టీమిండియా శ్రీలంక పర్యటన షెడ్యూల్‌ విడుదల | India Tour Of Sri Lanka 2026 Full Schedule Announced | Sakshi
Sakshi News home page

టీమిండియా శ్రీలంక పర్యటన షెడ్యూల్‌ విడుదల

May 21 2026 8:43 AM | Updated on May 21 2026 8:44 AM

India Tour Of Sri Lanka 2026 Full Schedule Announced

భారత అండర్‌ 19 క్రికెట్‌ జట్టు శ్రీలంక పర్యటన 2026 షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. కొత్త అండర్‌-19 వరల్డ్‌కప్‌ సైకిల్‌లో భాగంగా భారత యువ జట్టు జూలైలో ద్వీప దేశంలో పర్యటిస్తుంది. ఈ టూర్‌లో మూడు వన్డేలు, రెండు యూత్‌ టెస్టులు నిర్వహించనున్నారు. జూన్‌ 30న భారత జట్టు కొలంబో చేరుకోనుండగా.. జూలై 4 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

వైభవ్‌ సూర్యవంశీ​కి ఛాన్స్‌ లేదు
బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం ఒక్క ఆటగాడు కేవలం ఒక అండర్‌-19 వరల్డ్‌కప్‌ మాత్రమే ఆడగలడు. దీంతో గత అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఆడిన చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఈ సిరీస్‌లో పాల్గొనడు.

ట్రై సిరీస్‌
మరోపక్క భారత్‌-ఏ జట్టు ఇదే సమయంలో శ్రీలంకలో ట్రై సిరీస్‌ ఆడనుంది. అందులో ఇండియా-ఏ తరఫున వైభవ్‌ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. జూన్‌ 9 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో ఇండియా-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్‌-ఏ జట్లు పాల్గొంటాయి.

ఇండియా అండర్‌-19 జట్టు శ్రీలంక టూర్‌ పూర్తి షెడ్యూల్‌
జూలై 4- తొలి వన్డే- హంబన్‌టోటా
జూలై 6- రెండో వన్డే- హంబంటోటా 
జూలై 9- మూడో వన్డే - హంబంటోటా

జూలై 13-16 తొలి యూత్‌ టెస్ట్‌ - గాలే 
జూలై 20-23 రెండో యూత్‌ టెస్ట్‌ - కొలంబో  

ఈ సిరీస్‌తో 2028 అండర్‌-19 వరల్డ్‌కప్‌కు భారత జట్టు కొత్త కోర్‌ గ్రూప్‌ను తయారు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. శ్రీలంక టూర్‌ తర్వాత ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు భారత్‌కు వచ్చి యూత్‌ సిరీస్‌ ఆడనుంది. 

సెప్టెంబర్‌ 18 నుంచి 23 వరకు రాజ్‌కోట్‌లో మూడు యూత్‌ లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం సెప్టెంబర్‌ 27 నుంచి 30 వరకు రాజ్‌కోట్‌లో తొలి యూత్‌ టెస్ట్‌.. అక్టోబర్‌ 5 నుంచి 8 వరకు అహ్మదాబాద్‌లో రెండో యూత్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement