తస్లీమా నస్రీన్‌పై మరో వివాదం | Another controversy on Taslima Nasrin | Sakshi
Sakshi News home page

తస్లీమా నస్రీన్‌పై మరో వివాదం

Dec 20 2013 1:58 AM | Updated on Sep 2 2017 1:46 AM

Taslima Nasrin

Taslima Nasrin

బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై మరో వివాదం తలెత్తింది.

కోల్‌కతా: బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై మరో వివాదం తలెత్తింది. కొత్తగా ప్రారంభమైన బెంగాలీ చానల్ ‘ఆకాశ్ ఆఠ్’ గురువారం నుంచి ప్రసారం చేయదలచిన ‘దుస్సహబాస్’ (కడగండ్ల బతుకు) సీరియల్ తమ మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందంటూ ముస్లిం ఛాందసవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సీరియల్ ప్రసారం నిరవధికంగా వాయిదా పడింది. సీరియల్‌లోని కథకు మతంతో ఎలాంటి సంబంధం లేదని రచయిత్రి తస్లీమా, సీరియల్‌ను ప్రసారం చేసే టీవీ చానల్ యాజమాన్యం స్పష్టం చేసినా ముస్లిం ఛాందసవాదులు తమ పట్టు వీడలేదు. అయితే ఛాందసవాదులు సీరియల్ చూడకుండానే అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తస్లీమా తప్పుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement