అమెరికాలో ఇక మేడిన్‌ ఇండియా ఐఫోన్లే! | Majority of iPhones sold in US will be made in India | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఇక మేడిన్‌ ఇండియా ఐఫోన్లే!

May 3 2025 7:13 AM | Updated on May 3 2025 9:23 AM

Majority of iPhones sold in US will be made in India

న్యూఢిల్లీ: జూన్‌ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే మెజారిటీ ఐఫోన్లు భారత్‌లో తయారైనవే ఉంటాయని టెక్‌ దిగ్గజం యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్‌ వాచ్, ఎయిర్‌పాడ్స్‌ మొదలైనవి వియత్నాంలో తయారైనవి ఉంటాయని పేర్కొన్నారు. ఇతరత్రా దేశాల్లో విక్రయించే ఉత్పత్తులు మాత్రమే అత్యధికంగా చైనాలో తయారవుతాయని పేర్కొన్నారు.

చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అమెరికా భారీగా టారిఫ్‌లు ప్రకటించిన నేపథ్యంలో కుక్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంత మినహాయింపులున్నా, వివిధ టారిఫ్‌లను కలిపితే చైనా నుంచి ఎగుమతి చేసే తమ ఉత్పత్తులపై ఏకంగా 145 శాతం సుంకాలు వర్తిస్తాయని కుక్‌ తెలిపారు.

ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ విశ్లేషణ ప్రకారం 2024లో అమెరికాలో ఐఫోన్‌ విక్రయాలు 7.59 కోట్లుగా ఉండగా, మార్చిలో భారత్‌ నుంచి 31 లక్షలు ఎగుమతయ్యాయి. టారిఫ్‌ రేట్లు, పాలసీలు ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగితే జూన్‌ త్రైమాసికంలో తమ వ్యయాలపై రూ. 900 మిలియన్‌ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని కుక్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement