Annamayya District News
-
కరడు గట్టిన దొంగలు అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : వారు కరడు గట్టిన దొంగలు.. అడ్డు వస్తే చంపడానికి కూడా వెనుకాడరు. 16 ఏళ్ల వయసు నుంచే చోరీలు చేస్తూ అంతర్ రాష్ట్ర దొంగలుగా రాటుదేలారు. ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరంలోని నరాల బాలిరెడ్డి కాలనీలో గత నెల 17న ఏక కాలంలో నాలుగు ఇళ్లలో చోరీకి ప్రయత్నించి, ఒకే ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఎత్తుకెళ్లిన విషయం విదితమే. ఈ కేసులో కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం ప్రాంతానికి చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు వివరాలను ప్రొద్దుటూరు డీఎస్పీ భావన సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం, బెల్గాం పట్టణంలోని వైభవ్నగర్కు చెందిన ఖాజా రఫిక్, సయ్యద్ అక్బర్లు చిన్ననాటి స్నేహితులు. వీరు 15 ఏళ్ల వయసు నుంచే చోరీలు చేసేవారు. కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక నేరాలు చేశారు. రాత్రి పూట ఇళ్లకు కన్నాలు వేసేవారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తితో కలసి తమ ప్రాంతంలోనే నివాసం ఉంటున్న అర్మాన్ ఇర్ఫాన్, మహబూబ్ ఇబ్రహీం అనే ఇరువురిని పరిచయం చేసుకున్నారు. వారి ద్వారా అనేక చోరీలకు పాల్పడ్డారు. ఖాజా రఫిక్, సయ్యద్ అక్బర్‌లపై హత్యాయత్నం, హత్య కేసులతో సహా సుమారు 13 కేసులు ఉన్నాయి. మిగిలిన ముగ్గురిపై 5 చోరీ కేసులున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సయ్యద్ అక్బర్ కొన్నేళ్ల క్రితం అనంతపురం జిల్లాలోని గుంతకల్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా చోరీ ఘటన జరిగిన రెండు రోజుల ముందు నుంచే ఐదుగురు నిందితులు బొల్లవరంలోని నరాల బాలిరెడ్డి కాలనీలో రెక్కీ నిర్వహించారు. 16న రాత్రి 9 గంటలకు అందరూ కలసి మైదుకూరు రోడ్డులోని చాంద్ థియేటర్‌కు సెకండ్ షో సినిమాకు వెళ్లారు. సినిమా వదలగానే అర్థరాత్రి దాటిన తర్వాత సుమారు 1.15 గంటల సమయంలో బాలిరెడ్డి కాలనీకి వెళ్లి చోరీ చేశారు. కేసులోని కీలక నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరచిన త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి, ఎస్ఐలు ధనుంజయుడు, అరుణ్‌రెడ్డి, ఏఎస్ఐ సుబ్బన్న, హెడ్‌కానిస్టేబుల్ భద్రారెడ్డి, కానిస్టేబుళ్లు దస్తగిరి, సుబ్రహ్మణ్యం, రమణారెడ్డి, చాంద్‌బాషా, ధనాంజినేయ, దినకర్, హోమ్‌గార్డు జనార్దన్‌రెడ్డిలను డీఎస్పీ భావన అభినందించారు. రివార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా.. చోరీ జరిగిన వెంటనే డీఎస్పీ భావన పర్యవేక్షణలో త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి, టూ టౌన్, రూరల్ ఎస్ఐలు ధనుంజయుడు, అరుణ్రెడ్డిలతో కూడిన మూడు టీంలను ఏర్పాటు చేశారు. చోరీ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుల ఫొటోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే సాంకేతిక పరిజ్ఞానంతో కారుతో పాటు చోరీ చేసిన దొంగలు ఎవరన్నది గుర్తించారు. నిందితులు ప్రొద్దుటూరు శివారు ప్రాంతంలో తిరుగుతున్నారని సమాచారం రావడంతో అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం పట్టణానికి చెందిన ఖాజా రఫిక్, సయ్యద్ అక్బర్, షేక్ అర్మాన్ ఇర్ఫాన్. ముల్లా మహబూబ్ ఇబ్రహీంలు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. వారి వద్ద నుంచి 23.4 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు డీఎస్పీ భావన తెలిపారు. మరో నిందితుడితో పాటు మిగతా బంగారాన్ని కూడా రికవరీ చేస్తామని ఆమె వివరించారు. భయపడొద్దు.. మేమున్నాం.. చోరీల పట్ల ప్రొద్దుటూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. నిరంతరం పోలీసులు రాత్రి గస్తీని పటిష్టపరిచామని ప్రజలు భయపడొద్దన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. చోరీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దొంగతనాల నివారణకు ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో పని చేసే నిఘా కెమెరాలను ఇంట్లో అమర్చుకోవాలని సూచించారు. ఇటీవల ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలోని హౌసింగ్‌బోర్డులో జరిగిన చోరీ కేసులో కూడా పురోగతి సాధించినట్లు డీఎస్పీ తెలిపారు. చోరీ అయిన సొత్తుతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రూరల్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో జరిగిన దొంగతనం ఘటనలో అంతర్ రాష్ట్ర దొంగల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని, వారి కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. సాధ్యమైనంత తొందరలోనే దొంగలను పట్టుకుంటామని డీఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులోని బొల్లవరం చోరీ కేసులో పురోగతి పట్టుబడిన దొంగలు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంకు చెందిన వారు 23.4 తులాల బంగారు నగలు స్వాధీనం అరెస్టు వివరాలను వెల్లడించిన ప్రొద్దుటూరు డీఎస్పీ భావన -
చదువుతోనే మంచి భవిష్యత్తు
కడప ఎడ్యుకేషన్ : చదువుతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రణాళిక బద్ధంగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని దీంతోపాటు ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని అలవరచుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. సోమవారం కడప నగర శివార్లలోని శిల్పారామంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన జిల్లా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మార్కులనే కొలమానంగా కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. జిల్లాలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర పోషించారని ఈ సందర్భంగా వారిని అభినందించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించే గొప్ప అవకాశం గురువులకు దక్కుతుందన్నారు. విద్యార్థులు పట్టుదల, ప్రణాళికతో చదివి ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. డీఈఓ షంషుద్దీన్ మాట్లాడుతూ జిల్లా పది ఫలితాల్లో 80 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 18 వ స్థానంలో ఉందన్నారు. సన్మానం పొందిన విద్యార్థులు.. ● పల్లేటి జోషికా(595), సింహాద్రిపురం మండలం రావులకొలను జెడ్పీ హైస్కూల్ ● అతికారి పల్లవి (594) సిద్ధవటం మండలం జెడ్పీ హైస్కూల్ ● నీలం నాగ వీర తరుణ్ (593),పెండ్లిమర్రి మండలం గంగనపల్లి జెడ్పీ హైస్కూల్ ● బండి రామసాయి విఘ్నేష్ (593) కాశినాయన మండలం ఏపీ మోడల్ స్కూల్ ● రుద్ర గంగ జశ్వంత్ రెడ్డి (592) వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లి గ్రామం జెడ్పీ హైస్కూల్ ● అతికారి రక్షిత (591) బద్వేలు మండలం జెడ్పీ హైస్కూల్, ● గంజికుంట వెంకట శివ సంతోష్ (591), జమ్మలమడుగు మండలం ఎంజేపీ ఏపీ బీసీ డబ్ల్యూఆర్ఎస్ (బాలుర) హైస్కూల్ ● జడ కార్తీక్ (590) వేముల మండలం జెడ్పీ హైస్కూల్, ● కోగటం జువేరియ తహసీన్ (590), జమ్మలమడుగు మండలం జెడ్పీ హైస్కూల్, ● గంజికుంట తన్మయి (589) తొండూరు మండలం ఎంజేపీ ఏపీ బీసీ డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు) ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ నిత్యానంద రాజు, ఇతర శాఖల జిల్లా అధికారులు, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్ రెడ్డి, మీనాక్షి, వివిధ మండలాల ఎంఈఓలు, ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.టాప్ ‘టెన్’ విద్యా రత్నాలను సన్మానించిన కలెక్టర్, ఎస్పీ -
మిద్దైపె నుంచి పడి పెయింటర్ మృతి
కడప అర్బన్ : కడప నగరం రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాలనీలోని రాజేశ్వరి అనే మహిళ ఇంటికి ఈనెల 4వ తేదీన ఆదివారం పెయింటింగ్ పనిచేసేందుకు వెళ్లిన ఓబుళాపురం రాజశేఖర్ (50) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మిద్దైపెనుంచి కింద పడటంతో మృతి చెందాడు. కడప రిమ్స్ పోలీసు స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కలసపాడు మండల పరిధిలోని చెన్నారెడ్డిపల్లె దళిత కాలనీకి చెందిన ఓబులాపురం రాజశేఖర్, తన కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం రామాంజనేయపురంలో ఉంటున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మేసీ్త్ర వెంట పెయింటింగ్ వేసేందుకు వెళ్లాడు. మిద్దైపెకి వెళ్లి పెయింటింగ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న అతన్ని రిమ్స్‌కు తరలించారు. మధ్యాహ్నం మృతి చెందాడు. అతని కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రిమ్స్ పోలీసులు తెలిపారు. -
క్లూస్ టీమ్ పరిశీలన
ఓబులవారిపల్లె : ముక్కావారిపల్లె గ్రామంలో దొంగతనం జరిగిన కె.చెంగల్‌రెడ్డి ఇంట్లో సోమవారం ఎస్ఐ మహేష్, క్లూస్ టీమ్ పరిశీలించారు. చెంగల్‌రెడ్డి కుటుంబం తిరుపతికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి దొంగతనం జరిగిన విషయం విదితమే. క్లూస్ టీమ్ పరిశీలించి అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్లు తదితర ఆధారాలను సేకరించారు. ఎస్ఐ పి.మహేష్ మాట్లాడుతూ దాదాపు 30 తులాల బంగరం చోరీ జరిగినట్లు కె.చెంగల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 125 కేజీల రేషన్ బియ్యం పట్టివేత రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు అరక్కోణం ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 125 కేజీల రేషన్ బియ్యాన్ని డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, వీఆర్ఓ ఈశ్వరయ్య సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
తండ్రి మరణం తట్టుకోలేక..
కురబలకోట : రైల్వే ట్రాఽక్ పక్కనున్న విద్యుత్ స్థంభం ఎక్కడంతో విద్యుత్ షాక్‌కు గురై భవన నిర్మాణ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు..మండలంలోని సింగన్నగారిపల్లెకు చెందిన రామమూర్తి రైల్వేలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. ఇతని కుమారుడు కోటకొండ చంద్రశేఖర్ భవన నిర్మాణ కార్మికుడు. మద్యం తాగినప్పుడు తండ్రి గుర్తుకు వచ్చి ఊరి పక్కన ఉన్న రైల్వే ట్రాక్ ఎక్కేవాడు. కుటుంబీకులు లేదా తెల్సినవారు వెళ్లి రైలు ప్రమాదానికి గురికాకుండా బతిమాలి వెనక్కి తీసుకు వచ్చేవారు. గతంలో పలుమార్లు ఇలా జరిగినట్లు గ్రామస్థులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం మద్యం సేవించాడు. మునుపటిలా తండ్రి గుర్తుకు రావడంతో నేరుగా రైల్వే ట్రాక్‌పైకి వెళ్లాడు. ఈసారి ఏకంగా మద్యం మత్తులో ట్రాక్ పక్కనున్న విద్యుత్ స్థంభం ఎక్కాడు. సర్వీసు వైరు పట్టుకున్నాడు. అంతే హై పవర్ విద్యుత్ కావడంతో షాక్ కొట్టడంతో ఒక్కసారిగా కింద పడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయి. భర్తను వెతుక్కుంటూ వచ్చిన భార్య ఈ ఆకస్మిక సంఘటనతో నిశ్చేష్టురాలైంది. హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ స్థంభం ఎక్కిన వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై తీవ్ర గాయాలు -
చికిత్స పొందుతూ రాజస్థాన్ యువకుడు మృతి
మదనపల్లె : అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతూ రాజస్థాన్ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. రాజస్థాన్‌కు చెందిన ఈర్ష్సింగ్ కుమారుడు నేపాల్‌సింగ్(21) పట్టణంలోని ఆర్.ఆర్.వీధిలో ఉంటూ ఫ్యాన్సీ స్టోరులో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం వాంతులు కావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందాడు. అయినప్పటికీ తగ్గకపోవడంతో సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని బంధువులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. భర్త వేధింపులు తాళలేక .. కలకడ : భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకడ మండలంలో జరిగింది. ఎస్ఐ రామాంజనేయులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం, బాలయ్యగారిపల్లె పంచాయతీ యర్రయ్యగారిపల్లెలో రెడ్డెప్ప ఇంటిలో శాంతల మణి, అతని భార్య చిన్నారి అద్దెకు ఉంటున్నారు. చిన్నారిది హైదరాబాద్ కాగా మణిది మహబూబ్ నగర్. ఏడాదిక్రితం ఆమెను మణి వివాహం చేసుకున్నాడు. జీవనోపాధికోసం కలకడ మండలం యర్రయ్యగారిపల్లెకు వచ్చారు. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణిగా ఉన్న చిన్నారిని ఆమె భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో తాళలేక ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త మద్యం తాగి వచ్చి వేధిస్తున్న విషయాన్ని చిన్నారి హైదరాబాదులో ఉంటున్న తన అక్కకు ఫోన్ ద్వారా తెలిపినట్లు ఎస్ఐ తెలిపారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు మణిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10 కోట్లు వ్యయం రాజంపేట : రాజంపేట మున్సిపాలిటీని దత్తత తీసుకొని, మౌలిక సదుపాయాల కల్పనకు తమ ట్రస్ట్ ద్వారా రూ.10 కోట్లు వ్యయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్‌కు వివరించామని కేఎంఎల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, న్యాయవాది కేఎంఎల్ నరసింహా ఇక్కడి విలేకరులకు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం రాయచోటిని కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబరులో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ దృష్టికి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాల గురించి వివరించారు. రాజంపేట పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10కోట్లు విరాళంగా ట్రస్ట్ తరపున ఖర్చు చేస్తామని కలెక్టర్‌కు తెలిపారు. లిఖితపూర్వకంగా హామీ కూడా కలెక్టర్‌కు అందజేశారు. ఈ అభ్యర్థనపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కువైట్‌లో వలసపాళెం వాసి మృతిఅట్లూరు : బతుకు దెరువు కోసం వెళ్లి కువైట్‌లో అట్లూరు మండలం వలసపాళెం గ్రామానికి చెందిన కేతవరం గంగాధర్ (35)అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగాధర్ నాలుగేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లాడు. ఎనిమిది నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి భార్యా పిల్లలతో గడిపి కువైట్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో గత నెల 24వ తేదీన కువైట్‌లోని కేతాన్ సమీపంలో 55వ నెంబరు రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందినట్లు తెలిసింది. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో అక్కడి అధికారులు సమాచారం ఇవ్వడంతో వారు పాస్‌పోర్టు ఆధారంగా సోమవారం అట్లూరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు ఖాజీపేట : సొంత వదినపై హత్యాయత్నం చేసి పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్దనుంచి హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఖాజీపేట సీఐ మోహన్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 2015 సంవత్సరంలో దాదం నాగేశ్వర్రావు భార్య పార్వతిని నాగేశ్వర్ రావు అన్న అనంతరావు హత్య చేశాడు. ఈ సంఘటనపై భర్త నాగేశ్వర్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అనంతరావును అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో కేసు రాజీ విషయమై తోటి బంధువులు నాగేశ్వరరావుపై ఒత్తిడి తీసుకు వచ్చారు. తల్లి మృతితో పిల్లలు అనాథలుగా మారినందున వారి ఆలనా పాలన కోసం రూ. 2లక్షలు చెల్లించేలా రెండేళ్ల క్రితం ఒప్పందం కుదిర్చారు. ఈ మేరకు అనంతరావు రూ. 1.60 లక్షలు నాగేశ్వరరావుకు చెల్లించాడు. మిగిలిన రూ.40 వేలు ఇవ్వకపోవడంతో అనంతరావును నాగేశ్వరరావు పలుమార్లు అడిగాడు. అయినా ఆయన ఇవ్వకపోవడంతో అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితిలో గత నెల 28వ తేదీన అనంతరావు, ఆయన భార్య లక్ష్మిదేవిలను హత్య చేసేందుకు పథకం రచించి నాగేశ్వరరావు తన అన్న ఇంటికి వెళ్లాడు. అక్కడ అనంతరావు లేకపోవడంతో వదిన లక్ష్మిదేవిపై మచ్చుకత్తితో దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న బంధువు నవీన్‌రావు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నాగేశ్వర్ రావును సోమవారం అతని ఇంటివద్దే అరెస్టు చేశారు. కలెక్టర్‌కు విన్నవించిన కేఎంఎల్ ఛారిటబుల్ ట్రస్ట్ -
పిడుగులతో జాగ్రత్త.!
రాజంపేట టౌన్ : ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుతున్నాయి. వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఫలితంగా ఈనెల 4వ తేదీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు మృతి చెందారు. విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఏ రకమైన వానలు కురుస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు కురిస్తే వాటితోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడటం సహజంగా జరుగుతుంది. పిడుగుకు బలమైన అయస్కాంత శక్తితో కూడిన విద్యుత్ శక్తి ఉంటుంది. అందువల్ల పిడుగులు పడిన ప్రతిసారి మనుషులతో పాటు పశువులు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు పిడుగుపాటుకు సమిధలవుతున్నారు. పిడుగుల ప్రభావానికి పచ్చని చెట్లు సైతం దగ్ధమవుతున్నాయి. పిడుగు పడే ప్రాంతాలపై విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేస్తున్నా ప్రాణనష్టం జరుగుతుండటం బాధాకరం. తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. లైట్నింగ్ కండక్టర్ ఏర్పాటు చేసుకోవాలి.. పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు ఎత్తయిన ప్రదేశాల నుంచి నేరుగా భూమిలోకి లైట్నింగ్ కండక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని ఏర్పాటు చేసుకోవడం వల్ల పిడుగులో ఉన్న విద్యుతావేశం భూమిలోకి ఆకర్షించుకుంటుంది. ఎత్తయిన భవనాలు, ఇతర నిర్మాణాలు నిర్మించుకున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మిలియన్ మెగావాట్ల శక్తి.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు బయటకు వెళ్లక పోవడమే ఉత్తమం. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలి. ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తుంటే చెట్ల కిందకు, విద్యుత్ టవర్లు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలోకి వెళ్లకూడదు. మెరుపు లేదా పిడుగు కాంతిని చూసేందుకు కూడా ప్రయత్నించకూడదు. పిడుగుకు కొన్ని మిలియన్ మెగావాట్ల శక్తి ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. సమయస్ఫూర్తి అవసరం.. వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగులు పడతాయని భావించి రైతులు అప్రమత్తం కావాలి. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. ఒకవేళ సురక్షిత ప్రాంతానికి వెళ్లే సమయం లేకుంటే సమయస్ఫూర్తితో వ్యవహరించి మోకాళ్లపై చేతులు, తలపెట్టి దగ్గరగా ముడుచుకొని కూర్చోవాలి. అందువల్ల సమీపంలో పిడుగు పడినా అందులో విద్యుత్ ప్రభావం తక్కువగా ఉండి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. పిడుగు పడుతుందని అనిపించినప్పుడు రబ్బరు చెప్పులు వేసుకోవడం మంచిది. అలా కుదరని పరిస్థితిలో కాళ్లను భూమి మీద పూర్తిగా ఆనించకుండా, కాలివేళ్లపై ఉండేందుకు ప్రయత్నించాలి. మే, జూన్ నెలల్లో అప్రమత్తంగా ఉండాలి.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మే, జూన్ నెలల్లో ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు క్యూములో నింబస్ మేఘాల కారణంగా పిడుగులు పడే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షం కురిసే అవకాశం ఉందని ముందే తెలిసినప్పుడు వీలైనంత వరకు ప్రజలు బయటకు వెళ్లకపోవడం మంచిది. ఈ జాగ్రత్తలు పాటించాలి.. ● సాధారణంగా ఎత్తుగా ఉండే నిర్మాణాలు, ప్రాంతాలపై పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. అందువల్ల వర్షం కురిసే సమయంలో ఎత్తయిన చెట్లు, సెల్‌టవర్, విద్యుత్ స్థంభాలు, కొండల వద్దకు వెళ్లకూడదు. ● టీవీలు, రిఫ్రిజిరేటర్లు, విదుత్ కుక్కర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు కంప్యూటర్లు ఇతర విద్యుత్ పరికరాలు ఉపయోగించకూడదు ● వర్షం కురిసినప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ● గుంపులుగా ఉండకుండా దూరంగా ఉండాలి. ● ముఖ్యంగా పొలాల్లో పనిచేయడం, పశువులు మేపడం వంటివి చేయకూడదు. ● చెరువు, ఈతకొలనులు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ప్రథమ చికిత్స ఇలా చేయాలి.. ● పిడుగుపాటుతో అస్వస్థతకు గురైన వారిని వెంటనే గాలి, వెలుతురు తగిలే విశాలమైన ప్రాంతంలో ఉంచాలి. ● తడి దుస్తులు తొలగించి పొడి దుస్తులు వేయాలి. ● మెల్లగా పడుకోబెట్టి రెండుకాళ్లు పైకి ఎత్తి ఉంచాలి. ● తల ఒకవైపునకు తిప్పి పెట్టాలి. ● నోటి ద్వారా నీరు, ఇతర ఎలాంటి ఆహారాన్ని అందించకూడదు. ● వెంటనే అందుబాటులో ఉన్న వైద్యుడి వద్దకు తీసుకెళ్లి వైద్య సేవలు అందించాలి. రాష్ట్రంలో రెండు రోజుల క్రితం పిడుగులు పడి ఆరుగురి మృతి అప్రమత్తత అవసరమంటున్న వాతావరణ శాఖ -
హెల్త్ అసిస్టెంట్ల వినూత్న నిరసన
రాయచోటి : సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కమ్యూనిటీ హెల్త్ అసిస్టెంట్లు మోకాళ్లపై కూర్చొని.. నోరు మూసుకొని నిరసన తెలిపారు. వీరి నిరసన 6వ రోజుకు చేరుకుంది. 7 సంవత్సరాలుగా విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో ప్రజలకు ఆరోగ్య సేవలను అందిస్తున్న సిబ్బందికి రావాల్సిన బెనిఫిట్స్ కోసం చేపట్టిన సమ్మైపె ప్రభుత్వం స్పందించాలన్నారు. 6 సంవత్సరాలు పూర్తి చేసుఉన్న సీహెచ్‌ఓలను రెగ్యులర్ చేయడం, ఎన్హెచ్ఎం 23 శాతం పెంపు అమలు చేయడం, ఇంక్రిమెంట్ పాలసీ ప్రారంభించడం, ఎక్స్‌గ్రేషియా పాలసీ, నిర్ధిష్టమైన జాబ్‌చార్ట్ అమలు చేయడం తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఏపీఎంసీఏ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం ఆరోగ్య శాఖ మంత్రిని కలిస్తే మీ ఉద్యోగాలు తీసేస్తాం, మీరు కాంట్రాక్టు ఉద్యోగులని బెదిరింపు ధోరణిలో మాట్లాడటం దారుణమన్నారు. సీహెచ్‌ఓల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మాటలను అసోసియేషన్ తరపున ఖండిస్తున్నామన్నారు. మంత్రి మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఎంసీఏ ప్రతినిధులు శివకుమార్, సమ్మోహనరాజ్, అహమ్మద్‌బాషా, భరత్‌కుమార్, సీహెచ్‌ఓలు పాల్గొన్నారు. -
అంధురాలిని... న్యాయం చేయండి
నాకు రెండు కళ్లు కనిపించవు. ఇద్దరు కుమారులు కూలీ చేసుకుని బతుకుతున్నారు. 2002లో అప్పటి ప్రభుత్వం నా భర్త మల్లికార్జునకు, మామకు.. తండ్రికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మా మామ ఇల్లు వేసుకున్నాడు. నా భర్త మతిస్థిమితం లేక ఎటో వెళ్లిపోయాడు. మా వద్ద డబ్బులు లేక ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో శ్లాబు వరకు ఇంటిని కట్టుకున్నాం. ఊర్లో ఉంటే బతకడానికి కష్టంగా ఉందని నా పిల్లలు రాజంపేటకు వచ్చి పెయింట్ పని చేసుకుని నన్ను సాకుతున్నారు. అయితే మా మరిది సుబ్బయ్య మా మామ కట్టుకున్న ఇల్లు, మేము శ్లాబు వరకు వేసుకున్న ఇంటిని కూల్చేసి, ఆ రెండు స్థలాల్లో ఇంటిని వేసుకుంటున్నాడు. మేము పెనగలూరులో తహసీల్దార్, పోలీసుస్టేషన్‌కు వెళ్లి న్యాయం చేయాలని కోరాం. అధికారులు మా మరిదిని పిలిచి మాట్లాడారు. అయితే మా మరిది ఇప్పుడు మాకు కోర్టు నోటీసు పంపాడు. నేను కళ్లు లేని దానిని. నా బిడ్డలకు చదువు రాదు. సబ్ కలెక్టరమ్మ న్యాయం చేయాలి. – నాగెళ్ల సుబ్బలక్షుమ్మ, నారాయణ నెల్లూరు.పెనగలూరు మండలం ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు మా రెండో బావ బసిరెడ్డి జయరామిరెడ్డికి పెళ్లి కాలేదు. అందువల్ల జయరామిరెడ్డి సంపాదించుకున్న ఐదు కుంటల భూమిని ఆ ఇంటాయన నరసింహారెడ్డికి రాయించాడు. ఒక సర్వే నంబరు కంప్యూటర్లోకి ఎక్కింది. మిగతా సర్వే నంబర్లు ఎక్కలేదు. ఈ విషయమై సంత్సరం నుంచి తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోవడం లేదు. మా మండల అధికారులైతే నన్ను గదమాయించి మట్లాడుతున్నారు.ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. – బసిరెడ్డి సుబ్బలక్షుమ్మ, ఇండ్లూరు సాతపల్లె, పెనగలూరు మండలం -
సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు
రాయచోటి : ప్రజల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. నడవలేని స్థితిలో.. : నడవలేని స్థితిలో పీలేరు నుంచి వికలాంగుడు మోపిరెడ్డి రామమోహన్‌రెడ్డి తన సమస్య చెప్పుకునేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అతని వద్దకే వెళ్లి సమస్య విన్నారు. అతను ఇచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరిధిలో సమస్యను పరిష్కరించాలని పీలేరు సీఐని ఆదేశించారు. ఎండ వేడిమికి ఉపశమనం కలిగేలా ఫిర్యాదుదారులకు ఎస్పీ ఆదేశాల మేరకు మజ్జిగ, చల్లని నీరు పోలీసులు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు -
తెలుగుపదానికి జన్మదినం.. జానపదానికి జ్ఞానపథం
అదివో అల్లదివో శ్రీవారి వాసము పదివేల శేషుల పడగలమయం..లాంటి కీర్తనలతో పదకవితాపితామహుడుగా తాళ్లపాక అన్నమాచార్యలు శ్రీవారి భక్తుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. అన్నమాచార్యుడు 617 జయంతి సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం... 12 నుంచి జయంతి ఉత్సవాలు రాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 617 జయంతి ఉత్సవాలను ఈనెల 12 వతేది నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ స్ధానిక టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. తాళ్లపాక, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఉత్సవాలు జరుతాయన్నారు. 12న సంకీర్తన గోష్టిగానం,నగర సంకీర్తనలు ఉంటాయన్నారు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు శ్రీవెంకటేశ్వరుని కల్యాణం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 13, 14న తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమయ్య జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ తరపున భక్తులకు పిలుపునిచ్చారు. రాజంపేట : భాగవతసేవ పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబలకు సంతానం లేకపోవడంతో ఏడుకొండలస్వామిని మొక్కుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఈ దంపతులు స్వామి మందిరంలో ప్రవేశించారు.గురుడస్తంభం వద్ద సాగిలపడి మొక్కారు. వెంకటేశ్వరస్వామి తన నిజఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్యదంపతులకు ప్రసాదించాడు. వాళ్లు పరమానంద భరితుల య్యారు.వెంకటపతిని దర్శించి స్తుతించారు.సంతోషంతో తాళ్లపాకకు తిరిగివచ్చారు. మే 9,1408న రాజంపేట మండలం తాళ్లపాకలో జన్మించాడు. తన ఎనిమిదో యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణుదీక్షనొసిగినప్పుడు అన్నమాచార్య నామం స్ధిరపడింది. అన్నమయ్య తిరుమల పయనం.. అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలతో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తర్వాత ఇంటి గురుకులంలో విద్యాభాస్యం కొనసాగింది.ఏకసంథాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారో యేట అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటి నుంచి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలు రచించసాగాడు. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని..అంటూ భక్తబృందంతో కలిసి అన్నమయ్య తిరుమలకు పయనమయ్యారు. వెంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే జీవితం గడిపాడు. సంసారం..సంకీర్తనం తిరుమల నుంచి తాళ్లపాకకు చేరుకున్న అన్నమయ్యకు తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం జరిగింది. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకరోజు తన ఇద్దరు భార్యలతో తిరుమలకు చేరుకున్నారు. ఆ సమయంలోనే శ్రీ వెంకటపతిపై రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అప్పటి నుంచి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించారు.భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. ముందుగా తన స్వగ్రామంలోని చెన్నకేశవుని అర్చించారు.మార్గంలోని నందలూరు సౌమ్యనాథుడు, ఒంటమిట్టి రామయ్య, కడప వెంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవున్ని, అహోబిలం నృసింహాస్వామిలను దర్శించుకుని కీర్తనలు ఆలపించారు. కీర్తనలుఅంతటా ప్రసిద్ది చెందాయి. అన్నమయ్య కీర్తనలు..రచనలు.. అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. తెలుగు వ్యవహారిక భాష, దేశి సంగీత విధానాలు రెండు అతని రచనల్లో ఉన్నాయి. లభించిన వాటిలో తొలి సంకీర్తనలు కనుక అన్నమయ్య సంకీర్తనాచార్యుడు, పదకవితాపితామహుడు అయ్యాడు. 32వేల కీర్తనలు ఆలపించారు. అలిమేలు మంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. సరళమైన మాటల్లో అధ్యాత్మిక సత్యాలను, వెంకటపతి తత్వాన్ని , జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు.లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య 12 నుంచి జయంత్యుత్సవాలు తాళ్లపాకలో శ్రీవారి కల్యాణం.. -
బీటీ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించాలి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022లో విడుదల చేసిన జీఓ ప్రకారం బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, యూనివర్శిటీగా ప్రకటించాలని బహుజనయువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌ను కలిసి బీటీ కాలేజీలో గతంలో తొలగించిన కోర్సులను తిరిగి ప్రారంభించి, ముఖ్యంగా ఇంటర్మీడియట్ కోర్సులను వెంటనే ప్రారంభించి అడ్మిషన్స్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బీటీ కళాశాలను యూనివర్శిటీ చేస్తామని హామీ ఇచ్చారని, దానిని నిలుపుకోవాలని కోరారు. -
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు కృషి
రాయచోటి టౌన్ : రాయచోటి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణ, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాల కోసం నాబార్డు కింద, ఆర్‌ఐడీఎస్ పథకం కింద మొత్తం రూ.12.06 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. రాయచోటి రూరల్ పరిధిలోని శిబ్యాల గ్రామంలో 700 ఎకరాల భూమిని గుర్తించామని, ఈప్రాంతంలో ఎస్సీజెడ్ తీసుకొచ్చి ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. తద్వారా ఆ ప్రాంతానికి చిన్న పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాయచోటి నియోజక వర్గంలోని ఆరు మండలాలలో తాగునీటి సమస్య కనిసిస్తోందని దానిని శాశ్వత పరిష్కారం కోసం రూ.300 కోట్లతో వెలిగల్లు ప్రాజెక్టు నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక జల్ జీవన్ మిషన్ కింద టెండర్లు పిలిచినట్లు చెప్పారు. జెడ్పీ సమావేశం వాయిదా కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 15వ తేదికి వాయిదా వేసినట్లు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేది నిర్వహించాలని తొలుత నిర్ణయించామని పేర్కొన్నారు. ఆరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండడం వల్ల ఈనెల 15వ తేది జెడ్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జెడ్పీ సభ్యులు, అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. వైవీయూ డిగ్రీ పరీక్ష కూడా.. కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల బీఏ బీకాం, బీఎస్సీ ,బీసీఏ , బీబీఏ ,ఒకేషనల్ 2,4,6 సెమిస్టరకు సంబంధించి ఈ నెల 7వ తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 7వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఐసెట్ పరీక్ష ఉందన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, యోగివేమన విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నాని వివరించారు. వాయిదా వేసిన పరీక్షలను ఇదే నెల 23వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించారు. వైభవం.. గజవాహనోత్సవం బ్రహ్మంగారిమఠం : వైఎస్సార్‌జిల్లా బ్రహ్మంగారిమఠంలో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కమనీయంగా జరుగుతున్నాయి. రెండో రోజైన సోమవారం రాత్రి గజవాహనోత్సవం జరిగింది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి గజవాహనంపై ఆశీనులను చేశారు. పెద్దమఠం నుంచి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిమఠం వరకు ఊరేగింపు చేపట్టారు. అక్కడ చిన్నమఠం మఠాధిపతి వీరశివకుమారస్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు తిరిగి పెద్దమఠం చేరుకుంది. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ఉత్సవానికి గుంటూరు జిల్లా బుద్దాంకు చెందిన కట్టోజు సత్యనారాయణచార్యులు, వరహాలమ్మ, విశ్వనాథాచారి, గురుస్వాములు, శివరూపాచారి ఉభయదారులుగా వ్యవహరించారు. ఐటీఐలలో అడ్మిషన్లు ప్రారంభం కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వ ఐటీఐల జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అలాగే 14 ఏళ్లు నిండిన విద్యార్థులు అర్హులని తెలిపారు. అడ్మిషన్లు 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయిస్తామని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు 10వ తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణపత్రం,టీసీ, ఆధార్, ఫొటో, మెయిల్ ఐడితోపాటు పర్మినెంట్‌గా వినియోగించే మొబైల్ నెంబర్‌తో దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐ వద్దకు వెళ్లి iti.a p.gov.in వెబ్సైట్ నందు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు రిజిస్ట్రేషన్‌కు మే 24వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. -
శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే దండన తప్పదు
రాయచోటి: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారి పట్ల కఠినదండనలు తప్పవని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు హెచ్చరించారు. విదేశ పర్యటన అనంతరం జిల్లా తిరిగి వచ్చిన జిల్లా ఎస్పీ జిల్లాలో చేపట్టాల్సిన శాంతిభద్రతలు, జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజల అప్రమత్తత తదితర విషయాలపై ఆదివారం పత్రికలకు అందజేసిన ప్రకటనలో విశదీకరించారు. మీ ఇళ్లు, పరిసర ప్రదేశాల్లో కనిపించే అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దన్నారు. అనుమానం ఉన్న వ్యక్తులైతే గుట్టుగా పోలీసులకు తెలియజేయాలన్నారు. విలువైన వస్తువులు, నగలు, డబ్బు ముఖ్యమైన పత్రాలను సురక్షితమైన స్థలంలో ఉంచుకోవాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్ల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే గొడవలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దన్నారు. దొంగతనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలతో సరదాగా తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటి. కానీ తాళం వేసి ఉండే ఇళ్లే లక్ష్యంగా దొంగలు విరుచుకుపడి దొరికినంత దోచుకెళ్తారన్నారు. వేసవి దొంగతనాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే వారి ఆటలు కట్టించేందుకు నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశామన్నారు. ప్రజలు కూడా పోలీసుల ఆదేశాలను పాటిస్తూ ఈ వేసవికాలాన్ని సురక్షితంగా సంతోషంగా కుటుంబసభ్యులతో గడపాలని ఎస్పీ తెలిపారు. నేరాలపై అవగాహన నేరాల గురించి అవగాహన కల్పించేందుకు వివిధ కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే దొంగతనాలను నివారించవచ్చని ఎస్పీ ప్రకటనలో పేర్కొన్నారు. ● ఇంటి భద్రతపై సూచనలు ఇంటి భద్రతకు సంబంధించి ఎస్పీ కొన్ని సూచనలు చేశారు. ● బయటకు వెళ్లే ముందు ఇంటి ప్రధాన, వెనుక ద్వారాలకు తాళాలు, చుట్టూ ఉన్న కిటికీలు మూసివేయడం మర్చిపోకూడదు. ● ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు కనిపించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ● ఇంటి బయట ఎప్పుడూ వెలిగేలా లైట్ ఉండాలి. దీని ద్వారా ఇంట్లో ఎవరూ లేరనే అనుమానం ఎవరికి రాదు. తద్వారా జరిగే దొంగతనాలను నివారించవచ్చు. ● నివాస ప్రాంతాల చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసు వారికి సమాచారమివ్వాలి. ● అపరిచితులను నమ్మకూడదు. వారిని ఇంట్లోకి అనుమతించకపోవడం మరీ మంచిది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి టౌన్: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటితో పాటు అన్ని మండలాల, గ్రామాల, డివిజన్ స్థాయి స్థాయి నుంచి వచ్చే సమస్యలను స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన నియామకం మదనపల్లె సిటీ: మదనపల్లె డీవైఈఓ(ఫుల్ అడిషనల్ చార్జి) గా పీలేరు మండల విద్యాశాఖ అధి కారి లోకేశ్వరరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు మదనపల్లె డీవైఈఓగా ఉన్న కుమార్‌ను తిరుపతి డీఈఓతో పాటు అదే కార్యాలయం లో అడిషనల్ డైరెక్టర్ గా నియమించారు. దీంతో ఖాళీగా ఏర్పడిన మదనల్లె డీవై ఈఓ స్థానంలో లోకేశ్వరరెడ్డిని నియమించారు. 9న ఊటీకి ప్రత్యేక బస్సు మదనపల్లె సిటీ: వేసవి సెలవులను పురస్కరించుకుని ఈనెల 9వతేదీన ఊటికి ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నట్లు ఆర్టీసీ డీఎం అమరనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 9న ఆర్టీసీ డిపో–2 నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి బెంగళూరు,మైసూర్ మీదుగా 10వతేదీ తెల్లవారుజామున ఊటీకీ చేరుతుందన్నారు. 11వతేదీ ఉదయం ఊటీ నుంచి బయలుదేరి పైకార షూటింగ్‌స్పాట్, ముడుమలై ఫారెస్టు, బండిపూర్ ఫారెస్టు మీదు గా మైసూర్ వెళ్లి ప్యాలెస్, జూపార్కు,బృందావన గార్డెన్స్ చూసిన తరువాత అదే రోజు రాత్రి బయలుదేరి 12వతేదీ తెల్లవారుజామున మదనపల్లెకు చేరుకుంటుందన్నారు. చార్జీ రూ.2800గా నిర్ణయించినట్లు చెప్పారు. సూపర్ లగ్జరీ బస్సు సీట్లు 35 ఉంటాయన్నారు. యాత్రకు వెళ్లాలనుకునేవారు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు డిపో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. గంగమ్మా.. కాపాడవమ్మా.. లక్కిరెడ్డిపల్లి: గంగమ్మ తల్లీ...వర్షాలు కురిపించి కరుణించి కాపాడవమ్మా అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మ దేవత ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.కొందరు బోనాలు సమర్పించారు.మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేడు, రేపు వ్యవసాయ పరిశోధన మండలి సమావేశం కడప అగ్రికల్చర్: కడప నగర శివార్లలోని ఊటుకూరు వ్యవసాయ పరివోధన కేంద్రంలో నేడు, రేపు దక్షణ మండలి పరిశోధన , విస్తరణ సలహా మండల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త ప్రభాకర్‌రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రం సమన్వయకర్తలు వీరయ్య, అంకయ్యకుమార్లు తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని వ్యవసాయ జిల్లా వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, ఐదు జిల్లాల వ్యవసాయ పరిశోధన, విస్తరణ కేంద్రాల శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో 2025–26 సంవత్సరానికి చేపట్టబోయే కార్యచరణ, ప్రణాళిక మీద సమీక్ష నిర్వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు. -
జగన్ హయాంలోనే ముస్లింలకు పెద్దపీట
రాజంపేట: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాయాంలో ముస్లింలకు పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆకేపాటి భవన్లో ఆకేపాటి, మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డిని రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ జాహిద్‌అలీ ఆధ్వర్యంలో ముస్లింలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ముస్లింలకు అన్ని విధాలుగా అండగా నిలబడి, వారికి మేలు చేసే విధంగా పాలనను కొనసాగించారని గుర్తుచేశారు. అదే విధంగా ముస్లిం మైనార్టీలు వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలబడుతూ వచ్చారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముస్లిం సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందన్నారు. చంద్రబాబు మాయమాటలతో ప్రజలను మోసం చేశారన్నది ప్రజలు గుర్తించారన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనువాసులరెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు మేలు జరిగిందంటే అది దివంగత సీఎం వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే అని అన్నారు. రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ జావిద్‌అలీ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆకేపాటి, ఎంపీలు మిధున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ పోలా కృషితో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో తనకు రాష్ట్రస్ధాయిలో పార్టీలో పదవి లభించిందన్నారు. ఇందుకు వారికి రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మసూద్అలీఖాన్, నియోజకవర్గ అధ్యక్షుడు ఖాజా, మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ మునాఫ్, సర్పంచ్ మౌలాలి, నాసిర్, ముస్లిం పెద్దలు నజీర్ అహ్మమద్, షపీ, సత్తార్‌ఖాన్, ఇలియాస్, సిద్దిక్, మొహమ్మద్షరీఫ్, మౌలా,హనీఫ్, షాకీర్, ఏజాజ్, బషీర్, అన్వర్, అక్డార్, ఖాదర్‌బాష, రఫీ, మొహమ్మద్అలీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి -
ప్రశాంతంగా ముగిసిన నీట్–2025
కడప సెవెన్‌రోడ్స్: నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్–2025 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఈ పరీక్ష నిర్వహించడం తొలిసారి కావడంతో జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్దేశించిన సమయం ముగిసిన తర్వాత వచ్చిన అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించలేదు. తమ పిల్లలు పరీక్ష రాస్తుండడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద నిరీక్షించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ● జిల్లాలో మొత్తం ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో 2371 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకోగా 2311 మంది హాజరు కాగా, 60 మంది గైర్హాజరయ్యారు. కడప నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 480మందికి గాను 468 మంది హాజరయ్యారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 480మందికిగాను 463 మంది, మున్సిపల్ హైస్కూలు (మెయిన్)లో 240 మందికిగాను 236 మంది, కేంద్రీయ విద్యాలయంలో 240 మందికిగాను 232 మంది, అంబేడ్కర్ గురుకులంలో 240కి 235మంది, చిన్నచౌకులోని వైఆర్ జెడ్పీ బాలికల హైస్కూలులో 159 మందికిగాను 154 మంది హాజరయ్యారు. కడప నగరంలోని మొత్తం ఆరు పరీక్షా కేంద్రాల్లో 1839 మందికిగాను 1788 మంది హాజరు కాగా, 51 మంది హాజరు కాలేదు. ఇక ప్రొద్దుటూరు పట్టణంలోని ఏబీఎంపీఎల్ హైస్కూలులో 172 మందికిగాను 168 మంది, వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో 360 మందికిగాను 355మంది హాజరయ్యారు. ఈ రెండు కేంద్రాల్లో మొత్తం 532 మందికిగాను 523 మంది హాజరు కాగా, తొమ్మిది మంది హాజరు కాలేదు. 2311 మంది విద్యార్థుల హాజరు -
ముక్కావారిపల్లెలో చోరీ
ఓబులవారిపల్లె : మండలంలోని ముక్కావారిపల్లె గ్రామంలో శనివారం రాత్రి కె.చెంగళరెడ్డి ఇంట్లో దొంగలు బంగారం, నగదు, పోస్టాఫీసు లాకర్‌ను దోచుకొని వెళ్లరు. చెంగళరెడ్డి గ్రామంలోని పోస్టాఫీసును తన ఇంటి వద్దే సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు. ఇటీవలే తన కుమారుడి వివాహం అయినందున కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా ఇంటిలో చోరీ జరిగినట్లు గుర్తించారు. పది తులాల బంగారం, రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ చోరీ జరిగినట్లు చెబుతున్నారు. జాతీయరహదారి పక్కనే ఇటీవల ముక్కా భాస్కర్ రెడ్డి ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. అదే ఇంట్లో ఎవరూలేని విషయాన్ని గమనించి శనివారం రాత్రి కూడా చోరీకి ప్రయత్నించారు. ఎస్ఐ పి.మహేష్ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. తల్లి,బిడ్డ అదృశ్యంపై కేసు నమోదురామసముద్రం : రామసముద్రం మండలం కమ్మవారిపల్లి పంచాయతీ ఎర్రబోయునిపల్లికి చెందిన గంగాధర భార్య గొర్రెల గాయత్రి (26), మూడేళ్ల కుమారుడు అఖిల్ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఎక్కడైనా ఆచూకీ లభిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. వడదెబ్బతో గొర్రెల కాపరి మృతిసింహాద్రిపురం : వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన సింహాద్రిపురం మండలం లోమడ గ్రామంలో జరిగింది. బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మేకల నారాయణ (53) గొర్ల కాపరిగా వెళ్లేవాడు. రోజు మాదిరిగా ఆదివారం ఆయన గొర్రెలను మేపేంందుకు వెళ్లాడు అక్కడ తీవ్ర వేడికి వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయి పడిపోవడంతో తోటి కాపర్లు వెంటనే ఆటోలో తొండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బి.మఠం దేవస్థానంలో అభివృద్ధి భేష్
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అభివృద్ధి భేష్‌గా ఉందని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రశంసించారు. ఆదివారం బి.మఠం దేవస్థానం పరిధిలో రూ 3.40 కోట్ల నిధులతో చేపట్టిన పనులను ఆయన ప్రారంభించారు. ఇందులో మఠం ప్రాకారం, కల్యాణ మండపం, టీటీడీ సదనంలో సీసీ ఫ్లోరింగ్, పోలేరమ్మ గుడి వద్ద టాయిలెట్ బ్లాక్, గుడి ఆవరణలో ఫ్లోరింగ్ తదితర పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతం కన్నా ఇప్పుడు బ్రహ్మంగారిమఠం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అందరి సహకారంతో బి.మఠం దేవస్థానం అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానన్నారు. మఠం అభివృద్ధిలో భాగంగా తొలగించిన తాత్కాలిక బస్ షెల్టర్ స్థానంలో రూ.10 లక్షలతో త్వరలోనే బస్ షెల్టర్ ఏర్పాటు చేయిస్తామన్నారు. అలాగే బస్ స్టేషన్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తానన్నారు. -
ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
రాజంపేట : రాజంపేట అర్బన్ పోలీసు స్టేషన్ పరిధిలో సున్నపురాళ్లపల్లె వద్ద జరిగిన ప్రమాదంలో హేమాద్రివారిపల్లె వాసి బి.వెంకటేశు(30) మృతి చెందాడు. శనివారం రాత్రి కదులుతున్న ట్రాక్టర్‌పై నుంచి కింద పడ్డాడు. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం రాజంపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డుప్రమాదంలో ఇద్దరికి గాయాలుమదనపల్లె : రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన నరసింహారెడ్డి (45), అదే గ్రామానికి చెందిన గోవర్దన్‌రెడ్డి (40) ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంలో అంగళ్లుకు వస్తుండగా, మార్గమధ్యంలో అంగళ్లు సమీపంలో టాటా సుమో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని గౌతమీనగర్‌కు చెందిన ఖాదర్‌బాషా భార్య నసీమా(35) కుటుంబ సమస్యలతో ఇంటివద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదేవిధంగా నిమ్మనపల్లె మండలం కొండయ్యగారిపల్లె పంచాయతీ వెంకోజిగారిపల్లెకు చెందిన శంకరప్ప కుమారుడు శ్రీనివాసులు(32) కుటుంబ సమస్యలతో పురుగుమందు తాగాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. దళితుల పట్ల వివక్ష తగదురాయచోటి అర్బన్ : రాజంపేట మండలం కూచివారిపల్లె గ్రామం దిగువ బసవనాయుడుపల్లె దళితవాడ వాసుల పట్ల కుల వివక్షత ప్రదర్శించిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఎం.విశ్వనాథ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అరుంధతీవాడ సమీపంలోని భూములను విక్రయించుకునేందుకు దళితుల ఇళ్లు అడ్డుగా ఉన్నట్లు భావించారన్నారు. వెంటనే రంగంలోకి దిగి దళితవాడకు వెళ్లే దారిని ఆక్రమించారన్నారు. అంతటితో ఆగక దళితుల ఇళ్లు ఇతరులకు కనిపించకుండా తమ స్థలం చుట్టూ ఎత్తయిన గోడలు కట్టడం ద్వారా దళితులను వెలివేసేందుకు ప్రయత్నిస్తుండడం దారుణమన్నారు. సమావేశంలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా నేత సిగి చెన్నయ్య పాల్గొన్నారు. -
వైభవోపేతం త్రిశూల, చక్ర స్నానం
వల్లూరు : పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాలు ఆదివారం త్రిశూల, చక్ర స్నానం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. శ్రీ వైద్యనాఽథేశ్వర స్వామి త్రిశూలం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి చక్ర తాళ్వార్ల స్నానాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. పుష్పగిరి గ్రామంలోని శ్రీ వైద్యనాఽథస్వామి ఆలయం నుంచి కామాక్షీ సహిత వైద్యనాఽథ స్వామిని, త్రిశూలాన్ని , కొండపైనున్న శ్రీ లక్ష్మీ చెన్న కేశవ ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత చెన్న కేశవ స్వామిని, చక్ర తాళ్వార్ను మేళళ తాళాలతో, డప్పువాయిద్యాలతో పల్లకిలో మోస్తూ ఊరేగింపుగా పెన్నా నది వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ భక్తులు స్వామివార్లకు కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు, శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో స్వామి వార్ల త్రిశూలం, సుదర్శన చక్రాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పాలు, చందనం, నెయ్యి, పెరుగు, పసుపు, పన్నీరు, కొబ్బరి నీరుతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి చక్ర స్నానాలతో పాటు స్నానాలు చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున కళశాలలో ఉంచిన నవ ధాన్యపు మొలకలను శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నీటిలో కలిపారు. అనంతరం రెండు ఆలయాల్లో ధ్వజావరోహణం చేసి, పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలను ముగించారు. కనుల పండువగా పుష్పయాగం.. ఆదివారం రాత్రి శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామికి పుష్పయాగాన్ని కనుల పండువగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో, వేద మంత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామికి నిర్వహించిన పుష్పయాగాన్ని చూసిన భక్తులు పులకించారు. రాత్రి శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వామి రావణేశ్వర వాహనంపై కొలువు దీరిన శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వామికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాములకు తిరుచ్చి వాహన సేవలో భాగంగా గ్రామ మాడ వీధుల్లో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు -
గాయపడిన వెటర్నరీ అసిస్టెంట్ మృతి
కలకడ : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వెటర్నరీ అసిస్టెంట్ మృతి చెందినట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం నడిమిచెర్ల గ్రామానికి చెందిన మురాషా కుమారుడు రెడ్డి ఖాదర్ బాషా(29) కలకడ మండలం బాలయ్యగారిపల్లె పంచాయతీ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి చిత్తూరు –కర్నూలు జాతీయ రహదారిపై కలకడ–కేవీ పల్లె మండల సరిహద్దు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఖాదర్‌బాషాను కలికిరి మండలం మహల్ ప్రభుత్వ ఆసుత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని భార్య షేక్ ఆఫిజున్నీసా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఎయిర్ పోర్టులో నిందితుడి అరెస్టు
కురబలకోట : పరారీలో ఉంటూ లుక్ అవుట్ నోటీసు జారీ చేయబడిన రామకృష్ణ అనే నిందితుడిని ముదివేడు పోలీసులు హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసినట్లు ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఇదివరకు అంగళ్లు ఎస్బీఐ బ్రాంచ్‌లో క్యాషియర్‌గా ఉండి ప్రస్తుతం నగిరి బ్రాంచ్‌లో పనిచేస్తున్న గాయత్రి ఇతనిపై 2021లో వరకట్నం కేసు పెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇతను పరారీలో ఉన్నాడు. దుబాయ్‌కు వెళ్లిపోయాడు. శనివారం ఇతను శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాడు. లుక్ అవుట్ నోటీసు ఉండడంతో ఎయిర్‌పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు కస్టడీలోకి తీసుకుని ముదివేడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి అతన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చారు. ఆదివారం రిమాండుకు తరలించినట్లు ముదివేడు ఎస్ఐ తెలిపారు. -
నమో వీరబ్రహ్మేంద్ర.!
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనాన్ని వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు. గర్భాలయంలోని మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి అర్చనామూర్తులకు గంగ, పంచామృతం, క్షీరం, ఫలోదకంలతో అభిషేకం చేశారు. అర్చనామూర్తులకు ప్రత్యేక వస్త్రాలంకరణ చేశారు. స్వామి గుణగణాలను కీర్తిస్తూ, 108 నామాలలో స్తుతిస్తూ సహస్ర నామార్చన కార్యక్రమాన్ని జరిపారు. సాయంత్రం వేదపారాయణం చేశారు. కమనీయంగా శేషవాహనోత్సవం రాత్రి శేషవాహనోత్సవం కమనీయంగా సాగింది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి పంచ శిరస్సులు గల శేషవాహనంపై ఆశీనులను చేశారు. పెద్దమఠం నుంచి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిమఠం వరకు ఊరేగించారు. అక్కడ చిన్నమఠం మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు తిరిగి పెద్ద మఠం చేరుకుంది. ఉత్సవానికి ప్రొద్దుటూరు పట్టణ పరిధి గురువయ్యతోటలోని కాలేజ్ రోడ్డుకు చెందిన పేర్ల వెంకట బ్రహ్మానందరెడ్డి, గుంటూరు జిల్లా క్రోసూరుకు చెందిన చేపూరి నరసింహాచారి, ఆయన భార్య విజయలక్ష్మి ఉభయదారులుగా వ్యవహరించారు. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం యడవల్లి రమణయ్య భాగవతార్ ఆధ్వర్యంలో హరికథా గానం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకుని తరించారు. దాతలు అన్నదానం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలు విరివిగా చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మఠం ఫిట్పర్సన్ సి.శంకర్‌బాలాజి, మేనేజర్ ఎన్.ఈశ్వరయ్య ఆచారి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కుమారులు శ్రీ వెంకటాద్రిస్వామి, భద్రయ్యస్వామి, వీరంబొట్లయ్యస్వామి, దత్తాత్రేయస్వామి, గోవిందు స్వామి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఆరాధనోత్సవాలు ప్రారంభం స్వామి వారికి ప్రత్యేక పూజలు భారీగా తరలివచ్చిన భక్తులు -
కారు గ్యారేజీలో అగ్నిప్రమాదం
మదనపల్లె : పట్టణంలోని ప్రశాంత్‌నగర్ రెండో మెయిన్ మహ్మద్ రఫీ కారు గ్యారేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఫైర్ ఆఫీసర్ జి.శివప్ప తెలిపారు. ఆదివారం ఉదయం 8.20 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. అయితే అప్పటికే కారు గ్యారేజీ, టాటా నెక్సాన్ కారు ముందరి భాగం, ఆయిల్, టైర్స్, టూల్స్ మంటల్లో కాలుతున్నాయన్నారు. వెంటనే సిబ్బంది మంటలను ఆర్పివేశారన్నారు. ప్రమాదానికి కారణం తెలియలేదన్నారు. విద్యుత్ షాక్‌తో గేదె మృతి బి.కోడూరు : మండలంలోని ప్రభలవీడు పంచాయతీ పరిధిలోని తిప్పరాజుపల్లె గ్రామానికి చెందిన గంగిరెడ్డి నాగమునిరెడ్డికి చెందిన గేదె ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఊరి బయట ఉన్న పొలాల్లోకి మేత కోసం వెళ్లి పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్‌కు గురైంది. గేదె విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, సంబంధిత అధికారులు ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం ప్రొద్దుటూరు క్రైం : స్థానిక పాత బీవీఎస్ హాల్ సమీపంలో ఉన్న బాహుబలి ఫర్నీచర్ షాపులో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో షాపులోని ప్లాస్టిక్ డైనింగ్ టేబుళ్లు, చైర్లు, ఇతర వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పేశారు. ఆటో బోల్తా – వ్యక్తి దుర్మరణంఅట్లూరు : బద్వేలు మండలం రాజుపాలెం గ్రామ సమీపంలో కడప – బద్వేలు ప్రధాన రహదారిపై ఆదివారం ఆటో బోల్తాపడిన ప్రమాదంలో అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం అక్కిరెడ్డిగారిపల్లె కాలనీకి చెందిన పొత్తపి చిన్నయ్య (58) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, బంధువుల వివరాల మేరకు చిన్నయ్య బద్వేలుకు వెళ్లి సెల్‌ఫోన్‌కు పౌచ్ వేయించుకుని వస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు. ఏపీ39 టీపీ 6930 నెంబరు గల ఆటోలో ఎక్కి రాజుపాలెం గ్రామ సమీపానికి వెళ్లే సరికి ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడి చిన్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.రూ.లక్ష ఆస్తి నష్టం -
అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య
ఒంటిమిట్ట : మండల పరిధిలోని చేనువారిపల్లె గ్రామానికి చెందిన ధారా మునయ్య(48) అనే వ్యక్తి గత నెల 29వ తేదీన కనిపించకుండా పోయినట్లు కేసు నమోదు కాగా ఆదివారం హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఒంటిమిట్ట సీఐ బాబు వివరాల మేరకు.. గతనెల 29వ తేదీన మండల పరిధిలోని మలకాటిపల్లె గ్రామంలో చీరాల అచ్చమ్మ అనే మహిళ దహన సంస్కారాలకు ధారా మునయ్య బైక్‌లో వెళ్లి తిరిగి వస్తుండగా ఉదయం 11 గంటలకు మంటపంపల్లి వద్ద అదృశ్యమయ్యాడు. అతని ఫోన్ సిగ్నల్ అందక పోవడం.. ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు దహనం చేసిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని చింతరాజుపల్లి –బోయపల్లి శివారులో చూసిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దహనం చేసిన మృత దేహాన్ని పరిశీలించగా మొబైల్ ఫోన్, ఽఆధార్ కార్డు లభించడంతో అది ధారా మునయ్య మృతదేహంగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, కాల్చేసి ఉంటారనే కోణంలో రిమ్స్ నుంచి వైద్యు బృందాన్ని పిలిచి సంఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ బాబు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు మునయ్య హత్యకు వివాహేతర సంబంధాలే కారణమని తెలుస్తోంది. -
పాత కక్షలే హత్యకు దారి తీశాయా?
మదనపల్లె : మదనపల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన యువకుడి దారుణ హత్య ఘటనలో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా పాత కక్షలే హత్యకు దారితీసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అందుకు బలం చేకూరుస్తూ మృతుడి సోదరి శశికళ శనివారం తన సోదరుడు సునీల్ కుమార్(25) హత్య ఘటనపై టూ టౌన్ పోలీసులకు.. మృతుని స్నేహితుడు పెద్దబాలి అలియాస్ బాలాంజనేయులు అలియాస్ బాల, అతని స్నేహితులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన సునీల్ కుమార్ మదనపల్లి మండలం బసినికొండ కాలనీలో నివాసం ఉంటున్నాడు. పట్టణంలో సోనూ అనే వ్యక్తితో కలిసి ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం శృతి అనే యువతితో వివాహం కాగా, ఇంటర్ పరీక్షలు రాసేందుకు ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో తన సోదరి శశికళ ఇంట్లో ప్రస్తుతం ఉంటున్నాడు. ఒకటో తేదీ (గురువారం) పనులకు వెళ్లి వస్తానని అక్క శశికళతో చెప్పి బయటికి వచ్చాడు. ఆరోజు ఇంటికి వెళ్లలేదు. దీంతో శశికళ ఫోన్ చేయగా తనకు పని ఉందని, చూసుకొని తర్వాత వస్తానని చెప్పాడు. అయితే శుక్రవారం రాత్రి పట్టణంలోని శేషప్ప తోట మయూరి కల్యాణ మండపం సమీపంలోని చర్చి వెనుక వైపున చెట్టు కింద.. తల, ముఖంపై బండరాళ్లతో కొట్టడంతో తీవ్ర గాయాలై హత్యకు గురై పడి ఉండడంతోపాటు మృతుడి తల, ముఖానికి అడ్డుగా బండరాళ్లు ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, సోదరి శశికళకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న శశికళ సోదరుని మృతదేహాన్ని చూసి తీవ్రంగా విలపించింది. గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా.. బాలాంజనేయులు అతని స్నేహితులు గౌతమ్, కమలాకర్‌లు తన తమ్ముడి హత్యకు కారకులై ఉంటారని శశికళ పోలీసులకు తెలిపింది. ఎందుకంటే తనతో బాలాంజనేయులు అసభ్యంగా ప్రవర్తించాడని, ఈ విషయం మనసులో ఉంచుకొని కక్షతో హత్య చేశారని ఆరోపించింది. రెండో తేదీ (శుక్రవారం) సునీల్ కుమార్, బాలాంజనేయులు, అతని స్నేహితులతో సంఘటన స్థలం వద్ద ఘర్షణ పడినట్లు తనకు సమాచారం ఉందని చెప్పింది. ఘర్షణ హత్యకు కారణమై ఉంటుందని పేర్కొంది. తనపై బాలాంజనేయులు అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించింది. కాగా ఆరు సంవత్సరాల క్రితం మండలంలోని రామాచార్లపల్లి వద్ద జరిగిన హత్య కేసులో బాలాంజనేయులు నిందితుడిగా ఉన్నాడు. అదే కేసులో సునీల్‌కుమార్ సాక్షిగా ఉన్నాడు. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ సునీల్ కుమార్‌ను బాలాంజనేయులు పలుమార్లు బెదిరించాడు. అంతేకాకుండా ఏడాది క్రితం శశికళ ఇంట్లో ఉండగా బాలాంజనేయులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై సునీల్ కుమార్ బాలాంజనేయులుతో ఘర్షణపడి దాడి చేశాడు. ఈ నేపథ్యంలో పాత కక్షలే హత్యకు దారి తీసి ఉంటాయని భావిస్తున్నారు. అయితే హత్య ఘటనలో ఎంత మంది పాల్గొన్నారు? హత్యకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ సునీల్ కుమార్ మృతదేహాన్ని డీఎస్పీ మహేంద్ర శనివారం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీ గది వద్ద పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హత్య కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు. హత్య కేసులో సాక్షిగా ఉన్న సునీల్ కుమార్ మృతుడి సోదరితో బాలాంజనేయులు అసభ్య ప్రవర్తన హత్యకు ముందు గొడవపడ్డారంటున్న సోదరి -
మద్య నియంత్రణ పాటించాలి
జిల్లాలో మద్య నియంత్రణ కు అధికారులు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే విచ్చలవిడగా పర్మిట్ రూములు పెట్టి తాగించడం...బెల్ట్ షాపుల ద్వారా పల్లెలకు కూడా సరుకులు చేరవేస్తుండడంతో గ్రామాల్లో తాగి కొట్టుకుంటున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడగా మద్యం పారించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. తద్వారా ఆయా కుటుంబాల్లో సమస్యలు ఉత్పన్నమతున్నాయి. –ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, రాజంపేట -
ఉపాధి పనుల్లో చేతివాటం
గాలివీడు : గ్రామాల నుంచి వలసలను నివారించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం లక్ష్యం తప్పుతోంది. క్షేత్ర స్థాయిలో ఎలాంటి పనులు చేపట్టకపోయినా.. అధికారులు, సిబ్బందికి మామూళ్లు అందితే చాలు అంతా బాగుందని ధ్రువీకరించి మమ అనిపిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు అసలే లేకపోవడంతో అధికార పార్టీ పేరు చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్లు దండుకుంటున్నారు. బోగస్ మస్టర్లు వేసి నిధులు తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఉపాధిలో అవినీతిని అరికట్టేందుకు ఎన్ని విధానాలు ప్రవేశ పెడుతున్నా.. వీరి దోపిడీకి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఆన్లైన్లోని లొసుగులను ఆసరాగా తీసుకుని దొంగ మస్టర్లు, బోగస్ హాజరుతో నిధులు స్వాహా చేస్తున్నారు. పని ప్రదేశం నుంచి కూలీల ఫొటోలను మస్టర్తో కలిపి ఎన్ఎంఎంఎస్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉండగా.. ఒక చోట నమోదు చేసిన ఫొటోలనే మరో మస్టర్‌కు నమోదు చేసి సొంత లాభం చూసుకుంటున్నారు. రోజుకు సగటున ప్రతి వ్యక్తికి రూ.307 కూలీగా నిర్ణయించారు. కూలీలు చేస్తున్న పనుల్లో కొలతలు వేస్తే.. అతి తక్కువగా కూలి పడుతోంది. ఇలాగైతే అధికారులు ఒప్పుకోకపోవడంతో కూలీలు పని చేసినా, చేయకపోయినా.. అధిక కూలి వేయక తప్పడం లేదని పలువురు క్షేత్రస్థాయి సిబ్బంది బాహాటంగానే చెబుతున్నారు. గాలివీడు మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల అమలు తీరు ఇలాగే ఉంది. చాలా గ్రామాల్లో చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. వేసవి కాలంలో గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా, ఎక్కువగా ప్రాధాన్యం లేని పనులు చేపడుతున్నారు. పంట కాలువల నిర్మాణం, పూడికతీత, పొలం గట్లపై మొక్కల పెంపకం, పంట కుంటలు, సరిహద్దు కందకాలు వంటి ప్రాధాన్యం ఉన్న పనుల జోలికి వెళ్లడం లేదు. అధికారులకూ వాటాలు ఉపాధి హామీ సిబ్బంది మస్టర్లలో హాజరు వేసిన కూలీల్లో 50 శాతం మంది మాత్రమే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. మరో 50 శాతం కూలీల పేరిట బోగస్ హాజరు వేస్తున్నారు. చాలా గ్రామాల్లో సగటున రోజుకు 30 మంది హాజరవుతుంటే మరో 20 మంది పేరిట బోగస్ హాజరు వేస్తున్నారు. కూలీల ముఖచిత్రాలు తీయడం లేదు. పనులకు వెళ్లని వారి జాబ్ కార్డులు తీసుకుని వారికి హాజరు వేస్తున్నారు. ఖాతాల్లో జమయ్యే వేతనాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు, జాబ్ కార్డుదారులు సగం సగం పంచుకుంటున్నారు. ఈ విషయం అధికారులు, కిందిస్థాయి సిబ్బందికి తెలిసినా.. వారికి కూడా వాటాలు చెల్లిస్తున్నట్లు పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు స్వయంగా చెబుతున్నారు. ఒక్కొక్కరు ఐదు నుంచి పది గ్రూపుల వరకు బినామీ పేర్లతో నిర్వహిస్తున్నారు. వీరు సంబంధిత అధికారులు, సిబ్బందిని ప్రసన్నం చేసుకుని చేతివాటం చూపుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి గ్రూపులో పనికి రాకుండానే వేతనాలు పొందుతున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు. బిల్లులు చేయించుకునేందుకు ఉపాధి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ మొదలు టీఏ, ఈసీ, ఏపీఓ, ఎంపీడీఓ స్థాయి వరకూ మామూళ్లు ముట్టచెబుతున్నట్లు సమాచారం. బాధ్యులను వదిలేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనులను ఫీల్డ్ ఆసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు, ఏపీఓలు పర్యవేక్షించాలి. ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి. సామాజిక తనిఖీల్లో అక్రమాలు బహిర్గతమై రికవరీకి ఆదేశిస్తే వెంటనే చర్యలు చేపట్టాలి. ఉపాధి హామీ నిబంధనల ప్రకారం రూ.10 వేలు రికవరీకి ఆదేశిస్తే ఫీల్డ్ అసిస్టెంట్, రూ.30 వేల రికవరీకి టెక్నికల్ అసిస్టెంట్, రూ.50 వేల రికవరీకి ఈసీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. మండల వ్యాప్తంగా సామాజిక తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా, రికవరీలకు ఆదేశిస్తున్నా బాధ్యులపై మాత్రం చర్యలు తీసుకోలేదు. దీంతో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు హెచ్చుమీరుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇలా.. మండలంలోని కొర్లకుంట గ్రామంలో ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు జరిగిన పనుల్లో మస్టర్ నంబర్లు 144 3897, 1443904, 1443984, 1443961, 11320350, 1319181, 1320353, 1323769, 11320354, 11322061, 11322062, 1611308, 11320352, 1319195, 1320359. వీటిని నిశితంగా పరిశీలిస్తే పలువురు పనులకు వెళ్లకపోయినా వెళ్లినట్లుగా, కొందరు బయటి ప్రాంతాల్లో వున్నా బిల్లులు పెట్టడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా కూలీ పనులకు వెళ్లని వారికి కూడా బోగస్ హాజరు వేసి.. వచ్చిన సొమ్ములో కొంత జాబ్ కార్డు దారుడికి ఇచ్చి మిగిలిన సొమ్ము ఫీల్డ్ అసిస్టెంట్లు నొక్కేస్తున్నారు. ఇలా మండలంలోని ప్రతి పంచాయతీ పరిధిలో ప్రతి రోజు దొంగ మస్టర్లు, ఒకరి స్థానంలో మరొకరి ఫొటోలు, కూలీల హాజరును ఎక్కువగా నమోదు చేస్తూ ఉపాధి నిధులను మింగేస్తూ జేబులు నింపుకొంటున్నారు. దొంగ మస్టర్లతో బురిడీ బోగస్ హాజరుతో వేతనాలు స్వాహా అక్రమార్కులకు అధికారుల అండదండలు పనులపై కొరవడిన పర్యవేక్షణచర్యలు తీసుకుంటాం ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పనులకు వచ్చే కూలీలను మాత్రమే మస్టర్ నమోదు చేసి వారి ఫొటోలనే అప్లోడ్ చేయాలి. ఎవరైనా బోగస్ మస్టర్లను నమోదు చేసినట్లుగా గుర్తిస్తే చర్యలకు వెనుకాడం. – వెంకటరత్నం, పీడీ, డ్వామా, అన్నమయ్య జిల్లా -
పంట పొలాల్లో చిరుత
కురబలకోట: జిల్లాలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. శనివారం కురబలకోట మండలంలోని సింగన్నగారిపల్లె దగ్గర పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రామాంజులు అనే రైతు ఉదయం టమాటా పొలం వద్దకు వెళ్లాడు. చిరుత కనిపించడంతో భయంతో పక్కనున్న చెట్టు ఎక్కుదామని భావించాడు. అంతలోనే చిరుత సమీపంలోని రైల్వే బ్రిడ్జి వైపుగా వెళ్లి అటుగా పక్కనున్న గుట్టల్లోకి చేరుకున్నట్లు రైతు తెలిపారు. విచిత్రమేమంటే చిరుతను రైతు చూశాడు కాని అది ఇతన్ని చూడకుండా వెళ్లిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే అతను ఈ సంగతిని ఊరి వారికి చెప్పడంతో అంతా పులి సంచరించిన ప్రాంతానికి చేరుకున్నారు. పులి అడుగులను గుర్తించారు. ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు హూటాహుటిన వచ్చారు. పులి అడుగు జాడలను గుర్తించారు. ఈప్రాంతంలో జింకలు సంచరిస్తుండడంతో వాటి కోసం చిరుత వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పొలాల్లో పులి కనిపించిందన్న సమాచారంతో పరిసర ప్రాంత గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల వద్దకు రైతులు ఒంటరిగా వెళ్లకుండా కొన్నాళ్ల పాటు జాగ్రత్త వహించాలని ఫారెస్టు అధికారులు సూచించారు. పరిసర గ్రామాల్లో హార్సిలీహిల్స్, బురకాయలకోట సెక్షన్ ఫారెస్టు సిబ్బంది అవగాహన కల్పించారు. చిరుత ఒక చోట ఉండదని తిరుగుతూ ఉంటుందని అన్నారు.హార్సిలీహిల్స్ పరివాహక ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. భయాందోళనలో రైతులు -
ఎల్లమ్మతల్లీ..కరుణించమ్మా..
పెనగలూరు: ఎల్లమ్మ తల్లీ కరుణించమ్మా.. మమ్మేలు తల్లీ.. అంటూ భక్తులు అమ్మను కొలిచారు. పెనగలూరు మండలంలోని సింగనమల గ్రామంలో ఎల్లమ్మతల్లి జాతర శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే జాతరకు సుదూర ప్రాంతాల నుంచి బంధుమిత్రులు రావడంతో గ్రామంలో సందడి నెలకొంది. ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు.శనివారం సాయంత్రం ఎల్లమ్మ తల్లిని గ్రామంలో ఊరేగించారు. అనంతరం గంగమ్మ, అంకాలమ్మ, మారమ్మ విగ్రహాలను తీసుకొచ్చి గ్రామ చావిడి వద్ద తాత్కాలికంగా వేపాకులతో ఆలయాలు నిర్మించి అక్కడ అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. శనివారం రాత్రి భక్తులు పొంగళ్లు సమర్పించారు.ఆదివారం కూడా పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని గ్రామస్తులు తెలిపారు. 41 సంవత్సరాల తర్వాత జాతర నిర్వహించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
ఒంటిమిట్ట: ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎర్రచందంన తరలించే వారిపై కేసులు నమోదు చేస్తామని కడప డీఎఫ్ఓ వినీత్ కుమార్ అన్నారు. శనివారం ఒంటిమిట్ట పారెస్ట్ రేంజ్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ శుక్రవారం తెల్లవారుజామున ఒంటిమిట్ట చెరువు కట్టపై అనుమానాస్పదంగా ఆల్విన్ లారీ వెళ్తుండటంతో ఒంటిమిట్ట ఫారెస్టు సిబ్బంది ఆపగా.. డ్రైవర్ నిలపకుండా వెళ్లాడు. దీంతో వాహనాన్ని వెంబడించారు. కొద్దిదూరంలో వాహనాన్ని వదిలేసి లారీ డ్రైవర్ పరారయ్యాడు. మినీ లారీలో స్మగ్లర్లు వదిలేసిన మొబైల్ ఫోన్ల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. ఈ కేసులో పరారైన పీలేరు జిల్లా రేగళ్ల కు చెందిన మురళి కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు కడప డీఎఫ్ఓ తెలిపారు. ఆల్విన్ లారీలో 84 దుంగలను కూరగాయల మాటున తీసుకెళ్లేందుకు నిందితులు ప్రయత్నం చేశారు. వాటి విలువ సుమారు రూ. 11 లక్షలు ఉంటుందని తెలిపారు. అయితే బయటి మార్కెట్లో వీటి విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. ఈ కార్యక్రమంలో సబ్ డీఎఫ్ఓ వివేకానంద, ఎప్ఆర్ఓ బాలసుబ్రమణ్యం, ప్రసాద్, డీఆర్ఓ నాగు నాయక్, ఎఫ్ఎస్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అశ్వవాహనంపై హరిహరులు
వల్లూరు : పుష్పగిరిలోని శ్రీ కామాక్షీవైద్యనాఽథేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి, శ్రీ కామాక్షీ వైద్యనాథస్వాములు అశ్వ వాహనాలపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. మొదట పుష్పగిరి గ్రామంలోని శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామి అశ్వ వాహనంపై కొలువు దీరగా.. మంగళ వాయిద్యాలు, దివిటీల వెలుగులతో మాడ వీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి అశ్వ వాహనంపై కొలువు దీరి విహరించారు. కొండపై నుంచి స్వామి వారిని పెన్నానది మీదుగా పల్లకీలో మోస్తూ గ్రామంలోని మాడ వీధులలో ఘనంగా ఊరేగించారు. ఉదయం శ్రీ వైద్యనాథస్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీ చక్ర సహిత కామాక్షీ అమ్మవారికి కుంకు మార్చనలు చేశారు. శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో యాగశాల పూజలు, వివిధ హోమాలు నిర్వహించారు. బలి హరణ కార్యక్రమం చేపట్టారు. స్వామి వారికి, లక్ష్మీదేవికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు చక్రస్నానం పుష్పగిరి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం వైద్యనాథస్వామి త్రిశూలం, చెన్నకేశవస్వామి సుదర్శన చక్రస్నానం జరుగుతుంది. అనంతరం రెండు ఆలయాల్లో పూర్ణాహుతి, ధ్వజ అవరోహణం కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 4.30 గంటల నుంచి శ్రీ లక్ష్మీచెన్నకేశవ ఆలయంలో పుష్పయాగం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామి ఆలయంలో రావణేశ్వర వాహన సేవ ఉంటుంది. అనంతరం శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామికి తిరుచ్చి వాహన సేవ జరుగుతుంది. వైభవంగా గ్రామోత్సవాలు కనుల పండువగా బ్రహ్మోత్సవాలు -
మామిడి చెట్లు దగ్ధం
పుల్లంపేట : మండల పరిధి వెంగమాంబ ఆర్.గొల్లపల్లె గ్రామంలో శనివారం దాదాపు ఐదు ఎకరాల మామిడి, నిమ్మ చెట్లు దగ్ధమయ్యాయి. గ్రామ సమీపంలోని నల్లిపల్లె లలితమ్మ, రాజశేఖర్‌రావు, చెంగయ్య అనే రైతులకు చెందిన మామిడి, నిమ్మ చెట్లు కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు కంచెకు నిప్పు పెట్టడంతో.. మంటలు తోట అంతా వ్యాపించాయి. విషయ తెలిసి రైతులు వెళ్లి చూసే సరికి ఏమీ మిగలలేదు. వేసవిలో ఆకతాయిలు ఎండిపోయిన గడ్డికి నిప్పు పెడుతుండటంతో ఇలా జరుగుతోందని రైతులు పేర్కొంటున్నారు. తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. వృద్ధురాలిపై పిచ్చికుక్క దాడి మదనపల్లె : పిచ్చికుక్క దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. కొండామరిపల్లె పంచాయతీ బెస్తపల్లెకు చెందిన నారాయణమ్మ (70) ఇంటి ముందు కూర్చుని ఉండగా.. అకస్మాత్తుగా పిచ్చికుక్క ఆమైపె దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికులు కుక్కను వెంబడించడంతో పరిగెత్తుతూ దారి వెంట ఎదురుపడిన ఆవులు, దూడలను కరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వృద్ధురాలిని వెంటనే మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం బాధితురాలని తిరుపతికి రెఫర్ చేశారు. కీచక ఉద్యోగిపై విచారణ సాక్షి టాస్క్ ఫోర్స్ : ‘ఆ శాఖలో.. కీచకుడు’ అనే కథనం శనివారం సాక్షిలో ప్రచురితమైంది. ఈ కథనం ఆ శాఖలో కలకలం రేపింది. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయంతోపాటు జిల్లా కలెక్టరేట్ అధికారులు ఆరా తీశారు. ఈ అంశానికి సంబంధించి ఈ నెల 5వ తేదీన ఉదయం 10.30 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో.. విచారణకు హాజరు కావాలని జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, క్షయ నివారణ అధికారి తెలిపారు. ఫిర్యాదు చేసిన వారితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి.. మొత్తం నలుగురిని విచారణకు పిలిచినట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి వాయిస్ రికార్డ్‌లు, ఇతర ఆధారాలు ఉన్నాయి. కాగా ఈ విచారణను సొంత శాఖకు చెందిన వారా లేదా ఆ శాఖకు సంబంధం లేని అధికారులా, ఎవరు విచారణ చేపడుతారో తెలియాల్సి ఉంది. జరుపబోయే ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయం గెలవాలని ఆ శాఖకు చెందిన ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. -
● ఎమ్మార్పీ ధరలకు మంగళం
సాక్షి రాయచోటి: రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్లు ఆర్థికంగా బలపడేందుకు అక్రమార్గాల్లో ముందుకు పోతున్నారు. అధికారంలో ఉండగానే అన్నీ చక్కబెట్టుకోవాలన్నట్లు అవకాశం ఉన్న ప్రతి అంశంపై కన్నేస్తున్నారు. ప్రధానంగా ఇసుక, మద్యం, మట్టి, గ్రావెల్ ఇలా అన్నింటిలోనూ దోపిడీకి స్కెచ్ వేశారు.అయితే మద్యం దుకాణాలు జిల్లాలో ఎక్కువ శాతం కూటమి సర్కార్‌లోని సంబంధీకులకే రావడంతోవారు ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూములకు అనుమతులు లేవని...బెల్ట్ షాపులను లేకుండా చేస్తున్నామని పేర్కొంటున్నా కిందిస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మద్యం దుకాణాల వద్ద ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అనధికార బెల్ట్ షాపులతో మద్యం వ్యాపారం మూడు క్వార్టర్లు..ఆరు బీర్లుగా విరాజిల్లుతోంది. అధికారులు ఇచ్చిన సమయపాలనను కూడా ఇటు బార్లుగానీ, అటు వైన్‌షాపులకు సంబంఽధించిన వారు ఎవరూ పట్టించుకోకుండా ఉదయం నుంచే అమ్మకాలు సాగిస్తున్నారు. మద్యం దుకాణాల ప్రక్కన పర్మిట్ రూములు జిల్లాలో కూటమి సర్కార్‌లోని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, వారి అనుచరులకే మద్యం దుకాణాలు దక్కాయి. దీంతో ఎవరూ అడ్డుకోలేరనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూములు పెట్టి నడిపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పర్మిట్ రూములుకు అనుమతులు లేవని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం యధేచ్ఛగా కూర్చొబెట్టి తాపిస్తున్నారు. ఎకై ్సజ్‌శాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు...వినబడినా వినబడనట్లు ముందుకు పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 120కి పైగా మద్యం షాపులు ఉన్నా ఏదో కొన్నిచోట్ల మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పర్మిట్ రూములను ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా వైన్ షాపుల వద్ద సెపరేట్ రూములు పర్మిషన్ లేకపోయినా ఎవరు ఏమి చేయలేరన్న ధీమా జిల్లాలో అధిక శాతం కూటమినేతలకే వైన్ షాపులు ఎకై ్సజ్ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం జిల్లాలోని మద్యం దుకాణాల్లో పలుచోట్ల బాటిల్‌పై ఎమ్మార్పీ ధర కాకుండా రూ. 10–30లకు అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల సాధారణ ధరలకే విక్రయాలు సాగిస్తున్నా మరికొన్నిచోట్ల బీరు, ఇతర మద్యం బాటిళ్లపై చిలక్కొట్టుడు కొడుతున్నారు. పైగా షాపుల వారికి అధికార బలం ఉండడంతోఎకై ్సజ్ అధికారులు కూడా వేగంగా స్పందించలేకున్నారన్న ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత మొత్తం అని కాకుండా పెద్ద ఎత్తున ధరలు పెంచి విక్రయిస్తున్నా అడిగే వారు లేకపోవడంతో ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. -
కోరం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి
రాయచోటి టౌన్ : వీఎస్ఎస్ ఎన్నికలు కోరం ప్రకారమే నిర్వహించాలని వంగిమళ్ల గ్రామం నాయనివారిపల్లె గ్రామ ప్రజలు రాయచోటి ఫారెస్టు అధికారులకు వినతి చేశారు. శనివారం వీరబల్లి మండలం వగిమళ్ల గ్రామం నాయనివారిపల్లెలో వృక్ష సంరక్షణ సమతి(వీఎస్ఎస్) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సి ఉండగా.. అధికార పార్టీ నాయకుల వత్తిడికి తలొగ్గి టీడీపీకి చెందిన వారినే వీఎస్ఎస్ సంఘం నాయకులుగా గుర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో తమకు న్యాయం జరగలేదని అధికార పార్టీకి చెందిన వారినే గెలుపొందినట్లు రికార్డులలో రాసుకున్నారని, ఈ పద్ధతి సరైనది కాదని ఆరోపిస్తూ ఆ ప్రాంతానికి చెందిన అర్హత కలిగిన అభ్యర్థులు ఎఫ్ఆర్వో వై.చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో మాట్లాడుతూ కోరం ప్రకారం సభ్యులు ఉంటేనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మొత్తం ఓట్లలో 51 శాతం ఓట్ల శాతం ఉన్నప్పుడే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కోరం ప్రకారం ఎన్నికలు జరగకపోతే కోర్టును శ్రయించవచ్చునని సూచించారు. దీనిపై రాయచోటి డీఎఫ్‌వో వై.చంద్రశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా.. ఆ గ్రామంలో ఉన్న స్థానికుల సహకారంతో కోరం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దీనిపై స్థానిక ప్రజలకు అవగాహన కూడా కల్పించామని చెప్పారు. ఈ ఎన్నికలు సజావుగా జరగకపోతే, త్వరలోనే ఎన్నికల నియవాళి ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
సంచులకు నిప్పు.. తప్పిన పెను ప్రమాదం
వేంపల్లె : స్థానిక పులివెందుల రోడ్డులోని కందుల కాంప్లెక్స్ వెనుక ఉన్న రేకుల షెడ్డులో గోనె సంచులకు అగ్ని అంటుకుంది. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. కందుల కాంప్లెక్స్ వెనుక కూరగాయలకు చెందిన వ్యాపారులు షెడ్లు వేసుకుని వాటిలో పాత గోనె సంచులు, టమాటా ట్రేలను పెట్టుకున్నారు. శనివారం గోనె సంచులు ఉన్న రేకుల షెడ్డులో మంటలు వస్తున్న విషయాన్ని స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే ఉన్న మరో రేకుల షెడ్డులో రోగులు, ఆస్పత్రులకు సప్లయ్ చేసే ఆక్సిజన్‌కు చెందిన సిలిండర్లకు మంటలు అంటుకొనే లోపలే.. అదుపు చేయడంతోపాటు సిలిండర్లపై నీటిని చల్లారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానికులు, ఫైర్ సిబ్బంది చాలా కష్టపడ్డారు. మంటల్లో మోటార్ బైకు కాలిపోయింది. ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లు మంటలకు పేలి ఉంటే ప్రజలు మృత్యువాత పడే అవకాశం ఉండేదని స్థానికులు వాపోతున్నారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక శాఖ అధికారి శివరామిరెడ్డి, ఫైర్ సిబ్బంది ఎస్.ఎం.డి. సాలర్, మహమ్మద్ రఫీ, సురేంద్ర రెడ్డి, నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
అర్జీలకు సత్వరమే పరిష్కారం
రామాపురం: ప్రజాసమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర, రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆర్అండ్బీ వసతి గృహంలో మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిని పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేడు విజయవాడ నుంచి కడపకు ప్రత్యేక బస్సు కడప కోటిరెడ్డిసర్కిల్: నీట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల సౌకర్యార్థం ఆదివారం రాత్రి 9.45 గంటలకు విజయవాడ నుంచి కడపకు ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీసును నడపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సు ఒంగోలు, కావలి, బద్వేలు మీదుగా కడపకు చేరుతుందన్నారు. ప్రయాణీకులు, విద్యార్థులు ఈ ప్రత్యేక సర్వీ సును సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియామకాలు కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో అన్నమయ్య జిల్లా వాసులకు చోటు కల్పించారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాజంపేటకు చెందిన కొట్టిక రాజమోహన్‌ను రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీగా, షేక్ మహమ్మద్ జాహిద్ అలీని రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా, జింకా ఓబయ్యను రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీగా, మదనపల్లెకు చెందిన ఎం.భారతి జయకుమారిని రాష్ట్ర అంగన్వాడీ విభాగం సెక్రటరీగా, రాజంపేటకు చెందిన మడితాటి సురేంద్రారెడ్డిని రాష్ట్ర ఉద్యోగ, పెన్షనర్ల విభాగం సెక్రటరీగా, మదనపల్లెకు చెందిన ఎన్.జగన్నాథరెడ్డిని రాష్ట్ర ఉద్యోగ, పెన్షనర్ల విభాగం జాయింట్ సెక్రటరీగా నియమించారు. గాలులతో విద్యుత్‌శాఖకు రూ. 30లక్షల నష్టం సిద్దవటం: మండలంలో గురువారం సాయంత్రం అకాల వర్షం, గాలులకు విద్యుత్ శాఖకు దాదాపు రూ. 30 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఎస్పీడీసీఎల్ కడప ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిసేవ్యానాయక్ తెలిపారు. సిద్దవటం మండలం బొగ్గిడివారిపల్లెలో శనివారం ఆయన విద్యుత్ మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల పెద్ద వృక్షాలు విద్యుత్ లైన్లపై పడటంతో 100 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయన్నారు. 10 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయన్నారు. 4 కిలోమీటర్ల మేర విద్యుత్‌లైన్ దెబ్బతిందన్నారు. ఈమేరకు దాదాపు రూ. 30 లక్షలు మేర విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లిందన్నారు. గృహ వినియోగ దారులకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట డీఈ సుబ్రమణ్యం, సిద్దవటం, ఒంటిమిట్ట ఏఈలు జయచంద్ర, ఉదయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్యసాధనకు కష్టపడాలి కురబలకోట: చదువు సంధ్యలనేవి జీవితాన్ని ఉన్నతంగా మలుచుకునేందుకు మహత్తరమైన అవకాశమని బెంగళూరు జర్సీ ల్యాబ్స్చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాంత్ కె అరిమానిత్య అన్నారు.విద్యార్థులు లక్ష్యసాధనకు కష్టపడాలని సూఐచించారు. అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల 27వ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు విద్యార్థుల కేరీర్‌ను మలుపు తిప్పుతాయన్నారు. డిజిటల్ పరివర్తన, ఏఐ, ఆటోమేషన్ తదితర టెక్నాలజీల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థుల ఆలోచనలే వారి భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే క్రమ శిక్షణ, కష్టపడే తత్వం కలిగి ఉండాలన్నారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు టెక్నాలజీనే ఆధారంగా నిలుస్తోందన్నారు. నేడు నేర్చుకునే ప్రతి పాఠం రేపటి భవిష్యత్తుకు పునాదిగా మారుతుందన్నారు. ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తే పైకి ఎదగవచ్చన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ట్రిపుల్ ఆర్ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకనాఽథ్, ప్రిన్సిపాల్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలి
రాయచోటి: మండలాల్లో ప్రభుత్వ భూములకు తగిన విధంగా రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆక్రమిత భూముల గుర్తింపు, జీఓ ఎంఎస్ నంబర్.30 మార్గదర్శకాల మేరకు అభ్యంతరలేని ప్రభుత్వ భూములు ఆక్రమణ రెగ్యులరైజేషన్, రీ సర్వే, అందరికీ గృహనిర్మాణం దరఖాస్తులు స్వీకరణ, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు భూముల గుర్తింపు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పథకాలకు భూములు అవసరం అవుతాయని కలెక్టర్ సూచించారు. మండలాల వారీగా సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ పథకం 2025లో భాగంగా ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన మార్గదర్శకాల మేరకు 2019 అక్టోబర్ 15కు ముందు ప్రభుత్వ భూములను అనధికారికంగా ఆక్రమించుకొని ఏర్పరుచుకున్న నివస గృహాలలో అభ్యంతరకరం లేని వాటిని క్రమబద్దీకరణ అంశంలో గుర్తించిన యూనిట్లు, తీసుకున్న చర్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. అలాగే హౌసింగ్ రీ వెరిఫికేషన్ పెండింగ్ కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పచ్చి మేతపెంపకానికి డివిజన్, మండల స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, డికేటీ, ప్రైవేటు భూములను ప్రతి మండలంలో కనీసం 3 వేల ఎకరాలను గుర్తించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు, సబ్ కలెక్టర్లు మేఘస్వరూప్, వైఖోన్ నదియా దేవి, ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
గుర్రంకొండ.. చూసోద్దాం రండి
గుర్రంకొండ : జిల్లాలో రాచరికానికి, నవాబులు, రాజులు, బ్రిటీష్ వారి పాలనకు నిలువుటద్దంగా నిలిచిన గుర్రంకొండ కోట వేసవి సెలవుల్లో పిల్లలు, పెద్దలు చూడదగిన ప్రదేశం. జిల్లాకు నడిబొడ్డున ఒక మణిహారంలా విరాజిల్లుతోంది. 14వ శాతాబ్దం నుంచి ఈ కోటను పలు వంశాలకు చెందిన రాజులు, నవాబులు పరిపాలించారు. కడప నవాబు పరిపాలనలో ఈ కోట పేరుగాంచింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దేవాలయాలు, చెరువులు ఉన్నాయి. మైసూర్ రాజు టిప్పుసుల్తాన్ బాల్యం, విద్యాభాస్యం ఇక్కడే గడిచింది. చివరగా బ్రిటీషువారితో ఇక్కడ రాజరిక పాలనకు తెర పడింది. ఈ ఘనచరిత్ర కలిగిన ఈ కోటలోఎన్నో విశేషాలు, చూడదగిన ప్రదేశాలు, ఆకట్టుకొనే కట్టడాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఈ విశేషాలను తిలకించడానికి రాష్ట్రం నుంచేగాక కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. మనం కూడా ఒకసారి చూసొద్దాం రండి. రంగిణీ మహ ల్గుర్రంకొంట కోటలో చూడదగిన ముఖ్య ప్రదేశం రంగిణీమహల్. ఎంతో పురాతన రాజభవనం ఇది. ముందువైపు నుంచి రెండు అంతస్తులుగా, వెనక వైపు నుంచి మూడు అంతస్తులుగా కనిపించడం దీని ప్రత్యేకత. ఎన్నో గదులు, ఓ గదిలో భవనం లోపలి నుంచి సొరంగ మార్గం ఉంది. శత్రు రాజులు దండెత్తినప్పుడు ఈ మార్గంలో కోట బయటకు వెళ్లేందుకు ఈసొరంగం ఒక మార్గంగా ఉండేది. పురాతన మెట్లు, సమావేశపు గదులు రాజరికానికి నిలుటద్దంగా నిలుస్తాయి. కోటముఖద్వారం గుర్రంకొండను రాజులు పరిపాలించే కాలంలో కొండ చుట్టూ కోట గోడ నిర్మించారు. చుట్టూ కందకాలు తవ్వి వాటిలో నీరు నింపేవారు శత్రువులు కోటగోడలు ఎక్కకుండా ఆనీటిలో మొసళ్లు వదిలేవారు. అలాంటి కోటకు ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ ద్వారం నుంచే ఎవరైనా కోటలోకి ప్రవేశించేవారు. పురాతన కట్టడంగా ఇది నిలుస్తోంది. షాకమాల్ దర్గా కోట పక్కనే మగ్బీరా ఉంది. పురాతన మహమ్మదీయుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కట్టడం ఇది. మగ్బీరా అంటే సమాధి. గుర్రంకొండ కోటను టిప్పుసుల్తాన్ మేనమామ మీర్రజాఆలీఖాన్ పాలించేవారు. అతను మృతిచెందిన తరువాత సమాధిని మగ్బీరాగా నిర్మించారు. డూమ్‌లో చేసే శబ్దాలు ప్రతి ధ్వనించడం ప్రత్యేకత. కోటలో ఇంకా చూడదగిన విశేషాలు● కొండపైన కోట బురుజులు, పురాతన కట్టడాలు, పురాతన ఇళ్లు ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి మెట్లమార్గం కూడా ఉంది. ● కోటలో శిథిలావస్థకు చేరుకొన్న అలనాటి ఆస్పత్రి భవనం ఉంది. ● కోటలో ఆంజనేయస్వామి, విఘ్నేశ్వరస్వామి ఆలయాలు, టిప్పుసుల్తాన్ కాలంనాటి ఈద్గాలు ఉన్నాయి. ● గుర్రంకొండ పట్టణంలో షాకమాల్ దర్గా దర్గా దగ్గర టిప్పుసుల్తాన్ చదువుకొన్న పాఠశాల యూసూఫ్ సాహేబ్ తకియా ఉంది. ● కోట నుంచి పదికిలోమీటర్ల దూరంలో తరిగొండ గ్రామంలో ప్రముఖ రచయిత్రి తరిగొండ వెంగమాంబ ఆలయం ఉంది. ● గుర్రంకొండ పాలకులు టిప్పు సుల్తాన్ చదవుకొన్న యూసూఫ్ సాహేబ్ తకియా(తకియా అంటే పారసీ భాషలో పాఠశాల అని అర్థం). ఇక్కడ ఉంది. ● గుర్రంకొండ కోటలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయులు కొండపైభాగంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. రంగిణీ మహల్‌కు దగ్గరలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. ● కోట నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సంతాన ప్రదాయిని చెర్లోపల్లె శ్రీ రెడ్డెమ్మకొండ దేవాలయం ఉంది. ● వీటితోపాటు ఇంకా ఎన్నో విశేషాలు గుర్రంకొండ కోటలో చూడవచ్చు. ఇలా వెళ్లొచ్చు..● జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు వెళ్లే మార్గంలో 38 కిలోమీటర్ల దూరంలో కడప–బెంగుళూరు జాతీయ రహదారిపై ఉంది. ● తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్లే మార్గంలోని వాల్మికీపురం నుంచి 17 కిలోమీటర్లు ఉంటుది. . ఇదే మార్గంలోనే తరిగొండ వెంగమాంబ ఆలయమున్న తరిగొండ గ్రామం ఉంది. ● తిరుపతి నుంచి నేరుగా అయితే 110 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చిత్తూరు నుంచి నేరుగా అయితే 125 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ● మదనపల్లె నుంచి కడపకు వెళ్లే మార్గంలో అయితే మదనపల్లె నుంచి 33 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అన్నమయ్య జిల్లాకు మణిహారం గుర్రంకొండ కోట వేసవిలో సందర్శించదగిన చరిత్రాత్మక పర్యాటక కేంద్రం -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రాజంపేట : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందారు. చిట్వేలి మండలం నాగవరానికి చెందిన మూరి అనిత(28) పెద్దఓరంపాడులోని తన పుట్టింటి నుంచి రాజంపేటకు ఆటోలో బయలుదేరారు. కడప–రేణిగుంట జాతీయ రహదారిపై రాజంపేట పట్టణ శివారులోని అశోక్ గార్డెన్స్ వద్ద వీరి ఆటోను టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మూరి అనిత(28) అక్కడికక్కడే మృతిచెందారు. ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ అంజి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం అతడిని కడప రిమ్స్ తరలించారు. విషయం తెలుసుకున్న బంధువులు చేరుకు బోరున విలపించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అమరావతికి వెళ్తూ యానిమేటర్కు గాయాలు ఓబులవారిపల్లె : అమరావతి పునర్నిర్మాణ సభకు వెళ్తూ ఒంగోలు వద్ద బస్సు టైర్ పగిలి జరిగిన ప్రమాదంలో యానిమేటర్ పట్ర కవితకు తీవ్రగాయాలయ్యయి. స్థానికుల వివరాల మేరకు.. అమరావతిలో మోదీ సభకు గురువారం రాత్రి మండలంలోని ఎస్‌హెచ్‌జీ బృందాల మహిళలు ఆర్ర్టీసీ బస్సులో బయలుదేరారు. ఒంగోలు చేరగానే.. బస్సు వెనుక టైర్ పెద్ద శబ్దంతో పేలింది. ఓబులవారిపల్లె మండలం శంకరాపురం దళితవాడకు చెందిన పట్ర కవిత, మంగళంపల్లె గ్రామానికి చేందిన గీతకు గాయాలయ్యాయి. వారిని తిరుపతి బర్డ్ ఆసుపత్రికి తరలించారు. సభకు వెళ్తూ పట్ర కవిత గాయపడినా నాయకులు పట్టించుకోలేదని రైల్వేకోడూరు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జోతి చిన్నయ్య విమర్శించారు. చెట్టుకు ఉరివేసుకొని తిరుపతి వాసి మృతి రాయచోటి : రాయచోటి రూరల్ మండలం జంగంరెడ్డిగారిపల్లె సమీపంలో చింత చెట్టుకు ఉరివేసుకుని కోటకొండ రెడ్డప్ప(40) మృతి చెందినట్లు రాయచోటి అర్బన్ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న రెడ్డప్ప జంగమరెడ్డిగారిపల్లెలోని కుమార్తె డేరంగుల మాధవి ఇంటికి ఐదు రోజుల కిందట వచ్చారు. మద్యం తాగడం మానుకోవాలంటూ కుమార్తె మాధవి చెప్పింది. మద్యానికి బానిసైన రెడ్డప్ప మద్యం తాగకుండా ఉండలేక గురువారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటి నుంచి వెళ్లి మామిడితోటలోని చింత చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందారు. రెడ్డప్ప కుమార్తె డేరంగుల మాధవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎర్రచందనం కేసులో ఇద్దరికి జైలుశిక్ష
సిద్దవటం : ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ అడిషనల్ సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించినట్లు సిద్దవటం రేంజర్ బి.కళావతి తెలిపారు. సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సిద్దవటం రేంజ్లో ఎర్రచందనం తరలింపుపై సిద్దవటం మండలం మాధవరం గ్రామానికి చెందిన రామేటి సుబ్బరాజు, కడప మలినేనిపట్నానికి చెందిన గంపాల యల్లయ్యలపై కేసు నమోదైందన్నారు. ముత్తుకూరు బీట్‌లో రూ.47 కిలోల ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిందన్నారు. -
రమణీయం.. రథోత్సవం
● వైభవంగా పుష్పగిరి బ్రహ్మోత్సవాలు ● హరిహరులకు ప్రత్యేక పూజలు ● భారీగా పాల్గొన్న భక్తజనం వల్లూరు: పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం హరిహరుల రథోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. పుష్పగిరి భక్తజన సంద్రంగా మారింది. ఉదయం శ్రీ వైద్యనాఽథేశ్వరస్వామి రథోత్సవం జరిగింది. శ్రీ కామాక్షీ సమేతుడైన వైద్యనాథస్వామి రథంలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం శివ నామాన్ని స్మరిస్తూ భక్తులు పోటీ పడి రథాన్ని లాగారు. కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ● సాయంత్రం శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి గ్రామోత్సవాలలో వివిధ వాహనాలపై ఒంటరిగా దర్శనమిచ్చిన చెన్నకేశవస్వామి కల్యాణ మహోత్సవంతో పరిపూర్ణుడై శ్రీదేవి, భూదేవిలతో కలిసి రథంపై ఆశీనులయ్యారు. బంగారు ఆభరణాలతో అలంకార భూషితులైన స్వామివారు ఇద్దరు దేవేరులతో కలిసి ద ర్శనమివ్వడంతో.. సాక్షాత్తు వైకుంఠంలోని శ్రీ హరి అంశకు చెందిన శ్రీ వెంకటేశ్వరున్ని ద ర్శించుకున్నట్లుగా భక్తులు పులకించి పోయా రు. ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితు లు ఆధ్వర్యంలో రథం వద్ద పూజలు చేశారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రథ సంప్రోక్షణ, అభిషేకాలు నిర్వహించారు. రథ ప్రారంభ పూజ, వాస్తు పూజ, శాంతి, అష్టబలి, కుష్మాండబలి, ఉత్సవ మూర్తుల దేవతా రాధన, మహా మంగళ హారతి నిర్వహించారు. గోవింద నామాలను జపిస్తూ భక్తులు రథం గొలుసులను పట్టుకుని లాగారు. పుష్పగిరి మాడ వీధుల్లో భక్తులు కాయ కర్పూరాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తలు భారీగా తరలివచ్చారు. ● రథాల వద్ద జరిగిన పూజల్లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి, ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, మురళీమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. పుష్పగిరిలో నేడు పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామి, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి అశ్వవాహనంపై దర్శనమివ్వనున్నారు. -
చేపల కోసం విషప్రయోగం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని రంగసముద్రం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషపూరితమైన ద్రావణాన్ని కలిపేశారని మండలంలోని రంగసముద్రం, రాపూరివాండ్లపల్లి పంచాయతీ ప్రజలు కలెక్టర్, మత్స్య శాఖ, డీపీవో, డీఎల్పీవో, మండల అధికారులకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. విష ప్రయోగంతో చెరువులోని చేపలు మృతిచెందాయని వారు పేర్కొన్నారు. చేపలు నీటిలో తేలియాడడం, రంతా కలుషితమై దుర్వాసన రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన చేపలు తిన్న కుక్కలు రోగాల బారిన పడుతున్నాయని, కలుషిత నీటిని తాగి పశువులు, ప్రజలకు ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులకు వారు తమ గోడును వెళ్ళబోసుకున్నట్లు తెలిపారు. నీటిని కలుషితం చేసిన వారిని గుర్తించి, చూసీ చూడనట్లు వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్‌కు రెండు గ్రామాల ప్రజల ఫిర్యాదు -
చెరువులో భవన నిర్మాణ కార్మికుడు మృతి
నిమ్మనపల్లె : చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందిన ఘటన నిమ్మనపల్లె మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. రాచవేటివారిపల్లెకు చెందిన బోడుమల్లె జగన్నాథం(40) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. అతడికి భార్య చిన్నబుజ్జి, కుమార్తె మహిత, కుమారుడు మహేష్ ఉన్నారు. ఏప్రిల్ 30న భార్య కూలి పనికి వెళ్లగా, మదనపల్లె ఆస్పత్రిలో బంధువు అనారోగ్యంతో ఉన్నాడని, చూసి వస్తానని జగన్నాథం ఇంటి నుంచి వెళ్లాడు. అయితే.. మూడు రోజులుగా రాకపోవడంతో భార్య కుటుంబ సభ్యులతో కలిసి భర్త కోసం గాలిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆచార్లపల్లె సమీపంలోని ముసలినాయుని చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతుండడం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తెచ్చారు. మృతుడి కుడిచేయికి మల్లయ్య పచ్చబొట్టు, ఎర్రటి గుడ్డ ఉండగా, కుడికాలికి ఎర్రటితాడు ఉంది. దీంతో పోలీసులు, గత మూడురోజులుగా కనిపించని వారి కుటుంబసభ్యులు ఉంటే రావాల్సిందిగా సమాచారం అందించడంతో మృతుడి భార్య చిన్నబుజ్జి చెరువు వద్దకు చేరుకుని ఆనవాళ్ల ఆధారంగా భర్త జగన్నాథంను గుర్తు పట్టింది. మృతి చెందిన వ్యక్తి తన భర్తేనని చెప్పింది. తన భర్త అప్పుడప్పుడు చేపల కోసం చెరువుకు వెళుతుంటాడని, అదే క్రమంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెంది ఉంటాడని పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. భార్య చిన్నబుజ్జి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య
ములకలచెరువు/మదనపల్లె : కుటుంబ సమస్యలతో వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ములకలచెరువు మండలంలో జరిగింది. చిన్నమొరవపల్లెకు చెందిన అమరనాథ్‌రెడ్డికి, శిరీష(26)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. శిరీష మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేది. ఇటీవల కొంతకాలంగా తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతుండటంతో ఉద్యోగం మానేసింది. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి కుటుంబ సమస్యలతో భర్తతో గొడవపడింది. మనస్తాపం చెంది ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఔట్‌పోస్ట్ పోలీసులు వివాహిత మృతి సమాచారాన్ని ములకలచెరువు పోలీసులకు తెలియజేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
రైతు ఇంట్లో బంగారు నగల చోరీ
కురబలకోట : మండలంలో మళ్లీ బంగారు నగలు చోరీ అయ్యాయి. అంగళ్లు దగ్గరున్న గౌనివారిపల్లెలోని జి.సోమశేఖర్‌రెడ్డి ఇంటిలో శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని యువకులు ప్రవేశించి బీరువాలో దాచిన రూ.25 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారు నగలను అపహరించారు. పోలీసులకు బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గౌనివారిపల్లెకు చెందిన సోమశేఖర్ రెడ్డి శుక్రవారం కుటుంబంతో సహా ఊరికి దగ్గరలోని టమాటా పొలం వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి రాగా తలుపు తెరచి ఉండడం కనరిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలు తెరచి ఉండడం.. మంచంపై చెల్లా చెదురుగా దుస్తులు పడిఉండడం గమనించి అవాక్కయ్యారు. బీరువాలో రూ.25 లక్షలు విలువ చేసే 250 గ్రాముల బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకుపైన పంచె కట్టుతో ఉన్న ఇద్దరు యువకులు ఊరిలో సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. తెలిసిన వారింటికి చుట్టాలుగా వచ్చి ఉంటారని తొలుత భావించడంతో పసిగట్టలేకపోయారు. ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ గ్రామంలో విచారణ జరిపారు. వేలిముద్రలు, ఆధారాల సేకరణతో పాటు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుల వస్త్రధారణను బట్టి ఇళ్లల్లో చోరీ చేయడంలో దిట్టగా ఉన్న తమిళనాడు గ్యాంగ్‌గా ఉన్నట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. పోలీసులకు సవాల్ చేసేలా జరుగుతున్న ఈ దొంగతనాలు స్థానికులను కలవరపరుస్తున్నాయి. అక్కడ ప్రెస్ మీట్...ఇక్కడ మళ్లీ చోరీ.!! మండలంలో వరుస చోరీలు జరుగుతుండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఇదే గౌనివారిపల్లెలో హైవే పక్కనే ఉన్న ఇంటిలో బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అంగళ్లులో హైవే పక్కన ఏడు షాపుల్లో చొరబడి సామాగ్రి, నగదు ఎత్తుకెళ్లారు. చేనేతనగర్‌లోని హార్డ్‌వేర్ షాపులో చొరబడి వస్తువులు పట్టుకెళ్లారు. ఇటీవల కురబలకోటలోని కువైట్ మస్తాన్, అదే ఊరికి చెందిన వరలక్ష్మి ఇంటిలో రెండిళ్లలో కేజీ దాకా బంగారు నగలు, నగదు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహిస్తుండగా అదే సమయంలో మండలంలోని గౌనివారిపల్లెలో మళ్లీ కొత్తగా చోరీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. రాకపోకలు సాగించేవారిని పసిగట్టడానికి ప్రతి ఊరికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. బ్యాంకుల్లో భద్రపరచుకోవడం అదీ లేదంటే గోల్డ్ లోను కింద బంగారు నగలను భద్రపరచుకోవడం ఉత్తమమని పలువురు భావిస్తున్నారు. ముందు జాగ్రత్తతో విలువైన వాటిని కాపాడుకోవడం ఉత్తమమని పోలీసులు చెబుతున్నారు. కురబలకోటలో వరుస చోరీలతో కలకలం -
ఈదురు గాలులకు.. నేలవాలిన పంటలు
రాయచోటి: జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఈదురుగాలుల కారణంగా మామిడి రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి పంటకు కూడా అక్కడక్కడ నష్టం వాటిల్లింది. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి వ్యవసాయ డివిజన్ల పరిధిలో మామిడి పంటకు అధికంగా నష్టం చేకూరినట్లు ఉద్యానవనాధికారుల సమాచారం. జిల్లా వ్యాప్తంగా 3500 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతినడంతో సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఏడాది మొదట్లో చీడపీడలు వెంటాడాయి. ద్వితీయార్థంలో ప్రకృతి వైపరీత్యాలు మామిడిని పండించే రైతులను నష్టాల పాలు చేశాయి. అష్ట కష్టాలు పడి పండించిన పంట దెబ్బతినడంతో ఏమిచేయాలో దిక్కతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. చెట్లు విరిగిపడడం, కరెంట్ స్తంభాలు కూలడంతో విద్యుత్ శాఖకు నష్టం జరిగింది. ● రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రాజంపేట, కోడూరు వ్యవసాయ డివిజన్ల పరిధిలో ఇప్పటికే రెండు పర్యాయాలు వీచిన ఈదురుగాలులకు మామిడి, అరటి, బొప్పాయి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. శుక్రవారం రాత్రి వీచిన గాలులకు లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లి, సంబేపల్లి, చిన్నమండెం, రాజంపేట, పెనగలూరు, గుర్రంకొండ, ఓబులవారిపల్లె ప్రాంతాల్లో మామిడికి నష్టం వాటిల్లింది. రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో అరటి తోటలను గాలులు దెబ్బతీశాయి. అసలే మామిడి దిగుబడి ఆలస్యంగా రావడం, ఆ పైన ప్రకృతి కన్నెర్ర చేయడంతో చెట్లకున్న కాయల్లో 50 శాతం మేర రాలిపోయాయి. తంబళ్లపల్లెలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది. దిగజారిన ధరలు రారాజుగా పిలుచుకొనే వీరవల్లి బేనీషా, హిమాం పసంద్ వంటి రకాల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. మార్కెట్లో వీటికి టన్ను లక్ష రూపాయల వరకు పలికింది. ఖాదర్, లాల్ బహర్ ఇతర మేలైన రకాలకు టన్ను రూ.50 నుంచి 70 వేల వరకు పలికింది. ప్రసుతం దిగుబడులు ప్రారంభం కాగా గాలుల కారణంగా ఒక్కసారిగా మార్కెట్ కుప్పకూలి పోయింది. రాలిన మామిడికాయలకు మార్కెట్లో టన్ను రూ.5 వేల నుంచి పదివేల లోపు ధర పలుకుతుండగా, కోసిన కాయలకు రూ.20 నుంచి 50 వేల లోపు మాత్రమే ధరలు పలుకుతుండడం మామిడి రైతులను కుంగిపోయేలా చేస్తోంది. 3500 ఎకరాల్లో దెబ్బతిన్న మామిడి రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం -
వెబ్‌ల్యాండ్ రికార్డుల పరిశీలన
రాయచోటి టౌన్: రాయచోటి తహసీల్దార్ కార్యాలయంలో వెబ్‌ల్యాండ్ రికార్డులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ శుక్రవారం పరిశీలించారు. ఏ మండలాల్లో ఎలాంటి రకాల భూములు ఉన్నాయి. అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయనే విషయాల గురించి ఆరా తీశారు. ప్రధానంగా వెబ్ ల్యాండ్ రికార్డులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్, సంబేపల్లె, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలకు చెందిన తహసీల్దార్లు తమ పరిధిలోని వెబ్ ల్యాండ్స్ రికార్డులను తనిఖీ చేయించుకున్నారు. 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం రాయచోటి జగదాంబసెంటర్: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభమ య్యా యి. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే మొదటి రోజు జిల్లాలో కేవలం 54 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఈ విషయమై విద్యాశాఖాధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. అలాగే అన్ని సచివాలయాలు, మండల విద్యాశాఖాధికారుల కార్యాలయాలలో, రిజిస్ట్రేషన్ల కోసం హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి ఫోటోలు షేర్ చేయాలన్నారు. -
కూటమి సర్కార్‌లో వ్యవస్థలు నిర్వీర్యం!
సాక్షి ప్రతినిధి, కడప: అపార అనుభవం అని చెప్పుకుంటూ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. ప్రజా సంక్షేమం లేదు. రైతులకు గిట్టుబాటు ధరల్లేవు. పెట్టుబడి నిధి లేదు. కొత్తగా ఒక్క ఉద్యోగం లేదు. ప్రవేటు సెక్టార్ అభివృద్ధి లేదు. ప్రజలకు చేయూతగా ఉన్న వాలంటీరు వ్యవస్థ లేదు. విద్యా దీవెన, వసతి దీవెన నిలిచిపోయాయి. మహిళలకు చేయూత ఆగిపోయింది. కాపు నేస్తం లేదు. చెప్పినవి ఇవ్వలేదు. ఇచ్చేటివి ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం అసలే లేదని కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్‌విఫ్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ 10 నెలల పాలనపై ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.15వేలు బకాయి పడింది. కొత్తగా ఒక్క పెన్షన్ లేదు, రైతులు, మహిళలు, ఉద్యోగులు అన్నీ వర్గాలను చంద్రబాబు సర్కార్ మోసం చేసిందని ఆయన దెప్పిపొడిచారు. మా పాలన ప్రజాశ్రేయస్సుకే అంకితం... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు ప్రజలకు దగ్గరగా వారి శ్రేయస్సుకు అనుగుణంగా ఉండేవి. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల చెంతకు పాలన తెచ్చారు. రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి, రైతులకు అండగా నిలిచారు. హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజల బాబోగులు చూశారు. ఆరోగ్యశ్రీ రూ.20 లక్షలకు పెంచి ప్రజల భద్రతగా నిలిచారు. ఆర్థికంగా అండగా నిలిచారు. ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా చిత్తశుద్ధితో సంక్షేమం అమలు చేశారు. ఇలాంటివి జనం ఊహించుకోలేదు. ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతోంది. అప్పటికి.. ఇప్పటికీ తేడా, వారు కోల్పోయినా సంక్షేమం అన్నీ గమనిస్తున్నారు. అధికారం ఉందని ఇప్పుడు ఎగిరెగిరి పడే వారి కుటుంబాలకు కూడా సంక్షేమం అందేది. పూర్తిగా ప్రజా శ్రేయస్సుకు అంకితమై పాలన కొనసాగిందని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. ఉపయోగం లేని మంత్రిత్వ హోదా... రాయచోటి నియోజకవర్గానికి తొలిసారి మంత్రి హోదా లభించినా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇంతకాలం జిల్లా కేంద్రానికి నడిబొడ్డున రాయచోటి ఉంది, కాబట్టే జిల్లా ఇచ్చారని చెప్పుకున్నారు. పార్లమెంట్‌కు కూడా సెంటర్ పాయింటే, మరీ ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. 70ఏళ్లుగా పాలనలో ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలు కూడా పెట్టలేని దుస్థితి ఉండిపోయింది. రాయచోటిని జిల్లా కేంద్రం చేసి ఎన్నో రంగాలల్లో అభివృద్ధి చేశాం. 15 సంవత్సరాల క్రితమే రూ.64కోట్లతో ఫోర్‌లైన్ రింగురోడ్డు ఏర్పాటు చేశాం. రూ.15వేల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం లభించింది. రాయచోటికి సంపద సృష్టించాం. జిల్లా కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్షర్ అభివృద్ధి చేశాం. చుట్టూ 35 కిలోమీటర్లు పరిధిలో ప్రతి వ్యక్తి ఆస్తి 3రెట్లు అధికంగా పెరిగాయి. ఈ పదినెలల కాలంలో రియల్ ఎస్టేట్ కుప్ప కూలింది. సామాన్యులు చితికిపోయారు. వ్యాపార వర్గాలవారు చిన్నాభిన్నమయ్యారు. ఎటుచూసినా ఏరకమైనా అభివృద్ధి కన్పించలేదు. మంత్రి హోదా లభించడం వల్ల నియోజకవర్గానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదని మాజీ చీఫ్‌విఫ్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సహాజ వనరులు దోపిడీ.... ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోయాయి. ప్రభుత్వ అధికారులను అడ్డుపెట్టుకొని సహజ వనరుల దోపిడీ చేస్తున్నారు. ఈమాట ప్రతి నోటా వినిపిస్తోంది. రెవెన్యూ, పోలీసుశాఖలను అడ్డుపెట్టుకొని నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు కంట కన్పిస్తోంది. భూ ఆక్రమణలు అధికమయ్యాయి. చాలామంది బాధితులు మాట్లాడుతున్న విషయం చూస్తున్నాం. మాపాలనలో ఐదేళ్లు ప్రభుత్వం ద్వారా సేకరించిన భూమి ప్రజల ఆస్తిగా సృష్టించాం. 100 ఎకరాల్లో కలెక్టరేట్, 11ఎకరాల్లో శిల్పారామం, 25 ఎకరాల్లో స్టేడియం, 45ఎకరాల్లో ఎకోపార్క్, జిల్లా పరిషత్‌కు 11 ఎకరాలు, రెసిడెంట్ బంగళాల కోసం తీర్చిదిద్దాం. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తిగా చేశాం. మా ప్రభుత్వ ఐదేళ్లు మాపాలన అలా ఉంటే, మంత్రి కుటుంబ సభ్యులు, అనుచరులు సహాజ వనరులు దోపిడీ చేస్తున్నారు, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. చట్టాలపై నమ్మకం లేకుండా పోతుంది... మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి ప్రాపర్టీ దొంగతనం చేస్తే ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యల్లేవు. లక్కిరెడ్డిపల్లె జడ్పీటీసీ ఇంటిపై దాడి చేస్తే చర్యల్లేవు. అధికారం అండతోనే ఇవన్నీ చేశారు. చట్టాలు, పోలీసులపై నమ్మకం పోతుంది. మాజీ ఎమ్మెల్యే ఆస్థికే ప్రొటెక్షన్ లేదు. మాండవ్య నదీ లూఠీ అవుతోంది. వందల టిప్పర్లు రింగు రోడ్డులో వెళ్తున్నాయి. ట్రాన్సుపోర్టు మంత్రిగా ఉంటూ అక్రమంగా వందలాది టిప్పర్లు మెటీరియల్‌తో నిర్భయంగా పోతుంటే దేనికి సంకేతం. మంత్రి అనుచరులు గ్యాంబ్లింగ్ కొనసాగిస్తున్నారు. కాని స్టేబుల్జూదం ఆడిస్తూ పట్టుబడ్డారు. లక్షలాది రూపాయాలు చేతులు మారుతున్నాయి. బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. రాజకీయ అండదండలతో ఆసాంఘిక కార్యక్రమాలు అధికమైయ్యాయని శ్రీకాంత్‌రెడ్డి వాపోయారు. మంత్రికి కప్పం కట్టాల్సిందే.. రాయచోటిలో ఎన్నడూ లేనివిధంగా కప్పం కట్టాల్సిన రోజులు దాపురించాయి. క్రషర్ యజమానులు మంత్రి కుటుంబసభ్యులకు నెలవారి కప్పం కట్టుతున్నారు. గతంలో ఈసంస్కృతి ఎన్నడూ లేదు. ఇలాంటి పరిస్థితులుంటే ఏకరంగా ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికవేత్తలు వస్తారు. శిబ్యాల వద్ద 500 ఎకరాలు ఏపీఐఐసీ కోసం అప్పట్లో సిద్ధం చేశాం, బహిష్కరించారు. చివరకు ఉపాధి హామీ పనులు కూడా పారదర్శకంగా చేపట్టడం లేదు. ఎన్ఆర్జీఈఎస్ కూడా దోపిడీ దాయకంగా సాగుతోంది. చట్టాన్ని నిర్వీర్యం చేయడం, దోపిడీ చేయడం ప్రతి గ్రామంలో ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగావైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చంద్రబాబు సర్కార్‌లో ప్రజాస్వామ్యంకంటే వ్యక్తులకే ప్రాధాన్యత తొలిసారి మంత్రి పదవి హోదా దక్కినా నియోజకవర్గ ప్రయోజనం నిల్ దోపిడీలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, అరాచకాలకే ప్రాధాన్యత చితికిపోయినా సామాన్యులు, చిన్నభిన్నమైన వ్యాపార వర్గాలు ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి -
పోయి రావమ్మా.. గంగమ్మా..
ఘనంగా ముగిసిన జాతర రైల్వేకోడూరు అర్బన్: భక్తులపాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కోడూరు గంగమ్మ జాతర శుక్ర వారం ముగిసింది. పట్టణంలోని పాత బజారువీధిలో గంగమ్మ మిట్టలో వెలసి ఉన్న గంగమ్మను గత రెండురోజులుగా వేలాది మంది భక్తులు దర్శించుకొన్నారు. ఉదయం 5 గంటల నుంచి గంగమ్మ మిట్టనుండి కొనసాగిన గంగమ్మ శోభాయాత్ర వైభవంగా సాగింది.భక్తులు మొక్కులు తీర్చుకొన్నారు. యువకుల నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఉంగరాలనగర్లోని గంగమ్మ ఘాట్ వద్ద అమ్మవారి నిమజ్జనం జరిగింది. అమ్మవారి మట్టి, పూల కోసం ప్రజలు ఎగబడ్డారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. -
శుభ్రతతో వ్యాధులు దూరం
నందలూరు: ప్రతి ఒక్కరూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పాటించాలని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గొల్లపల్లి నందలూరు హరిజనవాడలో ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమ గుడ్లను లార్వా దశలోనే నిర్మూలించాలని తెలిపారు. శుభ్రతతో వ్యాధులు దరిచేరవని చెప్పారు. దోమకాటు నుంచి రక్షించుకోవడానికి దోమతెరలను ఉపయోగించాలన్నారు. డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉంటే పంచాయతీ అధికారులకు తెలియజేసి క్లియర్ చేయించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ రికార్డులను పరిశీలించారు. కార్యక్రంమలో ప్రభుత్వ వైద్యులు కార్తీక్, విశ్వనాథ్, సీహెచ్ఓ వెంకటనారాయణ, రాజంపేట మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఎస్ఎస్దాస్, ఆరోగ్య కార్యకర్త అంజమ్మ పాల్గొన్నారు. ఉత్తమ భవితకు ఆధునిక సాంకేతికత కురబలకోట: వేగవంతంగా మారుతున్న డిజిటల్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ),మెషిన్ లర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతికతపై నైపుణ్యాలను పెంచుకుని విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎల్ అండ్‌టీ మైండ్ ట్రీ ప్రోగ్రామ్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ ఆశిష్ చద్దా, బెంగళూరు ఐపాలెట్ ప్రిన్సిపల్ డేటా సైంటిస్టు మనోజ్ఞ నాదెళ్ల పేర్కొన్నారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింఽగ్ కళాశాలలో జాతీయ స్థాయిలో జరిగిన డిఫెస్టా–25లో ఆశిష్ చద్దా మాట్లాడుతూ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో విద్యార్థులకు శాసీ్త్రయ విజ్ఙానం సరిపోదన్నారు. నూతన టెక్నాలజీలతో అనుసంధానం కావాల్సిన ఆవశ్యకత తప్పనిసరి అని అన్నారు. అప్పుడే విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు బాటలు పడతాయన్నారు. కేరీర్‌కు బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. ఉపాది, ఉద్యోగావకాశాలలో రాణిస్తారన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ అదనపు అర్హతగా నిలుస్తాయని మరో అతిధి మనోజ్ఙ నాదెళ్ల అన్నారు. సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ప్రపంచానికి రక్షణ కవచంగా నిలుస్తోందన్నారు. ప్రతి విద్యార్థికి దీనిపై అవగాహన ఉండాలన్నారు. -
పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
రాయచోటి అర్బన్: ఉద్యోగులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్న సీపీఎస్‌ను వెంటనే రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పథాన్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్.వెంకట జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపీఎస్స్ రద్దుకోరుతూ శుక్రవారం ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీపీఎస్‌ను వెంటనే రద్దుచేయాలన్నారు. పెండింగ్ డీఏ బకాయిలను చెల్లించాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ కిరణ్, పూర్వపు అధ్యక్షుడు పాలేల రామాంజనేయులు మాట్లాడుతూ ఐదేళ్లు పదవిలో ఉండే రాజకీయనేతలు పెన్షన్ పొందుతున్నప్పుడు 30 ఏళ్లకు పైగా సర్వీసు చేసిన ఉద్యోగులు పెన్షన్‌ను పొందడంలో తప్పేమీ లేదన్నారు. వృద్ధాప్యంలో ఉద్యోగులకు భరోసాగా నిలిచేది పెన్షన్ మాత్రమే అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాతపద్దతిలో పెన్షన్ పొందుతూ ఉద్యోగులకు మాత్రమే సీపీఎస్‌ను అమలుపరచడం దారుణం అని అన్నారు. అనంతరం డిఆర్ఓ మధుసూదన్‌కు వినతిపత్రాన్ని అందచేశారు. కార్యక్రమంలో ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమ ణారెడ్డి, ఏపిసిపిఎస్ఈఏ యూనియన్ నేతలు శ్రీనివాస్, గురుప్రసాద్‌తో పాటు పెద్దఎత్తున ఉద్యోగులు,నేతలు పాల్గొన్నారు. -
చల్లగా చూడమ్మా.. గంగమ్మా
రైల్వేకోడూరు అర్బన్: ప్రజలు చల్లగా ఉండేలా దీవించాలని గంగమ్మను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వేడుకున్నారు. రైల్వేకోడూరులో నిర్వహించిన గంగమ్మ జాతరలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి ఎంపీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఎంపీ, మాజీ ఎమ్మెల్యేను సత్కరించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన కోడూరు గంగమ్మను దర్శించుకోవడం ఎంతో అదష్ఠమని తెలిపారు. రైతులు, పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాక్షించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డిధ్వజారెడ్డి, ఉపసర్పంచ్ తోటశివసాయి, సీహెచ్‌రమేష్, జిల్లా యువజన అధ్యక్షుడు శివారెడ్డి, తల్లెంభరత్‌కుమార్‌రెడ్డి, గునిశెట్టిరమేష్, మేడావెంకటసుబ్బయ్య, బుడుగుశివయ్య, డీవీరమణ తదితరులు హాజరయ్యారు. కోడూరు గంగమ్మను దర్శించుకొన్న ఎంపీ -
నేటి నుంచి బాలికల కోసం ‘కిశోరి వికాసం’
రాయచోటి: కౌమార బాలికల సాధికారత లక్ష్యంగా, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కిషోరి వికాసంపై గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ గురువారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈనెల 2వ తేదీ నుండి జూన్ 10 వరకు వివిధ శిక్షణా కార్యక్రమాలను కౌమార బాలికలకు అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వీటని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా కౌమార బాలికలకు విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, రుతు పరిశుభ్రత, పౌష్టికాహారం, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేద చట్టం, ఆత్మరక్షణ, యోగా, జీవనోపాధి అవకాశాలు, సైబర్, ఆన్లైన్ భద్రత, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ● ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం అమరావతికి రానున్న సందర్బంగా జిల్లా నుంచి 30 బస్సులలో దాదాపు 1500 మంది జిల్లా ప్రజలు తరలివెళ్తున్నారని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, డీఆర్ఓ మధుసూదన్ రావు, పీడీడిఆర్డీఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి -
ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం
లక్కిరెడ్డిపల్లె: లక్కిరెడ్డి పల్లె మండలంలో తెలుగు తమ్ముళ్ల బరితెగింపునకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అనేక సంవత్సరాలుగా ఉపాధి హామీ పధకంలో పనిచేస్తున్న పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు తమ్ముళ్లు తొలగించారు. వారి స్థానంలో అధికార పార్టీ నాయకులు తమకు కార్యకర్తలుగా పనిచేసే వారిని ఫీల్డ్ అసిస్టెంట్లు గా నియమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీ నాయకులు నియమంచుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు నాయకుల అండ చూసుకొని విదేశాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలకు కూడా జాబ్ కార్డులో అన్ లైన్ మస్టర్లలో హాజరు వేసుకొని డబ్బులు చెల్లిస్తున్నట్లు ఉపాధిహామీ కూలీల నుంచే ఆరోపణలు ఉన్నాయి. అలాగే పనికి రాకుండా ఇంటి వద్ద ఉన్న వారికి కూడా కూలీ డబ్బులు చెల్లిస్తున్నట్ట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదంతా ఫీల్డ్ అసిస్టెంట్లు ఊరికే చేయడం లేదు. పనికి రాకుండా ఉండే వారి వద్ద ముడుపులు తీసుకొని తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారని పలువురు ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పలువురు కూలీలు క్రమం తప్పకుండా కూలికి వెళ్లినా ఐదు వారాలకు రెండు వారాల కూలి మాత్ర మే వారి ఖాతాలో జమకావడం.. మిగతా మూడు వారాల కూలి జమ కాకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ల చేతి వాటం బట్ట బయలయింది. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం కూలీల కు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంది అని చెపుతున్న మాటలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఏది ఏమైనా కూటమి పార్టీ నాయకుల వల్లే ఉపాధి హామీ కూలీలకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేవు గతంలో ఉపాధి పనులకు వెళితే ఎండ నుంచి ఉపశమనానికి టెంట్ వేసేవారు. నీటి సౌకర్యం కల్పించే వారు.వడదెబ్బ తగిలితే ప్రథమ చికిత్స కోసం కిట్ ను పనుల వద్ద ఉంచే వారు.మజ్జిగ ప్యాకెట్లు అందించేవారు.ప్రస్తుతం అవి ఏమి లేకపోగా తాము చేసిన పనులకు బిల్లులు రాకుండా ఎరరెవరి పేర్లో మస్టర్లలో ఆన్ లైన్లో ఎక్కించుకొని తమ కడుపు కొడుతున్నారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలి. –శ్రీరాములు,ఉపాధి కూలీ,అగ్రహారం,లక్కిరెడ్డిపల్లె మండలంఐదు వారాలు పనిచేస్తే రెండు వారాల బిల్లులు ఇచ్చారు ఐదు వారాలు పని చేస్తే రెండు వారాల బిల్లులు వచ్చాయి. ఈ విషయం గురించి అడుగుతంటే ఎవరూ పట్టించుకోలేదు. పని మేము చేస్తే డబ్బులు పనులకు రాని వాళ్లకు వేస్తున్నారు. డబ్బులు ఇవ్వాలని సిబ్బందిని నిలదీస్తే మీకు పనులే పెట్టమంటూ బెదిరింపులకు దిగుతున్నారు.ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. –నాగలక్ష్మి,కుర్నూతల ,లక్కిరెడ్డిపల్లె మండలంపనికి తగిన వేతనం లేదు ప్రతిరోజు ఎండలో పనులు చేస్తాం.వారంలో మాకు మూడు రోజులకు మాత్రమే కూలీ పడుతుంది.ఇంటి వద్ద ఉన్న వారికి ఆరు రోజులకు కూలీ డబ్బులు ఎక్కువ మొత్తంలో వస్తుంది.కష్టం మాదైతే కూలి డబ్బులు ఇంటి వద్ద ఉన్న వారికి వేస్తారు. అడిగితే పట్టించుకున్న వారే లేరు.మేము చేసిన పనులకు కూలీ డబ్బులు చెల్లించాలి. –అచ్చమ్మ, అగ్రహారం,కుర్నూతల గ్రామం,లక్కిరెడ్డిపల్లె మండలం విదేశాల్లో ఉన్న ఉపాధి కూలీలకు డబ్బులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కూలీలను ఇబ్బంది పెడుతున్న వైనం -
ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
సిద్ధవటం: యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను గురువారం గ్రామస్తులు టక్కోలులో అడ్డుకున్నారు. ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఉచితంగా పెన్నా పరివాహ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అదునుగా భావించిన కొందరు ఉచిత ఇసుక ముసుగులో మండలంలోని డేగనవాండ్లపల్లి, టక్కోలు, మాచుపల్లి, లింగంపల్లి గ్రామాల నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కడపకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా టక్కోలు మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉచిత ఇసుక ముసుగులో ప్రతి రోజు దాదాపు 50 ట్రాక్టర్ల ద్వారా పెన్నా పరివాహ ప్రాంతాలైన డేగనవాండ్లపల్లి, మాచుపల్లి లింగంపల్లి తదితర గ్రామాల నుంచి ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమం రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. -
పల్లె వైద్యానికి తాళం
రాయచోటి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తామని, అభివృద్ధిని పరుగులు తీయిస్తామని చెప్పిన కూటమి నాయకుల మూటలు నేడు నీటి మూటలుగా మిగిలాయి. ప్రజల చెంతకు పాలనను సచివాలయం రూపంలో తెచ్చిన వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇంకోవైపు అంగన్ వాడీ వర్కర్ల సమస్యలను గాలికి వదిలారు. ప్రస్తుతం గ్రామాల్లో నిర్మించిన హెల్త్ క్లినిక్‌లలో సేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ అధికారులు, సిబ్బంది సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. వారి సమస్య పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడంతో సమ్మె చేపట్టారు. ఫలితంగా పల్లె ప్రజకు ప్రాథమిక వైద్యం అందకుండా పోయింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం, ఉన్నతాధికారుల వైపు నుంచి ఎలాంటి ఊరట లభించకపోవడంతో నాలుగురోజుల నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈపీఎఫ్‌ను పునరుద్ధరించాలని, ఇన్సెంటివ్ ఇవ్వాలని, వేతనాలు పెంచాలని కోరుతూ ఎంఎల్‌హెచ్‌పీలు ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్‌ల తలుపులు మూతపడ్డాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వం తరపు నుంచి మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో హెల్త్ క్లినిక్‌లను నిర్మించారు. ప్రతి కేంద్రంలో రోజు 20 నుంచి 30 మంది ప్రాథమిక వైద్యాన్ని అందుకుంటున్నారు. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వ్యాధి నిరోధక టీకాలు, జ్వరం బారిన పడిన బాధితులు ఈ కేంద్రాల్లో చికిత్సలు అందుకుంటున్నారు. పల్లెల్లో వైద్య సేవలు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసనను కొనసాగిస్తామని ఎంపీ ఎంసీఏ జిల్లా నాయకులు శివకుమార్ తెలిపారు. ● సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో 375 కేంద్రాలు మూతపడ్డాయి. వివిధ చికిత్సల నిమిత్తం ఇక్కడికి వచ్చే వారికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యామ్నాయాలు చేపట్టకపోవడంతో పల్లె ప్రజలకు వైద్య సేవలు దూరమయ్యాయి. 375 కేంద్రాలు, 14 రకాల సేవలు: పల్లె ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే క్రమంలో గతంలో కొన్ని గ్రామాలను కలుపుతూ ఉప కేంద్రాలను ఏర్పాటు చేశారు ఐదేళ్ల కిందట వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో జిల్లాలో 375 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను నిర్మించింది. ఒక్కో కేంద్రంలో బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్‌గా నియమించింది. వీరి సమక్షంలో ఒక్కో కేంద్రంలో 14 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వీరికి సహాయం అందిస్తుంటారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలంఎంఎల్హెచ్పీల ధర్నా నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా సచివాలయ, ఏఎన్ఎంలు వారి స్థానంలో పనిచేయాలని జిల్లా వైద్య శాఖ ఆదేశించింది. అయితే ఇంతవరకు ఆదేశాలు విడుదల కాలేదు. దీంతో సచివాలయ ఏఎన్ఎంలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లతో సంబంధం లేన ట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా జిల్లా మంత్రి, కలెక్టర్ చొరవ చూపి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఎంఎల్‌హెచ్‌పీల ఆందోళన మూతపడిన హెల్త్ క్లినిక్‌లు -
అకాల వర్షం.. అపార నష్టం
లక్కిరెడ్డిపల్లి : అకాల వర్షాలు రైతుకు అపార నష్టాన్ని మిగిల్చాయి. గురువారం సాయంత్రం కురిసిన తేలికపాటి వర్షానికి ఈదురు గాలుల బీభత్సం తోడవడంతో మండలంలోని మద్దిరేవుల, కస్తూరురాజుగారిపల్లి, దప్పేపల్లి గ్రామాల పరిధిలోని మామిడి రైతుల తోటలలో కాయలు పూర్తిగా నేలరాలాయి. పెనుగాలుల బీభత్సానికి మండలంలోని మామిడి రైతుల పంట చేతికందే సమయంలో కుదేలైపోయాడు. పక్వానికి వచ్చిన మామిడి పంట కాస్త నేలరాలిపోగా మామిడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్లో నేలరాలిన మామిడి కాయలకు ధరలు లేకపోవడంతో రైతన్న పరిస్థితి గోరుచుట్టుపై రోకటి పోటు అన్న చందంగా మారింది. ప్రతి సంవత్సరం మామిడి పంట పక్వానికి వచ్చే సమయంలో ఈదురు గాలులకు మామిడి కాయలు రాలిపోతూనే ఉన్నాయని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది మామిడి రైతు ఇన్సూరెన్సును ప్రభుత్వానికి చెల్లించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులు ఎకరాకు రూ. 2250లు చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కలిపి కేంద్ర ప్రభుత్వానికి మామిడి రైతులు ఆన్లైన్ ద్వారా ఇన్సూరెన్సు కోసం డబ్బులు చెల్లించారు. ఉద్యాన అధికారులు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన మామిడి రైతును అన్ని విధాలా ఆదుకోవాలి.. అకాల వర్షాలకు నష్టపోయిన మామిడి రైతును అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, జెడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యాన శాఖ అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. అలాగే మండలంలో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్ కుమార్ రెడ్డి కోరారు. అలాగే మామిడి రైతుకు ఎకరాకు రూ. 20 వేలు నష్టపరిహారం తక్షణమే ప్రకటించాలన్నారు. గాలివీడులో.. గాలివీడు : గాలివీడు మండలంలో గురువారం జోరుగా గాలివాన కురిసింది. రాయచోటి ప్రధాన రహదారిపై పెద్ద వృక్షం నేలకొరిగింది. అంతేగాక చాలాచోట్ల మామిడి తోటల్లో మామిడి పండ్లు ఈదురు గాలులకు నేల పాలయ్యాయి. రహదారులపై వాహనదారులు పలు అవస్థలు పడ్డారు. ఈదురు గాలుల బీభత్సం కోతకు వచ్చే సమయంలో నేలరాలిన మామిడి కాయలు -
గుర్రంకొండలో అతలాకుతలం
గుర్రంకొండ : గుర్రంకొండలో ఒక్కసారిగా విజృంభించిన గాలివానతో పట్టణం అతలాకుతలంగా మారింది. రేకులషెడ్లు, బంకులు కొట్టుకుపోగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. చెట్లు ఎక్కడపడితే అక్కడ నేలకొరిగాయి. గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడంతో ఒక్కసారిగా వాతావరణం బీభత్సంగా మారిపోయింది. మగ్బీరా, మార్కెట్‌యార్డు వద్ద రేకులషెడ్లు, బంకులు ఈదురుగాలులకు కొట్టుకొని వచ్చి కడప–బెంగళూరు జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోయాయి. అదే సమయంలొ అక్కడే ద్విచక్రవాహనంపై నిలబడి ఉన్న రమణ అనే వ్యక్తి పక్కనుంచే రేకులషెడ్డు వెళ్లడంతో చేతికి బలమైన రక్తగాయాలయ్యాయి. అక్కడే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన స్తంభాలు కూలిపోయి విరిగి ఎన్‌హెచ్ 340 రోడ్డుపై పడ్డాయి. పట్టణంతో పాటు తలారివాండ్లపల్లె వద్ద రోడ్డుకు అడ్డంగా పెద్ద వృక్షాలు నేలకొరిగి కూలిపోయి విద్యుత్ తీగలు తెగి పడడంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో మూడుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయి వీధుల్లో పడిపోయాయి. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రాత్రి 8.30 గంటల వరకు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పట్టణం అంధకారంగా మారింది. కొట్టుకుపోయిన రేకులషెడ్లు, బంకులు నేలకొరిగిన వృక్షాలు కూలీపోయిన విద్యుత్ స్తంభాలు -
ద్విచక్రవాహనం అదుపుతప్పి బీటెక్ విద్యార్థి మృతి
మదనపల్లె : ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం వేకువజామున మదనపల్లెలో జరిగింది. నంద్యాల జిల్లా మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన చిన్నరాముడు, అరుణ దంపతుల కుమారుడు వెంకటేష్(21) కురబలకోట మండలం విశ్వం కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కడప జిల్లా కమలాపురానికి చెందిన వెంకటశివారెడ్డి(23) అదే కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ స్థానికంగా పీజీలో ఉంటున్నారు. గురువారం వేకువజామున ఇద్దరూ కలిసి సొంతపనులపై పలమనేరుకు వెళుతుండగా, మదనపల్లె బైపాస్‌రోడ్డు రాయల్ ఉడ్ సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి వేగంగా వెళ్లి చెట్టును ఢీకొన్నారు. ప్రమాదంలో వెంకటేష్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి వెంకటశివారెడ్డి తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి
ములకలచెరువు : పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో జరిగింది. బాధితుడి కథనం మేరకు.. మండలంలోని సోంపల్లి పంచాయతీ అడివి నాయుని చెరుపల్లికి చెందిన మస్తాన్ అప్పకు చెందిన రెండు ఆవులు ఇంటి సమీపంలోని ఒక చెట్టు కింద కట్టేశాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో ఆవులు ఉన్న చెట్టు పైన పిడుగు పడింది. పిడుగుతో రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. రూ.లక్ష రూపాయ లు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. వైద్యం కోసం వచ్చిన వ్యక్తి..బి.కొత్తకోట : వైద్యం కోసం వచ్చిన మండలంలోని చలిమామిడికి చెందిన శ్రీనివాసులు (70) గురువారం బి.కొత్తకోటలో మృతి చెందాడు. స్థానిక ఓ ఆర్ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం కోసం వచ్చాడు. అక్కడ కూర్చున్న కొంతసేపటికి కుప్పకూలిపోయాడు. అతన్ని స్థానిక సీహెచ్‌సీకి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై మెడికల్ ఆఫీసర్ కిరణ్‌కుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ షాక్‌తో రైతు..వేముల : మండలంలోని వేల్పుల గ్రామంలో గురువారం రాత్రి వల్లూరు లక్ష్మీనారాయణ అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ తనకున్న పొలంలో అరటి పంట సాగు చేశాడు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో గాలివాన వస్తున్న సమయంలో తోట వద్దకు వెళ్లాడు అక్కడ మోటార్ స్టార్టర్కు ఉన్న ఫీజులు తీసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు సారా విక్రేత అరెస్ట్ నిమ్మనపల్లె : సారా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఎస్ఐ సి.తిప్పేస్వామి తెలిపారు. గురువారం అగ్రహారం పంచాయతీ అరిపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్.లక్ష్మయ్య నాటుసారా తెచ్చి స్థానికంగా విక్రయిస్తు న్నట్లు సమాచారం అందడంతో.. సిబ్బందితో కలిసి దాడులు చేసి అతని వద్ద నుంచి 10 లీ టర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుని పై కేసు నమోదు చేసి, రిమాండు ని మిత్తం కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. విద్యార్థికి పాము కాటు మదనపల్లె : పాము కా టుకు గురై విద్యార్థి ప రిస్థితి విషమంగా మా రిన ఘటన గురువారం వాల్మీకిపురం మండలంలో జరిగింది. చింతపర్తి గ్రామం పాతకోటపల్లెకు చెందిన శ్రీనాథరెడ్డి కుమారుడు నిశాంత్‌రెడ్డి(14) వేసవి సెలవు లు కావడంతో పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ పా ము అకస్మాత్తుగా విద్యార్థిని కాటువేయడంతో అ పస్మారకస్థితికి వెళ్లి పరిస్థితి విషమించింది. వెంట నే కుటుంబ సభ్యులు బాధితుడిని మదనపల్లె ప్ర భుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. -
నమ్మి చేరదీస్తే.. నగలు దోచేశాడు !
కురబలకోట : తెలిసిన వాడని నమ్మి చేరదీసినందుకు గట్టి బుద్ధి చెప్పాడు ఓ యువకుడు. నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారింటిలోని రూ.10 లక్షలు విలువ చేసే వంద గ్రాముల బంగారు నగలు, రూ.50 వేల నగదును దోచుకున్న సంఘటన మండల కేంద్రం కురబలకోటలో ఆలస్యంగా వెలుగు చూసింది. గురువారం బాధితురాలి కథనం మేరకు..కురబలకోట ప్రశాంతనగర్‌లో ఎస్. వరలక్ష్మి (64)అనే వృద్ధురాలు కుమారుడు, మాజీ గ్రామ వలంటీర్ గౌరితో కలసి ఉంటోంది. ఈమెకు ఇల్లు తప్ప ఆస్తిపాస్తులు లేవు. చింతకాయ కొట్టడం, కూలిపనులకు వెళ్లడం తదితర కష్టార్జితంతో వంద గ్రాముల దాకా బంగారు నగలు సంపాదించింది. వాటిని ఇంటిలో మంచం కింద ఉన్న లాకర్లో భద్రపరిచింది. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన ఓ యువకుడు వారింటికి వచ్చి వెళ్లేవాడు. ఇతనికి బండి లేదని నెల క్రితం ఇంట్లో ఖాళీగా ఉన్న టీవీఎస్‌ను కూడా తోలుకోమని ఇచ్చింది. దీంతో అప్పుడప్పుడు అతను వారింటికి బండిలో వచ్చి వృద్ధురాలిని, ఆమె కుమారుడు గౌరిని పలకరించి వెళ్లేవాడు. వృద్ధురాలు కురబలకోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసేది. అక్కడి నుంచి అప్పుడప్పుడు ద్విచక్రవాహనంలో ఆమెను ఇంటి వద్ద కూడా దించేవాడు. దీంతో అతను మంచి వాడని నమ్మింది. ఇటీవల ఆమె ఓ పెళ్లికి ఇంట్లోని బంగారు నగలు వేసుకుని వెళ్లింది. అది చూసిన ఆ యువకుడు బంగారు నగలపై కన్నేశాడు. ఇంటి తాళాలు ఎక్కడున్నది తెలిసి ఉండడంతో ఎవరూ లేనప్పుడు ఇంటిలోకి ప్రవేశించి మంచం కింద లాకర్లోని బంగారు నగలను గుర్తించాడు. అనుమానం రాకుండా అలాంటి వాటినే నకిలీ (రోల్డ్‌గోల్డ్)వి ఉంచి అసలైన బంగారు నగలను కొట్టేశాడు. వృద్ధురాలు కావడంతో గుర్తించలేదని భావించి ఈ పని చేశాడు. ఆమె చింతకాయ కొట్టేది. ఆ డబ్బులు రావడంతో వాటిని లాకర్లో దాయడానికి పర్సు తీసింది. అందులో ముందు దాచిన రూ. 50 వేలు కనిపించలేదు. అంతేకాదు బంగారు నగలు కూడా తేడాగా కన్పించాయి. ఉన్నవి నకిలీవిగా గుర్తించి హతాశురాలైంది. జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న బంగారు నగలు కనిపించకుండా పోవడంతో ఆమె మనసు పగిలిపోయింది. వెంటనే ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి విచారణలో అసలు దొంగ బయటపడ్డాడు. ఇటీవల ఆ యువకుడు జల్సాగా ఖర్చు పెట్టడం, జోరుగా బెట్టింగులు కాయడాన్ని గమనించిన స్థానికులు కూడా ఇతన్ని అనుమానించారు. నమ్మి చేరదీసిన యువకుడే ఈ పని చేసినట్లు వెల్లడైంది. చోరీ చేసిన నగలను, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను అదే ఊరిలో మరొకరి ఇంట్లో ఇటీవల చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. మేలు చేసిన వారికి కీడు తలపెట్టిన ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బంగారు నగల స్థానంలో నకిలీవి ఉంచాడు జల్సాగా ఖర్చు పెడుతుండగా పట్టుబడిన నిందితుడు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వల్లూరు (చెన్నూరు) : చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెడతోటి మూర్తి (18) మృతి చెందాడు. తన చిన్నాన్న రాజశేఖర్‌తో కలిసి మూర్తి చెన్నూరుకు వచ్చేందుకు నేషనల్ హైవే రోడ్డు దాటుతుండగా కొక్కరాయపల్లె గ్రామానికి చెందిన తప్పెట వెంకట సుబ్బారెడ్డి ట్రాక్టర్‌తో ఢీ కొన్నాడు. ఈ ఘటనలో మూర్తి తలకు బలమైన గాయమై అక్కక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.చిన్నాయపల్లె సమీపంలో గుర్తు తెలియని మృతదేహంపోరుమామిళ్ల : మండలంలోని సిద్దవరం పంచాయతీ చిన్నాయపల్లెకు తూర్పున తెలుగుగంగ కాలువ గట్టున గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ కొండారెడ్డి కథనం మేరకు వేపచెట్టుకు ఉరి వేసుకుని ఉన్న వ్యక్తి శవాన్ని అడవి జంతువులు లాగడంతో కింద పడిందన్నారు. ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తు పట్టేందుకు వీలు లేకుండా ఉంది. మృతుడి ఒంటిపై ఎర్రచొక్కా, గళ్ల లుంగీ ఉన్నాయి. చెట్టుకు చీరతో ఉరి వేయడాన్ని గమనిస్తే ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా అన్న అనుమానం కలుగుతోంది. -
అక్రమానికి సరికొత్త మార్గం !
● దర్జాగా రైలులో రేషన్ బియ్యం దిగుమతులు ● అరక్కోణం ప్యాసింజర్ ద్వారా జిల్లాకు చేరుతున్న వైనం ● చిత్తూరు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కోడూరుకు దిగుమతి ● అటువైపు దృష్టి సారించని రైల్వే పోలీసులు రాజంపేట : తెల్లవారగానే ఇంటి వద్ద బియ్యంబండి వస్తోందంటూ..హారన్ శబ్దం..గత ప్రభుత్వం చౌకదుకాణం బియ్యాన్ని సరఫరాచేసే బండికాదు..ఇది రైలు..అరక్కోణంనుంచి కడప వరకు నడిచే ప్యాసింజర్ రైలు. ఇప్పుడు ఈరైలులో బియ్యం బస్తాలను రైల్వేకోడూరు స్టేషన్ వరకు తరలిస్తున్నారు. దీంతో ఈ బండి ఇప్పుడు బియ్యం బండిగా ప్రయాణికులు పిలవాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. అరక్కోణం నుంచి వచ్చే ప్యాసింజర్ రైలు చిత్తూరు, తిరుపతిజిల్లాలో పాటు తమిళనాడు సరిహద్దు పల్లెల నుంచి బియ్యం రైల్వేకోడూరు ఎందుకు తీసుకొస్తున్నారో ప్రయాణీకులు అంతుపట్టడంలేదు. బియ్యం తరలింపు వారి హడాహుడి అంతా ఇంతాకాదు..రైల్వేస్టేషన్ రాగానే బియ్యం బస్తాలను దించుకోవడంతోనే డోర్లో సమయం సరిపోతోంది. ప్రయాణీకులు దిగాలంటే ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కూడా ఇదే పరిస్ధితి రైల్వేకోడూరు స్టేషన్లో నెలకొంది. బోగీలలో చిన్నచిన్న గోనెసంచులోకి బియ్యం.. బోగీలలో చిన్నచిన్న గోనెసంచుల్లోకి బియ్యం మారుస్తుంటారు. చిన్న చిన్న సంచులను సీట్ల కింద తోసేస్తుంటారు. కనిపించకుండా చేస్తున్న తీరుతెన్నులను ప్రయాణికులు చూసి నివ్వెరపోయారు. ఈ బియ్యం ప్రభుత్వం అందజేసే చౌకదుకాణం బియ్యంగా ప్రయాణికులు గుర్తించారు. కొద్దిరోజులుగా జరుగుతున్న బియ్యం రవాణా అరక్కోణం ప్యాసింజర్ రైలులో చౌకదుకాణం బియ్యం రవాణా కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 20 మంది ప్యాసింజర్‌లోని వివిధ ఫార్మసిన్లో బియ్యం సంచులను ఎగుమతి చేసుకుంటారు. రేణిగుంట –అరక్కోణం మధ్యలో ఉన్న ప్రాంతాల నుంచి ఈ బియ్యం తీసుకొస్తున్నారనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున అరక్కోణం ప్యాసింజర్‌లో రవాణా అవుతుంటే రేణిగుంట రైల్వేపోలీసులు ఏమీ చేస్తున్నారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. రైల్వేకోడూరు అక్రమ రేషన్ బియ్యం నిల్వకు కేంద్రమా అన్న అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని రైల్వేకోడూరులో తరలించడమేమిటి అనేది చర్చనీయాంశంగా మారింది.రేషన్ తరలింపు వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేస్తే అక్రమార్కులు వెలుగులోకి వస్తారనే వాదన వినిపిస్తోంది. -
బైకు, కారు ఢీ : తండ్రీ కొడుకుల దుర్మరణం
ముద్దనూరు : ముద్దనూరు–జమ్మలమడుగు ఘాట్ రోడ్డులో మునయ్యకోన సమీపంలో గురువారం సాయంత్రం మోటార్‌బైక్‌ను కారు ఢీకొంది. ఈ ఘటనలో మోటార్‌బైక్‌లో ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు కొండాపురం మండల చౌటపల్లె గ్రామానికి చెందిన హాజీ మహ్మద్(35), నాలుగేళ్ల తన కుమారుడు ఇమాం సాదిక్‌తో కలిసి ముద్దనూరు వైపు ప్రయాణిస్తున్నాడు. మునయ్య కోన సమీపంలోకి రాగానే జమ్మలమడుగు వైపు ప్రయాణిస్తున్న కారు మోటార్ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులిద్దరినీ జమ్మలమడుగుకు తరలించారు. ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన హాజీ మహ్మద్‌ను కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
కట్నం కోసం వేధింపు కేసులో రెండేళ్ల జైలు
పెద్దతిప్పసముద్రం : కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులకు గురి చేసిన భర్తకు తంబళ్లపల్లి న్యాయస్థానం ముద్దాయికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని టి.సదుం పంచాయతీ గుంటిపల్లికి చెందిన ములాతి శశికళ అనే మహిళకు కర్నాటక రాష్ట్రం చింతామణి సమీపంలోని జుంజునపల్లికి చెందిన చిన్నపరెడ్డి కుమారుడు జేసీ మంజునాథ్‌రెడ్డి (45)తో వివాహమైంది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం తన భర్త నిత్యం కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేస్తుండటంతో బాధితురాలు శశికళ 2013లో పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ ఏ.గంగాధర్ 87/2013లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం కేసు తుది విచారణ కొనసాగింది. ఏపీపీ వీరాంజనేయులు వాదనలు, కేసు పూర్వాపర వివరాలు, సాక్షుల విచారణ విన్న తంబళ్లపల్లి న్యాయమూర్తి ఏ.ఉమర్ ఫరూక్ ముద్దాయి మంజునాథ్‌రెడ్డికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ హరిహర ప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ బావాజాన్‌లు తెలిపారు. -
ప్రణాళిక బద్ధంగా చదివితే ఐఐటీ, నీట్లో ర్యాంకు తథ్యం
కడప కోటిరెడ్డిసర్కిల్ : విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివితే నీట్ పరీక్షల్లో ర్యాంకు సాధించడం తథ్యమని విద్యా వేత్త రాహుల్ తెలిపారు. రాయచోటిలోని శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల ప్రాముఖ్యతను తెలియజేశారు. 2025–26 సంవత్సరం నుంచి శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూలులో రిసోర్సెస్ పద్ధలో ఐఐటీ, నీట్ బోధనను 6వ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు బోధిస్తారన్నారు. కార్యక్రమంలో శ్రీ సాయి విద్యాసంస్థల డైరెక్టర్ హీరా రాజు, శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ హెడ్మాస్టర్ త్యాగరాజన్‌తోపాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అన్నమాచార్య యూనివర్సిటీలో పారామెడికల్ కోర్సులు ప్రారంభం
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీలో ఆరోగ్య శాస్త్రాల శాఖ (పారామెడికల్ వింగ్స్)ను ప్రారంభించామని అన్నమాచార్య యూనివర్సిటీ చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ఏయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన తొలి బ్యాచ్ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజి, మెడికల్ ల్యాబ్, బీపీటీ కోర్సులు ఆరోగ్య రంగంలో ప్రాధాన్యత వహిస్తున్నాయన్నారు. నేటి ఆరోగ్య వ్యవస్థలో పారా మెడికల్ కోర్సులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఫిజియోఽథెరపీ ఇప్పుడు డిమాండ్ ఉన్న కోర్సు అన్నారు. ఏయూ వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య సేవల నుంచి ప్రత్యేక చికిత్స వరకు ప్రతి రంగంలో పారామెడికల్ నిపుణుల అవసరం ఉందన్నారు. ఏఐటీఎస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, పారామెడికల్ ఇన్చార్జి డాక్టర్ ద్వారకానాథరెడ్డిలు హాజరయ్యారు. -
మద్యం బాటిళ్లు స్వాధీనం
పెద్దమండ్యం : మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ పీవీ రమణ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీ గొల్లపల్లె పంచాయతీ బాటవారిపల్లెలో చింతచెట్టుకింద మద్యం బాటిళ్లు విక్రయిస్తుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 92 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు బాటివారిపల్లెకు చెందిన నాగేశ్వరమ్మ, ఆనందరెడ్డిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా బెల్ట్‌షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నాలుగు ఆటోలు సీజ్ పీలేరు రూరల్ : రికార్డులు సక్రమంగా లేని నాలుగు ఆటోలు సీజ్ చేయడంతోపాటు రూ. 21,610 జరిమానా విధించినట్లు ఎంవీఐ పి. విజయకుమారి తెలిపారు. బుధవారం స్థానిక సదుం మార్గంలో ఆర్టీసీ పీలేరు డిపో మేనేజర్ బి. నిర్మలతో కలసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆటోల రికార్డులు పరిశీలించి సక్రమంగా లేని ఆటోలు సీజ్ చేసి, జరిమానా విధించినట్లు తెలిపారు. రోడ్డు నియమాలు అతిక్రమించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎయిడ్స్‌పై విస్తృతమైన అవగాహన కల్పించాలిరాయచోటి టౌన్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో ఎయిడ్స్‌పై విస్తృతమైన అవగాహన కల్పించాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ వైద్యాధికారి డాక్టర్ శైలజ సూచించారు. బుధవారం పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలలో అవగాహన కలిగినప్పుడే ఈ వ్యాధులను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు. బోగినేని మణిపై కేసు నమోదుఓబులవారిపల్లె : జనసేన పార్టీ నాయకుడు, రాయలసీమ జోనల్ కన్వీనర్ బోగినేని చిన్న మణిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మండలంలోని చెన్నరాజుపోడు గ్రామంలో ఏప్రిల్ 10వ తేదీన శ్రీరామనవమి గ్రామోత్సవం సందర్భంగా అర్థరాత్రి పాత కక్షల కారణంగా ఎన్ఆర్ఐ పత్తి సుబ్బరాయుడు, అతని భార్య పత్తి రాజేశ్వరిపై జోగినేని మణి కాలితో తన్ని దాడి చేశాడు. ఈ విషయంపై పత్తి రాజేశ్వరి దంపతులు రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు వద్ద ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు మంగళవారం జోగినేని మణిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు మైదుకూరు : పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మైదుకూరుకు చెందిన వైద్య విద్యార్థి వీరమల్లు నవనీత్ కుమార్ గాయపడ్డాడు. నవనీత్ కుమార్ తండ్రి వీరమల్లు మల్లేష్ వైఎస్సార్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్నారు. పోతిరెడ్డిపాలెం వద్ద కారు ఇంటిని ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, నవనీత్‌కుమార్ తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. సంఘటన గురించి తెలియగానే నవీనత్ కుమార్ తండ్రి డాక్టర్ మల్లేష్ కుటుంబ సభ్యులతో కలిసి హుటాహుటిన నెల్లూరుకు బయల్దేరారు. -
మిట్స్ జాతీయ సింపోజియంలో మాజీ రాష్ట్రపతుల మనవడు
కురబలకోట : భారత మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి మనవడు డాక్టర్ జి. సుబ్రమణ్యం శర్మ అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల బుధవారం జాతీయ స్థాయిలో నిర్వహించిన టెక్నికల్ సింపోజియం జీమాక్స్–25లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈయన బెంగళూరు సుధీక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన సింపోజియంలో మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం కోసం పని చేసి జీవితంలో రాణించాలన్నారు. యువ ఇంజినీర్లు ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గ ట్లు నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. సరికొత్త ఆవిష్కరణలకు తెరలేపాలని సూచించారు. బాలిక అదృశ్యం పెద్దతిప్పసముద్రం : మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ కొత్తపల్లికి చెందిన ఓ మైనర్ బాలిక (17) గత రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. బంధువులు, చుట్టు పక్కల గ్రామాల్లో బాలిక ఆచూకీ లేకపోవడంతో అదృశ్యమైనట్లు భావించిన బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
గుర్రంకొండ : జిల్లాలో టమాటా రైతులు పండించిన టమాటాకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, జిల్లాకు హంద్రీనీవా నీళ్లు అందించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మండలంలోని తరిగొండ, మర్రిపాడు, టి.రాచపల్లె, రామాపురం గ్రామాల్లో పర్యటివంచారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు వారాల తరబడి బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. జిల్లాలోని పడమటి మండలాల్లో సాగు నీరు లేక భుగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు ఎండిపోతున్నాయన్నారు. తద్వారా చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని చెప్పారు. ఈ ప్రాంతానికి వెంటనే హంద్రీనీవా నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. క్యాక్రమంలో జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు రమేష్‌బాబు, నాయకులు వెంక్రటమణ, సుధాకర్‌రెడ్డి, రెడ్డెప్ప పాల్గొన్నారు. -
కొడుకు దూరమై.. బతుకు భారమై
కురబలకోట/బి.కొత్తకోట: ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలిహిల్స్లోని గంగోత్రి చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన బి. కొత్తకోటకు చెందిన బాలకృష్ణ (29) మృతదేహాన్ని బుధవారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది బోటు సాయంతో వెలికి తీశారు. పోలీసులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహింపజేశారు. బాలకృష్ణ బి.కొత్తకోట కాలనీలో టైలర్‌గా ఉన్నారు. ఇతని సంపాదనతోనే రోజులు గడిచేవి. ఇతను ఒక్కడే కుటుంబానికి ప్రధాన జీవనాధారం. ఇతను అవివాహితుడు. పెళ్లి సంబంధాలు చూస్తున్న తరుణంలో ఈతకు వెళ్లి ఆకస్మికంగా మృతి చెందడం కలచివేస్తోంది. ఇతనికి ఈత వచ్చినప్పటికీ చెరువు చివరి వరకు వెళతానని వెళ్లాడు. మధ్యలోకి వెళ్లాక ఈదలేక ఊహించని పరిస్థితిలో మునిగిపోయి చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇతని తండ్రి శ్రీనివాసులు ఆరేళ్ల క్రితం హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అక్క పద్మజకు వివాహమైంది. తల్లి మంజుల (50) నిస్సహాయురాలు. అన్న శివ కృష్ణ (35) మానసిక వికలాంగుడు. తల్లిని, అన్నను ఇతనే చూసుకునే వాడు. ఇప్పుడు అతను తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో వారి బతుకు ప్రశ్నార్థకంగా మారింది. తల్లి మంజుల పరిస్థితిని తలచుకుని బంధుమిత్రులు వేదన పడుతున్నారు. ఆధారంగా ఉన్న కొడుకు దూరం కావడంతో ఆ తల్లి తల్లడిల్లుతోంది.కొడుకు మృతితో తల్లికి తీరని వేదన -
ఐటీఐలో శిక్షణ..ఉపాధికి నిచ్చెన
రాజంపేట టౌన్ : కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా త్వరగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే విద్యార్థులకు ఐటీఐ ఓ వరమని చెప్పవచ్చు. ఐటీఐలో ఏ ట్రేడ్ కోర్సు పూర్తి చేసినా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే ప్రధానంగా రైల్వే, ఆర్టీసీ, విద్యుత్‌శాఖ వంటి ప్రభు త్వరంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాల కల్పనలో ఐటీఐ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. స్వయంగా కూడా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో 15 ఐటీఐలు.. అన్నమయ్య జిల్లాలో మొత్తం 15 ఐటీఐలు ఉన్నాయి. ఇందులో మూడు ప్రభుత్వ ఐటీఐలు కాగా 12 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. రాజంపేట, పీలేరు, తంబళ్లపల్లెలో ఒక్కొక్క ప్రభుత్వ ఐటీఐ ఉంది. ప్రైవేట్ ఐటీఐల విషయానికి వస్తే మదనపల్లెలో నాలుగు, రాయచోటిలో రెండు, రాజంపేట, రైల్వేకోడూరు, తంబళ్లపల్లె, పీలేరు, గుర్రంకొండ, వాయల్పాడులో ఒక్కో ప్రైవేట్ ఐటీఐ ఉంది. మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు.. ఐటీఐలో ప్రధానమైన ట్రేడ్లలో ప్రవేశానికి టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే టెన్త్‌లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఐటీఐలో సీట్ల కేటాయింపు ఉంటుంది. టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన వారికి కోరుకున్న ఐటీఐ కేంద్రంలో, ట్రేడ్ ఎంపికలో ప్రాధాన్యత ఉంటుంది. టెన్త్‌లో కొంత మంది విద్యార్థులకు సమానమైన మార్కులు వచ్చినప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. గణితంలో కూడా సమానమైన మార్కులు వచ్చివుంటే సైన్స్‌లో అత్యధిక మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ గణితం, సైన్స్ రెండు పాఠ్యాంశాలలో సమానమైన మార్కులు వచ్చినప్పుడు పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకొని ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. రిజర్వేషన్ల కేటగిరిని కూడా పరిగణలోకి తీసుకొని సీట్లను భర్తీ చేస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఐటీఐలో ఉత్తీర్ణులై అప్రెంటీస్ కూడా పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలను సులువుగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే విద్యు త్, రక్షణ, రైల్వే రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే విద్యార్థులు వారికి సంబంధించిన ట్రేడ్లలో మంచి నైపుణ్యం కలిగి ఉంటే స్వ యంగా కూడా ఉపాధి అవకాశాలను పొందవచ్చు. నేరుగా పాలిటెక్నిక్‌లోకి ప్రవేశం ఐటీఐలో రెండేళ్ల కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ రెండవ సంవత్సరంలో ప్రవేశానికి అర్హులవుతారు. పాలిటెక్నిక్ చదవాలనుకునే విద్యార్థులు తొలుత నెలరోజుల వ్యవధిగల బ్రిడ్జి కోర్సు చేసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ట్రేడ్ల వారీగా బ్రాంచ్‌లు కేటాయింపు ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన ట్రేడ్లను బట్టి పాలిటెక్నిక్‌లో బ్రాంచ్‌ల కేటాయింపు ఉంటుంది. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో సీటు కేటాయిస్తారు. అలాగే ఫిట్టర్, టర్నర్ మెషినిస్టు, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషన్ కోర్సు చేసిన వారికి మెకానికల్ బ్రాంచ్‌లో, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిక్ కోర్సు చేసిన వారికి ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌లో, మెకానిక్ మోటార్ వెహికల్ ఉత్తీర్ణులైన వారికి ఆటోమొబైల్ బ్రాంచ్‌లో సీటు కేటాయిస్తారు. ఉజ్వల భవిష్యత్తు వివిధ కారణాల రీత్యా ఉన్నత చదువులు చదివేందుకు వీలు కాని వారికి ఐటీఐ చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఐటీఐ కోర్సు పూర్తి చేసుక్ను వారికి తప్పక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ప్రతిభ గల విద్యార్థులకు ఐటీఐ పూర్తి చేసిన తరువాత ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు కృషి చేస్తాము. ఆర్థిక పరిస్థితుల కారణంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఐటీఐ ఓ వరం లాంటిది. ఆర్.రఘురామిరెడ్డి, జిల్లా కన్వీనర్, పారిశ్రామిక శిక్షణా సంస్థ కోర్సు పూర్తికాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రవేశాలకు మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ -
డాక్టరమ్మ.. విధులకు డుమ్మా
సిద్దవటం : మండలంలోని పి. కొత్తపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాకర్ రంగలక్ష్మి బుధవారం విధులకు గైర్హాజరయ్యారు. ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు పనిచేస్తున్నా డాక్టర్ శ్రీనివాసులరెడ్డి 104 సంచార వాహనం ద్వారా వైద్య సేవలను అందించేందుకు వెళ్లారు. మరో డాక్టర్ రంగలక్ష్మి విధులకు రాకపోవడంతో అక్కడి స్టాఫ్ నర్సు వచ్చిన రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. డాక్టరమ్మ వారానికి ఒక్కసారే వైద్య శాలకు వస్తారని, హాజరు పట్టికలో ఆమె విధులకు హాజరైన రోజున వారానికి సరిపడా సంతకాలు చేస్తున్నట్లు బట్ట బయలైంది. ఈనెల 25వ తేదీ వరకు హాజరు పట్టికలో వైద్యురాలు సంతకాలు చేశారు. ఆ తర్వాత నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు సంతకాలు చేసిన దాఖలాలు లేవు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.రోగులకు అందుబాటులో ఉండని పి. కొత్తపల్లె వైద్యాధికారిణి -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి
చిన్నమండెం : మండల పరిధిలోని కడప–బెంగళూరు జాతీయ రహదారి మల్లూరు క్రాస్ వద్ద మామిడి కాయల మండీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు పి.సఫయాత్‌ఖాన్(32) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పి.సఫయాత్‌ఖాన్, ఇబ్రహీంఖాన్‌లు తమ సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొందన్నారు. ఈ ప్రమాదంలో సఫయాత్‌ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా ఇబ్రహీంఖాన్కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 సాయంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్
మదనపల్లె : అన్నమయ్య జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ అవసరాల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గంటల తరబడి ఎదురుచూసే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిందన్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ(పీడీఈ) సిస్టమ్ ద్వారా, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా, అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. స్లాట్ బుకింగ్ వల్ల సమయం ఆదా అవడంతో పాటుగా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరాలు తగ్గుతాయన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనధికారిక కార్యకలాపాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు తగ్గుతాయన్నారు. ఏప్రిల్ 4 నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 11 సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు స్లాట్ బుకింగ్ వ్యవస్థను విస్తరించినట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపుల కొరతపై మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ...స్టాంపులు వచ్చాయని, అయితే వేరియేషన్స్ కారణంగా ఆన్లైన్లో ఎంటర్ చేయలేకపోతున్నామన్నారు. త్వరలో సమస్యకు పరిష్కారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి
పెద్దతిప్పసముద్రం : శిధిలావస్థకు చేరుకున్న పురాతన కాలం నాటి ఆలయాలను అభివృద్ధి చేస్తామని జిల్లా దేవదాయ శాఖ అధికారి విశ్వనాథ్ అన్నారు. విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం ఆయన మండలంలోని పలు ఆలయాలను అకస్మికంగా తనిఖీ చేసారు. మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి, విరూపాక్షేశ్వర్వామి, కందుకూరులోని పట్టాభి రామాలయాన్ని పరిశీలించారు. ఆలయాల్లో ఽనిత్య పూజలు, దూప,దీప నైవేధ్యాలు జరుగుతున్నాయా అని ఆరా తీశారు. అనంతరం కందుకూరు వ్యాసరాయ చెరువు కొండ వద్ద వెలసిన శ్రీ వేధగిరి నరసింహ స్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఈ ఆలయం వద్ద ఎలాంటి జన సంచారం లేని విషయాన్ని గుర్తించిన పలువురు గుర్తు తెలియని దుండగులు గతంలో గుప్త నిథుల కోసం గోపురం, ధ్వజ స్తంభాలను ధ్వంసం చేశారని పూజారి గంగాధర్ శాస్త్రి, ఆలయ ధర్మకర్త కరణం ప్రకాష్రావ్లు దేవదాయ శాఖ అధికారికి వివరించారు. ఈ ఆలయ పునరుద్ధరణకు ప్రత్యేక చొరవ చూపాలని సూచించగా అధికారి సానుకూలంగా స్పందించి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. అనంతరం నవాబుకోట పంచాయతిలో శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం 363 సర్వే నంబర్లోని 15 సెంట్ల ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్ అనే వ్యక్తి ఇటీవల జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోగా సదరు స్థలాన్ని కూడా జిల్లా అధికారి పరిశీలించారు. ఆయన వెంట అర్చకుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవయ్య తదితరులు ఉన్నారు. -
నేడు ఒంటిమిట్టలో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన
ఒంటిమిట్ట : మండల పరిధిలోని చింతరాజుపల్లిలోని పట్రపల్లిలో గురువారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు పర్యటించనున్నారు. ఈ విషయాన్ని మండల వైఎస్సార్ సిపి శ్రేములు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో గురువారం పట్రపల్లి నందు జరగబోవు గంగమ్మ జాతరకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ప్రశాంతంగా పాలిసెట్ రాయచోటి టౌన్ : జిల్లా వ్యాప్తంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) ప్రశాంతంగా జరిగిందని జల్లా కో ఆర్డినేటర్ శివశంకర్, డీఆర్వో మధుసూధన్‌రావు తెలిపారు. బుధవారం రాయచోటి, రాజంపేట, మదనపల్లె, కలికిరిలలో 11 సెంటర్లలో పరీక్షలు జరిగాయన్నారు. బాలురు 2376 మంది, 1605 మంది బాలికలు మొత్తం 3981 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశామన్నారు. ఆయా మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లు పర్యవేక్షించారని వివరించారు. నర్సరీ పరిశీలన సిద్దవటం : సిద్దవటం లోని అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నర్సరీలోని మొక్కలను బుధవారం సాయంత్రం కడప డీఎఫ్ఓ వినీత్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో ఇంకొన్ని మొక్కలను పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ప్లాంటేషన్‌ను మరింతగా అభివృద్ధి చేసి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు డీఎఫ్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో రేంజర్ కళావతి, డిప్యూటీ రేంజర్ కె. ఓబులేస్, టెక్నికల్ అసిస్టెంటు రమణ, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా పరిధిలో గల గిరిజన గురుకుల బాలుర పాఠశాలల్లో 3వ తరగతి, మిగతా తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలను నింపడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి. సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని టి.సుండుపల్లె, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లెలలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఎస్సీ –4, ఎస్టీ–32, బీసీ–2, ఓసీ–1, ఏఈక్యూ–1 సీట్లు 3వ తరగతిలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. బ్యాక్ లాగ్ ఖాళీలను ఎస్టీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బోగినేని మణిపై కేసు నమోదు ఓబులవారిపల్లె : జనసేన పార్టీ నాయకుడు, రాయలసీమ జోనల్ కన్వీనర్ బోగినేని చిన్న మణిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మండలంలోని చెన్నరాజుపోడు గ్రామంలో ఏప్రిల్ 10న శ్రీరామనవమి గ్రామోత్సవం సందర్భంగా అర్థరాత్రి పాత కక్షల కారణంగా ఎన్ఆర్ఐ పత్తి సుబ్బరాయుడు, అతని భార్య పత్తి రాజేశ్వరీపై జోగినేని దాడి చేశారు. ఈ విషయంపై పత్తి రాజేశ్వరీ దంపతులు రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు వద్ద ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు మంగళవారం రాత్రి మణిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. భద్రకాళీసమేతుడికి చందన అలంకారం రాయచోటి టౌన్ : అక్షయ తృతీయ సందర్భంగా రాయచోటిలోని వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారు చందన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అ ధికసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వా మి, అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయంలో వెలసిన శ్రీ బసవ దేవుడికి బసవ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఫారంపాండ్ పనుల తనిఖీ
సుండుపల్లె : మండల పరిధిలోని ఈడిగపల్లె, మాచిరెడ్డిగారిపల్లె గ్రామాల్లో నిర్మించిన ఫారంపాండ్, పశువుల నీటితొట్లు, ఊటకుంట పునరుద్ధరణ పనులను డ్వామా పీడీ వెంకటరత్నం బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లలో నీరు తక్కువ వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా చెట్ల పెంపకానికి ఫారంపాండ్లు, పశువుల దాహార్తిని తీర్చడానికి నీటితొట్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఉపాధిహామీ పథకం ద్వారా 5 ఎకరాల్లోపు ఖాళీ భూమి ఉన్న రైతులకు ఉద్యాన శాఖ ద్వారా 24 రకాల ఉద్యాన మొక్కలు పెంచుకొనేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ మాలిక్‌బాషా, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. -
నేడు కొలువుతీరనున్న గంగమ్మ
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కోడూరు గంగమ్మ జాతర నేడు గురువారం జరగనుంది. ఉదయం 5 గంటలకు పొట్టి శ్రీరాముల వీధిలోని అంకాలమ్మ గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకొస్తారు. గంగమ్మ మిట్టలో గంగమ్మ కొలువుతీరనుంది. ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అలాగే ఉదయం వసంతోత్సవంతో గంగమ్మను ఉంగరాల నగర్ వద్ద నిమజ్జనం చేయనున్నారు. ఈ ఏడాది ఎటువంటి వీఐపీ పాస్‌లు లేకుండా అమ్మవారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. జాతర నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు డప్పు వాయిద్యాలు, చెక్కభజన కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
కళ తప్పిన పసిడి పురి
ప్రొద్దుటూరు : వ్యాపారంలో ఒడిదుడుకులు కారణంగా పసిడిపురి కళ తప్పింది. అమాంతంగా బంగారం ధరలు పెరగడంతోపాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. శుభకార్యాల కోసం అవసరాలకు మాత్రమే ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. పైగా కొనుగోలుదారులు పూర్తిగా నగదు చెల్లిస్తే కానీ వ్యాపారులు ఆభరణాలను తయారు చేయించి ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పసిడి వ్యాపారానికి ప్రొద్దుటూరు ప్రసిద్ధి గాంచింది. బంగారు ఆభరణాల దుకాణాలతోపాటు వేల మంది స్వర్ణకార్మికులు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రత్యేక్షంగా, పరోక్షంగా వేలాది మందికి బులియన్ మార్కెట్ ఉపాధి కల్పిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,500 నమోదైంది. మార్చి 11న రూ.86వేలు ఉండగా.. ఈనెల 22న ఇదే ధర రూ.లక్షకు దాటింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో రూ.లక్షా 5వేల వరకు ధర పలకగా, ప్రొద్దుటూరులో రూ.లక్షకు చేరుకుంది. ధరల హెచ్చు తగ్గులతో అటు వ్యాపారులు, ఇటు స్వర్ణ కార్మికులు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరాలకు సంబంధించి గతంలో బంగారు ఆభరణాల కోసం వచ్చే వారు కేవలం అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తాన్ని చెల్లించి మిగతా సొమ్మును ఆభరణాలు తయారు చేశాఖ డబ్బు చెల్లించి తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ధరల ప్రభావం కారణంగా పూర్తి డబ్బు కొనుగోలుదారులు చెల్లిస్తే కానీ ఆభరణాలు తయారు చేయించే పరిస్థితి లేదు. స్వయంగా వ్యాపారులే ఈ విషయాన్ని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ ప్రభావమే పెద్ద కారణం గత ఏడాది ఎన్నికల ముందు నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. భూముల కొనుగోలు, అమ్మకాలు ఢమాల్ అన్నాయి. తద్వారా మార్కెట్లో మనీ రొటేషన్ లేదు. మరో వైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల ప్రభావం బంగారం మార్కెట్‌పై పడింది. అన్ని వ్యాపారాలపైన ఇదే పరిస్థితి ఉందని వ్యాపార నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ ఇంతటి ఇబ్బందులు చూడలేదని వాపోతున్నారు. ఒడిదుడుకుల మధ్య బంగారు వ్యాపారం ఆర్థిక ఇబ్బందుల్లో వ్యాపారులు, కార్మికులు నగదు చెల్లిస్తేనే బంగారం ధరలు అమాంతం పెరిగాయి బంగారం ధరలు అమాంతం పెరిగాయి. సాధారణ మధ్యతరగతి ప్రజలు బంగారం చూసేందుకే తప్ప కొనుగోలు చేసే పరిస్థితి లేదు. తులం బంగారం రూ.లక్ష దాటి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ధరలు ఇంకా పెరుగుతాయని కొందరు, తగ్గుతాయని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. కార్మికులకు ఉపాధి లేదు. – ఎస్.అహ్మద్ హుస్సేన్, ప్రొద్దుటూరు బులియన్ మర్చంట్స్ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు. వ్యాపారాలు లేవు బంగారు ధరల హెచ్చుతగ్గుల ప్రభావం మార్కెట్‌పై తీవ్రంగా ఉంది. గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకపోవడం మరోకారణం. వ్యాపారులు ముడి బంగారం కొనేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – బుశెట్టి రాంమోహన్‌రావు, రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు. -
నేడు పాలిసెట్ పరీక్ష
రాజంపేట: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నికల్ కళాశాలల ప్రవేశాలకు సంబంధించి పాలిసెట్ పరీక్ష బుధవారం నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి 1 గంట వరకు జరుగుతుంది. పట్టణంలో మూడు సెంటర్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 975 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తేడాలు ఉంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రందించాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలి. తమ వెంట ఆధార్‌కార్డు తెచ్చుకోవాలి. డీఈఈ సెట్‌కు దరఖాస్తు చేసుకోండి రాయచోటి అర్బన్: రాష్ట్రంలో రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ ) కోర్సులో ప్రవేశానికి సంబంధించిన డీఈఈ సెట్ – 2025 నోటిఫికేషన్ విడుదలైనట్లు డైట్ ప్రిన్సిపల్ అజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 29 నుంచి మే 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మే 20న హాల్‌టికెట్ల విడుదల, జూన్ 2,3 తేదీలలో పరీక్ష, 10న ఫలితాల ప్రకటన ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రాల ఎంపిక, అభ్యర్థుల అర్హతల నిబంధనలు, కోర్సు ఎంపిక విధానం తదితరాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌పైట్‌ను సందర్శించాలని వివరించారు. నేడు లైట్లు ఆఫ్ చేసి నిరసన కడప కల్చరల్: ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బుధవారం రాత్రి లైట్లు ఆఫ్‌చేసి నిరసనలు తెలియజేయాలని వక్ఫ్ పరిరక్షణ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. రాత్రి 9 నుంచి 9.15 వరకు 15 నిమిషాల వరకు ఇంటిలో, దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో లైట్లు ఆఫ్ చేసి ప్రతి ఒక్కరూ తమ నిరసనలు తెలియజేయాలని కోరారు. 4న లాంగ్‌మార్చ్ కడప కార్పొరేషన్: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మే 4వ తేది ఆదివారం జరిగే లాంగ్ మార్చ్‌ను విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పిలుపునిచ్చారు. మంగళవారం కడప నగరంలోని అంజద్‌బాషా కార్యాలయంలో పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి లో మరణించిన వారికి స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ముంతాజ్‌బేగం, వైఎస్సార్ సీపీ నాయకుడు జమాల్‌వలీ, పెద్దిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, అల్లాబక్ష్, అల్తాఫ్, బీహెచ్ ఇలియాస్, త్యాగరాజు, వినోద్, జమీల్, బాబు, కార్పొరేటర్లు పాకా సురేష్, షఫీ, బసవరాజు, బాలస్వామిరెడ్డి, షంషీర్, చాక్లెట్ గౌస్, మల్లికార్జున, కోఆప్షన్ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఉన్నారు. బాల్య వివాహాలకు పాల్పడితే చర్యలు రాయచోటి అర్బన్: జిల్లాలో బాల్యవివాహాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీడీఎస్ పీడీ రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్షర తృతీయ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని దేవాలయాల్లో బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నందున వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లా దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో కలసి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల అధికారులు, పురోహితులకు బాల్య వివాహ నిషేధ చట్టంను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. ఆలయాల్లో వివాహాలు చేసుకోదలచిన వారి వయసు ధ్రువీకరణ పత్రాలు (ఆధార్‌కార్డును ప్రామాణికంగా తీసుకోకూడదు) టెన్త్ మార్కులిస్టు, ప్రభుత్వం జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్లు, పాఠశాల రిజిస్టర్లో నమోదు చేసిన తేదీని ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. బాల్యవివాహ చట్టం ప్రకారం యువతులకు 18 ఏళ్లు, యువకులకు 21 ఏళ్లు పూర్తయి ఉండాలన్నారు. లేనిపక్షంలో పెళ్లికి సహకరించే షామియానా షాపుల వారు, క్యాటరింగ్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్స్, పురోహితులు, వాయిద్యకారులు, వివాహం కుదిర్చిన వ్యక్తులు, వివాహానికి హాజరైన పెద్దలు తదితరులు శిక్షార్హులవుతారన్నారు. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే బాల్యవివాహ నిషేధాధికారులైన ఆర్డీఓ, ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్లు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, తహసీల్దార్లు, చైల్డ్వెల్ఫేర్, పోలీసు, సచివాలయం అడ్మిన్ సెక్రటరీ, మహిళా సంరక్షణ కార్యదర్శులకు ముందస్తుగా తెలిపి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
సేవ ముసుగులో దోపిడీ
● అవగాహన కార్యక్రమాలు పక్కన పెట్టి.. అవగాహన కార్యక్రమాలను ఎక్కడా నిర్వహించిన పాపాన పోలేదు. ప్రభుత్వ సూచనలను పక్కనపెట్టి ఆ సంస్థ యాజమాన్యం సిబ్బందిని నేరుగా హోటళ్ల దగ్గరకు పంపి.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ రశీదులు ఇవ్వడం గమనార్హం. ఈ దందా రాయచోటిలో ఆరు, ఏడు నెలలుగా కొనసాగుతున్నట్లు వ్యాపారులు వాపోతున్నారు. ఒక రాయచోటిలోనే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటే జిల్లా వ్యాప్తంగా వీరి వసూళ్లు కోట్ల రూపాయలు ఉంటాయన్న వాదనలు వినిస్తున్నాయి. ఇలా చేస్తున్న వసూళ్లలో స్థానిక మున్సిపల్, ఫుడ్ షేప్టీ అధికారులకు తగిన మొత్తంలో మామూళ్లను అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాయచోటి: సేవ ముసుగులో ఓ స్వచ్ఛంద సంస్థ వసూళ్ల దందాకు పాల్పడుతోంది. సేవ చేస్తామని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చుకుంది. అయితే అక్రమ సంపాదనకు తెర తీసింది. ఈ ఆదాయంలో పై నుంచి కింది దాకా వాటాలు ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థను పై స్థాయి నేతలే రంగంలోకి దింపారనే విమర్శలు ఉన్నాయి. ఇదొక ఆదాయ మార్గంగా ఎంచుకున్నారనే వాదన వినిపిస్తోంది. దర్జాగా రశీదులు ఇస్తూ.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కిలో చికెన్‌పై పది రూపాయల దందా వసూలు అనే విషయాన్ని మరువకముందే.. రాయచోటిలో చికెన్, చికెన్ పకోడి కేంద్రాలు, హోటళ్ల నుంచి ప్రైవేటు సంస్థలకు వేలకు వేల రూపాయలు వాంతున్న లక్షలాది రూపాయలను వసూళ్లు చేస్తుండటంపై వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రైవేటు సంస్థల పేరుతో సాగుతున్న ఈ దందాపై స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా.. ఆగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇంత దోపిడీ జరుగుతున్నా ఫుడ్ షేప్టీ అధికారులు మాత్రం.. నిద్ర మత్తు నుంచి లేవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వసూలు చేస్తున్న మొత్తంలో స్థానిక మున్సిపల్, ఫుడ్ షేప్టీ అధికారులకు వాటాలు ఇస్తున్నారని, అందువల్లనే వారి వైపు నుంచి చర్యలు లేవని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అధికార పార్టీ పేరు చెప్పి అక్రమ వసూళ్ల దందా అధికమైందంటున్నారు. వ్యాపారాలు లేక ఆర్థికంగా చితికిపోతున్న వ్యాపారులు.. ప్రత్యేక వసూళ్ల దాడులతో కుదేలవుతున్నారు. ఒక్కొక్క షాపు నుంచి వేలకు వేల రూపాయలు అపరాధ రుసుం పేరుతో వసూలు చేయడమే కాకుండా.. తీసుకున్న డబ్బులకు సంస్థ పేరుతో దర్జాగా రశీదులు ఇస్తుండటం జిల్లా కేంద్రమైన రాయచోటిలో కనిపిస్తుంది. కై వంజి బాబా గ్రామీణ వికాస్ ఆధ్వర్యంలో.. రాయచోటి మున్సిపాల్టీ పరిధిలో ఫాస్టాక్ ట్రైనింగ్ పార్ట్నర్ పేరుతో కై వంజి బాబా గ్రామీణ వికాస్ మండల ఆధ్వర్యంలో.. మాంసం దుకాణాలు, హోటళ్లు, పకోడి సెంటర్లు, టీ దుకాణాల దగ్గర వేలకు వేల రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ రశీదులు ఇస్తున్నారు. ‘మేము చెప్పినంత డబ్బులు ఇవ్వకపోతే, మీపైన కేసులు బుక్ చేస్తామని, ఆపై మీరు కోర్టులకు తిరగాల్సి వస్తుంది’ అని భయబ్రాంతాలకు చేస్తున్నట్లు సమాచారం. అక్రమ వసూళ్లపైన మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో చేసేదిలేక.. వారు అడిగినంత డబ్బులు ఇచ్చి రశీదులు పొందుతున్నారు. ఫిర్యాదులు వచ్చాయి హోటళ్లు, చికెన్ సెంటర్ల దగ్గర అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వం సూచించిన మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నామినల్ రుసుంతో పొందాల్సి ఉంది. ఫిర్యాదులపై మున్సిపల్ చైర్మన్ పయాజ్ బాషాతో కలిసి.. సంస్థ వారిని పిలిచి డబ్బులు వసూలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించాం. అయినా తిరిగి అక్కడక్కడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. తగిన చర్యలు చేపడతాం. – వాసు, మున్సిపల్ కమిషనర్, రాయచోటి ఇదీ వారి బాధ్యత ఫాస్టాక్ ట్రైనింగ్ పార్ట్నర్ సంస్థ నిర్వాకం హోటళ్లు, మాంసం దుకాణాల నుంచి వసూళ్లు ‘కూటమి’ అండదండలతో రెచ్చిపోతున్న వైనం బెంబేలెత్తుతున్న వ్యాపారులు ఫుడ్ షేప్టీ అధికారులు దుకాణాల యజమానులు, హోటళ్లలో పని చేస్తున్న కార్మికులకు మంచి ఆహారం, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఆ శాఖ పరిధిలో తగినంత సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వం ఈ అవగాహన కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. ఈ క్రమంలో వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో కై వంజి బాబా గ్రామీణ వికాస్ మండల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫాస్టాక్ ట్రైనింగ్ పార్ట్నర్ సంస్థ.. హోటళ్లు, చికెన్ సెంటర్లు, టీ దుకాణాల యజమానులకు అందులో పని చేసే వర్కర్లను ఒక చోటికి పిలిచి అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక్కొక్క హోటల్, చికెన్ సెంటర్ల నుంచి రూ.300 నుంచి రూ. 500 వరకు చార్జ్ రూపంలో పొందడానికి అనుమతులు ఉన్నాయి. -
అడవిలో మంటలు ఆర్పిన అటవీ సిబ్బంది
సిద్దవటం : కడప రేంజి పరిధిలోని భాకరాపేట బీటులో ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టడంతో సోమవారం సాయంత్రం అటవీ సిబ్బంది ఆ ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారని కడప రేంజర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కడప ఫారెస్టు రేంజి పరిధిలోని భాకరాపేట బీటు పాలకొండ అటవీ ప్రాంతంలో ఆకతాయిలు కొండకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసి పడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. అటవీ సిబ్బంది అప్రమత్తమై ఎగిసి పడుతున్న మంటలను వాటర్ పంపులు, చెట్ల కొమ్మలను ఉపయోగించి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారన్నారు. అటవీ ప్రాంతానికి నిప్పు పెట్టడం వల్ల వన్య ప్రాణులు అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఎస్. ఓబులేసు, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఎఫ్‌బీఓలు ఇందిర, రాజశేఖర్‌రాజు, భాను కిషోర్, ప్రొటెక్షన్ వాచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట సీహెచ్‌ఓల ధర్నా
రాయచోటి అర్బన్ : తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పలువురు సీహెచ్‌ఓలు డిమాండ్ చేశారు. మంగళవారం సీహెచ్‌ఓలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీహెచ్‌ఓల యూనియన్ జిల్లా నాయకులు భరత్, శివకుమార్,అహమ్మద్ బాషా మాట్లాడుతూ ఆరేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాలన్నారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం విషయమై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. దాడి ఘటనపై కేసు నమోదు మదనపల్లె : భూవివాదం కారణంగా జరిగిన దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. పట్టణంలోని పీఅండ్‌టీ కాలనీకి చెందిన జి.రామాంజులుకు దేవతానగర్ వద్ద వారసత్వంగా సంక్రమించిన భూమి సర్వే నెంబర్.90లో ఉంది. అందులో సోమవారం సాయంత్రం ఔషధ మొక్కలు నాటుకుంటుండగా, అతడి సోదరుడైన బాలాజీ అడ్డుకుని రామాంజులు, అతడి భార్య నారాయణమ్మలపై దాడి చేశాడు. ఈ ఘటనల్లో బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడైన బాలాజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మిద్దైపె నుంచి పడి వ్యక్తి మృతి ములకలచెరువు : నూతనంగా నిర్మించిన ఇంటికి నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని సోంపల్లె పంచాయతీ బిళ్లూరివారిపల్లెకు చెందిన బి. గోవిందురెడ్డి(55) ఇంటి గోడలకు నీళ్లు పట్టే క్రమంలో అదుపుతప్పి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన గోవిందురెడ్డిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి కుమార్తె తేజస్విని, కుమారుడు ఈశ్వర్‌రెడ్డి సంతానం. మృతదేహానికి సర్పంచు బి. విష్ణువర్దన్‌రెడ్డి నివాళులు అర్పించారు. చైన్నెలో రైల్వేకోడూరు సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మందల ప్రతాప్ (30) చైన్నె తిరువళ్లూరులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు మందల నాగేంద్ర అన్న సుబ్రమణ్యం కుమారుడు మృతి చెందడంతో పలువురు నాయకులు విచారం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్ రమేష్ సంతాపం ప్రకటించారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య బి.కొత్తకోట : కడుపు నొప్పి తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని బడికాయలపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. సీఐ జీవన్ గంగనాథ్ బాబు కథనం మేరకు వివరాలు.. బడికాయలపల్లె గ్రామం జింకదాటినపల్లెకు చెందిన జి.పెద్దరెడ్డప్ప (45) చిన్నచిన్న కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి కడుపు నొప్పి సమస్య ఉండడంతో కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నాడు. మంగళవారం నొప్పి అధికం కావడంతో సమీపంలోని ఓ తోటలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఆత్మస్థైర్యంతో మహిళలు ముందుకు సాగాలి
రాయచోటి: పని ప్రదేశంలో ఏర్పడే సమస్యలను మహిళా ఉద్యోగులు ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లో అమరావతి ఏపీజేఏసీ జిల్లా శాఖ ఏర్పాటు చేసిన షీ బాక్స్‌ను మహిళా ఉద్యోగులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్సులో మహిళా ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల సమస్యలపై షీ బాక్స్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు. వాస్తవిక సమాచారం, ఆధారాలతో తమ దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ ఒక మహిళా ఉద్యోగికి ఏదైనా సమస్య వస్తే తోటి మహిళా ఉద్యోగులు అండగా ఉండాలన్నారు. అమరావతి ఏపీజేఏసీ జిల్లా చైర్మన్, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, జనరల్ సెక్రటరీ వైష్ణవి మాట్లాడుతూ జిల్లాలో మూడు డివిజన్లలో తమ శాఖ సబ్ కమిటీలు ఏర్పాటు చేసి, మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మధుసూదన్ రావు, ఏపీజేఏసీ మహిళా ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
బసినికొండ ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు
మదనపల్లె : బసినికొండలో టీడీపీ బరితెగింపు శీర్షికతో మంగళవారం సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారుల నుంచి స్పందన లభించింది. బసినికొండ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్.682–బీలోని 2.74 ఎకరాల విస్తీర్ణంలోని భూమి ప్రభుత్వానికి చెందినదని, ఎవరైనా ప్రవేశించినా, ఆక్రమించినా శిక్షార్హులంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే, అంతకుముందే బసినికొండకు చెందిన టీడీపీ మైనారిటీ నాయకుడు ఎస్.ఎం.రఫీ వివాద స్థలంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి, సర్వే నంబర్.682–బిలో చాలాకాలం క్రితమే పట్టాలు మంజూరు చేశారని, అప్పుడు ఇళ్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తే కొందరు అడ్డుకున్నారన్నారు. తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చేసేదిలేక ఊరుకున్నామన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇళ్లు నిర్మించేందుకు స్థలాన్ని జేసీబీతో శుభ్రం చేయిస్తుంటే, ఆక్రమిస్తున్నారంటూ సాక్షిలో వార్త రాశారని, తమ వద్ద భూమికి సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నాయంటూ జిరాక్స్ కాపీలు చూపించారు. అనంతరం కొద్దిగంటల తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ భరత్, వీఆర్ఓలతో కలిసి టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నించిన స్థలంలోకి వెళ్లి ఎఫ్ఎంబీ, విలేజ్ రెవెన్యూ మ్యాప్ తదితర రికార్డులను పరిశీలించి, సర్వేనెంబర్.382–బీలోని 2.74 ఎకరాల భూమి ప్రభుత్వ గయాళు స్థలంగా నిర్ధారించారు. హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. -
ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు
బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై ఉన్న గంగోత్రి చెరువులో ఈతకు దిగిన యువకుడు గల్లంతైన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు.. బి.కొత్తకోటకు చెందిన ముగ్గురు మిత్రులు కారులో సాయంత్రం హార్సిలీ హిల్స్ పర్యటనకు వచ్చారు. దారిలో పంప్ హౌస్ వద్ద ఉన్న గంగోత్రి చెరువు వద్ద ఆగారు. వీరిలో బి.కొత్తకోట జయశ్రీ కాలనీకి చెందిన టైలర్ బాలకృష్ణ (29) చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతూ కొంత దూరం వెళ్లాక గల్లంతయ్యాడు. ఇతన్ని కాపాడేందుకు మిగిలిన మిత్రులు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. సీఐ జీవన్ గంగనాథ్ బాబు, సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్, సిబ్బంది చెరువు వద్దకు చేరుకున్నారు. అయితే చీకటి కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో బుధవారం గాలిస్తామని వెనుదిరిగి వెళ్లిపోయారు. గంగోత్రి వద్దకు బాలకృష్ణ కుటుంబీకులు, మిత్రులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
రాజంపేట పార్లమెంటు పరిశీలకుడిగా సురేష్‌బాబు
● కడప పార్లమెంటు పరిశీలకుడిగా కొండూరు అజయ్‌రెడ్డి ● తిరుపతి పార్లమెంటు పరిశీలకులుగా ఎంపీ రఘునాథ్‌రెడ్డి ● హిందూపురానికి రమేష్‌కుమార్‌రెడ్డి..సాక్షి రాయచోటి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంతోపాటు ఎక్కడికక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధిష్టానం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలతోపాటు ఇతర అక్రమాలను నిలదీయడంలో భాగంగా.. పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీకులను నియమించింది. అందుకు సంబంధించి కడప పార్లమెంటు పరిశీలకులుగా స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేత కొండూరు అజయ్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా పార్లమెంటుకు సంబంధించి పరిశీలకులుగా కడప నగర మేయర్ కె.సురేష్‌బాబును నియమించారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పని చేసిన అనుభవంతోపాటు జెడ్పీ చైర్మన్‌గా కూడా సురేష్‌బాబు పని చేసి ఉన్నారు. ● తిరుపతి పార్లమెంటు పరిశీలకులుగా రాజంపేటకు చెందిన రాష్ట్ర నాయకులు, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డిని పార్టీ నియమించింది. తిరుపతి జిల్లాలో మేడా రఘునాథరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. అంతేకాకుండా రాయ చోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లెకు చెందిన మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డిని కూడా హిందూపురం నియోజకవర్గ పరిశీలకులుగా పార్టీ నియమించింది. ఎక్కడికక్కడ జిల్లాలో అందరినీ సమన్వయం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్ఫలితాలు సాధించేలా, ప్రభుత్వంపై అలుపెరగని పోరాటాలు చేయడమే లక్ష్యంగా పరిశీలకులను నిమించారు. -
మెరుగైన సౌకర్యాల కల్పనకు ఆర్టీసీ కృషి
కడప కోటిరెడ్డిసర్కిల్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణికుల మెరుగైన సౌకర్యాల కల్పనకు అన్ని చర్యలు చేపడుతోందని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు. జోనల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక మంగళవారం తొలిసారిగా కడపకు వచ్చిన నాగరాజుకు స్థానిక అధికారులు, యూనియన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆర్టీసీ బస్టాండు, గ్యారేజీ, ఆర్టీసీ ఆస్పత్రిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే ప్రారంభమవుతుందని, ఈ నేపద్యంలో తమ పరిశీలనకు వచ్చిన అంశాలను నివేదిక ద్వారా ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు సైతం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఉమ్మడి కడపజిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రితోపాటుస్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కలిశామని, ఆర్టీసీ పరంగా ప్రయాణీకులకు సంబంధించి సమస్యలను చర్చించామని, వాటిని పరిష్కరించి మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఈడీ పైడి చంద్రశేఖర్, ఆర్ఎం గోపాల్‌రెడ్డి, డీఎం డిల్లీశ్వరరావు, కార్గో డిప్యూటీ సీటీఎం (ఆపరేషన్స్ అండ్ కమర్షియల్) హరి, కార్గో మేనేజర్ జనార్దన్, అసిస్టెంట్ మేనేజర్లు కన్యాకుమారి, మంజుల పాల్గొన్నారు. ఆర్టీసీ జోనల్చైర్మన్ పూల నాగరాజు -
వ్యక్తి అదృశ్యం
ఒంటిమిట్ట : మండల పరిధిలోని చేనువారిపల్లికి చెందిన దారా మునయ్య అనే వ్యక్తి కనిపించలేదని మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. మండల పరిధిలోని మలకాటపల్లి చీరాల అచ్చమ్మ అనే మహిళ దహన సంస్కారాలకు దారా మునయ్య ఏపీ26సిడి 0027 నెంబరుగల బైక్‌లో వెళ్లి తిరిగి వస్తుండగా మంటపంపల్లి సమీపంలో ఉదయం 11 గంటలకు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నాడు. అయితే ఆ తరువాత మునయ్యకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో అతని పెద్ద కుమారుడు డి.కళ్యాణ్‌తోపాటు బంధువులు తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించడం లేదు. దీం స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారం – పోక్సో కేసు నమోదు ప్రొద్దుటూరు క్రైం : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో సప్లయర్ షాపు యజమానిపై రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన మైనర్ బాలిక ఓ హోటల్లో పని చేస్తోంది. మైదుకూరు రోడ్డులోని సప్లయర్ షాపు యజమాని సుధాకర్‌శర్మ తరచూ హోటల్‌కు టిఫిన్ చేయడానికి వెళ్తూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి బాలికను పలుమార్లు బయటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సుధాకర్శర్మపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య సింహాద్రిపురం : మండలంలోని కోవరంగుంటపల్లె గ్రామానికి చెందిన ఆశీర్వాదం(19) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మట్కా నిర్వాహకులు అరెస్టు ప్రొద్దుటూరు క్రైం : స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంజీవయ్య నగర్లో మట్కా జూదం ఆడుతున్నారని సమాచారం రావడంతో సీఐ సిబ్బందితో కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. రూ. 26,500 నగదు, మట్కా స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. -
అంగరంగ వైభవం.. చెన్న కేశవుని చందనోత్సవం
వల్లూరు : పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి, శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో శ్రీ చెన్న కేశవ స్వామి మూల విరాట్‌కు చందనోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం చందనంతో ప్రత్యేకంగా అలంకరించారు. చందన భూషితుడై తేజోవంతంగా కనిపిస్తూ చల్లని దీవెనలందిస్తున్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించారు. పుష్పగిరి గ్రామంలోని శ్రీ కామాక్షీ వైధ్యనాథేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైద్యనాథేశ్వరునికి అభిషేకాలు నిర్వహించారు. శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. రాత్రి పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామి ఆధ్వర్యంలో నెమలి వాహనంపై కొలువు దీరిన శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెన్న కేశవ స్వామి హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. పుష్పగిరిలో నేడు అక్షయ తదియ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం అతి ముఖ్యమైన అక్షయ తదియ తిరునాల ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఉదయం చెన్న కేశవునికి పూలంగి సేవ జరుగుతుంది. రాత్రి జరిగే వైద్యనాథుడి నందివాహన సేవకు, శ్రీ చెన్న కేశవుని గరుడ వాహన సేవకు విశేష సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. -
బొలేరో వాహనం ఢీకొని కూలీకి తీవ్ర గాయాలు
మదనపల్లె : బొలేరో వాహనం ఢీకొని బీహార్ వలస కూలీ తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. బీహార్‌కు చెందిన రఘుకుమార్(24) ఉపాధి నిమిత్తం కురబలకోటకు వచ్చి అంగళ్లు ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న నర్సరీ, ఎరువుల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. వంటగ్యాస్ అయిపోవడంతో సిలిండర్ కోసం ద్విచక్రవాహనంలో అంగళ్లుకు వచ్చి తిరిగి వెళుతుండగా, ఫ్లై ఓవర్ సమీపంలో రాయచోటి నుంచి మదనపల్లె వైపు వస్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో రఘుకుమార్ తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ధరలు ఉన్నా.. దిగుబడి సున్నా
ఎండ మబ్బు తెగులుతో గిటకబారుతున్న నిమ్మకాయలు రాయచోటి : ధరలు అనుకూలంగా ఉన్నా మండుతున్న ఎండల కారణంగా దిగుబడినిస్తున్న కాయలకు ఎండమబ్బు తెగులు సోకి నిమ్మకాయలు గిటకబారి పోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన అనేక పంటలకు మార్కెట్లో తగిన ధరలు లేక అల్లాడుతున్నారు. పులుసు నిమ్మకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఎండలు అధికం కావడంతో చెట్టుకున్న ఆకులకు ముడత రోగం, చెక్కర తెగుళ్లు బారిన పడ్డాయి. ఎండకు కాచిన కాయలపై మంగు ఏర్పడి కాయలు బండరాయిలా పనికిరాకుండా పోతున్నాయి. మండుతున్న ఎండలకు మనుషులు, జంతువులే కాకుండా చెట్లు సైతం మలమల మాడిపోతున్నాయి. మార్కెట్లో మంచి ధరలు పలుకుతున్న చెట్లు, కాయలకు సోకుతున్న తెగుళ్ల కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నామంటూ నిమ్మ రైతులు కలవరపాటుకు గురవుతున్నారు. మార్కెట్లో డజన్ నిమ్మకాయలు రూ. 50లు పైబడే పలుకుతున్నాయి. పెరుగుతున్న వేడి, ఉక్కపోత కారణంగా కూల్ డ్రింక్స్ , ఇతర ద్రవ పదార్థాలలో వినియోగానికి నిమ్మకాయలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ధరలు అనుకూలగా ఉండటంతో దిగుబడి వచ్చిన పంటకు తెగుళ్లు సోకకుంటే మంచి ధరలతోపాటు లాభాలు ఉండేవని రైతులు చెబుతున్నారు. ఉద్యానవన శాఖ అధికారులను పిలిపించి సోకిన తెగుళ్లపై పరిశోధనలు చేసి మందులు వాడినా తగిన ఫలితాలు రావడం లేదంటున్నారు. కేవలం ఎండలు అధికంగా ఉండటమే కారణమని చెబుతున్నారు. -
అదుపు తప్పి ద్విచక్ర వాహనం బోల్తా
సిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్ మూడవ గేటు వద్ద సోమవారం ద్విచక్రవాహనదారుడు అదుపు తప్పి కిందపడిన ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం కమ్మపాలెం ఎస్సీ కాలనీకి చెందిన ఎం.సుశాంత్, కల్లూరు కళ్యాణిలు ఇరువురు కడపలోని కళాశాలకు సోమవారం స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. వీరు భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్ మూడవ గేటు వద్దకు రాగానే బెటాలియన్‌లో నుంచి ఒక విద్యార్థి సైకిల్‌పై బయటకు వచ్చాడు. సుశాంత్ అతన్ని తప్పించ బోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న అరుగును ఢీకొని బోల్తా పడ్డాడు. ఈ ప్రమాదంలో సుశాంత్‌కు రెండు కాళ్లు విరిగాయి, కళ్యాణి తలకు గాయా లయ్యాయి. వీరిని వైద్యం కోసం కడపలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని స్థానికులు తెలిపారు.ఇద్దరికి గాయాలు -
సాంకేతిక విద్య.. భవితకు భరోసా!
కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి తరువాత వీలైనంత తొందరగా ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి పాలిటెక్నిక్ కోర్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సాధారణంగా పదవ తరగతి తరువాత ఇంటర్, డిగ్రీ కోర్సులు చేయడం సాధారణం. అయితే డిగ్రీ పూర్తయి ఉద్యోగం వచ్చేంత సమయం లేకపోవడంతో చాలామంది పాలిటెక్నిక్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. పదవ తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిసెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలలో ఉత్తమ ర్యాంకు సాధించిన వారికి రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి. ఇటీవలే పదవ తరగతి పరీక్షలు కూడా ముగిశాయి. ఫలితాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా పాలిసెట్ కోసం దాదాపు 8 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మెండుగా ఉద్యోగ అవకాశాలు.. పదవ తగరతి చదివిన వెంటనే సాంకేతిక విద్య చదవాలనే గ్రామీణ పేద విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సు గొప్ప అవకాశం. ఇంజనీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక విద్య అభ్యసించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. పాలిటెక్నిక్‌లో ఏ కోర్సు చేసినా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. దీంతో భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల వివిధ సంస్థలు నేరుగా కళాశాలలకు వెళ్లి పాలిటెక్నిక్ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులను తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు. ఈ నెల 30న ప్రవేశ పరీక్ష.. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ పరీక్ష రాయాల్సిందే. పాలిసెట్ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 17వ తేదీతో గడువు ముగిసింది. ఈ నెల 30వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహించనున్నారు. ఈ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ఇందులో గణితం 50 మార్కులకు, ఫిజిక్స్ 40 మార్కులకు, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉంటుంది. పదవ తరగతి సిలబస్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం కడప, ప్రొద్దుటూరులలో 16 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 వేల మంది దాకా ఈ పాలిసెట్ ప్రవేశ పరీక్షను రాయనున్నారు. కోర్సుల వివరాలు ఇలా.. ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈఈ, కంప్యూటర్ మెకానిక్, ఈసీఈ, ఎంఈసీలతోపాటు ఒకటి రెండు కొత్త కో ర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. జిల్లా మొ త్తం పైన ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 15 పాలిటెక్నిక్ కళాశాలకుగాను 5600 సీట్లు అందుబాటులో ఉన్నా యని అధికారులు తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ నిర్వహించారు. ఈ ఉచిత కోచింగ్ 28వ తేదీతో ముగిసింది. పదవ తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం పాలిటెక్నిక్ విద్యతో మంచి ఉద్యోగావకాశాలు రేపు పాలిసెట్ ప్రవేశ పరీక్ష జిల్లాలో 8 వేల మంది దాకా పరీక్ష రాయనున్న విద్యార్థులు జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల ఏర్పాటుపాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిజిల్లా వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకుఅన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. సోమవారం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అడిషనల్ కో ఆర్డినేటర్ దామోదరంతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం కడపలో 12 పరీక్షా కేంద్రాలను, ప్రొద్దుటూరులో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ 16 పరీక్షా కేంద్రాలలో దాదాపు 12500 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాస్తున్నారని తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుందని తెలిపారు. విద్యార్థులంతా ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఎవరికై నా ఆన్లైన్లో హాల్‌టికెట్ డౌన్లోడ్ కాకపోతే 29వ తేదీ మధ్యాహ్నంలోగా కడపలోని ప్రభుత్వ మహిళా కళాశాలను సంప్రదించాలని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి పరీక్ష రాసేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. -
విజయవంతంగా హ్యాక ధాన్
కురబలకోట: మదనపల్లె దగ్గర అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో 24 గంటల పాటు జాతీయ స్థాయి ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ హ్యాక ధాన్ ఇంపాక్ట్స్–25ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ యువరాజ్ సోమవారం తెలిపారు. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ విభాగాలు గీక్స్ ఫర్ గీక్స్ సహకారంతో దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు తెలిపారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పరిష్కరించే సాంకేతిక ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో ప్రేరేపించడం ఈ హ్యాక్‌ధాన్ ప్రాథమిక లక్ష్యమన్నారు. 246 మంది 73 గ్రూపులుగా పోటీ బృందాలు ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లర్నింగ్, ఎడెటెక్, హెల్త్‌కేర్, ఆగ్రోటెక్, స్మార్ట్ సిటీస్, సస్టైన్‌బులిటీ, ఎన్విరాన్మెంట్, స్టూడెంట్ ఇన్నోవేషన్ వంటి కీలక అంశాలపై విద్యార్థులు దృష్టి సారించారన్నారు. బెంగళూరుకు చెందిన గీక్స్ ఫర్ గీక్స్ లర్నింగ్ డైరెక్టర్ అభిషేక్ మాట్లాడుతూ ఇలాంటి హ్యాక్ధాన్ల ద్వారా నిర్దిష్ట సమస్యను తరచుగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాటిని పరిష్కరించడానికి ఉపయోగిస్తారన్నారు. విజేతలుగా నిలచిన పుత్తూరు సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల టెక్బ్రైట్ టీమ్ టి. మనోజ్‌కుమార్‌కు మొదటి బహుమతి కింద రూ.25వేలు, మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల డైనమోస్ టీమ్ కె. తిరిశాంక్కు రెండో బహుమతి రూ.20 వేలు, ఎస్వీ సెట్‌ది స్టైవర్స్ టీమ్ పి. దినేష్‌కుమార్ రెడ్డికి మూడవ బహుమతి కింద రూ.15వేలు, ఆ తర్వాత ఎస్వి సెట్ ఐఓటి స్క్వాడ్ వై.శశిధర్ రెడ్డికి 10 వేలు, మిట్స్ కళాశాల మైల్ వర్త్ సి. బాలాజీకి రూ.5వేలు చొప్పున అందజేసినట్లు తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ హ్యాక్ ధాన్‌లో పాల్గొనడం వల్ల టెక్నాలజీ ద్వారా సామాజిక మార్పు తీసుకురావడంలో విద్యార్థులు భాగస్వాములు కావచ్చన్నారు. -
వై.కోటలోని బంజరు భూములను పేదలకు పంచి పెట్టాలి
రాయచోటి అర్బన్ : ఓబులవారిపల్లె మండలం బాల్రెడ్డిగారిపల్లె పంచాయతీ వై.కోట గ్రామ పొలం సర్వే నంబరు 1150 లో గ్రామపెత్తందార్లు, కబ్జాదారుల ఆక్రమణలో ఉన్న సుమారు 150 ఎకరాల బంజరు భూములను ప్రభుత్వం వెంటనే పేదలకు పంచిపెట్టాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) జిల్లా అధ్యక్షుడు పండుగోల మణి, రైల్వేకోడూరు కార్యదర్శి జ్యోతిచిన్నయ్యలు జిల్లా కలెక్టర్ శ్రీధర్‌కు విన్నవించారు. రాయచోటి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు కలెక్టర్‌తో మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇతరులకు కట్టబెట్టిన ప్రభుత్వ, బంజరు భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. వాటిని నిరుపేద గిరిజన కుటుంబాలకు రెండేసి ఎకరాల చొప్పున పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఓబులవారిపల్లె మండల కార్యదర్శి చంతలపూడి నాగమ్మ, బీకేఎంయూ నాయకులు జయరామయ్య, మల్లిక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య ఒంటిమిట్ట: మండల పరిధిలోని పోలు బుచ్చయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నల్లగొండ నరసింహారెడ్డి భార్య నల్లగొండ కృష్ణమ్మ (55) సోమవారం విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఒంటిమిట్ట ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. ఆయన కథనం మేరకు నల్లగొండ నరసింహారెడ్డి, కృష్ణమ్మలకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరందరికీ వివాహం కాగా కుమారులు బతుకుదెరువు నిమిత్తం కువైట్‌లో ఉన్నారు. వారి కోడళ్లు పిల్లల చదువుల నిమిత్తం కడపలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం నరసింహారెడ్డి, కృష్ణమ్మలు పోలుబుచ్చయ్యగారిపల్లిలో వారి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. నరసింహారెడ్డి తనకున్న భూములను సాగు చేసుకునేవాడు. ఇది ఇలా ఉండగా ఐదేళ్ల క్రితం నుంచి కృష్ణమ్మకు కుడివైపున తుంటి వద్ద కీళ్లు అరిగి తీవ్రమైన నడుము నొప్పి ఉంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నొప్పి తగ్గకపోవడంతో ఆమె తరచూ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఎప్పటిలాగే పొలం పనికి వెళ్లిన నరసింహారెడ్డికి తన అన్న కోడలు నల్లగొండు దేవి ఫోన్ చేసి కృష్ణమ్మ విష ద్రావణం తాగిందని తెలిపారు. వెంటనే ఆయన ఇంటికి వచ్చి ఆమెను 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కడపలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని అక్కడి డాక్టర్లు చెప్పడంతో మళ్లీ కడప రిమ్స్‌కు తీసుకురాగా అక్కడి వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి భర్త నల్లగొండ నరసింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
గడ్డివాములో మగ శిశువు లభ్యం
వీరబల్లి : మండలంలోని దిగువరాచపల్లి పంచాయతీ పెద్ద దళితవాడ సమీపంలోని గంగమ్మ గుడి దగ్గర గడ్డివాములో ఆదివారం మగ శిశువును వదిలి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో వీర నాగయ్య అనే వ్యక్తి తమ గడ్డివాము దగ్గరకు వెళ్లి గడ్డి పీకుతుండగా మగ శిశువును గుర్తించాడు. వెంటనే అతను శిశువును రాయచోటి ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలపడంతో తిరిగి తన గ్రామానికి తీసుకువచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అంగన్ వాడీ సూపర్ వైజర్ సరస్వతమ్మ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం మగశిశువును స్వాధీనం చేసుకున్న అధికారులు రాయచోటి ఐసీడీఎస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఘర్షణ కేసులో 11 మంది అరెస్ట్కేవీపల్లె : ఇరువర్గాలు ఘర్షణ పడి పరస్పరం దాడి చేసుకున్న కేసులో 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిమ్మాపురానికి చెందిన రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గొడవకు కారణమైన 11 మందిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు ఆటంకం కల్గిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతితంబళ్లపల్లె : స్థానిక మల్లయ్య కొండ కింద మద్దాతం బావి వంకలో చెట్టుకు ఉరివేసుకుని ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు.. బి.కొత్తకోట మండలం తాకట్టుమారిపల్లెకు చెందిన ఓబులేసు, నాగరత్నమ్మల కుమారుడు కిషోర్ (21) మూడు రోజులుగా కన్పించలేదని అతని కోసం పలు చోట్ల వెతికినట్లు మృతుని తండ్రి తెలిపారు. మల్లయ్యకొండ కింద మద్దాతం బావి వంకలో ఓ కానుగ చెట్టుకు యువకుడు ఉరివేసుకుని వేలాడుతున్న విషయాన్ని గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ నజీర్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఉన్న పల్సర్ ద్విచక్రవాహనం నంబర్ ఆధారంగా మృతుని చిరునామా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని ఎడమచేతిపై కోసుకున్న గాట్లు ఉండటం, వేలాడుతున్న మృతదేహం కాళ్లకు చెప్పులు అలాగే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. -
సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలి
రాయచోటి అర్బన్ : ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం రాయచోటి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లా డుతూ ప్రజలను నమ్మించి వంచించడంలో చంద్రబాబును మించిన మహా ఘనుడు మరెవరూ లేరన్నారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ఊరూరా ఊదరగొట్టి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 10 నెలలు గడుస్తున్నా హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదంటూ మండిపడ్డారు. వృద్ధాప్య పింఛన్, ఉచిత గ్యాస్ పథకాలు తప్ప మరేవీ అమలుకాకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబ శివ, శ్రీనివాసులు, సుమిత్ర, మురళి, శివరామక్రిష్ణ దేవర, జ్యోతి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల ప్రహరీ కూలి ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలు
మదనపల్లె : పాఠశాల ప్రహరీ కూలి ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడిన సంఘటన మదనపల్లెలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు.. పట్టణంలోని కోటబడి హైస్కూల్ పక్కనే ఉన్న ఇంటి గోడ ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా కూలడంతో, ఆ గోడకు ఆనుకుని ఉన్న పాఠశాల ప్రహరీ సైతం కూలింది. పక్కనే ఆడుకుంటున్న త్యాగరాజు వీధికి చెందిన విద్యార్థులు హేమ వరుణ్(12) చారుకేష్ (11)వేదాంత్(04) స్వల్పంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాఠశాలకు చేరుకుని కూలిన గోడను పరిశీలించారు. వేసవి సెలవులు కావడంతో పాఠశాలలో విద్యార్థులు ఎవరూ లేరు. ప్రమాద సమయంలో నీటి డ్రమ్ము గోడ పక్కన ఉండడం వల్ల ఆడుకుంటున్న విద్యార్థులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం చేయరాదని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ పరిష్కరిస్తామని అదనపు ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. -
సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి
రాయచోటి : ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. ప్రతి సమస్యను, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందన్నారు. కావున అధికారులందరూ ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరుశాతం పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మధుసూదనరావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్డీసీ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ -
బసినికొండలో టీడీపీ బరితెగింపు
మదనపల్లె : కూటమిప్రభుత్వ పాలనలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. మదనపల్లె పట్టణశివారు ప్రాంతాల్లో ప్రధాన రహదారికి సమీపంలో కోట్ల విలువచేసే ప్రభుత్వస్థలాలు ఉండటంతో తమ్ము ళ్ల కన్ను వీటిపై పడింది. ముఖ్యంగా బసినికొండ పంచాయతీలో టీడీపీ నాయకులు బరితెగించి ప్రభుత్వస్థలాలను ఇష్టారాజ్యంగా ఆక్రమించేస్తున్నారు. ఏకంగా సచివాలయానికి కూతవేటు దూరంలో సోమవారం ఉదయం జేసీబీతో బహిరంగ మార్కెట్లో రూ.15కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించేందుకు పూనుకున్నారు. స్థానికులు గమనించి మొదట అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడకు వెళ్లి విచారిస్తే..ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరించారు. దీంతో వారు అక్కడ నుంచి వెనుదిరగడంతో స్థానికులు మీడియాకు తెలిపారు.... ఇది ప్రభుత్వగయాళు స్థలం. దీనికి సంబంధించి మీవద్ద ఏ రికార్డులు ఉన్నాయని రిపోర్టర్లు అడిగితే..తమకేమీ తెలియదని అంతా ఎమ్మెల్యేకే తెలుసు అంటూ బుకాయించారు. దీంతో మీడియా వ్యక్తులు తహసీల్దార్ ధనంజయులు, ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు వాట్సప్‌లో ఫొటోలు పంపి, సమాచారం తెలపడంతో ఆక్రమణదారులు పనులు నిలిపివేసి మెల్లగా జారుకున్నారు. ఆరేళ్ల క్రితమే సాక్షిలో కథనం... 2019 ఫిబ్రవరిలో బసినికొండకు చెందిన టీడీపీ మైనారిటీ నాయకుడు ఎస్ఎం.రఫీ..ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బసినికొండ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్.682 గయాళుభూమిలో తప్పుడు పత్రాలతో దరఖాస్తు పట్టాలు సృష్టించి భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన సాక్షి..ఆక్రమణపై కథనం ప్రచురించడంతో ఎట్టకేలకు పనులు నిలిపివేశారు. తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అఽధికారంలోకి రావడంతో తమ ఆటలు సాగవని గుట్టుగా ఉండిపోయారు. ప్రస్తుతం మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో..ఎలాగైనా విలువైన ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించుకునేందుకు తప్పుడు పత్రాలతో తమ్ముళ్లు సిద్ధమైపోయారు. దీనిపై తహసీల్దార్ ధనంజయులు వివరణ ఇస్తూ..సమాచారం తెలిసిన వెంటనే పనులు నిలిపివేయించామన్నారు. ఆక్రమణదారులు చూపిస్తున్న దరఖాస్తు పట్టాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని తెలిపారు. 15కోట్ల విలువైన ప్రభుత్వస్థలం ఆక్రమణకు సన్నాహాలు పట్టపగలే జేసీబీతో చదునుపనులు ఎమ్మెల్యే చెప్పాడంటూ అధికారులకు బెదిరింపులు -
దరఖాస్తు చేసుకోండి
రాయచోటి టౌన్ : ఉమ్మడి కడప జిల్లాలోని మైనార్టీలు, క్రిస్టియన్లు సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తుచేసుకోవాలని మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వి. బ్రహ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు 50శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు http:// apobmms.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9290448452 /08562–241137 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. రేపు ఉద్యోగ మేళా రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా ఉపాధి కార్యాలయం వారి ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన పీలేరులోని ఎస్జీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రముఖ కంపెనీలతో ఉద్యోగమేళా జరగనుంది. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పనా అధికారి సురేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు కంపెనీల్లో పనిచేసేందుకు ఆసక్తి గల యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్ చదివి 18–35 సంవత్సరాలు కలిగి ఉండాలని తెలిపారు. వైభవంగా పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటి భధ్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి మూల విరాట్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఉత్సవ మూర్తులను వివిధరకాల పూలు, పట్ట వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు.ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డివి రమణారెడ్డి, స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. నూతన నియామకం రాజంపేట : రిప్లబికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షునిగా చౌడవరం సుబ్బనరసయ్య నియమితులయ్యారు. ఈమేరకు ఆర్పీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.వెంకటస్వామి ఉత్తర్వులను విడుదల చేశారు. కేంద్రమంత్రి (సామాజికన్యాయం, సాధికారిత) రాందాస్ అత్వాలే ఆదేశాల మేరకు రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం బొమ్మవరానికి చెందిన సుబ్బనర సయ్యను జిల్లా అధ్యక్షునిగా నియమించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ వీరబల్లి : మండలంలో తాటిగుంటపల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగాయంటూ పంచాయతీలోని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచ్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సోమవారం జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి (డీపీఓ) ఖాదర్‌వల్లి విచారణ జరిపారు. ఫిర్యాదుదారులను సచివాలయానికి పిలిపించి వారి సమక్షంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నిధుల దుర్వినియోగానికి సంబంధించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపినాథ్‌రెడ్డి, ఈఓపీఆర్డీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైవీయూ డిగ్రీ పరీక్షలు షురూ కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ,బీకాం, బ్యాచిరల్ ఆఫ్ వొకేషనల్ 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు 80 కళాశాల నుంచి 55 కేంద్రాల్లో 25,892 మంది విద్యార్థులు రాస్తున్నారు. కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల, స్పిరిట్స్ డిగ్రీ కళాశాల కేంద్రాలను విశ్యవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాస రావు , వైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వి కృష్ణారావు మాట్లాడుతూ పరీక్షలు మే 24వ తేదీ వరకు ఉంటాయన్నారు. -
కడప డీసీసీబీ చైర్మన్‌గా సూర్యనారాయణరెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప : కడప డీసీసీబ్యాంకు చైర్మన్‌గా అట్లూరు మండలానికి చెందిన ఎం సూర్యనారాయణరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేమలూరు గ్రామానికి చెందిన ఆయన కాంట్రాక్టర్‌గా బెంగళూరులో స్థిరపడ్డారు. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి పోయే సూర్యనారాయణరెడ్డిని డీసీసీబ్యాంకు చైర్మన్‌గిరి వరించింది. కడప పార్లమెంట్ పరిధిలో డీసీసీబీ చైర్మన్ రెడ్డి సామాజిక వర్గానికి, రాజంపేట పార్లమెంటు పరిధిలో డీసీఎంఎస్ చైర్మన్ కాపు సామాజిక వర్గం ద్వారా నియమించాలనే దిశగా సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డీసీఎంఎస్ చైర్ పర్సన్‌గా రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన జయప్రకాష్‌ను నియమించారు. చక్రం తిప్పుతున్న వాసు... తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చక్రం తిప్పుతున్నారు. సూర్యనారాయణరెడ్డికి డీసీసీబీ చైర్మన్ ఎంపిక కావడం వెనుక తెరవెనుక ప్రోత్సాహం అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బద్వేల్‌పై కన్నెసి ఉంచిన ఆయన టీడీపీ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డికి చాపకింద నీరులా వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. అవకాశం వస్తే ఒక్కమారుగా రితేష్‌రెడ్డి వ్యతిరేకులంతా శ్రీనివాసులరెడ్డి చెంతన చేరిపోయేలా పథక రచన చేస్తున్నట్లు సమాచారం. పార్టీకి చేసిన సేవా, సమర్థత కంటే ఆర్థిక బలం ఉన్న సూర్యనారాయణరెడ్డి లాంటి వారిని చేరదీస్తున్నట్లు పలువురు వివరిస్తున్నారు. దూరదృష్టితో ప్రతి సందర్భంలోనూ వ్యవహారం తనకు అనువుగా మల్చుకుంటున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచడమే... తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు అధినేత చంద్రబాబు ఎగనామం పెట్టారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందనుకున్న వారికి నిరాశే ఎదురైంది. ఎన్నికల సమయంలో మాత్రమే కన్పించే సూర్యనారాయణరెడ్డి లాంటి వారికి డీసీసీబీ చైర్మన్‌గిరి లభించింది. వేమలూరు గ్రామం మినహా మండల స్థాయిలో కూడా ఇప్పటికీ రాజకీయాలు నెరపని సూర్యనారాయణరెడ్డికి పదవి లభించడం వెనుక ఆర్థిక స్థోమత మాత్రమే గుర్తించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా జీవితాంతం టీడీపీ జెండా మోస్తూ వచ్చిన నేతలను కనీస పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. డబ్బున్న నేతల్ని ఎంచుకొని నామినేటెడ్ పదవులు అప్పగిస్తున్నారు. పార్టీనే నమ్ముకొని అంటిపెట్టుకొని వస్తున్న సింగారెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, హరిప్రసాద్, అమీర్‌బాబు లాంటి నేతలు జిల్లా కేంద్రంలో అర్హులుగా ఉన్నప్పటికీ కనీస పరిగణలోకి తీసుకోలేదని పలువురు వివరిస్తున్నారు. ఎన్ని కష్టాలు..నష్టాలు ఎదురైనా జమ్మలమడుగు నుంచి జంబాపురం రమణారెడ్డి, ప్రొద్దుటూరు నుంచి ఈవీ సుధాకరరెడ్డి, పులివెందుల నుంచి పేర్ల పార్థసారధిరెడ్డిలాంటి వారు అర్హులైనప్పటికీ వారిని పరిగణలోకి తీసుకోకపోవడంపై పలువురు టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. కాంట్రాక్టర్‌గా బెంగుళూరులో స్థిరపడ్డ నేతకు దక్కిన పదవి జిల్లాలో టీడీపీ జెండా మోసిన నాయకులకు గుండు సున్నా ఆవిర్భావం నుంచి పార్టీ అంటిపెట్టుకొని ఉన్న నేతలు విస్మయం డీసీఎంఎస్ చైర్మన్‌గా జయప్రకాష్ -
కస్తూర్బా బాలిక.. విజయగీతిక
మదనపల్లె సిటీ : జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కస్తూర్బాగాంధీ విద్యాలయల (కేజీబీవీ) బాలికలు సత్తా చాటారు. జిల్లాలో 22 కేజీబీవీలు ఉండగా వాటిలో 798 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. వారిలో 631 మంది పాసై 79 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుల్లో రాణించారు. తమ కుటుంబాల నేపథ్యాలను గుర్తెరిగి మంచి ఫలితాలతో అందరి మన్ననలు పొందుతున్నారు. నేరవేరుతున్న వైఎస్సార్ కల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం నిజమవుతోంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన, ఆర్థిక స్థోమత లేకుండా, పేదరికంలో ఉండి చదవాలనే ఆసక్తి ఉన్నా... పరిస్థితులు అనుకూలించని ఎంతో మంది నిరుపేద బాలికలు చదువుకోవాలనే లక్ష్యం ఫలిస్తోంది. నేడు ఎంతో మంది విద్యార్థుఽలు బాగా చదివి... విద్యావంతులై భళా అనిపిస్తున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కేజీబీవీలను ఏర్పాటు చేశారు. వాటిలో ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంగ్లీషుమీడియంలో బోధన, అత్యంత భద్రతతో కూడిన వసతి సదుపాయాలు కలిగి బాలికలు విద్యావంతులుగా తయారవుతున్నారు. ఈ విద్యాలయాల్లో సాధారణ విద్యతో పాటు ఆంగ్లమాధ్యమం,యోగా, వృత్తి విద్యా కోర్సుల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి బాలికలకు చదువుతో పాటు బతుకు దెరువుకు భరసా కల్పిస్తున్నాయి. వై.ఎస్.జగనన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజీబీవీలకు లక్షలు ఖర్చు చేసి మరిన్ని వసతులు, సౌకర్యాలు కల్పించారు. పదో తరగతి తర్వాత వారు డ్రాపౌట్స్‌గా మారేందుకు వీలులేకుండా కేజీబీవీలలో ఇంటర్ విద్యను కూడా ప్రవేశపెట్టి మరో అడుగు ముందుకు వేశారు. ఇతర కేజీబీవీల్లో ఫలితాలు.. బి.కొత్తకోట కేజీబీవీలో ఎస్.ఫహీనాజుమ్ 544 మార్కులు, వగళ్ల కేజీబీవీలో వై.రేఖ 548, కలకడ కేజీబీవీకి చెందిన ఎం.జయంతి 516, ములకలచెరువు కేజీబీవీకి చెందిన స్నేహలత 488, నిమ్మనపల్లె కేజీబీవీలో వి.తేజస్విని 535, పెద్దమండ్యం కేజీబీవీలో ఎం.మౌనిక 525, పీటీఎం కేజీబీవీలో ఎ.స్నేహలత 459, రామసముద్రం కేజీబీవీలో పుష్పావతి 520, చిట్వేలి కేజీబీవీకి చెందిన హరిత 480, గాలివీడు కేజీబీవీలో డి.ప్రీతి 465, లక్కిరెడ్డిపల్లె కేజీబీవీకి చెందిన పి.కావ్యశ్రీ 480, పెనగలూరు కేజీబీవీలో ఎం.కవిత 515, పుల్లంపేట కేజీబీవీలో పల్లవి 547, రామాపురం కేజీబీవీలో ఆశ 549, రాయచోటి కేజీబీవీకి చెందిన సాయిశ్రీ 539, వీరబల్లి కేజీబీవీల్లో యమున 545 మార్కులు సాధించి ఆయా పాఠశాలల్లో టాపర్స్‌గా నిలిచారు. నేటి నుంచి రెమిడియల్ తరగతులు: జిల్లాలో మూడు సెంటర్లలో రెమిడియల్ తరగతులు సోమవారం నిర్వహిస్తున్నట్లు జీసీడిఓ మధుమతి తెలిపారు. రాయచోటి ప్రాంతానికి గాలివీడు కేజీబీవీ, మదనపల్లె ప్రాంతానికి బి.కొత్తకోట కేజీబీవీ, రాజంపేట ప్రాంతానికి పెనగలూరు కేజీబీవీలో రెమియల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయం నిజమవుతోంది. ఏ ఽఆధారం లేని బాలికల చదువు కోసం ఆయన సీఎంగా ఉన్నప్పుడు కస్తూర్బాగాంధీ విద్యాలయాలు(కేజీబీవీలు) నెలకొల్పారు. వైఎస్సార్ తనయుడు మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో కేజీబీవీలకు కార్పొరేట్ హంగులు సమకూర్చారు. వాటిలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఈ విద్యాలయాలు ఫలితాల్లో సత్తా చాటుతున్నాయి. ఇంటర్, పదో తరగతి ఫలితాల్లో తిరుగులేని ఆధిపత్యం చూపి భేష్ అనిపించుకున్నాయి. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ 79 శాతం ఉత్తీర్ణత ప్రథమ స్థానం విద్యార్థినికి 572 మార్కులు సంతృప్తికర ఫలితాలు కేజీబీవీల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. 22 కేజీబీవీలో 79 శాతం ఉత్తీరణ సా ధించాం. చాలా మంది విద్యార్థులకు 500 మార్కులుపైగా వచ్చాయి. ఫలితాల పరంగా సంతోషంగా ఉంది. – సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖ అధికారి. నిత్యం పర్యవేక్షణ జిల్లాలోని కలెక్టర్, డీఈఓల సూచనలు, సలహాలు పాటిస్తూ కేజీబీవీలను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. స్టడీ అవర్స్, వారాంతం పరీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మార్కుల సాధనపై దృష్టి పెట్టాం. తక్కువ మార్కులు వచ్చే వారి పట్ల ప్రిన్సిపాళ్లతో ప్రత్యే శ్రద్ధ తీసుకున్నాం. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించాం. – మధుమతి, జీసీడీఓ, సమగ్రశిక్ష -
అతివేగం తెచ్చిన అనర్థం
రైల్వేకోడూరు అర్బన్/నందలూరు: రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజుపేట గుండాలేరు బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున నందలూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఆటోను అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయిన లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఆటో నుజ్జు నుజ్జయింది.నందలూరుకు చెందిన పి.జహరాబీ (60), పి.సుహేల్ఖాన్ (15)లు అక్కడికక్కడే మృతి చెందారు.ఆటోలో ఉన్న రహీముల్లా, ఫరిహానా, సుహానాఖాన్, షాహీదా, అబ్దుల్లాలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరుపతిలో నివాసముంటున్న రహీముల్లా నందలూరులోని అత్తగారి ఇంటికి వచ్చాడు. ఒక రోజు ఉండి వేసవి సెలవులు కావడంతో బంధువులను తిరుపతిలోని తన ఇంటికి ఆటోలో తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో అనంతరాజుపేట వద్ద రాజంపేట వైపు వెళుతున్న టీఎన్88ఎల్807 నంబర్ గల లారీ ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ రఘురామన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్‌బాబు తెలిపారు. ఆటోను ఢీకొన్న లారీ ఇద్దరు మృతి : అయిదుగురికి గాయాలు -
జెండా దిమ్మె ఏర్పాటుపై కార్మిక సంఘాల గొడవ
మదనపల్లె : మేడే సందర్భంగా జెండా ఎగుర వేసేందుకు దిమ్మె ఏర్పాటు విషయం రెండు యూనియన్ల మధ్య వివాదానికి కారణమైంది. మున్సిపాలిటీలో ఇతర యూనియన్ల జెండా దిమ్మె ఏర్పాటును అంగీకరించేది లేదంటూ ఏఐటీయూసీ నాయకులు అడ్డుకుంటే, ఎలాగైనా జెండా దిమ్మె ఏర్పాటుచేసి తీరుతామంటూ సీఐటీయూ నాయకులు పంతానికి దిగారు. చివరకు రెండు యూనియన్ల మధ్య జెండా దిమ్మె ఏర్పాటుపై మొదలైన వివాదం చిలికి, చిలికి గాలివానగా మారి ఒక వర్గంపై మరొకరు దాడులు చేసుకుని పోలీసు కేసులు పెట్టుకునేంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకుని ఆదివారం మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేరని, సోమవారం కమిషనర్ సూచనలతో ఏర్పాటు చేసుకోవాలని సర్దిచెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. మదనపల్లె మున్సిపాలిటీలో చాలాకాలంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మాత్రమే కార్మిక సంఘం ఉండేది. కొద్దిరోజుల క్రితం ఏఐటీయూసీ నాయకుల ఆధిపత్యం భరించలేక, కార్మికుల్లో కొందరు విడిపోయి సీఐటీయూ యూనియన్‌లో చేరారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య చిన్న చిన్న వివాదాలు జరుగుతుండేవి. ఒక యూనియన్‌లో నుంచి మరో యూనియన్‌లో చేరాల్సిందిగా కార్మికులపై ఒత్తిడి తెచ్చేవారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం సీఐటీయూలోకి వెళ్లిన ఇద్దరు పర్మినెంట్, ఇద్దరు ఆప్కాస్ కార్మికులను ఏఐటీయూసీలోకి చేర్చుకున్నారు. ఇదిలాఉంటే.. మే1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా.. మున్సిపల్ కార్యాలయ ప్రహరీకి ఆనుకుని జెండా దిమ్మె ఏర్పాటు చేసుకునేందుకు సీఐటీయూ నాయకులు సామగ్రి తరలించారు. విషయం తెలుసుకున్న ఏఐటీయూసీ నాయకులు నాగరాజు, సురేష్, ముబారక్, సాంబశివ, పృథ్వీరాజ్, అశోక్, ఓబులేసు తదితరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సీఐటీయూ అనుబంధసంఘం కోశాధికారి రామకృష్ణ, ఏఐటీయూసీ నాయకులు ఓబులేసు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వన్‌టౌన్ ఎస్ఐ శివకుమార్ ఘటనాస్థలానికి చేరుకుని, రెండు యూనియన్ నాయకులతో సంప్రదింపులు జరిపారు. సోమవారం మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదించి జెండా ఏర్పాటుచేసుకోవాలని, అంతవరకు ఎవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దన్నారు. -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
రాజంపేట : పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో మన్నూరు అరుంధతీవాడకు చెందిన ఎం.రమణయ్య(68) ఆదివారం వడ దెబ్బతో మృతి చెందారు. భవన నిర్మాణ కార్మికునిగా పనిచేసేవాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదర్శ పాఠశాలలో సీసీ కెమెరాల చోరీకలకడ : మండలంలోని గుర్రంకొండ రోడ్డు మార్గం పక్కన ఉన్న కలకడ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను దుండగులు చోరీ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మల్లంగ్షావలీ తెలిపారు. వాచ్మెన్ రామాంజులు రాత్రి భోజనానికి ఇంటికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు 2 సీసీ కెమెరాలను చోరీ చేశారన్నారు. నీరు విడుదల చేసిన మంత్రిచిన్నమండెం : రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆయన సతీమణి హరితతో కలిసి చిన్నమండెం మండలం బోనమల నాగూరువాండ్లపల్లె, బోనమల దళితవాడకు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. బోనమల గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. కురబలకోటలో చోరీ కురబలకోట : కురబలకోట జెడ్పీ హైస్కూల్ సమీపంలో కువైట్ మస్తాన్ ఇంటిలో ఆదివారం చోరీ జరిగింది. ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్‌కు అందిన ఫిర్యాదు మేరకు.. కురబలకోట మస్తాన్ స్థానిక జెడ్పీ హైస్కూల్ సమీపంలో కొత్తగా కట్టిన ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అనారోగ్యం కారణంగా తిరుపతి ఆసుపత్రికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి ఇంట్లో బీరువా చూస్తే బంగారం, కువైట్‌కు చెందిన కరెన్సీ కన్పించలేదు. దీంతో బాధితుడు అదే రోజు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 600 గ్రాముల బంగారంతో పాటు దుబాయ్‌కు చెందిన కరెన్సీ పోయినట్లు బాధితుడు తెలిపాడు. చోరీ ఘటనలో తెలిసిన వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల్లో కేసును ఛేదిస్తామని ఎస్ఐ తెలిపారు. మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జలాశయంలో ఈతకు వెళ్లి వ్యక్తి దుర్మరణం మైలవరం : వేముల మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం (53) అనే వ్యక్తి మైలవరం జలాశయంలో ఈతకు వెళ్లి ఆదివారం సాయంత్రం దుర్మరణం చెందాడు. మైలవరం పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములకు చెందిన షేక్ ఇబ్రహీం జమ్మలమడుగు పట్టణంలో జరిగే హజరత్ సయ్యద్ షా గూడుమస్తాన్ వలీ ఉరుసు ఉత్సవానికి వేముల నుంచి శనివారం గూడెంచెరువు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం మైలవరం మండలంలోని గైబుసా స్వామి కొండకు వెళ్లి అక్కడ చదివింపులు చేసుకుని మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులతో కలసి మైలవరం జలాశయానికి వచ్చాడు. జలాశయంలో ఈతకు వెళ్లి అక్కడి మట్టిలో కూరుకుపోయి మృతి చెందాడు. -
లారీ డ్రైవర్ల సమస్యను పరిష్కరించండి
ఓబులవారిపల్లె : మంగంపేట ఏపీఎండీసీలో లారీ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీఎండీసీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ అనుబంధ సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏపీఎండీసీ బైరెటీస్ ప్రాజెక్టులో డిస్పాచ్‌లో 400 మందికి పైగా డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం మంచినీరు కూడా డ్రైవర్లకు ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి నాగిపోగు పెంచలయ్య, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, డ్రైవర్ల సంఘం యూనియన్ నాయకులు నాగార్జున, మహేంద్ర, సుబ్రమణ్యం, సీఐటీయూ నాయకుడు సిహెచ్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
సింహ వాహనంపై వైద్యనాథేశ్వరుడు
వల్లూరు : పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ కామాక్షీ వైద్య నాథేశ్వర స్వామి సింహ వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ వైద్యనాథస్వామి ఆలయంలో అర్చకులు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ కామాక్షీ అమ్మవారికి, శ్రీ చక్రానికి కుంకుమార్ఛన చేశారు. రాత్రి మంగళ వాయిద్యాలు, దివిటీల వెలుగుల మధ్య స్వామి వారి గ్రామోత్సవాన్ని పుష్పగిరి మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు. ● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆల యంలో స్వామివారికి అభిషేకాలు, తోమాల సేవను నిర్వహించారు. శ్రీ లక్షీదేవికి అర్చనలు జరిపారు. యాగశాలార్చన, చతుస్థానార్చన, నిత్య హోమము, బలిహరణ కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం సాయంత్రం వివిధ హోమాలను నిర్వహించారు. రాత్రి హంస వాహనం అధిష్టించిన చెన్న కేశవ స్వామి వారిని కొండపై నుండి పెన్నా నది మీదుగా దివిటీల వెలుగులో గ్రామంలోకి తీసుకుని వచ్చి పుష్పగిరి గ్రామ మాడ వీధులలో మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు కాయ, కర్పూరాలను భక్తితో సమర్పించారు. -
హరి హర అభేద క్షేత్రం పుష్పగిరి
వల్లూరు : జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రాలలో పుష్పగిరి ఒకటి. వల్లూరు మండలంలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరునికి, విష్ణు స్వరూపుడైన చెన్న కేశవునికి నిలయమైన ఈ క్షేత్రం హరి హర క్షేత్రమై శివ కేశవుల మధ్య అభేదానికి ప్రతీకగా నిలుస్తోంది. భాస్కర క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన పుష్పగిరిలోని వైద్యనాథ స్వామి ఆలయాన్ని చోళుల కాలంలోను, చెన్నకేశవ స్వామి ఆలయాన్ని చాళుక్యుల కాలంలోనూ నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. శివ కేశవులకు 9 రోజులపాటు బ్రహ్మోత్సవాలు.. సాధారణంగా శైవ క్షేత్రాలలో ఐదు రోజులు , విష్ణు క్షేత్రాలలో తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం పరిపాటి. కానీ పుష్పగిరిలో శివ కేశవులిద్దరికీ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి కార్యక్రమంలోనూ సాక్షాత్తూ శ్రీరామ చంద్రునిచే పూజలందుకున్న శ్రీ కామాక్షీ వైద్యనాఽథ స్వామికి ముందుగా పూజలు నిర్వహించి, అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవునికి పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజూ రాత్రి మొదట వైద్యనాథస్వామికి, అనంతరం శ్రీ చెన్న కేశవ స్వామికి వాహన సేవలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో 29 వ తేదీన జరిగే చందనోత్సవానికి, 30 న అక్షయ తదియలో భాగంగా జరిగే గరుడవాహన సేవకు, మే 1 న జరిగే రెండు కల్యాణోత్సవాలకు, 2 న జరిగే రెండు రథోత్సవాలకు, బ్రహ్మోత్సవాల ముగింపు రోజైన 4 వ తేదీన జరిగే చక్రస్నానం, పుష్పయాగాలకు అత్యంత పాధాన్యత ఉంది. భారీ సంఖ్యలో భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారు.ఈ నెల 29న చందనోత్సవం, 30న అక్షయ తదియ , మే 1 న కల్యాణోత్సవాలు, 2 న రథోత్సవాలు, 4 న చక్రస్నానం, పుష్పయాగం -
వైఎస్.షర్మిలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి
మదనపల్లె : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు ఆదివారం మదనపల్లె వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విజయవాడలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్.షర్మిల మాట్లాడుతూ దేశంలో ఇంటర్నల్ టెర్రరిజాన్ని బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రోత్సహిస్తున్నారని, మోదీ టెర్రరిస్ట్ అంటూ మాట్లాడారన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే విధంగా ఉన్నాయని, ఆమైపె దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుచేసిన వారిలో బీజేపీ నాయకులు బండి ఆనంద్, భగవాన్, జర్మనీ రాజు, కిరణ్ కుమార్, నాగరాజు, వెంకటరాజు, సాయిప్రసాద్, శ్రీకాంత్, పిల్లస్వామి నాయక్, మధుసూధన్‌రావు, శరత్ ఉన్నారు. కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలుమదనపల్లె : కారు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కళత్తూరు పంచాయతీ గళ్లవారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు జ్యోతీష్ (25) మదనపల్లెలోని ఓ హోటల్లో కిచెన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. సొంత పనులపై స్వగ్రామానికి వెళ్లి తిరిగి ఆదివారం ద్విచక్రవాహంలో వస్తుండగా మార్గమధ్యంలోని ముత్తుకూరు క్రాస్ వద్ద పుంగనూరు నుంచి చిత్తూరు వైపు వెళుతున్న కారు ఢీకొంది. ప్రమాదంలో జ్యోతీష్ తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. సంబంధింత పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉస్మాన్ నగర్లో రౌడీల వీరంగంరాజంపేట : పట్టణంలోని ఉస్మాన్ నగర్లో శనివారం రాత్రి కొంతమంది రౌడీలు వీరంగం సృష్టించారు. రౌడీల దాడిలో గాయపడిన వెంకటరమణ, కొడుకు రెడ్డయ్యలను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సీసీ కెమెరా ల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. రౌడీ మూకలు సీసీ కెమెరాలు పగులగొట్టారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజా తెలిపారు. -
బరువెక్కిన గుండెతో అంత్యక్రియలు
ములకలచెరువు : చెరువులో మునిగి మృతి చెందిన ముగ్గురి అంత్యక్రియలు ఆదివారం ములకలచెరువులో బరువెక్కిన హృదయాలతో జరిగాయి. ఇద్దరు చిన్నారులకు తోడుగా వచ్చి మృతి చెందిన మరో చిన్నారి నందిత అంత్యక్రియలు కర్నాటక రాష్ట్రం కై వరమ్ క్రాస్‌లో జరిగాయి. నీళ్లలోకి దిగి నలుగురు మృత్యువాత పడిన విషయం విదితమే. ములకలచెరువులో జరిగిన ముగ్గురి అంత్యక్రియలకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి హాజరయ్యారు. మృతులకు నివాళులు అర్పించారు. నలుగురికి రూ. 1.75 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కూడా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మాధవరెడ్డి, నాయకులు అన్సర్‌బాషా, సిద్దారెడ్డి, చాంద్‌బాషా, రెడ్డెప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అడవికి నిప్పు పెట్టిన ఆకతాయిలు
సిద్దవటం : సిద్దవటం రేంజి పరిధిలోని మద్దూరు, సిద్దవటం బీట్లలో ఆకతాయిలు శనివారం సాయంత్రం అడవికి నిప్పు పెట్టారు. అటవీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారని రేంజర్ కళావతి తెలిపారు. సిద్దవటంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ ఫారెస్టు రేంజి పరిధిలోని మద్దూరు, సిద్దవటం బీట్లలో ఆకతాయిలు కొండకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసి పడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. అటవీ సిబ్బంది అప్రమత్తమై మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. అటవీ ప్రాంతం పచ్చదనంతో ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఓబులేస్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సురేష్‌బాబు, ఎఫ్‌బీఓలు పెంచల్‌రెడ్డి, దీపిక, మధు, ఆది విశ్వనాథ్, ఏబీఓలు హైమావతి, నారాయణరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
మంగంపేట బైరెటీస్ గనులు తాకట్టు
రైల్వేకోడూరు అర్బన్ : మంగంపేట బైరెటీస్ గనులను ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 9 వేల కోట్ల అప్పు కోసం తాకట్టుపెట్టి ఇక్కడి ఖనిజ సంపదపై ప్రైవేటు వారికి హక్కు కల్పించి రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజలకు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగంపేట గనులు కోడూరు ప్రజల ఆస్తి అని వాటి జోలికి వస్తే ఒక ఇంచ్ కూడా తీసుకోలేరని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన మేధావులు అని చెప్పుకునే కూటమి నాయకులు ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. మంగంపేట గనులపై ప్రభుత్వం పెత్తనం చెలాయించి అప్పులు చేస్తే తీవ్ర ప్రజా ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ విజేత అన్నమయ్య జట్టు
మదనపల్లె సిటీ : స్థానిక నిమ్మనపల్లె రోడ్డులోని వశిష్ట పాఠశాలలో ఆదివారం జరిగిన 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల,బాలికల షూటింగ్‌బాల్ పోటీల్లో అన్నమయ్య జిల్లా బాల,బాలికల జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. గెలుపు, ఓటములు సహజమని ఓడినా, గెలిచినా సమానంగా తీసుకోవాలన్నారు. తమిళనాడులో జరగబోయే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు అన్ని జిల్లాల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నామని రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుశురాముడు తెలిపారు. పోటీల నిర్వాహకులు నరేష్‌బాబు, గోల్డెన్‌వ్యాలీ రమణారెడ్డి, అనిల్ కుమార్‌రెడ్డి, పీడీలు గురు, బాలాజీ, గురుభాస్కర్, అంజనప్ప, భారతి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. బాలికల విభాగంలో ప్రథమ స్థానం అన్నమయ్య జిల్లా, ద్వితీయ స్థానం చిత్తూరు జిల్లా, తృతీయ స్థానం తిరుపతి జిల్లా, నాలుగో స్థానంలో కర్నూలు జిల్లా జట్టు నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానం అన్నమయ్య జిల్లా, ద్వితీయ స్థానం ఏలూరు జిల్లా, తృతీయస్థానం చిత్తూరు జిల్లా, నాలుగో స్థానం సత్యసాయి జిల్లా జట్లు సాధించాయి. -
పశువులకు తప్పని ఇబ్బందులు
వైఎస్ జగన్ హయాంలో రైతులకు వరంగా ఉన్న పశు ఆరోగ్య సంచార వాహనాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ కారణంగా పశు వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో పశువుల వద్దకే వచ్చి సేవలు అందించేవారు. ముఖ్యంగా పశువైద్య శాలలు అందుబాటులో లేని ప్రాంతాలకు వరంగా ఉండేవి. టోల్ ఫ్రీ నంబరు ఉండేది. మారుమూల గ్రామలకు వెళ్లి తగిన సేవలు చేస్తూ వచ్చారు. ఉన్నట్టుండి సంచార వాహనాలను నిలిపి వేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. – మొలక గోపాల్ రెడ్డి, పాడి ఆవుల రైతు, మొలకవారిపల్లె, కురబలకోట మండలం మే 1 నుంచి అందుబాటులోకి వాహనాలు జిల్లాలో ప్రస్తుతం ఫిబ్రవరి 1 నుంచి ఆగిపోయిన ఆరు పశు సంచార వాహనాలను మే నెల 1వ తేదీ నుంచి నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రస్తుతం కాంట్రాక్టు కుదిరింది. ఈ నేపథ్యంలో మేనెల నుంచి వీటిని నడిపేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతానికి ఏడు వాహనాలతో జిల్లాలో వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. మిగిలినవి కూడా అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తాం. – గుణశేఖర్ పిళ్లై, జిల్లా పశుసంవర్దకశాఖ అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమా న్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లోనూ ప్రజలు ఫిర్యాదులను అందజేయొచ్చని వివరించారు. 14 నుంచి బ్రహ్మోత్సవాలు రాజంపేట రూరల్: శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను మే 10వ తేది నుంచి 14వ తేది వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారుడు పసుపులేటి వీరప్రదీప్కుమార్ తెలిపారు. మండల పరిధిలోని భువనగిరిపల్లి వద్ద నున్న లక్ష్మనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం బ్రహ్మోత్సవాల పోస్టర్లను, లగ్నపత్రికలను ఆలయ ధర్మకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13వ తేది కన్నుల పండువగా కల్యాణం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని భక్తులు, మహిళలు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని కోరారు. 11న దూదేకుల విద్యార్థులకు పురస్కారం కడప వైఎస్ఆర్ సర్కిల్: పదో తరగతి, ఇంటర్మీ డియెట్‌లో అత్యధిక మార్కులు సాధించిన దూదేకుల విద్యార్థులకు మే 11న నగరంలోని ఎర్రముక్కపల్లె దూదేకుల జిల్లా భవన్లో ప్రతిభా పురష్కారాలు అందజేస్తున్నట్లు ఏపీ నూర్ బాషా దూదేకుల, బీసీ, ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గగ్గుటూరి చిన్న రాజా పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని దూదేకుల సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంఘంతోపాటు కడప నూర్ భాష దూదేకుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్లో 950, పదో తరగతిలో 560కు పైగా మార్కులు సాధించిన వారు మే 9 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9440677839, 9441276127, 7780441172, 9951667362 అనే ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకేసుల బాషా, నాయకులు ఖాదరయ్య, ఓబులేసు, కమాల్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
మూగజీవాలకు శాపం!
సర్కారు నిర్లక్ష్యం.. సాక్షి రాయచోటి: కూటమి సర్కార్ మూగ జీవులపైనా తన ప్రతాపం చూపిస్తోంది. సంచార పశువైద్య వాహనాలను మూలకు నెట్టి వైద్య సేవలను అటకెక్కించింది. ఫలితంగా సమయానికి వైద్యం అందక మూగ జీవాలు అలమటిస్తున్నాయి. మూగజీవాలకూ అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా గత వైఎస్సార్సీపీ సర్కార్ ప్రణాళిక అమలు చేసింది. 2022 మే 19వ తేదీన సంచార పశు వైద్య వాహనాలకు శ్రీకారం చుట్టింది. మహోన్నత ఆశయంతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచార వాహనాలతో ఉత్తమ వైద్యానికి చర్యలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనాన్ని కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కడైతే పశువుకు బాగాలేదో ఆ ఇంటి వద్దనే వైద్యం అందించాలని సంచార పశు వైద్య వాహనాన్ని అప్పగించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలందిస్తున్న సంచార పశు వైద్య వాహనాలను ప్రస్తుత కూటమి సర్కార్ పట్టించుకోవడం మానేసింది. ఫలితంగా రెండు నెలలుగా వాహనాలు మూలకు చేరా యి. కాంట్రాక్టు గడువు ముగియడంతో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు వీటిని నిలిపివేశారు. ప్రస్తుతానికి జిల్లా అంతటా ఏడు వాహనాలతో అరకొర వైద్య సేవలు అందుతున్నాయి. పశు యజమానులకు కష్టకాలం జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్లు, గేదెలు, ఆవులు, ఎద్దులు, ఇతర పెంపుడు జంతువులు ఉన్నాయి. సంచార పశు వైద్య వాహనం ద్వారా ఎక్కడికక్కడ సమస్య ఉన్నచోటనే..జంతువును వాహనంలోకి హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఎక్కించి అక్కడే అన్ని పరీక్షలు చేసేవారు. పశువుల సంరక్షణ కోసం 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తోపాటు ఆటోగ్లేవ్ ప్రయోగశాలను కూడా సంచార వాహనంలో అందుబాటులో ఉంచారు. హైడ్రాలిక్ లిఫ్ట్ సిస్టమ్ ఉండడంతో ఆవు, గేదె వాహనంలోకి సులువుగా ఎక్కించేందుకు వీలు ఉండేది. అత్యున్నత టెక్నాలజీతో వాహనాన్ని తీర్చిదిద్దారు. అయితే దీనికి 108, 104 తరహాలోనే ఒక నంబరును కేటాయించి ఫోన్ చేయగానే గ్రామాలకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో అరకొర వాహనాలతో తూతూ మంత్రంగా వైద్యసేవలందుతున్నాయి. గ్రామీణ ప్రాంత పశువులకు, ఇతర జంతువులకు ఉపయోగపడే ఈ పథకంపై ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యం చూపడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంచార పశు వైద్య వాహనాల కాంట్రాక్టు పొడిగించడంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అంతుచిక్కడం లేదని పలు వురు పశువుల యజమానులు ప్రశ్నిస్తున్నారు. సంచార పశు వైద్య సేవ వాహనాలకు గడువు ముగిసినా పట్టించుకోని ప్రభుత్వం పల్లెల్లో కరువవుతున్న పశువైద్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పశు యజమానులు -
జీడీఎస్‌ల సంక్షేమమే లక్ష్యం
రాయచోటి జగదాంబసెంటర్: తపాలా శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్) శ్రేయస్సే ముఖ్యమని భారతీయ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రామిరెడ్డి అన్నారు. రాయచోటి పట్టణం ప్రజా చైతన్య సేవా సంఘం కార్యాలయంలో ఆదివారం జీడీఎస్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ డాక్ సేవక్‌లు ఎదుర్కొంటున్న సమస్యలు డిపార్ట్మెంట్ టార్గెట్లు తదితర అంశాలపై చర్చించారు. జీడీఎస్‌లు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా కొన్ని పథకాలకు ఇన్సెంటివ్ ఇస్తూ పనిభారం లెక్కించడం లేదన్నారు. త్వరలో పోస్టల్ శాఖలో వినూత్న మార్పులు వస్తున్నాయని తెలిపారు. అవటాల చెన్నారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్రాంచ్ పోస్టాఫీస్‌లకు 63 కుర్చీలు సభ్యులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో బీటీ పల్లి, రామాపురం, వీరబల్లి, మాసాపేట, రాయచోటి, సంబేపల్లె, చిన్నమండెం సబ్ పోస్టాఫీస్ పరిధిలోని జీడీఎస్‌లు పాల్గొన్నారు. -
శ్రీ భద్రకాళీ సమేతుడికి పల్లకి సేవ
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడికి అమావాస్య పల్లకీ సేవ నిర్వహించారు. ఆదివారం అమావాస్య కావడంతో రాత్రి మూల విరాట్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు అభిషేకాలు చేశారు. రంగు రంగుల పూలు, పట్ట వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.ఆలయ ఈవో డీవీ రమణారెడ్డిఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక భక్తులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కడప కోటిరెడ్డిసర్కిల్: మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం, క్రిస్టియన్, బుద్దిస్ట్, సిక్కు, జైను, పార్సీ మైనార్టీల సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి షేక్ హిదాయతుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏపీఓబీఎంఎంఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థి వయసు 21–55 ఏళ్ల మధ్య ఉండాలని, ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షలుగా నిర్ణయించారన్నారు. రూ.లక్ష యూనిట్‌కు సంబంధించి 50 శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల యూనిట్ ఖర్చు వరకు గరిష్టంగా రూ.1.25 లక్షలు సబ్సిడీ, రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు యూనిట్ ఖర్చుకు గరిష్టంగా రూ.2 లక్షల సబ్సిడీ, రూ.5 నుంచి రూ.8 లక్షల యూనిట్ 50 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. -
● మార్కుల జాబితా మాయ
మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. జీఎన్ఎం కోర్స్‌కు 1800, బీఎస్సీ నర్సింగ్కు 2,700 మార్కులు ఉంటాయి. ఉద్యోగ నియామకాల్లో ఈ మార్కులతోపాటు సర్వీస్, అకడమిక్ వెయిటేజ్ మార్కులు ఉంటాయి. అలాగే కోవిడ్ కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేపట్టిన విధుల కాలాన్ని బట్టి మార్కులు ఉంటాయి. ఈ మార్కుల మెరిట్‌తోపాటు ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇక్కడ మార్కులకు ప్రాధాన్యత ఉంటుంది. దీంతో అభ్యర్థులు నకిలీ మార్కుల జాబితాను సమర్పించినట్లుగా సమాచారం. బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతకు సంబంధించి మొత్తం 20 మంది బోగస్ సర్టిఫికెట్స్‌ను సమర్పించగా.. అందులో నలుగురు కరోనా డ్యూటీలకు సంబంధించి బోగస్ సర్టిఫికెట్స్ పొందుపరిచినట్లుగా సమాచారం. ఇలా మార్కుల జాబితా ఒక మాయలా మారింది. దీని ఫలితంగానే షెడ్యూల్ ప్రకారం ఎప్పుడో జరగాల్సిన నియామకాల కౌన్సెలింగ్ వాయిదా పడుతూ వచ్చింది. -
నకిలీ సర్టిఫికెట్ల కలకలం
కడప రూరల్: కడపలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4(రాయలసీమ జిల్లాలు) పరిధిలో ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్ నియామకాలకు చర్యలు చేపట్టారు. మొత్తం 150 పోస్టులకు గాను 11 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆ కార్యాలయ సిబ్బంది పరిశీలించి జాబితా సిద్ధం చేయడానికి పెద్ద కసరత్తే చేశారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రెండు విడతలుగా పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. ఆ పరంపరలోనే తాజాగా నియామకాలకు శ్రీకారం చుట్టారు. అనుమానంతో... వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 11 వేలకు పైగా వచ్చిన దరఖాస్తుల్లో 150 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయాలి. అందులో భాగంగా 200 మందితో అభ్యర్థుల తుది ఎంపిక జాబితా సిద్ధం చేశారు. 200 మందితో జాబితా ఎందుకంటే.. 150 మందిలో కౌన్సెలింగ్‌కు ఎవరైనా అభ్యర్థులు రాకపోతే, ప్రాధాన్యత ప్రకారం మిగతా వారికి ఆ స్థానంలో ఉద్యోగ అవకాశం కల్పించడానికి ముందస్తుగా ఎక్కువ మందితో జాబితా సిద్ధం చేయడం జరుగుతుంది. ఆ ప్రకారం అర్హులైన 200 మందితో తుది జాబితా తయారు చేశారు. ఇక ఆ జాబితాను ప్రకటించి నియామక కౌన్సెలింగ్‌ను చేపట్టడమే. అయితే ఆ శాఖ అధికారులకు అనుమానం రావడంతో ఎందుకై నా మంచిదని, ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లను ధ్రువీకరణ కోసం బోర్డుకు పంపారు. అందులో భాగంగా 100 మంది బీఎస్సీ నర్సింగ్, మరో 100 మంది జీఎన్ఎమ్ నర్సింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ను.. పరిశీలన కోసం పారామెడికల్ బోర్డు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపారు. బీఎస్సీ నర్సింగ్కు సంబంధించి 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపగా, అందులో 20 మంది సర్టిఫికెట్స్ బోగస్‌గా నిర్ధారించారు. జీఎన్ఎం నర్సింగ్ కోర్సు చేసిన 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ను పారా మెడికల్ బోర్డుకు పంపగా, అక్కడి అధికారుల నుంచి సమాధానం రావాల్సి ఉంది. అందులో కూడా పెద్ద సంఖ్యలోనే నకిలీ సర్టిఫికెట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు.. ముఠాగా ఏర్పడి.. గతంలో కూడా బోగస్ సర్టిఫికెట్స్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. కొంత మంది ఉద్యోగులు ఒక ముఠాగా ఏర్పడి బోగస్ సర్టిఫికెట్స్‌ను తయారు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కొందరు ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది. ఇప్పుడు కూడా వారే ఈ బోగస్ వ్యవహారానికి తెరలేపారనే ప్రచారం ఆ శాఖకు చెందిన ఉద్యోగుల్లో నడుస్తోంది. నిరుద్యోగుల ఆశలను ఆసరాగా తీసుకొని కొందరు మోసానికి పాల్పడుతున్నారు. అడ్డంగా దోచుకుంటున్నారు. ‘అధికారం మాదే’ అనే మదంతో కొంత మంది ఒక్కో పనికి లెక్కకట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో చేపడుతున్న కాంట్రాక్టు స్టాఫ్‌నర్స్ నియామకాల్లో.. నకిలీ సర్టిఫికెట్స్ వెలుగు చూడటం కలకలం రేపుతోంది. కొంత మంది అన్ని వ్యవహారాల్లో ఆరితేరి.. అడ్డదారుల్లో అక్రమంగా సంపాదించు కోవడానికి ఒక ముఠాగా ఏర్పడి.. వీటిని తయారు చేస్తున్నట్లు వినికిడి. దీంతో అప్రమత్తమైన ఆ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో.. ఈ వ్యవహారం బయటపడింది. స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీలో వెలుగులోకి.. ధ్రువీకరించిన హెల్త్ యూనివర్సిటీ కొందరి హస్తలాఘవంతో తయారీ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం అప్రమత్తం అవును.. నిజమే..! బోగస్ సర్టిఫికెట్స్ వెలుగు చూసిన మాట వాస్తవమే. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా నియామకాలు చేపట్టక ముందే.. ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన కోసం బోర్డుకు పంపాం. అక్కడ బోగస్ సర్టిఫికెట్స్ అని తేలాయి. ఇంకా నిర్ధారణ కావాల్సిన సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆ వివరాలు రాగానే చట్టపరమైన చర్యలు చేపడుతాం. అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరకముందే.. సర్టిఫికెట్స్ పరిశీలన చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ చర్యలు చేపట్టాం. – డాక్టర్ రామగిడ్డయ్య, రీజినల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం -
సబ్ జూనియర్ షూటింగ్‌బాల్ పోటీలు ప్రారంభం
మదనపల్లె సిటీ : స్థానిక పుంగనూరురోడ్డులోని వశిష్ట స్కూలులో శనివారం 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల షూటింగ్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ జునైద్ అక్బరీ, వశిష్ట స్కూల్ చైర్మన్ డాక్టర్ పీవీఆర్ గుప్తా ప్రారంభించారు. రాష్ట్ర షూటింగ్‌బాల్ కార్యదర్శి పరుశురాముడు మాట్లాడుతూ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్టును ఎంపిక చేసి మే 7 నుంచి తమిళనాడు రాష్ట్రంలో జరిగే పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో షూటింగ్ బాల్ అసోసియేషన్ రాయలసీమ కన్వీనర్ నరేష్‌బాబు, జిల్లా కార్యదర్శి మురళీధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మురళీధర్ , గురుప్రసాద్, పీడీలు నాగరాజ, భారతి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాలు పీకేసిన పాపం చంద్రబాబు, లోకేష్, పవన్లదే
రైల్వేకోడూరు అర్బన్ : మంగంపేటలో స్థానిక యువకులకు తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తే అందులో 375 మందికి ఉద్యోగాలు పీకేసి వారి కుటుంబాలు రోడ్డున పడేటట్లు చేసిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్లదేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏపీఎండీసీలో తీసేసిన ఉద్యోగులను తిరిగి చేర్చుకోకుంటే విజయవాడ, మంగంపేటలలో ఆందోళనలు చేసేందుకు ప్రజా సంఘాలు, ఇతర పార్టీలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్‌లు 25 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ యువకులకు ద్రోహం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అవసరాలకు మంగంపేట ఖనిజం కావాలి కానీ ఇక్కడి ప్రజలకు ఉద్యోగాలు వద్దా అని నిలదీశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, ఇన్చార్జి, కూటమి నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, మందల నాగేంద్ర, తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే కొరముట్ల -
కోదండ రాముడికి స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ టీటీడీ అధికారులు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి, పండితులచే స్వామివారిని అలంకరించి, పాలు, పెరుగు, నెయ్యి, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. రఘురామకృష్ణమరాజు డిప్యూటీ స్పీకర్‌గా అనర్హుడు మదనపల్లె : నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం కమ్యూనిస్టులే. మీకు తెలియకపోతే మీ వాళ్లని అడగండి.. లేకుంటే మీ పార్టీ నేతలను అడిగి తెలుసుకోండి’ అని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజుకు సూచించారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు అవమానకరంగా, అసభ్యకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పేదల గుడిసెలు తొలగింపునకు నిరసనగా గళమెత్తిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పై అనుచితవ్యాఖ్యలు దారుణమన్నారు. -
ప్రజల్లో విశ్వసనీయత పెంచాలి
రాయచోటి : పోలీసు శాఖపట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటిలోని పోలీసు కార్యాలయంలో రాజంపేట సబ్ డివిజన్ పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ముఖ్యంగా గ్రేవ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాలను సేకరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. నేరస్తులకు శిక్షపడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలతో చార్జ్షీట్లను నిర్ణీత గడువులోగా కోర్టులో దాఖలు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో జరిగే నేరాలను అరికట్టడానికి బీట్ పోలీసులు, రక్షక్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ ముమ్మరం చేయాలని చెప్పారు. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపట్ల ప్రజలను అప్రమత్తంగా చేయాలని, ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని కోరారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెడ్గే, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నేర సమీక్షలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి -
ఇళ్లు మావి... పరిహారం వేరొకరికా..?
మదనపల్లె : 21 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన పట్టా ఇళ్ల స్థలాలను ఆర్వోబీ నిర్మాణానికి తీసుకుని, పరిహారం వేరొకరికి ఇవ్వడమేంటని నిర్వాసితులు శనివారం సీటీఎంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ...సీటీఎం గంగమ్మగుడి ఎదుట 21 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాలను లలితకుమారి నుంచి తాము కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుని అందులో నివసిస్తున్నామన్నారు. సీటీఎం వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌బ్రిడ్జ్(ఆర్ఓబీ) నిర్మాణానికి ఇళ్ల స్థలాలు అవసరమై తమకు నోటీసులు అందజేశారన్నారు. అయితే నష్టపరిహారం మాత్రం తమకు అందివ్వకుండా తమకు ఇళ్ల స్థలాలు విక్రయించిన లలితకుమారికి ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారన్నారు. డబ్బులు చెల్లించి తాము కొనుగోలుచేసి, అనుభవంలో ఉంచుకున్న స్థలాలను ఆర్వోబీ నిర్మాణానికి ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే పరిహారం తమకే చెల్లించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు తమకు అన్యాయం చేస్తే ఆర్వోబీకి ఇళ్ల స్థలాలు ఇచ్చేది లేదన్నారు. కార్యక్రమంలో బాధితులు వై.రెడ్డిశేఖర్, రెడ్డెప్ప, శ్రీనివాసులు, పాపులమ్మ, సి.చంద్రశేఖర్, ఎస్.రాజశేఖర్, వేణునాయుడు పాల్గొన్నారు. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్
రాయచోటి : దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో శనివారం రెండో రోజు కూడా ఆకస్మిక తనిఖీలు, పరిశీలనలను జరిపారు. జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్టాండులు, ముఖ్యమైన ప్రాంతాలలో పోలీసు జాగిలాలు, బాంబు స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేశారు. నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణ కోసమే తనిఖీలు, సోదాలు చేస్తున్నట్లు అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి తెలిపారు. ఆకస్మిక తనిఖీలలో సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సీఐలు, ఎస్ఐలు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు. మామిడి చెట్లు నరికివేతచిన్నమండెం : మండల పరిధిలోని దేవగుడిపల్లె గ్రామం కొండమూలకు చెందిన బూసర శ్రీనివాసులు అనే రైతుకు చెందిన మామిడిచెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసినట్లు బాధిత రైతు తెలిపారు. ఆయన కథనం మేరకు.. తనకు గల 3 ఎకరాల పొలంలో మామిడిచెట్లను సాగు చేసినట్లు తెలిపారు. అయితే శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అందులో 15 మామిడిచెట్లను నరికివేశారని తెలిపారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. -
ఉగ్రవాదులను బహిరంగంగా ఉరి తీయాలి
రాజంపేట టౌన్ : పహల్గాంలో అభంశుభం తెలియని 28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను బహిరంగంగా ఉరి తీయలాని పట్టణంలోని ముస్లీం మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల ఉన్మాదాన్ని నిరసిస్తూ, ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వారి ఆత్మశాంతి కోసం శనివారం రాత్రి ముస్లీం మైనార్టీ నాయకులు ఆర్అండ్బీ బంగ్లా వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముస్లీం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి భారతీయుడు అండగా నిలుస్తాడని తెలిపారు. ముగ్గురాయిని రాయితీపై మిల్లులకు ఇవ్వాలి ఓబులవారిపల్లె : మంగంపేట గనుల ఆధారితంగా ఏర్పాటు చేసుకున్న పల్వరైజింగ్ మిల్లులకు ఏపీఎండీసీ యాజమాన్యం రాయితీపై ముగ్గురాయిని సరఫరా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ జోనల్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మంగంపేట కారుపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యంమత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 296 జీఓ ప్రకారం మిల్లులకు రాయితీలు కల్పించి ప్రోత్సహించారన్నారు. ప్రస్తుతం ఖనిజ సరఫరా నిలిపివేయడంతో పల్వరైజింగ్ మిల్లులు పూర్తిగా మూతపడ్డాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్థానికంగా ఉన్న మిల్లులకు రాయితీపై ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ ఖనిజాన్ని సరఫరా చేసి ఆదుకోవాలన్నారు. వృద్ధుడి ఆత్మహత్యాయత్నం సిద్దవటం : భార్య అనారోగ్యంతో బాధపడుతుంటే తట్టుకోలేని ఓ వృద్ధుడు భార్య కంటే ముందుగా తానే చనిపోవాలని నిర్ధారించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వృద్ధుడిని రైల్వే సిబ్బంది కాపాడారు. వివరాల్లోకి వెళితే.. అట్లూరు మండలం, అట్లూరు క్రాస్ రోడ్డులో నివాసం ఉంటున్న జె. అబ్బిరెడ్డికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అయితే ఇటీవల భార్య లక్ష్మిదేవి ఆరోగ్యం సరిగా లేనందున ఆమెకు ఏమైనా అవుతుందనే భయంతో, భార్యకంటే ముందుగా తాను చనిపోవాలని భావించాడు. శనివారం సిద్దవటం మండలం కనుమలోపల్లె గ్రామ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్దకు ఉదయం 8 గంటలకే వచ్చి రైల్వే స్టేషన్లో రైలు కింద పడబోతుండగా రైల్వే సిబ్బంది గమనించి వృద్ధుని ప్రాణాలు కాపాడారు. ఈ విషయాన్ని సిద్దవటం ఎస్ఐ మహమ్మద్ రఫీకి రైల్వే సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదని, వృద్ధురాలికి సరైన వైద్యం చేయించాలని కౌన్సిలింగ్ ఇచ్చి వారి బంధువులకు అప్పగించారు. గ్రీస్ దేశంలో ఉద్యోగావకాశాలు రాయచోటి టౌన్ : గ్రీస్ దేశంలో ఉద్యోగావకాశాలు ఉన్నట్లు అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) అధికారి దాసరి నాగార్జున శనివారం ఒక ప్రకటలో తెలిపారు. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. వివరాల కోసం 988853335, 8712655686, 8790118349, 8790117279లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నంమదనపల్లె : యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం మదనపల్లెలో జరిగింది. నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లేఅవుట్‌కు చెందిన నరసింహులు కుమారుడు మల్లికార్జున(26)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే అకస్మాత్తుగా వధువు తరపువారు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రైలు కిందపడి మహిళ మృతి పుల్లంపేట : మండల పరిధిలోని దేవసముద్రం వడ్డిపల్లికి చెందిన పసుపులేటి సీతమ్మ శనివారం ఉడుమువారిపల్లికి సమీపంలోని రైల్వేట్రాక్‌పై రైలు కింద పడి మృతి చెందింది. ఆమె మృతి విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై రేణిగుంట రైల్వే పోలీసు గౌరీ శంకర్ కేసు నమోదు చేశారు. -
ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఢీ
రామాపురం : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీ టోల్గేట్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 14 మంది ప్రయాణిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ వెంకట సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు...రాయచోటి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వంగిమళ్ల నుంచి రాయచోటికి వస్తుండగా టోల్గేట్ సమీపంలో బొలెరో వాహనానికి టైరును మారుస్తుండగా వెనుక వైపు నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొంది. మండల పోలీసులు వెంటనె సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ ప్రసాద్‌రెడ్డి, కండక్టర్ నరసింహులుతో పాటు 14 మంది ప్రయాణికులను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో వంగిమళ్లకు చెందిన రామాంజులరెడ్డి, చిన్నబాబు, సుమిత్ర, రెడ్డిరాణి, విజయ్‌కుమార్‌రెడ్డి, ఆస్మా, మన్విత, మాన్యత, పొలిమేరపల్లెకు చెందిన రమాదేవి, జగదీష్, గీతావాణి, మహేష్, ఉప్పరపల్లెకు చెందిన రాణెమ్మ, సుండుపల్లె చౌడయ్య, వీరబల్లి మండలానికి చెందిన సుమిత్ర, గంగనేరుకు చెందిన జమున ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం రామాంజులరెడ్డి, రాదేవి, జగదీష్, బాబు, గీతావాణిలను కడప రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ రామాంజులరెడ్డి(80) మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.ఒకరి మృతి, 14 మంది ప్రయాణికులకు గాయాలు -
ట్రిపుల్ ఐటీలతో.. ఉజ్వల భవిష్యత్తు
వేంపల్లె : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో ట్రిపుల్ ఐటీకి 1000 సీట్ల చొప్పున 4వేల సీట్లను ఆర్జీ యూకేటీ అధికారులు కేటాయించారు. అలాగే ఈబీసీ కోటా కింద ఒక్కో ట్రిపుల్ ఐటీకి 100 సీట్ల చొప్పున 400 సీట్లను కేటాయించారు. 2024–25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల చూపంతా ట్రిపుల్ ఐటీ వైపు మళ్లింది. ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 20వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎంపికై న అభ్యర్థుల జాబితా జూన్ 6న విడుదల చేస్తారు. జూన్ 11 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. స్పెషల్ కేటగిరి (పీహెచ్సీ/ క్యాప్/ఎన్సీసీ/స్పోర్ట్స్/భారత్ స్కౌట్స్) కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మే 28 నుంచి 31వ తేదీ వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం జూలై మొదటి వారంలో తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించేందుకు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణా రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఒక్కోదానికి 2000 సీట్లను కేటాయించగా.. తర్వాత ప్రభుత్వాలు 2010లో ఒక ట్రిపుల్ ఐటీలో 1000 సీట్లు ఉండేలా కుదించారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ తెలంగాణకు వెళ్లిపోవడంతో 2016లో ఏపీలో ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీలను ప్రారంభించారు. వీటిలో 26 జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. 4000 సీట్లలో ఓపెన్ కేటగిరిలో 600 సీట్లను స్థానికేతరులు, తెలంగాణ ఎన్ఆర్ఐ, తదితరులకు కేటాయిస్తారు. మిగిలిన 3400 సీట్లను 26 జిల్లాల వారికి సమానంగా పంచుతారు. జిల్లాకు కేటాయించే సీట్ల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు అవకాశం లభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులకే ట్రిపుల్ ఐటీల్లో అధిక సీట్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికే ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ ఇలా ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇద్దరు విద్యార్థులకు సమాన మార్కులు వస్తే తొలుత గణితం అనంతరం జనరల్ సైన్స్ తర్వాత ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజ్‌లో అధిక మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. అప్పటికి సమానంగా వస్తే పుట్టిన తేదీ ప్రకారం అధిక వయస్సు ఉన్న వారిని హాల్ టికెట్ నెంబర్ నుంచి పొందిన అత్యల్ప సంఖ్య ఆధారంగా ఎంపిక చేస్తారు. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు.. ట్రిపుల్ ఐటీలలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు గిగిగి. ఖఎ్ఖఓఖీ. ఐూ. అ్క వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ విద్యార్థులకు దరఖాస్తు రుసుము రూ.300లు కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200లుగా నిర్ణయించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తారు. రాష్ట్రంలోని అభ్యర్థులకు 85 శాతం సీట్లు, మిగిలిన 15 శాతం సీట్లు రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కేటాయిస్తారు. అడ్మిషన్లలో కచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. ఎస్సీ–15 శాతం, అనగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్–2 ప్రకారం ఎస్సీ గ్రూపు–1 కి 1 శాతం, గ్రూప్– 2 కి 6.5 శాతం, గ్రూప్ –3 కి 7.5 శాతం ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. మిగిలిన కేటగిరీలో ఎస్టీ–6, బీసీ(ఏ)–7, బీసీ(బి)–10, బీసీ (సి)1, బీసీ (డి)7, బీసీ(ఈ) 4, దివ్యాంగులకు–5 శాతం ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. ఆర్మీ ఉద్యోగుల పిల్లలు (సీఏపీ)–2, ఎన్సీసీ–1, స్పోర్ట్స్–0.5, భారత్ స్కౌట్స్ ఆఫ్ గైడ్స్–0.5 శాతం సీట్లు కేటాయిస్తారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కేటగిరిలో బాలికలకు 33.1/3 శాతం సీట్లు కేటాయిస్తారు. మొత్తం 4400 సీట్లు రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో క్యాంపస్‌కు 1000 సీట్ల చొప్పున మొత్తం 4వేల సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఈబీసీ కోటా కింద ఒక్కో క్యాంపస్‌కు 100 సీట్ల చొప్పున 400 సీట్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరంలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 2,45,307 మంది, బాలికలు 2,53,278 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య అధికంగా ఉండడంతో గట్టి పోటీనే ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అన్ని జిల్లాలకు సమానంగా సీట్లు ఆర్జీయూకేటీ పరిధిలోని అన్ని ట్రిపుల్ ఐటీల్లో ఆయా జిల్లాల్లో సమానంగా సీట్లు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 4శాతం, డిప్రివేషన్ స్కోరును జోడించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తాం. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ సండ్ర(ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ కన్వీనర్), ఇడుపులపాయ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ పదవ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో ట్రిపుల్ ఐటీల ఏర్పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు నాలుగు శాతం డిప్రివేషన్ స్కోరును జోడించి అభ్యర్థుల ఎంపిక -
పర్యాటక కేంద్రాల్లో హోంస్టేల నిర్మాణం జరగాలి
రాయచోటి: జిల్లా ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు పర్యాటక రంగం అభివృద్ధి కీలకమని, అందుకు అనుగుణంగా పర్యాటక కేంద్రాల్లో హోం స్టేల నిర్మాణం జరగాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనుల గురించి పర్యాటక శాఖ అధికారి నాగభూషణం వివరించారు. హార్స్‌లీహిల్స్‌లో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టులు, అన్నమాచార్య కీర్తనలను ప్రచారం చేయడం, రాయచోటిలో శిల్పారామ నిర్మాణంలో ప్రగతి తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రాయచోటి, పీలేరు, రాజంపేటలలో నిర్మించబోయే మూడు నక్షత్రాల హోటళ్లకు ఒక్కో చోట గుర్తించిన 5 ఎకరాల భూములను పర్యాటక శాఖకు అప్పగించే దిశగా చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. హార్సిలీహిల్స్‌లో గిరిజన కార్పొరేషన్ వారు అరకు కాఫీ కోసం గుర్తించిన స్థలాన్ని అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని మదనపల్లె సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. అక్కడే లేపాక్షి స్టాల్ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి పర్యాటక శాఖకు అందజేయాలన్నారు. స్వయం సహాయక బృందాలతో హోమ్ స్టేలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పీడీ డీఆర్‌డీఏను ఆదేశించారు. గ రాయచోటిలోని శిల్పారామం నిర్మాణంలో పురోగతి సాధించాలని పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, మదనపల్లె రాజంపేట సబ్ కలెక్టర్లు మేఘస్వరూప్, నైదియాదేవి, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణప్రసాద్, ఏపీ టీడీసీ ఈఈ సుబ్రమణ్యం, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, పీడీ డీఆర్డీఏ సత్యనారాయణ, ఏపీఎస్ఆర్టీసీ జిల్లా అధికారి రాము, జిల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్, మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ పథకాల్లో వందశాతం లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ఫిజబిలిటీ నివేదిక వెంటనే పంపాలని సూచించారు. జిల్లాలో పచ్చిమేత పెంపకానికి డివిజన్, మండలస్థాయిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, డికేటీ, ప్రైవేటు భూములను ప్రతి మండలంలో కనీసం 3 వేల ఎకరాలను గుర్తించాలన్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ -
● తోడుగా వెళ్లి...
జగనన్న కాలనీలో ఉంటున్న మల్లేష్, ఈశ్వరమ్మ ఇంటి పక్కనే మంజుల, వెంకటరమణలు ఉంటున్నారు. వీరికి నందిత అనే కుమార్తె ఉంది. ఇరుగు పొరుగు కావడంతో సఖ్యతతో ఉండేవారు.ముగ్గురు చిన్నారులు కలిసి ఆడుకునేవారు. శనివారం లావణ్య, నందకిషోర్ ఈశ్వరమ్మ వెంట వెళుతుండగా నేను వస్తానని నందిత వెళ్లింది. చెరువులో ఆడుకుంటూ ముగ్గురు మునిగి చనిపోయారు. ఒక్కగానొక్క కుమారై మృతి చెందడంతో అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం అంటూ మంజుల, వెంకటరమణలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
26 నుంచి షూటింగ్‌బాల్ పోటీలు
మదనపల్లె సిటీ: మదనపల్లె వశిష్ట పాఠశాలలో 26 వతేదీ నుంచి 27వతేదీ వరకు 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ –బాల,బాలికల షూటింగ్‌బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని రాయలసీమ జిల్లాల షూటింగ్‌బాల్ అసోసియేషన్ కన్వీనర్ నరేష్ తెలిపారు. ఈ పోటీలు 26న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. వెబ్సైట్లో సీనియారిటీ జాబితా కడప ఎడ్యుకేషన్: రాయలసీమ జోన్ –4 పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు పూర్వపు జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్(గవర్నమెంట్) నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు(గవర్నమెంట్) సీనియారిటీ జాబితాను వెబ్సైట్ https://rjdsekadapa. blogpot.comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శామ్యూల్ తెలిపారు. కావున ఉపాధ్యాయులు ఈ జాబితాను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారులు వారి వెబ్సైట్లో ప్రకటించాలని సూచించారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు రాయచోటి టౌన్: ఈ నెల 30వ తేదీ నిర్వహించే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్ఓ కె.మధుసూధన్ రావు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతుఊ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసులకు,విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు.పరీక్ష సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పక్కా గృహాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి రామాపురం: పక్కా గృహాల కోసం అర్హులైన లబ్ధిదారులు గ్రామ సచివాలయంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని హౌసింగ్ పీడీ సాంబశివయ్య పేర్కొన్నారు. మండలంలోని నల్లగుట్టపల్లె బీసీకాలనీ, కుమ్మరపల్లె గ్రామాలలో శుక్రవారం నిర్మాణ దశలో ఉన్న పక్కాగృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కుమ్మరపల్లె గ్రామంలో పూరి ఇంటిలో నివాసం ఉన్న ప్రజలతో మాట్లాడుతూ గ్రామాల్లో గతంలో మంజూరైన గృహాల్లో నిర్మించుకోలేకపోయినా ఎస్టీ లబ్ధిదారులకు రూ75వేలు, ఎస్సీ బీసీ లబ్ధిదారులకు రూ50వేలు అదనంగా ప్రభుత్వం అందజేస్తోందన్నారు. త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలియజేశారు. మండల హౌసింగ్ ఏఈ ఎల్వి ప్రసాద్, సచివాలయం అసిస్టెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు. పరిసరాలశుభ్రతతోనే వ్యాధులు దూరం రాయచోటి అర్బన్: పరిసరాల శుభ్రతతోనే వ్యాధులు దరిచేరవని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి అన్నారు.శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య,ఆరోగ్యశాఖ ఉద్యోగులు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను మలేరియా రహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని తెలిపారు. మురుగునీరు ఇంటి పరిసరాల్లో నిల్వలేకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈగలు,దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు. 2027 నాటికి జీరో మలేరియాను, 2030 నాటికి మలేరియా నిర్మూలనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు కిరణ్‌కుమార్, శివ రామరాజు, మలేరియా సబ్యూనిట్ అధికారి జయరామయ్య, శ్రీనివాసులరెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ బలరామరాజు, ల్యాబ్ టెక్నీ షియన్లు నాయక్, వెంకట్రామిరెడ్డి, ఉత్తమ్‌రెడ్డి, శ్రీనాథరెడ్డి, సూపర్వైజర్లు వెంకటేశ్వర్‌రెడ్డి, నూర్జహాన్ తదితరులు పాల్గొ న్నారు. -
ఉగ్రదాడి మృతులకు నివాళి
జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అన్నమాచార్య యూనివర్సిటీ అధ్యాపకులు,విద్యార్థులు శుక్రవారం రాత్రి నివాళులు అర్పించారు. ఉగ్రదాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కొవ్వొత్తుల ర్యాలీ వల్ల విద్యార్ధులలో దేశభక్తి, సామాజికబాధ్యత పెంపొందించవచ్చని తెలిపారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ, భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించాలని అందరూ ప్రార్ధించారు.కార్యక్రమంలో వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ మల్లికార్జునరావు, ఏఐటీఎస్ ప్రిన్సిపాల్ డా.నారాయణ, పరిపాలనాధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. –రాజంపేట -
గుక్కెడు నీళ్లు..గుప్పెడు గింజలు
మదనపల్లె సిటీ: ఈసారి ఎండలు ఆరంభం నుంచే అదరగొడుతున్నాయి. ఉష్ణతాపం తీవ్రమవుతుండటంతో జంతుజాలం దాహంతో అల్లాడుతోంది. మనుషులైతే దప్పిక వేసినపుడు ఎలాగోలా గొంతు తడుపుకొంటారు. కానీ మూగజీవాలకు ఇబ్బందిగా ఉంటుంది. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? చుక్క నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవి ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలేమా? అని హెల్పింగ్ మైండ్స్ సంస్థ, గణపతిసచ్చిదానంద స్వామి ఆశ్రమ నిర్వాహకులకు కలిగిన ఆలోచన మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వేలాది పశుపక్షాదుల దాహార్తిని తీరుస్తోంది. ● సాధారణంగా పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత దాటితే ఎక్కువ సేపు జీవించలేవు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అందులో మునకేస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పక్షుల రక్షణకు నడుం బిగించింది హెల్పింగ్‌మైండ్స్, సచ్చిదానంద ఆశ్రమం నిర్వాహకులు. సేవేమార్గంగా వాటర్బౌల్ ప్రాజెక్టును ప్రారంభించారు.అలాగే ధాన్యం గింజలతో పాటు పండ్లు కూడా అక్కడక్కడ ఉంచుతున్నారు. 25 తొట్టెలతో ప్రారంభమై... పక్షులను వేసవి తాపం నుంచి రక్షించి వాటి దాహార్తి తీర్చే ఉద్దేశంతో 2018లో వాటర్బౌల్ పేరుతో మదనపల్లెకు చెందిన హెల్పింగ్‌మైండ్స్ సంస్థ సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి ఏడాది నుంచి సభ్యులు, దాతల సహకారంతో మదనపల్లె–బెంగుళూరు రోడ్డు, కురబలకోట మండలం రైల్వేస్టేషన్వద్దనున్న ఫారెస్టు రోడ్డు ప్రాంతాల్లో వాటర్బౌల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సుమారు100కు పైగా తొట్టెలను ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్ల సాయంతో నీరు నింపుతున్నారు. ఫారెస్టులోని నెమళ్లు, దుప్పిలు, జింకలు, పావురాలు, కోయిలలు, కోతులు, కుక్కలు,కాకులు వాటర్బౌల్స్ వద్దకు వచ్చి దాహార్తి తీర్చుకుంటున్నాయి. ఈ వాటర్బౌల్స్ వద్దకు పక్షులు, మూగజీవాలు వచ్చి నీటిని తాగుతుండటం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తామూ ఈ వాటర్బౌల్ ప్రాజెక్టులో భాగస్వాములమువుతామని ముందుకు వస్తున్నారు. వాటర్బౌల్స్ వితరణ స్థానిక బొమ్మనచెరువువద్దనున్న గణపతి సచ్చిదానందస్వామి గత నాలుగేళ్లుగా ఆశ్రమ నిర్వాహకులు భక్తులకు వాటర్బౌల్స్ను ఉచితంగా అందజేస్తున్నారు. బౌల్స్‌లో మంచి నీళ్లు నింపి ఇంటి ముందు, పరిసర ప్రాంతాల్లో పక్షులకు అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు. దీంతో పట్టణంలో పలు ప్రాంతాల్లో వేసవిలో ఈ కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. వాటర్ బౌల్ పేరుతో వినూత్న ఆలోచన ఉచితంగా అందిస్తాం వేసవి వస్తే మనుషుల కోసం అడుగడుగునా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మూగజీవాల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకే మా సంస్థ వాటర్బౌల్ ప్రాజెక్టు ప్రారంభించాం. మదనపల్లె సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. మూగజీవాలను ప్రేమించేవారు ఎవ్వరు వచ్చినా ఉచితంగా తొట్టెలను అందిస్తాం. –అబుబకర్సిద్దిక్, హెల్పింగ్‌మైండ్స్ సంస్థ వ్యవస్థాపకులు,మదనపల్లె. -
సారా రహిత జిల్లాగా మారుద్దాం
రాయచోటి టౌన్: జిల్లాను సారా రహితంగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రొహిబిష, ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో నవోదయ– 2– కార్యక్రమంలో భాగంగా జిల్లాను నాటు సారా రహితంగా మార్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై చర్చించారు. జిల్లాలో వాయల్పాడు, మదనపల్లె, మొలకల చెరువు, పీలేరు నాటుసారా ప్రభావిత ప్రాంతాలని, వీటిని నాటుసారా రహితంగా చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని చెప్పారు. సారా తయారీ ప్రదేశాలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్‌శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి మధుసూధన్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలి
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పెద్దమండ్యం: గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. పెద్దమండ్యంలో డంపింగ్ యార్డ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. రోజువారీగా చెత్త సేకరణపై పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. అలాగే యాప్‌లో రోజువారీగా చెత్త సేకరణ వివరాలను అప్లోడ్ చేస్తున్నారా లేదా అనే విషయమై ఆరా తీశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శాఖలవారీగా అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో ఉన్న డంపింగ్ యార్డ్‌లను వినియోగంలోకి తీసుకురావాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. సకాలంలో ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. పక్కాగృహాల నిర్మాణంపై సమీక్షించారు. కాలనీలలో గృహ నిర్మాణాల పురోగతిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యాలయం వద్ద ప్రజలు, ప్రజా ప్రతినిధులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆకుమానిగుట్ట నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు భూ పరిహారం, అర్ధంతరంగా ఆగిపోయిన నల్లరాతిమడుగు ప్రాజెక్టు నిర్మాణం పనుల గురించి ఎంపీపీ గుర్రం పూర్ణచంద్రిక కలెక్టర్‌కు వివరించారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పీహెచ్సీలో రికార్డులను పరిశీలించారు.పీహెచ్సీలో జరుగుతున్న ప్రసవాల గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సయ్యద్అహ్మద్, ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ చంద్రశేఖరరెడ్డి, ఏపీడీ నందకుమార్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అశోక్‌కుమార్, హౌసింగ్ ఏఈ అక్రమ్, ట్రాన్స్‌కో ఏఈ రామ్మూర్తినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో 8 మందికి గాయాలు
మదనపల్లె : వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది గాయపడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ నల్లచినేపల్లెకు చెందిన మునిస్వామిరాజు కుమారుడు శ్రీనివాసులురాజు (30) వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంలో పుంగనూరుకు వెళ్తున్నారు. మార్గమధ్యంలో చెంబకూరు– ఈడిగపల్లె రోడ్డులో ఈడిగ పల్లె వద్ద కత్తి రాజుపల్లెకు చెందిన చిన్నప్ప కుమారుడు ప్రకాష్ (27) ద్విచక్ర వాహనంలో వెళ్తూ, ఎదురెదురుగా ఢీకొన్నారు. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలవగా స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కురబలకోట మండలం దమ్మున్న బావి సమీపంలో, కోళ్ల ఫారాల నిర్మాణ పనులు చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కూలీలు సాహిద్(20), జెస్సిం (20), సాజిద్ (21), అబ్దుల్లా(19), అంగళ్లకు వచ్చి మసీదులో ప్రార్థనలు ముగించుకుని తిరిగి దోమల బావికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. దమ్మున్న బావి సమీపంలో ఆటో మలుపు తిరుగుతుండగా ఎదురుగా వచ్చిన క్వాలిస్ వాహనం ఆటోను ఢీకొంది. ప్రమాదంలో నలుగురు కూలీలతోపాటు, ఆటో డ్రైవర్ నరసింహులు(19), అతడి స్నేహితుడు మంజునాథ్ గాయపడ్డారు. స్థానికులు బాధితులను మాలపిల్ల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్సలు పొందకుండానే ఆటో డ్రైవర్ నరసింహులు అతని స్నేహితులు మంజునాథ్ ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయారు. -
వ్యాన్ బోల్తా.... ఒకరు మృతి
రాజంపేట : మండలంలోని రోళ్లమడుగు సమీపంలో గొర్రెలను తరలిస్తున్న మినీ లారీ శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెడ్డిచర్ల చిన్నప్ప (50) మృతి చెందారు. చిన్నప్ప శుక్రవారం నెల్లూరు జిల్లా గూడూరు నుంచి గొర్రెలను కొనుగోలు చేసి సానిపాయిలోని గృహానికి తీసుకువస్తున్నారు. రోళ్ల మడుగు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో చిన్నప్ప మృతిచెందారు. ఈ మేరకు మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతి కలికిరి : అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు తమను ఆరాధిస్తాడని భావించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఒక్కగానొక్క కుమారుడు శుక్రవారం ప్రాణాలు విడిచారు. పోలీసుల వివరాల మేరకు.. ఈ నెల 14న మదనపల్లి నుంచి కలికిరి పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకర్ల /్ఞానేంద్ర(26) వస్తున్నారు. మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారిపై చింతలవారిపల్లి బస్టాపు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంలో తల్లిదండ్రులు విలపించడం స్థానికులను కలచివేసింది. మృతుడికి సుమారు ఏదాడి కిందట వివాహమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరుగురికి గాయాలు బి.కొత్తకోట : ఎదురుగా వస్తున్న కారును ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు గాయపడిన సంఘటన శుక్రవారం మండలంలోని అమరనారాయణపురం వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కురబలకోట మండలం అంగళ్లు నుంచి దొమ్మనబావికి చెందిన ఆటో డ్రైవర్ నరసింహులు 26) కాండ్లమడుగుకు వస్తున్నాడు. ఆటోలో పెద్దమండ్యం మండలం సిద్దవరానికి చెందిన మంజునాఽథ్ (30), జార్ఖండ్‌కు చెందిన అబ్దుల్(19), సాజిద్(19), షాహీద్(19), జెస్సీన్(20) ఆటోలో వస్తున్నారు. అమరనారాయణపురం వద్దకు రాగానే ములకలచెరువు నుంచి మదనపల్లె వెళ్తన్న కారు...ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో అందరికీ తీవ్ర గాయాలవగా అబ్దుల్, జెస్సీన్లకు కాలు విరిగింది. బాధితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానం కడప అగ్రికల్చర్ : ఏపీ పశుసంవర్థ శాఖ ఆధ్వర్యంలో ఊటకూరు కోళ్ల ఫారంలో మూడు ప్రధాన యూనిట్ల అభివృద్ధికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శారదమ్మ తెలిపారు. పబ్లిక్, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ యూనిట్లకు ప్రభుత్వ మౌలిక వసతులను వాడుకునే అవకాశాన్ని ఇస్తామన్నారు. -
ఇద్దరి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని అమ్మచెరువు మిట్ట ప్రాంతంలో నివాసమున్న అబ్దుల్లా భార్య సమీన(22), భర్త వేధింపులతో మనస్థాపం చెంది ఇంట్లోనే ఎలకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అబ్దుల్లా వృత్తిరీత్యా డ్రైవర్ కాగా, ఉపాధి నిమిత్తం పెళ్లి అయిన రెండు నెలలకే కువైట్‌కు వెళ్లాడు. ప్రతి రోజూ భార్యకు ఫోన్ చేసి నువ్వు చచ్చిపో అంటూ వేధించడంతో, మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అదేవిధంగా అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ కుమారుడు అర్షద్ (35), కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది సూపర్ వాస్మాల్, ఎలకల మందు కలిపి తిని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.జాతర ఏర్పాట్ల పరిశీలనరైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలో మే 1వ తేదీ నుంచి జరిగే జాతరలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అన్నమయ్య జిల్లా ఏఎస్పీ మనోహ్రామ్నాథ్హెగ్డే సిబ్బందిని ఆదేశించారు. జాతర జరిగే ప్రాంతాలను శుక్రవారం ఆయన పరిశీలించి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ వైభవంగా జరిగే జాతరలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ హేమసుందర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.పుష్పగిరి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణవల్లూరు : పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో కామాక్షీ వైద్యనాథేశ్వర స్వామి, లక్ష్మీచెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ చేశారు. స్వామికి ఉదయం పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, రక్షా బంధన కార్యక్రమాలు జరిపారు. కొండపై లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో అర్చకులు అఖిల్దీక్షితులు స్వామిని అభిషేకించారు. రాత్రి విశ్వక్సేన పూజతో కార్యక్రమాలు ప్రారంభించారు. పుట్ట వద్దకు వెల్లి పవిత్రమైన మట్టి తీసుకువచ్చి భూదేవిగా అలంకరించి మేదినీ పూజ జరిపారు. నవధాన్యాలతో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్తోక్తంగా నిర్వహించారు.రిమ్స్ ఓపీలోక్యాంటీన్ ప్రారంభంకడప అర్బన్ : కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఓపీలో 24 రోజుల తరువాత క్యాంటీన్ గురువారం తిరిగి ప్రారంభించారు. క్యాంటీన్ తెరవ లేదని, ప్రజలు, వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడుతున్నారనీ ఇటీవల పత్రికలలో వార్తలు రావడంతో స్పందించిన ఆస్పత్రి అధికారులు క్యాంటీన్‌ను ఒకరికి అప్పగించారు. త్వరలో జరిగే ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశంలో అక్కడ ఏ పద్ధతిలో ఇవ్వాలనేది తీర్మానించనున్నట్లు అధికారులు తెలియజేశారు. -
టీచర్ల సర్టిఫికెట్లలో వైకల్యం..!
● మూడు రోజుల పరిశీలనలో ‘గోల్మాల్’ ● డాక్టర్ల క్లినిక్‌లకు వెళ్లి కొందరి బేరసారాలు ● ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.30 వేల వరకు వసూళ్లు ● తొలి రోజున నగదు రూపంలో ఫీజుల వసూలు ● అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే సాక్షి, టాస్క్‌ఫోర్స్ : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది బదిలీల కోసం ఏకంగా చట్టం చేశారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. దానికనుగుణంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రతి జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుంచి 26వతేదీ వరకు మూడు రోజుల పాటు బోధన, బోధనేతర సిబ్బందికి చెవుడు, మూగ, కుంటి, గుడ్డి, అంగ వికలత్వం, బుద్ది మాంద్యం, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బు, ఇలా వ్యాధులు కలిగిన సిబ్బంది లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు పునఃపరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా విభాగాల్లో నిష్ణాతులైన డాక్టర్లచే రిమ్స్ జనరల్ హాస్పిటల్‌తో వికలత్వ, వ్యాధి నిర్ధారణ పునఃపరీక్షలు రిమ్స్ సూపరిండెంట్ పర్యవేక్షణలో జరురగుతున్నాయి. వివిధ విభాగాలు డాక్టర్లు, అధికారులను, సిబ్బందిని ఇందుకోసం నియమించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ నెల 24న జరిగిన పరిశీలనలో చేయి తడపనిదే కొందరు సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ముందుకు రాలేదనే విమర్శలున్నాయి. రిమ్స్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి కొందరు డాక్టర్లు, అటు టీచర్లను మేనేజ్ చేశారనే అరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. డబ్బులిచ్చిన వారికి కోరుకున్నట్లు సర్టిఫికెట్లు జారీ చేసేశారు. కొందరు యూనియన్ లీడర్లు, మండల విద్యాధికారులతో రెండు రోజుల ముందుగానే సిబ్బంది టచ్‌లోకి వచ్చి సర్టిఫికెట్ల జారీపై చెప్పినట్లు సమాచారం. ఒక్కో రేటుతో వసూళ్లు వికలత్వానికి ఒక రేటు, వ్యాధులకు మరో రేటు నిర్ధారించి వసూలు చేసినట్లు సమాచారం. ఆఫీసులో పని చేసే పెద్దస్థాయి అధికారి, సంబంధిత సెక్షన్ అధికారులుచ, సిబ్బంది ఉపాధ్యాయుల యూనియన్ లీడర్లు, మండల అధికారులతోనూ లాలూచీ పడినట్లు సమాచారం. రిమ్స్ పరిపాలనా విభాగంలో పనిచేసేఆఫీస్ సిబ్బందిలో కొందరు ఈ వ్యవహారాన్ని సాగించారు. ఉపాధ్యాయుల స్థాయిని బట్టి రేటు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలకు తెరతీసిన పరిపాలనా సిబ్బంది పారదర్శకంగా వికలత్వ సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. బోగస్ వికలత్వ సర్టిఫికెట్లు బోగస్ వ్యాధుల పేరున సర్టిఫికెట్ల ధృవీకరణ లేకుండా అధికారులు డాక్టర్లు వ్యవహరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఉపాధ్యాయుడు, వారి కుటుంబ సభ్యులచే రిమ్స్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ పేరిట నిర్ధారణ పరీక్ష ఫీజు రూ.1000 చెల్లించాలని నిబంధన ఉండగా, ఈ డబ్బు బ్యాంకులో చెల్లించి రసీదు తీసుకువచ్చి వికలత్వ సర్టిఫికెట్‌కు జతచేసి, ఇస్తే డాక్టర్ పరిశీలించాల్సి వుంది. ఈ నిబంధనను తొలి రోజున తుంగలో తొక్కి డబ్బు తామే కట్టించుకున్నారు. కలెక్టర్, రిమ్స్ పరిపాలనాధికారులు ఇప్పటికై నా స్పందించి మిగిలిన రెండు రోజులైనా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తొలి రోజున 190 మందికి వికలత్వ పున:పరీక్షలు నిర్వహించారు. రిమ్స్ అధికారుల సూచన మేరకు రెండు రోజుల వికలత్వ సర్టిఫికెట్ల నిర్ధారణ పరీక్షల ఫీజు యూనియన్ నాయకులే వసూలు చేసి ‘ఆసుపత్రి అభివృద్ది కమిటీ’ ఖాతాలో ఎట్టకేలకు జమచేశారు. -
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ క్లీనిక్‌పై అవగాహన
రాయచోటి టౌన్ : లీగల్ ఎయిడ్స్ డిఫెన్స్ క్లీనిక్‌పై జైలులో నిందితులు, ఖైదీలకు అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబాఫకృద్దీన్ అన్నారు. రాయచోటి సబ్ జైలును శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్‌పై వివరించారు. ఎలాంటి కేసుల్లో ఇక్కడికి వచ్చారు? మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటూ ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే రాయచోటి మండల శాఖ న్యాయ సేవాధికార సంస్థ(కడప)ను సంప్రదించవచ్చునని చెప్పారు. అంతకుముందు జైల్లో వసతులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అఫ్ ఫస్ట్ క్లాస్ ఎన్.తేజశ్విని, రాయచోటి సబ్ జైల్ ఇన్చార్జి సూపరిటెండెంట్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
మదనపల్లె : ఆంధ్ర ప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని, ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా ప్రత్యర్థులను వేధించడమే పనిగా కూటమి పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్‌అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. మదనపల్లెలోని ఎంపీ మిథున్‌రెడ్డి కార్యాలయంలో విలేకరులతో దేశాయితిప్పారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి ప్రజల బాగోగులు చూడాలని కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడితే, ప్రత్యర్థులను వేధించడమే పనిగా పాలన సాగిస్తున్నారన్నారు. మదనపల్లె ఫైల్స్ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న గౌతమ్‌తేజ్ లై డిటెక్టర్ నివేదికలో తనమీద ఎలాంటి ఒత్తిడి లేదని, ఘటనలో తన ప్రమేయం లేదని స్పష్టంగా పేర్కొన్నా, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని చెప్పినప్పటికీ.. ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంగళ్లు కేసును తప్పుడు ఎఫ్ఐఆర్ అని ఏ విధంగా కొట్టివేసిందో, ఇందులో ఎఫ్ఐఆర్ ఎవరు రాశారో? ఎందుకు కొట్టేస్తున్నారో? అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం, మదనపల్లె ఫైల్స్ కేసుల్లో కానీ, పెద్దిరెడ్డి, ఎంపీ కుటుంబంపై మోపుతున్న అభాండాలు, అభియోగాలకు ఆధారాలు చూపండంటూ సాక్షాత్తూ ఎంపీ ప్రశ్నిస్తున్నప్పటికీ చూపలేకపోయారన్నారు. ఎల్లో మీడియాలో కథనాలు రావడం, వాటి ఆధారంగా దర్యాప్తు అధికారులు కేసులు నమోదు చేయడం, వేధింపులకు పాల్పడడం జరుగుతోందన్నారు. మదనపల్లె వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ మాట్లాడుతూ...పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలను చూసి తట్టుకోలేక, వారి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో తప్పుడు కేసులను తెరపైకి తీసుకొస్తున్నారన్నారు. మదనపల్లె ఫైల్స్ కేసులో ఎవరికి, ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ, హెలికాప్టర్లో ఉన్నతాధికారులను పంపించి, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారన్నారు. మద్యం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డిని చేర్చడం, ఫారెస్ట్ భూములు ఆక్రమించారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేడయం చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ...మదనపల్లె ఫైల్స్ కేసు విషయంలో నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తుచేసి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై నమోదుచేయిస్తున్న కేసులన్నీ దురుద్దేశంతో కొందరిని లక్ష్యంగా చేసుకుని పెడుతున్నవేనని ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ మాజీ చైర్పర్సన్ షమీంఅస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యర్థులను వేధించడమే పనిగా కూటమి పాలన పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు మదనపల్లె ఫైల్స్ ఘటనలో ప్రమేయం లేదని చెప్పినా ఆగని వేధింపులు -
ఇందిరమ్మ కాలనీలో ఉద్రిక్తత
గుర్రంకొండ : గుర్రంకొండ ఇందిరమ్మ కాలనీలో ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత తలెత్తింది. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ మహిళ కడప–బెంగుళూరు జాతీయ రహదారిపై టి.దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ మహిళ తన భర్తతో సహజీవనం చేస్తోందని ఆరోపిస్తూ స్థానిక పెద్దపాళెం వీధికి చెందిన మరో మహిళ కొందరిని వెంటబెట్టుకుని వచ్చి నిలదీసింది. తనకు ఎలాంటి సంబంధం లేదని టీ దుకాణం నిర్వహించే మహిళ వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాల వారు పెద్ద ఎత్తున గుమిగూడి ఘర్షణకు దిగారు. ఒక వర్గానికి చెందిన వారు టీ.దుకాణాన్ని ధ్వంసం చేశారు. మరోవర్గం రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారు. ఎస్ఐ మధురామచంద్రుడు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి కొందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ పెద్ద ఎత్తున జనం చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చేసేదేమీల లేక పోలీసలు పోలీస్ స్టేషన్ గేట్లు మూసివేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎనిమిది మంది స్మగ్లర్లు అరెస్టు
వీరబల్లి : వీరబల్లి అటవీ పరిధిలో ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 12 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్‌ను శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణ నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) ఆర్ఐ సాయి గిరిధర్, ఆర్ఎస్ఐ విశ్వనాథ్ బృందం స్థానిక ఎస్బీఓ అనీల్‌కుమార్‌తో కలిసి అన్నమ్యయ్య జిల్లా వీరబల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం క్వారీ పాయింట్ వద్ద కొందరు వ్యక్తులు మోటారు సైకిల్‌తో కనిపించారు. వీరిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమై చుట్టుముట్టి పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. చుట్టు ప్రక్కల దాచిన 12 ఎర్రచందనం దుంగలు, మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించామన్నారు. వారిని తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా వారిని డీఎస్పీలు శ్రీనివాసులు రెడ్డి, షరీఫ్‌లు విచారించారు. ఈ మేరకు ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 12 ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం