అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
ఐపీఎల్ 2026 సీజన్లో వేర్వేరు జట్లలో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు మళ్లీ ఒక్కటిగా కలిసి ఆడనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో అప్గానిస్తాన్‌తో ఒక టెస్టు సహా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. ఏకైక టెస్టు మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్ గిల్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న ప్రిన్స్ యాదవ్‌కు తొలిసారి జాతీయ జట్టుకు పిలుపు వచ్చింది. ఇక టీమిండియా సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాలకు అఫ్గాన్‌తో సిరీస్‌కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్తాన్‌తో ఒకే టెస్టు మ్యాచ్ కావడంతో జడేజాను తప్పించామని, టీ20 ప్రపంచకప్ నుంచి బిజీగా క్రికెట్ ఆడుతున్న బుమ్రాను భవిష్యత్తులో టీమిండియా ఆడబోయే కీలక సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని అతడికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇక సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలను వన్డే జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, ఫిట్నెస్ అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.📸The Men's Selection Committee Meeting for #TeamIndia's squad announcement for the upcoming @IDFCFIRSTBank Test match and the three-match ODI series against Afghanistan is underway in Guwahati.#INDvAFG pic.twitter.com/VlA94h1nFC— BCCI (@BCCI) May 19, 2026
జనసేనలో మరోసారి ముసలం
ప్రకాశం: జిల్లా జనసేనలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జనసేన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఆయన అనుచరుడే తిరుగుబాటు చేశారు. నిన్న మొన్నటివరకూ జిల్లాలో బాలినేని మౌత్‌పీస్‌గా ఉన్న జనసేన నాయకుడు జడ బాలనాగేంద్ర.. తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు(మంగళవారం, మే 19వ తేదీ) ప్రెస్‌మీట్ పెట్టిన బాలనాగేంద్ర.. బాలినేనిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో బాలినేని పదవులు బేరం పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బాలినేని, ఆయన కొడుకు ప్రణీత్ రెడ్డి జనసేనను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బాలినేని, ఆయన కొడుకుని పార్టీకి దూరం పెట్టాలని పవన్ కళ్యాణ్‌కి విజ్ఞప్తి చేశారు బాలనాగేంద్ర.
నో టాయిలెట్, నో లీవ్స్ : రూ. 19 లక్షల జాబ్ వదిలేశా!
బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగం సంపాదించడం ప్రతీ భారతీయ యువకుడి కల. అది ఏ ఐటీ ఉద్యోగమో, ప్రభుత్వ రంగ సంస్థ (PSU)లో ఉద్యోగమో అయితే జీవితం సెట్ అన్నంత సంబరం. మంచి జీతం, ఉద్యోగ భద్రత, సమాజంలో లభించే గౌరవం వల్ల ఈ ఉద్యోగాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో యువ ఉద్యోగుల్లో ట్రెండ్ మారింది. జాబ్‌లో పని ఒత్తిడి (Workplace Stress) కంటే, జీవితంలో మానసిక ప్రశాంతత, ఉద్యోగంలో సంతృప్తి అనేది ప్రధానంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, ఎన్ఐటీ కురుక్షేత్ర (NIT Kurukshetra) పూర్వ విద్యార్థి, 25 ఏళ్ల ఇంజనీర్ సౌరభ్ మిట్టల్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.భారత్ పెట్రోలియం (BPCL) సంస్థలో ఏడాదికి రూ. 19 లక్షల ప్యాకేజీతో లభించిన ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని, ఆయన వదులుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు.కలల ఉద్యోగం... కానీ ఏం లాభంసౌరభ్ మిట్టల్ తన 22వ ఏటనే BPCLలో చేరాడు. ఎన్నో ఆశలతో, ఆశయలతో ఉద్యోగంలో చేరినప్పటికీ, అక్కడి పని వాతావరణం, పరిస్థితులు ఆయన ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. కనీస వసతులు కూడా లేని జీవితం. తనకు పని చేయడానికి కేటాయించిన ఆఫీసు వాస్తవానికి ఒక గిడ్డంగి లాంటిదని సౌరభ్ వివరించారు. అక్కడ తాగడానికి నీళ్లు గానీ, టాయిలెట్ గానీ లేవు. ఏసీ కూడా పాడైందని, దాన్ని తానే స్వయంగా బాగు చేసుకోవాల్సి వచ్చిందని అతను చెప్పాడు. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, అతను ఈ విషయాన్ని తన మేనేజర్, హెచ్ఆర్, ఉన్నతాధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకువచ్చినా, ఎలాంటి పరిష్కారం లభించలేదు. దీంతో తన ఇల్లు సుమారు 10 నిమిషాల నడక దూరంలో ఉండటంతో రోజుకు చాలాసార్లు ఇంటికి వెళ్ళేవాడు. తాను ఉద్యోగం మానేసే వరకు పరిస్థితి అలాగే ఉందని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు అక్కడి పని చాలా ఒత్తిడితో కూడుకున్నదని, పాతకాలపు పద్ధతుల్లో సాగేదని విమర్శించారు.అంతేకాకుండా సీనియర్ అధికారుల కోసం ఎయిర్పోర్ట్ పికప్‌లు, హోటల్ బుకింగ్‌లు వంటి వారి వ్యక్తిగత పనులను కూడా తనతో చేయించేవారట. అమ్మకాలు తగ్గినప్పుడు, ఉన్నతాధికారులు నేరుగా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేవారు. వీడియో కాన్ఫరెన్సులు, ఫోన్ కాల్స్ సమయంలో తిట్టడం సర్వసాధారణమైపోయింది.ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు, వీకెండ్స్ (శని, ఆదివారాలు) లోనూ ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేవని చెప్పారు. దీంతో లీవ్‌లు దొరకడం కష్టంగా ఉండేదని, ఇక ప్రమోషన్లు, జీతాల పెంపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని పెదవి విరిచారు.. వీటన్నింటికీ మించి, తన చుట్టూ ఉన్న ఉద్యోగులంతా చాలా పెద్ద వయసు వారు కావడంతో, అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి గానీ, కెరీర్ ఎదుగుదలకు గానీ పెద్దగా అవకాశం లేదనిపించిందని, "నా జీవితాంతం ఇలాగే గడపడాన్ని నేను ఊహించుకోలేక పోయాను" అని సౌరభ్ తన నిర్ణయాన్ని వివరించాడు.ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశసౌరభ్ నిర్ణయంపై కుటుంబంలో వ్యతిరేకత అయితే ఈ ఉద్యోగాన్ని వదలేయాన్ని సౌరభ్ నిర్ణయాన్ని అమలు చేయడం అంత సులువు కాలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే భద్రత, గౌరవం కారణంగా ఆయన తండ్రి ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, కొడుకు పడుతున్న మానసిక ఒత్తిడిని గమనించిన తల్లి మాత్రం ఆయన నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?నెటిజన్ల స్పందన సౌరభ్ మిట్టల్ కథనం ఆన్లైన్లో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. చాలా మంచి, ఆలోచనాత్మకమైన నిర్ణయం. ఆల్ ది బెస్ట్ చాలామంది సౌరభ్ నిర్ణయాన్ని సమర్ధించారు. "నేను కూడా 16 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను, మీ నిర్ణయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని మరొకరు, మంచి పని చేశావు, సోదరా”, “మీకు అంతా మంచే జరగాలి” అంటూ పలువురు సౌరభ్‌కు మద్దతుగా నిలిచారు.
హైకోర్టు న్యాయవాదిపై మంత్రి సత్యకుమార్ అనుచరుల దాడి
ధర్మవరం: కూటమి శ్రేణుల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ పనితీరును ఎవరైనా ప్రశ్నిస్తే చాలు అక్రమ అరెస్టులు, దాడులకు పాల్పడటమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ అనుచరులు దౌర్జన్యం చేశారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించిన హైకోర్టు న్యాయవాది అంజన్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు మంత్రి సత్యకుమార్ అనుచరులు.సత్యకుమార్ అనుచరుల దాడిలో అంజన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి సత్యకుమార్ పనితీరు బాగాలదేని సోషల్ మీడియాలో న్యాయవాది అంజన్‌రెడ్డి ప్రశ్నించారు. తమనే ప్రశ్నిస్తారా అనే అక్కసుతో అంజన్‌రెడ్డిపై సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. బంధువును పరామర్శించేందుకు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి అంజన్‌రెడ్డి వచ్చిన సమయంలో దాడికి దిగారు. ఈ ఘటనలో అంజన్‌రెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. తనపై దాడి ఘటనకు సంబంధించి మంత్రి సత్యకుమార్ పీఏ, అనుచరులపై అంజన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?
బీడు కొండలను పచ్చటి అడవిలా మార్చిన తాత..!
ముంబై ఇండియన్స్‌కు దెబ్బ మీద దెబ్బ
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
హైదరాబాద్‌లో ఐసాల్వ్‌డ్ విస్తరణ
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
జనసేనలో మరోసారి ముసలం
నీట్ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!
సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. 15 రోజుల్లో 25వేల బుకింగ్స్!
పెళ్లి చేసుకోవాలన్నా అనుమతి తీసుకోవాలేమో..: అవినాశ్ రెడ్డి
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
మాను సంపంగి... మా అబ్బాయి
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
మమతకు సీఎం సువేందు ఝలక్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?
బీడు కొండలను పచ్చటి అడవిలా మార్చిన తాత..!
ముంబై ఇండియన్స్‌కు దెబ్బ మీద దెబ్బ
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
హైదరాబాద్‌లో ఐసాల్వ్‌డ్ విస్తరణ
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
జనసేనలో మరోసారి ముసలం
నీట్ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!
సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. 15 రోజుల్లో 25వేల బుకింగ్స్!
పెళ్లి చేసుకోవాలన్నా అనుమతి తీసుకోవాలేమో..: అవినాశ్ రెడ్డి
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్..!
మాను సంపంగి... మా అబ్బాయి
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
మూడు పెళ్లిళ్లు.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేశా: టాలీవుడ్ హీరోయిన్
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మాజీ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
ఇంత కాలానికి ఓ శుభవార్త విన్నాం.. యుద్ధం చేయలేమని..!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
మమతకు సీఎం సువేందు ఝలక్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
ఫొటోలు
రాశీ ఖన్నా గ్లామర్ ఫోటోషూట్
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
మంచు మనోజ్ కొత్త ట్రస్ట్ ప్రారంభం (ఫొటోలు)
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
పెట్రో బాదుడు: వైఎస్సార్సీపీ పోరుబాటకు విశేష స్పందన
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
అనంతపురం : భారమైన వేళ.. బాధతో విక్రయం! (ఫొటోలు)
హైదరాబాద్ : మురిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
సినిమా
‘పెద్ది’ .. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే మూవీ : రామ్ చరణ్
‘‘నా కెరీర్లో చేసిన మోస్ట్ ఇన్ స్పైరింగ్ ఫిల్మ్ ‘పెద్ది’. ఇలాంటి చిత్రాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు తరచుగా రావు. అవి రావాలంటే సంవత్సరాలు పడుతుంది. ‘పెద్ది’ కూడా అలాంటి అరుదైన సినిమా. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే మూవీ ఇది’’ అని హీరో రామ్‌చరణ్ తెలిపారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ మూవీ జూన్ 4న విడుదలకానుంది. సోమవారం ముంబైలో జరిగిన ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బుచ్చిబాబు సానా మాట్లాడుతూ– ‘‘నా రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రామ్ చరణ్‌గారికి రుణపడి ఉంటాను’’ అన్నారు ‘‘మా అమ్మగారు(శ్రీదేవి), చిరంజీవిగారు కలిసి నటించిన సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. చరణ్‌గారు–నా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ నాకు చాలా ప్రత్యేకం’’ అని జాన్వీ కపూర్ చెప్పారు. ‘‘నేరుగా తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ‘పెద్ది’ రూపంలో ఆ అవకాశం వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ వేడుకలో నిర్మాత సతీష్ కిలారు, నటుడు దివ్యేందు శర్మ, కెమెరామెన్ రత్నవేలు మాట్లాడారు.
ఈ సినిమా ప్రేక్షకుల ఊహకు అందదు : రష్మిక మందన్నా
షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీసనన్ ప్రధాన తారాగణంగా నటించిన హిందీ చిత్రం ‘కాక్ టెయిల్ 2’. హోమి అదజానియా దర్శకత్వంలో దినేష్ విజన్, లవ్ రంజన్ , అంకుర్ గార్గ్ నిర్మించారు. ఇందులో కునాల్ పాత్రలో షాహిద్ కపూర్, దియాగా రష్మికా మందన్నా, అల్లీగా కృతీసనన్ నటించారు. ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ఈ సినిమా మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో రష్మికా మందన్నా మాట్లాడుతూ–‘‘డిఫరెంట్ లవ్‌స్టోరీ సినిమా ఇది. ఈ సినిమా కథ ప్రేక్షకుల ఊహకు అందదు. షాహిద్‌తో ఆన్ స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఈ సినిమాలో కృతీసనన్ మరింత అందంగా కనిపిస్తారు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో నేను కునాల్ రోల్ చేశాను. కథలో ఇద్దరు హీరోయిన్ల మధ్యలో కునాల్ ఎవరివైపు వెళ్లాలో తెలియక సతమతం అవుతుంటాడు. రష్మిక, కృతీసనన్ సూపర్‌స్టార్స్. ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు’’ అని చెప్పారు. ఇక హోమి అదజానియా దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్ , దీపికా పదుకొనె, డయానా పెంటీ లీడ్ రోల్స్ చేసిన హిందీ హిట్ ఫిల్మ్ ‘కాక్టెయిల్’. ఈ ‘కాక్టెయిల్’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న రెండో సినిమా ‘కాక్ టెయిల్ 2’ అని తెలుస్తోంది.
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ
90స్ కిడ్స్ అందరూ తమ చిన్నప్పుడు చూసి హాలీవుడ్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా 'మమ్మీ' ఫ్రాంచైజీ ఉంటుంది. ఇప్పటివరకు మూడు మూవీస్ రాగా అవన్నీ ఆకట్టుకున్నాయి. ఇదే ఫ్రాంచైజలో వచ్చిన లేటెస్ట్ చిత్రం 'ద మమ్మీ' గత నెలలో థియేటర్లలోకి రాగా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)గతంలో వచ్చిన 'మమ్మీ' సినిమాలన్నీ అడ్వెంచర్, కామెడీ తరహాలో వచ్చాయి. వాటికి భిన్నంగా పూర్తిగా డార్క్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో లేటెస్ట్ మూవీ తీశారు. 'ద మమ్మీ' పేరుతో తీసిన ఈ చిత్రానికి లీ క్రోనిన్ దర్శకత్వం వహించారు. గత నెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని మెప్పించింది. ఇప్పుడీ చిత్రం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి రావొచ్చు. అప్పుడు తెలుగు డబ్బింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.'ద మమ్మీ' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం ఆనందిస్తుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్ భయపెట్టేలా ఉన్నాయని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందనే కామెంట్స్ వినిపించాయి.(ఇదీ చదవండి: 'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ అదేనా?)
పవర్ఫుల్ సావిత్రి
కబీర్‌సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్ ప్రధాన తారాగణంగా నటించిన సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. రవికుమార్ సీరపు దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.కాగా ఈ సినిమాలో పవర్ఫుల్ సావిత్రి పాత్రలో రాశి నటించినట్లు వెల్లడించి, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. ఓ బ్యాగ్ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. కథను మలుపు తిప్పే సావిత్రి పాత్రలో రాశి నటించారు’’ అని యూనిట్ పేర్కొంది.
క్రీడలు
సంజూతో గొడవపడ్డ క్లాసెన్!.. చర్యలు తప్పవా?
మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2026 ‘ప్లే ఆఫ్స్’లో అడుగుపెట్టింది. చెపాక్ వేదికగా సోమవారం జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకుంది. అంతేకాదు తమతో పాటు గుజరాత్ టైటాన్స్‌ను కూడా ‘ప్లే ఆఫ్స్’కు చేర్చింది.ఇక ఈ సీజన్లో ముందుగా డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ముందుగా బెర్తు ఖాయం చేసుకోగా.. ఇప్పుడు మిగిలిన మరో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ జట్లు రేసులో ఉన్నాయి. సహనం కోల్పోయిన క్లాసెన్ఇదిలా ఉంటే.. చెన్నైతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ సహనం కోల్పోయాడు. మెరుపు వేగంతో తనను స్టంపౌట్ చేసిన చెన్నై వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను అసభ్యంగా దూషించాడు.Sanju Samson ಕಡೆಯಿಂದ Dhoni-level stumping! 🔥🤯ವೀಕ್ಷಿಸಿ | Race to Playoffs 👉 #CSKvsSRH | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ. #TATAIPL pic.twitter.com/v9uADWD2YG— Star Sports Kannada (@StarSportsKan) May 18, 2026180 పరుగులుసొంతమైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కార్తీక్ శర్మ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.అనంతరం హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు.మెరుపు వేగంతోఅయితే, జోరు మీదున్న క్లాసెన్‌ను చెన్నై బౌలర్ నూర్ అహ్మద్.. తన స్పిన్ మాయాజాలంతో ట్రాప్ చేశాడు. పదిహేనో ఓవర్లో అతడు సంధించిన మూడో బంతిని ఆడటంలో క్లాసెన్ విఫలమయ్యాడు. ఇంతలో బంతిని అందుకున్న వికెట్ కీపర్ సంజూ.. ధోనిని గుర్తుచేస్తూ మెరుపు వేగంతో స్టంప్స్ గిరాటేశాడు.Heated argument between sanju and klaseen #cskvssrh#sanjusamson#HeinrichKlaasen pic.twitter.com/A2noDYjGk9— NOTHING (@Nothing_il9zO) May 18, 2026సంజూను దూషించిన క్లాసెన్!ఈ క్రమంలో రీప్లేలో క్లాసెన్ కాలు గాల్లో ఉన్నట్లుగా తేలడంతో అతడు అవుటయ్యాడు. దీంతో సంజూ, నూర్ సంబరాలు చేసుకోగా.. క్లాసెన్ కోపంగా సంజూను దూషించినట్లు కనపడింది. సంజూ కూడా బదులిచ్చేందుకు రాగా.. నూర్ సైతం క్లాసెన్ పైకి వెళ్లాడు. ఇంతలో శివం దూబే, ఫీల్డ్ అంపైర్లు వచ్చి ఇరు వర్గాలను విడదీయడంతో పరిస్థితి సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. క్లాసెన్ ప్రవర్తన పట్ల విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ప్లేయర్ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ ఘటన నేపథ్యంలో క్లాసెన్‌ను బీసీసీఐ మందలించే అవకాశం ఉంది. చదవండి: నా శరీరం బలహీనంగా ఉంది: ధోని అభిమానుల హృదయం ముక్కలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరింది. ఇప్పటికి మూడు జట్లు (ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. రెండు జట్లు (లక్నో, ముంబై) రేసు నుండి నిష్క్రమించాయి. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ఐదు జట్లు (రాజస్థాన్, కేకేఆర్, ల్లీ, పంజాబ్, సీఎస్కే) పోటీ పడుతున్నాయి.లీగ్ నుండి అధికారికంగా నిష్క్రమించిన జట్లలో ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ ఇవాళ (మే 19) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు లక్నోకు షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ స్వదేశానికి వెళ్లిపోయాడు. లక్నో ఆడాల్సిన చివరి రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడు. వ్యక్తిగత కారణాల చేత మార్క్రమ్ స్వదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అతడి భార్య నికోల్ డానియెల్లా ఓ’కానర్ త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే, రిషబ్ పంత్ నేతృత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లోనూ తీవ్రంగా నిరాశపరిచింది. జట్టు నిండా విధ్వంసకర బ్యాటర్లు (మార్క్రమ్, మార్ష్, పూరన్, పంత్, ఇంగ్లిస్) ఉన్నా, ఆ జట్టు ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. బౌలింగ్‌లోనూ ఆ జట్టు ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శనలే చేసింది. షమీ, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, మొహిసిన్ ఖాన్ అంచనాలకు మించి రాణించారు. అయినా లక్నోను విజయాలు వరించలేదు. ఈ జట్టులో ఎక్కడో ఏదో లోపం ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుంది. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఈ జట్టు రాజస్థాన్, పంజాబ్‌తో తలపడాల్సి ఉంది.
ధోని అభిమానుల హృదయం ముక్కలు చేసిన రైనా!
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్ చరమాంకానికి చేరుకుంది. ఐపీఎల్‌కు తలా దాదాపుగా వీడ్కోలు పలికినట్లే. నిజానికి 44 ఏళ్ల ధోని ఐపీఎల్ 19వ సీజన్లో ఒక్క మ్యాచ్‌లోనైనా బరిలోకి దిగకపోతాడా అంటూ కళ్లు కాయలు కాచేలా అభిమానులు ఎదురు చూశారు. కానీ మరోసారి వారికి నిరాశ తప్పలేదు. గత ఆరు ‘హోం’ మ్యాచ్‌లలో కనీసం గ్రౌండ్ మొహం చూడని ధోని (MS Dhoni) సీజన్లో తొలిసారి మైదానానికి వచ్చాడు. చెపాక్‌లో ఇది ఆఖరి మ్యాచ్ కావడంతో ఈసారి తలా బరిలోకి దిగవచ్చని వినిపించింది.అదొక్కటే మిగిలిందిఅయితే ధోని మాత్రం పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. చెన్నై తమ చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో ఆడనుంది. ఇక్కడే ఆడని ధోని అక్కడ ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్లే. అంటే 2008 నుంచి ధోని ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడని సీజన్‌గా ఇది ముగియవచ్చు! ఇక అతడి నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన ఎప్పుడు వస్తుందా అనే వేచిచూడటమే మిగిలింది.ధోని అభిమానుల హృదయాలను ముక్కలుఈ నేపథ్యంలో చెన్నై దిగ్గజం, భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చెప్పిన విషయం ధోని అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న చిన్న తలా.. చెపాక్‌లో ధోనిని కలిశాడు. ఈ సందర్భంగా తాను ధోనితో రిటైర్మెంట్ గురించి చర్చించినట్లు రైనా తెలిపాడు.నా శరీరం కాస్త బలహీనంగా ఉందిస్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘తలా... ‘ఐపీఎల్-2026 సీజన్‌ను నువ్వు మిస్ చేశావు. వచ్చే ఏడాది ఇంతకు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలి’ అని చెప్పాను. అందుకు బదులుగా.. ‘నా శరీరం కాస్త బలహీనంగా ఉంది’ అని ధోని అన్నాడు.‘ఏదేమైనా.. మేము ఇవన్నీ నమ్మలేము. నువ్వు కచ్చితంగా వచ్చే ఏడాది ఆడాల్సిందే’ అని అన్నాను. ఆడటం, ఆడకపోవడం పూర్తిగా ధోని వ్యక్తిగత నిర్ణయం. నాకు తెలిసి ఆయన సానుకూల దృక్పథంతోనే ఉన్నాడు. జట్టు కూడా సమష్టిగా ముందుకు సాగుతుందనే భావిస్తున్నా’’ అని రైనా పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి చెన్నైతోనే ఉన్న ధోని.. కెప్టెన్ హోదాలో జట్టును రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. ధోనితో పాటు రైనా కూడా చెన్నై జట్టు ప్రధాన సభ్యుడిగా వెలుగొందాడు. అభిమానులు అతడిని చిన్న తలా అని ముద్దుగా పిలుచుకుంటారు.Thala 💛 Chinna Thala#WhistlePodu pic.twitter.com/X4QmTgbmxa— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2026చదవండి: Pat Cummins: వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము
సంజూ సరికొత్త చరిత్ర
స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ సీఎస్కే తరఫున తొలి సీజన్లోనే అదిరిపోయే రికార్డు సాధించాడు. ఈ సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 477 పరుగులు చేసిన అతడు.. సీఎస్కే తరఫున ఓ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోని పేరిట ఉండేది.అతడు 2013 సీజన్లో 16 ఇన్నింగ్స్‌ల్లో 461 పరుగులు చేశాడు. తాజాగా సంజూ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. లీగ్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో సంజూ 500 పరుగుల అరుదైన మైలురాయిని కూడా తాకే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే సీఎస్కే తరఫున ఒక సీజన్లో 500 పరుగులు చేసిన తొలి వికెట్‌కీపర్‌గా నిలుస్తాడు.రికార్డు సాధించినా, మ్యాచ్ చేజారింది..!నిన్న ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో సంజూ పై రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో సంజూ మెరుపు ఇన్నింగ్స్‌తో (13 బంతుల్లో 27; 5 ఫోర్లు, సిక్స్) అలరించాడు. సిక్స్‌తో ఖాతా తెరిచిన అతడు.. వరుస బౌండరీలతో ఎస్ఆర్హెచ్ బౌలర్లపై దాడి చేశాడు. అయితే పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఔటై ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్‌గా మలచ లేకలేకపోయాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 180/7 స్కోర్ చేసింది. బ్రెవిస్ (44), కార్తీక్ శర్మ (32), సంజూ శాంసన్ (27), శివమ్ దూబే (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ సైతం తడబడినా చివరికి గెలిచింది. ఇషాన్ కిషన్ (70), క్లాసెన్ (47) రాణించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. సీఎస్కే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
బిజినెస్
బెంగళూరు కంటే హైదరాబాదే బెస్ట్!
నేటి కార్పొరేట్ ప్రపంచంలో లక్షల ప్యాకేజీలు, ఆకర్షణీయమైన కెరీర్ వృద్ధి వైపే యువత పరుగులు తీస్తోంది. కానీ, ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ సరికొత్త చర్చకు తెరలేపింది. ‘బెంగళూరులో రూ.38 లక్షల ప్యాకేజీ (ఎల్పీఏ) కావాలా? లేక హైదరాబాద్‌లో ప్రశాంత జీవితం కావాలా?’ అంటూ సదరు ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఆన్లైన్ వేదికగా వైరల్‌గా మారింది.ఆ వేతనం కంటే.. జీవన నాణ్యతే ముఖ్యం!మధన్ మోహన్ అనే ఓ ఐటీ నిపుణుడు ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తన కెరీర్ ఎంపిక గురించి ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నాడు. ప్రస్తుత సంస్థలో చేరడానికి ముందు తన వద్ద రెండు బెటర్ జాబ్ ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించాడు. ఆఫర్ 1.. రూ.38 ఎల్పీఏ ప్యాకేజీ, బెంగళూరులో లొకేషన్. ఆఫర్ 2.. రూ.30 లక్షల ప్యాకేజీ, హైదరాబాద్‌లో జాబ్ లొకేషన్. ‘నా చుట్టూ ఉన్న చాలా మంది.. చేతికి వచ్చే ఆ 8 లక్షల రూపాయల అదనపు ఆదాయాన్ని ఎందుకు వదులుకుంటావు? అని ప్రశ్నించారు. కానీ కొన్నిసార్లు, ఉత్తమ నిర్ణయం అంటే కేవలం అత్యధిక ప్యాకేజీని ఎంచుకోవడం మాత్రమే కాదని నేను గ్రహించాను’ అని మధన్ మోహన్ పేర్కొన్నాడు.హైదరాబాద్‌పైనే ఎందుకు మొగ్గు?‘బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో నిత్యావసరాలు, జీవన వ్యయం చాలా తక్కువ. ట్రాఫిక్, రోజువారీ ఉరుకుల పరుగుల ఒత్తిడి కూడా తక్కువే. దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యులు సమీపంలోనే ఉన్నారు. హైదరాబాద్ బెస్ట్ ఫుడ్, ఇక్కడి అనుకూల వాతావరణం మానసిక ప్రశాంతతను ఇస్తాయి. చాలా మంది ఉద్యోగులు కేవలం కాగితంపై కనిపించే సీటీసీని మాత్రమే లెక్కిస్తారు. కానీ జీవితంలో ఆనందం, మానసిక శ్రేయస్సు, జీవన నాణ్యతను లెక్కించడం మర్చిపోతారు. దీర్ఘకాలంలో మనశ్శాంతే అత్యంత విలువైనది. ఒత్తిడికి బదులు శాంతిని ఎంచుకోవడం కూడా ఒక తెలివైన కెరీర్ ప్లానింగే’ అని అతను నెటిజన్లతో పంచుకున్నాడు. తన నిర్ణయం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ప్రస్తుతం సంతృప్తితో ఉన్నానని తెలిపాడు.నెట్టింట స్పందనలు ఇలా..మధన్ మోహన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దాదాపు 82,000 కంటే ఎక్కువ వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ‘జీతం వర్సెస్ జీవన నాణ్యత’ అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘అన్ని నగరాల కంటే హైదరాబాదే బెస్ట్’ అని కొందరు వ్యాఖ్యానించగా.. ‘నాకు కూడా హైదరాబాద్ సొంత ఇల్లాంటి అనుభూతినే ఇస్తుంది’ అని మరొకరు రాసుకొచ్చారు. ‘బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో ఖర్చులు చాలా తక్కువ సోదరా, నీ నిర్ణయం కరెక్ట్’ అంటూ మెజారిటీ నెటిజన్లు తన నిర్ణయాన్ని కొనియాడారు. ‘నేనైతే బెంగళూరులో ఆ రూ.38 లక్షల ఆఫర్ తీసుకునేవాడిని. అక్కడ ఏడాది పాటు పనిచేసి ఆపై 30% హైక్‌తో రూ.50 లక్షల ప్యాకేజీకి హైదరాబాద్‌లో ఉద్యోగం వెతుక్కుని వచ్చేవాడిని. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి మార్పులు ఆర్థికంగా భారీ ఊతాన్ని ఇస్తాయి. అయితే, ఇవి తరచూ చేయడం సరైందికాదు’ అని ఒకరు స్పందించారు.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!
అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వార్షిక వేతన పెంపుదల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి, ఆందోళనకు దారితీసింది. సగటున 5 శాతం మేర జీతాలు పెంచినట్లు కంపెనీ ప్రకటించినప్పటికీ అంతర్గత నిబంధనల్లో మార్పులు, పనితీరు కోటాలు విధించడం వల్ల చేతికి వచ్చే జీతం తగ్గిపోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు, లే-ఆఫ్స్ భయాలు ఐటీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రదర్శించిన సాలరీ హైక్ ఉద్యోగులకు ఆనందాన్ని ఇవ్వకపోగా కొత్త ఆందోళనలను తెచ్చిపెట్టింది. అప్రైజల్ సైకిల్ ముగిసిన తర్వాత కంపెనీ వార్షిక వేతన పెంపును అమలు చేసింది. అయితే, ఈ పెంపుదలపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సంక్షోభానికి దారితీసిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.వేతన పెంపు ఉన్నా చేతికొచ్చే జీతం తగ్గింది!టీసీఎస్ ఈ ఏడాది సగటున 5 శాతం వేతన పెంపును ప్రకటించింది. ప్రతిభ కనబరిచిన ‘A+’ పెర్ఫార్మెన్స్ బ్యాండ్ ఉద్యోగులకు అత్యధికంగా 9 శాతం నుంచి 13 శాతం వరకు ఇంక్రిమెంట్లు లభించాయి. అయినప్పటికీ, మెజారిటీ ఉద్యోగులు తమ చేతికి వచ్చే నికర ఆదాయం తగ్గిందని వాపోతున్నారు.స్ట్రక్చరల్ మార్పుల్లో భాగంగా కంపెనీ అంతర్గత వేతన నిర్మాణంలో మార్పులు చేశారు.పనితీరు ఆధారంగా ఇచ్చే వేరియబుల్ పే తగ్గింది.ఉద్యోగికి కంపెనీ ఆఫర్ చేసే కాస్ట్ టు కంపెనీ(సీటీసీ) నుంచి గ్రాట్యుటీ మొత్తాన్ని తొలగించి చూపుతున్నారు. అంటే.. సులభంగా అర్థం చేసుకోవడానికి దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటి.. కాగితం మీద కనిపించే మార్పు, రెండు.. భవిష్యత్తులో వచ్చే నష్టం.ఉదాహరణకు: ఒక ఉద్యోగి సీటీసీ రూ.10 లక్షలు అనుకుందాం. అందులో గ్రాట్యుటీ విలువ రూ.40,000 ఉందనుకోండి.పాత పద్ధతి: స్క్రీన్ పైన లేదా ఆఫర్ లెటర్లో మీ సీటీసీ రూ.10,00,000 గానే కనిపిస్తుంది.కొత్త పద్ధతి: ఇప్పుడు గ్రాట్యుటీ మొత్తాన్ని (రూ.40,000) ఆ డిస్ప్లే నుంచి తీసివేస్తే ఇప్పుడు మీ సీటీసీ రూ.9,60,000గా కనిపిస్తుంది.‘బ్యాండ్ -డీ’ కోటా భయాలుఈ అప్రైజల్ సీజన్లో మేనేజర్లకు అందిన అంతర్గత ఆదేశాలు ఉద్యోగులను మరింత ఉలిక్కిపడేలా చేశాయి. ప్రతి టీమ్‌లో కనీసం 5 శాతం మంది సిబ్బందిని అత్యంత తక్కువ పనితీరు కేటగిరీ అయిన ‘బ్యాండ్ డీ’ లో ఉంచాలని యాజమాన్యం స్పష్టమైన కోటాను విధించినట్లు సమాచారం. సాధారణంగా ఈ బ్యాండ్‌లోని ఉద్యోగులకు కంపెనీ వేటు వేసే అవకాశం ఉంటుంది. ఈ 5% నిబంధన కారణంగా భవిష్యత్తులో తమ ఉద్యోగాలు ఊడిపోతాయేమోననే అభద్రత ఉద్యోగుల్లో తీవ్రస్థాయికి చేరింది.ఐటీ రంగంపై ఆర్థిక ఒత్తిడిఈ వివాదం కేవలం టీసీఎస్‌కు మాత్రమే పరిమితమైనది కాదు; మొత్తం భారతీయ ఐటీ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం వల్ల అంతర్జాతీయ క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్లను తగ్గించుకున్నారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలను క్లయింట్లు వాయిదా వేస్తున్నారు. ఆదాయ వృద్ధి మందగించడంతో ఐటీ కంపెనీలు తమ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగుల వేతనాల్లో కోతలు, కఠినమైన పనితీరు నిబంధనలు తెరపైకి వస్తున్నాయి.ఇదీ చదవండి: బంగారం ధరలు రివర్స్.. తులం ఎంతంటే..
బంగారం ధరలు రివర్స్.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గడిచిన మూడు సెషన్‌ల్లో తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
డేటా ఆధారంగా చర్యలు
అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో.. సరఫరా పరమైన సమస్యలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయా? మానిటరీ పాలసీ పరమైన చర్య అవసరమా? అన్నది పరిశీలిస్తూ ఉంటామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2025 నుంచి ఆర్బీఐ తటస్థ విధానాన్ని అనుసరిస్తున్నట్టు గుర్తు చేస్తూ, డేటా విషయంలో తగిన విధంగా స్పందించడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు.ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. భారత్‌కు తరచుగా సరఫరా సమస్యలు ఎదురవుతున్నట్టు చెప్పారు. ‘‘ధరలు అదే పనిగా పెరుగుతూ, వేతన భారానికి, ఉత్పత్తి, రవాణా వ్యయాలకు దారితీస్తే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లకు కారణమవుతుంటే అప్పుడు విధానాన్ని కఠినతరం చేయాల్సి వస్తుంది’’అని మల్హోత్రా వివరించారు. ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యానికి మరో 2 శాతం వరకు వెసులుబాటు ఉన్న నేపథ్యంలో స్వల్పకాలంలో సరఫరా సమస్యలను ఆర్బీఐ సర్దుబాటు చేసుకోగలదన్నారు.అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఇంకా కొనసాగుతున్న తరుణంలో, స్థూల ఆర్థిక పరమైన ప్రభావాలు ఇంకా పూర్తి స్థాయిలో వెలుగుచూడాల్సి ఉందన్నారు. మానిటరీ పాలసీ కఠినతరం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే వాటిని తెలియజేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆర్బీఐ ఎంపీసీ తదుపరి పాలసీ సమీక్ష జూన్ 3 నుంచి 5 వరకు జరగనుంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
ఫ్యామిలీ
ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..
ఫుడ్‌తో కొంగొత్త పరిచయాలే కాదు..ఓ దేశాన్నే మైమరిపించొచ్చు. ఎంతటి శత్రుత్వాలు, కోపతాపలు..ఒక్క విందుతో సమసిపోతాయి. అలాంటి టేస్టీ ఫుడ్‌తో ఇతర దేశాల మనసును దోచుకుని కోట్లు ఆర్జించడం మాటలు కాదుకదా. అలాంటి ఘన విజయాన్నే అందుకుంది ఈ భారత సంతతి మహిళ. మన భారతీయ రుచులను జోడించి తయారు చేసిన ఐస్‌క్రీమ్ బ్రాండ్‌తో దూసుకుపోతూ..శెభాష్ అనిపించుకుంటోంది పూజా బావిషి. ఎవరామె అంటే..భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా బావిషి, 'మలై' అనే ఐస్ క్రీమ్ బ్రాండ్‌తో అమెరికన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఏడాదికి రూ. రెండు వేల కోట్లు టర్నోవర్‌ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇద హోల్‌సేల్ ఈ కామర్స్ వ్యాపారంగా మారింది. 46 ఏళ్ల వ్యవస్థాపకురాలు, సీఈఓ 2015లొ ఈ మలైని ప్రారంభించారు. ఈ వ్యాపారం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో నాలుగు దుకాణాలను నిర్వహిస్తోంది. చాలామటుకు ఐస్‌క్రీమ్‌లలో చాక్లెట్, వెనిలా వంటి ఫ్లేవర్లు చూశాం. కానీ అంతకుమించిన రుచి కోసం మలై వంటి వెరైటీ టేస్ట్‌ని పరిచయం చేశారు. దీని తయారీలో ఉపయోగించిన యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, జాజికాయ వంటి రుచులను జోడించడంతో అమెరికా వాసుల మనసులను దోచుకుంది ఈ మలై ఐస్ క్రీమ్. ఈ కంపెనీ 2025లోనే సుమారు రూ. రెండు వేల కోట్లు పైనే ఆర్జించేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతకుముందు ఏడాది 2024, 2025 సంత్సరాలలో సంస్థ లాభదాయకంగా సాగింది. ఇక పూజా విద్యా నేపథ్యం వచ్చేసి..బావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే ఆమె ఆమె వాషింగ్టన్ డిసి-ఆధారిత లాభాపేక్షలేని సంస్థ అయిన ఈక్వల్ రైట్స్ సెంటర్లో పౌర హక్కుల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందిలా..స్నేహితులకు ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీంల రుచి చూపించినప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చేసినట్లు గుర్తు చేసుకుంది. అల్లం-స్టార్ సోంపు ఐస్ క్రీమ్ - ఒక డిన్నర్ పార్టీలో తక్షణమే అందర్నీ ఆకట్టు కోవడంతో..ఇలాంటి టేస్టే టేస్టీ ఐస్‌క్రీం షాపు పెట్టాలని భావించారట ఆమె. అయితే తన ఉత్పత్తులు మార్కెట్లో క్లిక్ అవుతాయో లేతో అన్న సందేహం మాత్రం బాగా ఉండేదని చెప్పుకొచ్చారామె. అయితే తన షాపుకు వచ్చే కస్టమర్ ఎలాంటి ఫ్లేవర్ కోరుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తూ..టేస్టీ, టేస్టీ..మలై ఐస్‌క్రీమ్‌ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే తన షాపు కి వచ్చే కస్టమర్ ఎవరు?, వాళ్లకేం కావాలన్నదే పూర్తిగా అవగాహన ఉండాలని, లేదంటే వ్యాపారం లాభదాయకంగా ఉండదని అంటోంది. అలాగే తాను కేవలం లాభాల మీదే గాక, వ్యాపార విస్తరణపై కూడా దృష్టిపెట్టానని అన్నారు. అలాగే తాను వ్యాపారాన్ని చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి..అన్ని విధాల క్లిక అవుతుందని నమ్మకం కొనసాగేక ముందుకు తీసుకెళ్లానని అన్నారు. అలాగే భారతీయ రుచులు ప్రయోగాత్మకమైనవి కావు, ఈ రుచులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించడం విశేషం. పైగా మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది. అందుకు చాలా గర్వకారణంగా ఉందంటోంది పూజ. View this post on Instagram A post shared by Malai (@malai_icecream) (చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)
స్కూలు బస్సుకి పసుపు రంగే ఎందుకు?
ఫ్రెండ్స్.. మనం రోజూ స్కూలుకి వెళ్లే బస్సు పసుపు రంగులోనే ఉంటుంది. ఎందుకలా ఉంటుందో మీరెపుడైనా ఆలోచించారా? ఎందుకంటారు? ఎందుకంటే పసుపు రంగు ఎంత దూరం నుంచైనా ఆకర్షిస్తుంది. దానివల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి.టాక్సీలు, స్కులు బస్సులకు, రసాయనాలను సూచించే ఫలకాలకు ఈ రంగును వాడుతుంటారు. ప్రమాదాన్ని సూచించే సందర్భాలకి ఎరుపు రంగుని వాడితే, జాగ్రత్త పాటించాల్సిన సూచనల కోసం పసుపుని వాడుతారన్నమాట. అలాగే ట్రాఫిక్ సిగ్నల్‌లో ఈ రంగు లైట్ వెలిగితే.. నెమ్మదిగా వెళ్లాలని అర్థం. ఔనా?హార్న్‌బిల్ అనే పక్షి తన పిల్లల్ని ఎవరూ చూడకుండా, తాకకుండా వుండాలని వాటి నివాసం కోసం చాలా సురక్షితమైన ప్రదేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒక చెట్టుతొర్రలో వుంచి, ఆ తొర్రను వుట్టి లేదా బెరడుతో కప్పేస్తుంది. అయితే గాలి, వెలుతురు కోసం చిన్న రంధ్రం ఒకటి వుంచుతుంది. పిల్లలకు ఆ రంధ్రంలోంచి వుుక్కుతో ఆహారాన్ని అందిస్తుంది. అలా పిల్లలు పెద్దవయ్యేదాకా ఆ తల్లికి ఈ కష్టం తప్పదు వురి.
ఏకలవ్య శిష్యరికం
ఆధునిక భారతదేశంలో ఏకలవ్యుడు దళిత, గిరిజన హక్కులకు ఆదర్శంగా ప్రత్యేకంగా నిలిచాడు. ఏకలవ్యుని గౌరవార్ధం, కేంద్ర ప్రభుత్వం భారతీయ గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను‘ నిర్వహిస్తోంది. అలాగే కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు క్రీడలలో అసాధారణ విజయాలు సాధించిన 19 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులకు, వ్యక్తులకు ఏకలవ్య పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఇది ఇలా ఉండగా హర్యానాలోని గురగ్రామ్ లో ఏకలవ్యునికి అంకితం చేయబడిన ఆలయం ఒకటి ఉంది. ఆ గ్రామంలోని కాండ్సప్రాంతంలో ఆలయాన్ని అక్కడి గ్రామస్తులు అప్పట్లో నిర్మించారు. ఈ ఆలయం వద్దనే ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి గురువైన ద్రోణాచార్యుడికి సమర్పించినట్లు చారిత్రాత్మక ఆధారం. ఏకలవ్యుడంటే తెలియని వాళ్లు...గురు దక్షిణగా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి ఇచ్చిన విషయం గురించి వినని వారు బహుశా ఉండరేమో.... దీక్ష... పట్టుదల...అంకిత భావం... ఎనలేని గురుభక్తితో కాదు పొమ్మన్నా సరే... ఆ గురువునే మట్టిబొమ్మగా మలుచుకొని ఒక గొప్ప విలువిద్య కారుడుగా మహాభారతంలో పేరుగాంచిన మేటి విలుకాడే ఏకలవ్యుడు....నిషాదుల రాజు హిరణ్యధన్వుని కుమారుడే ఏకలవ్యుడు. కౌరవ పాండవులకు ఆస్థాన గురువైన ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలన్నది ఏకలవ్యుని ఆకాంక్ష. అయితే ఏకలవ్యుని సామర్థ్యాన్ని గమనించిన ద్రోణాచార్యుడు అతనికి తగిన శిక్షణ ఇస్తే అతడు విలువిద్యలో కౌరవ, పాండవ రాకుమారులను మించిపోతాడని, దాంతో తాను భీష్మునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమోననే ఉద్దేశ్యంతో ఏకలవ్యుని తన శిష్యునిగా స్వీకరించేందుకు అంగీకరించలేదు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడు అందుకు ఏమాత్రం నిరాశపడక గురువుపై ఉన్న అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసంతో ద్రోణాచార్యుని మట్టిబొమ్మను తయారు చేసుకొని స్వీయ శిక్షణతో గొప్ప విలుకాడుగా పేరుగాంచాడు.ఒకసారి ఒక వేట కుక్క ఏకలవ్యుడిని చూసి మొరగడంతో ఏకలవ్యుడు ఆ కుక్క నోరు తెరిచి ఉండగానే దానికి ఏమాత్రం హాని కలగకుండా ఏడు బాణాలు వేశాడు. ఎంతో నైపుణ్యంతో వేసిన బాణాలను చూసిన అర్జునుడు నిరాశకు లోనై ద్రోణాచార్యునికి విషయాన్ని తెలిపాడు. అనంతరం ఏకలవ్యుని కలిసిన ద్రోణాచార్యుడు, ఏకలవ్యుని ఏకాగ్రతను గుర్తించి అభినందిస్తాడు. అయితే తన ప్రియ శిష్యుడైన అర్జునుని మేటి విలుకానిగా తీర్చిదిద్దుతానని తాను అర్జునునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమో అనే ఉద్దేశ్యంతోనూ, అతను తనను గురువుగా భావించి నేర్చుకున్న విలువిద్యకు తగిన గురుదక్షిణగా ఏకలవ్యుని కుడిచేతి బొటన వేలు కోరతాడు, ఏమాత్రం సంకోచించకుండా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి గురువైన ద్రోణాచార్యునికి సమర్పిస్తాడు ఏకలవ్యుడు. గురువుతో ప్రత్యక్ష సంబంధం లేకుండానే ఆ గురువును ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడలలో నడుస్తూ స్వయంగా విద్యను నేర్చుకునే వారిని ఏకలవ్య శిష్యులు అనే నానుడి అలా వచ్చింది. అమృత బిందువులు – ఆలోచన లేని స్పందన అవగాహన లేని విమర్శ సంపాదన లేని ఖర్చు ప్రయత్నం లేని ఓటమి వీటివల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది.– ‘మన సంబంధం ఆస్తులతో ముడిపడిన వారంతా బంధువులవుతారు. మన విలువలు సుఖ దుఃఖాలతో ముడిపడిన వారంతా ఆత్మ బంధువులవుతారు.– సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శ్రపాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సాయం చేసే స్థాయికి మనం ఎదగాలి.– మనం గెలిస్తే మనవాళ్ళకి మనమేంటో తెలుస్తుంది. మనం ఓడిపోతే మనవాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది.– చిన్నప్పుడు దేన్నయినా పట్టుకుని నిలబడాలి. పెద్దయ్యాక దేన్నయినా తట్టుకుని నిలబడాలి.→ ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. – సి. ఎన్. మూర్తి సీనియర్ పాత్రికేయులు
నిస్వార్థ సేవే నిజమైన ధర్మం
రాగి పాత్రని ప్రతి రోజూ శుభ్రం చేయకపోతే, చిలుం పట్టినట్లుగా, ప్రతి రోజూ విహిత కర్మాచరణ, సత్కర్మలు చేయకపోతే, మనసు కూడా మలినమై పాపగ్రస్థమవుతుంది. సత్కర్మ అంటే కేవలం పూజలు, పునస్కారాలు చేయడం మాత్రమే కాదు. సమాజానికి, తోటి ప్రాణులకు మేలు చేసే ప్రతి పని సత్కర్మే అవుతుంది. కీడు తలపెట్టకపోవడం, అందరూ బాగుండాలని కోరుకోవడం (మానసిక సత్కర్మ). మృదువుగా మాట్లాడటం, సత్యాన్ని పలకడం, ఎవరినీ మాటలతో గాయపరచకపోవడం(వాచిక సత్కర్మ). శ్రమించి పని చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, సమాజసేవ చేయడం(శారీరక సత్కర్మ). భారతీయ సంస్కృతిలో ‘యద్భావం తద్భవతి‘ అని అంటారు. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే మన పనులు అలానే ఉంటాయి. భారతీయ జీవన విధానంలో, ధర్మశాస్త్రాలలో సత్కర్మాచరణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మనం చేసే పనులే మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనిషి పుట్టుకతో గొప్పవాడు కాడు, తను చేసే కర్మల (పనుల) ద్వారానే గొప్పవాడవుతాడు. మనం చేసే ప్రతి చిన్న మంచి పని సమాజంలో ఒక సానుకూల మార్పుకు నాంది పలుకుతుంది. కాబట్టి, ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలి.రోజుకు కొంత సమయం సత్సాంగత్యంలో గడపడం వల్ల పోనుపోను మనసు ప్రక్షాళితమవుతుంది. ఒకరి అనుభవం, జిజ్ఞాస ఇతరులకు చేరతాయి. దీనివల్ల వేరే ఆలోచనలు దూరంగా ఉంటాయి. నిజజీవితంలో ఏదైనా కర్మ నిర్వర్తించేటప్పుడు, అది నాకు, ఇతరులకు మంచి చేస్తుందా అనే ప్రశ్న వేసుకోవడం, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా భగవదర్పితం చేయడం వల్ల మోక్షమార్గం సులువవుతుంది. మనసు పూర్తిగా ఆ పరమాత్మపై లగ్నమైనప్పుడు, లౌకికమైన భయాలు మనిషిని ఏమీ చేయలేవు. మనసుని దైవపరం చేయడం వల్ల మనం చేసే ప్రతి పనీ నిష్కామ కర్మ అవుతుంది. సంసారమనే సాగరంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, భగవంతుడనే నావ మనల్ని మునిగిపోనివ్వదు. క్రోధం, ఈర‡్ష్య, ద్వేషం వంటి అంతర్గత శత్రువులనే మంటలు మనల్ని దహించలేవు. మనసు ప్రశాంతమైన మలయమారుతంలా మారుతుంది. లోకంలో మన చుట్టూ ఉండే ప్రతికూలతలనే విషం వ్యక్తిత్వాన్ని లేదా మనశ్శాంతిని హరించలేదు.‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం లేకుండా, ‘అంతా దైవ నిర్ణయం, నేను కేవలం నిమిత్తమాత్రుడిని’ అనే భావంతో కర్మలు చేయడం వల్ల విజయం వచ్చినా పొంగిపోము, అపజయం ఎదురైనా కుంగిపోము.ఒక వ్యక్తి చేసే ’మంచి పని’ అనేది కేవలం ఎదుటివారికి సహాయం చేయడం మాత్రమే కాదు, అది సమాజంలో ఒక సానుకూల మార్పుకు పునాది వేస్తుంది. మంచి పనిని ఆచరించడానికి పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు, మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులే గొప్ప మార్పును తెస్తాయి. మంచి పని చేసేటప్పుడు ఏ గుర్తింపునూ లేదా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తే, అది పైన మనం చెప్పుకున్న ’నిష్కామ కర్మ’ అవుతుంది. ఫలితం ఆశించకుండా చేసే సాయం ఎప్పుడూ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.మానవ జీవితం కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ‘కర్మ’ అంటే పని. మనం చేసే పనులే మన భవిష్యత్తును, మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ‘సత్’ అంటే మంచి, ‘ఆచరణ’ అంటే అనుసరించడం. అంటే, శాస్త్ర సమ్మతంగా, ధర్మబద్ధంగా, పరోపకార భావంతో చేసే పనులనే సత్కర్మాచరణ అంటారు. ఒక వ్యక్తి చేసే మంచి పని సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి చెట్టు నాటితే, అది వందల మందికి నీడనిస్తుంది. డబ్బు, పదవులు శాశ్వతం కావు. మనిషి మరణించిన తర్వాత కూడా అతను చేసిన మంచి పనులు మాత్రమే జీవించి ఉంటాయి. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఒక చిన్న మంచి పనినైనా చేస్తూ సత్కర్మ మార్గంలో పయనించాలి.– ఆనంద ‘మైత్రేయ’మ్
అంతర్జాతీయం
దుబాయ్ లాటరీ: భారతీయులకు జాక్‌పాట్
అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో మరోసారి భారతీయులను అదృష్టం వరించింది. యూఏఈలో ప్రవాసుల కలల సిరి 'అబుదాబీ బిగ్ టికెట్' మే నెల మొదటి వారపు ఈ-డ్రా ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ లక్కీలో డ్రాలో 1,00,000 దిర్హాల (సుమారు రూ. 26 లక్షలకు పైగా) నగదు బహుమతిని మొత్తం నలుగురు గెలుచుకున్నారు. ఈ నలుగురు విజేతలలో ఇద్దరు భారతీయులు కాగా, మిగిలిన ఇద్దరు మలేషియా, బంగ్లాదేశ్ పౌరులు. విజేతలలో ప్రతి ఒక్కరికీ 25,000 దిర్హాల (సుమారు రూ. ఆరున్నర లక్షలు) చొప్పున నగదు బహుమతి దక్కనుంది.లాటరీ గెలుచుకున్న భారతీయలు వీరేకేరళకు చెందిన 39 ఏళ్ల జవాద్ నజీర్.. ఖతార్‌లోని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పనిచేస్తున్నాడు. అయితే ఖతార్‌లో ఉంటున్న జవాద్, అబుదాబి బిగ్ టికెట్ గురించి తెలుసుకుని గత మూడేళ్లుగా తన 20 మంది స్నేహితులతో కలిసి టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్టకేలకు అతడికి అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో గెలిచినట్లు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మొదట నమ్మలేకపోయానని నజీర్ తెలిపాడు. అదేవిధంగా వచ్చిన బహుమతి మొత్తాన్ని మా స్నేహితులమంతా సమానంగా పంచుకుంటాం అని జవాద్ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు బెంగళూరు చెందిన వినయ్ పుదుమన గత 15 ఏళ్లుగా దుబాయ్‌లో నివాసముంటున్నాడు.గత ఐదేళ్లుగా బిగ్ టికెట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వినయ్.. మొదట్లలో తన స్నేహితులతో కలిసి టికెట్లు కొనేవాడు. కానీ ఆ తర్వాత సొంతంగానే టికెట్లు కొనడం ప్రారంభించాడు. ఆన్లైన్ ద్వారా ఆయన కొనుగోలు చేసిన 037772 అనే నంబర్ టికెట్ అతడికి భారీ నగదుబహుమతిని తెచ్చిపెట్టింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీకి తోడుగా పాక్ సైన్యం భారీ మోహరింపు
ఇస్లామాబాద్:పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ ఏ క్షణమైనా మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనిక బలగాలను పంపింది. సైనికులతో పాటు ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. అయితే, ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇరాన్‌తో సాంస్కృతిక, భౌగోళిక సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది.ఒప్పందం ప్రకారం, ఇరాన్ దాడులు చేస్తే తిప్పికొట్టేలా సైన్యం, యుద్ధ విమానాలను సౌదీకి పంపినట్లు భద్రతా అధికారులు ధృవీకరించారు. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వాటిలో ప్రత్యర్థి దేశాల దాడుల సమయంలో ఒకరికొకరు అండగా నిలబడాలని నిబంధనలు ఉన్నాయి. పాకిస్థాన్-సౌదీ రక్షణ ఒప్పందం పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ, ఒకరిపై దాడి జరిగితే మరొకరు రక్షణకు రావాల్సి ఉంటుందని ప్రకటించారు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈ ఒప్పందం సౌదీ అరేబియాను పాకిస్థాన్ అణు కవచం కింద ఉంచుతుందని సూచించారు.సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఏప్రిల్ ప్రారంభంలో 16 జేఎఫ్-17 యుద్ధ విమానాలు, రెండు డ్రోన్ స్క్వాడ్రన్లు, హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను సౌదీకి పంపింది. ఈ మోహరింపులో 8,000 సైనికులు ఉన్నారు. అవసరమైతే మరిన్ని సైనికులను పంపుతామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది.ఘర్షణ సమయంలో పంపిన సైనికులు, వైమానిక దళ సిబ్బంది ప్రధానంగా సలహా, శిక్షణ పాత్ర పోషిస్తారని అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 80,000 పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపే అవకాశం ఉంది. అదనంగా యుద్ధ నౌకలు పంపే అంశం కూడా ఒప్పందంలో ఉంది.ఈ మోహరింపు ప్రతీకాత్మకంగా కాకుండా, యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, వేలాది సైనికులతో కూడిన పెద్ద స్థాయి చర్య అని వర్గాలు పేర్కొన్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, సౌదీ ఇరాన్‌పై గోప్య దాడులు జరిపింది. పాకిస్థాన్ గతంలో కూడా సౌదీకి సైనిక శిక్షణ, సలహా అందించింది. మరోవైపు, సౌదీ పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక సహాయం అందించింది.
పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్‌కు రహస్యంగా..
పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ ఏం చేసినా భారత్‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. భారత్ త్రివిధ దళాల వద్ద ఉన్న విధ్వంసకర ఆయుధాలను చూసి పాక్ భయపడుతుంది. భారత్‌లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో, ఎలాంటి అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయో అటువంటివి అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుంది. కానీ, అగ్ర దేశాల వద్ద అప్పులు అడుక్కునే పాక్ ఎన్నో రకాల ఆయుధాలను తన అమ్ములపొదిలో చేర్చుకోలేకపోయింది. ప్రపంచంలో 6 దేశాలకు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉంది. అవే.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, భారత్. ఇక ఇజ్రాయెల్ వద్ద క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద అణు బాలిస్టిక్ క్షిపణిని మోసే ఒక సంప్రదాయ జలాంతర్గామి ఉంది. భారత్‌కు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉండడంతో తమకూ కావాలని పాక్ ప్రయత్నాలు జరిపింది.చైనా నౌకాదళం తమ గ్వాదర్ పోర్ట్‌ను శాశ్వతంగా వినియోగించుకునే అవకాశం ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ప్రతిఫలంగా అణుదాడి చేయగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు లేదా అణు ఆయుధ వ్యవస్థను ఇవ్వాలని చైనాను పాక్ కోరిందని అమెరికాకు చెందిన ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ పేర్కొంది. శత్రుదేశం ముందుగా అణుదాడి చేసినా.. జలాంతర్గాముల నుంచి తిరిగి అణుదాడి చేసే శక్తిని పొందాలని పాక్ భావిస్తోంది. దీన్ని అణు నిరోధక వ్యవస్థలో అత్యంత కీలక భాగంగా భావిస్తారు.పాక్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించి.. పాకిస్థాన్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించామని, దాని ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నామని ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ తెలిపింది. 2024లో పాకిస్థాన్ సైన్యం-చైనా ద్వైపాక్షిక చర్చల్లో ఈ డిమాండ్ వచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యానికి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నాయకత్వం వహించాడు. 2024 ఆరంభంలో గ్వాదర్‌ను చైనా సైన్యానికి శాశ్వత స్థావరంగా మార్చేందుకు అనుమతి ఇస్తామని చైనాకు పాకిస్థాన్ రహస్యంగా హామీ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు ఇవ్వాలని చైనాను కోరింది. దీంతో ఇప్పటికే పాక్ వద్ద ఉన్న గగనతల, భూతల అణ్వాయుధాల ద్వంద్వ వ్యవస్థను సముద్ర వ్యూహాత్మక ఆయుధాలతో కూడిన త్రివిధ వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిమాండ్ అసంబద్ధమని చైనా భావించడంతో చర్చలు నిలిచిపోయాయి.ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేటివ్‌లోని కీలక అధికారి రహస్య కేబుల్ వివరాలు కూడా ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ వెల్లడించింది. దీంతో, అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్.. అటు చైనా, ఇటు అమెరికాతో చర్చోపచర్చలు జరిపినట్టు స్పష్టమైంది. గత ఐదేళ్లలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలను మలిచిన పరిణామాలను ఈ కథనం వివరించింది. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే.. వ్యూహాత్మక ఆయుధాలు ఇవ్వాలని చైనాతోనూ పాకిస్థాన్ బేరసారాలు జరిపింది.అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు 3 రకాలుగా ఉంటాయి.. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు, బాలిస్టిక్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు.ఈ మూడింట్లో పాకిస్థాన్ దేన్ని కోరిందో పాకిస్థాన్ కథనంలో స్పష్టత లేదు. 1970 చివర, 1980 ఆరంభంలో చైనా సహకారంతో పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసింది. రహస్య అణు సాంకేతిక బదిలీల్లో ఇదే తొలి ఉదాహరణగా భావిస్తున్నారు. అధిక సాంద్రత యురేనియం సరఫరాతో పాటు, 1960లలో పరీక్షించిన 12 కిలోటన్నుల సామర్థ్యమున్న సీహెచ్ఐసీ-4 అణు విస్ఫోటక రూపకల్పనను కూడా పాకిస్థాన్‌కు చైనా ఇచ్చింది. 1990లలో అణ్వాయుధాలను ప్రయోగించే ఎం-11 మధ్యదూర బాలిస్టిక్ క్షిపణులను కూడా పాకిస్థాన్‌కు చైనా విక్రయించింది.ఈ ఆయుధాలతో గగనతలం, భూమి నుంచి ప్రయోగించే ద్వంద్వ అణు వ్యవస్థను పాకిస్థాన్ తయారుచేసుకుంది. కానీ త్రివిధ వ్యవస్థలో మూడో భాగమైన సముద్ర ఆధారిత అణ్వాయుధ సామర్థ్యం మాత్రం సాంకేతిక, ఆర్థిక పరిమితుల వల్ల సాధ్యం కాలేదు.సముద్రం అడుగునుంచి ప్రయోగించే అణ్వాయుధాను అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా భావిస్తారు. శత్రువు తొలి అణుదాడి చేసినా, తీవ్ర నష్టం జరిగిన తర్వాత కూడా ప్రతిదాడి చేయొచ్చు. 2017లో 450 కిలోమీటర్ల పరిధితో జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి త్రివిధ అణు వ్యవస్థ పూర్తి చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. కానీ పాకిస్థాన్ వద్ద కేవలం 5 క్రియాశీల సంప్రదాయ జలాంతర్గాములు మాత్రమే ఉండటం, క్షిపణి పరిధి తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రాథమిక స్థాయి సముద్ర అణు నిరోధక వ్యవస్థగానే మిగిలింది.
ఇజ్రాయెల్‌కు పదులకొద్దీ విమానాల్లో మందుగుండు సామగ్రి
టెల్ అవీవ్: జర్మనీలోని స్థావరాల నుంచి అమెరికాకు చెందిన పదుల కొద్దీ కార్గో విమానాలు మందుగుండు సామగ్రితో సోమవారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో దిగినట్లు అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్ 13 సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించే ఉద్దేశంతోనే వాషింగ్టన్ చర్యలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు పెరిగాయి. దీంతో పశ్చిమాసియా ఘర్షణ మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా చర్యలు ఇరాన్‌పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో భాగమని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు, యుద్ధ నష్టపరిహారం అంశాలపై చర్చలు నిలిచిపోయిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్ ముందున్న సమయం వేగంగా ముగుస్తోంది. వారు వెంటనే కదలాలి. లేకపోతే వారి దగ్గర ఏమీ మిగలదు. సమయం అత్యంత కీలకం” అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు.చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా విధించిన ప్రధాన షరతులను ఇరాన్ మీడియా బయటపెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించాలని, ఒక అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించాలని, యుద్ధ నష్టపరిహారం డిమాండ్‌ను వదులుకోవాలని అమెరికా కోరింది.దీనికి ప్రతిగా టెహ్రాన్ కూడా చర్చలపై 5 షరతులు పెట్టింది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా లెబనాన్‌లో సైనిక చర్యలు ముగియాలని, ఇరాన్‌పై ఆంక్షలు తొలగించాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.అదనంగా యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలని, హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ వ్యూహాత్మక మార్గంలో నౌకల రాకపోకలపై ఇరాన్ నియంత్రణ కఠినతరం చేసింది. మరోవైపు ఇరాన్ పోర్టులు, సముద్ర వాణిజ్యంపై అమెరికా విస్తృత నౌకాదళ దిగ్బంధంతో ఒత్తిడి పెంచింది.
జాతీయం
120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశ
ఈటానగర్: కాలుష్యమయ భారతంలో ఎన్నో వృక్షజాతులు అంతరించిపోయాయి. గత 120 ఏళ్లుగా కన్పించకుండా పోయిన ఒక పుష్పజాతి సైతం శాశ్వతంగా అంతర్థానమైపోయిందని అంతా భావిస్తున్న వేళ తాజాగా దాని జాడలు అరుణాచల్‌ప్రదేశ్‌లో కన్పించాయి. దీంతో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (Botanical Survey of India)పరిశోధకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తూర్పు హిమాలయ పర్వతశ్రేణుల్లో సిక్కింలో 1905లో చివరిసారిగా ‘జీయుం మాక్రోసెపాలం’అనే రోజాపూల రకానికి చెందిన పుష్పజాతి మొక్కను చూశారు. ఆ తర్వాత పరిశోధకులకు అది ఎక్కడా కనిపించలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లోని సేలా పాస్ వద్ద దీని జాడను కనుగొన్నారు. సేలా పాస్ అనేది చైనా సరిహద్దుల్లో భారత సైన్యానికి అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. పశ్చిమ అరుణాచల్‌లో ఆల్పైన్రీజియన్గా పిలిచే తవాంగ్, పశి్చమ కెమాంగ్ జిల్లాల్లో సుభాజిత్ లాహిరి, మోనాలిసా దాస్, సుధాంశు శేఖర్ దాస్లతో కూడిన బొటానికల్ పరిశోధకుల బృందం బొటానికల్ సర్వే చేపట్టగా సముద్రమట్టానికి ఏకంగా 13,780 అడుగుల ఎత్తులో ఈ మొక్కను కనుగొన్నారు. దీంతో తూర్పు హిమాలయపర్వతశ్రేణుల్లో అంతర్థాన మైందని భావిస్తున్న ఈ మొక్క ఇంకా ఉనికిలో ఉందని ప్రపంచానికి తెల్సిందని పరిశోధకులు వెల్లడించారు. వీళ్ల పరిశోధనా సంబంధిత వివరాలు ఫైటోటాక్సా అనే అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్వీళ్ల పరిశోధన తూర్పు హిమాలయాల్లోని జీవావరణవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను మరోసారి ఎత్తిచూపిందని జర్నల్ పొగిడింది. జీయుం మాక్రోసెపాలం జాతి పూలు చిన్నపాటి రోజాపుష్పాల్లా ఉంటాయి. ఈ మొక్కలకు పసుపురంగు పూలు పూస్తాయి. చిన్న కాండం మీద పుష్పం వికసిస్తుంది. ఒక్కోసారి ఒక్కచోటే ఎక్కువ పుష్పాలు పుష్పగుచ్ఛంగా ఏర్పడతాయి. హిమాలయాల్లోని అత్యల్ప ఉష్ణోగ్రత, మంచు మయ అతిశీతల కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుని సైతం ఈ పుష్పజాతి జీవిస్తుంది. ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?ఇప్పటికే ఈ మొక్కను అంతర్జాతీయ ప్రకృతి పర్యవేక్షణ కూటమి (ఐయూసీఎన్) భారత్‌లో అంతరించిపోయే ఆస్కార మున్న జాతుల జాబితాలో చేర్చింది. జీవవైవిధ్యానికి నెలవైన తూర్పు హిమాలయాల్లోనూ అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పుల వంటివి ఇలాంటి చిన్న మొక్కల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్
వీధుల్లో కుక్కలు కనపడ్డానికి వీల్లేదు: సుప్రీం కోర్టు
వీధి కుక్కల అంశం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కల తరలింపు కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పింది. అలాగే తమ గైడ్ లైన్స్‌ను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలన్న విజ్ఞప్తులను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేస్తూ.. జంతు ప్రేమికులకు ఝలక్ ఇచ్చింది. వీధి కుక్కల దాడుల వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రతి పౌరుడు సొసైటీలో స్వేచ్ఛగా(ప్రత్యేకించి పబ్లిక్ ప్లేసుల్లోనూ) జీవించాలే తప్ప భయంతో కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో కిందటి ఏడాది నవంబర్ 7న కఠిన ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం.. ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా ప్రదేశాల నుండి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని చెప్పింది. వాటికి స్టెరిలైజ్, వ్యాక్సినులు వేసినా కూడా తిరిగి పబ్లిక్‌ప్లేసుల్లో వదలొద్దని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే.. ఈ మార్గదర్శకాలను సవరించాలంటూ జంతు సంక్షేమ సంఘాలు, డాగ్ ఫీడర్స్ పిటిషన్లు వేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2023కు విరుద్ధమని వాదించారు. ఆ నియమాల ప్రకారం, కుక్కలను స్టెరిలైజ్ చేసి, వ్యాక్సిన్ వేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని గుర్తు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియా.. ఆ వాదనతో ఏకీభవించలేదు. తమ ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించింది.తాజా విచారణలో.. ప్రేక్షక పాత్ర వహిస్తున్న ప్రభుత్వాల తీరును సుప్రీం కోర్టు ఆక్షేపించింది. చిన్న పిల్లలు, వృద్ధులు, విదేశీ పర్యాటకులు కూడా వీధి కుక్కల దాడులకు గురైన ఘటనలను కోర్టు ప్రస్తావించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై దాడులు బాధాకరమని వ్యాఖ్యానించింది. తాము ఆదేశాలిచ్చాక కూడా కుక్క కాట్ల ఘటనలు చోటు చేసుకుంటుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్” అనే డార్వినియన్ సూత్రం వాస్తవంగా అమలవుతున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల వల్ల కలిగే ప్రమాదాలను నిర్లక్ష్యం చేయరాదని కోర్టు ఈ సందర్భంగా హెచ్చరించింది. ప్రజల ప్రాణ భద్రతను కాపాడటం ప్రభుత్వాల కర్తవ్యమని.. ఈ విషయంలో ప్రభుత్వాలు పాసివ్ స్పెక్టేటర్లుగా ఉండకూడదని.. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాబట్టి తమ గైడ్‌లైన్స్‌ను కచ్చితంగా పాటించాల్సిందేనని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాటిని ఆహారం పెట్టాలని జంతు ప్రేమికులకు స్పష్టం చేసింది.‘‘వీధుల్లో కుక్కలు కనిపించకూడదు. పిచ్చి కుక్కలకు యుథనేషియా ఇచ్చి చంపేయండి. ప్రమాదకర కుక్కలను సహించొద్దు. రేబీస్ కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించాలి. ప్రతిజిల్లాలో నియంత్రణకు యంత్రాంగం ఉండాల్సిందే. వీధి కుక్కల బెడదను నివారించాల్సిందే. ఇదొక సీరియస్ పబ్లిక్ న్యూసెన్స్. మా ఆదేశాలను పాటించని అధికారులు కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని సుప్రీం కోర్టు తీర్పు సందర్భంగా వెల్లడించింది.
మమతకు సీఎం సువేందు ఝలక్
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. గత టీఎంసీ పాలనలో జరిగిన అవినీతి, మహిళలపై నేరాలపై దర్యాప్తు కోసం ఆయన రెండు కమిషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్లలో ఒక దాని కీలక బాధ్యతలు సీనియర్ ఐపీఎస్ అధికారిణి దమయంతి సేన్‌కు ఆయన అప్పగించారు. దమయంతి సేన్ 1996 బ్యాచ్ అధికారిణి. కోల్‌కతాకు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్క్ స్ట్రీట్ గ్యాంగ్‌రేప్ కేసు(2012) కేసును స్వయంగా చేధించి.. నిందితులను తక్కువ టైంలోనే పట్టుకున్నారామె. ఆ సమయంలో దేశం మొత్తం ఆమెపై ప్రశంసలు గుప్పించింది. అయితే.. (పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేసు కేసు గురించి.. 2012 ఫిబ్రవరి 6వ తేదీన ఒక మహిళపై కారులో గ్యాంగ్‌రేప్ జరిగింది)ఈ కేసు విషయంలోనే ఆమె అప్పటి దీదీ సర్కార్ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆ సమయంలో మమతా బెనర్జీ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ కేసు ఒక కల్పితం అని, టీఎంసీ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రగా అభివర్ణించారామె. అంతటితో ఆగకుండా దమయంతిని క్రైమ్ బ్రాంచ్ నుంచి ట్రైనింగ్ కాలేజీకి బదిలీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. నిజాయితీకి మమత ప్రభుత్వం ఇచ్చిన కానుక అంటూ బీజేపీ, వామపక్షాలు తిట్టిపోశాయి.అటు ఆ టైంలో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు లభించింది. అయితే మమతా సర్కార్ తీసుకున్న నిర్ణయంపై దమయంతి సేన్ ఇన్నేళ్లు మౌనంగా పాటించారు. రోటీన్ ట్రాన్స్ఫర్ను అంగీకరించి తన విధుల్ని చేసుకుంటూ పోయారు. ఆపై ప్రమోషన్ల విషయంలోనూ ఆమెకు అన్యాయమే జరిగిందని.. పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు ఇస్తూ వచ్చారని విమర్శలు ఉన్నాయి. అయితే ఆమె సిన్సియారిటీని గుర్తించిన కలకత్తా హైకోర్టు.. 2022లో నాలుగు అత్యాచార కేసులు, రసికా జైన్ మరణం కేసును అప్పగించి మమతా సర్కార్‌కు ఝలక్ ఇచ్చింది.తాజాగా.. రిటైర్డ్ జస్టిస్ సంపతి చటర్జీ అధ్యక్షతన నేతృత్వంలో సువేందు సర్కార్ కమిషన్ వేయగా.. దమయంతి సేన్‌ను అందులో మెంబర్ సెక్రటరీగా నియమించారు. ఈ కమిషన్ మహిళలు, పిల్లలపై దాడులను పరిశీలించనుంది. ఇందులో సందేశ్‌ఖాలి, కస్బా, బోగ్టుయి వంటి కేసులు కూడా ఉన్నాయి. దమయంతి సేన్ తిరిగి కీలక బాధ్యతల్లోకి రావడం.. బెంగాల్ రాజకీయాల్లో ఒక ముఖ్య పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
భర్త.. రెండో భర్త.. ఇద్దరు ప్రియులు!
వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏదో ఒక మూల రోజుకో దారుణం జరుగుతోంది. ప్రేమ, మోసం, హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం.. ఇలా ఒక్కో తీరు నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా గుజరాత్లో బయటపడ్డ ‘శాంతిగిరి కేసు’ ట్విస్టుల మీద ట్విస్టులను ఇచ్చింది. ఈ తరహా కేసుల్లోనే ఓ కొత్తదనం చూపించింది. సురేంద్రనగర్ జిల్లాలో శాంతిగిరి గోస్వామి అనే వ్యక్తి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలోనే అతను దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ కేసును చేధించిన పోలీసులు.. నిందితుల నుంచి విస్తుపోయే వివరాలను సేకరించారు. అసలేం జరిగిందంటే.. జాగృతి గోస్వామి అనే మహిళ సుఖ్దేవ్గిరి గోస్వామిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొంతకాలానికి ఆమె తన భర్త పెద్ద అన్న శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను వదిలి.. అతనితో పారిపోయి మరో గ్రామంలో కొత్త జీవితం మొదలుపెట్టింది. అయితే అక్కడా ఆమె బుద్ధి వక్రదారి పట్టింది. శాంతిగిరి ట్రక్ డ్రైవర్ పని కోసం తరచూ బయట ఉండేవాడు. ఈ సమయంలో కాంతిలాల్ అలియాస్ భారత్ సబారియా అనే వ్యక్తితో జాగృతి సంబంధం పెట్టుకుంది. కాంతిలాల్ ఏకంగా జాగృతి ఇంటి పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. శాంతిగిరి లేని సమయంలో ఇద్దరూ కలుసుకునేవారు. అయితే ఏదో ఒకరోజు తమ విషయం తెలుస్తుందని.. శాంతిగిరిని అడ్డు తొలగించుకోవాలని ఆ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యూనిస్ అనే వ్యక్తికి 25,000 సుపారీ ఇచ్చారు. అయితే యూనిస్ ‘భలే’ మోసం చేశాడు. నిద్రపోతున్న శాంతిగిరిని ఫోటో తీసి హత్య చేశానంటూ జాగృతికి పంపాడు. అయితే మరుసటి రోజు ఉదయం భర్త బతికే ఉండడంతో జాగృతి షాక్‌కు గురైంది. తీరా చూస్తే యూనిస్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో జాగృతి, కాంతిలాల్ స్వయంగా హత్యకు ప్లాన్ చేశారు. నిద్రిస్తున్న శాంతిగిరి గొంతును కాంతిలాల్ నులిమి చంపగా.. జాగృతి దుప్పటి తోసి శబ్దం రాకుండా చేసింది. ఆపై శవాన్ని గదిలో దాచారు. ఆ తర్వాత దీపక్ అలియాస్ మున్నా అనే వ్యక్తి సహాయంతో కారులో తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు కథ అల్లే ప్రయత్నం చేశారు. శాంతిగిరి కొత్త ఉద్యోగం కోసం బయటి ఊరికి వెళ్లాడని.. ఫోన్ నెంబర్ మార్చాడని అందరినీ నమ్మించారు. అలా ఎనిమిది నెలలు గడిచాయి. ఈ గ్యాప్‌లో కాంతిలాల్‌కు తెలియకుండా దీపక్‌తో ఆమె వ్యవహారం నడిపించింది. అయితే.. శాంతిగిరి బంధవుల ఎంట్రీతో సీన్ మారింది. జాగృతి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు వాళ్లు. అలా ఈ మిస్సింగ్ మిస్టరీ కేసు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు చేరింది. రెండు నెలల దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం.. జాగృతి, కాంతిలాల్‌ను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న దీపక్ కోసం గాలింపు చేపట్టింది.
ఎన్ఆర్ఐ
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
క్రైమ్
రూ. 51 లక్షలు, ఫార్చ్యూనర్ కారు కోసం దారుణం?
తమ బిడ్డ పెళ్లి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. రూ. 11 లక్షల నగదు, రూ. 50 లక్షల విలువైన బంగారం, ఫర్నిచర్ , ఒక స్కోర్పియో (Scorpio) కారు లాంటి ఖరీదైన కానుకలను కట్నంగా ఇచ్చారు. కానీ ఏం లాభం, పెళ్లైన 17 నెలలకే తీరని కట్నం దాహానికి 25 ఏళ్ల కొత్త కోడలు బలైపోయింది. దీంతో అమ్మాయి తల్లి దండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్యంత హృదయ విదారకమైన ఈ ఘటన, గ్రేటర్ నోయిడాలోని జల్పురా ప్రాంతంలో, Ecotech-III పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా (జల్పురా ప్రాంతం)లో 25 ఏళ్ల దీపికా నాగర్ అనే వివాహిత తన అత్తవారింటి పైకప్పు (టెర్రస్) పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2024 డిసెంబరులో దీపిక వివాహం జరిగింది. ఈ వివాహం కోసం దీపిక తండ్రి సంజయ్ నగర్ దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లయిన 3-4 నెలల నుంచే అత్తవారింటి వేధింపులు మొదలయ్యాయని దీపిక తల్లిదండ్రలు ఆరోపించారు. నిందితులు అదనంగా ఒక ఫార్చ్యూనర్ కారు, రూ. 51 లక్షల నగదు కావాలని దీపికను వేధించడం ప్రారంభించారు. కట్నం కోసమే ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఎలాగైన తనబిడ్డ సంసారం నిలబడుతుందనే ఆశతో, సర్దుకుపోతుందని భావించి తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని దీపిక తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అంత కట్నం ఇచ్చినా నా కూతురు నాకు దక్కలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పడిపోయిందా? తోసేశారా? ఆదివారం నాడు దీపికా తన తండ్రికి ఫోన్ చేసి, భర్త మరియు అత్తవారింటి వారు తనను తీవ్రంగా కొడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దాంతో తండ్రి బంధువులు ఆ సాయంత్రం అత్తగారింటికి వెళ్లి గొడవను సర్దిచెప్పి, వారు ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, రాత్రి 12:30 గంటల ప్రాంతంలో దీపికా మూడో అంతస్తునుంచి పైనుంచి కింద పడిందని సమాచారం అందింది.అయితే ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి చెప్పారు. ఆమెను తీవ్రంగా కొట్టి, కడుపులో స్క్రూడ్రైవర్ లేదా కత్తితో పొడిచి, ఆపై పైనుంచి కిందకు తోసేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, ముక్కు, చెవులలోంచి రక్తం కారుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను కొట్టి, ఆపై అది ఒక ప్రమాదంలా కనిపించేలా చేయడానికి కిందకు విసిరేశారని దీపిక బాబాయ్ విశేష్ నాగర్ ఆరోపించారుమామ, భర్త అరెస్ట్సెంట్రల్ నోయిడా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పైకప్పు పైనుంచి దూకి మరణించినట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దీపిక భర్త రితిక్ తన్వర్, మామ మనోజ్ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శవపరీక్ష (Post-mortem) నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
మొయినాబాద్ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: మొయినాబాద్ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన మొత్తం ఎనిమిది మంది చంపేందుకు నిందితురాలు కరీమాబేగం, ఆమె భర్త రెహమాన్ ప్లాన్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.తాండూరు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే కరీమాబేగం, రెహమాన్ దంపతులు ఆబేదాబేగం, మహబూబాబీ అనే ఇద్దరు మహిళల వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. అప్పు తీసుకున్న తర్వాత నెలలు గడుస్తున్నా కరీమాబేగం దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో వారిపై మహిళలిద్దరూ ఒత్తిడి చేశారు. దీంతో వారిని చంపేయాలని కరీమాబేగం, రెహమాన్ కుట్ర చేశారు. కుట్రలో భాగంగా అప్పు ఇస్తానంటూ మొయినాబాద్ సమీపంలోని తోల్కట్ట ఫాంహౌస్ వద్దకు రావాలని సమాచారం అందించారు. అలా వచ్చిన బాధితుల్ని వేర్వేరు సమయాల్లో గొంతు నులిమి హత్య చేశారు. అక్కడే గొయ్యి తీసి మృత దేహాల్ని పూడ్చిపెట్టారు.మిస్సింగ్ కంప్లయింట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జంట హత్యకేసును ఛేదించారు. తాజాగా పోలీసుల దర్యాప్తులో నిందితులు అప్పు తీసుకున్న ఆరుగురిని హతమార్చేందుకు ఫామ్ హౌస్‌కు పిలిపించుకున్నారని, అప్పు ఇస్తానని చెప్పి ప్రాణం తీసేందుకు ప్రయత్నించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్ మెసేజెస్
భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల గర్భిణి అయిన ట్విషా (31) భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి ముందు తన స్నేహితులకు పంపిన చివరి సందేశాలు వాట్సాప్ చాట్ కలకలం రేపుతోంది. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అంటూ ఆమె తన స్నేహితులకు పంపిన సందేశాలు ఆమె తీవ్రమైన మానసిక ఆందోళన, ఒంటరితనం, పెళ్లి తర్వాత వేదనలో ఉన్నట్లు ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఆమె ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్టు చెబుతున్న బెల్టును పోస్ట్‌మార్టంకు ఎయిమ్స్ భోపాల్‌కు పంపకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ కేసును పక్క దారి పట్టిస్తున్నారంటూ భోపాల్ పోలీసులపై ఆరోపణలు కుదిపేస్తున్నాయి. దర్యాప్తు సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అసలు ఏం జరిగింది?నోయిడాకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన ట్విషా శర్మ, ఢిల్లీలో ఉద్యోగం చేసేది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన లాయర్ సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన అయిదు నెలలకే, మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన భర్త ఇంట్లో ట్విషా శవం వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆమె మరణం ఉరి వేసుకోవడం వల్లే జరిగిందని తేలినప్పటికీ, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాల గుర్తులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియా చాట్స్ కీలకంగా మారాయి.మే 7న ఒక స్నేహితురాలితో వాట్సాప్ చాట్‌లో.. "నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. పెళ్లి కుటుంబాన్ని ఇస్తుంది, కానీ ఎక్కడున్నా మన కోసం మనం పని చేయడం ఆపకూడదు" అని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించి ముందడుగు వేయండి" అని స్నేహితురాలిని హెచ్చరించింది. అలాగే తనకు ఇల్లు, స్నేహితులు బాగా గుర్తొస్తున్నారని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో స్నేహితుడితో మాట్లాడుతూ.. "నేను చిక్కుకుపోయాను బ్రో (I am trapped bro). నువ్వు మాత్రం ఇలాంటి వాటిలో ఇరుక్కోవద్దు. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, సమయం వచ్చినప్పుడు కాల్ చేస్తాను" అని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబంట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ (రిటైర్డ్ జడ్జి)లపై కుటుంబ సభ్యులు హత్య, కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. భర్త, అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించారు. నిందితులు ప్రభావవంతమైన వ్యక్తులు కావడం వల్ల వారికి ముందస్తు బెయిల్ లభించిందని, దీనివల్ల స్థానిక పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై న్యాయం చేయాలని, ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)లో మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్విషా కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసం వెలుపల నిరసన చేపట్టారు. భోపాల్ వచ్చినప్పటి నుండి తాము ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం కోసం మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ట్విషా తండ్రి నవనిధి శర్మ, సోదరుడు ఆశిష్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు .స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.నిందితుల కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉండటంతో పాటు, వారికి సమీప బంధువైన వ్యక్తి లోకాయుక్తగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తున్నారని తండ్రి నవనిధి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కుటుంబ సభ్యుల ప్రకారం పెళ్లయిన దగ్గర్నుంచీ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో తిరిగి వచ్చేయాలని ఆమె భావించింది. ఇంతలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్‌ను సవాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం
ప్రేమోన్మాది మణితేజ మృతి
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. హైదరాబాద్‌లో పరిచయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
వీడియోలు
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
ఇంటికెళ్లి విజిల్ వేసుకోండి.. ఇషాన్ కిషన్ మాస్ ర్యాగింగ్
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం
నీ అయ్యా జాగీరా..? ధూళిపాళ్ల కు ఇచ్చిపడేసిన దాసరి రాము
మీరు హెలికాప్టర్ లో తిరిగి పాపం నిమ్మల రామనాయుడితో 10KM సైకిల్ తొక్కిస్తారా?
నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మా చెప్పుతో... నువ్వు వెంట్రుక కూడా పీకలేవ్...
ఎండ దెబ్బకు... తగలబడిన కారు
చనిపోయిన మహిళకు ట్రీట్మెంట్? ప్రశ్నిస్తే దాక్కుంటున్న డాక్టర్..
భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న సూర్య వీరభద్రుడు
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు


