లంచంపై ఫిర్యాదు చేస్తే లక్ష బహుమతి! | Tamil Nadu CM Vijay Sensational Anti Corruption Move, Announces ₹1 Lakh Reward For Reporting Bribery, Sparks Massive Debate | Sakshi
Sakshi News home page

1000 లంచం అడిగినా ఫిర్యాదు చేస్తే లక్ష బహుమతి!

May 20 2026 12:43 PM | Updated on May 20 2026 1:18 PM

Tamil nadu CM Vijay Sensational Decision For Corruption Eradicate

చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారా?. అవినీతి రహిత పాలన కోసం కఠిన చర్యలు అవలంభిచబోతున్నారా?. ఇందు కోసం తొలి అడుగు.. అవినీతి నిరోధక శాఖ ప్రక్షాళనతోనే ప్రారంభించబోతున్నారా?. లంచం అడిగినా అధికారులపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నజరానా ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది.    

అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం విజయ్‌ సర్కార్‌ ప్రొత్సాహక పథకం తేబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగా.. అధికారులు ఎవరైనా వెయ్యి లంచం అడిగినా పిర్యాదు చేస్తే లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినట్లు ఆ వార్త సారాంశం. అవినీతి ఫిర్యాదుల కోసం 24 గంటలు పని చేసేలా 1800 425 1555 టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేశారని.. అలాగే ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేస్తారన్నది ఆ కథనం సారాంశం. 

అంతేకాదు.. ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వమని ప్రభుత్వం భరోసా ఇవ్వబోతోందట. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలించేందుకు అడుగులు వేశారని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ శాఖల్లో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు చర్చ నడుస్తోంది. ఇందుకుగానూ అన్ని శాఖలకు మూడు నెలల గడువు విధించారని.. పోలీస్‌, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్‌ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. 

మరోవైపు.. టెండర్లు, కాంట్రాక్టులు పారదర్శకత కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ఆ కథనాలు ఊటంకించాయి. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు అవినీతి రహిత సమాజంలో ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ సీఎం విజయ్‌ తీసుకుంటున్న నిర్ణయమంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement