ఈ సినిమాతో మా అబ్బాయి సిగ్గు పోతే చాలు: నిర్మాత | Battula Koteswara Rao Talks About Purushaha Movie | Sakshi
Sakshi News home page

అందుకే నా కొడుకుని హీరో చేశాను : నిర్మాత బత్తుల కోటేశ్వరరావు

May 20 2026 7:25 PM | Updated on May 20 2026 8:10 PM

Battula Koteswara Rao Talks About Purushaha Movie

సినిమా ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. హీరో అవ్వాలన్న నా కలని మా అబ్బాయి ద్వారా నెరవేర్చుకున్నాను. మా అబ్బాయికి ఉన్న సిగ్గు, బిడియం కూడా ఈ సినిమాల వల్ల పోతుంది. అందుకే మా కొడుకుని హీరోగా చేశాను’ అన్నారు నిర్మాత బత్తుల కోటేశ్వరరావు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో ఆయన కొడుకు  పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. నాకు సినిమా ఫీల్డుతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇక్కడకు వచ్చాక అందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీలోకి రావడం మంచి పరిణామంగా అనిపిస్తోంది.

→ దర్శకుడు వీరుతో  కంటే ముందు ఓ దర్శకుడితో సినిమా చేయాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. ఆ తరువాత సతీష్ ముత్యాల ద్వారా వీరు పరిచయం అయ్యాడు. ఆయన చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మా కన్‌స్ట్రక్షన్ ఆఫీస్‌నే సినిమా ఆఫీస్‌గా మార్చాం.

→ ‘పురుష:’ కథ చాలా బాగుంటుంది. ఆయన నెరేషన్ ఇచ్చిన తీరు కూడా డిఫరెంట్‌గా ఉంది. ఇందులోని లవ్ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఏదో ఒక భారీ సినిమా తీసేయాలనే కోరిక అయితే నాకు లేదు. మా అబ్బాయికి ఉన్న బిడియం, సిగ్గుని పోగొడితే చాలు అని నాకు అనిపించింది. డబ్బుల కోసం అయితే మూవీ తీయలేదు. లాభాలు ఆశించడం లేదు.

→ ఈ చిత్రంలో వీటీవీ గణేష్ పాత్ర అందరినీ నవ్విస్తుంది. ఆయన మాకు ఎంతో సహకరించారు. డేట్స్ విషయంలో ఎంతో హెల్ప్ చేశారు. వెన్నెల కిషోర్  వల్లే కథలో సంఘర్షణ వస్తుంది. సప్తగిరి అద్భుతంగా నటించారు. కసిరెడ్డి గారు చక్కగా నటించారు. మా హీరోయిన్లు అందంగా కనిపించడమే కాకుండా తెరపై చక్కగా నటించారు. అనంత శ్రీరామ్  పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది. మా అబ్బాయి గురించి నేను చెప్పను. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ చెప్పాలి.

→ ఈ సినిమాని మొత్తంగా మూడు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మే 21 నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నాం. థియేటర్లో హాయిగా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మా చిత్రం ఉంటుంది.

→ మా అబ్బాయికి నేను ముందుగానే మాట ఇచ్చాను. మూడు సినిమాలు చేస్తానని చెప్పానని. అప్పటి వరకు మా వాడు నిరూపించుకుని హీరోగా నిలబడితే ఓకే. లేదంటే మళ్లీ మా ఊరికి వచ్చి వ్యవసాయం చేయాలని ముందే చెప్పాను. అలా నేను మా వాడితో కచ్చితంగా నాకున్న స్థోమతలో మూడు సినిమాలు అయితే చేస్తాను.

Advertisement
 
Advertisement
Advertisement