గుర్రంకొండలో అతలాకుతలం | - | Sakshi
Sakshi News home page

గుర్రంకొండలో అతలాకుతలం

May 2 2025 1:05 AM | Updated on May 2 2025 1:05 AM

గుర్ర

గుర్రంకొండలో అతలాకుతలం

గుర్రంకొండ : గుర్రంకొండలో ఒక్కసారిగా విజృంభించిన గాలివానతో పట్టణం అతలాకుతలంగా మారింది. రేకులషెడ్లు, బంకులు కొట్టుకుపోగా విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. చెట్లు ఎక్కడపడితే అక్కడ నేలకొరిగాయి. గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడంతో ఒక్కసారిగా వాతావరణం బీభత్సంగా మారిపోయింది. మగ్బీరా, మార్కెట్‌యార్డు వద్ద రేకులషెడ్లు, బంకులు ఈదురుగాలులకు కొట్టుకొని వచ్చి కడప–బెంగళూరు జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోయాయి. అదే సమయంలొ అక్కడే ద్విచక్రవాహనంపై నిలబడి ఉన్న రమణ అనే వ్యక్తి పక్కనుంచే రేకులషెడ్డు వెళ్లడంతో చేతికి బలమైన రక్తగాయాలయ్యాయి. అక్కడే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన స్తంభాలు కూలిపోయి విరిగి ఎన్‌హెచ్‌ 340 రోడ్డుపై పడ్డాయి. పట్టణంతో పాటు తలారివాండ్లపల్లె వద్ద రోడ్డుకు అడ్డంగా పెద్ద వృక్షాలు నేలకొరిగి కూలిపోయి విద్యుత్‌ తీగలు తెగి పడడంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. స్థానిక ఇందిరమ్మ కాలనీలో మూడుచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయి వీధుల్లో పడిపోయాయి. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రాత్రి 8.30 గంటల వరకు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పట్టణం అంధకారంగా మారింది.

కొట్టుకుపోయిన రేకులషెడ్లు, బంకులు

నేలకొరిగిన వృక్షాలు

కూలీపోయిన విద్యుత్‌ స్తంభాలు

గుర్రంకొండలో అతలాకుతలం1
1/1

గుర్రంకొండలో అతలాకుతలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement