కేన్స్‌ చిత్రోత్సవాల్లో హారర్‌ సినిమా టీజర్‌ | Thazh Thiravaa Teaser Screened at Cannes Film Festival | Sakshi
Sakshi News home page

కేన్స్‌ చిత్రోత్సవాల్లో తమిళ హారర్‌ మూవీ టీజర్‌

May 21 2026 9:12 AM | Updated on May 21 2026 9:38 AM

Thazh Thiravaa Teaser Screened at Cannes Film Festival

నటుడు ఆదవ్‌ కన్నదాసన్‌, నటి వాణి భోజన్‌ జంటగా నటించిన చిత్రం తాళ్‌ తిరవా. బర్మన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌. కేఆర్‌ సహ నిర్మాత. భరణి శేఖర్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.. సురేష్‌ మీనన్‌, సుబ్బుపంజా ముఖ్య పాత్రలు పోషించిన ఇందులో బాల తారలు లిసా, లలిత నటించారు. హారర్‌, థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇది ఒక గ్రామంలో గుర్తించిన పురాతన రాతి పలకంపై రాసిన అక్షరాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, అనర్థాల ఇతివృత్తంతో రూపొందిస్తున్న మూవీ అని చెప్పారు.

ఇప్పటికే చిత్ర షూటింగ్‌ పూర్తి అయిందన్నారు. మూవీ టీజర్‌ను మంగళవారం (మే 19) నాడు కేన్స్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రపంచ సినీ ప్రముఖులను అలరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే తాళ్‌ తిరవా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశామని, దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. చిత్ర ఆడియో, ట్రైలర్‌ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈచిత్రానికి ఓషో. వెంకట్‌ సంగీతాన్ని సమకూర్చగా, సాల్మన్‌బోస్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement