కేజీఎఫ్, సలార్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా 'డ్రాగన్'. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ రిలీజ్ చేశారు. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ కోసం తారక్ చాలా బక్కచిక్కిపోయాడు. గతంలో పలు ఈవెంట్స్‌లో అలానే కనిపించాడు. అయితే అంతలా బరువు తగ్గిపోవడానికి కారణాన్ని ఇన్నాళ్లకు ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు. తాజా ఇంటర్వ్యూలో అసలేం జరిగిందో చెప్పాడు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)
'మూవీ షూటింగ్ మొదలుపెడదామనగా.. ఎన్టీఆర్‌ని కొంచెం సన్నబడమని చెప్పాను. కానీ ఆయన మాత్రం నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిపోయాడు. దీంతో అంతా కంగారు పడ్డారు. తారక్ భార్య, తల్లి, ఫ్రెండ్సే కాదు నా టీమ్ కూడా నన్నే తిట్టారు. నేనే ఇదంతా చేశానని అన్నారు. ఎందుకంటే మరీ బక్కగా, బలహీనంగా కనిపించాడు. నేను కూడా చాలాసార్లు ఇక సరిపోతుంది ఆపేయమని చెప్పా. అయినా వినలేదు'
'కథ కోసం, తన పాత్ర కోసం ఎన్టీఆర్‌ని ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఆయనని ఆపడం చాలా కష్టం. ఇంత పట్టుదల గల వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, వ్యక్తిగతంగా సమస్య ఉందని వచ్చిన వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. పాత్ర కోసం పడిన కష్టమే అది' అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు.
వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్.. ఆఫ్గాన్ డ్రగ్ మాఫియా కంపెనీలో పనిచేసే నరహంతకుడిగా కనిపించబోతున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్. అనిల్ కపూర్, జిబు మేనన్, ఖుష్బూ, అశుతోష్ రాణా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. అతిపెద్ద దేశభక్తి సినిమా: ప్రశాంత్ నీల్)
#PrashanthNeel says, 'We spent four months looking at him ( #NTR ) suffer.'
“I told him that if you became THINNER for the role of the assassin, it would help.
His wife, his mother, all his friends and my whole team were UPSET with me.” pic.twitter.com/FpJ7Puj0BW— Whynot Cinemas (@whynotcinemass_) May 20, 2026


