Suvendu Adhikari
-
మమతకు బిగ్ షాక్.. సువేందు అధికారి అదిరిపోయే దెబ్బ
పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను, గుర్తులను సువేందు ప్రభుత్వం తొలగిస్తోంది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘బిస్వా బంగ్లా’ లోగోను రాష్ట్రవ్యాప్తంగా తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారిక వేదికలు, ప్రజా మౌలిక సదుపాయాల నుండి అధికారికంగా తొలగించడం ప్రారంభించింది. దీనికి బదులుగా భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు.కాగా, మాజీ సీఎం మమతా బెనర్జీ సెప్టెంబర్ 16, 2013న బిస్వా బంగ్లా బ్రాండ్ లోగోను ప్రారంభించారు. బెంగాల్ సాంస్కృతిక గుర్తింపు, పర్యాటకం, సాంప్రదాయ కళలు మరియు చేతివృత్తులకు ప్రాతినిధ్యం వహించే చిహ్నంగా దీనిని రూపొందించారు. బెంగాలీ అక్షరం “B” చుట్టూ రూపొందించబడిన ఈ లోగో, తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ వెబ్సైట్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు సుందరీకరణ కార్యక్రమాలలో క్రమంగా అధికారిక బ్రాండింగ్ చిహ్నంగా మారింది.దశాబ్దానికి పైగా తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది గుర్తింపుగా పనిచేసింది. కాగా, బెంగాల్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం, ఈ లోగో స్థానంలో మరో కొత్త లోగోను తీసుకువచ్చారు. దీనికి బదులుగా భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా సాల్ట్ లేక్ స్టేడియంలో 'బిస్వా బంగ్లా' గుర్తును తొలగించి, దాని స్థానంలో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఈ రీబ్రాండింగ్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా విస్తరించింది. పలు ప్రభుత్వ విభాగాలు, సేవలకు లింక్‌లను అందించే 'ఎగియే బంగ్లా' పోర్టల్‌లో ఇప్పుడు బిస్వా బంగ్లా లోగో స్థానంలో అశోక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టల్ థీమ్‌లో కూడా మార్పు వచ్చింది. గతంలో ఉన్న తెలుపు-నీలం రంగుల స్థానంలో కాషాయ రంగును చేర్చారు.The 'Biswa Bangla' logo has been removed from the Salt Lake stadium in Kolkata. Its been replaced by India's national emblem - the Ashok StambhBiswa Bangla logo was introduced by former CM Mamata Banerjee as the state emblem for Bengal pic.twitter.com/dSGg4ViC9Q— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) May 16, 2026అయితే, ఒక వ్యక్తి సృష్టించిన లోగో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక గుర్తింపుగా పనిచేయకూడదని వాదిస్తూ బీజేపీ నాయకులు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. అధికారిక ప్రభుత్వ వినియోగానికి అశోక చిహ్నమే అత్యున్నతమైన మరియు అత్యంత సముచితమైన చిహ్నంగా ఉంటుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. 2017లో 'బిస్వా బంగ్లా' లోగో ఒక రాజకీయ వివాదానికి కేంద్రంగా నిలిచింది. అప్పుడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్, ఆ లోగో ప్రైవేట్ యాజమాన్యంలో ఉందని, అది ప్రభుత్వానిది కాదని ఆరోపించారు. ఈ ఆరోపణలను అభిషేక్ బెనర్జీ ఖండించగా మమతా బెనర్జీ అసెంబ్లీలో ఆ లోగోను తానే స్వయంగా సృష్టించానని, రాయల్టీ వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దానిని ఉపయోగించుకోవడానికి అనుమతించానని తరువాత స్పష్టం చేశారు.దాదాపు 13 సంవత్సరాలుగా బిస్వా బంగ్లా చిహ్నం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ గుర్తింపుతో మరియు ప్రజా సంబంధాలతో ముడిపడి ఉంది. అయితే, బీజేపీ ప్రభుత్వం వచ్చాక అధికారిక వ్యవస్థలు మరియు రాష్ట్ర నియంత్రిత వేదికల నుండి ఆ లోగో తొలగించడం ఎంతో కీలకంగా మారింది. ఇది బెంగాల్ రాజకీయ, పరిపాలనా బ్రాండింగ్‌లో ఒక ప్రతీకాత్మక మార్పును సూచిస్తుంది.రాజకీయ ప్రభావంటీఎంసీ గుర్తింపు తొలగింపు: బిశ్వ బంగ్లా లోగో తొలగించడం ద్వారా టీఎంసీ పాలనలో ఏర్పడిన గుర్తింపును తొలగిస్తున్నారు.బీజేపీ సంకేతం: అశోక స్తంభం ప్రవేశపెట్టడం ద్వారా జాతీయ చిహ్నాన్ని రాష్ట్ర గుర్తింపుగా మార్చి, “సాఫ్రన్ బ్రాండింగ్”ను బలపరుస్తోంది.సాంస్కృతిక ప్రభావం: దుర్గాపూజ వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా బీజేపీ ప్రభావం పెరుగుతుందని అంచనా. -
“పుష్ప” సంగతి నేను చూస్తా: బెంగాల్ సీఎం సువేందు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత, “పుష్ప” అని చెప్పుకునే జహంగీర్ ఖాన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శనివారం హెచ్చరిక చేశారు. “అతడు అత్యంత కిరాతక నేరస్థుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. అతడి వ్యవహారాన్ని నేను స్వయంగా చూసుకుంటా. పుష్ప అని చెప్పుకునే ఆ వ్యక్తి బాధ్యత ఇప్పుడు నాది” అని హెచ్చరించారు.ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఫల్తాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సభలో సువేందు అధికారి మాట్లాడారు.“మేనల్లుడు (అభిషేక్ బెనర్జీ) రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పదేళ్లుగా ప్రజలు ఓటు వేయలేని పరిస్థితి ఫల్తాలో ఉంది. ఈ రీపోలింగ్‌తో ఓటర్ల హక్కులు మళ్లీ స్థిరపడతాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఫల్తా ఓటర్లు బీజేపీ అభ్యర్థిని లక్షకు పైగా మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా” అని సువేందు అధికారి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తృణమూల్ నేత, ఫల్తా అభ్యర్థి జహంగీర్ ఖాన్ తనను తాను “పుష్ప”గా చెప్పుకున్నారు. “పుష్ప” సినిమాలో అల్లు అర్జున్ పోషించిన స్మగ్లర్, శక్తిమంతమైన పాత్రను ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ పోలీసు పరిశీలకుడిగా నియమించింది. ఆయనను “సింగం” సినిమా సిరీస్‌లో అజయ్ దేవగన్ పోషించిన పోలీసు అధికారి పాత్రతో పోల్చి, ఖాన్ ‘‘పుప్ప’’ వ్యాఖ్యలు చేశాడు.కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పడింది. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు దశల్లోనూ 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కాగా, మొన్న తమిళనాడు అసెంబ్లీలోనూ ‘‘పుష్ప’’ పాత్రను గుర్తు చేస్తూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ఆర్జీ కర్ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ల సస్పెన్షన్
కోల్‌కతా: 2024లో సంచలనం రేపిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి దారుణ హత్యాచార ఘటన కేసును తిరిగిదోడుతామంటూ ఇచ్చిన ఎన్నికల హామీ అమలుకు సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ దారుణంపై ప్రాథమిక దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరిగ్గా దర్యాప్తు చేయలేదనే ఆరోపణలపై ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ శుక్రవారం సీఎం సువేందు అధికారి ఆదేశాలిచ్చారు. కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్, మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన సెక్రటేరియట్లో ప్రకటించారు. వీరు కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేకపోవడమే కాదు, మృతురాలి తల్లిదండ్రులకు లంచం ఎరజూపారని తెలిపారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు, శాఖాపరమైన దర్యాప్తు నిర్ణీత వ్యవధిలోగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సంఘమిత్ర ఘోష్ ముగిస్తారని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం సీబీఐ జరుపుతున్న దర్యాప్తు, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. సీబీఐ కంటే ముందు, కోల్‌కతా పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తు దశలపై మాత్రమే ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వివరించారు. -
అచ్చం ప్రధానిలాగే చేసిన సీఎం
కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుసరిస్తూ పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం శాసనసభలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేళ సువేందు అధికారి శాసనసభకు చేరుకున్నారు. సభలోకి ప్రవేశించే ముందు, గౌరవ సూచకంగా శాసనసభ మెట్లపై సాష్టాంగ నమస్కారం చేశారు.కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మే 9న జరిగిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాష్టాంగ నమస్కారం చేస్తూ వేదికపై ప్రజలకు నమస్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని అందించినందుకుగానూ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన అలా చేశారు. ఆ సమయంలో మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.బాధ్యతలు చేపట్టిన వెంటనే పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం, 45 రోజుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం చేపట్టేందుకు సరిహద్దు భద్రతా దళానికి భూమి కేటాయించడం వాటిలో ఉన్నాయి.నందిగ్రామ్ స్థానానికి రాజీనామాపశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన సువేందు అధికారి తాను భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా కొనసాగుతానని, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేస్తానని బుధవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పూర్తిగా ఓడించడమే కాకుండా.. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆమె కంచుకోటలాంటి భవానీపూర్‌లో ఓడించింది. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె 15,000కుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు భవానీపూర్ నుంచే సువేందు అధికారి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. -
బెంగాల్ సీఎం సహాయకుని హత్య కేసులో బిగ్ ట్విస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) రంగంలోకి దిగి ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన షూటర్‌గా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన ‘రాజ్ సింగ్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.రాజ్ సింగ్ ఎవరు? బల్లియాలోని ఆనంద్ నగర్‌కు చెందిన రాజ్ సింగ్ స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. అఖిల భారత క్షత్రియ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే ఇతడి పేరు గతంలో ఒక కాల్పుల ఘటనలోనూ వినిపించింది. ప్రొఫెషనల్ షూటర్లతో సహా కనీసం ఎనిమిది మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్నోలో ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా, అయోధ్యలో రాజ్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, బిహార్‌లోని బక్సర్‌లో మయాంక్ మిశ్రా, విక్కీ మౌర్యాలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజ్‌ను తదుపరి విచారణ నిమిత్తం కోల్‌కతాకు తరలించారు.నా కొడుకు నిర్దోషి.. పోలీసులదే కుట్రతన కొడుకును ఈ కేసులో అకారణంగా ఇరికించారని రాజ్ సింగ్ తల్లి జామవంతి సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హత్య జరిగిన సమయంలో తాము ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నామని, 2026 మే 9 ఉదయం అయోధ్యలో గుడికి వెళ్లామని ఆమె ఆజంగఢ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. అయోధ్యలో ఐదుగురు వ్యక్తులు తన కొడుకును బలవంతంగా ఎత్తుకెళ్లి, ఆ తర్వాత బక్సర్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని ఆమె మండిపడ్డారు. తమకు కోల్‌కతాతో ఎలాంటి సంబంధం లేదని, అక్కడికి ఎన్నడూ వెళ్లలేదని పేర్కొన్నారు.ఫోన్ రికార్డులే సాక్ష్యం.. దర్యాప్తు ముమ్మరంరాజ్ సింగ్ లక్నోలో పెళ్లికి హాజరై, మార్కెట్లో షాపింగ్ చేసినట్లు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని తల్లి జామవంతి చెబుతున్నారు. ‘నా కొడుకుకు న్యాయం జరగాలి, మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ రికార్డులను పరిశీలిస్తే నిజాలు బయటపడతాయి’ అని ఆమె ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ దారుణాన్ని ముందస్తు కుట్రగా అభివర్ణించడంతో బెంగాల్ ఎస్టీఎఫ్, సీఐడీ, యూపీ, బీహార్ పోలీసుల సంయుక్త బృందాలు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేశాయి. -
మమతను ముంచిన ముస్లింలు.. BJPని గెలిపించిన హిందూ ఓటు బ్యాంకు
-
మమతా వారసత్వాన్ని కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం
కోల్‌కతా: సాధారణంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే.. గత పాలన తాలూకు ఆనవాళ్లు చెరిపేయడం, లేదంటే ఆ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పేర్లు మార్చి క్రెడిట్ కొట్టేసి తామే చేశామని చెప్పుకునే ఈ రోజుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం మమతా బెనర్జీ తన పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.దీదీ ప్రభుత్వం 2021లో మహిళా సాధికారత పథకం లక్ష్మీర్ బండార్ అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద అర్హులైన 25 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీలకు నెలకు రూ.1200, సాధారణ వర్గాలకు రూ.1000 ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసేవారు.ఇటీవల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి బీజేపీ అధికారంలోకి రాగా.. ఆ రాష్ట్రానికి తొమ్మదవ సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం చేపట్టారు. పాలనలో తనదైన మార్క్‌తో నిర్ణయాలు తీసుకుంటున్నారు.సోమవారం పశ్చిమ బెంగాల్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో లక్ష్మీర్ బండార్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత టీఎంసీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ అమలు చేసిన లక్ష్మీర్ బండార్లాంటి సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.దీంతో పాటు ఎన్నికల్ని సజావుగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ బీజేపీ కార్యకర్తకు నివాళులర్పించారు. -
భారత బోర్డర్.. బెంగాల్ సీఎం సంచలన నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. మన దేశ బోర్డర్లో రక్షణ కోసం బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీ చేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 127 కిలోమీటర్ల మేర బీఎస్ఎఫ్ కోసం కేంద్ర హోంశాఖ ఫెన్సింగ్ వేయనుంది. రానున్న 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు తగిన భూమిని అప్పగించనున్నట్టు సీఎం సువేందు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఎస్ఎఫ్ (BSF) కోసం సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి భూమి కేటాయింపులు ప్రారంభించింది. తాజాగా సీఎం సువేందు అధికారి బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద ఫెన్సింగ్ కోసం భూమి బదిలీకి ఆమోదం తెలిపారు. అయితే, కలకత్తా హైకోర్టు ఇప్పటివరకు కేటాయింపులు ఆలస్యం కావడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. కాగా, గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం బీఎస్ఎఫ్కు భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపించారని ఆరోపణలు ఉన్నాయి. 127 కిలోమీటర్లకు గాను.. కేవలం 8 కిలోమీటర్లే మమత సర్కార్ కేటాయింపులు చేసింది. ప్రభావం ఇలా.. సరిహద్దు భద్రత: బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద అక్రమ రవాణా, చొరబాటు తగ్గించడానికి ఫెన్సింగ్ కీలకం.బీఎస్ఎఫ్ బలోపేతం: కొత్త అవుట్‌పోస్టులు, ఫెన్సింగ్ వల్ల BSFకు పర్యవేక్షణ సులభం అవుతుంది.రాజకీయ ప్రభావం: సువేందు అధికారి ప్రభుత్వం బీఎస్ఎఫ్కు మద్దతు ఇస్తూ, కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేస్తోంది.Suvendu government's first big move!▶️Suvendu transfers land for border fencing to BSF. #SuvenduAdhikari #WestBengal pic.twitter.com/xL3gHjmN83— IndiaToday (@IndiaToday) May 11, 2026 -
‘యూపీఐ పేమెంట్’తో సువేందు పీఏ హంతకుల పట్టివేత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అనూహ్యమైన పురోగతి సాధించారు. నిందితులు చేసిన ఒకే ఒక్క చిన్న పొరపాటు వారిని పోలీసులకు చిక్కేలా చేసింది. టోల్ ప్లాజా వద్ద చేసిన ఆన్లైన్ పేమెంట్ ఆధారంగా, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అనుమానితులను బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.టోల్ ప్లాజా వద్ద పట్టించిన ‘యూపీఐ’హత్య అనంతరం పరారైన దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులకు టోల్ ప్లాజా వద్ద ఓ ‘యూపీఐ’ ద్వారా జరిగిన ఆన్లైన్ పేమెంట్ దర్యాప్తులో కీలకంగా మారింది. దీని ఆధారంగా నిందితుల కదలికలను పసిగట్టిన పోలీసులు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారు కాగా, మరొకరు యూపీలోని బల్లియాకు చెందిన వ్యక్తి. సోమవారం రాత్రి వీరందరినీ పశ్చిమ బెంగాల్‌కు తరలించిన పోలీసులు ముమ్మర విచారణ చేపట్టారు.సినిమాను తలపించేలా ఛేజింగ్, కాల్పులుమే 6వ తేదీ రాత్రి కోల్‌కతా శివార్లలోని నార్త్ 24 పరగణాల జిల్లా దొహారియా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. కారులో ముందు సీటులో ప్రయాణిస్తున్న చంద్రనాథ్‌ను బైక్‌లపై వెంబడించిన దుండగులు అడ్డగించారు. అనంతరం కారు అద్దం గుండా అత్యంత సమీపం నుంచి (పాయింట్ బ్లాంక్ రేంజ్) కాల్పులు జరిపి, క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ భయానక దాడిలో చంద్రనాథ్ రథ్ ప్రాణాలు కోల్పోగా, బుల్లెట్ గాయాలపాలైన కారు డ్రైవర్ కోల్‌కతా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.కుట్ర వెనుక మాస్టర్ మైండ్ ఎవరు?అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగిన ఈ హత్యలో పట్టుబడిన నిందితుల పాత్ర ఏమిటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల అనంతర హింసను ప్రేరేపించే కుట్రలో భాగంగానే ఈ హత్య జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ ఘాతుకానికి గల ప్రధాన కారణాలు, దీని వెనుక ఉన్న అసలు కుట్రదారుల వివరాలతో బెంగాల్ పోలీసులు త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్ పాలిటిక్స్: జైలు నుంచి ‘కింగ్ మేకర్’ విడుదల -
సువేందు అలా చేయకుంటే.. మారణహోమం: టీఎంసీ బహిష్కృత నేత
కోల్‌కతా: టీఎంసీ బహిష్కృత నేత రిజుదత్తా బెంగాల్ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సువేందు అధికారి సంయమనంతో దాదాపు ఐదువేల మంది తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రాణాలు కాపాడారన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం సువేందు తన వ్యక్తిగత సహాయకుడు దారుణ హత్యకు గురైనప్పటికీ, ప్రతీకారానికి పిలుపునివ్వకుండా శాంతిని పాటించారని లేదంటే భారీ హింస జరిగేదన్నారు.పశ్చిమబెంగాల్‌కు మమతా బెనర్జీ తర్వాత సువేందు అధికారే సీఎంగా అర్హుడైన వ్యక్తి అని కొనియాడారు. మమతా బెనర్జీని నందిగ్రామ్‌లో ఓడించిన రికార్డు ఆయనకు ఉందని, ఆయన రాజకీయ ప్రస్థానం అద్వితీయమని ప్రశంసల వర్షం కురిపించారు.ప్రైవేట్ సంస్థైన ఐ-ప్యాక్ చేతుల్లోకి టీఎంసీ వెళ్లిపోయిందని దీనికి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ బాధ్యత వహించాలని దత్తా విమర్శించారు.పార్టీ ఓటమికి అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలే కారణమని కృష్ణేందు నారాయణ్ చౌదరి, అటిన్ ఘోష్ వంటి సీనియర్ నేతలు సైతం తృణముల్ కాంగ్రెస్ ఓటమికి కారణమన్నారు.అయితే రిజూదత్తా వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించింది. ఇవన్నీ సదరు వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలని, పార్టీకి వీటికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ అధికారికంగా ప్రకటించే అంశాలనే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది. కాగా రిజుదత్తా టీఎంసీ ప్రతినిధి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే నెపంతో ఆయనను పార్టీ ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. కారులో వెళుతున్న ఆయనను అడ్డగించిన దుండగులు పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చిచంపారు. దీనిపై కన్నీటీ పర్యంతమైన సువేందు అధికారి నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టాది లేదని తేల్చిచెప్పారు. -
బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం
కోల్‌కతా: పోరాటాల గడ్డ పశ్చిమబెంగాల్లో కమలనాథుల పరిపాలనా శకానికి నాందిపలుకుతూ ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర అగ్రనేత సువేందు అధికారి శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తద్వారా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి బీజేపీ నాయకునిగా సువేందు చరిత్ర సృష్టించారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి పార్టీల అగ్రనేతల సమక్షంలో అత్యంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. గవర్నర్ ఆర్ఎన్ రవి అధికారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. తర్వాత ఉప్పొంగిపోయిన ప్రధాని తమకు అపూర్వ విజయాన్ని అందించిన బెంగాల్ ఓటర్లకు మోకాళ్లపై ఒంగి నేలకు తల ఆన్చి నమస్కారంచేశారు. ఈ సందర్భంగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లోని ప్రమాణస్వీకార ప్రాంగణం జైశ్రీరాం, భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిపోయింది. భవానీపూర్‌లో మమతా బెనర్జీని మట్టికరిపించి, నందిగ్రామ్‌లో విజయాన్ని సాధించిన సువేందుకు ప్రధాని ప్రమాణ స్వీకారం తర్వాత శుభాకాంక్షలు తెలిపారు. సువేందు తర్వాత సీనియర్ బీజేపీ నేత దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తనీయ, క్షుదిరాం టుడు, నితీశ్ ప్రామాణిక్‌లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. బ్రాహ్మణ, ఓబీసీ, గిరిజన, కాయస్థ, మథువా, రాజ్‌వంశీ ఇలా ఆరు సామాజిక వర్గాలకు చెందిన నేతలను కేబినెట్లోకి తీసుకుని బీజేపీ తమ సామాజిక సమానత్వాన్ని చాటింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల నేతలకు సమప్రాధాన్యతనిచ్చింది. సోమవారం రాజ్‌భవన్‌లో మరికొందరు నేతలు మంత్రులుగా ప్రమాణంచేయనున్నారు. ప్రమాణంచేసిన మంత్రులకు ఇంకా శాఖలను కేటాయించలేదు. సోమవారం శాఖలను కేటాయించి తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. పెద్దసంఖ్యలో హాజరైన కమలదళ సభ్యులు తొలిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న క్షణాలను చిరస్మరణీయంగా మార్చాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకోసం భారీసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలను తరలించారు. ప్రాంగణమంతా భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటుచేసి సువేందు, మోదీల పాత ప్రసంగాలను ప్రసారంచేశారు. ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారంచేశారు. పార్టీ జెండాల రెపరెపలతో ప్రాంగణం కాషాయమయమైంది. ‘‘ఈరోజు కోసం ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్నా. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చింది. ఇక టీఎంసీ అరాచకాలకు చెట్లుచీటీ పడుతుంది. సరిహద్దు ఆవలినుంచి చొరబాట్లు ఆగిపోతాయి. అరాచకాలను తట్టుకోలేక నా కుమారుడు సొంత రాష్ట్రం నుంచి వలసపోయాడు. ఇప్పుడు తిరిగొస్తాడు’’అని 80 ఏళ్ల భగవతీదేవి చెప్పారు. హిందు ప్రభుత్వపాలన ఆరంభాన్ని కళ్లారా చూసేందుకు వచ్చానని 70ఏళ్ల నవదీ్వప్ మఠ్‌లో ప్రజ్ఞాన్ మహరాజ్అనే సాధువు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కొలువుతీరే క్షణాలను కళ్లారా చూడాలని కెనడానుంచి వచ్చానని 50 ఏళ్ల వ్యక్తి చెప్పారు. ప్రత్యేక ఆకర్షణగా ఝాల్మురీ.. ప్రచారంవేళ ప్రధాని రుచిచూసిన బెంగాలీ చిరుతిండి ఝాల్మురీ శనివారం ప్రమాణస్వీకార ప్రాంగణంలో అందర్నీ నోరూరించింది. బీజేపీ నేతలు ప్రత్యేకంగా ఈ స్టాళ్లను ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. మరవరాలు, పచ్చి మిరప, మసాలా దినుసులతో ఝాల్మురీ చేస్తారు. దీనిని తినేందుకు పెద్దసంఖ్యలో జనం ఎగబడ్డారు. 20 స్టాళ్లు సరిపోక సొంతంగా కొందరు వ్యాపారులు సైతం స్టాళ్లు పెట్టుకున్నారు. ‘‘ఝాల్మురీ కాస్తంత ఘాటుగాఉంటుంది. కానీ బీజేపీ విజయానికి గుర్తుగా తీపి జోడించాం. అయినా వేగంగా సరుకు అమ్ముడపోయింది’’అని 24 నార్త్పరగణాల జిల్లా నుంచి స్టాల్ పెట్టిన మనీశ్ యాదవ్ చెప్పారు. బీజేపీ జెండా రంగుల్లో తయారుచేసిన రసగుల్లా అయితే హాట్‌కేకులా అమ్ముడుపోయింది. ‘‘మామూలుగా దొరికే ఝాల్మురీ కంటే ఇక్కడి ఝాల్మురీ నిజంగా బాగుంది’’అని కోల్‌కతాలోని గోలీగంజ్ వాసి మంజరి బసు అన్నారు.కదలివచ్చిన తారాలోకం ప్రమాణ స్వీకారోత్సవంలో బెంగాలీ సినీలోకం తరలివచ్చింది. ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి విచ్చేశారు. ప్రసేన్జీత్ ఛట్జీ, జీషు సేన్గుప్తాలతోపాటు శాస్త్రీయ కళాకారులు పండిత్ అజయ్ చక్రవర్తి, డ్యాన్సర్ మమతా శంకర్, నటుడు రిషి కౌశిక్, పాయల్ సర్కార్సహా బెంగాలీ టెలివిజన్ రంగ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.వాళ్లకు న్యాయం చేయాలి: సీఎం తల్లి సువేందు సీఎంగా ప్రమాణం చేశాక ఆయన తల్లిదండ్రులు గాయత్రి, సిసిర్ అధికారులు అమితానందం వ్యక్తంచేశారు. తూర్పు మేదినీపూర్‌లోని కాంతి పట్టణంలో సొంతింట్లో వాళ్లు మాట్లాడారు. ‘‘మాకొడుకు సీఎం అయ్యాడని మాకంటే ఎక్కువగా బెంగాలీ ప్రజలే సంతోషిస్తున్నారు. సువేందు హయాంలో ఇకనైనా ఆర్జీకర్ వైద్యురాలి హత్యోదంతంలో బాధితులకు న్యాయం జరగాలి. ఇలాంటి అకృత్యాల్లో నిందితులకు కఠినంగా శిక్షలుపడేలా చేయాలని కోరుకుంటున్నా’’అని తల్లి గాయత్రి అన్నారు. సువేందు తండ్రి సిసిర్ గతంలో మూడుసార్లు ఎంపీగా గెలిచారు.బీజేపీ అమరులకు మోదీ నివాళులు గత 15 ఏళ్లలో మమతాబెనర్జీ ప్రభుత్వ హయాంలో టీఎంసీ దాడుల్లో మృతిచెందిన బీజేపీ నేతలు,కార్యకర్తలకు నివాళిగా ఏర్పాటుచేసిన తాత్కాలిక స్మారకం వద్ద ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అంజలి ఘటించారు. ప్రమాణస్వీకార ప్రాంగణంలో ఈ స్మారకం ఏర్పాటుచేశారు. ‘‘కోల్‌కతాలో ఓవైపు బీజేపీ తొలి సర్కార్ కొలువుతీరుతుంటే మేం మాత్రం తొలుత టీఎంసీ అరాచకపాలనలో అమరులైన బీజేపీ కార్యకర్తలకు నివాళులరి్పంచాం. వీళ్ల త్యాగం సదా మాకు స్ఫూర్తిదాయకం’’అని తర్వాత మోదీ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. వృద్ధ నేతకు మోదీ పాదాభివందనం 98 ఏళ్ల బీజేపీ నేత మఖన్‌లాల్ సర్కార్‌ను బీజేపీ ప్రత్యేకంగా వేదిక మీదకు ఆహ్వానించింది. శాలువా కప్పి ఆయన కాళ్లను ప్రధాని మోదీ మొక్కారు. తర్వాత ఆప్యాయంగా హత్తుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద ముఖర్జీతో కలిసి 1952లో కశ్మీర్లో త్రివర్ణపతాకాన్ని ఎగరేసిన బృందంలో మఖన్‌లాల్ ఉన్నారు. ఈ సందర్భంగా ఈయననూ అరెస్ట్‌చేశారు. ‘‘స్వాతం్రత్యానంతరం జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని ఇప్పటికీ సజీవ స్ఫూర్తిగా ఉన్న అతికొద్ది మందిలో మఖన్‌లాల్ ఒకరు’’అని బీజేపీ కొనియాడింది. 1980లో బీజేపీ ఏర్పడ్డాక పశ్చిమబెంగాల్లోని వెస్ట్ దినాజ్‌పూర్, జల్పాయ్గురి, డార్జిలింగ్ జిల్లాలకు మఖన్‌లాల్ సమన్వయకర్తగా సేవలందించారు. 1981 నుంచి ఏడేళ్లపాటు జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. -
అప్పుడు లంచం తీసుకుంటూ దొరికి.. ఇప్పుడు సీఎంగా ప్రమాణం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడంతో పలువురు ఆయన పాత వీడియోలను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. గతంలో సువేందు అధికారి టీఎంసీలో ఉన్న సమయంలో నోట్ల కట్టలను లంచంగా తీసుకుంటూ కెమెరాకు చిక్కిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆయనపై అవినీతిపరుడంటూ తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడేమో ఆయనను ఆశీర్వదిస్తూ సీఎం కుర్చిలో కూర్చోబెట్టారని పలువురు నేతలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.‘‘మ్యాథ్యూ శామ్యుయేల్ అనే పాత్రికేయుడు 2014లో తహల్కా పత్రిక తరఫున నారదా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. సువేందు అధికారి ఓ గదిలో ఏం చేస్తున్నారన్న విషయాన్ని రహస్యంగా చిత్రీకరించి బయటపెట్టింది ఆ స్టింగ్ ఆపరేషన్. అందులో టీఎంసీ నేతల్లో పలువురు లంచాలు తీసుకుంటూ కనిపించారు. వారిలో సువేందు అధికారి కూడా ఉన్నారు. 2016 ఎన్నికల వేళ బీజేపీ ఈ వీడియోను బాగా ప్రచారం చేసింది. తర్వాత సువేందు అధికారి బీజేపీలో చేరిన తర్వాత తమ అధికారిక ఛానల్ నుంచి ఆ వీడియోను ఆ పార్టీ తొలగించింది. ఇప్పుడు బీజేపీకి చెందిన ఈ గొప్ప వ్యక్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మొత్తం బీజేపీ శ్రేణులు సువేందును పొగడటానికి ఒక్కటయ్యారు. నైతికత ఏమైంది? నైతిక సూత్రాలు ఏమయ్యాయి?’’ అంటూ ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. సువేందు అధికారి లంచం తీసుకున్న వేళ తీసిన వీడియోను కూడా సంజయ్ రౌత్ పోస్ట్ చేశారు.२०१४ मध्ये तहलका मॅगझिनच्या पत्रकार मॅथ्यू सॅम्युअल यांनी नारदा स्टिंग ऑपरेशन केले.TMC चे अनेक मोठे नेते लाच घेताना पकडले गेले, त्यात सुवेंदु अधिकारी देखील होते.२०१६ च्या निवडणुकीत BJP ने या व्हिडिओला प्रचंड प्रमोट केले,पुढे जेव्हा सुवेंदु भाजपात आले, तेव्हा BJP ने आपल्या… pic.twitter.com/YQGvYYkbTC— Sanjay Raut (@rautsanjay61) May 9, 2026మీడియా సమావేశంలోనూ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు ప్రమాణ స్వీకారం చేశారని, కొన్ని సంవత్సరాల క్రితం ఆయనపై బీజేపీ పెద్ద ఎత్తున ఓ ప్రచారం చేసిందని చెప్పారు. ఆయన అవినీతిని బయటపెట్టిందని, కెమెరా ముందు లంచాలు తీసుకుంటున్న దృశ్యాలు కూడా చూపించిందని అన్నారు. సువేందు అవినీతిపరుడంటూ సామాజిక మాధ్యమాలు పోస్టులతో నిండిపోయాయని, ఈడీ దాడులు కూడా జరిగాయని తెలిపారు. అయినప్పటికీ ఇప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.కాగా, సువేందు అధికారి లంచాలు తీసుకుంటూ కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయారంటూ గతంలో ప్రధాని మోదీ విమర్శించిన వీడియో కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘2016లో కెమెరా ముందు లంచం తీసుకున్నారని సువేందు అధికారిపై మోదీ విమర్శలు చేశారు. 2021లో సువేందు బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ వాషింగ్ మెషీన్లో శుభ్రం చేయటానికి మోదీకి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆయనను మోదీ ఆశీర్వాదిస్తున్నారు. అవినీతిపై మోదీ పోరాటాన్ని ఎవరూ సందేహించకూడదు’’ అంటూ మరొకరు చురకలు అంటించారు. In 2016, Modi attacked Suvendu Adhikari for taking bribe on camera.In 2021, Suvendu joined the BJP and Modi took 5 years to wash him in the BJP washing machine.Now, Modi blesses him as he takes oath as a CM. No one should doubt Modi’s fight against corruption. pic.twitter.com/ldkTi6qvp5— Shantanu (@shaandelhite) May 9, 2026यह मोदीजी अपने ही बनाए हुए मुख्यमंत्री सुवेनदू अधिकारी की बात कर रहे हैं! pic.twitter.com/RcfS0JXASQ— Prashant Bhushan (@pbhushan1) May 9, 2026 -
బెంగాల్ ప్రజలకు మోకరిల్లి.. నమస్కారం చేసిన మోదీ
-
కేబినెట్లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆయన కేబినెట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఏకైక మహిళా నేత 51 ఏళ్ల అగ్నిమిత్ర పాల్. బాలీవుడ్ గ్లామర్ ప్రపంచం నుంచి బెంగాల్ గల్లీ రాజకీయాల వరకు ఆమె సాగించిన ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది.అలనాటి హీరోయిన్లకు దుస్తుల తయారీ..ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ వేడుకలో దిలీప్ ఘోష్, నిశిత్ ప్రమాణిక్ వంటి ఉద్దండులతో పాటు అగ్నిమిత్ర పాల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఏకైక మహిళా ప్రతినిధి ఈమె కావటం విశేషం. రాజకీయాల్లోకి రాకముందు అగ్నిమిత్ర పాల్ కోల్‌కతా ఫ్యాషన్ రంగంలో తిరుగులేని సెలబ్రిటీగా వెలుగొందారు. ‘ఇంగా’ అనే ఫ్యాషన్ లేబుల్‌తో శ్రీదేవి, హేమమాలిని వంటి దిగ్గజ నటీమణులకు ఆమె దుస్తులను డిజైన్ చేశారు.2019లో రాజకీయ అరంగేట్రం పశ్చిమ బెంగాల్ సంప్రదాయ ‘కాంతా’ ఎంబ్రాయిడరీని అంతర్జాతీయ వేదికలపైకి అగ్నిమిత్ర పాల్ తీసుకువచ్చారు. 2019లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి టీఎంసీ అభ్యర్థిపై 40,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి, పార్టీలో తన పట్టును నిరూపించుకున్నారు. బీజేపీలో చేరిన అతి తక్కువ కాలంలోనే మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, పార్టీ ఉపాధ్యక్షురాలిగా అగ్నిమిత్ర కీలక బాధ్యతలు చేపట్టారు.ముఖ్యమంత్రి రేసులో..ఒకానొక దశలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఆమె పేరు వినిపించడం విశేషం. అయితే ఆమె రాజకీయ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. తన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, నిరసనలు, ఆందోళనలకు సంబంధించి ఆమెపై 23 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏ కేసులోనూ శిక్ష పడకపోయినప్పటికీ, బెంగాల్ మట్టి బిడ్డగా పోరాట పటిమను ప్రదర్శిస్తూ, ఆమె కేబినెట్లో కీలక స్థానాన్ని దక్కించుకున్నారు. -
మఖన్‌లాల్ పాదాలకు మొక్కిన మోదీ
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ఉదయం ప్రమాణం చేశారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఓ పెద్దాయన్ని శాలువాతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాదాభివందనం చేశారు. ‘‘బెంగాల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పా కదా.. వచ్చింది’’ అంటూ మోదీ ఆ పెద్దాయనతో అన్నారు. ఆయన పేరు మఖన్‌లాల్ సర్కార్. పశ్చిమ బెంగాల్లోనే అత్యంత సీనియర్ బీజేపీ కార్యకర్త. ఆయన నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది.బెంగాల్‌కు చెందిన మఖన్‌లాల్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్ రాజకీయ విభాగంగా.. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ (BJS) స్థాపించిన సంగతి తెలిసిందే. దీంతో మఖన్‌లాల్ అందులో చేరారు. "ఒక దేశం, ఒక జెండా" అనే నినాదంతో 1952లో కశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయడానికి ముఖర్జీ ప్రయత్నించారు. ఆ సమయంలో మఖన్‌లాల్ కూడా ఉన్నారు. ఈ ఉద్యమంలో ఆయన అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.ఆ తర్వాత.. 1977లో బీజేఎస్ జనతా పార్టీలో విలీనమై తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP)గా రూపాంతరం చెందింది. టెక్నికల్‌గా మఖన్‌లాల్ బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. బెంగాల్లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో గౌరవసూచీకంగా ప్రధాని మోదీ ఆయన్ని సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. Kolkata, West Bengal: Prime Minister Narendra Modi took blessings and felicitated Makhanlal Sarkar, one of the most senior BJP workers in West Bengal, as he attended the swearing-in ceremony of the new government pic.twitter.com/Yc1FDdlG09— IANS (@ians_india) May 9, 2026 -
Watch Live: దీదీ కంచుకోటను బద్దలు కొట్టి.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం
-
సువేందు అధికారి అనే నేను..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల సమక్షంలో ఈ ఘట్టం జరిగింది. సువెందు అధికారి క్యాబినెట్లో మంత్రులుగా ఎమ్మెల్యేలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తానియా, క్షుదీరం తుడు, నిషిత్ ప్రమాణిక్‌లు కూడా ప్రమాణస్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి సువేందు, ఇతర మంత్రుల చేత ప్రమాణం చేయించారు. దీనికి ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో సువేందు అధికారి బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఆయన బెంగాల్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతోంది. #WATCH | Kolkata | Prime Minister Narendra Modi and CM-designate Suvendu Adhikari pay tribute to Gurudev Rabindranath Tagore on his birth anniversary pic.twitter.com/0f2FiHRAWJ— ANI (@ANI) May 9, 2026సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కోల్‌కతా చేరుకున్న ప్రధాని స్థానిక బీజేపీ సీనియర్ కార్యకర్తలలో ఒకరైన మఖన్ లాల్ సర్కార్‌ను సన్మానించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 1952లో కశ్మీర్లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి వెళుతున్న సందర్భంలో మఖన్ లాల్ సర్కార్ అరెస్టయ్యారు. ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ వద్ద మిఠాయిలు, కుంకుమ రంగు ‘రసగుల్లాలు’ విక్రయానికి అందుబాటులో ఉంచారు. దీనికి ముందు ప్రధాని మోదీ,సువేందు అధికారి తదితరులు రవీంద్రనాథ్ ఠాగూర్‌కు నివాళులర్పించారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు సీనియర్ ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. కాగా పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ప్రధాని అక్కడికి చేరుకోగానే ‘మోదీ, మోదీ’ అనే నినాదాలు ఆ ప్రాంగణమంతటా మార్మోగిపోయాయి. #WATCH | BJP leader Suvendu Adhikari arrives at Kolkata’s iconic Brigade Parade Grounds to take oath as the Chief Minister of West Bengal pic.twitter.com/bDFzrPZzZI— ANI (@ANI) May 9, 2026పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఎన్నికల సంగ్రామంలో సంచలన విజయంతో రాష్ట్రంలో కమలం వికసించింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై భవానీపూర్‌లో అద్భుత విజయం సాధించిన బీజేపీ నేత సువేందు అధికారి, ఈరోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్కంఠభరితమైన రాజకీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ ఘట్టాన్ని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ఎన్డీఏ అగ్రనేతలు హాజరయ్యారు. క్యాబినెట్ రేసులో సీనియర్లుసువేందు అధికారి నేతృత్వంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో కీలక మంత్రి పదవుల కోసం బీజేపీలోని పలువురు ప్రముఖ నేతలు బలమైన పోటీదారులుగా ఉన్నారు. వారిలో మాజీ కేంద్ర మంత్రి నిశిత్ ప్రమాణిక్, బారక్పూర్ ఎమ్మెల్యే అర్జున్ సింగ్, ముర్షిదాబాద్ నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే గౌరీ శంకర్ ఘోష్ వంటి కీలక నేతల పేర్లు మంత్రివర్గ కూర్పులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.మంత్రివర్గంలో ఆశావహుల జాబితావీరితో పాటు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారిలో మరికొన్ని ప్రముఖ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ వీహెచ్‌పీ మాజీ అధ్యక్షుడు శృతి శేఖర్ గోస్వామి, మాజీ ఎంపీ రూపా గంగూలీ, న్యాయవాది కౌస్తవ్ బాగ్చీతో పాటు దీపక్ బర్మన్, సజల్ ఘోష్, ఇంద్రనీల్ ఖాన్, జాయెల్ ముర్ము లాంటి నాయకులు కొత్త ప్రభుత్వంలో క్యాబినెట్ బెర్తుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. #WATCH | Kolkata | Senior NDA leaders, including Union HM Amit Shah, Uttar Pradesh Chief Minister Yogi Adityanath, Andhra Pradesh CM Chandrababu Naidu and others at Kolkata’s iconic Brigade Parade Grounds, where the swearing-in ceremony of the BJP government in West Bengal is… pic.twitter.com/TlThluxqvd— ANI (@ANI) May 9, 2026 -
బెంగాల్ అధికారి సువేందు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడిపోయింది. సీనియర్ నేత సువేందు అధికారికే అధికారం అప్పగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం కోల్‌కతాలో సమావేశమయ్యారు. సువేందును శుక్రవారం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. నూతన ముఖ్యమంత్రిగా 55 ఏళ్ల సువేందు పేరును ఖరారు చేశారు. తర్వాత సువేందు లోక్ భవన్‌కు చేరుకొని, గవర్నర్ ఆర్.ఎన్.రవిని కలిశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. సీఎంగా ప్రమాణం స్వీకారం చేయాలంటూ సువేందు అధికారిని గవర్నర్ ఆహ్వానించారు. శనివారం ఉదయం కోల్‌కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో బీజేపీ ముఖ్యమంత్రి తొలిసారిగా కొలువుదీరుతున్న రెండో రాష్ట్రం పశ్చిమ బెంగాల్. గత నెలలో బిహార్‌లో బీజేపీ నేత సామ్రాట్ చౌదరి తొలిసారిగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. చొరబాట్లు ఇక అసాధ్యం: అమిత్ షా పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాలనలో చొరబాట్లు, పశువుల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలు అసాధ్యమని అమిత్ షా తేల్చిచెప్పారు. ఆయన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని కేవలం ఒక ఎన్నికల మైలురాయిగా మాత్రమే కాకుండా, అంతకు మించి జాతీయ భద్రత, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఒక నిర్ణయాత్మక రాజకీయ మార్పుగా అమిత్ షా అభివరి్ణంచారు. ఈ విజయం కేవలం బీజేపీ విస్తరణకు లేదా దాని సిద్ధాంతానికి సంబంధించినది మాత్రమే కాదని అన్నారు. ఇది 21వ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించినది కూడా కాదన్నారు. దేశ జాతీయ భద్రతలోని అతిపెద్ద లోపాల్లో ఒకదానిని ఈ విజయం పూడ్చివేస్తుందన్నారు. బెంగాల్లో చొరబాట్లు, గోవుల అక్రమ రవాణా ఆగిపోతాయన్నారు. చొరబాటుదార్లను గుర్తించి, బయటకు పంపిస్తామని పునరుద్ఘాటించారు. ఇది జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు విస్తరించిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. 1950లో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో ప్రారంభమైన సైద్ధాంతిక ప్రయాణం 2026లో ఆయన సొంత జన్మస్థలంలో ఆయన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని తెలిపారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనలో అరాచకమే రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. చొరబాట్లు లేని బెంగాల్, బంగారు బెంగాల్ స్వప్నాన్ని సాకారం చేస్తామన్నారు. మహిళలకు భద్రత కల్పిస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేయాల్సిన బాధ్యత బీజేపీ సర్కార్‌పై ఉందన్నారు.హామీలన్నీ అమలు చేస్తాం: సువేందు బెంగాల్లో భయోత్పాత కాలం ముగిసిందని సువేందు అధికారి స్పష్టంచేశారు. రాష్ట్రంలో తొలి బీజేపీ ప్రభుత్వం సామూహిక నాయకత్వ సూత్రంపై పనిచేస్తుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు. బీజేపీ శాసనసభాపక్ష భేటీలో సువేందు ప్రసంగించారు. రాష్ట్రంలో భయం పోయిందని, భరోసా వచ్చిందని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం వ్యక్తిగత అధికారం చుట్టూ తిరగదని స్పష్టం చేశారు. నేను కాదు మనం అనే భావనతో ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు. బెంగాల్ ప్రజలకు తమకు చరిత్రాత్మక విజయం కట్టబెట్టారని, హామీలు అమలు చేసిన వారి రుణం తీర్చుకుంటామని వెల్లడించారు. వాగ్దానాలను దశలవారీగా అమలు చేస్తామన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు, మహిళల పట్ల నేరాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. బెంగాల్ పునరి్నర్మాణం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సానుకూల పాలన, సంకల్ప పత్రం(మేనిఫెస్టో) అమలు ద్వారా వచ్చే ఎన్నికల్లో 60 శాతానికి పైగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సువేందు తేల్చిచెప్పారు. కౌన్సిలర్ నుంచి సీఎం దాకా...!సువేందు రాజకీయ ప్రస్థానం కోల్‌కతా: మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన సువేందు అధికారి అంచెలంచెలుగా పైకి ఎదిగారు. ఆయన 1970 డిసెంబర్ 15న పూర్బ మేదినీపూర్‌లో బలమైన రాజకీయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు గాయత్రి అధికారి, శిశిర్ అధికారి. సోదరుడు దివ్యేందు అధికారి ఉన్నారు. సువేందు అధికారి రవీంద్ర భారతి యూనివర్సిటీ, సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఎంఏ పూర్తిచేశారు. 2021లో నందిగ్రామ్‌లో, 2026లో భవానీపూర్‌లో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని ఓడించి, సంచలనం సృష్టించారు. మొదటిసారి 1,956 ఓట్లు, రెండోసారి 15,105 ఓట్ల తేడాతో మమతను ఓడించడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది. 2026 ఎన్నికల్లో భవానీపూర్లోపాటు నందిగ్రామ్‌లోనూ పోటీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పబిత్ర కర్‌పై 9,665 ఓట్ల తేడాతో గెలిచారు. సువేందు అధికారి అవివాహితుడు. ఒకప్పుడు మమతా బెనర్జీకి వీర విధేయుడు, నమ్మిన బంటు అయిన సువేందు చివరికి ఆమెకు ప్రత్యర్థిగా మారడం, వరుసగా రెండు ఎన్నికల్లో ఓడించడం ఒక వైచిత్రి. తృణమూల్ కాంగ్రెస్‌లో నంబర్–2 సువేందు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో మంచి అనుబంధం ఉంది. ఆయన తొలుత కాంగ్రెస్‌లో చేరారు. 1995లో కాంతీ మున్సిపాల్టీ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అనంతరం 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. సువేందు తండ్రి శిశిర్ అధికారి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. యూపీఏ–2 ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సువేందు సైతం 2009, 2014లో తామ్లుక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారు. 2007లో నందిగ్రామ్‌లో భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలోనే కీలక నేతగా గుర్తింపు పొందారు. 2016లో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ తర్వాత నంబర్–2గా మారారు. బెంగాల్లో పార్టీని విస్తరించడంతో ఆయనదే కీలక పాత్ర. పార్టీలో ముఖ్యమైన బాధ్యతలను మమతా బెనర్జీ తన విశ్వాసపాత్రుడైన సువేందుకు అప్పగించేవారు. మమత మేనల్లుడి పెత్తనాన్ని సహించలేక.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి మారిపోయింది. అతడి పెత్తనం పెరిగిపోవడం, సువేందు అధికారి ప్రాధాన్యం క్రమంగా తగ్గడం మొదలైంది. అభిషేక్ ఆధిపత్యాన్ని ఆయన పలుమార్లు ప్రశ్నించారు. ఇరువురి మధ్య విభేదాలు ముదిరాయి. మమతా బెనర్జీ సైతం మేనల్లుడికే వత్తాసు పలకడాన్ని సహించలేకపోయారు. 2020 నవంబర్ 27న మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా సమరి్పంచారు. 2020 డిసెంబర్ 17న తృణమూల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇకపై పార్టీలో ఉండలేనని స్పష్టంచేశారు. డిసెంబర్ 19న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ పార్టీలో సీనియర్ నాయకుల ఆధిపత్యాన్ని తట్టుకొని తన బలం పెంచుకున్నారు. పార్టీలో జూనియర్ నేత అయినప్పటికీ బీజేపీ అధిష్టానం మెప్పు పొందారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి కంటిలో నలుసులా మారారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 207 స్థానాలు గెల్చుకొని తిరుగులేని విజయం దక్కించుకుందంటే దాని వెనుక సువేందు అధికారి పాత్ర మరువలేనిది. ఆయన కృషిని, పట్టుదలను బీజేపీ పెద్దలు గుర్తించారు. అందుకే అధికార పీఠం అప్పగించారు. ముఖ్యమంత్రిగా సువేందును ఎంపిక చేయడాన్ని బీజేపీలో ఎవరూ ప్రశ్నించలేదు. సువేందుపై ఒక సందర్భంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2014 సెప్టెంబర్‌లో శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో సీబీఐ ప్రశ్నించింది. -
బెంగాల్ తొలి BJP ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
-
బెంగాల్ సీఎం ఎవరు..? అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్
-
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపికయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఎమ్మెల్యేలు ఆయనను ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నుకున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం శనివారం (రేపు) అధికారంలోకి రానుంది. రేపు ఉదయం 11 గంటలకు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ కోల్‌కతాలో పర్యటించి, బీజేపీకి చెందిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ న్యూటౌన్‌లోని బిస్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ వర్గాల ప్రకారం, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనుండగా, ఇద్దరు మహిళలకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించే నిర్ణయం తీసుకున్నారు.బెంగాల్లో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నందిగ్రామ్, భవానిపూర్ రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. భవానిపూర్‌లో 15 వేల ఓట్ల మెజార్టీతో మమతా బెనర్జీని ఓడించారు.కౌన్సిలర్ టూ సీఎంసువేందు అధికారి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ‘జెయింట్ కిల్లర్’గా పేరుపొందిన నేత. ఆయన కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తృణమూల్ కాంగ్రెస్ ద్వారా ఎదిగి, చివరికి బీజేపీలో చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.జననం: 15 డిసెంబర్ 1970, కార్కులి గ్రామం, పూర్బ మెదినిపూర్, పశ్చిమ బెంగాల్తల్లిదండ్రులు: సిసిర్ అధికారి (మాజీ యూనియన్ మంత్రి, ఎంపీ), గాయత్రి అధికారివిద్య: 2011లో రబీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారువివాహం: అవివాహితుడురాజకీయ ప్రస్థానం1995: కాంగ్రెస్‌లో కాంతి మునిసిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు1998: తండ్రితో కలిసి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు2006: కాంతి దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, అదే సంవత్సరం కాంతి మునిసిపాలిటీ చైర్మన్‌గా కూడా అయ్యారునందిగ్రామ్ ఉద్యమం2007: నందిగ్రామ్‌లో భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారుటీఎంసీకి ప్రజాదరణ తెచ్చారుఈ ఉద్యమం మమతా బెనర్జీని రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు తెచ్చిందితృణమూల్ కాంగ్రెస్‌లో ఎదుగుదల2009: తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు2014: మళ్లీ తమ్లుక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు2016: నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మమతా బెనర్జీ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు2018–2020: నీటి వనరులు, సాగు శాఖ మంత్రిగా కూడా పనిచేశారుబీజేపీలో చేరిక2020 నవంబర్–డిసెంబర్: టీఎంసీ నుంచి రాజీనామా చేసి, 19 డిసెంబర్ 2020న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారుకారణం: మమతా బెనర్జీ వారసుడిగా అభిషేక్ బెనర్జీని ముందుకు తేవడంపై విభేదాలుఎన్నికల విజయాలు2021: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు2026: నందిగ్రామ్, భవానిపూర్ రెండింటిలోనూ గెలిచి, మమతా బెనర్జీని ఆమె స్వస్థల నియోజకవర్గంలో ఓడించారుఇది 1967 తర్వాత మొదటిసారి ఒకే వ్యక్తి రెండు నియోజకవర్గాల్లో గెలిచి, సిట్టింగ్ సీఎంను ఓడించిన ఘట్టంముఖ్య పదవులు2009–2016: లోక్‌సభ సభ్యుడు (తమ్లుక్)2016–2020: పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో రవాణా, నీటి వనరులు శాఖలు2020–2021: జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్2021–2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత2026 నుంచి: పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిజెయింట్ కిల్లర్ అనే బిరుదు: మమతా బెనర్జీని నందిగ్రామ్ (2021), భవానిపూర్ (2026)లో ఓడించడం వల్ల ఈ పేరు వచ్చింది.నైపుణ్యం: గ్రామీణ స్థాయిలో బలమైన కేడర్ నిర్మాణం, ఉద్యమాల ద్వారా ప్రజల్లో ప్రభావం చూపడం ఆయన ప్రత్యేకత.బీజేపీ తొలి సీఎం: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి చెందిన మొదటి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. -
గతంలోనూ ముగ్గురు సహాయకులను కోల్పోయిన సువేందు
బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ దుండగుల కాల్పుల్లో ప్రాణాల కోల్పోయిన విషయం తెలిసిందే. సువేందు అధికారి తన సహాయకులను కోల్పోవడం ఇది మొదటిసారి కాదు. 13 ఏళ్లలో సువేందు అధికారి ముగ్గురు సహాయకులను కోల్పోయారు.ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. చంద్రనాథ్ రథ్‌ది రాజకీయ హత్య అని ఆయన అంటున్నారు. గతంలో మృతి చెందిన సువేందు అధికారి సహాయకుల వివరాలు చూద్దాం..2013: వ్యక్తిగత సహాయకుడి మరణంఇలాంటి తొలి ఘటన 2013లో జరిగింది. సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ప్రదీప్ ఝా, పూర్బా మెదినిపూర్ జిల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అయితే, ఆ సమయంలో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాజకీయ వివాదంగా మారలేదు. దర్యాప్తు అధికారులు కూడా నేర కోణాన్ని నిర్ధారించలేదు.2018: విగత జీవిగా భద్రతా అధికారిసువేందుకు 2018లో వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేసిన రాష్ట్ర సాయుధ పోలీసు కానిస్టేబుల్ శుభబ్రత చక్రవర్తి.. పూర్బా మెదినిపూర్‌లోని కాంతి పోలీసు బ్యారక్‌లో విగతజీవిగా కనిపించారు. తన సర్వీస్ రివాల్వర్‌తో తానే కాల్చుకున్నారని చెబుతూ పోలీసులు మొదట దీన్ని ఆత్మహత్యగా పరిగణించారు. 2021లో చక్రవర్తి భార్య ఈ ఘటనపై మళ్లీ దర్యాప్తు కోరడంతో కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. తరువాత పశ్చిమ బెంగాల్ సీఐడీ మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. ఘటన స్థలాన్ని పునర్నిర్మించి, మొదటి దర్యాప్తుతో సంబంధం ఉన్న పలువురు పోలీసులను ప్రశ్నించింది. ఈ పరిణామంతో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య రాజకీయ ఘర్షణ పెరిగింది. కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఇరు పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నాయి.2021: వ్యక్తిగత సహాయకుడి మరణంసువేందుకు మరో వ్యక్తిగత సహాయకుడైన పులక్ లాహిరి 2021లో అసాధారణ పరిస్థితుల్లో మరణించినట్టు సమాచారం. నేరపూరిత కుట్ర జరిగిందని నిర్ధారించే తుది వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు.2026: చంద్రనాథ్ రథ్ మృతితాజా ఘటనలో సువేందుకు సన్నిహిత సహాయకుడైన చంద్రనాథ్ రథ్‌ను కాల్చిచంపారు. రాజకీయ లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తూ, నిష్పక్షపాత దర్యాప్తు కోరుతున్నారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సీఎం కుర్చీపై సువేందు సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని భవానీపూర్‌లో 15 వేల ఓట్ల తేడాతో ఓడించి, నందిగ్రామ్‌లో ముచ్చటగా మూడోసారి అఖండ విజయం సాధించిన ఆయన.. ఈ రెండు స్థానాల్లో దేనిని వదులుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా నందిగ్రామ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.పార్టీ నిర్ణయమే శిరోధార్యంఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి నందిగ్రామ్‌లో అడుగుపెట్టిన సువేందు అధికారికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ‘మీరు నందిగ్రామ్ ముద్దుబిడ్డ, మీరే మా సీఎం’ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలపై స్పందించిన సువేందు.. అది తాను తీసుకునే నిర్ణయం కాదని, పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ‘నేను క్రమశిక్షణ గల కార్యకర్తను, అవసరమైతే నా అభిప్రాయం చెబుతాను.. కానీ సొంత నిర్ణయాలు తీసుకోను. మరో పది రోజుల్లో ఒక స్థానాన్ని వదులుకోవాల్సిందే. కానీ భవానీపూర్, నందిగ్రామ్ ప్రజల పట్ల నా బాధ్యతను ఎప్పటికీ విస్మరించను’ అని ఆయన పేర్కొన్నారు.పాత కేసుల రీఓపెన్.. కఠిన చర్యలుగత రెండు దశాబ్దాలుగా భూసేకరణ ఉద్యమాల నుండి నందిగ్రామ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన, తన కుటుంబం ఎదుర్కొన్న వేధింపులను సభలో ప్రస్తావించారు. ‘2011 మార్పులో నేను భాగమయ్యాను, ఇప్పుడు నిజమైన మార్పులో ఉన్నాను. మా 90 ఏళ్ల తండ్రిని సీఐడీ విచారణ పేరుతో వేధించారు. నా ఆఫీసుకు 150 మంది పోలీసులను పంపారు. గతంలో జరిగిన అకృత్యాలపై విచారణ కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, నేరస్థులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని సువేందు హెచ్చరించారు.ఆరు నెలల్లో నందిగ్రామ్ రూపురేఖలు మార్చేస్తానందిగ్రామ్ అభివృద్ధికి తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని సువేందు హామీ ఇచ్చారు. నందిగ్రామ్-I లో ఏడాదికి రెండు పంటలు పండేలా చూస్తానని, హల్దియా-నందిగ్రామ్ వంతెనను నిర్మిస్తానని తెలిపారు. గోకుల్‌నగర్‌లో పాఠశాల, సోనాచురాలో ఐటీఐ ఏర్పాటుతో పాటు వేరే ఆసుపత్రులకు రిఫర్ చేసే పరిస్థితి లేకుండా నందిగ్రామ్ ఆసుపత్రిని ఆధునికీకరిస్తామన్నారు. ఆరు నెలల్లో ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ అందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని, ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ, నూతన బెంగాల్‌ను నిర్మిస్తామని సువేందు అధికారి పేర్కొన్నారు. -
కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం..కాబోయే సీఎం ఆస్తుల చిట్టా!
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తరువాత బీజేపీ నాయకుడు సువేందు అధికారి పేరు సీఎం రేసులో ప్రముఖంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలు, క్రిమినల్ కేసులపై చర్చ జోరుగా నడుస్తోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. సువేందు అధికారి నికర ఆస్తుల విలువ రూ. 85.87 లక్షలు. సొంత కార్లూ లేవు. ఎటువంటి అప్పులు లేవు. చేతిలో ఉన్న నగదు రూ. 12 వేలు మాత్రమే.చరాస్తులు (Movable Assets) రూ.24.57 లక్షలు.14 బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.7.34 లక్షలు ఉన్నాయి.ఇక పెట్టుబడుల విషయానికి వస్తే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు రూ. 5.45 లక్షలు, కిసాన్ వికాస్ పత్రాలు రూ.2.60 లక్షలు, 6 ఎల్ఐసీ (LIC) పాలసీల విలువ రూ.7.71 లక్షలు. ఆయన పేరు మీద ఎటువంటి కార్లుగానీ, బంగారమూ కానీ లేదు. స్థిరాస్తుల విలువ మొత్తం రూ. 61.30 లక్షలు. ఇందులో పూర్బా మేదినీపూర్‌లో వ్యవసాయ భూమి (9.05 లక్షలు), వ్యవసాయేతర స్థలాలు (రూ. 27.50 లక్షలు), రూ.24.75 లక్షల విలువ చేసే మూడు నివాస గృహాలు/ఫ్లాట్లు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.17.38 లక్షలు. ఇది గత నాలుగేళ్లలో ఇది రెట్టింపు కావడం గమనార్హం క్రిమినల్ కేసులు : 29 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, అయితే దేనిలోనూ నేరం రుజువు కాలేదు. అఫిడవిట్ వివరాల ప్రకారం మమతా బెనర్జీతో పోలిస్తే సువేందు అధికారి ఆస్తులు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మమతా బెనర్జీకి ఎటువంటి స్థిరాస్తులు (భూమి లేదా ఇల్లు) లేనప్పటికీ, ఆమె వార్షిక ఆదాయం సువేందు అధికారి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఆమెకు వచ్చే రాయల్టీ, వడ్డీలు. ఇద్దరూ తమకు సొంత కార్లు లేవని అఫిడవిట్లో పేర్కొనడం విశేషం.కాగా సువేందు అధికారి ఇటీవల పశ్చిమ బెంగాల్లో రెండు (నందిగ్రామ్, భవానీపూర్) అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. భవానీపూర్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 15,105 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల తరువాత బెంగాల్లో తీవ్ర హింస చెలరేగింది. తాజాగా సువేందు పీఏను చంద్రనాథ్ రథ్‌ను కొంతమంది దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపడం ఆందోళన రేపింది. -
బాంబుల మోత.. ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు
పానిహటి: పశ్చిమ బెంగాల్‌లోని పానిహటి ప్రాంతంలో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. రాజకీయ కక్షల నేపథ్యంలో వరుస దాడులతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. బీజేపీ కీలక నేత సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడైన చంద్రనాథ్ రత్ బుధవారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ నెత్తుటి మరకలు ఆరకముందే, కొన్ని గంటల వ్యవధిలోనే పానిహటిలో గురువారం ఉదయం నాటు బాంబుల మోత మోగింది. ఈ బాంబు దాడిలో ముగ్గురు బీజేపీ మద్దతుదారులు తీవ్రంగా గాయపడటంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.సెయింట్ జేవియర్స్ స్కూల్ వద్ద కలకలంబుధవారం రాత్రి చంద్రనాథ్ రత్ తుపాకీ తూటాలకు బలైన ఘటన మరువక ముందే, గురువారం పానిహటిలోని సెయింట్ జేవియర్స్ స్కూల్ సమీపంలో ఒక బాంబు భారీ శబ్దంతో పేలింది. స్కూల్ వద్ద ఈ పేలుడు జరగడంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో అక్కడే ఉన్న ముగ్గురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడటం ఉద్రిక్తతను మరింత పెంచింది.ఆస్పత్రికి క్షతగాత్రులుబాంబు దాడిలో రక్తమోడుతూ పడి ఉన్న ఆ ముగ్గురిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని సాగర్ దత్తా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, పేలుడు జరిగిన ప్రదేశం ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అభయ తల్లి నివాసానికి అతి సమీపంలో ఉంది. ఈ ఘటన వెనుక ఉన్న కుట్ర కోణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రంగంలోకి పోలీసు బలగాలుహత్య, ఆ తర్వాత వెంటనే జరిగిన బాంబు పేలుడు ఘటనలతో పానిహటి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే భారీ సంఖ్యలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితి చేజారకుండా అదుపులోకి తెచ్చిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నేరస్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
బెంగాల్ లో మళ్లీ హింస.. సువేందు అధికారి పీఏ హత్య
-
కోల్‌కతా సమీపంలో కాల్పులు.. సువేందు అధికారి పీఏ హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యంగ్రామ్ ప్రాంతంలో ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో దారుణ హత్యకు గురయ్యారు. దోహారియా ప్రాంతంలో బుధవారం రాత్రి కారులో చంద్రనాథ్ రథ్ ప్రయాణిస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. అత్యంత దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో రథ్‌తో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రథ్‌ను, డ్రైవర్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రథ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ సంఘటన బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన రెండు రోజులకే చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మధ్యంగ్రాం నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి రథిన్ ఘోష్, ఇతను బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాడు. ఆయన 2,399 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే తరుణ్‌జ్యోతి తివారీ మాట్లాడుతూ, ‘మేము నిరంతరం శాంతిని కోరుకుంటున్నాం, కానీ టీఎంసీ ఈ దారుణానికి ఒడిగట్టి అతిపెద్ద తప్పు చేసింది’.. అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరగడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితులను గుర్తించేందుకు, హత్యకు గల కారణాలను విశ్లేషించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ అనుచరులుగా నటిస్తూ హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో సువేందు అధికారి, భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడించి 'జెయింట్ కిల్లర్' అనే పేరును సంపాదించారు. దాంతో సువేందు అధికారిని ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. -
ముస్లిం ఓట్లన్నీ టీఎంసీకే : కాబోయే సీఎం సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో అఖండ విజయం తరువాత బీజేపీనేత కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న సువేందు అధికారి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్, భవానిపూర్, రెండింటిలోనూ విజయం సాధించిన తరువాత ముస్లిం ఓటర్లనుద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం కలవరం రేపుతోంది.నందిగ్రామ్‌లో తన గెలుపునకు హిందూ ఓటర్ల బలమైన మద్దతే కారణమని సువేందు అధికారి పేర్కొంటూ, తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈసారి తాను దాదాపు పదివేల ఓట్ల తేడాతో ఎన్నికల్లో గెలిచాననీ, ఇవన్నీ హిందువుల ఓట్లేనని వారే తనను మళ్లీ గెలిపించారన్నారు.ఇది హిందుత్వ విజయం..అక్కడ ముస్లిం ఓట్లన్నీ టీఎంసీకే వెళ్లాయి, కనుక తనకు ఓటేసిన నందిగ్రామ్ హిందువుల కోసం పనిచేస్తానంటూ వ్యాఖ్యానించారు. #WATCH | Haldia, West Bengal: BJP leader and winning candidate from Bhabanipur and Nandigram seat, Suvendu Adhikari says, "...This time I won the election with almost ten thousand votes. The Hindu people of Nandigram made me win again. There, the entire Muslim vote went to TMC...… https://t.co/VTjw3JrW93 pic.twitter.com/8uOh5qEtyI— ANI (@ANI) May 4, 2026 "హిందూ EVM అంటే బీజేపీ, ముస్లిం EVM అంటే TMC" అని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. ఇక మమతా రాజకీయ సన్యాసం తీసుకోవాలిన, ఆమెను ప్రజలు తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఈ అవినీతి, కుటుంబ ఆధారిత పార్టీకి ఎలాంటి సిద్ధాంతం లేదు. టీఎంసీ 24 గంటల్లో నాశన మవుతుంది, అంతమైపోతుందన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన పనులను పూర్తి చేస్తామని హామీ వచ్చారు. కాగా గతంలో కూడ బీజేపీ నినాదమైన 'సబ్కా సాథ్, సబ్కా వికాస్'ను పక్కనపెట్టి, "మనతో ఉండేవారికే మనం తోడుంటాం"(జో హమారే సాథ్, హమ్ ఉన్కే సాథ్) అనే నినాదాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి వెళ్లగొడతామని, అలాగే "బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులను" తొలగించాలని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి? -
విజయ్, సువేందు సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. తమిళనాడులో దళపతి విజయ్ (టీవీకే), పశ్చిమ బెంగాల్లో బీజేపీ అగ్రనేత సువేందు అధికారి.. ఇద్దరూ చెరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 14 రోజుల్లో వీరు ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండటంతో, ఏ సీటును అంటిపెట్టుకోనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వీరి భవిష్యత్ వ్యూహాలపై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.సువేందు సంచలనం.. సీఎం రేసులో..పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీని భవానీపూర్ నియోజకవర్గంలో ఏకంగా 15,105 ఓట్ల భారీ తేడాతో ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా నందిగ్రామ్‌లోనూ 9,665 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. అయితే, ఆయన భవానీపూర్‌ను వదులుకుని, తన సొంత జిల్లా తూర్పు మేదినీపూర్‌లోని నందిగ్రామ్ స్థానాన్నే అంటిపెట్టుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మమతను రెండుసార్లు ఓడించిన ఘనత దక్కించుకోవడంతో ఆయన తదుపరి సీఎం రేసులో ముందున్నారు. మే 9న జరగనున్న ప్రమాణస్వీకారానికి పరిశీలకునిగా అమిత్ షా వ్యవహరించనున్నారు.చెన్నైకే విజయ్ ఓటు.. పెరంబూర్ ఫిక్స్తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్.. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ రెండు చోట్లా ఘన విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి ఆర్డి శేఖర్‌పై పెరంబూర్‌లో 53,715 ఓట్ల మెజారిటీతో నెగ్గగా, తిరుచిరాపల్లిలో 27,416 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే విజయ్ తన సొంత ప్రాంతమైన చెన్నైలోని పెరంబూర్ స్థానాన్ని అంటిపెట్టుకుని, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.బైపోల్స్ కోసం దళపతి మాస్టర్ స్ట్రోక్మధ్య, దక్షిణ తమిళనాడులో పార్టీ ప్రభావాన్ని విస్తరించాలనే వ్యూహంతోనే విజయ్ తొలుత తిరుచిరాపల్లి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆ స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుండటంతో, త్వరలో జరిగే ఉపఎన్నికలో అక్కడ మాజీ ఐఏఎస్ అధికారి యు సహాయంను బరిలోకి దించే అవకాశాన్ని టీవీకే అధిష్టానం పరిశీలిస్తోంది. టీవీకే ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కొత్తవారు కావడంతో పరిపాలనా అనుభవం కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం విజయ్‌దేనని పార్టీ నేతలు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ‘కమల’ వ్యూహం: బెంగాల్ రిపీట్.. పంజాబ్ డిలీట్! -
బెంగాల్ పీఠంపై కూర్చునేది ఎవరు?
కమ్యూనిస్టుల కంచుకోటలను బద్దలుకొట్టి 15ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా పశ్చిమబెంగాల్‌ను ఏలిన మమతాబెనర్జీని ఘోరంగా ఓడించి ఇంటికి సాగనంపిన కమలనాథుల్లో ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చిలో ఆసీనులవుతారనే ప్రశ్న తలెత్తింది. ఆ కుర్చీకి తామే అర్హులమంటూ రాష్ట్ర ముఖ్యనేతలు బీజేపీ అధిష్టానం వద్ద వాదనలు గట్టిగా విన్పిస్తున్నారు. వీరి వాదనల్లో ఎవరి వాదనకు అగ్రనేతలు మోదీ, అమిత్‌షా ద్వయం సమ్మతి తెలుపుతుందో త్వరలో తేలిపోనుంది.అయితే మమతను ఒంటిచేత్తో మట్టికరిపించిన రాష్ట్ర రాజకీయ దురం«ధరుడిగా ఘనత సాధించిన సువేందు అధికారికే సీఎం పీఠం దక్కే అవకాశముందని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే గుజరాత్ మొదలు మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్దాకా ప్రతిసారీ కొత్త ముఖాలకు అవకాశమిచి్చన బీజేపీ అధిష్టానం ఈసారి పశ్చిమబెంగాల్లోనూ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే ఆస్కారముందనే వాదనా తెరమీదకొచి్చంది. ఈ నేపథ్యంలో ఐదారుమంది నేతల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. వారి గురించి క్లుప్తంగా.. సువేందు అధికారి.. బెంగాల్లో అత్యధిక మందికి చిరపరిచితమైన నేత. గతంలో మమతాబెనర్జీకి కుడిభుజంగా ఉంటూ నందిగ్రామ్‌లో రైతు ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నేత తర్వాత టీఎంసీకి తిలోదకాలిచ్చి కమలదళంలో చేరి కీలక నేతగా ఎదిగారు. గతంలో నందిగ్రామ్‌లో మమతను ఓడించి ఈసారి భవానీపూర్‌లోనూ మమతకు ఓటమి రుచిచూపించారు. క్షేత్రస్థాయిలోనూ పార్టీపై పట్టుసాధించిన సువేందుకు సీఎం అయ్యే అవకాశాలు మిగతావారికంటే మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నారదా స్టింగ్ ఆపరేషన్ ఉదంతంలో లంచం తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కి పరువుపోగొట్టుకున్నారు. సమిక్ భట్టాచార్య ఆర్ఎస్ఎస్ మూలాలున్న భట్టాచార్య ఇటీవలే పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు ఆరంభించారు. ఎన్నికల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. అగ్రనేతల సుడిగాలి పర్యటనలను సమన్వయంచేసుకుంటూనే సొంతంగా పలు ప్రచారకార్యక్రమాల్లో పాల్గొని టీఎంసీపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించి ప్రజల్లో గుర్తింపుపొందారు. పార్టీలో నేతలను ఏకతాటి మీదకు తీసుకురావడంలో దిట్టగా పేరొందారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల్లోనూ పార్టీని విస్తరింపజేసే సత్తా ఈయనకు ఉందని అగ్రనాయకత్వంలోనూ ఈయన మంచిపేరు సంపాదించారు. ఈయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే మాటా విన్పిస్తోంది. అగ్నిమిత్ర పాల్ గతంలో వృత్తిరీత్యా ఈమె ఒక ఫ్యాషన్ డిజైనర్. బెంగాల్లో ముందంజలో ఉండి పార్టీని నడిపించే క్రియాశీలక మహిళా నేతల్లో ఈమె కూడా ఒకరు. బీజేపీ మహిళా మోర్చాకు గతంలో అధ్యక్షురాలిగా సేవలందించారు. తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అసన్సోల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి గతంలో పట్టభద్రురాలైన ఈమె తరచూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రూపా గంగూలీ దిగ్గజ నిర్మాత, స్క్రీన్రచయిత బీఆర్ చోప్రా తెరకెక్కించిన అద్భుత సీరియల్ ‘మహాభారత్’లో ద్రౌపది పాత్రతో యావత్ భారతానికి చిరపరిచితమైన నటి రూపా గంగూలీ. బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. తర్వాత సోనానూర్ దక్షిణ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గంలో ఓటర్లకు అందుబాటులో ఉంటూ మంచి పేరుతెచ్చుకున్నారు. బెంగాల్ బీజేపీ మహిళా మోర్చాకు అధ్యక్షురాలిగా రెండేళ్లు సేవలందించారు. ఆకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. దిలీప్ ఘోష్ బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా పేరొందారు. గతంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2021లో పార్టీ టీఎంసీకి గట్టిపోటీ ఇవ్వడంలో సఫలీకృతమయ్యారు. ఆనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమంటే వామపక్షలు, కాంగ్రెస్ కాదు అని బీజేపీయే ప్రజల పక్షాన పోరాడుతోందని నిరూపించే ప్రయత్నంచేశారు. తక్కువకాలంపాటే బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్‌గా కొనసాగినా వ్యవహారాలను చక్కబెట్టడంలో తనదైన ముద్రవేశారు. సీఎం రేసులో తానూ ముందంజలో ఉన్నానని నిరూపించుకున్నారు. గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. 12 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కష్టపడిపనిచేసి త్వరగానే రాష్ట్ర చీఫ్ స్థాయికి ఎదిగారు. అయితే వాచాలత్వంతో తరచూ వివాదాస్పద వ్యాఖ్యానాలుచేస్తూ అప్రతిష్ట తెచ్చుకోవడం ఈయనకు రివాజుగా మారింది. అయినాసరే రాజకీయ చతురతతో నెగ్గుకురాగల సమర్థుడని ఆయనకుపేరుంది. సువేందుకు ఈయన ఒక్కరే గట్టిపోటీ ఇచ్చే అవకాశముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మమత వ్యాఖ్యలపై సువేందు అధికారి స్పందన
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో తాము ఓడిపోలేదని, నైతికంగా తామే గెలిచామని, సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి స్పందించారు. సీఎం పదవికి మమత రాజీనామా చేయనంటే కుదరదని సువేందు అధికారి పేర్కొన్నారు. రాజ్యాంగంలో ప్రతీది రాసి ఉందని, ఓడిపోయాక రాజీనామా చేయనంటే సాధ్యమయ్యే పనినే అంటూ ప్రశ్నించారు. మమత వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని సువేందు అధికారి తెలిపారు. కాగా, బెంగాల్లో నైతిక విజయం తమదేనని అన్నారు మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌భవన్‌కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్‌కతా నుంచి ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. 100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు’ అంటూ ధ్వజమెత్తారు. -
భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి
కోల్‌కతా: భవానీ పూర్లో సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత సువేందు అధికారి విజయం సాధించారు. మమతాపై సువేందు అధికారి 10,994 ఓట్ల తేడాతో గెలుపొందారు.ఈ సందర్భంగా తన ఓటమిపై మమతా బెనర్జీ స్పందించారు. సర్పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలిచ్చింది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను నిలిపివేశారు. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ ఏంజెట్లను కొడుతున్నారు. టీఎంసీ ఏంజెట్లలో ఎవరినీ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వడం లేదు. పార్టీ ఏజెంట్లను అనుమతి ఇస్తామని డీవో హామీ ఇచ్చారు. పార్టీ ఏజెంట్లు వచ్చిన తర్వాత డీవో ఇక్కడ లేరు అని వాపోయారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన రెండవ సీఎంగా మమతా బెనర్జీ అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ఇటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఉన్నారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు. తాజా ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో మమతను ఓడించారు సువేందు అధికారు. దీదీ ఓటమితో టీఎంసీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. -
బెంగాల్ ఫలితాలపై సువేందు అధికారి రియాక్షన్
-
‘ప్రజాశక్తి విజయం సాధించింది’.. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీదీ నాలుగోసారి అధికారంలోకి వస్తారా? బీజేపీ టీఎంసీకి చెక్ పెడుతుందా? అనేది తేలిపోనుంది. మొత్తం 294 స్థానాల్లో అధికారం కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 148. అయితే ఫాల్తా రీపోలింగ్ నేపథ్యంలో.. ఆ సంఖ్య 293-147గా మారింది.ప్రజాశక్తి విజయం సాధించింది.. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ బెంగాల్ ప్రజల ఆకాంక్షలను మేం నెరవేరుస్తాంపశ్చిమ బెంగాల్లో కమలం వికసించింది 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ప్రజాశక్తి విజయం సాధించింది బీజేపీ సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రతి ఒక్కరికీ నేను నమస్కరిస్తున్నాను ప్రజలు బీజేపీకి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా పార్టీ సాధ్యమైన ప్రతిదీ చేస్తుందని నేను హామీ ఇస్తున్నానుబెంగాల్ ఫలితాలపై స్పందించిన మమత ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్లను దొంగిలించింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ హవామెజార్టీ మార్క్ దాటిన కమలంబీజేపీ ఓట్లు దొంగలించింది: మమతా బెనర్జీఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంపై స్పందించిన మమతా బెనర్జీటీఎంసీ శ్రేణులకు కీలక సూచనలు ఈ ఫలితాలు చెంది నిరాశ చెందొద్దుమూడు రౌండ్ల కౌంటింగే జరిగిందికౌంటింగ్ నిలిపివేశారు70 స్థానాల్లో కౌంటింగ్‌పై ఈసీ అప్డేట్ ఇవ్వడం లేదుతుది ఫలితాల్లో మనదే విజయంతొందరపడి కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లొద్దుబీజేపీ ఓట్లు దొంగిలిస్తోందిబెంగాల్లో కమల వికాసంభారీ ఓటమి దిశగా తృణమూల్ కాంగ్రెస్193 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ97 స్థానాల్లో టీఎంసీకాంగ్రెస్ 1, సీపీఎం 2 స్థానాల్లో ఆధిక్యంబెంగాల్ విజయోత్సవాల్లో మోదీసాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీపశ్చిమ బెంగాల్ సహా అస్సాంలో బీజేపీ క్లీన్‌స్వీప్ పుదుచ్చేరి(కేంద్రపాలిత ప్రాంతం)లో ఎన్డీయే కూటమి ఘన విజయంవిజయోత్సవాల్లో పాల్గొననున్న మోదీ బెంగాల్లో కమల వికాసంతృణమూల్ చేజారిన పశ్చిమ బెంగాల్విజయం దిశగా దూసుకెళ్తున్న బీజేపీఇప్పటికే 150+ స్థానాల్లో స్పష్టంగా కొనసాగుతున్న లీడ్125 స్థానాల ఆధిక్యంలో టీఎంసీలెఫ్ట్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంఇతరులు ఒక స్థానంకాంగ్రెస్ ఆధిక్యం జీరో అనూహ్య విజయ దిశగా బీజేపీబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంముస్లిం ప్రాబల్యం ప్రాంతాల్లో బీజేపీ అధిక్యంముస్లింలో చీలిక ఏర్పడిందని విశ్లేషకుల అభిప్రాయం.ఈ చీలిక ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్లో స్పష్టంగా.. దక్షిణ బెంగాల్, కూచ్ బెహర్‌లో మాత్రం టీఎంసీ వైపు మొగ్గునిరాశలో టీఎంసీ శ్రేణులుబెంగాల్ ఎన్నికల్లో ఓటమి దిశగా తృణమూల్ కాంగ్రెస్టీఎంసీ శ్రేణుల్లో తీవ్ర నిరాశబోసిపోతున్న టీఎంసీ కార్యాలయం కాళిఘాట్‌లోని మమత నివాసం వద్ద నిశబ్ద వాతావరణంమెజారిటీ లీడ్‌లో బీజేపీబెంగాల్లో 150 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం133 స్థానాల ఆధిక్యంలో టీఎంసీకాంగ్రెస్, సీపీఎం తలో మూడు చోట్ల లీడ్నాలుగోసారి సీఎం కావాలన్న మమతా బెనర్జీ ఆశలపై బీజేపీ నీళ్లుబెంగాల్లో కాషాయం జెండా రెపరెపలుసంబురాల్లో బీజేపీ శ్రేణులులీడ్లో ఆర్జీకర్ బాధితురాలి తల్లిఆధిక్యంలో రత్నా దేవనాథ్(54)దేశాన్ని కుదిపేసిన ఆర్జీకర్ హత్యాచార ఘటనఈ ఘటన బాధితురాలి తల్లే రత్నా దేవనాథ్ పనిహాతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీఆధిక్యంలో కొనసాగుతున్న రత్నా దేవనాథ్బెంగాల్లో బీజేపీ ఆధిక్యం142 సీట్లలో లీడ్‌లో బీజేపీ111 సీట్లలో టీఎంసీమూడు చోట్ల కాంగ్రెస్‌కు ఆధిక్యంలీడ్ ఖాతా తెరవని సీపీఎంబెంగాల్లో టఫ్ ఫైట్హోరాహోరీగా టీఎంసీ, బీజేపీ మధ్య పోరురెండో స్థానంలో కొనసాగుతున్న టీఎంసీమమతా బెనర్జీని దోబూచులాడుతున్న లీడ్కాసేపు దీదీ.. కాసేపు అధికారి సువేందు ఆధిక్యంలో.. భవానీపూర్‌లో రౌండ్ రౌండ్‌కీ మారుతున్న సీన్బెంగాల్ కౌంటింగ్‌లో మారుతున్న సీన్కొనసాగుతున్న ఈవీఎంల ఓటింగ్టీఎంసీ కంటే ఆధిక్యంలో బీజేపీ107 సీట్లలో టీఎంసీ, 127 స్థానాల్లో బీజేపీ లీడ్నాలుగు చోట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ భవానీపూర్‌లో వెనకంజలో మమతప్రారంభమైన ఈవీఎం కౌంటింగ్బెంగాల్లో ప్రారంభమైన ఈవీఎంల కౌంటింగ్మరో గంటలో ట్రెండ్స్ మొదలయ్యే చాన్స్ఫలితాలపై అప్పుడే రానున్న స్పష్టతటీఎంసీ శ్రేణుల మౌనంవెలువడుతున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుపోస్టల్లో బీజేపీకి ఆధిక్యంవెలవెలబోతున్న టీఎంసీ ఆఫీస్కాళీఘాట్ మమతా బెనర్జీ నివాసం వద్దా గంభీర వాతావరణం బెంగాల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్బెంగాల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుఆధిక్యంలో బీజేపీ.. 118 స్థానాల్లో లీడ్టీఎంసీ 107రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్ఖాతా తెరవని సీపీఎందీదీ వెనకంజ.. బీజేపీ కామెంట్బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలీడ్లో ఆ పార్టీ అగ్రనేతలువెనకంజలో మమతా బెనర్జీఇవి జనతా వర్సెస్ మమతా ఎన్నికలు :బీజేపీమమతా బెనర్జీపై జనాలకు ఉన్న కోపం విస్పష్టం :బీజేపీఆధిక్యంలో.. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంటీఎంసీ 108బీజేపీ 117కాంగ్రెస్ 5సీపీఎం 0ఇతరులు 0అధిర్ రంజన్ వెనుకంజమూడు దశాబ్దాల తర్వాత స్టేట్ పాలిటిక్స్‌లోకి అధిర్ రంజన్ రీఎంట్రీముర్షీదాబాద్ జిల్లా బరహంపూర్ నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ పోటీపోస్టల్ బ్యాలెట్లో వెనుకంజలో కాంగ్రెస్ సీనియర్ నేత వెనకంజలో మమతా బెనర్జీదీదీకి పోస్టల్ బ్యాలెట్లో షాక్వెనకంజలో కొనసాగుతున్న టీఎంసీ అధినేత్రిఅధికారి సువేందు ముందంజఆసక్తికరంగా భవానీపూర్ పోరుఇటు.. నందిగ్రాంలోనూ ఆధిక్యంలో సువేందుఆధిక్యంలోకి సువేందుభవానీపూర్లో ఆసక్తికరంగా పోరుతొలుత మమతా బెనర్జీకి ఆధిక్యంకాసేపటికే లీడ్‌లోకి వచ్చిన బీజేపీ అధికారి సువేందుఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ అగ్రనేతలు బెంగాల్లో హోరాహోరీపోస్టల్ బ్యాలెట్లో టీఎంసీ ముందంజస్వల్పంగా వెనకబడిన బీజేపీ106 స్థానాల్లో టీఎంసీ, 100 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలీడ్ ఖాతా తెరవని కాంగ్రెస్, లెప్ట్ పార్టీమరికాసేపట్లో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ఆధిక్యంలో మమతా బెనర్జీభవానీపూర్లో సీఎం మమతా బెనర్జీ ఆధిక్యంవెనుకబడిపోయిన బీజేపీ రాష్ట్ర చీఫ్ అధికారి సువేందుగత ఎన్నికల్లో ఇక్కడే దీదీని ఓడించిన సువేందుబీజేపీ అగ్రనేతల ముందంజబెంగాల్ ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలుపోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ అగ్రనేతల ముందంజబీజేపీ శ్రేణుల్లో సంబురాలు! పోస్టల్ బ్యాలెట్లో.. ఆసక్తికరంగా పోస్టల్ బ్యాలెట్టీఎంసీ-బీజేపీ హోరాహోరీమరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈవీఎం ఓట్ల లెక్కింపుమూడంచెల భద్రత నడుమ.. బెంగాల్ వ్యాప్తంగా మొదలైన ఓట్ల కౌంటింగ్ భద్రం కోసం మూడంచెల వ్యవస్థప్రశాంతంగా కౌటింగ్ ప్రారంభమైందన్న సిలిగురి కమిషనర్ సయ్యద్ వాకార్ రజా తనిఖీలు ముమ్మరంగా జరుగున్నాయని.. శాంతియుతంగా కౌంటింగ్ కొనసాగేలా చేస్తామని వ్యాఖ్య #WATCH | Siliguri, West Bengal | On the counting of votes, Siliguri Commissioner of Police (CP) Syed Waqar Raza says, "Everything will be done peacefully. All things are in proper order. Frisking is being done here, and there is a 3-tier security system, and we hope that… pic.twitter.com/4fiRZU0kE8— ANI (@ANI) May 4, 2026 ఆ స్థానంలో ఏం జరగనుందో?బెంగాల్లో హాట్ సీట్‌గా భవానీపూర్మమతా బెనర్జీ వర్సెస్ అధికారి సువేందుగత ఎన్నికల్లో గురువు మమతను ఓడించిన బీజేపీ సువేందుఈసారి తనదే గెలుపని సువేందు ధీమాప్రారంభమైన కౌంటింగ్పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైన కౌంటింగ్తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపుమమతా బెనర్జీ సంచలన ఆరోపణలుబెంగాల్ కౌంటింగ్ వేళ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలుపలు ప్రాంతాల్లో కరెంట్ కట్ చేస్తున్నారని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీటీవీలు పని చేయడం లేదన్న దీదీస్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు పలు వాహనాలు వచ్చి వెళ్లాయని ఆరోపణఈ చర్యల వెనుక బీజేపీ ఉందని మమతా బెనర్జీ వ్యాఖ్య అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ శ్రేణులకు పిలుపుఅనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచనమమత సూచనలతో రాత్రంతా స్ట్రాంగ్ రూమ్‌ల వద్దే పడిగాపులు కాసిన టీఎంసీ శ్రేణులుఅందరి చూపు బెంగాల్ వైపు.. కాసేపట్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంఅందరి చూపు పశ్చిమ బెంగాల్ వైపుటీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాలుగోసారి సీఎం అవుతారా?దీదీ విజయపరంపరకు, ఆధిపత్యానికి బీజేపీ చెక్ పెడుతుందా?ఎస్ఐఆర్(ఓట్ల తొలగింపు ప్రక్రియ) నేపథ్యంలో ఆసక్తికరం కానున్న ఫలితాలుజాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఫలితం కావడంతో ఉత్కంఠకౌంటింగ్ కోసం ఈసీ.. బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ కోసం ఈసీ భారీ ఏర్పాటుభారీగా నమోదైన పోలింగ్ శాతం77 ఓటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్75 వేల మంది భద్రతా సిబ్బందిఫాల్తాలో ఈ నెల 21న రీపోలింగ్.. 24 కౌంటింగ్మిగిలిన 293 స్థానాలకు ఇవాళ జరగనున్న కౌంటింగ్ -
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. మమతా బెనర్జీ ఓటమి ఖాయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానిపూర్ చక్రబేరియా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు, ఒకప్పుడు ఆమెకు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి ఒకే పోలింగ్ బూత్ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తమైంది.స్థానిక టీఎంసీ నాయకులను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీ కార్యాలయం బయట కూర్చుని ఉండగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సువేందు అధికారి ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. తనకి ఒక్క ఓటు పడటం లేదని మమతా బెనర్జీ గ్రహించారు’ అని ఆయన ఆరోపించారు. మరోవైపు మమతా బెనర్జీ, కేంద్ర బలగాలు, పోలీసు పరిశీలకులు, ఎన్నికల అధికారులను ఉపయోగించి బీజేపీ ఎన్నికలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.ఈ సందర్భంగా సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘మమతా బెనర్జీ భయపడుతున్నారు. ఆమె పోలీసుల స్థానంలో కేంద్ర బలగాలను నియమించారు. ఇక్కడ ఈసీ సీఏపీఎఫ్‌లను మోహరించింది. ఆమెకు ఏమైనా సమస్య ఉంటే వారిని సంప్రదించాలి. కానీ ఆమెతో పాటు 40-50 మందిని ఎందుకు తీసుకువస్తున్నారు?’అని ప్రశ్నించారు.అలాగే, సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ మమతా యాబై, అరవై మంది గూండాలతో తిరుగుతున్నారు. ఆమె ఒక అభ్యర్థి కాబట్టి బూత్‌లను సందర్శించవచ్చు. కానీ ఈ గూండాగిరి ఎందుకు? నేను కోల్‌కతా డీఈఓకు ఫిర్యాదు చేశాను. ఈసారి ఎవరినీ బెదిరింపులకు పాల్పడటానికి అనుమతించబోము’అని అన్నారు. ఆమెకు ఎవరూ ఓటు వేయడం లేదు. ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనివ్వాలి. నేను భవానిపూర్‌లో కనీసం 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను’అని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు.ఇక మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నేను చెట్లా, పద్మపుకూర్, చక్రబేరియా ప్రాంతాల్లోని బూత్‌లను సందర్శించాను. బీజేపీ ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయాలని చూస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు సాధారణంగా ప్రశాంతంగా జరుగుతాయి. ఇక్కడ గూండా రాజ్ ఉందా?’అని ప్రశ్నించారు. -
బెంగాల్‌ను ఏలేదెవరు? కూలేదెవరు?
ఉత్తర బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్‌తో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు, ఇవాళ దక్షిణ బెంగాల్లో రెండో విడతతో మరింత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. 142 నియోజకవర్గాల్లో 3 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ విడతలో భవానీపూర్ పోరు ప్రత్యేక ఆకర్షణ. మమతా బెనర్జీ (TMC) మరియు సువేందు అధికారి (BJP) మధ్య జరుగుతున్న ఈ పోటీ కేవలం ఒక నియోజకవర్గం పోరాటం కాదు. అది బెంగాల్ భవిష్యత్తు దిశను నిర్ణయించే ప్రతీకాత్మక యుద్ధంగా మారింది.సంక్షేమం Vs పరివర్తనం..ఇదే ఈ విడతలో ప్రధాన నినాదం. మమతా బెనర్జీ సంక్షేమ పథకాలతో గ్రామీణ మహిళల మద్దతు పొందుతుండగా బీజేపీ “మార్పు” వాగ్దానంతో ముందుకు వస్తోంది. మరోవైపు సర్ సమస్య (ఓటర్ల పేర్లు తొలగింపు) ప్రజల్లో ఆందోళన కలిగించి, అధిక ఓటర్ల హాజరుకు దారితీస్తోంది. కోల్‌కతా, హౌరా, హుగ్లీ, నాదియా, బర్దమాన్ జిల్లాల్లో కీలక పోటీలు జరుగుతున్నాయి. టీఎంసీ మంత్రులు తమ స్థానాలను కాపాడుకోవడానికి పోటీ పడుతుండగా బీజేపీ ఈ ప్రాంతాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 41,000కి పైగా పోలింగ్ కేంద్రాల్లో CAPF బలగాలు మోహరించబడ్డాయి. సున్నితమైన బూత్‌లలో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. తొలి విడతలో 93% పైగా ఓటింగ్ నమోదైన నేపథ్యంలో, రెండో విడతలో కూడా అధిక హాజరు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు మౌనంగా ఉన్నా, వారి ఓటు నిర్ణయం ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనుంది. మొత్తంగా, ఇవాళ జరుగుతున్న రెండో విడత పోలింగ్, బెంగాల్ ఎన్నికల తుది ఫలితాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. “ఏలేదెవరు? కూలెదెవరు?” అన్న ప్రశ్నకు సమాధానం దిశగా ప్రజాస్వామ్య యాత్ర కొనసాగుతోంది. -
29న కోల్‌కతాలో బిగ్గెస్ట్ ఫైట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. సత్యజిత్ రే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో ఉద్దండులకు నిలయమైన కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ‘భవానీపూర్’ నియోజకవర్గం ఇప్పుడు మహా సంగ్రామానికి వేదికగా మారింది. 2026, ఏప్రిల్ 29న జరగనున్న ఈ హై-వోల్టేజ్ ఎన్నికల్లో.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మాజీ ప్రియ శిష్యుడు, ప్రస్తుత బీజేపీ విపక్ష నేత సువేందు అధికారి మధ్య భీకర పోరు జరగనుంది. బెంగాల్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఈ స్థానంలో గెలుపు ఇరు పార్టీలకు జీవన్మరణ సమస్యగా పరిణమించింది.చారిత్రక వారసత్వం.. ఉద్దండుల నిలయందక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గానికి రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య పరంగా ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, దేశబంధు చిత్తరంజన్ దాస్, విద్యావేత్త అశుతోష్ ముఖర్జీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే, దిగ్గజ ఫిల్మ్ మేకర్స్ సత్యజిత్ రే, మృణాల్ సేన్, నటుడు ఉత్తమ్ కుమార్, గాయకుడు హేమంత్ కుమార్ వంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే నివసించారు. ఈ ప్రతిష్టాత్మక స్థానం ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య భీకర పోరుకు సాక్ష్యంగా నిలవనుంది. కాళీఘాట్ ఆలయం, గురుద్వారాలు, మసీదులు, బ్రిటిష్ కాలం నాటి చర్చిలతో కూడిన ఈ ప్రాంతం భిన్న సంస్కృతులకు సజీవ ప్రతీకగా నిలిచింది.సొంత గడ్డపై ‘దీదీ’ వర్సెస్ ‘బయటి వ్యక్తి’2011 నుంచి ఈ నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్న మమతా బెనర్జీ ఇక్కడి హరీష్ ఛటర్జీ వీధిలోనే నివసిస్తున్నారు. స్థానిక అశుతోష్ కళాశాలలో చదువుకున్న ఆమె కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సుపరిచితురాలు. ప్రచారంలో భాగంగా ఆమె తనకు తెలిసిన పాత పరిచయస్థులను పలకరిస్తూ, వీధుల్లో కలియతిరుగుతున్నారు. మరోవైపు నందిగ్రామ్ నుంచి వచ్చిన సువేందు అధికారి ఈ పాత కోల్‌కతా ప్రాంతంలో ‘బయటి వ్యక్తి’ అనే ముద్రను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఆయన దీదీని ఓడిస్తే, రాష్ట్రంలో బీజేపీ వెతుకుతున్న తిరుగులేని నాయకునిగా ఆయన అవతరిస్తారు.మమత ఓడిపోయే అవకాశం ఉందా?ఈసారి ఎన్నికల వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉందని స్థానికులు అంటున్నారు. ‘మమత ఇక్కడి నుంచి ఎప్పటికీ ఓడిపోరు. కానీ తొలిసారిగా నాన్-బెంగాలీ ప్రాంతాల్లో టీఎంసీకి వ్యతిరేకంగా బహిరంగ చర్చలు జరుగుతున్నాయి’ అని అదితి సర్కార్ అనే స్థానికురాలు అభిప్రాయపడ్డారు. అయితే మమత విద్యార్థి దశ నుంచి సాగిస్తున్న పోరాటాలను చూస్తున్నామని, ఆమె తమ ప్రాంతపు ఆడపడుచే అని స్థానిక కేఫ్ నిర్వాహకుడు అమోల్ సగర్వంగా చెబుతున్నారు. ఎవరి ధీమా వారికున్నా.. ఉత్కంఠ మాత్రం తారాస్థాయికి చేరుకుంది.కీలక సమస్యలు.. వ్యాపారుల ఆందోళనసరిహద్దు చొరబాట్లు, ఆర్జీ కర్ ఉదంతం, రాష్ట్ర ఆర్థిక మందగమనం లాంటివి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. 1953లో కచ్ నుంచి వలస వచ్చిన వ్యాపారి భరత్ మెహతా మాట్లాడుతూ.. ‘భవానీపూర్‌లో గెలవడం మమతకు ప్రతిష్టాత్మక సమస్య. సువేందు ఇక్కడ పోటీ చేసి తప్పు చేశారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల మమత మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. ఆర్థిక మందగమనం వల్ల బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్‌లకు ఇప్పటికే చాలా మంది వ్యాపారులు వలస వెళ్లిపోతున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.స్థానికత వర్సెస్ వలసదారుల విభజనఈ ఎన్నికల్లో బెంగాలీ, నాన్-బెంగాలీ విభజన స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలకు బెంగాల్ సురక్షితమైన ప్రాంతమని యువ ఓటరు, బ్యాంకర్ కరబి ఘోష్ బలంగా విశ్వసిస్తున్నారు. మమతా దీదీ తమకు ఎంతో సాయం చేశారని, తమ గురుద్వారాను సైతం సందర్శించారని ట్యాక్సీ డ్రైవర్ సుఖ్విందర్ సింగ్ కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు. కానీ బీహార్‌కు చెందిన మరో ట్యాక్సీ డ్రైవర్ రతన్ కుమార్ మాత్రం.. ‘మేము గతంలో తృణమూల్‌కే ఓటేశాం, కానీ ఈసారి ప్రజలు ‘పరివర్తన్’ (మార్పు) కోరుకుంటున్నారు’ అని అన్నారు.ఎన్నికల జ్వరంతో నిద్రలేని రాత్రులుపోలింగ్కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో భవానీపూర్ వీధులన్నీ రాజకీయ వేడితో మరింత హీటెక్కిపోతున్నాయి. పగటి ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు టీఎంసీ, బీజేపీ నాయకులు రాత్రి వేళల్లో సమావేశాలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాషాయ జెండాలతో సువేందు వర్గం, తమదైన శైలిలో దీదీ వర్గం ప్రచారాలు హోరెత్తిస్తుండటంతో ఈ ప్రాంతమంతా అర్ధరాత్రి వరకు కోలాహలంగా ఉంటోంది.ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే? -
నందిగ్రామ్ సెగలు: పోలీసులపై సువేందు ఫైర్
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. రాజకీయంగా కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోలీసులు.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేసిన సంచలన ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.పోలీసుల పక్షపాత వైఖరిపై ఫైర్తమ పోలింగ్ ఏజెంట్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని నందిగ్రామ్, భవానీపూర్ స్థానాల నుంచి బరిలో ఉన్న సువేందు అధికారి ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసుల తటస్థతపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా పింగ్లా పోలీస్ స్టేషన్ ఓసీ చిన్మోయ్ ప్రమాణిక్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఆయనను సస్పెండ్ చేసి, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) మనోజ్ అగర్వాల్, పోలీసు పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. VIDEO | West Bengal election: BJP candidate from Bhabanipur and Nandigram, Suvendu Adhikari, said,"Murder accused Sheikh Shahuddin is threatening voters. I am not afraid of anything. My fight is not against any religion. My fight is against the goons of TMC."… pic.twitter.com/z2EYl7Tmjs— Press Trust of India (@PTI_News) April 23, 2026‘ఆ గూండాలతోనే నా పోరాటం’ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని సువేందు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘హత్య కేసులో నిందితుడైన షేక్ షాహుద్దీన్ ఓటర్లను బెదిరిస్తున్నాడు. నేను దేనికీ భయపడను. నా పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదు, కేవలం టీఎంసీ గూండాలపైనే నా యుద్ధం’ అని ఆయన పేర్కొన్నారు. బిన్పూర్, ఖరగ్‌పూర్ లాంటి ఇతర ప్రాంతాల్లోనూ బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఏజెంట్లను బలవంతంగా తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి కూడా నందిగ్రామ్‌లో టీఎంసీ, బీజేపీ వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. -
యోగి, సువేందుల వైరల్ వీడియో.. ‘ఎంత భక్తో’
కోల్‌కతా: రాజకీయ వేదికలపై కనిపించే కొన్ని దృశ్యాలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విషయంలో బెంగాల్ ఫైర్ బ్రాండ్ నేత సువేందు అధికారి చూపిన అనూహ్య భక్తిభావం, అణకువ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.పశ్చిమబెంగాల్లోని కొంటాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభ ఈ ఆసక్తికర ఘట్టానికి వేదికైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ఇక్కడకు వచ్చారు. ఆయన వేదిక పైకి అడుగుపెట్టగానే సువేందు అధికారి వేగంగా వెళ్లి, కాషాయ కండువాతో స్వాగతం పలికారు. అంతేకాదు, ఏమాత్రం సంకోచించకుండా వేదికపైనే యోగి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. వెంటనే స్పందించిన యోగి ఆయనను ఆప్యాయంగా పైకి లేపి, చేయి పట్టుకుని అక్కడున్న ప్రజల వైపు తిరిగి అభివాదం చేశారు. ఈ క్షణాలను క్యాప్చర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఎంత భక్తో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Beautiful video ♥️Kanthi, West Bengal : Bengal LoP Suvendu Adhikari seeks blessings from UP CM Yogi Adityanath by prostrating in-front him and touching his feet.#BengalElections #BJP4Bengal pic.twitter.com/eUj1lPdOe9— Amitabh Chaudhary (@MithilaWaaala) April 12, 2026ఈ సభలో యోగి ఆదిత్యనాథ్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బెంగాల్ సంస్కృతిని, శాంతిభద్రతలను కాపాడటంలో టీఎంసీ సర్కార్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, భద్రత కోసం ఇక్కడ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, బీర్భూమ్ వంటి ప్రాంతాల్లో హిందువుల జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బెంగాల్లో దుర్గాపూజ, రామ నవమి ఊరేగింపులను అడ్డుకోవడాన్ని యోగి తప్పుబట్టారు. బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.ఇది కూడా చదవండి: Noida: కార్మికుల తిరుగుబాటు.. కలెక్టర్ కీలక నిర్ణయం! -
సువేందుకు అనుకూలం.. ఆయనను తొలగించండి: టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి(ఆర్వో)ను వెంటనే తొలగించాలని అధికార టీఎంసీ డిమాండ్ చేసింది. ఇదే నియోజకవర్గం నుంచి టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండటం తెల్సిందే. ఇక్కడి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఆర్వో సురాజిత్ రాయ్ సన్నిహితుడంటూ ఆరోపించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్‌కు శుక్రవారం ఒక వినతిపత్రం సమర్పించింది.ప్రస్తుత ఆర్వో రాయ్ గతంలో నందిగ్రామ్ నియోజకవర్గంలో బ్లాక్ అభివృద్ధి అధికారిగా ఉన్నప్పుడే సువేందుకు అనుకూలంగా బహిరంగంగానే వ్యవహరించినట్లు పేర్కొంది. అలాంటి అధికారిని సరిగ్గా ఎన్నికల వేళ ఆర్వోగా నియమించడం అనుమానాలకు తావిస్తోందని టీఎంసీ పేర్కొంది. ఈ నియామకం తటస్థ వైఖరికి భంగకరంగా ఉంటుందని పేర్కొంది. ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉందని తెలిపింది. -
మార్పునకు దగ్గరి దారి భవానీపూర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మార్పునకు సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీని ఓడించడమే దగ్గరిదారి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మమతకు పోటీగా బీజేపీ నేత సువేందు అధికారి భవానీపూర్‌లో గురువారం నామినేషన్ వేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావాలంటే 170 సీట్లను గెలుచుకోవడం ఒక ఎత్తయితే, భవానీపూర్‌లో సువేందు గెలవడం మరో ఎత్తుగా పేర్కొన్నారు. ఇక్కడ సువేందు విజయంతో రాష్ట్రంలో మార్పు దానంతటదే వస్తుందని పేర్కొన్నారు. కోల్‌కతాలోని హజ్రా నుంచి గురువారం మొదలైన సువేందు నామినేషన్ ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. ‘బెంగాల్లో మార్పు సంభవిస్తుంది. అయితే, ముందుగా భవానీపూర్‌లో మార్పు రావాలా? వద్దా? అంటూ ప్రజలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. ‘రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు మన అభ్యర్థిని సువేందు అధికారిని భారీ మెజారిటీతో గెలిపించాలని భవానీపూర్ ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నా’అని పేర్కొన్నారు. నందిగ్రామ్ నుంచే కాదు భవానీపూర్‌లో కూడా పోటీ చేసి మమతను ఓడించాలని సువేందును ఒప్పించానన్నారు. 2021లో మరోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సువేందు చేతిలో మమత ఓడారన్నారు. ఈసారి మాత్రం, రాష్ట్రంలో అధికారంతోపాటు భవానీపూర్‌లోనూ మమతా బెనర్జీ ఓటమి ఖాయమని అమిత్ షా ప్రకటించారు. ‘మోదీ జీ నాయకత్వంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. చొరబాటుదార్లను రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి వెళ్లగొట్టాలి’అని మంత్రి పేర్కొన్నారు. బెంగాల్ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందన్నారు. కాళీఘాట్ వద్ద హైటెన్షన్. బీజేపీ ర్యాలీలో జై శ్రీరాం, బీజేపీ జిందాబాద్, మమతా హటావో, బంగ్లా బచావో నినాదాలు భవానీపూర్‌లో మారుమోగుతున్న వేళ ర్యాలీ సీఎం మమతా బెనర్జీ నివాసమున్న కాళీఘాట్ సమీపానికి చేరుకుంది. అక్కడ టీఎంసీ మద్దతుదారులు పార్టీ జెండాలు చేబూని జోయ్ బంగ్లా, మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రెండు పార్టీల మద్దతుదారుల నడుమ కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. -
సిట్టింగ్‌లకు టీఎంసీ షాక్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అభ్యర్థుల జాబితాలో అనూహ్యంగా భారీ మార్పులకు తెరతీసింది. అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లకుగాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ మొత్తం ఎమ్మెల్యేల్లో మూడోవంతు మంది, 74 మందికి మొండి చేయి చూపింది. వరుసగా నాలుగోసారి అధికార పీఠం చేజిక్కించుకోవాలని లక్ష్యంతో ఉన్న ఆ పార్టీ..ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకే ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లుగా భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితాను టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసంలో మంగళవారం విడుదల చేశారు. డార్జిలింగ్ హిల్స్‌లోని మిగతా మూడు స్థానాలను మిత్రపక్షమైన భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చాకు వదిలిపెట్టారు.ముఖ్యంగా భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారిని నేరుగా ఢీకొనబోతున్నారు. 2007లో టాటా కంపెనీ భూసేకరణకు వ్యతిరేకంగా చేపట్టిన మమతా బెనర్జీ చేపట్టిన ఉద్యమానికి కేంద్రస్థానంగా నందిగ్రామ్ ఉంది. 2021 ఎన్నికల్లో ఇక్కడ మమతను సువేందు అధికారి 1,900 స్వల్ప ఓట్ల తేడాతో ఓడించారు. అనంతరం భవానీపూర్ నియోజ కవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మమత 58 వేల మెజారిటీతో గెలిచారు. తాజాగా, నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్‌లోనూ బీజేపీ నేత సువేందు పోటీకి దిగుతుండటం తెల్సిందే. దీంతో వీరిద్దరూ మళ్లీభవానీపూర్ వేదికగా ఢీకొననున్నారు. టీఎంసీకి ప్రస్తుతమున్న 224 మంది ఎమ్మెల్యేలకు గాను 135 మందికి మళ్లీ టికెట్ దక్కింది. వీరిలో 15 మందికి మాత్రం సీట్లను మార్చారు. 74 మందికి మొండిచేయి చూపారు. జాబితాలో 52 మంది మహిళలతోపాటు పిర్హాద్ హకీం, అనూప్ బిశ్వాస్, చంద్రిమా భట్టాచార్య, తదితర మంత్రులు కూడా ఉన్నారు. బీజేపీ కోసమే ఈసీ బదిలీలు: మమతఅభ్యర్థుల జాబితా విడుదల అనంతరం ప్రసంగించిన సీఎం మమత ఎన్నికల కమిషన్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ సహా పలువురు అధికారులను ఎన్నికల కమిషన్ ఉన్న ఫళంగా బదిలీ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈసీ ఈ బదిలీలన్నిటినీ కేంద్రంలోని బీజేపీ కోసమే చేసిందని ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో బదిలీల జాబితా తయారు కాగా, ఆ మేరకు ఈసీ అమలు పర్చిందని మమత విమర్శించారు. రాష్ట్రంలోకి బీజేపీ డబ్బు, ఆయుధాలను నిరాటంకంగా తరలించేందుకే బదిలీలు చేపట్టారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో బీజేపీకి సాయపడేలా రాష్ట్రం వెలుపలి నుంచి కూడా కొందరు అధికారులను తీసుకువచ్చారన్నారు. బీజేపీ తరపున తమాషా ఆట ఆడుతున్న ఈసీ నేరుగా బీజేపీ తరపునే ప్రచారం చేసుకోవచ్చు కదా అంటూ మమత ఎద్దేవా చేశారు. -
మమత Vs సువెందు : రసవత్తరంగా బెంగాల్ పోరు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆరంభంలోనే రసవత్తరంగా మారుతోంది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికలకు గాను అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మొత్తం 294 స్థానాలకు గాను 291 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 3 స్థానాలను డార్జిలింగ్ ప్రాంతంలో అనిత్ థాపా నేతృత్వంలోని BGPM పార్టీకి కేటాయించారు. ఈ మేరకు అభ్యర్థుల వివరాలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీ10 మంది మహిళలకు చోటివ్వగా టీఎంసీ లిస్టులో 52 మంది మహిళలు ఉన్నారు.సై అంటే సై అంటున్న దీదీబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన నియోజకవర్గమైన భవానీపూర్ నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సువేందు అధికారిపై తలపడేందుకు దీదీ సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడించిన సువేందు అధికారిపై ఆమె మరోసారి నేరుగా ఢీకొంటుండటం విశేషం. భవానీపూర్, నందిగ్రామ్ రెండింటి నుండి సువేందును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.గెలుపు మాదే దీదీ ధీమా: వరుసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తాము 226 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ ఎస్ఐఆర్పై ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని బీజేపీని తిప్పికొట్టి, తృణమూల్‌కు ఓటు వేసి గెలిపించాలని దీదీ విజ్ఞప్తి చేశారు. బెంగాల్ అస్థిత్వం కోసం జరిగే పోరు ఇది అని మమతా వ్యాఖ్యానించారు.కాగా 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన తర్వాత, మమత భవానీపూర్ ఉప ఎన్నిక ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశించారు. 2021లో TMC 213 సీట్లు సాధించగా, బీజేపీ 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ సారి ఎలామైనా మమతను ఓడించి బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటికే బీజేపీ 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 2021లో ఇలా2021 అసెంబ్లీ ఎన్నికలలో, టీఎంసీ 213 స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ గెలుపు సాధించింది. నందిగ్రామ్‌లో మమత ఓడిపోయినప్పటికీ టీఎంసీ తన స్థానాల సంఖ్యను రెండు పెంచుకుంది. 2016లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ 2021 లో 77 స్థానాలకు పుంజుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రచారంలోదూకుడుతోపాటు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్‌ల వైఫల్యం బీజేపీకి కలిసి వచ్చింది. -
బెంగాల్ ఎన్నికల పోరు.. ఎవరిది జోరు?
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారం మొదలుపెట్టేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ తరపున ప్రచారం సాగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రచార బాధ్యతను ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు. ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అయితే నిజంగానే ఆ పరిస్థితి ఉందా అంటే.. లేదనే అంటోంది తాజా సర్వే.మళ్లీ దీదీకే చాన్స్మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముందని 'ఓట్ వైబ్' సర్వే అంచనా వేసింది. దీని ప్రకారం 39.6 శాతం మంది ఓటర్లు దీదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. కమలం పార్టీకి ఓటు వేస్తామని చెప్పిన వారు 30.5 శాతం మంది మాత్రమే. నిమ్న వర్గాల నుంచి కాషాయ పార్టీకి ఎక్కువ మద్దతు లభించడం ఆసక్తికర పరిణామం. ఎస్సీ (50%), ఎస్టీ (38%), ఓబీసీ ఓటర్లలో (44%) అధిక శాతం బీజేపీ వైపు మొగ్గు చూపారు. మైనారిటీలు మమతా బెనర్జీ పార్టీకే జై కొట్టారు. ముస్లిం ఓటర్లలో 54 శాతం మంది తృణమూల్ వైపు నిలిచారు. హిందూ సాధారణ వర్గం ఓటర్లలో అత్యధిక మద్దతు కూడా తృణమూల్ కాంగ్రెస్‌కే దక్కడం విశేషం.ప్రభుత్వ పనితీరు.. ప్చ్బెంగాల్ యువత ఎక్కువగా బీజేపీకి మద్దతుగా ఉన్నారని సర్వే వెల్లడించింది. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారు కాషాయపార్టీకి అండగా ఉన్నారు. సీనియర్ సిటిజనులు మాత్రం మమతా బెనర్జీపైనే నమ్మకం ఉంచారు. అయితే దీదీ ప్రభుత్వ పనితీరుపై మాత్రం బెంగాల్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎంసీ ప్రభుత్వం బాలేదని 40.6 శాతం మంది నిర్మోహమాటంగా తేల్చేశారు. 38.3 శాతం మంది మాత్రం ప్రభుత్వ పనితీరు బాగుదంటూ కితాబిచ్చారు. ముస్లింల్లో సగానికి పైగా మమతా ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేయగా.. ఎస్సీ, ఎస్టీల్లో మాత్రం 50 శాతం కంటే ఎక్కువ మంది పేలవం అంటూ పెదవి విరిచారు. ఓటు ఎవరికి వేయాలో ఇంకా నిర్ణయం తీసుకోని వారు 18.5 శాతం మంది అని సర్వే తెలిపింది.దీదీ బెస్ట్ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ మాత్రమే సరైన నాయకురాలని బెంగాల్ ప్రజలు క్లియర్‌కట్‌గా తేల్చేశారు. సర్వేలో ఆమెకు 35.4 శాతం మంది మద్దతు ప్రకటించారు. బీజేపీ నాయకుడు సువేందు అధికారికి 20.9 శాతం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య (Samik Bhattacharya) 14.8 శాతం మద్దతుతో రెండుమూడు స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. నిరుద్యోగంపై బెంగఉపాధిలేమి బెంగాల్ ప్రజలను బాగా కలవరపెడుతోంది. నిరుద్యోగం (Unemployment) పట్ల 33.8 శాతం మంది ఓటర్లు ఆందోళన వెలిచ్చారు. శాంతిభద్రతలు/మహిళల భద్రత (19.1%), అవినీతి (18.3%) గురించి కూడా బెంగాలీలు బెంగగా ఉన్నారు. మతపరమైన ధ్రువీకరణ (కమ్యునల్ పోలరైజేషన్) గురించి మాత్రం బెంగాల్ ఓటర్లు (3 శాతం) పెద్దగా పట్టించుకోలేదు. నాయకత్వం లేదా సిద్ధాంతం ఆధారంగా కాకుండా.. ప్రభుత్వ పనితీరును చూసే ఓటు వేస్తామని 29.3 శాతం మంది చెప్పడం గమనించాల్సిన విషయం. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతఎమ్మెల్యేల స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్టు సర్వే బయటపెట్టింది. కేవలం 26.9 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ సిట్టింగ్ ఎమ్మెల్యేను తిరిగి ఎన్నుకునేందుకు అనుకూలంగా ఉన్నారు. అదే పార్టీ నుండి వేరే అభ్యర్థిని నిలబెట్టాలని ఎక్కువ మంది ఓటర్లు కోరుకుంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థిని మార్చకపోతే ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయాలని యోచిస్తున్నారు.బీజేపీకి అదే మైనస్బెంగాల్లో బీజేపీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లు అంతర్గత కలహాలు, వర్గ విభేదాలని 20 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. బెంగాల్ సంస్కృతిని (Bengal culture) అర్థం చేసుకోలేదనే అభిప్రాయాన్ని 16.2 శాతం మంది సర్వేలో వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన రాష్ట్ర నాయకుడు లేకపోవడం బీజేపీకి మరో మైనస్ అని 14.5 శాతం మంది పేర్కొన్నారు.చదవండి: చిరాగ్ పాశ్వాన్ ఈసారైనా చక్రం తిప్పుతారా?టీఎంసీకి కబీర్ ఎఫెక్ట్టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ (Humayun Kabir).. తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్‌కు గండి కొట్టే అవకాశముందని ఓటర్లలో 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆయన వెనుక బీజేపీ లేదా టీఎంసీ ఉండివుండొచ్చన్న అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్‌లో బాబ్రీ మాదిరి మసీదు నిర్మాణానికి పూనుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. -
అదే జరిగితే బెంగాల్లో రాష్ట్రపతి పాలనే.. సువేందు అధికారి హెచ్చరిక
జల్పాయ్గురి: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి 2026లో జరగనున్న ఎన్నికలతో ప్రభుత్వం మారనుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి జోస్యం చెప్పారు. సకాలంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.జల్పాయ్గురి జిల్లా నగ్రాకటలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తికాని పక్షంలో ఎన్నికలు జరగవన్నారు. ‘వచ్చే ఏడాది మే 4వ తేదీకల్లా ఎస్ఐఆర్ పూర్తి చేయాల్సి ఉంది. లేకుంటే ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల ముందు సెమీఫైనల్స్ వంటిది. ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తప్పదు’ అని సువేందు వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ‘2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీలు పొందిన ఓట్లలో తేడా 42 లక్షలు మాత్రమే. అప్పట్లో అక్రమంగా చేర్చిన 2.4 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎస్ఐఆర్లో తొలగిస్తారు. అక్రమ వలసదారులు, ఇతరత్రా అనర్హుల పేర్లు సైతం ఉండవు. భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీకి తన చేతిలో ఓటమి తప్పదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అయ్యో.. గూడు లేని వనజీవి!
ప్రకృతి ప్రేమికుడిగా.. పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మన వనజీవి రామయ్య. అలాంటి వనజీవే పశ్చిమ బెంగాల్ పూరులియాలో ఒకరున్నారు. తన 12వ ఏట నుంచి వన సంరక్షణకు కృషి చేస్తున్నారాయన. ఆ సేవను గుర్తించే కిందటి ఏడాది భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. అయితే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు లేకపోవడంతో కూలిన స్థితిలో ఉన్న పూరిగుడిసెలోనే ఆయన జీవనం వెల్లదీస్తున్నారు. బీడుభూమిగా ఉన్న అజోధ్యా హిల్స్ ప్రాంతాన్ని.. పచ్చటి వనంగా తీర్చి దిద్దిన వ్యక్తి దుఖు మాఝీ. అలాంటి వ్యక్తి చందాల మీద అతికష్టంగా గడుపుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ గుడిసె బయట పద్మశ్రీ పురస్కార గ్రహీత అనే బోర్డు ఉంటుంది. ఆ పక్కనే పాత సైకిల్ ఉంటుంది. స్థానికంగా గచ్చ్ దాదూ(Tree Grandfather)గా పేరున్న దుఖు మాజీ.. భార్య, దివ్యాంగుడైన కొడుకుతో కలిసి ఓ పూరీ గుడిసెలో ఉంటున్నాడు. అది వర్షాలకు తడిసి ముద్దవుతూ ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరింది. దీంతో గ్రామస్తులు చందాలు వేసుకుని వెదురు బొంగులు, పైన కప్పే టార్పాలిన్ షీట్ అందించారు. సోషల్ మీడియా స్పందనతో ప్రతిపక్ష నేత సువేందు అధికారి రూ.2 లక్షల సహాయం ప్రకటించి, శాశ్వత గృహ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అదే సమయంలో ఆయనకు ఇప్పటిదాకా సొంతిల్లు లేకపోవడంతో..ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. పలుమార్లు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నా ఇల్లు దక్కలేదన్నది ఆ విమర్శల సారాంశం. విమర్శల వేళ అధికారులు స్పందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలోనే ఆయనకు శాశ్వత నివాసం మంజూరైనట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన కూడా ధృవీకరించారు. అయితే తన పెద్ద కొడుకు వివాహం చేసుకుని ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడని చెప్పాడాయన. దాతలు దయ తలిస్తే తన స్థలంలోనే సొంతిల్లు కట్టుకుంటానని వేడుకుంటున్నాడు. మొక్కలను రక్షిస్తేనే మనం స్వచ్ఛమైన గాలి పీల్చగలం అని ఓ పోలీసు అధికారి పంద్రాగష్టున ఇచ్చిన ప్రసంగం ఆయన్ని ఎంతగానో ఆకర్షించిందట. అలా చిన్నతనం నుంచే ఆయన మొక్కల్ని నాటుతూ.. చెట్ల సంరక్షణకు పాటుపడుతున్నారు. ఐదు వేలకు పైగా మొక్కలు నాటి వృక్షాలుగా ఎదిగేదాకా సంరక్షణ చూసుకున్నారాయన. ఈయన జీవితాన్ని రుఖూ మాటి దుఖు మాఝీ పేరిట డాక్యుమెంటరీగా తీస్తే.. అది జాతీయ అవార్డు దక్కించుకుంది కూడా. -
సువేందు అధికారి కాన్వాయ్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత
కూచ్ బెహార్: పశ్చిమబెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ కూచ్ బెహార్లో నిర్వహించిన ర్యాలీలో సువేందు అధికారి పాల్గొన్నారు. ఇటీవల బెంగాల్లో మహిళలపై హింస, నేరాలు పెరుగుతున్న క్రమంలో టీఎంసీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆయన ర్యాలీ నిర్వహించగా.. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. దాడులకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఖగ్రాబారి ప్రాంతంలో సువేందు అధికారి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో నల్ల జెండాలు పట్టుకున్న నిరసన కారులు ‘వెళ్లిపో’ అంటూ నినాదాలు చేశారు. ఆయన వాహనంపై చెప్పులు విసిరారు. పోలీసు ఎస్కార్ట్ వాహనం కూడా ధ్వంసమైంది. ఆ సమయంలోనే అధికార ప్రభుత్వానికి చెందిన నేతలు, కార్యకర్తలు ఇక్కడ నిరసనలు తెలుపుతున్నారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం ఆడుతున్న డ్రామాగా అంటూ టీఎంసీ నేతలు అభివర్ణిఇంచారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష గళాన్ని అణచివేయాలనే కుట్ర అంటూ బీజేపీ మండిపడింది. బుల్లెట్‌ప్రూఫ్ కారులో ఉండడం వల్లే సువేందు ప్రాణాలతో బయటపడినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు. -
West Bengal: ‘బీహార్‌లా బెంగాల్..’ : సువేందు సంచలన డిమాండ్
హౌరా (పశ్చిమ బెంగాల్): బీహార్‌లో అమలు చేసిన ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పశ్చిమ బెంగాల్లోనూ అమలు చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో కోటి మందికిపైగా రోహింగ్యా వలసదారులు, బంగ్లాదేశ్ ముస్లిం ఓటర్లు అక్రమంగా ఉంటున్నారని ఆయన ఆరోపించారు. హౌరాలో జరిగిన కన్యా సురక్ష యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తల మధ్య సువేందు అధికారి ఈ విధంగా వ్యాఖ్యానించారు.పశ్చిమ బెంగాల్ ఓటరు జాబితాలో మరణించిన ఓటర్లు, నకిలీ ఎంట్రీలు, నకిలీ ఓటర్లు, రోహింగ్యా వలసదారులు, బంగ్లాదేశ్ ముస్లిం ఓటర్లు ఉన్నారని, ఓటరు జాబితా విశ్వసనీయతను నిర్ధారించడానికి భారత ఎన్నికల సంఘం అక్రమ ఓటర్ల పేర్లను తొలగించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు.కాగా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణను చేపట్టింది. తుది ముసాయిదాలో 65 లక్షల మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. పోల్ బాడీ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 24, 2025 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. అయితే దానికి భిన్నంగా 7.24 కోట్ల గణన ఫారమ్‌లు (ఈ ఎఫ్)లు రావడం విశేషం. బీజేపీ ఆదేశాల మేరకే ఈ కసరత్తు జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో ఈ వ్యవహారం వివాదాస్సదంగా మారింది. బీహార్ అసెంబ్లీ, పార్లమెంటులో దీనిపై తీవ్ర నిరసనలు జరిగాయి. కాగా బెంగాల్లో మహిళలకు భద్రత కల్పించాలని కోరుతూ సువేందు రాష్ట్రంలో కన్యా సురక్ష యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. -
అలా మాట్లాడటం కంటే చావడం మేలు: సీఎం మమత సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చే చొరబాటుదార్లను ఆమె ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పొరుగుదేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులు బెంగాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. సీఎం తీరుతో రాష్ట్ర జనాభా తీరుతెన్నులు మారనున్నాయని ఆరోపించారు.ఇదే సమయంలో ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన మహా కుంభ్‌ను ఆమె మృత్యు కుంభ్ అంటూ వర్ణించడం ద్వారా కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ నుంచి సస్పెండైన అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సువేందు.. ‘అక్రమ చొరబాటుదార్లను అస్సాం ఎస్టీఎఫ్ పట్టుకుంటే మీరు నిద్రపోతున్నారు. కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్‌లా ఉన్నాయని స్వయంగా మీరే అన్నారు. ఒక మతం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర జనాభా తీరుతెన్నులు మారితే మీకు సంతోషమా? మీరు అలా చేయడాన్ని మేం ఒప్పుకోం’ అని హెచ్చరించారు.రుజువు చేస్తే రాజీనామా చేస్తా: మమత బంగ్లాదేశ్‌లోని అతివాదులు, ఉగ్రవాదులతో తనకు సంబంధాలున్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించడంపై సీఎం మమత మండిపడ్డారు. చేతనైతే రుజువు చేయాలని వారికి సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం కంటే చావడం మేలని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యేల నిరాధార ఆరోపణల విషయమై ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్నారు. బంగ్లా సరిహద్దులోని చచార్లో రాత్రి కర్ఫ్యూసిల్చార్: తీవ్రవాద శక్తులు, స్మగ్లర్ల కదలికలను నివారించే లక్ష్యంతో భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అస్సాం రాష్ట్రం చచార్ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. శాంతిభద్రతలను కాపాడేందుకు కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తూ చచార్ జిల్లా మేజిస్ట్రేట్ మృదుల్ యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సరిహద్దులకు కిలోమీటర్ పరిధిలో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు రెండు నెలల పాటు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ సమయంలో భారత భూభాగంలోని సుర్మా నది ఒడ్డున ఎవరూ సంచరించరాదని, అనుమతులున్న స్థానిక మత్స్యకారులు మాత్రమే చేపలు పట్టుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవని మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు. -
‘ఇక మీవంతు’..మమతకు బీజేపీ హెచ్చరిక
కోల్‌కతా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఉత్సాహంలో మునిగితేలుతున్న బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఎసీఎం మమతా బెనర్జీని టార్గెట్‌గా చేసుకుని ‘ఇక మీవంతు’ అని హెచ్చరించారు. కోల్‌కతాతో విలేకరులతో మాట్లాడిన సువేందు అధికారి ‘ఢిల్లీలొ విజయం మనదే.. ఇక 2026లో బెంగాల్ వంతు వస్తుంది’ అని అన్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం దేశానికి ఎంతో అవసరమని, అవినీతి, అబద్ధాల రాజకీయాల ముగింపునకు ఇది నాంది అని సువేందు అధికారి పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అవినీతికి పాల్పడిందని, దీనికి ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు.ఢిల్లీ దేశ రాజధాని అని, దీనిని అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చాల్సివుందని, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని నాశనం చేసిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి జరిగినట్లే, ఢిల్లీలో కూడా జరిగి ఉండాల్సిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం యమునా ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని, అయితే ఢిల్లీ ప్రభుత్వం వాటిని నిర్వహించడంలో విఫలమైందన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఢిల్లీలోని 90 శాతం బెంగాలీ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డులను ఇవ్వడం ద్వారా ఉచిత విద్యుత్, నీరు వంటి సౌకర్యాలను అందించిందని, ఇది దేశ భద్రతకు ముప్పు అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఇలాంటి కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లే, ఢిల్లీలో జరిగిన అన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలలో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. -
బీజేపీ వస్తే మమత జైలుకే: బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు
కోల్‌కతా:పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మమత అరెస్టు తప్పదన్నారు. సందేశ్‌ఖాలీలో మహిళలను టీఎంసీ నేతలు వేధించిన ఘటనలకు మమత బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పారు. ‘2026లో బెంగాల్లో బీజేపీ పవర్లోకి వస్తే సందేశ్‌ఖాలీ ఘటనలపై విచారణ కమిషన్ వేస్తాం. సీఎం మమత కూడా జైలుకు వెళ్లకతప్పదు. సందేశ్‌ఖాలీలో మన తల్లులు, అక్కచెల్లెలను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు.దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు’అని సువేందు అధికారి హెచ్చరించారు. మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీలో పర్యటించిన మరుసటి రోజే పోటీగా అక్కడ నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సువేందు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కాగా,గతేడాది ప్రారంభంలో తృణమూల్ నేత షాజహాన్‌షేక్ తమ భూములు కబ్జా చేయడమే కాకుండా తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఉత్తరపరగణాల జిల్లా సందేశ్‌ఖాలీలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అనంతరం షేక్‌షాజహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
గూండాల చేతిలో పశ్చిమ బెంగాల్: సువేందు అధికారి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వరుసగా జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతృత్వంలోని మమత ప్రభుత్వంపై బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ గూండాలు, రేపిస్టుల చేతుల్లో ఉందని సువేందు ఆరోపించారు. శనివారం నుంచి ఇప్పటి వరకు ఏడు లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయని అన్నారు. నిందితులు టీఎంసీతోప్రత్యక్ష సంబంధం కలిగినవారేనని, వీరని మమతా బెనర్జీ పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. మమతా సాగిస్తున్న అవినీతిని బీజేపీ బయటపెడుతుందని అన్నారు. అంతకుముందు బీర్భూమ్లో నర్సుపై వేధింపుల ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ సీఎం మమతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరిపాలనతో పాటు పోలీసింగ్ వైఫల్యమే ఇటువంటి ఘటనలకు కారణమన్నారు. మమతకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ఆమె తప్పుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. -
ఎన్నికల్లో ఓటమి.. బీజేపీ నేత కొత్త నినాదం!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన మైనార్టీ విభాగాన్ని రద్దు చేయాలని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన సబ్కా సాత్ సబ్కా వికాశ్ నినాదం చేయవద్దని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోల్‌కతాలో జరిగిన రాష్ట్ర బీజేపీ ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఒక కొత్త నినాదాన్ని చేశారు. జో హమారే సాత్, హమ్ ఉన్కే సాత్ ( ఎవరైతే మాతో ఉంటారో.. వారితో మేము ఉంటాం)అని అన్నారు. ‘జాతీయవాద ముస్లీంల గురించి నేను మాట్లాడితే.. మీరంతా సబ్కా సాత్, సబ్‌గా వికాస్ అని నినాదాలు చేసేవారు. కానీ ఇక నుంచి ఆ నినాదాన్ని నేను పలకను. ఇప్పుడు నేను మరో నినాదాన్ని పలకుతాను. అదేంటి అంటే.. ‘జో హమారే సాత్, హమ్ ఉన్కే సాత్’. మీరు కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్ అనటం మానేయండి. ఇక నుంచి మనకు మైనార్టీ మోర్చా అవసరం లేదు’అని అన్నారు. లోక్ సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనివాళ్ల కోసం ఓ పోర్టల్‌ను సువేందు అధికారి ప్రారంభించారు.మరోవైపు.. ‘సుమారు 50 లక్షల మంది హిందూ ఓటర్లను లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయటానికి అనుమతించలేదు. అదేవిధంగా ఇటీవల జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలో సైతం సుమారు 2 లక్షల హిందూ ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించలేదు’ అని ‘ఎక్స్’లో తెలిపారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో ఎంపీ స్థానాలు గెలచుకోలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 12 సీట్లకే పరిమితమైంది. ఇటీవల జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో మొత్తం అధికారం టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికల్లో తమ బీజేపీ గెలుపునుకు ముస్లీం ఓటు బ్యాంక్ అడ్డంకిగా మారిందని బీజేపీ నేత సువేందు అధికారి భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక.. కులం, మతాలకు అతీతంగా భారతీయులంతా అభివృద్ధి చెందాలని ప్రధాని మోదీ 2014లో ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ నినాదం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు ముస్లిం ఓట్లు ఆశించినంత పడకపోవటంపై సువేందు అధికారి అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. -
‘టీఎంసీని ఉగ్రసంస్థగా ప్రకటించి.. సీఎం మమతను అరెస్ట్ చేయాలి’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని, సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. సందేశ్‌కాళీలో టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందుగుడు సామాగ్రిని సీబీఐ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సువేందు టీఎంసీ, సీఎం మమతపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడ లభ్యమైన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవని తెలిపారు. ‘సందేశ్‌కాళీలో లభించిన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు అన్ని అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉపయోగించేవి. అందుకే టీఎంసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. అప్పడే పశ్చిమ బెంగాల్ ప్రశాంతంగా ఉంటుంది. సందేశ్‌కాళీలో ఆయుధాలకు సంబంధించి ఘటనకు సీఎం మమత బాధ్యత వహించాలి. సీఎం మమతను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని సువేందు డిమాండ్ చేశారు.Paschim Medinipur, West Bengal | Bengal Assembly LoP Suvendu Adhikari says, "All the weapons found in Sandeshkhali are foreign. Explosives like RDX are used in horrific anti-national activities. All these weapons are used by international terrorists. I demand to declare Trinamool… pic.twitter.com/IOfFUknMFL— ANI (@ANI) April 27, 2024 శుక్రవారం సందేశ్‌కాళీలో సీబీఐ జరిపిన సోదాల్లో టీఎంసీ సస్పెండెడ్ నేత షాజహాన్ షేక్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, ఒక పోలీసు తుపాకీ లభించింది. వాటిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ దాడులపై టీఎంసీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ వేళ (శుక్రవారం) సీబీఐ పలు చోట్ల సోదాలు చేపట్టింది’ అని ఆరోపణలు చేసింది.జనవరిలో ఈడీ అధికారులుపై టీఎంసీ కార్యకర్తలు చేసిన దాడికి సంబంధించి శుక్రవారం సీబీఐ పలు చోట్లు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక.. షాజహాన్ షేక్‌ను బెంగాల్ పోలీసులు ఫ్రిబవరి 29న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీకి అభ్యర్థులు కావలెను. ఆసక్తి రేపుతున్న ‘టీఎంసీ’ పోస్టర్లు
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మధ్య జరుగుతున్న పోస్టర్ వార్ ఆసక్తిరేపుతోంది. బీజేపీ ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించని అసన్సోల్, డైమండ్ హార్బర్ లోక్‌సభ సీట్ల విషయంలో టీఎంసీ గోడలపై పోస్టర్లు వేసింది. క్యాండిడేట్ వాంటెడ్ అని షాడో ఫేస్ ఉన్న పోస్టర్లను వీధుల్లో అంటించారు. దమ్ముంటే బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత సువేందు అధికారి డైమండ్ హార్బర్ సీటు నుంచి పోటీ చేయాలని టీఎంసీ సవాల్ విసురుతోంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం టీఎంసీ జనరల్ సెక్రటరీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అసన్సోల్ నుంచి బీజేపీ క్యాండిడేట్‌గా ప్రకటించిన పవన్‌సింగ్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నారు. దీంతో బీజేపీ ఇక్కడ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అసన్సోల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే లేరని టీఎంసీ ఎద్దేవా చేస్తోంది. కాగా, పశ్చిమ బెంగాల్లో ఈ నెల 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీకి షాక్ శివసేన(ఉద్ధవ్)లోకి సిట్టింగ్ ఎంపీ -
‘సువేందును పోటీకి దింపాలి’.. బీజేపీకి టీఎంసీ సవాల్
కోల్‌కతా: లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, జాబితా విడుదల చేయటంలో బిజీగా ఉంటున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ.. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పోటాపోటీగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేత కునాల్ ఘోష్ బీజేపీకి సవాల్ విసిరారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించటంలో జాప్యం చేస్తుందని అన్నారు. ఆ స్థానంలో పోటీకి నిలపడానికి బీజేపీకి అభ్యర్థులే దొరకటం లేదని ఎద్దేవా చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారిని పోటీకి దింపాలని టీఎంసీ నేత కునాల్ ఘోష్ సవాల్ విసిరారు. ‘బీజేపీ నేత సువేందు అధికారికి నేను బహిరంగ వివాల్ విసురుతున్నా. ఆయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో మా నేత అభిషేక్ బెనర్జీపై పోటీ చేయలి’ అని కునాల్ అన్నారు. ఇప్పటికీ డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో బీజేపీ ఎవరినీ పోటీకి దింపలేదు. ఇక.. ఈ సీటులో పోటీ చేయాలని బీజేపీ తమ అభ్యర్థులను కోరుతోందని ఎద్దేవా చేశారు. అయితే టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి కంచుకోట అయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజర్టీతో గెలుపొందారు. ఆదివారం బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులు ప్రకటించింది. అందులో బెంగాల్ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీకి దింపింది. ఇప్పటి వరకు మొత్తం 38 మంది అభ్యర్థులను బీజేప ప్రకటించింది. ఇక.. పశ్చిమ బెంగాల్లో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. చదవండి: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు -
రసవత్తరంగా కోల్‌కతా రాజకీయాలు..
సాక్షి,కోల్‌కతా : దేశంలో ఎన్నికల రణరంగంలో ఆసక్తికర పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ప్రజా సంక్షేమం కోసం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన అనంతరం జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ త్వరలో రాజకీయాల్లోకి అడుగపెట్టనున్నారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల జస్జిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పశ్చిమ్ బెంగాల్ స్కూళ్లలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టారు. సీబీఐ, ఈడీలకు సైతం దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ అంశం కోల్‌కతాతో పాటు దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. తమ్లుక్ లోక్‌సభ అభ్యర్ధిగా.. ఇప్పుడు ఆయనే స్వయంగా రాజకీయాల్లో అడుగు పెడుతుండడంతో కోల్‌కతా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్‌లోని తమ్లుక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఆయనను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టవచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. ఒకప్పుడు ఈ స్థానంలో పశ్చిమ బెంగాల్ ప్రతిపక్షనేత, బీజేపీ నేత సువేందు అధికారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సువేందు అధికారి తమ్ముడు, టీఎంసీ నేత దిబ్యేందు అధికారి ఎంపీగా కొనసాగుతున్నారు. పార్టీల కోసం.. మరోవైపు కోల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ రాజీనామాపై ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.‘హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం అంటే న్యాయం చేయడం లేదు. పార్టీ కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. -
‘మమత అక్క కాదు.. గయ్యాళి అత్త’
పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ ఘటన వెలుగు చూసినప్పటి నుంచి మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉద్యమించాయి. అయితే రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని బీజేపీ చెడగొట్టిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలన్నీ సందేశ్‌ఖాలీ చుట్టూ తిరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత శుభేందు అధికారి మరోసారి బెంగాల్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. మమతా బెనర్జీ ఇప్పుడు అక్క(దీదీ) కాదని, గయ్యాళి అత్తగా మారిపోయారని ఆరోపించారు. ఇకపై మమతా బెనర్జీని ‘దీదీ’ అని పిలవడం మానేయాలని అన్నారు. ఇది అత్త, మేనల్లుడి ప్రభుత్వమని ఆరోపించారు. దీదీ అనే పేరులో మానవత్వం స్ఫురిస్తుందని, అయితే మమతా బెనర్జీలో క్రూరత్వం ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించానని, అందుకే తనపై 42 కేసులు పెట్టారని శుభేందు అధికారి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీ గ్రామం నిరసనలకు సాక్షిగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు ఇటీవల టీఎంసీ నేత షాజహాన్ షేక్‌తో పాటు ఇతర నేతలు తమ భూములను స్వాధీనం చేసుకున్నారని, లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే ఈ ప్రాంతం నిరసనలకు నిలయంగా మారింది. -
పోలీస్ అధికారిపై ‘ఖలిస్తానీ’ వ్యాఖ్యలు...చిక్కుల్లో బీజేపీ నేత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ‘సందేశ్‌ఖాలీ’ వివాదం సద్దుమణగడం లేదు. నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతలు భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గత వారం రోజులుగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యవహారంలో తాజాగా సిక్కు పోలీస్ అధికారిని ఖలిస్తానీ అంటూ దూషించడంతో రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి చిక్కుల్లో పడ్డారు. ఈ వీడియోను పశ్చిమ బెంగాల్ పోలీసులు మంగళవారం షేర్ చేయడంతో తాజా వివాదం రాజుకుంది. ‘మా అధికారులలో ఒకరిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి 'ఖలిస్తానీ' అని పిలిచారు. అది తప్పు. అతను గర్వించదగిన సిక్కు, అలాగే చట్టాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమర్థుడైన పోలీసు అధికారి. ఈ వ్యాఖ్యలు మతపరంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇది నేరపూరిత చర్య. ఒక వ్యక్తి మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా చేసిన ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం’ అని రాష్ట్ర పోలీసు అధికారిక హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు. చదవండి: సీనియర్ లాయర్ ఫాలీ నారీమన్ కన్నుమూత We, the West Bengal Police fraternity, are outraged to share this video, where one of our own officers was called ‘Khalistani’ by the state's Leader of the Opposition. His ‘fault’: he is both a proud Sikh, and a capable police officer who was trying to enforce the law…(1/3) — West Bengal Police (@WBPolice) February 20, 2024 సువేందు అధికారి వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ ఖండించారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. పోలీసులు అధికార టీఎంసీకి లోబడి పనిచేస్తున్నారని మండిపడింది. Stern legal action is being initiated. (3/3)#Honourandduty #WBP pic.twitter.com/ucHCZTLFvk — West Bengal Police (@WBPolice) February 20, 2024 అయితే సువేందు అధికారి నేతృత్వంలో నిరసనకారులు సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో, నిరసనకారులలో ఒకరు సంఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ పోలీసు అధికారిని ‘ఖలిస్తానీ’ అని పిలిచినట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన అధికారి ‘నేను తలపాగా వేసుకున్నాను, అందుకే నన్ను ఖలిస్తానీ అంటారా? దీనిపై నేను చర్య తీసుకుంటాను. మీరు నా మతంపై దాడి చేయలేరు. మీ మతం గురించి నేను ఏమీ చెప్పలేదు" అని అధికారి చెబుతున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. -
Sandeshkhali: బెంగాల్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న అశాంతి విషయంలో కోల్‌కతా హైకోర్టు సీరియస్ అయింది. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసును మంగళవారం కోల్‌కతా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సందేశ్‌కాలీ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ను సమర్థించకూడదని పేర్కొంది. సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేత సువేందు అధికారి అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం స్పదించారు. సందేశ్‌కాళీ ప్రాంతంలోని మహిళలు చేసిన ఆరోపణలను హైకోర్టు గుర్తించిందని తెలిపారు. ‘మేము అక్కడి మహిళలకు సంబంధించి బాధలను చూశాం. ఆ ప్రాంతంలోని మహిళలు సమస్యలపై నిరసన తెలిపారు. అక్కడ కొంత భూమి ఆక్రమణకు గురైంది. ఈ కేసులో ప్రాథమికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్రం ప్రభుత్వం కూడా విషయాన్ని సమర్ధించదు. ఆయన లొంగిపోవాలి. ఆయన చట్టాన్ని ధిక్కరించడం సాధ్యం కాదు’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ‘నేరాలకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆయన రక్షించబడుతున్నాడో? లేదో? మాకు తెలియదు. రాష్ట్ర పోలీసులు మాత్రం పలు ఘటనల్లో కీలకంగా ఉన్న షాజాహాన్ షేక్‌ను అరెస్ట్ చేయలేకపోయారు’ అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. చదవండి: Sandeshkhali: సువేందు అధికారిని మరోసారి అడ్డుకున్న పోలీసులు -
Sandeshkhali: సువేందు అధికారిని మరోసారి అడ్డుకున్న పోలీసులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ వ్యవహారం రోజురోజుకీ రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సందేశ్‌ఖాలీని సందర్శించడానికి వెళ్లిన రాష్ట్ర ప్రతిపక్ష నేత, బీజేపీ నేత సువేందు అధికారి, సీపీఎం బృందా కారత్ను పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. సువేందు అధికారి తన మద్దతు దారులతో కలిసి సందేశ్ ఖాలీకి వెళ్తుండగా ధమాఖలి వద్ద పోలీసులు, అల్లర్ల నియంత్రణ దళం సిబ్బంది బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, సీపీఎం మద్దతుదారులు ధమాఖలీలో వేర్వేరుగా నిరసనలు చేపట్టారు. కాగా నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్శాలీలో కొందరు టీఎంసీ నేతలు భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే బీజేపీ ఆరోపణలతో ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే. టీఎంసీ నేతలపై ఆరోపణల అనంతరం నందిగావ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు సందేశ్ ఖాలీని సందర్శించడం ఇది మూడోసారి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన అంతకముందు రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. చదవండి: 2018 పరువునష్టం కేసులో రాహుల్‌కు ఊరట.. అయితే సందేశ్‌కాలీ గ్రామంలో పర్యటించేందుకు బీజేపీ నేత సువేందు అధికారితోపాటు ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌కు కోల్‌కతా హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. తన మద్దతుదారులతో కలిసి వెళ్లవద్దని పేర్కొంది. భద్రతా సిబ్బందితో వెళ్లొచ్చని తెలిపింది. అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలేవీ చేయవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలగనీయరాదని హెచ్చరించింది. అదే విధంగా బీజేపీ నేత సందేశ్‌ఖాలీని సందర్శించడంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మంగళవారం ఉదయం హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది, సందేశ్ కాలీ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా కూడా తనను అడ్డుకుంటున్నారని సువేందు అధికారి అసహనం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు దృష్టికి ఈసుకెళ్తానని తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, రాష్ట పోలీసులు కలకత్తా హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదని మండిపడ్డారు. -
ఘోర ప్రమాదం.. ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి
లక్నో: పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి కాన్వాయ్‌లోని కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని పుర్భా మేదినీపూర్ జిల్లాలోని చందీపూర్‌లో గురువారం రాత్రి జరిగింది. పెట్రోల్‌బంక్ వద్ద సీక్ ఇస్రాఫిల్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢికొట్టిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపారు. అంతేగాక ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. కాగా రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు నందిగ్రామ్ ఎమ్మెల్యే కాన్వాయ్‌కు చెందినదో కాదో విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే సువేందు అధికారి మోయినాలో జరిగిన పార్టీ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా నివేదించింది. మరోవైపు ప్రమాదానికి కారణమైన సువేందు అధికారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇక నందిగ్రామ ఎమ్మెల్యే సువేందు అధికారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దీనిపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ రాత్రి 10.30 గంటలకు పెట్రోల్ బంక్ దగ్గర రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టింది. స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. మృతుడిని సీక్ ఇస్రాఫిల్‌గా గుర్తించాం. ఎమ్మెల్యే సువేందు కాన్వాయ్ కారు గుద్దడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై సువేందు అధికారితో సహా బీజేపీ నాయకులెవరూ స్పందించలేదు.’ అని తెలిపారు. చదవండి: కలబురిగిలో నువ్వా.. నేనా! హైదరాబాద్ కన్నడనాట తీవ్ర పోటీ -
టీఎంసీకి జాతీయ హోదా రద్దుపై షాకు దీదీ ఫోన్ చేశారన్న సువేందు
-
మమతా దీదీకి బీజేపీ సవాల్!...దమ్ముంటే ఈ చట్టాన్ని ఆపండి!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ నాయకుడు సువేందు అధికారి రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలవుతోందని నొక్కి చెప్పారు. ఈ మేరకు ఆయన బంగ్లాదేశ్ మూలాలు ఉన్న మతువా ఆధిపత్య ప్రాంతమైన నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ఠాకూర్ నగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ....విస్వసనీయ పత్రాలతో కూడిన నివాసి అయితే వారికి పౌరసత్వం తీసివేయబడుతుందని సీఏఏ సూచించలేదు. తాము అనేకసార్లు సీఏఏ గురించి చర్చించాం. కచ్చితంగా రాష్ట్రంలో అములు చేయబడుతుంది. దీంతో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన వలసదారులకు పౌరసత్వం మంజూరు అయ్యేలా సీఏఏ సులభతరం చేస్తోంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ....దీదీజీ మీకు దమ్ముంటే దీన్ని ఆపండి అంటూ సవాలు విసిరారు. ఐతే ఆ చట్టం కింద ఉన్న నిబంధనలను ప్రభుత్వం ఇంకా రూపొందించనందున ఇప్పటివరకు ఎవరికీ ఆ చట్టం ద్వారా పౌరసత్వం మంజూరు కాలేదు. కానీ నందిగ్రామ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి మతువా కమ్యూనిటీ సభ్యులకు కూడా పౌరసత్వం ఇవ్వబడుతుందని చెప్పారు. రాజకీయంగా ప్రాముఖ్యమున్న ఈ కమ్యూనిటీ బీజేపీ, తృణమాల్ శిభిరాలుగా చీలిపోయారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది మతువాలతో నాడియా, నార్త్, సౌత్24 పరగణాస్ జిల్లాలో కనీసం ఐదు లోక్‌సభ స్థానాల తోపాటు దాదాపు 50 అసెంబ్లీ స్థానాల్లో ఈ సంఘం ప్రభావం ఉంది. అలాగే కేంద్ర మంత్రి బొంగావ్‌కు చెందిన బీజేపీ ఎంపీ శంతను ఠాకూర్ కూడా కచ్చితంగా సీఏఏ అమలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం సాధించేందకు కట్టుబడి ఉన్నాం అన్నారు. ఇదిలా ఉండగా, తృణమాల్ నాయకుడు పశ్చిమబెంగాల్ సీనియర్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ...2023 పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ సీఏఏ కార్డుతో ఓటు బ్యాంకు రాజకీయాలపై ఫోకస్ పెట్టి ఇలా నాటకమాడుతోందని విమర్శించారు. ఐనా అలా ఎప్పటికీ జరగనివ్వం అని హకీమ్ దృఢంగా అన్నారు. (చదవండి: గుజరాత్ ఎన్నికల చిత్రం.. పటేళ్ల రూటు ఎటు?) -
ముందు షారుక్‌ను తీసేసి గంగూలీని పెట్టు.. మమతకు బీజేపీ కౌంటర్
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి సౌరవ్ గంగూలీని తప్పించడం తనను షాక్‌కు గురి చేసిందని మమతా బెనర్జీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాలని, గంగూలీని ఐసీసీకి పంపాలని ఆమె కోరారు. అయితే మమత వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. గంగూలీ గొప్పతనం గురించి నిజంగా ఆమెకు తెలిస్తే.. బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్‌ను తప్పించాలని, ఆ స్థానాన్ని దాదాతో భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాతే మమత మాట్లాడాలని తెలిపింది. బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఈమేరకు వ్యాఖ్యానించారు. అంతేకాదు క్రీడలపై రాజకీయం చేయొద్దని మమతకు సూచించారు సువేందు అధికారి. ఇలాంటి విషయాలకు ప్రధాని మోదీ చాలా దూరంగా ఉంటారని, ఆయన ప్రస్తావన తీసుకురావద్దని హితవు పలికారు. క్రికెట్ వ్యవహారాల్లో ప్రధాని జోక్యం చేసుకోరని మమతకు ఆ మాత్రం తెలియదా? అని సెటైర్లు వేశారు. అంతకుముందు గుంగూలీకి మద్దతుగా మాట్లాడారు మమతా బెనర్జీ. ఆయన ఏం తప్పు చేశారని బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి తప్పించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అయినా జోక్యం చేసుకుని గంగూలీని ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమిత్ షా కుమారుడు జైషాను మాత్రం రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించడాన్ని ప్రశ్నించారు. చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ -
‘నేను మగవాడిని.. నా శరీరాన్ని ఈడీ, సీబీఐ తాకలేవు’
కోల్‌కతా: మహిళా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఇటీవల పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకొని.. సువేందు అధికారిని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న తరుణంలో మహిళా పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మహిళా అధికారి. నన్ను టచ్ చేయొద్దు.. పురుష సిబ్బందిని పిలవండి’ అని వారించారు. తాజాగా సువేందు అధికారి వ్యాఖ్యలకు టీఎంసీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. టీఎంసీ శాసన సభ్యుడు ఇద్రిస్ అలీ ‘ఈడీ, సీబీఐ నా శరీరాన్ని తాకలేవు.. నేను మగవాడిని’ అని రాసి ఉన్న కుర్తా ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లాడు. టీఎంసీ ఎమ్మెల్యే ఇలాంటి డ్రెస్ ధరించి అసెంబ్లీకి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా.. ‘తనను సీబీఐ, ఈడీ తాకలేవని భావించే ఓ బీజేపీ నేత ఉన్నారు’ అంటూ సువేందు అధికారిని ఉద్ధేశిస్తూ చురకలంటించారు. చదవండి: సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనలపై సుప్రీం కాగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘నబానా ఛలో’ పేరుతో బీజేపీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఓ మహిళా పోలీస్ తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది మహిళా పోలీసులు అతన్ని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న తరుణంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను టచ్ చేయొద్దు’ అని వారించారు. అనంతరం ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళా కళ్లల్లో దుర్గామాతను చూస్తానని, మహిళలంటే ఎంతో గౌరవమని తెలిపారు. -
మాట్లాడింది మమతేనా? మోదీకి సపోర్ట్ చేయడమేంటి?
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీపై వీలుచిక్కినప్పుడల్లా విమర్శలు, కుదిరితే సెటైర్లు వేస్తుంటారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధమే నడిచింది. అయితే ఇప్పుడు మమతలో అనూహ్య మార్పు వచ్చింది. బెంగాల్ అసెంబ్లీలో మోదీకి మద్దతుగా ఆమె మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బెంగాల్ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మమత.. సీబీఐ, ఈడీకి బయపడి దేశంలోని వ్యాపారస్థులు విదేశాలకు పారిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే దీనికి మోదీ కారణం కాదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. సీబీఐ హోంశాఖ పరిధిలోకి వస్తుందని, ప్రధాని కార్యాలయానికి దీనితో సంబంధం లేదని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తరచూ హోంమంత్రిని కలిసి తమపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎప్పుడూ మోదీపై విమర్శలు గుప్పించే మమత.. ఇప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడటం సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. కుతంత్రం.. అయితే మమత వ్యాఖ్యలపై బీజేపీ నేత సువేంధు అధికారి స్పందించారు. బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్లుడు అభిషేక్ బెనర్జీని కాపాడుకునేందుకే ఆమె ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మమత కుతంత్రాలను బీజేపీ ఆ మాత్రం పసిగట్టలేదా అని సెటైర్లు వేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు సీఎం మమతా బెనర్జీ. అయితే ఈ చర్యను బీజేపీ తప్పుబట్టింది. తర్వాత న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఇలాగే తీర్మానాన్ని తీసుకొస్తారా? అని ప్రశ్నించింది. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్! సోనియాతో కీలక భేటీ -
బెంగాల్ సీఎం మమతకు ఊహించని షాక్.. భారీ విజయం అందుకున్న బీజేపీ
బెంగాల్ రాజకీయాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు పార్టీల నేతల మధ్య మాటల వార్ ఇంకా నడుస్తూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీకి చేదు అనుభవమే ఎదురైనప్పటికీ సీట్ల విషయం మాత్రం పుంజుకుంది. ఇదిలా ఉండగా, తాజాగా అధికార టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. పూర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాగా ఆదివారం భేకుటియా సమబే కృషి సమితికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నికల్లో 12 సీట్లకు గానూ 11 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇక, ఈ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఒక్క సీటుకే పరిమితమైంది. మరోవైపు.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓడించారు. ఇక, బీజేపీ విజయంపై సువేందు అధికారి స్పందిస్తూ.. బీజేపీని గెలిపించినందుకు నందిగ్రామ్ నియోజకవర్గం, భేకుటియా సమబే కృషి ఉన్నయన్ సమితి సహకార సంఘం ఓటర్లందరికీ ధన్యవాదాలు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో గొప్ప విజయానికి బాటలు వేస్తాయి అని కామెంట్స్ చేశారు. Big SETBACK for Mamata Banerjee, BJP wins 11 out of 12 seats in Nandigram co-operative body election Nandigram: Bhekutia Samabay Krishi Samity, which was held by Mamata Banerjee's Trinamool Congress (TMC) for a long time, took over by the Saffron camphttps://t.co/q55vSFd14i — Selvam 🚩 (@tisaiyan) September 19, 2022 -
కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు మరోమారు తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోవిడ్-19 టీకాల పంపిణీ పూర్తవగానే పౌరసత్వ చట్టం అమలు చేస్తామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో మంగళవారం పార్లమెంట్ హౌస్‌లో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. బెంగాల్లో బీజేపీ కార్యవర్గ సమస్యలపై చర్చించేందుకు ఇరువురు సమావేశమైనట్లు తెలిసింది. అనంతరం మాట్లాడిన సువేందు అధికారి సీఏఏ అంశాన్ని తెలిపారు. ‘కోవిడ్-19 మూడో డోసు పంపిణీ పూర్తవగానే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సీఏఏ అమలు చేస్తామని అమిత్ షా చెప్పారు.’ అని పేర్కొన్నారు అధికారి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో బుస్టర్ డోసుల పంపిణీని ప్రారంభించింది కేంద్రం. అది తొమ్మిది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. మే నెలలో పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయ్గురిలో నిర్వహించి సభలో సీఏఏపై మాట్లాడారు అమిత్ షా. సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా సీఏఏ ప్రస్తావన తీసుకొచ్చారు కేంద్ర మంత్రి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ వంటి దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన అక్కడి మైనారిటీ హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్ మతాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే.. 2014, డిసెంబర్ 31లోపు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం కల్పించాలని నిర్ణయించారు. 2019, డిసెంబర్లో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మతం పేరుతో వివక్ష, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. భారత్‌లోని ముస్లింలను లక్ష్యంగా చేసుకునే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్, సీఏఏలు ఉన్నాయని పేర్కొన్నారు నిరసనకారులు. ఆ వాదనలను తోసిపుచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిరసనలు రాజకీయంగా ప్రేరేపితమైనవేనని పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయుడు తన పౌరసత్వాన్ని కోల్పోడని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: భవిష్యత్‌లో చరిత్రను నిర్దేశించేది డేటానే - ప్రధాని మోదీ -
బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ-బీజేపీ ఎమ్మెల్యేల కొట్లాట
-
బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్
లక్నో: పశ్చిమబెంగాల్ శాసనసభలో అధికార పార్టీ టీఎంసీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నేతల మధ్య తోపులాటలు జరిగాయి. రాంపూర్హాట్, బీర్భూమ్ హింసాత్మక ఘటనలపై చర్చలు జరపాలంటూ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ తిగ్గ బట్టలు చిరిగిపో.. టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందర్ ముక్కుకు గాయమైంది. మరోవైపు శాసనసభలో జరిగిన గందరగోళం నేపథ్యంలో శాసనసభ ప్రతిపక్షనేత సువేందుతో సహా అయిదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సువిందు సహా బీజేపీ సభ్యులందరూ సభ భయట నిరసనకు దిగారు. బీజేపీ నేతలపై జరిగిన దాడి నేపథ్యంలో స్పీకర్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు. చదవండి: కశ్మీర్ ఫైల్స్.. కేజ్రీవాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ కాగా పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో పది ఇళ్లకు నిప్పంటించిన ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. టీఎంసీ నాయకుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బాద్ షేక్ హత్యకి ప్రతీకారంగా మార్చి 21న ఈ ఘటన చోటుచేసుకుంది. బీర్భూమ్ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. ఈ దారుణ ఘటనపై పలు కేసులు నమోదు చేసింది. -
తృణమూల్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బెంగాల్లో వివాదాన్ని రేకెత్తిస్తోంది. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి బిహార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని బుక్ ఫెయిర్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభలో టీఎంసీ ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి ప్రసంగిస్తూ.. ‘మీలో బెంగాలీ రక్తం ప్రవహిస్తే, ఖుదీరామ్, నేతాజీ(సుభాష్ చంద్రబోస్)ల రక్తం ప్రవహిస్తే.. మాతృభాషను, మాతృభూమిని ప్రేమిస్తే.. ఒక బీహార్ వ్యక్తి వంద వ్యాధులతో సమానం’ అని గట్టిగా అరవాలని వ్యాఖ్యానించారు. బెంగాలీలకు వ్యాధులు వద్దని, బెంగాల్‌ను వ్యాధి రహితంగా మార్చాలని పేర్కొన్నారు. తృణమూల్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మాట్లాడిన వీడియో తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ యూపీ, బిహారిలు లేని పశ్చిమ బెంగాల్‌గా మార్చాలని అన్నారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మొదటిసారిగా 2021 బెంగాల్ ఎన్నికల్లో హుగ్లీ నుంచి గెలిచారు. First his leader @MamataOfficial labels Biharis & UPites as "Bohiragotos" & now this clarion call to make Bengal free of Biharis.@BJP4Bihar @BJP4India @renu_bjp @SanjayJaisw @girirajsinghbjp @BJP4Jharkhand@YashwantSinha @PavanK_Varma — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) March 14, 2022 -
2018లో బాడీగార్డు మృతి.. బీజేపీ నేత సువేందుకు సమన్లు
కోల్‌కతా: పశి్చమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారికి రాష్ట్ర సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. సువేందుకు బాడీగార్డుగా పని చేసిన సబ్ ఇన్స్పెక్టర్ సుభభ్రత చక్రవర్తి మరణానికి సంబంధించిన కేసులో ఆయనకు సీఐడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని భవాని భనవ్ సీఐడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా చెప్పింది. 2018లో బాడీగార్డు చక్రవర్తి మరణించారు. తుపాకీతో తనకు తానే కాల్చుకొని మరణించినట్లు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఏడాది జూలైలో తన భర్త కేసును మళ్లీ దర్యాప్తు చేయాల్సిందిగా చక్రవర్తి భార్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో కేసు సీఐడీ చేతికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సువేందు అధికారికి సీఐడీ సమన్లు జారీ చేసింది. (చదవండి: వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ) -
ఫేస్బుక్ కామెంట్స్ పై బీజేపీ ఎంపీ బహిరంగ క్షమాపణలు
కోల్‌కతా: బీజేపీ నాయకులు సువేందు అధికారి, దిలీప్ ఘోష్‌లపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన విభాగం చీఫ్ సౌమిత్రా ఖాన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆదివారం జరిగిన బీజేపీ యూత్ వింగ్ సమావేశంలో సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ.. “ఫేస్బుక్లో ఓ ప్రకటన చేయడం నా వంతు తప్పు. నేను క్షమాపణ కోరుతున్నాను. నేను సోషల్ మీడియాలో అలాంటి వ్యాఖ్య చేయకూడదు.” అని అన్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరింత తీవ్రమైన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ప్రతిజ్ఞ చేశారు. టిఎంసి 211 అసెంబ్లీ నియోజకవర్గాలను దక్కించుకోగలిగితే, భవిష్యత్తులో బీజేపీ 250 సీట్లను ఎందుకు పొందలేం? మనం ముందుకు సాగాలి, పార్టీకి నాయకత్వం వహించే వారు ఆ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు. బెంగాల్లో ఎన్నికల్లో జరిగిన హింసపై టీఎంసీని తీవ్రంగా విమర్షించారు. ఇక టీఎంసీ "టీఎంసీ 211 అసెంబ్లీ నియోజకవర్గాలను దక్కించుకోగలిగితే, భవిష్యత్తులో బీజేపీ 250 సీట్లను ఎందుకు పొందలేము? మనం ముందుకు సాగాలి, పార్టీకి నాయకత్వం వహించే వారు ఆ బాధ్యతలు స్వీకరిస్తారు" అని ఆయన అన్నారు. సౌమిత్రా ఖాన్ ఒక ఉద్వేగభరితమైన వ్యక్తి కాగా ఈ నెల (జూలై) లో ఫేస్ బుక్‌లో స్పందిస్తూ.. ‘‘ ఓ నాయకుడు తరచే ఢిల్లీకి పర్యటనలు చేస్తున్నాడు. పార్టీ సాధించే ప్రతి విజయానికి ఆయనకే పేరు వచ్చింది. ఢిల్లీ నాయకులను ఆయన తప్పుదారి పట్టిస్తున్నాడు. బెంగాల్లో పార్టీ ఆయనే పెద్ద నాయకుడిగా భావిస్తున్నాడు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో.. సగమే అర్థం చేసుకోగలడు. అతను ఇవన్నీ అర్థం చేసుకోలేడు. ’’ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. "సౌమిత్రా ఖాన్ ఒక ఉద్వేగభరితమైన వ్యక్తి. నేను అతని పట్ల ఎటువంటి చెడు భావాలను కలిగి లేను. అతను యువ మోర్చాకు నాయకత్వం వహిస్తాడు" అని అన్నారు. -
కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లు.. సువేందుపై ముకుల్ రాయ్ ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు ముకుల్ రాయ్ మండిపడ్డారు. తాను పార్టీ మారడంపై సువేందు అధికారి కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్.. ఆ పార్టీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన తిరిగి టీఎంసీ గూటికి చేరారు. అయినప్పటికీ ఆయన బీజేపీ శాసనసభ్యుడిగానే కొనసాగుతున్నారు. Why only court? He can go wherever he wishes to go: TMC leader Mukul Roy on Leader of Opposition Suvendu Adhikari's statement that BJP will approach Calcutta High Court for enforcing anti-defection law in West Bengal pic.twitter.com/9AIxVrl9Bx— ANI (@ANI) July 16, 2021 ఈ నేపథ్యంలో ముకుల్ రాయ్‌పై పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయమై ప్రతిపక్ష నేత సువేందు అధికారి బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీకు ఫిర్యాదు చేయగా, ఇవాళ ఐదు నిమిషాల పాటు విచారణ జరిపించారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు ముకుల్ రాయ్‌పై పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తామని సువేందు అధికారి పేర్కొన్నారు. సువేందు చేసిన ఈ ప్రకటనపై మండిపడిన ముకుల్ రాయ్.. కోర్టుకు కాకపోతే మరెక్కడికైనా వెళ్లవచ్చని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, ముకుల్ రాయ్ ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన కృష్ణానగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. -
మమత పిటిషన్‌పై 12న విచారణ
కోల్‌కతా/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు స్వీకరించింది. ఆగస్టు 12న ఆ పిటిషన్‌పై విచారణ జరుపుతామని బుధవారం వెల్లడించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలియజేసింది. నందిగ్రామ్ ఓట్లకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపర్చాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) సూచించింది. మమతా బెనర్జీ పిటిషన్‌ను జస్టిస్ షంపా సర్కార్ విచారించారు. మొదటగా ఈ పిటిషన్ జస్టిస్ కౌశిక్ చంద్ర వద్దకు వెళ్లినప్పటికీ, విచారణ నుంచి ఆయనే స్వయంగా తప్పుకున్నారు. దీంతో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందాల్ ఈ కేసును జస్టిస్ షంపా సర్కార్ ధర్మాసనానికి బదిలీ చేశారు. మమత పిటిషన్‌ను బదిలీ చేయండి నందిగ్రామ్‌లో తన గెలుపును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్రం వెలుపలి కోర్టుకు బదిలీ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మమత పిటిషన్‌పై పశ్చిమ బెంగాల్ బయట విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఈసీని కలవనున్న టీఎంసీ నేతలు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగాల్సిన అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించకపోవడంపై జూలై 15న కేంద్ర ఎన్నికల కమిషన్‌ను (సీఈసీ) కలవనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీకి ఎన్నిక కాని వ్యక్తి రాజ్యాంగం ప్రకారం కేవలం ఆరు నెలలు మాత్రమే సీఎం పదవిలో ఉండగలరు. మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి గెలవాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు, శాసన సభ్యులు మరణించగా ఖాళీ అయిన మరో రెండు స్థానాలకు ఎన్నికలు ప్రకటించాలన్న డిమాండ్‌తో తృణమూల్ నేతలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు థర్డ్ వేవ్ వచ్చేవరకు వేచి చూస్తున్నారా? అంటూ తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ఎన్నికల కమిషన్‌ను విమర్శించారు. -
దీదీ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, కోల్‌కతా : నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ కౌశిక్ చందా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. కాగా, దీదీపై సువేందు అధికారి రెండు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో నందిగ్రామ్ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. కౌంటింగ్ రోజు నాటకీయ పరిణామాలు జరగ్గా.. రీ కౌంటింగ్ కోసం తృణమూల్ కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఇక ఫలితాల మరుసటి రోజే మమతా బెనర్జీ, సువేందు ఎన్నికపై కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. అంతేకాదు ఆ సమయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కిషోర్ బిశ్వాస్ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ.. ఆయనకు భద్రత కల్పించింది మమత సర్కార్. -
West Bengal: సువేందుకు ఝలక్.. ఇవాళే విచారణ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ చీఫ్ సువేందు అధికారికి ఝలక్ తగిలింది. ఆయన ఎన్నికపై అనుమానాలున్నాయంటూ సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ఇవాళ (శుక్రవారం) ఉదయం 11 గం. పిటిషన్ విచారణ చేపట్టనుంది. కాగా, దీదీపై సువేందు రెండు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో నందిగ్రామ్ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. కౌంటింగ్ రోజు నాటకీయ పరిణామాలు జరగ్గా.. రీ కౌంటింగ్ కోసం తృణమూల్ కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఇక ఫలితాల మరుసటి రోజే మమతా బెనర్జీ, సువేందు ఎన్నికపై కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ కౌశిక్ చందా నేతృత్వంలో ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. అంతేకాదు ఆ సమయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కిషోర్ బిశ్వాస్ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ.. ఆయనకు భద్రత కల్పించింది మమత సర్కార్. కాగా, 2011 నుంచి భాబనీపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న మమత.. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైంది. అయినప్పటికీ భారీ స్థానాలు గెల్చుకుని టీఎంసీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణం చేసింది. చదవండి: సువేందుపై చోరీ కేసు -
సువేందును భయపెడుతున్న ఆ 24 మంది..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీకి షాకుల మీద షాకుల తగులుతున్నాయి. బీజేపీ తరఫున గెలిచిన ముకుల్ రాయ్ తృణమూల్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలో మరి కొందరు పయణించే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలందరు తమతోనే ఉన్నారని నిరూపించుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడింది. బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి, గవర్నర్ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఈ సంఘటనతో మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి తిరుగుపయనం కానున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. సువేందు అధికారి సోమవారం సాయంత్రం గవర్నర్ జగ్దీప్ ధన్కర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనుచిత సంఘటనలు, వాటి పరిణామాలతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. దాంతో వారంతా తిరిగి టీఎంసీలో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవి కట్టబెట్టడాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలకపోతున్నారు. సువేందు నాయకత్వాన్ని అంగీకరించడానికి వారు సుముఖంగా లేరు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ముకుల్ రాయ్ టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే మరికొందరు బీజేపీని వీడి తృణమూల్‌లో చేరతారని భావిస్తున్నారు. 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ టీఎంసీ ప్రకటించడం గమనార్హం. చదవండి: ముకుల్‌రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి -
ముకుల్‌రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
కోల్‌కతా: ఇటీవలే అధికార తృణమూల్ కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన ముకుల్ రాయ్ తన ఎమ్మెల్యే పదవికి తక్షణం రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి (బీజేపీ) సోమవారం డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా రాజీనామా చేయకపోతే ముకుల్ రాయ్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. నాలుగేళ్ల కిందట తృణమూల్‌ను వీడి... బీజేపీలో చేరిన సీనియర్ నేత ముకుల్ రాయ్ కమలం పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తన సీనియారిటీని పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవిని కట్టబెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. దాంతో కొద్దిరోజుల కిందట తృణమూల్ కాంగ్రెస్‌లోకి తిరిగివచ్చారు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్‌పై ఉత్తర క్రిష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ‘ఉత్తర క్రిష్ణానగర్ ఎమ్మెల్యే ఇటీవలే పార్టీ మారారు. ఆయన 24 గంటల్లోగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే బుధవారం స్పీకర్‌కు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేస్తాం’ అని ముకుల్ రాయ్ పేరు ఎత్తకుండానే సువేందు అన్నారు. కాగా మరోవైపు సువేందు నేతృత్వంలో 50 మంది పైచిలుకు ఎమ్మెల్యేలు సోమవారం రాజ్‌భవన్‌లో బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, అరాచకం రాజ్యమేలుతోందని బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. దాడులు జరగొచ్చనే భయంతో 17 వేల మంది బీజేపీ కార్యకర్తలు ఇళ్లు విడిచి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని సువేందు అన్నారు. చదవండి: సువేందు అధికారి ఢిల్లీ పర్యటన.. కారణం ఇదేనా! చదవండి: Coronavirus: దేశంలో తగ్గిన కరోనా తీవ్రత -
సువేందు అధికారి ఢిల్లీ పర్యటన.. కారణం ఇదేనా!
న్యూఢిల్లీ: బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి మంగళవారం ఉదయం హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. అంతకుముందు నౌకాయాన శాఖ మంత్రి మనసుఖ్ లాల్ మాండవీయను కలిసిన ఆయన అమిత్‌షా నివాసానికి చేరుకున్నారు. అంతేకాకుండా సువేందు ఈ రోజు సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలువనున్నారు. ఇక బుధవారం సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీని నందిగ్రామ్ ఎన్నికల యుద్ధంలో సువేందు ఓడించిన సంగతి తెలిసిందే. బెంగాల్లో మమతను ఎదుర్కొవడానికి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సువేందు నాయకత్వమే సరియైందని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత సువేందు అధికారి ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి: వైరల్: పెళ్లి కొడుకు హుషారు చూసి పెళ్లి కూతురు షాక్!) -
WestBengal: సువేందు బ్యాడ్ టైం స్టార్ట్!
బీజేపీ శాసనసభ పక్ష నేత సువేందు అధికారిపై టీఎంసీ రివెంజ్ మొదలైందా? తాజా పరిణామాలతో ‘అవుననే’ అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. రానున్న రోజుల్లో అది మరింతగా ఉండబోతుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. కోల్‌కతా : వెస్ట్ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ లీడర్ సువేందు అధికారిపై ఓ కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన సామాగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ సభ్యుడు రత్నదీప్ మన్నా ఈ నెల 1న చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి ఇద్దరూ మే 29న కార్యాలయ గోడౌన్‌లోకి అక్రమంగా చొరబడి లక్షలు విలువచేసే సామాగ్రిని దోచుకువెళ్లారు అని మన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనంలో బీజేపీ నేతలు కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ తృణముల్ మాజీ నేత మమతపై నెగ్గిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తుపాన్ సమీక్షలో ఈయన కూడా పాల్గొనడంతోనే.. దీదీ ఎగ్గొట్టిందన్న వాదన వినిపించింది కూడా. ముఖ్య అనుచరుడీ అరెస్ట్ ఇక సువేందు అధికారి ముఖ్య అనుచరుడు రేఖాల్ బెరాను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వందల మంది నుంచి డబ్బులు వసూలు చేశారనేది రేఖాల్ పై ప్రధాన ఆరోపణ. ఇది 2019 జులై, సెప్టెంబర్‌లో జరిగిందని ఫిర్యాదులో సుజిత్ డే అనే వ్యక్తి పేర్కొన్నాడు. తన నుంచి రెండు లక్షల రూపాయలు రేఖాల్ తీసుకున్నారని సుజిత్ తెలిపాడు. కాగా, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ ఫేక్ జాబ్ రాకెట్ స్కాంలో మరికొంత మంది నిందితుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: రసవత్తరంగా కోల్డ్‌వార్ -
Nandigram: నందిగ్రామ్.. హై టెన్షన్
కోల్‌కతా: తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తొలిసారి బరిలో నిలిచిన పశ్చి మ బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠత రేపాయి. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేంధు అధికారి మధ్య క్షణ క్షణం మారిపోతున్న ఓట్ల మెజారిటీ... మొత్తం రాష్ట్ర ఎన్నికల ఘట్టంలోనే అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. ఇద్దరు ప్రధాన పార్టీల ప్రత్యర్థుల మధ్య అటూ ఇటూ దోబూచులాడిన మెజారిటీ.. చివరకు సువేంధు అధికారిని వరించింది. మమతా బెనర్జీపై స్వల్ప ఆధిక్యంతో గెలిచినట్లు ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించింది. అయితే, నందిగ్రామ్ ఫలితాలపై తాను కోర్టుకు వెళ్తానని మమతా ప్రకటించారు. అంతకుముందు ఆదివారం ఉదయం కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా కొద్దిసేపటికే సువేంధు మమత కంటే ఆధిక్యంలోకి వచ్చారు.ఆ తర్వాత సువేంధు మెజారిటీ ఏకంగా ఎనిమిది వేల దాకా వెళ్లింది. మధ్యాహ్నందాకా సువేంధుదే పైచేయి. మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా పుంజుకుని మమత ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆధిక్యత మరొకరి చెంతకు చేరింది. ఒకానొక దశలో సువేంధు కేవలం ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లో మెజారిటీ సువేంధు, మమత మధ్య మారుతూ వచ్చింది. సువేంధు 1,200 ఓట్ల మెజారిటీలో గెలిచారని వార్తలు రాగా, ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 1,956 ఓట్ల ఆధిక్యంతో సువేంధు అధికారి గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. త్యాగాలు తప్పవు.. ఈసీ ప్రకటనపై మమతా బెనర్జీ వెంటనే స్పందించారు. ‘‘నందిగ్రామ్‌లో ఓటమిని అంగీకరిస్తున్నాను. మరేం ఫరవాలేదు. అయితే, నందిగ్రామ్‌లో అక్రమాలు జరిగాయని విన్నాను. దీనిపై కోర్టుకు వెళతాను. మనం మొత్తం రాష్ట్రాన్నే గెలిచాం. ఇంతటి ఘన విజయం సాధించినపుడు ‘నందిగ్రామ్’లో ఓటమిలాంటి త్యాగాలు తప్పవు’’ అని ఫలితాల అనంతరం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో రీకౌంటింగ్ జరపాలని ఈసీని టీఎంసీ కోరగా అందుకు ఈసీ నిరాకరించింది. -
మమతకు చెమటలు పట్టిస్తున్న సువేందు
-
నందిగ్రామ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ
లేటెస్ట్ అపడేట్ : నందిగ్రామ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ కోలకత: పశ్చిమబెంగాల్లో నందీగ్రామ్ ఎన్నికల ఫలితం కీలకంగా మారింది. క్షణ క్షణానికిమారుతున్న ఆధిత్యంతో నరాలు తెగే ఉత్కంఠను రాజేస్తోంది. సమీప ప్రత్యర్ధి,బీజేపీ అభ్యర్థి సువేందుపై ప్రారంభంలో వెనుకబడిన మమతా, ఆ తరువాత లీడింగ్‌లోకి వచ్చారు. 16వ రౌండ్ ముగిసే సమయానికి సువేందుకు కంటే కేవలం 6 ఓట్లు వెనకబడి ఉన్నారు. దీదీ-సువేందు మధ్య నెలకొన్ని హోరాహోరీ పోరు టీ20 మ్యాచ్‌ను తలపిస్తోంది. చివరిదైనా 17వ రౌండ్ ఫలితంపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మ్యాజిక్ ఫిగర్ స్థానాలను దాటి లీడింగ్‌లో దూసుకుపోతుండగా ముఖ్యమంత్రి మమత మాత్రం వెనకంజలో ఉండటం గమనార్హం. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలకమైన స్థానంలో దూసుకుపోతోంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు, అప్పటి మంత్రి సువేందు అధికారిని తనవైపు తిప్పుకున్న బీజేపీ నందీగ్రామ్‌నుంచి గట్టిపోటీ ఇస్తోంది. తొలి రౌండ్‌నుంచీ వెనుకంజలో ఉన్న దీదీ నాలుగు రౌండ్ల తరవాత కూడా సువేందుకంటే 8 వేలకు పైగా ఓట్లు వెనుకబడి ఉన్నారు. నందిగ్రామ్‌లోమమతను తాను 50 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడిస్తానని, అలా చేయలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని సవాల్ చేసిన అధికారి ఆ దిశగా సాగి పోతున్నారు. అయితే క్షణక్షణానికి మారుతున్న ప్రస్తుత తరుణంలో పూర్తి ఫలితం వచ్చేవరకు నందీగ్రామ్ ఫలితంపై ఉత్కంఠకు తెరపడదు. కాగా టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన, మాజీమంత్రి సువేందు అధికారి సవాల్‌కు ప్రతిసవాల్‌గా నందీగ్రామ్‌నే మమత ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అటు టీఎంసీ 200 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, -
66 ఏళ్ల ఆంటీ.. నోరు అదుపులో పెట్టుకో!
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై , బీజేపీ నేత నందీగ్రామ్‌లో ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి నోరు పారేసుకున్నారు. మాజీ టీఎంసీ నేత అయిన సువేందు సీఎం మమతా 66 ఏళ్ల ఆంటీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఇటీవల మమతా విమర్శల నేపథ్యంలో సువేందు కౌంటర్ ఎటాక్ చేశారు. దీదీ ఈ వయస్సులో నోటిని అదుపులో పెట్టుకోవాలని, భాషను మార్చుకోవాలంటూ హితవు పలికారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు ఓటమి తప్పదని హెచ్చరించారు. అలాగే మే 2వ తేదీన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, ఆ తర్వాత కూడా కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉండాలని సువేందు వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిగా ఆమె తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, ప్రధాని మోదీపై ఆమె అభ్యంతరకర రీతిలో భాషను వాడుతున్నారని ఆరోపించారు.ఈ సందర్బంగా బెంగాల్ సీఎంను ఆంటీ అంటూ ఆయన సంబోధించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మమతా మీడియాతో మాట్లాడారని మండిపడ్డారు. కాగా రెండో దశ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా తన ఓటుహక్కును వినియోగించుకున్న సువేందు అధికారి, ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోందని, రీపోలింగ్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
బెంగాల్, అస్సాం రెండో విడత పోలింగ్
కోల్‌కతా/గువాహటి: పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బెంగాల్లో 37.42 శాతం, అసోంలో 33.24 శాతం పోలింగ్ నమోదైంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఎనిమిది విడతల్లో, 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 27న తొలి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బెంగాల్లో రెండో విడతలో 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. 171 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 75,94,549 మంది ఓటర్లు వారి భవితవ్యం నిర్ణయించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో 10,620 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఓటింగ్ జరిగే అన్ని ప్రాంతాలను సున్నితమైనవిగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అస్సాంలో.. రెండో దశలో ఎన్నికలు జరగనున్న 39 స్థానాల్లో మొత్తం 345 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ 34 సీట్లలో, మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్ 6 స్థానాల్లో, యూపీపీఎల్ 3 సీట్లలో పోటీ చేస్తున్నాయి. రెండు స్థానాల్లో బీజేపీ, ఏజీపీ మధ్య, రెండు స్థానాల్లో బీజేపీ, యూపీపీఎల్ మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొని ఉంది. మహా కూటమి నుంచి కాంగ్రెస్ 28 సీట్లలో, ఏఐయూడీఎఫ్ 7 స్థానాల్లో, బీపీఎఫ్ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన అస్సాం జాతీయ పరిషత్ 19 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. 25 స్థానాల్లో ఎన్డీయే, మహా కూటమి మధ్య ద్విముఖ పోటీ నెలకొన్నది. ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. ఈ రెండో దశ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచిన నందిగ్రామ్ నియోజకవర్గంపైననే అందరి దృష్టి ఉంది. మమతను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ అగ్ర నేతలు ఈ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.మమతకు పోటీగా ఒకప్పటి ఆమె విశ్వసనీయ సహచరుడు, టీఎంసీ నుంచి బీజేపీలోకి వచ్చిన సువేందు అధికారిని బీజేపీ పోటీలో నిలిపిన విషయం తెలిసిందే. బెంగాల్లో 30 స్థానాలకు గానూ మొత్తం 191 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 75 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 10,620 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం నిర్ధారించి, ఆయా బూత్‌ల వద్ద అదనపు బలగాలను నిలిపింది. తూర్పు మెదినీపుర్(9), పశ్చిమ మెదినీపుర్(9), దక్షిణ 24 పరగణ(4), బంకురా(8) జిల్లాల్లో ఈ రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. టీఎంసీ, బీజేపీలు మొత్తం 30 స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. సీపీఎం 15, కాంగ్రెస్ 13, ఐఎస్ఎఫ్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రెండో దశ ఎన్నికలు జరుగుతున్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించారు. కాలికి గాయమైన ఆమె వీల్చెయిర్పైననే ఈ ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రచారంలో అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు. చదవండి: భారీ పోలింగ్ మా విజయానికి సంకేతం నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే -
నందిగ్రామ్‌లో దీదీ ఓటమి తథ్యం: సర్వే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశ పూర్తైన సంగతి తెలిసిందే. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. ఈ ఎన్నిక పట్ల బెంగాల్ వాసులతో పాటు దేశప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండో దశ పోలింగ్‌లో మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో కూడా ఓటింగ్ జరగనుంది. పార్టీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్‌లో మమతతో తలపడనున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆ సంగతి పక్కకు పెడితే గత రెండు మూడు రోజులుగా నందిగ్రామ్ ఫలితాలకు సంబంధించి రెండు, మూడు సర్వేలు బెంగాల్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీటి సారాంశం ఏంటంటే మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఘోర పరాజయం చవి చూడబోతున్నారు. సువేందు దీదీని దారుణంగా ఓడించబోతున్నాడని సర్వేలు తెలిపాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సర్వేలన్నింటిని పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ పాక్ నిర్వహించిందనే వార్తలు జనాలను మరింత ఆశ్చర్యచకితులను చేశాయి. ఈ క్రమంలో ఐ పాక్ సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థ నిర్వహించినట్లు చెప్పుకుంటున్న సదరు సర్వే ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐపాక్ ‘‘గత కొద్ది రోజులుగా నందిగ్రామ్ ఓటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సర్వే ఫేక్. బీజేపీ నాయకులు, వారి హామీల్లానే ఈ సర్వే కూడా అవాస్తవం. ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్‌ను ప్రచారం చేసి జనాలను ప్రభావితం చేయాలని భావిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. అసలు ఐ పాక్ డెస్క్ టాప్‌లను వినియోగించదు.. మరింత స్మార్ట్‌గా ఆలోచించండి’’ అంటూ ట్వీట్ చేసింది. Facing imminent defeat, @BJP4Bengal has now gone down to the level of using FAKE surveys in the name of I-PAC to keep the morale of their workers up!! P.S: In I-PAC, no one uses desktops so at-least be smart in your effort to create fake survey / reports! 😉🤣 pic.twitter.com/lFaOo0DshU — I-PAC (@IndianPAC) March 31, 2021 చదవండి: నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన -
West Bengal Election 2021: ‘నందిగ్రామ్’ పోరు రసవత్తరం
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలకంగా మారిన నందిగ్రామ్.. 14 ఏళ్ల తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ తరువాత ఇప్పుడు అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 1న రాష్ట్రంలో జరిగే రెండో దశ ఎన్నికలలో బంకురా, పశ్చిమ మేదినీపూర్, తూర్పు మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల పరిధిలోని నాలుగు జిల్లాలలో కలిపి 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరుగనుంది. ఈ దశలో హాట్ టాపిక్‌గా మారిన నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్‌లోనే మకాం వేసిన సువేందును ఢీకొట్టేందుకు టీఎంసీ అభ్యర్థి, సీఎం మమతా బెనర్జీ సోమ, మంగళవారాల్లో రెండు రోజుల వ్యవధిలో 6 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉన్న బెనర్జీ నందిగ్రామ్‌లో ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సువేందు అధికారి తరఫున కమలదళం తరపున హోం మంత్రి అమిత్ షా మంగళవారం భారీ రోడ్‌షో నిర్వహించారు. పరస్పరం తీవ్ర ఆరోపణలు ఏప్రిల్ 1వ తేదీన పోలింగ్ జరుగబోయే నందిగ్రామ్‌లో ప్రచారపర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్న మమతా బెనర్జీని కనీసం 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని, లేనిపక్షంలో రాజకీయాలను విడిచి పెడతానని సువేందు అధికారి ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఒక ర్యాలీలో సువేందు, అతని తండ్రి శిశిర్, సోదరుడు సౌమేందులు విషసర్పాలుగా మారుతారనే విషయం తనకు అర్థం కాలేదని దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీలకంగా ఆ ముగ్గురు నేతలు నందిగ్రామ్‌లో సువేందు హిందుత్వ ఎజెండాతో హిందూ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా దూసుకెళ్తుండగా, మమతా బెనర్జీ తన అభివృద్ధి పనులతో పాటు, అధికారి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జనాభాలో 30 శాతం ఉన్న ముస్లిం ఓట్లు తమకే పడతాయని దీదీ నమ్మకంతో ఉన్నారు. 2016లో టీఎంసీ టికెట్‌తో 68 వేల ఓట్లతో సువేందు గెలిచారు. అయితే పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో బీజేపీ, టీఎంసీలు స్థానికంగా పేరున్న నాయకులు సుఫియాన్ షేక్, అబూ తాహెర్, మేఘనాథ్ పాల్‌లకు సంబంధించిన సమస్యలపై పోరాడుతున్నాయి. ఒక సమయంలో ఈ ముగ్గురు నాయకులు సువేందుకు చాలా దగ్గరగా ఉండేవారు. మారిన పరిణామాల నేపథ్యంలో అబూ తాహెర్, సుఫియాన్ షేక్ మమతా బెనర్జీకి అండగా నిలబడగా, మేఘనాథ్ పాల్ సువేందుతో కొనసాగుతున్నారు. అయితే సువేందుకు వీరిద్దరు దూరమైన తర్వాత తాహెర్, షేక్‌లపై కొనసాగుతున్న కేసులపై దర్యాప్తు జరపాలంటూ ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు మేఘనాథ్ పాల్ ఇంట్లో సువేందు గుండాలు దాక్కున్నారని ఆరోపిస్తూ టీఎంసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు స్థానిక నాయకులు నందిగ్రామ్‌లో ఎవరు గెలవాలన్న అంశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తారు. ఉద్ధండులు వర్సెస్ ఫైర్‌బ్రాండ్ మరోవైపు ఇద్దరు ఉద్ధండులను ధీటుగా ఎదుర్కొనేందుకు వామపక్షాలు ఫైర్ బ్రాండ్‌గా పేరున్న డివైఎఫ్ నాయకురాలు మీనాక్షి ముఖర్జీని బరిలోకి దింపాయి. ఆమె ఒకప్పుడు వామపక్షాల కంచుకోట అయిన నందిగ్రామ్‌లో తిరిగి ఎర్రజెండా రెపరెపలాడించేందుకు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటీవల సౌతఖాలీ, గార్చక్రబేరియా, కాళిచరణ్, సోనాచురా బజార్, తఖాలీ వంటి ప్రాంతాల్లో మీనాక్షి ప్రచార ర్యాలీలు చేపట్టారు. అంతేగాక 2011లో వామపక్ష కూటమి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన నందిగ్రామ్ భూసేకరణ అంశాన్ని అప్పుడు వ్యతిరేకించిన భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీలోని ప్రముఖులు మీనాక్షికి మద్దతు ఇస్తున్నారు. బెంగాల్, అస్సాంలలో ముగిసిన ప్రచారం కోల్‌కతా/గువాహటి: పశ్చిమబెంగాల్, అస్సాంలలో ఏప్రిల్ ఒకటో తేదీన జరగనున్న రెండో దశ పోలింగ్‌కు మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. అస్సాం అసెంబ్లీలోని 126 సీట్లకుగాను 39 స్థానాలకు, బెంగాల్‌లోని 284 నియోజకవర్గాలకు గాను 30 చోట్ల ఏప్రిల్ ఒకటో తేదీన పోలింగ్ జరగనుంది. అస్సాంలో రెండోదశలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 345 మంది అభ్యర్థుల్లో 174 మంది స్వతంత్రులున్నారు. మొత్తం 345 మందిలో 37 మందికి నేర చరిత్ర ఉండగా అందులో 30 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయి. నేర చరితుల్లో బీజేపీకి చెందిన 11 మంది, కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌కు చెందిన ఐదుగురు చొప్పున ఉండటం గమనార్హం. అదేవిధంగా, బెంగాల్‌లోని నాలుగు జిల్లాల్లో రెండోదశ పోలింగ్ జరిగే 30 నియోజకవర్గాల్లో 171 మంది బరిలో నిలిచారు. పోలింగ్ బందోబస్తు కోసం 651 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను రంగంలోకిదించారు. -
బీజేపీ గూండాలను తరమండి
కోల్‌కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని, బయటి నుంచి గూండాలను దిగుమతి చేస్తోందని తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. గరిటెలు, అట్లకాడలు, వంట పాత్రలతో బీజేపీ గూండాలను తరిమికొట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని నారాయణగఢ్, పింగ్లాలో శనివారం ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. నందిగ్రామ్‌లో తనపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువేందు అధికారిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు ద్రోహులని దుయ్యబట్టారు. సువేందు అధికారి కుటుంబ సభ్యుడొకరు శుక్రవారం రాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడని అన్నారు. అతడిని మహిళలు పట్టుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు. బయటి నుంచి వచ్చిన మరో 30 మంది గూండాలను కూడా మహిళలు పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో ద్రోహులపై కన్నేశా: అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. నందిగ్రామ్‌లో మీర్ జాఫర్లపై(ద్రోహులు) ఓ కన్నేసి ఉంచానని వ్యాఖ్యానించారు. సువేందు అధికారికి, అతడి సోదరులకు మంచి పదవులు కట్టబెట్టానని గుర్తుచేశారు. అయినప్పటికీ వారు తృణమూల్ కాంగ్రెస్‌ను దగా చేసి, బీజేపీలో చేరారని విమర్శించారు. డబ్బుకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ, తృణమూల్ కార్యకర్తల ఘర్షణ పూర్బ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో శనివారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానంలో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బయటి నుంచి తీసుకొచ్చిన రౌడీలు తమపై దాడి చేశారని మమతా బెనర్జీ ఎలక్షన్ ఏజెంట్ షేక్ సూఫియాన్ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ముగ్గురు గాయాలపాలయ్యారని అన్నారు. -
సువేందు అధికారి ద్రోహి
కాంతి దక్షిణ్: తానొక పెద్ద గాడిదనని(అమీ ఏక్తా బోరో గధా), అందుకే సువేందు అధికారి అసలు రంగును గుర్తించలేకపోయానని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకర్గం నుంచి ఆమెపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మమతకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సువేందు అధికారి అభిప్రాయభేదాల వల్ల దూరమయ్యారు. మమతా బెనర్జీ ఆదివారం పూర్బ మేదినీపూర్ జిల్లా కాంతి దక్షిణ్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సువేందు కుటుంబం రూ.5వేల కోట్ల ఆస్తులు కూడగట్టినట్లు తాను విన్నానని చెప్పారు. ఆ డబ్బుతో ఓట్లు కొనేయాలని సువేందు ప్రయత్నిస్తున్నాడని, అతడికి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే అతడి అవినీతిపై విచారణ జరిస్తానన్నారు. బీజేపీని తరిమికొట్టాలి సువేందు అధికారి కుటుంబాన్ని ద్రోహుల(మీర్ జాఫర్) కుటుంబంగా మమతా బెనర్జీ అభివర్ణించారు. అతడికి ఓటేయవద్దని ప్రజలను కోరారు. బీజేపీ వంచకులు, గూండాల పార్టీ అని మండిపడ్డారు. బెంగాల్లో శాంతి భద్రతలను కాపాడాలన్నా, అభివృద్ధిని కొనసాగించాలన్నా బీజేపీని తరిమికొట్టాలని సూచించారు. -
బెంగాల్ దంగల్: మోదీ–దీదీ మాటల యుద్ధం
ఖరగ్‌పూర్/ హల్దియా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మధ్య మాటల తూటాలు పేలాయి. మమత సర్కార్ దోపిడి విధానాలను మోదీ ఎత్తి చూపిస్తే, బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడి పార్టీ అంటూ దీదీ ఎదురు దాడి చేశారు. శనివారం ఖరగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీకి భారీగా తరలివచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. మమత సర్కార్ దోపిడి విధానాల వల్ల రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, కేవలం మాఫియా ఇండస్ట్రీ మాత్రమే పని చేస్తోందని ధ్వజమెత్తారు. మమత మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీని సింగిల్ విండోగా అభివర్ణించారు. ఆయనతో మాట్లాడకపోతే ఒక్క పని జరగడం లేదని పారిశ్రామికవేత్తలందరూ హడలెత్తిపోతున్నారని అన్నారు. ‘‘పారిశ్రామికీకరణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు దీనిని పాటిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. బెంగాల్లో కూడా సింగిల్ విండో ఉంది. మమత మేనల్లుడే ఇక్కడ సింగిల్ విండో. ఆ విండోని దాటకుండా ఒక్క పని కూడా జరగదు’’అని ఆరోపించారు. అన్నీ అమ్మేస్తున్నారు హల్దియా రేవు పట్టణంలో జరిగి ఎన్నికల సభకి వీల్ చైర్లోనే హాజరైన సీఎం మమతా బెనర్జీ మోదీ మాటల్ని తిప్పి కొట్టారు. ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద దోపిడీ పార్టీ అని ఆరోపణలు గుప్పించారు. పీఎం కేర్స్ఫండ్ ద్వారా ఆ పార్టీ ఎంత డబ్బు సంపాదించిందో ఒక్క సారి చూడండని అన్నారు. మోదీని మించిన అమ్మకం దారుడు మరెవరూ లేరని ధ్వజమెత్తారు. ప్రధాని అన్నీ అమ్మేస్తూ భారత ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ౖ‘‘రెల్వేలను ప్రైవేటు పరం చేశారు. బొగ్గు, బీఎన్ఎన్ఎల్, బీమా, బ్యాంకులు ఇలా అన్నీ అమ్మేస్తున్నారు’’అంటూ విమర్శించారు. ఏదో ఒక రోజు హల్దియా ఓడరేవుని కూడా అమ్మకానికి పెట్టేస్తారని హెచ్చరించారు.. బెంగాల్‌ని కాపాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్‌కే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసిన మమత అప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదని అన్నారు. -
అధినాయకి వర్సెస్ అధికారి
సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం నందిగ్రామ్ పేరు తొలిసారిగా వార్తల్లోకెక్కింది. సెజ్‌ల ఏర్పాటు కోసం రైతుల నుంచి భూసేకరణకు నిరసనగా నందిగ్రామ్‌లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ సెగలు దేశం నలుమూలలకీ పాకాయి. పోలీసు కాల్పుల్లో 14 మంది రైతులు మరణించడంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నదాతలకు అండగా నిలిచి ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. నందిగ్రామ్ వేదికగా నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటమే చేసి కాలం మారింది కామ్రేడ్స్ అని గర్జిస్తూ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు కంచుకోటని బద్దలు కొట్టారు. మళ్లీ ఇన్నేళ్లకి మమత నందిగ్రామ్ అసెంబ్లీ బరిలో దిగడంతో దేశవ్యాప్తంగా మరోసారి నందిగ్రామ్ పేరు మారుమోగుతోంది. ఇన్నాళ్లూ తనకి కుడి భుజంగా ఉంటూ గత డిసెంబర్లోనే బీజేపీలో చేరిన సువేందు అధికారి సవాల్‌ని స్వీకరించి మరీ నందిగ్రామ్ బరిలో మమత దిగడంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ సంగ్రామం వేడెక్కింది. వ్యూహ ప్రతివ్యూహాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన సమయంలో కాలికి అయిన గాయాన్ని తనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీల్‌చైర్ మీదే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ సానుభూతి ఓట్లు దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ తనని నాలుగ్గోడల మధ్య పరిమితం చేయడానికే నందిగ్రామ్‌లో తనపై దాడికి దిగిందని ఆరోపిస్తున్నారు. తన గెలుపు కోసం పూర్ణేందు బసు అనే సీనియర్ మంత్రిని ప్రత్యేకంగా నియమించారు. పూర్ణేందు అధికారి సాక్షితో మాట్లాడుతూ మమతా బెనర్జీ చేపట్టిన సంక్షేమ పథకాలే ఆమెని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మమతను వెన్ను పోటు పొడిచి పార్టీ వీడిన సువేందు అధికారి తప్పు చేశారని, ఆయన చేసిన తప్పులే దీదీకి ఓట్లను కురిపిస్తాయని అన్నారు. నందిగ్రామ్ ఎమ్మెల్యేగా ఉన్న సువేందు అధికారి చేసిన అవినీతి పనులే ఆయనని ఓటమి పాలు చేస్తాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ధోలాసేన్ జోస్యం చెప్పారు. నందిగ్రామ్‌లో మహిళలకి రాజకీయ చైతన్యం ఎక్కువ. తరచుగా ఉద్యమాల్లో పాల్గొంటారు. 49 శాతం ఓట్లు ఉన్న మహిళా ఓటర్లు మమతకే అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి వన్ మ్యాన్ ఆర్మీగా దూసుకుపోతున్నారు. 2016 ఎన్నికల్లో 67% ఓట్లు కొల్లగొట్టిన సువేందు అ«ధికారి కుటుంబానికి ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. సువేందు అధికారి తండ్రి, సోదరుడు కూడా ఎంపీలుగా పని చేశారు. జూట్ మిల్లు కార్మిక కుటుంబాలతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం ఉన్న మిడ్నాపూర్ ఉమ్మడి జిల్లాలో వీరి కుటుంబానికి ఎదురే లేదు. హిందూ ఓట్లను ఏకం చేయడంతో పాటుగా ముస్లిం ఓట్లను రాబడితే గెలుపు ఖాయమన్న ధీమాలో అధికారి ఉన్నారు. బీజేపీకి కేడర్ లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. సమఉజ్జీల మధ్య సమరంలో ముస్లింలు, కమ్యూనిస్టు ఓటు బ్యాంకుపైనే వారి గెలుపు ఆధారపడి ఉంది. ముస్లిం ఓటు బ్యాంకు ఎటు ? నందిగ్రామ్ నియోజకవర్గంలో 30% ఉన్న ముస్లింలు ఈ సారి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ముస్లింలు మొదట్లో కమ్యూనిస్టులకు అండగా ఉండేవారు. 2007లో జరిగిన భూ సేకరణలో భూములు కోల్పోయిన వారు మమతకి మద్దతుగా నిలిచారు. మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకుపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సువేందు అధికారి తనకున్న వ్యక్తిగత పరిచయాలతో ముస్లిం ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక సీపీఎం, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఐఎస్ఎఫ్ నాయకుడు అబ్బాస్ సిద్ధి్దఖికి నందిగ్రామ్‌లో గట్టి పట్టు ఉంది. ఆయన ప్రభావంతో ముస్లింలు తిరిగి కమ్యూనిస్టుల వైపు మళ్లితే మమతా బెనర్జీ గెలుపు అవకాశాలు ప్రమాదంలో పడిపోతాయి. హిందూత్వ కార్డు నందిగ్రామ్‌లో 70% హిందూ ఓట్లన్నీ గంపగుత్తలా తమకే పడేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీ కరడుగట్టిన హిందూత్వ వాదాన్ని ఎదుర్కోవడానికి మమత కూడా హిందూత్వ బాట పట్టారు. గుళ్లు గోపురాలు తి రుగుతూ, ఎన్నికల ర్యాలీల్లో శ్లోకాలు వల్లె వేస్తున్నారు. తమదీ హిందూ కుటుంబమే అని చెబుతున్నారు. బ్రాహ్మణ్ సమ్మేళన్ నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తూ దుర్గా పూజ కమిటీలకు సాయం చేస్తున్నారు. హిందువుల్లో వైçష్ణవ ఓటర్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. వీరు తులసిమాల ధరిస్తారు. విభూదిని బొట్టుగా పెట్టుకుంటారు. మమత గెలిస్తే విభూది పెట్టుకోవాలన్నా అనుమతి తీసుకోవాలంటూ సువేందు ప్రచారం చేస్తున్నారు. మత్స్యకారుల పాత్ర హుగ్లీ నది సముద్రంలో కలిసే ప్రాంతం నందిగ్రామ్‌లో ఉంది. దీంతో ఇక్కడ భారీ సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సముద్రపు నీటిని చట్టవిరుద్ధంగా కాలువల ద్వారా గ్రామాల్లోకి తీసుకువచ్చి వేలాది ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. రొయ్యల సాగుని అడ్డుకుంటామని మమత ప్రభుత్వం చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. సువేందు అధికారి రొయ్యల వ్యాపారుల సిండికేట్‌తో కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఈ మత్స్యకారుల్లో దళితులు, ముస్లింలు కూడా ఎక్కువే ఉన్నారు. వీరంతా అధికారి వైపే ఉంటారన్న అంచనాలున్నాయి. సీపీఎం ప్రభావం ? నందిగ్రామ్‌లో సీపీఎం ప్రభావం ఎన్నికల్లో కీలకం కానుంది. చాలా ఏళ్లు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోట. 2007లో జరిగిన కాల్పుల ఘటనతో వారి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. కేడర్ పెద్ద సంఖ్యలో పార్టీని విడిచి వెళ్లిపోయారు. అయితే టీఎంసీ అధికారంలోకి వచ్చాక సీపీఎం నాయకులపైనా, కార్యకర్తలపైనా దాడులు జరగడంతో మమతపై వారంతా గుర్రుగా ఉన్నారు. వీరు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. సీపీఎం విద్యార్థి నాయకురాలైన మీనాక్షి ముఖర్జీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీకి దిగింది. వాక్పటిమ కలిగిన మీనాక్షి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కమ్యూనిస్టులు తమ ఓటు బ్యాంకును తిరిగి కొల్లగొడితే సువేందు అధికారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి. – నందిగ్రామ్ నుంచి సాక్షి ప్రతినిధి -
మమత నామినేషన్ తిరస్కరించాలంటూ బీజేపీ ఫిర్యాదు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించాలని ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికల సంఘాన్ని కోరారు. మమతా బెనర్జీపై ఉన్న ఆరు క్రిమినల్ కేసులను ఆమె నామినేషన్లో ప్రస్తావించలేదని చెప్పారు. ఇందులో ఐదు కేసులు అస్సాంలో, ఒక కేసు బెంగాల్లో సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. ఆమె వాటిని నామినేషన్ పత్రాల్లో పేర్కొనకుండా తొక్కిపెట్టారని విమర్శించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేసు నంబర్లను కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించానని సువేందు అధికారి చెప్పారు. ప్రస్తుతం ఆయా కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. చట్ట ప్రకారం మమతా బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. సువేందు అధికారి ఫిర్యాదుపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు. అది ఓటర్ల ప్రాథమిక హక్కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, తమపై ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నామినేషన్ పత్రాల్లో పేర్కొనకపోతే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆ నామినేషన్‌ను తిరస్కరించవచ్చని 2018 మార్చి నెలలో సుప్రీంకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది. అభ్యర్థుల గురించి పూర్తిగా తెలుసుకోవడం ఓటర్ల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. నామినేషన్ పత్రాల్లో కొన్ని కాలమ్స్‌ను ఖాళీగా ఉంచడం ఆ హక్కుకు భంగం కలిగించినట్లే అవుతుందని తేల్చిచెప్పింది. -
మమతను ఢీకొట్టేందుకు రెడీ..
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢీకొట్టేందుకు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి సిద్ధమవుతున్నారు. ఆయన ఈ నెల 12న నందిగ్రామ్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో దీదీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న సువేందు.. మారిన సమీకరణల కారణంగా బీజేపీ తీర్ధం పుచ్చుకొని, ఏకంగా ఆమెపైనే పోటీకి సిద్ధం కావడంతో అందరి కళ్లు ఈ స్థానంపైనే పడ్డాయి. దీదీ ప్రతిసారీ పోటీ చేసే భవానీపూర్‌ను కాదని నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించిన వెంటనే, బీజేపీ వేగంగా పావులు కదిపి ఆమెకు సరితూగే బలమైన అభ్యర్ధిని బరిలో దించింది. దీంతో పోరాటాల పురిటిగడ్డ అయిన నందిగ్రామ్ మరోసారి వార్తల్లోకెక్కింది. -
దీదీ వర్సెస్ సువేందు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న నందిగ్రామ్‌లో ఆమెకు పోటీగా బీజేపీ సువేందు అధికారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. శనివారం 57 మంది అ«భ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మాజీ క్రికెటర్ అశోక్ దిందా, మాజీ ఐపీఎస్ అధికారి భారతి ఘోష్‌లకు తొలి జాబితాలో చోటు దొరికింది. 57 మంది పేర్లతో కూడిన జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఒక్క స్థానాన్ని మిత్రపక్షం ఏజేఎస్‌యూకి కేటాయించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో తొలి రెండు విడతల్లో జరిగే 60 స్థానాలకు గాను 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ జాబితా రూపొందించింది. 2011లో ఉవ్వెత్తున ఎగసిన నిరసన ప్రదర్శనలతో మమత అధికారంలోకి రావడానికి కారణమైన నందిగ్రామ్ ఈ సారి ఎన్నికల్లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. 2016లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సువేందు అధికారి ఇటీవల బీజేపీలో చేరడానికి ముందు తన పదవికి రాజీనామా చేశారు. -
బెంగాల్ ఫైట్: బీజేపీ నేత సువేందు అధికారికి నోటీసులు
కోల్‌కతా: బీజేపీ నేత సువేందు అధికారి తనపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. జనవరి 19న ఖేజూరిలో జరిగిన బహిరంగ సభలో తన పరువుకు భంగం కలిగే విధంగా అసత్యమైన ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ సువేందు అధికారికి లీగల్ నోటీసులు పంపారు. 36 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, అతనిపై చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తామని అభిషేక్ బెనర్జీ తరపున లాయర్ పేర్కొన్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితుడైన సువేందు.. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఏంటని అభిషేక్ ప్రశ్నించారు. అహంకారంతో విర్రవీగుతున్న సువేందు.. ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నేరాలను మరిచిపోయారని ధ్వజమెత్తారు. శారదా చిట్ ఫండ్ స్కాం, నారద లంచం కేసుల్లో సువేందు ప్రమేయాన్ని నోటీసుల్లో ప్రస్థావించారు. అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్వయానా మేనల్లుడు. కాగా, గతంలో టీఎంసీ కీలక నేతల్లో ఒకరైన సువేందు.. మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించారు. ఆయన ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. సువేందుతో పాటు పలువురు టీఎంసీ నేతలు కమల తీర్ధం పుచ్చుకున్నారు. త్వరలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అధికార టీఎంసీ, భాజపాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మమతను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. -
రాళ్లదాడి.. బీజేపీకి చేదు అనుభవం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మరో సారి చేదు అనుభవం ఎదురయ్యింది. గతంలో టీఎంసీ కార్యకర్తలు బీజేపీ జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి చేయగా.. ప్రస్తుతం బీజేపీ నాయకుడు సువేందు అధికారి పాల్గొన్న ర్యాలీలో ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి దేవశ్రీ చౌధురి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, మాజీ మంత్రి సువేందు అధికారి పాల్గొన్నారు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఓటమి భయంతోనే టీఎంసీ నాయకులు మాపై దాడి చేశారు. వారంతా మిని పాకిస్తాన్‌కు చెందిన వారు’ అన్నారు. (చదవండి: వ్యూహాత్మక ఎత్తుగడ: బీజేపీకి దీదీ సవాల్) వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ హింస చోటుచేసుకోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఏప్రిల్- మే నెలల్లో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో పాగా వేయాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు పరివర్తన్ ర్యాలీ నిర్వహించింది. అయితే, ఈ ర్యాలీపై కొందరు వ్యక్తులు వాటర్ బాటిళ్లు విసిరారు. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ జెండాలను పట్టుకొన్న కొందరు వ్యక్తులు ‘గో బ్యాక్’ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో దక్షిణ కోల్‌కతాలోని ముదియాలి ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గతేడాది జేపీ నడ్డా పర్యటన సందర్భంగా కూడా కోల్‌కతాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ చేసిన ప్రకటనపై సువేందు స్పందించారు. ఆమెని 50 వేల ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని తెలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఆమెని(దీదీ) నందిగ్రామ్‌లో అర లక్ష ఓట్ల తేడాతో ఓడిస్తాను. లేదంటే రాకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. -
దీదీకి షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత సువేందు అధికారి టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రి పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి లక్ష్మి రతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ నేతలు ఒక్కొక్కరు టీఎంసీ వీడుతూ దీదీకి షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలో రతన్ శుక్లా తన రాజీనామా లెటర్ ఒక కాపీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, మరో దాన్ని గవర్నర్ జగదీప్ ధంకర్‌కు అందజేశారు. గతంలో బెంగాల్ రంజీ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రతన్ శుక్లా హౌరా(ఉత్తర) నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రతన్ శుక్లా రాజీనామాపై స్పందిస్తూ.. ‘పార్టీకి, నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు. రాజకీయాల నుంచి రిటైర్ అవుదామనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అన్నారు. (చదవండి: మమతకు వరుస షాక్‌లు.. స్పీకర్ ట్విస్టు!) ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. మమతకు కంటికి మీద కునుకు లేకుండా చేస్తోంది. సువేంధు అధికారి పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి టీఎంసీలో చీలికలు మొదలయ్యాయి. ఇక కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా ఎన్నికల నాటికి టీఎంసీలో దీదీ మాత్రమే మిగులుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబెల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సువేందు అధికారి తమ్ముడు కూడా బీజేపీలో చేరారు. సౌమేందు అధికారి తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని మునిసిపాలిటీకి కౌన్సిలర్, చైర్‌పర్సన్‌గా ఉన్నారు. గత వారం ఆయనతో కలిసి మరో డజను మంది ఇతర పార్టీ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. అయితే అధికారి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు సభ్యులు సువేందు అధికారి తండ్రి సిసిర్, సోదరుడు దిబ్యేండుల్‌లు మాత్రం టీఎంసీలో కొనసాగుతున్నారు. -
ఆ వైరస్ పీడ విరగడైంది.. సంతోషం: ఎంపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ), బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఇరువర్గాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ క్రమంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నారద, శారద పోంజి స్కాం వంటి కుంభకోణాల్లో తనకు భాగస్వామ్యం లేదంటూ తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. తాను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డానని రుజువు చేస్తే బహిరంగంగా ఉరివేసుకోడానికి సిద్ధమని సవాల్ విసిరారు. కాగా ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సీనియర్ నేత సువేందు.. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ.. అభిషేక్ బెనర్జీపై విమర్శలు గుప్పించారు. తోలాబాజ్(అధికార దుర్వినియోగానికి పాల్పడి బలవంతపు వసూళ్లు చేసేవాడు) అంటూ విరుచుకుపడ్డారు. అలాంటి వాళ్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇక తన నియోజకవర్గమైన డైమండ్ హార్బర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ సువేందు వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి తనను విమర్శించే హక్కులేదన్నారు. (చదవండి: 21 ఏళ్లు.. అందుకు సిగ్గుపడుతున్నా!) ఈ మేరకు.. ‘‘లక్షణాలు బయటపడని కోవిడ్-19 రోగులు మన పార్టీలో చాలా మందే ఉండేవారు. వారి కార్యకలాపాలను మేం ట్రేస్ చేశాం. వారిని గుర్తించాం. 2019 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించిన వైరస్ వెళ్లిపోవడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమైన తోలాబాజే నన్ను ఆ మాట అంటున్నారు. శారద స్కాంలో ఆయన పేరు బయటకి వచ్చింది. ఒక్క విషయం చెప్పనా ఫ్రెండ్.. నేను నారద, శారద కుంభకోణాల్లో భాగస్వామిని కాను. ఈడీ, సీబీఐ నాపై దాడులు చేసినా ప్రతిఫలం ఉండదు. ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి’’ అని సువేందుకు కౌంటర్ ఇచ్చారు. -
21 ఏళ్లు.. అందుకు సిగ్గుపడుతున్నా!
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఓ కంపెనీలా మారిందని, అక్కడ ఎవరికీ క్రమశిక్షణ లేదంటూ బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుదీర్ఘకాలం పాటు ఆ పార్టీలో కొనసాగినందుకు తాను సిగ్గుపడుతున్నానని పేర్కొన్నారు. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్లో మంత్రిగా విధులు నిర్వర్తించిన ఆయన ఇటీవలే తన పదవికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన తనకు సముచిత స్థానం దక్కకపోవడం, మమతతో విభేదాలు తలెత్తడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి సువేందు అధికారి శనివారం ప్రసంగించారు. (చదవండి: ఒక్కొక్కరికి రూ. 2.5 లక్షలు: అమిత్ షా) ‘‘డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ త్యాగ ఫలితంగానే మనం నేడు బెంగాల్లో జీవించగలుగుతున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగం పెరిగిపోయింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తోడు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది’’ అని పేర్కొన్నారు. ఇక పార్టీ మారడం గురించి మాట్లాడుతూ.. ‘‘21 ఏళ్ల పాటు తృణమూల్‌తో బంధం కొనసాగించినందుకు సిగ్గుపడుతున్నా. ఆ పార్టీలో అసలు ఇప్పుడు క్రమశిక్షణ లేదు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. జాతీయత, దేశ భక్తి, క్రమశిక్షణకు మారు పేరైన ఈ పార్టీలో ఇప్పుడు నేను కూడా సభ్యుడిని. అధిష్టానం మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని సోనార్ బంగ్లాగా తీర్చిదిద్దడమే మన అందరి లక్ష్యం’’ అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి దిశానిర్దేశం చేశారు. ‘‘బీజేపీ కార్యకర్తలపై విచక్షణా రహిత దాడులు జరుగుతున్నాయి. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పార్టీ కోసం ఇప్పటికే 135 మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు. ఇవన్నీ పోలీసులకు కనిపించవు’’ అని మమత ప్రభుత్వాన్ని విమర్శించారు. అదే విధంగా పీఎం- కిసాన్ యోజన అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని సువేందు మండిపడ్డారు.(చదవండి: రాష్ట్రాన్ని నాశనం చేశారు: ప్రధాని మోదీ) -
మమత మాత్రమే మిగులుతారు!
మిడ్నాపూర్: రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, కేవలం మమతా బెనర్జీ మాత్రమే పార్టీ్టలో ఉంటారని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. శనివారం బెంగాల్లో ఆయన టీఎంసీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంసీ సీనియర్ నేత సువేందు అధికారి సహా పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. టీఎంసీ నినాదమైన ‘‘మా, మాటి, మనుష్(తల్లి, జన్మభూమి, ప్రజ) కాస్తా ‘‘దోపిడీ, అవినీతి, బంధుప్రీతి’’గా మారిపోయిందని అమిత్ షా దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 200 పైగా సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు మార్పు కోసం బీజేపీ వెనుక నడిస్తే మమతకు ఏమి సమస్యని ఆయన ప్రశ్నించారు. బంధుప్రీతి, బుజ్జగింపులే కారణం ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరడానికి టీఎంసీ అనుసరిస్తున్న బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే కారణమని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ నుంచి పలువురు నేతలు సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీలో మోదీ నాయకత్వంలో పనిచేయడానికి చేరారని చెప్పారు. టీఎంసీలో చీలికలను బీజేపీ ప్రోత్సహిస్తోందన్న విమర్శలపై స్పందిస్తూ 1998లో టీఎంసీ ఏర్పడిందే కాంగ్రెస్ నుంచి చీలిపోయాయని గుర్తు చేశారు. టీఎంసీ నుంచి నేతలు వీడడం ఆరంభమేనని, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఎంసీని వీడుతున్నారన్నారు. ఇదే విధంగా వలసల జోరు కొనసాగితే ఎన్నికల నాటికి టీఎంసీలో మమత మాత్రమే మిగులుతారన్నారు. 9 మంది ఎంఎల్ఏలు, ఒక ఎంపీ అధికార టీఎంసీకి చెందిన కీలక నేత సువేందు అధికారి సహా వివిధ పార్టీలకు చెందిన 9 మంది ఎంఎల్ఏలు, ఒక టీఎంసీ ఎంపీ అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇటీవలే టీఎంసీకి సువేందు రాజీనామా చేశారు. బర్ధమాన్ పుర్బాకు చెందిన ఎంపీ సునీల్ మండల్, టీఎంసీ ఎంఎల్ఏలు బన్సారీ మైటీ, శిలభద్ర దత్తా, బిస్వజిత్ కుందు, సుక్రా ముండా, సైకత్ పంజా, సీపీఎం నుంచి టీఎంసీలో చేరిన ఎంఎల్ఏ దిలీప్ బిస్వాస్, సీపీఎంకే చెందిన మరో ఎంఎల్ఏ తపసి మండల్, సీపీఐ ఎంఎల్ఏ అశోక్దిండా, కాంగ్రెస్ ఎంఎల్ఏ సుదీప్ ముఖర్జీ బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ దశరధ్ టిర్కీ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు టీఎంసీ, లెఫ్ట్, పలువురు కాంగ్రెస్ జిల్లాస్థాయి నేతలు బీజేపీలో చేరారు. రైతు ఇంట భోజనం... పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్న హోంమత్రి అమిత్‌షా శనివారం ఒక రైతు ఇంట మధ్యాహ్న భోజనం చేశారు. బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని బలిజ్హరిలో నివాసముండే సనాతన్ సింగ్ నివాసానికి వెళ్లిన అమిత్‌షా అక్కడే నేలపై కూర్చొని భోజనం చేశారు. ఆయనతోపాటు బీజేపీ నేతలు కైలాస్ విజయ్వర్ఘీయ్, ముకుల్‌రాయ్, దిలీప్ ఘోష్ భోజనాలు చేశారు. అంతకుముందు స్థానిక ఆలయంలో అమిత్ పూజలు నిర్వహించారు. తన ఇంట్లో హోంమంత్రి విందారగించడంపై సనాతన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. కేవలం పప్పు, రోటీలను మాత్రమే భోజనంలో ఇవ్వగలిగానన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు కదం తొక్కుతున్న వేళ రైతు ఇంట విందుకు అమిత్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చేఎన్నికల్లో రైతులను ఆకట్టుకునే వ్యూహంలో ఇది ఒక భాగమని భావిస్తున్నారు. ఎవరీ సువేందు? మమతా బెనర్జీ ప్రస్తుత ప్రభుత్వంలో సువేందు అధికారి రవాణా, నీటిపారుదల–జల వనరుల మంత్రిగా పనిచేశారు. నవంబర్ 27 న ఆయన మంత్రి పదవికి, డిసెంబర్ 16న ఎమ్మెల్యే పదవికిడిసెంబర్ 17న టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ తరువాత సువేందు అధికారికి జనాదరణ ఎక్కువగా ఉందంటారు. 2007నందిగ్రామ్ ఉద్యమంలో అధికారి కీలక పాత్ర పోషించారు. అనంతరం ‘జంగల్ మహల్’గా పేరుతెచ్చుకున్న పశ్చిమ మిడ్నాపూర్, పురూలియా, బంకురా జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. రెండు మార్లు లోక్‌సభ ఎంపీగా కూడా ఆయన ఎన్నికయ్యారు. వెస్ట్ మిడ్నాపూర్, బంకురా, పురులియా, ఝూర్గ్రామ్, బీర్భూమిలోని కొన్ని ప్రాంతాలతో కలిపి మొత్తం 60 నుంచి 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారి కుటుంబ ప్రభావం ఉంటుందని విశ్లేషకుల అంచనా. అతనే కారణమా? ఇటీవల తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగానే సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారని బయటకు వినిపిస్తున్నా, అసలు కారణం వేరే ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలోని ఇతర సీనియర్ నాయకులకన్నా ప్రాధాన్యం పెరగడం, అభిషేక్‌ను తన వారసునిగా మమత సిద్ధం చేయడమే సువేందు అధికారి సహా అనేకమంది సీనియర్ల అసంతృప్తికి అసలు కారణమంటున్నారు. -
మమతకు వరుస షాక్‌లు.. స్పీకర్ ట్విస్టు!
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార తృణమూల్ పార్టీని దెబ్బకొట్టి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మమతకు కుడిభుజంగా ఉన్న ముకుల్ రాయ్‌ను మూడేళ్ల క్రితమే తమ పార్టీలో చేర్చుకున్న కాషాయ దళం.. ఇప్పుడు టీఎంసీ ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన మంత్రి సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఇక ఈరోజు మరో ఎమ్మెల్యే శిల్భద్ర దత్తా సహా మైనార్టీ సెల్ నాయకుడు కాబిరుల్ ఇస్లాం టీఎంసీని వీడారు. అదే విధంగా 24 గంటల్లోనే నలుగురు ముఖ్యనేతలు పార్టీని వీడటం, రానున్న రోజుల్లో భారీ ఎత్తున క్షేత్రస్థాయి కార్యకర్తలు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీఎంసీ మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారి సహా ఆయన అనుచరుడు, దక్షిణ బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ చీఫ్, గ్రీవెన్స్ సెల్ హెడ్ కల్నల్ దీప్తాంశు చౌదరి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌కు లేఖ పంపించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వారంతంలో బెంగాల్లో పర్యటించనున్న నేపథ్యంలో వీరంతా అప్పుడే కాషాయ కండువా కప్పుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు టీఎంసీలో కలవరం రేపుతున్నాయి.(చదవండి: కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం) మమతకు వరుస షాకులు.. గవర్నర్ నిర్ణయం టీఎంసీ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే సువేందు అధికారి రాజీనామాను స్పీకర్ అంగీకరించలేదు. ఈనెల 21న ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆయనకు సందేశం పంపారు. ఇదిలా ఉండగా.. బారక్‌పోర్ నుంచి గెలుపొందిన శిల్భద్ర దత్తా మాత్రం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీని వీడుతున్నట్లు మమతకు రాసిన లేఖలో.. ‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఇమడలేనని నాకు అనిపిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. అయినా నేనెందుకు రాజీనామా చేయాలి? ప్రజలు ఓట్లు వేసి నన్ను గెలిపించారు. నేను పదవిలో లేనట్లయితే వాళ్లు ఎవరిని ఆశ్రయిస్తారు. కేవలం పార్టీని మాత్రమే వీడుతున్నాను’’అని ఆయన పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తనలాంటి రెబల్స్‌ను బుజ్జగించేందుకు టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ లేదా ఆయన టీం రంగంలోకి దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సెటైర్లు వేసిన బీజేపీ ఐటీ సెల్ ముకుల్ రాయ్ సహకారంతో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 294 అసెంబ్లీ సీట్లలో 200 మేర స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మమత సర్కారును విమర్శించే ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా మాటల దాడి చేస్తోంది. ఇక బీజేపీ సోషల్ మీడియా వింగ్ సైతం విమర్శనాస్త్రాలు సంధిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తాజా పరిణామాలపై స్పందించిన బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ.. ‘‘ఈస్థాయిలో టీఎంసీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారంటే.. ఆంటీ తన కార్యాలయంలో రాజీనామా లేఖలు కలెక్ట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ సెంటర్ పెడితే సరిపోతుంది’’అంటూ ట్విటర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ ప్రాంతంపై అధికారికి పట్టు! ఓవైపు టీఎంసీ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతుండగా.. మరోవైపు బీజేపీ ఆ పార్టీ ముఖ్యనేతలకు గాలం వేస్తూ రోజురోజుకీ బలం పెంచుకుంటోంది. సువేందు అధికారి బీజేపీలో చేరడం లాంఛనమే అని పార్టీ వర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే. కాగా అధికారిని చేర్చుకోవడం వల్ల కాషాయ దళానికి భారీగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంపై ఆయనకు పట్టు ఉంది. సుమారు 50 సీట్లలో పార్టీని గెలిపించే సత్తా ఆయనకు ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఈ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు రావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇక బీజేపీ తీరుపై ఇటీవలి కూచ్‌బెహర్ పర్యటనలో భాగంగా మమతా బెనర్జీ ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీ నేతలకు ఫోన్లు చేస్తూ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీశారని మండిపడ్డారు. అదే విధంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ‘‘కొంతమంది అలల్లాగా వస్తారు పోతారు. కానీ టీఎంసీ ఉనికిని ఎవరూ ఎన్నటికీ మాయం చేయలేరు’’ అని చెప్పుకొచ్చారు. కాగా పశ్చిమబెంగాల్లో గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ క్రమంగా పట్టుబిగిస్తోంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల డేటాని బట్టి చూసినా కామ్రేడ్ల స్థానాన్ని కాషాయం ఆక్రమిస్తున్న విషయం దృఢపడుతోంది. -
ఎమ్మెల్యే పదవికి సువేందు అధికారి రాజీనామా
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, శాసనసభ ఎన్నికల్లోనూ తన మార్కు చూపించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఎపిసోడ్ సహా ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రం వర్సెస్ మమత అన్నట్లుగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ అసంతృప్త నేత సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. (చదవండి: కేంద్రంతో మమత ఢీ) కాగా టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో సువేందు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేసిన ఆయన హూగ్లీ రివర్ బ్రిడ్జి కమిషన్ చైర్మన్ పదవి నుంచి కూడా వైదొలిగారు. దీంతో ప్రభుత్వానికి, సువేందుకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన అనుచరులు పలువురిని బహిష్కరిస్తూ ఆదివారం పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా సుభేందు అధికారి టీఎంసీని వీడినట్లయితే మమత సర్కారు కుప్పకూలూతుందంటూ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేగాక సువేందు బీజేపీలో చేరినట్లయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మా నాయకుడికి బీజేపీ నేతల ఫోన్: మమతా బెనర్జీ అధికార దాహంతో బీజేపీ తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. కూచ్‌బెహర్ జిల్లాలో ఆమె మాట్లాడుతూ.. ‘‘బీజేపీ మా నాయకులకు ఫోన్‌కాల్స్ చేస్తోంది. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా భక్తికి ఢిల్లీ బీజేపీ నేతల నుంచి, అనుబ్రతా మొండాల్‌కు బీర్భూమ్ నుంచి కాల్ వచ్చింది. చూడండి వాళ్లెంత ప్రమాదకరమో చూడండి. మా నాయకులను లాక్కొనేందుకు వారి ప్రయత్నాలు చూడండి’’ అని విమర్శించారు. ‘‘బీజేపీ దొంగలు, గూండాలు, చంబల్ దోపిడీదారుల పార్టీ. కూచ్‌బెహర్‌లో వాళ్లు చేసిన అభివృద్ధి ఏమీలేదు. వలస కార్మికుల రైలు చార్జీలు నేను చెల్లించాను. మైనార్టీలను అక్కున చేర్చుకున్నాను. బీజేపీని నమ్ముకుంటే లాభం లేదు’’ అని పేర్కొన్నారు. -
రసవత్తరం కానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నాయకుడు, తిరుగుబాటు నేత సువేందు అధికారి ఆ పార్టీకి తల నొప్పిగా మారనున్నారు. టీఎంసీ పార్టీ నాయకుడు సౌగతా రాయ్(49) అయిదుగు పార్టీ నాయకులతో రెండు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించారు. సువేందు నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటే మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. (చదవండి: పశ్చిమ బెంగాల్లో విషాదం, 11 మంది మృతి) పార్టీలో మొదలైన ముసలం టీఎంసీ యూత్ వింగ్ చీఫ్, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పార్టీలో ప్రాధాన్యత పెరగడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహితుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో పార్టీ ఫిరాయించిన చాలా మంది బీజేపీలో చేరడంతో గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంటే.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 40 స్థానాలకు గానూ 18 గెలుచుకుంది. మారనున్న సమీకరణాలు సువేందు పార్టీ మారకపోయినా.. పార్టీ నుంచి నిష్క్రమిస్తే మాల్డా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, పశ్చిమ మిడ్నాపూర్ ప్రాంతాల్లోని స్థానిక నాయకులపై ప్రభావం చూపనుంది. సువేందు పదవిని రద్దు చేసే వరకు ఈ ప్రాంతంలో ఆయన అధికారి పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన తండ్రి, సోదరుడు ఇద్దరు కూడా టీఎంసీ పార్టీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సువేందు మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి పార్టీలో అగ్రస్థానం చేరుకోవడానిక దొడ్డి దారి ఎంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై బెనర్జీ స్పందిస్తూ... ‘‘నేను డైమండ్ హార్బర్ వంటి కఠినమైన నియోజకవర్గం నుంచి ఎంపీ కావడానికి పారాచూట్, నిచ్చెనను ఉపయోగించలేదు. డైమండ్ హార్బర్ నా సొంత నియోజకవర్గం. మా కుటుంబంలో వారు కూడా చాలా పదవులు కలిగి ఉన్నారు’ అని అన్నారు. మంగళవారం ఉత్తర కోల్‌కత్తాలో జరిగిన సమావేశంలో ఎన్నికల ప్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తోపాటు బెనర్జీ హాజరయ్యారు. -
‘తల్లికి నమ్మకద్రోహం చేస్తే.. అధోగతే’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నాయకుడు, రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి శుక్రవారం మమతా బెనర్జీ మంత్రి వర్గం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తాను పైకి ఎదగడానికి లిఫ్ట్ ఉపయోగించలేదని, పార్టీ కార్యకర్తలే తన బలమని, పారాచూట్ ఉపయోగించి కిందికి రాలేను’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ యూత్ వింగ్ చీఫ్, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తన నియోజకవర్గమైన సత్గాచియాలో జరిగిన బహిరంగ ర్యాలీలో స్పందిస్తూ.. టీఎంసీ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పార్టీ సభ్యులకు తల్లిలాంటిదన్నారు. పార్టీ సభ్యులు అంచెలంచెలుగా ఎదగడానికి, ప్రజల కోసం పని చేయడానికి ఆమె అవకాశం ఇచ్చారన్నారు. వ్యక్తిగత లాభాల కోసం ఎవరైనా తల్లి నమ్మకాన్ని వమ్ము చేస్తే, పార్టీకి నష్టం కలిగిస్తే అతను తల్లికి నమ్మకదోహం చేసినట్లా? కాదా? అని ప్రశ్నించారు. నమ్మకద్రోహం చేస్తే అది అతని పతనానికి నాందని ఆయన అన్నారు. (చదవండి: షాకింగ్‌గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు!) టీఎంసీ నిర్వహించిన రిజర్వేషన్ సమస్యల సమావేశంలో పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాల్లో పట్టున్న నాయకుడు, ప్రముఖ ఎంపీ సౌగతా రాయ్‌తో సుబేందు రిజర్వేషన్లపై తన అభిప్రాయం పంచుకున్నారు. ఆయన వామపక్ష ఫ్రంట్‌ను ఓడించి మమతా బెనర్జీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. నందిగ్రామ్ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమానికి ఆయన వెన్నుముకగా నిలిచారు. అయితే కొంత కాలంగా టీఎంసీ పార్టీ కార్యకలాపాలకు సువేందు దూరంగా ఉంటున్నారు. -
టీఎంసీ పతనం ఆరంభం: సువేందుకు స్వాగతం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉందన్న అంచనాల మధ్య రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు అధికారాన్నికాపాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్టీలో రగులుతున్న అసమ్మతి సెగలు, రాజీనామాలతో టీఎంసీ కష్టాల్లో కూరుకుపోతోంది. మరోవైపు తిరుగుబాటు నాయకులను బుజ్జగించి కాషాయ దళంలో చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తాజా పరిణామాలపై మాజీ టీఎంసీ నేత, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రవాణా మంత్రి, సీనియర్ నాయకుడు సువేందు అధికారి రాజీనామాను స్వాగతించిన ఆయన టీఎంసీ ముగింపు ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఆయన బీజేపీలో చేరితే పార్టీకి, ఆయనకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సువెందు మంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటలకే ఆయన ఈ మేరకు స్పందించారు. (క్లిష్ట సమయంలో మమతకు భారీ షాక్) మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ సువేందు అధికారికి బీజేపీ ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీ తీరు పట్ల మరికొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, వారికి కూడా బీజేపీలోకి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. సువెంద్ రాజీనామా టీఎంసీ పతనానికి సంకేతమనీ, ఇక ఆ పార్టీ తెరమరుగవ్వడం ఖాయమన్నారు. అంతేకాదు "ఈ రోజు పెద్ద వికెట్ పడిపోయింది" ఇక ఆత్మగౌరవమున్న నాయకులంతా టీఎంసీకి గుడ్‌బై చెబుతారని ఘోష్ జోస్యం చెప్పారు. అదొక మునిగిపోతున్న ఓడ, అందులో కెప్టెన్ మినహా ఎవరూ ఎవ్వరూ ఉండరన్నారు. 2019 (లోక్‌సభ ఎన్నికలు) బీజేపీకి సెమీ ఫైనల్. తామిపుడు 202 (అసెంబ్లీ ఎన్నికలు) లో ప్రధాన లక్ష్యానికి ముందుకుపోతున్నాం.. సువెందు అధికారి తమ పార్టీలోచేరితే ఇది మరింత ఊపందుకుంటుదన్నారు. కాగా టీఎంసీ సీనియర్ నేత రవాణ శాఖ మంత్రి సువేందు అధికారి ఈరోజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనికి ముందు గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హుగ్లీ రివర్ బ్రిడ్జి కమిషనర్స్ చైర్మన్ పదవికి కూడా గుడ్‌బై చెప్పారు. మరోవైపు కూచ్బెహార్కు చెందిన టీఎంసీ మాజీ ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి శుక్రవారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకన్నారు. దీంతో 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. -
క్లిష్ట సమయంలో మమతకు భారీ షాక్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సీనియర్ నాయకుడు, రెబెల్ రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి మంత్రి పదవికి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన చివరకు ప్రభుత్వంనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలినట్టయింది. గురువారం కీలక పదవికి రాజీనామా చేసిన ఆయన తాజాగా మంత్రి పదవికి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన సీఎంకు శుక్రవారం ఒక లేఖ రాశారు. తన రాజీనామాను వెంటనే అంగీకరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నిబద్ధత, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేశానని లేఖలో పేర్కొన్నారు. కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోమారు అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న మమతా బెనర్జీకి అసమ్మతి సెగ భారీగానే తగులుతోంది. క్లిష్ట సమయంలో పెనుసవాళ్లు ఎదురవుతున్నాయి. అండగా ఉండాల్సిన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. ముఖ్యంగా ఈ నెలలో జరిగిన కేబినెట్ సమావేశానికి ఐదుగురు మంత్రులు గైర్హాజరు కావడం టీఎంసీలో కలవరం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు గత కొన్ని వారాలుగా అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న అధికారి గురువారం హూగ్లీ రివర్ బ్రిడ్జ్ కమిషన్ చైర్మన్ పదవినుంచి తప్పుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ్ బెనర్జీని కొత్తగా నియమించింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌లో తాజా తిరుగుబాటు చర్చనీయాంశంగా మారింది. -
శారద స్కాం: ఎంపీని ప్రశ్నించిన సీబీఐ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారద చిట్‌ఫండ్ స్కాంలో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సువేందు అధాకారిని ప్రశ్నించారు. సీబీఐ అధికారులు దాదాపు గంటసేపు ఆయనను ప్రశ్నించారు. అనంతరం అధికారి మాట్లాడుతూ.. 'సాక్షిగా నన్ను విచారించారు. నాకు తెలిసిన విషయాలను వారికి చెప్పా' అని అన్నారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లుక్ నియోజకవర్గం నుంచి ఆయన పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీబీఐ ఈ కేసులో పలువురు ఎంపీలతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇటీవల ప్రశ్నించారు.


