ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..ట్రంప్ ఫస్ట్ చాయిస్ ఈయనేనట!
వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై ఆకస్మిక దాడి, అప్పటి సుప్రీం నాయకుడు అలీ ఖమేనీని హతమార్చిన తరువాత టెహ్రాన్‌లో పాలన మార్పు అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాలో ఒక కీలక భాగంగా ఉంది. ఆ దాడుల తొలినాళ్లలో, ఇరాన్ తదుపరి నాయకుడు ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచే రావాలని ట్రంప్ పదేపదే మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించి ట్రంప్ వ్యూహం తాజాగా తెరపైకి వచ్చింది.ఇరాన్ టాప్ లీడర్ కోసం ట్రంప్ మనసులోని ప్రత్యేకమైన, అత్యంత ఆశ్చర్యకరమైన వ్యక్తి మరెవ్వరో కాదు ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్. కొత్త ఇరాన్ ప్రభుత్వానికి నాయకుడిగా ట్రంప్ ఎంచుకున్న అహ్మదీనెజాద్ కఠినమైన, ఇజ్రాయెల్ వ్యతిరేక, అమెరికా వ్యతిరేక అభిప్రాయాలకు పేరుగాంచిన వ్యక్తి కావడం గమనార్హం.ఈ విషయంపై సమాచారం అందుకున్న అమెరికా అధికారులను ఉటంకిస్తూ, మంగళవారం 'ది న్యూయార్క్ టైమ్స్' నివేదిక ప్రకారం... ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్‌ను దేశానికి కొత్త నాయకుడిగా తిరిగి నియమించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ మరియు అమెరికా 'ఆపరేషన్ రోరింగ్ లయన్' ,'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్లను చేపట్టాయి. ఇరాన్‌కు నాయకత్వం వహించి, "ఇరాన్ రాజకీయ, సామాజిక , సైనిక పరిస్థితిని" నిర్వహించగల సమర్ధుడిగా అమెరికన్లు అహ్మదీనెజాద్‌ను భావిస్తున్నారని ఆయన సహచరుడు ఒకరు మీడియాకు తెలిపారు.ఈ సాహసోపేతమైన ప్రణాళికను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో గాయపడిన అహ్మదీనెజాద్‌ను ఈ ప్రతిపాదన కోసం సంప్రదించారని, అయితే ఆ తర్వాత ఈ ప్లాన్ బెడిసికొట్టిందని నివేదిక సూచించింది. 2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయనను ఒక హాలోకాస్ట్ నిరాకరిణిగా,అణుబాంబు పిచ్చివాడిగా, అప్పటికే విసిగిపోయి ఉన్న దేశంపై ఇస్లామిక్ విప్లవ భావజాలాన్ని బలవంతంగా రుద్దిన వ్యక్తిగా చాలామంది భావిస్తారు. అలాగే అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మతతత్వ ఫాసిజానికి చిహ్నంగా కనిపించడమే కాదు, ఒకానొక సమయంలో ఆయన "ఇజ్రాయెల్‌ను ప్రపంచ పటంలోనే లేకుండా తుడిచేయాలి" అని కూడా పిలుపు నిచ్చారు.గత దశాబ్ద కాలంగా ఆయన ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకిగా మారిపోవడంతో ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఆయనను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికారికంగా నిషేధించింది. అంతేకాదు ఆయన ఇస్లామిక్ ప్రభుత్వం నిఘాలో కూడా ఉన్నారు.'ది అట్లాంటిక్' నివేదిక ప్రకారం, యుద్ధం ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే, ఇరాన్ ప్రభుత్వం అహ్మదీనెజాద్ ఇంటి వద్ద బాడీగార్డులను కాపలా పెట్టింది. పేరుకు ప్రముఖ పౌరుడి రక్షణ కోసమే అయినా, అసలు ఉద్దేశం ఆయనపై నిఘా ఉంచడమే. అయినప్పటికీ, ఇరాన్లో ఆయనకు ఇంకా ఆదరణ ఉంది, అందుకే అక్కడి ప్రభుత్వం ఆయన పట్ల అప్రమత్తంగా ఉంటుంది.యుద్ధం మొదటి రోజున అహ్మదీనెజాద్ ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ దాడి ఉద్దేశం ఆయనను గృహ నిర్బంధం నుండి విడిపించడమే. ఆయన ఆ దాడి నుండి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఈ క్షిపణి దాడి తర్వాత పాలనా మార్పు ప్రణాళికపై ఆయన విరక్తి చెందారని అమెరికా అధికారులు మరియు అతని సహచరుడు ఒకరు తెలిపారు. అప్పటి నుండి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే వివరాలు తెలియవు. టెహ్రాన్‌లో నాయకత్వ మార్పు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని ఆయన సొంత సహాయకులే కొందరు విశ్వసించడం లేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: రోమ్‌లో ‘మెలోడీ’ రీయూనియన్ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్‌ల సునామీవైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ఈ విషయంపై స్పందిస్తూ... "మొదటి నుండి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) పై ప్రెసిడెంట్ ట్రంప్ తన లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయడం, వాటి ఉత్పత్తి కేంద్రాలను కూల్చివేయడం, వారి నౌకాదళాన్ని ముంచేయడం మరియు వారి ప్రాక్సీలను బలహీనపరచడం. అమెరికా సైన్యం తన లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా అధిగమించింది, ఇప్పుడు మా చర్చల ప్రతినిధులు ఇరాన్ అణుసామర్థ్యాలను శాశ్వతంగా నాశనం చేసే ఒప్పందం కోసం కృషి చేస్తున్నారు" అని తెలిపారు. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.అహ్మదీనెజాద్ ఎందుకు ?వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను బంధించడంలో ట్రంప్ విజయం సాధించారు. ఇదే నమూనాను ఇరాన్లో కూడా పునరావృతం చేయవచ్చని ట్రంప్ భావించినట్లు తెలుస్తోంది. అలాగే మదురోను తొలగించిన తర్వాత వెనిజులాలో అధికారం చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్ లాంటి వ్యక్తిగా అమెరికా అహ్మదీనెజాద్‌ను చూసి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ
'కూతురు' అత్తారింటికి అప్పగించే వస్తువా?
మాజీ మిస్ పూణే ట్విషా శర్మ మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నోయిడాకు చెందిన 33 ఏళ్ల ఈమె, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌ను వివాహం చేసుకున్న తర్వాత, మే 12న అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగా..ట్విషా కుటుంబం, ఆమె అత్తగారి కుటుంబాల మధ్య ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. అదీగాక ఈ విషాద ఘటనపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించారు కూడా. తాజాగా ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా ఈ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేసుపై తీవ్రంగా స్పందించారు. ఆమె ఎక్స్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. కూతుళ్ల పట్ల భారతీయ కుటుంబాల మనస్తత్వంపై విమర్శలు గుప్పించారు. వాళ్లు కూతుళ్లను ఒక వస్తువుల్లా చూస్తారని, ముఖ్యంగా అత్తారింటికి పంపే సరుకులా చూస్తారని అన్నారామె. కన్యాదానం తర్వాత కూతురు అత్తగారింట్లో మృతి చెందడం గౌరప్రదం కదా అంటూ ఆక్రోశించారు. పెళ్లితోనే తల్లిదండ్రులు కూతుళ్లను తిరిగి తెచ్చుకోకూడని ఓ వస్తువులాంటి వారు కదా అని వ్యగ్యంగా మాట్లాడారు. Twisha's death is proof that many Indian parents think their daughter is a commodity that is delivered to the in-laws and has no return policy. The girl can die at the In-laws. That is only honorable after Kanya Daan. Ok?— Chinmayi Sripaada (@Chinmayi) May 19, 2026 అలాగే బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో వెలుగుచూసిన వరకట్న వేధింపుల కేసులు, మరణాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్ట్‌లో వివాహానికి ముందే ఆర్థిక స్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ పెళ్లైన యువతుల గురించి ఎన్నో విషాద వార్తలు వస్తున్నాయి. పెళ్లైన ఈ యువ, విద్యావంతులైన మహిళల్లో చాలామంది, విషాదాలు జరగకముందే ఊపిరాడనంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయమని తమ తల్లిదండ్రులను వేడుకుంటున్నారు. కానీ భారతీయ సమాజం కూతుళ్లను పెళ్లయ్యాక వదిలేయడానికి ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఎవరి మాట వినొద్దు..మీరు జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోండి లేదంటే మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ముందుకురారు అని యువతకు హిత బోధ చేశారామె. View this post on Instagram A post shared by Bollywood Bubble (@bollywoodbubble) (చదవండి: థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమూ..)
బీజేపీ రాజకీయం.. కేంద్ర కేబినెట్లో సమూల మార్పులు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు అధికార బీజేపీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మంత్రివర్గ విస్తరణ తథ్యమంటూ ఢిల్లీలో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీతోపాటు ప్రభుత్వంలోనూ కొత్త సమీకరణాలకు బీజేపీ అధిష్టానం తెరలేపే అవకాశముందని సమాచారం.ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 21వ తేదీన పూర్తిస్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై రేపటి కేబినెట్ సమావేశంలో సమీక్ష జరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాంలో మెరుగైన ఫలితాలు సాధించడం, పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2027లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త మంత్రివర్గం, పార్టీ జాతీయ బృందం రూపుదిద్దుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువత, మహిళల్లో కొత్త వారికి అవకాశం కలి్పస్తూ, కొంతమంది సీనియర్ నేతలను పార్టీ సంస్థాగత బాధ్యతలకు అప్పగించేలా కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని రెండోసారి అధికారం చేపట్టాక 2.0 ప్రభుత్వంలో 2021 జూలైలో కేబినెట్లో భారీ మార్పులు చేపట్టారు. మొత్తం 12 మంది మంత్రులను తప్పించారు. కొత్తగా 36 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
విజయ్‌కు కొత్త టెన్షన్!
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీవీకే విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే త్వరలో తమిళనాడు కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో, విజయ్ మంత్రి వర్గంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే ఎమ్మెల్యేలు చేరనున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు సమాచారం.కాగా, తమిళనాడు ప్రభుత్వానికి అటు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, అన్నాడీఎంకే రెబల్స్‌కు మంత్రి పదవులు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరికను సీపీఎం వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటామని సీఎం విజయ్‌కు అల్టిమేటం విధించినట్టు సమాచారం. దీంతో, సీఎం విజయ్‌కు కొత్త టెన్షన్ ప్రారంభమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా.. సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్‌కు సీఎం విజయ్ నివాళులు అర్పించం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్‌ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్‌కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్‌గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసిందికాంగ్రెస్ ఏం చెబుతుంది?రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్‌కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్‌తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది.డిఫెన్స్‌లో టీవీకే.. ఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే కాదని, శ్రీలంకలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది. అయితే, సీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మళ్లీ యుద్ధం: ఇప్పుడు ట్రంప్ ముందున్న 2 మార్గాలివే..
కేన్స్‌లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్ లుక్..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?
అమరావతికి రాష్ట్ర ఖజానా నిధులు విడుదల చేసిన బాబు సర్కార్
పడిలేచిన స్టాక్ మార్కెట్లు..
అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
గ్రేట్ డైరెక్టర్ ఓటీటీ ఎంట్రీ.. ఏటీఎం దొంగతనం స్టోరీతో
రామ్‌కు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో చై మూవీ!
చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్!
ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేర్ల అర్థమిదే!
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..ట్రంప్ ఫస్ట్ చాయిస్ ఈయనేనట!
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
మమతకు సీఎం సువేందు ఝలక్
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
మళ్లీ యుద్ధం: ఇప్పుడు ట్రంప్ ముందున్న 2 మార్గాలివే..
కేన్స్‌లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్ లుక్..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?
అమరావతికి రాష్ట్ర ఖజానా నిధులు విడుదల చేసిన బాబు సర్కార్
పడిలేచిన స్టాక్ మార్కెట్లు..
అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
గ్రేట్ డైరెక్టర్ ఓటీటీ ఎంట్రీ.. ఏటీఎం దొంగతనం స్టోరీతో
రామ్‌కు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో చై మూవీ!
చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్!
ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేర్ల అర్థమిదే!
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..ట్రంప్ ఫస్ట్ చాయిస్ ఈయనేనట!
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
మమతకు సీఎం సువేందు ఝలక్
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
ఫొటోలు
శ్రీవారి సేవలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ దంపతులు (ఫోటోలు)
వరుసగా శుభవార్తలు చెప్తున్న షణ్ముఖ్ జశ్వంత్ (ఫోటోలు)
ఆంధ్రప్రదేశ్ : మనసు దోచే సిద్ధలయ్య కోన ఎక్కడో తెలుసా ?
#HBDJrNTR : జూ.ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ HD స్టిల్స్
'రమణి కళ్యాణం' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా 'ఫస్ట్ టైమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'పెద్ది' కోసం జాన్వీ కపూర్ రెడీ అయిందిలా (ఫొటోలు)
రాశీ ఖన్నా గ్లామర్ ఫోటోషూట్
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
మంచు మనోజ్ కొత్త ట్రస్ట్ ప్రారంభం (ఫొటోలు)
సినిమా
రిలేషన్లో వన్ టైం చీటింగ్ తప్పేం కాదు: రకుల్
తెలిసో తెలియకో ఏదో ఒకసారి చీటింగ్ చేస్తే తప్పేం కాదంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అలా అని మోసం చేయడాన్ని తాను సమర్థించడం లేదని చెప్తోంది. రకుల్ కథానాయికగా నటించిన తాజా చిత్రం 'పతీ పత్నీ ఔర్ వో దో'. ఇటీవల రిలీజైన ఈ హిందీ సినిమా ఇప్పటివరకు రూ.30 కోట్లకు పైగా రాబట్టింది. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. మోసం చేస్తే?ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్లు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పార్ట్నర్ మోసం చేస్తే ఒప్పుకుంటారా? అన్న ప్రశ్నకు ముగ్గురూ విభిన్నంగా స్పందించారు. మొదటగా సారా అలీ ఖాన్.. మోసం చేయడం సరికాదు, కానీ మోసం జరిగితే మాత్రం కచ్చితంగా సారీ చెప్పాలి అంది. దానికి రకుల్ కూడా అవునని వంత పాడింది. అయితే ఆయుష్మాన్ ఖురానా మాత్రం పెళ్లయ్యాక ప్రత్యేక షరతులుంటాయి. మానవ సహజంఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి, దానికి బాధపడుతూ నిజాయితీగా సారీ చెప్పినప్పుడు క్షమించేయడమే ఉత్తమం. మనిషన్నాక చిన్నపాటి పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. వాటిని పెద్దగా చూడకూడదు. అయితే పొరపాట్లు చేయడమే పనిగా పెట్టుకోవడం మాత్రం సరికాదు అన్నాడు. అలాగైతే ఒకసారి చీట్ చేస్తే క్షమించేయొచ్చా? అని సారా అడగ్గా కుదరదని రకుల్ బదులిచ్చింది.అది సరికాదుకానీ, అంతలోనే మళ్లీ మాట మార్చేసింది. 'ఎవరైనా అనుకోకుండా పొరపాటు చేస్తే మాత్రం క్షమించేయొచ్చు. ఎందుకంటే జీవితం చాలా పెద్దది. ఒక్క పొరపాటు చేసినందుకు జీవితాంతం అవతలి వ్యక్తిని క్షమించకుండా ఉండటం కరెక్ట్ కాదు. అలా అని ఇది నా జీవితానికి, నా భర్తకు వర్తించదు' అని రకుల్ పేర్కొంది.చదవండి: జైలులో పెళ్లిరోజు.. ఏదేమైనా నీ చేయి వదలను: దర్శన్ భార్య
ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి రాజీనామా.. ఆ కారణం వల్లే..
తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవి నుంచి ఏషియన్ మూవీస్ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ వైదొలిగారు. ఈ మేరకు ఛాంబర్ ప్రతినిధులకు మంగళవారం రాత్రి ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.నావల్ల కాదు'కొందరు కార్యవర్గ సభ్యులను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి నేను పని చేయలేను. అలాగే నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ఛాంబర్ ఎప్పుడూ ఏకాభిప్రాయంతో నడవాలి. ప్రస్తుతం అలా జరగడం లేదు' అని ఫిలిం ఛాంబర్‌కు రాసిన లేఖలో సునీల్ నారంగ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. సునీల్ నారంగ్ రాజీనామాను ఫిలిం ఛాంబర్ ఆమోదించింది.అసలేంటి వివాదం?ఇటీవల టాలీవుడ్లో పర్సంటేజీ (కమిషన్) విధానంపై వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే! సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరగా అగ్రనిర్మాతలు అంగీకరించడం లేదు. కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు జరుగుతున్న పర్సంటేజీ వివాదమే సునీల్ రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామాతెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త సునీల్ నారంగ్ రాజీనామా చేశారు.ఆయన సమర్పించిన రాజీనామా లేఖను ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించి ఆమోదించింది. pic.twitter.com/0HUtwHeKFC— Telangana State Film Chamber Of Commerce (@TelanganaFilm) May 20, 2026 చదవండి: ఆస్పత్రిలో అమితాబ్?
ఆస్పత్రిలో అమితాబ్? మౌనంగా ఉంటే ఇలాగే రెచ్చిపోతారు!
లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిపాలయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. శనివారం సాయంత్రం కడుపునొప్పితో బాధపడుతున్న బిగ్‌బీ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరాడని, అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నాడని సదరు వార్తల సారాశం. దీంతో అభిమానులు బిగ్‌బీకి ఏమైందని ఆందోళన చెందుతున్నారు.అసలేమైంది?కాగా బిగ్‌బీకి కూలీ సినిమా (1983) చిత్రీకరణ సమయంలోనే కడుపు నొప్పి సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఆయన నిజంగానే ఆస్పత్రిలో ఉన్నాడా? అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. అయితే ఈ ప్రచారం అంతా ఉట్టిదేనని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ప్రతి ఆదివారంలాగే మొన్నటి ఆదివారం కూడా తన నివాసం బయటకు వచ్చి అభిమానులకు ఆప్యాయంగా నమస్కరించాడు. భయం మటుమాయంఅందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఎప్పటిలాగే నా శ్రేయోభిలాషలను కలిసేందుకు నేను ఇంటి నుంచి బయటకు వస్తాను. ఆ సమయంలో నాలో ఒక ప్రశ్న తలెత్తింది. వారు నిజంగానే బయట ఉన్నారా? ఒకవేళ ఉన్నా నన్ను కలవడానికి వచ్చారా? లేదా హేళన చేసేందుకు వచ్చారా? అని ఒకింత భయం వేసింది. కానీ బయటకు వస్తుండగానే వారి కేరింతలు నాలోని భయాన్ని మటుమాయం చేశాయి. నాలో సంతోషాన్ని రెట్టింపు చేశాయి. పిల్లలు, పెద్దలు.. ఇలా అందర్నీ చూసేసరికి మనసుకు తేలిక. నిజంగా నేనెంత అదృష్టవంతుడిని అని రాసుకొచ్చాడు.మౌనంగా ఉంటేనే..ఇక రొటీన్ చెకప్‌లో భాగంగానే అమితాబ్ ఆస్పత్రికి వెళ్లి వచ్చాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్‌బీ.. బుధవారం నాడు తన బ్లాగ్‌లో హిందీలో ఓ పద్యం రాసుకొచ్చాడు. 'గద్ద మౌనంగా ఉన్నప్పుడే రామచిలకలు మాట్లాడటం మొదలుపెడతాయి. నచ్చిన విందు ఆరగిస్తాయి. బ్రెడ్డు, ధాన్యపు గింజలు నోట్లో పడగానే కాకుల్లా అరవడం మొదలుపెడతాయి' అని దాని సారాంశం. బహుశా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్‌పై బిగ్‌బీ ఇలా కౌంటరిచ్చాడేమో! ప్రస్తుతం బిగ్‌బీ కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కనిపించనున్నాడు.చదవండి: జైల్లోనే దర్శన్ పెళ్లిరోజు.. భార్య ఎమోషనల్ పోస్ట్
రామ్‌కు నో చెప్పిన పుష్ప విలన్!
ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న మూవీ వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ ప్రకటించారు. ఈ మూవీలో రామ్ వీర పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం స్పెషల్‌గా మేకోవర్ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.హీరోయిన్ సరే, విలన్ ఎవరు?అలాగే నటీనటుల ఎంపికపైనా రామ్ దృష్టి సారించాడట! ఈ మూవీలోని హీరోయిన్ పాత్రకు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని సంప్రదించినట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర కోసం మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, తమిళ నటుడు, దర్శకనిర్మాత ఎస్జే సూర్యలను అనుకుంటున్నారట. కాకపోతే పుష్ప తర్వాత ఫహద్ ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాలు చేస్తున్న అతడు రామ్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి రామ్‌కు జోడీగా శ్రీనిధి, విలన్‌గా ఎస్జే సూర్య నటిస్తారేమో చూడాలి!
క్రీడలు
పాకిస్తాన్‌ను చిత్తు చేసే దిశగా బంగ్లాదేశ్ అడుగులు
సిల్హెట్: బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో... పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ చేసేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పరాజయం పాలైన పాకిస్తాన్... రెండో మ్యాచ్‌లో కాస్త పోరాడినా ప్రస్తుతం పరాజయం అంచునే ఉంది. 437 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్... మంగళవారం ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. సిరీస్ సమం చేయాలంటే... బుధవారం చివరి రోజు చేతిలో మూడు వికెట్లు ఉన్న పాకిస్తాన్ ఇంకా 121 పరుగులు చేయాల్సి ఉంది. సల్మాన్ ఆఘా (102 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (134 బంతుల్లో 75 బ్యాటింగ్; 8 ఫోర్లు), కెపె్టన్ షాన్ మసూద్ (116 బంతుల్లో 71; 8 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు. ఓపెనర్లు అజాన్ అవైస్ (21), అబ్దుల్లా ఫజల్ (6) ఎక్కువసేపు నిలవలేకపోడంతో ఛేదనలో పాకిస్తాన్‌కు శుభారంభం దక్కలేదు. 41/2తో కష్టాల్లో పడ్డ జట్టును బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి షాన్ మసూద్ కాపాడే ప్రయత్నం చేశాడు. మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించిన అనంతరం బాబర్ అవుట్ కాగా... ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. సౌద్ షకీల్ (6) విఫలమయ్యాడు. దీంతో ఒకదశలో 133/2తో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్ కాసేపటికి 162/5తో కష్టాల్లో పడింది. ఇక పాక్ పని అయిపోయినట్లే అనుకుంటున్న దశలో సల్మాన్, రిజ్వాన్ చక్కటి పోరాటం కనబర్చారు. బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ జంట ఆరో వికెట్‌కు 134 పరుగులు జోడించింది. దీంతో కోలుకున్న పాకిస్తాన్ 296/5తో మ్యాచ్‌ను ముగించే స్థితికి చేరింది. అయితే పట్టు వదలకుండా ప్రయత్నించిన బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం చివర్లో సల్మాన్‌తో పాటు హసన్ అలీ (0)ని తన వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... రిజ్వాన్‌తో పాటు సాజిద్ ఖాన్ (8 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో ఎడమ చేతివాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 4, నహీద్ రాణా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేయగా... పాకిస్తాన్ 232 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసిన బంగ్లాదేశ్... పాక్ ముందు రికార్డు లక్ష్యాన్ని నిలిపింది.
‘ప్రపంచకప్‌కు మేం సిద్ధం’
ముంబై: టి20 ప్రపంచ కప్ కోసం నిర్వహించిన సన్నాహక శిబిరం చాలా బాగా సాగిందని, టోర్నీ కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. ఉదాసీనతకు తావు లేకుండా శ్రమించి టైటిల్ సాధించడమే తమ లక్ష్యమని ఆమె వ్యాఖ్యానించింది. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుంది. దీనికి సంబంధించి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో జట్టుకు ప్రత్యేక కోచింగ్ క్యాంప్‌ను నిర్వహించారు. ‘మా సన్నాహక శిబిరం అన్ని రకాలుగా చాలా బాగా సాగిందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేను. ఎందుకంటే మేం వరల్డ్ కప్‌కు వెళుతున్నామనే విషయం మరచిపోవద్దు. అమ్మాయిలు పూర్తి స్థాయిలో ఫిట్‌గా, ఉత్సాహంగా ఉన్నారు. వారంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. శిబిరంలో అందరూ చాలా కష్టపడ్డారు’ అని స్మృతి చెప్పింది. ఈ నెల 22న ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న మహిళల బృందం వరల్డ్ కప్‌కు ముందు ఇంగ్లండ్‌తోనే మూడు టి20 మ్యాచ్ సిరీస్ ఆడుతుంది. ‘మేం వరల్డ్ కప్ కోసమే సిద్ధమైనా దానికి ముందు సిరీస్ కూడా చాలా కీలకం. మా కఠోర శ్రమ ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నాం. ట్రోఫీని గెలిచి భారత్ గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నాం’ అని స్మతి పేర్కొంది.
డబ్బు కన్నా... పట్టుదల ముఖ్యం
బెంగళూరు: ఐపీఎల్‌తో తక్షణమే పేరు ప్రఖ్యాతలు వచ్చినా... సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ప్రస్తుతం కాలంలో ఐపీఎల్ వల్ల యువ ఆటగాళ్లకు భారీగా డబ్బు, పేరు వస్తోందని... అయితే అక్కడితో ఆగిపోకుండా మరింత కష్టపడితేనే ఆటలో గొప్ప స్థాయికి చేరగలరని కోహ్లి వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆర్సీబీ స్పోర్ట్స్ సమ్మిట్ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ... ‘అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్ల ఆటగాడిగా కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం. పట్టుదలను డబ్బుతో ముడిపెట్టలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఐపీఎల్ రూపంలో 20 బంతుల్లో 40–50 పరుగులు చేస్తే చాలు ఎనలేని పేరు, డబ్బు వస్తున్నాయి. అది సుఖవంతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ 10–15 ఏళ్లు ఏకబిగిన అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దానికి ఎంతో పట్టుదల ఉండాలి. అది టి20 క్రికెట్ ఆడినంత సులువు కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అభిమానుల ఆదరణ, ఆట నుంచి గౌరవం పొందగలం. అలా అని టి20 క్రికెట్‌ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఇటీవలి కాలంలో చూస్తే... గొప్ప గొప్ప పవర్ హిట్టర్లు పుట్టుకొస్తున్నారు. వారు బంతిని బాదుతున్న విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవలీలగా సిక్స్‌లు కొడుతున్నారు. ఐపీఎల్ ఆరంభంలో మాదిరిగా ప్రతిసారి భారీ స్కోర్ల పిచ్‌లు ఎదురుకావు. కొన్నిసార్లు కఠినమైన పిచ్‌పై రెండు, మూడు వికెట్లు కోల్పోయినప్పుడు 175–180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి జట్టును గెలిపించాల్సి వస్తుంది. అలాంటి స్థితిని తట్టుకున్న బ్యాటర్ దీర్ఘకాలం నిలబడగలుగుతాడు. పరిస్థితులు పరీక్షిస్తున్న సమయంలో అత్యుత్తమ ఆట తీరు కనబర్చడం ముఖ్యం. నా వరకైతే ఆటను ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని... పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగుతా. నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకోవాలి అంటే బలమైన పునాది అవసరం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక బంతిని ఎదుర్కొనే ముందు మీ దగ్గర ఎక్కువ మార్గాలు ఉండాలి. అప్పుడే కష్టమైన పిచ్‌పై కూడా పరుగులు రాబట్టగలం. అది కేవలం సాధన వల్లే సాధ్యమవుతుంది’ అని వివరించాడు.
కొత్త కుర్రాళ్లకు పిలుపు
గువాహటి: సొంతగడ్డపై వచ్చే నెలలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుతో పాటు వన్డే సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత జట్లను ప్రకటించింది. దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న నలుగురు కుర్రాళ్లకు జాతీయ జట్టులో తొలిసారి అవకాశం దక్కగా... ఐపీఎల్లో ఆకట్టుకోలేకపోతున్న రిషభ్ పంత్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. అలాగే ఇప్పటి వరకు టెస్టు జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడు ఇప్పుడిక కేవలం ప్లేయర్‌గానే కొనసాగనున్నాడు. పంత్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు బదలాయించారు. టెస్టు, వన్డే జట్లకు శుబ్‌మన్ గిల్ నాయకత్వం వహించనుండగా... సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. రవీంద్ర జడేజా కూడా రెస్ట్ ఇవ్వగా... అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయలేదు. రోహిత్‌తో పాటు హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్‌కు ముందు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. జూన్ 6 నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య న్యూ చండీగఢ్‌లో ఏకైక టెస్టు జరగనుంది. ఆ తర్వాత జూన్ 14న ధర్మశాలలో తొలి వన్డే, 17న లక్నోలో రెండో వన్డే, 20న చెన్నైలో మూడో వన్డే జరగనున్నాయి. ‘అఫ్గాన్‌తో సిరీస్‌ల అనంతరం ఇంగ్లండ్ పర్యటన వరకు బుమ్రా జట్టుతో చేరుతాడు’ అని అగార్కర్ పేర్కొన్నాడు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు, వన్డే జట్లలో చోటు నిలబెట్టుకున్నాడు. భారత టెస్టు జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే , ధ్రువ్ జురేల్. భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే , కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్. ప్రిన్స్ యాదవ్: తాజా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ జట్టు పేసర్ ప్రిన్స్ యాదవ్ మాత్రం తన వేగం, కచ్చితత్వంతో సెలెక్టర్ల మెప్పు పొందాడు. గతేడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 24 ఏళ్ల ప్రిన్స్... ఈ సీజన్లో నిలకడ కనబర్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఢిల్లీ బౌలర్‌కు పెద్దగా అనుభవం లేకపోయినా... లిస్ట్ ‘ఎ’, ఐపీఎల్ ప్రదర్శనతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. యార్కర్లు వేయడంలో దిట్ట అయిన ప్రిన్స్ వన్డే సిరీస్‌లో రాణిస్తే... ఈ ఏడాది చివర్లో జరిగే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అతడి పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు. మానవ్ సుతార్: రాజస్తాన్‌కు చెందిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. చాన్నాళ్లుగా దేశవాళీల్లో నిలకడ కనబరుస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 29 మ్యాచ్‌ల్లో 129 వికెట్లు పడగొట్టిన ఈ ఎడంచేతి వాటం స్పిన్నర్... బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేయగలడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సుతార్‌ను ఏకైక టెస్టు కోసం ఎంపిక చేశారు. జడేజా, అక్షర్ జట్టులో లేకపోవడంతో సుతార్‌కు అవకాశం దక్కింది. కుల్దీప్, సుందర్‌లు తుది జట్టులో ఉండటం ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా టీమ్‌లో చోటు కోసం హర్ష్ దూబే తో సుతార్ పోటీపడనున్నాడు. గుర్నూర్ బ్రార్: చాన్నాళ్లుగా భారత జట్టులో నెట్ బౌలర్‌గా కొనసాగుతున్న 25 ఏళ్ల గుర్నూర్ బ్రార్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌కు బ్రార్‌పై అపార నమ్మకం ఉండగా... అతడికి పంజాబ్‌కే చెందిన భారత సారథి గిల్ మద్దతు దండిగా ఉంది. ఐపీఎల్‌లోనూ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న అతడు రెండేళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అదనపు బౌన్స్ రాబట్టడంలో మంచి నైపుణ్యం ఉన్న ఆరున్నర అడుగుల గుర్నూర్ దక్షిణాఫ్రికా వంటి పేస్ పిచ్‌లపై ప్రభావం చూపగలడని సెలెక్షన్ కమిటీ నమ్ముతోంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 18 మ్యాచ్‌లు ఆడిన బ్రార్ 27.30 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు. హర్ష్ దూబే : సుదీర్ఘ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న 23 ఏళ్ల హర్ష్ దూబే కు మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 2024–25 రంజీ సీజన్లో రికార్డు స్థాయిలో 69 వికెట్లు పడగొట్టడంతో పాటు 476 పరుగులు చేసిన దూబే... తాజా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23.26 సగటుతో 133 వికెట్లు తీసిన హర్ష్... 1026 పరుగులు సైతం చేశాడు. అతడి ఖాతాలో 9 అర్ధశతకాలు ఉన్నాయి.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
బిజినెస్
ఆరు నెలల గరిష్టానికి నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగం ఏప్రిల్‌లో స్వల్పంగా పెరిగింది. మార్చిలో ఉన్న 5.1 శాతం నుంచి 5.2 శాతానికి చేరింది. 2025 ఏప్రిల్‌లోనూ 5.1 శాతంగానే ఉండడం గమనార్హం. 15 ఏళ్ల వయసుకు మించి పనిచేసే జనాభాకు సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర ప్రణాళిక, కార్యక్రమాల అమలు శాఖ శుక్రవారం విడుదల చేసింది. చివరిగా 2025 అక్టోబర్‌లోనూ 5.2 శాతం స్థాయిలో నిరుద్యోగం నమోదైంది. ⇒ పట్టణాల్లో నిరుద్యోగం కాస్తంత దిగొచ్చింది. మార్చిలో ఉన్న 6.8 శాతం నుంచి ఏప్రిల్‌లో 6.6 శాతానికి తగ్గింది. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ⇒ 2025 ఏప్రిల్‌తో పోల్చితే మాత్రం గ్రామీణ, పట్టణ నిరుద్యోగంలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ⇒ పట్టణ పురుషుల్లో నిరుద్యోగం మార్చిలో 5 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లో 5.1 శాతానికి చేరింది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం 4.7 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గింది. ⇒ దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు 5.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. గ్రామీణ మహిళల్లో 4.4 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గగా.. పట్టణ మహిళల్లోనూ 9 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గుముఖం పట్టింది. ⇒ కార్మికుల భాగస్వామ్య రేటు ఏప్రిల్‌లో 55 శాతానికి పరిమితం అయింది. మార్చిలో ఇది 55.4 శాతంగా ఉంది.
ఇక యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ భవిష్య నిధిని (పీఎఫ్) వేగంగా ఉపసహరించుకునేందుకు వీలుగా యూపీఐ పేమెంట్ గేట్‌వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని పరీక్షించడం పూర్తయిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. మెరుగైన సేవల దిశగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈపీఎఫ్‌వో సభ్యులు యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా ఉపసంహరించుకునే మొత్తం, వారి బ్యాంక్ ఖాతాలకు వెంటనే జమ అవుతుందని చెప్పారు. ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేసిన యూపీఐ పిన్ను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. నిబంధనల మేరకు భవిష్యనిధిలో కొంత మేర బ్యాలన్స్‌ను తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుంది.అది పోను మిగిలిన మొత్తాన్ని యూపీఐ సాయంతో వేగంగా ఉపసంహరించుకునే దిశగా ఈపీఎఫ్‌వో అడుగులు వేస్తున్నట్టు మంత్రి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. నూతన సదుపాయంతో ఏడు కోట్ల మంది ఈపీఎఫ్‌వో సభ్యులకు నిధుల ఉపసంహరణ సులభతరం కానుంది. ప్రస్తుత విధానంలో సభ్యులు ఉపసంహరణ కోసం క్లెయిమ్ దాఖలు చేసి, నిర్ణీత సమయం పాటు నిరీక్షించాల్సి వస్తోంది.ఆటో–సెటిల్మెంట్ విధానంలో మానవ ప్రమేయం లేకుండా ఎలక్ట్రానిక్ రూపంలో క్లెయిమ్‌ల పరిష్కారానికి మూడు రోజుల సమయం పడుతోంది. ఈపీఎఫ్‌వో వాట్సాప్ సేవలను నెలలో ప్రారంభించనున్నట్టు మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సభ్యులు ఈపీఎఫ్‌వో వాట్సాప్ నంబర్‌కు హాయ్ అని టైప్ చేసి పంపించడం ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉంది? చివరి ఐదు లావాదేవీలు తదితర సమాచారాన్ని పొందొచ్చని చెప్పారు. పెండింగ్ కేసులకు పరిష్కారం నిధి ఆప్కే నికత్ కార్యక్రమం ద్వారా కన్జ్యూమర్ కోర్టుల్లో అపరిష్కృతంగా ఉండిపోయిన కేసులను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మాండవీయ తెలిపారు. దీంతో 2025 ఏప్రిల్ 1 నాటికి 31,036 కేసులు ఉండగా, 2026 ఏప్రిల్ 1 నాటికి 27,639కు తగ్గినట్టు చెప్పారు.
క్రెడిట్ కార్డుల హవా
ముంబై: దేశంలో ఒకవైపు క్రెడిట్ కార్డు లావాదేవీలు దేశంలో శరవేగంగా పెరుగుతుంటే.. మరోవైపు డెబిట్ కార్డు లావాదేవీలు అదే స్థాయిలో తగ్గిపోతున్నాయి. 2021లో 216 కోట్లుగా ఉన్న క్రెడిట్ కార్డ్ లావాదేవీలు 2025 నాటికి 570 కోట్లకు పెరిగాయి. సుమారు 2.6 రెట్లు వృద్ధి నమోదైంది. 2021లో రూ. 8.9 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ 2025 నాటికి రూ. 23.2 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది. ఐదేళ్ల కాలంలో క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో 27 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదైంది. నివేదికలోని అంశాలు.. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల సంఖ్య 2021లో 408.7 కోట్లుగా ఉంటే, 2025 నాటికి 133.6 కోట్లకు పడిపోయాయి. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల విలువ రూ. 7.4 లక్షల కోట్ల నుంచి రూ. 4.5 లక్షల కోట్లకు తగ్గింది. ⇒ యూపీఐ, డిజిటల్ వాలెట్లు, క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల కంటే డెబిట్ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. ⇒ ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. ⇒ ఇక క్రెడిట్‌కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. ⇒ విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. ⇒ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిసెంబర్ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి.డిజిటల్ చెల్లింపుల విస్తరణ ⇒ 2016తో పోలిస్తే 2025 నాటికి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సంఖ్య 33 రెట్లు పెరగ్గా, వాటి విలువ దాదాపు మూడు రెట్లు అధికమైంది. ⇒ ముఖ్యంగా గత ఐదేళ్లలో డిజిటల్ చెల్లింపులు సంఖ్యా పరంగా నాలుగు రెట్లకు పైగా పెరిగాయి. ⇒ 2025 జూన్‌లో 6,782 లక్షలుగా ఉన్న క్యూఆర్ కోడ్లు, డిసెంబర్ 2025 నాటికి 7,313 లక్షలకు పెరిగాయి. ⇒ డిజిటల్ చెల్లింపులను స్వీకరించే ఛానళ్లను పరిశీలిస్తే.. గతేడాది జూన్–డిసెంబర్ మధ్య యూపీఐ క్యూఆర్ కోడ్లు, క్రెడిట్ కార్డులు, వ్యాలెట్లలో ఎక్కువ వృద్ధి కనిపించగా, పీవోఎస్ టెరి్మనళన్లు, ఏటీఎంలు, మైక్రో ఏటీఎంల వినియోగం తగ్గింది.⇒ యూపీఐ, డిజిటల్ వాలెట్లు, క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల కంటే డెబిట్ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. ⇒ ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. ⇒ ఇక క్రెడిట్‌కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. ⇒ విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. ⇒ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిసెంబర్ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి.
భారత్‌లో రూ. 5,700 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫుడ్, బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో 2030 నాటికి భారత్‌లో రూ. 5,700 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయ నుంది. ప్రధానంగా ఆహారోత్పత్తుల తయా రీ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ మొత్తా న్ని వెచ్చించనున్నట్లు సంస్థ ఇండియా, సౌత్ ఏషి యా సీఈవో జాగృత్ కొటేచా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని కాన్సెంట్రేట్స్ ప్లాంటులో, అస్సాం..తమిళనాడులోని స్నాక్స్ ప్లాంట్లపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో ఇటీవలే స్థలాన్ని కూడా సేకరించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆదాయాలు, వినియోగం స్థిరంగా పెరుగుతున్న భారత్ తమకు టాప్ 13 మార్కెట్లలో ఒకటని ఆయ న చెప్పారు.గతేడాది (2025)లో రూ. 9,789 కోట్ల ఆదాయంపై రూ. 905 కోట్ల లాభం ఆర్జించినట్లు జాగృత్ తెలిపారు. వరుసగా రెండో ఏడాది కూడా పటిష్టంగా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందినట్లు వివరించారు. ఫుడ్ సెగ్మెంట్లో 11 శాతం వృద్ధి సాధించినట్లు పెప్సీకో ఇండియా, సౌత్ ఏషియా సీఎఫ్‌వో సవిత బాలచంద్రన్ తెలిపారు. వాతావరణం కారణంగా శీతల పానీయాల విభాగానికి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, పోటీ కూడా పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ రెండు విభాగాలు మెరుగ్గా రాణించినట్లు పేర్కొన్నారు.
ఫ్యామిలీ
కేన్స్‌లో ప్రజక్తా మాలి ట్రెడిషనల్ లుక్! సగర్వంగా భారతీయత..
ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్! పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్... కానీ ప్రపంచమంతా సెలెబ్రిటీల దుస్తులు, రెడ్ కార్పెట్ మీద వారి లుక్స్ తదితరాలే హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. అందుకోసం తారలు, సెలబ్రిటీలు తల నుంచి పాదాల వరకు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చూపుతిప్పుకోని విధంగా రెడి అయ్యేందుకు కొన్ని నెలల ముందు నుంచే సన్నద్ధమవుతుంటారు. అయితే ఈ ప్రపంచ వేదిక కేన్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసే లాంగ్ గౌనులు, పాశ్చాత్య స్టైలిష్ వేర్లే సందడి చేస్తుంటాయి. అలాంటిది ఈసారి భారతీయ డిజైనర్లు మన భారతీయ సంప్రదాయ వారసత్వానికే పెద్దపీట వేశారు. ఒక్కో ప్రాంతంలో ఉన్న సంప్రదాయ చీరలు, ఆభరణాలతో తారలు, ప్రముఖులు సందడి చేయడం విశేషం. తాజాగా ఆ కోవలోకి మరాఠి నటి ప్రజక్తా మాలి కూడా చేరిపోయారు. ఆమె ఈ ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ రెడ్ కార్పెట్‌పై మహారాష్ట్ర సంస్కతిని సగర్వంగా చూపించారామె. తన మూలాలను చాటి చెప్పేలా సాంప్రదాయ నీలి రంగు నౌవారీ చీరలో మెరిశారామె. రిచ్ బ్లూ, పర్పుల్ రంగుల మేళవింపుతో ఉన్న మహారాష్ట్రలో చీరలో వయ్యారంగా నడుస్తూ..అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం మొత్తాన్ని తనవైపుకి తిప్పుకునేలా ప్రత్యేకంగా కనిపించింది. ఆమె రూపం సంప్రదాయ సాంస్కృతికి గర్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఆఖరికి తన ఆహార్యానికి తగ్గట్టుగా చక్కగా జుట్టు ముడివేసి, సాంప్రదాయ బిందీ, ప్రత్యేకమైన నాథ్, చోకర్, గాజులు, కమర్బంద్ వంటి యాక్సెసరీలు ధరించారామె. మరాఠి సంప్రదాయలో రాజసమైన లుక్‌లో ఆకర్షించారామె. అంతేగాదు ప్రజక్తా కెమెరాలకు చేతులు జోడించి అభివాదం చేస్తూ ఇచ్చిన ఫోజులు ఆత్మీయత, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పుతున్నట్లుగా ఉంది. ఇలా ప్రపంచ వేదికపై సగర్వంగా భారతీయతను చాటడం ముఖ్యంగా మరాఠీ ప్రేక్షకులను ఎంతోగానో అలరించడం కాదు, గర్వించే క్షణంగా మారింది. కాగా, ప్రజక్తా మాలి, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్‌కార్పెట్‌పై అరంగేట్రం చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..సాంప్రదాయ నౌవారీ చీర, మరాఠీ నాథ్‌తో కేన్స్‌లో నడవం ఎంతో గర్వంగా ఉందని పోస్ట్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Prajaktta Mali (@prajakta_official) (చదవండి: బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !)
సమతుల్య పోషణతోనే సేంద్రియ దిగుబడులు
సేంద్రియ కూరగాయల సాగులో ఒకటికి నాలుగు రకాల సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కలిపి వాడినప్పుడు మాత్రమే అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందుతాయని, తద్వారా అత్యుత్తమ దిగుబడులు సాధించగలమని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, పరివృద్ధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాలీహౌస్లో రెడ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలను ప్రయోగాత్మకంగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ 2025–26 శీతాకాల పంటలో ఉత్తమ ఫలితాలు సాధించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎ. రాజారెడ్డి పర్యవేక్షణలో హార్టికల్చర్ అసిస్టెంట్ ్రపొఫెసర్లు డా. సీహెచ్ షణ్ముఖి, డా. టి. శిరీష నిర్వహిస్తున్న ఈ మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ కిసాన్ సంఘ్‌కు చెందిన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.కాలీఫ్లవర్ ఎకరానికి 8 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై కాలీఫ్లవర్‌ను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 9 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడుతూ పాలీహౌస్లో కాలీఫ్లవర్ సాగు చేస్తే 5.8 టన్నుల దిగుబడి వచ్చింది. అయితే, కోళ్ల ఎరువుతో పాటు 3 రకాల జీవన ఎరువులు వాడితే అత్యధికంగా హెక్టారుకు 8 టన్నులకుపైగా సేంద్రియ కాలీఫ్లవర్ దిగుబడి వచ్చింది. హెక్టారుకు 7.5 టన్నుల కోళ్ల ఎరువుతో పాటు వామ్ 5 కిలోలు, అజోస్పిరిల్లం 2 కిలోలు, పీఎస్బీ 5 కిలోలు వాడినప్పుడు అత్యధికంగా ఒక్కో కాలీఫ్లవర్ బరువు 825 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 8టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. అయితే, జీవన ఎరువులతో పాటు వర్మీ కంపోస్టు లేదా జీవామృతం లేదా లిగ్నైట్ కలిపి వాడినప్పుడు.. కోళ్ల ఎరువుతో పాటు జీవన ఎరువులు వాడినప్పటికన్నా తక్కువ దిగుబడి రావటం విశేషం.రెడ్ క్యాబేజీ ఎకరానికి 9 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై రెడ్ క్యాబేజీ పంటను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 6 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. పాలీహౌస్లో హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడితే హెక్టారుకు 5 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడి వచ్చింది. అయితే, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువుతో పాటు మరో 4 రకాల సేంద్రియ ఎరువులు వాడితే హెక్టారుకు అత్యధికంగా 9 టన్నులకుపైగా సేంద్రియ రెడ్ క్యాబేజీల దిగుబడి వచ్చింది. హెక్టారుకు 5 టన్నుల పశువుల ఎరువు, వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడారు. ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 962 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 9 టన్నులకు పైగా దిగుబడి రావటం విశేషం. అయితే, పశువుల ఎరువు అసలు వాడకుండా.. హెక్టారుకు వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడినప్పుడు ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 935 గ్రాములకు మాత్రమే పెరిగింది.సమతుల్య పోషణే కీలకంసేంద్రియ సాగులో పంటలకు అవసరమైన అన్ని పోషకాలనూ సమతుల్యంగా తగు పాళ్లలో అందించగలిగినప్పుడే రసాయన సేద్యంతో సమానంగా దిగుబడులు సాధించటం సాధ్యమవుతుందని మల్లారెడ్డి యూనివర్సిటీలో తాజా పరిశోధనలు తేల్చాయి. పాలీహౌస్ ప్రయోగాత్మక సాగులో ఎకరానికి 8 టన్నుల కాలీఫ్లవర్, 9 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడులు మాకు సంతృప్తి కలిగించాయి. అన్ని యూనివర్సిటీలూ ఈ దిశగా పరిశోధనలు చేస్తే రైతులకు మంచి ఆదాయంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యదాయకమైన ఆహారం లభిస్తుంది. – ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులుసేంద్రియ పరిశోధనలు కొనసాగిస్తాంపూర్తిగా సేంద్రియ కూరగాయల సాగులో మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టు తొలి ఏడాది ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలు ఈ ప్రయోగాలు కొనసాగిస్తాం. సేంద్రియ ఎరువుల యాజమాన్యం, దిగుబడుల స్థిరీకరణ చేసి పూర్తి ఫలితాలు ఆ తర్వాత ప్రకటిస్తాం. – డాక్టర్ ఎ. రాజారెడ్డి, డీన్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మల్లారెడ్డి యూనివర్సిటీనిర్వహణ: పంతంగి రాంబాబు
కష్టాలే... గెలుపు పాఠాలై!
‘కష్టపడేవారిని అదృష్టం ఇష్టపడుతుంది’ అనేది సామెత. చైనాకు చెందిన జౌక్విన్ ఫేయ్ని ‘అదృష్టవంతురాలు’ అంటారు చాలామంది. అయితే ఆమె కష్టమే ఆమెను అదృష్టవంతురాలిని చేసింది. చదువు మధ్యలో మానేసి పొట్టకూటి కోసం వాచ్ లెన్స్ కంపెనీలో పనిచేసిన జౌక్విన్ ఫేయ్ నేడు ప్రపంచ ప్రసిద్ధ ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీ యజమానురాలు...అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన విందులో ఆపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ల మధ్య కూర్చున్న మహిళ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు... జౌక్విన్ ఫేయ్.అదిగో... అవకాశంగ్రామీణ హునాన్ ప్రావిన్స్‌లో జౌక్విన్ ఒక ఫ్యాక్టరీలో సాధారణ కార్మికురాలిగా పనిచేసేది. స్మార్ట్ఫోన్ల విశ్వరూపాన్ని ప్రపంచం చూడని రోజుల్లోనే గ్లాస్ ్రపొడక్షన్లో నైపుణ్యం సాధిస్తుండేది. పదహారేళ్ల వయసులో చదువుకు దూరమైన జౌ పని వెదుక్కుంటూ షెన్జెన్కు వెళ్లింది. ఎంతోమంది వలస కార్మికులలాగే సుదీర్ఘమైన షిఫ్టులు, ఒత్తిడితో కూడిన వాతావరణంలో పనిచేసింది. 1993లో వాచ్గ్లాస్పై స్క్రీన్ ప్రింటింగ్‌కు సంబంధించి చిన్న వర్క్‌షాప్‌ను ప్రారంభించింది.తొలిరోజుల్లో వర్క్‌షాప్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ఆ రోజుల్లోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలు గుర్తించని ఒక అవకాశాన్ని జౌ గుర్తించింది. ‘ఎలక్ట్రానిక్స్ పలుచగా, తేలికగా, అధునాతనంగా మారేకొద్దీ గాజు తయారీకి విలువ అంతకంతకూ పెరుగుతుంది’ అనేది ఆమె గుర్తించిన విషయం. ఈ ముందుచూపు జౌను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆమె చిన్న సంస్థ ‘లెన్స్ టెక్నాలజీ’ అనే అతి పెద్ద కంపెనీగా మారింది. ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగించే అధునాతన కవర్గ్లాస్, టచ్–స్క్రీన్ భాగాలను సరఫరా చేసే కీలకసంస్థగా అవతరించింది. స్మార్ట్‌ఫోన్, ఏఐ హార్డ్‌వేర్, స్మార్ట్ వెహికిల్స్, కాక్‌పిట్ వ్యవస్థలు, రోబోటిక్స్ పార్ట్స్ నుండి ఏరోస్పేస్ సంబంధిత తయారీ రంగం వరకు విస్తరించింది.స్పీడ్ స్పీడ్‌గా...టిమ్ కుక్, ఎలాన్ మస్క్‌లాంటి దిగ్గజాల మధ్య జౌ కూర్చోవడం అనేది ఆమెకు సంబంధించిన విశేషమే కాదు, అనేక పరిశ్రమలలో పెరుగుతున్న లెన్స్ టెక్నాలజీకి ప్రతీకాత్మక చిత్రం. ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీకి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల నుండి అధిక ఆదాయం వస్తున్నప్పటికీ, ఏఐ గ్లాసెస్, ఇంటెలిజెంట్ వెహికిల్స్, ఫ్లెక్సిబుల్ గ్లాస్ టెక్నాలజీ, ఏరో స్సేస్ ఉత్పత్తుల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలోకి వేగంగా విస్తరించింది.‘చైనా మాన్యుఫాక్టరింగ్’ అంటే చాలా తక్కువ ఖర్చు అనే అభి్రపాయం ఉంది. ‘లెన్స్ టెక్నాలజీ’ లాంటి సంస్థలు ఇప్పుడు ఆ అభి్రపాయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే... విజయ రహస్యంనా కష్టాలు చిన్న వయసులోనే మొదలయ్యాయి. ఒక ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో నాన్న కంటిచూపు కోల్పోయాడు. అయిదేళ్ల వయసులో అమ్మ చని΄ోయింది. ‘తర్వాతి భోజనం ఎక్కడ దొరుకుతుంది? దాన్ని ఎలా సంపాదించుకోవాలి?’ అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. పదహారేళ్ల వయసులో ఒక వాచ్ లెన్స్ ఫ్యాక్టరీలో అసెంబ్లీ వర్కర్‌గా చేరాను. రాత్రిపూట అకౌంటింగ్ క్లాస్‌లకు హాజరయ్యేదాన్ని. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలలు కనేదాన్ని. వ్యాపారవేత్తగా నా ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. అయినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. వెనకడుగు వేసి ఉంటే ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీ ఉండేది కాదు. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు చాలామందిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా పట్టుదలతో ముందుకు సాగడమే అసలు సిసలు విజయం.– జౌక్విన్ ఫేయ్
ఫైర్‌పై బోర్ కొట్టకుండా!
సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. ప్రస్తుతం ‘ఇండ్ఫేమ్’ పేరుతో పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..‘‘పిల్లలకు థియరీగా చెప్పడం కంటే వారి నుంచి క్రియేటివిటీని రాబట్టడం ద్వారా మనో వికాసాన్ని కలిగించడం సులువు. కాక΄ోతే వారు చేస్తున్న పనుల్లో మనమూ ఇన్వాల్వ్ అవ్వాలి. పిల్లలకు ఊహ తెలుస్తున్న దగ్గరనుంచే వారిచేత వివిధ రకాల యాక్టివీటీస్ చేయించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా మన జీవనానికి ఆధారమైన ‘నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం’ ఇలా పంచభూతాల గురించి ఈ వేసవిలో పరిచయం చేద్దాం.ఏ విషయమైనా బోర్ కొట్టకుండా మన సంభాషణ పిల్లలతో సరదాగా ఉండాలి. పెద్దలకు కూడా ఇది ఎక్సర్సైజ్ పాఠమే అవుతుంది. ఉదాహరణకు ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’... సినిమాటిక్‌గా ఓ డైలాగ్ చేప్పండి. వెంటనే పిల్లల అటెన్షన్ మీ వైపు తిరుగుతుంది. అమ్మో ‘నిప్పు’ అని భయపెట్టకూడదు. ఆశ్చర్యం, జాగ్రత్త, విజ్ఞానం.. కలిపి ‘నిప్పు’ గురించి తెలుసుకునేలా ఉండాలి.వెలుగు దీపాలు→ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో అందంగా అలంకరించిన కేక్ పైన క్యాండిల్స్ వెలిగిస్తారు. ఆ వెలుగు ఎలా ఉంటుందో అడగండి. డ్రాయింగ్‌లో చూపమనండి.→ కిచెన్‌లో వంట వండటానికి ఏం వాడతారో అడగండి → దీపం వెలగడానికి ఏం అవసరం, లైటర్ ఎలా వెలుగుతుంది? → ఇంధనపు వేడి వల్ల ఏయే వాహనాలు, ఇంజన్లు నడుస్తాయో గెస్ చేయమనండి → అడవిలో మంటలు వస్తే, షార్ట్ సర్క్యూట్ జరిగితే, అకస్మాత్తుగా అగ్నిప్రమాదాలు ఏయే చోట్ల జరుగుతాయి... వాటినే చిత్రాల్లో చూపమనండి → కొవ్వొత్తి వెలుగుకి గాలి లేక΄ోతే ఏమవుతుంది, వేడికి కొవ్వొత్తి ఎందుకు కరిగి΄ోతుంది, మంట ఎందుకు రెపరెపలాడుతుంది?... మన రోజువారీ పనుల్లో ‘నిప్పు’ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం చెప్పమనండి.సేఫ్టీ హీరో రోల్అగ్ని ప్రమాద సమయంలో 101కు కాల్ చేసే వ్యక్తి, ఇంట్లో గ్యాస్ వాడకంలో పొదుపు, వంట చేసేటప్పుడు జాగ్రత్త పడే వాళ్లు, కాలిన గాయాలకు నివారణ ఉపాయాలు సూచించే వ్యక్తి ... వీటిలో ఏవి చేసినా ‘హీరో’నే. ఏయే వస్తువులు నిప్పును పుట్టిస్తాయి. పిల్లలు అగ్గిపెట్టె, వంటగ్యాస్.. మొదలైన ‘నిప్పు’ కు కారణమయ్యే వస్తువులకు దూరంగా ఎందుకు ఉండాలి.. చూపమనాలి.నిప్పు కథలు→ ఆదిమ మనిషి నిప్పు కనుగొన్న విధానం → హనుమంతుడు లంక దహనం కథ → చలి పెట్టినప్పుడు వేడికోసం మంట ఎలా ఉపయోగపడుతుంది → సూర్యుడు వేడిని ఎలా పుట్టిస్తున్నాడు. వేసవిలోనే ఎందుకు అంతగా మండుతుంటాడు → నిప్పుకు ఎన్ని పేర్లు ఉన్నాయి. ఏయే భాషల్లో ఎలాంటి పేర్లు ఉన్నాయి.. ‘నిప్పు’ గురించి చేసే ఈ ప్రయోగం పిల్లలను ఆలోచింపజేస్తుంది. కొత్త విధానాల రూపకల్పన జరుగుతుంది. ఎన్నో విషయాలు ‘నిప్పు’ అనే టాపిక్ ద్వారా తెలియజేయవచ్చు. పిల్లల వయసు, వారు అర్ధం చేసుకుంటున్న విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ప్రోత్సహిస్తే పిల్లలు కూడా ‘నిప్పు’రవ్వల్లా మెరుస్తారు.నిర్వహణ: నిర్మలారెడ్డి
అంతర్జాతీయం
పెంకులేకుండానే గుడ్లను పొదిగారు!
వాషింగ్టన్: అంతరించిపోయిన జీవులను డీఎన్ఏల సాయంతో మళ్లీ పునర్సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాలోని జీవసాంకేతికరంగ సంస్థ ‘కొలోసల్ బయోసైన్సెస్’తన ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. న్యూజిలాండ్‌లో చాలా శతాబ్దాల క్రితం అంతరించిపోయిన భారీ పక్షిజాతి ‘మోవా’ను పునర్సృష్టించే క్రతువులో మరో ముందడుగువేశామని కొలోసల్ బయోసైన్సెస్ తాజాగా ప్రకటించింది. మోవాకు జన్యువులపరంగా అత్యంత సారూప్యత ఉండే ఇతర జాతుల పక్షుల డీఎన్ఏతో సింథసిస్ చేసి తొలుత మోవా గుడ్డును తయారుచేయాలని సంకల్పించింది.అయితే ఆనాటి మోవాజాతి గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే ఏకంగా గరిష్టంగా 80 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇంతటి భారీ గుడ్డును పొదగాలంటే అంతపెద్దస్థాయిలో కృత్రిమ ఎగ్‌షెల్ అవసరం అవుతుంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కృత్రిమమేధతో త్రిమితీయ(3డీ) ముద్రిత చిన్నపాటి ఎగ్‌షెల్‌ను తయారుచేశామని కంపెనీ ప్రకటించింది. ఇందులో సాధారణ కోడి గుడ్లలోని పచ్చ, తెల్లసొనలను బయటకుతీసి ఈ 3డీ ముద్రిత ఎగ్షెల్లో పెట్టి విజయవంతంగా పొదిగామని కంపెనీ మంగళవారం వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా ఇలా ఇప్పటిదాకా 26 కోడిపిల్లలను సృష్టించారు. ఏఐ ఎగ్‌షెల్ ఎలా? పెంకును పగలగొట్టి పచ్చ, తెల్లసొనలను కప్పులాంటి ఇతర గోళాకార ఆకృతుల్లో పొదగడంపై గతంలోనూ చాలా మంది ప్రయోగాలు చేశారు. అయితే సహజసిద్ధ పెంకు నుంచి మాత్రమే సరిపడా ఆక్సిజన్ అందుతుంది. దాంతోనే లోపల గుడ్డు పొదుగుతుంది. ఇందుకోసం ఆక్సిజన్ సరైన మోతాదులో అందేలా లోపలివైపు జల్లెడ లాంటి దానిని కొలోసల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దానికి బయటివైపు పారదర్శకంగా ఉండేలా మరో కణత్వచాన్ని తయారుచేశారు. వీటి సాయంతో పచ్చ,తెల్లసొనలు ఏమాత్రం పాడవకుండా సహజసిద్ధ వాతావరణాన్ని వాటికి అందించామని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చ,తెల్లసొన కోడిపిల్లగా మారే క్రమంలో సాధారణ పెంకు నుంచి కాల్షియంను సంగ్రహించుకుంటుంది.ఇదే తరహాలో తాము కూడా ఈ ఏఐ ఎగ్‌షెల్ ద్వారా కాల్షియంను అందించామని పరిశోధకులు తెలిపారు. ఈ ఎగ్‌షెల్‌ను ఇంక్యుబేటర్‌లో పెట్టి సరిపడా వేడిని అందించి పొదిగారు. తమ ప్రయోగం విజయవంతంకావడంపై కొలోసల్ సంస్థ సీఈఓ బెన్లామ్ ఆనందం వ్యక్తంచేశారు. సింథటిక్ బయాలజీ పితామహుడిగా పేరొందిన అమెరికా దిగ్గజ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ జార్జ్ చర్చ్ ఆధ్వర్యంలో కొలోసల్ సంస్థ పనిచేస్తోంది. ‘‘కృత్రిమమేధతో పనిచేసే కృత్రిమ ఎగ్‌షెల్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే భవిష్యత్తులో అంతరించిపోయిన పక్షిజాతులకూ తిరిగి ప్రాణం పోయవచ్చు. న్యూజిలాండ్‌లో ప్రాచీనకాలంలో కలియతిరిగిన మోవా జాతిని పునర్సృష్టించాలంటే దాని గుడ్డును మోయగలిగే భారీ పక్షిజాతులు ఇప్పుడులేవు. అందుకే ఇలా కృత్రిమ ఎగ్‌షెల్ తయారీకి పూనుకున్నాం’’అని బెన్లామ్ వివరించారు.
సెప్టెంబర్‌లో భారత్‌కు పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్రంలో అధ్యక్షుడు పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషకోవ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ ఆయన వేరుగా భేటీ అవుతారని వివరించారు.బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉన్న భారత్ ఈ శిఖరాగ్రానికి ఆతిథ్యం ఇస్తోంది. భారత్‌కు పుతిన్ చివరిసారిగా 2025 డిసెంబర్లో వచ్చారు. అప్పట్లో ఆయన భారత్–రష్యా వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. బ్రెజిల్, భారత్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పాటైన బ్రిక్స్‌లో ప్రస్తుతం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, ఇండోనేసియా కూడా సభ్యదేశాలుగా ఉన్నాయి.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ కూలిపోవడంలో యుఎస్ఏ పాత్ర..?
వాషింగ్టన్, డీసీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని ప్రభుత్వం కూలిపోవడంపై అమెరికా మీడియా సంస్థ 'డ్రాప్ సైట్ న్యూస్' సంచలన కథనం ప్రచురించింది. అయిన ప్రభుత్వం కూలిపోవడానికి కేవలం ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కేవలం అవిశ్వాస తీర్మానం వల్ల కోల్పోలేదని దాని వెనక అమెరికా, పాకిస్థాన్ సైన్యం కుట్ర ఉందని కథనం ప్రచురించింది.డ్రాప్ సైట్ న్యూస్ నివేదిక ప్రకారం2022 ఫిబ్రవరి 24న ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు.యాధృచ్చికంగా అదే రోజు రష్యా ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధంపై పాకిస్తాన్ రష్యాను బహిరంగంగా విమర్శించాలని కోరుకున్నారు. కానీ ఇమ్రాన్ అలా చేయలేదు యుద్ధం పట్ల తటస్థవైఖరి ప్రదర్శించారు. అనంతరం 2022 మార్చి 7న, వాషింగ్టన్‌లోని అప్పటి పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్‌కు, అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి డోనాల్డ్ లూకు మధ్య సంభాషణ జరిగింది. అవిశ్వాస తీర్మానం నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగితే, అమెరికా అన్నింటినీ క్షమిస్తుందని లూ మజీద్‌తో చెప్పారు. ముప్పై మూడు రోజుల తరువాత, 2022 ఏప్రిల్ 9న, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. అని డ్రాప్ సైట్ న్యూస్ కథనం ప్రచురించింది.ఇమ్రాన్ తొలగింపు అనంతర పరిణామాలుఏప్రిల్ 2022, ఇమ్రాన్‌ను తొలగించిన మరుసటి రోజే షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు.అనంతరం కొద్ది నెలలకు నవంబర్‌లో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నవాజ్ షరీఫ్‌తో సంప్రదించిన తర్వాతే ఈ నియామకం జరిగిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.2024 ఎన్నికల సమయంలో ఇమ్రాన్ పార్టీ PTI ఎన్నికల చిహ్నమైన గబ్బిలాన్ని తొలగించారు. దీంతో అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయవలసి వచ్చింది. PTI మద్దతు ఉన్న అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ, PML-N, PPP పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.దీంతో 2025లో మునీర్ అధికారం మరింత పెరిగింది: నివేదిక ప్రకారం, రాజ్యాంగ మార్పుల అనంతరం అసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్ మరియు రక్షణ దళాల అధిపతిగా నియమించారు. దీంతో సైన్యం, రక్షణ మౌలిక సదుపాయాలు, పాకిస్తాన్ అణు కమాండ్‌పై ఆయన పట్టు మరింత బలపడింది.పతాక స్థాయికి అమెరికా-పాక్ సంబంధాలుఇమ్రాన్ ఖాన్ అధికారం నుండి వైదొలగిన తర్వాత, పాకిస్తాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక మరియు వ్యాపార ఒప్పందాల వరకు విస్తరించాయి.పాకిస్థాన్‌లో ఒక క్రిప్టో కౌన్సిల్ ఏర్పడింది. ట్రంప్ కుటుంబానికి చెందిన ఎల్ఎఫ్ కంపెనీతో 36 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ పైప్‌లైన్ ఒప్పందం కుదిరింది. 500 మిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందం కూడా కుదిరింది. గాజా స్ట్రిప్‌కు సైనికులను పంపేందుకు ఒక ప్రతిపాదన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అసిమ్ మునీర్ మరియు షాబాజ్ షరీఫ్‌లను బహిరంగంగా ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. ముందే చెప్పిన ఇమ్రాన్తన ప్రభుత్వం పడిపోయినప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా విదేశీ కుట్ర జరిగిందని ఆరోపించారు. 2022 మార్చిలో జరిగిన ఒక ర్యాలీలో, తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారని పేర్కొంటూ ఆయన ఒక కాగితాన్ని ఊపారు. ఈ కేసు ఆ తర్వాత సైఫర్ కేసుగా ప్రసిద్ధి చెందింది.
ఇరాన్ వార్.. నయా ట్రెండ్
ప్రపంచ యుద్ధాల రూపురేఖలు మారిపోతున్నాయ్. క్షిపణులు, అణు బాంబులు, డ్రోన్లు మాత్రమే కాదు.. ఇప్పుడు సరిహద్దులు, వనరులు, ఆఖరికి డిజిటల్ నెట్‌వర్క్‌లు కూడా ఆయుధాలయ్యాయి. అదెలా సాధ్యమో.. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. తనకంటే బలమైన సైన్యం ఉన్న అమెరికాను విసిగెత్తిస్తూ ‘వార్ ట్రెండ్’ను సెట్ చేసింది.ఇరాన్ తన సరికొత్త వ్యూహం అమలుకు.. హర్ముజ్ జలసంధిని వేదికగా చేసుకుంది. దీని ద్వారానే ప్రపంచంలో ఐదో వంతు చమురు రవాణా జరుగుతుందని తెలిసిందే కదా. అందుకే జలసంధిపై తమదే పూర్తి ఆధిపత్యం అని ప్రకటించుకుని.. టోల్‌ప్లాజా ఏర్పాటుతో వసూళ్లు చేపట్టాలని భావించింది. తద్వారా.. వచ్చిన సొమ్ముతో యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్‌ను పునరుద్ధరించుకోవడం, దేశ అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకుంటామని ప్రకటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించుకోగలిగింది. అదే సమయంలో.. సముద్ర గర్భం కేబుళ్లపై దృష్టిసారించి భయపెట్టింది కూడా. ఇప్పుడు కేబుళ్ల విషయంలో అమెరికన్ దిగ్గజ కంపెనీలు కాంప్రమైజ్ కావాలని.. ఎంతో కొంత తమకు చెల్లించాలని(పన్ను, ఫీజు, ఫైన్.. ఏదో ఒక రూపేణా).. అలాగే వాటి నిర్వహణ(రిపేర్లు వగైరా) బాధ్యతలు కూడా తమ ఆధ్వర్యంలోనే సాగాలని కండిషన్లు పెడుతోంది. లేకుంటే కత్తిరింపులు తప్పవన్నట్లు బెదిరిస్తోంది. అలా.. తన భౌగోళిక స్థానాన్నే ఇరాన్ ఆయుధంగా మలుచుకుంది.టిట్ ఫర్ టాట్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ విషయంలో ఏం చేయాలనుకున్నాడో.. ఇరాన్ ఆ పనే కౌంటర్‌గా చేసి చూపించింది. అదే ఆర్థికంగా దెబ్బ తీయడం. ఇరాన్‌ను ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ట్రంప్.. హర్ముజ్ బ్లాకేడ్, నిధుల ఫ్రీజ్‌లను చూపించి ఇరాన్ మెడలు వంచాలనుకున్నాడు. అయితే ఆ నష్టం ధాటికి ఇరాన్ తలొగ్గలేదు. సరికదా.. యుద్ధాన్ని సరికొత్త మలుపులు తిప్పింది.యుద్ధం ప్రారంభంలో.. చౌకగా తయారైన షాహెడ్ డ్రోన్లు ఉపయోగించి అమెరికా రక్షణ వ్యవస్థలను ఆగమాగం చేసింది. తద్వారా అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత హర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని అడ్డుకోవడంతో తన వ్యూహాన్ని మొదలుపెట్టింది. హర్ముజ్ అనేది కేవలం 21 కిలోమీటర్ల వెడల్పు ఉండడం, పైగా తమ తీరానికి దగ్గరగా ఇరాన్‌కు ఎంతో కలిసొచ్చింది. రోజుకు 100–150 నౌకలు వెళ్లే హర్ముజ్‌లో మైన్స్, డ్రోన్లు, ఫాస్ట్ అటాక్ బోట్స్‌తో నియంత్రించింది. ఫలితంగా ఒక్క నౌక కూడా నీట మునగకుండానే ఇన్సూరెన్స్ ప్రీమియంలు 300% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. యూరప్ దేశాలు అదనంగా 28 బిలియన్ డాలర్ల ఇంధన బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అలా క్షిపణుల యుద్ధం కాస్తా ఆర్థిక యుద్ధం అయ్యింది.భవిష్యత్తులో.. ఇరాన్ తన యుద్ధాన్ని క్షిపణుల నుంచి మరో దారికి మలిచింది. ఎనర్జీ + డేటా.. ఇవి రెండూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంశాలే. అలా రెండు కీలక ప్రవాహాలను ఒకేసారి నియంత్రించే శక్తి తమ వద్ద ఉందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇకపై యుద్ధం కేవలం బాంబులు, గన్స్‌తో కాదు.. వివిధ వనరుల రూపంలోనూ జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ చూపించిన ఈ యుద్ధ వ్యూహాన్ని ఉత్తర కొరియా, చైనా అధ్యయనం చేస్తున్నాయి. రష్యా కూడా ఈ ఉద్రిక్తతను నిశీతంగా పరిశీలిస్తోంది. అందుకే ఇది కేవలం ఒక దేశానికి కాదు, ప్రపంచానికి కొత్త హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు.కొత్తదేం కాదా?ఇరాన్ అనుసరించిన ఈ వ్యూహం కొత్తేదేం కాదట. ఇది అర్థం చేసుకోవాలంటే చరిత్రలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు విశ్లేషకులు.థెర్మోపిలే యుద్ధం (480 BC): స్పార్టా రాజు లియోనిడాస్ కొద్దిమంది సైనికులతో పర్షియన్ సైన్యాన్ని ఒక పర్వత మార్గంలో నిలువరించగలిగాడు. సంఖ్యలో తక్కువైనా, భౌగోళిక స్థానం (చోక్పాయింట్)ను ఉపయోగించి శత్రువుల అధిక బలాన్ని నిర్వీర్యం చేశాడు. ఇది “స్థానం” అనే ఆయుధం ఎంత శక్తివంతమో చూపించింది.రోమన్ సామ్రాజ్యం – కార్తేజ్: ప్యూనిక్ యుద్ధాల అనంతరం రోమన్లు కార్తేజ్ పొలాలను ఉప్పు చల్లి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఇది భౌగోళిక వనరులను ధ్వంసం చేసి శత్రువును బలహీనపరిచే వ్యూహం.నెపోలియన్ (19వ శతాబ్దం): బ్రిటన్‌తో వాణిజ్యాన్ని నిషేధించి యూరప్ ఆర్థిక వ్యవస్థను నియంత్రించాడు. ఇది వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చిన ఉదాహరణ.బలహీన దేశం కూడా తన భౌగోళిక స్థానాన్ని ఆయుధంగా మార్చుకుని శక్తివంతమైన దేశాలను నిలువరించగలదు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆ పాఠాన్నే ఇరాన్ వల్లేసింది. అమెరికా అణు బాంబులను ఆపడానికి యుద్ధం మొదలుపెడితే.. కానీ ఇరాన్ తన భూభాగాన్ని ఆయుధంగా మార్చి మరింత శక్తివంతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది.
జాతీయం
మీ అర్హతలకు ప్రభుత్వ పథకాలు.. కొత్త వెబ్సైట్ వచ్చేసింది!
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వందలాది సంక్షేమ పథకాల గురించి సరైన సమాచారం లేక ఎంతోమంది అర్హులు ప్రయోజనాలను కోల్పోతున్నారు. ఏ పథకానికి ఎవరు అర్హులు, ఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలో తెలియక సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ గందరగోళానికి చెక్ పెడుతూ భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన డిజిటల్ పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ‘మైస్కీమ్’ (myScheme) వెబ్సైట్. మీ వయస్సు, వృత్తి, ఆదాయం తదితర ప్రాథమిక వివరాలను నమోదు చేయడం ద్వారా, కేవలం కొద్ది నిమిషాల్లోనే మీకు సరిపోయే ప్రభుత్వ పథకాల జాబితాను ఈ పోర్టల్ మీ కళ్లముందు ఉంచుతుంది.విప్లవాత్మక ‘మైస్కీమ్’ పోర్టల్కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వేలాది పథకాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన అధికారిక ప్లాట్‌ఫారమ్ ‘మైస్కీమ్’ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల నుండి రైతుల సబ్సిడీలు, మహిళా ఉపాధి పథకాలు, వృద్ధాప్య పింఛన్లు, వ్యాపార రుణాల వరకు అన్ని వివరాలు ఇందులో లభిస్తాయి. వేర్వేరు మంత్రిత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించే శ్రమ లేకుండా, ఒకే చోట మీ ప్రొఫైల్‌కు సరిపోయే స్కీమ్‌లను చెక్ చేసుకోవచ్చు. అలాగే సదరు పథకాలకు సంబంధించిన అర్హత నియమాలు, అవసరమైన పత్రాలు, లబ్ధి పొందే పూర్తి విధానాన్ని ఇది స్పష్టంగా వివరిస్తుంది.అర్హతలను తెలుసుకునే మార్గంఈ పోర్టల్ ద్వారా మీకు తగిన పథకాలను కనుగొనడం అత్యంత సులభం. మొదటగా ‘myScheme’ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, హోమ్‌పేజీలో ఉన్న ‘Find Schemes For You’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ వయస్సు, లింగం, రాష్ట్రం, వృత్తి, సామాజిక వర్గం, ఆదాయ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మీ ప్రొఫైల్‌ను మరింత విశ్లేషించడానికి సిస్టమ్ అడిగే మరికొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, మీరు ఏ ఏ పథకాలకు అర్హులో ఆ జాబితా స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.దరఖాస్తు విధానం- ప్రయోజనాలుఅర్హత గల పథకాన్ని ఎంచుకున్న తర్వాత, దానిపై క్లిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అక్కడ సదరు పథకం అందించే ప్రయోజనాలు, కావలసిన డాక్యుమెంట్లు, తరచుగా అడిగే ప్రశ్నల విభాగం ఉంటుంది. ‘Application Process’పై క్లిక్ చేస్తే దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన అధికారిక లింక్, దశలవారీ మార్గదర్శకాలు లభిస్తాయి. ఈ విధానం వల్ల సమయం, శ్రమ ఆదా కావడమే కాకుండా, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సామాన్యులు సకాలంలో పొందేందుకు వీలు కలుగుతుంది.ఇది కూడా చదవండి: 260 మంది ప్రాణాలు తీసింది ఆ ఒక్క స్విచ్చేనా?
పోలీసుల అలసత్వమే ప్రాణం తీసిందా?
యువ సింగర్ ఇందర్ కౌర్ హఠాన్మరణం పంజాబ్‌ను ఉలిక్కి పడేలా చేసింది. వారం కిందట కిడ్నాప్‌కు గురైన ఆమె.. నిన్న కాలువలో శవమై కనిపించారు. దీంతో అక్కడి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ కేసులో విస్తుపోయే విషయాల్ని వెల్లడించారు ఆమె కుటుంబ సభ్యులు.యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్(29).. పంజాబీ సింగింగ్ సెన్సేషన్. ఈ నెల 13న సాయంత్రం లూథియానాలోని ఇంటి నుంచి కారులో బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టుపక్కల అంతటా జల్లెడ పట్టారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం నీలో కాలువలో ఆమె శవంగా తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు కబురు పంపి.. మృతదేహాన్ని సమ్రాలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాకే వివరాలు చెబుతామని అధికారులు అంటున్నారు. ఈలోపు ఇందర్ కుటుంబం సంచలన ఆరోపణలకు దిగింది.మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన గాయకుడు సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా ఇందర్ మృతికి కారణమంటూ ఆమె సోదరుడు జోతింధర్ సింగ్ చెబుతున్నాడు. మూడేళ్ల కిందట వీళ్లకు పరిచయమైంది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాడు సుఖా. అయితే అప్పటికే కెనడాలో అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. దీంతో తిరస్కరించింది. దీంతో కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని జోతింధర్ అంటున్నాడు. తమ సోదరి కనిపించకుండా పోయిన నాడే పోలీసులకు ఈ విషయం చెప్పామని అంటున్నాడతను. సుఖాతో పాటు అతని స్నేహితుడు కరమ్‌జిత్ సింగ్ కూడా ఈ నేరంలో భాగమయ్యాడు. వాళ్లు తుపాకీ చూపించి ఇందర్‌ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతే ఆమె శవమై కనిపించిందని ఆరోపిస్తోంది ఆమె కుటుంబం.పోలీసుల అలసత్వమేనా?ఇందర్ కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు, తండ్రి మే 13వ తేదీ రాత్రే లూథియానాలోని జమల్పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు వెంటనే స్పందించలేదన్నది ఇందర్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. ఉన్నతాధికారి లేడంటూ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఎదురు చూశారు. ఆ తర్వాతే ఫిర్యాదు తీసుకుని ఆమె కోసం గాలింపు చేపట్టారు. పైగా అనుమానితుడిగా సింగర్ సుఖా పేరు చెప్పినా.. ఆ కోణంలో దర్యాప్తు జరపలేదు.ఇందర్ తిరస్కరించాక సుఖా అవమానంగా ఫీలై కెనడాకు వెళ్లిపోయాడు. అయితే పగ పెంచుకుని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఇందర్, ఆమె కుటుంబం ఊహించలేదు. కెనడా నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చిన సుఖా.. నేరం చేశాక తిరిగి అదే దారిలో వెళ్లిపోయాడు. పోలీసులు తక్షణ ఫిర్యాదు స్వీకరించినా.. సకాలంలో స్పందించినా.. ఇందర్ ప్రాణాలు దక్కేవని, నేరస్తుడు చిక్కేవాడేమోనని అని బాధిత కుటుంబం వాపోతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విచారణకు ఆదేశిస్తామని పోలీస్ శాఖ చెబుతోంది. అంతేకాదు.. వ్యక్తిగత విబేధాలతో పాటు గ్యాంగ్‌స్టర్ మాఫియా లింకుల కోణంలోనూ ఈ కేసు విచారణ జరుపుతామని ప్రకటించింది.ఫేమస్ అవుతున్న టైంలో.. పంజాబీ సంగీత ప్రపంచంలో ఇందర్ కౌర్ రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫోక్ మ్యూజిక్‌కి దగ్గరగా ఉండే స్టైల్‌తో పాటు పాప్ కల్చర్‌కి కూడా అనుసంధానం చేసేది. లైవ్ పెర్ఫార్మెన్స్లు, సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల ఆమెకు మంచి ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. అలా అభిమానులు ఆమెను ఫోక్ క్వీన్‌గా పిలుచుకునేవారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె హఠాత్తుగా ఇలా చనిపోవడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.పంజాబ్‌లోనే ఎందుకిలా?ఇందర్ కౌర్ మరణం పంజాబ్ గ్లామర్ఫీల్డ్ను మరోసారి వార్తల్లో నిలబెట్టింది. వ్యక్తిగత విబేధాలు మాత్రమే కాదు.. అక్కడి గాయకులు, సెలబ్రిటీలు తరచుగా హింసకు గురవుతున్నారు. సిధూ మూసేవాలా, అమర్ సింగ్ చమ్కిలా వంటి ప్రముఖులు కూడా ఈ తరహా దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అందుకు కారణాలను పరిశీలిస్తే..పంజాబ్‌లో సింగర్లు కేవలం వినోదకారులు మాత్రమే కాదు.. సామాజిక, రాజకీయ, కుల చిహ్నాలుగా ఉంటున్నారు. వీటికి తోడు పంజాబ్‌లో సంఘటిత నేరజాలం వినోద రంగంతో మిళితమై ఉంది. అంటే.. కొంతమంది గాయకుల పాటల్లో గన్స్, రివెంజ్, పవర్ పాలిటిక్స్ వంటి అంశాలు ఉండటం వల్ల వారు గ్యాంగ్‌స్టర్ కల్చర్‌తో అనుసంధానమైపోతున్నారు. అలా దాడులకు గురవుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
ఆ బస్సుల్లో మాత్రమే లేడీస్‌కు ఫ్రీ జర్నీ
తిరువనంతపురం: కేరళలోని మహిళా ప్రయాణికులకు యూడీఎఫ్ ప్రభుత్వం సరికొత్త కానుకను అందించబోతోంది. @ఇందిరా గ్యారెంటీ* పథకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎటువంటి ఆదాయ పరిమితులు కానీ, ప్రత్యేక కార్డులు కానీ లేకుండానే మహిళలు ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ఈ పథకం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) పరిధిలోని అన్ని బస్సులకు వర్తించదు. కేవలం ఎంపిక చేసిన సర్వీసులలో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలుంటుంది.పరిమితులు లేవు.. కార్డులు అవసరం లేదురాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాధారణ (ఆర్డినరీ) కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరికీ ఈ ఉచిత పథకం వర్తిస్తుంది. కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మహిళా లబ్ధిదారుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు లేదా పాస్‌లను ప్రవేశపెట్టగా, కేరళలో ఎలాంటి ప్రత్యేక కార్డులు లేకుండానే ఉచిత ప్రయాణాన్ని అనుమతించనున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అమలువుతున్న నమూనానే కేరళ కూడా అనుసరిస్తోంది. అయితే, ఫాస్ట్ ప్యాసింజర్, సూపర్-క్లాస్ వంటి లగ్జరీ బస్సులలో ఈ సదుపాయం ఉండదు.ఏయే బస్సులకు వర్తిస్తుందంటే?ప్రస్తుతం కేరళలో సుమారు 4,700 కేఎస్ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా, అందులో దాదాపు 3,000 ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. ఈ 3,000 సాధారణ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇందులో ఉండే సుమారు 300 సిటీ ఫాస్ట్ బస్సులు, 1,400 సూపర్-క్లాస్ బస్సులు, మరో 300 ఫాస్ట్ ప్యాసింజర్ సర్వీసులకు ఈ పథకం నుండి మినహాయింపు ఇచ్చారు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా హై-కేటగిరీ డీజిల్ బస్సులకు ఈ పథకాన్ని వర్తింపజేయడం ఆర్థికంగా సాధ్యం కాదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఆర్టీసీపై భారీగా ఆర్థిక భారంఈ సరికొత్త ఉచిత ప్రయాణ పథకం వల్ల కేరళ ఆర్టీసీపై నెలకు సుమారు రూ.90 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కేఎస్ఆర్టీసీ జీతాల కోసం నెలకు రూ.50 కోట్లు, పెన్షన్ల కోసం రూ.80 కోట్లు అందిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల మరో రూ.3 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ ఉచిత పథకం కూడా తోడైతే, ప్రభుత్వ ముందస్తు సహాయం నెలకు దాదాపు రూ.220 కోట్లకు పెరగనుంది. అయినప్పటికీ, మహిళలతో పాటు వచ్చే పురుషుల వల్ల టికెట్ ఆదాయం కొంతవరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: 260 మంది ప్రాణాలు తీసింది ఆ ఒక్క స్విచ్చేనా?
260 మంది ప్రాణాలు తీసింది ఆ ఒక్క స్విచ్చేనా?
న్యూఢిల్లీ: దాదాపు 260 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బొయింగ్ 787 ఘోర విమాన ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్నది. ఈ దారుణ ఉదంతంపై భారత విమానయాన అధికారులు సరికొత్త కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్రీమ్‌లైనర్ విమానాల్లోని ‘ఫ్యూయల్-కంట్రోల్ స్విచ్‌లు’ (ఇంధన నియంత్రణ స్విచ్‌లు) అకస్మాత్తుగా ఆగిపోవడమే ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో భారత సివిల్ ఏవియేషన్ (డీసీసీఏ) ఉన్నతాధికారులు అమెరికాలోని సీటెల్ నగరంలోని బొయింగ్ ప్రధాన కార్యాలయానికి స్వయంగా వెళ్లి, ఈ స్విచ్‌ల పనితీరుపై జరగబోయే ప్రయోగాలను పర్యవేక్షించనున్నారు.లండన్-బెంగళూరు ఫ్లైట్‌లో బయటపడ్డ లోపంఇటీవల లండన్ నుండి బెంగళూరు వస్తున్న మరో ఎయిర్ ఇండియా బొయింగ్ 787 విమానంలో పైలట్లు ఇంధన స్విచ్‌లలో ఒక విచిత్రమైన సాంకేతిక సమస్యను గుర్తించారు. ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో స్వల్ప ఒత్తిడి పడినా ఈ స్విచ్‌లు స్థిరంగా ఉండకుండా ఊడిపోవడాన్ని పైలట్లు గమనించారు. మూడుసార్లు ప్రయత్నించిన తర్వాతే అవి సరిగ్గా పనిచేశాయి. ఈ ఘటన విమాన ప్రమాద దర్యాప్తుకు అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. అహ్మదాబాద్ ప్రమాదంలో కూడా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంధన స్విచ్‌లు ఒకేసారి ‘కటాఫ్’ పొజిషన్‌కు మారిపోయి, ఇంజిన్‌కు ఇంధనం అందకుండా ఆగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.సీటెల్ బొయింగ్ ల్యాబ్‌లో క్లిష్టమైన పరీక్షలుఆటోమేటిక్గా లేదా అనుకోకుండా మారడానికి వీల్లేని ఈ సురక్షితమైన లాకింగ్ స్విచ్‌లు, ఏదైనా నిర్దిష్ట కోణంలో బాహ్య ఒత్తిడి పడటం వల్ల దానంతట అవే కట్-ఆఫ్ అయ్యే అవకాశం ఉందా? అనే కోణంలో ఇప్పుడు అధికారులు పరిశోధించనున్నారు. లండన్ ఫ్లైట్ నుండి తొలగించిన స్విచ్ మోడ్యూల్‌ను ప్రస్తుతం అమెరికా బొయింగ్ ల్యాబ్‌లో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో పరీక్షించనున్నారు. అయితే, ప్రాథమిక తనిఖీల్లో ఈ సిస్టమ్ బాగానే ఉందని బొయింగ్ పేర్కొన్నప్పటికీ, ప్రమాద తీవ్రత దృష్ట్యా డీజీసీఏ అధికారులు స్వయంగా అక్కడ ఉండి ప్రయోగాలను వీక్షించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించారు.పైలట్ల సంఘాల ఆందోళన – అంతర్జాతీయ నిఘామరోవైపు అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) గతంలో ఈ ప్రమాదానికి ఎలాంటి యాంత్రిక లోపం కారణం కాదని, పైలట్లే మాన్యువల్‌గా ఇంధనాన్ని నిలిపివేసి ఉండవచ్చని అభిప్రాయపడింది. అయితే ఈ వాదనను భారత పైలట్ల సంఘాలు, మరణించిన కెప్టెన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పూర్తి విచారణ ముగియకముందే పైలట్లపై నిందలు వేయడం సరికాదని, స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారత విమానయాన రంగ భద్రత దృష్ట్యా, డీజీసీఏ ఈ దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఇది కూడా చదవండి: ‘బందా’లో నిప్పుల కొలిమి: కర్ఫ్యూను తలపిస్తున్న వీధులు!
ఎన్ఆర్ఐ
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
క్రైమ్
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
సాక్షి, హైదరాబాద్: బండి సాయి భగీరథ్ పక్కా పథకం ప్రకారమే పోలీసులకు చిక్కాడని కేసు దర్యాప్తులో పాల్గొన్న కీలక పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో ఆధారాలు దొరకకుండా చేయాల్సిన పనులన్నీ పరారీలో ఉండగానే పూర్తి చేసిన తర్వాతే పోలీసుల అదుపులోకి వచ్చాడని చెప్పారు. ఈనెల 16న భగీరథ్‌ను అరెస్టు చేసిన తర్వాత నిందితుడిని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఠాణాలో రెండున్నర గంటలపాటు కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్ నిందితుడిని సుదీర్ఘంగా విచారించా రు. అయితే విచారణ సమయంలో భగీరథ్ పోలీసులకు ఖాళీ సెల్‌ఫోన్ మాత్రమే అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఫోన్లో సిమ్ లేదని, ఎక్కడుందని విచారణాధికారి నిందితుడిని ప్రశ్ని ంచగా.. సిమ్ కార్డ్ ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పినట్లు తెలిసింది. విచారణాధికారులు న్యా యనిపుణులతో చర్చించిన అనంతరం పోక్సో కేసులో కీలకమైన సాక్ష్యాధారాలు ధ్వంసం చేశాడని గుర్తించి, భగీరథ్‌పై కొత్తగా ‘ఆధారాలు మాయం’సెక్షన్‌ను జోడించారు. ఈ మేరకు ఛార్జ్ షీట్లో భగీరథ్‌పై బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 238ను జోడించారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని వారం రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ న్యాయస్థానంలో కస్టడీ పిటీషన్‌ను దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకొని నార్సింగిలోని సర్వీస్ అపార్ట్మెంట్, మెయిన్‌బాద్ ఫామ్‌హౌస్, పరిసర ప్రాంతాలలో సీన్ రీకన్‌స్ట్రక్షన్స్ చేయాలని పోలీసులు నిర్ణయించారు.
అమీర్‌పేట గర్ల్స్ హాస్టల్లో.. చొరబడ్డ వ్యక్తులు..!
హైదరాబాద్: గర్ల్స్ హాస్టల్లో గుర్తుతెలియని వ్యక్తులు కనిపించారని చెప్పిన యువతులపై దుర్భాషలాడిన హాస్టల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. అమీర్‌పేటలో ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్‌ను శివపార్వతి, ఆమె కుమారుడు వీరారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న తెల్లవారు జామున ఓ గదిలో ఎవరో ఉన్నట్లు అనుమానం రావడంతో యువతి లేచి చూడగా బాత్రూమ్లో దూరాడు. గట్టిగా అరవడంతో పరారయ్యాడు. ఈ విషయం నిర్వాహకుడు వీరారెడ్డికి చెబితే దుర్భాషలాడాడు. ఇలా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చినట్లు యువతులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి వీరారెడ్డిని అరెస్టు చేశారు. శివపార్వతి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
లక్ష్మీకుమార్ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు, భారీగా బంగారం!
మల్లాపూర్/నాంపల్లి: హైదరాబాద్ జలమండలిలో ఓ భారీ అవినీతి జలగ ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సంస్థ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) రెడ్‌హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీకుమార్ (58) నివాసం సహా బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన 8 ప్రదేశాల్లో ఏసీబీ డీఎస్పీ మజీత్ అలీఖాన్ ఆధ్వర్యంలో 16 గంటలపాటు సోదాలు జరిగా యి. హైదరాబాద్ మల్లాపూర్‌లోని వెంకటరమణ కాలనీలో ఉన్న అనంత లక్ష్మీకుమార్ నివాసంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఏకంగా రూ. 1.10 కోట్ల నగదు, 2.1 కేజీల బంగారం, 9.2 కేజీల వెండి లభ్యమైంది. అలాగే నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఇళ్లు, మారుతీ కారు, బజాజ్ మోటార్ బైక్ సహా మొత్తం రూ. 5.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంత లక్ష్మీకుమార్ భార్య రాధమ్మ పేరిట మూడు బ్యాంకు లాకర్లలో భద్రపర్చిన ఆభరణాలు, ఇళ్ల పత్రాలను కూడా ఏసీబీ అధికారులు తెరిపించి స్వా«దీనం చేసుకున్నారు. రెడ్‌హిల్స్‌లోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి కొన్ని రికార్డులను తీసుకెళ్లారు. ఆయా ఆస్తుల మార్కెట్ విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. అనంత లక్ష్మీకుమార్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన్ను బంజారాహిల్స్‌లోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)కు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాధు చేయాలని సూచించారు. ఫిర్యాధుల వివరాలు పూర్తింగా గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా, నోట్ల కట్టలను లెక్కించేందుకు తీసుకొచ్చిన కౌంటింగ్ మెషీన్లు కాసేపు మొరాయించాయి. సోదాల్లో 15 మంది అధికారులు పాల్గొన్నారు. ఉలిక్కిపడిన మల్లాపూర్...: మల్లాపూర్ వెంకరమణ కాలనీలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నట్లు టీవీల్లో చూసి ఉలిక్కిపడిన స్థానికులు.. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అనంత లక్ష్మీకుమార్ నివాసం వద్ద గుమిగూడారు. గత నెలలో చిన్న కుమార్తె వివాహాన్ని ఆయన ఆరంఘర్ సమీపంలో అంగరంగ వైభవంగా చేశారని చర్చించుకున్నారు.
స్పా సెంటర్లో భార్యను చంపిన భర్త..!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో పాటు అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన మంగళవారం గాం«దీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ఎస్ఐ నర్సింహ, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం. ఆటో డ్రైవర్ రాజు, బంగి దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్‌పురా కిషన్‌బాగ్ ఎంఎన్ గూడెంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కవాడిగూడ ప్రధాన రహదారిలోని ఓ సూపర్ మార్కెట్ 4వ అంతస్తులోని స్పా సెంటర్లో దేబోరా బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు ఎంఎన్ గూడెంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటూ రాజుపై దేబోరా అత్తాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు పెట్టింది. అప్పటి నుంచి రాజు కక్ష పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. మంగళవారం ఉదయం దేబోరా విధుల్లో భాగంగా ఆటోలో కవాడిగూడలోని స్పా సెంటర్‌కు చేరుకుంది. ఆమెను వెంబడించిన రాజు కవాడిగూడకు చేరుకున్నాడు. ఆమె లిఫ్టులోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చాడు. వీరిద్దరూ లిప్టులోనే గొడవ పడుతూ 4వ అంతస్తుకు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరంపై అనేక చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో దేబోరా మృతి చెందింది. నిందితుడు రాజు అత్తాపూర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వీడియోలు
పెళ్లి మండపంలో స్విగ్గీ బాయ్ వీడియో వైరల్
సీఎం విజయ్ యూటర్న్
జగన్ జోలికి వస్తే.. ఖబడ్డార్.. కూటమికి జూపూడి డెడ్ లైన్
నన్ను భయపెట్టే మగడు ఇంకా పుట్టలేదు..! అరెస్ట్ పై స్టాంగ్ రియాక్షన్
వైద్య సేవల జీపును నడిపి- చెక్ చేసిన సీఎం విజయ్
బాబుకి లెఫ్ట్, రైట్ ఇచ్చిపడేసిన పూనమ్, రేణుకా చౌదరి
మోదీ, పుతిన్, జిన్‌పింగ్ త్రైపాక్షిక భేటీ?
వివాహితను వేధించిన యువకుడు.. గుండు కొట్టి.. చెప్పుల దండ వేసి
భారీ ఎండలకు ఇదే సాక్ష్యం క్షణాల్లో కాలి బూడిదైన బైక్
జాన్వీని చూసి రామ్ చరణ్ షాక్ అయ్యాడట.. ఎందుకంటే?


