'సంక్షోభాలు' నేర్పుతున్న గుణపాఠాలు
వర్షాల అనిశ్చితి, ఎరువుల దిగుమతి ఆధారితం, భూమి క్షీణత, అధిక నీటి పంటలపై మోజు – ఈ నాలుగు కలిసి భారత వ్యవసాయాన్ని సున్నితమైన స్థితిలోకి నెట్టాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ సమస్య తీవ్రంగా వున్నది. 2026లో ఎల్నీనో ముప్పు, పశ్చి మాసియా ఉద్రిక్తతల వల్ల పెరుగుతున్న ఎరువుల ఖర్చులు రైతాంగానికి తాత్కా లిక ఇబ్బందే కాక, వ్యవసాయం చేసే పద్ధతులలో పూర్తి మార్పు అత్యవసరమని సూచిస్తున్నాయి.చిన్న మార్పులే పెను సవాళ్లువాతావరణ మార్పులు ఒక్కసారిగా కనపడవు. కొంచెం ఎక్కువ ఎండలు, ఆలస్యంగా వచ్చే వర్షాలు, పంట మధ్యలో పొడి విరామాలు – మొదట ఇవి చిన్న మార్పుల్లా కనిపిస్తాయి కానీ కొన్ని సంక్షోభాలు సమాజాన్ని తన జీవన విధానాన్ని, ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఆహార ఉత్పత్తి విధానాన్ని తిరిగి ఆలోచించేలా చేస్తాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆరోగ్యం, పోషకాహారం, స్థానిక ఆహార వ్యవస్థలు, ప్రకృతి ఆధారిత జీవన విధానాలపై కొత్త చర్చ ప్రారంభమైనట్లే, ఇప్పుడు వ్యవసాయ రంగం కూడా అలాంటి మరో మలుపు దగ్గర నిలిచింది.భారత వాతావరణ విభాగం ఈ ఏడాది దక్షిణ–పడమటి రుతుపవన వర్షపాతం దీర్ఘకాల సగటు కంటే తక్కువగా, 92 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ వాతావరణ అంచనాలు కూడా జూన్ నుంచి ఆగస్టు మధ్య ఎల్నీనో పరిస్థితులు బలపడే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఇదే సమయంలో, గ్యాస్, అమ్మోనియా, సల్ఫర్, డీఏపీ, యూరియా వంటి ఎరువుల సరఫరాపై అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఒత్తిడి పెంచు తున్నాయి. ఎల్నీనో భారత రుతుపవనాలను బలహీన పరుస్తుంది. వర్షాలు వచ్చినా వాటి పంపిణీ అసమానంగా ఉంటుంది. ఖరీఫ్ కాలంలో విత్తన దశలో ఆలస్యం, పుష్ప దశలో తేమ కొరత, చివరికి దిగుబడి తగ్గుదల – ఇవి రైతు ముందుకు వచ్చే ప్రధాన ప్రమా దాలు. రాయలసీమ, తెలంగాణ, విదర్భ, మరాఠ్వాడా వంటి వర్షాధార ప్రాంతాలు మరింత సున్నితంగా ఉంటాయి.ప్రమాదమా? మార్పునకు అవకాశమా?ఎరువుల విషయంలోనూ పరిస్థితి అంతే ఆందోళనకరంగా ఉంది. భారతదేశం యూరియా, డీఏపీ, మిశ్రమ ఎరువులు, అలాగే వాటి తయారీకి అవసరమైన సహజ వాయువు, అమ్మోనియా, సల్ఫర్ వంటి ఇన్ పుట్లలో గణనీయంగా దిగుమతులపై ఆధారపడు తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చిన్న మార్పే భారత రైతుకు పెద్ద భారం కావడం మన వ్యవసాయ విధానం స్వయం సమృద్ధి నుంచి ఎంత బాహ్య ఆధారంగా మారిందో చూపిస్తోంది. తెలంగాణలో ఎరువులు సగటున హెక్టారుకు 280–297 కిలోలు వాడితే, ఆంధ్ర ప్రదేశ్‌లో 230–240 కిలోలు వాడుతున్నారు. జాతీయ సగటు హెక్టారుకు 130 కిలోలు మాత్రమే. దీనికి ప్రధాన కారణాలు: వరి తర్వాత వరే వేయటం, పప్పుధాన్యాల విస్తీర్ణం తగ్గిపోవటం, భూమిలో సేంద్రియ పదార్థం కూడా తగ్గిపోవటం. కనీసం 1.0 నుంచి 1.5 ఉండాల్సిన స్థితి నుంచి ఇది 0.3 శాతం కంటే తక్కువకు పడిపోయింది. దీని వలన తేమను పట్టి ఉంచే గుణం, సమతుల్యమైన పోషకాలు అందించలేని పరిస్థితులలో మన భూములు వున్నాయి. దీనికి తోడు, ఎక్కువ సార్లు దున్ని, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వాడటం వలన, సంవత్సరం అంతా భూమి కప్పి ఉంచే పరిస్థితి లేకపోవటం వలన, మట్టి కొట్టుకు పోవటం, 5–6 అంగు ళాల కింద నెల గట్టి పడిపోవటం జరిగి నీరు కానీ, వేర్లు కానీ లోపలి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మనం ఎల్ నీనో ప్రభావాన్నీ, రసాయనిక ఎరువులు అందక పోవటాన్నీ చూడాలి. ఈ సంక్షోభాన్ని కేవలం ప్రమాదంగా మాత్రమే చూడనక్కర లేదు. ఇది మార్పునకు అవకాశం కూడా. దశాబ్దాలుగా ప్రభుత్వ కొనుగోలు విధానాలు, బోనస్‌లు, సబ్సిడీలు, సాగునీటి ప్రాధాన్యం– అన్నీ కలిసి వరి వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించాయి. తెలంగాణలో గత 15 ఏళ్లలో వారి విస్తీర్ణం 250% పైగా పెరిగింది. అనిశ్చిత వర్షపాతం, ఖరీదైన ఎరువుల కాలంలో అదే పంట నమూనాను యథాతథంగా కొనసాగించడం ఆర్థికంగా, పర్యావరణపరంగా ప్రమాదకరం.సుస్థిర మార్గమే శరణ్యంవరి విస్తీర్ణాన్ని ఒక్కసారిగా కాదుగానీ క్రమంగా తగ్గిస్తూ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వైపు సాగును మళ్లించాలి. జొన్న, సజ్జ, రాగి, కొర్రల వంటి చిరుధాన్యాలు తక్కువ నీటితో పెరుగు తాయి, పొడి పరిస్థితుల్లో కూడా నిలబడగలవు. కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పుధాన్యాలు నేలలో సహజంగా నత్రజని నిల్వ చేయడంలో సహాయపడతాయి. దీంతో రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది. రైతు ఖర్చు తగ్గి, కుటుంబాల పోషకాహార భద్రత మెరుగుపడుతుంది. ఈ మార్పు రైతు ఒంటరిగా చేయలేడు. విధానాలు మారాలి. వరికి లభించే కొనుగోలు హామీలు, ప్రోత్సా హక ధరలు, బోనస్‌లు, ఇన్ పుట్ సబ్సిడీలు – వాటిలో కొంత భాగాన్ని పొడి భూమి పంటల వైపు మళ్లించాలి. రైతు మార్పు చేయ డానికి మార్కెట్ హామీ, నిల్వ సదుపాయం, ప్రాసెసింగ్ వ్యవస్థ, విలువ ఆధారిత విక్రయం, స్థానిక కొనుగోలు మద్దతు అన్నీ కలిసి రావాలి. పంటల వైవిధ్యం గురించి మాట్లాడటం సరిపోదు; దానికి తగిన ప్రోత్సాహక వ్యవస్థను ప్రభుత్వం నిర్మించాలి.నేల ఆరోగ్య పునర్నిర్మాణం అత్యవసరం. ఏళ్లుగా అధిక రసాయన ఎరువుల వాడకం, పంట అవశేషాల దహనం, సేంద్రియ పదార్థాల నిర్లక్ష్యం వల్ల నేలలో సేంద్రీయ కర్బనం తగ్గిపోయింది. సేంద్రీయ పదార్థం తగ్గిన నేల నీటిని నిల్వ ఉంచుకోలేకపోతుంది. కొద్దిరోజుల పొడి వాతావరణానికే పంట ఒత్తిడికి గురవుతుంది. ఎరువు వేసినా పూర్తిగా ఉపయోగ పడదు. నేల బలహీనమైతే వాతా వరణ షాక్‌కు వ్యవసాయం మరింత సులభంగా దెబ్బతింటుంది. అందుకే నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచడం వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలా భావించాలి. మల్చింగ్ వల్ల వేసవిలో నేలనుండి నీటి ఆవిరి పోవడం తగ్గుతుంది. కవర్ క్రాప్స్ నేలను ఎండకు నేరుగా గురి కాకుండా కాపాడతాయి. సన్ హెంప్, ధైన్చా వంటి పచ్చి రొట్ట పంటలు నేలను సహజంగా సారవంతం చేస్తాయి. ఇవి పాత పద్ధతులు మాత్రమే కావు; భవి ష్యత్తు వ్యవసాయానికి అవసరమైన తెలివైన వ్యూహాలు. తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రమాదంతో, ఆరోగ్యకరమైన నేలతో, స్థిరమైన నీటి వినియోగంతో, పోషకాహార భద్రతతో సాగు చేసే విధానాల వైపు మళ్లాల్సిన సమయం వచ్చింది. ఎల్నీనో, ఎరువుల సంక్షో భాలు వ్యవసాయాన్ని స్థిరమైన మార్గంలోకి నడిపించే అవకాశం కావచ్చు. మార్పు వస్తుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఆ మార్పుకు మనం సిద్ధమవుతామా లేదా అనేదే అసలు ప్రశ్న.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
క్యాడ్ కట్టడికి అస్త్రాలున్నాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో విస్తరిస్తున్న కరెంటు ఖాతా లోటు (క్యాడ్)ను కట్టడి చేసేందుకు పలు చర్యలను పరిశీలిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ‘‘పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలూ ఒక బృందంగా పనిచేస్తున్నాయి. పలు చర్యలను పరిశీలిస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో విజేతగా అవతరిస్తామన్న నమ్మకం, ధైర్యం, దృఢ విశ్వాసంతో ఉన్నాం’’అని మంత్రి పేర్కొన్నారు. కరెంట్ ఖాతా లోటు డిసెంబర్ త్రైమాసికంలో 13.2 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. జీడీపీలో ఇది 1.3 శాతానికి సమానం. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో క్యాడ్ 11.3 బిలియన్ డాలర్లుగానే ఉంది. కానీ, గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఏప్రిల్–డిసెంబర్ కాలంలో క్యాడ్ 30.1 బిలియన్ డాలర్లకు (జీడీపీలో ఒక శాతం) తగ్గడాన్ని గమనించొచ్చు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఇది 36.6 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.3 శాతం)గా ఉంది. వస్తు, సేవల ఎగుమతులతో పోల్చితే దిగుమతులు, చెల్లింపుల విలువ పెరిగినప్పుడు ఏర్పడేదే కరెంటు ఖాతా లోటు. రూపాయి–దిగుమతుల ప్రభావం.. ముఖ్యంగా ఒకవైపు రూపాయి విలువ క్షీణిస్తుండడం.. మరోవైపు ముడి చమురు, బంగారం, వెండి దిగుమతుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుండడంకరెంటు ఖాతా లోటు విస్తరణకు దారితీస్తోంది. 2025–26లో పసిడి దిగుమతుల విలువ 24 శాతం పెరిగి 71.98 బిలియన్ డాలర్లకు చేరింది. వెండి దిగుమతులు 150 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే బంగారం దిగుమతులు 81 శాతం పెరిగి 5.62 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా ఏప్రిల్‌లో క్యాడ్ మూడు నెలల గరిష్ట స్థాయి అయిన 28.38 బిలియన్ డాలర్లకు పెరిగిపోవడం గమనార్హం. రూపాయి సైతం ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి (డాలర్‌తో 96.80)కి పడిపోవడం చూస్తూనే ఉన్నాం. కరెన్సీ విలువ క్షీణత, ఏఐ తరహా భారీ వృద్ధి అవకాశాలున్న కంపెనీలు భారత్‌లో లేకపోవడం, ఈక్విటీల అధిక వ్యాల్యూషన్లతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను క్రమంగా భారత్ నుంచి తరలించుకుపోతుండడం రూపాయి విలువను హరిస్తోంది. దీంతో పసిడి, వెండి దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం ఇటీవలే దిగుమతి సుంకాలు పెంచడంతోపాటు పలు నియంత్రణలు విధించింది. ఆభరణాల కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, చమురు వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెలిసిందే. ప్రధాని పట్ల విశ్వాసం ఉన్న వారి ఆచరణతో దేశానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని మంత్రి గోయల్ అభిప్రాయపడ్డారు. గల్ఫ్ దేశాల సమాఖ్యతో (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మొదటి విడత చర్చలు 2026 ద్వితీయ ఆరు నెలల కాలంలో కార్యరూపం దాలుస్తాయని చెప్పారు.
అగ్రజుల గుసగుసలు
రెండు సాధారణ దేశాల అధినేతలు కలిశారంటే వాణిజ్యం, వ్యాపారం, పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకోవడాలు చర్చకొస్తాయి. ఒప్పందాలు కుదురుతాయి. కానీ రెండు అగ్రదేశాలు కలిశాయంటే పైకి కనబడే వాణిజ్య, వ్యాపారాదులతోపాటు గుట్టుచప్పుడు కాకుండా కుదిరే లాలూచీలుంటాయి. వారం రోజుల వ్యవధిలో మూడు అగ్ర రాజ్యాల మధ్య మంతనాలు సాగాయి. గతవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకొస్తే, ఈ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంతు. స్వల్ప వ్యవధిలో ఇలా ఇద్దరు అగ్రరాజ్యాధినేతలు రావటంవల్ల సహజంగానే చైనా స్థాయి అమాంతం పెరిగిపోయింది. పుతిన్ వచ్చిన సందర్భం సాధారణమైనది కాదు. ఆయనే చెప్పినట్టు 54 సంవత్సరాల క్రితం ఇదేరోజున అప్పటి చైనా అధినేత మావో జెడాంగ్ ‘ప్రపంచ దేశాలన్నీ ఏకమై అమెరికా సామ్రాజ్యవాదంపై పోరాడాల’ని పిలుపునిచ్చారు. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారింది. పెట్టుబడి ఎగుమతిలో, దేశాలపై ఆర్థికంగా పట్టుబిగించటంలో, ఇరుగుపొరుగును చీకాకుపెట్టడంలో, కనిపించేదంతా తనదేనని ప్రకటించుకోవటంలో చైనా సైతం సామ్రాజ్యవాద పోకడలకు పోతోంది. మధ్యన ‘సోషల్ సామ్రాజ్యవాదం’ ముద్ర వేయించుకున్న సోవియెట్ యూనియన్ చీలికలూ, పేలికలై కుప్పకూలింది. అందులోని ప్రధాన భాగం రష్యా కూడదీసుకునే ప్రయత్నం చేస్తూ, గత వారసత్వాన్ని కొనసాగించటానికి ఆపసోపాలు పడుతోంది. ఇక అమెరికా పోకడలు దశాబ్దాలుగా అదే బాణీలో కొనసాగుతున్నాయి.గతవారం ట్రంప్‌కు లభించిన స్వాగత సత్కారాలన్నీ పుతిన్‌కు కూడా దక్కాయి. రెడ్‌కార్పెట్ పరచడం, సైనిక వందనం, కేరింతలతో పిల్లలు అభివాదం చేయడం వంటివన్నీ కనబడ్డాయి. అయితే స్వీయ ప్రయోజనాల రక్షణలో తమకెవరూ సాటిరారని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిరూపించారు. ఏవేవో ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పటమే తప్ప చైనా వైపునుంచి గతవారం ఎలాంటి ప్రకటనలూ రాలేదు. ఇప్పుడు పుతిన్‌కు కూడా దాదాపు అదే అనుభవం ఎదురైంది. ఇంధన సర ఫరా కోసం ‘పవర్ ఆఫ్ సైబీరియా 2’ పేరిట రెండో పైప్‌లైన్ నిర్మాణానికి రష్యా సిద్ధపడినా, చైనా అందుకు సంబంధించి మరింత లోతుగా చర్చించాల్సి ఉందంటూ వాయిదా వేసింది. కాకపోతే తైవాన్ విషయంలో ట్రంప్‌కు ‘రెడ్‌లైన్’ హెచ్చరిక జారీ అయిన పద్ధతిలో పుతిన్కుఎలాంటి భంగపాటు కలగలేదు. ఎవరికి వారు అవతలివారిని వేలెత్తి చూపడమే తప్ప, తమ తప్పులెరగరని ట్రంప్, పుతిన్‌ల పర్యటనలు నిరూపించాయి. హార్మూజ్ జలసంధి ప్రతిష్టంభన, ఇరాన్ యుద్ధం విషయంలో గతవారం అమెరికా, చైనాలు ‘ఏకాభిప్రాయం’ ప్రకటిస్తే... ఇప్పుడు చైనా, రష్యాలు సైతం అలాంటి స్వరమే వినిపిస్తున్నాయి. ‘ఏకపక్ష వ్యవహారశైలి, ఆధిపత్యవాద ధోరణులు’ ఉండరాదని కోరాయి. ప్రపంచం ఆటవిక న్యాయంలోకి దిగజారే ప్రమాదం కనబడుతోందని ఆందోళన వ్యక్తంచేశాయి. తరచిచూస్తే ఈ మూడు దేశాలూ జంకూ గొంకూ లేకుండా ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్నాయి. అయినా గంభీరస్వరాలతో హితవు పలికే సాహసం చేస్తున్నాయి. అమెరికా సైన్యం వెనెజులా అధ్యక్షుణ్ణి భార్యా సమేతంగా చీకటిచాటున అపహరించుకు పోయింది. ఇరాన్ అగ్రనేతను ఇజ్రాయెల్‌తో కలిసి హత్య చేసింది. క్యూబాను కబళించటానికి కత్తులు నూరుతోంది. రష్యా నాలు గేళ్లుగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. దురాక్రమణకు దిగకపోయినా ఆసియా ఖండ దేశాల్లో చైనా కండబల ప్రదర్శన తక్కువేం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుతిన్‌కు చైనా అవసరమే ఎక్కువుంది. ఉక్రెయిన్ను తక్కువ అంచనా వేసి యుద్ధంలోకి దిగి, అది తీవ్రంగా దెబ్బతింది. పుతిన్ స్వీయభద్రతే ప్రమాదంలో పడింది. రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించిన ఉక్రెయిన్... ‘రష్యా తలపెట్టిన మే 9 విక్టరీ పెరేడ్ సజావుగా సాగటానికే’ దీనికి అంగీకరించామంటూ ఎద్దేవా చేసింది. దానికితోడు 2008 తర్వాత తొలిసారి ట్యాంకులు, క్షిపణులు లేకుండా ఆ పెరేడ్ హడావుడిగా ముగిసింది. మొత్తానికి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆ రెండు దేశాల మాదిరిగా తనపై ఇంకా దురాక్రమణదారు ముద్రపడనందువల్లే ఈమాత్రం ప్రతిష్ఠయినా దక్కుతున్నదని చైనా గ్రహించి సవ్యంగా వ్యవహరిస్తే అదే పదివేలు!
కోటి ఆశలు నెరవేర్చాం!
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీస వేతనాలు నిర్ణయించకపోవడంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి కార్మిక, పారిశ్రామిక సంఘాలతో చర్చించి ఉభయతారకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం..సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కార్మికులను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వారు పనిచేసే గ్రామీణ/పట్టణ ప్రాంతాల ఆధారంగా వారి వేతనాలను సవరించింది. జూన్ 1 నుంచి ఈ కొత్త వేతనాలు అమ ల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు గ్రామీణ, పట్టణ అనే రెండు జోన్లు ఉండగా, తాజాగా మున్సిపల్ కార్పొరేషన్లు (జోన్–1), మున్సిపాలిటీలు (జోన్–2), గ్రామీణ ప్రాంతాలు (జోన్–3) అనే మూడు జోన్ల ఆధారంగా వేతనాలను ఖరారు చేసింది. స్థానికంగా ఉండే ఇళ్ల అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం ఆధారంగా వేతనాలను పెంచింది. జోన్–1లో అన్‌స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,592 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,772 నుంచి రూ.18,500కు, హైస్కిల్డ్ కార్మికుల వేతనం రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్‌తో కలిసి గురువారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్మిక వర్గానికి సీఎం ఈ తీపి కబురు వినిపించారు. వారికి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు ‘కార్పొరేషన్లలో ఇళ్ల అద్దెలు, ధరలు, ద్రవ్యోల్బణం ఎక్కువ కాబ ట్టి అక్కడ ఎక్కువ వేతనాలను, మున్సిపాలిటీల్లో కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకొంచెం తక్కువగా వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనాల పెంపును మే డే రోజే ప్రకటిద్దామనుకున్నా కొందరి సూచనల కోసం ఆలస్యమైంది. కనీస వేతనాల పెంపు అమలు చేయని పరిశ్రమలపై కార్మీక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. కార్మీకశాఖ ను ఇంకా బలోపేతం చేస్తాం. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తీసుకున్న పరిశ్రమల్లో 80% ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా నిబంధన పెట్టేందుకు అవకాశం ఉంది..’ అని సీఎం అన్నారు. నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ భద్రత ‘ఏఐ వచ్చాక వైట్ కాలర్ జాబ్ ఉద్యోగాలొచ్చే పరిస్థితీ, ఉద్యోగ భద్రతా లేదు. చాలా దేశాల్లో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి. అమెరికాలో కోట్లాది మంది ఐటీ రంగ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. వారు తిరిగి రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది. సాఫ్ట్వేర్ చదివితే రూ.లక్ష ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు కానీ సాంకేతిక నైపుణ్యంతో కూడిన చదువులతో రూ.2 లక్షల ఉద్యో గం వచ్చే అవకాశం ఉంది. బ్లూకాలర్ జాబ్స్‌కు ప్రపంచంలో విస్తృత డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేయ లేదు. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటే జర్మనీ, జపా న్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్‌లో కొన్ని కోట్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మీ దగ్గర నైపుణ్యం కలిగిన వారుంటే పంపాల ని ఈ దేశాలు మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. నర్సింగ్, సాంకేతిక రంగాల్లో ఎంత మందిని పంపిస్తారని అడుగుతున్నాయి. ఆ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ స్కిల్స్ వర్సిటీ, ఐటీసీల ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాలల అప్‌గ్రేడేషన్‌తో ప్రభుత్వం పూర్తిగా బ్లూకాలర్ ఉద్యోగాల మీద దృష్టి పెట్టింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో చేరితే నెలకు రూ.2 వేలు స్టైపెండ్ ఇస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్‌లో చేరేవారి కోసం కూడా మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. యువతకు జపనీస్, జర్మన్, కొరియన్ భాషలను నేర్పడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాం. జర్మనీ, చైనా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్‌లో 80 శాతం మందికి ఆంగ్లం రాదు. సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ నాలుగైదు దేశాలే తీరుస్తున్నాయి. ఈ దేశాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను తీర్చిదిద్దాలని మా ప్రయత్నం. ఏఐ తుపాన్లో అమెరికానే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. బ్లూ కాలర్ స్కిల్ నేర్చుకుంటే 100 శాతం జీవిత భద్రత ఉంటుంది..’అని రేవంత్ అన్నారు. గల్ఫ్ వెళ్లే వారికి శిక్షణ ‘ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాలనుకునే వారికి ప్రభుత్వ మే శిక్షణ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. స్కిల్స్ వర్సిటీలో ఆరు నెలల శిక్షణ నుంచి నుంచి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ వరకు వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. గతంలో గల్ప్ కార్మీకులు చనిపోతే శవాలను సైతం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రూ.5 లక్షల బీమా ఇవ్వడంతో పాటు శవాలను తీసుకొస్తున్నాం. గల్ఫ్ ఏజెంట్లు పడగలెత్తి పెద్దపెద్ద పదవుల్లోకి వచ్చారు. కానీ కార్మికులు మోసపోతున్నారు. గల్ఫ్ కార్మీకులకు సంబంధించి త్వరలో మంచి పాలసీతో వస్తాం..’అని సీఎం చెప్పారు. ప్రధాని ప్రతిదీ రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము కార్మీకుల కోణం చూస్తాం కాబట్టి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సింగరేణిలో స్థానికులకే 80% ఉద్యోగాలు: మంత్రి వివేక్ సింగరేణి సంస్థలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు కార్మీక శాఖ మంత్రి జి.వివేక్ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతులిచ్చే సమయంలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చెబుతున్నామని, హైస్కిల్డ్ ఉద్యోగాల విషయంలో వారిష్టమని అంటున్నామని చెప్పారు. కొత్తగా 56 ఏటీసీలను మంజూరు చేయడంతో మొత్తం సంఖ్య 118కి పెరగనుందన్నారు.
కోటి ఆశలు నెరవేర్చాం!
అసంఘటిత రంగంలో ఉపాధి జోరు!
భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్!
మూడేళ్లలో కొత్తగా వంద ఔట్లెట్స్
అగ్రజుల గుసగుసలు
క్యాడ్ కట్టడికి అస్త్రాలున్నాయ్
భగీరథ్ ‘ముందస్తు బెయిల్’ పిటిషన్ కొట్టివేత
ఐటీసీ లాభం రూ. 5,470 కోట్లు
'సంక్షోభాలు' నేర్పుతున్న గుణపాఠాలు
ఏ జిల్లా హీట్ రిస్క్ ఎంత?
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
‘సీఎం సీటొద్దులే.. మంత్రిగా సరిపెట్టుకుంటా’
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
BCCI: రోహిత్ శర్మకు బై.. బై!.. వరల్డ్‌కప్ జట్టులోకి అతడు?
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
పాక్ మాజీ క్రికెటర్‌కు బంపరాఫర్.. ఐపీఎల్‌కు అర్హత!
టీఎంసీకి ఝలక్.. అభిషేక్ బెనర్జీనే కారణమా?
ఇళ్లల్లో నివసించకున్నా.. తాళం వేసినా.. అద్దెకిచ్చిన చర్యలే
అభిషేక్ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ
సరస్వతీ మాత విగ్రహం కోహినూర్ కన్నా ముఖ్యం
కోటి ఆశలు నెరవేర్చాం!
అసంఘటిత రంగంలో ఉపాధి జోరు!
భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్!
మూడేళ్లలో కొత్తగా వంద ఔట్లెట్స్
అగ్రజుల గుసగుసలు
క్యాడ్ కట్టడికి అస్త్రాలున్నాయ్
భగీరథ్ ‘ముందస్తు బెయిల్’ పిటిషన్ కొట్టివేత
ఐటీసీ లాభం రూ. 5,470 కోట్లు
'సంక్షోభాలు' నేర్పుతున్న గుణపాఠాలు
ఏ జిల్లా హీట్ రిస్క్ ఎంత?
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
‘సీఎం సీటొద్దులే.. మంత్రిగా సరిపెట్టుకుంటా’
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
BCCI: రోహిత్ శర్మకు బై.. బై!.. వరల్డ్‌కప్ జట్టులోకి అతడు?
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
తమిళనాడు.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కి అదృష్టం
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
పాక్ మాజీ క్రికెటర్‌కు బంపరాఫర్.. ఐపీఎల్‌కు అర్హత!
టీఎంసీకి ఝలక్.. అభిషేక్ బెనర్జీనే కారణమా?
ఇళ్లల్లో నివసించకున్నా.. తాళం వేసినా.. అద్దెకిచ్చిన చర్యలే
అభిషేక్ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ
సరస్వతీ మాత విగ్రహం కోహినూర్ కన్నా ముఖ్యం
ఫొటోలు
డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్ (ఫోటోలు)
వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు
చిరంజీవి 158వ మూవీ లాంచ్ (ఫోటోలు)
తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)
‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
సింప్లీ సూపర్బ్ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
సినిమా
విరోష్ వెడ్డింగ్.. ఆ సీక్రెట్ రివీల్..!
ఈ ఏడాది టాలీవుడ్లో జరిగిన బిగ్గెస్ట్ గ్రాండ్ వెడ్డింగ్ విరోష్ జంటదే. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పెళ్లికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్ ప్రియ మాగంటి ఓ సీక్రెట్ రివీల్ చేశారు. రష్మిక తన మంగళసూత్రాన్ని స్వయంగా డిజైన్ చేసుకున్నారని తెలిపారు. ట్రెండ్‌ను ఫాలో కావాలని విరోష్ జోడీ ముందు నుంచే అనుకోలేదన్నారు. దుస్తులు, ఆభరణాల నుంచి అన్నీ రొటీన్‌కు భిన్నంగా ప్లాన్ చేసుకున్నారని వెల్లడించారు. వీరిద్దరు ప్రతి ఒక్కటీ ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే వీరిద్దరు రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
డ్రాగన్ కష్టాలు.. ఆ లుక్ కోసం ఇంత చేశారా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 20న యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్ల్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ చూపించాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ మూవీలో తన లుక్ కోసం తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 15 కిలోల బరువు తగ్గారని సమాచారం. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే బరువు తగ్గాల్సి ఉంటుందని ఎన్టీఆర్‌తో చెప్పానని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ మరింత బలహీనంగా, పాలిపోయినట్లుగా కనిపించారని నీల్ అన్నారు. ఈ శారీరక మార్పు చూసి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారని దర్శకుడు వెల్లడించారు.ఏడాదిన్నర క్రితమే ప్లాన్..దాదాపు ఏడాదిన్నర క్రితం 'డ్రాగన్' లుక్ టెస్టుల సమయంలోనే ఈ మార్పు మొదలైందని దర్శుకుడు వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ పోషించిన లూగర్ పాత్ర గురించి చర్చిస్తున్నప్పుడు కండలు తిరిగిన యాక్షన్ హీరో లుక్ కంటే.. సన్నని శరీరాకృతి ఆ పాత్రకు బాగా సరిపోతుందని డైరెక్టర్ అన్నారు. అందువల్లే ఈ రోల్ కోసం కొంచెం బరువు తగ్గమని మాత్రమే తాను సూచించానని.. కానీ జూనియర్ ఎన్టీఆర్ పూర్తి అంకితభావంతో ఆ సవాలును స్వీకరించారని ప్రశాంత్ నీల్ చెప్పారు. ముఖ్యంగా తన ఫిట్నెస్ పూర్తిగా దృష్టి పెట్టడానికి దాదాపు నాలుగు నెలల పాటు అన్ని షూటింగ్ కార్యక్రమాలకు విరామం ఇచ్చినట్లు సమాచారం. కఠినమైన ఆహార ప్రణాళిక, తీవ్రమైన వర్కౌట్ సెషన్లు, నిశితమైన వైద్య పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమైందని డైరెక్టర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బలహీనంగా.. పాలిపోయినట్లు కనిపించడంతో చాలాసార్లు ఆపేయమని చెప్పానని.. అయినా కూడా అతను వినలేదని దర్శకుడు పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ లుక్‌పై చాలా రూమర్స్ వచ్చాయి. ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే మందుల వాడారని వార్తలొచ్చాయి. కానీ వీటన్నింటినీ టీమ్ ఖండించింది. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, పోషణతోనే ఇది సాధ్యమైందని క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా, రుక్మిణి వసంత్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 2027లో థియేటర్లలో విడుదల కానుంది.
'పదేళ్లలో 55 ట్రాన్స్ఫర్స్'.. త్రిమూర్తులు టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. అప్పట్లో పెళ్లి, మనసిచ్చి చూడు లాంటి సూపర్ హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ కొన్నేళ్ల తర్వాత కనుమరుగైపోయాడు. మళ్లీ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల విరామం హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సినిమాకు కమల్‌తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాశీసింగ్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఓ కానిస్టేబుల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాట వినని రెబల్ కానిస్టేబుల్‌గా పాత్రలో వడ్డే నవీన్ కనిపించనున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అభిమాని కల నిజం చేసిన హీరో రామ్..!
aటాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని కలను నిజం చేశారు. ఎప్పటికైనా తనను కలవాలని ఆరాటపడుతున్న వీరాభిమాని కోరికను నెరవేర్చాడు. 18 ఏళ్లుగా 'ఫ్రీడ్రిచ్ అటాక్సియా' అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న అమ్మాయి ఇంటికి వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానితో మాట్లాడిన రామ్ తనకు ధైర్యం చెప్పారు. అప్యాయంగా పలకరించిన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో రామ్ చేసిన పనిపై టాలీవుడ్ సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాల విషయానికొస్తే ఆయన తొలిసారి మెగా ఫోన్ పట్టనున్నారు. రామ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీలో రామ్ వీర పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం స్పెషల్‌గా మేకోవర్ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.Tollywood actor Ram Pothineni showed his kind-hearted nature Fulfilling the dream of a die-hard fan battling the rare disease ‘Friedreich’s Ataxia’ for 18 years, Ram personally visited her home, spent time with her, and offered emotional support. #RamPothineni #Tollywood pic.twitter.com/7Fge86Xk58— Telangana Ahead (@telanganaahead) May 21, 2026
క్రీడలు
కేతన్ సారథ్యంలో...
భోపాల్: ఈనెలాఖరులో మొదలయ్యే ఆసియా కప్ అండర్–18 పురుషుల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును గురువారం ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు ఫార్వర్డ్ కేతన్ కుశ్వాహా సారథ్యం వహిస్తాడు. ఆసియా కప్ టోర్నీ మే 29 నుంచి జూన్ 6 వరకు జపాన్‌లోని కాకామిగాహారా పట్టణంలో జరుగుతుంది. భోపాల్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ శిబిరం అనంతరం ఈ జట్టును ఎంపిక చేశారు.ఆసియా కప్ సన్నాహాల్లో భాగంగా ఆ్రస్టేలియా అండర్–18 జట్టుతోనూ భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండింటిని ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. పూల్ ‘ఎ’లో దక్షిణ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, కజకిస్తాన్ జట్లతోపాటు భారత్‌కు చోటు కల్పించారు. భారత్ తమ తొలి మ్యాచ్‌ను కజకిస్తాన్‌తో మే 29న ఆడుతుంది. అనంతరం మే 31న జపాన్‌తో, జూన్ 1న దక్షిణ కొరియాతో, జూన్ 3న చైనీస్ తైపీతో టీమిండియా తలపడుతుంది. పూల్ ‘ఎ’... పూల్ ‘బి’లో టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత అండర్–18 హాకీ జట్టు: సావన్ కుమార్, ఆయుశ్ రజక్ (గోల్‌కీపర్లు), అన్ష్ బహుత్రా, అర్మాన్ సోరెంగ్, ఆశిష్ తానిపుర్తి, అర్ష్ దీప్ సింగ్, అవి మాణిక్‌పురి, రోమిత్ పాల్ (డిఫెండర్లు), రాహుల్ యాదవ్, ప్రేమ్‌చంద్ సోయ్, వరీందర్ సింగ్, కరణ్ గౌతమ్, సిద్ధార్థ్ బెన్ (మిడ్‌ఫీల్డర్లు), కేతన్ కుశ్వాహా, ఆకాశ్‌దీప్, గాజీ ఖాన్, షారుఖ్ అలీ, ప్రహ్లాద్ రాజ్‌భర్ (ఫార్వర్డ్స్).
భారత కాంపౌండ్ ఆర్చరీ చీఫ్ కోచ్‌గా డేవ్ కజిన్స్
కోల్‌కతా: ఆసియా క్రీడలు, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా... భారత కాంపౌండ్ ఆర్చరీ జట్టుకు కొత్త విదేశీ కోచ్‌ను నియమించారు. అమెరికాకు చెందిన 49 ఏళ్ల డేవ్ కజిన్స్ భారత కాంపౌండ్ ఆర్చర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. డేవ్ కజిన్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు స్వర్ణ పతకాలు సాధించారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో తొలిసారి కాంపౌండ్ విభాగాన్ని (మిక్స్డ్ మాత్రమే) మెడల్ ఈవెంట్‌గా చేర్చారు. మరో రెండు వారాల్లో భారత జట్టుతో చేరనున్న కజిన్స్‌కు నెల వేతనంగా 12,000 డాలర్లు (రూ. 11 లక్షల 53 వేలు) ఇస్తారని సమాచారం.
క్వార్టర్ ఫైనల్లో అష్మిత
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 71వ ర్యాంకర్ అష్మిత చాలిహా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రపంచ 51వ ర్యాంకర్ మాళవికæ, 38వ ర్యాంకర్ దేవిక సిహాగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అష్మిత 21–13, 21–16తోగో జిన్ వె (మలేసియా)పై గెలిచింది. మాళవిక 21–16, 8–21, 15–21తో లినె హొమార్క్ జార్స్‌ఫెల్ట్ (డెన్మార్క్) చేతిలో, దేవిక 16–21, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యు ఫె (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ కణపురం సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12–21, 25–27తో ప్రెస్లీ స్మిత్–జెనీ గాయ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ (భారత్) 14–21, 15–21తో హు కె యువాన్–లిన్ జియాంగ్ యి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు.
ఘోర ఓటమి.. ఐపీఎల్ నుంచి సీఎస్కే అవుట్
ఐపీఎల్-2026 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ముగించింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో సీఎస్కే ఘోర పరాజయం పాలైంది. దీంతో సీఎస్కే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే చెన్నైకు ప్లే ఆఫ్స్ రేసులో ఉండేది. కానీ ఓడిపోవడంతో ఈ ఏడాది సీజన్లో సీఎస్కే కథ ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84), జోస్ బట్లర్ (27 బంతుల్లో 57 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి తలా వికెట్ సాధించారు. ఆ తర్వాత 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. గుజరాత్ బౌలర్ల ధాటికి 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: గుజరాత్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు!.. ఐపీఎల్లో సరికొత్త చరిత్ర
న్యూస్ పాడ్‌కాస్ట్
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
బిజినెస్
సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కోసం.. ఎయిర్టెల్ కొత్త సర్వీస్!
భారతి ఎయిర్టెల్ కంపెనీ తమ వినియోగదారులకు మరింత మెరుగైన మొబైల్ నెట్వర్క్ అనుభవాన్ని అందించేందుకు ''ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్'' అనే కొత్త సర్వీస్ ప్రారంభించింది. చాలామంది జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అంటే.. మార్కెట్లు, ట్రాఫిక్ జామ్‌లు లేదా పెద్ద ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో, వీడియో కాల్స్ నిలిచిపోవడం, ఫోటోలు అప్లోడ్ కావడంలో ఆలస్యం, లేదా ఈమెయిల్స్ డౌన్లోడ్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎయిర్టెల్ ఈ కొత్త సేవను తీసుకొచ్చింది.ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సర్వీస్ అనేది ప్రత్యేకంగా పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చారు. దీనిద్వారా నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా వినియోగదారులకు స్థిరమైన.. వేగవంతమైన ఇంటర్నెట్ అనుభవం లభిస్తుంది. దీనికి కారణం ఎయిర్టెల్ తమ 5జీ నెట్‌వర్క్‌లో చేసిన లేటెస్ట్ టెక్నికల్ అప్‌గ్రేడ్. ఈ సాంకేతికతను స్లైసింగ్ అని పిలుస్తారు.స్లైసింగ్ అనేది ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఉపయోగంలో ఉన్న నెట్వర్క్ టెక్నాలజీ. ఇప్పుడు అదే సదుపాయాన్ని ఎయిర్టెల్ భారతదేశంలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవను పొందడం చాలా సులభం. ఇప్పటికే ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులైతే ఈ సదుపాయం ఆటోమేటిక్‌గా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రీపెయిడ్ వాడుతున్న వారు ఎయిర్టెల్ యాప్ ద్వారా లేదా సమీప ఎయిర్టెల్ స్టోర్‌కి వెళ్లి తమ కనెక్షన్‌ను పోస్ట్‌పెయిడ్‌గా మార్చుకోవచ్చు.అయితే.. ఈ సేవను పూర్తిగా ఉపయోగించాలంటే వినియోగదారుల వద్ద 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అలాగే ఫోన్లో తాజా సాఫ్ట్వేర్ అప్డేట్ ఉండటం అవసరం. ఫోన్లో అప్డేట్ పెండింగ్‌లో ఉంటే, సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్ కనిపిస్తుంది. అదనంగా ఎయిర్టెల్ యాప్ ద్వారా కూడా ఫోన్ ఈ సేవకు సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు.Entering our priority era 💅 https://t.co/GfN7Qzzkrg— airtel India (@airtelindia) May 19, 2026
ఉద్యోగాల కోతలు.. జుకర్‌బర్గ్ వివరణ
టెక్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే మెటా కంపెనీ భారీ స్థాయిలో ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ ప్రభావం 8000 ఉద్యోగులపై పడింది. మరో 7000 మంది ఉద్యోగులను కొత్త టీమ్స్‌కు మార్చింది. అంతే కాకుండా ఖాళీగా ఉన్న 6000 పోస్టులను కూడా భర్తీ చేసే యోచన లేదని సంస్థ స్పష్టం చేసింది.ఈ పరిణామాల తరువాత మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు ఒక మెమో పంపించారు. అందులో.. ఈ ఏడాది పెద్ద స్థాయి ఉద్యోగ కోతలు ఉండవని స్పష్టం చేశారు. అంటే ప్రస్తుత ఉద్యోగ కోతల తరువాత సంస్థ ఉద్యోగులను తొలగించే ఆలోచనలో లేదని తెలుస్తోంది.మార్క్ జుకర్‌బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలను కూడా వివరించారు. కంపెనీ కమ్యూనికేషన్ విషయంలో కొంత స్పష్టత లోపించిందని ఆయన అంగీకరించారు. ఉద్యోగులకు సరైన సమాచారం ఇవ్వడంలో మరింత మెరుగుదల అవసరం ఉందని చెప్పారు. ఏఐ సాంకేతికత భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుందని అన్నారు. సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, కంపెనీలు నిరంతరం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు. ఏఐను మానవ జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే టెక్నాలజీగా ఆయన అభివర్ణించారు.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!ఉద్యోగం కోల్పోయిన వారికి సంస్థ 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనాన్ని సీవెరన్స్ ప్యాకేజీగా అందిస్తుంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని కొనసాగిస్తారు. యూఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులకు వారి దేశాల నిబంధనలను బట్టి దాదాపు ఇలాంటి ప్రయోజనాలే అందుతాయి.
కొత్త పల్సర్ ఎన్160 లాంచ్: ధర ఎంతంటే?
బజాజ్ ఆటో దేశీయ విఫణిలో 'పల్సర్ ఎన్160' కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,22,000 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత బజాజ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.బజాజ్ కొత్త పల్సర్ ఎన్160.. స్టాండర్డ్ సిరీస్ కంటే కూడా ప్రీమియం లుక్, మెరుగైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటివి ఉన్నాయి. ఇవి మరింత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. గోల్డ్ కలర్ USD ఫోర్కులు, ABS టెక్నాలజీ వంటివి ఉన్నాయి.సాధారణ టెలిస్కోపిక్ ఫోర్క్ సెటప్‌తో పోలిస్తే.. USB ఫోర్క్‌లను జోడించడం వల్ల మోటార్‌సైకిల్‌కు మరింత ప్రీమియం ఫ్రంట్-ఎండ్ లుక్ వస్తుంది. బ్రేకింగ్, కార్నరింగ్ లోడ్ల కింద మెరుగైన దృఢత్వాన్ని అందిస్తుంది. ABS బ్రేకులు రైడర్లకు మరింత బలమైన భద్రతను అందిస్తాయి.ఇదీ చదవండి: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. 15 రోజుల్లో 25వేల బుకింగ్స్!ఇకపోతే ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి ఈ వేరియంట్లో స్టైలింగ్ అండ్ రైడర్ సౌకర్యంపై స్పష్టంగా దృష్టి పెట్టారు. ఈ వేరియంట్లో మీకు LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ మరియు రైడర్, పిలియన్‌కు ఎక్కువ స్థలాన్ని అందించే సింగిల్-సీట్ సెటప్ కూడా లభిస్తాయి. పనితీరులో ఎలాంటి మార్పు ఉండదు.
IPL వెలుగులో బెట్టింగ్ ‘చీకటి ఆట’!
ఐపీఎల్ (IPL) సీజన్‌ను ఆసరాగా చేసుకుని భారతీయ క్రికెట్ అభిమానులను పెద్ద ఎత్తున ముంచేస్తున్న ఒక భారీ అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌ను ప్రముఖ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ 'క్లౌడ్‌సెక్' (CloudSEK) బట్టబయలు చేసింది. క్లోన్-స్క్రిప్ట్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్‌ఫేక్స్, హ్యాక్ చేసిన ప్రభుత్వ వెబ్సైట్లు, మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌ల సహాయంతో ఈ ముఠా ఇంతటి భారీ దోపిడీకి పాల్పడుతున్నట్లు సంస్థ తన తాజా పరిశోధనలో వెల్లడించింది.గత వారమే ఐపీఎల్ వీక్షకులను లక్ష్యంగా చేసుకుని నడుస్తున్న నకిలీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను గుర్తించిన క్లౌడ్‌సెక్, తాజాగా ఈ అక్రమ బెట్టింగ్ ఎకానమీ వెనుక ఉన్న చీకటి ప్రపంచాన్ని పూర్తిగా మ్యాప్ చేసింది.పరిశోధనలో తేలిన దిగ్భ్రాంతికర నిజాలు1,200కు పైగా నకిలీ డొమైన్లు: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించడానికి 1,200 కంటే ఎక్కువ వెబ్సైట్ డొమైన్లు యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు క్లౌడ్‌సెక్ గుర్తించింది.ఒక్క బ్యాకెండ్.. 25 వెబ్సైట్లు: పరిశోధకులు ఒక అక్రమ ప్లాట్‌ఫారమ్ అడ్మిన్ ప్యానెల్‌ను యాక్సెస్ చేయగా, కేవలం ఒకే ఒక్క బ్యాకెండ్ సిస్టమ్ నుండి 25కు పైగా వేర్వేరు బెట్టింగ్ వెబ్సైట్లను నడుపుతున్నట్లు తేలింది. దీని ద్వారా యూజర్ల డిపాజిట్లు, బెట్టింగులు, విత్‌డ్రా రిక్వెస్ట్‌లను నిందితులు పూర్తిగా నియంత్రిస్తున్నారు.రూ. 4.65 కోట్ల విత్‌డ్రా నిరాకరణ: మే 2025 నుండి మే 2026 మధ్య కాలంలో, ఈ ఒక్క ప్లాట్‌ఫారమ్‌లోనే వినియోగదారులు చేసుకున్న 9,300 లకు పైగా డబ్బు విత్‌డ్రా రిక్వెస్ట్‌లను ఏజెంట్లు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు. ఇది సాంకేతిక లోపం కాదు, కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో యూజర్ల సొమ్మును నొక్కేసే ప్రక్రియ. దీని విలువ సుమారు రూ.4.65 కోట్లు ఉంటుందని అంచనా.మనీ మ్యూల్ నెట్వర్క్: నిందితులు బిజినెస్ పేరుతో రిజిస్టర్ అయిన కొన్ని బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. యూజర్లు డిపాజిట్ చేసే డబ్బును ఈ ఖాతాల ద్వారా ఇతర చోట్లకు మళ్లించి, అసలు సూత్రధారులు ఎవరో దొరకకుండా జాగ్రత్తపడుతున్నారు.క్రికెటర్ల పేరిట డీప్‌ఫేక్ వీడియోలు: భారతీయ క్రికెటర్లు, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ల ముఖాలను, వాయిస్‌లను ఏఐ (AI) డీప్‌ఫేక్ టూల్స్ ద్వారా క్లోన్ చేసి.. వారు ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు. వీటిని ఇన్స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.ప్రభుత్వ వెబ్సైట్ల హ్యాకింగ్: ప్రజల్లో నమ్మకాన్ని చూరగొనడానికి పలు భారతీయ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను (.gov.in) కూడా హ్యాక్ చేసి, వాటిలో ఈ అక్రమ బెట్టింగ్ లింకులను (Backlinks) చొప్పించారు. గూగుల్ సెర్చ్‌లో ప్రభుత్వ సైట్లకు ఉండే గుర్తింపును వాడుకుని యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు.ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనంలో పడి సామాన్యులు భారీగా నష్టపోవడమే కాకుండా, ఆ తర్వాత వారిని టార్గెట్ చేస్తూ నకిలీ లోన్ యాప్‌ల ద్వారా కూడా వేధింపులకు గురిచేస్తున్నట్లు క్లౌడ్‌సెక్ నివేదిక స్పష్టం చేసింది. క్రికెట్ అభిమానులు ఇలాంటి అనధికారిక, అక్రమ బెట్టింగ్ సైట్లకు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్యామిలీ
వెరైటీల్లో ఘనాపా టీ
‘టీ’ అంటే ‘టీ’ మాత్రమే కాదు. మన ఫ్రెండు. మన ఫ్యామిలీ మెంబర్. స్నిగ్ధ మంచందకు ‘టీ’పై ఉన్న ప్రేమ ‘టీ ట్రంక్’ స్టార్టప్‌తో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌ను చేసింది... భారతదేశపు మొట్ట మొదటి సర్టిఫైడ్ టీ సోమెలియర్గా గుర్తింపు సాధించారు స్నిగ్ధ మంచంద. చాలామందిలాగే ఆమెకు ‘టీ’ అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టంతో టీ గురించి అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఎక్కడా, ఎలాంటి సంస్థలూ కనిపించలేదు. దీంతో తానే ఒక ‘టీ స్కూల్’ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు! అక్కడితో ఆగిపోలేదు. ‘టీ ట్రంక్’ పేరుతో కంపెనీ ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేశారు స్నిగ్ధ.ఆ పేరు అందుకే...‘చిన్నప్పటి నుండి రకరకాల టీ ΄÷డులను సేకరించి, వాటిని నాన్నగారి పాతకాలపు ట్రంకు పెట్టేలో భద్రపరిచేదాన్ని. టీపై అప్పటి నుంచే ప్రేమ మొదలైంది కాబట్టి నా కంపెనీకి టీ ట్రంక్ అని పేరు పెట్టాను’ అంటారు స్నిగ్ధ. కంపెనీ ప్రారంభించిన తరువాత పెద్ద బ్రాండ్లతో పోటీ పడాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆఫ్‌లైన్ పంపిణీ రూట్‌ను నిర్మించడం ఎంత కష్టమో ఆమెకు తెలిసింది.‘మొదట్లో లిస్టింగ్ ఫీజులు, పంపిణీదారుల వైఖరితో మాకు ఇబ్బందిగా ఉండేది. దీంతో మా దృష్టిని ఈ– కామర్స్ వైపు మళ్లించాం. అక్కడ కూడా ఎన్నో సవాళ్లు ఎదురైనా, వాటిని త్వరలోనే అధిగమించి నేరుగా టీ ప్రియుల దగ్గరికి చేరుకున్నాం’ అంటారు స్నిగ్ధ.కోవిడ్ కల్లోలంలో....కంపెనీకి అసలుసిసలు సవాలు కోవిడ్ కల్లోల కాలంలో ఎదురైంది. ‘ఎంత కష్టమైనప్పటికీ కోవిడ్ సమయంలో మా ఉద్యోగులందరినీ కొనసాగించాలని, అందరికీ జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాను. మా ఉద్యోగులలో దాదాపు ప్రతి ఒక్కరూ వారి కుటుంబానికి పోషకులే. ఆ సమయంలో ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఇ–కామర్స్‌పై మరింత దృష్టి పెట్టాము. గత కొన్ని సంవత్సరాలుగా మేము డిజిటల్–ఫస్ట్ బ్రాండ్‌ను నిర్మిస్తున్నాం కాబట్టి మాకు అప్పటికే కస్టమర్ బేస్ ఉంది. గోవాలో ఉండడం వల్ల మేము గ్రీన్ బేస్‌లో ఉన్నాం. లాక్డౌన్ సమయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే మా ఈ–కామర్స్ ఆదాయాన్ని ఎనిమిది రెట్లు పెంచుకోవడానికి మేమందరం చాలా కష్టపడి పనిచేశాం’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు స్నిగ్ధ.ఆ ప్రశ్న అడగాల్సిందే!టీ ప్రియుల నుంచి ఒక ప్రశ్న కోరుకుంటున్నారు స్నిగ్ధ, ‘నేను తాగే టీ ఎక్కడి నుంచి వచ్చింది? అని టీ తాగే వాళ్లు అడిగితే బాగుంటుందని నేను అనుకుంటాను. వైన్లాగే టీ రుచికి సంబంధించి అది ఏ ప్రాంతానికి చెందిందో, దాని ప్రత్యేకత ఏమిటో అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఏదైనా కొన్న ప్రతిసారీ మీ డబ్బు ఒక రైతు జేబులోకి వెళ్తుందా లేదా ఒక పెద్ద బహుళజాతి సంస్థ జేబులోకి వెళ్తుందా అని నిర్ణయించే శక్తి మీకు ఉంటుంది’ అంటారు స్నిగ్ధ. ‘తొలిరోజుల్లోనే పెద్ద స్టార్టప్‌ల గురించి పగటి కలలు కనడం మానేసి, వాస్తవాలను అవగాహన చేసుకుంటూ చిన్న చిన్న అడుగులు వేస్తూ ప్రయాణం ప్రారంభించాలి’ అని ఔత్సాహికులకు సలహా ఇస్తున్నారు స్నిగ్ధ.ప్రతి సీజన్లో వెరై‘టీ’...వ్యాపారం సంగతి సరే, స్నిగ్థాకు ఇష్టమైన టీ ఏమిటి? ‘టీ ప్రియులు ప్రతి ఒక్కరూ సీజన్ ప్రకారం టీ మార్చుకోవాలి. ఉదాహరణకు... వేసవి ప్రారంభంలో నాకు ఇష్టమైనది మందార గ్రీన్ టీ. ఇందులో సోంపు గింజలు ఉంటాయి. ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. మా బోటానికల్ కలెక్షన్స్‌లో మందార పువ్వులు కూడా ఉన్నాయి. ఇవి స్వచ్ఛమైన పువ్వులు కాబట్టి వీటిలో కెఫిన్ ఉండదు. వీటిని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు’ అంటున్నారు స్నిగ్థ. ఇప్పుడు సీన్ మారింది!టీ వ్యాపారం అనేది తరతరాలుగా పురుషులే నడుపుతున్న వారసత్వ వ్యాపారం. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా మేము నిర్మించిన బ్రాండ్‌తో పరిస్థితులు మారాయి. ఇప్పుడు నాకు అతి పెద్ద మద్దతుదారులు, ప్రోత్సాహకులు టీ పరిశ్రమకు చెందిన పురుషులే. టీ ట్రంక్ మన భారతీయ టీల గురించి అవగాహన కలిగిస్తున్న తీరును టీ ఎస్టేట్ యజమానులు అభినందిస్తున్నారు.– స్నిగ్థ మంచంద
లబ్... డబ్బు లయ తప్పొద్దు!
ధరల భయం అంటే... కుటుంబ నిర్వహణ భయం. కుటుంబ నిర్వహణ భయం అంటే... గృహిణి భయం. భర్త సంపాదిస్తాడు సరే... సరిపెట్టాల్సిన బాధ్యత తనదే కదా. అందుకే ఇటీవల ఆదాయం ఉన్నా, లేకున్నా మహిళలు ‘ఫైనాన్షియల్ యాంగ్జయిటీ’తో బాధపడుతున్నారు. దీనిని ఎలా ఎదుర్కొనాలి? రెండు కేస్ స్టడీస్ చూడండి.కేస్ స్టడీ1లత హౌస్‌వైఫ్. వయసు 42 ఏళ్లు. భర్త ప్రైవేట్ ఉద్యోగం. ఇద్దరు పిల్లలు ఇంటర్, డిగ్రీ. నెల జీతం అరవై వేలు. అప్పుల్లేవు, సొంత ఫ్లాట్ ఉంది. కానీ లతకి ప్రతి నెలా ఒకటవ తారీఖు వచ్చిందంటే గుండె దడ. జీతం పడిన వెంటనే లెక్కలు మొదలైపోతాయి. వెచ్చాలు, మెయింటెనెన్సు, ఇంటర్నెట్ బిల్లు, ఓటీటీ బిల్లు, పాలబిల్లు... కరెంట్... వంటగ్యాస్... పిల్లల ఫీజు... భర్తకు పెట్రోలు ఖర్చు, అత్తగారికి మావగారికి పంపాల్సినవి... ‘డబ్బులు సరిపోతాయా... రేపటికి మిగులుతాయా’... దాంతో యాంగ్జయిటీ మొదలు.సింప్టమ్స్యాంగ్జయిటీ వల్ల అదుపులేని చర్యలు మొదలవుతాయి. కూరగాయలు తగ్గించి కొనడం, కొత్త చీర కొనుక్కోకపోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతి గంటకి చెక్ చేయడం, రేపు ఆయన ఉద్యోగం పోతే అని ప్రతి రోజూ ఊహించుకుని ఏడవడం. దాంతో అసిడిటీ, తలనొప్పి, షుగర్ లెవెల్స్ పైకి కిందకి. భర్త ‘అన్నీ నేను చూసుకుంటా కదా’ అన్నా ఆవిడ భయం తగ్గలేదు. ఎందుకంటే సమస్య డబ్బు కాదు, మైండ్ మీద కంట్రోల్ లేకపోవడం. భర్త ఇది చూసి చూసి కౌన్సిలర్‌తో మాట్లాడించాడు. «ధరలు పెరగడం అందరికీ ఉన్న సమస్యే. నీ ఒక్కదానికే కాదు’ అని ఆమెకు అవగాహన కల్పించారు. కౌన్సిలర్ సలహాలతో లత మారింది.లత చేసిన మార్పులు...మనీ డేట్... అంటే నెలకు ఒకసారి భర్తతో కూర్చుని ముప్పై నిమిషాలు లెక్కలు మాట్లాడుకుంది. ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత మిగిలింది... దాచడం, దాపరికం లేదు. ఈ పారదర్శకత వల్ల భయం తగ్గింది. ‘ఎమర్జెన్సీ ఫండ్’ పేరుతో బ్యాంకులో 50 వేలు ఎఫ్.డి. వేసి దానికి ‘హాస్పిటల్/జాబ్ ప్రాబ్లమ్ ఫండ్’ అని పేరు పెట్టుకుంది. ఆ డబ్బు ముట్టుకోకూడదు. ఆ పేరు చూడగానే బుర్రకి ధైర్యం. వర్రీ టైమ్ ఫిక్స్ చేసింది. అంటే రోజంతా డబ్బు గురించి ఆలోచించడం మానేసి సాయంత్రం 6 నుంచి 6:15 వరకు మాత్రమే ‘డబ్బు కష్టాలు’ ఆలోచించేది. టైం అయిపోగానే బలవంతంగా ఆపేసేది. మెల్లగా ఈ మంత్రం పని చేసింది. లత కోలుకుంది. మనం జాగ్రత్తగా ఉంటే అంత ఆందోళన చెందాల్సింది లేదు. అందరితో పాటుగా మనం కూడా ఆర్థిక గండాలను తట్టుకుంటూ ముందుకుపోవచ్చు అని భరోసా కలిగింది.కేస్ స్టడీ 2కవిత వర్కింగ్ ఉమన్. వయసు 35 ఏళ్లు. సింగిల్ విమెన్. తల్లిదండ్రులు, తమ్ముడి చదువు అన్నీ ఆవిడ సంపాదనే. నెల జీతం 80 వేలు. పైకి ‘లేడీ బాస్’. కానీ లోపల మాత్రం వణుకు. కవిత సమస్య ఏమిటంటే ‘గోల్డెన్ హ్యాండ్‌కఫ్స్ యాంగ్జయిటీ’. అంటే జాబ్ నచ్చకపోయినా మానేయలేని పరిస్థితి. బంగారు సంకెళ్లు. ‘నేను ఉద్యోగం మానేస్తే ఇల్లు గడవదు’ అనే ప్రెజర్. బయట పరిస్థితులు బాగా లేవు అనే ఆందోళన.సింప్టమ్స్స్లీప్ రివెంజ్... అంటే నిద్ర మీద పగ. రాత్రి 2 వరకు ఫోన్ చూడటం. ‘పగలంతా నాది కాదు, రాత్రైనా నాది అవ్వాలి’ అనే ఫీలింగ్. ఇంపల్స్ షాపింగ్... అంటే స్ట్రెస్‌లో రెండు వేలు మూడు వేలకు ఆన్ లైన్ షాపింగ్ చేసి, తర్వాత గిల్టీ ఫీల్ అవ్వడం. రిజెక్షన్ సెన్సిటివిటీ:... అంటే బాస్ చిన్న మాట అన్నా ‘నన్ను తీసేస్తారేమో’ అని ఏడవడం. ఫ్యూచర్ బ్లైండ్నెస్... ‘పెళ్లి, పిల్లలు వద్దు. డబ్బు సరిపోదు’ అని జీవితాన్ని పోస్ట్‌పోన్ చేయడం.కవిత కలీగ్ ఇదంతా గమనించింది. కవితను కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లింది. ‘అంతా నార్మల్‌గా ఉన్నా అనవసర ఆందోళనతో బాధపడుతున్నావు’ అని కౌన్సిలర్ చిన్న సూచనలు చేసింది.కవిత చేసిన మార్పులు...ఒన్ పర్సెంట్ రూల్... అంటే తన జీతంలో ఒన్ పర్సెంట్ అంటే 800 తన సంతోషం కోసం అప్పుడప్పుడు ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. కాఫీ, పుస్తకం, మూవీ... ‘నేను కేవలం ఏటీఎం కాదు, మనిషిని’ అని గుర్తుచేసుకోవడానికి స్కిల్ ఇన్సూరెన్స్... అంటే వీకెండ్లో రెండు గంటలు ఫ్రీలాన్స్ కోర్స్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ‘ఈ జాబ్ పోయినా నేను బతకగలను’ అనే ధైర్యం కోసం. జాబ్ కంటే స్కిల్ మీద నమ్మకం పెంచుకుంది. నో–బడ్జెట్ డే... నెలకు ఒక రోజు బడ్జెట్, లెక్కలు, ఫోన్లో బ్యాంక్ బేలెన్స్ చూడకూడదు. ఆ రోజు బుర్రకి హాలిడే. దీనివల్ల మిగతా 29 రోజులు బుర్ర కంట్రోల్లో ఉంటుంది. ఆరు నెలల తర్వాత కవిత మొదటిసారి మూడు రోజులు గోవా వెళ్లొచ్చింది. ‘అదే సంపాదన. ఆరు నెలలు కొంచెం కొంచెం దాచాను. నా వల్ల అయ్యింది’ అని ఏడ్చేసింది ఎయిర్‌పోర్ట్‌లో. డబ్బు భయం ‘పేదవాళ్ల’ సమస్య మాత్రమే కాదు. బ్యాంక్‌లో లక్షలు ఉన్నవాళ్లకు కూడా ఫైనాన్షియల్ యాంగ్జైటీ ఉంటుంది. ఇది పర్సు సమస్య కాదు, ‘పర్సనల్ సెక్యూరిటీ’ ఫీలింగ్ సమస్య. దీన్ని మందులతో కాదు, మనసుతో గెలవాలి.కుటుంబం ఏం చేయాలి?భర్త, భార్య, పిల్లలు... ఇంట్లో అందరికీ బేసిక్ లెక్కలు తెలియాలి. భారం ఒక్కరి మీద పడితే యాంగ్జైటీ వస్తుంది. ప్రతి సమస్యను అందరూ చర్చించుకుంటే ఏవి కొనసాగించాలో ఏవి వదులుకోవాలో అందరికీ తెలుస్తుంది. ఫైనాన్షియల్ యాంగ్జయిటీతో రోజూ ఏడుపు, గుండె దడ, నిద్ర లేకపోవడం రెండు వారాలకు మించి ఉంటే – సైకాలజిస్ట్‌ని కలవండి. డబ్బు ప్లానింగ్ రాకపోతే సెబి రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలవండి. ఇందులో సిగ్గు పడాల్సింది ఏమీ లేదు.
కనిపించని కథ...గాలి బలమెంత!?
వేసవిలో వేడికి చల్లని గాలి మేనికి తగిలితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అదే గాలి ఉదృతమైతే చెట్ల కొమ్మలు ఊగడం, తలుపులు కిటికీలు టపటప కొట్టుకోవడం, తేలిక΄పాటి వస్తువులు ఎగరడం.. ఇవన్నీ చూస్తుంటాం. కానీ, ‘గాలి కంటికి కనిపించదు, ప్రపంచాన్ని మాత్రం కదిలిస్తుంది..’ అంతటి శక్తిమంతమైనది. ఇలా మన కళ్ల ముందు కనిపించే వస్తువులను చూపుతూ, కనపడని గాలిని పరిచయం చేయవచ్చు. పిల్లల వయసును బట్టి, అనేకానేక విషయాలను ఉదహరిస్తూ ‘గాలి’బలం గురించి చెప్పవచ్చు. తెలుసుకోమనవచ్చు. వారికి తెలిసింది తమ క్రియేటివిటీతో చూపమనండి. 1. కనిపించని కథ... గాలి కంటికి కనిపించదు. అయితే చెట్ల కొమ్మలు ఎందుకు ఊగుతాయి, కర్టెన్ ఎందుకు కదులుతుంది, ఉక్క΄ోస్తున్నప్పడు ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది.. ఇవన్నీ చెప్పడంతోపాటు ఒక పేపర్ తీసుకుని నోటితో ఊది కదిలించమనండి. టేబుల్ ఫ్యాన్ ముందు రిబ్బన్ కట్టి ఎలా ఊగుతుందో చూపించండి. కారులో ఏసీ లేకుండా డోర్స్ అన్నీ లాక్ చేసి, కాసేపు ఉంటే ఏమవుతుందో చెప్పమనవచ్చు. ఈ విధానం వల్ల ఊపిరిని నిలిపే ్ర΄ాణవాయువును ఎన్నో రూపాలుగా కళ్ల ముందు ఆవిష్కరింపజేయవచ్చు అనే విషయం పిల్లలకు అర్ధమవుతుంది. 2. విండ్మిల్.. గాలి పటం... గాలి బలంగా ఉంటే విండ్మిల్ ఎలా తిరుగుతుందో చూపించవచ్చు. బెలూన్‌లో గాలి నింపి, బయటకు వదలమని చెప్పవచ్చు. గాలిపటం ఎందుకు ఎగురుతుంది? గాలి లేక΄ోతే ఏమవుతుంది? పక్షులు గాలిని ఎలా ఉపయోగిస్తాయి? పిల్లలతో చిన్న గాలిపటం డ్రా చేయించండి లేదా తయారు చేయించండి. 3. శుభ్రమైన గాలి... వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ గాలిని ఎందుకు కలుషితం చేస్తుంది. చెట్ల వల్ల గాలి ఎలా శుభ్రపడుతుంది? మొక్కల పెంపకం ప్రాధాన్యత, గాలి వేగం పెరిగితే ఏమవుతుంది? తుఫాన్లు ఎలా వస్తాయి, సుడిగాలులు ఎలా ఉత్పన్నమవుతాయి... గాలిపైన ఎవరెన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయదగితే అన్నీ చేయమనండి.4. ఊహలకు రూపం... గాలికి కోపం వస్తే.. ఊహాకథలు చెప్పమనండి. పాటలు పాడమనండి. ఒక చిన్న వ్యాసం రాయమనండి. పంచభూతాలను తమ సృజనాత్మక కోణంలో ఎలా చూపుతారో ఛాయిస్ వారికే ఇవ్వండి. ఈ విధానం వల్ల కాలుష్యకార కాలను పిల్లలు గుర్తించగలుగుతారు. పర్యావరణంలో తమ పాత్రను తెలుసుకోగలుగుతారు. సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. (‘ఫైవ్ ఎలిమెంట్స్’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన.. ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. మెయిల్ ఐడి sakshisummerkids@gmail.com) నిర్వహణ: నిర్మలారెడ్డి(చదవండి: సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...)
సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...
గుర్తు తెలియని వ్యక్తులు నా బ్యాంకు ఖాతాలో 500 రూపాయలు జమ చేశారు. వాళ్లు సైబర్ నేరగాళ్ళు, ఆ నగదు ఆన్లైన్ మోసం ద్వారా వచ్చింది కాబట్టి నా బ్యాంకు ఖాతా కూడా సీజ్ చేస్తున్నాము అని పంజాబ్ సైబర్ క్రైమ్ వారు నా అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. అలా ఫ్రీజ్ చేసేవరకు ఈ 500 నా అకౌంట్లోకి వచ్చాయి అన్న విషయం కూడా నాకు తెలియదు. పంజాబ్ పోలీసులను సంప్రదించగా, వారు చెప్పిన విధంగానే అన్ని పత్రాలను, అఫిడవిట్‌ను – నా వ్యక్తిగత వివరాలతో సహా సమర్పించాను. ఇది జరిగి ఇప్పటికి పదినెలలు అవుతుంది కానీ ఇంతవరకు నా అకౌంట్‌ను రిలీజ్ చేయకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బ్యాంకువారిని అడిగితే పంజాబ్ కోర్టులో కేసు వేసుకోవాలి అని చెప్తున్నారు. పంజాబ్‌కి వెళ్లి కేసులు వేయడం చాలా కష్టం – అంత ఖర్చు పెట్టడం కూడా ఇబ్బంది. సలహా ఇవ్వగలరు. – చీమకుర్తి సునీల్ కుమార్, విజయవాడపంజాబ్ పోలీసులు మిమ్మల్ని నిందితుడిగా చూపిస్తూ ఏదైనా ఎఫ్.ఐ.ఆర్. చేశారా అనే విషయం ముఖ్యమైనది. మీ మీద నేరుగా నింద లేకుండా, మీ పేరును ఎటువంటి ఎఫ్.ఐ.ఆర్.లో నిందారోపితుడుగా చూపించకుండా ఉంటే మీరు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అయితే మీ బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్ హైదరాబాదులో కూడా ఉండాలి. పైన తెలిపిన అంశాలు మీ కేసులో ఉండి ఉంటే, బ్యాంకు వారు చెప్పినట్టుగా పంజాబ్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. పూర్వం కోర్టు పరిధి ఏది వస్తుంది అనే విభేదం కొంత ఉన్నప్పటికీ, అనేక హైకోర్టులు ఇలాంటి బ్యాంక్ ఫ్రీజింగ్ కేసులలో వేరే రాష్ట్రాల పోలీసుల ద్వారా ఫ్రీజ్ చేసిన అకౌంట్లను విడుదల చేయాల్సిందే అని తీర్పులు ఇచ్చాయి. కాబట్టి తెలంగాణ హైకోర్టును రిట్ పిటిషన్ ద్వారా ఆశ్రయించండి. అలా వెళ్ళేముందు మీ ఎకౌంటు ఫ్రీజ్ అయిన కారణానికి గల పత్రాలను, ముఖ్యంగా ఎఫ్.ఐ.ఆర్.ను– పంజాబ్ పోలీసులు బ్యాంకు వారికి పంపిన లేఖలను క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు చెప్పినట్లుగా 500 మాత్రమే మీ అకౌంట్‌కు వచ్చి ఉంటే – అంతమొత్తాన్నే మీ అకౌంట్లో ఫ్రీజ్ /లీన్ ఉంచి మిగతా నగదును వాడుకునేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చే ఆస్కారం ఉంది. లాయర్ గారితో ఈ విషయాలను మాట్లాడండి. ఇలాంటి గుర్తు తెలియని ట్రాన్సాక్షన్లు వచ్చిన వెంటనే బ్యాంకు వారికి లిఖితపూర్వకంగా చెప్పడం కొంతవరకు మిమ్మల్ని కాడుతుంది. - శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )చదవండి: 'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
అంతర్జాతీయం
గాజా ఫ్లోటిల్లా ఘటన.. ఇజ్రాయెల్ కేబినెట్లో చిచ్చు
గాజా ఫ్లోటిల్లా ఘటనపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. గాజాకు మానవతా సాయం అందించేందుకు వెళ్తున్న బృందాన్ని అడ్డుకున్న ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది వాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇటామర్ బెన్-గ్విర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దుమారం మొదలైంది. సుమారు 40 దేశాల నుంచి 50 ఫ్లోటిల్లా(చిన్నపాటి నౌకలు)ల్లో గాజాకు సాయం అందించేందుకు బయల్దేరాయి. అయితే వాటిని అడ్డుకుని మరీ ఇజ్రాయెల్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలను నేలపై మోకాళ్లపై కూర్చోబెట్టి, చేతులు వెనుకకు కట్టి ఉంచారు. ఆ సమయంలో ఒక మహిళ "ఫ్రీ, ఫ్రీ పాలస్తీన్" అని నినదించగా, పోలీసులు ఆమెను బలవంతంగా నేలపై తోసిన దృశ్యాలు కనిపించాయి. మే 20న ఈ ఘటన చోటు చేసుకుంది.ఆ వీడియోను షేర్ చేసిన బెన్-గ్విర్ ఆ కార్యకర్తలను ఎగతాళి చేస్తూ, "వీరంతా హీరోలుగా వచ్చారు.. ఇప్పుడు చూడండి వీరి పరిస్థితి" అని వ్యాఖ్యానించారు. వాళ్లను ఇజ్రాయెల్ నెగెవ్ ఎడారిలోని కెట్జియోట్ జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ככה אנחנו מקבלים את תומכי הטרורWelcome to Israel 🇮🇱 pic.twitter.com/7Hf8cAg7fC— איתמר בן גביר (@itamarbengvir) May 20, 2026ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రతిస్పందనకు దారితీసింది. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్‌ను ఒక సాధారణ భద్రతా చర్యగా చెబుతున్నప్పటికీ.. పెద్ద దౌత్య సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఫ్రాన్స్, కెనడా, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్ రాయబారులను పిలిపించి సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా స్పందించారు. అందులో ఇటలీ పౌరులు కూడా ఉన్నారని.. వాళ్లను అవమానకర పరిస్థితుల్లో ఉంచడం ఎంతమాత్రం అంగీకరించలేనిదని అన్నారు. తక్షణమే ఇజ్రాయెల్ క్షమాపణలు చెప్పాలని.. నిర్బంధిత ఇటాలియన్ పౌరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ జలాల్లో పౌరులను అరెస్టు చేయడానికి ఇజ్రాయెల్‌కు ఏ హక్కు ఉందని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియంగ్ ప్రశ్నిస్తున్నారు. టర్కీ కూడా తమ పౌరుల విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఇటు.. ఈ వీడియో ఇజ్రాయెల్ కేబినెట్లోనే చిచ్చు రాజేసింది. బెన్-గ్విర్ చర్యలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని విదేశాంగ మంత్రి గిదియోన్ సర్ విమర్శించారు. ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కూడా ఫ్లోటిల్లాను అడ్డుకోవడం ఇజ్రాయెల్ హక్కు అని చెప్పినా, వీడియోలో కనిపించిన ప్రవర్తన "ఇజ్రాయెల్ విలువలకు విరుద్ధం" అని వ్యాఖ్యానించారు.ఈ ఘటనతో మరోసారి గాజాలోని మానవతా సంక్షోభం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. యుద్ధం కారణంగా ఎక్కువ మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి శిబిరాల్లో, తాత్కాలిక ఆశ్రయాల్లో జీవిస్తున్నారు. సహాయక సంస్థలు అందిస్తున్న సరఫరాలు అవసరాలకు సరిపోవడం లేదని చెబుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తాము సహాయం అడ్డుకోవడం లేదని, సరఫరాలు పర్యవేక్షణలో గాజాకు చేరుతున్నాయని వాదిస్తోంది. అయితే తాజా ఫ్లోటిల్లా ఘటనతో ఇజ్రాయెల్ ముసుగు తొలగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమెరికాపై చైనా, రష్యా కన్నెర్ర
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపిన కొద్దిగంటలకే బీజింగ్ వేదికగా సమావేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ముక్తకంఠంతో పశ్చిమాసియా యుద్ధాన్ని తప్పుబట్టారు. ఇరాన్‌పై దండెత్తిన అమెరికా, ఇజ్రాయెల్ యుద్దకాంక్షను ముక్తకంఠంతో ఖండించారు. బాధిత ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తూనే అంతర్జాతీయ చమురు సంక్షోభానికి పరోక్షంగా కారణమైన ఇరాన్‌నూ పుతిన్, జిన్‌పింగ్ తప్పుబట్టారు. ఏకపక్షంగా హార్మూజ్‌ను దిగ్బంధించిన అమెరికాతోపాటు సముద్ర మందుపాతరలు పెట్టి ముడిచమురు నౌకల రాకపోకలను స్తంభింపజేసిన ఇరాన్‌పై ఇరుదేశాధినేతలు మండిపడ్డారు. ఈ రెండు దేశాల మొండివైఖరితో ఇంధన సంక్షోభం తలెత్తిందని, ధరలు పెరుగుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్’లో సంయుక్త ప్రకటనలో పలు అంశాలను పుతిన్, జిన్‌పింగ్ ప్రస్తావించారు. ‘‘ఇరాన్‌పై దండెత్తి అమెరికా, ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో అస్థిరతకు మరింత ఆజ్యంపోశారు. ట్రంప్ ప్రతిపాదిత గోల్డెన్‌డోమ్ షీల్డ్ రక్షణ ప్రణాళిక అంతర్జాతీయ భద్రతపై దుష్ప్రభావం చూపుతుంది. ఇకనైనా పశ్చిమాసియాలో శత్రుత్వం సమసిపోయి శాంతిస్థాపన జరగాలి’’ అని సంయుక్త ప్రకటనలో పుతిన్, జిన్‌పింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. అంతకుముందు జిన్‌పింగ్ మాట్లాడారు. చైనా, రష్యాల మధ్య హద్దుల్లేని దృఢానుబంధం కొనసాగుతోందని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా చైనాకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో బుధవారం బీజింగ్‌లో ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ ప్రసంగించారు. ‘‘పశ్చిమాసియాలో శత్రుత్వాలు తక్షణం సమసిపోవాలి. గల్ఫ్ మొదలు పశ్చిమాసియాదాకా యుద్ధాలు ఆగిపోవాలి. ఈ మేరకు చర్చలు, సంప్రతింపుల ప్రక్రియను మరింత వేగవంతంచేయాలి. సంక్షోభం సమసిపోతే ఇంధన సరఫరా, పారిశ్రామిక, సరఫరా గొలుసులు మెరుగవుతాయి. అంతర్జాతీయ వాణిజ్యం మళ్లీ గాడినపడుతుంది’’అని జిన్‌పింగ్ అన్నారు. రష్యాతో బంధంపై జిన్‌పింగ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘పుతిన్ చైనాకు రావడం ఇది 25వ సారి. చైనా–రష్యా సత్సంబంధాన్ని పుతిన్ పర్యటనలు రుజువుచేస్తున్నాయి. కీలక అంశాలపై పుతిన్ బృందంతో విస్తృతస్థాయిలో లోతైన చర్చలు జరిపా. వ్యూహాత్మక చర్చలు ఫలవంతమయ్యాయి. చక్కటి స్నేహపూర్వక ఇరుగుపొరుగు దేశాలుగా మరింత మెరుగైన సహకారం కోసం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం కీలక అంశాల్లో ఏకాభిప్రాయానికొచ్చాం. చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ ఏడాదితో 30 వసంతాలు పూర్తయ్యాయి. ఇంధన భద్రత, డిజిటల్ ఆర్థికవ్యవస్థ, కృత్రిమ మేధ, నవ్య సాంకేతికతల ఆవిష్కరణలో మరింతగా సమష్టిగా దూసుకెళ్లబోతున్నాం’’అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.బంధం సమున్నత శిఖరాలకు: పుతిన్‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్’లో తర్వాత పుతిన్ ప్రసంగించారు. ‘‘జిన్‌పింగ్ నా చిరకాల మిత్రుడు. చైనాలో ఒకసామెత ఉంది. ఒక్క రోజు ఎడబాటు కూడా మూడు వసంతాలను కోల్పోయిన భావన కల్గుతుంది. చైనా, రష్యాల బంధం అలాంటిదే. జిన్‌పింగ్‌ను మళ్లీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పాతికేళ్ల ఇరుదేశాల ‘చక్కటి పొరుగుదేశాల, స్నేహపూర్వక, సహకారం ఒప్పందం’ను మరింతగా విస్తరించేందుకు చైనా ఉత్సాహం కనబరుస్తోంది. ఇరుదేశాల బంధం సమున్నత శిఖరాలకు చేరుతోంది’’అని పుతిన్ అన్నారు.
బంధం బలోపేతం
రోమ్: భారత్, ఇటలీ మధ్య బంధం మరింత బలపడింది. ఇరుదేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2029 నాటికల్లా 20 బిలియన్ యూరోలకు చేర్చాలని నిర్ణయించుకున్నాయి. రక్షణ పారిశ్రామిక రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీ బుధవారం రోమ్‌లో సమావేశమయ్యారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవాలని తీర్మానించారు. పశ్చిమాసియా సంక్షోభం, తద్వారా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మోదీ, మెలొనీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉద్రిక్తతలు సాధ్యమైనంత త్వరగా చల్లారాలని ఆకాంక్షించారు. శాశ్వతమైన శాంతి సాధనకు చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని, స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలని ఇరువురు నేతలు విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌టీఏను త్వరగా అమలు చేయాలి కొన్ని నెలల క్రితం ఖరారైన భారత్–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ద్వారా లభించే అవకాశాలను సది్వనియోగం చేసుకోవాలని మోదీ, వెలొనీ నిర్ణయానికి వచ్చారు. ఆ ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. జార్జియా మెలొనీతో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చినందుకు చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. ‘భారత్–ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025–29’మన భాగస్వా మ్యానికి ఆచరణాత్మక, భవిష్యత్ దృష్టితో కూడిన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుందన్నారు. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 20 బిలియన్ యూరోల లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛ ఉండాలని మెలొనీ స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. భారత్–ఇటలీ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరడం సంతోషంగా ఉందన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలే చోదక శక్తులు భారత్–ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025–29ని సమీక్షించి, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించేందుకు విదేశాంగ మంత్రుల నేతృత్వంలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి భారత్, ఇటలీ అంగీకరించాయి. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, ఇంధనం, కృత్రిమ మేధ(ఏఐ), అరుదైన సాంకేతికతలు, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల విషయంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని మోదీ, మెలోనీ నిర్ణయించారు. రెండుదేశాల భాగస్వామ్యానికి సాంకేతికత, ఆవిష్కరణలే చోదక శక్తులు అని మోదీ స్పష్టంచేశారు. ఏఐ, క్వాంటం, అంతరిక్షం, పౌర అణుశక్తి వంటి రంగాల్లో పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రెండు దేశాల్లోని స్టార్టప్‌లు, పరిశోధనా కేంద్రాలు, పరిశ్రమలను అనుసంధానించడానికి ఇండియా–ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్‌పై పనిచేస్తున్నామని వివరించారు. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం పరస్పర విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. సముద్ర భద్రతా సహకారం, సమన్వయం, సమాచార మారి్పడి, ఉత్తమ పద్ధతులను పెంపొందించే లక్ష్యంతో సముద్ర భద్రతపై ఒక కార్యాచరణ ప్రారంభించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. కొలోజియం సందర్శనమోదీ మంగళవారం రాత్రి ఇటలీకి చేరుకున్నారు. ప్రధాని మెలొనీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ గౌరవార్థం ప్రత్యేక విందు ఇచ్చారు. తర్వాత రోమ్‌లోని ప్రాచీన కట్టడం కొలోజియంను ఇరువురు నేతలు కలిసి సందర్శించారు. వేర్వేరు కీలక అంశాలపై తాము అభిప్రాయాలను పంచుకున్నామని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇదిలా ఉండగా>, ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాలారెల్లాతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, కీలక ఖనిజాలు, ఏఐ, అంతరిక్షం, అణుశక్తి వంటి రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవడంపై చర్చలు జరిపారు. మోదీ యూరప్ పర్యటన బుధవారం ముగిసింది. ప్రధాని మోదీకి ఎఫ్ఏఓ అగ్రికోలాప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక పతకం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) ఆయనను అగ్రికోలా మెడల్‌తో సత్కరించింది. ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో చేసిన విశేషమైన కృషికి గాను మోదీకి ఈ ప్రతిష్టాత్మక పతకం దక్కింది. బుధవారం రోమ్‌లో ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఖూ డాంగ్యూ చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు. ఈ గౌరవం ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను, వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్నవారి కృషిని ప్రతిబింబిస్తోందని మోదీ వెల్లడించారు. ఇది భారతదేశంలోని రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు దక్కిన గొప్ప గౌరవమని అభివర్ణించారు.మెలొనీకి ‘మెలొడీ’ గిఫ్ట్ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలొనీకి మెలొడీ చాక్లెట్ల ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు గాను మోదీకి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ‘‘ప్రధాని మోదీ నా కోసం మంచి బహుమతి తీసుకొచ్చారు. చాలాచాలా మంచి చాక్లెట్లు తెచ్చారు. మెలొడీ అందించారు. ఆయన ఇచ్చిన బహుమతికి ధన్యవాదాలు’’అని పేర్కొన్నారు. తనకు అందిన బహుమతిని చూపిస్తూ మెలొనీ సరదాగా ‘మెలొడీ’అనడంతో మోదీ బిగ్గరగా నవ్వేశారు. మోదీ, మెలొనీలకు మెలొడీతో అనుబంధం ఉంది. ఇద్దరి పేర్ల కలయికతో ఏర్పడిన ‘మెలొ డీ’అనే హ్యాష్‌ట్యాగ్‌ను 2023లో దుబాయ్‌లో జరిగిన కాప్ సదస్సు సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి సృష్టించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాలలో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణల కారణంగా ఈ పదం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 10 అవగాహన ఒప్పందాలు మోదీ–మెలోని చర్చల అనంతరం సైనిక హార్డ్‌వేర్, ప్లాట్‌ఫారమ్‌ల సహ–అభివృద్ధి, సహ–ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తూ భారత్, ఇటలీ దేశాలు ఒక రక్షణ పారిశ్రామిక రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి. అంతేకాకుండా ఉన్నత విద్య, ఇటలీకి భారతీయ నర్సుల రాకపోకల కోసం ఇరు దేశాలు కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేశాయి. అరుదైన ఖనిజాలు, వ్యవసాయం, సముద్ర రవాణా, సముద్ర ఉత్పత్తులు తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా 10 అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) భారత్, ఇటలీ సంతకాలు చేశాయి.
యాప్ద్బాంధవులు
సమస్యను అందరూ గుర్తిస్తారు. కానీ, దాని పరిష్కార మార్గాలను కొందరే కనుగొంటారు. వారు మార్గదర్శకులుగా నిలుస్తారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం, దాడులతో గాజా విధ్వంసమైంది. ఆ ప్రాంతమంతా సంక్షోభంలో నిండిపోయింది. ఆ సంక్షోభంలోనూ కొత్త దారులేస్తూ ఆశలు చిగురింపజేస్తున్నారు అక్కడి యువత. సాంకేతికతతో తమ దేశ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు కోల్పోయినందుకు నిరాశతో ఊసురోమని కూర్చోకుండా తామే కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. గాజా నగరంలోని ‘తాకత్’వర్క్ స్పేస్‌లో ఓ మూలన లాప్టాప్తో కూర్చుని సీరియస్‌గా పనిచేసుకుంటోంది 23 ఏళ్ల సజా అల్ ఘాల్. ఆమె మరో దేశంలోని కంపెనీ కోసం పనిచేయడంలేదు. పాలస్తీనా ప్రజల ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడానికి పనిచేస్తోంది. తన సొంత మొబైల్ యాప్‌ను డెవలప్ చేస్తోంది. ఆమె డెవలప్ చేస్తున్న యాప్ పేరు ‘వాసెల్నీ’(డబ్ల్యూఏఎస్ఈఎల్ఎన్ఐ). అంటే అరబిక్‌లో ‘నా గమ్యాన్ని చేరడంలో నాకు సహాయం చేయండి’అని అర్థం. యుద్ధం తరువాత పాలస్తీనాలో పెరిగిన రవాణా ఖర్చులను తగ్గించడానికి రూపొందించిన రవాణా యాప్. ఈ యాప్ వల్ల ప్రయాణాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. ఉదాహరణకు, ఉదయం 8 గంటలకు అల్–షిఫా నుంచి మధ్య గాజా నగరంలోని అస్–సరయాకు ఎవరైనా ఒక ప్రయాణాన్ని ప్రతిపాదించవచ్చు. ఆ తర్వాత అటుగా వెళ్లాల్సి ఉన్న ఇతర వ్యక్తులు కూడా అదే ప్రయాణంలో చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఖర్చును పంచుకోవచ్చు. జస్ట్ లైక్ క్యాబ్ షేరింగ్ అన్నమాట. తప్పిపోయిన వస్తువులు... సజా తరహాలోనే యుద్ధ సమయంలో సర్వసాధారణమైన మరో సమస్యపై దృష్టి పెట్టారు 26 ఏళ్ల ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గ్రాడ్యుయేట్ బహా అల్మల్లాహి. యుద్ధ సమయంలో ప్రజలు సర్వం కోల్పోయారు. వ్యక్తిగత వస్తువులు, అధికారిక పత్రాలు, ఫోన్లు, బ్యాగులు.. మరెన్నో. వాటి ఖరీదు ఎక్కువేం కాకపోవచ్చు. కానీ, వాటి విలువ ఎక్కువ. జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉన్న వస్తువులై ఉంటాయి. అలా పోగొట్టుకున్న వస్తువుల గురించి సోషల్ మీడియా వేదికల్లో విజ్ఞప్తులు వెల్లువెత్తుతుండటం బహా గమనించారు. పోగొట్టుకున్న, లేదా దొరికిన వస్తువుల కోసం ఒక ప్రత్యేక డిజిటల్ వేదికను సృష్టించాలనే ఆలోచన అతనికి వచి్చంది. అలా డెవలప్ అయ్యిందే ‘రజ్జా’లి’. అంటే అరబిక్‌లో ‘నాకు తిరిగివ్వండి’అని అర్థం. ‘మీకు ఏదైనా దొరికినా లేదా మీరేమైనా పోగొట్టుకున్నా.. దానికోసం ఇక్కడ వెతకండి’అని అన్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగలేదు. యుద్ధం నిరాశ్రయులను చేస్తుండటంతో గాజాలో వలసలు రోజురోజుకు పెరిగాయి. ఈ క్రమంలో కిక్కిరిసిన జనాల మధ్య తమ ఆతీ్మయులను కోల్పోతున్నారు. అలా తప్పిపోయిన పిల్లల కేసులను కూడా చేర్చడానికి భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పిల్లలు తప్పిపోతే, వెంటనే వారి ఫొటో వివరాలతో వెంటనే సమీప ప్రాంతాల ప్రజలకు తక్షణం తెలపడానికి ఈ యాప్ రూపొందించారు. అనేక అడ్డంకులు.. అయితే, యాప్‌ను రూపొందించడంతో సగం పని మాత్రమే పూర్తయ్యింది. వాటిని జనంలోకి విస్తతంగా తీసుకెళ్లడం అసలైన టాస్్క. ఉదాహరణకు, సజా రూపొందించిన వాసెల్నీ యాప్‌ను ఒక వ్యక్తి తెరిచి, అదే సమయంలో అదే మార్గంలో ప్రయాణించడానికి తక్కువ మంది ఉండటమో, అసలు లేకపోవడమో జరిగితే.. అతను ఆ యాప్‌పై విముఖత చూపే అవకాశం ఉంది. అందుకే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, డ్రైవర్లను ధృవీకరించడానికి స్థానిక అధికారుల ఆమోదం అవసరమని సజా అంగీకరిస్తున్నారు. పోగొట్టుకున్న పత్రాలను కనుగొనడానికి తన ప్లాట్‌ఫామ్‌ను విశ్వసించాలంటే అధికారిక సంస్థల సహకారం అవసరమని బహా చెబుతున్నారు. ఇదంతా వారికి ఆర్థిక భారంగా మారింది. ఎందుకంటే, కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలపై ఆధారపడుతున్నాయి. వీటి కొనుగోలు చాలా ఖరీదైన పని. శిక్షణా కేంద్రంగా.. అయితే కేవలం పనిచేసుకోవడానికి కొన్ని సదుపాయాలు, స్థలం మాత్రమే కల్పిస్తే సరిపోదని తొందర్లోనే అర్థమైంది. గాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ టెక్ ప్రపంచం నుంచి యుద్ధం వేరు చేసింది. రెండేళ్లలో టెక్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, గాజాలోని యువత ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగవంతమైన విజృంభణతో.. గాజాలో ప్రోగ్రామర్లు ప్రపంచ మార్కెట్ డిమాండ్లను అందుకోవడంలో వెనుకబడ్డారు. ఈ అంతరాన్ని పూడ్చే శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఫలితంగా, విశ్వవిద్యాలయాలు, స్థానిక, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యంతో ‘తాకత్’ఒక కార్యక్షేత్రం నుంచి శిక్షణనిచ్చే ఇంక్యుబేషన్ కేంద్రంగా రూపాంతరం చెందింది. వీరి నుంచే కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. తమ ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యల అనుభవాల నుంచే ఈ పరిష్కార మార్గాలు కనిపెట్టారు విద్యార్థులు. అయినప్పటికీ, ఈ ప్రాజెక్టులకు మోక్షం కలగాలంటే పెట్టుబడి అవసరం. డెవలపర్లు ప్రధాన ఆర్థిక, సాంకేతిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రతిభను ఆచరణలోకి తీసుకురావడానికి పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులకు ‘తాకత్’... యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తరువాత అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక, ఉన్నా.. విద్యుత్ అందుబాటులో లేకపోవడం, ఇంటర్నెట్ అంతరాయాలతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అవి విలాస వస్తువులుగా మారిపోయాయి. కేవలం విద్యుత్, ఇంటర్నెట్ ఉన్న చోటుకోసం నెలకు రెండొందల షెకెల్స్.. అంటే దాదాపు ఏడువేలు. అలాంటి వారికోసమే కో వర్కింగ్స్పేస్ స్థాపించారు సీఈఓ, ఇంజనీర్ అయిన షరీఫ్ నయీమ్. దాని పేరు ‘తాకత్’. ‘యుద్ధం ప్రారంభంలో మౌలిక సదుపాయాలు ధ్వంసవ్వడంతో చాలాకాలం పాటు కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలాది మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లు పనిచేసే అవకాశం కోల్పయారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు అంతర్జాతీయ కాంట్రాక్టులను పోగొట్టుకున్నారు. పవర్ లేక కొందరు ఆన్లైన్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. వారందరికీ పనిచేసుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో గాజాలో ‘తకాత్’స్థాపించాను’అని నయీమ్ చెబుతున్నారు. యుద్ధ సమయంలో గాజా నగరంలో ఏర్పాటైన ఇది క్రమంగా నుసైరత్, డెయిర్ అల్–బలాహ్ సహా అనేక ప్రాంతాలకు విస్తరించింది. గాజా నగరంలో తన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి, సుమారు 250 మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లకు వసతి కల్పించింది. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం
‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party - CJP) గురించే చర్చ నడుస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే వేగంగా దూసుకుపోతున్న ఈ సరికొత్త వ్యంగ్య (Satirical) ఉద్యమం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వైరల్ ట్రెండ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు తెలుసా?భారతదేశ యువతను అనూహ్యంగా ఆకట్టుకున్న సీజేపీ వెనుక ఉన్న ఆ సంచలనం పేరు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke). ఉద్యోగాలు లేక, సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియా, ఆర్టీఐ (RTI) యాక్టివిస్టులుగా మారి వ్యవస్థపై దాడి చేసే కొంతమంది నిరుద్యోగ యువతను "బొద్దింకలు" (Cockroaches), "సమాజానికి పట్టిన పరాన్నజీవులు" (Parasites) అన్న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఆన్లైన్లో ప్రతిస్పందనగా 30 ఏళ్ల ఈ రాజకీయ ప్రచార వ్యూహకర్త, అభిజీత్ ప్రారంభించిందే కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ఇప్పుడు సునామీలా మారింది. ఆపై సీజేఐ వివరణ ఇచ్చుకున్నప్పటికీ .. ‘బొద్దింక’ అనే పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు అభిజీత్.యువతను అవమానించిన ఆ పదంతోనే సరికొత్త వ్యంగ్య రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. ఫలితంగా సీజేపీ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ వెబ్ సైట్ అండ్ అజెండా తమను తాను "సోమరులు, నిరుద్యోగ యువత పక్షపాతి" (Voice of the lazy and unemployed youth) గా ప్రకటించుకుంది. 'Secular, Socialist, Democratic, and Lazy' అనే ట్యాగ్‌లైన్‌తో నడుస్తున్న ఈ డిజిటల్ పార్టీకి కేవలం ఐదు రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల (1.2 కోట్లు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు వచ్చారు. ఇది దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. దీని ఆవిర్భావం కేవలం జోక్ కాదు.. యువత ఆక్రోశం! ఇంటర్నెట్ జోక్ లాగా మొదలైనప్పటికీ, దేశంలోని నిరుద్యోగం, నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలపై యువతలో ఉన్న అసంతృప్తిని ఈ వేదిక ప్రతిబింబిస్తోంది.పార్టీలో చేరడానికి వింత నియమాలు:కచ్చితంగా నిరుద్యోగి అయి ఉండాలి (బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా). విపరీతమైన సోమరితనం ఉండాలి (శారీరక శ్రమ పరంగా మాత్రమే). రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్లోనే గడపాలి (Chronically Online). ప్రొఫెషనల్‌గా, లాజికల్‌గా వ్యవస్థపై విమర్శలు (Rant) గుప్పించగలిగే నైపుణ్యం ఉండాలి. ఇంతకీ ఎవరీ అభిజీత్ దిప్కే?పూణేలో జర్నలిజం చదివిన అభిజీత్, ఆ తర్వాత అమెరికాలోని ప్రముఖ బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ (PR) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నిరుద్యోగి.Now attempts being made to hack Instagram pic.twitter.com/doFskK9D7Z— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఆమ్ ఆద్మీ నేపథ్యం సీజేపీని ప్రారంభించడానికి ముందు, దీప్కే 2020 - 2023 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించినప్పుడు, దీప్కే రాజకీయ సందేశాలు మరియు యువతను చేరుకోవడంపై దృష్టి సారించిన మీమ్-ఆధారిత డిజిటల్ ప్రచారంపై పనిచేశారు.2024లో తన వ్యక్తిగత ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం కోసం ఆప్ నుండి బయటకు వచ్చి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మేనిఫెస్టోకేవలం మీమ్స్ కే పరిమితం కాకుండా 5 అంశాలతో కూడిన ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. జడ్జీలకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు వంటి రాజకీయ ప్రయోజనాలు కల్పించకూడదు.పార్టీ ఫిరాయింపులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.తాము కూడా ఆర్టీఐ (RTI) పరిధిలోకి వస్తామని, ఎలాంటి అజ్ఞాత విరాళాలు (Electoral Bonds) తీసుకోబోమని స్పష్టం చేయడం. మహువా మోయిత్రా, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖులు సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. సంప్రదాయ రాజకీయాల్లో డబ్బు, అంగబలం ఉన్నవారే రాజ్యమేలుతున్న తరుణంలో.. ఈ జెన్ జెడ్ (Gen Z) యువత కేవలం మీమ్స్, రీల్స్ ద్వారా డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తూ దేశంలోనే సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. As expected Cockroach Janta Party’s account has been withheld in India. pic.twitter.com/44ymllnSMJ— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఇంతలోనే భారీ షాక్మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. ఊహించినట్టే, ' కాక్రోచ్ జనతా పార్టీని ఇండియాలో నిలిపివేశారని పేర్కొన్నారు.
‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఊహించని రీతిలో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార బీజేపీ అధికారిక ఖాతా కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు సృష్టించిన కొద్ది గంటల్లోనే, ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.బీజేపీని దాటేసిన క్రేజ్!కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం 8.7 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న బీజేపీ అధికారిక ఇన్‌స్టా ఖాతాను ఇది అధిగమించింది. కాంగ్రెస్ 13 మిలియన్ల ఫాలోవర్లతో ముందుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వెనుకబడి ఉంది. ఈ మైలురాయిని అందుకున్న కొన్ని గంటల్లోనే ‘సీజేపీ’ ఎక్స్ అకౌంట్‌ను భారత్‌లో బ్లాక్ చేశారు. ‘మేము ఊహించినట్టే జరిగింది’ అంటూ ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ స్పందించారు.సుప్రీం వ్యాఖ్యల నుండి పుట్టిన ఉద్యమంనిరుద్యోగం, పేపర్ లీకేజీలు, రాజకీయాలపై విసుగు చెందిన జెన్-జీ యువత ఆవేదన నుండి పుట్టిన పొలిటికల్ సెటైర్ మూవ్మెంట్ ఇది. గత వారం ఒక కోర్టు విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగులు, ఆన్లైన్ యాక్టివిస్టులను ఉద్దేశించి ‘బొద్దింకలు’,'పరాన్నజీవులు' అని వ్యాఖ్యానించారనే వార్తలతో ఈ ఉద్యమం మొదలైంది. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ, యువత ఈ వినూత్న పార్టీని స్థాపించారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, నకిలీ డిగ్రీల వారినే తానలా అన్నానని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు.సెలబ్రిటీల మద్దతు.. భారీ నెట్వర్క్బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, మాజీ ఆప్ సోషల్ మీడియా కార్యకర్త అయిన 30 ఏళ్ల అభిజీత్ దిప్కే ఈ వినూత్న మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ’ అనే నినాదంతో, కేవలం హాస్యం, మీమ్స్ ఆధారంగా యువతను ఇది విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వైవిధ్యమైన డిజిటల్ ప్రచారానికి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్, టీఎంసీ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా మద్దతు తెలపడం విశేషం.ఇది కూడా చదవండి: ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ!
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు హాట్ చర్చకు దారి తీసింది. గత ప్రభుత్వ హయాంలో అరెస్టై జైల్లో ఉన్న ప్రముఖ యూట్యూబర్ ‘సావుక్కు’ శంకర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. శంకర్‌పై గూండా యాక్ట్‌ను ఎత్తేయాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. దీంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సావుక్కు శంకర్(Savukku Shankar) అనే పేరు తమిళనాడులో రాజకీయాలు, మీడియా, ప్రజాస్వామ్య చర్చల్లోనూ తరచూ వినిపిస్తుంటుంది. సావుక్కు అంటే కొరడా అని అర్థం. విజిల్‌బ్లోయర్‌గా, సిస్టమ్‌కి బలైన వ్యక్తిగా ఆయన అక్కడి జనాలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన నోటి దురుసును విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఆయన ట్రాక్ రికార్డు చెప్పాలంటే.. గత ఐదేళ్ల కాలంలో ఏకంగా తొమ్మిదిసార్లు అరెస్ట్ అయ్యారు ఆయన. ఎవరీ సావుక్కు శంకర్.. ఆచిముత్తు శంకర్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి. విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగంలో క్లర్క్‌గా పని చేశారు. అయితే 2008లో తమిళనాట సంచలనం సృష్టించిన ఆడియో లీక్ కేసులో సస్పెండ్ అయ్యి.. దర్యాప్తు తదనంతరం ఉద్యోగం పొగొట్టుకున్నారు. ఆ స్కాంలో ఓ మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఆపై సావుక్కు అనే వెబ్సైట్, యూట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. అవినీతి, అధికార దుర్వినియోగం బయటపెట్టిన వ్యక్తిగా ఆయనకంటూ తమిళనాట ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమంలో ఆయన నోటి నుంచి నిజాలే వస్తాయని జనం భావించేంతగా పరిస్థితి చేరుకుంది. దీంతో వ్యవస్థ నుంచి ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలపై ఆయన చేసిన విమర్శలు, న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు.. ప్రజల్లో ఒక వర్గానికి ఆయనను ధైర్యవంతుడిగా చూపించాయి. అవినీతి వ్యతిరేకంగా పోరాడే యువత, ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నవారు ఈయనకు మద్దతుగా నిలిచేవారు. అదే సమయంలో.. మహిళలపై నోరు పారేసుకోవడం, వ్యక్తిగత దాడులు ఆయనపై కాస్త నెగెటివిటీని క్రియేట్ చేశాయి. డీఎంకే హయాంలో..2021లో స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శంకర్‌పై వరుసగా కేసులు నమోదయ్యాయి. గూండాస్ యాక్ట్ కింద పలుమార్లు అరెస్టు కావడం, ఎన్డీపీఎస్ కేసులు ఎదుర్కొన్నప్పటికీ, కోర్టులు మాత్రం ఆయన్ని నిర్దోషిగా తీర్పునిస్తూ డీఎంకే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేవి. అంతెందుకు 2024లో, మద్రాస్ హైకోర్టు ఆయనపై ఉన్న ఓ సంబంధించి నిర్బంధాల్ని రద్దు చేసింది. దీంతో.. డీఎంకే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఆయన్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని తమిళ ప్రజలు భావించేవారు. ‘‘తప్పుడు కేసులతో స్టాలిన్ ప్రభుత్వం నా నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ స్వయంగా ఆయన కూడా ఆరోపించేవారు. ఈ ఏడాది పరువు నష్టం కేసులోనూ మద్రాస్ హైకోర్టు ఆయనకు బెయిల్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగానే..2026 ఏప్రిల్‌లో చెన్నై పోలీసులు గూండాస్ చట్టం కింద నిర్బంధం విధించారు. ఏపీలో అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకువచ్చే సమయంలో పోలీసులపై రాళ్లు విసిరారని కేసు పెట్టారు. అయితే ఈ కేసులో ఆయన నిర్దోషి అని విజయ్ ప్రభుత్వం గుర్తించింది. అడ్వైజరీ బోర్డు పరిశీలనలో ఆయన నిర్బంధానికి తగిన కారణం లేదని తేలడంతో విడుదల చేయాలని ఆదేశించింది. ఆయనపై ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. వాటిలో చిక్కులను పరిశీలించాక ఆయన్ని విడుదల చేయాలని పోలీసు శాఖకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడో విషయం ఏంటంటే.. సావుక్కు శంకర్ విజయ్‌నూ వదల్లేదు. కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత తీరును ఏకిపారేస్తూ వీడియో సిరీస్ తీశాడు. వాటికి విపరీతంగా ఆదరణ దక్కింది.
‘బిహార్’ దెబ్బ: బంగ్లా వీడి ఆశ్రమానికి ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం దరిమిలా రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌ను కొత్త నిర్ణయం తీసుకున్నారు. పట్నాలోని విలాసవంతమైన బంగ్లాను వదిలి, ఒక ఆశ్రమానికి తన నివాసాన్ని మార్చారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.షేక్‌పురా హౌస్ ఖాళీ.. ఆశ్రమంలోనే బసదర్భంగాలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ తాను పట్నాలోని పాత నివాసాన్ని ఖాళీ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఐఐటీ పట్నాకు సమీపంలో ఉన్న ‘బిహార్ నవనిర్మాణ ఆశ్రమం’ ఇకపై తన నివాసమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ తన ముద్ర వేసేంత వరకు, అంటే తదుపరి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తాను ఈ ఆశ్రమంలోనే ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇంతకాలం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక ‘షేక్‌పురా హౌస్’ బంగ్లా నుండి కార్యకలాపాలు సాగించారు.ఘోర పరాజయం.. నితీష్‌పై తీవ్ర విమర్శలుఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఘోర పరాభవం తర్వాత పీకే రూట్ మార్చారు. ఇదే సమయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ కుమారుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కావడంపై మండిపడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజల వలసలను ఆపలేని ముఖ్యమంత్రి, తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకు మాత్రం గట్టి పునాది వేసుకున్నారని పీకే ఎద్దేవా చేశారు.ఓటర్లకు పిలుపు.. రూ.10 వేల పథకంపై ఎటాక్కుల మతాలకు, డబ్బు ఆశలకు లొంగకుండా ప్రజలు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయాలని ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ వంటి నాయకుల మాటలకు మోసపోవద్దన్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ కింద సుమారు 1.5 కోట్ల మంది మహిళలకు పంపిణీ చేసిన రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని ఉద్దేశిస్తూ.. కేవలం పదివేల రూపాయల కోసం ఓట్లను అమ్ముకోవద్దని పీకే ఓటర్లను హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ‘నాన్నా.. నీ కల నిజం చేస్తా’.. రాహుల్ భావోద్వేగ ట్వీట్!
ఎన్ఆర్ఐ
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
క్రైమ్
అత్తాపూర్ లో యువతి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్
అత్తాపూర్: రోడ్డుపై అందరూ చూస్తుంగానే అత్తాపూర్‌లో మంగళవారం రాత్రి ఓ యువతిని దుండగులు కిడ్నాప్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. నలుగురు యువకులు నెంబర్ లేని థార్ కారులో జాయ్ హాస్పిటల్ వద్ద యువతిని బలవంతంగా తీసుకొని వెళ్లారని స్థానికులు 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు కారును అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు వెంబడించే ప్రయత్నం చేయగా పరారయ్యారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. యువతి కిడ్నాప్ అయిందా? లేక వేరే కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అమ్మాయి ఇంట్లోనే ఉందిదర్యాప్తులో యువతి ఎవరనేది తెలిసిందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు యువతి మలక్‌పేట్‌లోని ఇంట్లోనే ఉందని తెలుసుకున్నారన్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన సందర్భంగా గొడవ పడ్డారన్నారని... ఆ తరువాత క్యాబ్‌లో బయలుదేరగా అత్తాపూర్‌లోని జాయ్ అస్పత్రి వద్ద దిగిందన్నారు. అక్కడినుంచి స్నేహితులే కారులో తీసుకెళ్లారని వివరించారు. స్నేహితుల స్టేట్మెంటును నమోదు చేశామని తెలిపారు.
బతికి ఉంటే ఇబ్బంది పెడతాడని.. భర్తను చంపేసింది
హైదరాబాద్: కుటుంబ కలహాలతో వేరుగా ఉంటున్న భార్య ఇంటికి పిల్లలను చూడటానికి వచ్చిన భర్తను తమ్ముడు, అతని స్నేహితుడితో కలిసి భార్య విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. వికారాబాద్ జిల్లా హజీపూర్ గ్రామానికి చెందిన గురు వెంకటేశ్ (31) బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటూ హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య, పిల్లలు వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్.. పిల్లలను చూసేందుకు రైతు బజార్ సమీపంలోని డబుల్బెడ్రూం నివాసాల్లో భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు.భర్తను చూసిన స్వప్న ఇక్కడికెందుకు వస్తున్నావు అంటూ తమ్ముడు పాండుతో కలిసి మూడో అంతస్తు నుండి కిందకు తీసుకువస్తూ దాడి చేశారు. అంతటితో ఆగకుండా పాండు తన స్నేహితుడు జగదీష్‌ను పిలిపించుకుని ముగ్గురూ కలిసి మూకుమ్మడిగా దాడిచేశారు. స్పృహ తప్పి పడిపోవడంతో..బతికి ఉంటే మళ్లీ ఇబ్బంది పెడతాడని దాడి చేసి తీవ్రంగా కొట్టి గ్రౌండ్‌ఫ్లోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు గమనించారు. మృతుడి సోదరుడు గురు తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతుని భార్య స్వప్న, ఆమె తమ్ముడు పాండు, అతని స్నేహితుడు జగదీష్‌లపై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు? నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారిస్తున్నట్లు తెలిసింది.
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్‌గా కూడా చాలాకాలం సేవలు అందించారు.
యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య
యర్రగొండపాలెం: తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా నరికి పొలాల్లో ఉన్న బోరు బావిలో పడేసిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీవైఎస్పీ కె.నాగరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెంచు కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు (21) ఈ నెల 13వ తేదీ రాత్రి ఓ 15 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూస్తే బాలికతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆవేశంలో ఇంట్లో ఉన్న అట్లపెనం తీసుకొని యువకుడి తలపై మోదడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు కూడా ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాసన వస్తుండటంతో నిందితులు మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ముక్కలుగా నరికి అక్కడికి సమీపంలోని ప్రైవేటు స్కూలు వెనుక వైపు పొలాల్లో ఉన్న ఒక బోరుబావిలో పడేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆంజనేయులు కనిపించకుండా పోయాడని అతని బావ చెల్లె వెంకటరావు ఈ నెల 16న ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ కె.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు సెల్ ఆధారంగా బాలిక ఇంటి వద్ద అదృశ్యమైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్నబాలిక తల్లిదండ్రులకు పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు. వారి కుమార్తెను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ కె.అజయ్‌కుమార్, ఎస్సై ఎం.దేవకుమార్‌లను ఆయన అభినందించారు. బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా డీవైఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మృతుడు ఆంజనేయులు బంధువులు పోలీస్ స్టేషన్లో గొడవకు దిగారు. వెంటనే బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీయాలని, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వీడియోలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!
క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం
పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం
గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..
నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు
బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి
బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి
మరో వివాదంలో సీఎం విజయ్


