గ్రేట్ డైరెక్టర్ ఓటీటీ ఎంట్రీ.. ఏటీఎం దొంగతనం స్టోరీతో | Rajkumar Hirani OTT Debut Series Latest Update | Sakshi
Sakshi News home page

Rajkumar Hirani OTT: స్టార్ డైరెక్టర్ కొడుకు.. ఓటీటీ సిరీస్‌తో అరంగేట్రం

May 20 2026 3:37 PM | Updated on May 20 2026 3:39 PM

Rajkumar Hirani OTT Debut Series Latest Update

హిందీ సినిమాలు కూడా చూసే తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు, డంకీ తదితర మూవీస్ తీశారు. వీటిలో షారూక్‌తో 'డంకీ' తప్పితే మిగిలినవన్నీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయ్యాయి. ఈయన నుంచి కొత్త మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్లకు చిన్నపాటి షాకిచ్చారు. ఓ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

(ఇదీ చదవండి: కళ్లు లేని హీరోయిన్.. కాళ్లు లేని హీరో)

'ప్రీతమ్ అండ్ పెడ్రో' పేరుతో తీస్తున్న ఈ సిరీస్.. ఓ ఏటీఎం దొంగతనం చుట్టూ జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. దీనికి రాజ్ కుమార్ హిరానీ.. షో రన్నర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవినాశ్ అరుణ్ దర్శకుడు. ఈ సిరీస్‌తోనే తన కొడుకు వీర్ హిరానీని నటుడిగానూ పరిచయం చేస్తున్నారు. ఇందులో అర్షద్ వార్సీ, విక్రాంత్ మస్సే లాంటి స్టార్స్ ఇతర కీలక పాత్రలు చేశారు. జూలై 3 నుంచి హాట్‌స్టార్‌లో సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement