భారత పర్యటనకు ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రూబియో స్పష్టం చేశారు. "భారత్‌కు మాకు ఒక గొప్ప మిత్రదేశం. ఎన్నో ఏళ్లగా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్‌లో అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను.
ఈ పర్యటన మాకు అత్యంత కీలకం. విదేశాంగ మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా మొదటి సమావేశం క్వాడ్ కూటమితోనే జరిగింది. ఇప్పుడు ఆ సమావేశాన్ని భారత్‌లో నిర్వహించబోతుండటం సంతోషంగా ఉంది.
ఈ ఏడాది చివర్లో మరోసారి క్వాడ్ సమావేశం నిర్వహించనున్నాము. అయితే భారత్ ఎంత పరిమాణంలో ఇందనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే.. అంత మొత్తంలో విక్రయించడానికి మేము సిద్దంగా ఉన్నాము. న్యూఢిల్లీ మా 'పోర్ట్‌ఫోలియోలో ఒక పెద్ద భాగంగా' ఉండాలని కోరుకుంటోందని" మార్కో రూబియో గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
అదేవిధంగా పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఇంధన భద్రత కల్పించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా రూబియో మే 23న భారత్‌కు చేరుకోనున్నారు. తొలుత కోల్‌కతాలో మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌ను ఆయన సందర్శిస్తారు. నంతరం ఆగ్రా, జైపూర్‌లను సందర్శించి.. న్యూఢిల్లీ చేరుకుంటారు.


