ప్రకాశం: జిల్లా జనసేనలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జనసేన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఆయన అనుచరుడే తిరుగుబాటు చేశారు. నిన్న మొన్నటివరకూ జిల్లాలో బాలినేని మౌత్‌పీస్‌గా ఉన్న జనసేన నాయకుడు జడ బాలనాగేంద్ర.. తీవ్ర విమర్శలు చేశారు.
ఈరోజు(మంగళవారం, మే 19వ తేదీ) ప్రెస్‌మీట్ పెట్టిన బాలనాగేంద్ర.. బాలినేనిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో బాలినేని పదవులు బేరం పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బాలినేని, ఆయన కొడుకు ప్రణీత్ రెడ్డి జనసేనను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బాలినేని, ఆయన కొడుకుని పార్టీకి దూరం పెట్టాలని పవన్ కళ్యాణ్‌కి విజ్ఞప్తి చేశారు బాలనాగేంద్ర.


