జైల్లోనే పెళ్లిరోజు.. ఎప్పటికీ నీ చేయి వదలను: దర్శన్‌ భార్య | Darshan Wife Vijayalakshmi Emotional Post on 23rd Wedding Anniversary | Sakshi
Sakshi News home page

Darshan: ప్రపంచమంతా వ్యతిరేకించినా సరే.. నీవైపే ఉంటా, నీకోసమే నిలబడతా..

May 20 2026 10:52 AM | Updated on May 20 2026 11:22 AM

Darshan Wife Vijayalakshmi Emotional Post on 23rd Wedding Anniversary

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు సెంట్రల్‌ జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు కాస్త ఊరట కలిగింది. దర్శన్‌ను కలిసేందుకు భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీశ్‌కు జైలు, పోలీసు అధికారులు అనుమతిచ్చారు. కుటుంబంతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఇటీవలే దర్శన్‌ అధికారులను కోరాడు. 

30 నిమిషాలు
మామూలుగా ఖైదీలను కుటుంబసభ్యులు కలవాలంటే ఇనుప కడ్డీలు, అద్దం అడ్డుగా ఉంటాయి, అలాగే మాట్లాడుకోవాలి. కానీ, దర్శన్‌కు ముఖాముఖి సంభాషణకు వీలు కల్పించారు. ఈ క్రమంలో తమ పెళ్లిరోజు(మే 19)నాడు భర్తను కలిసింది విజయలక్ష్మి. దాదాపు 30 నిమిషాలపాటు అతడితో సంభాషించింది. అనంతరం సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.

నీ చేయి వదలను
ప్రతి తుఫానులో, ప్రతి నిశ్శబ్ధంలో నీ చేయి నేను విడవను. పరిస్థితులు మనల్ని విడదీయాలని చూసినా నా గుండెచప్పుడు మాత్రం ఎల్లప్పుడూ నిన్నే కోరుకుంటుంది. ఈ ప్రపంచమంతా నీకు ఎదురు తిరిగినా సరే నేను మాత్రం నీవైపే ఉంటాను. నీకోసమే నిలబడతాను అని రాసుకొచ్చింది. కాగా దర్శన్‌- విజయలక్ష్మి 2003 మే 19న పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు వినీశ్‌ సంతానం. పెళ్లయిన కొంతకాలానికి దర్శన్‌- విజయలక్ష్మిల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 

జైలు జీవితం
అదే సమయంలో నటి పవిత్రగౌడతో ప్రేమలో పడ్డాడు దర్శన్‌. 2014 నుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఇంతలోనే వీరి జీవితాల్లో పెద్ద కుదుపు ఏర్పడింది. 2024లో అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌, పవిత్ర అరెస్టయ్యాడు. ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడన్న కారణంతో అనుచరులతో కలిసి దర్శన్‌ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే దర్శన్‌ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు.

 

 

చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంటి వద్ద ఫ్యాన్స్‌ కోలాహలం

Advertisement
 
Advertisement
Advertisement