అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత! | AI Boom Job Fears and Economic Anxiety, Why Americans Are Worried? | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!

May 19 2026 4:41 PM | Updated on May 19 2026 5:10 PM

AI Boom Job Fears and Economic Anxiety, Why Americans Are Worried?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెరికా ముందంజలో ఉంది. అయితే.. ఇక్కడి యువతలో ఏఐ పట్ల వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితిలా కనిపించినప్పటికీ.. దీని వెనుక ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే.. కేవలం AI గురించే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న దీర్ఘకాలిక మార్పులను కూడా పరిశీలించాలి.

ఏఐ మీద వ్యతిరేఖ భావన ఏర్పడటానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధ వల్ల కంపెనీలు ఉద్యోగాల కోత. చాలా సంస్థలు ఏఐ టెక్నాలజీ కోసం ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు ప్రకటనలు కూడా చేశాయి. నిజానికి కంపెనీలు కూడా ఖర్చులు, ఆర్థిక మందగమనం, మార్కెట్‌ ఒత్తిడులు వంటివి ఎదుర్కొంటున్నాయి.

AI కారణం అందుకే..
సంస్థలు AIని కారణంగా చూపడం.. వాటికి రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. ఒకటి.. ఉద్యోగాల కోతలను సమర్థించుకోవచ్చు. రెండోది.. మేము భవిష్యత్‌ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాం.. అనే ఇమేజ్‌ పొందవచ్చు. దీంతో సాధారణ ప్రజల్లో ఏఐ అంటే ఉద్యోగాలను తీసేసే యంత్రం అనే భయం పెరుగుతోంది.

ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. 2008-09 గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ క్రైసిస్‌ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగింది. అప్పటి నుంచి ధనిక-పేద అంతరం, అప్పుల భారం, ఉద్యోగ భద్రతలేమి వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. టెక్నాలజీ రంగం మాత్రమే వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ వృద్ధి సమాజంలోని అందరికీ సమానంగా ప్రయోజనం కలిగించలేదు.

టెక్నాలజీ విప్లవం
ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ విప్లవం, ముఖ్యంగా ఐఫోన్‌ వచ్చిన తర్వాత మొబైల్‌ రంగం ప్రపంచాన్ని మార్చేసింది. కానీ ఆ టెక్నాలజీ విప్లవం కూడా ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుకోలేకపోయింది. అదే విధంగా AI కూడా అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. AI ఉత్పాదకతను పెంచగలదు, కొత్త సేవలను సృష్టించగలదు. కానీ.. ప్రపంచ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రాజకీయ విభజనలు వంటి లోతైన సమస్యలను అది ఒక్కటే పరిష్కరించలేదు.

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రపంచం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఆర్థిక, రాజకీయ వ్యవస్థలనే అనుసరిస్తోంది. అమెరికా ఆధిపత్యం, గ్లోబల్‌ ట్రేడ్‌, డాలర్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటివి దశాబ్దాలుగా ప్రపంచాన్ని నడిపించాయి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. చైనా ఎదుగుదల, యుద్ధాలు, సరఫరా గొలుసు సమస్యలు, ఇంధన సంక్షోభాలు వంటివన్నీ కలిసి ప్రపంచాన్ని కొత్త దిశలోకి నెడుతున్నాయి.

మార్పునకు అవకాశం
చరిత్రను పరిశీలిస్తే.. ప్రతి టెక్నాలజీ విప్లవం మొదట్లో భయాలను సృష్టించింది. పరిశ్రమల విప్లవం సమయంలో కూడా యంత్రాలు ఉద్యోగాలను నాశనం చేస్తాయని భావించారు. కానీ తరువాత కొత్త రంగాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. AI విషయంలో కూడా అదే జరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశోధన రంగాల్లో AI భారీ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది అనేది వాస్తవం.

ఇదీ చదవండి: భారత్ vs అమెరికా: ఇదీ.. వర్క్ కల్చర్‌లో తేడా!

Advertisement
 
Advertisement
Advertisement