చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్​కు గోల్డెన్ ఛాన్స్! | US Tariffs On China Imports Create Good Opportunity For Indian Toy Market | Sakshi
Sakshi News home page

చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్​కు గోల్డెన్ ఛాన్స్!

Apr 20 2025 8:11 PM | Updated on Apr 20 2025 8:20 PM

US Tariffs On China Imports Create Good Opportunity For Indian Toy Market

చైనా వస్తువులపై అమెరికా అధిక సుంకాలను విధించడంతో.. బొమ్మల ఎగుమతి క్షీణించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ బొమ్మల ఎగుమతిదారులు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది అమెరికన్ కొనుగోలుదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకుతున్నారు.

అమెరికాకు ఎక్కువగా బొమ్మలను ఎగుమతి చేసే దేశాల్లో చైనా అగ్రగామిగా ఉండేది. అయితే ఇప్పుడు అధిక సుంకాల కారణంగా చైనా ఎగుమతులు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ అవకాశాన్ని భారతదేశం సద్వినియోగం చేసుకోవచ్చని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు 'అజయ్ అగర్వాల్' ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రస్తుతం, దాదాపు 20 సంస్థలు అమెరికన్ మార్కెట్‌కు పెద్ద ఎత్తున బొమ్మల ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్నాయని అగర్వాల్ అన్నారు. గత నెలలో యుఎస్ బేస్డ్ బొమ్మల కొనుగోలుదారుల నుంచి మాకు మరిన్ని విచారణలు వస్తున్నాయి. యూఎస్ నియమాలు, నిబంధనల ప్రకారం బొమ్మ ఉత్పత్తులను తయారు చేయగల తయారీదారుల జాబితాను కోరుతూ కొన్ని భారతీయ ఎగుమతి సంస్థలు కూడా మమ్మల్ని సంప్రదించాయి ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?

2024లో యూఎస్ బొమ్మల మార్కెట్ 42.8 బిలియన్ డాలర్లకు చేరుకుందని జీఎమ్ఐ రీసర్చ్ వెల్లడించింది. 2032 నాటికి ఈ వృద్ధి 56.9 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. బొమ్మల రంగంలో భారతదేశం నుంచి ఇప్పటికే దాదాపు 20 కంపెనీలు పెద్దమొత్తంలో అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.

ఇతర దేశాల కంటే తక్కువ రేట్లు ఉండటం వల్ల మనకు సుంకాల ప్రయోజనం లభిస్తే.. అమెరికా మార్కెట్లో భారతీయ బొమ్మల ఉనికిని తప్పకుండా పెంచుకోవచ్చని.. టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అన్నారు. అంతే కాకుండా త్వరలోనే తయారీదారులతో ఒక సెమినార్ నిర్వహించాలని అసోసియేషన్ యోచిస్తోందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement