ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఆ పేర్ల అర్థమిదే! | Jr NTR Introduces His Pet Birds Asahi, Yuuhi | Sakshi
Sakshi News home page

Jr NTR: బర్త్‌డే రోజు తారక్‌ స్పెషల్‌ పోస్ట్‌.. వాటిని పరిచయం చేస్తూ..

May 20 2026 3:17 PM | Updated on May 20 2026 3:17 PM

Jr NTR Introduces His Pet Birds Asahi, Yuuhi

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంట్లో కొత్త అతిథులు వచ్చి చేరాయి. రెండు అందమైన రామచిలుకలు తారక్‌తో కలిసి ఆడుకుంటున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్‌ తన బర్త్‌డే (మే 20) సందర్భంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. వాటికి అసాహి, యూహి అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు. ఇవి జపనీస్‌ పేర్లు. అసాహి అంటే సూర్యోదయం, యూహి అంటే సూర్యాస్తమయం అని అర్థం. జపాన్‌ దేశంపై తనకున్న ప్రేమతోనే పెంపుడు పక్షులకు జపనీస్‌ పేర్లు పెట్టినట్లు వెల్లడించాడు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తారక్‌ కెరీర్‌ మొదలైందిలా..
దివంగత నటుడు ఎన్టీరామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. తాత ఎన్టీఆర్‌ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడిగా తొలిసారి తెరపై కనిపించాడు. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారాడు. స్టూడెంట్‌ నెం.1, ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, యమదొంగ, అదుర్స్‌, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇలా అనేక హిట్‌ చిత్రాల్లో నటించాడు. 

సినిమా
చివరగా తెలుగులో దేవర: పార్ట్‌ 1తో హిట్‌ అందుకున్నాడు. హృతిక్‌ రోషన్‌ వార్‌ 2 మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో డ్రాగన్‌ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది. అలాగే తారక్‌ చేతిలో దేవర 2 కూడా ఉంది.

చదవండి: జైల్లోనే పెళ్లిరోజు.. దర్శన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement