సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు ఉదయం (గురువారం) 11 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ జరగనుంది. ఈ ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై స్పందించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


