మహిళ జలసమాధి ఘటనలో మరో విషాదం | Day After Tourist tragedy Elephant That Trampled On Her Dies In Karnataka | Sakshi
Sakshi News home page

మహిళ జలసమాధి ఘటనలో మరో విషాదం

May 20 2026 4:42 PM | Updated on May 20 2026 5:05 PM

Day After Tourist tragedy Elephant That Trampled On Her Dies In Karnataka

యశవంతపుర: కర్ణాటకలో కొడగు జిల్లాలోని దుబారె ఏనుగుల సంరక్షణాకేంద్రంలో సోమవారం వృద్ధ ఏనుగును మరో ఏనుగు కావేరి నదీతీరంలో తోసేయడం, దాని కింద నలిగిపోయి తమిళనాడు పర్యాటకురాలు మృతిచెందిన ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. కిందపడిన ఏనుగు మార్తాండ తీవ్రమైన గాయాలతో మంగళవారం తెల్లవారుజామున చనిపోయింది. 

కంచన్‌ అనే ఏనుగు దాడి చేయడంతో మార్తాండ కడుపులోకి దంతాలు దిగబడిపోయాయి. చెవుల వెనుక, కాళ్ల మీద సైతం తీవ్రమైన గాయాలయ్యాయి. వెనువెంటనే సమీప ఏనుగుల సాయంతో మార్తాడను బుదర నుంచి పైకి లేపిదీశారు. తర్వాత పశువైద్యులు చికిత్స మొదలెట్టినా ఫలితంలేకుండా పోయిందని అటవీశాఖ పశు వైద్యాధికారి డాక్టర్‌ ముజీబ్‌ బృందం మంగళవారం ప్రకటించింది. సౌమ్య స్వభావిగా పేరుగాంచిన మార్తాండ మైసూరు దసరా జ్ఞాపకాలను గుర్తుచేసుకుని అటవీ సిబ్బంది, మావటీలు, జంతు ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. 

ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ

53 ఏళ్ల మార్తాండ బరువు 4,500 కేజీలు. మూడేళ్ల క్రితం హసన్‌ జిల్లాలోని ఆలూర్‌లో దీనిని అధికారులు బంధించి సంరక్షణాకేంద్రానికి తీసుకొచ్చి దీని ఆలనాపాలన చూస్తున్నారు. దీనిపై దాడిచేసిన 26 ఏళ్ల కంజన్‌ గజరాజును 2014లో అదేజిల్లాలోని ఏసలూర్‌లో బంధించి ఇక్కడికి పట్టుకొచ్చారు. మార్తాండపై దాడిచేసిన చంపడంతో ఇకపై దానిని మైసూర్‌ దసరా ఉత్సవాలకు పంపబోమని అధికారులు స్పష్టంచేశారు.    

ఇదీ చదవండి: సరస్వతీ మాత విగ్రహం కోహినూర్‌ కన్నా ముఖ్యం

Advertisement
 
Advertisement
Advertisement