IPL 2026: కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అప్‌డేట్స్‌ | IPL 2026: KKR Vs Mumbai Indians Match Live Updates From Kolkata | Sakshi
Sakshi News home page

IPL 2026: కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అప్‌డేట్స్‌

May 20 2026 7:05 PM | Updated on May 20 2026 8:11 PM

IPL 2026: KKR Vs Mumbai Indians Match Live Updates From Kolkata

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం 65వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌), ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన ముంబై
కేకేఆర్‌తో  మ్యాచ్‌లో ముంబై దారుణ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తోంది. 41 ప‌రుగుల వ‌ద్ద సూర్య‌కుమార్ (15) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 50 ప‌రుగులు చేసింది. పాండ్యా (6), తిల‌క్ వ‌ర్మ (5) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

రోహిత్‌ (15) ఔట్‌.. మూడో వికెట్‌ డౌన్‌
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై కష్టాల్లో పడింది. 15 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ సౌరబ్‌ దూబే బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై 23 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (9), తిలక్‌ వర్మ (0) క్రీజులో ఉన్నారు.

మెరిసిన గ్రీన్‌.. రెండు వికెట్లు కోల్పోయిన ముంబై
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 17 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. కామెరున్‌ గ్రీన్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో మెరిశాడు. తొలుత 6 పరుగులు చేసిన రికెల్‌టన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పాండే స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత ఓవర్‌ చివరి బంతికి నమన్‌ ధిర్‌ను గ్రీన్‌ డకౌట్‌ చేశాడు.

టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 36 సార్లు తలపడితే ముంబై 25 సార్లు, కేకేఆర్ 11 సార్లు నెగ్గాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటిబాట పట్టనుంది. ప్రస్తుతం కేకేఆర్ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.  

ఈ మ్యాచ్‌లో గెలిస్తే కేకేఆర్ ఖాతాలో 13 పాయింట్లు చేరుతాయి. తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీని ఓడిస్తే అప్పుడు 15 పాయింట్లతో నిలవనుంది. ఇదే సమయంలో రాజస్తాన్‌, పంజాబ్‌లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఎలిమినేట్ కావడంతో వారు గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదు. 

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్‌ కీపర్‌) , రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కె ప్టెన్‌), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, రఘు శర్మ.

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానె(కెప్టెన్‌), అంగ్‌క్రిష్‌ రఘువంశీ(వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే. 

Advertisement
 
Advertisement
Advertisement