దీదీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Mamata Petition On Malpractices In The Counting Of Votes For The Nandigram Assembly Seat Has Been Deferred - Sakshi

సాక్షి, కోల్‌కతా : నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కౌశిక్‌ చందా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. కాగా, దీదీపై సువేందు అధికారి రెండు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో నందిగ్రామ్‌ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. కౌంటింగ్‌ రోజు నాటకీయ పరిణామాలు జరగ్గా.. రీ కౌంటింగ్‌ కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్‌ తోసిపుచ్చింది.

ఇక ఫలితాల మరుసటి రోజే మమతా బెనర్జీ, సువేందు ఎన్నికపై కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. అంతేకాదు ఆ సమయంలో ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కిషోర్‌ బిశ్వాస్‌ ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ.. ఆయనకు భద్రత కల్పించింది మమత సర్కార్‌.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top