ఆర్జీ కర్‌ కేసులో ముగ్గురు  సీనియర్‌ ఐపీఎస్‌ల సస్పెన్షన్‌  | Three IPS officers suspended as Bengal reopens scrutiny of RG Kar case | Sakshi
Sakshi News home page

ఆర్జీ కర్‌ కేసులో ముగ్గురు  సీనియర్‌ ఐపీఎస్‌ల సస్పెన్షన్‌ 

May 16 2026 4:08 AM | Updated on May 16 2026 4:08 AM

Three IPS officers suspended as Bengal reopens scrutiny of RG Kar case

ప్రాథమిక విచారణలో లోపాలున్నాయన్న సీఎం 

కోల్‌కతా: 2024లో సంచలనం రేపిన ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి దారుణ హత్యాచార ఘటన కేసును తిరిగిదోడుతామంటూ ఇచ్చిన ఎన్నికల హామీ అమలుకు సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ దారుణంపై ప్రాథమిక దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరిగ్గా దర్యాప్తు చేయలేదనే ఆరోపణలపై ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం సీఎం సువేందు అధికారి ఆదేశాలిచ్చారు. 

కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయెల్, మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్‌ గుప్తాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన సెక్రటేరియట్‌లో ప్రకటించారు. వీరు కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేకపోవడమే కాదు, మృతురాలి తల్లిదండ్రులకు లంచం ఎరజూపారని తెలిపారు. 

వీరిపై క్రమశిక్షణ చర్యలు, శాఖాపరమైన దర్యాప్తు నిర్ణీత వ్యవధిలోగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సంఘమిత్ర ఘోష్‌ ముగిస్తారని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం సీబీఐ జరుపుతున్న దర్యాప్తు, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. సీబీఐ కంటే ముందు, కోల్‌కతా పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తు దశలపై మాత్రమే ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వివరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement