
దేశవ్యాపంగా ఈద్-అల్-అదా (బక్రీద్) వేడుకలు శనివారం ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నారు.

పండుగ సందర్భంగా వివిధ నగరాల్లోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ.. త్యాగాలకు మారు పేరుగా ఈ పర్వ దినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు.

ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.


















