'దీదీ.. చిదంబరాన్ని చూసి నేర్చుకో' | Learn from Chidambaram, lift ban on my serial: Taslima to Mamata | Sakshi
Sakshi News home page

'దీదీ.. చిదంబరాన్ని చూసి నేర్చుకో'

Nov 29 2015 8:42 PM | Updated on Sep 3 2017 1:13 PM

'దీదీ.. చిదంబరాన్ని చూసి నేర్చుకో'

'దీదీ.. చిదంబరాన్ని చూసి నేర్చుకో'

సల్మాన్ రష్దీ పుస్తకాన్ని నిషేధించడం తప్పేనంటూ చిదంబరం ప్రకటించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రిన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చురకలంటించారు.

ఢిల్లీ:  సల్మాన్ రష్దీ పుస్తకాన్ని నిషేధించడం తప్పేనంటూ చిదంబరం ప్రకటించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రిన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చురకలంటించారు. చిదంబరాన్ని చూసైనా నేర్చుకోవాలని దీదీకి హితవు పలికారు.

తస్లిమా రచించిన ఓ టీవీ సీరియల్‌ తమ మనోభావాలకు విరుద్ధంగా ఉందంటూ ముస్లిం సంస్థలు అభ్యంతరం తెలపడంతో ఆ సీరియల్‌ ప్రసారంపై మమత ప్రభుత్వం నిషేధం విధించింది. చిదంబరాన్ని చూసైనా సీరియల్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని తస్లిమా కోరారు. తస్లిమా రచించిన 'ద్విఖండితో' పుస్తకాన్ని బుద్ధదేవ్ భట్టాచార్య  ప్రభుత్వం నిషేధించింది. చిదంబరం మాదిరిగా బుద్ధదేవ్ భట్టాచార్య కూడా తన తప్పును ఎప్పుడు అంగీకరిస్తారని ఆమె ప్రశ్నించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement