సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. 15 రోజుల్లో 25వేల బుకింగ్స్! | Oben Rorr Evo Crosses 25000 Bookings In 15 Days | Sakshi
Sakshi News home page

సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. 15 రోజుల్లో 25వేల బుకింగ్స్!

May 19 2026 3:50 PM | Updated on May 19 2026 4:04 PM

Oben Rorr Evo Crosses 25000 Bookings In 15 Days

ఓబెన్ ఎలక్ట్రిక్ ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన 'ఓబెన్ రోర్ ఈవో' కేవలం 15 రోజుల్లో 25వేల బుకింగ్స్ సొంతం చేసుకుంది. కంపెనీ మొదటి వెయ్యిమంది కస్టమర్లకు మాత్రమే రూ.99,999 వద్ద ఈ బైకును విక్రయించింది. ఈ తరువాత దీని ధరను 1,24,999 (ఎక్స్-షోరూమ్) రూపాయలకు పెంచింది. డెలివరీలు జూన్ నెలలో ప్రారంభం కానున్నాయి.

రోర్ ఈవో బైక్ 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 180 కి.మీ రేంజ్ అందిస్తుంది. కేవలం మూడు సెకన్లలో 0 నుంచి 400 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 110 కిమీ. కంపెనీ ఎనిమిదేళ్ల బ్యాటరీ వారంటీని అందిస్తుంది.

ఓబెన్ రోర్ ఈవోలో 'ఫాల్ అలర్ట్ విత్ ఎమర్జెన్సీ అసిస్ట్' అనే ఫీచర్ ఉంది. ఇది వాహనం కింద పడటాన్ని గుర్తించి, ఓబెన్ యాప్ ద్వారా హెచ్చరికలను జారీ చేస్తుంది. అవసరమైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు తెలియజేస్తుంది. అదనపు భద్రతా ఫీచర్లలో.. యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్ (UBA), డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ (DAS), సెక్యూర్ ఛార్జ్, మరియు మెరుగైన స్థిరత్వం కోసం వెడల్పాటి వెనుక టైరు ఉన్నాయి.

ఈ బైకులో 5 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే ఉంది. ఇది నావిగేషన్, రైడ్ డేటా, కాల్, టెక్స్ట్, మ్యూజిక్ కోసం స్మార్ట్ అలర్ట్‌లను అందిస్తుంది. ఈ బైక్ పొడవైన సీటును కలిగి ఉండటం వల్ల.. రైడర్, పిలియన్ ఇద్దరూ మంచి రైడింగ్ అనుభూతిని పొందుతారు. సీటు కింద, సీటు అండర్-సీట్ స్టోరేజ్, ట్యాంక్ పాడ్ స్టోరేజ్‌తో పాటు డ్యూయల్ USB ఛార్జింగ్ పోర్ట్‌లతో కలిపి మొత్తం 10 లీటర్ల స్టోరేజ్ లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement