
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వచ్చే వారం అమెరికాకు వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపక సిబ్బందితో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు.
కాంగ్రెస్ మీడియా పబ్లిసిటీ విభాగం చీఫ్ పవన్ ఖేరా గురువారం ఈ విషయం తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. అదేవిధంగా, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆఫీసు బేరర్లు, సభ్యులతో సమావేశమవుతారు.