ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్ | Ntr Dragon Movie Villains Names And Full Details | Sakshi
Sakshi News home page

Ntr Dragon Movie Villains: ఈ విలన్స్ అంతా ఎవరు? ఇంతకుముందు ఏ మూవీస్ చేశారు?

May 20 2026 5:51 PM | Updated on May 20 2026 6:00 PM

Ntr Dragon Movie Villains Names And Full Details

అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చేసింది. నాలుగున్నర నిమిషాల వీడియోతో అసలు సినిమా ఎలా ఉండబోతుందో చూపించేశారు. ‍'డ్రాగన్' ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఒపియమ్ అనే మొక్క, దీని ద్వారా వచ్చే హెరాయిన్.. దీని చుట్టూ ఉండే మాఫియా బ్యాక్‌డ్రాప్ ఇందులో చూపించబోతున్నారు. అయితే ఇందులో ఏకంగా ఎనిమిది విలన్స్ కనిపించడం అందరికీ షాకిచ్చింది. అసలు వీళ్లెవరు? ఏ ఇండస్ట్రీకి చెందినవాళ్లు? ఏయే సినిమాలు చేశారు? వాళ్ల వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఆ పేర్ల అర్థమిదే!)

మొదటగా ఎన్టీఆర్ విషయానికొస్తే.. పేరుకే హీరో అయినప్పటికీ విలనీ టచ్ ఉన్న లూగెర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన హంతకుల ముఠాకు నాయకుడిగా నటించాడు.

మొత్తం ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ బాస్ అయిన దాదా సర్కార్ పాత్రలో తెలుగు, తమిళ, హిందీలో గతంలో పలు సినిమాలు చేసిన అశుతోష్ రాణా నటించాడు. తెలుగులో ఈయన వెంకీ, బంగారం, బలుపు, తడాఖా, పటాస్ తదితర మూవీస్ చేశాడు. ముంబైకి చెందిన ఇతడు ఎక్కువగా హిందీ మూవీస్ చేశాడు.

ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో సెకండ్ ఇన్ కమాండ్ అయిన సుజోయ్ సర్కార్ పాత్రని అన్షుమాన్ పుష్కర్ అనే హిందీ నటుడు చేశాడు. ఇతడో సీరియల్ నటుడు. 2018 నుంచి హిందీ సీరియల్స్ చేస్తున్నాడు. 12th ఫెయిల్, మాలిక్ లాంటి మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు.

ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో వాజిర్ అయిన బాబీ సర్కార్ పాత్రలో సిద్ధాంత్ గుప్తా కనిపించబోతున్నాడు. ఇతడు కూడా హిందీలో సీరియల్స్, సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ పాత్ర కోసమే తొలుత మలయాళ హీరో టొవినో థామస్‌ని అడిగారని అంటున్నారు. బాబీ సర్కార్, లూగెర్.. అన్నదమ్ముల పాత్రలట.

ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో రావ్ అనే అకౌంటెంట్ పాత్రని తమిళ నటుడు గురు సోమసుందరం చేశాడు. ఇతడు గతంలో తెలుగులో చీకటిరాజ్యం, స్కార్క్ లైఫ్ చిత్రాల్లో నటించాడు. కానీ మలయాళ మూవీ 'మిన్నళ్ మురళి' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ద ట్రైనర్ పాత్రలో 'ధురంధర్'లో షిరానీ సాబ్‌గా నటించిన బిమల్ జీత్ ఒబెరాయ్ కనిపింతబోతున్నాడు. ఇతడికో పెద్ద సైన్యమే ఉండబోతుంది. ముంబైకి చెందిన ఇతడు గతంలో పీకే, టైగర్ 3 చిత్రాల్లోనూ కనిపించాడు గానీ 'ధురంధర్' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

రష్యన్ డిస్ట్రిబ్యూటర్ విక్టర్ మేన్స్‌కోవ్ పాత్రలో రష్యన్ నటుడు అలెగ్జాండర్ మిజేవ్, సోమాలియా నియంత జనరల్ దురాన్ పాత్రలో బ్రిటీష్ నటుడు బెన్డిక్ట్ పాల్ గారెట్, ఆఫ్రికా-యూరప్ డిస్ట్రిబ్యూటర్ బిలే క్సెర్సీ పాత్రలో దక్షిణాఫ్రికా నటుడు తుతేలో ప్రిన్స్ గ్రాట్‌బూమ్ కనిపించబోతున్నారు. ఇప్పటివరకు చెప్పినవన్నీ విలన్ పాత్రలే.

వీళ్లతో పాటు ఆఫ్గానిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్ జలీల్ రెహ్మాన్ పాత్రలో మలయాళ ప్రముఖ నటుడు బిజు మేనన్ కనిపించబోతున్నారు. ఈయన గతంలో తెలుగులో 'రణం', ఖతర్నాక్ మూవీస్‌లో నటించారు. ఓటీటీ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఈయన కాస్త సుపరిచితమే.

అలానే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్(ఇండియా) రఘువీర్ రాథోడ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించారు. గతంలో హిందీ చిత్రాల్లో హీరోగా చేశారు. రీసెంట్ టైంలో 'యానిమల్' మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బిజు మేనన్, అనిల్ కపూర్‌వి 'డ్రాగన్'లో పాజిటివ్ పాత్రలనిపిస్తోంది.

పైన చెప్పిన నటులతో పాటు ఈ మూవీలో తమిళ నటి ఖుష్బూ కూడా నటించింది. గ్లింప్స్‌లో విలన్స్ అందరి గురించి చెప్పే పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించింది గానీ ఆమె పాత్ర ఏంటనేది రివీల్ చేయలేదు. వీళ్లతో పాటు రాజీవ్ కనకాల, ప్రభాస్ శ్రీను, శత్రు తదితరులు ఇతర సహాయ పాత్రలు చేశారు.

ప్రస్తుతం రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ అందులో విలన్స్‌ని మాత్రమే చూపించారు. గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ, అందులో విలన్స్ ఎవరెవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు. మరి అందులో ఎంతమంది విలన్స్ ఉంటారో ఏంటో?

(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)

Advertisement
 
Advertisement
Advertisement