
నువ్వా నేనా అంటూ ప్రతీకార సుంకాలను అంతకంతకూ పెంచుకుంటూ పోయిన అమెరికా, చైనా దేశాలు టారిఫ్‌ల విషయంలో ఓ డీల్ కుదుర్చుకున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం.. చైనా.. అమెరికాపై విధించిన 125 శాతం సుంకాన్ని 10 శాతానికి పరిమితం చేయగా.. అమెరికా, చైనాపై విధించిన సుంకాన్ని 145 శాతం నుంచి 30 శాతానికి పరిమితం చేసింది.
ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?

అమెరికా ప్రపంచ దేశాల మీద ప్రతీకార సుంకాలను విధించిన సమయంలో.. చైనా కూడా అమెరికాకు ధీటుగా సుంకాలను పెంచింది. దీంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద విపరీతమైన ప్రభావం చూపింది. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే తాజాగా.. ఇరుదేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఈ సుంకాలను తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు.