ధర్మవరం: కూటమి శ్రేణుల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ పనితీరును ఎవరైనా ప్రశ్నిస్తే చాలు అక్రమ అరెస్టులు, దాడులకు పాల్పడటమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ అనుచరులు దౌర్జన్యం చేశారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించిన హైకోర్టు న్యాయవాది అంజన్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు మంత్రి సత్యకుమార్ అనుచరులు.
సత్యకుమార్ అనుచరుల దాడిలో అంజన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి సత్యకుమార్ పనితీరు బాగాలదేని సోషల్ మీడియాలో న్యాయవాది అంజన్‌రెడ్డి ప్రశ్నించారు. తమనే ప్రశ్నిస్తారా అనే అక్కసుతో అంజన్‌రెడ్డిపై సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారు.
బంధువును పరామర్శించేందుకు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి అంజన్‌రెడ్డి వచ్చిన సమయంలో దాడికి దిగారు. ఈ ఘటనలో అంజన్‌రెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. తనపై దాడి ఘటనకు సంబంధించి మంత్రి సత్యకుమార్ పీఏ, అనుచరులపై అంజన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


