పడిలేచిన స్టాక్‌ మార్కెట్లు.. | Stock Market Close May 20 Nifty Sensex ended higher | Sakshi
Sakshi News home page

పడిలేచిన స్టాక్‌ మార్కెట్లు..

May 20 2026 3:44 PM | Updated on May 20 2026 3:58 PM

Stock Market Close May 20 Nifty Sensex ended higher

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్‌ మార్క్‌ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ట్రేడింగ్ చివరి గంటలో అన్ని ఇంట్రాడే నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వచ్చేశాయి.

నిఫ్టీ 50 ఇండెక్స్ 41 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 23,659 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 23,690.90 వద్ద గరిష్టం, 23,397.30 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది.

బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్ 117.54 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 75,318.39 వద్ద ట్రేడింగ్ సెషన్ ను  ముగించింది. ఈ ఇండెక్స్‌లో గరిష్టం 75,406.18 పాయింట్లు, కనిష్టం 74,529.41 వద్ద నమోదైంది.

హిందాల్కో ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో నిఫ్టీ 50లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.49 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.04 శాతం పెరిగాయి

రంగాల వారీగా, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్, నిఫ్టీ ఆటో మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ చాలా క్షీణించాయి.

Advertisement
 
Advertisement
Advertisement