ఒప్పందానికి ముందు అవకాశాల అన్వేషణ | Commerce Ministry holds industry consultation on India-US trade talks | Sakshi
Sakshi News home page

ఒప్పందానికి ముందు అవకాశాల అన్వేషణ

May 4 2025 3:37 AM | Updated on May 4 2025 8:12 AM

Commerce Ministry holds industry consultation on India-US trade talks

అమెరికా– భారత్‌ మధ్య రంగాలవారీ చర్చలు 

మే చివరి నుంచి విస్తృత సంప్రదింపులు 

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు కొనసాగిస్తున్న భారత్‌–అమెరికా, దీనికంటే ముందు పరస్పర ప్రయోజనాన్నిచ్చే అవకాశాలను గుర్తించే పనిలో పడ్డాయి. వచ్చే సెపె్టంబర్‌–అక్టోబర్‌ నాటికి ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని కేంద్ర సర్కారు ఇప్పటికే సంకేతాలు ఇచి్చంది. రెండు దేశాలూ రంగాల వారీ చర్చలు మొదలు పెట్టాయని, మే చివరి నుంచి మరింత విస్తృత సంప్రదింపుల ప్రణాళికతో ఉన్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. 

భారత్‌ తరఫున కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ రాజేష్‌ అగర్వాల్, అసిస్టెంట్‌ యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (దక్షిణాసియా) బ్రెండన్‌ లించ్‌ వాషింగ్టన్‌లో గత వారం మూడు రోజుల పాటు చర్చలు నిర్వహించారు. ‘‘మొదటి దశ పరస్పర ప్రయోజనకర, బహుళ రంగాల వాణిజ్య ఒప్పందాన్ని (బీటీఏ) 2025 చివరికి (సెపె్టంబర్‌–అక్టోబర్‌) ముగించే దిశగా మార్గసూచీపై బృందం చర్చించింది. తొలి దశలో పరస్పర విజయావకాశాలపైనా దృష్టి పెట్టింది’’అని వాణి­జ్య శాఖ తెలిపింది.

 భారత్‌పై విధించిన అదనపు సుంకాలను 90 రోజుల పాటు (జూలై 9 వరకు) అమెరికా నిలిపివేసిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే మొదటి దేశం భారత్‌ అవుతుందంటూ యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.  

పరస్పర డిమాండ్లు..  
కార్మికుల ప్రాధాన్యం కలిగిన టెక్స్‌టైల్స్, జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ, తోలు ఉత్పత్తులు, గార్మెంట్స్, ప్లాస్టిక్, కెమికల్స్, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి ఎగుమతులపై సుంకాల రాయితీలను భారత్‌ కోరుతోంది. అమెరికా తన వైపు నుంచి ఇండస్ట్రియల్‌ గూడ్స్, ఆటోమొబైల్స్, వైన్, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులు, డైరీ, యాపిల్, నట్స్‌ తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తోంది.

ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించి నియమ, నిబంధనలను రెండు దేశాలూ ఇప్పటికే ఖరారు చేసుకోవడం తెలిసిందే. అమెరికాతో భారత్‌కు వాణిజ్య మిగులు ఏటేటా పెరుగుతుండడం గమనార్హం. 2024–25లో ఇది 41.18బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఆరి్థక సంవత్సరాల్లో ఇది 35.32 బిలియన్‌ డాలర్లు (2023–24), 27.7 బిలియన్‌ డాలర్లు (2022–23) చొప్పున ఉంది. దీన్ని సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు ట్రంప్‌ సర్కారు ప్రయత్నిస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement