
అమెరికా ప్రతీకగా సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి, బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దేశంలో గోల్డ్ రేటు ఏకంగా లక్ష మార్కును దాటేసింది. అయితే తాజాగా జరిగిన అమెరికా - చైనా దేశాలను టారిఫ్స్ కొంత తగ్గిస్తున్నట్లు.. ఇవి 90 రోజులు అమల్లో ఉంటాయని ప్రకటించాయి. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లో 3400 డాలర్ల కంటే ఎగువన ట్రేడ్ అయిన ఔన్స్ బంగారం ధర.. ఏకంగా 3218 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే భారతదేశంలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. వెండి ధరలు కూడా బంగారం బాటలో పయనించిందా అన్నట్లు.. తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం మొత్తం మీద బంగారం, వెండి ధరలు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది.
ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?
ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.