కోల్‌కతాకు వచ్చేస్తా... బెంగాల్‌ సీఎంకు తస్లిమా నస్రీన్ లేఖ | Want to come back to Kolkata says Taslima Nasrin | Sakshi
Sakshi News home page

కోల్‌కతాకు వచ్చేస్తా... బెంగాల్‌ సీఎంకు తస్లిమా నస్రీన్ లేఖ

May 20 2026 3:44 PM | Updated on May 21 2026 4:55 PM

Want to come back to Kolkata says Taslima Nasrin

సాక్షి, కోల్‌కతా:  ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ముఖచిత్రం మారిన నేపథ్యంలో ఆమె తిరిగి  కోల్‌కతారావాలని భావిస్తున్నారట. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం మారడంతో, దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రవాసంలో ఉంటున్నఆశలను మళ్లీ చిగురింపజేసినట్టు తెలిపారు. బంగ్లాదేశ్‌లో జన్మించి, ప్రవాసంలో ఉండి ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న,తస్లీమా తాజా పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ కోల్‌కతాకు తిరిగి రావచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

2007 నవంబర్‌లో తనను కోల్‌కతా నుండి బలవంతంగా వెళ్లగొట్టారనీ,  ఇప్పుడు పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయన్నారు.  గతంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం గానీ, ఆ తర్వాత వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ తనను నగరానికి తిరిగి వచ్చేందుకు అనుమతించలేదని విమర్శించారు.  గతంలో తాను స్క్రిప్ట్ రాసిన ఒక మెగా సీరియల్‌ను కూడా తృణమూల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.  దశాబ్దాలుగా కోల్‌కతాకు తిరిగి రావాలనే  కోరిక కోరిగానే ఉండిపోయిందని వాపోయారు.

కోల్‌కతాతో ఉన్న అనుబంధం
కల్చరల్ క్యాపిటల్ కోల్‌కతాలో ఉండే అవకాశం వస్తే  ఖచ్చితంగా అక్కడే ఉంటాను.  1914 ఆగస్టు లో బంగ్లాదేశ్ నుండి  బహిష్కరణకు గురైన తరువాత కోల్‌కతా సొంత ఇల్లా అనిపించింది. యూరప్ వదిలేసి తాను ఇక్కడికి రావడానికి కారణం బెంగాలీ సంస్కృతే అన్నారు. భారతదేశ సాంస్కృతిక రాజధాని కోల్‌కతాలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు, అలాగే కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌కు హాజరుకావాలని ఉందన్నారు. ఇటీవల కేరళతో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపిన ఆమె, కోల్‌కతా సందర్శనకు అనుమతిస్తే ఎంతో కృతజ్ఞతురాలినై ఉంటానని తస్లీమా చెప్పారు.

ఇదీ చదవండి: ఇది కదా లక్‌ అంటే : పాత ప్యాంట్‌లో రూ. 57 కోట్ల జాక్‌పాట్‌

కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారికి లేఖ రాయనున్న తస్లిమా
పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన సువేందు అధికారికి తాను కోల్‌కతా తిరిగి వచ్చేలా అనుమతించాలని కోరుతూ లేఖ రాయడానికి సిద్ధంగా ఉన్నట్లు తస్లిమా తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా తాను కోల్‌కతాలో నివసించాలనే కలలు కంటున్నానని, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తే అక్కడికే మారిపోతానని చెప్పారు. 

ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement