రసవత్తరంగా కోల్‌కతా రాజకీయాలు.. | Calcutta High Court Justice Abhijit Gangopadhyay Amid Speculations Of Him Joining The Bjp | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా కోల్‌కతా రాజకీయాలు..

Mar 4 2024 1:30 PM | Updated on Mar 4 2024 1:38 PM

Calcutta High Court Justice Abhijit Gangopadhyay Amid Speculations Of Him Joining The Bjp - Sakshi

సాక్షి,కోల్‌కతా : దేశంలో ఎన్నికల రణరంగంలో ఆసక్తికర పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ప్రజా సంక్షేమం కోసం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన అనంతరం జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ త్వరలో రాజకీయాల్లోకి అడుగపెట్టనున్నారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.  

ఇటీవల జస్జిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ పశ్చిమ్‌ బెంగాల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ చేపట్టారు. సీబీఐ, ఈడీలకు సైతం దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ అంశం కోల్‌కతాతో పాటు దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. 

తమ్లుక్‌ లోక్‌సభ అభ్యర్ధిగా..     
ఇప్పుడు ఆయనే స్వయంగా రాజకీయాల్లో అడుగు పెడుతుండడంతో కోల్‌కతా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్‌లోని తమ్లుక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఆయనను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టవచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. ఒకప్పుడు ఈ స్థానంలో  పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్షనేత, బీజేపీ నేత సువేందు అధికారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సువేందు అధికారి తమ్ముడు,  టీఎంసీ నేత దిబ్యేందు అధికారి ఎంపీగా కొనసాగుతున్నారు.

పార్టీల కోసం..
మరోవైపు కోల్‌కత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ రాజీనామాపై ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.‘హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం అంటే న్యాయం చేయడం లేదు. పార్టీ కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement