breaking news
Taslima Nasrin
-
అన్యాయం శాశ్వతం కాదు
కోల్‌కతా: అన్యాయం అనేది అశాశ్వతమని వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రిన్ వ్యాఖ్యానించారు. 19 సంవత్సరాల క్రితంగా ఆమె రచనలపై పశ్చిమబెంగాల్లో మొదలైన నిరసనలతో చివరకు ఆమె కోల్‌కతా నగరాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు తొలిసారిగా కోల్‌కతాకు వచ్చిన ఆమె శనివారం ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘కోల్‌కతాకు వచ్చాక ఇన్నాళ్లూ నేను ఇక్కడ వదిలేసి వెళ్లిన నా జీవితంలోకి మళ్లీ వచ్చినట్లుంది. ఇన్నాళ్లూ కోల్‌కతాను వీడటంతో నా చిరునామాను కోల్పోయానన్న బాధ అనుక్షణం వేధించింది’’అని ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఏ రాజకీయ పార్టీ తరఫున మాట్లాడేందుకు రాలేదు. ఏ పార్టీకీ నేను వ్యతిరేకం కాదు. మహిళల హక్కుల సాధన కోసం గళం విన్పిస్తూనే ఉంటా. అన్ని రకాల మతవాదాలకు నేను వ్యతిరేకం. ముఖ్యంగా ముస్లిం ఛాందసవాదానికి నేను పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే చిన్నతనం నుంచి ఆ ఛాందసవాదాన్ని కళ్లారాచూశా. నేను పుట్టి పెరిగిన బంగ్లాదేశ్‌లో ఇప్పుడు మత అతివాదం ప్రబలుతోంది. దీంతో వాక్ స్వాతంత్య్రం మరింత ప్రమాదంలో పడుతోంది. బంగ్లాలో ఛాందసవాదం పడగ విప్పే కొద్దీ వాక్ స్వాతంత్య్రం గొంతు నొక్కుకుపోతుంది. మహిళలు, మైనార్టీలు ఆ దేశంలో భద్రంగా, గౌరవంగా భవిష్యత్తులోనైనా బతకాలని కోరుకుంటున్నా. ఇన్నాళ్ల తర్వాత నేను కోల్‌కతాలో అడుగుపెట్టే గడియలొచ్చాయి. అన్యాయం శాశ్వతంగా ఉండబోదనడానికి ఈ క్షణాలే సాక్ష్యం. నన్ను అడ్డుకున్న వాళ్లు, ఇప్పుడు స్వాగతం పలికి వాళ్లు ఎవరనేది చరిత్ర గుర్తుంచుకుంటుంది’’అని అన్నారు. లజ్జ నవల రచించాక స్వదేశంలో బెదిరింపులు ఎక్కువయ్యాక తస్లీమా 1994 ఆగస్ట్‌లో బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు. 2004లో కోల్‌కతాలో ఆమె స్థిరపడ్డారు. అయితే ద్విఖండిత అనే ఆత్మకథ రాయడం, అందులోని అంశాలను ముస్లిం సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించి ఉద్యమించడం, అది హింసాత్మకంగా మారడంతో నాటి బుద్దదేవ్ భట్టాచార్య సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వం ఆమెను రాష్ట్రం నుంచి పంపేసింది. దీంతో ఆమె తర్వాత జైపూర్‌కు చివరకు ఢిల్లీలో అజ్ఞాతవాసంలో ఉండాల్సి వచ్చింది. అయినాసరే ఆమె పై ఒత్తిళ్లు పెరడంతో యూరప్‌కు వెళ్లిపోయారు. ఎప్పడొచ్చినా భద్రత కల్పిస్తాం: ముఖ్యమంత్రి ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడారు. ‘‘సీఎంగా, పోలీస్ శాఖ సారథిగా ఇది నా బాధ్యత. మీరు ఎన్నిసార్లు రాష్ట్రానికి వచ్చినా పటిష్టమైన భద్రత కల్పించే బాధ్యత నాది. ఇకపై బెంగాల్లో బెదిరింపులు, భయాలు అనేవి ఉండవు. రాజ్యాంగ మూలస్తంభాలన్నీ ఇక్కడ పటిష్టంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ రాష్ట్రానికి రావొచ్చు. వాక్ స్వాతంత్య్రం మేరకు మాట్లాడొచ్చు. నస్రీన్ ఎప్పుడొచ్చానా ఆమెకు భద్రమైన బెంగాల్ స్వాగతం పలుకుతుంది’’ అని సీఎం అన్నారు. -
‘ఇంటికి తిరిగొచ్చినట్టుంది’.. తస్లీమా నస్రీన్ భావోద్వేగం
ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్లీ కోల్‌కతా గడ్డపై అడుగుపెట్టారు. గతంలో తీవ్ర నిరసనలు, వివాదాల కారణంగా నగారన్ని వీడాల్సి వచ్చిన ఆమె.. శుక్రవారం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరిగి రావడంపై ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.‘‘ఇంటికి తిరిగొచ్చినట్లే అనిపిస్తోంది. ఇక్కడ నాకు చాలా నచ్చుతుంది’’ అంటూ కోల్‌కతాలో అడుగుపెట్టిన వెంటనే తస్లీమా స్పందించారు. చాలా కాలం తర్వాత తనకు ఎంతో అనుబంధం ఉన్న నగరానికి తిరిగి రావడం వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన సందర్భమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఆమె రాకను బీజేపీ స్వాగతించింది. అయితే మిగతా రాజకీయ పార్టీలు మాత్రం సరైన సమయం కాదనే అంటున్నాయి.నా అంతట నేను పోలేదు‘‘నేను కోల్‌కతాను ఎప్పుడూ స్వచ్ఛందంగా వదిలిపెట్టలేదు. అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నన్ను వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది. అయినా ఏదో ఒక రోజు తిరిగి వస్తాననే ఆశను ఎప్పుడూ కోల్పోలేదు’’ అని తెలిపారు. ఏళ్లు గడిచాయి.. ప్రభుత్వాలు మారాయి.. కానీ తిరిగి రావడానికి నాకు తలుపులు మాత్రం మూసే ఉన్నాయి” అని ఆమె గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.#WATCH | Bangladeshi writer and activist Taslima Nasreen arrives in Kolkata, West Bengal pic.twitter.com/IsFSBUaZ7t— ANI (@ANI) July 31, 2026‘ద్విఖండితో’ పుస్తకంతో వివాదంతస్లీమా నస్రీన్ 2007లో కోల్‌కతాను వీడాల్సి వచ్చింది. ఆమె రాసిన ఆత్మకథాత్మక పుస్తకం ‘ద్విఖండితో’పై తీవ్ర నిరసనలు చెలరేగడంతో అప్పటి పరిస్థితుల్లో ఆమె నగరాన్ని విడిచారు. అంతకుముందు బంగ్లాదేశ్‌లో కూడా మతపరమైన వివాదాల కారణంగా ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత కోల్‌కతాను తన నివాసంగా మార్చుకున్న ఆమె.. దాదాపు పదేళ్ల పాటు అక్కడే ఉన్నారు.అయితే 2003లో అప్పటి వామపక్ష ప్రభుత్వ హయాంలో ‘ద్విఖండితో’ పుస్తకాన్ని మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందనే ఆరోపణలతో నిషేధించారు.రేపు కార్యక్రమంలో పాల్గొననున్న తస్లీమాకోల్కతా పర్యటనలో భాగంగా శనివారం రవీంద్ర సదన్‌లో నిర్వహించే ఓ కార్యక్రమంలో తస్లీమా పాల్గొననున్నారు. మత మౌఢ్యానికి వ్యతిరేకంగా నిర్వహించే సాహిత్య సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 63 ఏళ్ల తస్లీమా నస్రీన్ ఢిల్లీలో దీర్ఘకాలిక నివాస అనుమతితో ఉంటున్నారు.తిరిగి వచ్చినా.. పాత జ్ఞాపకాల వెంటరచనల్లో స్వేచ్ఛ, మహిళా హక్కులు, మత ఛాందసవాదంపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే తస్లీమా నస్రీన్‌కు కోల్‌కతాతో ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె తిరిగి రావడం సాహిత్య, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
బెదిరింపుల ప్రభావం తాత్కాలికమే
కోల్‌కతా: వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు రెండు దశాబ్దాల తరువాత భారత్ తిరిగి రానున్నారు. 2003 తస్లిమా నస్రీన్ రాసిన పుస్తకం ‘ద్విఖండిత’పెద్ద వివాదానికి కారణమైంది. ముస్లింల మనోభావాలను దెబ్బతీశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, నిరసనలకు దిగడంతో ప్రభుత్వం 2007లో ఆ పుస్తకాన్ని నిషేధించడంతోపాటు తస్లీమా దేశం వదిలి వెళ్లేలా చేసింది. అయితే.. ఇన్నేళ్ల తరువాత మళ్లీ కోల్‌కతా రావడంపై ఆమె గురువారం మాట్లాడుతూ, ‘‘నా సొంత దేశానికి వచ్చినట్లే’’అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తన తాజా పర్యటన భావ ప్రకటన స్వేచ్ఛ, భిన్న గళాలకు రక్షణ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేందిగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేవారు. తస్లీమా ఆగస్టు ఒకటవ తేదీ కోల్‌కతాలో జరిగే ఒక కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రసిద్ధ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయలతో కలిసి పాల్గొననున్నారు. తస్లీమా నస్రీన్ జన్మతః బాంగ్లాదేశీ. అయితే 1994లో ఆమె రాసిన పుస్తకం ‘లజ్జ’పై కూడా పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి. బాబ్రీ మసీదు ధ్వంసం నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై దౌర్జన్యం జరగిందని తస్లీమా తన పుస్తకంలో రాసుకొచ్చారు. దీనికి ఆగ్రహించిన అక్కడి మతఛాందసవాదులు నిరసనలకు దిగడంతో 1997లో కోల్‌కతాకు వచ్చారు. పదేళ్లు ఇక్కడే గడిపిన తరువాత మరో వివాదం కారణంగా మళ్లీ బాంగ్లాదేశ్‌కు మకాం మార్చాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆమె కోల్‌కతా రావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో తస్లీమా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కోల్‌కతా కేవలం పదేళ్లు ఉన్న నగరం మాత్రమే కాదని, తనదన్న సొంత భావనను అందించినదని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లు దూరంగా ఉన్నా పశ్చిమ బెంగాల్‌తో తన అనుబంధం మాత్రం కొనసాగిందని చెప్పారు. ‘‘నా మనసులో బెంగాల్ ఎన్నడూ ముళ్లకంచెలతో కూడిన సరిహద్దులతో విడిపోలేదు. బెంగాల్ తూర్పు దిక్కున తలుపులు నాకు ఎప్పుడూ మూసే ఉంటాయి. అందుకే నాకు ఈ వైపు బెంగాల్ ఇల్లు అయిపోయింది’’అని వ్యాఖ్యానించారు. కోల్‌కతా తిరిగి వస్తూండటం తనకు దుఖంతో కూడిన ఆనందాన్ని ఇస్తోందని, పంతొమ్మిదేళ్లు నన్ను నా మిత్రులు, పాఠకులు, సొంతమనే భావనను దూరం చేశారని, ఈ కాలాన్ని ఎవరూ తిరిగి ఇవ్వలేరని భావోద్వేగంతో మాట్లాడారు. ‘‘అలాగని తాను ఏదో అతిథిలానో, అపరిచితురాలి మాదిరిగానో రావడం లేదు. బెంగాల్లో ఒక భాగమనే విశ్వాసంతోనే వస్తున్నా’’అన్నారు. ఆ మాటకొస్తే తాను కోల్‌కతా వదిలింది కూడా ఇష్టపూర్వకంగా కాదని, ఏదో ఒక రోజు ఇక్కడకు తిరిగి వస్తానన్న నమ్మకం తనకు ఉండిందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగానే కాకుండా.. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కోసం జరిగిన పోరాటానికి తన రాక ప్రతీక అని వ్యాఖ్యానించారు. ‘‘ఛాందసులు నొక్కేసేందుకు ప్రయత్నించిన గొంతుక తిరిగి వస్తోంది. స్టేజీపై నా ఉనికి ఫత్వాలు, బెదిరింపులు ఒక రచయితను కొంతకాలం ప్రవాసానికి పంపవచ్చునేమో కానీ ఆమె ఆలోచనలను తుడిచివేయలేరు అనేందుకు నిదర్శనంగా నిలుస్తుంది’’అని అన్నారు. అసౌకర్యంగా ఉన్న అభిప్రాయాలకూ రక్షణ కల్పించడమే భావ ప్రకటన స్వేచ్ఛకు కొలమానమని అన్నారు. ‘‘ఒక రచయిత స్వేచ్ఛ ప్రభుత్వ దయపై, లేదా ఒక పార్టీ సిద్ధాంతంపై లేదా మత సంస్థల అనుమతులపై ఆధారపడకూడదు. ప్రాథమిక హక్కులా ఉండాలి’’అన్నారు. భారతీయ పౌరురాలు కానప్పటికీ తనకు ఇక్కడ ఆశ్రయం దక్కడంపై కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీ రచయితలు స్వేచ్ఛగా మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం కల్పిస్తోందని, అదే సమయంలో బెదిరింపులు అందుకేనేందుకూ కారణమవుతుందోని చెప్పారు. యువత ప్రతి విషయాన్ని ప్రశ్నించాలని, మతం, సంప్రదాయం, అధికారం, రాజకీయాలు మాత్రమే కాకుండా... వారికిష్టమైన ఆలోచనలనూ ప్రశ్నించాలని, ఎవరి భావాలనో తమవిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని, వాటిని తమ నమ్మకాలుగా స్వీకరించవద్దు అని పిలుపునిచ్చారు. -
కోల్‌కతాకు వచ్చేస్తా... బెంగాల్ సీఎంకు తస్లిమా నస్రీన్ లేఖ
సాక్షి, కోల్‌కతా: ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ ముఖచిత్రం మారిన నేపథ్యంలో ఆమె తిరిగి కోల్కతారావాలని భావిస్తున్నారట. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం మారడంతో, దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రవాసంలో ఉంటున్నఆశలను మళ్లీ చిగురింపజేసినట్టు తెలిపారు. బంగ్లాదేశ్‌లో జన్మించి, ప్రవాసంలో ఉండి ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న,తస్లీమా తాజా పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ కోల్‌కతాకు తిరిగి రావచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.2007 నవంబర్‌లో తనను కోల్‌కతా నుండి బలవంతంగా వెళ్లగొట్టారనీ, ఇప్పుడు పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. గతంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం గానీ, ఆ తర్వాత వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ తనను నగరానికి తిరిగి వచ్చేందుకు అనుమతించలేదని విమర్శించారు. గతంలో తాను స్క్రిప్ట్ రాసిన ఒక మెగా సీరియల్‌ను కూడా తృణమూల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేయాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. దశాబ్దాలుగా కోల్‌కతాకు తిరిగి రావాలనే కోరిక కోరిగానే ఉండిపోయిందని వాపోయారు.కోల్‌కతాతో ఉన్న అనుబంధంకల్చరల్ క్యాపిటల్ కోల్‌కతాలో ఉండే అవకాశం వస్తే ఖచ్చితంగా అక్కడే ఉంటాను. 1914 ఆగస్టు లో బంగ్లాదేశ్ నుండి బహిష్కరణకు గురైన తరువాత కోల్‌కతా సొంత ఇల్లా అనిపించింది. యూరప్ వదిలేసి తాను ఇక్కడికి రావడానికి కారణం బెంగాలీ సంస్కృతే అన్నారు. భారతదేశ సాంస్కృతిక రాజధాని కోల్‌కతాలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు, అలాగే కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌కు హాజరుకావాలని ఉందన్నారు. ఇటీవల కేరళతో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపిన ఆమె, కోల్‌కతా సందర్శనకు అనుమతిస్తే ఎంతో కృతజ్ఞతురాలినై ఉంటానని తస్లీమా చెప్పారు.ఇదీ చదవండి: ఇది కదా లక్ అంటే : పాత ప్యాంట్లో రూ. 57 కోట్ల జాక్పాట్కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారికి లేఖ రాయనున్న తస్లిమాపశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన సువేందు అధికారికి తాను కోల్‌కతా తిరిగి వచ్చేలా అనుమతించాలని కోరుతూ లేఖ రాయడానికి సిద్ధంగా ఉన్నట్లు తస్లిమా తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా తాను కోల్‌కతాలో నివసించాలనే కలలు కంటున్నానని, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తే అక్కడికే మారిపోతానని చెప్పారు. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ -
తీవ్రవాదుల గుప్పిట్లో యూనస్ ప్రభుత్వం
తిరువనంతపురం: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు, నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్‌పై ప్రవాస రచయిత్రి తస్లీమా నస్రిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం మత ఛాందసవాదులతో చేతులు కలిపిందని ఆరోపించారు. ఆ దేశంలో విభజన శక్తులకు అధికారాన్ని కట్టబెడుతోందని ఆమె మండిపడ్డారు. కేరళ శాసనసభ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పుస్తకోత్సవంలో ‘శాంతి కోసం పుస్తకం’అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నోబెల్.. శాంతికి కొలమానం కాదు ‘నోబెల్ శాంతి బహుమతి అనేది శాంతికి కొలమానం కాదు.. అధికారం మాత్రమే దాన్ని నిర్ణయిస్తుంది’.. అని తస్లీమా వ్యాఖ్యానించారు. గతంలో హెన్రీ కిసింజర్, ఆంగ్ సాన్ సూకీ వంటి వారు నోబెల్ పొందినా, వారి హయాంలోనూ మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. సూకీ మానవత్వం కంటే అధికారానికే ప్రాధాన్యమిచ్చి రోహింగ్యాల ఊచకోతను అడ్డుకోలేకపోయారని విమర్శించారు. బంగ్లా మైనారిటీల దుస్థితిపై ఆవేదన బంగ్లాదేశ్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, ముస్లిం మత ఛాందసవాదులు మైనారిటీలపై (ముఖ్యంగా హిందువులపై) దాడులు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులర్ విద్యాసంస్థలు, సైన్స్ అకాడమీలను నిర్మించాల్సింది పోయి, కేవలం ఓట్ల రాజకీయం కోసం గత ప్రభుత్వాలు మసీదులు, మదరసాలను భారీగా నిర్మించాయని విమర్శించారు. ఇవే జిహాదీలను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఆమె దుయ్యబట్టారు. రక్షణ లేని హిందూ మహిళలు బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలకు కనీస చట్టపరమైన రక్షణ లేదని, బహుభార్యాత్వం, విడాకులు, ఆస్తి హక్కుల విషయంలో వివక్ష కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. దీని కోసం ఉమ్మడి పౌర స్మృతి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌ను నిషేధించి, జమాత్–ఏ–ఇస్లామీ వంటి శక్తులు పుంజుకోవడం ఆందోళనకరమన్నారు. జమాత్ అధికారంలోకి వస్తే ‘షరియా చట్టం’అమలవుతుందని, అప్పుడు మహిళలు, మైనారిటీల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తస్లీమా హెచ్చరించారు. భారత లౌకికత్వం భేష్ భారతదేశంలో మైనారిటీల పరిస్థితి బంగ్లాదేశ్‌పై ప్రభావం చూపుతోందా?.. అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘భారత్‌కు దీంతో సంబంధం లేదు. 1947 నుండి బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారత్ ఇప్పటికీ లౌకిక దేశంగానే ఉంది, కానీ బంగ్లాదేశ్ 1980లలోనే ఇస్లాంను అధికారిక మతంగా మార్చుకుని లౌకికత్వాన్ని కోల్పోయింది’.. అని ఆమె స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో మతాతీత రాజకీయాలు మళ్లీ రావాలంటే.. రాబోయే ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, లౌకికవాద పారీ్టలే అధికారంలోకి రావాలని తస్లీమా నస్రిన్ ఆకాంక్షించారు. -
'లివ్-ఇన్ రిలేషన్, పెళ్లి కాదు.. మగాళ్ల మనస్తత్వంలోనే అసలు సమస్య..'
శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఆమెను 35 ముక్కలు చేసిన అత్యంత క్రూరమైన ఈ అనాగరిక చర్య సర్వత్రా చర్చనీయాంశమైంది. లివ్-ఇన్ రిలేషన్ల కారణంగానే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ గురువారం అన్నారు. చదువుకున్న అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, లివ్ ఇన్ రిలేషన్ల జోలికి వెళ్లకుండా నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలకు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నజ్రీన్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో ఈ విషయంపై స్పందిస్తూ ఓ సందేశం రాసుకొచ్చారు. 'లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేస్తే.. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి.. లివ్ ఇన్ రిలేషన్ల వల్లే నేరాలు జరుగుతున్నాయని మీరు చెబుతున్నారు. కానీ పెళ్లైన పురుషులు తమ భార్యలను చంపినప్పుడు.. పెళ్లిళ్ల వల్లే నేరాలు జరుగుతున్నాయి, అందుకే పెళ్లి చేసుకోవద్దు.. లివ్ ఇన్ రిలేషన్లే ఎంచుకోండి అని ఎందుకు చెప్పడం లేదు. పెళ్లిళ్లు, లివ్ ఇన్ రిలేషన్లు కాదు.. అసలు సమస్య మగాళ్ల మనస్తత్వంలోనే ఉంది.' అని నజ్రీన్ రాసుకొచ్చారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. When a man kills his girlfriend in a live-in relationship,u ask girls to get married coz live-in encourages crimes. But when men kill their wives,u don't ask girls to go for live-in relationships coz marriage encourages crimes!! Not marriage or live-in,problem is men's mentality. — taslima nasreen (@taslimanasreen) November 17, 2022 మరోవైపు కౌషల్ కిశోర్ వ్యాఖ్యలపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కౌషల్ కిశోర్‌ను పదవి నుంచి తప్పించాలని కోరారు. ఇలాంటి హేయమైన నేరాళ్లో మహిళలనే నిందించడం క్రూరం, నిర్దాక్షిణ్యంగా అభివర్ణించారు. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా -
'బీఫ్ తిన్నారని చంపడం క్రూరమైన నేరం'
తిరువనంతపురం: బీఫ్ తిన్నారని చంపడం అసహనం కాదని, అత్యంత క్రూరమైన నేరమని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలతో భారత్‌లో అసహనం పెరిగిపోయిందని భావించరాదన్నారు. కొందరు ఎక్కడున్నా అసహనం సృష్టిస్తారు.. చట్టం పక్కాగా అమలైతే ఆ పదానికి చోటు ఉండదని చెప్పారు. అసహనంపై పెద్దెత్తున లౌకికవాదులు నిరసన వ్యక్తం చేయడం మంచి పరిణామమేనని తస్లీమా పేర్కొన్నారు. తాను భారత్ పౌరసత్వం కోరుకుంటే మోదీ ప్రభుత్వం తటస్థంగా, లౌకికవాదంతో పనిచేస్తుందని చెబుతానని ఆమె వివరించింది. -
'దీదీ.. చిదంబరాన్ని చూసి నేర్చుకో'
ఢిల్లీ: సల్మాన్ రష్దీ పుస్తకాన్ని నిషేధించడం తప్పేనంటూ చిదంబరం ప్రకటించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రిన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చురకలంటించారు. చిదంబరాన్ని చూసైనా నేర్చుకోవాలని దీదీకి హితవు పలికారు. తస్లిమా రచించిన ఓ టీవీ సీరియల్ తమ మనోభావాలకు విరుద్ధంగా ఉందంటూ ముస్లిం సంస్థలు అభ్యంతరం తెలపడంతో ఆ సీరియల్ ప్రసారంపై మమత ప్రభుత్వం నిషేధం విధించింది. చిదంబరాన్ని చూసైనా సీరియల్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని తస్లిమా కోరారు. తస్లిమా రచించిన 'ద్విఖండితో' పుస్తకాన్ని బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం నిషేధించింది. చిదంబరం మాదిరిగా బుద్ధదేవ్ భట్టాచార్య కూడా తన తప్పును ఎప్పుడు అంగీకరిస్తారని ఆమె ప్రశ్నించారు. -
రచయితలపై తస్లీమా ఫైర్
దేశంలో అసహనం పెరిగిపోతున్నదని నిరసన వ్యక్తం చేస్తూ సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చేసిన రచయితల సంఖ్య 30కి చేరింది. ఒకవైపు రచయితలు వరుసపెట్టి తమ పురస్కారాలను వాపస్ ఇస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం వారి నిరసన కల్పితమైనదని కొట్టిపారేసింది. ఈ వివాదంపై తాజాగా భారత్‌లో ప్రవాసముంటున్న బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా స్పందించారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారతీయ రచయితలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆమె విమర్శించారు. తనపై దాడి జరిగినప్పుడు వారు ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. అవార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా అన్యాయాలపై నిరసన తెలియజేయడం తప్పేమీ కాదన్నారు. ఇది కల్పిత నిరసన అని ప్రభుత్వం చేస్తున్న వాదనతో తాను ఏకీభవించడం లేదని, రచయితలు రాజకీయంగా, సామాజికంగా స్పృహ కలిగిన వ్యక్తులని పేర్కొన్నారు. 'నా పుస్తకం పశ్చిమ బెంగాల్లో నిషేధించినప్పుడు, నాపై భారత్‌లో ఐదు ఫత్వాలు జారీచేసినప్పుడు, బెంగాల్ నుంచి నన్ను వెళ్లగొట్టినప్పుడు, ఢిల్లీలో నెలపాటు నన్ను గృహనిర్బంధంలో ఉంచినప్పుడు చాలామంది రచయితలు మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ జీవించడానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. ఈ విషయంలో రచయితలు మౌనంగా ఉండటమే కాకుండా.. సునీల్ గంగూలీ, శంఖా ఘోష్ వంటి రచయితలు నా పుస్తకాన్ని నిషేధించాలని అప్పటి సీఎం బుద్ధదేవ్ భట్టచార్యకు కోరారు కూడా' అని తస్లీమా పేర్కొన్నారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారత రచయితలవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించారు. ఇక్కడ లౌకికవాదమూ సమస్యే! భారత్‌లో లౌకికవాదం అనుసరించే విధానంలోనూ సమస్య ఉందని, చాలామంది లౌకికవాదులు ముస్లింలకు అనుకూలంగా, హిందూ వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారని తస్లీమా పేర్కొన్నారు. వారు హిందూ ఛాందసవాదుల చర్యలను నిరసిస్తారు.. అదేసమయంలో ముస్లిం ఛాందసవాదుల దారుణమైన చర్యలను సమర్థిస్తారని తెలిపారు. -
ఇస్లాంను ఎప్పడూ విమర్శించలేదు: తస్లీమా
న్యూఢిల్లీ: 'లజ్జ' పుస్తకంలో ఇస్లాంపై తాను ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని వివాదస్పద రచయిత తస్లీమా నస్రీన్ అన్నారు. గతంలో లజ్జ పుస్తకం వివాదస్పదమైన మారిన నేపథ్యంలో తస్లీమాపై ఫత్వా విధించిన సంగతి తెలిసిందే. తాను లజ్లలో ఇస్లాంను విమర్శించలేదని, దాంతో బంగ్లాదేశ్ లో ముస్లిం సాంప్రదాయవాదులు ఫత్వా జారీ చేశారని తస్లీం అన్నారు. ఇస్లాంను విమర్శించారనే అంశంలో వాస్తవం లేదన్నారు. ఓ నిరసనకు లజ్జ ప్రతిరూపం. హింసపై తాను నిరసన వ్యక్తం చేశా. ప్రాంతం పేరుతో హత్యలు చేయడం దారుణం అని తస్లీన్ అన్నారు. తాజాగా లజ్జను ఇంగీష్ లోకి అనువదించి..20వ ఎడిషన్ గా ప్రచురిస్తున్నారు. -
తస్లీమా నస్రీన్‌పై మరో వివాదం
కోల్‌కతా: బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై మరో వివాదం తలెత్తింది. కొత్తగా ప్రారంభమైన బెంగాలీ చానల్ ‘ఆకాశ్ ఆఠ్’ గురువారం నుంచి ప్రసారం చేయదలచిన ‘దుస్సహబాస్’ (కడగండ్ల బతుకు) సీరియల్ తమ మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందంటూ ముస్లిం ఛాందసవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సీరియల్ ప్రసారం నిరవధికంగా వాయిదా పడింది. సీరియల్లోని కథకు మతంతో ఎలాంటి సంబంధం లేదని రచయిత్రి తస్లీమా, సీరియల్‌ను ప్రసారం చేసే టీవీ చానల్ యాజమాన్యం స్పష్టం చేసినా ముస్లిం ఛాందసవాదులు తమ పట్టు వీడలేదు. అయితే ఛాందసవాదులు సీరియల్ చూడకుండానే అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తస్లీమా తప్పుబట్టారు.


