పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీదీ నాలుగోసారి అధికారంలోకి వస్తారా? బీజేపీ టీఎంసీకి చెక్ పెడుతుందా? అనేది తేలిపోనుంది. మొత్తం 294 స్థానాల్లో అధికారం కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 148. అయితే ఫాల్తా రీపోలింగ్ నేపథ్యంలో.. ఆ సంఖ్య 293-147గా మారింది.
ప్రజాశక్తి విజయం సాధించింది.. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ
బెంగాల్ ప్రజల ఆకాంక్షలను మేం నెరవేరుస్తాం
పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించింది
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి
ప్రజాశక్తి విజయం సాధించింది
బీజేపీ సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి
పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రతి ఒక్కరికీ నేను నమస్కరిస్తున్నాను
ప్రజలు బీజేపీకి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు
వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా పార్టీ సాధ్యమైన ప్రతిదీ చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను
బెంగాల్ ఫలితాలపై స్పందించిన మమత
ఎస్‌ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్లను దొంగిలించింది.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ హవా
- మెజార్టీ మార్క్ దాటిన కమలం
బీజేపీ ఓట్లు దొంగలించింది: మమతా బెనర్జీ
ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంపై స్పందించిన మమతా బెనర్జీ
టీఎంసీ శ్రేణులకు కీలక సూచనలు
ఈ ఫలితాలు చెంది నిరాశ చెందొద్దు
మూడు రౌండ్ల కౌంటింగే జరిగింది
కౌంటింగ్ నిలిపివేశారు
70 స్థానాల్లో కౌంటింగ్‌పై ఈసీ అప్‌డేట్ ఇవ్వడం లేదు
తుది ఫలితాల్లో మనదే విజయం
తొందరపడి కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లొద్దు
బీజేపీ ఓట్లు దొంగిలిస్తోంది
బెంగాల్‌లో కమల వికాసం
- భారీ ఓటమి దిశగా తృణమూల్ కాంగ్రెస్
- 193 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ
- 97 స్థానాల్లో టీఎంసీ
- కాంగ్రెస్ 1, సీపీఎం 2 స్థానాల్లో ఆధిక్యం
బెంగాల్ విజయోత్సవాల్లో మోదీ
- సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ
- పశ్చిమ బెంగాల్ సహా అస్సాంలో బీజేపీ క్లీన్‌స్వీప్
- పుదుచ్చేరి(కేంద్రపాలిత ప్రాంతం)లో ఎన్డీయే కూటమి ఘన విజయం
- విజయోత్సవాల్లో పాల్గొననున్న మోదీ
బెంగాల్‌లో కమల వికాసం
- తృణమూల్ చేజారిన పశ్చిమ బెంగాల్
- విజయం దిశగా దూసుకెళ్తున్న బీజేపీ
- ఇప్పటికే 150+ స్థానాల్లో స్పష్టంగా కొనసాగుతున్న లీడ్
- 125 స్థానాల ఆధిక్యంలో టీఎంసీ
- లెఫ్ట్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యం
- ఇతరులు ఒక స్థానం
- కాంగ్రెస్ ఆధిక్యం జీరో
అనూహ్య విజయ దిశగా బీజేపీ
- బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం
- ముస్లిం ప్రాబల్యం ప్రాంతాల్లో బీజేపీ అధిక్యం
- ముస్లింలో చీలిక ఏర్పడిందని విశ్లేషకుల అభిప్రాయం.
- ఈ చీలిక ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్‌లో స్పష్టంగా..
- దక్షిణ బెంగాల్, కూచ్ బెహర్‌లో మాత్రం టీఎంసీ వైపు మొగ్గు
నిరాశలో టీఎంసీ శ్రేణులు
- బెంగాల్ ఎన్నికల్లో ఓటమి దిశగా తృణమూల్ కాంగ్రెస్
- టీఎంసీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ
- బోసిపోతున్న టీఎంసీ కార్యాలయం
- కాళిఘాట్‌లోని మమత నివాసం వద్ద నిశబ్ద వాతావరణం
మెజారిటీ లీడ్‌లో బీజేపీ
- బెంగాల్‌లో 150 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
- 133 స్థానాల ఆధిక్యంలో టీఎంసీ
- కాంగ్రెస్, సీపీఎం తలో మూడు చోట్ల లీడ్
- నాలుగోసారి సీఎం కావాలన్న మమతా బెనర్జీ ఆశలపై బీజేపీ నీళ్లు
- బెంగాల్‌లో కాషాయం జెండా రెపరెపలు
- సంబురాల్లో బీజేపీ శ్రేణులు
లీడ్‌లో ఆర్జీకర్ బాధితురాలి తల్లి
- ఆధిక్యంలో రత్నా దేవనాథ్(54)
- దేశాన్ని కుదిపేసిన ఆర్జీకర్ హత్యాచార ఘటన
- ఈ ఘటన బాధితురాలి తల్లే రత్నా దేవనాథ్
- పనిహాతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ
- ఆధిక్యంలో కొనసాగుతున్న రత్నా దేవనాథ్
బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం
- 142 సీట్లలో లీడ్‌లో బీజేపీ
- 111 సీట్లలో టీఎంసీ
- మూడు చోట్ల కాంగ్రెస్‌కు ఆధిక్యం
- లీడ్ ఖాతా తెరవని సీపీఎం
బెంగాల్‌లో టఫ్ ఫైట్
- హోరాహోరీగా టీఎంసీ, బీజేపీ మధ్య పోరు
- రెండో స్థానంలో కొనసాగుతున్న టీఎంసీ
- మమతా బెనర్జీని దోబూచులాడుతున్న లీడ్
- కాసేపు దీదీ.. కాసేపు అధికారి సువేందు ఆధిక్యంలో..
- భవానీపూర్‌లో రౌండ్ రౌండ్‌కీ మారుతున్న సీన్
బెంగాల్ కౌంటింగ్‌లో మారుతున్న సీన్
- కొనసాగుతున్న ఈవీఎంల ఓటింగ్
- టీఎంసీ కంటే ఆధిక్యంలో బీజేపీ
- 107 సీట్లలో టీఎంసీ, 127 స్థానాల్లో బీజేపీ లీడ్
- నాలుగు చోట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- భవానీపూర్‌లో వెనకంజలో మమత
ప్రారంభమైన ఈవీఎం కౌంటింగ్
- బెంగాల్‌లో ప్రారంభమైన ఈవీఎంల కౌంటింగ్
- మరో గంటలో ట్రెండ్స్ మొదలయ్యే చాన్స్
- ఫలితాలపై అప్పుడే రానున్న స్పష్టత
టీఎంసీ శ్రేణుల మౌనం
- వెలువడుతున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- పోస్టల్‌లో బీజేపీకి ఆధిక్యం
- వెలవెలబోతున్న టీఎంసీ ఆఫీస్
- కాళీఘాట్ మమతా బెనర్జీ నివాసం వద్దా గంభీర వాతావరణం
బెంగాల్‌లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
- బెంగాల్‌లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
- ఆధిక్యంలో బీజేపీ.. 118 స్థానాల్లో లీడ్
- టీఎంసీ 107
- రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్
- ఖాతా తెరవని సీపీఎం
దీదీ వెనకంజ.. బీజేపీ కామెంట్
- బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం
- లీడ్‌లో ఆ పార్టీ అగ్రనేతలు
- వెనకంజలో మమతా బెనర్జీ
- ఇవి జనతా వర్సెస్ మమతా ఎన్నికలు :బీజేపీ
- మమతా బెనర్జీపై జనాలకు ఉన్న కోపం విస్పష్టం :బీజేపీ
ఆధిక్యంలో..
పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ ఆధిక్యం
- టీఎంసీ 108
- బీజేపీ 117
- కాంగ్రెస్ 5
- సీపీఎం 0
- ఇతరులు 0
అధిర్ రంజన్ వెనుకంజ
- మూడు దశాబ్దాల తర్వాత స్టేట్ పాలిటిక్స్‌లోకి అధిర్ రంజన్ రీఎంట్రీ
- ముర్షీదాబాద్ జిల్లా బరహంపూర్ నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ పోటీ
- పోస్టల్ బ్యాలెట్‌లో వెనుకంజలో కాంగ్రెస్ సీనియర్ నేత
వెనకంజలో మమతా బెనర్జీ
- దీదీకి పోస్టల్ బ్యాలెట్‌లో షాక్
- వెనకంజలో కొనసాగుతున్న టీఎంసీ అధినేత్రి
- అధికారి సువేందు ముందంజ
- ఆసక్తికరంగా భవానీపూర్ పోరు
- ఇటు.. నందిగ్రాంలోనూ ఆధిక్యంలో సువేందు
ఆధిక్యంలోకి సువేందు
- భవానీపూర్‌లో ఆసక్తికరంగా పోరు
- తొలుత మమతా బెనర్జీకి ఆధిక్యం
- కాసేపటికే లీడ్‌లోకి వచ్చిన బీజేపీ అధికారి సువేందు
- ఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ అగ్రనేతలు
బెంగాల్‌లో హోరాహోరీ
- పోస్టల్ బ్యాలెట్‌లో టీఎంసీ ముందంజ
- స్వల్పంగా వెనకబడిన బీజేపీ
- 106 స్థానాల్లో టీఎంసీ, 100 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
- లీడ్ ఖాతా తెరవని కాంగ్రెస్, లెప్ట్ పార్టీ
- మరికాసేపట్లో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్
ఆధిక్యంలో మమతా బెనర్జీ
- భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీ ఆధిక్యం
- వెనుకబడిపోయిన బీజేపీ రాష్ట్ర చీఫ్ అధికారి సువేందు
- గత ఎన్నికల్లో ఇక్కడే దీదీని ఓడించిన సువేందు
బీజేపీ అగ్రనేతల ముందంజ
- బెంగాల్ ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు
- పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ అగ్రనేతల ముందంజ
- బీజేపీ శ్రేణుల్లో సంబురాలు!
పోస్టల్ బ్యాలెట్‌లో..
- ఆసక్తికరంగా పోస్టల్ బ్యాలెట్
- టీఎంసీ-బీజేపీ హోరాహోరీ
- మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈవీఎం ఓట్ల లెక్కింపు
మూడంచెల భద్రత నడుమ..
- బెంగాల్ వ్యాప్తంగా మొదలైన ఓట్ల కౌంటింగ్
- భద్రం కోసం మూడంచెల వ్యవస్థ
- ప్రశాంతంగా కౌటింగ్ ప్రారంభమైందన్న సిలిగురి కమిషనర్ సయ్యద్ వాకార్ రజా
- తనిఖీలు ముమ్మరంగా జరుగున్నాయని.. శాంతియుతంగా కౌంటింగ్ కొనసాగేలా చేస్తామని వ్యాఖ్య
#WATCH | Siliguri, West Bengal | On the counting of votes, Siliguri Commissioner of Police (CP) Syed Waqar Raza says, "Everything will be done peacefully. All things are in proper order. Frisking is being done here, and there is a 3-tier security system, and we hope that… pic.twitter.com/4fiRZU0kE8
— ANI (@ANI) May 4, 2026
ఆ స్థానంలో ఏం జరగనుందో?
- బెంగాల్‌లో హాట్ సీట్‌గా భవానీపూర్
- మమతా బెనర్జీ వర్సెస్ అధికారి సువేందు
- గత ఎన్నికల్లో గురువు మమతను ఓడించిన బీజేపీ సువేందు
- ఈసారి తనదే గెలుపని సువేందు ధీమా
ప్రారంభమైన కౌంటింగ్
- పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన కౌంటింగ్
- తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
- ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు
మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
- బెంగాల్ కౌంటింగ్ వేళ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
- పలు ప్రాంతాల్లో కరెంట్ కట్ చేస్తున్నారని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీటీవీలు పని చేయడం లేదన్న దీదీ
- స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు పలు వాహనాలు వచ్చి వెళ్లాయని ఆరోపణ
- ఈ చర్యల వెనుక బీజేపీ ఉందని మమతా బెనర్జీ వ్యాఖ్య
- అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ శ్రేణులకు పిలుపు
- అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచన
- మమత సూచనలతో రాత్రంతా స్ట్రాంగ్ రూమ్‌ల వద్దే పడిగాపులు కాసిన టీఎంసీ శ్రేణులు
అందరి చూపు బెంగాల్ వైపు..
- కాసేపట్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
- అందరి చూపు పశ్చిమ బెంగాల్ వైపు
- టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాలుగోసారి సీఎం అవుతారా?
- దీదీ విజయపరంపరకు, ఆధిపత్యానికి బీజేపీ చెక్ పెడుతుందా?
- ఎస్‌ఐఆర్(ఓట్ల తొలగింపు ప్రక్రియ) నేపథ్యంలో ఆసక్తికరం కానున్న ఫలితాలు
- జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఫలితం కావడంతో ఉత్కంఠ
కౌంటింగ్ కోసం ఈసీ..
- బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ కోసం ఈసీ భారీ ఏర్పాటు
- భారీగా నమోదైన పోలింగ్ శాతం
- 77 ఓటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్
- 75 వేల మంది భద్రతా సిబ్బంది
- ఫాల్తాలో ఈ నెల 21న రీపోలింగ్.. 24 కౌంటింగ్
- మిగిలిన 293 స్థానాలకు ఇవాళ జరగనున్న కౌంటింగ్


