మళ్లీ యుద్ధం: ఇప్పుడు ట్రంప్ ముందున్న 2 మార్గాలివే..
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఇది అమెరికా బలహీనతా? లేక దౌత్య చర్చల దిశగా అడుగా? ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? దాడులు చేస్తామని చెప్పిన ట్రంప్ మరోసారి యూ-టర్న్ ఎందుకు తీసుకున్నారు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కొన్ని గంటల్లోనే భిన్న సంకేతాలు వచ్చాయి. మొదట ఇరాన్‌పై దాడి చేస్తామని చెప్పారు. తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ విజ్ఞప్తి చేయడంతో జరగాల్సిన దాడిని వాయిదా వేశారు. దీనిపై పలువురు విశ్లేషకులు వివరించిన అంశాలను చూద్దాం.. ట్రంప్ ముందున్న మార్గాలు రెండు మాత్రమే. ఒకటి ఇరాన్‌కు రాయితీలు (ఆంక్షల ఎత్తివేత వంటి వెసులుబాట్లు) ఇవ్వడం. అంటే యుద్ధంలో ఓడిపోయామని చెప్పకనే చెప్పడం. గతంలో వియత్నాం, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో కూడా ఇటువంటిదే జరిగింది. కానీ, ఓటమిని అంగీకరించడం అమెరికాకు కష్టమే. మరో మార్గం మళ్లీ దాడులు మొదలుపెట్టడం. అమెరికాలోని నియోకాన్ (కఠిన విదేశాంగ విధానాన్ని సమర్థించే రాజకీయ వర్గం) వర్గాలు, ఇజ్రాయెల్ మరింత ఒత్తిడి పెడితే ఇరాన్ వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నాయి. కానీ అది అంత సులువు కాదు.ట్రంప్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇలాంటి మార్పులు పలుసార్లు చేశారు. ఫిబ్రవరి 28న 48 గంటల్లో ఇరాన్ ప్రజా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. తర్వాత గడువు పెంచారు. అనంతరం మళ్లీ పెంచారు. ఈ సారి మాత్రం పాకిస్థాన్ వల్ల కాదు.. యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా విజ్ఞప్తి కారణంగా ట్రంప్ నిర్ణయం వాయిదా పడింది.ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం పరిస్థితిని చూడాలి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం మొదలుపెట్టాయి. అప్పట్లో ట్రంప్ లక్ష్యాల్లో ఇరాన్ పాలనా మార్పు, క్షిపణి సామర్థ్యాల నిర్మూలన కూడా ఉన్నాయి. కానీ దాడుల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఏ లక్ష్యాన్నీ సాధించలేకపోయాయి.అంతేకాదు, ఇరాన్ హార్మూజ్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించింది. దీంతో ఇప్పటికే ఉన్న సమస్యలకు మరో పెద్ద సమస్య చేరింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్ ఒప్పందం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో నేరుగా చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడే అక్కడికి వెళ్లారు.మార్చి 6న ట్రంప్ “ఇరాన్ నుంచి షరతుల్లేని లొంగుబాటు తప్ప మరేదీ అంగీకరించను” అన్నారు. అదే ట్రంప్ తర్వాత ఉపాధ్యక్షుడిని ఇస్లామాబాద్ పంపించారు. ఎందుకంటే “ఉపాధ్యక్షుడితోనే మాట్లాడతాం” అని ఇరాన్ స్పష్టం చేసింది.కాల్పుల విరమణ ప్రకటనలో హార్మూజ్ ప్రాంతాన్ని తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ, ఆ ప్రాంతం ఇప్పటికీ మూసే ఉంది. అయినా కాల్పుల విరమణ కొనసాగుతోంది. కారణం ట్రంప్ మళ్లీ ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్లాలని అనుకోవడం లేదు. ఏప్రిల్ 8 నుంచి ట్రంప్ దౌత్య చర్చల ద్వారా ఒప్పందం సాధించాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ అమెరికా కోరుతున్న షరతులకు ఒప్పుకోవడం లేదు. దీంతో చర్చలు స్థంభించాయి.ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాలియుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కూడా ట్రంప్‌నకు ఉంటుంది. అయితే, యుద్ధం మొదలైనప్పుడు బ్యారెల్ చమురు ధర 75 నుంచి 77 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు 115 డాలర్ల వరకు చేరింది. భారత్‌లో ఇప్పటికే పెట్రోల్ ధరలు రెండుసార్లు పెరిగాయి. ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు అందరూ పొదుపు పాటించాలని చెబుతోంది. రూపాయి విలువ పడిపోతోంది. కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. కరెంట్ అకౌంట్ లోటు అంటే విదేశీ లావాదేవీల్లో దేశ ఖర్చులు ఆదాయాల కంటే ఎక్కువ కావడం.ఈ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యులు అని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ మళ్లీ యుద్ధం మొదలుపెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని చిక్కులు ట్రంప్‌ను చుట్టుముట్టాయి. అమెరికా 40 రోజుల దాడులతో ఫలితం సాధించలేకపోయింది. మళ్లీ దాడులు చేస్తే మరింత తీవ్రతరంగా వైమానిక దాడులు చేయాల్సి వస్తుంది.అలా జరిగితే ఇరాన్ కూడా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అమెరికా, గల్ఫ్ దేశాలు ఎదుర్కోగలవా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది.
సిమ్ కార్డ్ కోసం బయోమెట్రిక్ ఇస్తున్నారా? రూ.101.87 కోట్ల మోసం
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించగా.. తాజాగా సైబర్ నేరాలకు వెన్నెముకగా నిలుస్తున్న ‘ఘోస్ట్ సిమ్’ వ్యవస్థపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’తో ఉక్కుపాదం మోపింది.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలో మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తంగా 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 432 సీల్డ్ సిమ్ లు ఉండగా.. 112 ఓపెన్డ్ సిమ్ లు ఉన్నాయి. వీరిలో 44 మంది ఘోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ కార్డుల సరఫరాదారులు ఉన్నారు. వీరంతా కలిపి దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్లు తేలింది. ఈ నేరాలకు సంబంధించిన మొత్తం మోసం విలువ రూ.101.87 కోట్లు.టెలికాం నెట్వర్క్ వారీగా పరిశీలిస్తే.. అరెస్టయిన పీఓఎస్ ఏజెంట్లలో వొడాఫోన్ ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్‌టెల్‌కు చెందిన వారు ఏడుగురు, జియోకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి.ఈ కేసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నంబర్ పొర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు, వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో.. 'నెట్వర్క్ సరిగా లేదు', 'సర్వర్ డౌన్ అయ్యింది', 'వేలిముద్ర సరిగా పడలేదు' అంటూ ఏజెంట్లు నమ్మబలికి.. రెండు, మూడు బయోమెట్రిక్ ను తీసుకుంటున్నారు.మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఏకంగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి.. నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని వారి ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఇంటర్ నెట్ ను ఉచితంగా ఇస్తామంటూ ఆశచూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. తమకు ఎన్ని సిమ్ లు అమ్మితే అంత కమిషన్ తో పాటు సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు కూడా వస్తుండటంతో ఈ దందా చేస్తున్నారు.ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు భౌతికంగా విదేశాలకు తరలించాల్సిన అవసరం లేకుండానే.. అత్యంత ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సాధారణ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే, వాటిని ఇ-సిమ్ (e-SIM)లుగా మారుస్తున్నారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. తద్వారా ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్ కార్డు లేకుండానే, మన దేశపు మొబైల్ నంబర్లను తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నారు.ఈ ఇండియన్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు.. మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తారు. అమాయకులకు సైబర్ వల వేస్తారు. వారి నుంచి లక్షలాది రూపాయలు, ఒక్కోసారి కోట్లాది రూపాయలు కొల్లగొడుతారు. కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసే 'సెక్స్టార్షన్' ముఠాలు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే 'డిజిటల్ అరెస్ట్' ముఠాలు సైతం ఈ నంబర్లనే వాడుతున్నాయి. నంబర్ మన దేశానిదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారు.ఇదంతా ఒక పక్కా వ్యూహంతో జరుగుతుంది. తమ టార్గెట్ మేరకు వేలాది సిమ్ కార్డుల యాక్టివేషన్ ప్రక్రియ పూర్తికాగానే, ఆ సిమ్ కార్డులను జారీ చేసిన లోకల్ ఏజెంట్లు రాత్రికి రాత్రే తమ దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్నారు. ఈ సైబర్ నెట్‌వర్క్‌ను ఛేధించడంలో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివ మారుతి, వారి ప్రత్యేక బృందాలు ఎంతో కృషి చేశాయి. కాగా,'ఘోస్ట్ సిమ్' నెట్వర్క్ వ్యవహారాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది.అలాగే, డీవోటీ, ట్రాయ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి.. నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కోరనుంది. 'మ్యూల్ అకౌంట్స్' సమస్యను అరికట్టడానికి బ్యాంకుల నుంచి ఎలాగైతే పరిష్కారాలను కోరడం జరిగిందో.. ఇప్పుడు టెలికాం సంస్థల నుంచి కూడా 'ఘోస్ట్ సిమ్' సమస్యను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని వారికి చెప్పనుంది.ముఖ్యంగా పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లపై నిఘాను పెంచడం, వారి బాధ్యతను నిర్ణయించే ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త సిమ్ కార్డుల జారీ, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ప్రక్రియలో తప్పనిసరిగా రియల్-టైమ్ వెరిఫికేషన్ చేయాలి. సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్ కార్డులను వెంటనే డీయాక్టివేట్ చేయాలి. నిబంధనలు పాటించని PoS ఏజెంట్లను, డిస్ట్రిబ్యూటర్లను అన్ని టెలికాం నెట్‌వర్క్‌ల నుంచి బ్లాక్‌లిస్ట్ చేయాలి.ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులు జారీ అవుతున్న తీరును గుర్తించేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగించాలి. కేవైసీ చేసే సమయంలో 'మ్యూల్ హంటర్ డేటా', I4C అనుమానితుల డేటాబేస్‌తో అనుసంధానం చేసి తనిఖీలు చేయాలి. టెలికాం సంస్థలు, పోలీసుల మధ్య డేటా షేరింగ్ కోసం ఒక క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.ప్రజలు ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సమాచారం, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు. సిమ్ కార్డులు తీసుకునే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటూ, కేవలం అధీకృత డీలర్ల వద్దే వాటిని కొనుగోలు చేయాలి.మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పోర్టల్ https://tafcop.sancharsaathi.gov.in ద్వారా వెంటనే చెక్ చేసుకోండి. ఈ 'సంచార్ సాథీ' పోర్టల్‌ను క్రమంతప్పకుండా తనిఖీ చేస్తూ, మీకు తెలియకుండా ఎవరైనా మీ నంబర్‌ను వాడుతుంటే వెంటనే అందులోనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే.. ఆ మొదటి గంట గోల్డెన్ అవర్ అత్యంత కీలకం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కంగారు పడకుండా.. వెంటనే 1930 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. హైదరాబాద్ సిటీ పోలీస్ అందిస్తున్న 'సి-మిత్ర' సేవలను కూడా సద్వినియోగం చేసుకోండి.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..ట్రంప్ ఫస్ట్ చాయిస్ ఈయనేనట!
వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై ఆకస్మిక దాడి, అప్పటి సుప్రీం నాయకుడు అలీ ఖమేనీని హతమార్చిన తరువాత టెహ్రాన్‌లో పాలన మార్పు అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాలో ఒక కీలక భాగంగా ఉంది. ఆ దాడుల తొలినాళ్లలో, ఇరాన్ తదుపరి నాయకుడు ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచే రావాలని ట్రంప్ పదేపదే మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించి ట్రంప్ వ్యూహం తాజాగా తెరపైకి వచ్చింది.ఇరాన్ టాప్ లీడర్ కోసం ట్రంప్ మనసులోని ప్రత్యేకమైన, అత్యంత ఆశ్చర్యకరమైన వ్యక్తి మరెవ్వరో కాదు ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్. కొత్త ఇరాన్ ప్రభుత్వానికి నాయకుడిగా ట్రంప్ ఎంచుకున్న అహ్మదీనెజాద్ కఠినమైన, ఇజ్రాయెల్ వ్యతిరేక, అమెరికా వ్యతిరేక అభిప్రాయాలకు పేరుగాంచిన వ్యక్తి కావడం గమనార్హం.ఈ విషయంపై సమాచారం అందుకున్న అమెరికా అధికారులను ఉటంకిస్తూ, మంగళవారం 'ది న్యూయార్క్ టైమ్స్' నివేదిక ప్రకారం... ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్‌ను దేశానికి కొత్త నాయకుడిగా తిరిగి నియమించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ మరియు అమెరికా 'ఆపరేషన్ రోరింగ్ లయన్' ,'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్లను చేపట్టాయి. ఇరాన్‌కు నాయకత్వం వహించి, "ఇరాన్ రాజకీయ, సామాజిక , సైనిక పరిస్థితిని" నిర్వహించగల సమర్ధుడిగా అమెరికన్లు అహ్మదీనెజాద్‌ను భావిస్తున్నారని ఆయన సహచరుడు ఒకరు మీడియాకు తెలిపారు.ఈ సాహసోపేతమైన ప్రణాళికను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో గాయపడిన అహ్మదీనెజాద్‌ను ఈ ప్రతిపాదన కోసం సంప్రదించారని, అయితే ఆ తర్వాత ఈ ప్లాన్ బెడిసికొట్టిందని నివేదిక సూచించింది. 2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయనను ఒక హాలోకాస్ట్ నిరాకరిణిగా,అణుబాంబు పిచ్చివాడిగా, అప్పటికే విసిగిపోయి ఉన్న దేశంపై ఇస్లామిక్ విప్లవ భావజాలాన్ని బలవంతంగా రుద్దిన వ్యక్తిగా చాలామంది భావిస్తారు. అలాగే అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మతతత్వ ఫాసిజానికి చిహ్నంగా కనిపించడమే కాదు, ఒకానొక సమయంలో ఆయన "ఇజ్రాయెల్‌ను ప్రపంచ పటంలోనే లేకుండా తుడిచేయాలి" అని కూడా పిలుపు నిచ్చారు.గత దశాబ్ద కాలంగా ఆయన ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకిగా మారిపోవడంతో ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఆయనను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికారికంగా నిషేధించింది. అంతేకాదు ఆయన ఇస్లామిక్ ప్రభుత్వం నిఘాలో కూడా ఉన్నారు.'ది అట్లాంటిక్' నివేదిక ప్రకారం, యుద్ధం ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే, ఇరాన్ ప్రభుత్వం అహ్మదీనెజాద్ ఇంటి వద్ద బాడీగార్డులను కాపలా పెట్టింది. పేరుకు ప్రముఖ పౌరుడి రక్షణ కోసమే అయినా, అసలు ఉద్దేశం ఆయనపై నిఘా ఉంచడమే. అయినప్పటికీ, ఇరాన్లో ఆయనకు ఇంకా ఆదరణ ఉంది, అందుకే అక్కడి ప్రభుత్వం ఆయన పట్ల అప్రమత్తంగా ఉంటుంది.యుద్ధం మొదటి రోజున అహ్మదీనెజాద్ ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ దాడి ఉద్దేశం ఆయనను గృహ నిర్బంధం నుండి విడిపించడమే. ఆయన ఆ దాడి నుండి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఈ క్షిపణి దాడి తర్వాత పాలనా మార్పు ప్రణాళికపై ఆయన విరక్తి చెందారని అమెరికా అధికారులు మరియు అతని సహచరుడు ఒకరు తెలిపారు. అప్పటి నుండి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే వివరాలు తెలియవు. టెహ్రాన్‌లో నాయకత్వ మార్పు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని ఆయన సొంత సహాయకులే కొందరు విశ్వసించడం లేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: రోమ్‌లో ‘మెలోడీ’ రీయూనియన్ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్‌ల సునామీవైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ఈ విషయంపై స్పందిస్తూ... "మొదటి నుండి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) పై ప్రెసిడెంట్ ట్రంప్ తన లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయడం, వాటి ఉత్పత్తి కేంద్రాలను కూల్చివేయడం, వారి నౌకాదళాన్ని ముంచేయడం మరియు వారి ప్రాక్సీలను బలహీనపరచడం. అమెరికా సైన్యం తన లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా అధిగమించింది, ఇప్పుడు మా చర్చల ప్రతినిధులు ఇరాన్ అణుసామర్థ్యాలను శాశ్వతంగా నాశనం చేసే ఒప్పందం కోసం కృషి చేస్తున్నారు" అని తెలిపారు. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.అహ్మదీనెజాద్ ఎందుకు ?వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను బంధించడంలో ట్రంప్ విజయం సాధించారు. ఇదే నమూనాను ఇరాన్లో కూడా పునరావృతం చేయవచ్చని ట్రంప్ భావించినట్లు తెలుస్తోంది. అలాగే మదురోను తొలగించిన తర్వాత వెనిజులాలో అధికారం చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్ లాంటి వ్యక్తిగా అమెరికా అహ్మదీనెజాద్‌ను చూసి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ
చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్!
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌పై విజయం సాధించడం ద్వారా రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఆదివారం (మే 24న) ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా 16 పాయింట్లతో రాజస్తాన్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. మ్యాచ్ విజయంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీదే కీలకపాత్ర. 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి రాజస్తాన్‌ను గెలుపు తీరాలకు దగ్గర చేశాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ మిగతాపనిని పూర్తి చేశాడు. అయితే తొలి 12 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన వైభవ్ సూర్యవంశీ ఆ తర్వాతి 26 బంతుల్లో 82 పరుగులు చేయడం విశేషం. అయితే 23 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన అనంతరం వైభవ్ సూర్యవంశీ తన చేతులతో విచిత్రమైన ఫోజు ఇచ్చాడు. దానికి అర్థం ఏంటా అని ఎంత జుట్టు పీక్కున్నప్పటికీ లాభం లేకపోయింది. అయితే తాను ఇచ్చిన ఫోజుపై వైభవ్ మ్యాచ్ ముగిసిన తర్వాత వెల్లడించాడు. ఆ ఫోజు వెనుక ఉన్న రహస్యాన్ని వైభవ్ పంచుకున్నాడు. మురళీ కార్తిక్‌తో వైభవ్ మాట్లాడుతూ..'ఆ ఫోజు ఎందుకు ఇచ్చానో నాకే తెలియదు. ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నా కానీ ఏం చేశానో అర్థం కాలేదు. లక్నోపై ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు వైభవ్ ప్రకటించాడు. తన తల్లి పేరు ‘A’ అక్షరంతో మొదలవు తుందని అందుకే వేళ్లతో ఆ సింబల్ చూపించాను’ అని స్పష్టం చేశాడు. దీంతో వైభవ్ తన అమ్మపై ఉన్న ప్రేమను ఇలా మైదానంలో చాటుకోవడంతో అభిమానులు ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.‘ఇక నేను న్యూస్ పేపర్లు పెద్దగా చదవను. దీనివల్ల నా గురించి పేపర్లలో ఏం రాస్తున్నారన్నది తెలియదు. అయితే నా కెరీర్‌కు ఇది ఆరంభం మాత్రమే. ఇంకా సుదీర్ఘమైన కెరీర్ మిగిలి ఉంది. నా దృష్టి కేవలం ఆటపైనే తప్ప ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోను.'అని చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ మొదట్లో స్లోగా ఆడడంపై కూడా వైభవ్ వివరణ ఇచ్చాడు.'మా జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో నేను డగౌట్లో కూర్చున్నా. ఆ సమయంలో వికెట్ బాగుందనిపిచ్చింది. అయితే ఆదిలోనే తొందరపడితే మొదటికే చేటు అని భావించి కాస్త స్లో ఆడాలని నిర్ణయించుకున్నా. కానీ మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ వేగంగా ఆడడంతో నేను సైలెంట్ అయిపోయాను. కానీ జైస్వాల్ ఔటయ్యేటప్పటికీ పిచ్‌పై పూర్తి అవగాహన వచ్చేసింది. అందుకే ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ ఆడాను. నేను ఎక్కువసేపు క్రీజులో ఉండడమే లక్ష్యంగా పెట్టుకొని బ్యాటింగ్ కొనసాగించాను. అయితే సెంచరీ మిస్ అవ్వడంపై కాస్త నిరాశకు లోనైనప్పటికీ జట్టును గెలిపించడం ఆ బాధను మరిచిపోయేలా చేసింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్‌కు మరింత చేరువయ్యాం. కానీ ఇప్పుడు మా దృష్టంతా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌పైనే ఉంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టడమే మా ఏకైక లక్ష్యం' అని చెప్పుకొచ్చాడు.An entertainer on the field and even off it 😄That's Vaibhav Sooryavanshi for you 😌Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/XO3ZKPPJWb— IndianPremierLeague (@IPL) May 19, 2026చదవండి: టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
HDFC బ్యాంక్ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’
గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కిరీటం మాయం
పాక్ మాజీ క్రికెటర్‌కు బంపరాఫర్.. ఐపీఎల్‌కు అర్హత!
ఎన్ఎంఐఎంఎస్ డిగ్రీ కోర్సులకు రిజిస్ట్రేషన్లు
మూడున్నర ఏళ్లలో అనేక సార్లు భేటీ అయ్యాం: మోదీ, మెలోనీ
ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్
దైవ దర్శనానికి వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
OTT: ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్ రివ్యూ
అభిషేక్ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ
సంపద తరలిన మార్గానికి ఇదే దిక్సూచి
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
HDFC బ్యాంక్ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’
గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కిరీటం మాయం
పాక్ మాజీ క్రికెటర్‌కు బంపరాఫర్.. ఐపీఎల్‌కు అర్హత!
ఎన్ఎంఐఎంఎస్ డిగ్రీ కోర్సులకు రిజిస్ట్రేషన్లు
మూడున్నర ఏళ్లలో అనేక సార్లు భేటీ అయ్యాం: మోదీ, మెలోనీ
ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్
దైవ దర్శనానికి వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
OTT: ‘ఎగ్జామ్’ వెబ్ సిరీస్ రివ్యూ
అభిషేక్ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ
సంపద తరలిన మార్గానికి ఇదే దిక్సూచి
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
ఫొటోలు
ఆధ్యాత్మికతలో అంబానీలు.. బెంగళూరు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సెంటర్లో సందడి (ఫొటోలు)
మెలోనీతో కలిసి మోదీ పలు ప్రాంతాల సందర్శన (ఫోటోలు)
శ్రీవారి సేవలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ దంపతులు (ఫోటోలు)
వరుసగా శుభవార్తలు చెప్తున్న షణ్ముఖ్ జశ్వంత్ (ఫోటోలు)
ఆంధ్రప్రదేశ్ : మనసు దోచే సిద్ధలయ్య కోన ఎక్కడో తెలుసా ?
#HBDJrNTR : జూ.ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ HD స్టిల్స్
'రమణి కళ్యాణం' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా 'ఫస్ట్ టైమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'పెద్ది' కోసం జాన్వీ కపూర్ రెడీ అయిందిలా (ఫొటోలు)
రాశీ ఖన్నా గ్లామర్ ఫోటోషూట్
సినిమా
జైల్లోనే పెళ్లిరోజు.. ఎప్పటికీ నీ చేయి వదలను: దర్శన్ భార్య
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు కాస్త ఊరట కలిగింది. దర్శన్‌ను కలిసేందుకు భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీశ్‌కు జైలు, పోలీసు అధికారులు అనుమతిచ్చారు. కుటుంబంతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఇటీవలే దర్శన్ అధికారులను కోరాడు. 30 నిమిషాలుమామూలుగా ఖైదీలను కుటుంబసభ్యులు కలవాలంటే ఇనుప కడ్డీలు, అద్దం అడ్డుగా ఉంటాయి, అలాగే మాట్లాడుకోవాలి. కానీ, దర్శన్‌కు ముఖాముఖి సంభాషణకు వీలు కల్పించారు. ఈ క్రమంలో తమ పెళ్లిరోజు(మే 19)నాడు భర్తను కలిసింది విజయలక్ష్మి. దాదాపు 30 నిమిషాలపాటు అతడితో సంభాషించింది. అనంతరం సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.నీ చేయి వదలనుప్రతి తుఫానులో, ప్రతి నిశ్శబ్ధంలో నీ చేయి నేను విడవను. పరిస్థితులు మనల్ని విడదీయాలని చూసినా నా గుండెచప్పుడు మాత్రం ఎల్లప్పుడూ నిన్నే కోరుకుంటుంది. ఈ ప్రపంచమంతా నీకు ఎదురు తిరిగినా సరే నేను మాత్రం నీవైపే ఉంటాను. నీకోసమే నిలబడతాను అని రాసుకొచ్చింది. కాగా దర్శన్- విజయలక్ష్మి 2003 మే 19న పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు వినీశ్ సంతానం. పెళ్లయిన కొంతకాలానికి దర్శన్- విజయలక్ష్మిల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. జైలు జీవితంఅదే సమయంలో నటి పవిత్రగౌడతో ప్రేమలో పడ్డాడు దర్శన్. 2014 నుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఇంతలోనే వీరి జీవితాల్లో పెద్ద కుదుపు ఏర్పడింది. 2024లో అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్టయ్యాడు. ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడన్న కారణంతో అనుచరులతో కలిసి దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే దర్శన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. View this post on Instagram A post shared by Vijayalakshmi darshan (@viji.darshan) చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద ఫ్యాన్స్ కోలాహలం
జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?
తెలుగు హీరోల్లో జూ.ఎన్టీఆర్ కాస్త స్పెషల్. చిన్నప్పుడే నటుడు అయిపోయాడు. ఓ వయసొచ్చేసరికి సూపర్ హిట్స్ కొట్టి అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. మధ్యలో ఫ్లాప్స్ పడ్డాయి కానీ మళ్లీ పుంజుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇంతకీ తారక్ ఎంత ఆస్తి సంపాదించాడు? గ్యారేజీలో కార్ల కలెక్షన్స్ ఏంటి?జూ.ఎన్టీఆర్.. సినీ, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలోనే పుట్టాడు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చాడు. అలా ఇప్పటివరకు రూ.500-600 కోట్ల మేర ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ప్రొపర్టీస్ రూపంలోనే ఎక్కువగా ఉన్నట్టు టాక్. ప్రస్తుతం ఉంటున్న జూబ్లీహిల్స్‌లోని ఇంటి విలువ రూ.25 కోట్లు ఉంటుందని, అలానే హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో ఆరున్నర ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉందని తెలుస్తోంది.సినిమాలు చేసినప్పటికి కుటుంబానికి కూడా ఎన్టీఆర్ అదే స్థాయిలో సమయం కేటాయిస్తుంటాడు. ఇద్దరు కొడుకులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ.80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. వీటన్నింటితో పాటు కార్లు, వాచీలంటే కూడా తారక్‌కి పిచ్చి ఇష్టం.తారక్ దగ్గర ప్రస్తుతం అరడజనుకు పైగానే కార్లు ఉన్నాయి! వాటిలో అత్యంత ఖరీదైన పోర్స్ కేమన్ ఎస్ ఒకటి. దీని ఉత్పత్తిని సదరు కంపెనీ ఎప్పుడో ఆపేసింది. చాన్నాళ్ల క్రితమే ఎన్టీఆర్ దీన్ని కొనుగోలు చేశాడు. అప్పట్లో రూ.3 కోట్లు పెట్టి దీన్ని కొన్నాడు. అంటే ఇప్పటి రేటులో డబుల్ ధర ఉండొచ్చు. దీని తర్వాత చూసుకుంటే కొన్నేళ్ల క్రితం రూ.3.5 కోట్లు విలువైన లాంబోర్గిని ఉరుస్ క్యాప్సుల్ గ్రాఫైట్ కారు కొన్నాడు. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు.ఈ రెండింటితో పాటు రూ.4 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ మేబాచ్ ఎస్ క్లాస్, రూ.2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్, రూ.1.70 కోట్ల ఖరీదు చేసే బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఫ్యామిలీ అంతా కలిసి తిరిగేందుకు రూ.1.53 కోట్ల విలువైన టయోటా వెల్ ఫైర్ కారు.. ఎన్టీఆర్ గ్యారేజీలో ఉన్నాయి. వీటలో చాలా వాటికి 9999 లేదా 9 సంఖ్య కలిసొచ్చేలా నంబర్ ప్లేట్స్ ఉంటాయి. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ పాటించిన '9' సెంటిమెంట్‌నే తారక్ ఫాలో అవుతూ వస్తున్నాడు. కార్లే కాదు ఖరీదైన వాచీలు కూడా తారక్ దగ్గరున్నాయి. రూ.7.47 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే చేతి గడియారం, రూ.2.5 కోట్ల విలువైన నటిలస్ వాచీలు తారక్ సొంతం.తారక్ సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత చేసిన వాటిలో 'దేవర' హిట్ కాగా గతేడాది రిలీజైన 'వార్ 2' ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీని గ్లింప్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
రామ్‌కు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో చై మూవీ!
ఆనందం, రన్, సండైకోళి (పందెం కోడి), పయ్యా (ఆవారా), అంజాన్ (సికిందర్) వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు లింగుస్వామి. నిర్మాతగానూ పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ఈయన ఇటీవల మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. సండైకోళి చిత్రంతో విశాల్‌కు సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన లింగుస్వామి ఇటీవల దానికి సీక్వెల్‌గా పందెం కోడి 2 చిత్రాన్ని చేశారు. అది అంచనాలను అందుకోలేకపోయింది. చిన్న గ్యాప్ తర్వాత..ఆ తర్వాత టాలీవుడ్ హీరో రామ్పోతినేని కథానాయకుడిగా ది వారియర్ చిత్రాన్ని చేశారు. కానీ ఈ మూవీ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఈయన సంగీత దర్శకుడు విద్యాసాగర్ వారసుడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఆ చిత్రం ఏమైందో గానీ తాజాగా నాగచైతన్యతో మూవీ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాఇది మంచి యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ మధ్య తండేల్ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న నాగ చెతన్య ప్రస్తుతం వృషకర్మ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమిళంలో వెంకట్ ప్రభు డైరెక్షన్లో కస్టడీ సినిమా చేసి చేతులు కాల్చుకున్న చై.. లింగుసామితో సినిమా చేస్తాడా? లేదా? చూడాలి!
చూపులేని హీరోయిన్.. నడవలేని హీరో
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఓ మూవీ 'రమణీ కళ్యాణం'. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌తో ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో అమితాబ్? మౌనంగా ఉంటే ఇలాగే రెచ్చిపోతారు!)కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. సంజన ఆర్జే & సింగర్. తనకి చుపులేదు. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. 'కోర్ట్' ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ రాశారు. మే 22న అంటే ఈ శుక్రవారమే సినిమా థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)
క్రీడలు
పాక్‌కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. తొలిసారి ఈ జట్టు బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. సిల్హెట్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 78 పరుగుల తేడాతో ఓడటంతో 0-2తో క్లీన్ స్వీప్ అయ్యింది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆ జట్టు భారత్‌ను సైతం కిందకు (ఆరో స్థానానికి) నెట్టింది. ఆసీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక టాప్-4 జట్లుగా కొనసాగుతున్నాయి. ఈ ఓటమితో పాక్ మరింత పతనమై ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ గెలుపు బంగ్లాదేశ్‌కు పాక్‌పై వరుసగా నాలుగవది. అంతకుముందు రెండు టెస్ట్‌లకు బంగ్లాదేశ్ పాక్ గడ్డపైనే గెలిచింది. ఈ ఏడాది మార్చిలో బంగ్లా జట్టు పాక్‌ను వన్డే సిరీస్‌లోనూ ఓడించింది. రిజ్వాన్ పోరాటం వృధా437 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 316-7 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. కొద్దిసేపటిలోనే మిగిలిన 3 వికెట్లు కోల్పోయి 358 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ (94) పాక్‌ను గట్టెక్కించే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అతని పోరాటం వృధా అయ్యింది. తైజుల్ ఇస్లాం (34.2-4-120-6) అద్భుత ప్రదర్శనలతో పాక్ పతనాన్ని శాశించాడు.ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (126) సెంచరీతో కదంతొక్కాడు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ (17-1-81-4), మొహమ్మద్ అబ్బాస్ (16-3-45-3) రాణించారు. అనంతరం పాక్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. బాబర్ ఆజం (68) ఒక్కడే రాణించడంతో అతి కష్టంమీద 232 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తైజుల్, నహిద్ రాణా తలో 3, తస్కిన్, మెహిది హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లతో పాక్ ఆట కట్టించారు.కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఈ ఇన్నింగ్స్‌లోనూ తొలుత తడబడినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ముష్ఫిఫర్ రహీం (137) సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 390 పరుగుల భారీ స్కోర్ చేసి పాక్‌కు 437 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. ఛేదనలో రిజ్వాన్ సహా షాన్ మసూద్ (71), సల్మాన్ అఘా (71) అర్ద సెంచరీతో రాణించినా పాక్‌ను గట్టెక్కించలేకపోయారు.
చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. నిన్న (మే 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసిన అతడు.. ఈ సీజన్లో తన పరుగుల సంఖ్యను 579కి పెంచుకున్నాడు. తద్వారా ప్రపంచంలో ఏ టీ20 టోర్నీలోనైనా 500 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా (15 ఏళ్లు) చరిత్రలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. పంత్ 2018 ఎడిషన్‌లో 20 ఏళ్ల వయసులో (ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున) ఈ ఫీట్‌ను అందుకున్నాడు.ఈ మ్యాచ్‌లో వైభవ్ మరో రెండు భారీ రికార్డులు కూడా సాధించాడు. ఇందులో మొదటిది ఈ సీజన్లో ఇప్పటివరకు 236.33 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన అతడు.. ఓ సీజన్లో 500 ప్లస్ పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక స్ట్రయిక్‌రేట్ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ రసెల్ పేరిట ఉండేది. రసెల్ 2019లో 204.8 స్ట్రయిక్‌రేట్‌తో ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో (202) పరుగులు చేశాడు. సిక్సర్ల ఫిఫ్టిఈ మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదిన వైభవ్ ఈ సీజన్లో తన సిక్సర్ల సంఖ్యను 53కు పెంచుకున్నాడు. తద్వారా ఓ సింగిల్ సీజన్లో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఓ సింగిల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (59) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.ఈ మ్యాచ్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన వైభవ్.. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఈ సీజన్లో అతడి ‘స్లోయెస్ట్’ ఫిఫ్టీ కావడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. వైభవ్ విధ్వంసం ధాటికి లక్నో నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగు చేసుకుంది. ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు దక్కించుకున్న విషయం తెలిసిందే.
ప్రపంచకప్ బరిలో స్కాట్లాండ్ గోల్‌కీపర్ క్రెయిగ్ గోర్డాన్
గ్లాస్గో: ఆటకు వీడ్కోలు చెప్పకముందే తన కల నిజం చేసుకోబోతున్నాడు స్కాట్లాండ్కు చెందిన 43 ఏళ్ల క్రెయిగ్ గోర్డాన్. 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోరీ్నకి అర్హత సాధించిన స్కాట్లాండ్ జట్టు తరఫున గోర్డాన్ బరిలోకి దిగనున్నాడు. వచ్చే నెలలో అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌లో పోటీపడే స్కాట్లాండ్ జట్టును మంగళవారం ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన స్కాట్లాండ్ జట్టులో క్రెయిగ్ గోర్డాన్కు కూడా స్థానం లభించింది. 2004లోనే గోర్డాన్ స్కాట్లాండ్ జాతీయ సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేయగా... ప్రస్తుత జట్టులోని చాలామంది ప్లేయర్లు అప్పటికింకా పుట్టనే లేదు. గ్రూప్ ‘సి’లో ఉన్న సాట్లాండ్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న బోస్టన్‌లో హైతీ జట్టుతో ఆడుతుంది. గోర్డాన్ తుది జట్టులో ఆడితే ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన రెండో అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందుతాడు. ప్రపంచకప్ ఆడిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు ఈజిప్ట్ గోల్‌కీపర్ ఎసామ్ ఎల్ హదారీ (2018లో 45 ఏళ్లు) పేరిట ఉంది.
పాకిస్తాన్‌ను చిత్తు చేసే దిశగా బంగ్లాదేశ్ అడుగులు
సిల్హెట్: బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో... పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ చేసేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పరాజయం పాలైన పాకిస్తాన్... రెండో మ్యాచ్‌లో కాస్త పోరాడినా ప్రస్తుతం పరాజయం అంచునే ఉంది. 437 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్... మంగళవారం ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. సిరీస్ సమం చేయాలంటే... బుధవారం చివరి రోజు చేతిలో మూడు వికెట్లు ఉన్న పాకిస్తాన్ ఇంకా 121 పరుగులు చేయాల్సి ఉంది. సల్మాన్ ఆఘా (102 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (134 బంతుల్లో 75 బ్యాటింగ్; 8 ఫోర్లు), కెపె్టన్ షాన్ మసూద్ (116 బంతుల్లో 71; 8 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు. ఓపెనర్లు అజాన్ అవైస్ (21), అబ్దుల్లా ఫజల్ (6) ఎక్కువసేపు నిలవలేకపోడంతో ఛేదనలో పాకిస్తాన్‌కు శుభారంభం దక్కలేదు. 41/2తో కష్టాల్లో పడ్డ జట్టును బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి షాన్ మసూద్ కాపాడే ప్రయత్నం చేశాడు. మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించిన అనంతరం బాబర్ అవుట్ కాగా... ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. సౌద్ షకీల్ (6) విఫలమయ్యాడు. దీంతో ఒకదశలో 133/2తో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్ కాసేపటికి 162/5తో కష్టాల్లో పడింది. ఇక పాక్ పని అయిపోయినట్లే అనుకుంటున్న దశలో సల్మాన్, రిజ్వాన్ చక్కటి పోరాటం కనబర్చారు. బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ జంట ఆరో వికెట్‌కు 134 పరుగులు జోడించింది. దీంతో కోలుకున్న పాకిస్తాన్ 296/5తో మ్యాచ్‌ను ముగించే స్థితికి చేరింది. అయితే పట్టు వదలకుండా ప్రయత్నించిన బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం చివర్లో సల్మాన్‌తో పాటు హసన్ అలీ (0)ని తన వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... రిజ్వాన్‌తో పాటు సాజిద్ ఖాన్ (8 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో ఎడమ చేతివాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 4, నహీద్ రాణా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేయగా... పాకిస్తాన్ 232 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసిన బంగ్లాదేశ్... పాక్ ముందు రికార్డు లక్ష్యాన్ని నిలిపింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
బిజినెస్
యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
మహారాష్ట్రకు చెందిన సహకార బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు చేపడుతోంది. మహారాష్ట్ర, ఫాల్టాన్కు చెందిన ‘యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం పని వేళలు ముగిసినప్పటి నుంచి ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు (డిపాజిట్లు స్వీకరించడం, రుణాల చెల్లింపులు వంటివి) నిర్వహించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.లైసెన్స్ రద్దుకు కారణాలుబ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని కీలక నిబంధనలను పాటించడంలో యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పూర్తిగా విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్ వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులు, సంపాదన సామర్థ్యం దాని ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయడానికి సరిపోవు. బ్యాంక్ భవిష్యత్తులో లాభాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాంకును ఇంకా కొనసాగనిస్తే అది సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆర్బీఐ చెప్పింది.తదుపరి చర్యలుబ్యాంకును శాశ్వతంగా మూసివేయడానికి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే బ్యాంకు ఆస్తుల అమ్మకం, బాధ్యతల నిర్వహణ కోసం ఒక సమర్థవంతమైన ‘లిక్విడేటర్’(ఒక సంస్థ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి మూతపడే స్థితికి చేరినప్పుడు దాని లిక్విడేషన్ ప్రక్రియను నిర్వహించడానికి ప్రభుత్వం లేదా కోర్టు నియమించే ఒక అధికారిక వ్యక్తి)ను నియమించాలని మహారాష్ట్ర సహకార కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను ఆర్బీఐ కోరింది.డిపాజిటర్లకు లభించే రక్షణ ఎంత?బ్యాంక్ లైసెన్స్ రద్దు అయినప్పటికీ డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టం ప్రకారం ప్రతి డిపాజిటర్‌కు రక్షణ లభిస్తుంది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్ మొత్తానికి గానూ గరిష్టంగా రూ.5,00,000 వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని పొందేందుకు చట్టబద్ధమైన అర్హత కలిగి ఉంటారు. డీఐసీజీసీ ఇప్పటికే సంబంధిత డిపాజిటర్లకు రూ.106.96 కోట్ల మొత్తాన్ని ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కింద చెల్లించడం గమనార్హం.ఇటీవలి కాలంలో ఆర్థిక మూలాలు బలహీనంగా ఉన్న, నిబంధనలు పాటించని అర్బన్, రూరల్ కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ కఠిన వైఖరి అవలంబిస్తోంది. యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కూడా ఇందులో భాగమే. అయితే, ఐదు లక్షల లోపు డిపాజిట్లు ఉన్న ఖాతాదారులకు పూర్తి డబ్బు వెనక్కి వస్తుండటం ఇక్కడ ఊరట కలిగించే అంశం.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!
డిజిటల్ భారత్‌లో మైక్రోసాఫ్ట్ మెగా ప్లాన్
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి భారీ ఊపునిచ్చేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రంగం సిద్ధం చేసింది. దేశంలోనే తన అత్యంత భారీ డేటా సెంటర్‌ను 2026లోనే అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. టెక్నాలజీ హబ్‌గా మారుతున్న హైదరాబాద్ నగరంలోనే ఈ సదుపాయం ఏర్పాటు కాబోతోందని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అధికారికంగా ధ్రువీకరించారు. ఇది భారతదేశంలో మైక్రోసాఫ్ట్ నిర్మించబోయే అత్యంత భారీ, వ్యూహాత్మక డేటా సెంటర్ కానుంది.క్లౌడ్, ఏఐ సేవలకు భారీ డిమాండ్భారత్లో మైక్రోసాఫ్ట్ సేవల విస్తరణపై పునీత్ చందోక్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో అజూర్ క్లౌడ్ సేవలకు విపరీతమైన ఆదరణ ఉంది. దీనితో పాటు నెలకు 30 డాలర్ల ధర కలిగిన కంపెనీ ప్రతిష్టాత్మక ‘కోపైలట్ 365 ఏఐ అసిస్టెంట్’ వినియోగం భారత్‌లో శరవేగంగా పుంజుకుంటోంది’ అని పేర్కొన్నారు.ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో భారత్ అగ్రగామిగా ఉంది. ఇక్కడి భారీ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య, నైపుణ్యం కలిగిన సాంకేతిక ప్రతిభను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ తన ఏఐ పురోగతిని మరింత బలోపేతం చేస్తోంది. కాగా, మైక్రోసాఫ్ట్ ప్రత్యర్థులైన ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్లు సైతం భారతీయ ఏఐ, క్లౌడ్ మార్కెట్లో దూకుడుగా విస్తరిస్తుండటం గమనార్హం.వేల కోట్ల పెట్టుబడిభారత మార్కెట్‌పై మైక్రోసాఫ్ట్ నమ్మకానికి ఇక్కడి పెట్టుబడులే నిదర్శనం. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిగా భావిస్తున్న 17.5 బిలియన్ డాలర్లను భారతదేశంలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ గత ఏడాది చివర్లో ప్రకటించింది. ఇది 2025లో ప్రకటించిన 3 బిలియన్ డాలర్ల వాగ్దానానికి అదనపు పెట్టుబడి కావడం విశేషం. ఈ భారీ నిధుల్లో సింహభాగం హైదరాబాద్ ఫెసిలిటీతో కూడిన డేటా సెంటర్ మౌలిక సదుపాయాల విస్తరణకే మళ్లించనున్నారు. డేటా సెంటర్ నిర్మాణ ప్రణాళికలను ప్రస్తావిస్తూ.. తమ ప్రాజెక్ట్ పనులు అత్యంత వేగంగా, అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నామని చందోక్ స్పష్టం చేశారు. అయితే, రాబోయే ఈ సదుపాయం కచ్చితమైన సామర్థ్యం ఎంత అనే వివరాలను ఆయన ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!
ఆరు నెలల గరిష్టానికి నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగం ఏప్రిల్‌లో స్వల్పంగా పెరిగింది. మార్చిలో ఉన్న 5.1 శాతం నుంచి 5.2 శాతానికి చేరింది. 2025 ఏప్రిల్‌లోనూ 5.1 శాతంగానే ఉండడం గమనార్హం. 15 ఏళ్ల వయసుకు మించి పనిచేసే జనాభాకు సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర ప్రణాళిక, కార్యక్రమాల అమలు శాఖ శుక్రవారం విడుదల చేసింది. చివరిగా 2025 అక్టోబర్‌లోనూ 5.2 శాతం స్థాయిలో నిరుద్యోగం నమోదైంది. ⇒ పట్టణాల్లో నిరుద్యోగం కాస్తంత దిగొచ్చింది. మార్చిలో ఉన్న 6.8 శాతం నుంచి ఏప్రిల్‌లో 6.6 శాతానికి తగ్గింది. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ⇒ 2025 ఏప్రిల్‌తో పోల్చితే మాత్రం గ్రామీణ, పట్టణ నిరుద్యోగంలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ⇒ పట్టణ పురుషుల్లో నిరుద్యోగం మార్చిలో 5 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లో 5.1 శాతానికి చేరింది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం 4.7 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గింది. ⇒ దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు 5.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. గ్రామీణ మహిళల్లో 4.4 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గగా.. పట్టణ మహిళల్లోనూ 9 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గుముఖం పట్టింది. ⇒ కార్మికుల భాగస్వామ్య రేటు ఏప్రిల్‌లో 55 శాతానికి పరిమితం అయింది. మార్చిలో ఇది 55.4 శాతంగా ఉంది.
ఇక యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ భవిష్య నిధిని (పీఎఫ్) వేగంగా ఉపసహరించుకునేందుకు వీలుగా యూపీఐ పేమెంట్ గేట్‌వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని పరీక్షించడం పూర్తయిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. మెరుగైన సేవల దిశగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈపీఎఫ్‌వో సభ్యులు యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా ఉపసంహరించుకునే మొత్తం, వారి బ్యాంక్ ఖాతాలకు వెంటనే జమ అవుతుందని చెప్పారు. ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేసిన యూపీఐ పిన్ను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. నిబంధనల మేరకు భవిష్యనిధిలో కొంత మేర బ్యాలన్స్‌ను తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుంది.అది పోను మిగిలిన మొత్తాన్ని యూపీఐ సాయంతో వేగంగా ఉపసంహరించుకునే దిశగా ఈపీఎఫ్‌వో అడుగులు వేస్తున్నట్టు మంత్రి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. నూతన సదుపాయంతో ఏడు కోట్ల మంది ఈపీఎఫ్‌వో సభ్యులకు నిధుల ఉపసంహరణ సులభతరం కానుంది. ప్రస్తుత విధానంలో సభ్యులు ఉపసంహరణ కోసం క్లెయిమ్ దాఖలు చేసి, నిర్ణీత సమయం పాటు నిరీక్షించాల్సి వస్తోంది.ఆటో–సెటిల్మెంట్ విధానంలో మానవ ప్రమేయం లేకుండా ఎలక్ట్రానిక్ రూపంలో క్లెయిమ్‌ల పరిష్కారానికి మూడు రోజుల సమయం పడుతోంది. ఈపీఎఫ్‌వో వాట్సాప్ సేవలను నెలలో ప్రారంభించనున్నట్టు మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సభ్యులు ఈపీఎఫ్‌వో వాట్సాప్ నంబర్‌కు హాయ్ అని టైప్ చేసి పంపించడం ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉంది? చివరి ఐదు లావాదేవీలు తదితర సమాచారాన్ని పొందొచ్చని చెప్పారు. పెండింగ్ కేసులకు పరిష్కారం నిధి ఆప్కే నికత్ కార్యక్రమం ద్వారా కన్జ్యూమర్ కోర్టుల్లో అపరిష్కృతంగా ఉండిపోయిన కేసులను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మాండవీయ తెలిపారు. దీంతో 2025 ఏప్రిల్ 1 నాటికి 31,036 కేసులు ఉండగా, 2026 ఏప్రిల్ 1 నాటికి 27,639కు తగ్గినట్టు చెప్పారు.
ఫ్యామిలీ
ఆ మూవీ ప్రభావంతో ఉద్యోగానికి రిజైన్ చేసింది..! కట్‌చేస్తే..
సినిమాలోలా రియల్ లైఫ్ ఎప్పటికీ ఉండదు. మూడు గంటల సినిమా ఎంతో ప్రభావం చూపిస్తుంది. కానీ వాస్తవిక ప్రపంచంలో అందులోలా వర్కౌట్ అవడం అంత సులభం కాదు. అదే చాలామంది తెలుసుకోలేక..ఆ సినీ మాయలో పడి ఊహాలోకంలో తేలుతుంటారు. చివరికి హాయిగా ఉన్న లైఫ్‌ని రిస్క్‌లో పడేసుకుంటుంటారు. అలాంటి సంఘటనే ఈ మహిళ లైఫ్‌లో చోటుచేసుకుంది. హర్ష్ అనే యూజర్ సోష్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. తాను ఉద్యోగ ఇంటర్వ్యూలో ఓ మహిళను కలిసినట్లు చెబుతూ..ఆమె చేసిన పని గురించి వివరిస్తూ పోస్టు పెట్టడంతో ఒక్కసారిగా సినిమా ఎంత పనిచేసింది అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ మహిళ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం సంపాదించి స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగంతో బిందాస్‌గా లైఫ్ సాగిపోయిందామెకు. సుమారు ఆరేళ్లు ఆ లైఫ్‌ని ఎంజాయ్ చేసింది. సరిగ్గా 2015లో తమాషా మూవీ చూడటంతో ఒక్కసారిగా ఆమె లైఫ్ అనూహ్యమైన మలుపు తీసుకుంది. ఆ తమాషా మూవీని..ఆర్ట్‌కి ఉన్న పవర్, చిన్ననాటి అభిరుచులను ఎలా వదులుకుని కెరీర్‌పై ఫోకస్ పెడతాం వంటివి ఇతి వృత్తంగా తీసుకుని తీశారు. ఈ మహిళ ఆ మూవీని చూసి స్ఫూర్తి పొంది.. కార్పొరేట్ లైఫ్ అంటే టార్గెట్లు, పనిఒత్తిడి ఇదేనా జీవితం? అదే నచ్చిన అభిరుచిలో కొనసాగడంలో ఉన్న ఆనందమే వేరు అంటూ చేస్తున ఉద్యోగానికి రిజైన్ చేసింది. చక్కగా ఆర్ట్స్ డిప్లొమా కోర్సులో చేరి, ప్రదర్శనలు నిర్వహించడం, తన పేయింటింగ్స్ని అమ్మడం వంటి కెరీర్‌ని నిర్మించుకోవాలని కలలు కనింది. ఆ మహిళ తాను అనుకున్నట్లుగానే క్రియేటివిటీ రంగంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించినప్పటికీ.. ఆ క్రమంలో చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు సవాలుగా మారాయి. అప్పటిదాక పొదుపు చేసిన డబ్బు అయిపోవడంతో ఆ అభిరుచి నుంచి తప్పుకోక తప్పలేదు. చివరికి రెండేళ్ల కెరీర్ విరామం తర్వాత మళ్లీ అనూహ్యంగా కార్పొరేట్ స్థిరత్వమే బెటర్ అంటూ జాబ్ సర్చింగ్ మొదలు పెట్టారామె. అలా ఓ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చి.. తనతో ఆ మహిళ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్లు రాసుకొచ్చారు హర్ష్. అంతేగాదు హర్ష్ ఆమె నిర్ణయం వెనుకున్న భావోద్వేగ పరిస్థితిని ప్రస్తావిస్తూ అభిరుచి వెంట పరుగులు తీసి..కెరీర్‌ని రిస్క్‌లో పెట్టుకోకూడదని అన్నారు. మంచి విషయం ఏంటంటే తన కళా అభిరుచిని వదులుకున్నా అనే పశ్చాత్తాపం ఎప్పటికీ ఎదురవ్వద్దు కానీ ఇంకోరకంగా అది కాస్త చెడ్డ నిర్ణయం ఎలా అంటే..మళ్లీ 30 ఏళ్ల అనంతరం కార్పొరేట్ ఉద్యోగం సంపాదించటం ఈ రోజుల్లో అదెంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ పోస్ట్‌ని ముగించారు. నిజానికి ఈ కథలో నీతి అభిరుచి కోసం ఉద్యోగ జీవితాన్నే రిస్క్‌లో పెట్టడం కంటే..అందులో సాధకబాధలు బేరీజు వేసుకుంటూ..చేస్తున్న ఉద్యోగాన్ని సాగిస్తూనే ఆ కళాత్మక రంగంలో సాగాలి. మొదట పార్ట్‌టైంగా సాగించి..బాగుంది ధైర్యంగా పూర్తి స్థాయిలో దీనిలో దిగొచ్చు అన్న నమ్మకం వచ్చాక..దిగితే ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు. అన్నింట్లకంటే ఆర్థిక భద్రత ముఖ్యం అనేది గ్రహించాలి.(చదవండి: కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..)
కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కొంగొత్త ఆవిష్కరణలు, రోజుకో సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది యువత. అలాంటి ఈ కాలంలో వెట్టిచాకిరి వ్యవస్థ, బానిసలు అనేవి ఇంకా ఉన్నాయంటే నమ్ముతారా?. పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో చదివిన ఘటనలు ఇంకా కళ్లముందు కదలాడటమే కాదు, ఆ దురాగతలకే బలి అవుత్ను వాళ్లు ఇంకా మన మధ్యే ఉన్నారు. అలాంటి భావోద్వేగ ఘటనే పాకిస్తాన్లో చోటుచేసుకుంది. ఓ కుటుంబం అప్పులో ఊబిలో చిక్కుకుని, తరతరాలు వెచ్చిచాకిరిలో మగ్గిపోయింది. సింపుల్‌గా చెప్పాలంటే ఆధునిక బానిసలు. బాధలనే చీకట్లో మగ్గిపోతున్న వాళ్ల బతుకుల్లోకి ఓ విదేశీయుడి కారణంగా వెలుగు సంతరించుకుంది. అసలేం జరిగిందంటే..పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కసూర్ ప్రాంతంలో ఇటుక బట్టీలలో దాదాపు 130 ఏళ్లుగా వెట్టిచాకిరిలో చిక్కుకుంది ఓ కుటుంబం. ఆ ఫ్యామిలీని విడిపించేందుకు ఓ మానవతావాది ముందుకొచ్చారు. నివేదికల ప్రకారం..తరతరాల క్రితం వారి పూర్వీకులు తీసుకున్న 'పేష్కి' అనే అప్పు భారంతో పనిచేస్తూ ఉండేది. ఆ అప్పు ఎన్నడూ తీరకపోవడంతో తర్వాత తరాలు వేతనాలు లేకుండా పనిచేస్తూ జీవితాంత బానిసలుగా బతుకీడుస్తున్నారు. వాళ్లకు విముక్తి కలిగించే రక్షణ చర్యను ఆరోన్ హచింగ్స్ అనే విదేశీయుడు చేపట్టారు. 'జూబ్లీ క్యాంపెయిన్' అనే మానవహక్కుల సంస్థ సభ్యుడైన ఆరోన్ వారి జీవితాలకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఈ 'జూబ్లీ క్యాంపెయిన్' సంస్థ పలు దేశాలలో బానిసత్వం, మతపరమైన హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక మానవ హక్కుల సంఘం. హచింగ్స్ ఆ కుటుంబం బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుందని తెలుసుకుని ఎలా భావోద్వేగంగా స్పందించారో రికార్డు చేసి మరీ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు ఆ వీడియోకి ఐదో రోజు గుడ్‌న్యూస్ తెలుసుకున్న ఆ కుటుంబం..కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అనే క్యాప్షన్ జోడించి మరి పోస్టు చేశారు. కాగా, ఈ జూబ్లీ క్యాంపెయిన్ ప్రపంచవ్యాప్తంగా జాతి, మత మైనారిటీల కోసం మానవ హక్కులు, మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. ఈ క్యాంపెయిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, మయన్మార్, నైజీరియా, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్ వంటి దేశాలలో బలవంతపు చాకిరీ, వెట్టిచాకిరి,మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై పనిచేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఆ విదేశీయుడు హచింగ్స్ని ప్రశంసించగా, ఇంకా ఇలాంటివి కొనసాగుతున్నాయా అని విస్తుపోస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Aaron Hutchings (@aaronhutchings77) (చదవండి: ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!)
కేన్స్‌లో ప్రజక్తా మాలి ట్రెడిషనల్ లుక్! సగర్వంగా భారతీయత..
ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్! పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్... కానీ ప్రపంచమంతా సెలెబ్రిటీల దుస్తులు, రెడ్ కార్పెట్ మీద వారి లుక్స్ తదితరాలే హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. అందుకోసం తారలు, సెలబ్రిటీలు తల నుంచి పాదాల వరకు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చూపుతిప్పుకోని విధంగా రెడి అయ్యేందుకు కొన్ని నెలల ముందు నుంచే సన్నద్ధమవుతుంటారు. అయితే ఈ ప్రపంచ వేదిక కేన్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసే లాంగ్ గౌనులు, పాశ్చాత్య స్టైలిష్ వేర్లే సందడి చేస్తుంటాయి. అలాంటిది ఈసారి భారతీయ డిజైనర్లు మన భారతీయ సంప్రదాయ వారసత్వానికే పెద్దపీట వేశారు. ఒక్కో ప్రాంతంలో ఉన్న సంప్రదాయ చీరలు, ఆభరణాలతో తారలు, ప్రముఖులు సందడి చేయడం విశేషం. తాజాగా ఆ కోవలోకి మరాఠి నటి ప్రజక్తా మాలి కూడా చేరిపోయారు. ఆమె ఈ ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ రెడ్ కార్పెట్‌పై మహారాష్ట్ర సంస్కతిని సగర్వంగా చూపించారామె. తన మూలాలను చాటి చెప్పేలా సాంప్రదాయ నీలి రంగు నౌవారీ చీరలో మెరిశారామె. రిచ్ బ్లూ, పర్పుల్ రంగుల మేళవింపుతో ఉన్న మహారాష్ట్రలో చీరలో వయ్యారంగా నడుస్తూ..అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం మొత్తాన్ని తనవైపుకి తిప్పుకునేలా ప్రత్యేకంగా కనిపించింది. ఆమె రూపం సంప్రదాయ సాంస్కృతికి గర్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఆఖరికి తన ఆహార్యానికి తగ్గట్టుగా చక్కగా జుట్టు ముడివేసి, సాంప్రదాయ బిందీ, ప్రత్యేకమైన నాథ్, చోకర్, గాజులు, కమర్బంద్ వంటి యాక్సెసరీలు ధరించారామె. మరాఠి సంప్రదాయలో రాజసమైన లుక్‌లో ఆకర్షించారామె. అంతేగాదు ప్రజక్తా కెమెరాలకు చేతులు జోడించి అభివాదం చేస్తూ ఇచ్చిన ఫోజులు ఆత్మీయత, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పుతున్నట్లుగా ఉంది. ఇలా ప్రపంచ వేదికపై సగర్వంగా భారతీయతను చాటడం ముఖ్యంగా మరాఠీ ప్రేక్షకులను ఎంతోగానో అలరించడం కాదు, గర్వించే క్షణంగా మారింది. కాగా, ప్రజక్తా మాలి, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్‌కార్పెట్‌పై అరంగేట్రం చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..సాంప్రదాయ నౌవారీ చీర, మరాఠీ నాథ్‌తో కేన్స్‌లో నడవం ఎంతో గర్వంగా ఉందని పోస్ట్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Prajaktta Mali (@prajakta_official) (చదవండి: బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !)
సమతుల్య పోషణతోనే సేంద్రియ దిగుబడులు
సేంద్రియ కూరగాయల సాగులో ఒకటికి నాలుగు రకాల సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కలిపి వాడినప్పుడు మాత్రమే అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందుతాయని, తద్వారా అత్యుత్తమ దిగుబడులు సాధించగలమని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, పరివృద్ధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాలీహౌస్లో రెడ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలను ప్రయోగాత్మకంగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ 2025–26 శీతాకాల పంటలో ఉత్తమ ఫలితాలు సాధించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎ. రాజారెడ్డి పర్యవేక్షణలో హార్టికల్చర్ అసిస్టెంట్ ్రపొఫెసర్లు డా. సీహెచ్ షణ్ముఖి, డా. టి. శిరీష నిర్వహిస్తున్న ఈ మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ కిసాన్ సంఘ్‌కు చెందిన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.కాలీఫ్లవర్ ఎకరానికి 8 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై కాలీఫ్లవర్‌ను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 9 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడుతూ పాలీహౌస్లో కాలీఫ్లవర్ సాగు చేస్తే 5.8 టన్నుల దిగుబడి వచ్చింది. అయితే, కోళ్ల ఎరువుతో పాటు 3 రకాల జీవన ఎరువులు వాడితే అత్యధికంగా హెక్టారుకు 8 టన్నులకుపైగా సేంద్రియ కాలీఫ్లవర్ దిగుబడి వచ్చింది. హెక్టారుకు 7.5 టన్నుల కోళ్ల ఎరువుతో పాటు వామ్ 5 కిలోలు, అజోస్పిరిల్లం 2 కిలోలు, పీఎస్బీ 5 కిలోలు వాడినప్పుడు అత్యధికంగా ఒక్కో కాలీఫ్లవర్ బరువు 825 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 8టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. అయితే, జీవన ఎరువులతో పాటు వర్మీ కంపోస్టు లేదా జీవామృతం లేదా లిగ్నైట్ కలిపి వాడినప్పుడు.. కోళ్ల ఎరువుతో పాటు జీవన ఎరువులు వాడినప్పటికన్నా తక్కువ దిగుబడి రావటం విశేషం.రెడ్ క్యాబేజీ ఎకరానికి 9 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై రెడ్ క్యాబేజీ పంటను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 6 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. పాలీహౌస్లో హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడితే హెక్టారుకు 5 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడి వచ్చింది. అయితే, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువుతో పాటు మరో 4 రకాల సేంద్రియ ఎరువులు వాడితే హెక్టారుకు అత్యధికంగా 9 టన్నులకుపైగా సేంద్రియ రెడ్ క్యాబేజీల దిగుబడి వచ్చింది. హెక్టారుకు 5 టన్నుల పశువుల ఎరువు, వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడారు. ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 962 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 9 టన్నులకు పైగా దిగుబడి రావటం విశేషం. అయితే, పశువుల ఎరువు అసలు వాడకుండా.. హెక్టారుకు వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడినప్పుడు ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 935 గ్రాములకు మాత్రమే పెరిగింది.సమతుల్య పోషణే కీలకంసేంద్రియ సాగులో పంటలకు అవసరమైన అన్ని పోషకాలనూ సమతుల్యంగా తగు పాళ్లలో అందించగలిగినప్పుడే రసాయన సేద్యంతో సమానంగా దిగుబడులు సాధించటం సాధ్యమవుతుందని మల్లారెడ్డి యూనివర్సిటీలో తాజా పరిశోధనలు తేల్చాయి. పాలీహౌస్ ప్రయోగాత్మక సాగులో ఎకరానికి 8 టన్నుల కాలీఫ్లవర్, 9 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడులు మాకు సంతృప్తి కలిగించాయి. అన్ని యూనివర్సిటీలూ ఈ దిశగా పరిశోధనలు చేస్తే రైతులకు మంచి ఆదాయంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యదాయకమైన ఆహారం లభిస్తుంది. – ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులుసేంద్రియ పరిశోధనలు కొనసాగిస్తాంపూర్తిగా సేంద్రియ కూరగాయల సాగులో మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టు తొలి ఏడాది ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలు ఈ ప్రయోగాలు కొనసాగిస్తాం. సేంద్రియ ఎరువుల యాజమాన్యం, దిగుబడుల స్థిరీకరణ చేసి పూర్తి ఫలితాలు ఆ తర్వాత ప్రకటిస్తాం. – డాక్టర్ ఎ. రాజారెడ్డి, డీన్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మల్లారెడ్డి యూనివర్సిటీనిర్వహణ: పంతంగి రాంబాబు
అంతర్జాతీయం
#Melodi: రోమ్‌లో మెలోడీ మూమెంట్
విదేశీ పర్యటనలో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ చేరుకున్నారు. రోమ్‌లో మోదీకి ఇటలీ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ ఘన స్వాగతం పలికారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని చివరగా ఇక్కడ పర్యటించబోతున్నారు. నా స్నేహితుడికి రోమ్ నగరం స్వాగతం పలుకుతోంది అంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. అంతకు ముందు.. ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. ఇటలీ చారిత్రక కోలోసియం సందర్శించారు. అక్కడ సెల్ఫీ కూడా దిగారు. వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రోమ్‌లో మెలోడీ#Melodi మూమెంట్స్ అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. మోదీ, మెలనీ పేర్లను కలిపి అలా సరదాగా పిలుస్తారన్నది చాలామందికే తెలిసే ఉంటుంది. వీళ్ల స్నేహంపై సోషల్ మీడియాలో తరచూ చర్చ నడుస్తుంటుంది కూడా. Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026మోదీ 2024లో జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లారు. అయితే అధికారిక ద్వైపాక్షిక పర్యటన మాత్రం ఇదే. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య మిత్రబంధాన్ని కాస్త వ్యూహాత్మక సంబంధంగా మార్చాలని మోదీ భావిస్తున్నారు. వాణిజ్యం, రక్షణ, సముద్ర భద్రత, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. తొలుత ఇటలీ అధ్యక్షుడు సెర్జియో మట్టారెల్లాతో మోదీ భేటీ అవుతారు. అటుపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఎఫ్ఏవో (Food and Agriculture Organisation) ప్రధాన కార్యాలయం సందర్శించి అక్కడ ఆహార భద్రత అంశంలో భారత్ వైఖరిని మోదీ చాటిచెప్పే అవకాశం ఉంది. అలాగే.. ఇండియా-మిడిల్ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ద్వారా వాణిజ్య, రవాణా, కనెక్టివిటీ విస్తరణ అంశాలను చర్చించనున్నారు. రక్షణ, సముద్ర భద్రత, సరఫరా గొలుసులు, టెక్నాలజీ, వాణిజ్యం రంగాల్లో సహకారం కోసం రూపొందించిన Joint Strategic Action Plan 2025–2029 పైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, మొబిలిటీ, డిఫెన్స్ తయారీలో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలపైనా చర్చిస్తారని సమాచారం. ప్రవాస భారతీయులతో.. రోమ్‌లోని హోటల్ వద్ద భారతీయ ప్రవాసులు మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. వారణాసి ఘాట్లను ప్రతిబింబించే చిత్రకళా బహుమతి అందించారు. సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ పర్యటన భారత్–ఇటలీ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశంగా భావిస్తున్నారు. రక్షణ, వాణిజ్యం, సముద్ర భద్రత, ఆహార భద్రత రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా యూరప్‌లో భారత్ వ్యూహాత్మక స్థానం మరింత బలపడనుంది. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, డిఫెన్స్ తయారీ రంగాల్లో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది.
సంబంధాలు ఉన్నతస్థాయికి
ఓస్లో: తమ సంబంధాలను ఇకపై గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని భారత్, నార్డిక్ దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని మోదీ మంగళవారం నార్వే రాజధాని ఓస్లోలో మూడో ఇండియా–నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. క్లీన్ ఎనర్జీ, సుస్థిరాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, నవీన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. మోదీతోపాటు ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రన్ ఫ్రొస్టాడాటిర్, ఫిన్లాండ్ ప్రధాని పెటెరీ ఓర్పో, డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్, నార్వే ప్రధాని జోనా గర్ స్టోర్, స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఈ సదస్సుకు హాజరయ్యారు.అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదంపై భారతదేశం, నార్డిక్ దేశాలు స్పష్టమైన, ఐక్య వైఖరిని కలిగి ఉన్నాయని మోదీ తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో రాజీపడి ప్రసక్తే లేదని, ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టంచేశారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు కొనసాగుతున్న తరుణంలో నియమాల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేయడానికి భారత్, నార్డిక్ దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని వెల్లడించారు.ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా వివాదాల ప్రారంభ పరిష్కారానికి, శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు మద్దతునిస్తూనే ఉంటామని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన పట్ల నిబద్ధత తమను సహజ భాగస్వాములను చేస్తోందన్నారు. గ్రీన్ టెక్నాలజీ భాగస్వామ్యంతో మొత్తం ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందిస్తామని మోదీ పేర్కొన్నారు. మూడు దేశాల ప్రధానులతో భేటీ ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలతో క్లీన్ ఎనర్జీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరాభివృద్ధి, డిజిటలీకరణ, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీ తదితర రంగాల్లో పరస్పర సంబంధాలను బలపేతం చేసుకోవడంపై మోదీ చర్చించారు. ఆయన మంగళవారం ఆయా దేశాల ప్రధానమంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్, మూడు నార్డిక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్‌లో పర్యటించాలని మూడుదేశాల ప్రధానులను మోదీ ఆహ్వానించారు. ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఇటలీకి పయనమైన మోదీ ప్రధాని మోదీ నార్వే పర్యటన పూర్తిచేసుకొని మంగళవారం ఇటలీకి పయనమయ్యారు. నార్వే పర్యటన ఫలవంతంగా ముగిసిందని ఆయన ‘ఎక్స్‘లో పోస్టుచేశారు. పలు సమావేశాల్లో పాల్గొన్నానని, కీలక రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.
పెంకులేకుండానే గుడ్లను పొదిగారు!
వాషింగ్టన్: అంతరించిపోయిన జీవులను డీఎన్ఏల సాయంతో మళ్లీ పునర్సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాలోని జీవసాంకేతికరంగ సంస్థ ‘కొలోసల్ బయోసైన్సెస్’తన ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. న్యూజిలాండ్‌లో చాలా శతాబ్దాల క్రితం అంతరించిపోయిన భారీ పక్షిజాతి ‘మోవా’ను పునర్సృష్టించే క్రతువులో మరో ముందడుగువేశామని కొలోసల్ బయోసైన్సెస్ తాజాగా ప్రకటించింది. మోవాకు జన్యువులపరంగా అత్యంత సారూప్యత ఉండే ఇతర జాతుల పక్షుల డీఎన్ఏతో సింథసిస్ చేసి తొలుత మోవా గుడ్డును తయారుచేయాలని సంకల్పించింది.అయితే ఆనాటి మోవాజాతి గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే ఏకంగా గరిష్టంగా 80 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇంతటి భారీ గుడ్డును పొదగాలంటే అంతపెద్దస్థాయిలో కృత్రిమ ఎగ్‌షెల్ అవసరం అవుతుంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కృత్రిమమేధతో త్రిమితీయ(3డీ) ముద్రిత చిన్నపాటి ఎగ్‌షెల్‌ను తయారుచేశామని కంపెనీ ప్రకటించింది. ఇందులో సాధారణ కోడి గుడ్లలోని పచ్చ, తెల్లసొనలను బయటకుతీసి ఈ 3డీ ముద్రిత ఎగ్షెల్లో పెట్టి విజయవంతంగా పొదిగామని కంపెనీ మంగళవారం వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా ఇలా ఇప్పటిదాకా 26 కోడిపిల్లలను సృష్టించారు. ఏఐ ఎగ్‌షెల్ ఎలా? పెంకును పగలగొట్టి పచ్చ, తెల్లసొనలను కప్పులాంటి ఇతర గోళాకార ఆకృతుల్లో పొదగడంపై గతంలోనూ చాలా మంది ప్రయోగాలు చేశారు. అయితే సహజసిద్ధ పెంకు నుంచి మాత్రమే సరిపడా ఆక్సిజన్ అందుతుంది. దాంతోనే లోపల గుడ్డు పొదుగుతుంది. ఇందుకోసం ఆక్సిజన్ సరైన మోతాదులో అందేలా లోపలివైపు జల్లెడ లాంటి దానిని కొలోసల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దానికి బయటివైపు పారదర్శకంగా ఉండేలా మరో కణత్వచాన్ని తయారుచేశారు. వీటి సాయంతో పచ్చ,తెల్లసొనలు ఏమాత్రం పాడవకుండా సహజసిద్ధ వాతావరణాన్ని వాటికి అందించామని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చ,తెల్లసొన కోడిపిల్లగా మారే క్రమంలో సాధారణ పెంకు నుంచి కాల్షియంను సంగ్రహించుకుంటుంది.ఇదే తరహాలో తాము కూడా ఈ ఏఐ ఎగ్‌షెల్ ద్వారా కాల్షియంను అందించామని పరిశోధకులు తెలిపారు. ఈ ఎగ్‌షెల్‌ను ఇంక్యుబేటర్‌లో పెట్టి సరిపడా వేడిని అందించి పొదిగారు. తమ ప్రయోగం విజయవంతంకావడంపై కొలోసల్ సంస్థ సీఈఓ బెన్లామ్ ఆనందం వ్యక్తంచేశారు. సింథటిక్ బయాలజీ పితామహుడిగా పేరొందిన అమెరికా దిగ్గజ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ జార్జ్ చర్చ్ ఆధ్వర్యంలో కొలోసల్ సంస్థ పనిచేస్తోంది. ‘‘కృత్రిమమేధతో పనిచేసే కృత్రిమ ఎగ్‌షెల్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే భవిష్యత్తులో అంతరించిపోయిన పక్షిజాతులకూ తిరిగి ప్రాణం పోయవచ్చు. న్యూజిలాండ్‌లో ప్రాచీనకాలంలో కలియతిరిగిన మోవా జాతిని పునర్సృష్టించాలంటే దాని గుడ్డును మోయగలిగే భారీ పక్షిజాతులు ఇప్పుడులేవు. అందుకే ఇలా కృత్రిమ ఎగ్‌షెల్ తయారీకి పూనుకున్నాం’’అని బెన్లామ్ వివరించారు.
సెప్టెంబర్‌లో భారత్‌కు పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్రంలో అధ్యక్షుడు పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషకోవ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ ఆయన వేరుగా భేటీ అవుతారని వివరించారు.బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉన్న భారత్ ఈ శిఖరాగ్రానికి ఆతిథ్యం ఇస్తోంది. భారత్‌కు పుతిన్ చివరిసారిగా 2025 డిసెంబర్లో వచ్చారు. అప్పట్లో ఆయన భారత్–రష్యా వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. బ్రెజిల్, భారత్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పాటైన బ్రిక్స్‌లో ప్రస్తుతం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, ఇండోనేసియా కూడా సభ్యదేశాలుగా ఉన్నాయి.
జాతీయం
‘కాక్రోచ్ జనతా పార్టీ’ vs ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’?
న్యూఢిల్లీ: భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో నిత్యం కూటములు, చీలికలు, వాట్సాప్ వార్ రూమ్‌ల హడావుడిని చూస్తూనే ఉంటాం. అయితే, దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త ‘బయోలాజికల్’ డిజిటల్ రాజకీయ యుద్ధం మొదలైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ (కాక్రోచెస్, పారాసైట్స్) అనే వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, యువత ఈ అవమానాన్ని కేవలం నిరసనగా మార్చకుండా, ఒక వినూత్న వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా మలిచారు. దీని ఫలితంగానే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ), ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ (ఎన్పీఎఫ్) వంటి వ్యంగ్య పొలిటికల్ గ్రూపులు నెట్టింట ప్రభంజనం సృష్టిస్తున్నాయి.కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానం (CJP)‘ఎక్కడ వైఫై ఉంటే అదే మా ప్రధాన కార్యాలయం’ అంటూ అభిజీత్ దిప్కే అనే యువకుడు మే 16న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని స్థాపించారు. కేవలం నాలుగు రోజుల్లోనే ‘ఎక్స్’, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ పేజీకి ఏకంగా 10 లక్షల (మిలియన్) పైగా ఫాలోవర్స్ వచ్చారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రవేశ పరీక్షల భారంతో నలిగిపోయే యువతకు ఈ వేదిక ఒక ఆయుధంగా మారింది. వీరి మేనిఫెస్టోలో.. రిటైర్మెంట్ తర్వాత చీఫ్ జస్టిస్‌లకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదని, తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు కేబినెట్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా దీనిపై ఆన్లైన్లో స్పందించడంతో ఈ ఉద్యమానికి మరింత ప్రచారం లభించింది. (Cockroach Janta Party Story)దూసుకొచ్చిన ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’(NPF)రాజకీయాల్లో ఖాళీలు ఉండవు కాబట్టి, సీజేపీకి పోటీగా ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ రంగంలోకి దిగింది. పరాన్నజీవులుగా ముద్రపడిన సాధారణ పౌరుల తరఫున తామే అసలైన ప్రతిపక్షం అని ఈ గ్రూప్ ప్రకటించుకుంది. ‘వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికే మేము ఈ విరిగిన వ్యవస్థతో అతుక్కుపోయాం’ అని ఎన్పీఎఫ్ తన వెబ్సైట్లో పేర్కొంది. పార్లమెంట్లో నేరస్థులు ఉండకూడదని, చదువుకున్న ప్రజాప్రతినిధులు రావాలని, వర్షం పడితే నదులుగా మారే రోడ్ల వ్యవస్థ మారాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ బొద్దింకలాగా ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే సామాన్యుడిని ప్రతిబింబిస్తే, ఎన్పీఎఫ్ మాత్రం ‘అసలైన పరాన్నజీవులు ఎవరు?’ అంటూ పాలకుల వైపు ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. (National Parasitic Front Story)సరికొత్త మీమ్ పాలిటిక్స్ యుగంభారతదేశంలో కార్టూన్లు, మిమిక్రీ ద్వారా రాజకీయ వ్యంగ్యం ఎప్పటి నుంచో ఉంది. కానీ 2026 నాటి ఈ డిజిటల్ యుగంలో, యువత కేవలం జోకులను చూసి నవ్వుకోకుండా, తామే స్వయంగా భాగస్వామ్యులయ్యే ‘పార్టిసిపేటరీ సాటైర్’ విధానాన్ని ఎంచుకున్నారు. పూర్వం యువత ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక వెబ్సైట్ తెరిచి, లోగో క్రియేట్ చేసి, ఒక నకిలీ రాజ్యాంగాన్ని రాసి మధ్యాహ్నానికల్లా వేలల్లో ఫాలోవర్లను సంపాదిస్తున్నారు. ఈ రెండు గ్రూపులు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన అధికారిక పార్టీలు కాకపోయినప్పటికీ, దేశంలోని నిరుద్యోగ యువత ఆవేదనను, వ్యవస్థపై వారికున్న అసంతృప్తిని డిజిటల్ వేదికగా ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.ఇది కూడా చదవండి: మీ అర్హతలకు ప్రభుత్వ పథకాలు.. కొత్త వెబ్సైట్ వచ్చేసింది!
లంచంపై ఫిర్యాదు చేస్తే లక్ష బహుమతి!
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారా?. అవినీతి రహిత పాలన కోసం కఠిన చర్యలు అవలంభిచబోతున్నారా?. ఇందు కోసం తొలి అడుగు.. అవినీతి నిరోధక శాఖ ప్రక్షాళనతోనే ప్రారంభించబోతున్నారా?. లంచం అడిగినా అధికారులపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నజరానా ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం విజయ్ సర్కార్ ప్రొత్సాహక పథకం తేబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగా.. అధికారులు ఎవరైనా వెయ్యి లంచం అడిగినా పిర్యాదు చేస్తే లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినట్లు ఆ వార్త సారాంశం. అవినీతి ఫిర్యాదుల కోసం 24 గంటలు పని చేసేలా 1800 425 1555 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారని.. అలాగే ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తారన్నది ఆ కథనం సారాంశం. అంతేకాదు.. ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వమని ప్రభుత్వం భరోసా ఇవ్వబోతోందట. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలించేందుకు అడుగులు వేశారని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ శాఖల్లో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు చర్చ నడుస్తోంది. ఇందుకుగానూ అన్ని శాఖలకు మూడు నెలల గడువు విధించారని.. పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు.. టెండర్లు, కాంట్రాక్టులు పారదర్శకత కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ఆ కథనాలు ఊటంకించాయి. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు అవినీతి రహిత సమాజంలో ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయమంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో అనూహ్య ప్రశ్న సంధించి వార్తల్లో నిలిచిన నార్వే మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్ (Helle Lyng Svendsen) చేదు అనుభవం ఎదురైంది. ఆమె సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తూ మెటా షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె కూడా ధృవీకరించారు.ఆన్లైన్లో వెల్లువెత్తిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలు నిలిపివేయబడ్డాయని హెలె లింగ్ ట్వీట్ చేశారు. తన ఖాతా నిలిపివేయబడటానికి ముందు రోజంతా తన ఇన్‌స్టాను యాక్సెస్ చేయలేకపోయానని లింగ్ తెలిపారు. "పత్రికా స్వేచ్ఛ కోసం చెల్లించాల్సిన చిన్న మూల్యమే ఇది, కానీ ఇలాంటి అనుభవం ఇంతకు ముందెప్పుడూ ఎదురు కాలేదు," అని ఆమె తన సస్పెన్షన్ నోటీసు స్క్రీన్‌షాట్ షేర్ చేశారు.Throughout all day I have struggled to log onto my Instagram account. Now I have been suspended. It is a small prize to pay for press freedom, but I’ve never experienced it before. pic.twitter.com/XCitS65Rlg— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026 ; మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్స్ ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వినియోగ దారులకు, తన ఇన్‌స్టా, ఫేస్బుక్ ఖాతాలు రెండూ సస్పెండ్ అయ్యాయని మరో పోస్ట్‌లో లింగ్ తెలియజేశారు. తాను వీలైనంత ఎక్కువ మంది భారతీయులకు స్పందించాలనుకున్నా, కానీ ఇప్పుడు అది లేట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ తన ఖాతాలు తిరిగి యాక్టివ్ అవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన పోస్ట్‌కు ఆమె మెటాను కూడా ట్యాగ్ చేస్తూ రాశారు.ఇదీ చదవండి: ఇది కదా లక్ అంటే : పాత ప్యాంట్లో రూ. 57 కోట్ల జాక్‌పాట్ కాగా ప్రధాని మోదీ పత్రికా సమావేశంలో తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ బాగా వైరల్ అయింది. ఆమె ఫాలోవర్లు కూడా పెరిగారు. దీనిపై బీజేపీ శ్రేణులు లింగ్పై విరుచుకుపడగా, నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.
విజయ్‌కు కొత్త టెన్షన్!
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీవీకే విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో, విజయ్ మంత్రి వర్గంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే ఎమ్మెల్యేలు చేరనున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు సమాచారం.కాగా, తమిళనాడు ప్రభుత్వానికి అటు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, అన్నాడీఎంకే రెబల్స్‌కు మంత్రి పదవులు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరికను సీపీఎం వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటామని సీఎం విజయ్‌కు అల్టిమేటం విధించినట్టు సమాచారం. దీంతో, సీఎం విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా.. సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్‌కు సీఎం విజయ్ నివాళులు అర్పించం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్‌ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్‌కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్‌గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసిందికాంగ్రెస్ ఏం చెబుతుంది?రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్‌కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్‌తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది.డిఫెన్స్‌లో టీవీకే.. ఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే కాదని, శ్రీలంకలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది. అయితే, సీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎన్ఆర్ఐ
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
క్రైమ్
అమీర్‌పేట గర్ల్స్ హాస్టల్లో.. చొరబడ్డ వ్యక్తులు..!
హైదరాబాద్: గర్ల్స్ హాస్టల్లో గుర్తుతెలియని వ్యక్తులు కనిపించారని చెప్పిన యువతులపై దుర్భాషలాడిన హాస్టల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. అమీర్‌పేటలో ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్‌ను శివపార్వతి, ఆమె కుమారుడు వీరారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న తెల్లవారు జామున ఓ గదిలో ఎవరో ఉన్నట్లు అనుమానం రావడంతో యువతి లేచి చూడగా బాత్రూమ్లో దూరాడు. గట్టిగా అరవడంతో పరారయ్యాడు. ఈ విషయం నిర్వాహకుడు వీరారెడ్డికి చెబితే దుర్భాషలాడాడు. ఇలా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చినట్లు యువతులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి వీరారెడ్డిని అరెస్టు చేశారు. శివపార్వతి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
లక్ష్మీకుమార్ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు, భారీగా బంగారం!
మల్లాపూర్/నాంపల్లి: హైదరాబాద్ జలమండలిలో ఓ భారీ అవినీతి జలగ ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సంస్థ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) రెడ్‌హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీకుమార్ (58) నివాసం సహా బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన 8 ప్రదేశాల్లో ఏసీబీ డీఎస్పీ మజీత్ అలీఖాన్ ఆధ్వర్యంలో 16 గంటలపాటు సోదాలు జరిగా యి. హైదరాబాద్ మల్లాపూర్‌లోని వెంకటరమణ కాలనీలో ఉన్న అనంత లక్ష్మీకుమార్ నివాసంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఏకంగా రూ. 1.10 కోట్ల నగదు, 2.1 కేజీల బంగారం, 9.2 కేజీల వెండి లభ్యమైంది. అలాగే నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఇళ్లు, మారుతీ కారు, బజాజ్ మోటార్ బైక్ సహా మొత్తం రూ. 5.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంత లక్ష్మీకుమార్ భార్య రాధమ్మ పేరిట మూడు బ్యాంకు లాకర్లలో భద్రపర్చిన ఆభరణాలు, ఇళ్ల పత్రాలను కూడా ఏసీబీ అధికారులు తెరిపించి స్వా«దీనం చేసుకున్నారు. రెడ్‌హిల్స్‌లోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి కొన్ని రికార్డులను తీసుకెళ్లారు. ఆయా ఆస్తుల మార్కెట్ విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. అనంత లక్ష్మీకుమార్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన్ను బంజారాహిల్స్‌లోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)కు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాధు చేయాలని సూచించారు. ఫిర్యాధుల వివరాలు పూర్తింగా గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా, నోట్ల కట్టలను లెక్కించేందుకు తీసుకొచ్చిన కౌంటింగ్ మెషీన్లు కాసేపు మొరాయించాయి. సోదాల్లో 15 మంది అధికారులు పాల్గొన్నారు. ఉలిక్కిపడిన మల్లాపూర్...: మల్లాపూర్ వెంకరమణ కాలనీలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నట్లు టీవీల్లో చూసి ఉలిక్కిపడిన స్థానికులు.. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అనంత లక్ష్మీకుమార్ నివాసం వద్ద గుమిగూడారు. గత నెలలో చిన్న కుమార్తె వివాహాన్ని ఆయన ఆరంఘర్ సమీపంలో అంగరంగ వైభవంగా చేశారని చర్చించుకున్నారు.
స్పా సెంటర్లో భార్యను చంపిన భర్త..!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో పాటు అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన మంగళవారం గాం«దీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ఎస్ఐ నర్సింహ, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం. ఆటో డ్రైవర్ రాజు, బంగి దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్‌పురా కిషన్‌బాగ్ ఎంఎన్ గూడెంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కవాడిగూడ ప్రధాన రహదారిలోని ఓ సూపర్ మార్కెట్ 4వ అంతస్తులోని స్పా సెంటర్లో దేబోరా బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు ఎంఎన్ గూడెంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటూ రాజుపై దేబోరా అత్తాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు పెట్టింది. అప్పటి నుంచి రాజు కక్ష పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. మంగళవారం ఉదయం దేబోరా విధుల్లో భాగంగా ఆటోలో కవాడిగూడలోని స్పా సెంటర్‌కు చేరుకుంది. ఆమెను వెంబడించిన రాజు కవాడిగూడకు చేరుకున్నాడు. ఆమె లిఫ్టులోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చాడు. వీరిద్దరూ లిప్టులోనే గొడవ పడుతూ 4వ అంతస్తుకు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరంపై అనేక చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో దేబోరా మృతి చెందింది. నిందితుడు రాజు అత్తాపూర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళ వెనుక వెళ్లి.. డ్రెస్‌ను పైకెత్తి
హైదరాబాద్: ఇటీవల నార్సింగి సైకిల్ ట్రాక్‌లో జాగింగ్ చేస్తున్న యువతిని చూస్తూ ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడం మరచిపోకముందే అలాంటిదే మరో ఘటన నెక్నాంపూర్ డివిజన్ అలకాపూర్ టౌన్íÙప్లో చోటుచేసుకుంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. స్థానికులు, నార్సింగి ఎస్ఐ సరిత తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ రోడ్ నం. 4లో మధ్యాహ్నం వేళ కూతురును ఎత్తుకుని వెళ్తోంది. ఓ యువకుడు నక్కినక్కి వచ్చి వెనకనుంచి మహిళ డ్రెస్‌ను పైకెత్తాడు. అకస్మాత్తు పరిణామంతో నివ్వెరపోయిన మహిళ గట్టిగా అరిచింది. దీంతో నిందితుడు పారిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది. కొందరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది. విషయం పోలీసులకు చేరడంతో బాధిత మహిళను గుర్తించి ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఇలాంటివి జరగకుండా పోలీసులు గస్తీ పెంచాలని, కాలనీల్లో సీసీ కెమెరాలన్నింటినీ పనిచేసేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.చిల్లర నా కొడుకులు ఎక్కువైపోయారు 💦ఏం బ్రతుకులు రా మీవి ముండల్లారThis incident happened in Manikonda on 14 may afternoon pic.twitter.com/kcvlzogBme— Prudvi Kumar (@Prudvikumar_54) May 19, 2026
వీడియోలు
బాబు విజన్.. గ్యాస్ లేకుండానే చేపల ఫ్రై
తప్పు చేస్తే ఎవరిని వదలొద్దు.. POCSO మీద అందుకే.. మంచు మనోజ్ రియాక్షన్
YSR శిష్యులం భయపెడితే భయపడతామా?
అత్తాపూర్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
కష్టపడి స్పూన్ తో చేపలు తింటున్న బాబు.. చంద్రబాబు పులిహోర
ఆమె కోసమే A సింబల్.. అసలు సీక్రెట్ భయపెట్టిన బుడ్లోడు
బీటెక్ సర్టిఫికెట్ నమ్ముకుంటే కష్టమే.. ఈ కోర్సులు కూడా పక్కా ఉండాలి..!
షాక్ ఇచ్చిన బంగారం.. శాంతించిన వెండి..
మోదీ-మెలోని ద్వైపాక్షిక భేటీ
గో డౌన్ నీ సొమ్మా...! ధూళిపాళ్ల నరేంద్రపై అంబటి మురళి


