యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన తీర్మానం 50-47 ఓట్లతో నెగ్గింది. దీంతో ఇరాన్‌తో యుద్ధం విషయంలో కాంగ్రెస్ ట్రంప్‌పై పై చేయి సాధించింది. అయితే ఇది చట్టంగా మారడానికి ఇంకా అనేక దశలు దాటాల్సి ఉంది.ఇరాన్‌తో యుద్ధం ట్రంప్ పాలిట శాపంగా మారింది. ఈ తొందరపాటు నిర్ణయంతో ఇంటా, బయిటా ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్‌పై దాడితో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తి అనేక దేశాలు ట్రంప్‌ను విమర్శిస్తుండగా.. మరోవైపు స్వంత దేశంలోనూ యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టారు.ఇరాన్‌పై యుద్ధం ఆపే ప్రతిపాదనను వర్జీనియా డెమెక్రట్స్ సెనేటర్ టిమ్ కెయిన్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణానికి అనుకూలంగా 50 ఓట్లు రాగా వ్యతిరేకంగా 47 ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఓటింగ్‌లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు సైతం ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. మరో ముగ్గురు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికన్ కాంగ్రెస్‌లో నెగ్గింది.అయితే ఇది కేవలం ప్రారంభదశ మాత్రమే ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రావాలంటే సెనేట్‌లో ఓటింగ్ జరగాలి అనంతరం రిపబ్లికన్ల అధిక్యం ఉన్న ప్రతినిధుల సభలోనూ నెగ్గాలి అయినప్పటికీ అధ్యక్షుడు తన విచక్షణ అధికారాలను ఉపయోగించి వీటో చేసి దీనిని ఆపవచ్చు. ఒకవేళ వీటోని ఆపాలని అమెరికా కాంగ్రెస్ అనుకుంటే సెనెట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ 2/3 వంతు మెజార్టీతో నెగ్గాల్సి ఉంటుంది. అప్పుడు ఇరాన్‌పై యుద్ధాన్ని నియంత్రించేలా చట్టం చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంలా కనిపిస్తోంది.అమెరికా చట్టం ఏం చెబుతుంది.అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలను ప్రారంభించగలరు. ఆ తర్వాత, ఆయన యుద్ధాన్ని ముగించడమో, కాంగ్రెస్ అనుమతి కోరడమో, లేదా దళాల సురక్షిత ఉపసంహరణను నిర్ధారించడానికి అదనంగా 30 రోజులు అభ్యర్థించడమో చేయాలి. అయితే ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో ట్రంప్ ఈ చట్టం ఇరాన్ యుద్ధానికి వర్తించదని పేర్కొన్నారు. ఏదైమైనా ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికా కాంగ్రెస్‌లో నెగ్గడం ప్రతిపక్షాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి.
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి. హద్దు మీరితే అభిమానమే కాదు, అభిమాని కూడా అవమానాల పాలవుతాడు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి.జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం ఒక వారం మాత్రమే అయింది. అయితే, ఈ కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో నకిలీ రాజకీయ కథనాలు, అతిశయోక్తులు అభిమానుల నుంచి విస్తృతంగా వ్యాపించాయి. సోషల్ మీడియాలో విజయ్ టీవీకే ప్రభుత్వాన్ని చారిత్రక విప్లవం, అపూర్వమైన మార్పులు తీసుకొస్తున్న ఫ్యాక్టరీగా చూపించే ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటి? అనేక క్లెయిములు అతిశయోక్తి, తప్పుదారి పట్టించేవి లేదా పూర్తిగా తప్పుడు సమాచారమే. ఈ నేపథ్యంలో, నిజాలను.. వాస్తవాలను వేరు చేసి చేద్దాం..టీవీకే 108 సీట్లు గెలుచుకున్న తర్వాత సోషల్ మీడియా వైరల్ పోస్టులతో నిండిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చాలా ప్రచారాలు టీవీకే లేదా ప్రభుత్వం అధికారిక ఖాతాల నుంచి రావడం లేదు. ఇన్ఫ్లూయెన్సర్లు, అజ్ఞాత హ్యాండిల్స్, ఫ్యాన్ పేజీలు, యూట్యూబ్ చానళ్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా వీటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఒక ముఖ్యమైన క్లెయిమ్‌తో మొదలు పెడదాం. అప్పుడే సామాజిక విప్లవాన్ని సృష్టించారా? ఎన్నికల తర్వాత టీవీకే సామాజిక విప్లవం సృష్టించిందని, సాధారణ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దించిందని వైరల్ అయింది. కొందరు 5 మంది గెలిచారని, మరికొందరు 20 నుంచి 28 మంది వరకు బరిలో ఉన్నారని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం అధికారిక డేటా ప్రకారం, టీవీకే సాధారణ నియోజకవర్గంలో కేవలం ఒక్క షెడ్యూల్డ్ కుల అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించింది. అతను కూడా ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో సాధారణ సీటు నుంచి గెలిచిన ఏకైక షెడ్యూల్డ్ కులాల అభ్యర్థి కాంగ్రెస్‌కు చెందిన మధురై విశ్వనాథన్. తర్వాత వచ్చింది ఓ పిచ్చి ప్రచారం. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పేదరికం, కష్టాలు, టీ స్టాల్, ఆటో డ్రైవర్ బ్యాక్గ్రౌండ్లను చూపించి ప్రచారం చేశారు. విశ్వసనీయతను దెబ్బతీసేలా.. విజయ్ కూడా “పేదరికం, ఆకలి అంటే ఏమిటో నాకు తెలుసు” అని వ్యాఖ్యానించారు. నిజానికి ఓ రాజకీయ పార్టీకి ఇటువంటి ప్రచారం గౌరవనీయమే. కానీ ఎన్నికల అఫిడవిట్లు వేరే కథ చెబుతున్నాయి. అనేక మంది శాసనసభ్యులు కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ వాహనాలు, ప్రీమియం ఆస్తులను డిక్లేర్ చేశారు. పేద సామాన్య నాయకుడిగా బ్రాండింగ్ చేసుకుని, కోటీశ్వరులుగా అఫిడవిట్లు దాఖలు చేయడం విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.ఈ సంఖ్యలన్నీ కలిపితే 126.. టీవీకేకి 107 మందే ఇక్కడ టీవీకే అభ్యర్ధుల అర్హతల విషయంలో కూడా గందరగోళం నెలకొంది. కొందరు ఎమ్మెల్యేలు తమను ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా పరిచయం చేసుకున్నారు. కానీ వారి అఫిడవిట్లలో భిన్నమైన అర్హతలు ఉన్నాయి. ఇదే నేపధ్యంలో ఓ వైరల్ స్టాటిస్టిక్ హాస్యాస్పదంగా మారింది. టీవీకే 108 ఎమ్మెల్యేలలో ఆరుగురు PhDలు, 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అయిదుగురు IIT ఇంజనీర్లు, ఎనిమిది మంది డాక్టర్లు, 40 మంది లాయర్లు-ఇంజనీర్లు మొదలైన వివరాలు ఇచ్చి పోస్టు వైరల్ అయింది. కానీ ఈ సంఖ్యలన్నీ కలిపితే 126 వస్తుంది. వాస్తవానికి టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రా? ఇదంతా పక్కన పెడితే ఓ అతి పెద్ద నకిలీ కథనం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ‘విజయ్ యుగం’లోకి అడుగుపెట్టిందనేది. విజయ్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని వార్త సారాంశం. రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రిని విజయ్ ఇచ్చారని చెప్పడం పూర్తి అబద్ధం. ఉదాహరణకు జయలలిత, జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి మహిళా మంత్రులు కూడా ఉన్నారు. అలాగే, షెడ్యూల్డ్ కులాల మంత్రికి ముఖ్య పోర్ట్‌ఫోలియో ఇచ్చిన మొదటి సారి అనడం కూడా తప్పు. కక్కన్, పరితి, పొన్ముడి వంటి నాయకులు ఇంతకు ముందే ముఖ్య శాఖలు చూశారు.ఫిర్యాదుల పోర్టల్, సీఎం హెల్ప్‌లైన్, బస్సుల్లో పానిక్ బటన్లు, పాత సర్క్యులర్లను కూడా కొత్త సాధనాలుగా చూపిస్తున్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కూడా ‘విజయ్ యుగం’ విజయంగా ప్రచారం చేశారు. పదేళ్లుగా జరుగుతున్న కార్యక్రమాన్ని అభిమానులు విజయ్ కోసం చేయడం వింతగా అనిపిస్తుంది.నిజానికి తమిళనాడు ప్రజలు నిజమైన మార్పు కోసం ఓటు వేశారు. నిజమైన పాలనకు సమయం కావాలి. అతిశయోక్తి, నకిలీ ప్రచారాలు, AI చిత్రాలు దీర్ఘకాలంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. విజయ్ ప్రభుత్వం వైరల్ రీల్స్‌కు బదులు వాస్తవిక సాధనలు, పారదర్శకత , జవాబుదారీతనంపై దృష్టి పెట్టాలి. సమాచార శాఖ నకిలీ ప్రచారాలను త్వరగా సరిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి స్వయంగా ఈ అతిశయోక్తి సంస్కృతిని నిరుత్సాహపరచాలి. ప్రభుత్వాల పాలన గురించి వాట్సాప్ ఫార్వర్డుల ద్వారా కాకుండా, పనితీరు ద్వారా అంచనా వేస్తారు.
అభిషేక్ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ
కోల్‌కతా: అభిషేక్ బెనర్జీకి తనకు ఉమ్మడి ఆస్తులు కలిగి ఉన్నాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీఎంసీ ఎంపీ సాయాని ఘోష్ స్పష్టం చేశారు. ఈ రోజు (బుధవారం) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడిగా ఒక ఆస్తిని కలిగి ఉన్నామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. తన ఆస్తుల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్లో పూర్తిగా వెల్లడించానన్నారు. ఈ రకమైన "ఫేక్ న్యూస్" (అసత్య ప్రచారాలు) వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.ఆమె మాట్లాడుతూ " అభిషేక్ బెనర్జీ & సాయాని ఘోష్ కలిసి కోల్‌కతా 700030 లోని '19 D సెవెన్ ట్యాంక్స్ రోడ్' అనే ఆస్తిని ఉమ్మడిగా కలిగి ఉన్నారు దానికి ఎలాంటి మొబైల్ నంబర్ సంప్రదింపుల కోసం లేదని కొన్ని ఫార్వార్డ్ మెసేజ్‌లను ఇప్పుడే చూశాను. వారు ఎవరో నాకు తెలియదు. కానీ, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు స్వలాభం కోసం పనిచేయకుండా నిజాయితీగా ఉంటూ ఒక సాధారణ నేపథ్యం నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన ఎంపీ సాయాని ఘోష్ మాత్రం అది కాదు" అన్నారు. ప్రజలు నన్ను ఆశీర్వదించారు, అందుకు నేను కృతజ్ఞతురాలిని అని ఎక్స్‌లో పేర్కొన్నారు.తాను ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా తన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇది వరకే బహిరంగంగా అందుబాటులో ఉంచానని తెలిపారు. తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించబడ్డాయి. రికార్డులను తనిఖీ చేయండి. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి ఆరోపణలు మోపుతున్నవారు ఇకనైనా ఈ ప్రయత్నాలను ఆపాలన్నారు. తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో క్షమించేది లేదను ఈ అంశంలో తాను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానిని సాయాని ఘోష్ హెచ్చరించారు. వివాదం ఏంటికాగా ప్రస్తుతం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ఆస్తులను కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలిస్తోంది. అతని బంధువులు వారితో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన 17నుండి 21 ఆస్తులకు సంబంధించి ఆమోదించబడిన బిల్డింగ్ ప్లాన్లు, ఇతర పత్రాలను సమర్పించాలని ఇదివరకే KMC నోటీసులు జారీ చేసింది.నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా నిర్మాణాలు జరిగాయా అనేది పత్రాలను పరిశీలించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ సాయాని ఘోష్ వివరణ ఇచ్చింది.
మళ్లీ యుద్ధం: ఇప్పుడు ట్రంప్ ముందున్న 2 మార్గాలివే..
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఇది అమెరికా బలహీనతా? లేక దౌత్య చర్చల దిశగా అడుగా? ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? దాడులు చేస్తామని చెప్పిన ట్రంప్ మరోసారి యూ-టర్న్ ఎందుకు తీసుకున్నారు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కొన్ని గంటల్లోనే భిన్న సంకేతాలు వచ్చాయి. మొదట ఇరాన్‌పై దాడి చేస్తామని చెప్పారు. తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ విజ్ఞప్తి చేయడంతో జరగాల్సిన దాడిని వాయిదా వేశారు. దీనిపై పలువురు విశ్లేషకులు వివరించిన అంశాలను చూద్దాం.. ట్రంప్ ముందున్న మార్గాలు రెండు మాత్రమే. ఒకటి ఇరాన్‌కు రాయితీలు (ఆంక్షల ఎత్తివేత వంటి వెసులుబాట్లు) ఇవ్వడం. అంటే యుద్ధంలో ఓడిపోయామని చెప్పకనే చెప్పడం. గతంలో వియత్నాం, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో కూడా ఇటువంటిదే జరిగింది. కానీ, ఓటమిని అంగీకరించడం అమెరికాకు కష్టమే. మరో మార్గం మళ్లీ దాడులు మొదలుపెట్టడం. అమెరికాలోని నియోకాన్ (కఠిన విదేశాంగ విధానాన్ని సమర్థించే రాజకీయ వర్గం) వర్గాలు, ఇజ్రాయెల్ మరింత ఒత్తిడి పెడితే ఇరాన్ వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నాయి. కానీ అది అంత సులువు కాదు.ట్రంప్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇలాంటి మార్పులు పలుసార్లు చేశారు. ఫిబ్రవరి 28న 48 గంటల్లో ఇరాన్ ప్రజా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. తర్వాత గడువు పెంచారు. అనంతరం మళ్లీ పెంచారు. ఈ సారి మాత్రం పాకిస్థాన్ వల్ల కాదు.. యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా విజ్ఞప్తి కారణంగా ట్రంప్ నిర్ణయం వాయిదా పడింది.ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం పరిస్థితిని చూడాలి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం మొదలుపెట్టాయి. అప్పట్లో ట్రంప్ లక్ష్యాల్లో ఇరాన్ పాలనా మార్పు, క్షిపణి సామర్థ్యాల నిర్మూలన కూడా ఉన్నాయి. కానీ దాడుల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఏ లక్ష్యాన్నీ సాధించలేకపోయాయి.అంతేకాదు, ఇరాన్ హార్మూజ్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించింది. దీంతో ఇప్పటికే ఉన్న సమస్యలకు మరో పెద్ద సమస్య చేరింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్ ఒప్పందం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో నేరుగా చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడే అక్కడికి వెళ్లారు.మార్చి 6న ట్రంప్ “ఇరాన్ నుంచి షరతుల్లేని లొంగుబాటు తప్ప మరేదీ అంగీకరించను” అన్నారు. అదే ట్రంప్ తర్వాత ఉపాధ్యక్షుడిని ఇస్లామాబాద్ పంపించారు. ఎందుకంటే “ఉపాధ్యక్షుడితోనే మాట్లాడతాం” అని ఇరాన్ స్పష్టం చేసింది.కాల్పుల విరమణ ప్రకటనలో హార్మూజ్ ప్రాంతాన్ని తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ, ఆ ప్రాంతం ఇప్పటికీ మూసే ఉంది. అయినా కాల్పుల విరమణ కొనసాగుతోంది. కారణం ట్రంప్ మళ్లీ ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్లాలని అనుకోవడం లేదు. ఏప్రిల్ 8 నుంచి ట్రంప్ దౌత్య చర్చల ద్వారా ఒప్పందం సాధించాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ అమెరికా కోరుతున్న షరతులకు ఒప్పుకోవడం లేదు. దీంతో చర్చలు స్థంభించాయి.ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాలియుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కూడా ట్రంప్‌నకు ఉంటుంది. అయితే, యుద్ధం మొదలైనప్పుడు బ్యారెల్ చమురు ధర 75 నుంచి 77 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు 115 డాలర్ల వరకు చేరింది. భారత్‌లో ఇప్పటికే పెట్రోల్ ధరలు రెండుసార్లు పెరిగాయి. ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు అందరూ పొదుపు పాటించాలని చెబుతోంది. రూపాయి విలువ పడిపోతోంది. కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. కరెంట్ అకౌంట్ లోటు అంటే విదేశీ లావాదేవీల్లో దేశ ఖర్చులు ఆదాయాల కంటే ఎక్కువ కావడం.ఈ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యులు అని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ మళ్లీ యుద్ధం మొదలుపెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని చిక్కులు ట్రంప్‌ను చుట్టుముట్టాయి. అమెరికా 40 రోజుల దాడులతో ఫలితం సాధించలేకపోయింది. మళ్లీ దాడులు చేస్తే మరింత తీవ్రతరంగా వైమానిక దాడులు చేయాల్సి వస్తుంది.అలా జరిగితే ఇరాన్ కూడా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అమెరికా, గల్ఫ్ దేశాలు ఎదుర్కోగలవా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది.
జాన్వీ తుంటరి లుక్.. రితికా నాయక్ గ్లామర్
ఎయిర్టెల్ కొత్త 'ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్' 5జీ ప్లాన్లు
రోజుకు 18, ఏడాదికి 6 వేల రైళ్లు రద్దు
బంగ్లాదేశ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు!
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
ట్విషా శర్మ కేసులో బిగ్ ట్విస్ట్
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
ఈ సినిమాతో మా అబ్బాయి సిగ్గు పోతే చాలు: నిర్మాత
కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త బ్రాంచ్
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
జాన్వీ తుంటరి లుక్.. రితికా నాయక్ గ్లామర్
ఎయిర్టెల్ కొత్త 'ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్' 5జీ ప్లాన్లు
రోజుకు 18, ఏడాదికి 6 వేల రైళ్లు రద్దు
బంగ్లాదేశ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు!
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
ట్విషా శర్మ కేసులో బిగ్ ట్విస్ట్
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
ఈ సినిమాతో మా అబ్బాయి సిగ్గు పోతే చాలు: నిర్మాత
కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త బ్రాంచ్
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
ఫొటోలు
టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఆధ్యాత్మికతలో అంబానీలు.. బెంగళూరు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సెంటర్లో సందడి (ఫొటోలు)
మెలోనీతో కలిసి మోదీ పలు ప్రాంతాల సందర్శన (ఫోటోలు)
శ్రీవారి సేవలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ దంపతులు (ఫోటోలు)
వరుసగా శుభవార్తలు చెప్తున్న షణ్ముఖ్ జశ్వంత్ (ఫోటోలు)
ఆంధ్రప్రదేశ్ : మనసు దోచే సిద్ధలయ్య కోన ఎక్కడో తెలుసా ?
#HBDJrNTR : జూ.ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ HD స్టిల్స్
'రమణి కళ్యాణం' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా 'ఫస్ట్ టైమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'పెద్ది' కోసం జాన్వీ కపూర్ రెడీ అయిందిలా (ఫొటోలు)
సినిమా
గ్రేట్ డైరెక్టర్ ఓటీటీ ఎంట్రీ.. ఏటీఎం దొంగతనం స్టోరీతో
హిందీ సినిమాలు కూడా చూసే తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు, డంకీ తదితర మూవీస్ తీశారు. వీటిలో షారూక్‌తో 'డంకీ' తప్పితే మిగిలినవన్నీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయ్యాయి. ఈయన నుంచి కొత్త మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్లకు చిన్నపాటి షాకిచ్చారు. ఓ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: కళ్లు లేని హీరోయిన్.. కాళ్లు లేని హీరో)'ప్రీతమ్ అండ్ పెడ్రో' పేరుతో తీస్తున్న ఈ సిరీస్.. ఓ ఏటీఎం దొంగతనం చుట్టూ జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. దీనికి రాజ్ కుమార్ హిరానీ.. షో రన్నర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవినాశ్ అరుణ్ దర్శకుడు. ఈ సిరీస్‌తోనే తన కొడుకు వీర్ హిరానీని నటుడిగానూ పరిచయం చేస్తున్నారు. ఇందులో అర్షద్ వార్సీ, విక్రాంత్ మస్సే లాంటి స్టార్స్ ఇతర కీలక పాత్రలు చేశారు. జూలై 3 నుంచి హాట్‌స్టార్‌లో సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)
ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేర్ల అర్థమిదే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కొత్త అతిథులు వచ్చి చేరాయి. రెండు అందమైన రామచిలుకలు తారక్‌తో కలిసి ఆడుకుంటున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన బర్త్‌డే (మే 20) సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటికి అసాహి, యూహి అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు. ఇవి జపనీస్ పేర్లు. అసాహి అంటే సూర్యోదయం, యూహి అంటే సూర్యాస్తమయం అని అర్థం. జపాన్ దేశంపై తనకున్న ప్రేమతోనే పెంపుడు పక్షులకు జపనీస్ పేర్లు పెట్టినట్లు వెల్లడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.తారక్ కెరీర్ మొదలైందిలా..దివంగత నటుడు ఎన్టీరామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడిగా తొలిసారి తెరపై కనిపించాడు. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారాడు. స్టూడెంట్ నెం.1, ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, యమదొంగ, అదుర్స్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, ఆర్ఆర్ఆర్.. ఇలా అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. సినిమాచివరగా తెలుగులో దేవర: పార్ట్ 1తో హిట్ అందుకున్నాడు. హృతిక్ రోషన్ వార్ 2 మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది. అలాగే తారక్ చేతిలో దేవర 2 కూడా ఉంది.చదవండి: జైల్లోనే పెళ్లిరోజు.. దర్శన్ భార్య ఎమోషనల్ పోస్ట్
జైల్లోనే పెళ్లిరోజు.. ఎప్పటికీ నీ చేయి వదలను: దర్శన్ భార్య
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు కాస్త ఊరట కలిగింది. దర్శన్‌ను కలిసేందుకు భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీశ్‌కు జైలు, పోలీసు అధికారులు అనుమతిచ్చారు. కుటుంబంతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఇటీవలే దర్శన్ అధికారులను కోరాడు. 30 నిమిషాలుమామూలుగా ఖైదీలను కుటుంబసభ్యులు కలవాలంటే ఇనుప కడ్డీలు, అద్దం అడ్డుగా ఉంటాయి, అలాగే మాట్లాడుకోవాలి. కానీ, దర్శన్‌కు ముఖాముఖి సంభాషణకు వీలు కల్పించారు. ఈ క్రమంలో తమ పెళ్లిరోజు(మే 19)నాడు భర్తను కలిసింది విజయలక్ష్మి. దాదాపు 30 నిమిషాలపాటు అతడితో సంభాషించింది. అనంతరం సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.నీ చేయి వదలనుప్రతి తుఫానులో, ప్రతి నిశ్శబ్ధంలో నీ చేయి నేను విడవను. పరిస్థితులు మనల్ని విడదీయాలని చూసినా నా గుండెచప్పుడు మాత్రం ఎల్లప్పుడూ నిన్నే కోరుకుంటుంది. ఈ ప్రపంచమంతా నీకు ఎదురు తిరిగినా సరే నేను మాత్రం నీవైపే ఉంటాను. నీకోసమే నిలబడతాను అని రాసుకొచ్చింది. కాగా దర్శన్- విజయలక్ష్మి 2003 మే 19న పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు వినీశ్ సంతానం. పెళ్లయిన కొంతకాలానికి దర్శన్- విజయలక్ష్మిల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. జైలు జీవితంఅదే సమయంలో నటి పవిత్రగౌడతో ప్రేమలో పడ్డాడు దర్శన్. 2014 నుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఇంతలోనే వీరి జీవితాల్లో పెద్ద కుదుపు ఏర్పడింది. 2024లో అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్టయ్యాడు. ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడన్న కారణంతో అనుచరులతో కలిసి దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే దర్శన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. View this post on Instagram A post shared by Vijayalakshmi darshan (@viji.darshan) చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద ఫ్యాన్స్ కోలాహలం
జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?
తెలుగు హీరోల్లో జూ.ఎన్టీఆర్ కాస్త స్పెషల్. చిన్నప్పుడే నటుడు అయిపోయాడు. ఓ వయసొచ్చేసరికి సూపర్ హిట్స్ కొట్టి అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. మధ్యలో ఫ్లాప్స్ పడ్డాయి కానీ మళ్లీ పుంజుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇంతకీ తారక్ ఎంత ఆస్తి సంపాదించాడు? గ్యారేజీలో కార్ల కలెక్షన్స్ ఏంటి?జూ.ఎన్టీఆర్.. సినీ, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలోనే పుట్టాడు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చాడు. అలా ఇప్పటివరకు రూ.500-600 కోట్ల మేర ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ప్రొపర్టీస్ రూపంలోనే ఎక్కువగా ఉన్నట్టు టాక్. ప్రస్తుతం ఉంటున్న జూబ్లీహిల్స్‌లోని ఇంటి విలువ రూ.25 కోట్లు ఉంటుందని, అలానే హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో ఆరున్నర ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉందని తెలుస్తోంది.సినిమాలు చేసినప్పటికి కుటుంబానికి కూడా ఎన్టీఆర్ అదే స్థాయిలో సమయం కేటాయిస్తుంటాడు. ఇద్దరు కొడుకులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ.80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. వీటన్నింటితో పాటు కార్లు, వాచీలంటే కూడా తారక్‌కి పిచ్చి ఇష్టం.తారక్ దగ్గర ప్రస్తుతం అరడజనుకు పైగానే కార్లు ఉన్నాయి! వాటిలో అత్యంత ఖరీదైన పోర్స్ కేమన్ ఎస్ ఒకటి. దీని ఉత్పత్తిని సదరు కంపెనీ ఎప్పుడో ఆపేసింది. చాన్నాళ్ల క్రితమే ఎన్టీఆర్ దీన్ని కొనుగోలు చేశాడు. అప్పట్లో రూ.3 కోట్లు పెట్టి దీన్ని కొన్నాడు. అంటే ఇప్పటి రేటులో డబుల్ ధర ఉండొచ్చు. దీని తర్వాత చూసుకుంటే కొన్నేళ్ల క్రితం రూ.3.5 కోట్లు విలువైన లాంబోర్గిని ఉరుస్ క్యాప్సుల్ గ్రాఫైట్ కారు కొన్నాడు. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు.ఈ రెండింటితో పాటు రూ.4 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ మేబాచ్ ఎస్ క్లాస్, రూ.2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్, రూ.1.70 కోట్ల ఖరీదు చేసే బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఫ్యామిలీ అంతా కలిసి తిరిగేందుకు రూ.1.53 కోట్ల విలువైన టయోటా వెల్ ఫైర్ కారు.. ఎన్టీఆర్ గ్యారేజీలో ఉన్నాయి. వీటలో చాలా వాటికి 9999 లేదా 9 సంఖ్య కలిసొచ్చేలా నంబర్ ప్లేట్స్ ఉంటాయి. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ పాటించిన '9' సెంటిమెంట్‌నే తారక్ ఫాలో అవుతూ వస్తున్నాడు. కార్లే కాదు ఖరీదైన వాచీలు కూడా తారక్ దగ్గరున్నాయి. రూ.7.47 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే చేతి గడియారం, రూ.2.5 కోట్ల విలువైన నటిలస్ వాచీలు తారక్ సొంతం.తారక్ సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత చేసిన వాటిలో 'దేవర' హిట్ కాగా గతేడాది రిలీజైన 'వార్ 2' ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీని గ్లింప్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
క్రీడలు
లక్నో జట్టులోకి వైభవ్ సూర్యవంశీ!
రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వచ్చే ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్‌లో చేరనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్‌తో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా సుదీర్ఘంగా చర్చించిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఆ ఫొటోలను సంజీవ్ గోయెంకానే స్వయంగా తన ‘ఎక్స్’లో పంచుకోవడం విశేషం. మాటల సందర్భంలో లక్నో జట్టులో చేరాలంటూ వైభవ్‌కు సంజీవ్ గోయెంకా అడిగినట్లు తెలుస్తోంది. అయితే కళ్లు చెదిరే మొత్తాన్ని వైభవ్‌కు ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే.. ఇద్దరి మధ్య జరిగిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంజీవ్ గోయెంకా ఆశీర్వాదం తీసుకున్న వైభవ్, ఆ తర్వాత ఆయనతో చాలాసేపు ముచ్చటించాడు. లక్నో జట్టులోకి వస్తాడా? రాడా అన్నది పక్కనబెడితే, వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అయిన సంజీవ్ గోయెంకా అతడి టెక్నిక్, బ్యాటింగ్ రహస్యం గురించి చర్చించి ఉండొచ్చని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ సమయంలోనే లక్నో జట్టులో చేరాలంటూ వైభవ్‌కు ఆయన భారీ ఆఫర్ కూడా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారు. నిజానికి వైభవ్ సూర్యవంశీకి వచ్చే ఏడాది యాక్షన్ పూల్‌లో బరిలోకి దిగే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. వైభవ్ సూర్యవంశీని తక్కువ ధరకే సొంతం చేసుకున్న రాజస్తాన్ రాయల్స్ అతడిని విడుదల చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. అవసరమైతే ఎక్కువ అమౌంట్‌ను కోట్ చేసి వైభవ్‌ను తమ జట్టుతోనే అట్టిపెట్టుకునే అవకాశముంది. ఐపీఎల్ మెగావేలానికి మరో రెండేళ్లు ఉండడంతో అప్పటివరకు వైభవ్ సూర్యవంశీని తమతోనే ఉంచుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఒకవేళ వైభవ్ సూర్యవంశీ తనంతట తానుగా రాజస్తాన్ నుంచి బయటికి వచ్చి వేరే ఫ్రాంచైజీకి వెళ్లాలనుకుంటే మాత్రం అతన్ని దక్కించుకోవడానికి ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం లేకపోలేదు. పట్టుమని 16 ఏళ్లు కూడా లేని వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇవాళ ఐపీఎల్లో అన్ని ఫ్రాంచైజీలకు హాట్ కేక్‌లా మారిపోయాడు. అతడు వస్తానంటే ఎంత భారీ ధరకైనా కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. 13 మ్యాచ్‌లాడిన వైభవ్ 579 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 221 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లోనే 93) సునామీ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాన్ని బాటలు వేశాడు. ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ ఆ తర్వాత ఓటములతో ఢీలా పడింది. కానీ చివరి అంకంలో మళ్లీ ఫుంజుకున్న రాయల్స్ విజయాలు సాధించి 14 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. మే 24న ముంబై ఇండియన్స్‌తో జరగనున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ చేరుకోవాలని రాజస్తాన్ పట్టుదలతో ఉంది. ఇక టీమిండియా సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు వైభవ్‌కు ఇంకా సమయముందున్న బీసీసీఐ ఇండియా-ఏ జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేసింది. మరి ఇండియా-ఏ తరఫున మ్యాచ్‌ల్లో వైభవ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.The world has seen your talent. The nation sees the future in you. That’s a lot of responsibility already on very young shoulders, very able ones at that. Preserve the innocence, keep honing your brilliance, and the world will be at your feet.Prayers, aashirwad, and love for… pic.twitter.com/LZS7pEe93s— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) May 20, 2026చదవండి: చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్
చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్!
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌పై విజయం సాధించడం ద్వారా రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఆదివారం (మే 24న) ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా 16 పాయింట్లతో రాజస్తాన్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. మ్యాచ్ విజయంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీదే కీలకపాత్ర. 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి రాజస్తాన్‌ను గెలుపు తీరాలకు దగ్గర చేశాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ మిగతాపనిని పూర్తి చేశాడు. అయితే తొలి 12 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన వైభవ్ సూర్యవంశీ ఆ తర్వాతి 26 బంతుల్లో 82 పరుగులు చేయడం విశేషం. అయితే 23 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన అనంతరం వైభవ్ సూర్యవంశీ తన చేతులతో విచిత్రమైన ఫోజు ఇచ్చాడు. దానికి అర్థం ఏంటా అని ఎంత జుట్టు పీక్కున్నప్పటికీ లాభం లేకపోయింది. అయితే తాను ఇచ్చిన ఫోజుపై వైభవ్ మ్యాచ్ ముగిసిన తర్వాత వెల్లడించాడు. ఆ ఫోజు వెనుక ఉన్న రహస్యాన్ని వైభవ్ పంచుకున్నాడు. మురళీ కార్తిక్‌తో వైభవ్ మాట్లాడుతూ..'ఆ ఫోజు ఎందుకు ఇచ్చానో నాకే తెలియదు. ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నా కానీ ఏం చేశానో అర్థం కాలేదు. లక్నోపై ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు వైభవ్ ప్రకటించాడు. తన తల్లి పేరు ‘A’ అక్షరంతో మొదలవు తుందని అందుకే వేళ్లతో ఆ సింబల్ చూపించాను’ అని స్పష్టం చేశాడు. దీంతో వైభవ్ తన అమ్మపై ఉన్న ప్రేమను ఇలా మైదానంలో చాటుకోవడంతో అభిమానులు ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.‘ఇక నేను న్యూస్ పేపర్లు పెద్దగా చదవను. దీనివల్ల నా గురించి పేపర్లలో ఏం రాస్తున్నారన్నది తెలియదు. అయితే నా కెరీర్‌కు ఇది ఆరంభం మాత్రమే. ఇంకా సుదీర్ఘమైన కెరీర్ మిగిలి ఉంది. నా దృష్టి కేవలం ఆటపైనే తప్ప ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోను.'అని చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ మొదట్లో స్లోగా ఆడడంపై కూడా వైభవ్ వివరణ ఇచ్చాడు.'మా జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో నేను డగౌట్లో కూర్చున్నా. ఆ సమయంలో వికెట్ బాగుందనిపిచ్చింది. అయితే ఆదిలోనే తొందరపడితే మొదటికే చేటు అని భావించి కాస్త స్లో ఆడాలని నిర్ణయించుకున్నా. కానీ మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ వేగంగా ఆడడంతో నేను సైలెంట్ అయిపోయాను. కానీ జైస్వాల్ ఔటయ్యేటప్పటికీ పిచ్‌పై పూర్తి అవగాహన వచ్చేసింది. అందుకే ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ ఆడాను. నేను ఎక్కువసేపు క్రీజులో ఉండడమే లక్ష్యంగా పెట్టుకొని బ్యాటింగ్ కొనసాగించాను. అయితే సెంచరీ మిస్ అవ్వడంపై కాస్త నిరాశకు లోనైనప్పటికీ జట్టును గెలిపించడం ఆ బాధను మరిచిపోయేలా చేసింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్‌కు మరింత చేరువయ్యాం. కానీ ఇప్పుడు మా దృష్టంతా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌పైనే ఉంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టడమే మా ఏకైక లక్ష్యం' అని చెప్పుకొచ్చాడు.An entertainer on the field and even off it 😄That's Vaibhav Sooryavanshi for you 😌Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/XO3ZKPPJWb— IndianPremierLeague (@IPL) May 19, 2026చదవండి: టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
పాక్‌కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. తొలిసారి ఈ జట్టు బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. సిల్హెట్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 78 పరుగుల తేడాతో ఓడటంతో 0-2తో క్లీన్ స్వీప్ అయ్యింది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆ జట్టు భారత్‌ను సైతం కిందకు (ఆరో స్థానానికి) నెట్టింది. ఆసీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక టాప్-4 జట్లుగా కొనసాగుతున్నాయి. ఈ ఓటమితో పాక్ మరింత పతనమై ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ గెలుపు బంగ్లాదేశ్‌కు పాక్‌పై వరుసగా నాలుగవది. అంతకుముందు రెండు టెస్ట్‌లకు బంగ్లాదేశ్ పాక్ గడ్డపైనే గెలిచింది. ఈ ఏడాది మార్చిలో బంగ్లా జట్టు పాక్‌ను వన్డే సిరీస్‌లోనూ ఓడించింది. రిజ్వాన్ పోరాటం వృధా437 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 316-7 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. కొద్దిసేపటిలోనే మిగిలిన 3 వికెట్లు కోల్పోయి 358 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ (94) పాక్‌ను గట్టెక్కించే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అతని పోరాటం వృధా అయ్యింది. తైజుల్ ఇస్లాం (34.2-4-120-6) అద్భుత ప్రదర్శనలతో పాక్ పతనాన్ని శాశించాడు.ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (126) సెంచరీతో కదంతొక్కాడు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ (17-1-81-4), మొహమ్మద్ అబ్బాస్ (16-3-45-3) రాణించారు. అనంతరం పాక్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. బాబర్ ఆజం (68) ఒక్కడే రాణించడంతో అతి కష్టంమీద 232 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తైజుల్, నహిద్ రాణా తలో 3, తస్కిన్, మెహిది హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లతో పాక్ ఆట కట్టించారు.కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఈ ఇన్నింగ్స్‌లోనూ తొలుత తడబడినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ముష్ఫిఫర్ రహీం (137) సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 390 పరుగుల భారీ స్కోర్ చేసి పాక్‌కు 437 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. ఛేదనలో రిజ్వాన్ సహా షాన్ మసూద్ (71), సల్మాన్ అఘా (71) అర్ద సెంచరీతో రాణించినా పాక్‌ను గట్టెక్కించలేకపోయారు.
చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. నిన్న (మే 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసిన అతడు.. ఈ సీజన్లో తన పరుగుల సంఖ్యను 579కి పెంచుకున్నాడు. తద్వారా ప్రపంచంలో ఏ టీ20 టోర్నీలోనైనా 500 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా (15 ఏళ్లు) చరిత్రలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. పంత్ 2018 ఎడిషన్‌లో 20 ఏళ్ల వయసులో (ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున) ఈ ఫీట్‌ను అందుకున్నాడు.ఈ మ్యాచ్‌లో వైభవ్ మరో రెండు భారీ రికార్డులు కూడా సాధించాడు. ఇందులో మొదటిది ఈ సీజన్లో ఇప్పటివరకు 236.33 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన అతడు.. ఓ సీజన్లో 500 ప్లస్ పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక స్ట్రయిక్‌రేట్ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ రసెల్ పేరిట ఉండేది. రసెల్ 2019లో 204.8 స్ట్రయిక్‌రేట్‌తో ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో (202) పరుగులు చేశాడు. సిక్సర్ల ఫిఫ్టిఈ మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదిన వైభవ్ ఈ సీజన్లో తన సిక్సర్ల సంఖ్యను 53కు పెంచుకున్నాడు. తద్వారా ఓ సింగిల్ సీజన్లో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఓ సింగిల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (59) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.ఈ మ్యాచ్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన వైభవ్.. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఈ సీజన్లో అతడి ‘స్లోయెస్ట్’ ఫిఫ్టీ కావడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. వైభవ్ విధ్వంసం ధాటికి లక్నో నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగు చేసుకుంది. ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు దక్కించుకున్న విషయం తెలిసిందే.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
బిజినెస్
270 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:59 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు తగ్గి 23,544 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 274 పాయింట్లు నష్టపోయి 74,919 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.36బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 110.78 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.66 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.67 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.84 శాతం నష్టపోయింది.Today Nifty position 20-05-2026(time: 09:59 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
మహారాష్ట్రకు చెందిన సహకార బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు చేపడుతోంది. మహారాష్ట్ర, ఫాల్టాన్కు చెందిన ‘యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం పని వేళలు ముగిసినప్పటి నుంచి ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు (డిపాజిట్లు స్వీకరించడం, రుణాల చెల్లింపులు వంటివి) నిర్వహించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.లైసెన్స్ రద్దుకు కారణాలుబ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని కీలక నిబంధనలను పాటించడంలో యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పూర్తిగా విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్ వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులు, సంపాదన సామర్థ్యం దాని ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయడానికి సరిపోవు. బ్యాంక్ భవిష్యత్తులో లాభాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాంకును ఇంకా కొనసాగనిస్తే అది సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆర్బీఐ చెప్పింది.తదుపరి చర్యలుబ్యాంకును శాశ్వతంగా మూసివేయడానికి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే బ్యాంకు ఆస్తుల అమ్మకం, బాధ్యతల నిర్వహణ కోసం ఒక సమర్థవంతమైన ‘లిక్విడేటర్’(ఒక సంస్థ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి మూతపడే స్థితికి చేరినప్పుడు దాని లిక్విడేషన్ ప్రక్రియను నిర్వహించడానికి ప్రభుత్వం లేదా కోర్టు నియమించే ఒక అధికారిక వ్యక్తి)ను నియమించాలని మహారాష్ట్ర సహకార కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను ఆర్బీఐ కోరింది.డిపాజిటర్లకు లభించే రక్షణ ఎంత?బ్యాంక్ లైసెన్స్ రద్దు అయినప్పటికీ డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టం ప్రకారం ప్రతి డిపాజిటర్‌కు రక్షణ లభిస్తుంది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్ మొత్తానికి గానూ గరిష్టంగా రూ.5,00,000 వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని పొందేందుకు చట్టబద్ధమైన అర్హత కలిగి ఉంటారు. డీఐసీజీసీ ఇప్పటికే సంబంధిత డిపాజిటర్లకు రూ.106.96 కోట్ల మొత్తాన్ని ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కింద చెల్లించడం గమనార్హం.ఇటీవలి కాలంలో ఆర్థిక మూలాలు బలహీనంగా ఉన్న, నిబంధనలు పాటించని అర్బన్, రూరల్ కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ కఠిన వైఖరి అవలంబిస్తోంది. యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కూడా ఇందులో భాగమే. అయితే, ఐదు లక్షల లోపు డిపాజిట్లు ఉన్న ఖాతాదారులకు పూర్తి డబ్బు వెనక్కి వస్తుండటం ఇక్కడ ఊరట కలిగించే అంశం.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!
డిజిటల్ భారత్‌లో మైక్రోసాఫ్ట్ మెగా ప్లాన్
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి భారీ ఊపునిచ్చేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రంగం సిద్ధం చేసింది. దేశంలోనే తన అత్యంత భారీ డేటా సెంటర్‌ను 2026లోనే అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. టెక్నాలజీ హబ్‌గా మారుతున్న హైదరాబాద్ నగరంలోనే ఈ సదుపాయం ఏర్పాటు కాబోతోందని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అధికారికంగా ధ్రువీకరించారు. ఇది భారతదేశంలో మైక్రోసాఫ్ట్ నిర్మించబోయే అత్యంత భారీ, వ్యూహాత్మక డేటా సెంటర్ కానుంది.క్లౌడ్, ఏఐ సేవలకు భారీ డిమాండ్భారత్లో మైక్రోసాఫ్ట్ సేవల విస్తరణపై పునీత్ చందోక్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో అజూర్ క్లౌడ్ సేవలకు విపరీతమైన ఆదరణ ఉంది. దీనితో పాటు నెలకు 30 డాలర్ల ధర కలిగిన కంపెనీ ప్రతిష్టాత్మక ‘కోపైలట్ 365 ఏఐ అసిస్టెంట్’ వినియోగం భారత్‌లో శరవేగంగా పుంజుకుంటోంది’ అని పేర్కొన్నారు.ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో భారత్ అగ్రగామిగా ఉంది. ఇక్కడి భారీ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య, నైపుణ్యం కలిగిన సాంకేతిక ప్రతిభను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ తన ఏఐ పురోగతిని మరింత బలోపేతం చేస్తోంది. కాగా, మైక్రోసాఫ్ట్ ప్రత్యర్థులైన ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్లు సైతం భారతీయ ఏఐ, క్లౌడ్ మార్కెట్లో దూకుడుగా విస్తరిస్తుండటం గమనార్హం.వేల కోట్ల పెట్టుబడిభారత మార్కెట్‌పై మైక్రోసాఫ్ట్ నమ్మకానికి ఇక్కడి పెట్టుబడులే నిదర్శనం. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిగా భావిస్తున్న 17.5 బిలియన్ డాలర్లను భారతదేశంలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ గత ఏడాది చివర్లో ప్రకటించింది. ఇది 2025లో ప్రకటించిన 3 బిలియన్ డాలర్ల వాగ్దానానికి అదనపు పెట్టుబడి కావడం విశేషం. ఈ భారీ నిధుల్లో సింహభాగం హైదరాబాద్ ఫెసిలిటీతో కూడిన డేటా సెంటర్ మౌలిక సదుపాయాల విస్తరణకే మళ్లించనున్నారు. డేటా సెంటర్ నిర్మాణ ప్రణాళికలను ప్రస్తావిస్తూ.. తమ ప్రాజెక్ట్ పనులు అత్యంత వేగంగా, అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నామని చందోక్ స్పష్టం చేశారు. అయితే, రాబోయే ఈ సదుపాయం కచ్చితమైన సామర్థ్యం ఎంత అనే వివరాలను ఆయన ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!
ఆరు నెలల గరిష్టానికి నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగం ఏప్రిల్‌లో స్వల్పంగా పెరిగింది. మార్చిలో ఉన్న 5.1 శాతం నుంచి 5.2 శాతానికి చేరింది. 2025 ఏప్రిల్‌లోనూ 5.1 శాతంగానే ఉండడం గమనార్హం. 15 ఏళ్ల వయసుకు మించి పనిచేసే జనాభాకు సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర ప్రణాళిక, కార్యక్రమాల అమలు శాఖ శుక్రవారం విడుదల చేసింది. చివరిగా 2025 అక్టోబర్‌లోనూ 5.2 శాతం స్థాయిలో నిరుద్యోగం నమోదైంది. ⇒ పట్టణాల్లో నిరుద్యోగం కాస్తంత దిగొచ్చింది. మార్చిలో ఉన్న 6.8 శాతం నుంచి ఏప్రిల్‌లో 6.6 శాతానికి తగ్గింది. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ⇒ 2025 ఏప్రిల్‌తో పోల్చితే మాత్రం గ్రామీణ, పట్టణ నిరుద్యోగంలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ⇒ పట్టణ పురుషుల్లో నిరుద్యోగం మార్చిలో 5 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లో 5.1 శాతానికి చేరింది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం 4.7 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గింది. ⇒ దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు 5.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. గ్రామీణ మహిళల్లో 4.4 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గగా.. పట్టణ మహిళల్లోనూ 9 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గుముఖం పట్టింది. ⇒ కార్మికుల భాగస్వామ్య రేటు ఏప్రిల్‌లో 55 శాతానికి పరిమితం అయింది. మార్చిలో ఇది 55.4 శాతంగా ఉంది.
ఫ్యామిలీ
ఆ మూవీ ప్రభావంతో ఉద్యోగానికి రిజైన్ చేసింది..! కట్‌చేస్తే..
సినిమాలోలా రియల్ లైఫ్ ఎప్పటికీ ఉండదు. మూడు గంటల సినిమా ఎంతో ప్రభావం చూపిస్తుంది. కానీ వాస్తవిక ప్రపంచంలో అందులోలా వర్కౌట్ అవడం అంత సులభం కాదు. అదే చాలామంది తెలుసుకోలేక..ఆ సినీ మాయలో పడి ఊహాలోకంలో తేలుతుంటారు. చివరికి హాయిగా ఉన్న లైఫ్‌ని రిస్క్‌లో పడేసుకుంటుంటారు. అలాంటి సంఘటనే ఈ మహిళ లైఫ్‌లో చోటుచేసుకుంది. హర్ష్ అనే యూజర్ సోష్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. తాను ఉద్యోగ ఇంటర్వ్యూలో ఓ మహిళను కలిసినట్లు చెబుతూ..ఆమె చేసిన పని గురించి వివరిస్తూ పోస్టు పెట్టడంతో ఒక్కసారిగా సినిమా ఎంత పనిచేసింది అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ మహిళ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం సంపాదించి స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగంతో బిందాస్‌గా లైఫ్ సాగిపోయిందామెకు. సుమారు ఆరేళ్లు ఆ లైఫ్‌ని ఎంజాయ్ చేసింది. సరిగ్గా 2015లో తమాషా మూవీ చూడటంతో ఒక్కసారిగా ఆమె లైఫ్ అనూహ్యమైన మలుపు తీసుకుంది. ఆ తమాషా మూవీని..ఆర్ట్‌కి ఉన్న పవర్, చిన్ననాటి అభిరుచులను ఎలా వదులుకుని కెరీర్‌పై ఫోకస్ పెడతాం వంటివి ఇతి వృత్తంగా తీసుకుని తీశారు. ఈ మహిళ ఆ మూవీని చూసి స్ఫూర్తి పొంది.. కార్పొరేట్ లైఫ్ అంటే టార్గెట్లు, పనిఒత్తిడి ఇదేనా జీవితం? అదే నచ్చిన అభిరుచిలో కొనసాగడంలో ఉన్న ఆనందమే వేరు అంటూ చేస్తున ఉద్యోగానికి రిజైన్ చేసింది. చక్కగా ఆర్ట్స్ డిప్లొమా కోర్సులో చేరి, ప్రదర్శనలు నిర్వహించడం, తన పేయింటింగ్స్ని అమ్మడం వంటి కెరీర్‌ని నిర్మించుకోవాలని కలలు కనింది. ఆ మహిళ తాను అనుకున్నట్లుగానే క్రియేటివిటీ రంగంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించినప్పటికీ.. ఆ క్రమంలో చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు సవాలుగా మారాయి. అప్పటిదాక పొదుపు చేసిన డబ్బు అయిపోవడంతో ఆ అభిరుచి నుంచి తప్పుకోక తప్పలేదు. చివరికి రెండేళ్ల కెరీర్ విరామం తర్వాత మళ్లీ అనూహ్యంగా కార్పొరేట్ స్థిరత్వమే బెటర్ అంటూ జాబ్ సర్చింగ్ మొదలు పెట్టారామె. అలా ఓ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చి.. తనతో ఆ మహిళ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్లు రాసుకొచ్చారు హర్ష్. అంతేగాదు హర్ష్ ఆమె నిర్ణయం వెనుకున్న భావోద్వేగ పరిస్థితిని ప్రస్తావిస్తూ అభిరుచి వెంట పరుగులు తీసి..కెరీర్‌ని రిస్క్‌లో పెట్టుకోకూడదని అన్నారు. మంచి విషయం ఏంటంటే తన కళా అభిరుచిని వదులుకున్నా అనే పశ్చాత్తాపం ఎప్పటికీ ఎదురవ్వద్దు కానీ ఇంకోరకంగా అది కాస్త చెడ్డ నిర్ణయం ఎలా అంటే..మళ్లీ 30 ఏళ్ల అనంతరం కార్పొరేట్ ఉద్యోగం సంపాదించటం ఈ రోజుల్లో అదెంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ పోస్ట్‌ని ముగించారు. నిజానికి ఈ కథలో నీతి అభిరుచి కోసం ఉద్యోగ జీవితాన్నే రిస్క్‌లో పెట్టడం కంటే..అందులో సాధకబాధలు బేరీజు వేసుకుంటూ..చేస్తున్న ఉద్యోగాన్ని సాగిస్తూనే ఆ కళాత్మక రంగంలో సాగాలి. మొదట పార్ట్‌టైంగా సాగించి..బాగుంది ధైర్యంగా పూర్తి స్థాయిలో దీనిలో దిగొచ్చు అన్న నమ్మకం వచ్చాక..దిగితే ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు. అన్నింట్లకంటే ఆర్థిక భద్రత ముఖ్యం అనేది గ్రహించాలి.(చదవండి: కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..)
కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కొంగొత్త ఆవిష్కరణలు, రోజుకో సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది యువత. అలాంటి ఈ కాలంలో వెట్టిచాకిరి వ్యవస్థ, బానిసలు అనేవి ఇంకా ఉన్నాయంటే నమ్ముతారా?. పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో చదివిన ఘటనలు ఇంకా కళ్లముందు కదలాడటమే కాదు, ఆ దురాగతలకే బలి అవుత్ను వాళ్లు ఇంకా మన మధ్యే ఉన్నారు. అలాంటి భావోద్వేగ ఘటనే పాకిస్తాన్లో చోటుచేసుకుంది. ఓ కుటుంబం అప్పులో ఊబిలో చిక్కుకుని, తరతరాలు వెచ్చిచాకిరిలో మగ్గిపోయింది. సింపుల్‌గా చెప్పాలంటే ఆధునిక బానిసలు. బాధలనే చీకట్లో మగ్గిపోతున్న వాళ్ల బతుకుల్లోకి ఓ విదేశీయుడి కారణంగా వెలుగు సంతరించుకుంది. అసలేం జరిగిందంటే..పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కసూర్ ప్రాంతంలో ఇటుక బట్టీలలో దాదాపు 130 ఏళ్లుగా వెట్టిచాకిరిలో చిక్కుకుంది ఓ కుటుంబం. ఆ ఫ్యామిలీని విడిపించేందుకు ఓ మానవతావాది ముందుకొచ్చారు. నివేదికల ప్రకారం..తరతరాల క్రితం వారి పూర్వీకులు తీసుకున్న 'పేష్కి' అనే అప్పు భారంతో పనిచేస్తూ ఉండేది. ఆ అప్పు ఎన్నడూ తీరకపోవడంతో తర్వాత తరాలు వేతనాలు లేకుండా పనిచేస్తూ జీవితాంత బానిసలుగా బతుకీడుస్తున్నారు. వాళ్లకు విముక్తి కలిగించే రక్షణ చర్యను ఆరోన్ హచింగ్స్ అనే విదేశీయుడు చేపట్టారు. 'జూబ్లీ క్యాంపెయిన్' అనే మానవహక్కుల సంస్థ సభ్యుడైన ఆరోన్ వారి జీవితాలకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఈ 'జూబ్లీ క్యాంపెయిన్' సంస్థ పలు దేశాలలో బానిసత్వం, మతపరమైన హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక మానవ హక్కుల సంఘం. హచింగ్స్ ఆ కుటుంబం బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుందని తెలుసుకుని ఎలా భావోద్వేగంగా స్పందించారో రికార్డు చేసి మరీ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు ఆ వీడియోకి ఐదో రోజు గుడ్‌న్యూస్ తెలుసుకున్న ఆ కుటుంబం..కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అనే క్యాప్షన్ జోడించి మరి పోస్టు చేశారు. కాగా, ఈ జూబ్లీ క్యాంపెయిన్ ప్రపంచవ్యాప్తంగా జాతి, మత మైనారిటీల కోసం మానవ హక్కులు, మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. ఈ క్యాంపెయిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, మయన్మార్, నైజీరియా, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్ వంటి దేశాలలో బలవంతపు చాకిరీ, వెట్టిచాకిరి,మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై పనిచేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఆ విదేశీయుడు హచింగ్స్ని ప్రశంసించగా, ఇంకా ఇలాంటివి కొనసాగుతున్నాయా అని విస్తుపోస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Aaron Hutchings (@aaronhutchings77) (చదవండి: ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!)
కేన్స్‌లో ప్రజక్తా మాలి ట్రెడిషనల్ లుక్! సగర్వంగా భారతీయత..
ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్! పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్... కానీ ప్రపంచమంతా సెలెబ్రిటీల దుస్తులు, రెడ్ కార్పెట్ మీద వారి లుక్స్ తదితరాలే హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. అందుకోసం తారలు, సెలబ్రిటీలు తల నుంచి పాదాల వరకు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చూపుతిప్పుకోని విధంగా రెడి అయ్యేందుకు కొన్ని నెలల ముందు నుంచే సన్నద్ధమవుతుంటారు. అయితే ఈ ప్రపంచ వేదిక కేన్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసే లాంగ్ గౌనులు, పాశ్చాత్య స్టైలిష్ వేర్లే సందడి చేస్తుంటాయి. అలాంటిది ఈసారి భారతీయ డిజైనర్లు మన భారతీయ సంప్రదాయ వారసత్వానికే పెద్దపీట వేశారు. ఒక్కో ప్రాంతంలో ఉన్న సంప్రదాయ చీరలు, ఆభరణాలతో తారలు, ప్రముఖులు సందడి చేయడం విశేషం. తాజాగా ఆ కోవలోకి మరాఠి నటి ప్రజక్తా మాలి కూడా చేరిపోయారు. ఆమె ఈ ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ రెడ్ కార్పెట్‌పై మహారాష్ట్ర సంస్కతిని సగర్వంగా చూపించారామె. తన మూలాలను చాటి చెప్పేలా సాంప్రదాయ నీలి రంగు నౌవారీ చీరలో మెరిశారామె. రిచ్ బ్లూ, పర్పుల్ రంగుల మేళవింపుతో ఉన్న మహారాష్ట్రలో చీరలో వయ్యారంగా నడుస్తూ..అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం మొత్తాన్ని తనవైపుకి తిప్పుకునేలా ప్రత్యేకంగా కనిపించింది. ఆమె రూపం సంప్రదాయ సాంస్కృతికి గర్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఆఖరికి తన ఆహార్యానికి తగ్గట్టుగా చక్కగా జుట్టు ముడివేసి, సాంప్రదాయ బిందీ, ప్రత్యేకమైన నాథ్, చోకర్, గాజులు, కమర్బంద్ వంటి యాక్సెసరీలు ధరించారామె. మరాఠి సంప్రదాయలో రాజసమైన లుక్‌లో ఆకర్షించారామె. అంతేగాదు ప్రజక్తా కెమెరాలకు చేతులు జోడించి అభివాదం చేస్తూ ఇచ్చిన ఫోజులు ఆత్మీయత, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పుతున్నట్లుగా ఉంది. ఇలా ప్రపంచ వేదికపై సగర్వంగా భారతీయతను చాటడం ముఖ్యంగా మరాఠీ ప్రేక్షకులను ఎంతోగానో అలరించడం కాదు, గర్వించే క్షణంగా మారింది. కాగా, ప్రజక్తా మాలి, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్‌కార్పెట్‌పై అరంగేట్రం చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..సాంప్రదాయ నౌవారీ చీర, మరాఠీ నాథ్‌తో కేన్స్‌లో నడవం ఎంతో గర్వంగా ఉందని పోస్ట్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Prajaktta Mali (@prajakta_official) (చదవండి: బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !)
సమతుల్య పోషణతోనే సేంద్రియ దిగుబడులు
సేంద్రియ కూరగాయల సాగులో ఒకటికి నాలుగు రకాల సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కలిపి వాడినప్పుడు మాత్రమే అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందుతాయని, తద్వారా అత్యుత్తమ దిగుబడులు సాధించగలమని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, పరివృద్ధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాలీహౌస్లో రెడ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలను ప్రయోగాత్మకంగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ 2025–26 శీతాకాల పంటలో ఉత్తమ ఫలితాలు సాధించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎ. రాజారెడ్డి పర్యవేక్షణలో హార్టికల్చర్ అసిస్టెంట్ ్రపొఫెసర్లు డా. సీహెచ్ షణ్ముఖి, డా. టి. శిరీష నిర్వహిస్తున్న ఈ మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ కిసాన్ సంఘ్‌కు చెందిన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.కాలీఫ్లవర్ ఎకరానికి 8 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై కాలీఫ్లవర్‌ను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 9 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడుతూ పాలీహౌస్లో కాలీఫ్లవర్ సాగు చేస్తే 5.8 టన్నుల దిగుబడి వచ్చింది. అయితే, కోళ్ల ఎరువుతో పాటు 3 రకాల జీవన ఎరువులు వాడితే అత్యధికంగా హెక్టారుకు 8 టన్నులకుపైగా సేంద్రియ కాలీఫ్లవర్ దిగుబడి వచ్చింది. హెక్టారుకు 7.5 టన్నుల కోళ్ల ఎరువుతో పాటు వామ్ 5 కిలోలు, అజోస్పిరిల్లం 2 కిలోలు, పీఎస్బీ 5 కిలోలు వాడినప్పుడు అత్యధికంగా ఒక్కో కాలీఫ్లవర్ బరువు 825 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 8టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. అయితే, జీవన ఎరువులతో పాటు వర్మీ కంపోస్టు లేదా జీవామృతం లేదా లిగ్నైట్ కలిపి వాడినప్పుడు.. కోళ్ల ఎరువుతో పాటు జీవన ఎరువులు వాడినప్పటికన్నా తక్కువ దిగుబడి రావటం విశేషం.రెడ్ క్యాబేజీ ఎకరానికి 9 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై రెడ్ క్యాబేజీ పంటను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 6 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. పాలీహౌస్లో హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడితే హెక్టారుకు 5 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడి వచ్చింది. అయితే, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువుతో పాటు మరో 4 రకాల సేంద్రియ ఎరువులు వాడితే హెక్టారుకు అత్యధికంగా 9 టన్నులకుపైగా సేంద్రియ రెడ్ క్యాబేజీల దిగుబడి వచ్చింది. హెక్టారుకు 5 టన్నుల పశువుల ఎరువు, వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడారు. ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 962 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 9 టన్నులకు పైగా దిగుబడి రావటం విశేషం. అయితే, పశువుల ఎరువు అసలు వాడకుండా.. హెక్టారుకు వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడినప్పుడు ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 935 గ్రాములకు మాత్రమే పెరిగింది.సమతుల్య పోషణే కీలకంసేంద్రియ సాగులో పంటలకు అవసరమైన అన్ని పోషకాలనూ సమతుల్యంగా తగు పాళ్లలో అందించగలిగినప్పుడే రసాయన సేద్యంతో సమానంగా దిగుబడులు సాధించటం సాధ్యమవుతుందని మల్లారెడ్డి యూనివర్సిటీలో తాజా పరిశోధనలు తేల్చాయి. పాలీహౌస్ ప్రయోగాత్మక సాగులో ఎకరానికి 8 టన్నుల కాలీఫ్లవర్, 9 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడులు మాకు సంతృప్తి కలిగించాయి. అన్ని యూనివర్సిటీలూ ఈ దిశగా పరిశోధనలు చేస్తే రైతులకు మంచి ఆదాయంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యదాయకమైన ఆహారం లభిస్తుంది. – ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులుసేంద్రియ పరిశోధనలు కొనసాగిస్తాంపూర్తిగా సేంద్రియ కూరగాయల సాగులో మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టు తొలి ఏడాది ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలు ఈ ప్రయోగాలు కొనసాగిస్తాం. సేంద్రియ ఎరువుల యాజమాన్యం, దిగుబడుల స్థిరీకరణ చేసి పూర్తి ఫలితాలు ఆ తర్వాత ప్రకటిస్తాం. – డాక్టర్ ఎ. రాజారెడ్డి, డీన్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మల్లారెడ్డి యూనివర్సిటీనిర్వహణ: పంతంగి రాంబాబు
అంతర్జాతీయం
షిడ్వార్ ద్వీపాన్ని చుట్టుముట్టిన చమురుతెట్టు
దుబాయ్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు మొదలెట్టాక హార్మూజ్ జలసంధి సమీపంలోని షిడావ్ర్ ద్వీపాన్ని చమురుతెట్టు చుట్టేసింది. ఇప్పుడు చమురుతెట్టు అక్కడి జీవావరణంపై గొడ్డలిపెట్టుగా తయారైంది. షిడ్వార్ ద్వీపంలోని సముద్రతీరాలను పెద్దమొత్తంలో ముడిచమురుతో జిగటగా తయారైన అలలు పోటెత్తుతున్నాయి. ద్వీపం తీరం మొత్తాన్నీ దాదాపు చమురుతెట్టు ఆక్రమించేసింది. ఈ జీవావరణ విధ్వంసం తాలూకు వివరాలు సంబంధిత ఉపగ్రహ చిత్రాలు, ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇరాన్‌లోని చమురుశుద్ధి కర్మాగారాలపై దాడుల తర్వాత పెద్దమొత్తంలో ముడిచమురు సముద్రజలాల్లోకి చేరింది. ఇది పల్చని పొరలా సముద్రఉపరితల జలాలపై పేరుకుని అలలరూపంలో సమీప ద్వీపాల తీరాలకు చేరుతోంది. వీటితోపాటు ఇరాన్‌కు చెందిన ఎహ్సాన్ జలాలీ అనే వ్యక్తితీసిన స్మార్ట్‌ఫోన్ వీడియో ఫుటేజీ సైతం షిడ్వార్ ద్వీపంలో జరిగిన జీవావరణ విధ్వంసాన్ని కళ్లకుకడుతోంది. తాబేళ్లు, పక్షులు, స్క్వాడ్చేపలు, డాలి్ఫన్లు ఇలా పలురకాల జీవులు చమురుతెట్టులో చిక్కుకుని చనిపోతున్నాయి. 30 సెంటీమీటర్ల రెజల్యూషన్‌తో ఫొటోలు తీసే ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్ ప్లీడస్ నియో ఆప్టికల్ శాటిలైట్ ద్వారా తీసిన ఫొటోలనూ తాజాగా విడుదలచేశారు. ఏప్రిల్ పదో తేదీన ఇరాన్‌లోని చమురుశుద్ధి కర్మాగారాలపై దాడి తర్వాత రెండ్రోజులైనా అక్కడి నుంచి మంటలు ఎగిసిపడుతున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టమైంది. షిడ్వార్ ఐలాండ్‌ను స్థానికంగా మరో ద్వీపం అని కూడా పిలుస్తారు. చిత్తడి నేలలకు ఈ ద్వీపం ప్రసిద్ధి. ఇరాన్లో కని్పంచే బుల్లి ‘టెర్న్’పక్షు లు, సముద్రపక్షులకు ఈ ద్వీపం ఆలవాలంగా ఉంది. చిత్తడినేలలను భూమి సహజ ఊ పిరితిత్తులుగా పేర్కొంటారు. మురుగునీరు విస్తరించకుండాచేసి, భూగర్భజలాలను శుద్ధిచేసే నేలలుగా చిత్తడినేలలుప్రసిద్ధిచెందాయి. ఇప్పుడివి నాశనమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు.
#Melodi: రోమ్‌లో మెలోడీ మూమెంట్
విదేశీ పర్యటనలో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ చేరుకున్నారు. రోమ్‌లో మోదీకి ఇటలీ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ ఘన స్వాగతం పలికారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని చివరగా ఇక్కడ పర్యటించబోతున్నారు. నా స్నేహితుడికి రోమ్ నగరం స్వాగతం పలుకుతోంది అంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. అంతకు ముందు.. ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. ఇటలీ చారిత్రక కోలోసియం సందర్శించారు. అక్కడ సెల్ఫీ కూడా దిగారు. వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రోమ్‌లో మెలోడీ#Melodi మూమెంట్స్ అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. మోదీ, మెలనీ పేర్లను కలిపి అలా సరదాగా పిలుస్తారన్నది చాలామందికే తెలిసే ఉంటుంది. వీళ్ల స్నేహంపై సోషల్ మీడియాలో తరచూ చర్చ నడుస్తుంటుంది కూడా. Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026మోదీ 2024లో జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లారు. అయితే అధికారిక ద్వైపాక్షిక పర్యటన మాత్రం ఇదే. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య మిత్రబంధాన్ని కాస్త వ్యూహాత్మక సంబంధంగా మార్చాలని మోదీ భావిస్తున్నారు. వాణిజ్యం, రక్షణ, సముద్ర భద్రత, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. తొలుత ఇటలీ అధ్యక్షుడు సెర్జియో మట్టారెల్లాతో మోదీ భేటీ అవుతారు. అటుపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఎఫ్ఏవో (Food and Agriculture Organisation) ప్రధాన కార్యాలయం సందర్శించి అక్కడ ఆహార భద్రత అంశంలో భారత్ వైఖరిని మోదీ చాటిచెప్పే అవకాశం ఉంది. అలాగే.. ఇండియా-మిడిల్ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ద్వారా వాణిజ్య, రవాణా, కనెక్టివిటీ విస్తరణ అంశాలను చర్చించనున్నారు. రక్షణ, సముద్ర భద్రత, సరఫరా గొలుసులు, టెక్నాలజీ, వాణిజ్యం రంగాల్లో సహకారం కోసం రూపొందించిన Joint Strategic Action Plan 2025–2029 పైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, మొబిలిటీ, డిఫెన్స్ తయారీలో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలపైనా చర్చిస్తారని సమాచారం. ప్రవాస భారతీయులతో.. రోమ్‌లోని హోటల్ వద్ద భారతీయ ప్రవాసులు మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. వారణాసి ఘాట్లను ప్రతిబింబించే చిత్రకళా బహుమతి అందించారు. సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ పర్యటన భారత్–ఇటలీ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశంగా భావిస్తున్నారు. రక్షణ, వాణిజ్యం, సముద్ర భద్రత, ఆహార భద్రత రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా యూరప్‌లో భారత్ వ్యూహాత్మక స్థానం మరింత బలపడనుంది. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, డిఫెన్స్ తయారీ రంగాల్లో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది.
సంబంధాలు ఉన్నతస్థాయికి
ఓస్లో: తమ సంబంధాలను ఇకపై గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని భారత్, నార్డిక్ దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని మోదీ మంగళవారం నార్వే రాజధాని ఓస్లోలో మూడో ఇండియా–నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. క్లీన్ ఎనర్జీ, సుస్థిరాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, నవీన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. మోదీతోపాటు ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రన్ ఫ్రొస్టాడాటిర్, ఫిన్లాండ్ ప్రధాని పెటెరీ ఓర్పో, డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్, నార్వే ప్రధాని జోనా గర్ స్టోర్, స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఈ సదస్సుకు హాజరయ్యారు.అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదంపై భారతదేశం, నార్డిక్ దేశాలు స్పష్టమైన, ఐక్య వైఖరిని కలిగి ఉన్నాయని మోదీ తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో రాజీపడి ప్రసక్తే లేదని, ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టంచేశారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు కొనసాగుతున్న తరుణంలో నియమాల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేయడానికి భారత్, నార్డిక్ దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని వెల్లడించారు.ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా వివాదాల ప్రారంభ పరిష్కారానికి, శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు మద్దతునిస్తూనే ఉంటామని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన పట్ల నిబద్ధత తమను సహజ భాగస్వాములను చేస్తోందన్నారు. గ్రీన్ టెక్నాలజీ భాగస్వామ్యంతో మొత్తం ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందిస్తామని మోదీ పేర్కొన్నారు. మూడు దేశాల ప్రధానులతో భేటీ ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలతో క్లీన్ ఎనర్జీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరాభివృద్ధి, డిజిటలీకరణ, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీ తదితర రంగాల్లో పరస్పర సంబంధాలను బలపేతం చేసుకోవడంపై మోదీ చర్చించారు. ఆయన మంగళవారం ఆయా దేశాల ప్రధానమంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్, మూడు నార్డిక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్‌లో పర్యటించాలని మూడుదేశాల ప్రధానులను మోదీ ఆహ్వానించారు. ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఇటలీకి పయనమైన మోదీ ప్రధాని మోదీ నార్వే పర్యటన పూర్తిచేసుకొని మంగళవారం ఇటలీకి పయనమయ్యారు. నార్వే పర్యటన ఫలవంతంగా ముగిసిందని ఆయన ‘ఎక్స్‘లో పోస్టుచేశారు. పలు సమావేశాల్లో పాల్గొన్నానని, కీలక రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.
పెంకులేకుండానే గుడ్లను పొదిగారు!
వాషింగ్టన్: అంతరించిపోయిన జీవులను డీఎన్ఏల సాయంతో మళ్లీ పునర్సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాలోని జీవసాంకేతికరంగ సంస్థ ‘కొలోసల్ బయోసైన్సెస్’తన ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. న్యూజిలాండ్‌లో చాలా శతాబ్దాల క్రితం అంతరించిపోయిన భారీ పక్షిజాతి ‘మోవా’ను పునర్సృష్టించే క్రతువులో మరో ముందడుగువేశామని కొలోసల్ బయోసైన్సెస్ తాజాగా ప్రకటించింది. మోవాకు జన్యువులపరంగా అత్యంత సారూప్యత ఉండే ఇతర జాతుల పక్షుల డీఎన్ఏతో సింథసిస్ చేసి తొలుత మోవా గుడ్డును తయారుచేయాలని సంకల్పించింది.అయితే ఆనాటి మోవాజాతి గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే ఏకంగా గరిష్టంగా 80 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇంతటి భారీ గుడ్డును పొదగాలంటే అంతపెద్దస్థాయిలో కృత్రిమ ఎగ్‌షెల్ అవసరం అవుతుంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కృత్రిమమేధతో త్రిమితీయ(3డీ) ముద్రిత చిన్నపాటి ఎగ్‌షెల్‌ను తయారుచేశామని కంపెనీ ప్రకటించింది. ఇందులో సాధారణ కోడి గుడ్లలోని పచ్చ, తెల్లసొనలను బయటకుతీసి ఈ 3డీ ముద్రిత ఎగ్షెల్లో పెట్టి విజయవంతంగా పొదిగామని కంపెనీ మంగళవారం వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా ఇలా ఇప్పటిదాకా 26 కోడిపిల్లలను సృష్టించారు. ఏఐ ఎగ్‌షెల్ ఎలా? పెంకును పగలగొట్టి పచ్చ, తెల్లసొనలను కప్పులాంటి ఇతర గోళాకార ఆకృతుల్లో పొదగడంపై గతంలోనూ చాలా మంది ప్రయోగాలు చేశారు. అయితే సహజసిద్ధ పెంకు నుంచి మాత్రమే సరిపడా ఆక్సిజన్ అందుతుంది. దాంతోనే లోపల గుడ్డు పొదుగుతుంది. ఇందుకోసం ఆక్సిజన్ సరైన మోతాదులో అందేలా లోపలివైపు జల్లెడ లాంటి దానిని కొలోసల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దానికి బయటివైపు పారదర్శకంగా ఉండేలా మరో కణత్వచాన్ని తయారుచేశారు. వీటి సాయంతో పచ్చ,తెల్లసొనలు ఏమాత్రం పాడవకుండా సహజసిద్ధ వాతావరణాన్ని వాటికి అందించామని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చ,తెల్లసొన కోడిపిల్లగా మారే క్రమంలో సాధారణ పెంకు నుంచి కాల్షియంను సంగ్రహించుకుంటుంది.ఇదే తరహాలో తాము కూడా ఈ ఏఐ ఎగ్‌షెల్ ద్వారా కాల్షియంను అందించామని పరిశోధకులు తెలిపారు. ఈ ఎగ్‌షెల్‌ను ఇంక్యుబేటర్‌లో పెట్టి సరిపడా వేడిని అందించి పొదిగారు. తమ ప్రయోగం విజయవంతంకావడంపై కొలోసల్ సంస్థ సీఈఓ బెన్లామ్ ఆనందం వ్యక్తంచేశారు. సింథటిక్ బయాలజీ పితామహుడిగా పేరొందిన అమెరికా దిగ్గజ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ జార్జ్ చర్చ్ ఆధ్వర్యంలో కొలోసల్ సంస్థ పనిచేస్తోంది. ‘‘కృత్రిమమేధతో పనిచేసే కృత్రిమ ఎగ్‌షెల్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే భవిష్యత్తులో అంతరించిపోయిన పక్షిజాతులకూ తిరిగి ప్రాణం పోయవచ్చు. న్యూజిలాండ్‌లో ప్రాచీనకాలంలో కలియతిరిగిన మోవా జాతిని పునర్సృష్టించాలంటే దాని గుడ్డును మోయగలిగే భారీ పక్షిజాతులు ఇప్పుడులేవు. అందుకే ఇలా కృత్రిమ ఎగ్‌షెల్ తయారీకి పూనుకున్నాం’’అని బెన్లామ్ వివరించారు.
జాతీయం
రోమ్‌లో ‘మెలోడీ’ రీయూనియన్ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్‌ల సునామీ
ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరి దశగా ఇటలీలోని రోమ్‌లో అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం షేర్ చేయగా లైక్‌ల సునామీ ఏర్పడింది. కేవలం రెండు,మూడు గంటల వ్యవధిలోనే 60 లక్షల పైచిలుకు లైక్‌లు వచ్చాయి.ఈ 'మెలోడీ' ముచ్చట్లు మొదట ప్రధాని మోదీ షేర్ చేసిన ఫోటోలతో ప్రారంభమయ్యాయి. అంతేకాదు ప్రధాని మోదీ తనకు 'మెలోడీ' టాఫీల (చాక్లెట్ల) ప్యాకెట్‌ను బహుమతిగా ఇస్తున్న వీడియోను మెలోని స్వయంగా షేర్ చేశారు. ఆ వీడియోకు "బహుమతికి ధన్యవాదాలు" అని ఆమె క్యాప్షన్ పెట్టారు. ఆసక్తికరమైన వీడియోతో ఈ #Melodi మూమెంట్ మరోసారి పీక్స్‌కు చేరింది. Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU— Narendra Modi (@narendramodi) May 20, 2026 ; जब मोदी... मिले... मेलोनी से 🔥एक तो महिला ऊपर से इटालियन उससे भी आगे इटली की PM और ये पलकें बिछाकार मेरे PM का इंतज़ार सारी दुनिया की गांव में मिर्च बोने को ये एक मिनट का वीडियो ही काफी हैँ रे बाबा ✍️ pic.twitter.com/vO8KFRmo6m— Deepak Sharma (@SonOfBharat7) May 20, 2026 "రోమ్‌లో ల్యాండ్ అయిన తర్వాత, డిన్నర్ సమయంలో ప్రధాని మెలోనిని కలిసే అవకాశం వచ్చింది. అనంతరం ప్రసిద్ధ కొలోసియం (Colosseum) ను సందర్శించాము. వైవిధ్యమైన అంశాలపై మా ఆలోచనలను పంచుకున్నాము" అని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. రోమ్ నడిబొడ్డున ఉన్న 'కొలోస్సియం' ఒక ప్రసిద్ధ దీర్ఘవృత్తాకార యాంఫిథియేటర్ (పురాతన బహిరంగ ప్రదర్శనశాల). ప్రపంచంలోనే నిర్మించబడిన అతిపెద్ద పురాతన యాంఫిథియేటర్ ఇదే కావడం విశేషం.Five Italians passionate about Indian dance, Svamini Atmananda Giri, Ms. Martina Meenakshi Argada, Ms. Lucrezia Maniscotti, Ms. Valeria Vespaziani, Ms. Rosella Fanelli performed ‘Trigalbandi’, which included Kuchipudi, Bharatanatyam and Kathak. It is wonderful to see Indian dance… pic.twitter.com/gWYKgNejBe— Narendra Modi (@narendramodi) May 20, 2026 కాగా మంగళవారం ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీకి మెలోని నుండి ఘనస్వాగతం లభించింది. "నా స్నేహితుడికి రోమ్‌లోకి స్వాగతం!" అని మెలోని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు. వీరిద్దరూ బుధవారం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీనికి ముందు, నవంబర్ 2025లో జరిగిన జి20 (G20) సదస్సు సందర్భంగా వీరిద్దరూ చివరిసారిగా సమావేశమయ్యారు. ఇటలీ వీధుల రమణీయమైన దృశ్యాలతో "మెలోడీ" (Melodi) మీమ్స్‌కు తెరలేపిన మోదీ, మెలోనిల సాన్నిహిత్యం మరోసారి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. గతంలో కూడా వీరిద్దరూ ఈ 'మెలోడీ' మీమ్స్‌ను గుర్తించి, వాటిపై మోదీగా సరదాగా స్పందించారు.ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన విశేషాలుభారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో పంచుకున్న వివరాల ప్రకారం, రోమ్ చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి భారతీయులు ఉత్సాహంగా, ఘనంగా స్వాగతం పలికారు. ఇటాలియన్ కళాకారులు ప్రదర్శించిన కథక్, కూచిపూడి, భరతనాట్యం వంటి రంగుల ప్రదర్శనలను ప్రధానమంత్రి వీక్షించారు.ఇటాలియన్ సంగీతకారులు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అద్భుతంగా ఆలపించారు. సంతూర్, తబలా, బన్సూరి (ఫ్లూట్), సితార్ వాయిద్యాల కలయికతో భారతదేశ సంగీత వారసత్వాన్ని వారు ప్రతిబింబించారు. అలాగే ఇటలీలో భారతీయ సంగీతానికి ఆదరణ పెరుగుతోందని మోదీ పేర్కొంటూ... స్వాగత వేడుకల్లో 'హంసధ్వని' రాగాన్ని అద్భుతంగా పలికించిన ఇటాలియన్ కళాకారులు వాలెరియో బ్రూని (సంతూర్), లియో వెర్టున్ని (సితార్), సిమోన్ మట్టియెల్లో (బన్సూరి), ఫ్రాన్సెస్కో గెరార్డి (తబలా), నికోలో మెల్లోచి (బన్సూరి)లను అభినందించారు.వారణాసి పెయింటింగ్ బహుమతిఈ పర్యటనలో ఇటాలియన్ చిత్రకారుడు జియాంపాలో తోమస్సెట్టిని మోదీ కలిశారు. తోమస్సెట్టి తాను గీసిన వారణాసి పెయింటింగ్‌ను మోదీకి బహుమతిగా ఇచ్చారు. తోమస్సెట్టికి భారతీయ సంస్కృతిపై నాలుగు దశాబ్దాలుగా ఉన్న మక్కువను మోదీ కొనియాడారు. 1980లలో వేద సంస్కృతికి సంబంధించిన పుస్తకాలకు ఇలస్ట్రేటర్‌గా కెరీర్ ప్రారంభించిన తోమస్సెట్టి, 2008 నుండి 2013 మధ్య కాలంలో మహాభారతానికి సంబంధించి 23 పెద్ద పెయింటింగులను రూపొందించారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ
‘కాక్రోచ్ జనతా పార్టీ’ vs ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’?
న్యూఢిల్లీ: భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో నిత్యం కూటములు, చీలికలు, వాట్సాప్ వార్ రూమ్‌ల హడావుడిని చూస్తూనే ఉంటాం. అయితే, దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త ‘బయోలాజికల్’ డిజిటల్ రాజకీయ యుద్ధం మొదలైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ (కాక్రోచెస్, పారాసైట్స్) అనే వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, యువత ఈ అవమానాన్ని కేవలం నిరసనగా మార్చకుండా, ఒక వినూత్న వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా మలిచారు. దీని ఫలితంగానే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ), ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ (ఎన్పీఎఫ్) వంటి వ్యంగ్య పొలిటికల్ గ్రూపులు నెట్టింట ప్రభంజనం సృష్టిస్తున్నాయి.కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానం (CJP)‘ఎక్కడ వైఫై ఉంటే అదే మా ప్రధాన కార్యాలయం’ అంటూ అభిజీత్ దిప్కే అనే యువకుడు మే 16న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని స్థాపించారు. కేవలం నాలుగు రోజుల్లోనే ‘ఎక్స్’, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ పేజీకి ఏకంగా 10 లక్షల (మిలియన్) పైగా ఫాలోవర్స్ వచ్చారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రవేశ పరీక్షల భారంతో నలిగిపోయే యువతకు ఈ వేదిక ఒక ఆయుధంగా మారింది. వీరి మేనిఫెస్టోలో.. రిటైర్మెంట్ తర్వాత చీఫ్ జస్టిస్‌లకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదని, తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు కేబినెట్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా దీనిపై ఆన్లైన్లో స్పందించడంతో ఈ ఉద్యమానికి మరింత ప్రచారం లభించింది. (Cockroach Janta Party Story)దూసుకొచ్చిన ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’(NPF)రాజకీయాల్లో ఖాళీలు ఉండవు కాబట్టి, సీజేపీకి పోటీగా ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ రంగంలోకి దిగింది. పరాన్నజీవులుగా ముద్రపడిన సాధారణ పౌరుల తరఫున తామే అసలైన ప్రతిపక్షం అని ఈ గ్రూప్ ప్రకటించుకుంది. ‘వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికే మేము ఈ విరిగిన వ్యవస్థతో అతుక్కుపోయాం’ అని ఎన్పీఎఫ్ తన వెబ్సైట్లో పేర్కొంది. పార్లమెంట్లో నేరస్థులు ఉండకూడదని, చదువుకున్న ప్రజాప్రతినిధులు రావాలని, వర్షం పడితే నదులుగా మారే రోడ్ల వ్యవస్థ మారాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ బొద్దింకలాగా ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే సామాన్యుడిని ప్రతిబింబిస్తే, ఎన్పీఎఫ్ మాత్రం ‘అసలైన పరాన్నజీవులు ఎవరు?’ అంటూ పాలకుల వైపు ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. (National Parasitic Front Story)సరికొత్త మీమ్ పాలిటిక్స్ యుగంభారతదేశంలో కార్టూన్లు, మిమిక్రీ ద్వారా రాజకీయ వ్యంగ్యం ఎప్పటి నుంచో ఉంది. కానీ 2026 నాటి ఈ డిజిటల్ యుగంలో, యువత కేవలం జోకులను చూసి నవ్వుకోకుండా, తామే స్వయంగా భాగస్వామ్యులయ్యే ‘పార్టిసిపేటరీ సాటైర్’ విధానాన్ని ఎంచుకున్నారు. పూర్వం యువత ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక వెబ్సైట్ తెరిచి, లోగో క్రియేట్ చేసి, ఒక నకిలీ రాజ్యాంగాన్ని రాసి మధ్యాహ్నానికల్లా వేలల్లో ఫాలోవర్లను సంపాదిస్తున్నారు. ఈ రెండు గ్రూపులు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన అధికారిక పార్టీలు కాకపోయినప్పటికీ, దేశంలోని నిరుద్యోగ యువత ఆవేదనను, వ్యవస్థపై వారికున్న అసంతృప్తిని డిజిటల్ వేదికగా ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.ఇది కూడా చదవండి: మీ అర్హతలకు ప్రభుత్వ పథకాలు.. కొత్త వెబ్సైట్ వచ్చేసింది!
లంచంపై ఫిర్యాదు చేస్తే లక్ష బహుమతి!
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారా?. అవినీతి రహిత పాలన కోసం కఠిన చర్యలు అవలంభిచబోతున్నారా?. ఇందు కోసం తొలి అడుగు.. అవినీతి నిరోధక శాఖ ప్రక్షాళనతోనే ప్రారంభించబోతున్నారా?. లంచం అడిగినా అధికారులపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నజరానా ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం విజయ్ సర్కార్ ప్రొత్సాహక పథకం తేబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగా.. అధికారులు ఎవరైనా వెయ్యి లంచం అడిగినా పిర్యాదు చేస్తే లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినట్లు ఆ వార్త సారాంశం. అవినీతి ఫిర్యాదుల కోసం 24 గంటలు పని చేసేలా 1800 425 1555 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారని.. అలాగే ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తారన్నది ఆ కథనం సారాంశం. అంతేకాదు.. ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వమని ప్రభుత్వం భరోసా ఇవ్వబోతోందట. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలించేందుకు అడుగులు వేశారని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ శాఖల్లో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు చర్చ నడుస్తోంది. ఇందుకుగానూ అన్ని శాఖలకు మూడు నెలల గడువు విధించారని.. పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు.. టెండర్లు, కాంట్రాక్టులు పారదర్శకత కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ఆ కథనాలు ఊటంకించాయి. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు అవినీతి రహిత సమాజంలో ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయమంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో అనూహ్య ప్రశ్న సంధించి వార్తల్లో నిలిచిన నార్వే మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్ (Helle Lyng Svendsen) చేదు అనుభవం ఎదురైంది. ఆమె సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తూ మెటా షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె కూడా ధృవీకరించారు.ఆన్లైన్లో వెల్లువెత్తిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలు నిలిపివేయబడ్డాయని హెలె లింగ్ ట్వీట్ చేశారు. తన ఖాతా నిలిపివేయబడటానికి ముందు రోజంతా తన ఇన్‌స్టాను యాక్సెస్ చేయలేకపోయానని లింగ్ తెలిపారు. "పత్రికా స్వేచ్ఛ కోసం చెల్లించాల్సిన చిన్న మూల్యమే ఇది, కానీ ఇలాంటి అనుభవం ఇంతకు ముందెప్పుడూ ఎదురు కాలేదు," అని ఆమె తన సస్పెన్షన్ నోటీసు స్క్రీన్‌షాట్ షేర్ చేశారు.Throughout all day I have struggled to log onto my Instagram account. Now I have been suspended. It is a small prize to pay for press freedom, but I’ve never experienced it before. pic.twitter.com/XCitS65Rlg— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026 ; మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్స్ ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వినియోగ దారులకు, తన ఇన్‌స్టా, ఫేస్బుక్ ఖాతాలు రెండూ సస్పెండ్ అయ్యాయని మరో పోస్ట్‌లో లింగ్ తెలియజేశారు. తాను వీలైనంత ఎక్కువ మంది భారతీయులకు స్పందించాలనుకున్నా, కానీ ఇప్పుడు అది లేట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ తన ఖాతాలు తిరిగి యాక్టివ్ అవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన పోస్ట్‌కు ఆమె మెటాను కూడా ట్యాగ్ చేస్తూ రాశారు.ఇదీ చదవండి: ఇది కదా లక్ అంటే : పాత ప్యాంట్లో రూ. 57 కోట్ల జాక్‌పాట్ కాగా ప్రధాని మోదీ పత్రికా సమావేశంలో తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ బాగా వైరల్ అయింది. ఆమె ఫాలోవర్లు కూడా పెరిగారు. దీనిపై బీజేపీ శ్రేణులు లింగ్పై విరుచుకుపడగా, నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.
ఎన్ఆర్ఐ
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
క్రైమ్
అమీర్‌పేట గర్ల్స్ హాస్టల్లో.. చొరబడ్డ వ్యక్తులు..!
హైదరాబాద్: గర్ల్స్ హాస్టల్లో గుర్తుతెలియని వ్యక్తులు కనిపించారని చెప్పిన యువతులపై దుర్భాషలాడిన హాస్టల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. అమీర్‌పేటలో ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్‌ను శివపార్వతి, ఆమె కుమారుడు వీరారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న తెల్లవారు జామున ఓ గదిలో ఎవరో ఉన్నట్లు అనుమానం రావడంతో యువతి లేచి చూడగా బాత్రూమ్లో దూరాడు. గట్టిగా అరవడంతో పరారయ్యాడు. ఈ విషయం నిర్వాహకుడు వీరారెడ్డికి చెబితే దుర్భాషలాడాడు. ఇలా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చినట్లు యువతులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి వీరారెడ్డిని అరెస్టు చేశారు. శివపార్వతి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
లక్ష్మీకుమార్ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు, భారీగా బంగారం!
మల్లాపూర్/నాంపల్లి: హైదరాబాద్ జలమండలిలో ఓ భారీ అవినీతి జలగ ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సంస్థ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) రెడ్‌హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీకుమార్ (58) నివాసం సహా బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన 8 ప్రదేశాల్లో ఏసీబీ డీఎస్పీ మజీత్ అలీఖాన్ ఆధ్వర్యంలో 16 గంటలపాటు సోదాలు జరిగా యి. హైదరాబాద్ మల్లాపూర్‌లోని వెంకటరమణ కాలనీలో ఉన్న అనంత లక్ష్మీకుమార్ నివాసంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఏకంగా రూ. 1.10 కోట్ల నగదు, 2.1 కేజీల బంగారం, 9.2 కేజీల వెండి లభ్యమైంది. అలాగే నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఇళ్లు, మారుతీ కారు, బజాజ్ మోటార్ బైక్ సహా మొత్తం రూ. 5.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంత లక్ష్మీకుమార్ భార్య రాధమ్మ పేరిట మూడు బ్యాంకు లాకర్లలో భద్రపర్చిన ఆభరణాలు, ఇళ్ల పత్రాలను కూడా ఏసీబీ అధికారులు తెరిపించి స్వా«దీనం చేసుకున్నారు. రెడ్‌హిల్స్‌లోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి కొన్ని రికార్డులను తీసుకెళ్లారు. ఆయా ఆస్తుల మార్కెట్ విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. అనంత లక్ష్మీకుమార్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన్ను బంజారాహిల్స్‌లోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)కు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాధు చేయాలని సూచించారు. ఫిర్యాధుల వివరాలు పూర్తింగా గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా, నోట్ల కట్టలను లెక్కించేందుకు తీసుకొచ్చిన కౌంటింగ్ మెషీన్లు కాసేపు మొరాయించాయి. సోదాల్లో 15 మంది అధికారులు పాల్గొన్నారు. ఉలిక్కిపడిన మల్లాపూర్...: మల్లాపూర్ వెంకరమణ కాలనీలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నట్లు టీవీల్లో చూసి ఉలిక్కిపడిన స్థానికులు.. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అనంత లక్ష్మీకుమార్ నివాసం వద్ద గుమిగూడారు. గత నెలలో చిన్న కుమార్తె వివాహాన్ని ఆయన ఆరంఘర్ సమీపంలో అంగరంగ వైభవంగా చేశారని చర్చించుకున్నారు.
స్పా సెంటర్లో భార్యను చంపిన భర్త..!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో పాటు అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన మంగళవారం గాం«దీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ఎస్ఐ నర్సింహ, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం. ఆటో డ్రైవర్ రాజు, బంగి దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్‌పురా కిషన్‌బాగ్ ఎంఎన్ గూడెంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కవాడిగూడ ప్రధాన రహదారిలోని ఓ సూపర్ మార్కెట్ 4వ అంతస్తులోని స్పా సెంటర్లో దేబోరా బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు ఎంఎన్ గూడెంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటూ రాజుపై దేబోరా అత్తాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు పెట్టింది. అప్పటి నుంచి రాజు కక్ష పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. మంగళవారం ఉదయం దేబోరా విధుల్లో భాగంగా ఆటోలో కవాడిగూడలోని స్పా సెంటర్‌కు చేరుకుంది. ఆమెను వెంబడించిన రాజు కవాడిగూడకు చేరుకున్నాడు. ఆమె లిఫ్టులోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చాడు. వీరిద్దరూ లిప్టులోనే గొడవ పడుతూ 4వ అంతస్తుకు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరంపై అనేక చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో దేబోరా మృతి చెందింది. నిందితుడు రాజు అత్తాపూర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళ వెనుక వెళ్లి.. డ్రెస్‌ను పైకెత్తి
హైదరాబాద్: ఇటీవల నార్సింగి సైకిల్ ట్రాక్‌లో జాగింగ్ చేస్తున్న యువతిని చూస్తూ ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడం మరచిపోకముందే అలాంటిదే మరో ఘటన నెక్నాంపూర్ డివిజన్ అలకాపూర్ టౌన్íÙప్లో చోటుచేసుకుంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. స్థానికులు, నార్సింగి ఎస్ఐ సరిత తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ రోడ్ నం. 4లో మధ్యాహ్నం వేళ కూతురును ఎత్తుకుని వెళ్తోంది. ఓ యువకుడు నక్కినక్కి వచ్చి వెనకనుంచి మహిళ డ్రెస్‌ను పైకెత్తాడు. అకస్మాత్తు పరిణామంతో నివ్వెరపోయిన మహిళ గట్టిగా అరిచింది. దీంతో నిందితుడు పారిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది. కొందరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది. విషయం పోలీసులకు చేరడంతో బాధిత మహిళను గుర్తించి ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఇలాంటివి జరగకుండా పోలీసులు గస్తీ పెంచాలని, కాలనీల్లో సీసీ కెమెరాలన్నింటినీ పనిచేసేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.చిల్లర నా కొడుకులు ఎక్కువైపోయారు 💦ఏం బ్రతుకులు రా మీవి ముండల్లారThis incident happened in Manikonda on 14 may afternoon pic.twitter.com/kcvlzogBme— Prudvi Kumar (@Prudvikumar_54) May 19, 2026
వీడియోలు
పాస్టర్ కాదు.. పెద్ద యాక్టర్ కావాలనే యాక్షన్
బాబు విజన్.. గ్యాస్ లేకుండానే చేపల ఫ్రై
తప్పు చేస్తే ఎవరిని వదలొద్దు.. POCSO మీద అందుకే.. మంచు మనోజ్ రియాక్షన్
YSR శిష్యులం భయపెడితే భయపడతామా?
అత్తాపూర్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
కష్టపడి స్పూన్ తో చేపలు తింటున్న బాబు.. చంద్రబాబు పులిహోర
ఆమె కోసమే A సింబల్.. అసలు సీక్రెట్ భయపెట్టిన బుడ్లోడు
బీటెక్ సర్టిఫికెట్ నమ్ముకుంటే కష్టమే.. ఈ కోర్సులు కూడా పక్కా ఉండాలి..!
షాక్ ఇచ్చిన బంగారం.. శాంతించిన వెండి..
మోదీ-మెలోని ద్వైపాక్షిక భేటీ


