అమెరికాలో రానా సందడి.. హాలీవుజ్‌ దిగ్గజాలతో భేటీ! | Rana Daggubati and His Loca Loka Crew Light Up Miami F1 Weekend | Sakshi
Sakshi News home page

Rana Daggubati: అమెరికాలో రానా సందడి.. హాలీవుజ్‌ దిగ్గజాలతో భేటీ!

May 4 2025 5:02 PM | Updated on May 4 2025 5:09 PM

Rana Daggubati and His Loca Loka Crew Light Up Miami F1 Weekend

టాలీవుడ్ హీరో రానా నాయుడు యూఎస్‌లో సందడి చేశారు. ఇటీవల డబ్ల్యూడబ్ల్యూఈ రేజ్లింగ్‌ మేనియాలోనూ కనిపించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రానా మియామి గ్రాండ్ ప్రిక్స్ వీకెండ్‌ ఈవెంట్‌కు హాజరయ్యారు. అక్కడే హాలీవుడ్‌లో ప్రముఖ సంగీత దిగ్గజాలైన 50 సెంట్‌, ఆ‍స్కార్ విజేత అయిన గూడింగ్ జూనియర్‌తో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇండియాకు చెందిన లోకా లోకా పార్టీ సంస్థ ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు రానా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే లోకా లోకా సంస్థకు సహా వ్యవస్థాపకుల్లో ఒకరైన రానా దగ్గుబాటి ఈవెంట్‌లో సందడి చేశారు. ఈ కంపెనీకి హర్ష వడ్లమూడి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ కలిసి ముగ్గురు ఈ సంస్థకు కో ఓనర్స్‌గా ఉన్నారు. అమెరికా మార్కెట్లో తమ సంస్థ విస్తరణ కోసమే రానా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. రానా చొరవతో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ లైఫ్‌ స్టైల్‌ బ్రాండ్‌గా లోకా లోకా సంస్థ మరింత బలోపేతం కానుంది. ఈ సందర్భంగా వ్యాపారం, వినోదం, క్రీడల ప్రపంచానికి నిలయమైన మియామిలో రానా దగ్గుబాటి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement