తెలిసో తెలియకో ఏదో ఒకసారి చీటింగ్ చేస్తే తప్పేం కాదంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అలా అని మోసం చేయడాన్ని తాను సమర్థించడం లేదని చెప్తోంది. రకుల్ కథానాయికగా నటించిన తాజా చిత్రం 'పతీ పత్నీ ఔర్ వో దో'. ఇటీవల రిలీజైన ఈ హిందీ సినిమా ఇప్పటివరకు రూ.30 కోట్లకు పైగా రాబట్టింది. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది.
మోసం చేస్తే?
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్లు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు పార్ట్‌నర్ మోసం చేస్తే ఒప్పుకుంటారా? అన్న ప్రశ్నకు ముగ్గురూ విభిన్నంగా స్పందించారు. మొదటగా సారా అలీ ఖాన్.. మోసం చేయడం సరికాదు, కానీ మోసం జరిగితే మాత్రం కచ్చితంగా సారీ చెప్పాలి అంది. దానికి రకుల్ కూడా అవునని వంత పాడింది. అయితే ఆయుష్మాన్ ఖురానా మాత్రం పెళ్లయ్యాక ప్రత్యేక షరతులుంటాయి.
మానవ సహజం
ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి, దానికి బాధపడుతూ నిజాయితీగా సారీ చెప్పినప్పుడు క్షమించేయడమే ఉత్తమం. మనిషన్నాక చిన్నపాటి పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. వాటిని పెద్దగా చూడకూడదు. అయితే పొరపాట్లు చేయడమే పనిగా పెట్టుకోవడం మాత్రం సరికాదు అన్నాడు. అలాగైతే ఒకసారి చీట్ చేస్తే క్షమించేయొచ్చా? అని సారా అడగ్గా కుదరదని రకుల్ బదులిచ్చింది.
అది సరికాదు
కానీ, అంతలోనే మళ్లీ మాట మార్చేసింది. 'ఎవరైనా అనుకోకుండా పొరపాటు చేస్తే మాత్రం క్షమించేయొచ్చు. ఎందుకంటే జీవితం చాలా పెద్దది. ఒక్క పొరపాటు చేసినందుకు జీవితాంతం అవతలి వ్యక్తిని క్షమించకుండా ఉండటం కరెక్ట్ కాదు. అలా అని ఇది నా జీవితానికి, నా భర్తకు వర్తించదు' అని రకుల్ పేర్కొంది.
చదవండి: జైలులో పెళ్లిరోజు.. ఏదేమైనా నీ చేయి వదలను: దర్శన్ భార్య


