో భారతీయుల వద్ద ఉన్న పసిడి – 11.56 శాతం ⇒ యూఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉంది. రూపాయి బలపడటంతో ఉపశమనమే..డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఫిబ్రవరి 10న రూ.87.95 తాకి ఆల్ టైమ్ గరిష్టం నమోదు చేసింది. రూపాయి అదే స్థాయిలో ఉన్నా, మరింత బలహీనపడ్డా భారత్‌లో ఈపాటికే గోల్డ్ రేట్ రూ.లక్ష దాటేది. కొద్ది రోజులుగా డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి బలపడుతుండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.85.38గా నమోదైంది. ఇక 2025 జనవరి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78 వేలకు అటుఇటుగా పలికింది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ధర రూ.18.75 మాత్రమే.ప్రత్యామ్నాయం వైపు కొనుగోలుదారుల చూపు..సంప్రదాయంగా భారతీయ కొనుగోలుదారులు పెట్టుబడికి విలువ, ఆకట్టుకునేలా ఉండేలా 22 క్యారెట్లతో తయారైన బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని ప్రత్యామ్నాయాలను అన్వేషించేలా చేశాయి. ఆకర్షించే రూపు, సరసమైన ధర రెండింటినీ అందించే క్లిష్ట, తేలికైన డిజైన్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో 18, 14 క్యారట్ల ఆభరణాలు ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్నాయి. తక్కువ బరువుతో సంప్రదాయ డిజైన్లను ఆభరణాల తయారీదారులు రూపొందించడానికి తయారీ సాంకేతికతలో వచి్చన పురోగతి వీలు కల్పించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 22 క్యారెట్లతో తయారు చేసిన ఆభరణాల్లో 91.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 18 క్యారెట్లు అయితే 75% స్వచ్ఛమైన బంగారం, 25% ఇతర లోహాలు ఉంటాయి. 22 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 18 క్యారెట్లతో తయారైన ఆభరణం ధర దాదాపు ఐదో వంతు తక్కువగా ఉంటుంది. తక్కువ ధర, ఎక్కువ మన్నిక కారణంగా 18 క్యారెట్ల ఆభరణాలకు డిమాండ్ క్రమంగా ఊపందుకుంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా రెండేళ్ల క్రితం కేవలం 5–7% ఉండగా ఇప్పుడు 15% కంటే ఎక్కువగా పెరిగిందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది.ఆభరణాల్లో మనమే ఫస్ట్..భారత్‌లో ఏటా 10 లక్షలకుగా వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లకే ఏటా 300–400 టన్నుల పసిడి అమ్ముడవుతుందని కళ్యాణ్ జువెల్లర్స్ అంటోంది. దీపావళి, అక్షయ తృతీయ వంటి శుభదినాల్లో హిందువులు పసిడిని కొనుక్కుంటున్నారు. చైనాలోనూ అంతే. పెళ్లిళ్లు, బిడ్డ పుట్టిన నెలరోజులకు జరిపే వేడుక, ఇతర ముఖ్య సందర్భాల్లో ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. చైనాలో అత్యధికులు టియోచు సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం వరుడి కుటుంబం వధువు కోసం నెక్లెస్, గాజులు, చెవి కమ్మలు, ఉంగరాన్ని కొనుగోలు చేస్తారు. చైనాను మించి ప్రపంచంలో అత్యధికంగా 2024లో భారతీయ వినియోగదార్లు 560 టన్నుల ఆభరణాలను అందుకున్నారు. 510 టన్నులతో చైనా రెండవ స్థానంలో ఉంది. గత ఏడాది భారతీయులు 240 టన్నుల గోల్డ్ బార్స్, కాయిన్స్‌ను కొనుగోలు చేస్తే చైనా వాసుల విషయంలో ఇది 345 టన్నులు ఉంది.పెట్టుబడిగా బంగారం..సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లను మినహాయిస్తే ప్రపంచ పసిడి డిమాండ్‌లో ఇండోనేసియా, వియత్నాం సహా ఆసియా వాటా ఏకంగా 64.5 శాతానికి చేరుకుంది. అయితే పెట్టుబడి స్వేచ్ఛ సూచికలో ఆసియా దేశాలు ప్రధానంగా భారత్, చైనా పేలవంగా ఉన్నాయి. భారతీయ కుటుంబాల్లో 6 శాతం కంటే తక్కువ సంపద ఈక్విటీల్లో, 15 శాతం బంగారంలో పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో చైనీయులు బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏటా 1–2 శాతం వడ్డీ ఇచ్చే డిపాజిట్లకు బదులు చైనీయులు చిన్నమొత్తంలో పసిడిని దక్కించుకుంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ బాటలో పెట్టుబడిగా ముడి బంగారాన్ని కొంటున్నారు. ఎగుమతులు డీలా..భారత్ నుంచి 2024–25లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 11.72 శాతం క్షీణించి రూ. 2,43,390 కోట్లకు చేరాయి. అలాగే దిగుమతులు 11.96 శాతం తగ్గి రూ.1,67,384 కోట్లుగా ఉన్నాయి. యూఎస్, చైనా మార్కెట్లు నిదానించడం, ప్రపంచంలో పలు ప్రాంతాల్లో యుద్ధాలు, రష్యా తవ్విన వజ్రాలపై ఆంక్షలు, చవకగా లభించే ల్యాబ్ తయారీ వజ్రాలు వెరసి రెండేళ్లుగా దేశం నుంచి ఎగుమతులు తగ్గడానికి కారణం అయ్యాయి. విదేశాలకు సరఫరా అయిన రత్నాలు, ఆభరణాల్లో యూఎస్ వాటా ఏకంగా 30.4 శాతం ఉంది. అయితే అమెరికా భారీ సుంకాలను ప్రకటించిన తర్వాత ఎగుమతుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో అతిపెద్ద మార్కెట్‌ను ప్రభావితం చేసే కొత్త సుంకాలు.. డైమండ్ కటింగ్, ఆభరణాల తయారీలో ప్రపంచంలో ముందంజలో ఉన్న భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయని భావిస్తున్నారు.ఎస్‌జీబీల మాటేమిటి?భారత్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకం (ఎస్జీబీ) 2015 నవంబర్‌లో ప్రారంభం అయింది. పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్ బాండ్స్ జారీ అయ్యాయి. ప్రస్తుత ధరల వద్ద బకాయి ఉన్న సావరిన్ గోల్డ్ బాండ్లను రిడీమ్ చేయాలంటే ప్రభుత్వం సుమారు రూ. 1.3 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 7 విడతల బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించింది. 8వ విడతకు ముందస్తు రిడెమ్షన్ కూడా ఆఫర్ చేసింది. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది. పెరుగుతున్న బాధ్యతను సమతౌల్యం చేయడానికి ప్రభుత్వం గోల్డ్ రిజర్వ్ ఫండ్ (జీఆర్ఎఫ్)ను సృష్టించింది. 2023–24లో ఈ నిధిలో రూ. 3,552 కోట్లు జమ చేసింది. దీన్ని 2024–25 సవరించిన బడ్జెట్లో రూ. 28,605 కోట్లకు పెంచింది. గోల్డ్ బాండ్స్ కింద ఇన్వెస్టర్లకు 2024–25 చివరి నాటికి చెల్లించాల్సిన మొత్తం రూ. 85,000 కోట్లకు చేరుకుంటుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. పసిడి దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం లేకపోగా దూసుకుపోతున్న పుత్తడి ధరలతో ఖజానాపై ఆర్థిక భారం పడింది. దీంతో పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అందం, గుర్తింపు వ్యక్తీకరణ..రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత జీడీపీకి 7% సమకూరుస్తోంది. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ మార్కెట్ విలువ దేశంలో సుమారు రూ.6,82,960–7,25,645 కోట్లు ఉంది. 2035 నాటికి ఇది రూ.19,20,825 కోట్లకు చేరుకుంటుందని అంచనా. సంప్రదాయికంగా ఆభరణాలు ఒక పెట్టుబడి. ఇప్పుడు ఇది అందం, గుర్తింపు వ్యక్తీకరణ. ఈ మార్పు అన్ని వయసుల వారికీ వర్తిస్తుంది. భిన్న డిజైన్లు కోరుకుంటున్నప్పటికీ యువ వినియోగదారులు ఆభరణాలపట్ల మొగ్గు చూపుతున్నారు. - సందీప్ కోహ్లీ సీఈవో, ఇంద్రియ, ఆదిత్య బిర్లా జువెలరీ బంగారం ధర పెరుగుదలకు నిపుణులు చెబుతున్న కారణాలు....: వాణిజ్య సుంకాలు :..సుంకాల కారణంగా ప్రపంచమార్కెట్లు తీవ్ర అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ ప్రకటించిన 90 రోజుల విరామం, ఆ తర్వాత ఏవైనా పరిణామాలు బంగారాన్ని సురక్షిత స్వర్గధామంగా ఆకర్షణీయంగా ఉంచుతాయి. అమెరికా–చైనాప్రతీకార చర్యలు ఇప్పటికే స్వల్పకాలంలో డిమాండ్‌ను పెంచుతున్నాయి...: సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోళ్లు :..కేంద్ర బ్యాంకులు దశాబ్దాలుగా స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మూడేళ్లలో ఇవి ఏటా 1,000 టన్నులకుపైగా సమకూర్చుకున్నాయి. మార్చి 2025లో వరుసగా 5వ నెలలోనూ చైనా బలమైన బంగారం కొనుగోళ్లను నివేదించింది...: స్టాగ్ఫ్లేషన్ ఆందోళనలు :..తాజా యూఎస్ ఫెడ్ పాలసీ మినిట్స్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్టాగ్ఫ్లేషన్ వైపు మళ్లవచ్చనే ఆందోళనలను సూచిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధి, అధిక నిరుద్యోగితను స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం మెరుగైన పనితీరు కనబరుస్తుంది...: చైనా ఈటీఎఫ్ పెట్టుబడులు :..చైనా గోల్డ్ ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయిలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025లోనూ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 2024 నుంచి అంతర్జాతీయంగా ఈటీఎఫ్ పెట్టుబడులు పెరుగుతున్నాయి...: ఫెడ్ రేటు కోతలు :..యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 2025లో మరో రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది బంగారం ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది. ..: స్థిరమైన పనితీరు :..2000 నుంచి 2025 వరకు బంగారం రెండుసార్లు మినహా అన్ని సందర్భాల్లోనూ అనుకూల రాబడిని అందించింది...: భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు :..రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ పతనం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ అశాంతి వరకు భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారం డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి...: కరెన్సీ హెచ్చుతగ్గులు :..డాలర్ సూచిక మూడేళ్ల కనిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. స్విస్ ఫ్రాంక్, జపనీస్ యెన్, యూరోలతో పోలిస్తే తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ కరెన్సీలలో బంగారం చౌకగా మారింది...: పెరుగుతున్న రుణ స్థాయిలు :..2024 నవంబర్‌లో యూఎస్ జాతీయ రుణం రికార్డు స్థాయిలో 36 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఈ రుణాన్ని ఎలా నిర్వహిస్తారనే దానిపై పెరుగుతున్న ఆందోళనలతో బంగారం సహజ హెడ్జ్‌గా మారింది. ప్రపంచ రుణం కూడా పెరిగింది. ..: మార్కెట్ అస్థిరత :..2025లో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అస్థిరత పెరిగింది. పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు దెబ్బతిన్నాయి.వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక అనిశి్చతులు, డాలర్ బలహీనపడడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు మద్దతునిచ్చాయి. ఈ ఏడాది బంగారం ఇప్పటికే 25 శాతానికి పైగా పెరిగింది. ఏప్రిల్ 2 సుంకాలపై ప్రకటన తర్వాత నుంచి చూసినా 6 శాతం పెరిగింది.- సతీష్ కోటక్ మహీంద్రా ఏఎంసీ ఫండ్ మేనేజర్ ఈటీఎఫ్ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల డిమాండ్ పెరిగింది.భారత్‌లో రానున్న పండుగల సీజన్‌నుదృష్టిలో పెట్టుకుని చూస్తే బంగారానికి అదనపు మద్దతు లభించనుంది. సుంకాలకు సంబంధించి అనిశ్చితి, యూఎస్ డాలర్ బలహీనత, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతుండడం బంగారం ధరల ర్యాలీకి తోడ్పడుతోంది. – జేఎం ఫైనాన్షియల్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ -
అమెరికాతో ఒప్పందంపై చురుగ్గా చర్చలు
శాన్ఫ్రాన్సిస్కో: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికాతో చర్చలు చురుగ్గా సాగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సెప్టెంబర్–అక్టోబర్ నాటికి తొలి దశకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. భారత్ సహా పలు దేశాలపై అమెరికా భారీగా ప్రతీకార టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాలు బీటీఏపై కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చర్చలను రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు, సెమీకండక్టర్లు, రెన్యువబుల్ ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేథ మొదలైన వాటిల్లో పురోగమిస్తున్న భారత్.. భవిష్యత్తులో ఆయా రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆమె చెప్పారు. -
ఇండియా విధానం సరైనదేనా?
భారత ప్రభుత్వం సుంకాల విషయమై అమెరికాతో చర్చిస్తున్న పద్ధతిని కొందరు సమర్థిస్తుండగా, కొందరు విమర్శిస్తున్నారు. విలువైన అంశాలు రెండింటిలోనూ ఉన్నాయి. కానీ ఈ చర్చలన్నీ తక్షణ అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అవి అవసరమే. అదే సమయంలో మరికొంత లోతుకు వెళ్లటం, దీర్ఘకాలిక దృష్టి తీసుకోవటం కూడా చేస్తే తప్ప ఇంత ముఖ్యమైన విషయమై సమగ్రమైన అవగాహన ఏర్పడదు. ఇతర దేశాల నుంచి దిగుమతులపై తాము స్వల్పమైన సుంకాలు విధిస్తున్నామనీ, తమ ఎగుమతులపై మాత్రం వారు భారీ సుంకాలు వేస్తున్నారనీ, ఆ విధంగా తాము రెండు విధాలుగానూ నష్టపోతున్నామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నమాట. కేవలం గణాంకాలకు పరిమితమైతే అది నిజమే. కానీ, అందులో అనేక మతలబులున్నాయి. అమెరికాలో ఒకప్పుడు విస్తారంగా ఉండిన ఉత్పత్తుల రంగాన్ని కుదించి, పరిశ్రమలను ఇతర దేశాలకు తరలించింది అక్కడి ప్రభుత్వమే గదా? అసలు వివిధ అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను ఉనికిలోకి తెచ్చి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిందే అమెరికా. ఒకవేళ 90 రోజుల వాయిదా కాలంలో చర్చల ద్వారా కొన్ని సర్దుబాట్లు జరిగినా కొంత నష్టం మిగిలే ఉంటుంది. ఈ పరిణామాలన్నింటి ప్రభావంతో అమెరికా పట్ల ప్రపంచానికి ఇంత కాలం ఉండిన విశ్వాసం తగ్గుతుందనే సందేహం ఉంది. అది జరిగినపుడు ఇప్పటికే గల బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు మరింత బలపడగలవనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి.నాలుగు ధోరణులుఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 2024–25లో 41.18 బిలి యన్ డాలర్లు. మన దిగుమతులపై అమెరికా సుంకాల రేటు సగటున 2.7 శాతం. అమెరికా నుంచి దిగుమతులపై మన సుంకాల రేటు సగ టున 12 శాతం కాగా, కొన్ని సరుకులపై 48 శాతం వరకు ఉంది. ఈ లెక్కలను బట్టి అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలతో గల వాణిజ్య లోటులో 50 శాతం మేర సుంకాలు పెంచిన ప్రకారం భారత ఎగుమతులపై రేటును 26 శాతంగా ప్రకటించారు. ఏప్రిల్ 2న ఈ కొత్త రేట్లు ప్రకటించటానికి ముందే చేసిన హెచ్చరికలను బట్టి భారత ప్రభుత్వం అమెరికన్ మోటార్ సైకిళ్లు వగైరాపై సుంకాలు తగ్గించటం తెలిసిందే. అయినప్పటికీ కొత్త రేట్లు యథావిధిగా పెరిగాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా భారత్ ఏమి చేయాలన్నది ప్రశ్న. ప్రపంచ దేశాలు చేస్తున్నదేమిటని చూడగా నాలుగు ధోరణులు కనిపిస్తు న్నాయి. కొన్ని చిన్న ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా లొంగి పోతున్నాయి. అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలు నూరు శాతం రద్దు చేస్తు న్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ జింబాబ్వే. కొన్ని సామరస్య ధోర ణితో ఇచ్చిపుచ్చుకునే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. జపాన్ అందు కొక ఉదాహరణ. కొన్ని ఎదురు సుంకాలతో ప్రతిఘటిస్తూ అమెరికా తగ్గితే తాము తగ్గుతామంటున్నాయి. కెనడా, యూరోపియన్ దేశాలు ఈ కోవలోకి వస్తాయి. చైనా ఒక్కటి భిన్నంగా కనిపిస్తున్నది. పోరాడు తాము తప్ప లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నది.ఈ నాలుగింటిలో ఇండియా ప్రయోజనాలకు ఉపయోగపడ గలది ఏది? చైనా వలె పూర్తిగా ధిక్కరించటమన్నది అభిలషణీయం కాదు, కావాలనుకున్నా సాధ్యమయ్యేదీ కాదు. వారిది రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత దేశం కన్నా అయిదు రెట్లు పెద్దది.క్రమంగా అమెరికాను మించిపోయి అగ్రస్థానానికి చేరాలన్నది చైనా లక్ష్యం. మన స్థితిగతులుగానీ, లక్ష్యాలుగానీ వీలైనంత అభివృద్ధి చెందటమే తప్ప చైనా వంటివి కావు. కనుక ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అటువంటి వైఖరి తీసుకోవటమన్న ఆలోచనే అసందర్భం. ఇదంతా అర్థమయ్యో, కాకనో కొందరు భారత ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు. జపాన్ మార్గంఇక మిగిలినవి జపాన్, కెనడా ప్లస్ యూరోపియన్ మార్గాలు. ఈ రెండింటిలో రెండవది కూడా ఇండియాకు అనుకూలించగలది కాదు. అందుకు ఒక కారణం యూరోపియన్ దేశాలన్నీ ఒక బృందం వలె నిలిచి ఉన్నాయి. అది గాక సైనికంగా, భౌగోళిక వ్యూహాల రీత్యా అమెరికా, కెనడా, యూరప్‌ల సాన్నిహిత్యం భిన్నమైనది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నందువల్లనే అమెరికా ట్యారిఫ్లను వారు బలంగా ఎదుర్కొంటూ, ఆ దేశం దిగి రావలసిందేనని స్పష్టం చేస్తు న్నారు. ఇదంతా భారతదేశానికి సాధ్యమయ్యేది కాదు.అందువల్ల స్థూలంగా జపాన్ నమూనా ఒక్కటే మిగులుతున్నది. దక్షిణ కొరియా, మెక్సికో మొదలైన వాటి వైఖరి కూడా ఇంచుమించు ఇదే విధంగా కనిపిస్తున్నది. ఈ పద్ధతి ఇంకా ఇదమిత్థంగా రూపు తీసుకోలేదు. చర్చలు జరిగే కొద్దీ ఇందుకొక రూపం రాగలదని భావించవచ్చు. భారత్ స్థూలంగా జపాన్ తరహా వైఖరిని తీసుకుంటున్నట్లు కని పిస్తున్నది. ఇందులోనూ ఒక ఆకు తక్కువే. అమెరికాతో జపాన్‌కు గల వ్యూహాత్మక భాగస్వామ్యం వేరు. అందుకే ‘స్థూలంగా’ అనే మాటను ఉపయోగించటం. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, భారతదేశం గురించి మాట్లాడుకోవలసిన మౌలికమైన విషయాలు రెండున్నాయి. భారత అభివృద్ధి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? కొత్త అభివృద్ధి లక్ష్యాల సాధనకు అనుసరించవలసిన మార్గం ఏమిటని ప్రభుత్వం భావిస్తున్నది? సుంకాల యుద్ధంపై తీసుకోగల వైఖరికి ఈ ప్రశ్నలతో సంబంధం ఉంటుంది.దేశ ప్రయోజనాలే ముఖ్యం!ఆర్థికాభివృద్ధి రీత్యా ఇండియా ఇంకా వర్ధమాన దేశమే. అభివృద్ధి చెందుతున్నా, ఆ వేగం ఉండవలసినంతగా లేదు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే అంతర్గతంగా జరగవలసింది చాలా ఉండటంతో పాటు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి, ఇంచు మించు తన స్థాయిలో గల వర్ధమాన దేశాల నుంచి, అవసరమైన వనరులు గల దేశాల నుంచి సహకారం అవసరం. అందుకోసం ఈ కూటమి, ఆ కూటమి అనే ఒకప్పటి రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వైపుల నుంచి సహకారం కోసం సమ సంబంధాలు పాటించాలి. దేశ ప్రయోజనాలే దేనికైనా గీటురాయి కావాలి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఉండరు. పరిస్థితులు, ఫిలాసఫీ రెండూ ఇవే. ఇదంతా ఇప్పుడు మనం సుంకాల సమస్యల సందర్భంలో కొత్తగా సూత్రీకరిస్తున్నది కాదు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘ది ఇండియా వే, స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టెన్ వరల్డ్’ (2020) పేరిట రాసిన పుస్తకంలో ఈ సూత్రీ కరణలన్నీ కనిపిస్తాయి. శీర్షిక దానికదే ఎంతో అర్థవంతమైనది. ‘మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా జీవించటమే వివేకం’ అనే తిరు వళ్ళువర్ బోధనతో ఆయన తన పుస్తకాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ పాలకులు వచ్చిపడుతుండగా చదరంగంలో మునిగి రాజ్యం పోగొట్టుకున్న బెంగాల్ నవాబుల ఉదంతంతో ‘షతరంజ్ కే ఖిలాడీ’ సినిమా తీసిన సత్యజిత్ రే హెచ్చరిక, అమెరికా బలహీనపడుతుండగా ముందుకు దూసుకుపోతున్న చైనాల గురించి చర్చిస్తూ, ‘ఇప్పుడు భారతదేశం తనను తాను నిర్వచించుకుంటుందా? లేక ఇంకో ప్రపంచమే నిర్వచిస్తుంటుందా?’ అని ప్రశ్నిస్తారు. స్వయంగా అమెరికా, చైనాలలో రాయబారిగా పనిచేసిన జైశంకర్ సూత్రీకర ణలు, రూపొందిస్తున్న విదేశాంగ విధానాలు ప్రస్తుత క్లిష్ట పరిణా మాలకు తగినవే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు
-
‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
యెమెన్‌పై భీకర దాడులకు సంబంధించి అమెరికా ప్రణాళికలు ముందుగానే బయటపడడం చర్చనీయాంశమైన వేళ.. విస్మయం కలిగించే విషయం ఒకటి వెలుగు చూసింది. హౌతీ రెబల్స్‌పై దాడుల సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తన భార్య, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత లాయర్‌తోనూ పంచుకున్నట్లు బయటపడింది. సమాచారం లీక్ విషయంలో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.న్యూయార్క్: సమాచారం లీక్ అవ్వడానికి కారణమైన ‘సిగ్నల్’ గ్రూప్‌ను తానే క్రియేట్ చేశానని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ (Mike Waltz) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గ్రూప్‌లో సమాచారం ఎలా లీక్ అయ్యిందో అర్థం కావడం లేదని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ఈలోపు.. అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్(Pete Hegseth) తన కుటుంబ సభ్యులతోనూ ఆ కీలక సమాచారం పంచుకున్నారనే విషయం వెలుగు చూసింది.యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన F/A-18 హార్నెట్ దాడుల షెడ్యూల్ల వివరాలను ఆయన మరో ఛాట్‌లో భార్య, తన సోదరుడు, స్నేహితులతోనూ పంచుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హెగ్సెత్ భార్య, ఫాక్స్ న్యూస్ ప్రొడ్యూసర్ అయిన జెన్నిఫర్.. సైన్యానికి సంబంధించిన కీలక సమావేశాలకూ హాజరయ్యారని వాల్ స్ట్రీట్ జనరల్ విడిగా మరో కథనం ఇచ్చింది.ఈ కథనాలపై ఇటు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్.. అటు వైట్‌హౌజ్ వర్గాలు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. అత్యంత సున్నితమైన భద్రతా వివరాలను పంచుకోవడానికి ట్రంప్ పేషీ ‘‘సిగ్నల్’’ లాంటి యాప్‌ను వాడడంపై అమెరికాలో తీవ్ర చర్చ నడుస్తోంది.అమెరికా బలగాలు కిందటి నెలలో యెమెన్(Yemen Attacks Plan Leak)పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే ఓ పాత్రికేయుడికి తెలియడం అమెరికాలో కలకలం రేపింది. సిగ్నల్‌లో గ్రూప్‌చాట్ కోసం తనను రెండు రోజుల ముందే యాడ్ చేశారని ‘అట్లాంటిక్ మ్యాగజైన్’ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ ప్రకటించారు. లక్ష్యాలు, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై గ్రూపులో చర్చించారని, ఆ ప్రకారమే దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే తన వద్ద ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. తాను ఎలాంటి కథనాలు ఇవ్వలేదంటూ చెప్పారాయన.అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు యెమెన్‌పై చర్చించిన సిగ్నల్ యాప్ గ్రూప్చాట్లో ఈ జర్నలిస్టును యాడ్ చేశారు. దాడుల విషయాలు ఆ పాత్రికేయునికి తెలుసని శ్వేతసౌధం ధ్రువీకరించింది.మరోవైపు.. ఈ ప్రణాళిక లీకైన అంశంపై తనకెలాంటి సమాచారం లేదని అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఈ భద్రతా ఉల్లంఘనను ట్రంప్ సాధారణ విషయంగా తీసుకున్నప్పటికీ.. డెమోక్రట్లు తీవ్రంగా ఖండించారు. నూతన పాలకవర్గం అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు.ఇక.. ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి నిఘా అధికారులను అమెరికా సెనెట్ విచారిస్తోంది. ఇప్పటికే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌లు సెనెట్ నిఘా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే గ్రూప్‌ను తానే క్రియేట్ చేసినప్పటికీ సదరు జర్నలిస్టు ఫోన్ నెంబర్ తన వద్ద లేదని అన్నారు. ఫోన్లో లేని నెంబర్ ఎలా గ్రూప్‌లోకి వచ్చిందో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని .. విషయంలో తాము ఇలాన్ మస్క్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ వెల్లడించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మార్చి 15న యెమెన్‌పై దాడులను ప్రకటించారు. ఇజ్రాయెల్ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన యెమెన్ తిరుగుబాటు దళం హూతీలపై అమెరికా ఇటీవల పెద్దఎత్తున దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర నేతలపై తమ దళాలు భీకర దాడులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో 50 మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడ్డారు. -
యెమెన్ పోర్టుపై మళ్లీ అమెరికా దాడులు
సనా: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్ల మౌలిక వనరులే లక్ష్యంగా అమెరికా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. హొడైడా నౌకాశ్రయం, విమానా శ్రయాలపై ఆదివారం 13 సార్లు అమెరికా వైమానిక దాడులు జరిపిందని హౌతీల అధీనంలో అల్ మసీరాహ్ టీవీ చానెల్ పేర్కొంది. హొడైడా ప్రావిన్స్‌లోనే ఉన్న రాస్ ఇసా పోర్టుపై అమెరికా రెండు రోజుల క్రితం చేపట్టిన దాడుల్లో 80 మంది మృతి చెందారు. 150 మందికి గాయాలయ్యాయి. అమెరికా బలగాలు శనివారం రాజధాని సనాలోని రెండు ప్రాంతాలపై జరిపిన దాడుల్లో ముగ్గురు చనిపోగా నలుగురు గాయపడినట్లు అల్ మసీరాహ్ తెలిపింది. అమెరికా ఎన్ని దాడులు చేసినా తాము వెనక్కి తగ్గేది లేదని హౌతీలు ప్రకటించారు. గాజాలోని పాలస్తీనియన్లకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రంలో ప్రయాణించే పశ్చిమదేశాల నౌకలపై హౌతీలు ఇప్పటివరకు 100కు పైగా దాడులు జరిపారు. దీంతో, హౌతీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా దాడులకు శ్రీకారం చుట్టారు. ఈ దాడులపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. రాస్ ఇసా పోర్టుపై దాడి ఫలితంగా దెబ్బతిన్న ట్యాంక్‌ల నుంచి లీకైన చమురు ఎర్ర సముద్ర జలాలను కలుషితంగా మార్చే ప్రమాదముందన్నారు. ఈ దాడిలో ఐదుగురు ఐరాస సహాయక సిబ్బంది సైతం గాయపడ్డారన్నారు. యెమెన్ దిగుమతుల్లో 70 శాతం, మానవతాసాయంలో 80 శాతం రాస్ ఇసా, హొడైడా, అస్ సలీఫ్ పోర్టుల ద్వారానే జరుగుతుంటాయి. రాస్ ఇసాలో యెమెన్ ప్రధాన ఆయిల్ పైప్ లైన్‌కు టెర్మినస్‌తోపాటు, అత్యంత కీలక మౌలిక వనరులున్నాయని ఐరాస పేర్కొంది. -
క్యూ4 ఫలితాలే దిక్సూచి
గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(క్యూ4) ఫలితాలే ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. వీటికితోడు యూఎస్ టారిఫ్ వార్తలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన వెలువడిన వర్షపాత అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నివ్వనున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం..ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ దిగ్గజాల క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల ఆధారంగా కదలనున్నాయి. క్యూ4తోపాటు మార్చితో ముగిసిన పూర్తి ఏడాది పనితీరును సైతం వెల్లడించనున్నాయి. కొన్ని రంగాల కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రభావిత అంశాలు, పనితీరుపై అంచనాలు సైతం వెలువరించనున్నాయి. ఈ జాబితాలో కార్ల దిగ్గజం మారుతీసహా.. ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎఫ్ఎంసీజీ బ్లూచిప్ హిందుస్తాన్ యూనిలీవర్, ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తదితరాలున్నాయి. ఐటీ బ్లూచిప్ ఇన్ఫోసిస్‌తోపాటు వారాంతాన(19న) ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐసహా యస్ బ్యాంక్ ఫలితాలు విడుదల చేశాయి. దీంతో నేడు(21న) ఈ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇతర అంశాలు ప్రపంచ ప్రధాన(ఆరు) కరెన్సీలతో మారంకలో ఇటీవల డాలరు బలహీనపడుతుండటంతో దేశీ కరెన్సీ బలపడుతోంది. డాలరు ఇండెక్స్ కొద్ది రోజులుగా 104 స్థాయి నుంచి 99కు నీరసించడం రూపాయికి జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు దేశీ స్టాక్స్‌లో తిరిగి విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీగా పెట్టుబడులు చేపడుతుండటం మరింత మద్దతిస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. కాగా.. ముడిచమురు ధరలు బ్యారల్ 65–60 డాలర్ల స్థాయికి దిగిరావడం దేశీయంగా సానుకూల అంశమని, ఇది ద్రవ్యోల్బణం తగ్గేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. గత వారమిలా కేవలం మూడు రోజులు జరిగిన గత వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 4 శాతంపైగా జంప్‌చేయడం విశేషం! ఇందుకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం తోడ్పాటునిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత వారం సెన్సెక్స్ నికరంగా 3,396 పాయింట్లు(4.5 శాతం)దూసుకెళ్లగా, నిఫ్టీ సైతం 1,023 పాయింట్లు(4.5 శాతం) ఎగసింది. వెరసి సెన్సెక్స్ 78,553 వద్ద, నిఫ్టీ 23,852 వద్ద ముగిశాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ ఇదేస్థాయిలో ర్యాలీ చేయడం గమనార్హం! సాంకేతికంగా గత వారం సెలవుల నేపథ్యంలో సాంకేతికంగా మార్కెట్లు మూడు ట్రేడింగ్ సెషన్లలోనే భారీగా బలపడ్డాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 23,600 పాయింట్ల స్థాయిలో బలమైన మద్దతును కూడగట్టుకుంటున్నట్లు సాంకేతిక నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి నిఫ్టీకి ఈ స్థాయి సపోర్ట్‌గా నిలిచే వీలున్నట్లు అంచనా వేశారు. ఇదేవిధంగా 24,550 పాయింట్ల వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు. వెరసి సమీప భవిష్యత్‌లో సపోర్ట్ లేదా రెసిస్టెన్స్‌లను అధిగమిస్తే మార్కెట్ల తీరు వెల్లడికావచ్చని అభిప్రాయపడ్డారు.రుతుపవనాల ఎఫెక్ట్ ఈ ఏడాది సాధారణానికంటే అధిక వర్షపాతానికి వీలున్నట్లు దేశీ వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఇది ధరల(ద్రవ్యోల్బణ) క్షీణతకు దారి చూపవచ్చని పేర్కొన్నారు. అయితే యూఎస్ టారిఫ్ వార్తలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని విశ్లేషించారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల యూఎస్, చైనా సుంకాల విధింపులో పోటాపోటీగా వ్యవహరిస్తుండటం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు పలువురు నిపుణులు తెలియజేశారు. ఇకపై టారిఫ్‌ల యుద్ధం మరింత వేడెక్కడం లేదా చల్లబడటం అనే అంశాలపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు వివరించారు.ఎఫ్‌పీఐల దన్ను 3 రోజుల్లో రూ. 8,500 కోట్లు గత వారం మూడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 8,472 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. నిజానికి ఈ నెల మొదట్లో సైతం ఎఫ్‌పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. ఈ బాటలో గత వారం తొలి రోజు రూ. 2,352 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. తదుపరి రెండు సెషన్లలో ఏకంగా రూ. 10,824 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్ నుంచి రూ. 23,103 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అంటే 2025 జనవరి నుంచి రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు. -
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌కు గోల్డెన్ ఛాన్స్!
చైనా వస్తువులపై అమెరికా అధిక సుంకాలను విధించడంతో.. బొమ్మల ఎగుమతి క్షీణించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ బొమ్మల ఎగుమతిదారులు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది అమెరికన్ కొనుగోలుదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకుతున్నారు.అమెరికాకు ఎక్కువగా బొమ్మలను ఎగుమతి చేసే దేశాల్లో చైనా అగ్రగామిగా ఉండేది. అయితే ఇప్పుడు అధిక సుంకాల కారణంగా చైనా ఎగుమతులు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ అవకాశాన్ని భారతదేశం సద్వినియోగం చేసుకోవచ్చని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు 'అజయ్ అగర్వాల్' ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.ప్రస్తుతం, దాదాపు 20 సంస్థలు అమెరికన్ మార్కెట్‌కు పెద్ద ఎత్తున బొమ్మల ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్నాయని అగర్వాల్ అన్నారు. గత నెలలో యుఎస్ బేస్డ్ బొమ్మల కొనుగోలుదారుల నుంచి మాకు మరిన్ని విచారణలు వస్తున్నాయి. యూఎస్ నియమాలు, నిబంధనల ప్రకారం బొమ్మ ఉత్పత్తులను తయారు చేయగల తయారీదారుల జాబితాను కోరుతూ కొన్ని భారతీయ ఎగుమతి సంస్థలు కూడా మమ్మల్ని సంప్రదించాయి ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?2024లో యూఎస్ బొమ్మల మార్కెట్ 42.8 బిలియన్ డాలర్లకు చేరుకుందని జీఎమ్ఐ రీసర్చ్ వెల్లడించింది. 2032 నాటికి ఈ వృద్ధి 56.9 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. బొమ్మల రంగంలో భారతదేశం నుంచి ఇప్పటికే దాదాపు 20 కంపెనీలు పెద్దమొత్తంలో అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.ఇతర దేశాల కంటే తక్కువ రేట్లు ఉండటం వల్ల మనకు సుంకాల ప్రయోజనం లభిస్తే.. అమెరికా మార్కెట్లో భారతీయ బొమ్మల ఉనికిని తప్పకుండా పెంచుకోవచ్చని.. టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అన్నారు. అంతే కాకుండా త్వరలోనే తయారీదారులతో ఒక సెమినార్ నిర్వహించాలని అసోసియేషన్ యోచిస్తోందని ఆయన అన్నారు. -
మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలు
ఆడపిల్లలంటే మన సమాజంలో చిన్నచూపు. ఇక అరుదైన వైకల్యంతో పుట్టిన చిన్నారి పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలివేశారు. కానీ భారతదేశంలో నివసిస్తున్న అమెరికాకు చెందిన దంపతులు పెద్ద మనసు చేసుకున్నారు. రెండేళ్లుగా అనాథాశ్రమంలో ఉంటున్న చిన్నారి నిషాని ఇంటికి తెచ్చుకున్నారు. ఎంతో ప్రేమగా ఒక బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఒక అందమైన పోస్ట్‌ద్వారా ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకు న్నారు. ప్రస్తుతం ఈ కథ నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) భారతదేశంలో నివసిస్తున్న ఒక అమెరికన్ జంట క్రిస్టెన్, టిమ్ ఫిషర్ శ్రీమతి ఫిషెర్. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలున్నారు. నాలుగో కుమార్తెగా రెండేళ్ల నిషాను దత్తత తీసుకున్నారు. నిషాను పరిచయం చేస్తూ ఒక వీడియోలో ఆనందకరమైన క్షణాన్ని పంచుకున్నారు. 2023 అక్టోబర్‌లో దత్తత ప్రక్రియను ప్రారంభించి, 2024 సెప్టెంబర్‌లో నిషా తమకు నచ్చిందని, 2025 ఏప్రిల్ నాటికి దత్తతను పూర్తి చేశామంటూ ఈ వీడియోలో వివరించారు. ఇది నిజంగా బిగ్ న్యూస్.. ఇన్నాళ్లూ ఈ రహస్యాన్ని దాచిపెట్టాం. ఈ రోజుకోసం ఎంతగానో కలలు కన్నాం. మజీవితంలో ఈ ప్రత్యేకమైన అమ్మాయి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు మా కల ఫలించిందంటూ ఫిషర్ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) అనేక కారణాల వల్ల స్పెషల్ నీడ్స్ బేబీని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్రధానంగా బేలేట్రల్ లోయర్ లింబ్ వైకల్యం (bilateral lower limb deformities) బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలను కున్నాము. పాపాయి చిరునవ్వు, ఆనందం, సంతోషంతో ఎంతో అందంగా ఉంటుంది. ఇంత కాలం ఆమె నిర్లక్ష్యానికి గురైనా, ఆమె ఈ ప్రపంచానికి చాలా అవసరం అంటూ రాశారు. ఫిషర్స్ దత్తత ప్రకటన చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది. ప్రత్యేక అవసరాలున్న ఆడబిడ్డ నిషాను దత్తత తీసుకోవడానికి ఈ జంట తీసుకున్న నిస్వార్థ నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసించారు. "మాటల్లో వర్ణించలేం. ఆమెకు శాశ్వత ఇల్లు ఇచ్చినందుకు మీ కుటుంబానికి చాలా ఆశీర్వాదాలు! నిజంగా మీరు చాలా అభినందనీయులు!" అన్నారొకరు. ‘‘అద్భుతం , మీమాది అపారమైన గౌరవం ఏర్పింది అభినందనలు!" అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కాగా 2021లో భారతదేశానికి మకాం మార్చారు క్రిస్టెన్, ఫిషెర్ దంపతులు. వారి అనుభవాలను పంచు కోవడం ద్వారా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఇపుడు ముగ్గురు అమ్మాయిలున్న ఈ దంపతులు భారతీయ అమ్మాయిని అదీ స్పెషల్లీ నీడ్ బేబీని దత్తత తీసుకోవడం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికాలో 1798 నాటి ఎలియన్ ఎనిమీస్ చట్టం కింద నిర్బంధానికి గురైన వెనిజులా పౌరులకు భారీ ఊరట లభించింది. వారిని బలవంతంగా వెనక్కి పంపించకుండా అమెరికా సుప్రీంకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తేల్చిచెప్పింది.కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఉత్తర టెక్సాస్‌లో 261 మంది వెనిజులా పౌరులను ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798 కింద నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. ఈ 261 మందిని ట్రంప్ ప్రభుత్వం ఎల్‌సాల్వెడార్ దేశంలో భూలోక నరకంగా పరిగణించే ఓ జైలుకు తరలించింది. తర్వాత వారందరినీ వెనిజులాకు పంపించాలని నిర్ణయించింది. దీంతో బాధితులకు మద్దతుగా అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు న్యాయ పోరాటం ప్రారంభించారు. కోర్టులను ఆశ్రయించారు. 261 మందిని వారి స్వదేశానికి తరలించకుండా తాత్కాలికంగా నిలిపివేస్తూ కింది కోర్టు మార్చి 15న ఆదేశాలిచ్చింది.అయితే, వారిని వెనక్కి పంపించడానికి 1798 నాటి వార్‌టైమ్ చట్టాన్ని ట్రంప్ ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 8న తీర్పు వెలువరించింది. కానీ, డిపోర్టేషన్‌ను సవాలు చేసే అవకాశం వారికి ఇవ్వాలని స్పష్టంచేసింది. దాంతో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం డిపోర్టేషన్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. వెనిజులా పౌరులకు ఇది అతిపెద్ద విజయమని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.వెనిజులా వాసులు ప్రస్తుతానికి ఎల్ సాల్వెడార్ జైలులోనే ఉండనున్నారు. 216 మందిలో 137 మందిపై ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798ను తొలగించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విదేశీయులను అక్రమ వలసదార్లను గుర్తించి, అరెస్ట్ చేసి డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా నుంచి బయటకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. The US Supreme Court just blocked President Trump from Deporting illegals under the Alien Enemies Act.Thomas & Alito dissented.They did this while we weren't looking and they did this before the 5th or the 4th circuit could dismiss the appeals.Barack Obama deported 3… pic.twitter.com/aTJvfUhsSJ— Matthew Zimmerman 🇺🇸 (@MattZimmerman26) April 19, 2025 -
మూడో దశ చర్చలు 26న
రోమ్: అణు కార్యక్రమాలను ఇరాన్ మరింతగా వేగవంతం చేసిన నేపథ్యంలో ఆ దేశంతో అమెరికా మొదలెట్టిన రెండో దఫా చర్చలు శనివారం రోమ్‌లో ముగిశాయి. తొలి దఫా చర్చలు ఒమన్‌లో ముగియగా రెండో రౌండ్ చర్చలు ఇటలీ వేదికగా శనివారం జరిగాయి. ఇటలీ రాజధాని రోమ్ నగరానికి సమీపంలోని క్యామిలూసియా ప్రాంతంలోని ఒమన్ రాయబార కార్యాలయంలో ఈ పరోక్ష చర్చలు జరిగాయి. అమెరికా తరఫున అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ్చలు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చలకు ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ మధ్యవర్తిగా వ్యవహరించారు. అయితే రెండోదఫా చర్చల్లో ఎలాంటి పురోగతి ఉందనే వివరాలను ఇరుదేశాలు వెల్లడించలేదు. అయితే ఏప్రిల్ 26వ తేదీన ఒమన్‌లో స్టీవ్ విట్కాఫ్తో మూడో దఫా చర్చలు జరగనున్నాయని ఇరాన్ మంత్రి అబ్బాస్ చెప్పారు. ‘‘ఇరాన్ గొప్పగా, సుసంపన్నంగా ఉంటే సరిపోతుంది. అణ్వాస్త్ర సామర్థ్యంతో పనిలేదు. ఆ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం’’అని ట్రంప్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘‘మేం ఎల్లప్పడూ బాధ్యతాయుతంగానే మెలిగాం. సమస్యలకు దౌత్యమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నాం. సంపత్రింపులు కొనసాగుతాయి’’అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ శనివారం తన ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. చర్చలు ముందు ఇరాన్ మంత్రి అరాగ్చీ ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీతో భేటీ అయ్యారు. తదుపరి చర్చల్లో రష్యా సైతం భాగస్వామి కానుందని వార్తలొచ్చాయి. -
భద్రతా కోణంలోనే.. రక్షణాత్మకం కాదు
న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియం దిగుమతులపై తాము విధించిన సుంకాలు దేశ భద్రతా కోణంలోనే తప్పించి రక్షణాత్మక చర్యల కింద చూడరాదని అమెరికా కోరింది. అమెరికా జాతీయ భద్రతకు స్టీల్, అల్యూమినియం దిగుమతులు ముప్పుగా పరిణమించడంతో, దీన్ని సర్దుబాటు చేయడానికి సెక్షన్ 232 కింద అధ్యక్షుడు టారిఫ్‌లను ప్రకటించినట్టు వివరించింది. ఈ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థకు బదులిచ్చింది. డబ్ల్యూటీవో సేఫ్‌గార్డ్ అగ్రిమెంట్‌లోని ఆర్టికల్ 12.3 కింద అమెరికాతో సంప్రదింపులకు ఏప్రిల్ 11న భారత్ ప్రతిపాదన చేయడంతో ఈ సమాధానం వచ్చింది. ‘‘ఇవి ఎంత మాత్రం రక్షణాత్మక చర్యలు కావు. కనుక రక్షణాత్మక చర్యల కింద సంప్రదింపులకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. అయినప్పటికీ ఈ అంశమే కాదు, ఏ అంశంపై అయినా భారత్‌తో చర్చలకు సుముఖంగా ఉన్నాం. కాకపోతే, చర్చలు ఏవైనా కానీ రక్షణాత్మక చర్యల ఒప్పందం కింద ఉండకూడదు’’అని అమెరికా స్పష్టం చేసింది. అయితే, అమెరికా వాదనను భారత్ అంగీకరించలేదు. భద్రతా కోణంలోనే అని అమెరికా చెప్పినప్పటికీ.. అవి రక్షణాత్మక చర్యలేనని వాదించింది. ఈ ఒప్పందం కింద చర్యలను డబ్ల్యూటీవో కమిటీకి తెలియజేయడంలో అమెరికా విఫలమైనట్టు పేర్కొంది. -
యెమెన్ నౌకాశ్రయంపై అమెరికా భీకరదాడులు
దుబాయ్: యెమెన్‌లోని హౌతీ రెబల్స్ ఆదీనంలో ఉన్న చమురు నౌకాశ్రయంపై అమెరికా భీకర వైమానిక దాడులు జరిపింది. ఘటనలో 74 మంది చనిపోగా, 171 మంది గాయపడినట్లు హౌతీలు ప్రకటించారు. కాగా, హౌతీల లక్ష్యాలపై ట్రంప్ ప్రభుత్వం మార్చి 15 నుంచి కొనసాగిస్తున్న దాడుల్లో శక్తివంతమైంది ఇదేనని చెబుతున్నారు. గురువారం రాత్రి జరిగిన దాడితో రస్ ఇసా ఆయిల్ పోర్టులో భీకర శబ్ధాలతోపాటు భారీగా మంటలు వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడికి సంబంధించిన గ్రాఫిక్ ఫుటేజీని హౌతీలు విడుదల చేశారు. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న హౌతీల ప్రధాన ఆదాయ వనరును ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. గత పదేళ్లుగా ఈ ప్రాంతంలో భయోత్పాతం సృష్టించే హౌతీలకు అక్రమ ఆదాయం అందకుండా చేయడానికే ఈ దాడుల లక్ష్యమని తెలిపింది. శాంతియుతంగా జీవించాలని కోరుకునే యెమెన్ ప్రజలకు హాని తలపెట్టడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. అమెరికా దాడిని హౌతీలు తీవ్రంగా ఖండించారు. ఇది యెమెన్ సార్వభౌమత్వంపై చేసిన దాడిగా పేర్కొన్నారు. -
ఉగ్రవాది హ్యాపీ పాసియా అరెస్టు
న్యూయార్క్/చండీగఢ్: గ్యాంగ్‌స్టర్ నుంచి ఉగ్రవాదిగా మారిన హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా అలియాస్ జోరా అమెరికాలో అరెస్టయ్యాడు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ, ఖలిస్తానీ సంస్థ బీకేఐతో సంబంధాలున్న హ్యాపీ పాసియా పంజాబ్‌లో పలు ఉగ్రవాద దాడుల ఘటనల్లో నిందితుడిగా రికార్డుకెక్కాడు. వాంటెట్ జాబితాలో ఉన్న జోరా కోసం భారత దర్యాప్తు అధికారులు వెతుకుతున్నారు. అమెరికాలోని శాక్రమెంటో నగరంలో ఎఫ్‌బీఐ అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా అధికారులు శుక్రవారం వెల్లడించారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినందుకు అక్కడి అధికారులు అరెస్టు చేసినట్లు తెలిపారు. పంజాబ్‌లో 16 ఉగ్రవాద దాడుల్లో జోరా ప్రమేయం ఉన్నట్లు భారత అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అతడిపై రూ.5 లక్షల నగదు రివార్డు ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లాలోని పాషియా గ్రామంలో జని్మంచిన జోరా తొలుత గ్యాంగ్‌స్టర్‌గా వ్యవహరించాడు. తర్వాత పాకిస్తాన్, ఖలిస్తాన్ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకొని ఉగ్రవాదిగా మారాడు. 2018 ఏప్రిల్‌లో దుబాయ్‌కి చేరుకున్నాడు. 2019లో ఫిబ్రవరిలో ఇండియాకు తిరిగివచ్చాడు. 2020 అక్టోబర్‌లో లండన్‌కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయాడు. -
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
మయామి: దేశంలో అక్రమంగా ఉంటున్నాడంటూ అమెరికా పౌరుడొకరిని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత పత్రాలన్నిటినీ అతడి తల్లి చూపినా వదల్లేదు. చివరికి కోర్టు జోక్యంతో అతడికి విముక్తి లభించింది. బుధవారం కారులో వెళ్తున్న జువాన్ కార్లోస్ లోపెజ్ గోమెజ్ (20) అనే వ్యక్తిని ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు జార్జియా రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకున్నారు. దేశంలో అక్రమంగా ఉండే వారికి జార్జియాలోకి ప్రవేశం నిషిద్ధం. ఆ నిబంధనను సాకుగా చూపు తూ గోమెజ్తోపాటు ఆ కారులో ఉన్న వారందరినీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి తల్లి వచ్చి పౌరసత్వ కార్డు సహా ఆధారాలన్నీ చూపినా ససేమిరా అంటూ లియోన్ కౌంటీ జైలుకు వారిని తరలించారు. కేసు విచారణ సమయంలో గోమెజ్ తల్లి స్టేట్ ఐడెంటిటీ కార్డు, బర్త్ సర్టిఫికెట్, సోషల్ సె క్యూరిటీ కార్డు చూపారు. దీంతో, ఇమిగ్రేషన్ అధి కారుల చర్యకు ఎటువంటి ఆధారాలు లేవంటూ గోమెజ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ పరిమాణంపై ఇమిగ్రేషన్ విభాగం స్పందించలేదు. దేశ పౌరులను అదుపులోకి తీసుకునే అధికారం యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు లేకపోవడం గమనార్హం. -
విద్యార్థుల వీసాలపై పిడుగు
విదేశీ విద్యార్థులపై అమెరికా కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోంది. గత నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 1,024 మంది విదేశీ విద్యార్థుల వీసాలనో, వారి లీగల్ రెసిడెన్సీ స్టేటస్నో రద్దు చేసింది. వారంతా అమెరికాలోని 160 కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకుంటున్నవారే. వారంతా ఆందోళనకు లోనవుతున్నారు. ఇలా ఉన్నపళంగా వెళ్లగొట్టడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ‘‘చట్టప్రకారం అన్ని అనుమతులూ ఇచ్చిన ప్రభుత్వమే ఆ చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఈ చర్యలను ఎలా సమర్థించుకుంటుంది?’’ అని ప్రశి్నస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ చర్యపై పలువురు కోర్టుకెక్కారు. కొందరు అరెస్టు భయంతో చదువులు మధ్యలోనే వదిలేసి స్వదేశాలకు వెళ్లిపోయారు. పునరాలోచించాలి లీగల్ స్టేటస్ రద్దుతో వందలాది మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అమెరికా వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ప్రభుత్వమే నిర్బంధించి బలవంతంగా వెళ్లగొట్టే పరిస్థితి నెలకొంది. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, ఒహాయో స్టేట్ వర్సిటీల్లోని పలువురు విద్యార్థుల లీగల్ స్టేటస్లు రద్దయ్యాయి. పలు కాలేజీల్లోని విద్యార్థులు వీసాలు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీపై కోర్టుల్లో కేసులు దాఖలవుతున్నాయి. విదేశీ విద్యార్థులు ఇలా వెళ్లిపోతే అమెరికా వర్సిటీలు, కాలేజీల మనుగడ కష్టమవుతుందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. దీనిపై పునరాలోచించాలని ట్రంప్ సర్కారుకు సూచిస్తున్నారు. కాలేజీలు, వర్సిటీల నుంచి కూడా ఈ మేరకు విజ్ఞాపనలు వెళ్తున్నాయి. రద్దయితే ఇంటికేనా? ఎఫ్–1 విద్యార్థి వీసాలను అమెరికా విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుంది. అమెరికాలోకి అడుగుపెట్టాక వారి లీగల్ రెసిడెన్సీ స్టేటస్‌ను పర్యవేక్షించే బాధ్యత డీఓహెచ్దే. విద్యార్థుల డేటాబేస్ దానివద్ద ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తయ్యి వారు స్వదేశాలకు వెళ్లాక వర్సిటీ సూచనతో లీగల్ స్టేటస్‌ను తొలగించేవారు. ఇప్పుడు వర్సిటీలతో సంబంధమే లేకుండా విదేశీ విద్యార్థుల లీగల్ రెసిడెన్సీ స్టేటస్ ఉన్నపళంగా రద్దయిపోతోంది. పైగా ఆ మేరకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. డేటాబేస్‌ను వర్సిటీ వర్గాలు తనిఖీ చేసినప్పుడు మాత్రమే ఆ విషయం తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో వీసా రద్దయినా లీగల్ రెసిడెన్సీ స్టేటస్ అలాగే ఉంటుంది. అలాంటప్పుడు విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. స్వదేశాలకు వెళ్లి మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేటస్ రద్దయితే మాత్రం అమెరికాలో ఉండడానికి అనుమతించరు. స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచిస్తారు. లేదంటే బలవంతంగా పంపిస్తారు.ఎందుకీ వీసాల రద్దు? → విద్యార్థుల వీసాల రద్దుకు నిబంధనల ఉల్లంఘన ముఖ్య కారణమని వర్సిటీలు చెబుతున్నాయి. → ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా వీసా రద్దవుతోంది. గత ఉల్లంఘనలకు కూడా ఇప్పుడు వీసా రద్దు చేస్తున్నారు. → చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడినా వీసా రద్దు తప్పదు. → పాలస్తీనా సానుభూతిపరుడంటూ కొలంబియా వర్సిటీ విద్యార్థి మహమ్మద్ ఖలీల్ వీసా రద్దు చేశారు. కానీ వీసాలు, లీగల్ స్టేటస్లు రద్దవుతున్న పలువురు విద్యార్థులకు ఉద్యమాలతో, తీవ్రవాద/ఉగ్రవాద సంస్థలతో ఏ సంబంధమూ లేదని ఆయా వర్సిటీలే చెబుతున్నాయి. కారణాలేమిటో ప్రభుత్వాన్నే అడగాలంటున్నాయి. → ‘‘విదేశీ విద్యార్థులను బయటకు వెళ్లగొట్టడమే డీఓహెచ్కు పనిగా మారింది. ఈ మేరకు అనధికారింగా జాతీయ పాలసీ తెచ్చినట్టు కనిపిస్తోంది’’ అని వేన్ స్టేట్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రతినిధులు విద్యార్థుల తరఫున కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బలవంతపు డిపోర్టేషన్లు ఆపాలని కోరారు. → డార్ట్మౌత్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న చైనాకు చెందిన షియాంటియాన్ లియూ తన లీగల్ స్టేటస్ రద్దుపై కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ విద్యారి్థకి అనుకూలంగా న్యూ హ్యాంప్‌షైర్ ఫెడరల్ జడ్జి తీర్పు ఇచ్చారు. → ‘‘అమెరికాలోకి వచ్చిపడుతున్న విదేశీయుల పట్ల ట్రంప్ గుర్రుగా ఉన్నారు. వారందరినీ వెనక్కు పంపేయాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే విదేశీ విద్యార్థులను లక్ష్యం చేసుకుంటున్నారు’’ అని మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్లో పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ మిషెల్ మిటెల్స్టాడ్ అన్నారు.తీవ్ర పరిణామాలేఅమెరికాలో చట్టాల అమలు కఠినంగా ఉంటుంది. వాటిని పాటించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘‘విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. చట్టాలను ధిక్కరిస్తామంటే ప్రభుత్వం సహించదు. ఇష్టానుసారం వ్యవహరిస్తే వీసాలు రద్దు చేసి వెనక్కు పంపుతారు. నిజాయితీగా ఉండేవారికి అమెరికాలో అద్భుత అవకాశాలున్నాయి’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్గరెట్ మెక్లియోడ్ అన్నారు. ఈ విషయంలో కేంద్రం ఇకనైనా మొద్దునిద్ర వీడి అమెరికాలోని మన విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రాష్ టు జోష్..!
ట్రంప్ టారిఫ్‌ల సునామీ ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేసింది. అనేక దేశాలపై అమెరికా భారీగా ప్రతీకార సుంకాలు వడ్డించడం, చైనా దీటుగా టారిఫ్‌లతో తిప్పికొట్టడంతో వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో అమెరికా టు ఆసియా స్టాక్ మార్కెట్లు ’బేర్’మన్నాయి. అక్టోబర్ నుంచి రివర్స్‌గేర్‌లో కొనసాగుతున్న మన సూచీలు.. ట్రంప్ టారిఫ్ దెబ్బకు తాజా 17 శాతం దిగజారాయి. సెన్సెక్స్ సెప్టెంబర్‌లో 85,978 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టం నుంచి తాజాగా 71,425 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాలకు 90 రోజులు విరామం ప్రకటించడం, పలు రంగాలకు మినహాయింపులు ఇవ్వడంతో మళ్లీ బుల్స్ ఫేస్ టరి్నంగ్ ఇచ్చుకున్నాయి. తాజా కనిష్టం నుంచి 10 శాతం మేర ‘రిలీఫ్’ ర్యాలీ చేశాయి. ఈ వారంలోనే 4 శాతం జంప్ చేశాయి. కాగా, దేశీ మార్కెట్లు గతంలో కూడా సంక్షోభాలు, స్కామ్‌ల దెబ్బకు భారీగా పడి, బేర్ గుప్పిట్లో చిక్కుకున్నప్పటికీ... మళ్లీ అంతే వేగంగా రికవరీ అయ్యాయి. అమెరికా–చైనాల మధ్య టారిఫ్ వార్ ముదురుతుండటం, ట్రంప్ మళ్లీ ఎప్పుడు ఎలాంటి పిడుగు వేస్తారోనన్న అనిశి్చతితో ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, టారిఫ్‌ల దుమారం పూర్తిగా సద్దుమణిగితే బుల్స్ రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లే అవకాశం ఉంది. మన మార్కెట్లో అతిపెద్ద పతనాలు, కోలుకున్న తీరు చూస్తే...కోవిడ్ క్రాష్.. 2020లో కోవిడ్–19 మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతే.. స్టాక్ మార్కెట్లో బేర్ విలయతాండవం చేసింది. ఇటీవలి చరిత్రలో మార్కెట్లు ఇలా కుప్పకూలడం ఇదే తొలిసారి. లాక్డౌన్లతో ఆర్థిక వ్యవస్థలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో మార్చి 2020లో సెన్సెక్స్ 41,000 స్థాయి నుంచి 25,981 పాయింట్ల కనిష్టానికి క్రాష్ అయ్యింది. అయితే, సెంట్రల్ బ్యాంకుల సహాయ ప్యాకేజీలు, వడ్డీ రేట్ల భారీ కోతలతో మార్కెట్లు నేలక్కొట్టిన బంతిలా దూసుకుపోయాయి. నవంబర్ 2020 నాటికి కనిష్టం నుంచి 58 శాతం ఎగబాకి మళ్లీ క్రాష్ ముందస్తు స్థాయిని దాటేశాయి. వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కుమ్మరింపుతో నాన్ స్టాప్ ర్యాలీ చేశాయి. 2021 సెప్టెంబర్ నాటికి 60,,000 స్థాయి పైకి చేరగా.. 2024 సెప్టెంబర్‌లో 85,978 పాయింట్లతో సరికొత్త చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడం విశేషం! ప్రపంచ ఆర్థిక సంక్షోభం... 2008లో అమెరికాలో మొదలై ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం దెబ్బకు అనేక పేరొందిన ఆర్థిక సంస్థలతో పాటు పలు కంపెనీలు కూడా దివాలా తీశాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు చివురుటాకుల్లా వణికిపోయాయి. సెన్సెక్స్ మెగా పతనంతో 21,000 స్థాయి నుంచి 2009 మార్చి నాటికి 8,000 పాయింట్లకు కుప్పకూలింది. అంటే ఏకంగా 62 శాతం కరిగిపోయింది. అయితే, ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ఉద్దీపన ప్యాకేజీల అమలు, వడ్డీరేట్ల కోతలతో మార్కెట్ల రికవరీ మొదలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడటం, విదేశీ ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో 2010 నవంబర్ నాటికి సెన్సెక్స్ మళ్లీ 21,000 మార్కును తాకింది. రెండేళ్ల రికవరీలో 162% ర్యాలీ చేసింది. కేతన్ పరేఖ్ స్కామ్/డాట్ కామ్ బబుల్ భారత్ స్టాక్ మార్కెట్లను కుదిపేసిన కేతన్ పరేఖ్ షేర్ల కుంభకోణానికి తోడు ప్రపంచవ్యాప్తంగా డాట్–కామ్ బబుల్ బద్దలవ్వడంతో దేశీ సూచీలు కకావికలం అయ్యాయి. 2001 ఆరంభంలో 4,200 పాయింట్ల స్థాయిలో ఉన్న సెన్సెక్స్ సెప్టెంబర్ నాటికి 2,594 పాయింట్లకు కుప్పకూలింది. అయితే, మళ్లీ 2003 నుంచి నెమ్మదిగా మార్కెట్లో జోరు మొదలైంది. 2004 మధ్య నాటికి, అంటే మూడేళ్లలో 62 శాతం ర్యాలీతో 4,200 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఇందుకు ప్రధానంగా దేశ జీడీపీ వృద్ధి పుంజుకోవడం, ఐటీ రంగం పరుగులతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులకు వరుస కట్టడం వంటి అంశాలు దోహదం చేశాయి.హర్షద్ మెహతా కుంభకోణం దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోయిన హర్షద్ మెహతా స్కామ్.. ఇన్వెస్టర్లను నిలువునా ముంచేసింది. 1992లో స్కామ్ బట్టబయలు కాగా, సెన్సెక్స్ 4,467 పాయింట్ల నుంచి 1993 మే నెలకల్లా 2,529 పాయింట్లకు (43 శాతం) పడిపోయింది. అయితే, దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు, సరళీకరణ దన్నుతో విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసం కొత్తపుంతలు తొక్కి, మార్కెట్లు చెంగుచెంగున దూసుకెళ్లాయి. 1996 నాటికి సెన్సెక్స్ మళ్లీ 4,600 పాయింట్ల స్థాయికి (82 శాతం) అధిగమించి దుమ్మురేపింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి
-
విమానం హైజాక్‌కు యత్నం.. నిందితుడ్ని కాల్చి చంపిన తోటి ప్రయాణికుడు
బెల్మోపాన్: అమెరికా ఈశాన్య తీర దేశమైన బెలిజ్‌లో విమానం హైజాక్ (Hijack Plane) కలకలం రేపింది. గురువారం (స్థానిక సమయం) బెలిజ్‌లో ఓ అమెరికన్ పౌరుడు గాల్లో ఉండగా ఓ చిన్న ట్రాఫిక్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో నిందితుడు తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత నిందితుణ్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. బెలిజ్ పోలీస్ కమిషనర్ చెస్టర్ విలియమ్స్ ప్రకారం..49ఏళ్ల అమెరికా పౌరుడు అకిన్యేలా సావా టేలర్ (Akinyela Sawa Taylor) గాలిలో ఉండగా శాన్ పెడ్రోకు వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తోటి ప్రయాణికుడు గన్నుతో నిందితుణ్ని కాల్చి చంపారు. ఈ సందర్భంగా టేలర్‌ను కాల్చి చంపిన ప్రయాణీకుడిని హీరో అంటూ కమిషనర్ విలియమ్స్ ప్రశంసించారు.కాగా,టేలర్ విమానంలోకి కత్తిని ఎలా తీసుకురాగలిగాడో అస్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.ఈ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తులో సహాయం కోసం బెలిజియన్ అధికారులు అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్‌ను కలిసిన తొలి యూరప్ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం. ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. ఈ డీల్ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్‌ను రోమ్ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025 -
అమెరికా టారిఫ్‌లతో డిఫాల్ట్ రిస్కులు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల వల్ల రుణాలకు సంబంధించిన పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని, తక్కువ రేటింగ్, స్పెక్యులేటివ్ రేటింగ్ ఉన్న కార్పొరేట్లు డిఫాల్ట్ అయ్యే రిస్కులు పెరగవచ్చని మూడీస్ రేటింగ్స్ వెల్లడించింది. గ్లోబల్ వృద్ధి నెమ్మదించి, మాంద్యం వచ్చే అవకాశాలు పెరగవచ్చని ఓ నివేదికలో వివరించింది.‘ఫైనాన్షియల్ మార్కెట్లను టారిఫ్‌లు షాక్‌కు గురిచేశాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం వచ్చే రిస్కులు పెరుగుతున్నాయి. అనిశ్చితి కొనసాగడం వల్ల వ్యాపార ప్రణాళికలకు అవరోధంగా మారుతుంది. పెట్టుబడులు నిల్చిపోతాయి. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతుంది‘ అని మూడీస్ రేటింగ్స్ తెలిపింది.టారిఫ్‌ల అమలుకు తాత్కాలికంగా విరామం ఇవ్వడం వల్ల వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తి, కొనుగోళ్లను సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయం లభించినప్పటికీ, 90 రోజుల తర్వాత టారిఫ్‌ల పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో వ్యాపార ప్రణాళికలకు సమస్యలు తలెత్తవచ్చని వివరించింది. గత నెల రోజులుగా రుణ సంబంధ పరిస్థితులు (రుణాల లభ్యత, వడ్డీ రేట్లు, రుణ గ్రహీతలు చెల్లించే సామర్థ్యాలు మొదలైనవి) గణనీయంగా దిగజారినట్లు మూడీస్ రేటింగ్స్ వివరించింది. అమెరికా జీడీపీపైనా ప్రభావం.. ఇక అమెరికా ఎకానమీ మీద కూడా టారిఫ్‌ల ప్రభావం ఉంటుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. అగ్రరాజ్యం జీడీపీ వృద్ధి కనీసం ఒక పర్సెంటేజీ పాయింట్ మేర తగ్గొచ్చని, అమెరికన్ వినియోగదారులు.. వ్యాపార సంస్థలకు ధరలు గణనీయంగా పెరిగిపోవచ్చని మూడీస్ తెలిపింది. టారిఫ్‌ల భారాన్ని నెమ్మదిగా బదలాయించినా, అంతిమంగా దాన్ని మోయాల్సింది అమెరికన్ వినియోగదారులేనని తెలిపింది.సుంకాల వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుందని, పలు సంస్థల లాభాల మార్జిన్లు పడిపోతాయని వివరించింది. అటు చైనా విషయానికొస్తే వాణిజ్య యుద్ధంపరమైన ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకానమీ మందగమనం వల్ల ఎగుమతుల రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది.ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికా–చైనా సంబంధాలు వివాదాస్పదంగానే కొనసాగవచ్చని, దీనితో వ్యాపారవర్గాలు.. వినియోగదారుల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. ఫలితంగా దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఏర్పడొచ్చని తెలిపింది. -
FSU: అమెరికా యూనివర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి
సాక్రమెంటో: అగ్రరాజ్యం మరోసారి కాల్పుల ఘటనతో ఉలిక్కి పడింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ(Florida state University)లో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.తొలుత.. తల్లహస్సి క్యాంపస్‌లోని స్టూడెంట్ యూనియన్‌లో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు తొలుత సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది. అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్యాంపస్ లాక్డౌన్(Lock Down)లోకి వెళ్లింది. ఈ రోజు జరగాల్సిన క్లాస్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తల్లహస్సి మెమోరియల్ హెల్త్‌కేర్ ప్రతినిధి తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ విషయాన్ని అధికారులు చేరవేశారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదొక భయంకర సంఘటన అని ట్రంప్ పేర్కొన్నారు. ఓ యువకుడు తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్లుగా ఫుటేజీ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిందితుడు యూనివర్సిటీ విద్యార్థిగానే తెలియగా.. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు.. ఐదుగురు మృతి చెందినట్లు కథనాలు వెలువడుతున్నప్పటికీ అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది. #Shooting at American universityMedia report that over 30 shots were fired on the campus of #Florida State #University.At least 5 people were killed and 4 others injured in the incident. pic.twitter.com/49nBiC6SLv— Tamadon News - English (@TamadonTV_EN) April 18, 2025 -
వచ్చే వారం అమెరికాకు రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వచ్చే వారం అమెరికాకు వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపక సిబ్బందితో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ మీడియా పబ్లిసిటీ విభాగం చీఫ్ పవన్ ఖేరా గురువారం ఈ విషయం తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. అదేవిధంగా, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆఫీసు బేరర్లు, సభ్యులతో సమావేశమవుతారు. -
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని కలలుగంటున్న భారతీ య విద్యార్థులకు మరిన్ని షాక్‌లు తగులుతున్నాయి. అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ స్లాట్లు ఆన్లైన్ నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 20–25 రోజుల నుంచి వీసా అపాయింట్మెంట్ స్లాట్లు దొరకడం గగనంగా మారిందని అంటున్నారు. ఇండియా నుంచి అమెరికా వెళ్లడానికి వేలాది మంది విద్యార్థులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు అమెరికా విద్యా సంస్థల్లో అడ్మిషన్ల సీజన్ డెడ్‌లైన్‌కు గడువు ముంచుకొస్తోంది. నిర్దేశిత గడువులోగా వీసాలు దొరక్కపోతే అడ్మిషన్‌పై ప్రభావం పడనుంది. అమెరికా వీసా కావాలంటే ఇండియాలోని యూఎస్ ఎంబసీలు లేదా కాన్సులేట్లలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూల కోసం ముందుగానే ఆన్లైన్లో నగదు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ నెలకు సంబంధించిన స్లాట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. మే, జూన్‌కు సంబంధించిన స్లాట్లు అందుబాటులో లేవని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆన్లైన్లో కనిపించడం లేదని చెబుతున్నారు. కారణం ఏమిటో తెలియక అయోమయానికి గురవుతున్నారు. వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ స్లాట్ల కోసం నిత్యం వందలాది మంది ప్రయత్నిస్తున్నారు. కానీ, నిరాశే ఎదురవుతోంది. అమెరికా ఎంబసీ వీసా స్లాట్ల వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తోందని, అందుకే ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీసా స్లాట్ల వ్యవస్థను ఎవరూ దుర్వినియోగం చేయకుండా, అనధికారిక వ్యక్తులు ఇందులోకి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కానీ, దీనిపై అమెరికా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు వీసాలు దొరకడం కష్టం కావడంతో అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు వాయిదా వేసుకోవాలని కొందరు విద్యార్థులు భావిస్తున్నట్లు తెలిసింది.భారతీయ విద్యార్థులకు సహకరిస్తాం: రణధీర్ జైశ్వాల్ అమెరికాలో భారతీయుల వీసాలు హఠాత్తుగా రద్దు చేస్తుండడం, భారతీయ పర్యాటకులను అడ్డుకోవడం, హెచ్–1బీ వీసా ఉన్నవారికి ప్రవేశం నిరాకరిస్తుండడం వంటి సమస్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ గురువారం స్పందించారు. ఎఫ్–1 వీసాలను రద్దు చేస్తున్నామంటూ భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం నుంచి సమాచారం వస్తున్నట్లు తమకు తెలిసిందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, తగిన సహకారం అందిస్తామని చెప్పారు. అమెరికాలోని భారతీయ ఎంబీసీలు, కాన్సులేట్లు మన విద్యార్థులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. -
నరుడా.. ఓ నరుడా.. డోనరుడా..!
ఎలాన్ మస్క్.. ఈ పేరు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు అధిపతి. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఆవిష్కరణ వేత్తగా కూడా పేరు సంపాదించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు మస్క్. అయితే తన వారసత్వం తనతో ఆగిపోకూడదనే తపన కూడా ఆయనలో ఎక్కువగానే ఉంది. ప్రపంచానికి తనలాంటి మేధావులు మళ్లీ మళ్లీ పరిచయం కావాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఎప్పుడో వచ్చిందట. దీనిలో భాగంగా తన తర్వాత తరాన్ని తయారు చేసే పనిలో పడ్డారట ఎలాన్ మస్క్. ప్రపంచ జనాభా పెంచే పనిలో మస్క్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్యాబినెట్ లో కీలక పదవిలో ఉన్న ఎలాన్ మస్క్.. తన వీర్యాన్ని దానం చేసే పనిలో ఉన్నారని తాజా కథనాల సారాంశం. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ తన కాస్ట్ కటింగ్ లతో ప్రపంచానికి నిద్రపట్టనివ్వకుండా చేస్తుంటే.. మస్క్ మాత్రం తన వీర్యాన్ని పంచి ప్రపంచ జనాభాను పెంచే పనిలో ఉన్నారట. దీనికి సంబంధించి అమెరికన్ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. మస్క్ కు బాగా తెలిసిన వాళ్లకు ఈ ఆఫర్ చేస్తూ ఉంటాడని, ఒకవేళ తెలియక పోయినా వారితో పరిచయం పెంచుకుని మరీ వారికి దగ్గరవుతూ ఉంటాడట. మేధావి వర్గం అనేది తర్వాత తరాలకు కూడా అందుబాటులో ఉండాలనే పదునైన సంకల్పంతో ఉన్న మస్క్ దీనికి పూనుకున్నట్లు పేర్కొంది. ’ఎక్స్’లో మహిళలకు దగ్గరవుతూ వారిని పిల్లల్ని కనమని ఆఫర్లు ఇస్తున్నాడని స్పష్టం చేసింది. ఇలా మస్క్ పిల్లల సంఖ్య పెరుగుతూ పోతూ ఉందని తెలిపింది. జనాభా సమతుల్యతను కాపాడే పనిలో..ఇప్పటికే 14 మంది పిల్లలకు తండ్రిగా ఉన్న ఎలాన్ మస్క్.. తన వారసత్వ సంపదగా ఒక దండునే తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నాడని డబ్యూఎస్జే తెలిపింది. తగ్గిపోతున్న జనన రేట్ల మానవ నాగరికతను అస్తిత్వంలో పడేస్తాయని మస్క్ బలంగా నమ్ముతున్నాడని, ఇది కూడా తన వీర్యాన్ని దానం చేస్తూ జనాభా సమతుల్యతను కాపాడుకునే క్రమంలో సాధ్యమైనంత మేర తన వంతు ప్రయత్నం చేస్తున్నాడనేది ఆ కథనం సారాంశం. ఇప్పటికే ఎంతోమంది మహిళలకు తన వీర్యాన్ని డోనర్ రూపంలో దానం చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి వ్యవహారాలపై సీక్రెట్ ఒప్పందాలు మస్క్ చేసుకున్నట్లు ప్రచురించింది. జపనీస్ మహిళను ఇలా కలిసి..?క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లూయెన్సర్ అయిన జపాన్ మహిళ టిఫనీ ఫాంగ్ కు కూడా మస్క్ నేరుగా మెస్సేజ్ చేసి తన బిడ్డ (వీర్యం దానం చేయడం ద్వారా) కావాలా అని అడిగినట్టు డబ్యూఎస్ జే పేర్కొంది. ఇది జరిగి ఏడాది అవుతుందని, మస్క్ ఆమెను ఎక్స్ లో ఫాలో అవ్వడం మొదలైన తర్వాత ఈ ఆఫర్ ఇచ్చాడట. ఆమెను మస్క్ ఫాలో అవ్వడంతో టిఫనీ ఫాంగ్ కు ఫాలోవర్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగి రెండు వారాల్లోనే 21 వేల డాలర్లను సంపాదించినట్లు ఆ కథనంలోని మరొక విషయం. అయితే మస్క్ ఆఫర్ ను టిఫనీ ఫాంగ్ తిరస్కరించిందని, ఆమెకు అప్పటికే ఉన్న పిల్లల ఫోటోలను కూడా చూపించిందట.ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలుఇటీవల రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్.. మస్క్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు మస్క్ తండ్రి అంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్టు పెట్టారు. ఆమె పోస్టుపై మస్క్ సమాధానం ఇస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తన బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ కామెంట్స్ చేశారు.గతేడాది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. తనకు పుట్టిన పిల్లలను, మాజీ భాగస్వామ్యులు ఉండేందుందుకు 14 వేల 400 స్క్వేర్ ఫీట్ కాంపౌడ్ లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించి వారు బాగోగులు చూస్తున్నట్లు కూడా పేర్కొంది. ఆ ఇంటిని నిర్మించడం కోసం సుమారు 300 కోట్ల రూపాయిలు అయినట్లు తెలిపింది. ఏం లేదు.. అంతా గాసిప్: మస్క్‌జపాన్ మహిళకు వీర్యం ఆఫర్ చేసినట్టు వచ్చిన కథనాల్ని మస్క్ కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని అంటున్నారు. డబ్యూఎస్జే వెబ్సైట్ అనేది ఒక గాసిప్ వెబ్ సైట్ అని, అందులో గాసిప్ తప్పితే ఏమీ ఉండదని అంటున్నారు. అయితే స్పెర్మ్ డోనర్ అనే అంశం చాలా సీక్రెట్‌గానే ఉంచుతారు. మరి అటవంటప్పుడు మస్క్ ఎవరికైనా వీర్యాన్ని దానం చేసినా దానిని బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉండదు. ఇటీవల కాలంలో తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ బహిరంగంగా పలువురు వ్యాఖ్యానించిన క్రమంలోనే ఈ వార్తను డబ్యూఎస్జే పరిశోధానాత్మక కోణంలో ప్రచురించినట్లు తెలుస్తోంది. -
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
న్యూఢిల్లీ: అమెరికాలో టారిఫ్‌ల విధింపుతో చైనా ఉత్పత్తులు భారత్‌లోకి వెల్లువెత్తే అవకాశాలున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అంతర్–మంత్రిత్వ శాఖల మానిటరింగ్ సెల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు అగ్రరాజ్యంపై చైనా ప్రతీకార టారిఫ్‌ల వల్ల అమెరికా వ్యవసాయోత్పత్తులు కూడా భారత్‌లోకి భారీగా వచ్చి పడే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో దిగుమతుల్లో అసాధారణ ధోరణులేమైనా కనిపించిన పక్షంలో దేశీ పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా యాంటీ–డంపింగ్ సుంకాల్లాంటివి విధించవచ్చని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ సత్య శ్రీనివాస్ చెప్పారు. కమోడిటీలు, దేశాలవారీగా ట్రెండ్స్‌ను మానిటరింగ్ గ్రూప్ ప్రతి వారం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.ఇందులో వాణిజ్య శాఖ, డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్), సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్రీయ బోర్డు), పరిశ్రమలు .. అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మొదలైన విభాగాల నుంచి ప్రతినిధులు ఉన్నారు. -
ఎవరీ రేష్మా కేవల్రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్‌లో చోటు..
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. అందులో ఈసారి భారతీయులెవరకీ చోటు దక్కలేదు. కానీ భారత సంతతి మహిళగా అమెరికన్ బయోటక్ దిగ్గజం కేవల్ రమణి చోటు దక్కించుకుని ఆ లోటుని భర్తిచేశారని చెప్పొచ్చు. అమెరికన్ పౌరురాలే అయినా భారత మూలలున్న అమ్మాయే కేవల్ రమణి. ఆమె నేపథ్యం ఏంటీ..?ఎలా అత్యంత ప్రతిష్టాత్మకమైన టైమ్స్ జాబితాలో స్థానం దక్కించుకోగలిగింది అంటే..2020ల టైంలో ఇలానే రేష్మా కేవల్రమణి వార్తల్లో నిలిచారు. ఆ ఏడాది యునైటెడ్ స్టేట్స్లో ఒక ప్రధాన బయోటెక్ సంస్థకు నాయకత్వం వహించిన తొలి మహిళగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ అయిన US-ఆధారిత వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో రేష్మ కేవల్రమణి. ఆమె ఈ ఏడాది టైమ్ మ్యగజైన్ వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అంతేగాదు ఈ ఏడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత సంతతి వ్యక్తిగా నిలిచారామె. అలాగే ఆమె జన్యు వైద్యంలో సంచలనాత్మక ఆవిష్కరణలతో కంపెనీని ముందంజలో నిలిపింది. పైగా ఆమె నాయకత్వంలోనే వెర్టెక్స్ మొట్టమొదటి CRISPR-ఆధారిత చికిత్సకు FDA ఆమోదం పొంది గణనీయమైన పురోగతిని అందుకోవడం తోపాటు అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఇది సికిల్ సెల్ వ్యాధికి విప్లవాత్మక చికిత్స. ఆ ఔషధం ఆ పరిస్థితికి ప్రధానమైన DNA ఉత్పరివర్తనలను సరిచేస్తుంది. టైమ్ ప్రోఫైల్ కూడా దీన్నే హైలెట్ చేస్తూ..ఆమెను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు ఇచ్చి.. మరీ గౌరవించింది. అలాగే జింగో బయోవర్క్స్ వ్యవస్థాపకుడు జాసన్ కెల్లీ..రేష్మా దూరదృష్టి విధానాన్ని కొనియాడారు. మన శరీరాలు డీఎన్ఏ భాషను మాట్లాడతాయి. రానున్నకాలంలో అత్యంత శక్తివంతమైనవి ఆ మందులేనని, అవి అదే భాషను తిరిగి మాట్లాడతాయని, పైగా మరిన్ని రుగ్మతలను నివారిస్తాయని అన్నారు కెల్లీ.రేష్మా విద్యా నేపథ్యం..ముంబైలో జన్మించిన రేష్మా 1988లో యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. అక్కడే ఆమె వైద్య వృత్తిని కొనసాగించింది. బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసింది. తదనంతరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో ఫెలోషిప్ పొందింది. ఆ తర్వాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది. ఆమె 2017లో వెర్టెక్స్‌లో చేరి త్వరితగతిన అంచెలంచెలుగా ఎదిగి.. 2018లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, అక్కడ నుంచి రెండేళ్లకే సీఈవో స్థాయికి చేరుకున్న ప్రతిభావంతురాలామె.(చదవండి: World Hemophilia Day: చిన్న గాయమైన రక్తంధారగా పోతుందా..? తస్మాత్ జాగ్రత్త..!) -
ఉత్తరకొరియా మరో సంచలనం.. కిమ్ ప్లాన్‌తో ప్రపంచానికే హెచ్చరిక!
పాంగ్య్యాంగ్: ఉత్తరకొరియా తన శత్రు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిత్యం క్షిపణి పరీక్షలతో కవ్వించే కిమ్.. ఇప్పుడు అత్యాధునిక యుద్ధనౌకను తయారుచేసే పనిలో స్పీడ్ పెంచారు. మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు తీసిన చిత్రాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉత్తర కొరియా నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. కిమ్ అధికారం చేపట్టాక సైనిక దళాలను అత్యంత వేగంగా ఆధునికీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా నౌకాదళం ఓ అతిపెద్ద నౌకను తయారుచేసే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆ యుద్ధ నౌకపై ఆయుధ, అంతర్గత వ్యవస్థలను నిర్మిస్తున్నారు. దీని పనులు ఆ దేశ ఉత్తర తీరంలో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు పసిగట్టాయి. ప్రస్తుతం ఆ దేశ నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉందని సమాచారం. దీని పొడవు సుమారు 140 మీటర్లుగా అంచనా వేశారు. దీని నిర్మాణానికి అవసరమైన టెక్నాలజీ మాస్కో నుంచి అంది ఉంటుందని దక్షిణ కొరియా నిపుణులు చెబుతున్నారు.***UPDATE***New warship revealed by #NorthKorea hints at VLS and phased array radars. #OSINT pic.twitter.com/2pzm01QcLr— H I Sutton (@CovertShores) December 29, 2024ఇదిలా ఉండగా.. అమెరికాకు చేరే స్థాయి ఖండాంతర క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా సమకూర్చుకొంది. ఈ ఆయుధాల తయారీకి అవసరమైన టెక్నాలజీ, పరికరాలను ఎవరూ ఉత్తరకొరియాకు విక్రయించకుండా ఐరాస ఆంక్షలు విధించింది. రష్యాతో మంచి సంబంధాలు ఉండటంతో ఆంక్షల ప్రభావం లేకుండా చూసుకొంది. మొత్తానికి ఈ భారీ నౌక నిర్మాణం ఉత్తర కొరియా సైనిక శక్తిని మెరుగుపరిచే మరో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. దీంతో, అమెరికా.. ఈ విషయంపై ఫోకస్ పెంచే అవకాశం ఉంది.🇰🇵🛳️ North Korea is building the largest warship in its arsenal, measuring 140 meters long, — CNN.❗️The missile frigate is said to have vertical launchers for missiles at air and ground targets. DPRK receiving military technology from Russia, as it is under strict sanctions. pic.twitter.com/ivEEVwmQAY— MAKS 24 🇺🇦👀 (@Maks_NAFO_FELLA) April 14, 2025 -
కెనడా వర్సిటీల వైపు అమెరికా విద్యార్థుల చూపు
అమెరికాలో విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారించారు. ట్రంప్ విధానాల నేపథ్యంలో కెనడియన్ విశ్వవిద్యాలయా లు అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయ డం, యూనివర్సిటీ నిధులను తగ్గించడంవంటి చర్యల ఫలితంగా.. యూనివ ర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొ లంబియా (యూబీసీ), యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్శిటీ ఆఫ్ వాటర్లూ వంటి కెనడియన్ విశ్వవిద్యాలయాలకు అమెరికా విద్యార్థుల దరఖాస్తులు పెరిగాయి. వాంకోవర్‌లో ఉన్న యూబీసీ క్యాంపస్‌లో 2024తో పోలిస్తే మార్చి1 నాటికి యూఎస్ పౌరుల నుంచి గ్రాడ్యుయేషన్ దరఖాస్తుల్లో 27% పెరుగుదల నమోదైంది. ఈ సంస్థ కొన్ని ప్రోగ్రామ్స్ కోసం అడ్మిషన్లను ఈవారం కూ డా తిరిగి తెరిచింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్ 2025 నాటికి యూఎస్ విద్యార్థుల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. టొరంటో విశ్వవిద్యాలయానికి కూడా సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో యూఎస్ నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటర్లూ విశ్వవిద్యాలయంలో, సెపె్టంబర్ 2024 నుంచి యూఎస్ వెబ్ ట్రాఫిక్ 15% పెరిగింది. ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు క్యాంపస్‌ను వ్యక్తిగతంగా సందర్శిస్తున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకర్షణకు కారణాలు.. ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా వీసాలను రద్దు చేయడం, విదేశీ విద్యార్థుల సోష ల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించడం, కాలేజీలకు ఫెడరల్ ఫండింగ్ తగ్గించడం ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పలువురు విద్యార్థులు, కుటుంబాల్లో భవిష్యత్తుపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. స్టూడెంట్ వీసాలు, యూనివర్సిటీ ఫండింగ్పై అమెరికాలో నిరసనలు, దావాలు ఎదుర్కొంటున్న సమయంలో కెనడా విద్యకు మరింత స్థిరమైన, స్నేహపూర్వక గమ్యస్థానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడా కొన్ని పరిమితులున్నాయి. తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై కెనడా ప్రభుత్వం కూడా పరిమితి విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరిగిన క్యాంపస్ టూర్లు.. యూబీసీలో యూఎస నుంచి అండర్ గ్రాడ్యుయేయేషన్ అప్లికేషన్లు కేవలం 2% మాత్రమే పెరిగినా, అమెరి కన్–నిర్దేశిత క్యాంపస్ టూర్లు మాత్రం 20% పెరిగాయి. ఆసక్తి పెరుగుతోందని, ఎక్కువ మంది విద్యార్థులు కెనడియన్ విశ్వవిద్యాలయాలను వాస్తవ అవకాశంగా చూస్తున్నారని ఇది సూచిస్తుంది. తమ క్యాంపస్‌లకు అంతర్జాతీయ విద్యార్థులను పంపే మొదటి మూడు దేశాల్లో అమెరికా ఇప్పటికే ఒకటి అని యూబీసీ వార్షిక నివేదిక పేర్కొంది. ఇప్పటికే సుమారు 1,500 మంది యూఎస్ విద్యార్థులు యూబీసీలో గ్రాడ్యుయేషన్, అండర్‌గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. -
స్టైòపెండ్తో పాటు విమాన టికెట్
వాషింగ్టన్: అమెరికాలోని అక్రమ వలసదారుల పట్ల కఠిన వైఖరి ఆవలంబిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్తంత మెత్తబడ్డారు. ‘సెల్ఫ్–డిపోర్ట్’ఆప్షన్ ఎంచుకునే వలసదారులకు విమాన టికెట్లు కొనివ్వడంతోపాటు స్టైఫండ్‌గా కొంత డబ్బు కూడా అందజేయాలనే యోచన ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ఇది అన్ని దేశాల వలసదారులకూ వర్తిస్తుందన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం వెల్లడించారు. ప్రస్తుతం హంతకులను మాత్రమే దేశం నుంచి పంపించివేస్తున్నామంటూనే ఆయన.. అక్రమంగా ఉంటున్న ఇతరులకు సాయప డేందుకు ‘సెల్ఫ్–డిపోర్టేషన్ ప్రోగ్రామ్’ను అమలు చేయనున్నామన్నారు. సొంత దేశాలకు వెళ్లాక వీరిలో సత్ప్రవర్తన కలిగి ఉన్న వారిని తిరిగి అమెరికాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి వర్తింపజేస్తారు, ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ట్రంప్ జనవరిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను నిర్బంధించి, వారిని బలవంతంగా సొంత దేశాలకు పంపిస్తున్న విషయం తెల్సిందే. ఇంటర్వ్యూ సందర్భంగా ఫాక్స్ న్యూస్ యాంకర్ రాచెల్ కంపోస్–డఫీ మెక్సికో వాసి వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. ‘నేను ట్రంప్‌కు ఓటేయలేదు. అయినప్పటికీ నా మద్దతు ట్రంప్‌కే. నేరాలకు పాల్పడిన వారిని, నాతో సహా ఎవరినైనా సరే సొంత దేశాలకు పంపించడంలో తప్పులేదు’అని ఆ వ్యక్తి తెలిపాడు. ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు అమెరికా పౌరుడు..భార్య, పిల్లలు కూడా ఉన్నారని యాంకర్ డఫీ వివరించారు. ఇది చూసిన ట్రంప్..తమకు కావల్సింది ఇలాంటి వాళ్లేనన్నారు. అతడికి డిపోర్టేషన్ ముప్పు ఉన్నట్లు భావించడం లేదన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించుకునే అవకాశం ఇవ్వడం ద్వారా హోటళ్లు, వ్యవసాయ క్షేత్రాల యజమానులకు సాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లు సొంత దేశాలకు వెళ్లిపోయి, తిరిగి చట్టబద్ధంగా అమెరికా రావాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ ఆయన వెల్లడించలేదు. -
చైనాపై సుంకాలు 245%
వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ భీకరంగా మారుతోంది. బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఫ్యాక్టషీట్ విడుదల చేసింది. అరుదైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల కోసం విదేశాలపై విపరీతంగా ఆధారపడడం వల్లే తలెత్తే భద్రతాపరమైన ప్రమాదాలపై విచారణకు ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారని వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరోసారి అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ’ని మొదటి రోజే ప్రారంభించారని గుర్తుచేసింది. నూతన వాణిజ్య ఒప్పందాలు, సుంకాలపై 75కు పైగా దేశాలు అమెరికాతో చర్చలకు ముందుకొచ్చాయని పేర్కొంది. అందుకే ఆయా దేశాలపై సుంకాలను వాయిదా వేసినట్లు వెల్లడించింది. చైనాపై మాత్రం ప్రతీకార సుంకాలు కొనసాగుతాయని తేల్చిచెప్పింది. చైనా ఉత్పత్తులను ఇకపై అమెరికాలో విక్రయించాలంటే 245 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ఫ్యాక్ట్‌షీట్‌లో స్పష్టంచేసింది. చైనా–అమెరికా మధ్య కొంతకాలంగా టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా ఉత్ప త్తులపై అమెరికా ఇప్పటికే 145 శాతం టారిఫ్‌లు విధించింది. అమెరికా నుంచి బోయింగ్ విమానాల కొనుగోలుపై నిషేధం విధించిన మరుసటి రోజే టారిఫ్‌లను అదనంగా 100 శాతం పెంచడం గమనార్హం. బోయింగ్ విమానాలు కొనుగోలు చేయవద్దని చైనా నిర్ణయించడం పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒప్పందం నుంచి మధ్యలో విరమించుకోవడం సరైంది కాదంటూ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రత్యర్థులతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో అమెరికా ప్రయోజనాలు కచ్చితంగా కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. టారిఫ్ వార్‌ను ముగించే విషయంలో చైనాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఆ అవసరం చైనాకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం బంతి చైనా కోర్టులోనే ఉందని వెల్లడించారు.చర్చల సంధానకర్తగా లీ చెంగాంగ్ నియామకం టారిఫ్ యుద్ధాన్ని విరమించే విషయంలో బంతి చైనా కోర్టులో ఉందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేసిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో చర్చలకు మొగ్గుచూపింది. చర్చల కోసం సంధానకర్తగా లీ చెంగాంగ్‌ను నియమించింది. వాంగ్ షౌవెన్ స్థానంలో లీ చెంగాంగ్‌ను నియమిస్తున్నట్ల చైనా వాణిజ్య శాఖ బుధవారం ప్రకటించింది. 2020లో అమెరికా, చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో చెంగాంగ్ పాల్గొన్నారు. ఆయన గతంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో చైనా రాయబారిగా సేవలందించారు. -
హార్వర్డ్ ప్రతిఘటనా స్వరం!
అంతటా ఒక అనిశ్చితి, దాన్ని మించిన సందిగ్ధత అలముకున్నవేళ నిశ్చయంగా, నిర్భయంగా వినబడిన గొంతు ఇప్పుడు అమెరికాలో సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది. ఆ గొంతు ప్రపంచంలోనే అత్యుత్తమశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటైన హార్వర్డ్ విశ్వవిద్యాలయానిది. ఆ విశ్వవిద్యాలయం ఇంతవరకూ లక్షలాది విద్యార్థులకు పాఠం చెప్పివుండొచ్చు. కానీ తనతో ఏకీభవించనివారిని ససేమిరా సహించని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వంటి నేతకు పాఠం నేర్పాలని చూస్తే భారీ మూల్యం చెల్లించాల్సివుంటుంది. అది తెలిసి కూడా హార్వర్డ్ దృఢంగా నిలబడటం ఈ కాలంలో అతి పెద్ద వార్త. పాలస్తీనా అనుకూల ఉద్యమకారుల్ని పట్టించి ఇవ్వాలనీ... వైవిధ్యత, సమానత, సమ్మిళిత (డీఈఐ) విధానాల ద్వారా ‘అందరికీ అవకాశాలిచ్చే’ పేరిట ప్రతిభపై వివక్ష ప్రదర్శిస్తున్న వైఖరి విడనాడాలనీ ట్రంప్ కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు. ఒప్పుకోకుంటే నిధులు ఆపేస్తామని హుకుం జారీచేశారు. దేశంలోని 60 ప్రధాన విశ్వవిద్యాలయాల్లో చాలా భాగం ఆయన ఆదేశాలకు తలొంచాయి. కానీ హార్వర్డ్ నిర్భయంగా నిలబడింది. ‘మా వ్యవహారాల్లో మీకేం పన’ని ఎదురు ప్రశ్నించింది. వర్త మాన పరిస్థితుల్లో ఈ చర్య చిన్నదేం కాదు. మొన్న జనవరిలో అధికార పగ్గాలు చేపట్టింది మొదలు ట్రంప్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కోర్టులనే ధిక్కరిస్తున్నారు. అక్రమ వలసదారుగా పొర బడి, ఒక పౌరుడిని ఎల్‌సాల్వెడార్ జైలుకు పంపిన వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. పొరబడ్డా మని ఒప్పుకుంటూనే అతన్ని వెనక్కితేలేమని కోర్టులో ప్రభుత్వం మొండికేసింది. ఆరు నూరైనా తేవాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించగా మౌనమే జవాబైంది. మర్నాడు అమెరికా సందర్శించిన ఎల్‌సాల్వెడార్ అధ్యక్షుడు ‘అతన్ని అప్పగించేది లేద’ంటూ సాక్షాత్తూ వైట్‌హౌస్‌లో ప్రకటించారు.విశ్వవిద్యాలయాలు కళాశాలల కన్నా భిన్నమైనవి. అవి ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తాయి. కొత్త ఆలోచనల్ని స్వాగతిస్తాయి. భిన్న ధోరణులపై పరిశోధనకు అవకాశమిస్తాయి. అందుకే అవి జ్ఞానకేంద్రాలు. ఎంతమందికి పట్టాలు పంపిణీ చేశామన్నది కాక, ఎటువంటి విశిష్ట వ్యక్తులను సమాజానికి అందించగలిగామన్నది లెక్కేస్తాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా సర్కారు విశ్వ విద్యాలయ పరిశోధనలకూ, సృజనాత్మక ఆవిష్కరణలకూ భారీయెత్తున ఖర్చుచేసింది. ఫలితంగా అపారసంఖ్యలో ఆవిష్కరణలు సాధ్యమయ్యాయి. అనేక కొత్త ఉపకరణాలు అందుబాటులో కొచ్చాయి. చికిత్సకు లొంగని ఎన్నో వ్యాధులు చిత్తగించాయి. ఆయుఃప్రమాణం పెరిగింది. కంప్యూ టర్లు మొదలుకొని రోబోటిక్స్, కృత్రిమ మేధ వరకూ అన్నిటికన్నీ కేవలం ఈ పరిశోధనల పర్యవసానమే. లైబ్రరీలు, లేబొరేటరీలు దాటుకుని పరిశ్రమల్లో పురుడు పోసుకున్న ఉత్పత్తులు ఎన్నెన్నో! వాటివల్ల అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. పర్యవసానంగా ఇదంతా సమాజ ఆధునికతకు తోడ్పడింది. గత నెలలో విడుదలైన ఒక నివేదిక ప్రకారం జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ఐహెచ్) నిరుడు పరిశోధనలకు వ్యయం చేసిన 3,690 కోట్ల డాలర్ల సొమ్ము 9,450 కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడింది. సరుకుల తయారీ, పంపిణీ, వినియోగం, ఇతర అనుబంధ సర్వీసులు ఈ కార్యకలాపాల్లో భాగం. 4,08,000 ఉద్యోగాల కల్పన సాధ్యమైంది.కానీ ట్రంప్ సర్కారు దీన్ని అంగీకరించటం లేదు. అవి ఏం చేయాలో, చేయకూడదో నిర్దేశిస్తున్నారు. సాష్టాంగపడమంటున్నారు. అందుకు సిద్ధపడినా కనికరించటంలేదు. పేరుప్రఖ్యాతులున్న కొలంబియా విశ్వవిద్యాలయ దుఃస్థితే అందుకు ఉదాహరణ. ఆ క్యాంపస్‌లో కొంతకాలం క్రితం జరిగిన పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి, వారి అరెస్టుకు సహకరించాలనటంతో మొదలుపెట్టి ప్రభుత్వం అనేక డిమాండ్లు పెట్టింది. మూడు డజన్లమంది ‘ప్రత్యేక అధికారుల’ను తక్షణం నియమించడం అందులో ఒకటి. ఆ ప్రత్యేకాధికారులకు పాలస్తీనా అను కూల విద్యార్థులను గుర్తించి అవసరమైనప్పుడు అరెస్టుచేసే అధికారాలున్నాయి. విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అధ్యయనాల విభాగాన్ని పర్యవేక్షించే అధిపతిని నియమించాలన్న ప్రభుత్వ తాఖీ దును సైతం ఆమోదించింది. ఆ విభాగం సిలబస్‌ను నిశితంగా పరిశీలించి మార్పులు చేర్పులూ సూచిస్తుంది. ఇన్ని చేసినా ఆ విశ్వవిద్యాలయానికి విడుదల చేయాల్సిన 40 కోట్ల డాలర్ల నిధులనూ నిలిపివేసింది. విశ్వవిద్యాలయ తాత్కాలిక అధ్యక్షురాలు కత్రినా ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాను తీసుకుంటున్న చర్యలను నిరసించిన విశ్వ విద్యాలయ ఆచార్యులకు ఇవి చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమేనని కత్రినా వివరించారు. అయినా నిధుల విడుదల జాడ లేకపోవటంతో కొలంబియా యాజమాన్యం ఆమెకు ఉద్వాసన పలికింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం సంగతికే వస్తే, తిరుగుబాటుకు తక్షణ మూల్యం 220 కోట్ల డాలర్ల గ్రాంటు, 6 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు నిలిచిపోవటం. ఇవిగాక పన్ను మినహాయింపులు కూడా ఆపేస్తామని సర్కారు బెదిరిస్తోంది. నిజానికి మొదటే ప్రధాన యూనివర్సిటీలన్నీ ప్రభుత్వ బెదిరింపులను ముక్తకంఠంతో నిరసించాల్సింది. కానీ ఇప్పటికి కూడా ఎవరికి వారు ట్రంప్ కంట్లో పడకుంటే చాలన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ చాలా సంస్థలు గోడమీది పిల్లివాటంగా ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాలపై సర్కారువారి సంపూర్ణ పెత్తనాన్ని అంగీకరించాలన్నది ట్రంప్ ఆంతర్యం. యూదు వ్యతిరేకత, వివక్ష విధానాల అమలు వంటి ఆరోపణలన్నీ పైకి చెబుతున్న కారణాలు. దీన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అమెరికా విశ్వవిద్యాలయాలకు అంత మంచిది. ఇన్నాళ్లూ తాము బోధించిన విలువల కోసం నిలబడితేనే వాటి గౌరవమర్యాదలు కాస్తయినా నిలబడతాయి. -
రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు. -
అమెరికా ఇరాన్ మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు
-
అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చిన చైనా
-
ట్రంప్‌కు కీలెరిగి వాత
అరుదైన ఖనిజాల ఎగుమతుల నిలిపివేత ద్వారా అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతం.కానీ దేశీయ, ముఖ్యంగా రక్షణ అవసరాలను తీర్చేందుకు ఆ నిల్వలు ఏ మూలకూ చాలవు. మలేసియా, జపాన్ సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా అవి 30 శాతం అవసరాలనే తీర్చగలుగుతున్నాయి. దాంతో మరో దారిలేక అగ్ర రాజ్యం ఇంతకాలంగా చైనా దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడుతూ వస్తోంది. తన అరుదైన ఖనిజ అవసరాల్లో 70 శాతం అక్కడినుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా ఇప్పుడు సరిగ్గా గురి చూసి ఆ కీలకమైన సరఫరా లింకును మొత్తానికే తెగ్గొట్టింది.17 రకాల అరుదైన ఖనిజాల్లో సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం రూపంలో ప్రస్తుతానికి ఏడింటికి ఎగుమతుల నిషేధాన్ని వర్తింపజేసింది. వీటితో పాటు పలు కీలక లోహాలు, అయస్కాంత వస్తువులను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇకపై చైనా కంపెనీలు వీటిని ఎగుమతి చేయాలంటే ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిందే. చైనా నిర్ణయం పలు అమెరికానే గాక చాలా దేశాలనూ ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా యూరప్ దేశాలకైతే పిడుగుపాటే. వాటి అరుదైన ఖనిజాల అవసరాల్లో సగటున 46 శాతం దాకా చైనా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి.అనుమానమే నిజమైందిఅత్యంత కీలకమైన ఖనిజ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా రక్షణ శాఖ ముందునుంచీ మొత్తుకుంటూనే ఉంది. ఇది జాతీయ భద్రతకే ముప్పని 2024 మార్చి 11న అధ్యక్షునికి పంపిన ఓ నోట్లో స్పష్టంగా పేర్కొంది కూడా. ఈ విషయంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలావరకు చైనామీదే ఆధారపడాల్సి రావడంపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఆ భయాలే ఇప్పుడు నిజమయ్యాయి. రక్షణ పాటవం పెంచుకోవడంలో అమెరికా, చైనా కొన్నేళ్లుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.కీలక ఖనిజాలపై ఆంక్షలతో ఈ పోటీలో అగ్ర రాజ్యాన్ని దాటి చైనా దూసుకెళ్లేలా కన్పిస్తోంది. ఈ సమస్యను అధిగమించే మార్గాలపై అమెరికా రక్షణ శాఖ కొంతకాలంగా గట్టిగా దృష్టి సారించింది. దేశీయంగా అరుదైన ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇతోధికంగా పెంచుకునేలా ‘మైన్ టు మాగ్నెట్’ పేరిట ఐదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఆలోగా జరిగే అపార నష్టాన్ని భర్తీ చేసుకునే మార్గాంతరాలు కన్పించక ట్రంప్ సర్కారు తలపట్టుకుంటోంది.అన్నింట్లోనూ అవే కీలకంఫైటర్ జెట్లు మొదలుకుని కీలకమైన రక్షణ వ్యవస్థలన్నింట్లోనూ అరుదైన ఖనిజాలది కీలక పాత్ర. ఎఫ్–35 యుద్ధ విమానాలు, వర్జీనియా–కొలంబియా శ్రేణి జలాంతర్గాములు, తోమహాక్ క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, ప్రిడేటర్ శ్రేణి మానవరహిత వైమానిక వాహనాలు, మ్యునిషన్ సిరీస్ స్మార్ట్ బాంబులు... ఇలా దేని తయారీకైనా అవి కావాల్సిందేనని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వివరించింది.⇒ ఒక ఎఫ్–35 యుద్ధ విమానం తయారీకి 900 పౌండ్ల (400 కిలోల) మేరకు అరుదైన ఖనిజాలు కావాలి.⇒ అర్లే బ్రూక్ శ్రేణి డీడీజీ–51 డిస్ట్రాయర్ యుద్ధనౌక తయారీకి ఏకంగా 5,200 పౌండ్లు (2,300 కిలోలు) అవసరం.⇒ అదే వర్జీనియా శ్రేణి జలాంతర్గామి నిర్మాణానికి 9,200 పౌండ్ల (4,173 కిలోల) అరుదైన ఖనిజాలు అవసరం.ఆందోళనకరమే⇒ ఖనిజాలపై చైనాతో చర్చిస్తాం ⇒ ట్రంప్ ఆర్థిక సలహాదారువాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, కీలక లోహాలు, అయస్కాంత పదార్థాల ఎగుమతులను నిలిపేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం అమెరికాను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశమేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హసెట్ అంగీకరించారు. సోమవారం ఆయన వైట్‌హౌస్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ అరుదైన ఖనిజాల అవసరం రక్షణ, టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు చాలా ఉంటుంది.చైనా నిర్ణయాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఈ విషయమై మాకు అందుబాటులో ఉన్న అన్ని ఇతర అవకాశాలనూ పరిశీలిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. బహుశా డ్రాగన్ దేశంతో తాము చర్చలు జరిపే అవకాశాలు లేకపోలేదన్నారు. చైనా నిర్ణయంతో పలు యూరప్ దేశాల్లో కూడా ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్లు తదితర కంపెనీలు తీవ్రంగా ప్రభావితమవుతాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుతుందన్న వాదనను హసెట్ తోసిపుచ్చారు. అమెరికా, చైనా మధ్య తీవ్రస్థాయి టారిఫ్‌ల పోరు సాగుతున్న విషయం తెలిసిందే. -
‘అమెరికా విమానాల్ని కొనుగోలు చేయొద్దు’.. జిన్‌పింగ్ ఆదేశాలు
బీజింగ్: అమెరికా-చైనాల మధ్య టారిఫ్ వార్ (China–United States trade war) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే చైనా పలు కీలక ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నిలిపివేసింది. ఆ దేశ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం మానేసింది. తాజాగా అమెరికాలోని విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు (Boeing) చెందిన విమానాల్ని కొనుగోలు చేయొద్దని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) ఆ దేశ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. బ్లూమ్‌బర్గ్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా, చైనా నుంచి దిగుమతులపై 145 శాతం వరకు టారిఫ్‌లు విధించింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం కస్టమ్స్ టారిఫ్‌లు విధించింది. ఈ తరుణంలో చైనా, దేశీయ విమానయాన సంస్థలు బోయింగ్ విమానాలను కొనుగోలు చేయకుండా ఆదేశించినట్టు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. అంతేకాకుండా, అమెరికా నుండి విమాన భాగాలు,ఉపకరణాల కొనుగోళ్లను కూడా నిలిపివేయాలని పేర్కొంది. అదే సమయంలో విమానాల లీజు తీసుకునే సంస్థలకు చైనా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ట్రంప్ విధించిన టారిఫ్‌లు ప్రపంచ మార్కెట్లను గందరగోళంలోకి నెట్టేశాయి. మిత్రదేశాలు, ప్రత్యర్థులతో కూడిన సంబంధాలపై ప్రభావం చూపించాయి. గత వారం ట్రంప్, కొత్త టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేశానని ప్రకటించినా, చైనాకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అమెరికా అధికారులు ఇటీవల స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు,సెమీకండక్టర్లు వంటి హైటెక్ ఉత్పత్తులపై టారిఫ్ మినహాయింపులు ప్రకటించారు.🚨🇺🇸🇨🇳China orders its airlines to halt any further deliveries of Boeing $BA jets as the Trade War with the U.S. heats up.$BA stock is down 3% in reaction to the news. pic.twitter.com/7xjCI0Heru— Jesse Cohen (@JesseCohenInv) April 15, 2025 -
డిస్కస్ త్రోలో కొత్త ప్రపంచ రికార్డు
రామోనా (అమెరికా): పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో క్రీడాంశంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఒక్లాహోమా త్రోస్ సిరీస్ వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవెల్ మీట్లో లిథువేనియాకు చెందిన మికోలస్ అలెక్నా (Mykolas Alekna- 75.56 మీటర్లు) ఈ ఘనత సాధించాడు. స్వర్ణ పతకం గెలిచే క్రమంలో 22 ఏళ్ల అలెక్నా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును రెండుసార్లు తిరగ రాయడం విశేషం. గత ఏడాది ఇదే మీట్లో అలెక్నా డిస్క్‌ను 74.35 మీటర్ల దూరం విసిరి... 1986 నుంచి జుర్గెన్ షుల్ట్ (జర్మనీ; 74.08 మీటర్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మికోలస్ రజత పతకం గెలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఒక్లాహోమో మీట్లో అలెక్నా తొలి ప్రయత్నంలో డిస్క్‌ను 74.89 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డును సవరించాడు. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో డిస్క్‌ను 75.56 మీటర్ల దూరం విసిరి మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా డిస్క్‌ను 75 మీటర్ల దూరం విసిరిన తొలి అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. తండ్రి బాటలోమికోలస్కు ఘనమైన క్రీడా కుటుంబ నేపథ్యం ఉంది. మికోలస్ తండ్రి వర్జిలియస్ అలెక్నా కూడా విఖ్యాత డిస్కస్ త్రోయర్ కావడం విశేషం. 6 అడుగుల 7 అంగుళాల ఎత్తు, 130 కేజీల బరువున్న వర్జిలియస్ 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో సర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించాడు. 2003 పారిస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2005 హెల్సింకి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు నెగ్గిన వర్జిలియస్... 1997 ఏథెన్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2001 ఎడ్మంటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా తన కెరీర్లో వర్జిలియస్ 12 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు గెలిచాడు. 2014లో రిటైర్మెంట్ ప్రకటించిన 53 ఏళ్ల వర్జిలియస్ రాజకీయాల్లో ప్రవేశించి లిథువేనియా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. -
అమెరికా ఫస్ట్ నినాదం.. ట్రంప్, మస్క్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో పలు దేశాలను టార్గెట్ చేసి ఇష్టానుసారం భారీగా సుంకాలు వడ్డీస్తున్నారు. దీంతో, ఇక ప్రపంచీకరణ ముగిసినట్లేనని పలువురు దేశాధినేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, ట్రంప్ మాత్రం.. అమెరికన్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కాపాడేందుకు ఇతర దేశాల దిగుమతులపై భారీ సుంకాలను విధిస్తున్నట్టు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రారంభమైన గ్లోబలైజేషన్ ఇక ముగిసినట్టే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. అలాగే, ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచడంపై దేశాలు ఫోకస్ పెడుతున్నాయి. అటు, అమెరికా సైతం స్థానిక వనరులనే వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా.. ఫన్నీ వీడియోలు షేర్ చేస్తున్నారు.తాజా ఓ నెటిజన్ ట్రంప్, ఎలాన్ మస్క్‌కు చెందిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్, మస్క్‌లు అమెరికా అభివృద్ధి కోసం ఇప్పుడే పనులు మొదలు పెడుతున్నట్టు ఉంది. ట్రంప్ పొలంలో నాట్లు వేస్తూ.. మస్క్ చీపురుతో ఊడుస్తున్నట్టుగా, జేడీ వాన్స్ షూ తయారు చేస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇలా.. మెల్లగా పనులు చేస్తే ఎప్పటికి అమెరికా అభివృద్ధి చెందుతుంది అన్నట్టు ఫన్నీ కామెంట్స్ పెట్టారు.A couple new characters introduced in this one. pic.twitter.com/8lO3IaIiFA— MAGA Cult Slayer🦅🇺🇸 (@MAGACult2) April 13, 2025మరో నెటిజన్ ట్రంప్, జిన్‌పింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో చైనా టారిఫ్‌ల దెబ్బకు ట్రంప్ విలవిల్లాడిపోతున్నట్టుగా ఉంది.Trump opens a portal to the Upside Down and finds Xi waiting with a 125% tariff in this Stranger Things parody gone full trade war chaos 😱🌀📉💼🔥👔😂 #StrangerTariffs #UpsideDownEconomics #TrumpVsXi #TradeWarParody #StrangerThingsSpoof #MadeInChina #PoliticalParody… pic.twitter.com/zVmr8jchMB— Julius Dein (@JuliusDein) April 11, 2025 Who wore their tariff best? 💃📉🔥 Watch as world leaders strut their stuff in the most ridiculous outfits, proudly flexing their import taxes like it’s Paris Fashion Week for sanctions. 🇺🇸🇨🇳👠 #TariffFashionShow #GlobalDrip #Sanction #CustomsCouture #TradeWarLooks #china… pic.twitter.com/jpxmnmwl9w— Julius Dein (@JuliusDein) April 3, 2025 Trump’s MAGA hat says “Made in China 🇨🇳🧢 and Xi’s somewhere in Beijing cackling like he just won the trade war 😂🤡 #MakeAmericaManufactureAgain #TradeWar #MAGAhat #PoliticalSatire #XiLaughsLast #ManufacturingIrony #MadeInChina #USA🇺🇸 #GlobalLOL pic.twitter.com/3zOSPDR5ax— Julius Dein (@JuliusDein) April 11, 2025Trump and Elon Musk mocked in new AI video showing them as factory workers. pic.twitter.com/wAEXcmlYOK— Daily Mail Online (@MailOnline) April 10, 2025In 2025, AI surpasses all expectations, enabling thousands to become more creative, something that Trump certainly did not anticipate.😂 pic.twitter.com/NTbnGzp8LB— Johannes Maria (@luo_yuehan) April 12, 2025 -
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్ ప్లాన్‌తో టెన్షన్లో ట్రంప్!
వాషింగ్టన్: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదంటూ చైనా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చైనా గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా నిర్ణయంపై వైట్‌హౌస్ స్పందించారు.తాజాగా ట్రంప్ ముఖ్య ఆర్థిక సలహాదారుల్లో ఒకరైన కెవిన్ హసెట్ మాట్లాడుతూ..‘చైనా అరుదైన ఖనిజాల నిలిపివేత ఆందోళనకరం. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఖనిజాలు లేకపోవడం అమెరికాకు నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ అంశంపై పలు మార్గాలను అన్వేషిస్తున్నామని’ అన్నారు. ఇదే సమయంలో ట్రంప్ తన టారిఫ్ ప్రణాళికలతో ప్రపంచ వాణిజ్యానికి ఆర్థిక మాంద్యం తెచ్చే పరిస్థితులు వందకు వంద శాతం లేవని క్లారిటీ ఇచ్చారు.The chart shows how much the US relies on imports for rare earth metals, what they are used for, and how much of the imports come from China. A good one from JPM-AM. pic.twitter.com/xQalD5ZyH7— Ayesha Tariq, CFA (@AyeshaTariq) April 14, 2025మరోవైపు.. ఇదే అంశంపై యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనా.. పరస్పర సుంకాలపై రెండు దేశాలు బెదిరింపులకు దిగుతున్నప్పటికీ దీనిపై ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదన్నారు. అలాగే, చైనాతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో ఒప్పందం కాస్త కష్టమేనని వ్యాఖ్యానించారు. ఎందుకంటే తమ దేశానికి చైనా అతిపెద్ద ఆర్థిక పోటీదారని, సైనిక ప్రత్యర్థి అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికా ఈ ఖనిజాలను 90 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఏప్రిల్ రెండు నుంచి చైనా వాటిని నియంత్రణ జాబితాలో చేర్చింది. అమెరికాకు ఒక అరుదైన లోహాలు ఉత్పత్తి చేసే గని కూడా ఉంది. అయినా ఆ దేశ వినియోగంలో ఎక్కువ భాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ ఖనిజాలపైనే కాకుండా అయస్కాంతాల ఎగుమతిని డ్రాగన్ నిలిపివేసింది. దీంతో, ట్రంప్ సర్కార్‌కు ఊహించని షాక్ తగిలింది.BREAKING: Trump Administration’s Kevin Hassett says he’s “100 percent not expecting a recession.”He claims that job numbers are through the roof as the reason why.Does he not realize that Job numbers are from the month of March and Tariffs started in the beginning of April?… pic.twitter.com/DjXuC1vfT9— Ed Krassenstein (@EdKrassen) April 14, 2025ఇక.. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం సుంకం విధించగా.. చైనా కూడా అంతే వేగంగా దూకుడు ప్రదర్శించింది. అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇక, ఈ టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి రాయితీ లభించదని తేల్చి చెప్పేశారు. ఆ దేశం తమతో దారుణంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. -
మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా
సాక్షి, అమరావతి: దిగుమతి సుంకాల అమలు మూడు నెలల పాటు వాయిదా వేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం రొయ్యల ఎగుమతిదారులకు ఊరటనిచ్చింది. దీంతో రొయ్యలను అమెరికాకు తరలించేందుకు భారతీయ సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతుదారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగుమతికి సిద్ధంగా 40వేల టన్నులు చైనా మినహా భారత్‌తో సహా మిగిలిన దేశాలపై టారిఫ్ అమలును 3 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం ఎగుమతిదారులకు కలిసొచ్చింది. దీంతో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 2వేల కంటైనర్ల (40వేల టన్నులు) సరుకును పాత టారిఫ్ ప్రకారం అమెరికాకు పంపేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని పరిశ్రమ వర్గాలు సోమవారం తెలిపాయి. ఇదిలా ఉండగా సుంకాల భయాలున్నప్పటికీ ఆర్డర్లు తగ్గలేదని భారతీయ సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతుదారుల సమాఖ్య కార్యదర్శి కేఎన్ రాఘవన్ ప్రకటించారు.భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అమెరికారొయ్యల ఎగుమతుల్లో భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అమెరికా. అగ్రరాజ్యానికి ఆహార, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో 42.3%తో భారత్ మొదటి స్థానంలో నిలవగా, 26.9 % తో ఈక్విడార్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండోనేషియా (15.4%), వియత్నాం (7.2 %), థాయిలాండ్(2.4%), అర్జెంటీనా (2.1%) ఉన్నాయి. 2023–24 సీజన్లో అమెరికాకు 2.7 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలను భారత్ ఎగుమతి చేసింది.ట్రంప్ ప్రతీకార నిర్ణయంతో ప్రతికూలతలు ఈ నెల 4న ట్రంప్ ప్రభుత్వం విధించిన ప్రతీకార టారిఫ్ (26 శాతం) దేశీయంగా ఆక్వా రంగాన్ని కుదిపేసింది. ఈ పెంపు ఈ నెల 9 నుంచి అమలులోకి వచ్చి ఉంటే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ 5.77 శాతం, యాంటీ డంపింగ్ డ్యూటీ 3.88 శాతంతో పాటు తాజాగా విధించిన 26 శాతం కలిపి 34 శాతం సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. ఆ మేరకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న 2 వేల కంటైనర్లపై సుంకాల భారం రూ.600 కోట్లపైగా పడేది.ఇక కోల్డ్ స్టోరేజ్‌ల్లో ఉన్న మరో 2,500 కంటైనర్ల సరుకుపై పడే భారం కలిపితే రూ.1300 కోట్లకుపైగా ఉండేది. ఈ పరిణామం ఎగుమతిదారులను కలవరానికి గురిచేసింది. ఇదే సమయంలో ట్రంప్ ట్యాక్స్ సాకుతో అమెరికాకు ఎగుమతి కాని కౌంట్ ధరలను కూడా కంపెనీలు తగ్గించడంతో ఆక్వా రైతులు నష్టాల బారిన పడ్డారు. అయితే మరో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఉన్న తక్కువ సమయాన్ని అందిపుచ్చుకునేందుకు ఎగుమతిదారులు ప్రయత్నిస్తున్నారు. -
అమెరికా–ఇరాన్ తదుపరి చర్చా వేదిక రోమ్
రోమ్: ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా–ఇరాన్ మధ్య తదుపరి చర్చలు శనివారం రోమ్‌లో జరగనున్నాయి. ఇరాన్, ఇటలీ అధికారులు ఈ విషయాన్ని సోమవారం ధ్రువీకరించాయి. చర్చలకు మధ్యవర్తిగా ఉన్న ఒమన్ నుంచి అందిన వినతి మేరకు అంగీకరించినట్లు ఇటలీ ప్రధాని ఆంటోనియో టజనీ తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్‌లో శనివారం రెండు దేశాల మధ్య మొదటి రౌండ్ చర్చలు జరగడం తెల్సిందే. కాగా, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ మరియానో గ్రాస్సీ సోమవారం ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చించేందుకు బుధవారం టెహ్రాన్ వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ పరిశీలకుల బృందాన్ని అణు మౌలిక వసతులను సందర్శించేందుకు వీలు కల్పించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరే అవకాశముందని సమాచారం. -
వన్ వే రూటు
రుణపత్రాల విపణిలో ఉత్పన్నమైన అనూహ్య పరిణామాలు అమెరికా అధ్యక్షుడికి గుబులు పుట్టించాయి. అమెరికా బాండ్స్‌కు గిరాకీ పెరిగినట్లే పెరిగి వెంటనే తగ్గిపోయింది. డాలర్ ఇండెక్స్ విలువ కూడా క్షీణిస్తోంది. దీంతో కొత్త సుంకాల విధింపు అమలును 90 రోజుల పాటు నిలిపివేశారు. ఇతర ప్రపంచ దేశాల విషయంలో తాత్కాలికంగానే అయినా ఒక మెట్టు దిగిన ట్రంప్ చైనా విషయంలో మాత్రం చాలావరకు బెట్టుగానే ఉన్నారు. ఏమైనా, అమెరికా సృష్టించిన ఈ అల్లకల్లోలం రోడ్డు మ్యాపు లేని వన్ వే రూటు! ట్రంప్ సుంకాల సంక్షోభం మధ్యకాలిక అనిశ్చితిని పెంచుతుంది. ఆర్థిక కార్యకలాపాలు అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. అనిశ్చితి అనేది అంచ నాలను మార్చేస్తుంది. వ్యాపార సంస్థలు, కుటుంబాలు నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. ట్రంప్ 90 రోజుల ఊరట నిజానికి ఈ అనిశ్చితి వ్యవధిని పెంచుతుందే తప్ప, అనిశ్చితికి ముగింపు పలకదు. ఆర్థిక కార్యకాలపాల్లో తెగింపు, నిర్ణయ శక్తి కొరవడతాయి. ప్రభుత్వాలు ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ, ప్రపంచ వ్యాప్త ఆర్థిక మందగమనం తప్పదు. సుంకాల వెనుక రెండు లక్ష్యాలువిచ్ఛిన్నకర సుంకాల ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని ట్రంప్ అనుకుంటున్నారు. అమెరికా వస్తూత్పత్తుల తయారీ వ్యవస్థ ఏనాడో కుప్పకూలింది. దీన్ని పునరుద్ధరించడం మొదటిది. తద్వారా దిగువ స్థాయి ఫ్యాక్టరీ ఉద్యోగాలు విశేషంగా సృష్టి అవుతాయి. ఇక రెండోది, చైనాను శిక్షించడం. ప్రపంచ వాణిజ్య విధానాన్ని అడ్డు పెట్టుకుని అది అనుచిత ప్రయోజనం పొందుతోంది. పాతికేళ్ల క్రితమే అమెరికాలో పాగా వేయ గలిగింది. ఈ రెండో లక్ష్యం కంటే, మొదటిదే ట్రంప్ రాజకీయ మద్దతుదారులకు మరింత ముఖ్య విషయం. దేశీయంగా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కల్పించలేనప్పుడు, ధరలు పెరిగిపోతున్నప్పడు, చైనాను శిక్షించడం వల్ల అమెరికన్లకు ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ ఒక సమస్య ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి మొదటి లక్ష్యాన్ని సాధించడమే... చైనాను దెబ్బ తీయడమనే రెండో లక్ష్యం కంటే కష్టమైన విషయం. చైనా భౌగోళిక ఆర్థిక విస్తరణను అదుపు చేసే వ్యూహాలు ఇప్పటికిప్పుడు రూపొందినవి కాదు. గడచిన రెండు దశాబ్దాలుగా అమెరికాలో వీటి గురించి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు, పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయో, వీటిని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం కావాలో చైనా ప్రభుత్వానికి మంచి అవగాహనే ఉంది. మరి, ట్రేడ్ వార్ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు అమెరికా ఎంతవరకు సన్నద్ధంగా ఉందనేది ప్రశ్న. కర్మాగారాల స్థాపనకు కనీసం రెండేళ్లు పడుతుంది. ట్రంప్ నిరుద్యోగ మద్దతుదారులు అందాకా ఓర్పుతో ఉండగలరా? స్వల్పకాలంలో కష్టాలు, దీర్ఘకాలంలో లాభాలు అనే సూత్రం రాజకీయంగా కుదిరేది కాదు. ట్రంప్ స్వదేశంలోనే మద్దతు కోల్పేతే ఆయన విధానాలకు అంతర్జాతీయంగా స్పందన ఎలా ఉంటుంది?దేశాల స్పందనట్యారిఫ్ సంక్షోభం అనంతర కాలంలో ప్రపంచ దేశాలు అమెరికా మీద విశ్వాసం కోల్పోతాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు తన విధానాలు, (వివాదాస్పద) మాటలు వెనక్కు తీసుకున్నా, ఆయన ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాధిపతులు విశ్వాసంలోకి తీసుకోరు! కెనడా, మెక్సికో, డెన్మార్క్, దక్షిణా ఫ్రికాలను ట్రంప్ బాహాటంగానే టార్గెట్ చేసి మాట్లాడారు. బ్రెజిల్, కొలంబియా, జర్మనీ, ఫ్రాన్స్,సింగపూర్, నమీబియా, ఆస్ట్రేలియా వంటి దేశాల అధినేతలు యూఎస్ అధ్యక్షుడిపై బహిరంగ విమర్శలకు వెనుకాడటం లేదు. యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో ఒక్కతాటి మీద లేకున్నా, మెజారిటీ సభ్యదేశాలు అమెరికాను నమ్మే స్థితిలో లేవు. ఈయూ అటు చైనాతోనూ, ఇటు ఇండియా తోనూ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుంది. బలహీన ప్రధాని నేతృత్వంలోని జపాన్ మాత్రం అమెరికాను ప్రాధేయపడుతున్నట్లు వ్యవహరిస్తోంది. ఏమైనా, అది కూడా చైనాతో వాణిజ్య సంబంధాలు స్థిరీకరించుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇండియా మౌనం వెనుక...ఇక ఇండియా నాయకత్వం అమెరికా ట్రేడ్ పాలసీ పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది. చైనాతో అమీతుమీకి ట్రంప్ సిద్ధపడటం ఇండియాకు ఆనందంగా ఉంది. మరోవంక, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందానికి చర్చలు జరుపుతోంది. అమెరికా నుంచి రక్షణ సామగ్రి, ఇతరత్రా దిగుమతులు పెంచు కునేందుకు సిద్ధపడుతోంది. అయినా కూడా, ట్రంప్ మొదటి విడత పదవీకాలంలో ఆయనతో వ్యవహరించినంత సంతోషంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దఫా ఉన్నారా? ట్రంప్ ఆయనకు చురకలు వేస్తూ మాట్లాడుతున్నారు. అంతగా స్నేహపూర్వకం కాని ధోరణిలో ఇండియా పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎంతో సెల్ఫ్ ఇమేజ్, ఇగో ఉన్న మోదీ ఈ అవమానాలకు లోలోపల కుమిలిపోయే ఉంటారు!ఉభయ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిరపరచుకోవాలని ఇండియా భావిస్తోంది. అయినా సరే, ఏ భారతీయ నాయకుడూ జపాన్, ఇటలీ మాదిరిగా ట్రంప్ ముందు సాగిలపడేందుకు సిద్ధంగా లేరు. బహుశా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్న నేపథ్యంలో మోదీ మౌనం పాటిస్తూ ఉండొచ్చు. దీంతో, గ్లోబల్ సౌత్ (పేద దేశాలు) తరఫున మాట్లాడేందుకు ఇతరులకు అవకాశం లభించింది. ట్రేడ్ ట్యారిఫ్లను వ్యతిరేకిస్తూ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు చైనా సంఘీభావం ప్రకటిస్తోంది. ఇండియా కూడా కలిసి రావాలని ఆహ్వానిస్తోంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా నాయకులు కూడా ఇతర వర్ధమాన దేశాలకు సంఘీభావం ప్రకటించాయి. ‘గ్లోబల్ సౌత్’ ఇండియా ‘వాయిస్’ కోసం ఎదురు చూస్తోంది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!
ఓ వైపు అమెరికా.. మరోవైపు చైనా.. నువ్వా నేనా అన్నట్లుగా సుంకాలను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ విషయం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు, రెండు దేశాలు ప్రవర్తిస్తున్నాయి. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో.. చైనా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అమెరికాపై విధిస్తున్న సుంకాలను 125 శాతానికి పెంచింది.అమెరికా విధిస్తున్న సుంకాల భారీ నుంచి తప్పించుకోవడం ఎలా అని చాలామంది తలలు పట్టుకుంటున్నారు. దీనికి ఓ మార్గం కూడా ఉంది. సుంకాల భారీ నుంచి తప్పించుకోవాలంటే.. ఇక స్మగ్లింగ్ చేయాలేమో అనే మీకు రావొచ్చు. అలాంటి సాహసాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎలా తప్పించుకోవాలో క్లారిటీగా వెల్లడించే ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.చైనా వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తే 145 శాతం సుంకాలను కట్టాల్సి ఉంటుంది. ఎగుమతి అంటేనే భారీ మొత్తం. కానీ చైనాలో వస్తువు కొని మనవెంట అమెరికాకు తెచ్చుకుంటే.. దానికి ప్రత్యేకంగా టారిఫ్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్ఉదాహరణకు ఒక అమెరికన్.. చైనాలో పర్యటించేటప్పుడు తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వాటిని తనతో పాటు అతని దేశానికి కూడా తీసుకెళ్లవచ్చు. ఇది పూర్తిగా లీగల్.. పర్సనల్ షాపింగ్ సర్వీస్ కిందికి వస్తుంది. అయితే ఎన్ని వస్తువులు కొనాలి?, ఎన్ని వస్తువులను తనతో పాటు తీసుకెళ్లవచ్చు అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని పాటిస్తే.. మీపై టారిఫ్స్ ప్రభావం ఉండదు. ఇది ఒక్క అమెరికన్ ప్రజలకు మాత్రమే కాదు.. ఈ ఫార్ములాతో మీరు ఏ దేశీయులైన.. ఇతర దేశాల్లో వస్తువులను సుంకాలతో పనిలేకుండా హ్యాపీగా కొనేయొచ్చు.China is now providing tariff advice. 🤣 pic.twitter.com/esNxGshMe6— James Wood 武杰士 (@commiepommie) April 13, 2025 -
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
ముంబై: ప్రపంచ దేశాల మధ్య టారిఫ్‌ల కారణంగా తలెత్తిన అనిశ్చితి స్వల్పకాలమే కొనసాగనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, ఎండీ కె.కృతివాసన్ పేర్కొన్నారు. వెరసి ఐటీ సేవల పరిశ్రమకు కొంతకాలమే అనిశ్చితి సవాళ్లు సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లోనే పరిష్కారం లభించనున్నట్లు అంచనా వేశారు.39 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ ఆర్డర్ బుక్ భవిష్యత్ ఆదాయ ఆర్జనకు హామీ ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డీల్ పైప్‌లైన్ పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొంతమంది క్లయింట్ల నుంచి విచక్షణ వ్యయాలు నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. అయితే ధరల విషయంగా ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.నిజానికి వార్షికంగా, త్రైమాసికవారీగా ధరలు స్వల్పంగా మెరుగుపడినట్లు తెలియజేశారు. గతేడాదికి 30 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీ విచక్షణ వ్యయాల వాటాపై వివరణ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇవి ఆదాయంలో కీలకమే అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు.యూఎస్‌లో పరిస్థితులు సర్దుకుంటే ఉత్తర అమెరికా బిజినెస్‌లో తిరిగి పురోభివృద్ధి అందుకోగలమని అంచనా వేశారు. సాఫ్ట్వేర్ సేవల ఔట్‌సోర్సింగ్‌కు ప్రపంచంలోనే యూఎస్ అతిపెద్ద మార్కెట్‌కాగా.. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో వాటా 48%కి పరిమితం కావడం గమనార్హం! -
మనువుతో మతిమరుపే!
ఒంటరితనంతో బాధపడేవారు కొన్ని విషయాలనే పదేపదే ఆలోచిస్తూ మిగతా వాటిని మర్చిపోతారనే వాదన ఉంది. కానీ అందులో అస్సలు నిజం లేదని తాజా అధ్యయనం ఒకటి బల్లగుద్ది చెబుతోంది. సోలో బతుకే సో బెటరు అంటోంది. పెళ్లికాని ప్రసాదుల్లో మతిమరుపు లక్షణాలు తక్కువని చెబుతోంది. వైవాహిక బంధానికి బీటలు పడి మళ్లీ ఒంటరయ్యే వాళ్లలో కూడా మతిమరుపు బారిన పడే అవకాశాలు బాగా తగ్గుతున్నట్టు కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది.వేల మందిపై అధ్యయనం తర్వాత.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర విశ్వవిద్యాలయం ఈ పరిశోధన జరిపింది. ఇందుకోసం అమెరికాలో 24,000 మందిని ఎంపికచేశారు. వాళ్లందరినీ 18 ఏళ్లపాటు అధ్యయనం చేశారు. పెళ్లయిన వాళ్లు, విడాకులైన వాళ్లు, బ్రహ్మచారులు, జీవితభాగస్వామి అనారోగ్యంతో కన్నుమూసిన వారిని పరిశోధనకు ఎంచుకున్నారు. మతిమరుపు లక్షణాలు లేని వాళ్లను మాత్రమే అధ్యయనం కోసం ఎంపికచేశారు. పెళ్లికాని వాళ్లను మూడు గ్రూప్‌లుగా విభజించి ఆరోగ్య పరిస్థితిని అంచనావేశారు. పెళ్లయిన వాళ్లతో పోలిస్తే వారికి మతిమరుపు ముప్పు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. పొగ తాగడం, కుంగుబాటు వంటివి ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెప్పారు. పెళ్లయిన వాళ్లతో పోలి స్తే పెళ్లయి విడాకులు తీసుకున్న వాళ్లు, అస్సలు పెళ్లిచేసుకోని వాళ్లలో మతిభ్రంశం ముప్పు తక్కువగా ఉందని బయటపడింది. పెళ్లికాని వ్యక్తుల్లో అల్జీమర్స్ తరహా డిమెన్షియా ముప్పు తక్కువగా ఉంది. అయితే డిమెన్షియాలో అరుదైన రకమైన వాసు్కలర్ చిత్తవైకల్యం ముప్పు వివరాలు వెల్లడికాలేదు.విడాకులు తీసుకున్న వాళ్లలో విడాకులు తీసుకున్న వాళ్లు, అస్సలు పెళ్లిచేసుకోని వాళ్లలో అభిజ్ఞానవికాసం క్షీణించి డిమెన్షియా బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడైంది. అధ్యయనకాలంలో జీవితభాగస్వామి చనిపోవడంతో ఒంటరిగా మారిన వ్యక్తుల్లోనూ మనోభ్రంశం ముప్పు తక్కువగా ఉండటం విశేషం. మెదడు ఆరోగ్యం ముఖ్యం మెదడు పనితీరు ఎంత కీలకమైందో ఈ పరిశోధనలో మరోసారి స్పష్టమైంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిణా మాలు, కష్టాలు, రాజీపడటం, కీలకమైన నిర్ణయాలు అనేవి మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పెళ్లిచేసుకుంటే హాయిగా ఉంటాం అనేది నిజం కాదని, పెళ్లాయ్యాక కూడా హాయిగా ఉండగల్గితేనే మెదడు ఆరోగ్యం బాగుంటుందని పరిశోధన పునరుద్ఘాటించింది. జీవితభాగస్వామిని కోల్పోయిన వాళ్లు, విడాకులు తీసుకున్న వాళ్లు ఎంతో వేదనకు గురవుతారన్న అభిప్రాయాన్ని సవాల్ చేసేలా ఈ పరిశోధనా ఫలితాలు రావడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా గ్యాస్ పైప్‌లైన్ మాకిచ్చేయండి
వాషింగ్టన్: ‘మినరల్స్ ఫర్ వెపన్స్’ ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్‌పై మరింత నియంత్రణకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ భూభాగం నుంచి వెళ్లే రష్యా పైప్‌లైన్‌ను తమకు అప్పగించాలనే కొత్త డిమాండ్ ముందుకు తెచ్చింది. అరుదైన ఖనిజాలు, ఆయిల్, గ్యాస్ సహా ఉక్రెయిన్ విస్తారమైన వనరులను అమెరికా కంపెనీలకు అప్పగించాలని.. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా వైఖరిని ఉక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్ స్ట్రాటజీకి చెందిన సీనియర్ ఎకనమిస్ట్ వోలోదిమిర్ లాండా తప్పుబట్టారు. ఈ డిమాండ్లు వలసవాద తరహా ఒత్తిడిని తలపిస్తున్నాయని, వాటిని అంగీకరించే అవకాశం లేదని ఆయన చెప్పారు. సోవియట్ కాలం నాటి సహజ వాయువు పైప్‌లైన్ ఉక్రెయిన్ భూభాగం గుండా వెళ్తోంది. పశ్చిమ రష్యాలోని సుడ్జా నుంచి స్లొవేకియా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ నగరం ఉజ్హోరోడ్ వరకు ఈ పైప్‌లైన్ ఉంది. ఇది యూరప్‌కు రష్యన్ గ్యాసు సరఫరా చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. దీన్ని నియంత్రణలోకి తీసు కోవాలని యూఎస్ ప్రభుత్వ సంస్థ అయిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తోంది. రష్యా ప్రభుత్వ ఇంధన సంస్థ గాజ్‌ప్రోమ్‌తో ఉక్రెయిన్ ఐదేళ్ల ఒప్పందం గడువు ఈ ఏడాది జనవరితో ముగిసింది.బెర్లిన్ తరహాలో విభజిద్దాం... ఉక్రెయిన్ను బెర్లిన్లాగా విభజించవచ్చని అమెరికా ప్రత్యేక రాయబారి కీత్ కెల్లాగ్ సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బెర్లిన్‌లో రష్యన్ జోన్, ఫ్రెంచ్ జోన్, బ్రిటీష్ జోన్, యూఎస్ జోన్ తరహాలో.. ఉక్రెయిన్‌లో యూకే, ఫ్రాన్స్ దళాలు పశ్చిమ ప్రాంతంలో భరోసాగా ఉంటాయన్నారు. ఆక్రమిత తూర్పు ప్రాంతంలో రష్యా సైన్యం ఉండవచ్చని, రెండింటి మధ్య ఉక్రెయిన్ దళాలతో సైనిక రహిత ప్రాంతం ఉంటుందని వెల్లడించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తన మాటలను వక్రీకరించారన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమన్నారు. -
ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తీసుకున్న నోట్‌ప్యాడ్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. టెస్లా సీఈఓ కాన్ఫరెన్స్ టేబుల్ వద్ద కూర్చుని 'ఎలాన్ మస్క్' అని రాసి ఉన్న నేమ్ కార్డ్ కనిపిస్తుంది. అక్కడే ఒక పేపర్ మీద 'టాప్ సీక్రెట్' రాసి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫోటోలో ఒక పెన్ను, ఖాళీ గాజు మాత్రమే కాకుండా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడి ముద్ర ఉన్న కోస్టర్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరక్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా వినియోగదారులు మస్క్ నోట్‌ప్యాడ్‌ను జూమ్ చేయడంతో “టాప్ సీక్రెట్” అనే పదాలు కనుగొన్నారు. మీడియాను గందరగోళంలోకి నెట్టడానికి మస్క్ ఈ విధంగా చేసి ఉంటాడని.. ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఎలాన్ నవ్వుతున్న ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చారు.ఇదీ చదవండి: గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..ఒక ట్రిలియన్ నుంచి రెండు ట్రిలియన్ డాలర్ల వరకు.. అమెరికా వ్యయాలను తగ్గిస్తామని ఒకప్పటి నుంచి చెబుతున్న ఎలాన్ మస్క్ ఇప్పుడు మాట మార్చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో.. 150 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించగలమని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ట్రంప్ నేతృత్వంలోని డోజ్ టీమ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని మస్క్ మెచ్చుకున్నారు.😂 https://t.co/0NsNM4yAdR— Elon Musk (@elonmusk) April 12, 2025 -
Jesus Nut: టెక్ సీఈవో ఫ్యామిలీ ప్రాణం తీసిన ‘జీసెస్ నట్’ కథ!
వాషింగ్టన్: జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ (agustin escobar) కుటుంబం మరణానికి ‘జీసెస్ నట్’ (jesus nut) కారణమైందని నిపుణులు భావిస్తున్నారు.గత గురువారం ఆగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, మెర్సి కాంప్రూబి మాంటాల్, వారి ముగ్గురు పిల్లలు (వయస్సు 4, 5, 11), పైలట్‌తో సహా సైట్ సీయింగ్ కోసం బయల్దేరారు. ఇందుకోసం బెల్ 206 అనే సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను వినియోగించారు.అయితే, సీఈవో కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాల్ స్ట్రీట్ హెలిపోర్ట్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ అవుతుండగా.. మన్‌హట్టన్ వినువీధిలో .. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దిశగా వెళ్లింది. ఆ సమయంలో గిరిగిరా తిరుగుతూ న్యూయార్క్ నగరంలోని ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ (miracle on the hudson) నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. పక్షి ఢీకొట్టడం వల్లే హెలికాఫ్టర్ ప్రమాదం జరిగి ఉంటుందేమోనని అందరూ భావించారు. హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగే సమయంలో స్థానికులు వీడియోలు తీశారు. ఆ వీడియోల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఘోరం జరిగే సమయంలో పక్షుల జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగింది. పలు ఆధారాలు, ఏవియేషన్ రంగ నిపుణులు, ప్రమాదానికి ముందు జరిగిన నిర్లక్ష్యం ఆధారంగా బెల్ 206 హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ‘జీసెస్ నట్’ కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఏంటి ‘జీసెస్ నట్’ జీసెస్ నట్ అనేది హెలికాప్టర్ మెయిన్ రోటర్ మాస్ట్‌పై(mast) అమర్చబడి ఉంటుంది. అంటే ఇది హెలికాప్టర్ రెక్కలు..హెలికాప్టర్ ఇంజిన్‌కు జాయింట్ చేసి ఉంటుంది. ఈ భాగం వద్ద జీసెస్ నట్ ఉంటుంది. అది ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా, ఊడినా హెలికాప్టర్ మొత్తం అదుపు తప్పుతుంది. ఆ నట్టు ఊడి పోతే హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడేయడం పైలెట్ వల్ల కూడా సాధ్యం కాదు. ఆగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోని ఈ జీసెస్ నట్ ఊడిపోవడం వల్లే విషాదం చోటు చేసుకున్న న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఎఫ్ఏఏ (fedaral viation Administration) విచారణను వేగవంతం చేసింది.‘జీసెస్ నట్’ అంటే ఏమిటి?.. చరిత్ర ఏం చెబుతోందిజీసెస్ నట్ అనే పదం వియత్నాం యుద్ధంలో అమెరికన్ సైనికుల నోట తొలిసారి ఈ పదం వెలుగులోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1930, 1940లలో యుద్ధ సమయంలో అమెరికా నేవి ప్రత్యర్థుల్ని మట్టికరింపించేందుకు చిన్న ఎయిర్ క్ట్రాప్ట్లను భారీ సంఖ్యలో డిజైన్ చేయించింది. కాన్సాలిడేటెడ్ మోడల్ 28లో పీబీవై కాటలినా అనే ఎయిర్ క్ట్రాప్ట్లో తొలిసారి ఈ నట్టును వినియోగంలోకి తెచ్చారు. పైన చెప్పుకున్నట్లుగా ఈ నట్టు ఎయిర్ క్ట్రాప్ట్ రెక్కలకు, ఇంజిన్‌కు అనుసంధానం చేసి ఉంటుంది. అయితే వియత్నంతో జరిగే యుద్ధంలో ఈ ఎయిర్ క్ట్రాఫ్ట్లో సైనికులు ప్రయాణిస్తుండగా ఎదైనా ప్రమాదం జరిగితే ఆ నట్టు బిగించిన రూటర్ మాస్ట్ ఊడిపోతే .. జీసెస్‌ను ప్రార్థించడం తప్ప ఏం చేయలేం అని అమెరికా సైనికులు అనేవారంటూ వీకీపీడియా సమాచారం చెబుతోంది.ప్రయాణానికి ముందే అంతేకాదు, ఈ తరహా జీసెస్ నట్ ఉన్న ఎయిర్క్రాప్ట్లలో ప్రయాణించే ముందు నట్టు సరిగ్గా ఉందా? లేదా? అని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రయాల్సి ఉంది. లేదంటే ప్రాణాలు గాల్లోనే కలిసి పోవడం ఖాయం. తాజాగా ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ నదిలో చోటు చేసుకున్న సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం హెలికాప్టర్ ప్రమాదం ఈ జీసెస్ నట్ పనితీరుపై దృష్టిసారించకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్ రేటు 23 శాతం పెరిగింది. ఏప్రిల్ నెలలో మాత్రమే పసిడి ధర 5 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. శనివారం నాటికి బంగారం ధరలు గరిష్టంగా రూ. 95,670 వద్ద నిలిచాయి.అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. ట్రాయ్ ఔన్సుకు $3,263 రికార్డు గరిష్ట స్థాయిని తాకిన తర్వాత కామెక్స్ గోల్డ్ 2.44 శాతం పెరిగి $3,254.90 వద్ద ముగిసింది. ఇప్పటి వరకు బంగారం ధరలు పెరుగుదల ఆల్ టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది.బంగారం రేటు ఎందుకు పెరుగుతోందిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్.. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అనేక దేశాలపై విధించిన పరస్పర సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించగా.. చైనాపై సుంకాలను మాత్రం 125 శాతానికి పెంచారు. చైనా కూడా ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వృద్ధి చుట్టూ అనిశ్చితిని పెంచాయి. దీంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులకు గ్యారెంటీ లేదు. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెడితే.. అది సురక్షితమైన ఆస్తిగా భావించేవారు సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ఎక్కువమంది బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇది గోల్డ్ రేటు పెరగడానికి దోహదపడుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. 200 మంది ఉద్యోగులు బయటకుబంగారం ధరలు తగ్గుతాయా?వాణిజ్య యుద్ధం, డాలర్ విలువ తగ్గడం, వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ట్రాయ్ ఔన్సుకు $3,300 నుంచి $3,500 వరకు పెరుగుతాయని చెబుతున్నారు.భారతదేశంలో 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం రూ. 97,000 కు చేరుకుంటుందని HDFC సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ 'అనుజ్ గుప్తా' అన్నారు. ధరలు పెరుగుదల ఇలాగె కొనసాగే అవకాశం ఉందని.. ఎల్కేపీ సెక్యూరిటీస్ , కమోడిటీ అండ్ కరెన్సీ, వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది కూడా వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేదని స్పష్టంగా అర్థమవుతోంది. -
అమెరికాలోని భారతీయులపై ట్రంప్ తెంపరితనం
-
అమెరికా కాలేజీల్లోనూఅక్రమ వలసదారుల వేట!
తలాహస్సీ(యూఎస్): అమెరికా గ్రామాలు, పట్టణాల్లో అనుమానిత ప్రదేశాలు, జనావాస స్థలాల్లో మాత్రమే ఇన్నాళ్లూ అక్రమ వలసదా రుల కోసం ఇమిగ్రేషన్ అధికారుల వేట కొన సాగింది. ఇకపై ‘సున్నిత ప్రదేశాల’ కేటగిరీలో ఉన్న విశ్వవిద్యాలయాల్లోనూ అక్రమ వలస దారుల జాడ కనిపెట్టేందుకు ఇమిగ్రేషన్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు రంగప్రవేశం చేయ నున్నారు. ప్రస్తుతానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోకి ‘ఇమి గ్రేషన్’ తనిఖీలను అనుమతించే అవకాశ ముంది. బోకా రాటన్ నగరంలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ, గెయిన్స్‌విల్లేలోని ఫ్లోరిడా వర్సిటీ క్యాంపస్, తంపా సిటీలోని సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలు ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందానికి ముందుకొ చ్చాయి. తమ విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లోని స్థానిక పోలీసులను ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ సేవల కోసం వినియోగించుకునేందుకు ఈ మూడు ప్రభుత్వ విశ్వవి ద్యాలయాలు అనుమతి ఇవ్వనున్నాయి. ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రోన్ డీశాంటిస్ సైతం తమ రాష్ట్రంలో అక్రమ వలసదారులపై ఉక్కుపా దం మోపేందుకు ట్రంప్ సర్కార్‌కు పూర్తి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఫ్లోరిడాలో తాజాగా ఈ పరిణామం జరగడం ప్రాధాన్య త సంతరించుకుంది. స్థానిక, రాష్ట్ర పాలనా యంత్రాంగాలు కలిసికట్టుగా ఇమిగ్రేషన్ విభాగానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఫిబ్రవరి 19వ తేదీనే సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేశారు. పోలీసులకు తగు శిక్షణఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలోని పోలీ స్ శాఖ(ఎఫ్ఏయూపీడీ) సిబ్బందికి ఇమిగ్రే షన్ ఎన్ఫోర్స్మెంట్ విభాగ విధులను అప్ప గించనున్నారు. ఇమిగేషన్ సంబంధిత పత్రాల తనిఖీ, ఒకవేళ అక్రమ వలసదారు చిక్కితే నిర్బంధం, అరెస్ట్, అనుసరించాల్సిన విధానాలను ఈ సాధారణ పోలీసులుకు విడమర్చి చెప్పనున్నారు. ఇందుకోసం ఎఫ్ఏ యూపీడీ సిబ్బందికి ‘287(జీ) ప్రోగ్రామ్’ పేరిట తగు శిక్షణ ఇస్తారని ఫ్లోరిడా అట్లాంటిక్ వర్సిటీ అధికార ప్రతినిధి జాషువా గ్లేంజర్ చెప్పారు. ఈ శిక్షణ బాధ్యతలను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తీసుకోనుంది. వర్సిటీ పోలీసులకు ఇలా ఇమిగ్రేషన్ అధికారాలు దఖలుపడే అవకాశం రావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. శిక్షణ పూర్తయ్యాక వర్సిటీ పోలీసు లు ఆయా విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు, క్యాంపస్, కళాశాలల్లో అనుమానితులు, విద్యార్థులు, విదేశీయులను విచారిస్తారు. తనిఖీలు చేస్తారు. అవసరమైతే ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తారు. అయితే వర్సిటీ పాలకమండళ్ల ఈ నిర్ణయాలను విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. విద్యాలయాలను అక్రమచొరబాట్ల తనిఖీ కేంద్రాలుగా మార్చొద్దని, నిర్ణయాలను వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్‌చేశాయి. ‘‘వర్సిటీల్లో ఉన్న వాళ్లు విద్యార్థు లా కాదా అంటూ పోలీసులు అణువణువునా గాలింపులు మొదలెడితే వర్సిటీల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది’’ అని జెనికా ఛార్లెస్ అన్నారు. ఛార్లెస్ హౌతీ నుంచి వలసవచ్చి ఫ్లోరిడా అట్లాంటిక్ వర్సిటీలో రాజనీతిశాస్త్రం చదువుతున్నారు. సురక్షిత, సమ్మిళిత విద్యకు పట్టుగొమ్మల్లాంటి వర్సిటీ ల్లో ఇమిగ్రేషన్ తనిఖీలు, సోదాలను నిరోధించాలని ‘ప్రెసిడెంట్స్ అలయన్స్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్’ సంస్థ సీఈఓ మిరియం ఫెడ్బ్లమ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సంస్థ విదేశీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతోంది. -
అణు కార్యక్రమంపై ముగిసిన ఇరాన్–అమెరికా ప్రతినిధుల భేటీ
మస్కట్: ఇరాన్, అమెరికా ప్రతినిధుల ముఖాముఖి మొదటి విడత చర్చలు శనివారం ఒమన్ రాజధాని మస్కట్‌లో ముగిశాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేందుకు వీరు వచ్చే వారం మరోసారి సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక మొదటి విడత చర్చలు పూర్తయినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు ఇరాన్ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ఈ నెల 19వ తేదీన తదుపరి విడత పరోక్ష చర్చలు జరుపుతామని అరగ్చి తెలిపారు. ‘ఫలితం లేని ఈ చర్చలతో సమయం వృథా. వీటిపై ఎవరికీ ఆసక్తి లేదు’అని పేర్కొన్నారు. మస్కట్ శివారులోని ఓ భవనంలో సమావేశమైన రెండు దేశాల ప్రతినిధులు రెండు గంటలపాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చలు ముఖాముఖి జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రతినిధి విట్కాఫ్ తెలపడం గమనార్హం. అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడమన్నదే తమ లక్ష్యమని ఇరాన్‌కు తెలిపినట్లు విట్కాఫ్ అంటున్నారు.