ఎడ్యుకేషన్‌పై ఐఏఎస్‌ అధికారి ఆసక్తికర పోస్ట్‌..! | IAS officer says education missed key life lessons | Sakshi
Sakshi News home page

ఎడ్యుకేషన్‌పై ఐఏఎస్‌ అధికారి ఆసక్తికర పోస్ట్‌..!

May 20 2026 10:59 AM | Updated on May 20 2026 11:21 AM

IAS officer says education missed key life lessons

మన విద్య విధానం విద్యాపరంగా గెలుపు సాధించడం ఎలా, కఠినతరమైన పరీక్షలను ఎదుర్కోవడం ఎలా తదితరాలనే నేర్పిస్తోంది. జీవితానికి అవసరమైనవి, అత్యంత కీలకమైన పాఠాలను నేర్పించడంలేదట. చదువు అన్ని జీవన నైపుణ్యాలను నేర్పింస్తుందని పొరబడుతున్నాం. అది నిజంగా భావోద్వేగ పరంగా స్ట్రాంగ్‌ ఉండటం దగ్గర నుంచి జీవితానికి అవసరమై కీలక పాఠాలనేవ ఏమి నేర్పించలేకపోతుందంటూ ఓ ఐఏఎస్‌ అధికారిణి పెట్టిన పోస్టు అందర్నీ ఆకర్షించడమే కాదు ఆలోచనాత్మకంగా ఉంది. ఇంతకీ ఆమె ఆ పోస్ట్‌లో ఏం రాశారంటే..

ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా..ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక కాలేజీలలో ఉన్నత చదువుని పొందా, ఐఏఎస్‌ వంటి మంచి గౌరవనీయమైన ఉద్యోగాన్ని దక్కించుకున్నానని అన్నారు. అయితే తాను పొందిన ఉన్నత విద్య పోటీపరీక్షలకు, వృత్తిపరమైన బాధ్యతలకు సిద్ధం చేయగలిగింది కానీ భావోద్వేగ పోరాటాలకు, ఒంటిరితనాన్ని ఎదుర్కోవడం వంటి సవాళ్లకు సిద్ధం చేయలేకపోయిందని రాశారు. 

నిజానికి మనమంతా విద్యార్థి దశలో గెలుపుని ఎలా అందుకోవాలో నేర్చుకోవడానికి ఏళ్ల తరబడి టైం స్పెండ్‌ చేస్తాం, కానీ సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఒక్క రోజు కూడా కేటాయించం అని పోస్టులో రాసుకొచ్చారామె. మనం కెమిస్ట్రీలో ఆవర్తన పట్టికను తెగ కంఠస్థం చేస్తాం, అయితే బాధను ఎలా అధిగమించాలో మాత్రం నేర్చుకోం. నిజానికి విద్యార్థులంతా విద్యా సంబంధితమైన అన్నింటిని నేర్చుకుంటారు, కానీ దుఃఖం, ఒత్తిడి లేదా వైఫల్యాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం నేర్పించదు లేదా ఏ గురువు నేర్పే ప్రయత్నం చేయరని అన్నారు. 

అంతేగాదు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి బదులుగా అణిచేయడం లేదా నియంత్రించడమే నేర్పిస్తారని, అది కాస్త ఒత్తిడికి గురిచేస్తుందని ఆమె నొక్కి చెబుతున్నారు. అంతేగాదు ప్రతి స్టూడెంట్‌కి వ్యాసాలు రాయడం ప్రోత్సహిస్తాం, కానీ అసౌకర్యాన్ని ఎలా వ్యక్తపరచాలో, హద్దులు ఎలా ఏర్పరచుకోవాలి,  కష్టతరమైన పరిస్థితుల్లో కాదు అనే మాట ఎలా చెప్పాలి వంటి అనేక విషయాలను నేర్పాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారామె. ప్రతి స్కూలు స్టూడెంట్‌ చెప్పే సమాధానాలకు బహుమతులు ఇస్తుంది, వారినే విజేతలుగా పేర్కొంటుంది. కానీ జీవితంలో ఎక్కువ ప్రశ్నలు వేసిన వారే నిలదొక్కుకుంటారని ఆమె అంటున్నారు. 

అలాగే గణితం నేర్పిస్తాం గానీ ఆర్థిక ఒత్తిడిని ఎలా నిర్వహించాలో నేర్పదన్నారు. కేవలం డబ్బు సంపాదించడమే విద్య నేర్పిస్తుందే కానీ, దాన్ని నిర్వహించడం నేర్పదని పోస్టులో రాసుకొచ్చారామె. ఆమె పోస్టులకు పలువురు నెటిజన్లు మద్దతిస్తూ..విద్య కేవలం వృత్తి జీవితాన్నే నేర్పిస్తుందే తప్ప జీవితానికి కీలకమైన జీవన నైపుణ్యాలనే నేర్పించలేకపోతుందంటూ పోస్టులు పెట్టారు.  

(చదవండి: ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే..)

 

Advertisement
 
Advertisement
Advertisement