ఎన్‎ఎంఐఎంఎస్ డిగ్రీ కోర్సులకు రిజిస్ట్రేషన్లు | NMIMS undergraduate registrations | Sakshi
Sakshi News home page

ఎన్‎ఎంఐఎంఎస్ డిగ్రీ కోర్సులకు రిజిస్ట్రేషన్లు

May 20 2026 6:19 PM | Updated on May 20 2026 6:52 PM

NMIMS undergraduate registrations

భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విద్యకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఎస్‎వీకేఎం వారి నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎన్‎ఎంఐఎంఎస్) మల్టీ డిసిప్లైనరీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను రూపొందించింది. విద్యార్థులను పరిశ్రమ-ఆధారిత పాఠ్యాంశాలు, అనుభవపూర్వకమైన అభ్యాసం,విమర్శనాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వాస్తవ-ప్రపంచ అనుభవం కోసం సిద్ధం చేసే ఒక అండర్ గ్రాడ్యుయేట్ అభ్యాస వ్యవస్థను తయారు చేసినట్లు ఎన్‎ఎంఐఎంఎస్ తెలిపింది.

2026—27 విద్యా సంవత్సరానికి గానూ ఎన్‎ఎంఐఎంఎస్ ముంబై, నవి ముంబై, శిర్పూర్, బెంగళూరు, హైదరాబాదు, ఇండోర్, చండీఘడ్, అహ్మదాబాద్ లోని తమ ప్రాంగణాలలో అండర్ ‎గ్రాడ్యుయేట్ అవకాశాలను అందిస్తోంది. ఎన్‎పిఏటి (కామర్స్), ఎన్‎సిఈటి (ఇంజనీరింగ్ & ఫార్మసీ), ఎన్‎ఎల్‎ఏటి (లా), ఎన్‎డిఏటి (డిజైన్), ఎంఎస్‎టి (మ్యాథమాటిక్స్, స్టాటిస్టిక్స్ & డేటా సైన్సెస్) సహా ఎంచుకున్న కోర్స్ ఆధారంగా వివిధ ప్రవేశ పరీక్షల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ రిజిస్ట్రేషన్లకు గడువు మే 26న ముగుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement