తమిళనాట మళ్లీ గీతాలాపన వివాదం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ ‘గీతాలాపన’ వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం గురువారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార ఉత్సవంలో అధికారిక గీతాల ఆలపన క్రమం తీవ్ర దుమారానికి దారితీసింది. సంప్రదాయకంగా పాడే ‘తమిళ్ తాయ్ వాజ్తు’ (తమిళ మాత వందనం)కు ముందే ‘వందేమాతరం’ ఆలపించడంపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నాయి. ఇటు తమిళ అస్తిత్వం, అటు జాతీయ ప్రొటోకాల్ మధ్య నడుస్తున్న ఈ రాజకీయ యుద్ధం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.విజయ్ సర్కార్‌పై డీఎంకే, సీపీఐ ఆగ్రహంతాజా మంత్రివర్గ విస్తరణలో భాగంగా 23 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ కార్యక్రమంలో ‘వందేమాతరం’ మొదటి స్థానంలో, జాతీయ గీతం ‘జనగణమన’ రెండో స్థానంలో ఆలపించగా, ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను మూడో స్థానానికి పరిమితం చేశారు. దీనిపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తీవ్రంగా మండిపడింది. తమిళ గుర్తింపును, సంస్కృతిని కాపాడటంలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) విఫలమైందని డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై విమర్శించారు. అటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ గీతానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రస్తుత మార్పు గత సంప్రదాయాలను ఉల్లంఘించడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ ఆదేశాల మేరకే ఈ తప్పు జరిగిందని ఆయన ఆరోపించారు.కౌంటర్ ఇచ్చిన బీజేపీ: అది ‘నేషనల్ ప్రొటోకాల్’ప్రతిపక్షాల విమర్శలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతే తీవ్రంగా స్పందించింది. ప్రమాణ స్వీకార ఉత్సవాల్లో ఇతర గీతాల కంటే ముందు ‘వందేమాతరం’ ఆలపించడం అనేది ‘నేషనల్ ప్రొటోకాల్’ (జాతీయ నియమావళి) అని బీజేపీ నాయకురాలు తమిళసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ‘తమిళ మాతను ఎవరూ అవమానించలేరు, తమిళ మాత ఎల్లప్పుడూ జాతీయవాదాన్ని గౌరవిస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. డీఎంకే దేశ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతోందని, అందుకే ప్రజలు వారికి గతంలోనే బుద్ధి చెప్పారని ఆమె కౌంటర్ ఇచ్చారు.కేరళలోనూ ఇదే సెగ.. దేశవ్యాప్తంగా చర్చఈ వివాదం కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు, పొరుగు రాష్ట్రమైన కేరళలోనూ ఇటువంటి చర్చకు దారితీసింది. అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేబినెట్ ప్రమాణ స్వీకారంలో ‘వందేమాతరం’ పూర్తి వెర్షన్‌ను ఆలపించడంపై సీపీఐ(ఎం) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక బహుళత్వ సమాజంలో ఇది సరైనది కాదని, ఆ గీతంలోని కొన్ని భాగాలు మతపరమైన అంశాలతో కూడి ఉన్నాయని లెఫ్ట్ పార్టీలు ఆరోపించాయి. అయితే లెఫ్ట్ పార్టీల వ్యాఖ్యలు జాతీయ గీతాన్ని అవమానించడమేనని, తుష్టీకరణ రాజకీయాల్లో భాగమేనని కేరళ బీజేపీ నేతలు తిప్పికొట్టారు. మొత్తానికి ‘వందేమాతరం’ చుట్టూ ముసురుకున్న ఈ వివాదం దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్ స్టార్ట్
అమెరికా టెక్ పరిశ్రమ వ్యాప్తంగా జరుగుతున్న తాజా ఉద్యోగ కోతలు టెక్ నిపుణులు గుండెల్లో గునపాల్లా దిగుతున్నాయి. ఉద్యోగం కోల్పోతే, దేశంలో నివసించే హక్కును కూడా కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయం వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ ఇంజనీర్లు , సాఫ్ట్వేర్ డెవలపర్లు అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. క్లిష్టమైన కోడింగ్ రాశారు, ఎన్నో టీమ్స్‌ను నడిపించారు. ఫలితంగా విదేశాల్లో జీవితం ఎంతో సురక్షితమైనదని నమ్మారు. అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ఇళ్లు కొనుక్కున్నారు. కుటుంబాలను పెంచుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు, వేలాది మందికి వచ్చిన ఒకే ఒక్క ఈమెయిల్ అంతటినీ మార్చేస్తోంది. అమెరికాలో ఉద్యోగం పోవడం అనేది ఒక కౌంట్‌డౌన్ షురూ అయినట్టే.సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు మరోసారి ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మెటా (Meta) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు తన వనరులను మళ్లిస్తూ దాదాపు 8వేల ఉద్యోగాలను తొలగించింది. అమెజాన్ కూడా పలు విడతల కోతల తర్వాత మరికొన్ని టీమ్స్ సైజ్ తగ్గిస్తోంది. టెక్ పరిశ్రమ ఏఐ, ఆటోమేషన్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో లింక్డ్ఇన్ సైతం ఇటీవలి ఉద్యోగులపై వేటు వేసింది అమెరికాలోని మెజారిటీ భారతీయ టెక్ నిపుణులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. ఇవి నేరుగా వారి యజమానులతో (Employers) ముడిపడి ఉంటాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, వీసా స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరోయజమానిని వెతుక్కోవడానికి,సాధారణంగా 60 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఒకవేళ వారు విఫలమైతే, దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగం కోల్పోవడం అంటే కేవలం వృత్తి పరమైన నష్టం మాత్రమే కాదు, ఇమ్మిగ్రేషన్, ఇంటి లోన్ల చెల్లింపులు, పిల్లల పాఠశాలల అడ్మిషన్లు, ఆరోగ్య రక్షణ, కుటుంబ నిర్ణయాలతో కూడిన రేస్‌లా మారుతుంది. ఇప్పటికే చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డ్‌ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. కొందరికి అమెరికాలోనే పుట్టిన పిల్లలు ఉన్నారు. మరికొందరు తాము దీర్ఘకాలం అక్కడే ఉంటామనే నమ్మకంతో ఇళ్లు కొనుగోలు చేశారు. ఉద్యోగం పోవడంతో ఆ ప్లాన్లన్నీ రాత్రికి రాత్రే అనిశ్చితిలోకి వెళ్లిపోతున్నాయి.ఇక ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది భారతీయ కార్మికులు అమెరికాలో మరికొంత కాలం కొనసాగడానికి తాత్కాలిక ప్రత్యామ్నాయాలను వెతుక్కోక తప్పని పరిస్థితి. దీనికి B-2 విజిటర్ వీసాకు మారడమే పరిష్కారం. తద్వారా మరో ఉద్యోగం వెతుక్కునే లోపు అక్కడ మరికొన్ని నెలలు ఉండే అవకాశం లభిస్తుంది.60 రోజుల H-1B నిబంధన అంటే ఏమిటి?యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన H-1B కార్మికులకు తమ తదుపరి నిర్ణయాన్ని చూసుకోవడానికి సాధారణంగా 60 రోజుల గ్రేస్ పీరియడ్ (లేదా వారి I-94 హోదా గడువు ముగిసే వరకు, ఏది ముందైతే అది) లభిస్తుంది. ఈ సమయంలో తమ వీసాను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న వేరే యజమానిని వెతుక్కోవచ్చు, వేరే వీసా కేటగిరీకి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అమెరికా విడిచి వెళ్లడానికి సిద్ధం కావచ్చు. ఈ 60 రోజుల గడువు సాధారణంగా ఉద్యోగి యొక్క చివరి పని దినం (Last working day) నుండి ప్రారంభమవుతుంది, అంతేకానీ చివరి జీతం బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటి నుండి కాదు అనేది గుర్తించాలి.సడన్‌గా ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ నైపుణ్యం కలిగిన కార్మికులకు కొంత ఉపశమనం కలిగించడానికి ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. కానీ వాస్తవానికి, టెక్ పరిశ్రమలోనే నియామకాలు మందగించినప్పుడు రెండు నెలల సమయం చాలా వేగంగా గడచిపోతుంది. కొత్త స్పాన్సర్‌ను కనుగొనడం, ఉద్యోగం రావడం, వీసా ట్రాన్స్ఫర్ అంత ఈజీకాదు. అందుకే ఉద్యోగాలు కోల్పోయిన వారు Form I-539 దాఖలు చేయడం ద్వారా తాత్కాలికంగా B-1 లేదా B-2 విజిటర్ వీసాకు మారాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సలహా ఇస్తుంటారు.కెనడా, యూరప్ వైపు మొగ్గుదశాబ్దాలుగా అమెరికా అంటే కెరీర్ వృద్ధి, అధిక జీతాలు మరియు ప్రపంచ స్థాయి గుర్తింపునకు చిహ్నంగా ఉండేది. కానీ వరుస లేఆఫ్స్, వీసాపై ఆధారపడటం, ఇమ్మిగ్రేషన్‌పై వస్తున్న రాజకీయ విమర్శలు , AI ఆధారిత మార్పులు చాలా మంది నిపుణులను తమ భవిష్యత్తు గురించి పునరాలోచించుకునేలా చేస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే లక్షా పదివేలకు పైగా టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు. 2025లో ఆమోదించిన H-1B పిటిషన్లలో అత్యధిక శాతం భారతీయులవే ఉన్నాయి. కానీ ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో చాలా మంది భారతీయులు తమ 'అమెరికన్ డ్రీమ్' ఆశలను వదిలేసుకుంటున్న పరిస్థితి. ఇటీవలి ఒక 'బ్లైండ్' (Blind) పోల్ ప్రకారం, అమెరికాలోని భారతీయ నిపుణులలో దాదాపు సగం మంది తాము ఉద్యోగం కోల్పోతే భారతదేశానికి తిరిగి రావడానికి మొగ్గు చూపుతామని తెలిపారు. మరికొందరు కెనడా , యూరప్ వైపు చూస్తున్నారు...
టీఎంసీకి ఝలక్.. అభిషేక్ బెనర్జీనే కారణమా?
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత తృణముల్ కాంగ్రెస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ దేబాలినా బిస్వాస్ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఆమె రాజీనామా లేఖ వెలుగులోకి రావడంతో టీఎంసీకి భారీ షాక్ తగిలింది. అయితే, టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణంగానే ఆమె తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.టీఎంసీ నియంత్రణలో ఉన్న కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ), అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు నోటీసులు జారీ చేసిన మరుసటి రోజు ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్బంగా దేబాలినా బిస్వాస్ మాట్లాడుతూ..‘నేను నా పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాలా రాయ్‌కి లేఖ పంపాను. కౌన్సిలర్‌గా కొనసాగుతూ, నా ప్రాంత ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ పదవిలో చాలా కాలంగా ఉన్నాను, కానీ ఇప్పుడు తప్పుకుంటున్నాను. నేను ఇది పూర్తిగా పార్టీ సంబంధిత కారణాల వల్ల చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, అభిషేక్ బెనర్జీ నివాసం.. అక్రమ నిర్మాణంగా జరిగిందంటూ కేఎంసీ (KMC) నోటీసులు జారీ చేసిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ అగ్ర నాయకత్వం తనపై ఒత్తిడి తెచ్చారని బిస్వాస్ ఆరోపించారు. ఈ క్రమంలో..‘నిన్న నోటీసు ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు. అకస్మాత్తుగా, అర్ధరాత్రి వేళ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. ‘లేదు, ఇది సరికాదు’ అని నాకు అనిపించింది. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వమని ఒకరిని బలవంతం చేయడం లేదా వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనులు చేయమని ఒత్తిడి చేయడం పార్టీకి తగదని నేను భావిస్తున్నాను. విషయాన్ని కప్పిపుచ్చడం సరైన పద్ధతి కాదు. మనం అడగాలి. ఇది ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు?. కొన్ని విషయాలు నా పరిధిలోకి రావు’ అని వ్యాఖ్యానించారు.అభిషేక్ బెనర్జీ కంపెనీ, కుటుంబానికి సంబంధించి కేఎంసీ నోటీసులు అందుకున్న 17 చిరునామాలలో, 14 చిరునామాలు బిస్వాస్ అధ్యక్షత వహించిన బరో 9 పరిధిలోకి వస్తాయి. నోటీసులు జారీ చేసిన తర్వాత సోమవారం రాత్రి నుంచే పార్టీ నాయకుల నుంచి ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. పార్టీ అగ్ర నాయకత్వంలోని ఒక వర్గం ఆదేశాల మేరకు బిస్వాస్ రాజీనామా చేశారని టీఎంసీ నాయకుల్లో ఒక వర్గం ఆరోపిస్తోంది. కాగా, తన రాజీనామా ఇంకా అధికారికంగా ఆమోదించబడలేదని బిస్వాస్ తెలిపారు. మరోవైపు.. నగరంలో అభిషేక్ బెనర్జీకి అనేక అక్రమ ఆస్తులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.
గాజా ఫ్లోటిల్లా ఘటన.. ఇజ్రాయెల్ కేబినెట్లో చిచ్చు
గాజా ఫ్లోటిల్లా ఘటనపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. గాజాకు మానవతా సాయం అందించేందుకు వెళ్తున్న బృందాన్ని అడ్డుకున్న ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది వాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇటామర్ బెన్-గ్విర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దుమారం మొదలైంది. సుమారు 40 దేశాల నుంచి 50 ఫ్లోటిల్లా(చిన్నపాటి నౌకలు)ల్లో గాజాకు సాయం అందించేందుకు బయల్దేరాయి. అయితే వాటిని అడ్డుకుని మరీ ఇజ్రాయెల్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలను నేలపై మోకాళ్లపై కూర్చోబెట్టి, చేతులు వెనుకకు కట్టి ఉంచారు. ఆ సమయంలో ఒక మహిళ "ఫ్రీ, ఫ్రీ పాలస్తీన్" అని నినదించగా, పోలీసులు ఆమెను బలవంతంగా నేలపై తోసిన దృశ్యాలు కనిపించాయి. మే 20న ఈ ఘటన చోటు చేసుకుంది.ఆ వీడియోను షేర్ చేసిన బెన్-గ్విర్ ఆ కార్యకర్తలను ఎగతాళి చేస్తూ, "వీరంతా హీరోలుగా వచ్చారు.. ఇప్పుడు చూడండి వీరి పరిస్థితి" అని వ్యాఖ్యానించారు. వాళ్లను ఇజ్రాయెల్ నెగెవ్ ఎడారిలోని కెట్జియోట్ జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ככה אנחנו מקבלים את תומכי הטרורWelcome to Israel 🇮🇱 pic.twitter.com/7Hf8cAg7fC— איתמר בן גביר (@itamarbengvir) May 20, 2026ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రతిస్పందనకు దారితీసింది. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్‌ను ఒక సాధారణ భద్రతా చర్యగా చెబుతున్నప్పటికీ.. పెద్ద దౌత్య సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఫ్రాన్స్, కెనడా, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్ రాయబారులను పిలిపించి సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా స్పందించారు. అందులో ఇటలీ పౌరులు కూడా ఉన్నారని.. వాళ్లను అవమానకర పరిస్థితుల్లో ఉంచడం ఎంతమాత్రం అంగీకరించలేనిదని అన్నారు. తక్షణమే ఇజ్రాయెల్ క్షమాపణలు చెప్పాలని.. నిర్బంధిత ఇటాలియన్ పౌరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ జలాల్లో పౌరులను అరెస్టు చేయడానికి ఇజ్రాయెల్‌కు ఏ హక్కు ఉందని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియంగ్ ప్రశ్నిస్తున్నారు. టర్కీ కూడా తమ పౌరుల విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఇటు.. ఈ వీడియో ఇజ్రాయెల్ కేబినెట్లోనే చిచ్చు రాజేసింది. బెన్-గ్విర్ చర్యలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని విదేశాంగ మంత్రి గిదియోన్ సర్ విమర్శించారు. ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కూడా ఫ్లోటిల్లాను అడ్డుకోవడం ఇజ్రాయెల్ హక్కు అని చెప్పినా, వీడియోలో కనిపించిన ప్రవర్తన "ఇజ్రాయెల్ విలువలకు విరుద్ధం" అని వ్యాఖ్యానించారు.ఈ ఘటనతో మరోసారి గాజాలోని మానవతా సంక్షోభం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. యుద్ధం కారణంగా ఎక్కువ మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి శిబిరాల్లో, తాత్కాలిక ఆశ్రయాల్లో జీవిస్తున్నారు. సహాయక సంస్థలు అందిస్తున్న సరఫరాలు అవసరాలకు సరిపోవడం లేదని చెబుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తాము సహాయం అడ్డుకోవడం లేదని, సరఫరాలు పర్యవేక్షణలో గాజాకు చేరుతున్నాయని వాదిస్తోంది. అయితే తాజా ఫ్లోటిల్లా ఘటనతో ఇజ్రాయెల్ ముసుగు తొలగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బాబు.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరివి హత్యా రాజకీయాలు?: వైఎస్ జగన్
టెస్ట్‌ల్లోకి కోహ్లి రీఎంట్రీ..? క్లూ ఇచ్చిన కీలక వ్యక్తి
జూనియర్ ఎన్టీఆర్ నాలుగు నెలల్లో 15 కేజీలు..! ఎలా తగ్గారంటే..
భారత్‌లో మరో స్టోర్‌కు సన్నాహాలు!
‘ఎబోలా’ కలకలం: అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్
మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది: జగన్
#Mega158: చిరు-బాబీ మూవీ 'మెగా' లాంచ్
మదరసాల్లో ‘వందేమాతరం’ నిర్బంధం
తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా
తెలంగాణ నేతలకు బంపరాఫర్.. కేంద్ర కేబినెట్లో చోటు?
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
బాబు.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరివి హత్యా రాజకీయాలు?: వైఎస్ జగన్
టెస్ట్‌ల్లోకి కోహ్లి రీఎంట్రీ..? క్లూ ఇచ్చిన కీలక వ్యక్తి
జూనియర్ ఎన్టీఆర్ నాలుగు నెలల్లో 15 కేజీలు..! ఎలా తగ్గారంటే..
భారత్‌లో మరో స్టోర్‌కు సన్నాహాలు!
‘ఎబోలా’ కలకలం: అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్
మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది: జగన్
#Mega158: చిరు-బాబీ మూవీ 'మెగా' లాంచ్
మదరసాల్లో ‘వందేమాతరం’ నిర్బంధం
తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా
తెలంగాణ నేతలకు బంపరాఫర్.. కేంద్ర కేబినెట్లో చోటు?
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 98.. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.115
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
మా ఆయన రాత్రంతా నిద్రపోడు.. నన్ను నిద్ర పోనివ్వడు!
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
ఇక్కడ ఎకరం 99 పైసలకే ఇస్తున్నా.. ఎవరూ రావడం లేదేమిటి సార్!
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
ఫొటోలు
తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)
‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
సింప్లీ సూపర్బ్ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఆధ్యాత్మికతలో అంబానీలు.. బెంగళూరు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సెంటర్లో సందడి (ఫొటోలు)
మెలోనీతో కలిసి మోదీ పలు ప్రాంతాల సందర్శన (ఫోటోలు)
శ్రీవారి సేవలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ దంపతులు (ఫోటోలు)
వరుసగా శుభవార్తలు చెప్తున్న షణ్ముఖ్ జశ్వంత్ (ఫోటోలు)
సినిమా
ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు
కేజీఎఫ్, సలార్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా 'డ్రాగన్'. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ రిలీజ్ చేశారు. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ కోసం తారక్ చాలా బక్కచిక్కిపోయాడు. గతంలో పలు ఈవెంట్స్‌లో అలానే కనిపించాడు. అయితే అంతలా బరువు తగ్గిపోవడానికి కారణాన్ని ఇన్నాళ్లకు ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు. తాజా ఇంటర్వ్యూలో అసలేం జరిగిందో చెప్పాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)'మూవీ షూటింగ్ మొదలుపెడదామనగా.. ఎన్టీఆర్‌ని కొంచెం సన్నబడమని చెప్పాను. కానీ ఆయన మాత్రం నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిపోయాడు. దీంతో అంతా కంగారు పడ్డారు. తారక్ భార్య, తల్లి, ఫ్రెండ్సే కాదు నా టీమ్ కూడా నన్నే తిట్టారు. నేనే ఇదంతా చేశానని అన్నారు. ఎందుకంటే మరీ బక్కగా, బలహీనంగా కనిపించాడు. నేను కూడా చాలాసార్లు ఇక సరిపోతుంది ఆపేయమని చెప్పా. అయినా వినలేదు''కథ కోసం, తన పాత్ర కోసం ఎన్టీఆర్‌ని ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఆయనని ఆపడం చాలా కష్టం. ఇంత పట్టుదల గల వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, వ్యక్తిగతంగా సమస్య ఉందని వచ్చిన వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. పాత్ర కోసం పడిన కష్టమే అది' అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు.వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్.. ఆఫ్గాన్ డ్రగ్ మాఫియా కంపెనీలో పనిచేసే నరహంతకుడిగా కనిపించబోతున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్. అనిల్ కపూర్, జిబు మేనన్, ఖుష్బూ, అశుతోష్ రాణా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. అతిపెద్ద దేశభక్తి సినిమా: ప్రశాంత్ నీల్)#PrashanthNeel says, 'We spent four months looking at him ( #NTR ) suffer.'“I told him that if you became THINNER for the role of the assassin, it would help.His wife, his mother, all his friends and my whole team were UPSET with me.” pic.twitter.com/FpJ7Puj0BW— Whynot Cinemas (@whynotcinemass_) May 20, 2026
కేన్స్ చిత్రోత్సవాల్లో హారర్ సినిమా టీజర్
నటుడు ఆదవ్ కన్నదాసన్, నటి వాణి భోజన్ జంటగా నటించిన చిత్రం తాళ్ తిరవా. బర్మన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్. కేఆర్ సహ నిర్మాత. భరణి శేఖర్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.. సురేష్ మీనన్, సుబ్బుపంజా ముఖ్య పాత్రలు పోషించిన ఇందులో బాల తారలు లిసా, లలిత నటించారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇది ఒక గ్రామంలో గుర్తించిన పురాతన రాతి పలకంపై రాసిన అక్షరాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, అనర్థాల ఇతివృత్తంతో రూపొందిస్తున్న మూవీ అని చెప్పారు.ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి అయిందన్నారు. మూవీ టీజర్‌ను మంగళవారం (మే 19) నాడు కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రపంచ సినీ ప్రముఖులను అలరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే తాళ్ తిరవా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశామని, దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈచిత్రానికి ఓషో. వెంకట్ సంగీతాన్ని సమకూర్చగా, సాల్మన్బోస్ చాయాగ్రహణం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by தாழ் திறவா (@thazhthiravaa)
మంచు మనోజ్‌కి మరో కీలక పాత్ర.. ఆ సీనియర్ హీరోతో ఢీ
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మరో భారీ చిత్రంలో నటించబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో ఆయనను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే భైరవం, మిరాయి వంటి చిత్రాల్లో విలన్‌గా కనిపించి మెప్పించిన మనోజ్, ఈసారి బాలయ్యతో కలిసి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నటించారు.ఈ చిత్రంలో విలన్ పాత్రలో మనోజ్ కనిపించనున్నాడని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో అధికారికంగా మనోజ్ ఎంట్రీని ప్రకటిస్తూ..'మీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది'అని పేర్కొన్నారు. ఇది ఆయనకు మనోజ్‌తో మొదటి కాంబినేషన్. గోపీచంద్ గతంలో బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఇక ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం.
'డ్రాగన్', 'పెద్ది'.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఏంటి?
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒకరోజు వ్యవధిలో రెండు అప్డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ అయింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరి సగటు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)'పెద్ది' ట్రైలర్ విషయానికొస్తే.. మాస్ మూమెంట్స్, పంచ్ డైలాగ్స్ లాంటి వాటికంటే స్టోరీ ఎలా ఉండబోతుందనేది ఫోకస్ చేసి చూపించారు. మెగా అభిమానులు సంతృప్తి చెందారు కానీ సగటు ఆడియెన్స్‌కి మాత్రం ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. యాక్టింగ్ పరంగా చరణ్‌ని వంకపెట్టడానికి లేదు గానీ మాస్ మూమెంట్స్ లాంటివి ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేశారు. అవి లేకపోవడంతో కొందరు డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే మరో ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉందన్నట్లు టాక్ వినిపిస్తోంది. భోపాల్, హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్స్‌లో కొత్త ట్రైలర్ రిలీజ్ చేయొచ్చంటున్నారు. జూన్ 4న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ముందురోజు రాత్రి ప్రీమియర్స్ కూడా వేయనున్నారు.'డ్రాగన్' విషయానికొస్తే ఇందులోనూ స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ లాంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. డ్రగ్ మాఫియా, అందులోని విలన్స్‌ని చూపించారు. ఎన్టీఆర్ కూడా అత్యంత క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాడు. కానీ ట్రైలర్లో అందుకు సంబంధించిన యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్ లాంటి వాటికి పెద్దగా చోటివ్వలేదు. మూవీ థియేటర్లలోకి రావడానికి మరో ఏడాది సమయముంది కాబట్టి ఇకపై రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌లో ఫైట్ సీన్స్ లాంటివి ఉండే అవకాశముంది.ఈ రెండింటిని పోల్చి చూడలేం గానీ రెండింటికి యునానిమస్ టాక్ అయితే రాలేదు. అలా అని పూర్తిగా బాగోలేదని కూడా చెప్పలేదు. కొందరికి విపరీతంగా నచ్చేశాయి. మరికొందరికి మాత్రం ఓ మాదిరిగా మాత్రమే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే స్పందన వస్తోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు)
క్రీడలు
టీమిండియా శ్రీలంక పర్యటన షెడ్యూల్ విడుదల
భారత అండర్ 19 క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటన 2026 షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. కొత్త అండర్-19 వరల్డ్‌కప్ సైకిల్లో భాగంగా భారత యువ జట్టు జూలైలో ద్వీప దేశంలో పర్యటిస్తుంది. ఈ టూర్లో మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు నిర్వహించనున్నారు. జూన్ 30న భారత జట్టు కొలంబో చేరుకోనుండగా.. జూలై 4 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ లేదుబీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం ఒక్క ఆటగాడు కేవలం ఒక అండర్-19 వరల్డ్‌కప్ మాత్రమే ఆడగలడు. దీంతో గత అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆడిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లో పాల్గొనడు.ట్రై సిరీస్మరోపక్క భారత్-ఏ జట్టు ఇదే సమయంలో శ్రీలంకలో ట్రై సిరీస్ ఆడనుంది. అందులో ఇండియా-ఏ తరఫున వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. జూన్ 9 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో ఇండియా-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు పాల్గొంటాయి.ఇండియా అండర్-19 జట్టు శ్రీలంక టూర్ పూర్తి షెడ్యూల్జూలై 4- తొలి వన్డే- హంబన్టోటాజూలై 6- రెండో వన్డే- హంబంటోటా జూలై 9- మూడో వన్డే - హంబంటోటాజూలై 13-16 తొలి యూత్ టెస్ట్ - గాలే జూలై 20-23 రెండో యూత్ టెస్ట్ - కొలంబో ఈ సిరీస్‌తో 2028 అండర్-19 వరల్డ్‌కప్‌కు భారత జట్టు కొత్త కోర్ గ్రూప్‌ను తయారు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. శ్రీలంక టూర్ తర్వాత ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌కు వచ్చి యూత్ సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు రాజ్‌కోట్‌లో మూడు యూత్ లిస్ట్-ఏ మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు రాజ్‌కోట్‌లో తొలి యూత్ టెస్ట్.. అక్టోబర్ 5 నుంచి 8 వరకు అహ్మదాబాద్‌లో రెండో యూత్ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఈ సీజన్ మొత్తం అంతే.. అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరినప్పటికి ముంబై ఇండియన్స్ ఆట తీరు మాత్రం మారడం లేదు. బుధవారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. మరోసారి ముంబై బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో కార్భిన్ బాష్ (32), హార్దిక్ పాండ్యా(26) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 6 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కేకేఆర్ విజయంలో మనీష్ పాండే(45), రావ్మన్ పావెల్(40) కీలక పాత్ర పోషించారు.ముంబై బౌలర్లలో కార్భిన్ బాష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్ఫర్ తలా వికెట్ సాధించారు. ఈ ఏడాది సీజన్లో ముంబైకి తొమ్మిదవ పరాజయం కావడం గమనార్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని పాండ్యా అంగీకరించాడు."బ్యాటింగ్‌లో మేము 20 పరుగులు తక్కువ చేశాము. పవర్‌ప్లేలోనే మేం కీలక వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. ఒకవేళ నేను, తిలక్ వర్మ క్రీజులో మరికాసేపు నిలదొక్కుకుని ఉండి ఉంటే కనీసం 15 నుంచి 20 పరుగులు అదనంగా వచ్చేవి. అప్పుడు మాకు గెలిచేందుకు మంచి అవకాశం ఉండేది. అయినప్పటికి మా బౌలర్లు గేమ్‌ను ఆఖరివరకు తీసుకొచ్చారు.స్కోర్ బోర్డులో పెద్దగా పరుగులు లేనప్పటికి మా బౌలర్లు పోరాడిన తీరు నిజంగా అద్భుతం. పిచ్ బ్యాటింగ్‌కు కాస్త కష్టంగా ఉంది. కానీ బౌలర్లకు కూడా సహకరించే ఇలాంటి పిచ్‌లపై ఆడటం నాకు ఇష్టమే. ప్రస్తుతం ఐపీఎల్ పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలంగా మారుతోందని అన్పిస్తోంది. బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఏమి చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. ఈ రోజు మాత్రం పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలంగానే ఉంది. ఇక ఈ సీజన్ అంతటా మా ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. మేం చాలా క్యాచ్‌లు వదిలేశాం. ఎవరూ కావాలని క్యాచ్‌లు విడిచిపెట్టారు. కానీ మ్యాచ్‌లు గెలవాలంటే ఫీల్డింగ్ చాలా ముఖ్యం. క్యాచ్‌లే మ్యాచ్ ఫలితాలను నిర్ణయిస్తాయి. మ్యాచ్ స్వరూపాన్నే మార్చే క్యాచ్‌లను జారవిడిస్తే , జట్టు ఎప్పడూ వెనుకబడే ఉంటుంది. మా చివరి మ్యాచ్ మాకు చాలా ప్రత్యేకమైనంది. 25,000 మంది చిన్నారుల ముందు ఆడనున్నాము. స్టేడియానికి వచ్చే ఆ పిల్లల ముఖాల్లో నవ్వులు పూయించడమే మా లక్ష్యం. గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" హార్దిక్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు. ముంబై తమ చివరి మ్యాచ్‌లో మే 24 వాంఖడే స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి భారత్
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఆరో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు భారత్ ఐదో స్థానంలో ఉండగా తాజాగా పాకిస్తాన్‌పై 2–0తో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించడంతో ఆ జట్టు ముందంజ వేసింది. డబ్ల్యూటీసీ (2025–27)లో భాగంగా ఆడిన 9 టెస్టుల్లో 4 గెలిచి 4 ఓడిన శుబ్‌మన్ గిల్ సేన మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భారత్ ఖాతాలో మొత్తం 52 పాయింట్లు ఉండగా... పాయింట్ల శాతం (48.15) ప్రకారం ప్రస్తుతం ఆరో స్థానంలో నిలిచింది.గత ఏడాది దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో పరాజయం పాలవడం జట్టు ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపించింది. 2026లో ఇంకా ఒక్క టెస్టు కూడా ఆడని టీమిండియా... జూన్ 6 నుంచి అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో తలపడనుండగా ఈ టెస్టు డబ్ల్యూటీసీలో భాగంగా లేదు. ఆ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్‌లలో జరిగే పర్యటనలు భారత్‌కు కీలకం కానున్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా... దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది.
లక్ష్యసేన్, ప్రణయ్ నిష్క్రమణ
కౌలాలంపూర్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సూపర్–500 టోర్నీ మలేసియా మాస్టర్స్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్‌లకు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లోనే వీరిద్దరు నిష్క్రమించారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ లక్ష్య సేన్ 17–21, 11–21 స్కోరుతో ప్రపంచ 38వ ర్యాంకర్ ఉబేదుల్లా (ఇండోనేసియా) చేతిలో అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. 43 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. మరో పోరులో ప్రణయ్ 17–21, 22–20, 22–24 తేడాతో ఆరో సీడ్ కొడై నరోకా (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. 80 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో రెండో గేమ్ గెలిచిన ప్రణయ్... చివరి గేమ్‌లో కూడా తీవ్రంగా శ్రమించినా లాభం లేకపోయింది. పురుషుల సింగిల్స్‌లోనే ప్రపంచ పదో ర్యాంకర్ అలెక్స్ లేనియర్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో భారత ఆటగాడు కిరణ్ జార్జ్ 15–21, 1–6తో వెనుకబడి ఉన్న దశలో గాయంతో రిటైర్డ్‌గా తప్పుకున్నాడు. తెలంగాణ ఆటగాడు తరుణ్ మన్నేపల్లి కూడా 21–17, 14–21, 8–21తో వాంగ్ వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడి తొలిరౌండ్లోనే వెనుదిరిగాడు. అస్మిత, మాళవిక ముందంజ... మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ అస్మిత చాలిహా 21–16, 21–13తో తలిత రమదాని (ఇండోనేసియా)ని ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. మాళవిక బన్సోద్ కూడా 21–17, 16–21, 21–9తో వోన్ లీ (జర్మనీ)పై, దేవిక సిహాగ్ 19–21, 21–18, 21–19తో పార్క్ యున్ (కొరియా)పై గెలుపొంది ముందంజ వేశారు. అయితే తాన్య హేమంత్ 19–21, 7–21తో హువాంగ్ చింగ్ పింగ్ (చైనీస్ తైపీ) చేతిలో, అన్మోల్ ఖర్బ్ 21–13, 16–21, 19–21తో ఎనిమిదో సీడ్ లైన్ హోమార్క్ (డెన్మార్క్) చేతిలో, ఇషారాణి బారువా 17–21, 21–14, 18–21తో ఐదోసీడ్ లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో, తాన్వి శర్మ 10–21, 19–21తో పికమన్ ఒపటినిపుట్ చేతిలో పరాజయంపాలై నిష్క్రమించారు. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ జోడి 16–21, 21–14, 21–18తో అలెగ్జాండర్ డున్ –జూలీ మ్యాక్సన్ (స్కాట్లాండ్)ను ఓడించి ముందంజ వేయగా... గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ జంట 15–21, 22–20, 10–21 స్కోరుతో అమ్రి స్యానవి–నీతా మార్వా (ఇండోనేసియా) చేతిలో పరాజయంపాలైంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
పాపాఘ్ని నదిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
బిజినెస్
శామ్సంగ్ వేతన వివాదానికి తాత్కాలిక బ్రేక్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు గ్లోబల్ సెమీకండక్టర్ (చిప్) సరఫరా గొలుసును కుదిపేస్తుందని భావించిన శామ్సంగ్ కార్మిక సమ్మె ముప్పు తాత్కాలికంగా తొలగిపోయింది. యాజమాన్యంతో కుదిరిన తాత్కాలిక వేతన ఒప్పందం నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ప్రారంభం కావాల్సిన ప్రణాళికాబద్ధమైన సమ్మెను నిలిపివేస్తున్నట్లు శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రధాన కార్మిక సంఘం (యూనియన్) ప్రకటించింది.బుధవారం రాత్రి వరకు ఇరు పక్షాల మధ్య చర్చలు పదే పదే విఫలమవడంతో సమ్మె ఖాయమని అందరూ భావించారు. అయితే, దక్షిణ కొరియా కార్మిక మంత్రి కిమ్ యంగ్-హూన్ వ్యక్తిగతంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహించడంతో చర్చలు మళ్లీ పుంజుకున్నాయి. చివరి నిమిషంలో యాజమాన్యం, యూనియన్ ఒక అంగీకారానికి వచ్చాయి. మరింత మెరుగైన కార్మిక సంబంధాలను నిర్మించడానికి ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తాత్కాలిక ఒప్పందంపై దాదాపు 48,000 మంది యూనియన్ సభ్యులు మే 22 నుంచి 27 వరకు ఓటింగ్ (రాటిఫికేషన్) జరపనున్నారు.ఉద్యోగుల అసంతృప్తి ఎందుకంటే..శామ్సంగ్ దక్షిణ కొరియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యాలయాల్లో ఒకటిగా పేరుపొందింది. అయితే, తమ ప్రధాన చిన్న ప్రత్యర్థి సంస్థ అయిన ఎస్ కే హైనిక్స్ ఇస్తున్న వేతనాలతో పోలిస్తే శామ్సంగ్ ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉండటం వారిలో అసంతృప్తిని రగిల్చింది. కంపెనీలోని వివిధ వ్యాపార విభాగాల మధ్య బోనస్‌లను పంచే విధానంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా భారీగా లాభాలు ఆర్జించే మెమరీ వ్యాపార విభాగం, నష్టాల్లో నడుస్తున్న లాజిక్ చిప్ విభాగం మధ్య పనితీరు బోనస్‌లను ఎలా కేటాయించాలనే దానిపై యాజమాన్యానికి, యూనియన్‌కు మధ్య వివాదం నడిచింది. నష్టపోయే విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా లాభాల వాటా సక్రమంగా దక్కాలన్నది వారి డిమాండ్.బోనస్‌లపై ఉన్న 50% గరిష్ట పరిమితిని రద్దు చేయాలని, బోనస్‌లను నేరుగా కంపెనీ సాధించే ఆపరేటింగ్ లాభాలతో ముడిపెట్టాలని ఉద్యోగులు పట్టుబట్టారు. వేతనాలు, సామూహిక బేరసారాలపై యాజమాన్యంతో జరిపిన చర్చలు పలుమార్లు విఫలమయ్యాయి. దాంతో ఇటీవల ప్రపంచవ్యాప్త సరఫరాకు ముప్పు తెచ్చేలా 18 రోజుల పాటు ప్రణాళికాబద్ధమైన సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే చివరి నిమిషంలో కార్మిక మంత్రి మధ్యవర్తిత్వంతో తాత్కాలిక ఒప్పందం కుదిరి సమ్మె విరమించుకున్నారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!
ట్రంప్ పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా రూపొందించిన అధునాతన గేమింగ్ చిప్‌పై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్విడియా ఫ్లాగ్షిప్ గేమింగ్ జీపీయూకు చెందిన చైనా-ఫ్రెండ్లీ వెర్షన్ ‘RTX 5090D V2’ గ్రాఫిక్స్ కార్డే లక్ష్యంగా బీజింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 15న చైనాలో తన అధికారిక పర్యటనను ముగించారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఎన్విడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సెన్ హువాంగ్‌తో సహా పలువురు సీనియర్ యూఎస్ వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారు. అయితే, ఈ హై-ప్రొఫైల్ పర్యటన ముగిసిన వెంటనే చైనా ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించడం చర్చకు దారితీసింది.RTX 5090D V2 ప్రత్యేకత ఏంటి?అమెరికా విధించిన కఠినమైన ఎగుమతి పరిమితులకు లోబడి చైనా మార్కెట్ కోసమే ఎన్విడియా ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ ఈ RTX 5090D V2. ఇది కంపెనీకి చెందిన టాప్-ఎండ్ RTX 5090 సవరించిన వెర్షన్. అమెరికా నిబంధనలకు అనుగుణంగా దీని మెమరీ, బ్యాండ్‌విడ్త్ సామర్థ్యాలను తగ్గించారు. ప్రాథమికంగా ఇది చైనీస్ గేమర్స్, డిజిటల్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినప్పటికీ ఎన్విడియా శక్తివంతమైన బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ దీనికి అనుసంధానమై ఉండటంతో చైనా పరిశోధకులు దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి కూడా ఉపయోగిస్తున్నారు. సెమీకండక్టర్ టెక్నాలజీ పరంగా అమెరికాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోవాలనే చైనా వ్యూహంలో భాగంగానే ఈ చిప్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.అలీబాబా కొత్త ఏఐ చిప్ఇదే తరుణంలో అమెరికాకు గట్టి కౌంటర్ ఇస్తూ చైనా టెక్ దిగ్గజం అలీబాబా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ ‘జెన్వు ఎమ్890’ను ఆవిష్కరించింది. ఈ కొత్త చిప్ తన మునుపటి మోడల్ కంటే ఏకంగా మూడు రెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తుందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. జెన్వు సిరీస్‌లో భాగంగా కంపెనీ ఇప్పటికే 5,60,000 కంటే ఎక్కువ చిప్‌లను సరఫరా చేసినట్లు వెల్లడించింది. చైనా మార్కెట్లో ఎన్విడియా భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలోనే అలీబాబా ఈ ప్రకటన చేయడం చాలా కచ్చితమైన వ్యూహం అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!
పునరుత్పాదక ఇంధన రంగంలోకి భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ పునరుత్పాదక ఇంధన రంగం (సోలార్, పవన విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపన) పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించనుంది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలోకి 110–120 బిలియన్ డాలర్ల (రూ.11.52 లక్షల కోట్లు) మేర పెట్టుబడులు రానున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. 7 లక్షల ఎకరాల భూ సమీకరణ కోసమే సుమారు 10–15 బిలియన్ డాలర్ల (రూ.96,000–1,44,000 కోట్లు) పెట్టుబడులు అవసరమని తెలిపింది. 2025 చివరికి పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపిత సామర్థ్యం 250 గిగావాట్లకు చేరుకున్నట్టు తెలిపింది. 2015 నాటికి ఉన్న 80 గిగావాట్లతో పోలి్చతే మూడు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది. 2026 మార్చి నాటికి స్థాపిత సామర్థ్యం 275 గిగావాట్లకు చేరినట్టు పేర్కొంది. 2030 నాటికి 270–300 గిగావాట్ల సోలార్, పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం అదనంగా తోడు కానున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. 2026–2030 కాలంలో 6.5 లక్షల ఎకరాలు ఒక్క సోలార్ ఇన్స్టాలేషన్లకే అవసరమవుతుందని.. మిగిలిన 50వేల ఎకరాలు పవన విద్యుత్‌కు కావాల్సి వస్తుందని పేర్కొంది. 500 మెగావాట్ల లక్ష్యం సాధ్యమే సోలార్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు కోసం ఒక్కో మెగావాట్‌కు రూ.3–4 కోట్లు, పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ల (భూమిపై)కు సంబంధించి ఒక మెగావాట్ సామర్థ్యం కోసం రూ.8–9 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని కొలియర్స్ ఇండియా తెలిపింది. దేశీయంగా తయారీ సామర్థ్యాలు మరింత మెరుగుపడుతున్నందున 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని సులభంగానే చేరుకుంటుందని భావిస్తున్నట్టు పేర్కొంది. అప్పటికి ఒక్క సోలార్ ప్రాజెక్టుల సామర్థ్యమే 400–450 గిగావాట్ల మేర ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం 146 గిగావాట్ల సామర్థ్యం మేర ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నట్టు తెలిపింది. పునరుత్పాదక విద్యుత్ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం రియల్ ఎస్టేట్ రంగానికి అవకాశాలు కలి్పస్తుందని.. ముఖ్యంగా భూ సమీకరణ, పునరుత్పాదక ఆధారిత పారిశ్రామిక పార్కుల్లో అవకాశాలు ఉంటాయని అంచనా వేసింది.
భారత్ వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో 2026 సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి (యూఎన్) స్వల్పంగా తగ్గించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గత అంచనా 6.6 శాతాన్ని 6.4 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియా సంక్షోభం మరో షాక్‌గా ఈ నివేదిక అభివరి్ణంచింది. ఇది ప్రపంచ వృద్ధిని మందగింపజేయడంతోపాటు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను, అనిశ్చితులను పెంచినట్టు వివరించింది. ప్రస్తుత ప్రపంచ ప్రతికూల సవాళ్ల నుంచి భారత్‌కూ మినహాయింపు లేదని యూఎన్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ విభాగం సీనియర్ ఆర్థికవేత్త ఇంగో పిట్టర్లే వ్యాఖ్యానించారు. ‘‘భారత్ ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లపై ప్రభావం తదతర ఒత్తిళ్లు సైతం నెలకొన్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల కఠినతరంతో మానిటరీ పాలసీ మరింత సంక్లిష్టంగా మారింది’’ అని పిట్టర్లే వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ, ఆర్థిక శాఖ ఎలా స్పందిస్తాయన్నదే కీలకమన్నారు. ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనా సైతం తగ్గింపు 2026 సంవత్సరానికి గాను ప్రపంచ స్థూల జీడీపీ వృద్ధి రేటు అంచనాను సైతం 2.5 శాతానికి యూఎన్ తగ్గించింది. జనవరిలో వేసిన అంచనా కంటే 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు, కరోనా మహమ్మారికి ముందున్న సాధారణ వృద్ధి రేటు కంటే ఇది చాలా తక్కువని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బలంగానే ఆర్థిక మూలాలు.. భారత్ వృద్ధి 2025లో ఉన్న 7.5 శాతం నుంచి 2026లో 6.4 శాతం తగ్గడమన్నది ప్రధానంగా ఇంధన దిగుమతి వ్యయాలు పెరిగిపోవడం వల్లేనంటూ.. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. దేశీయంగా వినియోగ డిమాండ్, ప్రభుత్వ మూలధన వ్యయాలు, సేవల రంగ ఎగుమతుల్లో చక్కని పనితీరు కారణంగా భారతదేశంలో నిర్మాణాత్మకంగా బలమైన వృద్ధి కనిపిస్తున్నట్టు పేర్కొంది. తిరిగి 2027 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. దిగుమతి చేసుకునే దేశాలకు వ్యయాలు పెరిగినప్పుడు ఎగుమతులు కూడా సమస్యలు ఎదుర్కోవచ్చని యూఎన్ డైరెక్టర్ ఆఫ్ ఎకనమిక్ అనలైసిస్ శంతను ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రవాణా ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు, డీజిల్ వంటి ఇంధన ధరలు పెరిగినప్పుడు వ్యాపార వ్యయాలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లాగే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌కు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉందన్నారు. అయితే, ప్రస్తుతమున్న మిగులు నిల్వలు కరిగిపోయే లోపే ఈ షాక్‌లను ఎంత సమర్థవంతంగా అధిగమించగలదన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు.
ఫ్యామిలీ
మండుటెండలకు ఎలాంటి ఫుడ్ మంచిదంటే..!
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనేది కాలానుగుణంగా ఉంటేనే మంచిది. అందులోనూ భగభగలాడే ఈమండుటెండల్లో వేడిని తట్టుకోవాలంటే..వంటగదిలో ఈ చిన్నమార్పులు తప్పనిసరి. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన ఆహారం వేసవి వేడికి ఇబ్బందికరంగా మారిపోతుంది. అలాగని ఆరోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలా? అంటే కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతర్గత శరీర ఉష్ణోగ్రత అదుపు తప్పకుండా ఉండేలా తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలని అంటున్నారు. మరి అవేంటో చూద్దామా.!.తీపి పదార్థాలు..తేనె, బెల్లం 'ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఇవి తీసుకుంటే శరీరంలో వేడి అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖర్జూరపు పొడి, స్టీవియా, మంక్ ఫ్రూట్ షుగర్ లేదా దాగా మిశ్రి వంటి వాటికి మారమని సూచిస్తున్నారు నిపుణులు.చిరుధాన్యాలుజొన్న, మక్కీ, రాగి, కుట్టు, బ్రౌన్ రైస్‌లు ఆరోగ్యకరమైనవే కానీ వేసవిలో మాత్రం అంత మంచివికావని అంటున్నారు. ఎందుకంటే వేసవిలో ఇవి జీర్ణం అవ్వడం కష్టంగా ఉంటుందట. అందుకు బదులుగా జొన్న, జౌ (బార్లీ), సమక్, కాంగ్ని, తెల్ల బియ్యం, ఓట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.పప్పుధాన్యాలుకందిపప్పు, మినపపప్పు, కుల్తీ, మోత్(మట్కీ), సోయాబీన్ తదితరాలుబరువుగా ఉండి, గ్యాస్‌ను ఏర్పరుస్తాయనిన్ హెచ్చరిస్తున్నారు నిపుణులు. వీటికి బదులుగా, పెసరపప్పు, మసూర్ పప్పు, లోబియా, కాబూలీ శనగలను తీసుకోండి.కూరగాయలువంకాయ, బీట్రూట్, పాలకూర వంటివి శరీరంలో వేడిని పెంచి, జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నందున, వాటిని అధికంగా తీసుకోకపోవడమే మేలని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా సొరకాయ, టిండా(ఇండియన్ బేబీ పంప్కిన్), కద్దు(ఆనపకాయ), పర్వాల్(దొంకాయ రకం), దోసకాయ వంటివి అధిక నీటి శాతం కలిగి ఉండటం వల్ల గొప్ప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి.పాల ఉత్పత్తులుగేదె పాలు వంటి బరువైన పదార్థాలు సహజంగానే జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అదేవిధంగా, అధికంగా ఉండే పెరుగుకు - దాని శీతలీకరణ గుణాలు ఉన్నప్పటికీ ఇది కూడా మండుటెండలకు అస్సలు మంచిది కాదు. రైతా లేదా పులచటి మజ్జిగాలో తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణుల.మసాలాలుసాధారణంగా, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పరిధిని దాటినప్పుడు, తేలికపాటి ఆహారం తీసుకోవడం, అధిక మసాలాలు ఉన్న వంటకాలకు దూరంగా ఉండటం మేలు. అయితే, ఎండు అల్లం (సౌంత్), దాల్చినచెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, మెంతి గింజలు, పిప్పలి వంటి వేడి చేసే మసాలాలు అసిడిటీని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి, వాటి వాడకాన్ని పరిమితం చేయాలని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటికి బదులుగా, రుచికోసం సోంపు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, లెమన్‌గ్రాస్ ఉపయోగించమని సూచిస్తున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హెర్నియా: చొచ్చుకుపోయే చిచ్చు..! ఎవరిలో అధికం అంటే..)
ఎడ్యుకేషన్‌పై ఐఏఎస్ అధికారి ఆసక్తికర పోస్ట్..!
మన విద్య విధానం విద్యాపరంగా గెలుపు సాధించడం ఎలా, కఠినతరమైన పరీక్షలను ఎదుర్కోవడం ఎలా తదితరాలనే నేర్పిస్తోంది. జీవితానికి అవసరమైనవి, అత్యంత కీలకమైన పాఠాలను నేర్పించడంలేదట. చదువు అన్ని జీవన నైపుణ్యాలను నేర్పింస్తుందని పొరబడుతున్నాం. అది నిజంగా భావోద్వేగ పరంగా స్ట్రాంగ్ ఉండటం దగ్గర నుంచి జీవితానికి అవసరమై కీలక పాఠాలనేవ ఏమి నేర్పించలేకపోతుందంటూ ఓ ఐఏఎస్ అధికారిణి పెట్టిన పోస్టు అందర్నీ ఆకర్షించడమే కాదు ఆలోచనాత్మకంగా ఉంది. ఇంతకీ ఆమె ఆ పోస్ట్‌లో ఏం రాశారంటే..ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా..ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక కాలేజీలలో ఉన్నత చదువుని పొందా, ఐఏఎస్ వంటి మంచి గౌరవనీయమైన ఉద్యోగాన్ని దక్కించుకున్నానని అన్నారు. అయితే తాను పొందిన ఉన్నత విద్య పోటీపరీక్షలకు, వృత్తిపరమైన బాధ్యతలకు సిద్ధం చేయగలిగింది కానీ భావోద్వేగ పోరాటాలకు, ఒంటిరితనాన్ని ఎదుర్కోవడం వంటి సవాళ్లకు సిద్ధం చేయలేకపోయిందని రాశారు. నిజానికి మనమంతా విద్యార్థి దశలో గెలుపుని ఎలా అందుకోవాలో నేర్చుకోవడానికి ఏళ్ల తరబడి టైం స్పెండ్ చేస్తాం, కానీ సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఒక్క రోజు కూడా కేటాయించం అని పోస్టులో రాసుకొచ్చారామె. మనం కెమిస్ట్రీలో ఆవర్తన పట్టికను తెగ కంఠస్థం చేస్తాం, అయితే బాధను ఎలా అధిగమించాలో మాత్రం నేర్చుకోం. నిజానికి విద్యార్థులంతా విద్యా సంబంధితమైన అన్నింటిని నేర్చుకుంటారు, కానీ దుఃఖం, ఒత్తిడి లేదా వైఫల్యాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం నేర్పించదు లేదా ఏ గురువు నేర్పే ప్రయత్నం చేయరని అన్నారు. అంతేగాదు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి బదులుగా అణిచేయడం లేదా నియంత్రించడమే నేర్పిస్తారని, అది కాస్త ఒత్తిడికి గురిచేస్తుందని ఆమె నొక్కి చెబుతున్నారు. అంతేగాదు ప్రతి స్టూడెంట్‌కి వ్యాసాలు రాయడం ప్రోత్సహిస్తాం, కానీ అసౌకర్యాన్ని ఎలా వ్యక్తపరచాలో, హద్దులు ఎలా ఏర్పరచుకోవాలి, కష్టతరమైన పరిస్థితుల్లో కాదు అనే మాట ఎలా చెప్పాలి వంటి అనేక విషయాలను నేర్పాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారామె. ప్రతి స్కూలు స్టూడెంట్ చెప్పే సమాధానాలకు బహుమతులు ఇస్తుంది, వారినే విజేతలుగా పేర్కొంటుంది. కానీ జీవితంలో ఎక్కువ ప్రశ్నలు వేసిన వారే నిలదొక్కుకుంటారని ఆమె అంటున్నారు. అలాగే గణితం నేర్పిస్తాం గానీ ఆర్థిక ఒత్తిడిని ఎలా నిర్వహించాలో నేర్పదన్నారు. కేవలం డబ్బు సంపాదించడమే విద్య నేర్పిస్తుందే కానీ, దాన్ని నిర్వహించడం నేర్పదని పోస్టులో రాసుకొచ్చారామె. ఆమె పోస్టులకు పలువురు నెటిజన్లు మద్దతిస్తూ..విద్య కేవలం వృత్తి జీవితాన్నే నేర్పిస్తుందే తప్ప జీవితానికి కీలకమైన జీవన నైపుణ్యాలనే నేర్పించలేకపోతుందంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే..)
ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే..
ఒక్కోసారి లక్కు ఎలా ఉంటుందో చెప్పలేం. మనం అంతగా పట్టించుకోకపోయినా..ఎవరో అపరిచిత వ్యక్తలు ద్వారా అయినా అదృష్టం తన్నుకుంటూ వచ్చేస్తుంది. మనం మర్చిపోయినా..రేయి ఈ సొమ్ము నీదే రా అంటూ వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అలాంటి సంఘటనే యూఎస్‌లో చోటు చేసుకుంది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన వ్యక్తి గతేడాది మే నెలలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ విషయాన్ని ఒక ఏడాది పాటు పూర్తిగా మర్చిపోయాడు. అయితే ఒక రోజు తరుచుగా వెళ్లే గ్యాస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. అక్కడ ఒక లాటరీ టికెట్ జాక్‌పాట్ గెలుచుకున్నా..ఎవరు క్లైయిమ్ చేసుకోలేదని, గడవు ముగియనుందంటూ ఓ ప్రకటన కనిపించింది అది ఈ వ్యక్తి కంట పడింది. దాని గురించి అక్కడి లాటరీ అధికారులను ఆరా తీయగా. అది పిక్ -6 లాటరీ టికెట్ అని రెగ్యులర్ కస్టమర్లు మాత్రమే దీన్ని ఎంచుకుంటారని చెప్పారు. దాంతో ఒక్కసారిగా ఆ విషయం ఈ వ్యక్తికి గుర్తొచ్చి వెంటనే ఇంట్లోని ప్రతి అణువు గాలించాడు. అప్పుడే పాత ఫ్యాంటు జేబులో నలిగిపోయిన లాటరీ టికెట్ అతడి కంటపడింది. జాక్‌పాట్ గెలుచుకున్న లాటరీ టికెట్ నెంబర్‌తో సరిపోల్చుకుంటే ఆ టికెట్ అదే అని తేలడంతో ఏకంగా రూ. 57 కోట్లు డబ్బు దక్కించుకున్నాడు. ఒక వేళ్ల తేలిగ్గా తీసుకుంటే అంత భారీ సోమ్ము త్రటిలో చేజారిపోయేది. ఇది మాములు లక్కు కాదు కదా..!. అదృష్టం ఉంటే అది ఎలాగైన మన తలుపు తడుతుందంటే ఇదే కదూ.!. చాలామంది విజేతలు ఇలానే తమ లాటరీ టికెట్ల గురించి మర్చిపోవడం వల్ల చాలామటుకు అలానే క్లైయిమ్ చేసుకోకుండా ఉండిపోతాయని చెబుతున్నారు అధికారులు.(చదవండి: బీడు కొండలను పచ్చటి అడవిలా మార్చిన తాత..!)
పిల్లలూ... చదవాలి లా
ఆ ఇంటి కుర్రాడు ఫోన్ లో వచ్చిన లింక్ నొక్కాడు. బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. మరో ఇంటి కుర్రాడు మార్ఫింగ్ ఫొటో పెట్టాడు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇంకో ఆకతాయి బైక్ రేస్ చేశాడు. కేసు నెత్తిన పడింది. ఇవన్నీ ‘తెలియక’ చేసినవే. కానీ చట్టం ‘తెలియదు’ అనే మాటను క్షమించదు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచి లీగల్ పాఠాలు ఉండాలంటున్నారు రిటైర్డ్ ఐపిఎస్ వీరేందర్. ‘మిషన్ లీగల్ స్టడీస్ ఇండియా’ పేరుతో ఆయన ఢిల్లీలో చేస్తున్న కృషి దేశం అందుకోవాల్సి ఉంది.‘ఇగ్నొరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ యాన్ ఎక్స్క్యూజ్’ అని చట్టంలో మొదటి పాఠం. ‘మా వాడు బుద్ధిమంతుడు సార్, తెలియక చేశాడు’ అని తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. తప్పులు... శిక్షలునేటి పిల్లల ప్రపంచం స్క్రీన్ అంత చిన్నది... లేదా స్క్రీన్ అంత పెద్దది. స్క్రీన్ మీద ఏది కనిపిస్తే అదే నిజం అనుకుంటున్నారు. సైబర్ నేరం చేస్తే జైలుకు వెళ్తారని తెలియదు. అమ్మాయి ఫోటో అనుమతి లేకుండా షేర్ చేస్తే పోక్సో అవుతుందని తెలియదు. బైక్‌పై ముగ్గురు వెళ్తే, హెల్మెట్ లేకపోతే, మైనర్ డ్రైవింగ్ చేస్తే తలిదండ్రులకు కూడా జైలు శిక్ష పడుతుందని తెలియదు. మనం కూడా మార్కులు, ర్యాంకులు, ఐఐటి.. నీట్ అంటూ పరుగెత్తిస్తాం. కానీ రోడ్డు మీద ఎలా నడవాలి, ఫోన్ లో ఏం చేయకూడదు, ఆపద వస్తే ఏ చట్టం కాపాడుతుంది అనే ‘బతుకు పాఠం’ చెప్పం. ఫలితం? చిన్న తప్పు చేసి జీవితాన్ని బజారున పడేసుకుంటున్నారు.బడిలో చట్టం నేర్పిస్తే?‘లీగల్ స్టడీస్’ అనే సబ్జెక్ట్ సి.బి.ఎస్.ఇ.లో 11, 12 క్లాసులకు ఆప్షనల్‌గా ఉంది. ఆర్.టి.ఐ ఎలా వేయాలి, కన్సూ్యమర్ హక్కులు ఏంటి, సైబర్ చట్టాలు, మహిళా రక్షణ చట్టాలు, ట్రాఫిక్ రూల్స్ అన్నీ అందులో ఉంటాయి. కానీ ఢిల్లీలో 1500 స్కూల్స్ ఉంటే కేవలం 29 స్కూల్స్ మాత్రమే ఈ సబ్జెక్ట్ ఆఫర్ చేస్తున్నాయి. ఎందుకు? ‘దీనివల్ల కెరీర్ ఏముంది’ అని స్కూల్స్ అనుకుంటాయి. ‘మార్కులు రావు’ అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇది మార్కుల పాఠం కాదు, మనిషిగా బతికే పాఠం. దీన్ని ఎవరు చె΄్పాలి? రిటైర్డ్ జడ్జిలు, లాయర్లు, పోలీస్ అధికారులు వారానికి ఒక పీరియడ్ తీసుకుంటే చాలు.కోర్టులో నల్లకోటు వేసుకునే లాయర్ బడిలో చాక్‌పీస్ పడితే చట్టం పిల్లల భాషలోకి దిగివస్తుంది. ‘కేసు’ అంటే భయం పోయి ‘క్లారిటీ’ వస్తుంది. సినిమాల్లో చూసే పోలీస్, లాయర్ కాకుండా నిజమైన చట్టం తెలుస్తుంది. నేర్చుకుంటే నేరం ఆగుతుంది. ఒక పిల్లవాడికి తన హక్కులు తెలిస్తే, ఎదుటివాడి హక్కులూ తెలుస్తాయి. ‘రోడ్డు నాదే’ అని బైక్ నడిపేవాడు ‘రూల్ అందరిదీ’ అని నమ్ముతాడు. చట్టం తెలిసిన పౌరుడు పోలీస్‌కు సాయం చేస్తాడు, భయపడడు. మోసం జరిగితే కన్సూ్యమర్ కోర్టుకు వెళ్తాడు. అమ్మాయిని ఏడిపిస్తే అది ‘ఈవ్ టీజింగ్’ కాదు, ‘క్రిమినల్ ఆఫెన్ ్స’ అని గట్టిగా చె΄్తాడు. సమాజం మారాలంటే శిక్ష ఎందుకు పడుతుందో తెలియాలి. అది బడి నుంచే తెలియాలి.అతని కృషిఢిల్లీ రిటైర్డ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ వీరేందర్ పుంజ్ ఈ విషయంలో మొదటగా కళ్లు తెరిచారు. 2012 నిర్భయ కేసు సమయంలో ఆయన్ను ఒక ప్రశ్న వెంటాడింది. ‘నిందితుల్లో ఒకడు మైనర్. వాడికి చిన్నప్పుడే చట్టం పాఠం చెప్పుంటే ఈ దారుణం జరిగేదా?’... ఈ ప్రశ్నకు జవాబుగా రిటైర్ అయ్యాక స్కూల్ బ్యాగ్ తగిలించుకున్నాడు. ‘మిషన్ లీగల్ స్టడీస్ ఇండియా’ పేరుతో బడి బడికీ తిరుగుతున్నాడు. పిల్లలతో మాట్లాడుతున్నాడు. ‘మీ హక్కులు తెలుసా?’ అని అడుగుతున్నాడు. పిల్లలు ఆయనకు ఉత్తరాలు రాశారు. ‘మాకు లీగల్ స్టడీస్ కావాలి’ అని. ‘"WE WANT LEGAL STUDIES SUBJECT IN OUR SCHOOLS" ‘ అని ప్లకార్డులు పట్టుకున్నారు. చిన్నప్పుడు హిట్ అండ్ రన్ కేసులో తండ్రిని పోగొట్టుకున్న వీరేందర్‌కు న్యాయం జరగలేదు. ఆ గాయమే ఇవాళ వేల మంది పిల్లలకు చట్టం అనే కవచం ఇచ్చేలా చేస్తోంది. ఒక్క పిరియడ్ చాలుచట్టం పుస్తకంలో కాదు, బుర్రలో ఉండాలి. మామిడి పండు తియ్యగా ఉండాలంటే మొక్క సమయం నుంచి నీళ్లు పోయాలి. పౌరుడు బాధ్యతగా ఉండాలంటే బడిలోనే చట్టం నేర్పాలి. క్లాస్‌రూమ్‌లో ఒక్క పిరియడ్ చట్టం వింటే చాలు. జీవితం సేఫ్. రేపు మీ పిల్లల స్కూల్లో ‘లీగల్ స్టడీస్’ ఉందా అని అడగండి. లేకపోతే అడిగించండి. చట్టం తెలిసిన బిడ్డ ఇంటికి భరోసా, దేశానికి ధీమా. – కె.
అంతర్జాతీయం
విమానాల కూల్చివేత కేసు.. రావుల్ కాస్ట్రోకు అమెరికా షాక్
అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. 1996 నాటి అమెరికా పౌర విమానాల కూల్చివేత కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రో (94) పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో అధికారికంగా విచారణ ప్రారంభమైంది.ఈ చార్జ్‌షీట్ విడుదలైన కొద్ది గంటల్లోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా ప్రజలను ఉద్దేశించి ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. క్యూబాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న కాస్ట్రో కుటుంబ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇదే విషయంపై అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మయామిలో మాట్లాడుతూ.. "30 ఏళ్ల కిందట హత్యకు గురైన నలుగురు అమెరికన్ల కుటుంబాలు ఇప్పటికి న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి. వారు సాధరణ పౌరులు. వారి వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. శరణార్థులను కాపాడానికి వెళ్లిన మా పౌరులను పొట్టన పెట్టుకున్నారు. అందులో రావుల్ కాస్ట్రోది కీలక పాత్ర. అతడి అరెస్ట్ కోసం త్వరలోనే ఒక వారెంట్ జారీ చేస్తాం. కాబట్టి అతడు తనంతట తాను అమెరికాకు వస్తాడని ఆశిస్తున్నాము. లేకపోతే ఇతర మార్గాల్లో మేమే రప్పిస్తామని" ఆయన పేర్కొన్నారు.అసలు 1996లో ఏమి జరిగిదంటే?'బ్రదర్స్ టు ది రెస్క్యూ' మయామి కేంద్రంగా పనిచేసే ఒక మానవతావాద సంస్థ. అప్పటిలో క్యూబాలోని కమ్యూనిస్ట్ దారుణాలను తట్టుకోలేక చిన్న పడవల్లో సముద్రం గుండా అమెరికాకు పారిపోయే క్యూబన్ శరణార్థులను ఆకాశం నుండి గుర్తించి, వారిని రక్షించడం ఆ సంస్థ పని. ఈ సంస్థకు చెందిన మూడు చిన్న సివిలియన్ విమానాలు 1996 ఫిబ్రవరి 24న ఫ్లోరిడా జలసంధి మీదుగా ప్రయాణించాయి. అయితేఅంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తుండగా క్యూబాకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు వాటిపై దాడి చేసి కూల్చివేశాయి. ఈ ఘటనలో కార్లోస్ కోస్టా, అర్మాండో అలెజాండ్రే జూనియర్, మారియో డి లా పెనా, పాబ్లో మోరల్స్ అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు అమెరికా పౌరులు ఉన్నారు. ఆ సమయంలో రావుల్ కాస్ట్రో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్నారు. అతడి ఆదేశాల మేరకే అమెరికా సివిలియన్ విమానాలను కూల్చివేశారని అమెరికా న్యాయశాఖ నిర్ధారించింది. దీంతో ఇన్నాళ్ల తర్వాత కాస్ట్రోపై అభియోగాలు నమోదు చేసింది.
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌లో తనకు తనకు విశేష ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశముందని వెల్లడించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కూడా ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారునెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన ఒక యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నాకు మాత్రం 99 శాతం ప్రజాదరణ ఉంది. నేను అక్కడ ప్రధానమంత్రిగా పోటీ చేసినా గెలవగలను" అని ట్రంప్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా ఇరాన్‌తో ఒప్పందం గురించి విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఎలాంటి తొందర లేదని ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించడమే తమ లక్ష్యమని, ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అహ్మదినెజాద్ను అధికారపీఠంపై కూర్చోబెట్టాలని చూశారు
వాషింగ్టన్: వెనుజువెలాలో మదురో దంపతుల అధికారభవనంపైకి మెరుపుదాడిచేసి వాళ్లను బంధించి అధికారపీఠం నుంచికూల దోసిన అమెరికా ప్రభుత్వం అదే తరహాలో ఇరాన్‌లోనూ అధికార మార్పిడికి యత్నించి విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను వెలువర్చింది. 2005 నుంచి2013 ఏడాదిదాకా ఇరాన్‌కు అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేర్చిన మొహ్మూద్ అహ్మదినెజాద్కు తిరిగి అధికారాన్ని అప్పగించాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నించాయని నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీసహా పలువురు కీలక నేతలను వైమానిక దాడులతో అంతమొందించడం తెల్సిందే. వెనువెంటనే అహ్మదినెజాద్ ను గద్దెనెక్కించాలని అమెరికా ప్రయత్నించి నా అందుకు సానుకూలవాతావరణంలేక మిన్నకుండిపోయిందిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అహ్మదినెజాద్ పరిపాలనాధోర ణిని ఏమాత్రం మెచ్చని నాటి ఖమేనీ ఆ తర్వాత ఆయనను గృహనిర్బంధంచేశారు. దీంతో శత్రువుకు శత్రువు మిత్రువు అనే చందంలో ఖమేనీ అంటే మెచ్చని అహ్మది నెజాద్‌ను అమెరికా, ఇజ్రాయెల్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ మేరకు ఆయనతో రహస్యంగా సంప్రతింపులు జరిపినట్లు తెలుస్తోంది. గృహనిర్బంధంలో ఉన్న అహ్మదినెజాద్ను విడిపించేందుకే ఫిబ్రవరి 28న ఆయనను బంధించి ఇంటి మీదా అమెరికా దాడులుచేసి ఇంటిని ధ్వంసంచేసింది. అయితే ఈ దాడిలో అహ్మదినెజాద్ గాయపడ్డారని, తర్వాత ఆయన ఎవరికీ కన్పించకుండాపోయారని వార్తలొచ్చాయి.
బక్రీద్ కానుక.. 1400 మందికి పైగా ఖైదీల విడుదల!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జైళ్లులలో మగ్గుతున్న 956 మంది ఖైదీలను విడుదల చేయాలని నహ్యాన్ ఆదేశించారు.సమాజంలో క్షమాగుణాన్ని,సోదరభావం, సామాజిక సమరసతను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వివిద కేసుల్లో శిక్ష అనుభవిస్తూ జరిమానాలు లేదా ఆర్థికపరమైన బకాయిలు చెల్లించలేక జైళ్లలోనే ఉంటున్న ఖైదీల అప్పుల మొత్తాన్ని యూఏఈ అధ్యక్షుడే స్వయంగా చెల్లించనున్నారు. దీంతో బయటకు వచ్చిన ఖైదీలు ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. మరోవైపు అజ్మాన్ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్-నుఐమి కూడా తన పరిధిలోని జైళ్ల నుండి 230 మంది ఖైదీలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి సైతం 227 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో మొత్తం 1400కు పైగా ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. కాగా ప్రతీ ఏడాది రంజాన్, రంజాన్, బక్రీద్, జాతీయ దినోత్సవాల సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఒక ఆనవాయితీగా వస్తోంది.
జాతీయం
మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ముమ్మాటికీ ద్రోహులే
రాయ్‌బరేలీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ముమ్మాటికీ ద్రోహులు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారంతా కలిసి భారత రాజ్యాంగంపై నిత్యం దాడి చేస్తున్నారని, దేశ ప్రయోజనాలను కొంతమంది పారిశ్రామికవేత్తలకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ తన సొంత నియోజకర్గం రాయ్‌బరేలీలో రెండో రోజు బుధవారం కూడా పర్యటించారు. స్థానిక విప్లవవీరుడు ‘వీరా పాసీ’ సంస్మరణార్థం న్విహించిన బహుజన్ స్వాభిమాన్ సభలో ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మీ ఇళ్లకు వచ్చి మోదీ, అమిత్ షాల గురించి మాట్లాడితే నిలబడి గట్టిగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లు ద్రోహులేనని తేల్చిచెప్పాలని సూచించారు. రాజ్యాంగం, అంబేడ్కర్, గాం«దీజీలపై దాడి చేస్తూ దేశాన్ని అమ్మేస్తున్నవారు ద్రోహులు కాక ఇంకేమవుతారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, కుల గణన చేపట్టకుండా జాప్యం చేస్తూ, బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తూ రాజ్యాంగంపై నిత్యం 20 గంటలూ దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. త్వరలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహారం సహా అన్నింటి ధరలు ఎగబాకుతాయని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఎరువుల ధరలు సైతం పెరగడం తథ్యమని అన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా సామాన్య ప్రజలే నష్టపోతారని, అంబానీ, అదానీలపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. అంబానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి, దాన్ని విదేశాలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడని, ఆ సొమ్మును నరేంద్ర మోదీకి చేరవేస్తున్నాడని రాహుల్ ధ్వజమెత్తారు. రాబోయే సంక్షోభం నుంచి ప్రజలను ప్రభుత్వం కాపాడలేదని, దాని ప్రభావం రెండు మూడు నెలల్లో కనిపిస్తుందని అన్నారు. చమురు ధరల విషయంలో ప్రభుత్వం తప్పేమీ లేదని మోదీ అంటున్నారని ఆక్షేపించారు. కానీ, తప్పంతా మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లదని తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని రాహుల్ విమర్శించారు.‘అది నాయకత్వ లక్షణం కాదు.. గిమ్మిక్’ ప్రధాని మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలొనీకి మెలొడీ చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడంపై రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో స్పందించారు. ‘అది నాయకత్వ లక్షణం కాదు.. ఉత్తి గిమ్మిక్’ అని తేల్చిచెప్పారు. ఒకవైపు పెరిగిపోతున్న ఆర్థిక సంక్షోభాన్ని పట్టించుకోకుండా ఇటలీలో చాక్లెట్లు ఇస్తున్నారని మోదీపై మండిపడ్డారు. మన రైతులు, కార్మికులు, వ్యాపారులు కష్టాల్లో ఉంటే మోదీ మాత్రం నవ్వుతూ రీల్స్ చేస్తున్నారని, అది చూసి బీజేపీ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారని రాహుల్ విమర్శించారు. రాజకీయాల్లో ఆయన రాహువు బీజేపీ చీఫ్ నబీన్ మండిపాటున్యూఢిల్లీ: ప్రధాని మోదీ ద్రోహి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ మాటలు ఆయన అరాచక మనస్తత్వాన్ని, స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ధ్వజమెత్తారు. 140 కోట్ల మంది ప్రజలను దారుణంగా కించపర్చారని, రాహుల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బుధవారం డిమాండ్ చేశారు. భారత రాజకీయాల్లో రాహుల్ ఒక ‘రాహువు’అని ఆరోపించారు. ఆయన తన ఆలోచనా విధానంతో దేశ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని విమర్శించారు. వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుండడంతో అది తట్టుకోలేక నిరాశ, అసంతృప్తికి గురై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని, మానసిక సమతుల్యత కోల్పోతున్నారని రాహుల్‌పై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు.
ఉప్పు గాలితో ‘ఊపిరి’ తీసుకోండి!
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనం ప్రకారం ప్రపంచంలో దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల బారిన పడిన వారిలో అధిక శాతం మన దేశంలోనే ఉన్నారు. ముఖ్యంగా మన నగరాల్లో 10 కోట్ల మందికిపైగా ప్రజలు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ), ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి ఉప్పుతో చేసే హాలోథెరపీ తేలికపాటి చికిత్స ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు గాలి చేసే మంచి.. ఉప్పు గదిలో కూర్చొని ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ, విశ్రాంతి తీసుకోవడమే సాల్ట్ రూమ్ హాలోథెరపీ లేదా సాల్ట్ థెరపీ. ఉప్పు గాలి శ్వాసనాళాన్ని శుభ్రపరిచి బలహీనంగా ఉన్న ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ థెరపీతో శ్వాసకోశ సమస్యలు నయంకావడంతోపాటు నిద్ర కూడా సరిగా పడుతుందని అధ్యయనంలో తేలింది. ఔషధాల తయారీలో ఉపయోగించే సోడియం క్లోరైడ్‌ను హాలో జనరేటర్ అనే యంత్రం సాయంతో చిన్నచిన్న రేణువులుగా మారుస్తారు. ఆ కణాలు గాలిలో తేలుతూ గది అంతటా ఆవరిస్తాయి. ఉప్పులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, మ్యూకోలైటిక్ (కఫాన్ని పలచబరిచే) గుణాలు సహజంగా ఉంటాయి. ఆ గాలిని పీల్చడం వల్ల ఉప్పు కణాలు శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని పలచగా చేసి శ్వాస తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గిస్తాయని ఆల్టర్నేటివ్ మెడిసిన్ నిపుణులు అంటున్నారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ అధ్యయన సంస్థ ప్రపంచంలో 160కిపైగా దేశాల్లో సేవలందిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. దాదాపు 12 వేల మంది పరిశోధకులు ఈ అధ్యయనాల్లో పాల్గొంటున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్
ప్రభుత్వ న్యాయ విభాగాల్లో 30% మహిళా కోటాపై తేల్చండి
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, విభాగాలు, ట్రిబ్యూనళ్లు, రెగ్యులేటరీల వంటి ప్రభుత్వ ప్యానెళ్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయ సలహాదారు, గవర్నమెంట్ ప్లీడర్, న్యాయాధికారి వంటి పోస్టుల్లో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. లాడ్లీ ఫౌండేషన్ ట్రస్ట్ వేసిన ఈ పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంఛోలీల ధర్మాసనం విచారించింది. ఈ విషయంలో మీ స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టులోని ప్యానెళ్లు మొదలు స్థానిక న్యాయసహాయక అథారిటీల్లో మహిళా న్యాయవాదులకు తగు ప్రాధాన్యత దక్కేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ విషయమై తాము ఇప్పటికే దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో మహిళా లాయర్ల ప్రాతినిధ్యాన్ని తేల్చేందుకు సర్వే పూర్తిచేశామని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ వికాస్‌సింగ్ తెలిపారు. దీంతో జస్టిస్ సూర్యకాంత్ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇటీవల తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రతినిధులు నన్ను కలిశారు. అక్కడ మహిళా లాయర్‌ను సెక్రటరీగా నియమించారని తెలిసి ఆశ్చర్యపోయా. అక్కడ మొత్తం 19,000 మంది బార్ సభ్యులున్నారని, వారిలో 8,000 మంది లాయర్లు తరచూ కోర్టులకు హాజరవుతారని తెలిసింది. వారిలో 2,000 మంది మహిళా లాయర్లే. వీరిలో ఒకరికి మాత్రమే సెక్రటరీ పదవి దక్కింది’’ అని సీజేఐ గుర్తుచేశారు. మహిళా లాయర్లు న్యాయవాద వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలపై విడిగా పిల్ వేస్తామని సింగ్ తెలిపారు. ‘‘ లా కాలేజీల్లో చాలా మంది అమ్మాయిలు చేరి లా పట్టా పుచ్చుకుంటున్నా న్యాయస్థానాల దాకా రావట్లేదు. న్యాయవాద వృత్తిలోకి రాకుండా ఎన్నో ప్రతిబంధకాలు వాళ్లకు అడ్డుగా నిలుస్తున్నాయి. అందుకే 30 శాతం రిజర్వేషన్ ద్వారా మహిళల ప్రాతినిధ్యం ఈ వృత్తిలో పెంచాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్యానెళ్లు, ప్రభుత్వ లా ఆఫీసర్ పదవులు, న్యాయ సహాయకులు, అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో లీగల్ నిపు ణులు,సలహాదారుల పదవుల్లోకి మహి ళా లాయర్లకు తగు అవకాశం ఇవ్వాలి’’ అని ఆయన వాదించారు.
రాష్ట్రానికి అదనంగా రూ.5 వేల కోట్లు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, విద్యారంగ రూపాంతరమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కీలక భేటీ జరిపారు. రాష్ట్రంలో మౌలిక వసతుల విస్తరణ, మానవ వనరుల అభివృద్ధికి కేంద్రం నుంచి అదనపు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఆయన వినతిపత్రాలు సమర్పించారు. ‘సాస్కీ’పథకం కింద.... రాష్ట్రంలో కొనసాగుతున్న మూలధన వ్యయాలు, సంక్షేమ పథకాలకు మద్దతుగా ‘సాస్కీ’(ఎస్ఏఎస్సీఐ) పథకం కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని భట్టి విక్రమార్క కోరారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ ఇప్పటికే కేంద్రం రూ.4,208 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.30,000 కోట్లతో భారీ ప్రణాళికను రూపొందించిందని భట్టి పేర్కొన్నారు. ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయింపు ఇవ్వండి ఏడీబీ సహకారంతో రూ.4,049.11 కోట్లు, ఏఐఐబీ సహకారంతో రూ.4,903.44 కోట్ల వ్యయంతో చేపట్టే విద్యా ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ రుణాలను రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం వెంట ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రెటరీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. కొయ్యగూడెం బ్లాక్–3ని సింగరేణికి అప్పగించండికేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి భట్టి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, రాష్ట్ర విద్యుత్ అవసరాలే లక్ష్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డితో సమావేశమయ్యారు. కోల్ ఇండియా తరహాలోనే సింగరేణిలోనూ ఆధునిక సాంకేతికతతో ‘బొగ్గు గ్యాసిఫికేషన్’ప్రాజెక్టులను చేపట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణ విద్యుత్ అవసరాలకు కీలకమైన కొయ్యగూడెం బ్లాక్–3 గత వేలంలో కేటాయించినా నాలుగేళ్లుగా పనులు ప్రారంభం కాలేదని, కాబట్టి దాన్ని సింగరేణికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రీ–మైనింగ్ పనులు పూర్తయిన తాడిచెర్ల కోల్ బ్లాక్–2 మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేసేలా ముందస్తు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులు, సింగరేణి ప్రతినిధులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఆర్ఐ
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
క్రైమ్
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్‌గా కూడా చాలాకాలం సేవలు అందించారు.
యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణ హత్య
యర్రగొండపాలెం: తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్న యువకుడిని బాలిక తల్లిదండ్రులు దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా నరికి పొలాల్లో ఉన్న బోరు బావిలో పడేసిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మార్కాపురం డీవైఎస్పీ కె.నాగరాజు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెంచు కాలనీకి చెందిన దిగుడు ఆంజనేయులు (21) ఈ నెల 13వ తేదీ రాత్రి ఓ 15 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూస్తే బాలికతో ఆంజనేయులు సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆవేశంలో ఇంట్లో ఉన్న అట్లపెనం తీసుకొని యువకుడి తలపై మోదడంతో అతను మృతి చెందాడు. మరుసటి రోజు కూడా ఆ మృతదేహాన్ని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. వాసన వస్తుండటంతో నిందితులు మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ముక్కలుగా నరికి అక్కడికి సమీపంలోని ప్రైవేటు స్కూలు వెనుక వైపు పొలాల్లో ఉన్న ఒక బోరుబావిలో పడేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఆంజనేయులు కనిపించకుండా పోయాడని అతని బావ చెల్లె వెంకటరావు ఈ నెల 16న ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ కె.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆంజనేయులు సెల్ ఆధారంగా బాలిక ఇంటి వద్ద అదృశ్యమైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఉన్నబాలిక తల్లిదండ్రులకు పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లె జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు డీవైఎస్పీ తెలిపారు. వారి కుమార్తెను త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ కె.అజయ్‌కుమార్, ఎస్సై ఎం.దేవకుమార్‌లను ఆయన అభినందించారు. బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా డీవైఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మృతుడు ఆంజనేయులు బంధువులు పోలీస్ స్టేషన్లో గొడవకు దిగారు. వెంటనే బోరుబావిలో ఉన్న శరీర భాగాలను వెలికి తీయాలని, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అత్తమామలను చంపిన అల్లుడికి ఉరి
వరంగల్ లీగల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడానికి అమె తల్లిదండ్రులు (అత్తమామలు) కారణమని భావించి వారిని చంపిన అల్లుడికి వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి జె. మైత్రేయి బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజుకు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు చెందిన బానోతు దీపిక ప్రేమించుకున్నారు. 2023లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. అయితే పెళ్లయినప్పటి నుంచే దీపికను నాగరాజు గృహహింసకు గురిచేయడంతో భరించలేని ఆమె 2024లో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అందుకు దీపిక తల్లిదండ్రులే కారణమని కక్ష పెంచుకున్న నాగరాజు.. ఆ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. 2024 జూలై 10న అర్ధరాత్రి దాటాక 16 చింతల తండాకు చేరుకొని నిద్రిస్తున్న దీపికతోపాటు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా బానోతు శ్రీను మృతి చెందాడు.
పోలీసుల అలసత్వమే ప్రాణం తీసిందా?
యువ సింగర్ ఇందర్ కౌర్ హఠాన్మరణం పంజాబ్‌ను ఉలిక్కి పడేలా చేసింది. వారం కిందట కిడ్నాప్‌కు గురైన ఆమె.. నిన్న కాలువలో శవమై కనిపించారు. దీంతో అక్కడి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ కేసులో విస్తుపోయే విషయాల్ని వెల్లడించారు ఆమె కుటుంబ సభ్యులు.యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్(29).. పంజాబీ సింగింగ్ సెన్సేషన్. ఈ నెల 13న సాయంత్రం లూథియానాలోని ఇంటి నుంచి కారులో బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టుపక్కల అంతటా జల్లెడ పట్టారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం నీలో కాలువలో ఆమె శవంగా తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు కబురు పంపి.. మృతదేహాన్ని సమ్రాలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాకే వివరాలు చెబుతామని అధికారులు అంటున్నారు. ఈలోపు ఇందర్ కుటుంబం సంచలన ఆరోపణలకు దిగింది.మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన గాయకుడు సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా ఇందర్ మృతికి కారణమంటూ ఆమె సోదరుడు జోతింధర్ సింగ్ చెబుతున్నాడు. మూడేళ్ల కిందట వీళ్లకు పరిచయమైంది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాడు సుఖా. అయితే అప్పటికే కెనడాలో అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. దీంతో తిరస్కరించింది. దీంతో కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని జోతింధర్ అంటున్నాడు. తమ సోదరి కనిపించకుండా పోయిన నాడే పోలీసులకు ఈ విషయం చెప్పామని అంటున్నాడతను. సుఖాతో పాటు అతని స్నేహితుడు కరమ్‌జిత్ సింగ్ కూడా ఈ నేరంలో భాగమయ్యాడు. వాళ్లు తుపాకీ చూపించి ఇందర్‌ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతే ఆమె శవమై కనిపించిందని ఆరోపిస్తోంది ఆమె కుటుంబం.పోలీసుల అలసత్వమేనా?ఇందర్ కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు, తండ్రి మే 13వ తేదీ రాత్రే లూథియానాలోని జమల్పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు వెంటనే స్పందించలేదన్నది ఇందర్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. ఉన్నతాధికారి లేడంటూ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఎదురు చూశారు. ఆ తర్వాతే ఫిర్యాదు తీసుకుని ఆమె కోసం గాలింపు చేపట్టారు. పైగా అనుమానితుడిగా సింగర్ సుఖా పేరు చెప్పినా.. ఆ కోణంలో దర్యాప్తు జరపలేదు.ఇందర్ తిరస్కరించాక సుఖా అవమానంగా ఫీలై కెనడాకు వెళ్లిపోయాడు. అయితే పగ పెంచుకుని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఇందర్, ఆమె కుటుంబం ఊహించలేదు. కెనడా నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చిన సుఖా.. నేరం చేశాక తిరిగి అదే దారిలో వెళ్లిపోయాడు. పోలీసులు తక్షణ ఫిర్యాదు స్వీకరించినా.. సకాలంలో స్పందించినా.. ఇందర్ ప్రాణాలు దక్కేవని, నేరస్తుడు చిక్కేవాడేమోనని అని బాధిత కుటుంబం వాపోతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విచారణకు ఆదేశిస్తామని పోలీస్ శాఖ చెబుతోంది. అంతేకాదు.. వ్యక్తిగత విబేధాలతో పాటు గ్యాంగ్‌స్టర్ మాఫియా లింకుల కోణంలోనూ ఈ కేసు విచారణ జరుపుతామని ప్రకటించింది.ఫేమస్ అవుతున్న టైంలో.. పంజాబీ సంగీత ప్రపంచంలో ఇందర్ కౌర్ రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫోక్ మ్యూజిక్‌కి దగ్గరగా ఉండే స్టైల్‌తో పాటు పాప్ కల్చర్‌కి కూడా అనుసంధానం చేసేది. లైవ్ పెర్ఫార్మెన్స్లు, సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల ఆమెకు మంచి ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. అలా అభిమానులు ఆమెను ఫోక్ క్వీన్‌గా పిలుచుకునేవారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె హఠాత్తుగా ఇలా చనిపోవడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.పంజాబ్‌లోనే ఎందుకిలా?ఇందర్ కౌర్ మరణం పంజాబ్ గ్లామర్ఫీల్డ్ను మరోసారి వార్తల్లో నిలబెట్టింది. వ్యక్తిగత విబేధాలు మాత్రమే కాదు.. అక్కడి గాయకులు, సెలబ్రిటీలు తరచుగా హింసకు గురవుతున్నారు. సిధూ మూసేవాలా, అమర్ సింగ్ చమ్కిలా వంటి ప్రముఖులు కూడా ఈ తరహా దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అందుకు కారణాలను పరిశీలిస్తే..పంజాబ్‌లో సింగర్లు కేవలం వినోదకారులు మాత్రమే కాదు.. సామాజిక, రాజకీయ, కుల చిహ్నాలుగా ఉంటున్నారు. వీటికి తోడు పంజాబ్‌లో సంఘటిత నేరజాలం వినోద రంగంతో మిళితమై ఉంది. అంటే.. కొంతమంది గాయకుల పాటల్లో గన్స్, రివెంజ్, పవర్ పాలిటిక్స్ వంటి అంశాలు ఉండటం వల్ల వారు గ్యాంగ్‌స్టర్ కల్చర్‌తో అనుసంధానమైపోతున్నారు. అలా దాడులకు గురవుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
వీడియోలు
ప్రెస్ మీట్ మధ్యలో జగన్ కామెడీ.. పుష్ప శ్రీవాణితో బాబు మేనిఫెస్టో చదివించి..
అబ్బా కొడుకులిద్దరికి కలిపి చెప్తున్నా.. జగన్ స్ట్రాంగ్ రిప్లై
పెట్రోల్ ధరలపై లోకేష్ దొర అన్న మాటలు.. వీడియోలు ప్లే చేసి ఏకిపారేసిన జగన్
నందమూరి హరికృష్ణ శవం దగ్గర.. చంద్రబాబు పొత్తులు
జగన్ మంచోడు కనుకనే... ఈ రోజు మీరందరు బ్రతికున్నారు
ఢిల్లీకి పరుగులు.. అమిత్ షాతో పవన్ అర్జెంట్ మీటింగ్
బాలకృష్ణ గన్ తో ఇద్దరిని టపా..టపా అంటూ కాల్చితే.. బాబు శవ రాజకీయాలుపై జగన్ కౌంటర్
జోగి రమేష్ అరెస్ట్ జగన్ సంచలన కామెంట్స్
వీళ్లకు రోడ్డు పక్కన ప్లాట్లు భూములిచ్చిన రైతులకు చెరువుల్లో
ఆ పేరు వింటే బాబు గుండె ఆగిపోతుంది..


