ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఓ మూవీ 'రమణీ కళ్యాణం'. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్తో ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఆస్పత్రిలో అమితాబ్? మౌనంగా ఉంటే ఇలాగే రెచ్చిపోతారు!)
కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది అనే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. సంజన ఆర్జే & సింగర్. తనకి చుపులేదు. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. 'కోర్ట్' ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ రాశారు. మే 22న అంటే ఈ శుక్రవారమే సినిమా థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)


