అప్పుల పరుగులో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ అప్పుల్లో మాత్రం దూసుకెళ్తూ అగ్రస్థానంలో ఉన్నారు. బడ్జెట్లో ప్రతి మంగళవారం అప్పులు చేయడంతోపాటు, బడ్జెట్ బయట కూడా దొరికిన చోటల్లా అప్పు చేస్తూ రెండేళ్లు కాకుండానే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. తాజాగా మంగళవారం బడ్జెట్లో మరో రూ.4,600 కోట్లు అప్పు చేశారు. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో రెండేళ్లు కాకుండానే చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రూ.3,40,494 కోట్లకు చేరాయి. ఇందులో బడ్జెట్ అప్పులే రూ.1,80,603 కోట్లు కాగా, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,12,504 కోట్లకు చేరాయి. మరో పక్క రాజధాని అమరావతి పేరుతో రూ.47,387 కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా అభివృద్ధి, సంక్షేమం మాత్రం శూన్యంగా ఉంది. అప్పు చేయకుండా రాష్ట్ర సంపద పెంచడం ద్వారా సూపర్ సిక్స్‌తో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తానంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకుండానే రాష్ట్ర ప్రజలపై భారీగా అప్పుల భారం మోపారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా రాష్ట్ర సంపద పెంచడంలోనూ విఫలమయ్యారు. దొరికిన చోటల్లా అప్పులు చేయడంలో మాత్రం సఫలం అయ్యారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసింది. కానీ చంద్రబాబు రెండేళ్లు కాకుండానే రూ.3.40 లక్షల కోట్లు అప్పు చేసినా, ప్రజలకిచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదు. కొత్తగా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అభివృద్ధి చేయలేదు. రాష్ట్ర ఆస్తులను సృష్టించలేదు. రాష్ట్ర సంపదగానీ, ప్రజల సంపద గానీ పెంచలేదు. మొత్తంగా రాష్ట్ర ప్రజలపై మోయలేని అప్పుల భారం మోపారు.
పంట పీకి పందిరి!
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో గడిచిన పుష్కరకాలంగా పంటల సాగులో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. కూరగాయలు సహా సంప్రదాయ పంటలు తగ్గిపోతుంటే వాటి స్థానాన్ని వరి, పత్తి ఆక్రమించాయి. గతంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీరకాయ, బెండకాయ, వంకాయ, గోరుచిక్కుడు తదితర కాయగూరలను రైతులు విరివిగా సాగు చేసేవారు. వీటితో పాటు సంప్రదాయ పంటలైన సజ్జ, జొన్న, ఉలువలతో పాటు నూనెగింజల సాగు కూడా ఎక్కువగానే ఉండేది. అయితే రానురానూ ఆయా పంటల విస్తీర్ణం గణనీయంగా పడిపోతూ, వరి, పత్తి సాగు బాగా పెరుగుతోంది. ఒకింత విస్మయం కలిగించినా..ఇందుకు ప్రధాన కారణం.. కోతులు కావడం గమనార్హం. వానరాల బెడదతో రైతులు ఆయా పంటలు సాగు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఆహార కొరత కారణంగా అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలో తిష్ట వేస్తున్నాయి. పొలాలపై దాడులు చేస్తూ ఆహార పంటలను నాశనం చేస్తున్నాయి. అక్కడక్కడా రైతులపై దాడులు చేస్తున్న ఘటనలూ నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో కూరగాయలు, సజ్జ, జొన్న, మొక్కజొన్న వంటివి సాగు చేయాలంటేనే భయపడుతున్నారు. వేసిన పంటలు చేతికి రాక నష్టపోతున్న రైతులు కూరగాయల సాగు నుంచి క్రమంగా తప్పుకుంటున్నారు. ఇప్పుడు వరి ధాన్యాన్ని కూడా వానర గుంపులు ఆగమాగం చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వానరాల సమస్య ఎక్కువగా ఉంది. పంటంతా ఆగమాగం కోతుల గుంపులు కాయగూరలు, పండ్ల తోటలపై దాడులు చేస్తూ తిన్నంత తిని, మిగిలిన పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు ఎక్కువగా వరి, పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా 2014–15లో రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం 2.53 లక్షల ఎకరాలు ఉండగా, 2023–24 నాటికి అది సగానికి పైగా తగ్గి 1.12 లక్షల ఎకరాలకు పడిపోయింది. గత దశాబ్దంలో కూరగాయల సాగు వృద్ధిరేటు మైనస్ 8.4 శాతంగా నమోదు కావడం గమనార్హం. ఎన్ఐఎన్¯Œ, ఐసీఎంఆర్ సిఫారసుల మేరకు రాష్ట్రానికి సంవత్సరానికి 81.49 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమవుతాయని అంచనా వేయగా, ప్రస్తుతం ఉత్పత్తి కేవలం 11.17 లక్షల మెట్రిక్ టన్నులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే రాష్ట్ర అవసరాల్లో సుమారు 16 శాతం మాత్రమే సొంతంగా సమకూరుతున్నాయన్న మాట. ముఖ్యంగా టమాటా, ఉల్లిపాయ, బెండ, పచ్చిమిర్చి, వంకాయ సాగు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అన్ని రకాల కూరగాయలతో పాటు ఆలుగడ్డ, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, కొత్తిమీర వంటి పంటలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఒక జత.. పదేళ్లలో వంద! అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, సరిపడా ఆహారం దొరకకపోవడం వల్ల కోతుల గుంపులు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి, ఆపై ఊళ్లలో తిష్ట వేస్తున్నాయి. 25 ఏళ్ల వరకు జీవించే కోతులకు కాయగూరలు, పండ్లు, ఊళ్లలో ఆహార వ్యర్థాల రూపంలో మెరుగైన ఆహారం దొరుకుతుండటంతో పునరుత్పత్తి పెరగడంతో పాటు మరణాల రేటు తగ్గిపోయింది. సహజంగా ఒక వానరం మూడేళ్ల వయసు నుండి పునరుత్పత్తి ప్రారంభిస్తే.. ఒక జంట పిల్లలు, తిరిగి వాటి పిల్లలు, వాటి పిల్లలు ఇలా కలుపుతూ పోతే పదేళ్లలో 70 నుండి 100 కోతుల వరకు పెరిగే అవకాశం ఉందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో అత్యధికంగా బానెట్ మకాక్ (జటి) రకం కోతులు పంటపొలాలు, ఊళ్లపై దాడి చేస్తున్నాయి. ఈ రకం కోతులు కొత్త పరిసరాలకు సులభంగా అలవాటు పడుతున్నాయి. నిర్మల్ ప్రయోగం ఫెయిల్..! పంటలతో పాటు జనావాసాలకు నష్టం చేస్తున్న కోతుల నియంత్రణ కోసం హిమాచల్‌ప్రదేశ్‌లో చేసిన ప్రయోగాన్ని తెలంగాణలో అమలు చేసినా సరైన ఫలితం కనిపించలేదని నిపుణులు చెబుతున్నారు. హిమాచల్ తరహాలో నిర్మల్–గండిరామన్న హరితవనంలో 2020లో ‘మంకీ రిహాబిలిటేషన్ సెంటర్’ను ప్రారంభించి, రోజూ 10–15 కోతులకు వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ కోతులను పట్టుకోవడం, నిర్మల్‌కు తరలించడం పంచాయతీలకు ఆర్థిక భారంగా మారడంతో కుటుంబ నియంత్రణ కార్యక్రమం పెద్దగా సక్సెస్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగు పెరగాలంటే ఏం చేయాలి.. ⇒ కోతుల నివారణకు ప్రతి జిల్లా కేంద్రంలో నిర్మల్ తరహా కుటుంబ నియంత్రణ కేంద్రం ప్రారంభించాలి. కోతులను పట్టేందుకు పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. కూరగాయలు, పండ్ల తోటలు, ఇతర ఉద్యాన పంటలకు పూర్తి సబ్సిడీతో సోలార్ ఫెన్సింగ్ పంపిణీ చేయాలి. ⇒ క్లస్టర్ వారీగా ఏ ప్రాంతానికి ఏ కూరగాయలు అనుకూలమో గుర్తించి, వాటినే సాగు చేసేలా రైతులకు మార్గనిర్దేశం చేయాలి. పెట్టుబడి వ్యయం, కూలీల కొరత నివారణకు అవసరమైన యంత్ర సామగ్రిని అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు సబ్సిడీపై అందించాలి. ⇒ పంజాబ్ తరహాలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేసే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. హిమాచల్ తరహాలో 75 శాతం సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్, కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో మార్కెట్ యార్డుల్లో కూరగాయలకు ప్రత్యేక స్థల కేటాయింపులు చేయాలి. సమగ్ర కార్యాచరణ అవసరం రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఆందోళనకరం. రాష్ట్రాన్ని కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సమగ్ర కార్యాచరణ అవసరం. ముఖ్యంగా కోతుల నియంత్రణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. – డాక్టర్ రాజిరెడ్డి, వీసీ, హార్టికల్చర్ యూనివర్సిటీ కూరగాయల కనగర్తి.. ఇప్పుడొక చరిత్రే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కనగర్తి ఒకప్పుడు కూరగాయలకు ఎంతో ప్రసిద్ధి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘కూరగాయల కనగర్తి’గా పేరొందింది. ఇరవైకి పైగా తీగజాతి కూరగాయలు, ఊరందరికీ పనులు, రైతులకు జేబునిండా డబ్బులు, కడుపునిండా పౌష్టికాహారం.. ఇలా కళకళలాడిన గ్రామంలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు 50 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తే ఇప్పుడు కేవలం 10 మందే సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా అంతటికీ అన్ని రకాల కూరగాయలు అమ్మిన స్థితి నుండి ఇప్పుడు ఇదే ఊరిలో సిరిసిల్ల నుంచి వచ్చే కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. దీనంతటికీ కారణం.. కనగర్తి పంట పొలాలతో పాటు ఊరంతా వానరాలతో నిండిపోవడమే. కనగర్తి అంతా కోతుల గుంపులే కోతులతో ఊరంతా నిండిపోయింది. పంటలు, ఇళ్లు నాశనం అవుతున్నాయి. మా ఒక్క కనగర్తే కాదు.. అన్ని ఊళ్లలో ఇదే పరిస్థితి. అందుకే కోతుల నియంత్రణకు తక్షణ కార్యాచరణ ప్రారంభించాలి. మళ్లీ కూరగాయల సాగు పెరగాలంటే సోలార్ ఫెన్సింగ్‌తో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలి. – స్వామిదాస్, కనగర్తి సర్పంచ్
కొనసాగుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం. వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసుకొని టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తున్న కర్నూలు పోలీసులు. ఈనెల 14వ తేదీన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై విమర్శలు చేశారని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి టిజి భరత్. ఓ ఫార్మా కంపెనీ వద్ద మంత్రి భరత్ 45 కోట్ల రూపాయలు వసూలు చేశారని బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆరోపించారు. దాంతో తనపై, నారా లోకేష్ పై సిద్దార్థ రెడ్డి చేసిన ఆరోపణలకు స్పందించి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంత్రి టిజి భరత్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు.
డబ్బు కన్నా... పట్టుదల ముఖ్యం
బెంగళూరు: ఐపీఎల్‌తో తక్షణమే పేరు ప్రఖ్యాతలు వచ్చినా... సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ప్రస్తుతం కాలంలో ఐపీఎల్ వల్ల యువ ఆటగాళ్లకు భారీగా డబ్బు, పేరు వస్తోందని... అయితే అక్కడితో ఆగిపోకుండా మరింత కష్టపడితేనే ఆటలో గొప్ప స్థాయికి చేరగలరని కోహ్లి వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆర్సీబీ స్పోర్ట్స్ సమ్మిట్ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ... ‘అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్ల ఆటగాడిగా కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం. పట్టుదలను డబ్బుతో ముడిపెట్టలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఐపీఎల్ రూపంలో 20 బంతుల్లో 40–50 పరుగులు చేస్తే చాలు ఎనలేని పేరు, డబ్బు వస్తున్నాయి. అది సుఖవంతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ 10–15 ఏళ్లు ఏకబిగిన అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దానికి ఎంతో పట్టుదల ఉండాలి. అది టి20 క్రికెట్ ఆడినంత సులువు కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అభిమానుల ఆదరణ, ఆట నుంచి గౌరవం పొందగలం. అలా అని టి20 క్రికెట్‌ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఇటీవలి కాలంలో చూస్తే... గొప్ప గొప్ప పవర్ హిట్టర్లు పుట్టుకొస్తున్నారు. వారు బంతిని బాదుతున్న విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవలీలగా సిక్స్‌లు కొడుతున్నారు. ఐపీఎల్ ఆరంభంలో మాదిరిగా ప్రతిసారి భారీ స్కోర్ల పిచ్‌లు ఎదురుకావు. కొన్నిసార్లు కఠినమైన పిచ్‌పై రెండు, మూడు వికెట్లు కోల్పోయినప్పుడు 175–180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి జట్టును గెలిపించాల్సి వస్తుంది. అలాంటి స్థితిని తట్టుకున్న బ్యాటర్ దీర్ఘకాలం నిలబడగలుగుతాడు. పరిస్థితులు పరీక్షిస్తున్న సమయంలో అత్యుత్తమ ఆట తీరు కనబర్చడం ముఖ్యం. నా వరకైతే ఆటను ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని... పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగుతా. నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకోవాలి అంటే బలమైన పునాది అవసరం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక బంతిని ఎదుర్కొనే ముందు మీ దగ్గర ఎక్కువ మార్గాలు ఉండాలి. అప్పుడే కష్టమైన పిచ్‌పై కూడా పరుగులు రాబట్టగలం. అది కేవలం సాధన వల్లే సాధ్యమవుతుంది’ అని వివరించాడు.
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఎబోలా డేంజర్ బెల్స్.. 131 మరణాలు..
జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానుల సందడి
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
ప్రపంచకప్ బరిలో స్కాట్లాండ్ గోల్‌కీపర్ క్రెయిగ్ గోర్డాన్
‘గెస్ పేపర్'లో కెమిస్ట్రీ ప్రశ్నలన్నీ అవుట్.. సీబీఐకి చిక్కిన లిస్ట్!
అదే తన లక్ష్యం అంటున్న డ్యూడ్ హీరోయిన్
అమీర్‌పేట గర్ల్స్ హాస్టల్లో.. చొరబడ్డ వ్యక్తులు..!
డిజిటల్ భారత్‌లో మైక్రోసాఫ్ట్ మెగా ప్లాన్
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
దగ్గుపాటి రాజకీయం.. టీడీపీలో భారీ పొలిటికల్ ట్విస్ట్
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
ఎబోలా డేంజర్ బెల్స్.. 131 మరణాలు..
జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానుల సందడి
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
ప్రపంచకప్ బరిలో స్కాట్లాండ్ గోల్‌కీపర్ క్రెయిగ్ గోర్డాన్
‘గెస్ పేపర్'లో కెమిస్ట్రీ ప్రశ్నలన్నీ అవుట్.. సీబీఐకి చిక్కిన లిస్ట్!
అదే తన లక్ష్యం అంటున్న డ్యూడ్ హీరోయిన్
అమీర్‌పేట గర్ల్స్ హాస్టల్లో.. చొరబడ్డ వ్యక్తులు..!
డిజిటల్ భారత్‌లో మైక్రోసాఫ్ట్ మెగా ప్లాన్
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
దగ్గుపాటి రాజకీయం.. టీడీపీలో భారీ పొలిటికల్ ట్విస్ట్
ఫొటోలు
#HBDJrNTR : జూ.ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ HD స్టిల్స్
'రమణి కళ్యాణం' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా 'ఫస్ట్ టైమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'పెద్ది' కోసం జాన్వీ కపూర్ రెడీ అయిందిలా (ఫొటోలు)
రాశీ ఖన్నా గ్లామర్ ఫోటోషూట్
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
మంచు మనోజ్ కొత్త ట్రస్ట్ ప్రారంభం (ఫొటోలు)
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
పెట్రో బాదుడు: వైఎస్సార్సీపీ పోరుబాటకు విశేష స్పందన
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
సినిమా
నేను ఒంటరివాడిని కాను: సల్మాన్ ఖాన్
‘‘కోట్లాది మంది అభిమానులు, స్నేహితులు, ఇంత పెద్ద కుటుంబం నాకు ఉన్నప్పుడు నేనెలా ఒంటరివాడిని అవుతాను?’’ అంటున్నారు సల్మాన్ ఖాన్. ఓ షర్ట్‌లెస్ ఫొటోని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ‘‘ఒంటరిగా ఉండటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి అలోన్... రెండోది లోన్లీ. అలోన్‌గా ఉండటం మన నిర్ణయం. కానీ, ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడనప్పుడు వచ్చేది లోన్లీనెస్.దీని తర్వాత ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి’’ అంటూ సల్మాన్ ఖాన్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ‘మీరు (సల్మాన్) ఒంటరిగా ఉన్నానని ఎందుకు బాధపడుతున్నారు?’ అంటూ ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురై పోస్ట్‌లు పెట్టడంపై సల్మాన్ మరోసారి స్పందించారు. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి ఆ పోస్ట్ చేయలేదు. అయినా... ఇంత పెద్ద కుటుంబం, కోట్లాది మంది స్నేహితులు, అభిమానులు ఉన్నప్పుడు నేను ఒంటరివాడిని ఎలా అవుతాను.మీరంతా నాతో ఉంటున్నప్పటికీ నేను ఒంటరిగా ఉన్నాననుకుంటే కృతజ్ఞత లేనివాడిని అవుతాను. షూటింగ్స్ నుండి నా కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలనిపించింది. అంతే... దాన్ని అందరూ హైలైట్ చేసి హెడ్‌లైన్స్‌గా మార్చేశారు. ఆ వార్తలు చూసి మా అమ్మ నన్ను ‘ఏమైంది?’ అని కంగారుగా అడుగుతోంది. రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్... నాకేం కాలేదు’’ అని సల్మాన్ స్పష్టం చేశారు.
'పెద్ది'.. సమస్యలన్నీ క్లియర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నిరోజుల నుంచి పర్సంటేజీ వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్నట్లే తమకు కూడా షేరింగ్ ఇవ్వాలని సింగిల్ స్క్రీన్స్ నిర్వహిస్తున్న ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే ఇరువురి మధ్య మీటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ కమిటీ కూడా వేసింది. అయితే 'పెద్ది'కి కూడా పర్సంటేజీ ఇవ్వనున్నారని తెలిసింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మీటింగే దీనికి కారణం. ఇప్పుడు ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్వయంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.ఆంధ్రాలో 'పెద్ది' టికెట్ ధరల పెంచితే అందులో 7.5 శాతం సదరు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియర్ షోల కోసమైతే ఏ సెంటర్లో ప్రతి షోకు రూ.25 వేలు, బి సెంటర్లో ప్రతి షోకు రూ.15 వేలు, సి సెంటర్లో ప్రతి షోకు రూ.10 వేలు చొప్పున నిర్మాత చెల్లించాలి.తెలంగాణలో టికెట్ ధరలు పెంచితే పై నిబంధనలు వర్తిస్తాయి. టికెట్ ధర పెంపు లేకపోతే వారు ఎప్పటిలానే డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానాన్ని అమలు చేసేందుకు అంగీకరించారని కూడా తెలిపింది.జూన్ 4న పెద్ది సినిమా థియేటర్లలోకి రానుంది. సోమవారం ట్రైలర్ రిలీజ్ చేయగా కొందరికి నచ్చితే మరికొందరికి ల్యాగ్ అనిపించింది. ఇందులో రామ్ చరమ్.. క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా కనిపిస్తాడు. అంటే క్రికెట్, కుస్తీ, రన్నింగ్ చేస్తాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు.
ముద్దుగున్న మృణాల్.. ఐస్‌క్రీమ్‌తో 'ధురంధర్' సారా
దేశీ లుక్‌లో ముద్దేచ్చేలా మృణాల్ ఠాకుర్పలుచని చీరలో 'పెద్ది' కోసం జాన్వీ కపూర్ఐస్ క్రీమ్‌తో పోజులిచ్చిన సారా అర్జున్ఎర్రచీరలో భయపెట్టేస్తున్న శ్రుతి హాసన్బుక్ చదువుతూ అందంగా మీనాక్షి చౌదరిగులాబీ చీరలో అను ఇమ్మాన్యుయేల్ View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjunn) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారమైతే లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి'తో పాటు జ్యోతిక 'సిస్టమ్', మధువిధు, మేం కాప్‌లం లాంటి డబ్బింగ్ మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అలానే డ్రీమ్ క్యాచర్, భీంసేరి లాంటి చోటా చిత్రాలు అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడీ లిస్టులోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేరింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్మెంట్)అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత తదితరులు ప్రధాన పాత్రలు చేసిన తెలుగు సినిమా 'పైసా వాలా'. కె.నవీన్ తేజస్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. రూ.10 హవాలా నోటు చుట్టూ తిరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. కానీ స్టార్స్ లేకపోవడంతో దీన్ని జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.'పైసా వాలా' విషయానికొస్తే.. హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత అతడి ఫోన్, పర్స్ మిస్ అవుతుంది. అందులోనే హవాలా నోటు ఉంటుంది. పసుపు అంటిన సదరు పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బెరిదింపులు, హత్యలు కూడా జరుగుతాయి. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)
క్రీడలు
కొత్త కుర్రాళ్లకు పిలుపు
గువాహటి: సొంతగడ్డపై వచ్చే నెలలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుతో పాటు వన్డే సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత జట్లను ప్రకటించింది. దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న నలుగురు కుర్రాళ్లకు జాతీయ జట్టులో తొలిసారి అవకాశం దక్కగా... ఐపీఎల్లో ఆకట్టుకోలేకపోతున్న రిషభ్ పంత్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. అలాగే ఇప్పటి వరకు టెస్టు జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడు ఇప్పుడిక కేవలం ప్లేయర్‌గానే కొనసాగనున్నాడు. పంత్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు బదలాయించారు. టెస్టు, వన్డే జట్లకు శుబ్‌మన్ గిల్ నాయకత్వం వహించనుండగా... సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. రవీంద్ర జడేజా కూడా రెస్ట్ ఇవ్వగా... అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయలేదు. రోహిత్‌తో పాటు హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్‌కు ముందు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. జూన్ 6 నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య న్యూ చండీగఢ్‌లో ఏకైక టెస్టు జరగనుంది. ఆ తర్వాత జూన్ 14న ధర్మశాలలో తొలి వన్డే, 17న లక్నోలో రెండో వన్డే, 20న చెన్నైలో మూడో వన్డే జరగనున్నాయి. ‘అఫ్గాన్‌తో సిరీస్‌ల అనంతరం ఇంగ్లండ్ పర్యటన వరకు బుమ్రా జట్టుతో చేరుతాడు’ అని అగార్కర్ పేర్కొన్నాడు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు, వన్డే జట్లలో చోటు నిలబెట్టుకున్నాడు. భారత టెస్టు జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే , ధ్రువ్ జురేల్. భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే , కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్. ప్రిన్స్ యాదవ్: తాజా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ జట్టు పేసర్ ప్రిన్స్ యాదవ్ మాత్రం తన వేగం, కచ్చితత్వంతో సెలెక్టర్ల మెప్పు పొందాడు. గతేడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 24 ఏళ్ల ప్రిన్స్... ఈ సీజన్లో నిలకడ కనబర్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఢిల్లీ బౌలర్‌కు పెద్దగా అనుభవం లేకపోయినా... లిస్ట్ ‘ఎ’, ఐపీఎల్ ప్రదర్శనతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. యార్కర్లు వేయడంలో దిట్ట అయిన ప్రిన్స్ వన్డే సిరీస్‌లో రాణిస్తే... ఈ ఏడాది చివర్లో జరిగే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అతడి పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు. మానవ్ సుతార్: రాజస్తాన్‌కు చెందిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. చాన్నాళ్లుగా దేశవాళీల్లో నిలకడ కనబరుస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 29 మ్యాచ్‌ల్లో 129 వికెట్లు పడగొట్టిన ఈ ఎడంచేతి వాటం స్పిన్నర్... బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేయగలడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సుతార్‌ను ఏకైక టెస్టు కోసం ఎంపిక చేశారు. జడేజా, అక్షర్ జట్టులో లేకపోవడంతో సుతార్‌కు అవకాశం దక్కింది. కుల్దీప్, సుందర్‌లు తుది జట్టులో ఉండటం ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా టీమ్‌లో చోటు కోసం హర్ష్ దూబే తో సుతార్ పోటీపడనున్నాడు. గుర్నూర్ బ్రార్: చాన్నాళ్లుగా భారత జట్టులో నెట్ బౌలర్‌గా కొనసాగుతున్న 25 ఏళ్ల గుర్నూర్ బ్రార్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌కు బ్రార్‌పై అపార నమ్మకం ఉండగా... అతడికి పంజాబ్‌కే చెందిన భారత సారథి గిల్ మద్దతు దండిగా ఉంది. ఐపీఎల్‌లోనూ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న అతడు రెండేళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అదనపు బౌన్స్ రాబట్టడంలో మంచి నైపుణ్యం ఉన్న ఆరున్నర అడుగుల గుర్నూర్ దక్షిణాఫ్రికా వంటి పేస్ పిచ్‌లపై ప్రభావం చూపగలడని సెలెక్షన్ కమిటీ నమ్ముతోంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 18 మ్యాచ్‌లు ఆడిన బ్రార్ 27.30 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు. హర్ష్ దూబే : సుదీర్ఘ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న 23 ఏళ్ల హర్ష్ దూబే కు మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 2024–25 రంజీ సీజన్లో రికార్డు స్థాయిలో 69 వికెట్లు పడగొట్టడంతో పాటు 476 పరుగులు చేసిన దూబే... తాజా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23.26 సగటుతో 133 వికెట్లు తీసిన హర్ష్... 1026 పరుగులు సైతం చేశాడు. అతడి ఖాతాలో 9 అర్ధశతకాలు ఉన్నాయి.
మెయిన్ 'డ్రా'కు సాత్విక్ - రాధిక జోడీ
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కణపురం సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ (భారత్) ద్వయం మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జాతీయ చాంపియన్స్ సాత్విక్ రెడ్డి (తెలంగాణ)–రాధిక శర్మ (పంజాబ్) జోడీ 21–15, 21–17తో దాతు అనీఫ్ ఇసాక్–క్లారిస్సా సాన్ (మలేసియా) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో అలెగ్జాండర్ డున్–జూలీ మెక్‌పర్సన్ (స్కాట్లాండ్) జంటతో సాత్విక్–రాధిక ద్వయం తలపడుతుంది. మరోవైపు మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అష్మిత చాలిహా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించగా... ఆకర్షి కశ్యప్ క్వాలిఫయింగ్‌లో నిష్క్రమించింది. అష్మిత 21–23, 21–16, 21–16తో పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై గెలిచింది. ఆకర్షి 21–15, 20–22, 7–21తో పార్క్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో హరిహరన్–ఎంఆర్ అర్జున్ 21–19, 21–15తో ఏడో సీడ్ క్రిస్టో పొపోవ్–టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)లపై గెలిచారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో శిఖా గౌతమ్–అశ్విని భట్ (భారత్) జంట 15–21, 21–17, 17–21తో జాకీ డెంట్–క్రిస్టల్ లాయ్ (కెనడా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.
‘ఏఐటీఏలోకి అడుగు పెడతా’
ముంబై: భారత మాజీ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఇప్పుడు పరిపాలనా వ్యవహారాల వైపు పూర్తి స్థాయిలో రావాలని ఆశిస్తున్నాడు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఎన్నికల్లో పాల్గొని జాతీయ స్థాయిలో అన్ని రకాలుగా భాగం కావాలని అతను భావిస్తున్నాడు. ఏఐటీఏలో చేరితే టెన్నిస్‌లో పలు కీలక మార్పులు తీసుకొచ్చేందుకు తాను సిద్ధమని బోపన్న ప్రకటించాడు. 2024లో జరిగిన ఎన్నికల ఫలితాలపై చెలరేగిన వివాదం కోర్టు జోక్యంతో ఇటీవలే సమసిపోగా... త్వరలోనే మళ్లీ పూర్తి స్థాయిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బోపన్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బోపన్న ఇప్పటికే కర్ణాటక టెన్నిస్ సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ‘ఏఐటీఏలో ఎన్నికల సమయం వచ్చింది. నాకూ ఏదైనా అవకాశం దొరికితే ఈ పరిపాలనలో భాగం కావాలని కోరుకుంటున్నా. భారత టెన్నిస్‌ను అభివృద్ధి చేసే దిశగా కీలక మార్పులు చేయగలననే విశ్వాసం నాకుంది. అలాంటి అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఏదో ఒక పదవి తీసుకోవడం నా ఉద్దేశం కాదు. నా వంతుగా ఏదైనా చేయగలనని నమ్మితే కచ్చితంగా వస్తా’ అని బోపన్న చెప్పాడు. మరోవైపు భారత టెన్నిస్‌లో డబుల్స్ ఆటగాళ్లను తీర్చిదిద్దే క్రమంలో తన సొంత అకాడమీలో సాగుతున్న ‘డబుల్స్ డ్రీమ్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంపై కూడా బోపన్న మాట్లాడాడు. ఇటీవలి కాలంలో డబుల్స్‌కు కూడా ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో తాను దానిపై దృష్టి పెట్టానని, పైగా స్పాన్సర్ల సహకారం కూడా లభించిందని అతను వెల్లడించాడు. ‘మా అకాడమీలో డబుల్స్ ఆటగాళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. దీనికి స్పాన్సర్లు కూడా లభించడం సానుకూలాంశం. సింగిల్స్‌తో పోలిస్తే ఇటీవల డబుల్స్‌కు మంచి ప్రాధాన్యత పెరిగింది. అందుకే దీనికి డబుల్స్ డ్రీమ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టాం. మా అకాడమీలో మొత్తం 175 మంది ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఇప్పటికే దక్షిణేశ్వర్ సురేశ్, వైష్ణవి అడ్కర్, దేవ్ జావియా, ప్రార్థన తోంబరే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అసోం, జమ్మూకు చెందిన కొందరు ప్రతిభ గల పేద కుర్రాళ్లకు గుర్తించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. భవిష్యత్తులో అత్యుత్తమ ఆటగాళ్లు రావాలనేదే నా లక్ష్యం’ అని గతంలో డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన రోహన్ బోపన్న వివరించాడు.
82 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టాతో...
లాస్ ఏంజెలిస్: మహిళల టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు... సుదీర్ఘ కెరీర్లో 12 సింగిల్స్ ట్రోఫీలు సహా ఏకంగా 39 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఘనత... ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు... ఆమె పేరుతోనే మహిళల టెన్నిస్‌లో టీమ్ ఈవెంట్ నిర్వహణ... ఇవన్నీ బిల్లీ జీన్ కింగ్ సొంతం. అయితే ఇంత అసాధారణ కెరీర్ తర్వాత కూడా జీన్ కింగ్ మదిలో ఒక తీరని కోరిక మిగిలిపోయింది. ఆటలో పడి తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయలేకపోయానని అనిపించేది. రెండేళ్ల క్రితమే చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పుడు దానిని సాధించి చూపించింది. 82 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పట్టాతో సగర్వంగా నిలిచింది. లాస్ ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో జీన్ కింగ్ 1961లో అడ్మిషన్ తీసుకుంది. అదే ఏడాది వింబుల్డన్‌లో డబుల్స్ టైటిల్ సాధించడంతో జీన్ కింగ్ చదువుకు దూరమైంది. ఆమె విజయప్రస్థానంలో ఇది మొదటి ట్రోఫీ కాగా... దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె ఆటను శాసించింది. అడ్మిషన్ తీసుకున్న 65 ఏళ్ల తర్వాత ఆమె చేతుల్లోకి డిగ్రీ రావడం విశేషం. ‘దీని విలువ ఎంతో నేను మాటల్లో చెప్పలేను. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఏదైనా సాధించాలని అనుకుంటే, మీపై మీకు నమ్మకం ఉంటే వయసులో సంబంధం లేదు. దేనికైనా ఆలస్యం అనేదే ఉండదు’ అని బిల్లీ జీన్ కింగ్ వ్యాఖ్యానించింది. 2026లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న మరో 6 వేల మందితో కలిసి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కరతాళ ధ్వనుల మధ్య ఆమె తన డిగ్రీ పట్టాను అందుకుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
బిజినెస్
రూపాయి మరో కొత్త కనిష్టం..
ముంబై: భగ్గుమంటున్న క్రూడాయిల్ రేట్లు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, డాలరు బలపడుతుండటం లాంటి ప్రతికూల పరిణామాలతో రూపాయి మారకం విలువ వేగంగా కరిగిపోతోంది. మంగళవారం డాలరుతో పోలిస్తే మరో 50 పైసలు క్షీణించి సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టం 96.70కి పతనమైంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 96.20తో పోలిస్తే మరింత తక్కువగా 96.38 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ .. ఇంట్రాడేలో 96.27కి పెరిగింది. కానీ అది నిలబెట్టుకోలేక చివరికి 50 పైసలు క్షీణతతో ముగిసింది. దీనితో గత ఎనిమిది సెషన్లలో 2.64 శాతం (రూ. 2.48) మేర పతనమైనట్లయింది. తద్వారా ఆసియాలోనే అత్యధికంగా పతనమైన కరెన్సీగా నిల్చింది. డాలరు బలపడటం, అమెరికా ట్రెజరీ ఈల్డ్‌లు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంలాంటి అంశాలు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. అయితే, పసిడి, వెండిపై దిగుమతులపై ఆంక్షలు, ఆర్బీఐ జోక్యంతో కనిష్ట స్థాయిల్లో రూపాయికి కొంత మద్దతు లభించవచ్చని పేర్కొన్నారు. స్పాట్ మార్కెట్లో 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు.
వడ్డింపే తరువాయి!
సాక్షి, బిజినెస్ డెస్క్: అసలే నిత్యావసరాల ధరల మంట.. ఆపై పెట్రో పోటుతో అల్లాడుతున్న ప్రజలకు మరో గండం పొంచి ఉన్నట్టే కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం... ఆఖరికి బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారినీ వదిలేట్లు లేదు. కొండెక్కిన క్రూడాయిల్ సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకుతుండటం... రూపాయి అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో త్వరలోనే రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వడ్డీ రేట్లు పెంచొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇదే జరిగితే గృహ, వాహన, పర్సనల్, కార్పొరేట్ లోన్లు భారమవుతాయి. దీంతో నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) ఎగబాకుతాయి. మరోపక్క, వడ్డీ రేట్ల పెంపుతో వినియోగం తగ్గి.. ఎకానమీ వృద్ధి మరింత మందగించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు! మోదీ పొదుపు వార్నింగ్ తర్వాత అటు బంగారం, వెండిపై సుంకాల మోత, దిగుమతి ఆంక్షలు... పెట్రో వాతతో షాకిచ్చిన సర్కారుకు ఇక ఆర్బీఐ కూడా జతయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 5న తీసుకోబోయే సెంట్రల్ బ్యాంక్ పాలసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ముడిచమురు బ్యారెల్ 100 డాలర్ల పైకి దూసుకెళ్లి, గత రెండున్నర నెలలుగా దాదాపు అదే స్థాయిలో కదలాడుతోంది. మన బంగారం, క్రూడ్ అవసరాల్లో 85 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో దిగుమతుల బిల్లు భారమై రూపాయి మరింత బక్కచిక్కింది. ప్రస్తుతం సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టం 96.60కి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనంతో డాలర్లు ఎగిరిపోతున్నాయి. ఈ విపత్కర పరిణామాలతో మన ఫారెక్స్ నిల్వలు కరిగిపోతున్నాయి. మరోపక్క, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో (వారంలోపే దాదాపు రూ.4 చొప్పున రెండు సార్లు) ద్రవ్యోల్బణం ఎగబాకుతోంది. దీంతో ఆర్బీఐ మళ్లీ వడ్డీరేట్లు పెంచవచ్చని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత బాండ్ మార్కెట్ ట్రెండ్.. రేట్ల పెంపు సిగ్నల్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. బాండ్ రాబడులు (ఈల్డ్స్) గత రెండు నెలల్లో ఎగబాకడం (10 ఏళ్ల ప్రామాణిక ట్రెజరీ బాండ్ ఈల్డ్ 6.25 శాతం నుంచి 7.06 శాతానికి జంప్ చేసింది) చూస్తుంటే.. చమురు ధరల సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకి, రూపాయి మరింత బలహీన పడుతుందన్న ఆందోళనలకు అద్దంపడుతోందని విశ్లేషిస్తున్నారు. గతేడాది 1.25 శాతం తగ్గింపు... ధరలు అదుపులో ఉండటంతో... జీడీపీ వృద్ధికి ఊతమిచ్చేందుకు 2025 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్బీఐ నాలుగు విడతల్లో రెపో రేటును 1.25 శాతం తగ్గించింది. దీంతో ఈ కీలక పాలసీ రేటు 6.5 శాతం గరిష్ట స్థాయి నుంచి 5.25 శాతానికి చేరింది. బ్యాంకులు కూడా దీన్ని రుణగ్రహీతలకు బదలాయించడంతో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు దిగొచ్చాయి. కానీ పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్ రేట్లు భగ్గుమనడం, రూపాయి భారీ పతనం, ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలతో ఆర్బీఐ అప్పటి నుంచీ పాలసీ రేట్లను యథాథంగానే కొనసాగిస్తోంది. అవసరమైతే రేట్లను తగ్గించేలా తటస్థ (న్యూట్రల్) విధానాన్ని కూడా మార్చలేదు. తీరా చూస్తే, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. కాగా, చివరిసారిగా ఆర్బీఐ రెపో రేటును 2023 ఫిబ్రవరిలో పావు శాతం పెంచింది. ఈ ఏడాది పెంపు.. రెండు విడతలు రూపాయి పతనం, ధరల పెరుగుదలకు అడ్డకట్ట పడాలంటే తదుపరి పాలసీ భేటీలో వడ్డీ రేట్ల పెంపు ‘దాదాపు అనివార్యం’గా కనిపిస్తోందని బ్రోకరేజి దిగ్గజం ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తాజా నివేదికలో పేర్కొంది. ఒకవేళ క్రూడ్ రేటు 100 డాలర్ల పైనే కొనసాగితే (ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 110 డాలర్ల వద్ద ట్రేడవుతోంది) పాలసీ భేటీతో సంబంధం లేకుండా సడన్‌గా వడ్డీ రేట్ల షాక్‌కు కూడా అవకాశం ఉందంటోంది. అయితే, ప్రస్తుతానికి ఆర్బీఐ అప్రమత్త ధోరణితోనే వ్యవహరించవచ్చని, రానున్న పాలసీలో సమీక్షలో తక్షణం వడ్డీ రేట్ల పెంపు వంటి కఠిన చర్యలకు దిగే అవకాశం లేదని చాయిస్ వెల్త్ సీఈవో నికుంజ్ సరాఫ్ అభిప్రాయపడ్డారు. రానున్న రెండు మూడు నెలల్లో ద్రవ్యోల్బణం గణాంకాలు, స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు. ఇందన సెగకు తోడు ఎల్‌నినో (వర్షాభావం) రిసు్కల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత ఎగబాకడంతో పాటు ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉందని హెచ్ఎస్బీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను మరీ తీవ్రంగా పెంచకపోవచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్ధంలో రెండు విడతల్లో అర శాతం రెపో రేటు పెంపునకు ఆస్కారం ఉందని పేర్కొంది. ధరాఘాతం.. ఎల్‌నినో ఆజ్యం! వాణిజ్య గ్యాస్ రేట్ల భారీ పెరుగుదలతో ఇప్పటికే ఆహార ధరలకు రెక్కలొచ్చాయి. మరోపక్క, అధిక క్రూడ్ ధరల కారణంగా ముడి వస్తువులు భారంగా మారడంతో ఎఫ్ఎంసీజీ, వాహన, వినియోగ వస్తువులు, ఎల్రక్టానిక్స్ సహా పలు కంపెనీలు రేట్ల పెంపునకు తెరతీశాయి. ఇక తాజాగా పెట్రో పోటు.. ఇంధన ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోస్తోంది. అన్ని రంగాల్లో రవాణా, ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో నిత్యావసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా, టోకు ధరల ద్రవ్యోల్బణం భగ్గుమంది. మార్చిలో 3.88 శాతం నుంచి ఏప్రిల్‌లో ఏకంగా 48 నెలల గరిష్ట స్థాయికి (8.3 శాతం) దూసుకెళ్లింది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే, రాబోయే వారాల్లో విడతల వారీగా మరో రూ.10 పెంపు తప్పకపోవచ్చని అంచనా వేసింది. దీనివల్ల జూన్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.4 శాతానికి ఎగబాకే రిస్కు ఉందని తెలిపింది. ఇదే జరిగితే ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం (2% అటుఇటుగా) పరిమితిని దాటేసే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే, పులిమీద పుట్రలా ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో ఆందోళనలు వణికిస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వర్షాలు గనుక సరిగ్గా కురవకపోతే ఆహార ధరలు మరింత భగ్గుమంటాయని హెచ్ఎస్బీసీ హెచ్చరించింది. గృహ రుణంపై ఈఎంఐ ఎంత పెరుగుతుందంటే... గడిచిన ఏడాది కాలంలో గృహ రుణాలపై వడ్డీ రేటు 9.5% గరిష్ట స్థాయి నుంచి 7.5% వరకు దిగొచ్చింది. ఆర్బీఐ గనుక త్వరలో పావు శాతం రెపో రేటును పెంచి, దీన్ని బ్యాంకులు నేరుగా కస్టమర్లకు వర్తింపజేస్తే... హోమ్‌లోన్ వడ్డీ రేటు కూడా ఎగబాకుతుంది. వడ్డీ రేట్ల పెంపునకు ముందు ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి 7.75% వడ్డీ రేటుతో రూ.50 లక్షల రుణం తీసుకుంటే, ఈఎంఐ రూ. 41,047 పడుతుంది. పావు శాతం వడ్డీ రేట్ల పెంపు తర్వాత ఇది రూ.41,822కు పెరుగుతుంది. అంటే, ఒక్కో ఈఎంఐపై రూ.775 అదనంగా చెల్లించాల్సి వస్తుందన్న మాట! ఒకవేళ ఈఎంఐ పెరగకుండా అలాగే కొనసాగిస్తే, రుణ వ్యవధి మరో 8–10 నెలలు పెరుగుతుంది. ఆమేరకు అధిక వడ్డీ కట్టాల్సి ఉంటుంది.
నేను అడ్వైజర్ కాదు.. పెట్టుబడులు మీ ఇష్టం
పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు.. ఆర్థికపరమైన సమాచారం వెల్లడించే రాబర్ట్ కియోసాకి తొలిసారి ఘాటుగా స్పదించారు. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదని, ఇతరులకు పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం లేదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను ఆర్ధిక సలహాదారుని కారు.. అయితే నా పేరును ఉపయోగించి, కొందరు వ్యక్తులు.. నేను చెప్పినట్లు పెట్టుబడులకు సంబంధించిన విషయాలను చెబుతున్నారు. వారికి నా లాయర్ ద్వారా నోటీసులు పంపించాను. నా పేరు వాడి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని హెచ్చరించాను.I AM NOT A FINANCIAl ADVISORMy attorney has sent a “Cease and Decist” notice to someone or group who is using my name to state investments I recommend.Please be aware I will always share with you what I am investing in and why.I do not recommend anyone invest in what I am…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 19, 2026నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో మాత్రమే చెబుతాను. నేను ఎవరిని ఇక్కడే పెట్టుబడులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదని కియోసాకి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఏథీరియం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాను అని చెప్పారు. నాకు 401(k), లేదా IRA వంటి రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాలు లేవని.. స్టాక్స్ లేదా బాండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టడం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహానేను ఏం చేస్తున్నానో చెబుతాను. కానీ ఇతరులు వాటిని తప్పకుండా అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తన ఆర్థిక నిర్ణయాలను తన ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో తీసుకోవడం మంచిది. కియోసాకి మాటలను బట్టి చూస్తే.. ఎవరుపడితే వారు చెప్పినమాటలు విని పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Vodafone Idea: రూ.లక్ష కోట్లు సమీకరణపై ఆశలు
వచ్చే మూడేళ్లలో అవసరమయ్యే రూ. 1 లక్ష కోట్లను సమకూర్చుకునేందుకు కొత్త రుణాలు, ట్యాక్స్ రిఫండ్లు, ప్రమోటర్ల నుంచి మరిన్ని పెట్టుబడులపై టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) భారీగా ఆశలు పెట్టుకుంది. మార్కెట్లో నిలబడే దిశగా నెట్వర్క్ని మెరుగుపర్చుకునేందుకు కంపెనీ దాదాపు రూ. 45,000 కోట్లు వెచ్చించనుంది. అలాగే, వచ్చే మూడేళ్లలో స్పెక్ట్రం చార్జీల కింద సంస్థ రూ. 49,000 కోట్లు, రుణభారానికి సంబంధించిన వడ్డీల కోసం మరో రూ. 5,000-6,000 కోట్లు చెల్లించాల్సి రానుంది.అయితే.. మరింత రుణాన్ని ఈక్విటీ కింద మార్చాల్సిన అవసరం లేకుండానే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తేజస్ మెహతా తెలిపారు. తాము రూ. 25,000 కోట్ల నిధులతో పాటు మూడేళ్ల వ్యవధిలో రూ. 60,000 కోట్ల వరకు ఎబిటాను సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఇక ట్యాక్స్ రిఫండ్ కింద మరో రూ. 10,000 కోట్లు రావాల్సి ఉంటుందని వివరించారు.కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలు..పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా మరిన్ని ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలను ఆవిష్కరించినట్లు వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా తెలిపారు. ఇవి 7 రోజులు, 14 రోజులు, 21 రోజుల కాలవ్యవధితో లభిస్తాయని వివరించారు. దీనితో మొత్తం 1 రోజు నుంచి 30 రోజుల వరకు వేలిడిటీతో 17 రకాల ప్యాక్‌లను అందిస్తున్నట్లవుతుందన్నారు.
ఫ్యామిలీ
ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎన్ని ఇక్కట్లు వచ్చాయో తెలిసిందే. గ్యాస్ నుంచి పెట్రోల్ వరకు దాని అన్నిట్లపై దాని ప్రభావం ఏం రేంజ్లో ఉందో తెలసిందే హార్బూజ్ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. భారత్ పట్ల సముచితంగా ఇరాన్ ఉన్నా..మనకు ఈ ఇబ్బందులు మాతరం ఇప్పట్లో తగ్గేలే లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇరాన్లో మన భారతీయవ దేవాలయంకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పైగా విష్ణు మంత్రాలు సైతం పర్షియన్ భాషలోనే ఉండటం విశేషం. మరి ఆ ఆలయ విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ రాజధాని అయిన బందర్ అబ్బాస్‌లో ఉన్న విష్ణు దేవాలయం ఉన్న వీడియోని నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఏంటా ఆలయం అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ వీడియో క్యాప్షన్‌లో రాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఉన్న పురాతన హిందూ విష్ణు దేవాలయం. 1892లో, ఖజార్ యుగంలో నిర్మించబడింది. ఈ నగరంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన హిందూ వ్యాపారుల కోసం దీనిని నిర్మించారు, ఆ గుడిలోని పాట సైతం పర్షియన్ భాషలోనే ఉంది అని పేర్కొన్నారు. 83 ఏళ్ల నటుడు అమితాబ్ షేర్ చేసిన వీడియో కారణంగా అందరిలో ఒక్కసారిగా ఆ ఆలయ విశేషాలు గురించి తెలుసుకునే ఆసక్తిని రేకెత్తించింది. ఆలయ చరిత్రచారిత్రక కథనాలు, యూట్యూబ్‌లోని వివిధ ట్రావెల్ వ్లాగ్‌ల ప్రకారం..ఈ ఆలయం 1892లో మహమ్మద్ హసన్ సాద్-ఓల్-మాలిక్ పాలనలో హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో నిర్మించారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్, భౌగోళికంగా ఇది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం, అదీగాక ముఖ్యమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి వెంబడి ఉంది. ఇది విష్ణుమూర్తి ఆలయం. ఒకప్పుడు, భారతీయులకు, ఇరాన్‌లకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతికగా ఈ దేవాలయం నిలుస్తోంది. ఇది ఇండో-ఇరానియన్ వాస్తుశైలికి నిలువెత్తు నిదర్శనం. అలాగే చరిత్రకారుల ప్రకారం..కవి,రచయిత మహమ్మద్ అలీ సదీద్ అల్-సల్తానే తన ఒక రచనలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయులకు 1888లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత హిందూ కమ్యూనిటీలకు ప్రత్యేకంగా ఒక దేవాలయం ఏర్పడింది. అప్పట్లో ఇరు వర్గాలు ఎంత శాంతియుతంగా జీవించాయనేందుకు నిదర్శనం ఈ కట్టడం. స్థానికులు హిందువులను 'గూర్' లేదా 'గాబర్' అని పిలిచేవారు కాబట్టి, ఈ ఆలయాన్ని స్థానికులు 'గూరన్' అని పిలుస్తారు. భారత్‌లో ఉండే ఆలయాల మాదిరిగా సాంప్రదాయ వాస్తుశిల్పం ఈ ఆలయానికి లేదు. మధ్యలో ఉన్న చతురస్రాకార గది ఉల్లిపాయ ఆకారంలో ఉన్న గోపురంతో కప్పబడి ఉంటుంది, దానిపై తామర పువ్వుల చెక్కి ఉన్నాయి. ఈ గుడిలోనే పూజారులు, సన్యాసుల కోసం గదులు కూడా నిర్మించారు. 1979 ఇస్లామిక విప్లవం కారణంగా ఈ గుడిలోని చాలా విగ్రహాలు, చిత్రాలు ధ్వసం అయ్యాయి. పైగా అధిక సంఖ్యల్లో భారతీయులు ఇరాన్‌ను విడిచిపెట్టారు. ఈ ఆలయంలో బుద్ధుడు, విష్ణుమూర్తి విగ్రహాలు, శ్రీకృష్ణుని చిత్రాలను చూడవచ్చు. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ కూర్చుని ఉన్న ఒక చిత్రం ఉంది. పునరుద్ధరణ అవసరమైన హిందూ దేవతల పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ఒక గది మ్యూజియంగా మారింది. అక్కడి పెట్టెలలో ఒకదానిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజు శివుని పురాతన విగ్రహం ఉంది. కాగా ఇరాన్లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు, ఇరాన్‌లోని సిస్తాన్ , బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్‌లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.ఆ ఆలయంలో పాటలు..ఏయ్ విష్ణు జాన్ (ఓ ప్రియమైన విష్ణు)ఏయ్ రామ జాన్ (ఓ ప్రియమైన రామా)ఏయ్ కృష్ణ జాన్ (ఓ ప్రియమైన కృష్ణా)దర్ ఖల్బ్-ఎ మా బేమన్ (మా హృదయాలలో ఉండిపో)హమీషే బేమన్-2 (శాశ్వతంగా ఉండిపో)నూర్-ఎ తో బేతాబాద్ (నీ కాంతి ప్రకాశించుగాక)ఇష్క్-ఎ తో బేతాబాద్ (నీ ప్రేమ ప్రకాశించుగాక) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)
పాటలు పాడటం ఇంత మంచిదా..? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు
సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని మన పెద్దలు చెబతుండటం విన్నాం. అంతెందుకు శ్రావ్యమైన సంగీతం వింటుంటే శారీరకంగా, మానసికంగా బాగుంటాం అని నిపుణులు సైతం అంటున్నమాటే. తాజాగా వినడమే కాదు పాటలు పాడితే మన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందట. పైగా గట్ హెల్త్ బాగుంటుందని సాక్షాత్తు హార్వర్డ్ నిపుణులే చెబుతున్నారు. అదేవిధంగానో ఆ నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా.!.పాడటం అనేది కళాత్మక ప్రక్రియ. మరి దీనికి జీర్ణక్రియకు సంబంధం ఎలా అంటే.. పాటలు పాడినప్పుడు మనసు, పేగులు, నాడీ వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఒక బృందంగా పాడుతున్నప్పుడు శరీరంలో ఇమ్యూనోగ్లోబిన్ (ఏ), కార్డిసాల్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో గమనించారు. పాడటం అనేది మానవ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జీర్ణ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. ఒత్తిడి, ఆందోళనతో చాలామంది బాధపడుతుంటారు. కానీ కొందరు దీన్ని అధిగమించిగలుగుతారు అందుకు ఇదే కారణమని అంటున్నారు.పాడినప్పుడు ఏం జరుగుతుందంటే..శరీరంపై సానుకూల ప్రభావం మెదడు నుంచి మొదలై వేగస్ నాడి ప్రేరణ ద్వారా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకోసం బీథోవెన్ సంగీతాన్ని ఆలపిస్తున్న బృందంపై పరిశోధనలు చేయగా, వారందిరలోనూ పాడటం కారణంగా లాలాజలంలో ఒక కీలకమైన రోగనిరోధక యాంటీబాడీ నాటకీయంగా పెరగడం గుర్తించామని తెలిపారు. ఆ యాంటీబాడీ.. జీర్ణవ్యవస్థ లోపలి పొర, గొంతు, శ్వాస మార్గాలలో మన శరీరానికి మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఫలితంగా వ్యాధికారకాలు మనపై పట్టు సాధించే అవకాశం రాకమునుపే ఈ యాంటీబాడీ అడ్డుగోడగా మారుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే గానానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉందని చెబుతున్నారు. మెదడుకు, పేగుకి మధ్య ఉన్న ప్రధాన సమాచార ప్రసార మార్గం అయిన వేగస్ నాడి పాటను ఆలపించగానే ఉత్తేజితమవుతుందట. ఎప్పుడైతే పాట కోసం ఉదర శ్వాసను ఉపయోగిస్తామో అప్పుడు ఈ వేగస్ నాడీ తక్షణమే యాక్టివ్ అవుతుందట. దాంతో విశ్రాంతి, జీర్ణక్రియ అనే ప్రక్రియ ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి ప్రేగులు అత్యుత్తమంగా పనిచేయడం ప్రారంభిస్తాయట. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమేగాక, ప్రేగుల లోపలి పొర ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు శరీరంలో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతకు మద్దతిస్తుందట. గానం ఎలా హెల్ప్ అవుతుందంటే..గానం విశ్రాంతిని ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఆటోమేటిగ్గా మనం రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోతాం. దాంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ పాట పడటం కోసం ఉదర శ్వాసను వినియోగిస్తాం దాంతో శ్వాశ, నాడీవ్యవస్థ నియంత్రణ ఫలితం ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. జీర్ణవ్యవస్థకు మెదడు నుంచి సరైన సంకేతాలు అందితేనే తన పనిని సజావుగా జరపగలదట. అందువల్లే గానం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నొక్కి చెప్పగలమని అన్నారు. గానం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అది సమర్థవంతంగా సంకేతాలను అందించడంతో ప్రేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు. అందరూ పాడేటప్పుడు లోతైన శ్వాసను తీసుకుంటే వేగస్ నాడీ ఉత్తేజమయ్యి..జీర్ణవ్యవస్థ బాగుండేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే మన పూర్వీకులు మన చేత నిరంతరం జపాలు, పారాయణాల పేర్లతో మంత్రాలు, భక్తిపాటలను లయబద్ధంగా ఆలపించేలా చేసేవారని అంటున్నారు. అంటే మెరుగైన ఆరోగ్యానికి చక్కటి జీవనశైలి, శ్వాస, మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమనేది గుర్తురెగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం View this post on Instagram A post shared by Akanksha Pandey (@acanxa) (చదవండి: వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే..)
ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..
ఫుడ్‌తో కొంగొత్త పరిచయాలే కాదు..ఓ దేశాన్నే మైమరిపించొచ్చు. ఎంతటి శత్రుత్వాలు, కోపతాపలు..ఒక్క విందుతో సమసిపోతాయి. అలాంటి టేస్టీ ఫుడ్‌తో ఇతర దేశాల మనసును దోచుకుని కోట్లు ఆర్జించడం మాటలు కాదుకదా. అలాంటి ఘన విజయాన్నే అందుకుంది ఈ భారత సంతతి మహిళ. మన భారతీయ రుచులను జోడించి తయారు చేసిన ఐస్‌క్రీమ్ బ్రాండ్‌తో దూసుకుపోతూ..శెభాష్ అనిపించుకుంటోంది పూజా బావిషి. ఎవరామె అంటే..భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా బావిషి, 'మలై' అనే ఐస్ క్రీమ్ బ్రాండ్‌తో అమెరికన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఏడాదికి రూ. రెండు వేల కోట్లు టర్నోవర్‌ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇద హోల్‌సేల్ ఈ కామర్స్ వ్యాపారంగా మారింది. 46 ఏళ్ల వ్యవస్థాపకురాలు, సీఈఓ 2015లొ ఈ మలైని ప్రారంభించారు. ఈ వ్యాపారం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో నాలుగు దుకాణాలను నిర్వహిస్తోంది. చాలామటుకు ఐస్‌క్రీమ్‌లలో చాక్లెట్, వెనిలా వంటి ఫ్లేవర్లు చూశాం. కానీ అంతకుమించిన రుచి కోసం మలై వంటి వెరైటీ టేస్ట్‌ని పరిచయం చేశారు. దీని తయారీలో ఉపయోగించిన యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, జాజికాయ వంటి రుచులను జోడించడంతో అమెరికా వాసుల మనసులను దోచుకుంది ఈ మలై ఐస్ క్రీమ్. ఈ కంపెనీ 2025లోనే సుమారు రూ. రెండు వేల కోట్లు పైనే ఆర్జించేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతకుముందు ఏడాది 2024, 2025 సంత్సరాలలో సంస్థ లాభదాయకంగా సాగింది. ఇక పూజా విద్యా నేపథ్యం వచ్చేసి..బావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే ఆమె ఆమె వాషింగ్టన్ డిసి-ఆధారిత లాభాపేక్షలేని సంస్థ అయిన ఈక్వల్ రైట్స్ సెంటర్లో పౌర హక్కుల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందిలా..స్నేహితులకు ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీంల రుచి చూపించినప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చేసినట్లు గుర్తు చేసుకుంది. అల్లం-స్టార్ సోంపు ఐస్ క్రీమ్ - ఒక డిన్నర్ పార్టీలో తక్షణమే అందర్నీ ఆకట్టు కోవడంతో..ఇలాంటి టేస్టే టేస్టీ ఐస్‌క్రీం షాపు పెట్టాలని భావించారట ఆమె. అయితే తన ఉత్పత్తులు మార్కెట్లో క్లిక్ అవుతాయో లేతో అన్న సందేహం మాత్రం బాగా ఉండేదని చెప్పుకొచ్చారామె. అయితే తన షాపుకు వచ్చే కస్టమర్ ఎలాంటి ఫ్లేవర్ కోరుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తూ..టేస్టీ, టేస్టీ..మలై ఐస్‌క్రీమ్‌ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే తన షాపు కి వచ్చే కస్టమర్ ఎవరు?, వాళ్లకేం కావాలన్నదే పూర్తిగా అవగాహన ఉండాలని, లేదంటే వ్యాపారం లాభదాయకంగా ఉండదని అంటోంది. అలాగే తాను కేవలం లాభాల మీదే గాక, వ్యాపార విస్తరణపై కూడా దృష్టిపెట్టానని అన్నారు. అలాగే తాను వ్యాపారాన్ని చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి..అన్ని విధాల క్లిక అవుతుందని నమ్మకం కొనసాగేక ముందుకు తీసుకెళ్లానని అన్నారు. అలాగే భారతీయ రుచులు ప్రయోగాత్మకమైనవి కావు, ఈ రుచులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించడం విశేషం. పైగా మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది. అందుకు చాలా గర్వకారణంగా ఉందంటోంది పూజ. View this post on Instagram A post shared by Malai (@malai_icecream) (చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)
స్కూలు బస్సుకి పసుపు రంగే ఎందుకు?
ఫ్రెండ్స్.. మనం రోజూ స్కూలుకి వెళ్లే బస్సు పసుపు రంగులోనే ఉంటుంది. ఎందుకలా ఉంటుందో మీరెపుడైనా ఆలోచించారా? ఎందుకంటారు? ఎందుకంటే పసుపు రంగు ఎంత దూరం నుంచైనా ఆకర్షిస్తుంది. దానివల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి.టాక్సీలు, స్కులు బస్సులకు, రసాయనాలను సూచించే ఫలకాలకు ఈ రంగును వాడుతుంటారు. ప్రమాదాన్ని సూచించే సందర్భాలకి ఎరుపు రంగుని వాడితే, జాగ్రత్త పాటించాల్సిన సూచనల కోసం పసుపుని వాడుతారన్నమాట. అలాగే ట్రాఫిక్ సిగ్నల్‌లో ఈ రంగు లైట్ వెలిగితే.. నెమ్మదిగా వెళ్లాలని అర్థం. ఔనా?హార్న్‌బిల్ అనే పక్షి తన పిల్లల్ని ఎవరూ చూడకుండా, తాకకుండా వుండాలని వాటి నివాసం కోసం చాలా సురక్షితమైన ప్రదేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒక చెట్టుతొర్రలో వుంచి, ఆ తొర్రను వుట్టి లేదా బెరడుతో కప్పేస్తుంది. అయితే గాలి, వెలుతురు కోసం చిన్న రంధ్రం ఒకటి వుంచుతుంది. పిల్లలకు ఆ రంధ్రంలోంచి వుుక్కుతో ఆహారాన్ని అందిస్తుంది. అలా పిల్లలు పెద్దవయ్యేదాకా ఆ తల్లికి ఈ కష్టం తప్పదు వురి.
అంతర్జాతీయం
ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్
Iran War అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చిన వారికి 58 మిలియన్ డాలర్ల (సుమారు 50 మిలియన్ యూరోలు, రూ. 480 కోట్ల ) బహుమతి (బౌంటీ) ప్రకటించే దిశగా ఇరాన్ పార్లమెంట్ ఒక బిల్లును సిద్ధం చేస్తోందని 'ఇరాన్ వైర్', 'ది టెలిగ్రాఫ్ యూకే' నివేదికల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఇరాన్ పార్లమెంట్‌కు చెందిన 'నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిటీ' చైర్మన్ ఇబ్రహీం అజీజీ ఈ బిల్లును సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి "కౌంటర్-యాక్షన్ బై ది మిలిటరీ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్" అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. .ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిగిన వైమానిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఇతనితోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా హతమయ్యారు. ప్రస్తుత సుప్రీం లీడర్ తీవ్ర గాయాలు పాలుకావడానికి కూడా ఈ దాడులే కారణమని అంచనా. ఈ దాడులకు ప్రతీకారంగా ట్రంప్, నెతన్యాహులను హతమార్చడానికి రివార్డులను ప్రతిపాదించే ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుంది. ఖమేనీ హత్యలో పాత్ర ఉన్నందుకు గాను ట్రంప్, నెతన్యాహు, మరియు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "ప్రతీకార చర్య" తీసుకోవాలని అజీజీ పేర్కొన్నట్లు ఇరాన్ వైర్ తెలిపింది. జాతీయ భద్రతా కమిషన్ లోని మరొక సభ్యుడు మహమూద్ నబవియాన్ కూడా, ట్రంప్, నెతన్యాహులను "నరకానికి పంపే" ఎవరికైనా బహుమతులు ఇచ్చే బిల్లుపై తమ పార్లమెంట్ త్వరలోనే ఓటు వేస్తుందని ప్రకటించారు. మసాఫ్ (Masaf) మీడియా : 'కిల్ ట్రంప్' ప్రచారం ,సైబర్ గ్రూప్ ప్రకటనఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ 'మాసఫ్' కొన్ని రోజుల క్రితమే ఒక ప్రకటన చేస్తూ, ఇస్లామిక్ ప్రభుత్వం "కిల్ ట్రంప్" అనే ప్రచారం కోసం 50 మిలియన్ల డాలర్ల ఆర్థిక వనరులను సమకూర్చుకుందని పేర్కొంది.హండాలా (Handala) హ్యాకింగ్ గ్రూప్: అంతకుముందు, ఇరాన్ ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ వార్ఫేర్ గ్రూప్ "హండాలా" కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా న్యాయ శాఖ తమ గ్రూప్ సభ్యుల సమాచారం కోసం 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించినందుకు ప్రతిస్పందనగా... "అణచివేత, అవినీతికి ప్రధాన సూత్రధారులు" అయిన ట్రంప్ మరియు నెతన్యాహులను అంతమొందించడానికి తాము ఈ వనరులను కేటాయించామని హండాలా క్లెయిమ్ చేసింది. ఈ ఇద్దరు దేశాధినేతలపై "ప్రత్యక్ష చర్య" తీసుకునే ఏ వ్యక్తికైనా లేదా సమూహానికైనా ఈ డబ్బు చెల్లిస్తామని ఆ హ్యాకింగ్ గ్రూప్ పేర్కొంది. ఇరాన్ ప్రతిపాదించిన ఈ బౌంటీ (రివార్డు) చట్టం, గతంలో వారు చేసిన మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల కంటే చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు.గతంలో ఇరాన్ కేవలం మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల ద్వారా మాత్రమే ఇలాంటి హెచ్చరికలు చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో చట్టబద్ధంగా బౌంటీ బిల్లును తీసుకురావాలని చూడటం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందాన్ని తీవ్ర ముప్పులోకి నెడుతుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్అమెరికా హెచ్చరిక: గతంలో ట్రంప్ మాట్లాడుతూ.. తనను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని "భూమ్మీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తాం" (Wipe them off the face of the Earth) అని తీవ్రంగా హెచ్చరించారు.శాంతి చర్చల్లో సందిగ్ధత: ఇరాన్ తాజాగా అమెరికాకు ఒక కొత్త శాంతి ప్రతిపాదనను పంపినప్పటికీ, అది పాత ప్రతిపాదనల కంటే పెద్దగా మెరుగ్గా ఏమీ లేదని వాషింగ్టన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని మరియు ఇరాన్ సానుకూలంగా స్పందించాల్సిన ఒత్తిడి వారిపైనే ఉందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?
తైవాన్ యుద్ధంలోకి ఫిలిప్పీన్స్
మనీలా: తైవాన్ చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా నుండి తైవాన్‌పై ఏ చిన్న దాడి జరిగినా, భౌగోళికంగా సమీపాన ఉన్న కారణంగా ఫిలిప్పీన్స్ అనివార్యంగా యుద్ధంలోకి ప్రవేశిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ యుద్ధమే వస్తే, భౌగోళికంగా తమ దేశం అందులో భాగస్వామ్యం వహించక తప్పదంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది.సైనిక ఘర్షణ మొదలైతే..తైవాన్ విషయంలో తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని జపనీస్ మీడియాకు మార్కోస్ స్పష్టం చేశారు. తైవాన్ తమకు చాలా దగ్గరగా ఉండటమే కాకుండా, దాదాపు 2,00,000 మంది ఫిలిప్పీన్స్ పౌరులు అక్కడ నివసిస్తూ, పనిచేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ నిజంగానే సైనిక ఘర్షణ మొదలైతే ఉత్తర ఫిలిప్పీన్స్ ఆ యుద్ధ ప్రభావానికి తీవ్రంగా గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధంలోకి వెళ్లడం తమకు ఇష్టం లేకపోయినా, భౌగోళిక పరిస్థితులు తమను బలవంతంగా లాగుతాయని తెలిపారు.జపాన్‌తో చేతులు కలుపుతూ..ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే వారం మార్కోస్ జపాన్‌లో పర్యటించనున్నారు. జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచితో సమావేశమై భద్రతా సహకారంపై కీలక చర్చలు జరపనున్నారు. టోక్యో ఇటీవల రక్షణ ఎగుమతుల నిబంధనలను సడలించిన క్రమంలో, జపాన్ భద్రతా విధానంపై మరింత స్పష్టత వస్తుందని మార్కోస్ తెలిపారు. తూర్పు చైనా సముద్రంలో బీజింగ్ నుండి జపాన్, ఫిలిప్పీన్స్ ఎదుర్కొంటున్న బెదిరింపులు, సవాళ్లు ఒకటేనని ఆయన పేర్కొన్నారు. జపాన్ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.చైనాతో దౌత్యం.. ట్రంప్, జిన్‌పింగ్ మంతనాలుదక్షిణ చైనా సముద్రంపై బీజింగ్‌తో ప్రాదేశిక వివాదం ఉన్నప్పటికీ, శాంతిని నెలకొల్పేందుకు చైనాతో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరుపుతున్నట్లు మార్కోస్ ప్రకటించారు. మరోవైపు గత వారం బీజింగ్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తైవాన్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర ఘర్షణలకు దారితీస్తుందని జిన్‌పింగ్ హెచ్చరించినట్లు ట్రంప్ స్వయంగా తెలిపారు.ఇది కూడా చదవండి: ఆర్జీ కర్ కేసు: సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి
అమెరికా మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్ (మసీదు) వెలుపల సోమవారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనను పోలీసులు ద్వేష పూరిత దాడిగా అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనా స్థలానికి సమీపంలోని వీధిలో పార్క్ చేసి ఉన్న ఒక కారులో 17, 19 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు యువకుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దాడి చేసిన అనంతరం నిందితులు ఇద్దరూ తమను తాము కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.పోరాడిన సెక్యూరిటీ గార్డుమరణించిన ముగ్గురిలో ఒకరైన సెక్యూరిటీ గార్డు.. సాయుధులైన దుండగులు లోపలికి చొరబడకుండా అతను తన ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుకున్నాడు. ఆ సమయంలో మసీదు కాంప్లెక్స్ పరిధిలోని ‘అల్ రషీద్’ స్కూల్లో వందలాది మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఒకవేళ అతడే గానీ అడ్డుపడకపోయింటే పెద్ద ఎత్తున రక్తపాతం జరిగి ఉండేది. ఈ ఘటన జరిగిన వెంటనే వందలాది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అరబిక్, ఖురాన్ పాఠశాలలోని చిన్న పిల్లలను పోలీసులు సురక్షితంగా బయటకు తరలించారు.
హరిత ఇంధనంలో సమష్టి కృషి
ఓస్లో: యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌తో శుద్ధ ఇంధనంలో సమష్టి కృషే ధ్యేయంగా హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. శుద్ధ ఇంధనం మొదలు వాతావరణ మార్పులను తట్టుకోవడం, తక్కువ కర్భన ఉద్గారాలు వెదజల్లేలా సముద్రవాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ సాంకేతిక, అంతరిక్షం, ఆర్కిటిక్ ఖండంలో పరిశోధన దాకా పలు అంశాలపై నార్వే ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సోమవారం నార్వే రాజధాని నగరం ఓస్లోలో జోనాస్ గార్ స్టోర్‌తో విస్తృతస్థాయిలో చర్చల సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ఇరుదేశాల మధ్య బంధాన్ని హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాం. పర్యావరణ అనుకూల సుస్థిరాభివృద్ధి ధ్యేయంగా శుద్ధ ఇంధనంతోపాటు వాతావరణ మార్పుల కట్టడి, పర్యావరణ పరిరక్షణ కోసం ఇకపై భారత్, నార్వే కలిసి నడుస్తాయి. గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ తర్వాత భారత దేశ ప్రతిభ, అందిపుచ్చుకునే తత్వం, వేగాన్ని నార్వే సాంకేతికత, పెట్టుబడులతో జోడించి రెండు దేశాల పరిశ్రమలు, సంస్థలు క్లీన్ ఎనర్జీ మొదలు బ్లూ ఎకానమీ, గ్రీన్ షిప్పింగ్ దాకా ఎన్నో రంగాల్లో అద్భుతాలు సృష్టించనున్నాయి. సత్సంబంధంలో భారత్, యూరప్ కొత్త స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నాయి. వచ్చే 15 ఏళ్లలో భారత్‌లోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు పది లక్షల ఉద్యోగాల కల్పనకు భారత్, యురోపియన్ స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందం బాటలుపరుస్తుంది. వచ్చే నాలుగేళ్లలో నార్వే, భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్కిటిక్‌లో భారత పరిశోధనా కేంద్రం ‘హిమాద్రి’కి నార్వే ఎంతగానో సాయపడుతోంది. ఇస్రో, నార్వే స్పేస్ ఏజెన్సీ మధ్య అవగాహన ఒప్పందం కుదరడం సంతోషకరం. ఆహార, ఇంధన భద్రత మొదలు పలు రంగాల్లో ఇరుదేశాల మధ్య బంధం సమున్నత శిఖరాలకు చేరుకోబోతోంది. ఉక్రెయిన్కావొచ్చు పశ్చిమాసియా సంక్షోభంకావొచ్చు ఏదైనా సంఘర్షణను చర్చలు, సంప్రతింపులు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోగలం. శాంతిస్థాపనకు భారత్, నార్వే ఎల్లప్పుడూ కృషిచేస్తాయి’’అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీకి నార్వే అత్యున్నత పురస్కారం నార్వే అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేనియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను మోదీ అందుకున్నారు. భారత్–నార్వే సత్సంబంధాలను సమున్నత శిఖరాలకు చేర్చేందుకు మోదీ చేస్తున్న కృషి, ఆయన దార్శనిక నాయకత్వానికిగాను మోదీని ఈ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు నార్వే ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మెడల్‌ను రాజప్రాసాదంలో నార్వే రాజు హరాల్డ్–5 స్వయంగా మోదీకి ప్రదానంచేశారు.మోదీకి పురస్కారం అందజేస్తున్న రాజు హరాల్డ్ మోదీ పారిపోయారు: రాహుల్మీడియా ఎదుట నార్వే ప్రధానితో మోదీ కరచాలనంచేశాక మీడియా ప్రతినిధుల నుంచి ఎలాంటి ప్రశ్నోత్తరాలను స్వీకరించకుండానే భారత ప్రధాని వెనుతిరిగారు. దీనిపై నార్వే మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తంచేశారు. ‘‘మోదీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రపంచ పత్రికాస్వేచ్ఛలో నార్వే అగ్రస్థానంలో ఉంది. అదే భారత్ 157వ స్థానంలో అట్టడుగున ఉంది. పాలస్తీనా, ఎమిరేట్స్, క్యూబా లాంటి దేశాల పక్కన ఆగిపోయింది’’అని హెలీ లింగ్ అనే జర్నలిస్ట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ స్పందిస్తూ ‘ఎక్స్’లో సోమవారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘భయపడనప్పుడు దాచిపెట్టాల్సిన పనేలేదు. మీడియా అడిగేప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోదీ పారిపోయారు. ఇలా చేస్తే భారత పరువు పోదా?’’అని రాహుల్ నిలదీశారు.
జాతీయం
కేరళలో మళ్లీ భయం.. భయం.. వర్షాలు బాబోయ్..
తిరువనంతపురం: కేరళను భారీ వర్షాలు మరోసారి అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళలో గతంలో కురిసిన వర్షాలు ఎంతగా విధ్వంసం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వర్షాకాలాల్లో కేరళలో కురిసిన వర్షాలను గుర్తు చేసుకుంటే.. 2018లో సంభవించిన విపత్తును అత్యంత భయంకరమైన విపత్తుగా గుర్తించారు. 2019, 2020లో వరుస మాన్సూన్లలో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. 2024 వయనాడ్ విపత్తును ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక నైరుతి రుతుపవనాలు ఈనెల 26న (4 రోజులు అటుఇటుగా) కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కేరళలో వర్ష హెచ్చరికలను భారత వాతావరణ శాఖ తాజాగా సవరించింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పత్తనం తిట్ట, కొట్టాయం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో మంగళవారం ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.అదే విధంగా బుధవారం కూడా నాలుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. అలప్పుళ, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం జిల్లాల్లో బుధవారానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో 115 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశమూ ఉందని తెలిపింది.ఇక కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో భారీ అలలు ఏర్పడే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు.భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత వాతావరణ శాఖ జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అత్యాచార నిందితుడికి వీరోచిత స్వాగతం : దుమారం
సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జైలు నుండి విడుదలైన సుశీల్ ప్రజాపతి అనే అత్యాచార నిందితుడికి, అతని మద్దతుదారులు పూలదండలతో ఘన స్వాగతం పలికిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ వీడియోలో, నిందితుడు ప్రజాపతిని భుజాలపై మోస్తూ, నినాదాలు చేస్తూ, అదేదో విజయయాత్రలా ఊరేగింపు నిర్వహించడం, ఒకరికొకరు, అందరూ కరచాలనాలు చేసుకుంటూ, నవ్వుతూ వీరోచిత స్వాగతం పలకడం ఆశ్చర్యానికి గురిచేసింది. హీరోలా ర్యాలీనిందితుడు సుశీల్ ప్రజాపతి 'హిందూ యువ వాహిని'నేతగా తెలుస్తోంది. ఇతనిపై ఒక ఎల్ఎల్బీ (LLB) విద్యార్థినిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక లాయర్‌కు పరిచయం చేస్తానన్న నెపంతో నిందితుడు ఆ విద్యార్థినిని ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడనేది ప్రధాన ఆరోపణ. దాదాపు తొమ్మిది నెలల తర్వాత, మే 17న నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. విడుదలైన వెంటనే, రాజకీయ నాయకుడిలా తెల్లటి దుస్తులు, మెడలో కాషాయ కండువాలు, పూలదండలతో రోడ్‌షో నిర్వహించడం నెట్టింట తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సమాజంలో ఇలా హీరోలా స్వాగతం పలకడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. <UP lives upto its local traditional grandeur, they garland, applaud and celebrate a Rape Accused. Accused in Ghaziabad, UP, LLB student rape case, Hindu Yuva Vahini leader Sushil Prajapati, released from jail, supporters hoisted him on shoulders, took out procession !!Tears… pic.twitter.com/FtpSiC14p6— We The People (@WithYou2023) May 19, 2026 ఇదీ చదవండి: నీట్ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్.. ఎవరీ తుషార్ కుమార్?
నీట్ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!
సాక్షి, న్యూఢిల్లీ : 2024లో నీట్ (NEET UG) పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినప్పుడు, విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తిగా మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కెమిస్ట్రీ టీచర్ శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ గుర్తింపు పొందారు. విద్యార్థులు ఆయన్ను ఆప్యాయంగా "ఎమ్ సర్" (M Sir) అని పిలుచుకునేవారు. నాడు విద్యార్థులకు "ఘోర అన్యాయం" జరిగిందంటూ వాదించిన ఆయన కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ, సరిగ్గా రెండేళ్ల తర్వాత.. 2026 నీట్ (NEET UG) పేపర్ లీక్ కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.శివరాజ్ మొతేగావ్కర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో, 2024లో ఆయన విద్యార్థుల కోసం మాట్లాడిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. "నీట్ 2024లో భారీ కుంభకోణం జరిగింది. దీనివల్ల మహారాష్ట్రలో చదువు కుంటున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. సంభాజీనగర్‌లోని ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్‌లో మేము ఇప్పటికే పిల్ (PIL) దాఖలు చేశాం. విద్యార్థుల తరఫున మరో ప్రత్యేక పిటిషన్ కూడా వేశాము. ఈ రోజు మేము ముంబై వచ్చాము. బాంబే హైకోర్టులో అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాము. మహారాష్ట్రలోని అన్ని న్యూస్ ఛానళ్ల ప్రతినిధులను కలిసి, దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరతాము. పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు మీడియా మద్దతు చాలా అవసరం."అని విద్యార్థుల తరపున గళమెత్తాడు. కట్ చేస్తే సరిగ్గా రెండేళ్లకు అదే విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ సీబీఐ చేతికి చిక్కాడు.'ఎమ్ సర్' అరెస్ట్ లాతూర్‌లోని ప్రముఖ 'రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్' (RCC) వ్యవస్థాపకుడైన శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మే 17 (ఆదివారం) నాడు అరెస్ట్ చేసింది. ఆయన నివాసాలు, కార్యాలయాలపై జరిపిన సోదాల్లో.. ఆయన మొబైల్ ఫోన్లో లీకైన నీట్ క్వశ్చన్ పేపర్ లభ్యమవ్వడంతో సీబీఐ ఈ చర్య తీసుకుంది.ఇదీ చదవండి: నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్ఎవరీ కెమిస్ట్రీ టీచర్ 'ఎమ్ సర్'?లాతూర్‌లోని ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన మొతేగావ్కర్, మొదట్లో సైకిల్‌పై తిరుగుతూ విద్యార్థులకు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేవారు 1990ల చివర్లో ఒక చిన్న అద్దె గదిలో కేవలం 10 మంది విద్యార్థులతో ఆయన కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. చేత్తో రాసిన నోట్స్ ఇస్తూ, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల కాంపిటేటివ్ పరీక్షల్లో టాపర్లను అందిస్తూ ఆయన స్వల్ప కాలంలోనే ఎంతో ప్రసిద్ధి చెందారు.ఇదీ చదవండి: నో టాయిలెట్, నో లీవ్స్ : రూ. 19 లక్షల జాబ్ వదిలేశా!ప్రస్తుతం 'ఆర్సీసీ' (RCC) క్లాసెస్‌కు మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన బ్రాంచ్ అయిన లాతూర్‌తో సహా 9 బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 40,000 మంది విద్యార్థులు నీట్, జేఈఈ, సెట్ (NEET, JEE, CET) పరీక్షల కోసం ఇక్కడ చేరుతుంటారు. సోషల్ మీడియాలో (ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్) కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. నాడు విద్యార్థుల రక్షకుడిగా ఫోజులిచ్చిన ప్రముఖ విద్యావేత్తే, నేడు అదే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అవ్వడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఆర్సీసీ బ్రాంచి నిర్వాహకుడు తమ ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ నుంచే నీట్లో ప్రశ్నలు వస్తాయని ధీమాగా చెప్పాడు. ఒక్కో సబ్జెక్టులో ఉండే 180 ప్రశ్నలకుగాను ఏకంగా 180 ప్రశ్నలు తామిచ్చే మెటీరియల్ నుంచే ఉంటాయంటూ గొప్పలు చెప్పుకున్నాడు. తమ కోచింగ్‌తో మెడికల్ సీటు గ్యారెంటీ అంటూ భరోసా ఇచ్చాడు. నీట్–2026 ముందు ఎన్డీటీవీ చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఓ అభ్యర్థి సోదరుడినంటూ ఎన్డీటీవీ ప్రతినిధి ఒకరు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని కలిశారు. కోచింగ్‌తో ర్యాంకు గ్యారెంటీపై ఆయన అనుమానం వ్యక్తం చేయగా అతడు చెప్పిన విషయాలన్నీ రహస్య కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దేశంలోనే ఏ ఇన్స్టిట్యూట్లోనూ తమ మాదిరి కోచింగ్ ఇవ్వరంటూ అతడు గొప్పలు చెప్పాడు. ఎయిమ్స్ సహా దేశంలోని ఏ మెడికల్ కాలేజీకి వెళ్లి చూసినా తమ కోచింగ్ తీసుకున్న కనీసం ఒక్క స్టూడెంటయినా కనిపిస్తారన్నాడు. 2025 నీట్‌లోనూ తామిచి్చన మెటీరియల్లోని ప్రశ్నలే వచ్చాయని తెలిపాడు. రిజల్టు పక్కా అని చెప్పగలిగేది దేశం మొత్తమ్మీద కేవలం తమ ఇన్స్టిట్యూట్ మాత్రమేనన్నాడు. ఏ ఇతర కోచింగ్‌లోనూ ఇప్పటి వరకు ఇలాంటి ఫలితాలు రాలేదని ధీమా వ్యక్తం చేశాడు. నీట్–2025లో వచ్చిన ప్రశ్నలు అచ్చుగుద్దినట్లుగా తమ మెటీరియల్‌లో ఎక్కడున్నదీ కచ్చితంగా చెప్పగలనన్నాడు. ‘పరీక్షలో అడిగిన 180 ప్రశ్నలకు గాను 180 ప్రశ్నలు ఇప్పటికే మా స్టడీ మెటీరియల్‌లో ఎక్కడో ఒకచోట వచ్చాయని మేం నిరూపించగలం. యాదృచ్ఛికంగానే ఈ క్వశ్చన్ బ్యాంకులోని ఏదైనా ఒక పేజీని తెరిచి మరీ ఇలాంటి ప్రశ్నలను చూపించగలను..’అంటూ బల్లగుద్ది చెప్పడం గమనార్హం. ఈ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు శివరాజ్ రఘునాథ్ మోటెగావొంకర్ను లాతూర్‌లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడం తెల్సిందే.
ఎన్ఆర్ఐ
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
క్రైమ్
స్పా సెంటర్లో భార్యను చంపిన భర్త..!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో పాటు అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన మంగళవారం గాం«దీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ఎస్ఐ నర్సింహ, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం. ఆటో డ్రైవర్ రాజు, బంగి దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్‌పురా కిషన్‌బాగ్ ఎంఎన్ గూడెంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కవాడిగూడ ప్రధాన రహదారిలోని ఓ సూపర్ మార్కెట్ 4వ అంతస్తులోని స్పా సెంటర్లో దేబోరా బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు ఎంఎన్ గూడెంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటూ రాజుపై దేబోరా అత్తాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు పెట్టింది. అప్పటి నుంచి రాజు కక్ష పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. మంగళవారం ఉదయం దేబోరా విధుల్లో భాగంగా ఆటోలో కవాడిగూడలోని స్పా సెంటర్‌కు చేరుకుంది. ఆమెను వెంబడించిన రాజు కవాడిగూడకు చేరుకున్నాడు. ఆమె లిఫ్టులోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చాడు. వీరిద్దరూ లిప్టులోనే గొడవ పడుతూ 4వ అంతస్తుకు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరంపై అనేక చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో దేబోరా మృతి చెందింది. నిందితుడు రాజు అత్తాపూర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళ వెనుక వెళ్లి.. డ్రెస్‌ను పైకెత్తి
హైదరాబాద్: ఇటీవల నార్సింగి సైకిల్ ట్రాక్‌లో జాగింగ్ చేస్తున్న యువతిని చూస్తూ ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడం మరచిపోకముందే అలాంటిదే మరో ఘటన నెక్నాంపూర్ డివిజన్ అలకాపూర్ టౌన్íÙప్లో చోటుచేసుకుంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. స్థానికులు, నార్సింగి ఎస్ఐ సరిత తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ రోడ్ నం. 4లో మధ్యాహ్నం వేళ కూతురును ఎత్తుకుని వెళ్తోంది. ఓ యువకుడు నక్కినక్కి వచ్చి వెనకనుంచి మహిళ డ్రెస్‌ను పైకెత్తాడు. అకస్మాత్తు పరిణామంతో నివ్వెరపోయిన మహిళ గట్టిగా అరిచింది. దీంతో నిందితుడు పారిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది. కొందరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది. విషయం పోలీసులకు చేరడంతో బాధిత మహిళను గుర్తించి ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఇలాంటివి జరగకుండా పోలీసులు గస్తీ పెంచాలని, కాలనీల్లో సీసీ కెమెరాలన్నింటినీ పనిచేసేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.చిల్లర నా కొడుకులు ఎక్కువైపోయారు 💦ఏం బ్రతుకులు రా మీవి ముండల్లారThis incident happened in Manikonda on 14 may afternoon pic.twitter.com/kcvlzogBme— Prudvi Kumar (@Prudvikumar_54) May 19, 2026
దొంగ అంటూ ముద్ర వేశారని...
గచ్చిబౌలి (హైదరాబాద్): తమ గదిలోని రెండు ల్యాప్‌టాప్‌లు దొంగిలించాడని హెచ్‌సీయూ ఎంఏ ఎకనామిక్స్ విద్యార్థిపై సహ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మయాంక్ కుందు (23) సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎఫ్ హాస్టల్లోని రూమ్ నంబర్ 242లో సెకండ్ ఇయర్ విద్యార్థి సుప్రతి లోహతో కలిసి ఉంటున్నాడు. రీడింగ్ రూమ్ లో రెండు ల్యాప్‌టాప్‌లు మయాంక్ చోరీ చేశాడని ఇద్దరు లైఫ్ సైన్స్ విద్యార్థులు ఈ నెల 17న వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ల్యాప్‌టాప్‌లు తీసి ఉంటే తిరిగివ్వాలని విద్యార్థులు కోరారు. ఆ ల్యాప్‌టాప్‌ల విషయం తనకు తెలియదని మయాంక్ చెప్పాడు. ల్యాప్‌టాప్ ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. దీంతో రూమ్మేట్కు చెప్పకుండా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు హాస్టల్ నుంచి వెళ్లిన మయాంక్ తిరిగి రాలేదు. ల్యాప్‌టాప్‌లు పోయాయని లైఫ్ సైన్స్ విద్యార్థులు సోమవారం ఉదయం గచ్చి బౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే హాస్టల్ నుంచి వెళ్లిన మయాంక్ వర్సిటీ క్యాంపస్‌లోని బఫెల్లో లేక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చెరువులో మయాంక్ మృతదేహాన్ని గుర్తించారు. హెచ్‌సీయూ రిజి్రస్టార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నా రు. కాగా, డ్రగ్స్‌కు బానిస కావడంతోనే కొన్నిసార్లు ల్యాప్‌టాప్‌లు తస్కరించానని, తాజా ల్యాప్‌టాప్‌ల విషయం మాత్రం తనకు తెలియదని మయాంక్ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
రేయ్.. నాశనం అయిపోతారు
దేవుడా ప్లీజ్ ఇలాంటి వాళ్లను ఏం చేయాలో నువ్వే చూడు- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోకు నెటిజన్ పెట్టిన కామెంట్ ఇది. వృద్ధులు అని కూడా చూడకుండా ఆస్తి కోసం అమ్మనాన్నలపై అమానవీయంగా కొడుకు, అతడి పిల్లలు దాడికి తెగబడిన వీడియో చూసినవారంతా ఇలాగే స్పందిస్తున్నారు. అసలు వీళ్లు మనుషులేనా, మనసంటూ ఉందా అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొమ్ముల కోసం కన్నవారిని కిందపడేసి కర్కోటకంగా కాళ్లతో తన్నుతూ దాడి చేస్తున్న దృశ్యాలు సమాజంలో దిగజారుతున్న విలువలకు నిలువెత్తు రుజువుగా సాక్షాత్కరిస్తున్నాయి.సమాజంలో బంధాలు, అనుబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో చెప్పడానికి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని కొత్తోట గ్రామంలో జరిగిన ఈ ఘోర సంఘటన నిదర్శనం. రెక్కలు ముక్కలు చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని కూడా చూడకుండా, కేవలం ఆస్తి కోసం ఓ కొడుకు, అతడి బిడ్డలు (మనవళ్లు, మనవరాలు) కలిసి వృద్ధ దంపతులపై అమానుషంగా దాడికి తెగబడ్డారు. సుమారు రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.కొత్తోట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సూర్యనారాయణ, కొప్పనాతి కస్తూరిబాయిలకు ముత్యాలరాజు అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా ఆస్తి విషయమై తల్లిదండ్రులతో అతడు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే ముత్యాలరాజు తన కొడుకులు రాధాకృష్ణ, శేఖర్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధ దంపతులపై కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశాడు. వయసుపైబడిన వారనే కనీస మానవత్వం లేకుండా, ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. వృద్ధులను కిందపడేసి కర్రలతో కొట్టి కాళ్లతో తన్నుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తీవ్ర గాయాలపాలైన సూర్యనారాయణ, కస్తూరి బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కఠిన చర్యలు తప్పవు: పోలీసులుఈ కేసును తాము పట్టించుకోవడం లేదంటూ కొన్ని మీడియా ఛానెళ్లలో వచ్చిన వార్తలను మొగల్తూరు పోలీసులు ఖండించారు. ఆ వార్తలు అవాస్తవాలని మొగల్తూరు ఎస్సై జి.వాసు పేర్కొన్నారు. బాధితురాలు కొప్పనాతి కస్తూరి బాయి ఈ నెల 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తాటలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఆస్తి వివాదం నేపథ్యంలో కొడుకు, మనవళ్లు కలిసి వృద్ధ తల్లిదండ్రులపై దారుణంగా దాడి చేశారు. సూర్యనారాయణ, కస్తూరి దంపతులను కాళ్లతో తన్నుతూ హింసించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కొడుకు… pic.twitter.com/7w0F9Kd880— greatandhra (@greatandhranews) May 18, 2026 చదవండి: రఘురామ కృష్ణంరాజుకు చెంపపెట్టు
వీడియోలు
ట్రంప్, నెతన్యాహును చంపిన వారికి భారీ బహుమతి?
రఘురామకృష్ణంరాజును సస్పెండ్ చేయాలని దళిత క్రైస్తవుల ర్యాలీ
నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్
దళారుల చేతిలో శ్రీవాణి టికెట్లు? 10 సెకెన్లలో హైజాక్!
మెడికల్ షాపులు బంద్.. ఏపీలో మూతపడ్డ 45K షాపులు
పెళ్లయిన 5 నెలలకే.. త్విషా శర్మ డెత్ మిస్టరీ
ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ఇక లేనట్లే
తమిళ రాజకీయాల్లో దుమారం.. చిక్కుల్లో విజయ్..
వైభవ్ ఊచకోత.. టాప్ 4లోకి రాజస్థాన్..
దివ్యాంగులకు జగనన్న భరోసా


