ఐటీసీ లాభం రూ. 5,470 కోట్లు  | ITC Net profit 5,469. 74 crore in Q4 Results | Sakshi
Sakshi News home page

ఐటీసీ లాభం రూ. 5,470 కోట్లు 

May 22 2026 12:43 AM | Updated on May 22 2026 12:43 AM

ITC Net profit 5,469. 74 crore in Q4 Results

ఆదాయం రూ. 23,626 కోట్లు 

షేరుకి రూ. 8 తుది డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 5,470 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 21,018 కోట్ల నికర లాభం సాధించింది. క్యూ4లో ప్రొడక్టుల విక్రయ ఆదాయం రూ. 23,626 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ. 17,348 కోట్లుగా నమోదయ్యాయి. 

అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో ఇవి రూ. 14,279 కోట్లుకాగా.. విమ్కో, శ్రేష్ట నేచురల్‌ బయోప్రొడక్ట్స్‌ విలీనం పూర్తయినట్లు ఐటీసీ వెల్లడించింది. దీంతో ఫలితాలు పోల్చతగదని పేర్కొంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 8 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 27 రికార్డ్‌ డేట్‌కాగా.. ఇప్పటికే(ఫిబ్రవరిలో) రూ. 6.5 చెల్లించిన సంగతి తెలిసిందే. పూర్తి ఏడాదికి రూ. 92,339 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది. డైరెక్టర్, స్వతంత్ర డైరెక్టర్‌గా 2026 డిసెంబర్‌ 20 నుంచి మరో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించేందుకు హేమంత్‌ భార్గవను బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది. 

ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్‌ఈలో యథాతథంగా రూ. 308 వద్ద ముగిసింది.  

Advertisement
 
Advertisement
Advertisement